Crime thrillers
-
డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజవుతోన్న ఇన్స్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్.. ఎప్పటినుంచంటే?
విశ్వ కార్తికేయ, కారుణ్య చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన లేటేస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'రేప్ డీ'. ఈ మూవీకి రవి శర్మ దర్శకత్వం వహించారు. టాలెంట్ కెఫె ప్రొడక్షన్ బ్యానర్‌పై దేవీ మేరేటీ నిర్మించారు. సాధ్వి, ప్రణవి సమర్పణలో వైవీ రమణ మూర్తి, యశ్వంత్ తోట సహ నిర్మాతలుగా తెరకెక్కించిన ఈ చిత్రానికి.. వికాస్ కురిమెల్ల సంగీతాన్ని సమకూర్చారు.ఈ చిత్రాన్ని పూర్తిగా క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జానర్లో తెరకెక్కించారు. ఈ మూవీని నేరుగా ఓటీటీలోకి రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రం ఆగస్ట్ 10 నుంచే రెంటల్ విధానంలో బీసీఐనీట్ (BCI neet) అనే యాప్‌లో అందుబాటులో ఉంది. అయితే ఈ చిత్రం ఆగస్ట్ 24 నుంచి మరో ఓటీటీ సంస్థలోనూ స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఏ ఓటీటీ అనేది మాత్రం వివరాలు తెలియరాలేదు. ఈ మూవీలో వంశీ ఆలూర్, నేహాల్ గంగావత్, రవి వర్మ అద్దూరి, అమిక్ష పవార్, వశిష్ట చౌదరి, కిరిటీ దామరాజు, అనుపమ స్వాతి కీలక పాత్రలు పోషించారు. -
ఓటీటీకి వచ్చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బిజు మీనన్, ఆసీఫ్ అలీ నటించిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ 'తలవన్'. ఈ సినిమాను జిస్ జాయ్ దర్శకత్వంలో తెరకెక్కించరు. ఈ ఏడాది మే నెలలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ ప్రేక్షకులను మెప్పించింది. పోలీస్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా మలయాళంలో హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ పోలీస్ క్రైమ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 12 నుంచి సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా మలయాళంతో పాటు, తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ, బెంగాలీ, కన్నడతో సహా మొత్తం ఏడు భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఓ పోలీస్ అధికారి ఓ కేసును ఎలా చేధించాడనేది ఈ సినిమాలో చూపించారు. #Thalavan will be streaming from Sept 12 on SONY LIV. pic.twitter.com/5A1GE3jXs6— Christopher Kanagaraj (@Chrissuccess) August 11, 2024 -
ఓటీటీలో అదరగొడుతున్న టాలీవుడ్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
అరవింద్ కృష్ణ, నటాషా దోషి హీరో హీరోయిన్లుగా తాజా చిత్రం సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం). ఈ చిత్రాన్ని విజయ భాస్కర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని నాగి రెడ్డి, తేజ పల్లి, శ్రీనివాస్ రెడ్డి నిర్మించారు. ఈ మూవీ ఈ నెల 10 నుంచి ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ కావడంతో ఆడియన్స్ నుంచి విపరీతమైన ఆదరణ దక్కించుకుంటోంది. తమ చిత్రానికి మంచి ఆదరణ వస్తుండటంతో దర్శకుడు విజయ భాస్కర్ రెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.విజయ భాస్కర్ రెడ్డి.. 'కడప జిల్లాలోనే పుట్టి పెరిగా. అక్కడే విద్యాభ్యాసం జరిగింది. మాది ఉమ్మడి కుటుంబం. రైతుల కష్టం నాకు తెలుసు. మా నాన్న పడ్డ కష్టాలు మేం పడకూడదని ఉన్నత చదువులు చదివించారు. నా డిగ్రీ తరువాత హైద్రాబాద్‌కు వచ్చా. సెంట్రల్ యూనివర్సిటీలో ఎంపీఏ చేశాను. ఆ తరువాత ఇండస్ట్రీలోకి వచ్చాను. అసిస్టెంట్, కో డైరెక్టర్‌గా చేసి సిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నా. సినిమాల్లోకి రావడం నా ఫ్యామిలీకి ఇష్టం లేదు. కానీ మా పెద్దన్న నాకు అండగా నిలిచారు. ఆయన వల్లే పదిహేనేళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతున్నా.' అని అన్నారు.అనంతరం మాట్లాడుతూ.. 'నా డిగ్రీ ఫ్రెండ్స్ ఫండింగ్ చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఈ కథను వెబ్ సిరీస్ కంటే సినిమా తీస్తేనే బాగుంటుందని అన్నారు. నాగి రెడ్డి, బాల్ రెడ్డి, శ్రీనివాస్, రమేష్ కలిసి ఈ మూవీని ఇక్కడి వరకు తీసుకొచ్చారు.ఈ చిత్రంలో అరవింద్ కృష్ణ అద్భుతంగా నటించారు. ఆయన సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. నటాషా చక్కగా నటించారు. అందరి సహకారంతోనే ఈ మూవీని బాగా తీయగలిగా. ఓటీటీ కంటెంట్ కాబట్టి.. ముందు నుంచి కూడా మేం ఓటీటీ కోసమే ప్రయత్నాలు చేశాం.సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. రెండో పార్ట్, మూడో పార్ట్ ఎప్పుడు? అని అంతా అడుగుతున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా రీచ్ అయిందని తెలుస్తోంది. ప్రస్తుతం మా చిత్రం టాప్ 5లో ట్రెండ్ అవుతోంది. చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు. -
చిరుత హీరోయిన్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్‌తోనే భయపెట్టేశారు!
ప్రస్తుతం అంతా ఓటీటీల యుగం నడుస్తోంది. అందుకు తగ్గట్టుగానే సరికొత్త సిరీస్‌లు, సినిమాలు సినీ ప్రియులను అలరించేందుకు వస్తున్నాయి. ముఖ్యంగా హారర్, క్రైమ్ జానర్ లాంటి కథలు ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. అలాంటి వాటికే ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కుతోంది. తాజాగా మరో మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేస్తోంది. నేహా శర్మ నటించిన తాజా వెబ్ సిరీస్ 36 డేస్ ఓటీటీలో సందడి చేయనుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తే మర్డర్ మిస్టరీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌కు 'సీక్రెట్స్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్' అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. ట్రైలర్లోనే ట్విస్టులు భయపెట్టేలా ఉన్నాయి. ఇవాళ విడుదల చేసిన ట్రైలర్‌తో ఈ సిరీస్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశారు. ఈ సిరీస్‌లో పూరబ్ కోహ్లి, శృతి సేఠ్, చందన్ రాయ్ సన్యాల్, షరీబ్ హష్మి, అమృతా ఖాన్విల్కర్ కీలక పాత్రల్లో నటించారు. అయితే మర్డర్ మిస్టరీ సిరీస్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. త్వరలోనే సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. నేహా శర్మ టాలీవుడ్లో చిరుత మూవీలో హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన మెరిసింది. -
థ్రిల్లింగ్ శబ్దం
హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘శబ్దం’. ఈ సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో సిమ్రాన్, లైలా లీడ్ రోల్స్‌లో నటించగా, 7జీ శివ నిర్మించారు. తెలుగు–తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘శబ్దం’ టీజర్‌ను హీరో వెంకటేశ్ షేర్ చేశారు. ‘‘ఆది పినిశెట్టి– అరివళగన్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘వైశాలి’ విజయం సాధించింది. ఇప్పుడు ‘శబ్దం’ వస్తోంది. ఈ సినిమాలోని చాలా సన్నివేశాలను పర్వతాలు, పర్యాటక ప్రదేశాల్లో చిత్రీకరించాం. అలాగే 120 ఏళ్ల క్రితం నాటి లైబ్రరీని కూడా నిర్మించాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
డైరెక్ట్‌గా ఓటీటీకి స్టార్ హీరోయిన్ క్రైమ్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే!
బాలీవుడ్ భామ భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'భక్షక్'. పులకిత్ దర్శకత్వంలో రూపొందిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ రెడ్ చిల్లీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై షారుక్‌ఖాన్, గౌరీఖాన్‌లు నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తే బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపుల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత సమాజంలో బాలికలు, మహిళలపై జరుగుతున్న దారుణాలను బయటికి తీసే జర్నలిస్ట్ జర్నలిస్ట్ వైశాలీ సింగ్ పాత్రలో భూమి కనిపించనుంది. కాగా.. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఈ చిత్రం హిందీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే తెలుగులోనూ ఈ సినిమా అందుబాటులోకి వచ్చే అవకాశముంది. View this post on Instagram A post shared by Shah Rukh Khan (@iamsrk) -
రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్.. ఇంత వైల్డ్ ఏంట్రా బాబు!
ఇటీవలే థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అనే అడల్ట్ మూవీతో అలరించిన నటి భూమి ఫడ్నేకర్. తాజాగా అర్జున్ కపూర్ సరసన ది లేడీ కిల్లర్ అనే క్రైమ్ థ్రిల్లర్‌లో నటిస్తోంది. ఈ చిత్రానికి అజయ్ బహల్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే ఉద్వేగభరితమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అర్జున్, భూమి ఫడ్నేకర్ మధ్య శృంగార సన్నివేశాలు ఈ చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నాయి. కొన్ని సీన్స్ అయితే మరింత వైల్డ్‌గా చూపించినట్లు ట్రైలర్లో కనిపిస్తోంది. ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ అర్జున్ కపూర్‌కు ఈ మూవీ టర్నింగ్ పాయింట్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ది లేడీ కిల్లర్ క్రైమ్ థ్రిల్లర్ నవంబర్ 3న థియేటర్లలోకి రానుంది. అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్ జంటగా మేరీ పట్నీ కా రీమేక్ అనే మరో ప్రాజెక్ట్‌లోనూ కనిపించనున్నారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలో నటించనుంది. అర్జున్ చివరిసారిగా ఏక్ విలన్ రిటర్న్స్‌లో కనిపించాడు. గతేడాది విడుదలైన ఈ చిత్రంలో జాన్ అబ్రహం, తారా సుతారియా, దిశా పటాని నటించారు. మరోవైపు భూమి ఫడ్నేకర్, షెహనాజ్ గిల్, డాలీ సింగ్, కుషా కపిల, షిబానీ బేడీలతో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అనే చిత్రంలో కనిపించింది. ఈ చిత్రం ఇటీవలే రిలీజైంది. -
తలకోనలో ఏం జరిగింది?
అప్సరా రాణి ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘తలకోన’. నగేష్ నారదాసి దర్శకత్వం వహించారు. స్వప్న శ్రీధర్ రెడ్డి సమర్పణలో దేవర శ్రీధర్ రెడ్డి (చేవెళ్ల) నిర్మించిన ఈ చిత్రం నవంబరులో విడుదల కానుంది. ‘‘కొంతమంది స్నేహితులతో కలిసి అడవికి వెళతారు హీరోయిన్ . ఎంతమంది వెళ్లారు? ఎందరు తిరిగొచ్చారు? అక్కడ ఏం జరిగింది? అనే అంశాలతో ఈ చిత్ర కథ సాగుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సుభాష్ ఆనంద్ సంగీత దర్శకుడు. -
క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తోన్న 'చీటర్'.. ఆసక్తిగా పెంచుతోన్న ట్రైలర్!
రేఖ నిరోషా, చంద్రకాంత్ దత్త, నరేందర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం "చీటర్". ఈ సినిమాను బర్ల నారాయణ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. యస్ఆర్ఆర్ ప్రొడక్షన్ పతాకoపై పరుపాటి శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 22న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలో వినాయకచవితి సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. (ఇది చదవండి: 'నా అనుమతి లేకుండా తాకాడు'..లైంగిక వేధింపులపై హీరోయిన్!) ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. "మేము అనుకున్నట్లుగానే సినిమా వచ్చింది. మా డైరెక్టర్ అనుకున్న దానికంటే బాగా కష్టపడ్డారు. మంచి అవుట్ పుట్ వచ్చింది. ప్రేక్షకులకు కథ తప్పకుండా నచ్చుతుంది. మంచి సినిమాని ప్రేక్షకులు ఎప్పుడూ అదరిస్తారు అని నమ్మకం ఉంది'. అని అన్నారు. డైరెక్టర్ నారాయణ మాట్లాడుతూ.. 'సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో ప్రేక్షకులను అబ్బురపరిచే విధంగా మా సినిమా ఉంటుంది. ప్రేక్షకులకు పక్కా నచ్చుతుంది. మా సినిమాని థియేటర్లో చూసి ఆదరించండి.' అని అన్నారు. ఈ చిత్రంలో రాధిక, అనిత,మల్లేశం, నిషాన్, గౌటి రాజు కీలకపాత్రలు పోషిస్తున్నారు. -
తమిళ్, తెలుగులో నాన్ యార్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం
క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రాలు కోలీవుడ్‌లో మినిమం గ్యారెంటీగా మారాయి. దీంతో ఈ తరహా చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా రపొందుతున్న నాన్ యార్ చిత్రం ఈ కోవకే చెందుతుంది. కౌశల్ క్రియేషన్స్ పతాకంపై భీమినేని శివప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, బాధ్యతలను నిర్జన్ పల్నాటి నిర్వహిస్తున్నారు. తమిళం, తెలుగు భాషల్లో రపొందుతున్న ఈ చిత్రం ద్వారా ప్రముఖ ఎడిటర్ కోలా భాస్కర్ వారసుడు కోలా బాలకృష్ణ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. నటి సాక్షి చౌదరి నాయకి. బాహుబలి ప్రభాకర్, తనిష్క్ రాజన్, నీరజా తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఆర్జే శక్తి సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది క్రైమ్ నేపథ్యంలో సాగే విభిన్న కథా చిత్రం అని చెప్పారు. నిత్యం జరిగే హత్యల వార్తలను పత్రికల్లో హెడ్లైన్లో చూస్తుంటామన్నారు. అలాంటి వాటి గురిం చిత్ర కథానాయకుడు అనలైజ్ చేస్తుంటాడని, అలాంటి సమయంలో అతని ప్రేయసిని ఒక ముఠా కిడ్నాప్ చేస్తారని చెప్పారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా మరో పక్క కథానాయకుడు తన ప్రేయసి కోసం వెతుకుతుంటారన్నారు. ఇలా పలు ఆసక్తికరమైన సంఘటనలతో రెండు కోణాల్లో జరిగే కథే నాన్ యార్ చిత్రం అని చెప్పారు. -
11 మంది ఫ్రెండ్స్ సరదాగా ఆడిన ఆట ఒకరి ప్రాణం తీస్తే.. '12th మ్యాన్' రివ్యూ
టైటిల్: 12th మ్యాన్ (మలయాళం) నటీనటులు: మోహన్ లాల్, ఉన్ని ముకుందన్, అనుశ్రీ, అదితి రవి, రాహుల్ మాధవ్, లియోనా లిషాయ్ తదితరులు కథ: కెఆర్. కృష్ణ కుమార్ దర్శకుడు: జీతూ జోసేఫ్ సంగీతం: అనిల్ జాన్సన్ సినిమాటోగ్రఫీ: సతీష్ కురూప్ నిర్మాత: ఆంటోనీ పెరుంబవూరు విడుదల తేది: మే 20, 2022, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విలక్షణ నటుడు, మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కథ నచ్చితే తన పాత్ర కోసం ఎంతైనా శ్రమిస్తారు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం '12th మ్యాన్'. దృశ్యం, దృశ్యం 2 సినిమాల డైరెక్టర్ జీతూ జోసేఫ్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. మోహన్ లాల్-జీతూ జేసేఫ్ కాంబోలో ముచ్చటగా మూడోసారి వచ్చింది ఈ చిత్రం. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే పెరిగాయి. అదేకాకుండా ఇదివరకు విడుదలైన సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెంచెలా ఉంది. అయితే ఎట్టకేలకు శుక్రవారం (మే 20) నేరుగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైన '12th మ్యాన్' (12th Man Movie) ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ: 11 మంది స్నేహితులు తమ ఫ్రెండ్ సిద్ధార్థ్ (అను మోహన్) బ్యాచ్‌లర్ పార్టీకి వారి భార్యలతో కలిసి ఒక రిసార్ట్‌కు వెళ్తారు. ఈ 11 మందిలో ఇప్పుడు పెళ్లి చేసుకునే జంటతో (ఇద్దరు) పాటు నలుగురు దంపతులు (8 మంది), ఒక పెళ్లి అయి భర్తతో సెపరేట్ అయిన మహిళ ఉంటారు. వీరందరు కలిసి బ్యాచ్‌లర్ పార్టీ బాగా ఎంజాయ్ చేద్దామనుకుంటారు. పార్టీలో భాగంగా మొబైల్ ఫోన్స్‌తో ఒక గేమ్ ఆడతారు. ఆ గేమ్ కాస్తా వారిలోని రహస్యాలను బయటపెడుతుంది. దీంతో ఆ సముహాంలో ఒక అనుమానం, గందరగోళం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే ఆ 11 మందిలో మాథ్యూ (సైజు కురూప్) భార్య షైనీ (అనుశ్రీ) అనుమానస్పదంగా చనిపోతుంది. షైనీ ఎలా చనిపోయింది ? హత్యా ? ఆత్మహత్య ? వారికి ఎదురైన అనుమానం ఏంటీ ? ఆ 11 మందితో కలుస్తానన్న 12వ మనిషి చంద్రశేఖర్ (మోహన్ లాల్) ఎవరు ? అనేది తెలియాలంటే '12th మ్యాన్' మూవీ చూడాల్సిందే. విశ్లేషణ: ఇది ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. దృశ్యం సిరీస్‌తో సంచలన విజయం సాధించిన డైరెక్టర్ జీతూ జోసేఫ్ మళ్లీ అదే తరహాలో ఈ సినిమాను తెరకెక్కించారు. క్రైమ్ థ్రిల్లర్‌ను ఎలా సస్పెన్సింగ్‌గా చూపెట్టాలో బాగా తెలిసిన దర్శకుడు జీతూ. ఈ మూవీని ఆద్యంతం థ్రిల్లింగ్, సస్పెన్సింగ్‌గా చూపెట్టడంలో నూటికి నూరు శాతం విజయం సాధించారు. 11 మంది పాత్రల పరిచయంతో ప్రారంభమైన సినిమా తాగుబోతుగా ఎంట్రీ ఇచ్చిన మోహన్ లాల్‌తో ఆసక్తిగా మారుతుంది. బ్యాచ్‌లర్ పార్టీలో మొబైల్ ఫోన్స్ గేమ్ ఆడతారు. ఈ గేమ్‌లో బ్యాచ్‌లర్ పార్టీ ఇస్తున్న సిద్ధార్థ్‌కు వచ్చిన ఫోన్ కాల్‌తో తన రహస్యం ఒకటి బయటపడుతుంది. దీంతో ఆ ఫ్రెండ్స్ మధ్య ఒక గందరగోళం, అనుమానం ఏర్పడుతుంది. ఇంతలో వారి ఫ్రెండ్ భార్య షైనీ చనిపోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఇక్కడ మోహన్ లాల్ గురించి ఒక విషయం రివీల్ అవుతుంది. అది ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది తప్ప మూవీలో మరే ట్విస్ట్‌లు ఏం లేకపోయినా ఒక్కొక్కరు తమ హిడెన్ సీక్రెట్స్ (నిజాలను) బయటపెట్టడం ఆద్యంతం ఉత్కంఠంగా, ఆసక్తిరకంగా ఉంటుంది. సినిమా రన్ టైమ్ కొంచెం ఎక్కువగానే 2 గంటల 42 నిమిషాలు ఉంటుంది. షైనీది హత్య ? ఆత్మహత్య ? అనేది చివరి వరకు తేలేదాకా ఎంతో గ్రిప్పింగ్‌గా నారేట్ చేశారు. దృశ్యం, దృశ్యం 2 తరహాలో స్క్రీన్‌ప్లే ఆకట్టుకుంది. సస్పెన్స్‌ను క్రియేట్ చేసేలా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చక్కగా కుదిరింది. ఎవరెలా చేశారంటే ? తాగుబోతుగా, మరొక రోల్లో మోహన్ లాల్ అదరగొట్టారు. ఆయన ఆక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేనేలేదు. మిగతా క్యారెక్టర్స్‌లో నటించిన వారంతా సెటిల్డ్ పెర్ఫామెన్స్ ఇచ్చారనే చెప్పవచ్చు. సినిమాకు కథ, కథనం పాత్రల నటన, బీజీఎం, సినిమాటోగ్రఫీ ప్రధాన బలం. సినిమా కథ అంతా ఒకే రోజు జరుగుతుంది. సినిమా ప్రారంభం నుంచే కథలో లీనమయ్యేలా తరెకెక్కించారు డైరెక్టర్ జీతూ. అప్పుడేల ఒక నిజం చెప్పడం.. అంతలోనే అది అబద్ధం అని తేలడం ఎంతో థ్రిల్లింగ్‌గా డైరెక్ట్ చేశారనే చెప్పవచ్చు. ఓవరాల్‌గా చెప్పాలంటే 'దృశ్యం' సిరీస్‌లా మంచి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకుంటే '12th మ్యాన్' సినిమాను కచ్చితంగా ట్రై చేయాల్సిందే. -
మోహన్ లాల్ మరో క్రైమ్ థ్రిల్లర్ '12th మ్యాన్'.. నేరుగా ఓటీటీలోకి
12th Man: Jeethu Joseph Mohanlal Locked Thriller Trailer Released: క్రైమ్ థ్రిల్లర్ జానర్స్తో ప్రేక్షకులను కట్టిపడేసే చిత్రాలను తెరకెక్కించే మలయాళ దర్శకులలో జీతు జోసేఫ్ ముందుంటారు. ఆయన తెరకెక్కించిన దృశ్యం, దృశ్యం 2 సినిమాలు ఎంతటి హిట్ సాధించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఆయన మరో క్రైమ్ థ్రిల్లర్‌ను రూపొందించారు. విలక్షణ నటుడు మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కింది '12th మ్యాన్' చిత్రం. (చదవండి: వావ్.. సినీ ప్రియులకు ఇక పండగే.. ఓటీటీలో ఏకంగా 40) ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా మే 20 నుంచి ప్రసారం కానుంది. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అధికారికంగా ప్రకటిస్తూ ట్రైలర్ విడుదల చేసింది. 11 మంది స్నేహితులు వెకేషన్‌కు వెళ్లినప్పుడు వారితో 12వ మనిషి కలుస్తాడు. ఆ 12వ మనిషి ఎవరు ? మిగతా 11 మందికి అతనికి ఉన్న సంబంధం ఏంటి ? అనే విషయాలతో ట్రైలర్ ఉత్కంఠగా సాగింది. ట్రైలర్ చూస్తుంటే క్రైమ్‌తోపాటు, లాక్డ్ థ్రిల్లర్‌లా ఉంది. ఈ మూవీ కూడా దృశ్యం, దృశ్యం 2 సినిమాల్లానే భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని తెలుస్తోంది. చదవండి: గుడ్‌న్యూస్ చెప్పిన ఆహా, మేలో ఏకంగా 40+ మూవీస్! 12th Man Official Trailer Out Now!!! Watch Here👉 https://t.co/5oyPiQhpH3#12thMan streaming from May 20 on @DisneyPlusHS #12thManOnHotstar @Mohanlal @aashirvadcine @KurupSaiju @Iamunnimukundan @JeethuJosephDir @12thManMovie @sethusivanand @SshivadaOffcl @DisneyplusHSMal pic.twitter.com/tUxENWUIKz — DisneyPlus Hotstar Malayalam (@DisneyplusHSMal) May 3, 2022 -
లవ్ హాస్టల్
విక్రాంత్ మెస్సే, ‘దంగల్’ ఫేమ్ శాన్యా మల్హోత్రా జంటగా బాబీ డియోల్ ముఖ్యపాత్రలో నటించనున్న నూతన చిత్రాన్ని గురువారం అధికారికంగా ప్రకటించారు. ‘గుర్గావ్’ చిత్రదర్శకుడు శంకర్ రమణ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మనీష్ ముంద్రాతో కలిసి షారుక్ ఖాన్ తన నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ పతాకంపై నిర్మించనున్నారు. నార్త్ ఇండియాలో జరిగిన ఘటనల ఆధారంగా ‘లవ్హాస్టల్’ సినిమాను రూపొందించనున్నారు. వచ్చే ఏడాది మొదట్లో షూటింగ్ ఆరంభం కానుంది. ఈలోపు ఈ సినిమాలో నటించనున్న నటీనటులందరూ వర్క్‌షాప్స్‌లో పాల్గొంటారని చిత్రబృందం తెలిపింది. ఊపిరిబిగపట్టే క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం సాగుతుందని నిర్మాతలు చెప్పారు. -
ఒక్క కట్ లేకుండా...
దిలీప్‌కుమార్ సల్వాది హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘దిక్సూచి’. బేబి సనిక సాయిశ్రీ రాచూరి సమర్పణలో శైలజ సముద్రాల, నరసింహ రాజు రాచూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దిలీప్ కుమార్ సల్వాది మాట్లాడుతూ– ‘‘డివోషనల్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. మా సినిమాకి మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చిన సెన్సార్ సభ్యులు ఒక్క కట్ కూడా లేకుండా యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమా నచ్చిన జేమ్స్‌గారు అమెరికాలో విడుదల చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో కూడా విడుదలవుతోంది’’ అన్నారు. ‘‘దిక్సూచి’ కంటెంట్ ఉన్న చిత్రం. నిర్మాత రాజుగారు ప్యాషన్‌తో తీశారు. అందరికీ ఈ సినిమా నచ్చుతుందని అమెరికాలో విడుదల చేస్తున్నాం. చిన్న సినిమా అయినా 15 లొకేషన్స్‌లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు జేమ్స్. ‘‘సినిమాలో కంటెంట్ ఉంది. అందుకే నిర్మాతగా మారాను. ‘దిక్సూచి’ విడుదలైన తర్వాత ప్రేక్షకులే మా సినిమా గురించి మాట్లాడతారు’’ అన్నారు నరసింహరాజు. చాందినీ, సుమన్ పాల్గొన్నారు. ‘ఛత్రపతి’ శేఖర్, సమ్మెట గాంధీ, చాందిని భగవనాని, సుమన్, రజితసాగర్, అరుణ్‌బాబు, రాకేష్ ధన్వి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: జయకృష్ణ, రవికొమ్మి, సంగీతం: పద్మనాభ్ భరద్వాజ్. -
క్రికెట్ మ్యాచ్ రోజునా...‘దృశ్యకావ్యం’ కలెక్షన్లు తగ్గలేదు
‘‘నా కెరీర్లో ఇప్పటివరకూ చాలా యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్స్‌లో నవ్వులు పూయించాను. కానీ హారర్ నే పథ్యంలో తెరకెక్కిన ‘దృశ్యకావ్యం’ చిత్రంలో నటించడం సరికొత్త అనుభూతిని ఇచ్చింది. నాకు మంచి పేరు తీసుకొచ్చిన చిత్రమిది’’ అని హాస్యనటుడు ‘థర్టీ ఇయర్స’ పృథ్వి అన్నారు. కార్తీక్, కశ్మీర జంటగా స్వీయ దర్శకత్వంలో బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఇందులో డాక్టర్ పృథ్విగా నటించిన పృథ్వి ఈ సినిమా గురించి చెప్పిన విశేషాలు... ♦ నేను ఇప్పటివరకూ చాలా అనుభవమున్న దర్శకులతో పనిచేశాను. చేస్తున్నాను. కానీ బెల్లం రామకృష్ణారెడ్డి ఈ సినిమా కథ చెప్పడానికి వచ్చినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎవరి దగ్గరా సహాయకునిగా పనిచేయకపోయినా ఆయన క్లారిటీ అద్భుతం. అది నాకు బాగా నచ్చింది. అందుకే ఈ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాను. కొత్త దర్శకులతో అయినా నేను పనిచేయడానికి రెడీ. ♦ షూటింగ్ టైమ్ చాలా హ్యాపీగా గడిచిపోయింది. రామకృష్ణారెడ్డి చాలా చక్కగా ఈ సీన్స్‌ను తీర్చిదిద్దారు. ఈ సినిమా విడుదలయ్యాక మా కష్టానికి తగ్గ రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల వరల్డ్‌కప్ టీ 20లో భాగంగా ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ జరిగిన రోజు కూడా ఈ సినిమాకు కలెక్షన్స్ తగ్గలేదు. ఈ సినిమా బాగా ఆగుతోందని చెప్పడానికి ఇదొక్కటి చాలు. ♦ ఎక్కడా అభ్యంతరకరమైన సన్నివేశాలు లేకుండా ఈ సినిమా అన్ని వర్గాల వారికి నచ్చేలా తీశారు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చక్కగా కూర్చొని ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు నచ్చే సినిమా ఇది. వేసవి సెలవుల్లో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ♦ సినిమా ద్వితీయార్ధంలో భూతవైద్యుడిగా హీరో ఇంట్లోకి ప్రవేశించిన నాకు హఠాత్తుగా ఎదురయ్యే పిల్లదెయ్యాలు, అవి నన్ను భయపెట్టే సన్నివేశాలకు ముఖ్యంగా పిల్లలు బాగా కనె క్ట్ అవుతున్నారు. ఈ ఎపిసోడ్ మొత్తం ఈ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ♦ ఇక, ఈ సన్నివేశాలకు గ్రాఫిక్ వర్క్ కూడా బాగా కుదిరాయి. లైవ్ ఇన్స్ట్రుమెంట్స్తో ‘ప్రాణం’ కమలాకర్ అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రాణం పోసింది. సినిమా నిడివి ఎక్కువ కావడంతో నా మీద చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలను తొలగించారు. త్వరలో ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందనున్న ‘దృశ్యకావ్యం-2’లో నటించనున్నా. అందులో కూడా నవ్విస్తాను. ♦ ఆ మధ్య చేసిన ‘లౌక్యం’ తర్వాత నుంచి నాకు వరుసగా మంచి పాత్రలు వస్తున్నాయి. ‘సరైనోడు’, మారుతి దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో చాలా మంచి రోల్స్ చేస్తున్నా. -
వరల్డ్ సినిమాకి నార్త్... ఈస్ట్... వెస్ట్... సౌత్
జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్బర్గ్, జాన్‌వూ, క్వెంటిన్ టెరెంటినో... ఈ నలుగురూ ప్రపంచ సినిమాకి నాలుగు దిక్కులు. ఒకరు వెస్ట్ అయితే, ఇంకొకరు ఈస్ట్. ఒకాయన సౌత్ అయితే, మరొకరు నార్త్. నలుగురివీ నాలుగు మార్గాలు. ఎవరు ఏ మార్గంలో నడిచినా ప్రపంచం మొత్తం వీరి సినిమాలంటే పడి చచ్చిపోతుంది. అసలు ఈ నలుగురు జగదేక దర్శకులు ఇప్పుడేం చేస్తున్నారు? భవిష్యత్తులో ఎలాంటి అద్భుతాలు సృష్టించడానికి సిద్ధమవుతున్నారు?... జస్ట్ లుక్. 1. జేమ్స్ కామెరూన్ అవతార్! ‘టెర్మినేటర్’లో రోబోల విధ్వంసం ఎలా ఉంటుందో ఒళ్లు గగుర్పొడిచేలా చూపించాడు. ‘టైటానిక్’తో ప్రేక్ష కుల గుండెలు కరిగేలా చేశాడు. ‘అవతార్’ సినిమాతో అత్యున్నత సాంకేతిక అద్భుతాన్ని తెర మీద ఆవిష్కరించి, ‘అరె ఇలా కూడా సినిమా తీయొచ్చా’ అని వెండితెరకు సరికొత్త గమనాన్ని నిర్దేశించిన దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఆయన లేట్‌గా తీసినా లేటెస్ట్గా తీస్తాడని ప్రతీతి. ‘అవతార్’ తర్వాత ‘టైటానిక్-త్రీడీ’ వెర్షన్ కార్యకలాపాల్లో కొన్నాళ్లు నిమగ్నమైన కామెరూన్ ఇప్పుడేం చేస్తున్నట్టు? ప్రస్తుతం ఆయన ‘అవతార్’ సీక్వెల్స్ పనుల్లో చాలా చాలా బిజీగా ఉన్నారు. ‘అవతార్-2’, ‘అవతార్-3’ ఇలా వరుసగా సినిమాలు తీస్తానని ఆయన ఇంతకు ముందే ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే ‘అవతార్-2’ను సిద్ధం చేస్తున్నారు. ఆ ‘అవతార్ ’ను మించిన కథాకథనాలు, గ్రాఫిక్స్ ఈ సీక్వెల్లో ఉంటాయట. అండర్‌వాటర్ సీక్వెన్సెస్ ‘అవతార్-2’లో ప్రేక్షకులకు కనువిందు చేస్తాయని కామెరూన్ పేర్కొన్నారు. 2016లో ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకున్నారు. అయితే, సాంకేతిక కారణాల వల్ల ఈ రెండో ‘అవతార్’ని 2017 డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు. 2. స్పైస్ స్పీల్బర్గ్ ‘జాస్’, ఈటీ (ఎక్స్ట్రా టెరస్ట్రియల్), ‘జురాసిక్ పార్క్’, ‘ద లాస్ట్ వరల్డ్’... ఈ సినిమాల పేర్లు వింటే టక్కున గుర్తుకువచ్చే దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్. ఈ దిగ్దర్శకుని చిత్రాల కోసం ఎన్నేళ్లయినా ఎదురుచూసే అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థలు స్టీవెన్‌తో కలిసి పనిచేయాలని ఇప్పటికీ ఉవ్విళ్లూరుతుంటాయి. ఇటీవల వచ్చిన ‘జురాసిక్ వరల్డ్’ చిత్రానికి స్టీవెన్ స్పీల్బర్గ్ కేవలం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాత్రమే. ఈ చిత్రానికి ఆయన శిష్యుడు కొలిన్ ట్రావె ర్రో దర్శకత్వం వహించారు. కానీ టైటిల్ కార్డ్ మీద స్టీవెన్ స్పీల్బర్గ్ అనే పేరు మంత్రంలా పనిచేసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా మూడో స్థానంలో నిలిచింది. మరి... స్పీల్బర్గ్ ఇప్పుడేం చేస్తున్నారు...? ఏ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు....? నిర్మాతగా ఫుల్ బిజీగా ఉంటూనే, ఆయన ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అదే ‘బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్’. టామ్ హ్యాంక్స్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. 2016 అక్టోబర్ 16న ఈ చిత్రం విడుదల కానుంది. ఈలోగా మరో చిత్రానికి కూడా సన్నాహాలు చేస్తున్నారాయన.. అదే ‘రెడీ ప్లేయర్ వన్’. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఎర్నస్ట్ క్లయిన్ రాసిన ‘రెడీ ప్లేయర్ వన్’ అనే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నవలను అదే పేరుతో తెరకెక్కించనున్నారు స్పీల్బర్గ్. ఈ చిత్రం 2017 డిసెంబర్ 15న తెర మీదకు రానుంది. 3. థ్రిల్లింగ్ మ్యాన్ జాన్ వూ యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్‌గా ప్రపంచ సినీ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన దర్శకుడు జాన్ వూ. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను కట్టిపడేయడం జాన్ వూ ప్రత్యేకత. ‘ఫేస్ ఆఫ్’, ‘మిషన్ ఇంపాజిబుల్-2’, బ్రోకెన్ యారో, పే చెక్... ఈ చిత్రాలన్నీ ఆయన ప్రతిభకు తార్కాణాలు. 2008లో విడుదలైన ‘రెడ్ క్లిఫ్’, దానికి సీక్వెల్‌గా విడుదలైన ‘రెడ్‌క్లిఫ్-2’, 1949 అంతర్యుద్ధం నేపథ్యంలో తీసిన ‘క్రాసింగ్’, దీనికి సీక్వెల్ అయిన ‘క్రాసింగ్-2’... ఇవన్నీ జాన్ వూ స్థాయిని పెంచాయి. 69 ఏళ్ల జాన్ వూ ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? 1976లో విడుదలైన జపనీస్ థ్రిల్లర్ ‘మ్యాన్ హంట్’ చిత్రాన్ని రీమేక్ చే సే సన్నాహాల్లో ఉన్నారు. 4. క్వెంటిన్ టెరెంటినో న్యూ డెఫినిషన్ వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ క్వెంటిన్ టొరెంటినో. ఎంత పాత కథలనైనా ఇంత కొత్తగా కూడా చూపించవచ్చా అని ఆశ్చర్యపోయే స్థాయిలో స్క్రీన్‌ప్లేను కొత్త పుంతలు తొక్కించారీ దర్శకుడు. అయితే, ఆయన చిత్రాల్లో మితిమీరిన హింస, పోరాట సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని విమర్శకుల వాదన. అయినప్పటికీ తన శైలిని మార్చుకోలేదు. ఎందుకంటే, ప్రేక్షకులు ఇష్టపడినవి ఇవ్వడమే తన ధ్యేయమని అంటారు క్వెంటిన్. తన సక్సెస్ సీక్రెట్ అదే అంటారాయన. క్వెంటిన్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో విజయాల శాతమే ఎక్కువ. ముఖ్యంగా ‘కిల్ బిల్’ సిరీస్, ‘ఇన్గ్లోరియస్ బాస్టర్డ్స్’, ‘ద జాంగో అన్చైన్డ్’... ఇలాంటి చిత్రాల ద్వారా క్రైమ్ థ్రిల్లర్స్‌కు సరికొత్త డెఫినిషన్ ఇచ్చారు. కొత్త దర్శకులు ఆయన్ను ఆదర్శంగా తీసుకుంటారు. ప్రస్తుతం క్వెంటిన్ ‘ద హేట్‌ఫుల్ ఎయిట్’ చిత్రాన్ని తెరకెక్కించే పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. డిసెంబరు 25న ఈ చిత్రం విడుదల కానుంది.