
దిలీప్‌కుమార్ సల్వాది హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘దిక్సూచి’. బేబి సనిక సాయిశ్రీ రాచూరి సమర్పణలో శైలజ సముద్రాల, నరసింహ రాజు రాచూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దిలీప్ కుమార్ సల్వాది మాట్లాడుతూ– ‘‘డివోషనల్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. మా సినిమాకి మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చిన సెన్సార్ సభ్యులు ఒక్క కట్ కూడా లేకుండా యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు.
ఈ సినిమా నచ్చిన జేమ్స్‌గారు అమెరికాలో విడుదల చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో కూడా విడుదలవుతోంది’’ అన్నారు. ‘‘దిక్సూచి’ కంటెంట్ ఉన్న చిత్రం. నిర్మాత రాజుగారు ప్యాషన్‌తో తీశారు. అందరికీ ఈ సినిమా నచ్చుతుందని అమెరికాలో విడుదల చేస్తున్నాం. చిన్న సినిమా అయినా 15 లొకేషన్స్‌లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు జేమ్స్. ‘‘సినిమాలో కంటెంట్ ఉంది. అందుకే నిర్మాతగా మారాను. ‘దిక్సూచి’ విడుదలైన తర్వాత ప్రేక్షకులే మా సినిమా గురించి మాట్లాడతారు’’ అన్నారు నరసింహరాజు. చాందినీ, సుమన్ పాల్గొన్నారు. ‘ఛత్రపతి’ శేఖర్, సమ్మెట గాంధీ, చాందిని భగవనాని, సుమన్, రజితసాగర్, అరుణ్‌బాబు, రాకేష్ ధన్వి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: జయకృష్ణ, రవికొమ్మి, సంగీతం: పద్మనాభ్ భరద్వాజ్.
Comments
Please login to add a commentAdd a comment