diksuchi
-
థియేటర్లు దొరక్కపోవడం దురదృష్టకరం
‘నెంబర్‌వన్’ సినిమాతో బాల నటుడిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి, దాదాపు 30 సినిమాలు చేసిన నటుడు దిలీప్‌కుమార్ సల్వాది. హీరోగా ‘నా సామి రంగ, ఒకే ఒక్క చాన్స్’ వంటి చిత్రాలు చేసిన అతను తాజాగా హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘దిక్సూచి’. బేబి సనిక సాయిశ్రీ రాచూరి సమర్పణలో శైలజ సముద్రాల, నరసింహ రాజు రాచూరి నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా దిలీప్ కుమార్ సల్వాది మాట్లాడుతూ– ‘‘డివోషనల్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. సినిమాకి మంచి టాక్ వచ్చింది. అయితే ఒక మంచి చిత్రానికి తెలంగాణ రాష్ట్రంలో థియేటర్లు దొరక్కపోవడం దురదృష్టకరం. మా చిత్రం ఏపీలో 60 థియేటర్లలో రిలీజ్ అయింది. కానీ తెలంగాణలో మాత్రం హైదరాబాద్‌లో రెండు, నాగర్ కర్నూల్లో ఓ థియేటర్ మాత్రమే దొరికింది. తెలంగాణలో ఒక్క మల్టీప్లెక్స్‌లో కూడా మా చిత్రానికి అవకాశం దొరకలేదు. ‘అవెంజర్స్’ సినిమాకి పోటీగా మీ సినిమాని ఎందుకు విడుదల చేశారు? అని కొందరు అంటున్నారు. అది హాలీవుడ్ సినిమా. ఇక్కడ డబ్ చేశారు. ఓ డబ్బింగ్ సినిమాకి వందల థియేటర్లు దొరికాయి కానీ, మన తెలుగు రాష్ట్రంలో ఓ తెలుగు సినిమాకి మాత్రం కనీసం ఒక్క షోకి అయినా థియేటర్లు దొరక్కపోవడం చాలా బాధగా ఉంది. మా సినిమాకి అమెరికాలో 40ఆటలు, ఆస్ట్రేలియాలో 12 ఆటలు పడ్డాయి. ఏడాది పాటు ఎంతో కష్టపడి ఓ మంచి సినిమా తీశాం. కానీ, దాన్ని ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లలేకపోతున్నాం. మా సినిమా బాగుందని తెలుసుకున్న మంత్రి కేటీఆర్‌గారు, జీఎమ్మార్ వాళ్లు చిత్రం చూసేందుకు ఏర్పాట్లు చేయమంటే క్యూబ్ ద్వారా కంటెంట్ పంపించాం. కేటీఆర్‌గారు చూసి ట్వీట్ చేస్తే థియేటర్లు పెరుగుతాయనే నమ్మకం ఉంది. ‘దిక్సూచి’ సినిమాని తమిళ్లో డబ్బింగ్ లేదా రీమేక్ చేయాలనే ఆలోచన ఉంది. ప్రస్తుతం తెలుగులో నా దర్శకత్వంలో ‘చిత్రసేన’ అనే జూన్‌లో ప్రారంభం అవుతుంది. తమిళంలో హీరోగా నటించిన రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరో సినిమా విడుదలకు రెడీగా ఉంది. తెలుగులో, తమిళంలో నాకు ఇప్పటి వరకూ హీరోగా సరైన హిట్ పడలేదు. అందుకే నన్ను నేను నిరూపించుకోవాలని దర్శకత్వం చేశా. కథ స్వయంగా రాసుకున్న సినిమాలకు మాత్రమే నేను దర్శకత్వం వహిస్తా. వేరే దర్శకుల చిత్రాల్లో హీరోగా చేస్తా’’ అన్నారు. -
ఒక్క కట్ లేకుండా...
దిలీప్‌కుమార్ సల్వాది హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘దిక్సూచి’. బేబి సనిక సాయిశ్రీ రాచూరి సమర్పణలో శైలజ సముద్రాల, నరసింహ రాజు రాచూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దిలీప్ కుమార్ సల్వాది మాట్లాడుతూ– ‘‘డివోషనల్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. మా సినిమాకి మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చిన సెన్సార్ సభ్యులు ఒక్క కట్ కూడా లేకుండా యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమా నచ్చిన జేమ్స్‌గారు అమెరికాలో విడుదల చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో కూడా విడుదలవుతోంది’’ అన్నారు. ‘‘దిక్సూచి’ కంటెంట్ ఉన్న చిత్రం. నిర్మాత రాజుగారు ప్యాషన్‌తో తీశారు. అందరికీ ఈ సినిమా నచ్చుతుందని అమెరికాలో విడుదల చేస్తున్నాం. చిన్న సినిమా అయినా 15 లొకేషన్స్‌లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు జేమ్స్. ‘‘సినిమాలో కంటెంట్ ఉంది. అందుకే నిర్మాతగా మారాను. ‘దిక్సూచి’ విడుదలైన తర్వాత ప్రేక్షకులే మా సినిమా గురించి మాట్లాడతారు’’ అన్నారు నరసింహరాజు. చాందినీ, సుమన్ పాల్గొన్నారు. ‘ఛత్రపతి’ శేఖర్, సమ్మెట గాంధీ, చాందిని భగవనాని, సుమన్, రజితసాగర్, అరుణ్‌బాబు, రాకేష్ ధన్వి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: జయకృష్ణ, రవికొమ్మి, సంగీతం: పద్మనాభ్ భరద్వాజ్. -
సమాజానికి దిక్సూచి
దిలీప్‌కుమార్ సలాది, ‘ఛత్రపతి’ శేఖర్, సమ్మెట గాంధీ, చాందిని, సమీరా, స్వప్నిక, బిత్తిరి సత్తి, రాకేష్, మల్లాది భాస్కర్, సుమన్, రజితసాగర్, అరుణ్‌బాబు, ధన్వి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘దిక్సూచి’. దిలీప్‌కుమార్ సలాది దర్శకత్వంలో నర్సింహరాజు రాచూరి, శైలజా సముద్రాల నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ మూడో వారంలో రిలీజ్ కానుంది. దిలీప్‌కుమార్ సలాది మాట్లాడుతూ– ‘‘డివోషనల్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. సమాజానికి ఓ దిక్సూచి అవుతుంది. 1970లో జరిగిన సెమీ పీరియాడికల్ మూవీ. మా నిర్మాత రాజుగారు ఆస్ట్రేలియన్ సిటిజన్. నేను చైల్డ్ ఆర్టిస్టుగా చాలా చిత్రాలు చేశా. హీరోగా నాకు నేనే ఓ పాత్ర రాసుకున్నా. ఇదే నిర్మాతతో, మరో కంపెనీతో అసోసియేట్ అయి ఏడాదికి మూడు సినిమాలు నిర్మిస్తాం. ఉగాదికి మరో సినిమా ఆరంభిస్తాం’’ అన్నారు. ‘‘మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. సిగరెట్, మందు వంటివాటిని చూపించడం లేదు. దిలీప్‌కుమార్ మంచివాడు. అతనిలోని ప్రతిభ బయటకు రావాలంటే మంచి జరగాలి. అందుకే ఈ సినిమా చేశాం. ఫైట్లు పెద్దగా లేవు’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: జయకృష్ణ, రవికొమ్మి, సంగీతం: పద్మనాభ్ భరద్వాజ్. -
భవితకు దిక్సూచి
ఇంటర్మీడియట్ స్పెషల్ బైపీసీ.. పదో తరగతి తర్వాత ఇంటర్మీడియెట్‌లో బైపీసీ గ్రూప్‌తో ఉన్నటువంటి ఉన్నతవిద్య, ఉద్యోగావకాశాలు మరే గ్రూపునకు లేవంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో బైపీసీతో ఉన్న ఉన్నత విద్య అవకాశాలేమిటో తెలుసుకుందాం.. ఎంసెట్‌తో.. ఇంటర్లో బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ (బైపీసీ) చదివినవారు మన రాష్ర్టంలో మెడికల్, అగ్రికల్చర్, వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్ రాయొచ్చు. ఈ ర్యాంకు ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీఎన్‌వైఎస్, బీయూఎంఎస్ వంటి కోర్సుల్లో చేరొచ్చు. వీటితోపాటు బీవీఎస్సీ అండ్ ఏహెచ్, బీఎఫ్ఎస్సీ, బీఎస్సీ(అగ్రికల్చర్), బీఎస్సీ(హార్చికల్చర్), బీఫార్మసీ, ఫార్మాడి, బీటెక్ (బయోటెక్నాలజీ) చేయొచ్చు. బీఎస్సీతో కెరీర్ షైనింగ్ ఇంటర్ పూర్తయ్యాక బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మేటిక్స్, మైక్రోబయాలజీ, మాలిక్యులర్ బయాలజీ, జెనిటిక్స్, బోటనీ, జువాలజీ వంటి సబ్జెక్టుల్లో ఏవైనా మూడింటిని ఎంచుకొని డిగ్రీ పూర్తిచేయొచ్చు. దాదాపు అన్ని ప్రభుత్వ, కొన్ని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ఈ కోర్సులు ఉన్నాయి. తర్వాత ఆసక్తి ఉన్న సబ్జెక్టులో పీజీ చేయొచ్చు. తర్వాత సీఎస్ఐఆర్ నిర్వహించే నెట్ రాయొచ్చు. మంచి మార్కులు సాధిస్తే దేశవ్యాప్తంగా ఉన్న వర్సిటీలు/విద్యాసంస్థల్లో పీహెచ్డీ చేయొచ్చు. జేఆర్ఎఫ్ కింద మొదటి రెండేళ్లు నెలకు రూ. 25,000 తర్వాత మూడేళ్లు నెలకు రూ. 28,000 పొందొచ్చు. పీహెచ్‌డీతో రీసెర్చ్, టీచింగ్ కెరీర్లో ఉన్నత స్థాయికి చేరొచ్చు. పీజీ వద్దనుకుంటే సివిల్స్, ఎస్ఎస్సీ, బ్యాంక్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగం పొందొచ్చు. ఉపాధికి పారామెడికల్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఆప్టోమెట్రీ, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్, ఆఫ్తల్మాలిక్ అసిస్టెంట్, ఆడియోమెట్రీ, రేడియోథెరపీ, పర్ఫ్యూషన్ టెక్నీషియన్, డయాలసిస్, మెడికల్ ఇమేజింగ్, రెస్పిరేటరీ థెరపీ, మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్, హియరింగ్ లాంగ్వేజ్ అండ్ స్పీచ్ థెరపీ, డెంటల్ టెక్నీషియన్, మైక్రో సర్జరీ, అనస్థీషియా, క్యాత్‌ల్యాబ్, ఈసీజీ, కార్డియాలజీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. రెండేళ్ల వ్యవధి ఉన్న ఈ కోర్సులు పూర్తిచేయడం ద్వారా ఆయా ఆస్పత్రుల్లో ఉపాధి అవకాశాలు దక్కించుకోవచ్చు. ప్రారంభంలో వేతనం నెలకు రూ.10 వేల నుంచి రూ. 15 వేల వరకు ఉంటుంది. ఫిజియోథెరపి.. వ్యాయామ పరికరాలను అవసరానికి అనుగుణంగా ఉపయోగించే శిక్షణ, ఎలక్ట్రోథెరపి, మాగ్నటోథెరపి, మసాజ్, దెబ్బతిన్న కండర పునరుత్పత్తికి ఫిజియోథెరపిస్టులు అత్యవసరం. ఈ కోర్సు పూర్తిచేస్తే ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు ఉంటాయి. ప్రారంభంలో నెలకు రూ.15 వేలు ఇస్తారు. నర్సింగ్.. మన దేశంతోపాటు అమెరికా, పశ్చిమ ఆసియాల్లోనూ అపార ఉద్యోగ అవకాశాలను అందిస్తున్న కోర్సు. భారత్‌లో 2016 నాటికి 24 లక్షల మంది నర్సుల అవసరం ఉంటుందని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అంచనా.