సమాజానికి దిక్సూచి | Diksuchi Movie to release in April 3rd week | Sakshi
Sakshi News home page

సమాజానికి దిక్సూచి

Published Thu, Mar 21 2019 4:16 AM | Last Updated on Thu, Mar 21 2019 4:16 AM

Diksuchi Movie to release in April 3rd week - Sakshi

నర్సింహరాజు, దిలీప్‌కుమార్, అరుణ్‌

దిలీప్‌కుమార్‌ సలాది, ‘ఛత్రపతి’ శేఖర్, సమ్మెట గాంధీ, చాందిని, సమీరా, స్వప్నిక, బిత్తిరి సత్తి, రాకేష్, మల్లాది భాస్కర్, సుమన్, రజితసాగర్, అరుణ్‌బాబు, ధన్వి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘దిక్సూచి’. దిలీప్‌కుమార్‌ సలాది దర్శకత్వంలో నర్సింహరాజు రాచూరి, శైలజా సముద్రాల నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ మూడో వారంలో రిలీజ్‌ కానుంది. దిలీప్‌కుమార్‌ సలాది మాట్లాడుతూ– ‘‘డివోషనల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఇది. సమాజానికి ఓ దిక్సూచి అవుతుంది.

1970లో జరిగిన సెమీ పీరియాడికల్‌ మూవీ. మా నిర్మాత రాజుగారు ఆస్ట్రేలియన్‌ సిటిజన్‌. నేను చైల్డ్‌ ఆర్టిస్టుగా చాలా చిత్రాలు చేశా. హీరోగా నాకు నేనే ఓ పాత్ర రాసుకున్నా. ఇదే నిర్మాతతో, మరో కంపెనీతో అసోసియేట్‌ అయి ఏడాదికి మూడు సినిమాలు నిర్మిస్తాం. ఉగాదికి మరో సినిమా ఆరంభిస్తాం’’ అన్నారు. ‘‘మంచి కంటెంట్‌ ఉన్న సినిమా ఇది. సిగరెట్, మందు వంటివాటిని చూపించడం లేదు. దిలీప్‌కుమార్‌ మంచివాడు. అతనిలోని ప్రతిభ బయటకు రావాలంటే మంచి జరగాలి. అందుకే ఈ సినిమా చేశాం. ఫైట్లు పెద్దగా లేవు’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: జయకృష్ణ, రవికొమ్మి, సంగీతం: పద్మనాభ్‌ భరద్వాజ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement