shekar
-
జనసేన ఖాళీ: వైఎస్సార్సీపీలో చేరిన DMR శేఖర్ దంపతులు
-
ఆసక్తి పెంచుతున్న లక్ష్ చదలవాడ కొత్త మూవీ కాన్సెప్ట్ పోస్టర్
టాలీవుడ్ యంగ్ హీరో లక్ష్ చదలవాడ ప్రస్తుతం ఫుల్ స్పీడు మీదున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నారు. వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి హిట్ సినిమాల్లో లక్ష్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు ధీర అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. లక్ష్ బర్త్ డే సందర్భంగా ధీర నుంచి అదిరిపోయే గ్లింప్స్‌ను మేకర్లు రిలీజ్ చేశారు. ఈ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. మరో వైపు కొత్త ప్రాజెక్ట్‌కు లక్ష్ ఓకే చెప్పేశారు. లక్ష్ 8వ చిత్రంగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు 'ఏ ఫిల్మ్ బై అరవింద్' ఫేమ్ శేఖర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ మీద పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ కాన్సెప్ట్ పోస్టర్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ కాన్సెప్ట్ పోస్టర్ చూస్తుంటే.. హీరో హీరోయిన్లు ఏదో ప్రమాదంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అలా రోడ్డు మీద వెళ్తున్నట్టుగా.. ఇక అగ్నిజ్వాలలు అలా చెలరేగి.. అది కాస్త మేఘాల్లా మారి.. మెదడు ఆకారంలోకి రావడం చూస్తుంటే.. ఈ సినిమా సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా అనిపిస్తోంది. మెదడుకు మేత పెట్టేలా సినిమా ఉంటుందనిపిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను మేకర్లు ప్రకటించనున్నారు. -
నాకు మాస్టర్ గా జీవితం ఇచ్చింది రాకేష్ మాస్టర్
-
‘శేఖర్’ మూవీ ప్రదర్శన నిలిపివేత.. రాజశేఖర్ ఎమోషనల్ ట్వీట్
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటించిన తాజా చిత్రం శేఖర్. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రదర్శన ఆగిపోయింది. ‘శేఖర్’ చిత్రం ప్రదర్శనను నిలిపివేయాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హీరో రాజశేఖర్ తనకు డబ్బులు ఇవ్వాలంటూ ఫైనాన్షియర్ పరంధామరెడ్డి సిటీ కోర్టును ఆశ్రయించాడు. కోర్డు ఆదేశించిన డబ్బు చెల్లించకపోవడంతో ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేతపై ట్విటర్ వేదికగా రాజశేఖర్ స్పందించారు. (చదవండి: మా కష్టానికి తగిన ఫలితం దక్కింది : 'శేఖర్' నిర్మాత) ‘శేఖర్ చిత్రాన్ని నేను, నా కుటుంబం మా సర్వస్వంగా భావించాం. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చాలా కష్టపడ్డాం. శేఖర్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కానీ, ఇంతలోనే కొందరు కావాలనే మా చిత్రాన్ని అడ్డుకుంటున్నారు. సినిమా అనేది మా ప్రాణం. ‘శేఖర్’ మాకు చాలా ప్రత్యేకం. ఇక నేను చెప్పాల్సిందేమీ లేదు.... ఎవరెన్ని చేసినా ఈ చిత్రం ప్రదర్శితమై, ప్రశంసలు పొందుతుందని, ఆ అర్హత ఈ సినిమాకు ఉందని నేను భావిస్తున్నాను’ అంటూ రాజశేఖర్ ట్వీట్ చేశాడు. #Shekar pic.twitter.com/JipmYOnh57 — Dr.Rajasekhar (@ActorRajasekhar) May 22, 2022 -
మా కష్టానికి తగిన ఫలితం దక్కింది : 'శేఖర్' నిర్మాత
రాజశేఖర్ హీరోగా, శివానీ రాజశేఖర్, ఆత్మీయా రాజన్, ముస్కాన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘శేఖర్’. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. వంకాయల పాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న రిలీజైంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘నిర్మాత బొగ్గరం శ్రీనివాస్‌తో నాకు ఉన్న పరిచయం వల్ల ‘కార్తికేయ’ సినిమాకు తనతో ఇన్వెస్టర్‌గా చేరాను.ఆ తర్వాత ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమా నిర్మించాను. ఇక ‘శేఖర్’ విషయానికి వస్తే.. రాజశేఖర్‌గారు నా ఫేవరెట్ హీరో. అందుకే ఆయన చేసిన ‘గరుడవేగ’ సినిమాతో ట్రావెల్ చేశాను. మలయాళ ‘జోసెఫ్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేద్దామని జీవితగారు చెప్పడంతో నేనూ ‘జోసెఫ్’ చూశాను. నచ్చి ‘శేఖర్’ సినిమాకు నిర్మాతగా ఉన్నాను. రాజశేఖర్‌గారు అద్భుతంగా నటించారు. జీవితగారు బాగా తీశారు. దాదాపు 300 థియేటర్స్‌లో రిలీజ్ చేశాం. సినిమా బాగుందని, మంచి సందేశం ఇచ్చారని ప్రేక్షకులు అభినందిస్తుంటే మా కష్టానికి తగిన ఫలితం దక్కిందని హ్యాపీగా ఉంది’’ అన్నారు. -
‘శేఖర్’ మూవీ రివ్యూ
టైటిల్ : శేఖర్ నటీనటులు : రాజశేఖర్, ముస్కాన్, ఆత్మీయ రాజన్, శివాణి, సమీర్, అభినవ్ గోమతం, కన్నడ కిశోర్ తదితరులు నిర్మాతలు: బీరం సుధాకర రెడ్డి, బొగ్గరం వెంకట శ్రీనివాస్, శివాణి రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ దర్శకురాలు: జీవిత రాజశేఖర్ సంగీతం: అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రఫి:మల్లికార్జున్ నారగాని విడుదల తేది:మే 20, 2022 యాంగ్రీస్టార్ రాజశేఖర్.. రెండు దశాబ్దాల క్రితం స్టార్ హీరోల్లో ఒక్కడు. అప్పట్లో ఆయన సినిమాలు రికార్డులు సృష్టించాయి. ఆ తర్వాత ఆయన చిత్రాలకు పెద్ద ఆదరణ దక్కలేదు. ఇక రాజశేఖర్ పని అయిపోతుదన్న సమయంలో గరుడవేగ, కల్కీ చిత్రాలతో మళ్లీ పుంజుకున్నాడు. ఆ చిత్రాలు విజయవంతం కావడంతో..అదే కిక్‌తో ‘శేఖర్’చిత్రంలో నటించారు. మలయాళం మూవీ జోసెఫ్ చిత్రం రీమేక్ ఇది. రాజశేఖర్ సతీమణి జీవిత ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ శుక్రవారం(మే 20) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై ఆసక్తిపెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో ‘శేఖర్’చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ‘శేఖర్’ అందకున్నాడా? లేదా?, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. శేఖర్(రాజశేఖర్)..ఓ రిటైర్డ్ పోలీసు అధికారి. క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో దిట్ట. నేరస్తులను ఎవరైనా సరే..ఇట్టే కనిపెట్టేస్తాడు. ఓ మర్డర్ కేసులో పోలీసులు అతని సహాయం తీసుకుంటారు. అదే సమయంలో అతని భార్య ఇందు(ఆత్మీయ రాజన్) నుంచి విడిపోయిన జ్ఞాపకాలు శేఖర్ని వెంటాడుతుంటాయి. ఓ రోజు ఇందు రోడ్డు ప్రమాదానికి గురైందని తెలియడంతో శేఖర్ ఆస్పత్రికి వెళ్తాడు. దురదృష్టవశాత్తు ఇందు చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మృతి చెందుతుంది. ఈ కేసుపై శేఖర్‌కి అనుమానం రావడంతో వెంటనే విచారణ ప్రారంభిస్తాడు. ఇన్వెస్టిగేషన్లో ఆయన భార్య రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని, ఎవరో హత్య చేశారని తెలుస్తుంది.అసలు ఇందుని హత్య చేసింది ఎవరు? ఎందుకు చేశారు? ఈ కేసును శేఖర్ ఎలా ఛేదించాడు? ఇందు నుంచి శేఖర్ విడిపోవడానికి కారణం ఏంటి? అనేది తెలియాలంటే.. థియేటర్స్‌లో ‘శేఖర్’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. క్రైమ్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్ చిత్రాలు అంటే అన్ని వర్గాల ప్రేక్షకులకు ఇష్టమే. అందుకే ఆ జానర్ చిత్రాలు ఎక్కువగా హిట్ అవుతుంటాయి. కథ, కథనం ట్విస్టులతో ఉత్కంఠంగా సాగితేనే ఆ చిత్రాలను ప్రేక్షకులు ఇష్టపడతారు. ‘శేఖర్’లో ఆ ఉత్కంఠత కాస్త తగ్గింది. 2018లో వచ్చిన మలయాళ చిత్రం జోసెఫ్..అప్పట్లో సూపర్ హిట్. కానీ ఈ మధ్య కాలంలో ఓటీటీల ప్రాధాన్యత పెరగడం.. క్రైమ్ థ్రిల్లర్‌తో పాటు అన్ని రకాల జానర్లకు సంబంధించిన కంటెంట్ అందుబాటులో ఉండడంతో, ఆ చిత్రానికి రీమేక్‌గా వచ్చిన ‘శేఖర్’ కథ ప్రేక్షకుడికి కొత్త అనుభూతికి అందించడం కాస్త కష్టమే. అయితే దర్శకురాలు జీవిత మాత్రం.. కథను తీర్చిదిద్దిన విధానం బాగుంది. మాతృకకు ఎలాంటి భంగం కలకుండా..తెలుగు ప్రేక్షకుల తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులు చేశారు. ఫస్టాఫ్ అంతా ఎమోషనల్‌గా సాగుతుంది. తండ్రి,కూతుళ్లు(రాజశేఖర్, శివాణి) మధ్య వచ్చే సీన్స్ హృదయాలను హత్తుకుంటాయి. అలాగే భార్యతో విడిపోవడానికి దారితీసిన కారణాలు, ఒకరి బాగు కోసం మరోకరు చేసే త్యాగం..అందరిని ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోవడమే కాకుండా.. సెకండాఫ్‌పై క్యూరియాసిటీని పెంచుతుంది. అసలు కథంతా సెకండాఫ్‌లోనే మొదలవుతుంది. అయితే..హీరో చేసే ఇన్వెస్టిగేషన్ కాస్త సినిమాటిక్‌గా అనిపిస్తుంది. వ్యవస్థలో ‘ఆర్గనైజ్డ్ మెడకల్ క్రైమ్’ ఎలా జరుగుతుందో ఈ సినిమా ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. వైద్యరంగంలో ఇలాంటి స్కామ్‌లు కూడా ఉంటాయా? అని సగటు ప్రేక్షకుడు ఆలోచిస్తాడు. స్కామ్‌ని బయటపెట్టేందుకు హీరో తీసుకునే సంచలన నిర్ణయం కాస్త సినిమాటిక్‌గా అనిపించినా.. క్లైమాక్స్‌లో ప్రకాశ్ రాజ్ ఇచ్చిన వివరణతో ప్రేక్షకుడు సంతృప్తి చెందుతాడు. అయితే సెకండాఫ్‌లో కథనం కాస్త నెమ్మది సాగడం, ఇన్వెస్టిగేషన్ కూడా రొటీన్‌గా ఉండడం ఈ సినిమాకు మైనస్. మలయాళం మూవీ జోసెఫ్ చూడకుండా, ఈ చిత్రాన్ని చూసే మాత్రం కచ్చితంగా నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. యాంగ్రీస్టార్ రాజశేఖర్ నటనలో ఇప్పటికి జోష్ తగ్గలేదు. రిటైర్డ్ కానిస్టేబుల్ శేఖర్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఎమోషనల్ సీన్స్‌లో అయితే అద్భుతంగా నటించారు. ఆయన కంటతడి పెట్టిన ప్రతిసారి.. ప్రేక్షకుడి హృదయం బరువెక్కుతుంది. ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌లో తెరపై యంగ్‌గా, స్టైలీష్‌గా కనిపించాడు. ‘కిన్నెర’ పాటలో అయితే ఒకప్పటి రాజశేకర్ని చూస్తారు. ఇక హీరో భార్య ఇందు పాత్రకి ఆత్మీయ రాజన్ న్యాయం చేశారు. శేఖర్ కూతురు గీత పాత్రలో శివాణి ఆకట్టుకుంది. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా.. సినిమాకు కీలకం. హీరో స్నేహితులుగా సమీర్, అభినవ్ గోమతం, కన్నడ కిశోర్, ప్రియురాలు కిన్నెరగా ముస్కాన్ ఆకట్టుకున్నారు. పొసాని కృష్ణమురళితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. అనూబ్ రూబెన్స్ సంగీతం ఆకట్టుకుంది. చిన్ని చిన్ని ప్రాణం.. కిన్నెర పాటలతో మిగిలిన సాంగ్స్ కూడా బాగున్నాయి. ఈ పాటలన్నీ కథతో సాగుతాయే తప్ప..తెచ్చిపెట్టినట్లు ఉండవు. నేపథ్య సంగీతం పర్వాలేదు. మల్లికార్జున్ నారగాని సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టిం పెడితే బాగుండేది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
అది జరగపోతే అప్పుల పాలవుతాం: రాజశేఖర్
కోవిడ్ టైమ్‌లో చావు అంచులదాకా వెళ్లి వచ్చాను. 75 కేజీలు ఉన్న నేను 62 కేజీలకు తగ్గాను .ఇక జీవితం అయిపోయింది..సినిమాలను చేయలేను అనుకున్నా. కానీ నా ఫ్యామిలీ సపోర్ట్‌తో పాటు అభిమానుల ప్రేమతో మళ్లీ కోలుకున్నా.మళ్లీ ఒక్కొక్కటిగా నేర్చుకొని ‘శేఖర్’ చిత్రంలో నటించాను . ఈ చిత్రం నాకు చాలా స్పెషల్’అని హీరో రాజశేఖర్ అన్నారు. రాజశేఖర్ హీరోగా, ముస్కాన్, ఆత్మీయ రాజన్ హీరోయిన్లుగా శివానీ రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శేఖర్’. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 20న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా రాజశేఖర్ గురువారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. మీ కెరీర్లో ఎప్పుడులేనంతగా.. ప్రీరిలీజ్ ఈవెంట్లో మా సినిమాను బతికించండి అని ప్రేక్షకులను వేడుకున్నారు.ఎందుకు? ఇంతవరకు మా వెనక ప్రాపర్టీ ఉంది. కాబట్టి సినిమాలు ఆడినా ఆడకపోయినా..పెద్దగా బాధ అనిపించేది కాదు. కానీ ఇప్పుడు శేఖర్ సినిమా సక్సెస్ అయితేనే అప్పుల నుంచి బయటపడతాం. లేదంటే అప్పుల పాలవుతాం. అందుకే నాకు టెన్షన్ ఎక్కువవుతుంది. ఓ ఢిపరెంట్ సినిమా ఎంచుకొని వచ్చాం. సినిమా బాగుందని తెలిసిన తర్వాతే థియేటర్స్ వెళ్లి చూడండి. కానీ త్వరగా వచ్చి చూడండి. ఈ టెన్షన్స్ కారణంగానే మనసులోనుంచి ఆటోమేటిగ్గా ఈ సినిమాను బతికించండి అని వచ్చింది. మీ గత సినిమాలతో పోలిస్తే.. శేఖర్‌లో కొత్తగా ఏం ఫీలయ్యారు? ఆర్టిస్టుగా చాలా సంతృప్తి చెందాను. శేఖర్ క్యారెక్టర్లో ఉన్న ఎమోషన్, బాధను చూపించడానికి బాగా చేశాను. ఈ చిత్రంలో మీ పాత్ర మేకోవర్ గురించి? 55-60 ఏళ్ల వయసు ఉన్న క్యారెక్టర్ నాది. ఈ క్యారెక్టర్‌కి కొత్త లుక్ ఉంటే.. సినిమాకు ప్లస్ అవుతుందని ఆలోచించి.. సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్‌లో వచ్చాం. ఆ గెటప్ బాగుందని చాలా మంది చెప్పారు. అయినా కొంచెం భయం ఉండేది. ఇటీవల ట్రైలర్ విడుదలైన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సెన్సార్ బోర్డు సభ్యులు కూడా సినిమా చూసి చాలా మెచ్చుకున్నారని జీవిత చెప్పారు. దీంతో నాకు చాలా ధైర్యం వచ్చింది. జీవిత దర్శకత్వం గురించి? షూటింగ్‌కి వెళ్తే మేమిద్దరం ఒక డైరెక్టర్, ఆర్టిస్టుగానే ఉంటాం. కానీ ప్రతి విషయంపై ఇద్దరం చర్చింకుంటాం. ఆమె గొప్ప దర్శకురాలు. అందరి నుంచి కావాల్సిన పనిని రాబట్టుకుంటుంది. మలయాళం మూవీ జోసెఫ్ మూవీని రీమేక్‌గా ఎంచుకోవడానికి కారణం? నా గత సినిమాలు ఒక్కసారి తలంబ్రాలు, అంకుశం,ఆహుతి, మగాడు, మా అన్నయ్య, సింహరాశి.. ఇవన్నీ రీమేక్ సినిమాలే. అన్ని సూపర్ హిట్ అయ్యాయి. అందుకే జోసెఫ్ మూవీ ఎంచుకున్నాం. మలయాళంలో పెద్ద సక్సెస్ అయిన సినిమా అది. నేను గతంలో చాలా మళయాల మూవీలను రీమేక్ చేసి హిట్ కొట్టాను. రీమేక్‌లకు సక్సెస్ గ్యారెంటీ ఎక్కువగా ఉంటుంది. అందుకే జోసెఫ్ని సెలెక్ట్ చేశాం. ఈ చిత్రంలో మీ కూతరు శివాణి నటించారు. ఆమె నటన గురించి? మొదట ఈ చిత్రంలో కూతురి పాత్రలకు శివాణి, శివాత్మికలను కాకుండా వేరే వాళ్లను తీసుకుందామని అనుకున్నాం. ఈ విషయం జీవితతో చెబితే.. లేదంటే..మన ఇద్దరి కూతుళ్లలో ఎవరినో ఒకరిని పెడితే..ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అవుతారు. మీ కూతురు అని చెప్పడానికి ఎక్కువ సీన్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు. చూడడానికి బాగుంటదని చెప్పింది. నేను ఓకే అన్నారు. ఇద్దరిలో ఎవరు చేస్తారని అడిగితే..ఇద్దరు చేస్తామని చెప్పారు. చివరకు అక్క కోసం శివాత్మిక త్యాగం చేసింది(నవ్వుతూ..) మీ పాత్రలకు సాయి కుమార్ గారు డబ్బింగ్ చెప్పేవారు. ఈ మధ్యలో బ్రేక్ ఇచ్చినట్లు ఉన్నారు కదా? మధ్యలో 10 ఏళ్లు సాయికుమార్ డబ్బింగ్ చెప్పలేదు. గత పదేళ్లుగా శ్రీనివాస్ మూర్తి నా పాత్రకు డబ్బింగ్ చెప్పారు. ఎవరు డబ్బింగ్ చెప్పారో ఆడియన్స్ కూడా గుర్తుపట్టకుండా ఇద్దరు బాగా చెప్పారు. శేఖర్ చిత్రానికి సాయికుమార్ డబ్బింగ్ చెప్పాడు. 37 ఏళ్ల నా సినీ కెరీర్లో 27 ఏళ్లు సాయికుమార్, 10 ఏళ్లు శ్రీనివాస్ మూర్తి నా పాత్రలకు డబ్బింగ్ చెప్పారు. కోవిడ్ టైమ్‌లో చాలా బ్యాడ్ సిచ్యుయేషన్ని ఫేస్ చేశారు కదా? అవును. చావు అంచులదాకా వెళ్లి వచ్చాను. 75 కేజీలు ఉన్న నేను 62 కేజీలకు తగ్గాను. మళ్లీ కోలుకుంటానని అనుకోలేదు. ఐసీయూలో ఉన్నప్పుడు బోర్ కొట్టకుండా ఉండడానికి అక్కడ టీవీ పెట్టారు. సినిమాలో హీరోలు చేస్తున్న ఫైట్స్, డాన్స్‌లు చూసి.. నేను కూడా ఇలా ఉండేవాడిని.. ఇప్పుడిలా అయిపోయిందే అని బాధపడేవాడిని. ఇక జీవితం అయిపోయిందని అనుకున్నాను. ఇక సినిమాలు చేయలేనని అనుకొని జోసెఫ్ రీమేక్ హక్కులను వేరే వాళ్లకు ఇవ్వమని చెప్పాను. కానీ జీవితతో పాటు అందరూ.. నువ్వు కోలుకుంటావని భరోసా ఇచ్చారు. సినిమాపై ఉన్న కసితో ఒక్కొక్కటిగా మళ్లీ నేర్చుకొని ‘శేఖర్’ మూవీ చేశాను. నా కెరీర్లో చేసిన సినిమాలన్నింటిలో ‘శేఖర్’మూవీ చాలా స్పెషల్. ఇంత ఎనర్జిటిక్ పాత్రను మళ్లీ చేయలేను అనుకుంటా. ఒరిజినల్ మూవీతో పోలిస్తే ‘శేఖర్’లో ఏమైనా మార్పులు చేశారా? పెద్దగా మార్పులు చేయలేదు. మలయాళంలో కొంచెం పేస్ స్లోగా ఉంటుంది. తెలుగులో అలా ఉంటే పనికిరాదు. మన తెలుగు ఆడియన్స్ తగ్గట్టుగా మార్చుకున్నాం. అలాగే మలయాళం చిత్రంలో కొన్ని సీన్స్‌కి వివరణ ఉండదు..ఇందులో ఆడియన్స్‌కు అర్థం అయ్యేలా వివరణ ఇచ్చాం. నిడివి కూడా ఒరిజినల్‌తో పోలిస్తే.. ఈ చిత్రం నిడివి తక్కువ. మీ అమ్మాయి(శివాణి) పాత్రను ఏమైనా పెంచారా? లేదు. మా అమ్మాయి కదా అని పాత్రను పెంచితే.. సినిమాను చెడగొట్టినవాళ్ల అవుతాం. అలా చేయలేదు. అనూప్ రూబెన్స్ మ్యూజిగ్ గురించి? ఈ చిత్రానికి సంగీతం చాలా ముఖ్యం. అనూప్ రూబెన్స్ చాలా మంచి మ్యూజిగ్ ఇచ్చారు. ఈ చిత్రంలో నా పాత్ర స్మోకింగ్ చేయాలి. కానీ నా అనారోగ్యం కారణంగా స్మోకింగ్ చేయొద్దని వైద్యులు చెప్పారు. అనూప్ తన మ్యూజిగ్తో ఈ సీన్స్ మ్యానేజ్ చేశారు. కోవిడ్ టైమ్‌లో మీ ఇద్దరు కూతుళ్లు దగ్గర ఉండి మీ బాగోగులు చూశారు.ఎలా అనిపించింది? నా తమ్ముడికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వాడే నాతో ‘మీ ఇద్దరు కూతుళ్లే నిన్ను కాపాడారు.గుర్తుపెట్టుకో. నా కొడుకులు కూడా నన్ను అలా చూసుకోలేదు’అన్నాడు. నిజంగా నా కూతుళ్లు, జీవిత ఆ సమయంలో నన్ను బాగా చూసుకున్నారు. కోవిడ్ టైమ్‌లో మేం నలుగురం ఐసీయూలోనే ఉండిపోయాం. నేను ఇలా లేస్తే చాలు..డాడీ ఏం కావాలి అంటూ ఇద్దరు వచ్చేవాళ్లు. కొడుకులు తక్కువ అని నేను చెప్పను కానీ.. కూతుళ్లు మాత్రం ఎక్కువే. మీ నలుగురు కలిసి సినిమా చేసే అవకాశం ఉందా? ఉంది. కొన్ని కథలు కూడా వచ్చాయి. ‘దొరసాని’ ఫేమ్ మహేందర్ కూడా మా నలుగురితో ఓ సబ్జెక్ట్ అనుకుంటున్నాడు.మేం కొన్ని మార్పులు చెప్పాం. అలాగే ప్రవీణ్ సత్తారు కూడా గరుడవేగ పార్ట్2లో ఇద్దరు కూతుళ్లను యాడ్ చేసే ప్లాన్‌లో ఉన్నాడు. భవిష్యత్తులో తప్పుకుండా మేమంతా కలిసి సినిమా చేస్తాం. ప్రీరిలీజ్ ఈవెంట్లో సుకుమార్ గారు మాట్లాడుతూ..మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనే సినిమాల్లోకి వచ్చామని చెప్పారు.ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఫీలయ్యా. నాకు ఇన్ని రోజులు ఈ విషయం తెలియదే అని ఫీలయ్యా(నవ్వుతూ..) కొత్త సినిమాలు ఏం ఉన్నాయి? త్వరలోనే ఓ పెద్ద అనౌన్స్మెంట్ ఉంటుంది. పాన్ ఇండియా మూవీకి ప్లాన్ చేస్తున్నాం. -
రాజశేఖర్‌గారి వల్ల ఫేమస్ అయ్యా! – డైరెక్టర్ సుకుమార్
‘‘నా ఫ్రెండ్ కృష్ణ అని ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నాడు. తను మా ఊర్లో అందర్నీ ఇమిటేట్ చేస్తుంటే నేను అసూయపడేవాణ్ణి. మొదటిసారి మా ఊర్లో రాజశేఖర్‌గారిని ఇమిటేట్ చేశాను.. దాంతో ఫేమస్ అయ్యాను. స్కూల్లో నన్ను రాజశేఖర్‌గారిలా చేయమంటే చేసేవాణ్ణి’’ అని డైరెక్టర్ సుకుమార్ అన్నారు. రాజశేఖర్ హీరోగా, ముస్కాన్, ఆత్మీయ రాజన్ హీరోయిన్లుగా శివానీ రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శేఖర్’. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్ రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో అతిథిగా పాల్గొన్న సుకుమార్ మాట్లాడుతూ– ‘‘రాజశేఖర్‌గారు చేసిన ‘ఆహుతి, ఆగ్రహం, తలంబ్రాలు, మగాడు, అంకుశం’.. ఇలాంటి సూపర్‌డూపర్ సినిమాలు మమ్మల్ని ఇన్స్పైర్ చేశాయి.. ఆ టైమ్‌లో ఆయనకు వీరాభిమాని అయ్యాను. సినిమాల్లోకి రాగలను, ఏదైనా చేయగలను అనే ఆలోచన నాలో ఏర్పడటానికి ఆయనే కారణం. ఆయనలోని గొప్ప విషయం ఏంటంటే.. మనందరం సినిమా పరిశ్రమలో ఉంటూ డబ్బులు, పేరు సంపాదిస్తూ మన పిల్లల్ని, కుటుంబాన్ని మాత్రం ఇండస్ట్రీకి దూరం పెడుతుంటాం. కానీ ఆయన ఇద్దరమ్మాయిలను (శివాని, శివాత్మిక) ఇండస్ట్రీకి తీసుకొచ్చినందుకు హ్యాట్సాఫ్. తద్వారా ఇండస్ట్రీ ఒక పవిత్రమైన ప్రదేశం అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. ఒక డైరెక్టర్‌కి ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. అలాంటిది జీవితగారు అటు ఫ్యామిలీని చూసుకుంటూ, ఇటు భర్తని హీరోగా పెట్టి ఓ సినిమాకి దర్శకత్వం చేస్తూ భారాన్ని మోసినందుకు ఆమెకు దండాలు. జీవితగారి కోసమైనా ‘శేఖర్’ బ్లాక్‌బస్టర్ కావాలి’’ అన్నారు. రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘కరోనా వల్ల చావు అంచులదాకా వెళ్లి వచ్చి ‘శేఖర్’ చేశాను.. ప్రజల ఆశీర్వాదాలే నన్ను బతికించాయి. నన్ను బతికించారు.. ‘శేఖర్’ చూసి నా బతుకుదెరువుని కూడా బతికించండి. అందరూ థియేటర్‌కి వెళ్లి సినిమా చూసినప్పుడే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. ఈ సినిమా కోసం మాకంటే కూడా జీవితగారే ఎక్కువ కష్టపడ్డారు. పోస్ట్ ప్రొడక్షన్లో మా పిల్లలు (శివాని, శివాత్మిక) జీవితకు ఎంతో సాయంగా ఉన్నారు’’ అన్నారు. నటుడు సముద్ర ఖని, కెమెరామేన్ మల్లిఖార్జున్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. -
నా జీవితం అయిపోయింది అనుకున్నా: రాజశేఖర్ భావోద్వేగం
‘‘కరోనా నుంచి కోలుకున్నాక ‘శేఖర్’ చిత్రం చేశాను. 10 సినిమాల కష్టం ఒక్క ‘శేఖర్’కి పడ్డాను. యూనిట్ అంతా ప్రాణం పెట్టి చేశారు. ఈ సినిమా బాగా రావడానికి కారణం జీవిత’’ అని రాజశేఖర్ అన్నారు. రాజశేఖర్ పుట్టినరోజు (ఫిబ్రవరి 4) వేడుకలు హైదరాబాద్‌లో జరిగాయి. ఈ సందర్భంగా ‘శేఖర్’ చిత్రంలోని ‘కిన్నెర..’ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి జీవితా రాజశేఖర్ డైరెక్టర్. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్ రెడ్డి, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘కోవిడ్ సమయంలో నా జీవితం అయిపోయింది.. నేను సినిమాలు చేస్తానా? లేదా? అనుకున్నాను. అయితే మీ అందరి ఆశీర్వాదాల వల్లే ఈరోజు మీ ముందు ఉన్నాను’’ అన్నారు. జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ–‘‘శేఖర్’ మాకు మరిచిపోలేని సినిమా అవుతుంది. ఈ సినిమాను ఎంతో కష్టపడి, ఇష్టంగా చేశాం. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. -
చనిపోతా.. రేపో, ఎల్లుండో చితికి మంట పెట్టేస్తారనుకున్నా: రాజశేఖర్ ఎమోషనల్
గత మూడున్నర దశాబ్దాలుగా విభిన్నమైన చిత్రాలలో నటిస్తూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సీనియర్ హీరో రాజశేఖర్. ఇప్పుడంటే ఆయన సినిమాలు తగ్గించాడు కానీ.. ఒకప్పుడు రాజశేఖర్ సినిమా అంటే.. మినిమమ్ గ్యారెంటీ ఉండేది. అంతేకాదు 90ల్లో స్టార్ హీరోగా వెలుగొందాడు. అప్పట్లో రాజశేఖర్ ఖాతాలో ఎన్నో సంచలన విజయాలు ఉన్నాయి. చాలా గ్యాప్ తర్వాత ఈ యాంగ్రీ స్టార్ ‘శేఖర్’సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రానికి ఆయన భార్య జీవిత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఓ టీవీ షోలో పాల్గొన్నా రాజశేఖర్.. తన జీవితంలో అనుభవించిన అత్యంత గడ్డు కాలాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. గతేడాది కరోనా బారిన రాజశేఖర్.. నెల రోజులకు పైగా ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ.. ‘కరోనా సోకినప్పుడు నాకు చాలా సీరియస్ అయింది. ఇక నేను చనిపోతాననుకున్నా. రేపో ఎల్లుండో నా చితికి మంట పెడతారనే ఆలోచనలు వచ్చాయి. జీవిత, పిల్లలకు ధైర్యంగా ఉండాలని చెప్పా. ప్రేక్షకుల ప్రార్థనల వల్లే బతికాను. ఇంటికి వచ్చిన తర్వాత నా కాళ్లు, చేతులు పనిచేయలేదు. ఇక నేను నటించలేనేమో అనే భయం కలిగింది. నాపై నాకే నమ్మకం లేకపోవడంతో..‘శేఖర్’చిత్రాన్ని వేరేవాళ్లతో చేయమని చెప్పా. ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడితే అవన్నీ గుర్తొస్తాయి’ అంటూ జీవిత,రాజశేఖర్ దంపతులుఎమోషనల్ అయ్యారు. ఇక సినిమాల్లోకి ఎలా వచ్చారో చెబుతూ... ‘నాకు చిన్నప్పటి నుంచి నటుడి కావాలని కోరిక ఉండేది. కానీ నాకు నత్తి ఉంది. ఒకవేళ నాకు సినిమా చాన్స్ వచ్చినా.. నత్తి ఉందని తీసేస్తారేమోననే భయం ఉండేది. అసలు నాకు నటన వచ్చో..రాదో తెలుసుకోవడానికి యాక్టింగ్ స్కూల్లో చేరా. అప్పడు నమ్మకం కలిగి.. నటించడం మొదలుపెట్టా’అని రాజశేఖర్ చెప్పుకొచ్చారు. -
రాజ'శేఖర్'లో శివానీ రాజశేఖర్
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'శేఖర్'. ఇందులో ఆయన పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమాలోనూ రాజశేఖర్ కుమార్తె పాత్రలో శివాని నటించారు. వెండితెరపై తండ్రి తనయ కలిసి కనిపించనున్న తొలి చిత్రమిదే. ఈ రోజు సినిమా యూనిట్ రాజశేఖర్, శివానీ రాజశేఖర్ స్టిల్స్ విడుదల చేసింది. హీరోగా రాజశేఖర్ 91వ సినిమా శేఖర్. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో, పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించిన సినిమా ఇది. దర్శకురాలు జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ "రాజశేఖర్, శివాని మధ్య సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నిజ జీవితంలో ఎలా ఉంటారో... సినిమాలో కూడా అలాగే ఉన్నారు. వారిద్దరూ చాలా సహజంగా చేశారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు, ఫస్ట్ గ్లింప్స్, లవ్ గంట మోగిందంటే పాటకు అద్భుత స్పందన లభించింది. సినిమా కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీ వెల్లడిస్తామం" అని చెప్పారు. -
ఆచార్య ఆగితే.. ‘శేఖర్’ వస్తాడట
Chiranjeevi Acharya Movie Updates: ఒమిక్రాన్ ఎఫెక్ట్ తో ఎలాగూ జనవరి మూవీస్ రిలీజెస్ షెడ్యూల్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఫిబ్రవరిలోనూ అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినీ అభిమానులను మరోసారి డిజప్పాయింట్ చేస్తూ ఆచార్య, ఖిలాడి లాంటి సినిమాలు మరో మంచి రిలీజ్ డేట్ వైపు చూసే ఆప్షన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 4న ఆచార్య రిలీజ్ కావాల్సి ఉంది. రెండేళ్లుగా మెగాభిమానలు ఈగర్ గా వెయిట్ చేస్తున్న మెగా మల్టీస్టారర్ మూవీ ఇది. ఎట్టకేలకు ఫిబ్రవరిలో మూవీ రిలీజ్ అవుతోంది. అందుకు తగ్గట్లే కొరటాలశివ సినిమా ప్రమోషన్ ను సాగిస్తున్నాడు. లాహే, నీలాంబరి, సానా కష్టం లాంటి సింగిల్స్ రిలీజ్ చేసాడు. చిరు, చరణ్ లపై స్పెషల్ టీజర్స్ విడుదల చేసాడు. కాని ఇప్పుడు ఈ మెగా మల్టీస్టారర్ ఒమిక్రాన్ ఎఫెక్ట్ తో వాయిదా పడే అవకాశాలు ఉన్నాయట. ఫిబ్రవరి 4న ఆచార్య పోస్ట్ పోన్ అయితే ఆ స్థానంలో శేఖర్ వస్తాడట. 2018 మలయాళ బ్లాక్ బస్టర్ జోసెఫ్ మూవీ తెలుగు రీమేక్ ఇది. నిజానికి ఈ మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు. ఇప్పుడు ఆచార్య పోస్ట్ పోన్ కానుందనే టాక్ బయటికి రావడంతో ఆ డేట్ పై రాజశేఖర్ కన్నేశాడు. -
తొలి ప్రేమే పుట్టిందంటున్న రాజశేఖర్!
రాజశేఖర్ హీరోగా జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శేఖర్’. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్ రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించిన చిత్రం ఇది. తాజాగా ‘శేఖర్’ చిత్రంలోని ‘ప్రేమ గంటే మోగిందంట’ పాటను విడుదల చేశారు. ‘‘బొట్టు పెట్టి.. కాటుక ఎట్టి వచ్చిందమ్మా సిన్నది... బుగ్గ మీద సుక్కే పెట్టి సిగ్గే పడుతున్నది..’’ అంటూ మొదలైన ఈ పాట ‘డండ డండ డండ లవ్గంట మోగిందంట... తొలి ప్రేమే పుట్టిందంట’ అంటూ సాగుతుంది. చంద్రబోస్ రాసిన ఈ పాటను విజయ్ ప్రకాష్, అనూప్, రేవంత్ పాడారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు స్వరకర్త. ‘‘ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు జీవితా రాజశేఖర్. -
రాజ‘శేఖర్’ మూవీకి ఓటీటీ షాకింగ్ రేట్స్!
కరోనా కారణంగా ఓటీటీలకు ఫుల్ డిమాండ్ వచ్చేసింది. ఇప్పటికే కొన్ని ఓటీటీ సంస్థలు సొంతంగా సినిమాలను తెరకెక్కించి డైరెక్ట్ స్ట్రీమింగ్ ఇస్తుంటే మరికొన్ని సంస్థలు ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా సినిమాలను ఫ్యాన్సీ రేటుకు కొనేసుకుంటున్నాయి. దీంతో థియేటర్ లో రిలీజ్ కాకుండానే డైరెక్ట్ స్ట్రీమింగ్ కు భారీ ధరలను కూడా ఓటీటీ సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. అందుకే వెంకటేష్ లాంటి సీనియర్ హీరోల సినిమాలు కూడా డైరెక్ట్ ఓటీటీలో వచ్చేస్తున్నాయి. చదవండి: పుష్ప ట్రైలర్ టీజ్ అవుట్, మామూలుగా లేదుగా.. థియేటర్లు తెరుచుకున్నప్పటికీ.. ఓటీటీలు మాత్రం ప్రేక్షకులలో అటెన్షన్ క్రియేట్ చేసి కొన్ని సినిమాలను ఎలాగైనా డైరెక్ట్ ఓటీటీ దక్కించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. అలా బజ్ క్రియేట్ చేసిన యాంగ్రీమెన్ రాజశేఖర్ ‘శేఖర్’ సినిమాపై ఇప్పుడు ఓటీటీల చూపు పడింది. డైరెక్ట్ రిలీజ్ కోసం ఓటీటీలు శేఖర్ సినిమాకు 22 నుంచి 25 కోట్ల రూపాయల వరకు ఫ్యాన్సీ రెట్లను ఆఫర్ చేస్తున్నాయట. ఈ సినిమా డిజిటల్ ప్లస్ శాటిలైట్ కలిపి 20 కోట్లకు పైగానే పలుకుతుండటం ట్రేడ్ వర్గాలకు షాక్ ఇస్తుంది. పెద్దగా మార్కెట్ లేని రాజశేఖర్ లాంటి హీరోల సినిమాకి ఓటీటీలు ఈ రేంజ్లో డీల్ కుదుర్చుకోవడం గమనార్హం. చదవండి: రూ. 3 కోట్ల మోసం, శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన యంగ్ హీరో ఇతడే దీనికి కారణం ఇప్పటికే విడుదలైన శేఖర్ గ్లింప్స్ ప్రేక్షకులలో అటెన్షన్ క్రియేట్ చేశాయనడంలో ఎలాంటి డౌట్స్ లేవు. ఈ సినిమా జానర్ కూడా మరో కారణం కాగా.. ఇది ఆల్రెడీ హిట్టయిన మలయాళ మూవీ జోసెఫ్‌కు రీమేక్ కావడంతో ఓటీటీలు ఎలాగైనా ఈ సినిమాను దక్కించుకునేందుకు భారీ స్థాయి ఆఫర్లు ఇస్తున్నారట. శేఖర్ రీమేక్ మూవీ అయినప్పటికీ మెయిన్ సోల్ మిస్ కాకుండా కథ-స్క్రీన్ ప్లేలో మార్పుచేర్పులు చేయడంతో పాటు తెలుగు ఆడియన్స్ కోసం ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేశారట. ఈ రీమేక్‌కి జీవిత రాజశేఖర్ డైరెక్టర్ కాగా స్క్రీన్‌ప్లే కూడా ఆమెనే చూసుకుంటుంది. మరి ఓటీటీకి ఇచ్చేస్తారా లేక థియేటర్లలో వదులుతారో చూడాలి. -
‘శేఖర్’ ఫస్ట్ గ్లింప్స్.. రాజశేఖర్ లుక్ అదిరిందిగా!
రాజశేఖర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘శేఖర్’. ఆయన సతీమణి జీవిత ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే సమకూర్చారు. బీరం సుధాకర్ రెడ్డి, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ చిత్రాన్ని నిర్మించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ని గురువారం విడుదల చేశారు. ‘అరకు బోసుగూడెం తోట బంగ్లాలో నూతన దంపతులు దారుణ హత్యకు గురయ్యారు’ అంటూ ఓ మహిళ వాయిస్ ఓవర్‌తో ఫస్ట్ గ్లింప్స్ మొదలైంది. ‘వాడు ఎప్పుడైనా మనం చెప్పింది చేశాడా? వాడు చేసేది మనకు చెప్పాడా?’ అంటూ రాజశేఖర్ చేసిన శేఖర్ పాత్ర పరిచయానికి సంబంధించిన సంభాషణలు బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తాయి. జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘రాజశేఖర్ నటించిన 91వ చిత్రమిది. ఫస్ట్ గ్లింప్స్‌కు మంచి స్పందన వస్తోంది. 2022 జనవరిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మల్లికార్జున్ నరగని, సంగీతం: అనూప్ రూబెన్స్. -
శేఖర్.. సూపర్
సంగారెడ్డి అర్బన్: సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో గుర్తింపుగా గౌరవ డాక్టరేట్‌తో పాటు, ఐదు ఆవార్డులు సొంతం చేసుకొని పల్పనూరి శేఖర్ ఆదర్శంగా నిలిచారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి కూత వేటు దూరంలో ఉన్న చిమ్నాపూర్‌లో జన్మించిన శేఖర్ 2002లో అంబేడ్కర్ యువజన సంఘం ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా, అనాథలకు అండగా నిలిచారు. దళితుల సమస్యలపై పోరాటాలు చేశారు. వివిధ సంస్థల్లో పని చేస్తూనే బహుజన భీమ్ సోల్జర్ను ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న దివ్యదిశ అనాథ ఆశ్రమంలో చిన్నారులకు నిత్యావసరాలు, దుస్తులు పంపిణీ, 2007లో నెహ్రూ యువ కేంద్రం సిద్దిపేట కేంద్రంగా పలు సేవా కార్యక్రమాలు చేశారు. «కంది మండలం ధర్మసాగర్ చెరువులో 360 ఎకరాల దళితులు భూములు కబ్జాకు గురైతే వారి భూములు తిరిగి ఇప్పించడంలో కీలక పాత్ర పొషించారు. క్రైస్తవ జేఏసీ తరపున చర్చిల్లో పలు సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా, నిరుపేదలకు నిత్యావసరాలు, దుస్తులు పంపిణీ చేశారు. హత్నూర మండలంలో ఓ పరిశ్రమ యాజమాన్యం ఇద్దరు మూగ దంపతుల భూమిని కబ్జా చేస్తే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేశారు. 2017లో హైటెన్షన్ వైర్ల భూ బాధితులకు నష్ట పరిహారం ఇప్పించడంలో ఆయన కీలక పాత్ర పొషించారు. ఆపదలో ఉన్న వారికి అండగా.. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడమే కాకుండా తాను స్వయంగా రక్తదానం చేసి మనవత్వాన్ని చాటుకున్నారు. అపదలో ఉన్నవారికి అండగా నిలువడంతో పాటు కార్మికుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి సేవలు అందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులైన్స్ డ్రైవర్లు హైదరాబాద్‌కు తీసుకెళ్లడానికి డబ్బులు అడగటంతో జెడ్పీ చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించారు. ఆసుపత్రుల్లో మృతిచెందిన బాలింతలు, చిన్నారుల పక్షాన న్యాయ పోరాటాలు చేశారు. గౌరవ డాక్టరేట్, ఐదు అవార్డులు సొంతం.. 18 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు గానూ, శేఖర్‌ను గుర్తించి జూన్ 20న అంతర్జాతీయ గ్లోబల్ యునివర్శిటీ చాన్స్‌లర్, ప్రొఫెసర్ల చేతుల మీదుగా కర్ణాటక రాష్ట్రం బెంగుళూర్లో డాక్టరేట్‌ను అందకున్నారు. 2007లో నెహ్రూ యువ కేంద్రం సిద్దిపేట తరపున జాతీయ అవార్డు సొంతం చేసుకున్నారు. 2014లో బెస్ట్ సోషల్ వర్కర్‌గా ఉమ్మడి మెదక్ జిల్లాలో అప్పటి కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. 2015లో ప్రొఫెసర్ జయశంకర్ జాతీయ అవార్డును తీసుకున్నారు. 2016లో అంబేడ్కర్ జాతీయ అవార్డును ఢిల్లీలో సొంతం చేసుకున్నారు. సేవలకు గుర్తింపుగా విశిష్ట సేవరత్న అవార్డును 2019లో తిరుపతిలో అందుకున్నారు. -
సమాజానికి దిక్సూచి
దిలీప్‌కుమార్ సలాది, ‘ఛత్రపతి’ శేఖర్, సమ్మెట గాంధీ, చాందిని, సమీరా, స్వప్నిక, బిత్తిరి సత్తి, రాకేష్, మల్లాది భాస్కర్, సుమన్, రజితసాగర్, అరుణ్‌బాబు, ధన్వి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘దిక్సూచి’. దిలీప్‌కుమార్ సలాది దర్శకత్వంలో నర్సింహరాజు రాచూరి, శైలజా సముద్రాల నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ మూడో వారంలో రిలీజ్ కానుంది. దిలీప్‌కుమార్ సలాది మాట్లాడుతూ– ‘‘డివోషనల్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. సమాజానికి ఓ దిక్సూచి అవుతుంది. 1970లో జరిగిన సెమీ పీరియాడికల్ మూవీ. మా నిర్మాత రాజుగారు ఆస్ట్రేలియన్ సిటిజన్. నేను చైల్డ్ ఆర్టిస్టుగా చాలా చిత్రాలు చేశా. హీరోగా నాకు నేనే ఓ పాత్ర రాసుకున్నా. ఇదే నిర్మాతతో, మరో కంపెనీతో అసోసియేట్ అయి ఏడాదికి మూడు సినిమాలు నిర్మిస్తాం. ఉగాదికి మరో సినిమా ఆరంభిస్తాం’’ అన్నారు. ‘‘మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. సిగరెట్, మందు వంటివాటిని చూపించడం లేదు. దిలీప్‌కుమార్ మంచివాడు. అతనిలోని ప్రతిభ బయటకు రావాలంటే మంచి జరగాలి. అందుకే ఈ సినిమా చేశాం. ఫైట్లు పెద్దగా లేవు’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: జయకృష్ణ, రవికొమ్మి, సంగీతం: పద్మనాభ్ భరద్వాజ్. -
సేవకు సెల్యూట్
అల్వాల్: అటు దేశ సేవలో.. ఇటు సామాజిక సేవలో తరిస్తున్నారు వైట్ వలంటీర్స్ సంస్థ వ్యవస్థాపకుడు శేఖర్ మారవేణి. జమ్మూ కశ్మీర్లో సీఆర్పీఎఫ్ సబ్ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న శేఖర్.. ఎంతో మంది విద్యార్థులను ఆదుకుంటూ దాతృత్వం ప్రదర్శిస్తున్నారు. గత ఏడాది మార్చిలో వైట్ వలంటీర్స్ సంస్థ ఏర్పాటు చేసి సిరిసిల్లలో మూడు ప్రభుత్వ పాఠశాలలు, పిల్లాయిపల్లిలో రెండు ప్రభుత్వ పాఠశాలల్ని దత్తత తీసుకొని పాలామృతం పేరుతో ప్రతిరోజూ విద్యార్థులకు పాలను అందిస్తున్నారు. ప్రతి ఏటావిద్యార్థులకు దుస్తులు పంపిణీ చేస్తున్నారు. వృద్ధులు, అనాథలు, వికలాంగుల పాలిట ఆపద్బాంధవుడిగా మారారు. ఒక్కరి ఆలోచన 200 మందికి స్ఫూర్తి మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా నాగరానికి చెందిన శేఖర్ తాను చిన్నప్పుడు చదువుకున్న పాఠశాలలో ఎంతో మంది విద్యార్థులు పోషకాహార లోపంతో బాధపడుతుండటం, సరైన దుస్తులు లేకపోవడంతో మధ్యలోనే బడి మానేయడం వంటి సమస్యలను గమనించారు. దీంతో తాను భవిషత్తులో కొంత మేరకైనా సహాయం చేయాలన్న లక్ష్యాన్ని ఏర్పర్చుకున్నారు. 2012లో సీఆర్ఫీఎఫ్లో ఉద్యోగం వచ్చాక ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు రక్షణతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. అప్పటినుంచి సామాజిక సేవ చేయాలనే సంకల్పం రెట్టింపయ్యింది. ఏడాది క్రితం 8 మందితో వైట్ వలంటీర్స్ సంస్థను స్థాపించారు. ప్రస్తుతం ఇది 200 మంది ప్రతినిధులతో నగరంలోని పలు ప్రాంతాల్లో సేవలందిస్తోంది. బాక్స్‌లు ఏర్పాటు చేసి.. ఈసీఐఎల్, మల్కాజిగిరి చౌరస్తాల్లో బాక్స్‌లు ఏర్పాటు చేసి దుస్తులు, పుస్తకాలు, ఇతర వస్తువులను సేకరిస్తూ విద్యార్థులకు, వృద్ధులకు పంపిణీ చేస్తున్నారు. శేఖర్ ఉద్యోగ విధులు నిర్వర్తిస్తుండగా.. ఆయన భార్య లత, సంస్థ ప్రతినిధులు యోగధాత్రి, ప్రభాకర్, శ్రావణి, దీపాంజలి, విక్రాంత్, రాజు, సతీష్‌లతో పాటు ఆరు కళాశాలలకు చెందిన 200 ప్రతినిధులు సేవాతత్పరతను చాటుతున్నారు. హ్యాపీ.. సెల్ఫీ జూబ్లీహిల్స్: ప్రముఖ సినీనటి తమన్నా మంగళవారం బంజారాహిల్స్ జీవీకే వన్ మాల్లోని యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనెటన్ స్టోర్‌లో సందడి చేశారు. కొత్త ఎస్ఎస్–19 సమ్మర్ కలెక్షన్‌ను ఆమె ఆవిష్కరించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలు తమ శక్తిసామర్థ్యాలను గుర్తించి ముందుకెళితే విజయం తథ్యమన్నారు. చిన్నప్పటినుంచి తనకు శ్రీదేవి, మాధురీ దీక్షిత్ అంటే ఎంతో ఇష్టమన్నారు. -
ఆశల దీపం ఆరిపోయింది
శ్రీకాకుళం, ఎల్.ఎన్.పేట: ఉద్యోగం చేసి కుటుంబాన్ని ఆదుకుంటాడని కుమారుడిపై ఎన్నో ఆశలు పెంచుకున్న ఆ తల్లిదండ్రులకు దేవుడు తీరని వేదన మిగిల్చాడు. కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారి రోదన ఆపడం ఎవరి తరము కావటం లేదు. బెంగళూరులో జరిగిన నేవీ ఎంపికల్లో పాల్గొని ముందురోజే ఇంటికి వచ్చిన కొడుకు మరిలేడని తెలుసుకుని తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. పదో తరగతి నుంచి అన్ని ఫలితాల్లో ప్రథమ స్థానంలోనే నిలుస్తూ... చదువులో రాణించే కొడుకు ఏదైనా మంచి ఉద్యోగం సాధిస్తాడని ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు విషాదమే మిగిలింది. మండలంలోని మోదుగువలస కాలనీకి చెందిన మునికోటి బాబూరావు, అరుణ దంపతుల కుమారుడు మునికోటి శేఖర్(19) మంగళవారం చెరువుకు స్నానానికి వెళ్లి మృతి చెందాడు. మోదుగువలస గ్రామానికి సమీపంలో ఉన్న కోనేరులో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఉదయం చెరువుకు స్నానానికి వెళ్లిన శేఖర్ ఎప్పటికీ ఇంటికి రాకపోవడంతో కొడుకు కోసం గ్రామంలో ఆరా తీశారు. స్నేహితులను అడిగినా తమకు తెలియదని, చెరువు వద్ద శేఖర్ బట్టలు, చెప్పులు ఉన్నాయని చెప్పడంతో అనుమానం వచ్చి వెళ్లి చూడగా చెరువు గట్టుపైనే బట్టలు, చెప్పులు ఉన్నాయి. దీంతో చెరువులో గాలించగా మృతదేహం లభించిందని స్థానికులు చెప్పారు. బెంగళూరులో జరిగిన నేవీ ఎంపికలకు వెళ్లిన శేఖర్ సోమవారం సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు. ఇతడు విజయనగరంలోని మహారాజ ఇంజినీరింగ్ కాలేజీలో ప్రథమ సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్నాడు. మంగళవారం ఉదయాన్నే కాలేజీకి వెళ్లిపోతానని ఇంట్లో చెప్పాడు. ఊరిలో అమ్మవారి వారాలు జరుగుతున్నాయని, మరలా నువ్వు ఎప్పుడు వస్తావో ఈరోజు వారాలు అయిపోతే బుధవారం ఉదయం వెళుదువులే అని చెప్పడంతో ఉండిపోయాడని తల్లిదండ్రులు రోదిస్తున్నారు. బాబూరావు, అరుణ దంపతుల పెద్ద కుమార్తె శ్రీలతకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. రెండో కుమార్తె సుధారాణి డిగ్రీ వరకు చదువుకుంది. ఈ సంఘటనపై తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సరుబుజ్జిలి పోలీస్ స్టేషన్ హెచ్‌సీ రమణమూర్తి చెప్పారు. మృతదేహానికి శవపంచనామా చేసి పోస్టుమార్టం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించామన్నారు. -
‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ లోగో లాంచ్
-
‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ లోగో లాంచ్
ఏబీటీ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 లో తెరకెక్కుతున్న చిత్రం ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’. లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ కార్తిక్ హీరోగా నటిస్తున్నాడు. పూజిత పొన్నాడ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్ర లోగోను దర్శక నిర్మాతలు ఈ రోజు (గురువారం) విడుదల చేసారు. అమలాపురంలో 20 రోజుల షూటింగ్ తరువాత ప్రస్తుతం హైదరాబాద్ లోని సారథి స్టూడియోస్ లో శేఖర్ మాస్టర్ ఆధ్వర్యంలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. తరువాత మరో షెడ్యూల్ 10రోజులు అమలాపురంలో షూట్ చేయనున్నారు. సినిమాను దీపావళి రోజున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నటి లక్ష్మీరాయ్ మాట్లాడుతూ... ‘ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రం వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి. మాస్ సాంగ్‌ను కంపోజ్ చేస్తున్నారు శేఖర్ మాస్టర్. ఈ పాట హైలెట్‌గా నిలుస్తుంది. అన్నీ పాటలను బాగా కంపోజ్ చేసాడు మ్యూజిక్ డైరెక్టర్ హరి. 70 శాతం షూటింగ్ పూర్తయింది. అందరూ కష్టపడి పనిచేస్తున్నారు.. నిర్మాతల సహకారం చాలా బాగుంది. నాకు మంచిపేరు తెచ్చిపెట్టే చిత్రం అవుతుందని ఆసిస్తూన్నా అన్నారు. -
సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్య
పెనగలూరు: టచ్ సెల్‌ఫోన్ (స్మార్ట్ ఫోన్) కొనివ్వలేదని కంబాలకుంటకు చెందిన కోనేరు శేఖర్ (15) గుళికలను నీటిలో కలుపుకుని తాగి మృతి చెందినట్లు పోలీస్‌హౌస్ ఆఫీసర్ నాయక్ తెలిపారు. తనకు స్మార్ట్‌ఫోన్ తీసివ్వాలని శేఖర్ తల్లిదండ్రులను అడిగాడు. ఇంట్లో ఉన్న చిన్న సెల్‌ఫోన్ ఇచ్చి ఉపయోగించుకోవాలని తల్లిదండ్రులు మందలించారు. దీంతో శేఖర్ ఇంట్లో తెచ్చిపెట్టి ఉన్న గుళికలను నీటికలో కలుపుకుని బుధవారం రాత్రి తాగాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు శేఖర్‌ను హుటాహుటిన రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శేఖర్ మృతి చెందినట్లు ఆయన తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని నాయక్ తెలిపారు. -
ఎస్వీ శేఖర్‌ను పట్టివ్వడమేనా నా పని?
శఢటీ.నగర్: ఎస్వీ శేఖర్‌ను పట్టివ్వడమే తన పనా? అంటూ కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. విల్లుపురంలో బీజేపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో సమధర్మ రాష్ట్ర మహానాడు ఈనెల 27న జరగనుంది. ఇందుకోసం జానకీపురంలో మహానాడు పందిరి గుంజం నాటే కార్యక్రమం సోమవారం ఉదయం జరిగింది. కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ హాజరై ప్రారంభించారు. తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు నేతలు ఇందులో పాల్గొంటారన్నారు. కర్ణాటకలో బీజేపీ అధికారం చేపట్టిన వెంటనే మంచి మార్పు జరుగుతుందని, రాష్ట్రానికి తగినన్ని జలాలు అందుతాయన్నారు. తర్వాత ఒక కార్యక్రమంలో మంత్రిని కొందరు విలేకరులు ఎస్వీ శేఖర్ మిమ్మల్ని కలిసి మాట్లాడారుగా? అని ప్రశ్నించారు. ‘తాను ఒక కార్యక్రమానికి వెళ్లినప్పుడు ఆయన తనకు నమస్కారం చేసి వెళ్లారని, ఆయనను తాను పట్టుకుని ఎలా పోలీసులకు అప్పగించగలనన్నారు. ఇదేనా నా పని? పోలీసులు మాత్రమే అతన్ని అరెస్టు చేయాలని బదులిచ్చారు. నేతల ఖండన: ఎస్వీ శేఖర్‌ను పోలీసులు అరెస్టు చేయకుండా ఉండేందుకు రాజకీయ పార్టీల నేతలు ఖండన తెలిపారు. దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాలలోను నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్వీ శేఖర్‌ను అరెస్టు చేయకుండా ఉండేందుకు అధికారంలో ఉండే అతని బంధువే కారణమని పేర్కొనడం గమనార్హం. -
నాలుగు స్తంభాలాట స్ఫూర్తితో...
శేఖర్, దిలీప్, శ్రీలక్ష్మి, గాయత్రీ గుప్తా ముఖ్య పాత్రలుగా కృష్ణవర్మ దర్శకత్వంలో కార్తీక్ రెడ్డి, అశోక్ సిరియాల నిర్మాణంలో రూపొందిన సినిమా ‘జంధ్యాల రాసిన ప్రేమకథ’. సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 24న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కృష్ణవర్మ మాట్లాడుతూ –‘‘గొప్ప దర్శకులైన జంధ్యాల రూపొందించిన ‘నాలుగు స్తంభాలాట’ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రజెంట్ ట్రెండ్‌కి అనుగుణంగా అన్ని కమర్షియల్ హంగులను కథకు జోడించాం’’ అన్నారు. సంగీతం: గోపి. కెమెరా: రత్నబాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట్. -
జంధ్యాల రాసిన ప్రేమకథ
శేఖర్, దిలీప్, శ్రీలక్ష్మీ, గాయత్రి ముఖ్యతారలుగా కృష్ణవర్మ దర్శకత్వంలో కీర్తి క్రియేషన్‌పై కార్తీక్ రెడ్డి, అశోక్ సిరియాల నిర్మించిన చిత్రం ‘జంధ్యాల రాసిన ప్రేమకథ’. గోపీ సంగీత దర్శకుడు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమయ్యింది. కృష్ణవర్మ మాట్లాడుతూ– ‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో గొప్ప దర్శకులైన జంధ్యాలగారు రూపొందించిన ‘నాలుగు స్తంభాలాట’ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రజెంట్ ట్రెండ్‌కు అనుగుణంగా కమర్షియల్ హంగులు జోడించి అందరికి నచ్చేలా చిత్రాన్ని తీర్చిదిద్దాం. ఈ నెలాఖరుకు సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట్.