శేఖర్, దిలీప్, శ్రీలక్ష్మి, గాయత్రీ గుప్తా ముఖ్య పాత్రలుగా కృష్ణవర్మ దర్శకత్వంలో కార్తీక్ రెడ్డి, అశోక్ సిరియాల నిర్మాణంలో రూపొందిన సినిమా ‘జంధ్యాల రాసిన ప్రేమకథ’. సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 24న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కృష్ణవర్మ మాట్లాడుతూ –‘‘గొప్ప దర్శకులైన జంధ్యాల రూపొందించిన ‘నాలుగు స్తంభాలాట’ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రజెంట్ ట్రెండ్‌కి అనుగుణంగా అన్ని కమర్షియల్ హంగులను కథకు జోడించాం’’ అన్నారు. సంగీతం: గోపి. కెమెరా: రత్నబాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట్.
Comments
Please login to add a commentAdd a comment