srilaxmi
-
OMC Case: ఒబులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి క్లీన్చిట్
సాక్షి, హైదరాబాద్: ఓఎంసీ(ఒబులాపురం మైనింగ్) కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి క్లీన్చిట్ ఇచ్చింది తెలంగాణ హైకోర్ట్. ఐఏఎస్ శ్రీలక్ష్మికి క్లీన్చిట్ ఇస్తూ మంగళవారం హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మిపై అభియోగాలను కోర్టు కొట్టివేసింది. కాగా, ఈ కేసులో శ్రీలక్ష్మి ఏడాది పాటు జైలులో ఉన్నారు. ఇక, 2004-09 వరకు శ్రీలక్ష్మి మైనింగ్ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. కాగా, ఈ కేసుకు సంబంధించి సీబీఐ.. ఆమెపై నేరారోపణకు సంబంధించిన సరైన వివరాలను కోర్టుకు అందించలేకపోయింది. కేవలం ఆరోపణలు మాత్రమే ఉండటంతో కోర్టు ఆమెకు క్లీన్చిట్ ఇచ్చింది. -
జూపల్లి వారి ఇంట పెళ్లి సందడి
సాక్షి, హైదరాబాద్: మై హోమ్స్ అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త జూపల్లి రామేశ్వరరావు సోదరుడు జగపతిరావు కుమార్తె శ్రీలక్ష్మి వివాహం జస్టిస్ నవీన్‌రావు కుమారుడు నృపుల్‌తో ఘనంగా జరిగింది. శుక్రవారం హైదరాబాద్‌లోని మాదాపూర్ హెచ్ఐసీసీ నోవాటెల్‌లో ఈ వివాహ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ, మహారాష్ట్ర గవర్నర్లు ఈఎస్ఎల్ నరసింహన్, విద్యాసాగర్‌రావు, సీఎం కె.చంద్రశేఖర్‌రావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిలు నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహ వేడుకలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, వ్యాపార, వాణిజ్యసంస్థల అధినేతలు, న్యాయమూర్తులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. -
ఛార్మి నృత్య గీతానికి ధీటుగా నర్తనం..
తూర్పుగోదావరి, అమలాపురం టౌన్: భరత వేదముగా.. నిరత నాట్యముగా.. అంటూ పౌర్ణమి సినిమాలో కథానాయకి ఛార్మి చేసిన నృత్య గీతం సంగీతాభిమానులనే కాదు.. నాట్యాభిమానులను ఉర్రూతలూగిస్తుంది. ఈ నృత్య గీతికలో ఛార్మి ప్రదర్శించిన నాట్య హోయలు.. నాట్య భంగిమలు.. అభినయాలకు ఏ మాత్రం తీసిపోకుండా సినిమాల్లో ఆ నృత్యాన్ని తిలకిస్తున్నామన్న అనుభూతిని అమలాపురానికి చెందిన ఓ నాట్య మయూరి తన ప్రదర్శనలతో కలిగిస్తోంది. తలపైన... రెండు అరచేతుల్లో అగ్ని కీలలతో మండతున్న ముంతలను ఉంచుకుని నాట్యమాడే ఆ ఎనిమిది నిమిషాల గీతానికి ఈ నర్తకి నయన మనోహరంగా నాట్యం చేస్తుంది. అమలాపురంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న అడపా శ్రీలక్ష్మి గత ఎనిమిదేళ్లలో అనేక నృత్య ప్రదర్శనలతో ఎంతో పేరు తెచ్చుకుంది. తన పదో ఏట నుంచే నృత్యం వైపు నడక మొదలు పెట్టింది. ఫ్రెంచి యానానికి చెందిన నాట్య గురువు నల్లా హైమావతి వద్ద నాట్యం నేర్చుకుంది. జిల్లాలో ఎక్కడ నృత్య పోటీలు ఏర్పాటు చేసినా. ఏదైనా సభలు, వేడుకలు జరిగినా ఆరంభంలో శ్రీలక్ష్మి నృత్య ప్రదర్శన విధిగా ఉంటుంది. శ్రీలక్ష్మి తల్లిదండ్రులు అడపా శ్రీమన్నారాయణ, మల్లేశ్వరి కూడా ఆమె అభీష్టానికి బాసటగా నిలిచి ప్రోత్సహించారు. ఓ సారి తన నృత్య ప్రదర్శనను ఆద్యంతం తిలకించిన సినీ నటుడు కృష్ణంరాజు దంపతులు శ్రీలక్ష్మిని అభినందించి ఆశీర్వదించారు. పౌర్ణమి సినిమాలో ‘భరత వేదముగా...నిరత నాట్యముగా’ నృత్య గీతికను ప్రదర్శిస్తే ప్రేక్షకుల నుంచి హర్షధ్వానాలు.. బహుమతుల పంటలు పరిపాటి. శ్రీలక్ష్మికి నృత్యంతో పాటు ఇటీవల కాలంలో సినిమాల్లో నటించాలన్ని కోరిక కూడా తోడైంది. సినీ ఆర్టిస్ట్ కావాలన్న లక్ష్యంతో కోనసీమలోని ఔత్సాహిక సినీ కళాకారులకు వేదికగా ఇటీవల ఏర్పాటైన కోనసీమ ఫిలిం క్లబ్లో శ్రీలక్ష్మి సభ్యత్వాన్ని పొంది ఏదైనా సినిమాలో అవకాశం వస్తే అల్లుకుపోయేందుకు సిద్ధంగా ఉంది. నర్తకిగా కీర్తిని సాధించాలని.. నటిగా సినిమాల్లోకి వెళ్లాలన్న ఆమె లక్ష్యాలు నెరవేరాలని ఆశిద్దాం. -
జెట్టి శ్రీలక్ష్మి ఉరేసుకుని ఆత్మహత్య
ఒంగోలు సబర్బన్: దివంగత న్యాయవాది జెట్టి ప్రభాకరరెడ్డి సతీమణి జెట్టి శ్రీలక్ష్మి (54) గురువారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడింది. జయరాం సెంటర్లోని శ్రీగిరి అపార్టుమెంట్స్‌లో తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం ఇది గమనించిన కుటుంబీకులు, స్థానికులు శ్రీలక్ష్మి సంబంధీకులకు సమాచారం అందించారు. ఫ్యాన్‌కు వేలాడుతున్న మృతదేహాన్ని కిందకు దించి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. 2017 నవంబర్ 12న ఒంగోలు వాకర్స్ క్లబ్ సభ్యులు విజయవాడ కృష్ణానగర్ ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీ ఘాట్‌లో బోటు ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. అప్పట్లో మృతి చెందిన వారిలో శ్రీలక్ష్మి భర్త జెట్టి ప్రభాకరరెడ్డి కూడా ఉన్నారు. కార్తీకమాసంలో విహారయాత్రకు వెళ్లి బోటు ప్రమాదంలో 18 మంది మృతి చెందటంతో విషాదయాత్రగా మిగిలిపోయింది. బోటు ప్రమాదం జరిగినప్పుడు శ్రీలక్ష్మి బోటులో వెళ్లకుండా అప్పట్లో ఒడ్డునే ఆగిపోయారు. అప్పుడు జరిగిన ప్రమాదంతో శ్రీలక్ష్మి కుటుంబం విలవిల్లాడింది. అప్పటి నుంచి భర్త మరణాన్ని జీర్ణించుకోలేని శ్రీలక్ష్మి మనోవేదనతో కుంగిపోసాగింది. అప్పటికి వారి కుమార్తెలు ఎంతో సముదాయిస్తూ వచ్చారు. అయినా భర్త తోడు లేకపోవడం ఆమె మనోవేదన గురవుతూ వచ్చింది. చివరకు ఆయన లేని జీవితం వృథా అనుకుందో.. ఏమో.. చివరకు బలవన్మరణానికి పూనుకుంది. జెట్టి శ్రీలక్ష్మి దంపతులకు సంతానం లేదు. అయినా ప్రభాకరరెడ్డి రక్తసంబంధీకులకు చెందిన ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకున్నారు. వాళ్లిద్దరినీ పెంచి పెద్ద చేశారు. వారికి వివాహాలు కూడా చేసి స్థిరపరిచారు. ఒక కుమార్తె అమెరికాలో స్థిరపడగా, రెండో కుమార్తె బెంగుళూరులో స్థిరపడింది. ఇటీవలే కుమార్తెలు వచ్చి దగ్గరుండి మరీ సపర్యలు కూడా చేశారని బంధువుల నోట వస్తున్న మాటలు. తల్లికి ఎంతో ధైర్యం చెప్పారు. అవేమీ ఆమెలో మనోస్థైర్యం నింపలేదు. చివరకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి భర్త చెంతకు చేరింది. -
నాలుగు స్తంభాలాట స్ఫూర్తితో...
శేఖర్, దిలీప్, శ్రీలక్ష్మి, గాయత్రీ గుప్తా ముఖ్య పాత్రలుగా కృష్ణవర్మ దర్శకత్వంలో కార్తీక్ రెడ్డి, అశోక్ సిరియాల నిర్మాణంలో రూపొందిన సినిమా ‘జంధ్యాల రాసిన ప్రేమకథ’. సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 24న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కృష్ణవర్మ మాట్లాడుతూ –‘‘గొప్ప దర్శకులైన జంధ్యాల రూపొందించిన ‘నాలుగు స్తంభాలాట’ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రజెంట్ ట్రెండ్‌కి అనుగుణంగా అన్ని కమర్షియల్ హంగులను కథకు జోడించాం’’ అన్నారు. సంగీతం: గోపి. కెమెరా: రత్నబాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట్. -
జంధ్యాల రాసిన ప్రేమకథ
శేఖర్, దిలీప్, శ్రీలక్ష్మీ, గాయత్రి ముఖ్యతారలుగా కృష్ణవర్మ దర్శకత్వంలో కీర్తి క్రియేషన్‌పై కార్తీక్ రెడ్డి, అశోక్ సిరియాల నిర్మించిన చిత్రం ‘జంధ్యాల రాసిన ప్రేమకథ’. గోపీ సంగీత దర్శకుడు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమయ్యింది. కృష్ణవర్మ మాట్లాడుతూ– ‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో గొప్ప దర్శకులైన జంధ్యాలగారు రూపొందించిన ‘నాలుగు స్తంభాలాట’ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రజెంట్ ట్రెండ్‌కు అనుగుణంగా కమర్షియల్ హంగులు జోడించి అందరికి నచ్చేలా చిత్రాన్ని తీర్చిదిద్దాం. ఈ నెలాఖరుకు సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట్. -
శ్రీలక్ష్మికి హైకోర్టులో ఊరట
నేరపూరిత కుట్ర, మోసం, విశ్వాస ఘాతుకం కేసు కొట్టివేత సాక్షి, హైదరాబాద్: దాల్మియా సిమెంట్స్‌కి సున్నపురాయి లీజు మంజూరుకు సంబంధించిన కేసులో నిందితురాలిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో ఊరట దక్కింది. ఆమెపై ఐపీసీలోని 120బి (నేరపూరిత కుట్ర), 420 (మోసం), 409 (విశ్వాస ఘాతుకం) సెక్షన్ల కింద నమోదు చేసిన కేసును కొట్టివేసింది. అయితే అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్)లోని సెక్షన్ 13 (ప్రభుత్వ ఉద్యోగి దుష్ప్రవర్తన) కింద నమోదుచేసిన కేసును కొట్టివేసేందుకు నిరాక రించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకర్‌రావు గురువారం తీర్పునిచ్చారు. కడప జిల్లా మైలవరం మండలం పరిధిలో 408 హెక్టార్ల సున్నపురాయి గనులను రాష్ట్ర ప్రభుత్వం దాల్మియా సిమెంట్స్‌కు లీజుకిచ్చింది. ఈ లీజు మంజూరులో అప్పట్లో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ సీబీఐ కేసు నమోదు చేసింది.ఆమెను 5వ నిందితురాలిగా చేర్చింది. దీనిపై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతోంది. అయితే తనపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ శ్రీలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ శివశంకర్‌రావు గురువారం తీర్పు వెలువరించారు. ఈ వ్యవహారంలో నేరపూరిత కుట్ర, మోసం, విశ్వాస ఘాతుకానికి పాల్పడారనేందుకు ప్రాథమిక ఆధారాలేమీ లేవని స్పష్టం చేశారు. ఐపీసీ సెక్షన్ల కింద కేసును విచారణకు స్వీకరిస్తూ సీబీఐ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేశారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13 కింద నమోదు చేసిన కేసును మాత్రం కొట్టివేసేందుకు నిరాకరించారు. ఈ సెక్షన్ కింద నమోదు చేసిన అభియోగాలు మినహా.. మిగతా సెక్షన్ల కింది కేసుల్లో ఏవైనా అభియోగాలు నమోదు చేసి ఉంటే అవేవీ చెల్లవని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
శ్రీలక్ష్మి పిటిషన్‌పై ముగిసిన వాదనలు
తీర్పు వాయిదా వేసిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: దాల్మియా సిమెంట్స్‌కు సున్నపురాయి లీజుల మంజూరుకు సంబంధించిన కేసులో సీబీఐ తనను అన్యాయంగా ఇరికించిందని, అందువల్ల ఆ కేసును కొట్టేయాలని కోరుతూ సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్షి దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు పిటిషనర్ తరఫు న్యాయవాది వై.శ్రీనివాసమూర్తి వాదనలు వినిపిస్తూ నిబంధనలను సీబీఐ సరిగా అర్థం చేసుకోలేదన్నారు. లీజు మంజూరు వ్యవహారం మొత్తం నిబంధనల మేరకే జరిగిందని, ఈ విషయం రికార్డులను పరిశీలిస్తే అర్థమవుతుందన్నారు. ఈ వాదనలను సీబీఐ తరఫు న్యాయవాది సురేందర్ తోసిపుచ్చారు. లీజుల మంజూరు విషయంలో శ్రీలక్షి కుట్రపూరితంగా వ్యవహరించి ఆ సంస్థకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
నాపై సీబీఐ కేసును కొట్టేయండి..
సాక్షి, హైదరాబాద్: దాల్మియా సిమెంట్స్‌కు గనుల లీజు మంజూరు వ్యవహారంలో సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై.శ్రీలక్ష్మి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని న్యాయమూర్తి జస్టిస్ బలుసు శివశంకరరావు బుధవారం విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వై.శ్రీనివాసమూర్తి వాదనలు వినిపిస్తూ.. శ్రీలక్ష్మి నిబంధనల ప్రకారమే వ్యవహరించారన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోకుండానే సీబీఐ అధికారులు ఆమెను అన్యాయంగా ఈ కేసులో ఇరి కించారన్నారు. లీజు మంజూరు అప్పటి మం త్రిమండలి తీసుకున్న నిర్ణయమని, మంత్రుల్ని వదిలేసిన సీబీఐ, పిటిషనర్‌ను దురుద్దేశంతో ఈ కేసులో నిందితురాలిగా చేర్చిందన్నారు. మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాల్ని అధికారులు అమలు చేయాల్సి ఉంటుందని, దీనిని సీబీఐ పరిగణనలోకి తీసుకోలేదన్నారు. పిటిషనర్‌ను విచారించేందుకు ప్రభుత్వం అనుమతినివ్వకపోయినా సీబీఐ దురుద్దేశాలతో వ్యవహరించిందన్నారు. జయమినరల్స్‌కున్న ప్రాస్పెక్టింగ్ లెసైన్స్‌ను దాల్మియా సిమెంట్స్‌కు చెందిన ఈశ్వర్ సిమెంట్స్‌కు బదలాయింపు వ్యవహారంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నది పిటిషనర్‌పై ఆరోపణని, అయితే సంబంధితశాఖ మంత్రి ఆమోదం తెలిపాకే బదలాయింపు జరిగిందని శ్రీనివాసమూర్తి వివరించారు. ఈ పిటిషన్‌పై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని, గడువు కావాలని సీబీఐ తరఫు న్యాయవాది పి.కేశవరావు కోరడంతో న్యాయమూర్తి అంగీకరిస్తూ విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు.