
సాక్షి, హైదరాబాద్: మై హోమ్స్ అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త జూపల్లి రామేశ్వరరావు సోదరుడు జగపతిరావు కుమార్తె శ్రీలక్ష్మి వివాహం జస్టిస్ నవీన్‌రావు కుమారుడు నృపుల్‌తో ఘనంగా జరిగింది. శుక్రవారం హైదరాబాద్‌లోని మాదాపూర్ హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో ఈ వివాహ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ, మహారాష్ట్ర గవర్నర్లు ఈఎస్‌ఎల్ నరసింహన్, విద్యాసాగర్‌రావు, సీఎం కె.చంద్రశేఖర్‌రావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలు నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహ వేడుకలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, వ్యాపార, వాణిజ్యసంస్థల అధినేతలు, న్యాయమూర్తులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment