తీర్పు వాయిదా వేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: దాల్మియా సిమెంట్స్‌కు సున్నపురాయి లీజుల మంజూరుకు సంబంధించిన కేసులో సీబీఐ తనను అన్యాయంగా ఇరికించిందని, అందువల్ల ఆ కేసును కొట్టేయాలని కోరుతూ సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్షి దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు పిటిషనర్ తరఫు న్యాయవాది వై.శ్రీనివాసమూర్తి వాదనలు వినిపిస్తూ నిబంధనలను సీబీఐ సరిగా అర్థం చేసుకోలేదన్నారు.
లీజు మంజూరు వ్యవహారం మొత్తం నిబంధనల మేరకే జరిగిందని, ఈ విషయం రికార్డులను పరిశీలిస్తే అర్థమవుతుందన్నారు. ఈ వాదనలను సీబీఐ తరఫు న్యాయవాది సురేందర్ తోసిపుచ్చారు. లీజుల మంజూరు విషయంలో శ్రీలక్షి కుట్రపూరితంగా వ్యవహరించి ఆ సంస్థకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
శ్రీలక్ష్మి పిటిషన్‌పై ముగిసిన వాదనలు
Published Tue, Apr 25 2017 4:41 AM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM
Advertisement
Advertisement