Dileep Reddy R
-
ఒక దేశం ఒక ఎన్నికపై... ఒక మాట!
‘భిన్నత్వంలో ఏకత్వం’ భారత లక్షణమే కాదు, విలక్షణ సంపద అని పలుమార్లు రుజువైంది. ఉద్వేగ నినాదంగా బాగున్నంత, ‘ఒక దేశం ఒక ఎన్నిక’ ఆచరణ గొప్పగా ఉంటుందనే నమ్మకం లేదు. ఇందులో పలు సమస్యలున్నాయి. దేశంలో రావాల్సిన ఎన్నికల సంస్కరణల్లో ఇదంత ప్రాధాన్యతాంశ మేమీ కాదు! అంతకన్నా ప్రాధాన్య అంశాలెన్నిటికో దిక్కూదివాణం లేక ప్రజాస్వామ్యమే వెనుకడుగులోకి జారుతోంది. ముందు ఆ సంస్కరణలు ముఖ్యం. జమిలితో... అభివృద్ధికి ఉండే ఆటంకాలు తొలగిపోతాయి. సమయం, ఆర్థికమానవ వనరుల దుబారా తగ్గుతుందనేది ఓ ఆశ! కానీ,ప్రాంతీయ అస్తిత్వాలకు అదొక గొడ్డలిపెట్టు. సమాఖ్య స్ఫూర్తికి భంగకరం. కేంద్ర ప్రభుత్వం ఆశిస్తున్నట్టుగానే... దేశ మంతటా ఒకేసారి (జమిలి) ఎన్నికలు జరిపించే విషయంలో సమగ్ర చర్చ జరగాలి. శాసనసభల స్పీకర్లతో పాటు మేధావులు, సమాజంలోని విభిన్నవర్గాల ప్రతినిధుల్ని భాగం చేసి చర్చించాలి. మాజీ రాష్ట్రపతి రావ్‌ునాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ సంప్రదింపుల్లో 32 పార్టీలు సానుకూలంగా మాట్లాడి, మద్దతు ప్రకటిస్తే 15 పార్టీలు పూర్తిగా వ్యతిరేకించాయి. వ్యతిరేకిస్తున్న పార్టీల్లో కాంగ్రెస్ ఉండటంతో... 1952 నుంచి 1967 వరకు, వరుస నాలుగు ఎన్నికల్లో కేంద్రం రాష్ట్రాల ఎన్నికల్ని కలిపి (జమిలి) నిర్వహించి నపుడు, మరిప్పుడెందుకు సాధ్యపడదు? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అనే ప్రశ్న పాలకపక్షాలు లేవనెత్తుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చాక జరిగిన తొలి సభలు కావడంతో అది సాధ్యమైంది. తర్వాత ఎన్నో మార్పులొచ్చాయి. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల విభజన జరిగింది. అవిశ్వాసాల్లో కొన్ని సభలు అర్ధంతరంగా ముగిశాయి. కొన్ని ప్రభుత్వాలు కూలిపోయో, రాష్ట్రపతి పాలన విధింపుతోనో ఎన్నికల ద్వారా కొత్త సభలు ఏర్పడ్డాయి. ఇలా వేర్వేరు పరిణామాల వల్ల లోక్‌సభకు, వివిధ శాసనసభలకు ఎన్నికల గడువు కాలాలు మారుతూ వచ్చాయి. భారత ఎన్నికల సంఘానికున్న విచక్షణాధికార పరిధి, వెసులుబాటు వల్ల... అప్పటికి రద్దయిన, రాష్ట్రపతి పాలనలో ఉన్న రాష్ట్రాల సభల ఎన్నికల కాలాలు స్వల్పంగా అటిటు అవుతూ వచ్చాయి. అందుకే, 1970ల తర్వాత జమిలి సాధ్య పడలేదు. ‘జమిలి కొత్తేం కాదు, ఇదివరకు జరిగిందే’ అని అమిత్ షా అంటున్నా, ఇవాళ్టి పరిస్థితి వేరు. అదంత సాధారణమే అయితే, ఇపుడు చట్టాలనూ, రాజ్యాంగాన్నీ మార్చడమెందుకు?ఎలా సమానం చేస్తారు?అన్ని ఎన్నికల్ని ఒక తేదీకి లాగే క్రమంలో... ఎన్నో మార్పులు చేయాల్సి ఉంటుంది. మొదట, పొట్టికాలం నిడివి సభలు, పొడుగు కాలం నిడివి సభలు అనివార్యమవుతాయి. బలవంతపు రాష్ట్రపతి పాలనలూ ఉంటాయేమో? ఇప్పుడు ప్రతిపాదిస్తున్నట్టు 2027లోనో, మరెపుడో జమిలి ఎన్నికల్ని నిర్వహించాక కూడా... ఏ కారణం చేతైనా ఒక రాష్ట్ర అసెంబ్లీ రద్దయితే, తిరిగి ఎన్నికల ద్వారా ఏర్పడే కొత్త సభను ఆ మిగిలిపోయిన కాలానికే పరిమితం చేస్తారు. సభ రద్దయిన సమయాన్ని (నాలుగేళ్లకో, మూడేళ్లకో రద్దయింది అనుకుంటే) బట్టి కొత్త సభకు ఏడాదో, రెండేళ్లో మిగలవచ్చు. సాధారణ ఎన్నికల్లో జరిగినట్టే అన్ని నియోజకవర్గాల, అందరు ఓటర్ల నిర్ణయంతో జరిగే మధ్యంతర ఎన్నికలో గెలిచిన సభ్యుల కొత్తసభ అలా ఆరు మాసాలకో, ఏడాదికో పరిమితం కావాల్సి రావడం ఏ రాజ్యాంగ ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రతీక? అది డబ్బు, మానవ వనరుల దుబారా కాదా? అనే ప్రశ్న సహజం. దీనికి రాజకీయ పార్టీలు ఎలా అంగీ కరిస్తాయో చూడాలి. చాలా దేశాల్లో దేశవ్యాప్త ఎన్నికలు, ప్రాదేశిక ఎన్నికలు వేటికవిగానే జరుగుతాయి. జమిలి జరిపే ఏడెనిమిది దేశాల్లో అధ్యక్ష తరహా పాలనకిది సానుకూలమే! జమిలి ఎన్నికల నిర్వహణా ఒక సంక్లిష్టమే! మొన్నటి హరియాణా ఎన్నికలతో, గడువు సమీపించిన మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్ని ఎందుకు కలపటం లేదని అడిగితే, ‘... శాంతి భద్రతలు, నిర్వహణ పరంగా ఇబ్బందులుంటా య’ని ఎన్నికల సంఘం పేర్కొంది. నాలుగైదు రాష్ట్రాల్లోనే ఒకేసారి ఎన్నికలు నిర్వహించలేని వారు మొత్తం దేశవ్యాప్తంగా లోక్‌సభకు దాదాపు 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్ని కలిపి, రేపెప్పుడో స్థానిక సంస్థల ఎన్నికల్నీ కలిపి ‘మహా జమిలి’ ఎలా నిర్వహిస్తారు? అనే ప్రశ్న సహజం. సంస్కరణల సవాళ్లెన్నో...భారీ ఓటర్ల భాగస్వామ్యంతో భారత ఎన్నికల నిర్వహణ ప్రపంచంలోనే ఒక అబ్బురం! బ్యాలెట్ నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా (ఈవీఎం) లకు మారిన తర్వాత కూడా, అభివృద్ధి చెందిన దేశాలు విస్మయం చెందే స్థాయిలో మన ‘మహా ఎన్నికలు’ జరుగుతున్నాయి. విడతలుగా జరిగిన ఎన్నికల సంస్కరణలు ప్రక్రియను చాలా వరకు పారదర్శకం చేశాయి. స్వేచ్ఛగా స్వతంత్రంగా ఓటర్లు తమ నిర్ణ యాన్ని ప్రకటిస్తున్నప్పటికీ... ఎన్నికల్లో ధన ప్రవాహం, ప్రక్రియలో లోపిస్తున్న జవాబుదారీతనం ఆందోళన కలిగిస్తున్నాయి. ‘దేశ ఎన్ని కల ప్రక్రియలో ముదురుతున్న ‘క్యాష్ క్యాన్సర్’ను నియంత్రించే సంస్కరణ అత్యవసరంగా రావాలి’ అని సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయి ఇటీవల హైదరాబాద్‌లో చేసిన వ్యాఖ్య కీలకమైంది. ‘మునుగోడు’ అసెంబ్లీ ఉప ఎన్నికలో మనం కళ్లారా చూశాం. సరిగ్గా పోలింగ్‌కు ముందు లక్షల ఓట్లు గల్లంతయినా, నిన్న మహారాష్ట్రలో జరిగినట్టు ఒకటి, రెండు నెలల్లోనే లక్షలాది కొత్త ఓట్లు నమోదైనా... ఎన్నికల సంఘం నుంచి సరైన వివరణ, జవాబుదారీతనం లేక పోవడం దారుణం. ఈ సంస్కరణలు చేపట్టకుండా ‘జమిలి’కి పట్టుబట్టడం సరికాదనే అభిప్రాయం కొన్ని పార్టీల వారు, మేధావులు వ్యక్తంచేస్తున్నారు. విడిగా ప్రజాప్రతినిధులు గానీ, స్థూలంగా పార్టీలు గానీ, ప్రభుత్వాలు గానీ ఆశించిన/నిర్దేశించిన స్థాయిలో పనిచేయకుంటే వారిని వెనక్కి రప్పించే (కాల్ బ్యాక్) పద్ధతి ఉండాలనే డిమాండ్ పెరుగుతున్న తరుణంలో... అయిదేళ్ల కొకమారు అన్ని ఎన్నికలూ జరిపేయాలి, మధ్యలో ఏ ఎన్నికలూ ఉండొద్దనే నిర్బంధ మేమిటనే వాదన ఒకటుంది. మధ్యలో వేర్వేరు ఎన్నికలుంటేనే నాయకులైనా, పార్టీలైనా, ప్రభుత్వాలైనా కొద్దో గొప్పో భయంతో ఉంటాయనేది సాధారణ అభిప్రాయం. అందుకు, ఎన్నో సాక్ష్యాలు, తార్కాణాలు మన కళ్లముందే ఉన్నాయి. కాన్షీరావ్‌ు అన్నట్టు ‘ఏటా ఎన్నికలుండాలి’ అనే వాదనను బలపరచకపోయినా... ఎన్నికల భయం ఉన్నపుడే ప్రభుత్వాలు ప్రజానుకూలంగా నడుచుకోవడం తరచూ జరిగేదే! అలా కాకుండా, ఒకసారి ‘జమిలి’ జరిగితే, ఇక అయిదేళ్లూ ఏ ఎన్నికలుండవంటే... ప్రభుత్వాల ఏకస్వామ్యమే సాగుతుందనే భయాలున్నాయి. పైగా, భిన్నత్వ ప్రతీక అయిన దేశంలోని ప్రాంతీయ అస్తిత్వాలు, భావనలు, వాదనలు... ‘జమిలి’లో ఆధిపత్యం వహించే జాతీయ ప్రవాహంలో కొట్టుకుపోతాయనే ఆందోళన కూడా ఉంది. అందుకే, పలు ప్రాంతీయ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి.ఒక పార్టీ ఒక నాయకుడు అంటారేమో!ఉభయ సభల్లో ఎన్డీయేకున్నది బొటాబొటీ మెజారిటీ! మూడింట రెండొంతుల మెజారిటీ ఉంటే తప్ప సాధ్యపడని రాజ్యాంగ సవ రణలకు ఎలా సాహసిస్తున్నారనేది ప్రశ్న! రాజ్యసభలో 164/243 అవసరమైనచోట 122 (42 తక్కువ) సంఖ్యాబలమే ఉంది. లోక్ సభలో 361/542 (ఒక ఖాళీ) అవసరం కాగా ఉన్నది 293 (63 కొరత) మాత్రమే! ఆ రోజు సభకు హాజరైన వారిలో మూడింట రెండొంతులు చాలు కనుక... ప్రత్యర్థి పార్టీల నుంచి క్రాస్ ఓటింగ్, గైర్హాజరీలను ప్రోత్సహిస్తారా? అని విపక్షంలో భయ సందేహాలున్నాయి. తరచూ ఎన్నికల వల్ల కోడ్ అమలు అభివృద్ధికి ఆటంకమనే భావనే తప్పని, ఓట్ల యావతో ఎన్నికలకు నెలల ముందే అభివృద్ధి పనులు చేయడం కాకుండా అయిదేళ్లపాటు జరిపితే కోడ్‌కు వెరవా ల్సిన భయమేమిటని ప్రశ్నిస్తున్నారు. ‘జమిలి’పై ఎందుకీ పంతం?’ ఇదే పంథాలో సాగి, రేపు ‘ఒక పార్టీ, ఒకే నాయకుడ’నే నినాదంతో ప్రజాస్వామ్యాన్ని అధ్యక్షతరహా పాలనవైపు నడిపే ప్రమాదాన్ని మొగ్గలోనే తుంచేయాలన్నది వ్యతిరేకవాదన వినిపించే వారి మాట!దిలీప్ రెడ్డి వ్యాసకర్త ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ -
ఇది మాయ కాక మరేమిటి?
నిరూపించ లేనంత మాత్రాన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా (ఈవీఎం)ల వినియోగ ప్రక్రియలో తప్పులే లేవనో, తప్పిదాలకు ఆస్కారమే లేదనో ధ్రువీకరించినట్టు కాదు. అభియోగాలు మోపేవారు అందుకు హేతువును, తమ సందేహాలకు కారణాలను, తగు సాక్ష్యాధారాలను సంబంధిత వ్యవస్థల దృష్టికి తీసుకు రావాలి. వాటిని స్వీకరించి బాధ్యులైన వ్యక్తులు, సంస్థలు లోతుగా పరిశీలన జర పాలి. అభియోగాలకు ఆధారాలున్నాయో లేదో, అవి తప్పో, కాదో తేల్చాలి. ఈ మొత్తం ప్రక్రియలో పారదర్శకత, జవాబు దారీతనం ముఖ్యం. అది జరగటం లేదు.అయిందానికి, కానిదానికి నిత్యం పరస్పరం విమర్శించుకునే రాజకీయ పార్టీలు ఈవీఎంల విషయంలో అనుసరించే ద్వంద్వ వైఖరి వారి ఆరోపణలకు పస లేకుండా చేస్తోంది. దాంతో వివాదం ప్రాధాన్యత లేకుండా పోతోంది. కానీ, కొన్ని రాజకీయేతర తటస్థ సంఘాలు, సంస్థలు కూడా అభ్యంతరాలు లేవనెత్తాయి. పోలింగ్ శాతాల సమాచారంలో వ్యత్యాసాలను ఎత్తిచూపుతూ, బహిరంగ ప్రజాభిప్రాయానికి విరుద్ధ ఫలితాలనూ... ఈవీఎంల దుర్వినియోగానికి గల ఆస్కారాన్నీ అవి ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చినా... తగిన స్పందన లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఓట్ ఫర్ డెమాక్రసీ (వీఎఫ్‌డీ), అసోసియేషన్ ఫర్ డెమాక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్), సిటిజన్ కమిషన్ ఆన్ ఎలక్షన్ (సీసీఈ) వంటి పౌర సంఘాలు నిర్దిష్టంగా ఫిర్యాదులు చేసినా వాటిని పరిగణనలోకి తీసుకుంటున్న దాఖలాలు లేవు. రాజకీయ పక్షాల నుంచే కాక ప్రజాసంఘాలు, సంస్థల నుంచి నిర్దిష్ట ఆరోపణలు చేసినపుడు కూడా ‘నిరాధారం’, ‘దురుద్దేశ పూర్వకం’ అంటూ, కనీస విచారణైనా జరుపకుండానే ఎన్నికల సంఘం కొట్టిపారేస్తోందన్నది వారిపై ప్రధాన అభియోగం!ఓటు వ్యత్యాసాల పైనే సందేహాలుసాయంత్రం వరకు పోలింగ్ సరళి ఒక విధంగా ఉండి, ముగింపు సమయాల్లో అనూహ్య, అసాధారణ ఓటింగ్ శాతాలు నమోదు కావడం, అలా ఎన్నికల అధికారి రాత్రి ఇచ్చిన గణాంకాలకు భిన్నంగా ఓట్ల లెక్కింపు ముందరి ‘లెక్క’తేలడం పట్ల సందేహాలున్నాయి. కొన్ని నియోజక వర్గాల్లో ఈ ఓట్ల వ్యత్యాసం భారీగా ఉంటోంది. ఇది సార్వ త్రిక ఎన్నికల్లోనే కాకుండా హరియాణా, జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీల ఎన్నికల సందర్భంగానూ వెల్లడయిందనేది విమర్శ. గణాంకాలు వారి వాదనకు బలం చేకూర్చేవిగానే ఉన్నాయి. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా, ఆఖరు నిమి షపు ఓట్ల వ్యత్యాసం పది శాతానికి పైగా ఉన్న పది జిల్లాల్లోని 44 అసెంబ్లీ స్థానాల్లో 37 ఎన్డీయే పక్షాలు గెలిచాయి. కానీ వ్యత్యాసం 10 శాతం కన్నా తక్కువగా ఉన్న 12 జిల్లాల్లోని 46 సీట్లలో ఎన్డీయే కూటమి 11 సీట్లు మాత్రమే గెలువగలిగింది. ఇటువంటి పరిస్థితి సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ ప్రతిబింబించిందని విమర్శకులంటారు. ఆఖరు నిమిషపు పోలింగ్ శాతపు పెరుగుదల వరుసగా ఐదు విడతల్లో 0.21%, 0.34%, 0.23%, 0.01%, 0.25% నామ మాత్రంగానే ఉండ టంతో ఎన్డీయే కూటమికి రాజకీయంగా ఇదేమీ లాభించ లేదనేది విశ్లేషణ! అందుకే, అక్కడ లోక్ సభ స్థానాల సంఖ్య 62 నుంచి ఈ సారి 36కి పడిపోయింది. జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తొలివిడతలో ‘ఆఖరు నిమిషపు ఓటింగ్ శాతం’ పెరుగుదల 1.79% నమోదుకాగా బీజేపీ 43లో 17 అసెంబ్లీ స్థానాలు నెగ్గింది. కానీ, రెండో విడత పోలింగ్ సందర్భంగా ఓటింగ్ శాతం పెరుగుదల 0.86%కి పరిమితమైనందునేమో, 38లో 7 సీట్లు మాత్రమే గెలువగలిగింది. ఇదంతా ఈవీఎంల మాయా జాలమే అని విమర్శకులంటారు.కళ్లకు కట్టినట్టు గణాంకాలుమహారాష్ట్రలోని అకోట్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్ర ఎన్నికల ముఖ్యాధికారిచ్చిన సమాచారం ప్రకారం, పోలింగ్ ప్రక్రియ అన్ని విధాలుగా ముగిసేటప్పటికి ఈవీఎం ద్వారా 2,12,690 ఓట్లు పోలయ్యాయి. లెక్కింపు రోజున ఈవీఎం నుంచి రాబట్టిన ఓట్ల సంఖ్య 2,36,234. అంటే, వ్యత్యాసం 23.544 ఓట్లు. గెలిచిన బీజేపీ అభ్యర్థికి దక్కిన ఆధిక్యత 18,851 ఓట్లు! ఇలా రాష్ట్రవ్యాప్తంగా గమనిస్తే, పోలింగ్ రోజు రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎన్నికల సంఘం వారి ‘యాప్’ ద్వారా వెల్లడైన గణాంకాల కన్నా ఓట్ల లెక్కింపు రోజున రమారమి పెరిగిన సంఖ్య ఉన్న నియోజకవర్గాలు తక్కువలో తక్కువ 95 ఉన్నాయనేది వారి వాదన. ఒకే విడత పోలింగ్ జరిగిన నవంబరు 20, సాయంత్రం 6.15 గంటలకు ఒకసారీ, రాత్రి 11.45 గంటలకు ఒకసారీ ఎన్నికల సంఘం అధికారికంగా ఓటింగ్ శాతాలను వెల్లడించింది. సాయంత్రం సమాచారం వెల్లడించే సమయానికి ఇంకా కొన్ని పోలింగ్ స్టేషన్లలో గడువు లోపల ‘క్యూ’లో చేరిన వారందరూ ఓటు వేసే వరకు, ఎంత సమయమైనా ఓటింగ్ ప్రక్రియ కొనసాగు తుందని పేర్కొన్నారు. ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది గణాంకాలు రాత్రి ప్రకటించిన సమాచారంలో పేర్కొన్నారు. 288 నియోజకవర్గాల్లో సాయంత్రానికి 58.22% (5,64,88,024 ఓట్లు) పోలయినట్టు తెలిపిన అధికారులు రాత్రి అయ్యేటప్పటికి 65.02% (6,30,85,732 ఓట్లు) నమోదైనట్టు చెప్పారు. అంటే, వ్యత్యాసం 65,97,708 ఓట్లన్న మాట! నవంబరు 22న ఓట్ల లెక్కింపునకు కొన్ని గంటలు ముందు, ‘యాప్’ వెల్లడించిన సమాచారం ప్రకారం, రాష్ట్ర మంతటా నమోదైన ఓట్ల సంఖ్య 6,40,85,095. అప్పుడు పోలింగ్ శాతం 66.05%కి చేరింది. ఏమిటీ వ్యత్యాసాలన్న ప్రశ్న ఈవీఎంలపై శంకకు తావిస్తోంది. 288 నియోజక వర్గాల్లోని 1,00,186 పోలింగ్ బూత్‌లలో సగటున 76 ఓట్ల చొప్పున 76 లక్షల ఓటర్లు, ఎలా గడువు తర్వాత ‘క్యూ’ల్లో నిలుచొని ఓటు వేసి ఉంటారనే ప్రశ్న తలెత్తడం సహజం!సందేహాలను నివృత్తి చేసేవిధంగా ఎన్నికల సంఘం సమా ధానం ఇవ్వాలనే డిమాండ్ వస్తోంది. చైతన్యమే దారిదీపం మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా మాల్శిరాస్ తాలూకా మార్కడ్వాడి అనే చిన్న గ్రామంలో జనం తిరగబడ్డారు. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని, ఓట్ల లెక్కింపు తర్వాత ఆరోపిస్తూ గ్రామస్థులు బ్యాలెట్ ద్వారా ‘మళ్లీ పోలింగ్’ జరపాలని వారికి వారే నిర్ణయించారు. కానీ పోలీస్ ఆంక్షలు విధించి సదరు రీపోల్ను అధికారులు జరుగనీయ లేదు. 13 వేల ఓట్ల ఆధిక్యతతో ఎన్సీపీ (శరద్ పవార్) అభ్యర్థి ఉత్తమ్రావ్ జన్కర్ ఎమ్మెల్యేగా ఎన్నికయి కూడా... ఆ గ్రామంలో ఈవీఎం అవకతవకలతో నష్టం జరిగిందని ఆరో పించారు. కులాల వారిగా, విధేయత పరంగా చూసినా... గ్రామంలో తనకు ఆధిక్యత ఉండగా, తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రామ్ సత్పతే (బీజేపీ)కి 160 ఓట్లు ఎక్కువ రావటం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. రీపోల్ నిర్వహణకు ప్రేరణ కల్పించారు. తమ ఫిర్యాదుకు ఎన్నికల సంఘం స్పందించనందునే రీపోల్ ఆలోచనని గ్రామ ముఖ్యులు పేర్కొన్నారు. రాజకీయ పార్టీల కార్యకర్తలు పోలింగ్ ఏజెంట్లుగా పోలింగ్ ముగిసే సమయంలో, కౌంటింగ్ ఏజెంట్లుగా ఓట్ల లెక్కింపు మొదలెట్టేప్పుడు ఆ యా కేంద్రాల్లో ఉంటారు. వారీ లెక్కలు సరి చూసుకుంటే ఏ ఇబ్బందీ ఉండదనే వాదనొకటుంది. ఈవీఎంలలో మాయ ఉందంటే... దానికి సాక్ష్యాలు, ఆధారాలు కావాలి. అనుమానాలు, గణాంకాల్లో సందేహాలు న్నాయంటే దానికి బాధ్యుల నుంచి సమాధానాలు రావాలి. ప్రజలకు కావాల్సింది... పారదర్శక పాలనా వ్యవస్థలూ, పాలకుల నుంచి జవాబుదారీతనం... దట్సాల్!దిలీప్ రెడ్డి వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,పీపుల్స్ పల్స్ రీసెర్చి సంస్థ డైరెక్టర్ -
ఢిల్లీ బహుత్ దూర్ హై!
ఢిల్లీ బాద్షా ఎవరు? కేంద్ర సర్కార్ బడానేతలు మోదీ–షా ద్వయానికి అతిపెద్ద రాజకీయ సవాల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక. దశాబ్దంగా దేశ ఎన్నికల రాజకీయాలను దాదాపు శాసిస్తున్న బీజేపీ నాయకత్వానికి మింగుడు పడని గరళ గుళిక ‘ఢిల్లీ’! పదేళ్లలో, వరుసగా 2014, 2019, 2024 మూడు ఎన్నికల్లో ఏడుకు ఏడు లోక్‌సభ స్థానాలు అలవోకగా గెలుస్తూ వస్తున్న బీజేపీ... ఢిల్లీ రాష్ట్రాధికార పీఠాన్ని ఎడబాసి పాతికేళ్లు! దేశ రాజధానిలో పునర్వైభవం కోసం రెండున్నర దశాబ్దాలుగా అది చేయని యత్నం, వేయని ఎత్తు లేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే ఆధిపత్యానికి కొంత గండిపడ్డా.... హరియాణా, మహారాష్ట్ర ప్రభుత్వాలను తిరిగి నిలబెట్టుకున్న ఆత్మవిశ్వాసంతో పార్టీ నాయకత్వం ఢిల్లీ అసెంబ్లీ పోరుకు సిద్ధమౌతోంది.భూమ్మీద రెండో అతిపెద్ద జనాభా (3.4 కోట్లు) నగరం మన రాజధాని ఢిల్లీ. 3.7 కోట్ల జనాభా కలిగిన టోక్యో (జపాన్) తర్వాత మనదే ఎక్కువ జనాభా నగరం. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను వేర్వేరుగా చూస్తూ ఓటేసే తెలివిపరుల బరి ఇది. అదే, ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీకి చిక్కులు తెచ్చిపెడ్తోంది. ఏకులా వచ్చి మేకులా, స్థానిక రాజకీయ శక్తిగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) స్థిరపడిపోవడం బీజేపీకి మింగుడుపడట్లేదు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్, పదకొండేళ్లుగా ఢిల్లీని ఏలుతున్న ఆప్‌లకు ఒక లోక్‌సభ సీటు కూడా దక్కనీకుండా బీజేపీ, దశాబ్దకాలంగా సున్నాకే పరిమితం చేసింది. కానీ, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్ని వరసగా మూడు పర్యాయాలు కాంగ్రెస్, మరో మూడుమార్లు ఆప్ గెలవటంతో 26 ఏళ్లుగా బీజేపీ ప్రతిపక్ష పాత్రకే పరిమితమౌతోంది. రాజకీయ ఆటుపోట్ల నడుమ కూడా, 70లో 11 స్థానాలకు ఆప్ అప్పుడే అభ్యర్థులను ప్రకటించి బరిలో దూకింది. ఫిబ్రవరిలో ఢిల్లీ కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. మోదీ నాయకత్వంలోని బీజేపీని ఎదుర్కునేందుకు ఆప్ అస్త్రశస్త్రాలు సన్నద్దం చేసుకుంటోంది. ఎన్నికలవేళ ఓటర్లను ఆకట్టుకునే ‘ఉచితాల మీద (‘రేవడీ పే’) చర్చ’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ విషయంలో బీజేపీది రెండు నాల్కల ధోరణి అని విమర్శించే ఆప్, మహారాష్ట్ర హామీల ఉదాహరణలతో వారిని ఎండగట్టాలని ఎత్తుగడ. మరో పక్క కాంగ్రెస్ ‘ఢిల్లీ న్యాయయాత్ర’ ప్రారంభించింది. ఆప్ పాలన బాగోలేదనే విమర్శతో...‘ఢిల్లీ ఇక సహించదు’ అనే నినాదాన్ని ప్రచారం చేస్తోంది.పొత్తుతో ‘ఆప్’కి మేలా, కీడా?ఢిల్లీలో 70 సీట్లకు ఒంటరిగానే పోటీచేస్తామని అటు కాంగ్రెస్, ఇటు ‘ఆప్’ ప్రకటించాయి. ఇక రాబోయేది మూడు ముక్కలాటే! సహజంగానే ‘ఇండియా’ కూటమి మిత్రులుగా ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీచేస్తాయనుకుంటారు. లోక్‌సభ ఎన్నికల్లో అలాగే చేశాయి. కానీ, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో వేర్వేరుగా బరిలోకి దిగాయి. 2013 నుంచి ఢిల్లీ రాజకీయాల్లో సమీకరణాలు మారుతూ వస్తున్నాయి. షీలా దీక్షిత్ సీఎంగా మూడు పర్యాయాలు ఢిల్లీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పతనం 2013 నుంచే మొదలైంది. ఆ ఎన్నికల్లో 24.7 శాతం ఓట్లు పొందిన కాంగ్రెస్‌కు 2015లో 9.7%, 2020లో 4.3% ఓట్లే దక్కాయి. 2013లోనే 29.7% ఓట్లతో ఆధిక్యత ప్రారంభించిన ఆప్, 2015లో 54.5% ఓట్లు సాధిస్తే, 2020లో 53.8% ఓట్లు దక్కించుకుంది. మూడు మార్లూ గెలిచింది. పదేళ్లుగా పాలకపక్షం ‘ఆప్’ మీద ప్రభుత్వ వ్యతిరేకత ఉందనీ, దాన్ని సొమ్ము చేసుకుంటూ తాను పూర్వవైభవం సాధించాలనీ కాంగ్రెస్ భావిస్తోంది. ఇదే ఆలోచన బీజేపీది. కాంగ్రెస్ – బీజేపీ మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే... అది ‘ఆప్’కే లాభం! కాంగ్రెస్‌తో కలిసి ఆప్ పోటీ చేస్తే, లాభం ఉంటుందనే గ్యారెంటీ లేకపోగా ప్రభుత్వ వ్యతిరేక ఓటులో కాంగ్రెస్ అంటే గిట్టని వారి ఓటు... బీజేపీకి అనుకూలంగా కేంద్రీకృతమయ్యే ఆస్కారాన్ని శంకిస్తున్నారు. మూడు పార్టీల వ్యూహకర్తలు ఎలా ఆలోచిస్తారో చూడాలి. 2013లో 70 చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్ 8 స్థానాల్లో నెగ్గితే, 69 పోటీ చేసిన ఆప్ 28 సీట్లు. 66 పోటీ చేసిన బీజేపీ 31 సీట్లు గెలిచాయి. 2015లో ఫలితాల సునామీ సృష్టించిన ఆప్ 70 చోట్ల పోటీ చేసి 67 గెలిచి, ప్రత్యర్థుల్ని ‘చీపురు’ పెట్టి ఊడ్చింది. 69 చోట్ల పోటీ చేసిన బీజేపీకి 3 సీట్లు లభిస్తే, మొత్తం 70 స్థానాలకూ పోటీ చేసిన కాంగ్రెస్ ఒకచోట కూడా గెలువలేకపోయింది. 2020 లోనూ సుమారు అటువంటి పరిస్థితే! కాంగ్రెస్ (0), బీజేపీ (8) లపై మళ్లీ ఆప్ (62) ఏకపక్ష ఆధిక్యత సాధించింది.ఓటరు పరిణతి వేరుపార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్ని ఢిల్లీ ఓటర్లెప్పుడూ వేర్వేరు వేదికలుగానే చూస్తారు. జాతీయాంశాల పరంగా లోక్‌సభ ఎన్నికల్లో తీర్పిస్తే, దైనందినాంశాలు, పౌర సదుపాయాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలను, వాటి పనితీరును కొలుస్తుంటారు. అక్కడే ‘ఆప్’ క్లిక్ అయింది. తాగునీరు, విద్యుత్తు, విద్య, వైద్యం, రవాణా వంటి అంశాల్లో శ్రద్ధ వహిస్తూ, ఢిల్లీ ఓటర్లతో తన నిబద్ధత చాటుకుంది. అర్బన్ ఓటర్లను ఆకట్టుకోగలిగింది. సర్కారు బడుల్ని మెరుగుపరచడం, మొహల్లా ఆస్పత్రుల్ని బాగుచేయడం, ఉచితంగా 400 లీటర్ల వరకు తాగునీరు, 200 యూనిట్ల వరకు విద్యుత్తు, మహిళలకు బస్సులో ప్రయాణ సదుపాయం వంటివి కల్పించడం సంక్షేమపరంగా పెద్ద ముందడుగు. పన్ను చెల్లింపుదారలకు న్యాయం చేసే సర్కారు జవాబుదారీతనం, అవినీతి రహిత పాలననూ ఆప్ ప్రచారం చేసుకుంది. కానీ, ఢిల్లీ మద్యం పాలసీ కేసు వల్ల ఆప్ ప్రభుత్వం అవినీతిలో పీకల్లోతు కూరుకుపోయిందంటూ ప్రత్యర్థులు ప్రచారం చేసే ఆస్కారం వచ్చింది. దీన్ని బీజేపీ ఎలా వాడుకుంటుందో చూడాలి. ఆ కేసులో, ముఖ్యమంత్రి హోదాలో అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఉపముఖ్య మంత్రి మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్ తదితర ఆప్ ముఖ్యులు అరెస్టయ్యారు. కేజ్రీవాల్ సీఎం పదవికే రాజీనామా చేశారు. అది కేవలం బీజేపీ కక్ష సాధింపేనని తిప్పికొట్టిన ఆప్ నాయకత్వం, నిర్దోషులుగానే నేతలు బయటపడతారని చెబుతోంది. ‘పాక్షిక రాష్ట్ర హోదా కల్గిన ఢిల్లీపై, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ద్వారా దొడ్డిదారి అధికారం చలాయిస్తూ, ఆప్ ప్రతిష్ఠ్ మసకబారేలా బీజేపీ నాయకత్వం కుయుక్తులు పన్నుతోందని ఆప్ విమర్శిస్తోంది.నాడి పట్టడంలో బీజేపీ విఫలంఎక్కువ నగర, తక్కువ గ్రామీణ జనాభాతో ఉండే ఢిల్లీ ఒకప్పుడు బీజేపీకి ఓటు బ్యాంకు. కానీ, 1998 తర్వాత సీన్ మారింది. ప్రస్తుత సమీకరణాల్లో ఢిల్లీ వాసుల నాడి పట్టలేకపోతోంది. పాతతరం – కొత్తతరం, సంపన్నులు–పేదలు, స్థానికులు–వలసజీవులు... ఇలా వైవిధ్యంగా ఉన్న సమూహాల్లో బీజేపీకి ఆధిపత్యం దొరకటం లేదు. ఒకప్పుడు తిరుగులేని పట్టున్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎమ్సీడీ) ఎన్నికల్లోనూ బీజేపీకి క్రమంగా పట్టు జారుతోంది. 98 శాతం ఢిల్లీ అర్బన్ జనాభా 75 శాతం విస్తీర్ణంలో నివాసముంటుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 7 పార్లమెంటు స్థానాలూ గెలిచిన బీజేపీకి, 52 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆధిక్యత దక్కింది. ఆప్ (10), కాంగ్రెస్ (8) కు నాలుగోవంతు సీట్లలోనే ఆధిక్యత వచ్చింది. కలిసి పోటీ చేసిన ఆప్ (24.17%), కాంగ్రెస్ (18.19%)ల ఉమ్మడి ఓటు వాటా (42.36%) కన్నా బీజేపీ వాటా (54.35%) ఎక్కువ! 2008 నుంచీ బీజేపీ గెలవని అసెంబ్లీ స్థానాలు 23 ఉంటే, కాంగ్రెస్ గెలవని స్థానాలు 25 ఉన్నాయి. 2013 నుంచి ఆప్ గెలవని స్థానం ఒకటే! 2013, 2015, 2020 అన్ని ఎన్నికల్లోనూ వారు గెలుస్తూ వస్తున్న స్థానాలు 26 ఉన్నాయి.ఆప్ ఓ నాలుగు లోక్‌సభ స్థానాలు పంజాబ్‌లోనైనా గెలిచింది తప్ప ఢిల్లీలో ఖాతాయే తెరవలేదు. ఢిల్లీ మహానగరంలో సామాజిక వర్గాల సమీకరణం కూడా ఈ వైవిధ్య ఫలితాలకు కారణమే! ఢిల్లీ 70 అసెంబ్లీ సీట్లలో... బిహార్, యూపీ రాష్ట్రాల వలసదారుల ఆధిపత్యమున్నవి 17 స్థానాలయితే, అంతే సంఖ్య స్థానాల్లో పంజాబీలు (14 శాతం జనాభా) నిర్ణాయకశక్తిగా ఉంటారు. స్థానికంగా పట్టు కలిగిన గుజ్జర్లు, జాట్లవి ఓ 10 స్థానాలు. ఢిల్లీ మొత్తంలో 12% జనాభా కలిగిన ముస్లింలు 30% మించిన ఓటర్లతో, నిర్ణాయకంగా ఉన్నవి 6 నియోజకవర్గాలు. అన్ని వర్గాలు మిళితమై నిర్దిష్టంగా ఎవరికీ ఆధిక్యత లేని నియోజకవర్గాలు 20 వరకుంటాయి. ఇన్ని వైవిధ్యాల మధ్యనున్న దేశ రాజధాని అసెంబ్లీ పీఠం గురించి ఎన్ని ఎత్తుగడలేసినా... బీజేపీకి, ఇంకా ఢిల్లీ బహుదూరమే (అభీ ఢిల్లీ బహుత్ దూర్ హై)!దిలీప్ రెడ్డి వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ -
అరశతాబ్ది కిందే విత్తులు చల్లిన నాయకత్వం
‘ఈ స్పృహ ఈనాటిది కాదు. దీనికి యాభయ్యేళ్లకు పైబడిన చరిత్ర ఉంది. మానవకారక కాలుష్యాల వల్ల ముంచుకొస్తున్న ముప్పు పర్యావరణ మార్పు దుష్ఫలితాలను ఎదుర్కోవడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక సహాయం చేయాలన్నది ఒప్పందం. అంతే తప్ప, ఆ పేరుతో పెట్టుబడుల్ని సాయంగా చూపి వ్యాపారం చేయడం కాదని ఇవాళ మనం నిర్దిష్టంగా డిమాండ్ చేస్తున్నాం. పదమూడేళ్ల కింద (2011 కోపెన్‌హాగెన్) మీరే అంగీకరించి, సంసిద్ధత ప్రకటించినట్టు ఏటా ఇవ్వాల్సిన లక్ష కోట్ల డాలర్ల పర్యావరణ ఆర్థిక సహాయాన్ని మీ మీ వ్యాపారాల వృద్ధికి బంగారు బాట చేసుకోకండి’ అని తాజాగా భారత్ స్పష్టం చేసింది. అజర్‌బైజాన్‌లోని ‘బాకు’లో ‘కాప్–29’ సదస్సు జరుగుతున్న సందర్భంలో భారత్ ఈ ప్రకటన వెలువరించింది. ఇవాళ 140 కోట్ల మానవ వనరుల శక్తిగా, మార్కెట్ ప్రపంచానికి గమ్యస్థానంగా ఉన్న భారత్, శాసించాల్సిన చోట నామమాత్రపు పాత్రకే పరిమితమౌతోంది. కారణం, పర్యావరణ స్పృహ, దూరదృష్టి, ప్రపంచ దృక్పథం కలిగిన నాయకత్వం లేకపోవడమేనన్నది కొట్టొచ్చినట్టు కనిపించే వాస్తవం. యాభై ఏళ్ల కింద, నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ చూపిన పర్యావరణ దృక్పథం, చేసిన ఆలోచనలు కాలం కన్నా ఎంతో ముందున్నాయి. తదుపరి అయిదారు దశాబ్దాల్లో అభివృద్ధి– పర్యావరణ పరిరక్షణ మధ్య తలెత్తబోయే ఘర్షణను గుర్తించారు. ఇదే విషయమై సంపన్న–పేద దేశాల మధ్య బంధాలకు సరికొత్త నిర్వచనాల అవసరాన్ని ఆమె సహేతుకంగా అంచనా వేశారు. అభివృద్ధి పేరిట ప్రకృతి వనరులను అవసరాలకూ, దామాషాకూ మించి కొల్లగొట్టడాన్ని పర్యావరణ నేరంగానే చూశారామె! విఘాతం కలిగించిన వారే మూల్యం/ నష్టపరిహారం చెల్లించాలన్న ఆలోచనకు ఆమె నాడే బీజం వేశారు. భారతదేశపు పర్యావరణ దృక్పథానికి, భావధారకు మూలాలు 1971–72 నాటి పాలకుల ఆలోచనల్లో, కేంద్ర ప్రభుత్వ చర్యల్లో కనిపిస్తాయి. నాటి ప్రధాని ఇందిరాగాంధీ తీసుకున్న వివిధ నిర్ణయాలు, చేపట్టిన పలు చర్యలు దీన్ని ధ్రువీకరిస్తాయి. స్వీడన్ వినతి మేరకు ఐక్యరాజ్యసమితి చొరవతో మొదటి ప్రపంచ పర్యావరణ సదస్సు స్టాక్‌హోమ్‌లో 1972 జూన్‌లో జరిగింది. కానీ, అంతకు ముందే 1972 ఫిబ్రవరిలోనే ‘పర్యావరణ ప్రణాళిక–సమన్వయ జాతీయ కమిటీ’ (ఎన్సీఈపీసీ) భారత్‌లో ఏర్పాటయింది. దీని ఏర్పాటుకు ఇంది రాగాంధీ చొరవ కారణం. ఆ కమిటీయే 1985లో కేంద్ర ‘పర్యావరణ అటవీ మంత్రిత్వ’ శాఖగా రూపాంతరం చెందింది. 1971 డిసెంబరులో ఆమె సిమ్లాలో ఉన్నారు. పాక్‌తో యుద్ధం, బంగ్లాదేశ్ అవతరణ తర్వాతి పరిణామాల్లో... పాకిస్తాన్ ప్రధాన మంత్రి జుల్ఫికర్ అలీ భుట్టోతో ఆమె దౌత్య చర్చలు జరుపుతున్నారు. అంతటి ఒత్తిడిలోనూ, సిమ్లా నుంచే ఆమె బిహార్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అభివృద్ధి పేరుతో చేపట్టిన ఒక ప్రాజెక్టుకు అటవీ భూమిని రాష్ట్ర ప్రభుత్వం బదలాయిస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందనీ, అది పర్యావరణానికి హాని చేసే తప్పుడు చర్య అవుతుంది కనుక ఉపసంహరించుకోవాలనీ ఆ లేఖలో పేర్కొన్నారు.దక్షిణ ప్రపంచానికి గొంతిచ్చిన వైనంస్టాక్హోమ్ పర్యావరణ వేదికను ఇందిరాగాంధీ ఎంతో వ్యూహాత్మకంగా, ప్రభావవంతంగా వాడుకున్నారు. అక్కడ ఆమె ఒక అరుదైన ఆలోచనాత్మకమైన ప్రసంగం చేశారు. ఆతిథ్య స్వీడన్ కాకుండా ఆమె ఒక్కరే దేశాధినేత హోదాలో ‘ప్లీనరీ ప్రసంగం’ చేశారు. ‘ఆ సదస్సు తర్వాత పదేళ్లకు పైగా ఆ ఊపు ఆమెలో కనిపించింది. దాని ఫలితంగానే, ఇప్పటికీ దేశంలో గొప్ప రక్షణాయుధాలుగా ఉన్న పలు ప్రగతిశీల అటవీ, వన్యప్రాణి–సహజవనరుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ చట్టాలు ఆ కాలంలోనే వచ్చాయ’ని ఆమె సమకాలికులైన ప్రభుత్వాధికారులు ఆయా సందర్భాల్లో వ్యాఖ్యానించేవారు. స్వల్ప జనాభా ఉన్న సంపన్న దేశాలు సౌఖ్యాలకు మరిగి, అసాధారణ స్థాయిలో ప్రకృతి సహజ వనరుల్ని కొల్లగొడుతూ చేస్తున్న పర్యావరణ హానిని ఆమె సోదాహరణంగా ఎండ గట్టారు. అభివృద్ధి–పర్యావరణ ఘర్షణను విడమర్చారు. కాలుష్య నివారణ కోసం విధించే కట్టుబాట్లు వెనుకబడ్డ దేశాల ప్రగతికి ప్రతిబంధకం అయ్యే తీరును ఎత్తిచూపడమే కాక ‘కాలుష్య కారకులే నష్టాల మూల్యం చెల్లించాల’నే వాదనను తెరపైకి తెచ్చి, మూడో ప్రపంచ దేశాల గొంతుకయ్యారు. ‘పర్యావరణ వాదననే మనం నెత్తికెత్తుకుంటే... యుద్ధం, పేదరికం వంటి సంక్షోభాలు అప్రాధాన్యమవుతాయేమో?’ అంటూ సదస్సు చైర్మన్‌గా ఉన్న యూఎన్ ప్రతినిధి మౌరిస్ స్ట్రాంగ్ వ్యక్తం చేసిన భయాన్ని ఆమె తిప్పికొట్టారు. ‘ప్రకృతి పరిరక్షణ’ అనేది అభివృద్ధి–పేదరిక నిర్మూలన బాధ్యతకు వ్యతిరేకం కాదనీ, అదే వారి జీవనప్రమాణాల వృద్ధికి దోహదపడుతుందనీ ఆమె అదే వేదిక నుంచి స్పష్టం చేశారు. సంపద, హోదా, అధికార పరంగా మనమెంత బలిష్టులమైనా, పర్యావరణ మార్పు విపరిణామాలకు ప్రభావితులం కాకుండా తప్పించు కోజాలమని ఆనాడే హెచ్చరించారు.పర్యావరణ స్పృహగల వారిప్పుడు వాడుతున్న ‘ఒకే పృథ్వి’ ‘జీవులున్న ఏకైక గ్రహం’ వంటి మాటల్ని ఇందిరా గాంధీ 70లలోనే వినియోగించారు. ‘ప్రపంచం ఏ మూల నుంచో తరచూ సమాచారం అందుతోంది, దేశం వెనుక దేశం అభివృద్ధి పేరిట ప్రకృతి విధ్వంసానికి తెగిస్తోంది, ఇలా సాగితే దీనికి ముగింపేమిటి?’ అని ఆమె ప్రశ్నించారు. సాటి మనుషుల్ని రక్షించడం, దోషుల్ని శిక్షించడమే కాదు, సకల జీవుల పట్ల కరుణతో ఉండాలని బుద్ధుడు, అశోకుడు 2 వేల ఏళ్ల కింద ఏర్పరచిన బాట, భారతీయ సంస్కృతిని ఆమె స్టాక్‌హోమ్ వేదిక నుంచి జగతికి వినిపించారు. అతి పురాతనమైన రుగ్వేదాన్ని ఉటంకిస్తూ ఇందిరాగాంధీ ఆనాడు స్టాక్‌హోమ్‌లో చెప్పిన ‘ప్రకృతి నుంచి తీసుకున్నంత, తిరిగి వెనక్కి ఇవ్వటం మానవ ధర్మం’ అన్న మాట, మనమంతా ఆచరించాల్సిన అక్షరసత్యం!- దిలీప్ రెడ్డి పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్(నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి) -
మంచి పనిని కించపరుస్తారా?
జనాభా సమీకరణాల్లో వస్తున్నంత పరివర్తన సామాజికార్థిక పరిస్థితుల్లో రాకపోవడం దేశంలో ఏకరీతి ప్రగతికి సవాల్ విసురుతోంది. అసమగ్ర అభివృద్ధికి ప్రభుత్వాలే కారణమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ‘జనాభా ఆధారంగా చట్టసభలకు ప్రాతినిధ్య’ పద్ధతి సమాఖ్య స్ఫూర్తికే విఘాతం కలిగించేలా పరిణమించింది. నియోజకవర్గ పునర్విభజనతో జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెరుగనుండగా, దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గనున్నాయి. జనాభా నియంత్రిస్తే తప్పయినట్టు, ఎక్కువ మంది పిల్లల్ని కనడమే గొప్పయినట్టు అధికారిక ప్రచారాలు, అమలు చర్యలు మొదలయ్యే ప్రమాదముంది. ఈ పరిస్థితులపై లోతైన సమగ్ర అధ్యయనం, దిద్దుబాటు చర్యలు తక్షణావసరం.మనమిపుడు 140 కోట్ల మందితో ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా ఉన్నాం. వనరులు, సదుపాయాలు, జనాభా నిష్పత్తిలో చూసినపుడు ఇదొక సంక్లిష్ట నమూనా! ఇటీవలి వరకు అధిక జనాభా దేశంగా ఉన్న చైనా కొన్నేళ్లుగా కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలతో జనాభా వృద్ధిని నిలువరించింది. మనం కూడా నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ, ఆశించిన లక్ష్యాలు అందుకోలేకపోయాం. అయితే, దేశంలోని కొన్ని, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు ఈ విషయంలో మంచి విజయాలు సాధించాయి. అర్థవంతమైన సంతానోత్పత్తి రేటు తరుగుదలను నమోదు చేశాయి. ఇది ప్రగతి సంకేతమే! కానీ, అదే తమ పాలిట శాపంగా పరిణమించిందని ఇప్పుడా రాష్ట్రాలు నెత్తి బాదుకుంటు న్నాయి. ప్రధానంగా రెండు సమస్యల్ని ఎదుర్కొంటున్నామని ఆ యా రాష్ట్రాల అధినేతలు భావిస్తున్నారు. ఒకటి, సంతానోత్పత్తి రేటు నియంత్రణ వల్ల పిల్లలు, యువ జనాభా తగ్గుతూ, వృద్ధుల జనాభా నిష్పత్తి పెరుగుతోంది. రెండోది, జనాభా నిలువరింపు కారణంగా, జాతీయ సగటు జనాభా ఆధారంగా జరిగే లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో ఆ యా రాష్ట్రాల్లో ఎంపీ స్థానాల సంఖ్య తగ్గనుంది. ఇది దేశంలోని అత్యున్నత విధాన నిర్ణాయక సభలో ప్రాతినిధ్యం కోతగా భావిస్తూ వారు కలత చెందుతున్నారు. ఇంకోవైపు, జనాభాను అదుపు చేయక, సంతానోత్పత్తి రేటును అధికంగానే చూపుతున్న రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాల సంఖ్య పెరుగనుండటం దేనికి సంకేతం? అనే ప్రశ్న పుట్టుకొస్తోంది.తగ్గిన సంతానోత్పత్తి రేటుదక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య భారతంలోని చిన్న రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటులో రమారమి తరుగుదల నమోదైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోనూ ఈ రేటు తక్కువగానే ఉంది. 2019–21 కాలంలో, దేశంలోనే అత్యల్పంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో సంతానోత్పత్తి రేటు 1.4గా ఉంటే... తెలంగాణ, ఏపీ, కేరళ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లలో ఇది 1.5గా నమోదయినట్టు ‘భారత రిజిస్ట్రార్ జనరల్’ నివేదిక చెబుతోంది. ‘పిల్లలు కనే వయసు’ కాలంలో మహిళలకు పుట్టిన పిల్లల సంఖ్య సగటును, ఆ ప్రాంతపు లేదా ఆ రాష్ట్రపు సంతా నోత్పత్తి రేటుగా పరిగణిస్తారు. అదే సమయంలో బిహార్ (3), ఉత్తర ప్రదేశ్ (2.7), మధ్యప్రదేశ్ (2.6) రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు అధి కంగా నమోదవుతోంది. ఎక్కువ సంతానోత్పత్తి రేటున్న రాష్ట్రాల్లో అభివృద్ధి మందగించడం సహజం.సంతానోత్పత్తి పరిమితుల్లో ఉండటం ప్రగతి సంకేతమే అయినా, మరో సమస్యకు అది కారణమవుతోంది. ఒక వంక పుట్టే పిల్లల సంఖ్య తగ్గుతుంటే, మరోవంక శాస్త్ర సాంకేతికత పురోగతి పుణ్యమా అని మనిషి సగటు జీవనకాలం పెరగటం వల్ల వృద్ధుల సంఖ్య అధిక మవుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లోలాగా ఒక నిర్దిష్ట వయసు దాటినవారికి ప్రభుత్వమే కల్పించే సామాజిక భద్రత పథకాలు, కార్యక్రమాలు మనవద్ద లేకపోవడంతో వారి పోషణ, ఆరోగ్య నిర్వహణ కుటుంబాలకు అదనపు ఆర్థిక భారంగా పరిణమిస్తు న్నాయి. జనాభా ఆధారంగానే వివిధ కేంద్ర పథకాలు, సంక్షేమ కార్య క్రమాల నిధుల కేటాయింపులు, చివరకు చట్టసభల్లో ఆయా రాష్ట్రాల ప్రాతినిధ్య సంఖ్య ఖరారు కూడా జరగటం తమకు నష్టం కలిగిస్తోందని ఏపీ, తమిళనాడు ముఖ్యమంత్రులు వ్యాఖ్యానించారు.ఆధారపడే జనాభా రేటులో వృద్ధిప్రపంచంలోనే అత్యధిక యువజనాభా కలిగిన దేశంగా భారత్ రికార్డులకెక్కింది. కానీ, ఇటీవలి కాలంలో వృద్ధుల జనాభా శాతం క్రమంగా పెరుగుతున్నట్టు, మున్ముందు అది మరింత పెరుగనున్నట్టు ఐక్యరాజ్యసమితి విభాగమొకటి (యూఎన్‌ఎఫ్‌పీయే) తన నివేదికలో చెప్పింది. భారత వైద్య, కుటుంబ ఆరోగ్య విభాగం అందించిన సమాచారం ఆధారంగా అంచనాలు లెక్కగట్టిన ఈ విభాగం 2021లో 10.1 శాతంగా ఉన్న వృద్ధుల జనాభా 2036 నాటికి 15 శాతానికి చేరవచ్చని చెప్పింది.అయితే, వృద్ధుల జనాభా పెరుగుదల రేటు సమస్య కాదు... సదరు జనాభా పనిచేసే వయస్కుల మీద ఆధారపడే స్థితి అధిక మవడం ఇబ్బంది. అంటే, వంద మంది పనిచేసే (18–59 ఏళ్లు) వయస్కులున్నపుడు, వారిపై ఆధారపడే వృద్ధుల జనాభా అధికంగా ఉండటం కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై నేరుగా ప్రభావం చూపుతుందనేది అంతర్జాతీయ ప్రమాణాల లెక్క. ఆ నిష్పత్తి పెరుగుతోంది. అది 15 శాతాన్ని దాటితే సమస్యను ‘వృద్ధుల సంక్షోభం’గా లెక్కిస్తారు. భారత జాతీయ జనాభా కమిషన్ (ఎన్సీపీ) 2021 లెక్కల ప్రకారం, కేరళలో ఇది ఇప్పటికే 26.1 శాతంగా ఉంది. తమిళనాడు (20.5), హిమాచల్ ప్రదేశ్ (19.6), ఏపీ (18.5) శాతాలు కూడా అధికంగానే ఉన్నాయి. 2036 నాటికి అవి మరింత గణనీయంగా పెరగటం ఖాయంగా కనిపిస్తోంది. సంతానన్పోత్తి రేటును, తద్వారా జనాభాను నియంత్రించినందుకు, సదరు కుటుంబాల్లో లభించే ఆ ప్రయోజనం... వృద్ధుల పోషణ, వారి ఆరోగ్య పరిరక్షణలోనే కరిగిపోతోందనే వాదన బలంగా వినిపిస్తోంది.కట్టడి చేసినందుకు కనీస స్థానాలా?2026 తర్వాతి జనాభా లెక్కల ఆధారంగా దేశంలో నియోజక వర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. రాష్ట్ర విభజన చట్ట నిర్దేశ్యం ప్రకారం ఏపీ, తెలంగాణల్లోనూ సంఖ్య పెంపుతో పునర్విభజన జరగాల్సి ఉంది. దేశవ్యాప్తంగా గడువు లోపల జనాభా తాజా లెక్కలు అందించడానికి వీలుగా జనగణన ప్రక్రియ సత్వరం చేపట్టనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే ప్రకటించింది. దశాబ్దానికి ఒకసారి జరిపే జనగణన, పాత సంప్రదాయం ప్రకారం 2020లో మొదలు కావాల్సింది. కోవిడ్ మహమ్మారి వల్ల అది వాయిదా పడింది. ఇప్పుడు 2025లో చేపట్టి, పదేళ్ల సైకిల్ని (ఇదివరకటిలా 2021 –2031 కాకుండా 2025 –2035గా) మారుస్తున్నారు. జనాభా వృద్ధి రేటు తీరుతెన్నుల్ని బట్టి కె.ఎస్. జేమ్స్, శుభ్ర కృతి జరిపిన అధ్యయనం ప్రకారం, వచ్చే పునర్విభజనతో ఉత్తరాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెరు గనుండగా దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గనుంది. ఉత్తరప్రదేశ్ (12), బిహార్ (10), రాజస్థాన్ (7) లలో లోక్‌సభ నియోజకవర్గాలు పెరుగ నున్నాయి. తమిళనాడు (9), కేరళ (6), ఏపీ (5) లలో తగ్గనున్నాయి. జాతీయ జనాభాలో వాటా పెరుగుదల, తరుగుదలను బట్టి ఈ సంఖ్య మారనుంది. ‘ఎక్కువ పిల్లలు కలిగిన తలిదండ్రులకు ప్రోత్సాహకాలివ్వాలి, ఆ మేరకు చట్టం తేవాలని నేను ఆలోచిస్తున్నాను’ అంటూ ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల అన్నారు. ఇటువంటి పంథా మంచిది కాదనీ, దాని వల్ల ఏ మంచీ జరుగదనేది ప్రపంచ వ్యాప్తంగా రుజువైన అంశమనీ సామాజికవేత్తలు అంటున్నారు. ప్రభుత్వాలిచ్చే ప్రాత్సాహకాలు అదనంగా పుట్టే సంతాన పోషణ, వారి విద్య –వైద్య అవసరాలు తీర్చవనీ, అధిక సంతానం కుటుంబ జీవన ప్రమాణాల పతనానికే కారణమవుతుందనీ విశ్లేషణలున్నాయి.ఈ పరిణామాలను ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకొని ప్రత్యా మ్నాయ చర్యలు చేపట్టాలి. జానాభా వృద్ధిని నిలుపుదల చేసిన వారిని ప్రోత్సహించేలా నిర్ణయాలుండాలి. సరైన జనాభా నిష్పత్తి ఉండేలా చూడాలి. వయసు మళ్లినవారు ఆయా కుటంబాలకు భారం కాకుండా సార్వత్రిక సాంఘిక భద్రతా పథకాలు ఉండాలి. ‘పనిచేసే వయసు’ కాలం నిడివి పెరిగేట్టు జీవన ప్రమాణాల వృద్ధికి చర్యలు తీసుకోవాలి. జనాభా నియంత్రణ తప్పు కాదు. ముసలితనం శాపం కాకూడదు. మంచి పనులకు ప్రోత్సాహం ఉండాలే తప్ప, శిక్షలు ఉండకూడదు.దిలీప్ రెడ్డి వ్యాసకర్త ‘పీపుల్స్ పల్స్’ రిసెర్చ్ సంస్థ డైరెక్టర్ -
‘దళపతి’ అడుగుల ముద్ర పడేనా?
‘సామాజిక స్పృహ టు రాజ్యాధికారం, వయా సినిమా.’ తమిళనాట ఏడున్నర దశాబ్దాలుగా రాజ్యమేలుతున్న రాజకీయ ఫార్ములా! సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని యత్నించి వెనకడుగు వేసిన చోట, సినీ తుఫాన్ విజయ్‌కాంత్ రాజకీయంగా మెరుపు మెరిసి కనుమరుగైన చోట, మరో దిగ్గజ నటుడు కమల్‌హాసన్ పార్టీ పెట్టి ఇప్పటికీ నిలదొక్కుకోలేకపోతున్న చోట... ఇంకో నటుడు ‘దళపతి’ విజయ్ కొత్త పార్టీ పెట్టారు. ‘‘మారా ల్సింది సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక్కటేనా? రాజకీయాలు కూడా మారాలి’’ అన్న ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో హోరెత్తాయి. రజనీకాంత్ తర్వాతి తరంలో అత్యధిక అభిమాన గణం ఉన్న నటుడిగా గుర్తింపు పొందిన విజయ్ ఆగమనం తమిళనాడు రాజకీయాల్లో మార్పు తెస్తుందా?తమిళ నటుడు విజయ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) పేరిట కొత్త పార్టీని ప్రకటించి, అక్టోబరు 27న విక్రవండిలో మొదటి బహిరంగ సభ నిర్వహించారు. ఒక ఎంజీఆర్, ఒక కరుణానిధి, ఓ జయ లలిత... సినీరంగ నేపథ్యంతో రాజకీయాలకు వచ్చి, తమదైన ముద్ర వేయడమే కాకుండా తమిళనాడు సామాజికార్థిక, రాజకీయ స్థితి గతుల్నే మార్చిన చరిత్ర కొనసాగింపే తాజా పరిణామం. తీవ్రమైన భావోద్వేగాలకు నెలవైన తమిళ నేలలో ‘దళపతి’ ప్రభావమెంత? ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు రాజకీయాలు భిన్నమైనవి. అసెంబ్లీలో ప్రత్యర్థి సభ్యులు భౌతికదాడికి పాల్పడి అవమానించినపుడు, ‘ఒక్క డీఎంకే సభ్యుడు కూడా లేని సభకే మళ్లీ వస్తా’నని దివంగత ముఖ్యమంత్రి జయలలిత శపథం చేస్తే, అటువంటి సభనే ఏర్పరచిన తమిళ తీర్పు ఒక భావోద్వేగ చరిత్ర! ఆత్మ గౌరవ ఉద్యమాన్ని, జస్టిస్ పార్టీని కలిపి 1944లో రామస్వామి పెరియార్ ‘ద్రావిడర్ కజగం’ (డీకే) ఏర్పాటు చేశారు. అర్ధ శతాబ్ధానికి పైగా తమిళనాడును పాలిస్తున్న ద్రవిడ కజగం పార్టీలన్నీ ఈ డీకే నుంచి పుట్టినవే! పెరియార్‌తో విబేధాలు రావడంతో డీకే నుంచి బయటకొచ్చిన అన్నాదురై... 1949లో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) స్థాపించారు. ద్రవిడ సిద్ధాంతాల ప్రకారం బ్రాహ్మణులు,కాంగ్రెస్, బీజేపీ ఉత్తరాది ఆర్యుల పార్టీల పెత్తనం చెల్లదు. అన్నాదురై తర్వాత డీఎంకేలో ఉంటూ ద్రవిడ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రచయిత కరుణానిధి 1969లో ముఖ్యమంత్రి అయ్యారు. కరుణానిధి తన గురువు అన్నాదురై సిద్ధాంతాలకు విరు ద్ధంగా పని చేస్తున్నారని ఆరోపిస్తూ... నటుడు ఎంజీ రామచంద్రన్ డీఎంకే నుంచి బయటకు వచ్చి 1972లో అన్నా డీఎంకే పార్టీని స్థాపించారు. ఆ రోజుల్లో నటునిగా తిరుగులేని ప్రజాకర్షణ కలిగిన ఎంజీఆర్, 1977లో అన్నాడీఎంకేని గెలిపించి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఎంజీఆర్ వారసత్వాన్ని జయలలిత కొనసాగించారు. డీఎంకే, అన్నా డీఎంకేలు కేంద్ర ప్రభుత్వాలకు అవసరమైనపుడు ఆ మేరకు మద్దతునిచ్చినా... తమిళనాడులో ఆ యా జాతీయ పార్టీలు బలపడ కుండా అవి నివారించగలిగాయి. దీంతో 5 దశాబ్దాలుగా అక్కడి రాజకీయాలు డీఎంకే వర్సెస్ అన్నా డీఎంకేగా నడుస్తున్నాయి. ఎంజీఆర్ స్ఫూర్తితో చాలామంది నటులు రాజకీయ ప్రవేశం చేశారు కానీ, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ మినహా ఎవరూ అంతటి విజయం సాధించలేకపోయారు. ఎంజీఆర్ కొత్త పార్టీ పెట్టడానికి ముందు నటించిన సినిమాలను తన రాజకీయ ఆశయాలను ప్రచారం చేయడానికి వాడుకున్నారు. ఇటీవల విజయ్ సినిమాల్లో కూడా ఇదే తంతు కనిపించింది. 2018లో విజయ్ నటించిన సర్కార్ చిత్రంలో... హీరో రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని చూసి షాక్ తిని, రాజకీయ నాయకుడిగా మారుతాడు. ఈ సినిమాలోనే, ఆ సమయంలో అధి కారంలో ఉన్న అన్నాడీఎంకేను అవమానించేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. కానీ, మొదటి బహిరంగ సభలో విజయ్ అన్నాడీఎంకేను ఒక్కమాటా అనలేదు! ఇటీవల విడుదలైన పలు చిత్రాల్లో పరోక్షంగా పంచ్ డైలాగ్స్‌తో డీఎంకేను విమర్శించారు. పెరియార్, అన్నా పేర్లను స్మరిస్తూ ద్రవిడ నమూనా పేరుతో తమిళనాడును ఒక కుటుంబం దోచుకుంటోందని విమర్శిస్తూ, ఆ పార్టీయే మన శత్రువని విజయ్ ప్రకటించారు. హేతువాది పెరియారే తన పార్టీకి విధాన మార్గదర్శి, కానీ పెరియార్ నాస్తిక సిద్ధాంతాన్ని మాత్రమే తాము అంగీకరించమని చెప్పారు. ఈ విషయంలో ‘ఒకటే వంశం – ఒకటే దేవుడు’ అన్న ‘అన్నా’ సూత్రాన్ని పాటిస్తామన్నారు. విధానపరంగా తమ సిద్ధాంతంలో ద్రవిడ, తమిళ జాతీయవాదం మధ్య విభజన లేదని వ్యాఖ్యానిస్తూ, ఆ రెండూ తనకు రెండు కళ్ళు అని చెప్పారు. పరస్పర విరుద్ధాంశాలపై అభిప్రాయానికి పొంతన లేకపోవడంతో విజయ్ సిద్ధాంతాల్లో స్పష్టత కొరవడినట్టు కనిపిస్తోంది. పార్టీల పేర్లను ప్రస్తావించకుండా, మతోన్మాద బీజేపీ తమ సైద్ధాంతిక ప్రత్యర్థిగా చెప్పినప్పటికీ, డీఎంకేకు వ్యతిరేకంగా మాట్లాడి నంతగా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడకపోవడం పలు ఊహాగానా లకు ఆస్కారం కల్పిస్తోంది. కుల గణన నిర్వహించాలనీ, విద్య ఉద్యో గాల్లో దామాషా ప్రకారం ప్రాతినిధ్యం కల్పించాలనీ చెప్పిన విజయ్, మైనారిటీల గురించి, వారి భద్రత గురించి ఎక్కడా ప్రస్తావించక పోవడమే ఆయనలోని ద్వైదీభావనకు నిదర్శనం! పలు తమిళ ఫ్యాన్ పేజీల్లో ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్‌తో విజయ్‌కు పోలికలు తేవడం చూడొచ్చు. వీరిరువురు ఒకరి సినిమాలు ఇంకొకరు రీమేకులు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. రాజకీయంగా కూడా ఇలాంటి రీమేక్ జరుగుతుందనే చర్చను అభిమానులు తెరపైకి తెస్తున్నారు. విజయ్, పవన్ మధ్య సామ్యాలు ఉన్నన్ని వైరుధ్యాలు కూడా ఉన్నాయి. పైగా, తెలుగు, తమిళ రాజకీయాలకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంటుందని గమనించాలి. ఏపీలో జనసేన అధికార భాగస్వామ్య పక్షమైన ప్పటికీ, వాస్తవానికి ఆ పార్టీ ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలపడలేదు. ఎన్నికల ఫలితాల్లో నూరు శాతం సక్సెస్ రేట్ సాధించినప్పటికీ, పకడ్బందీ పార్టీ వ్యవస్థ ఏర్పడలేదు. రాజకీయ సిద్ధాంత విధానా ల్లోనూ స్పష్టత లేదు. విజయ్ టీవీకేకూ ఇదే వర్తిస్తుంది. ఎంజీఆర్ పార్టీ పెట్టడానికీ, ఇతర నటులు పార్టీ పెట్టడానికీ తేడా ఉంది. ఎంజీఆర్ డీఎంకేను విడిచిపెట్టినప్పుడు, ఆయన అప్పటికే పార్టీలో నంబర్ త్రీగా ఉన్నారు. పదేళ్లు శాసనసభ అనుభవం గడించి ఉన్నారు. డీఎంకే కోశాధికారిగా పనిచేశారు. తమిళనాడులో కొత్త పార్టీలు పెట్టడానికి ఎవరో ఒకరి సపోర్ట్ ఉంటుందనే వాదన ఉంది. ఎంజీఆర్ వెనుక ఇందిరాగాంధీ ఉన్నారు. కొంతమేరకు విజయం సాధించగలిగిన నటుడు విజయకాంత్ వెనక పన్రుటి ఎస్. రామచంద్రన్ వంటి అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు ఉన్నారు. మరి, విజయ్ వెనుక కూడా ఎవరైనా ఉండొచ్చు అనే అనుమానా లున్నాయి. ‘‘2026 అసెంబ్లీ ఎన్నికల్లో మాకే మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నాం. భావసారూప్య పార్టీలతో పొత్తులకు, కూటమి ఏర్పాట్లకూ సిద్ధమే. మాతో పొత్తు పెట్టుకున్న వారినే అధికారంలో భాగస్వాము లను చేస్తాం’’ అని విజయ్ చెప్పారు. కానీ, సోషల్ మీడియాను దాటి క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తే మెజారిటీ సులభంగా కనిపించదు. మరోవైపు, అన్నాడీఎంకే ముందు పరోక్షంగా పొత్తు సంకేతాలు ఉంచి నట్లయ్యింది. ఒకవేళ ఆయన అన్నాడీఎంకేతో కలిసి నడిస్తే కూటమిగా విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2021లో అధికార డీఎంకే 37.7 శాతం ఓట్లు సాధించగా, అన్నాడీఎంకే 33.29 శాతం ఓట్లు సాధించింది. విజయ్ పార్టీ వచ్చే రెండేళ్లు క్షేత్రస్థాయిలో ఉంటే 7 శాతం వరకు ఓట్లు సాధించవచ్చు. అంటే, విజయ్ అన్నా డీఎంకేతో కలిస్తే, డీఎంకేకు నష్టం కలుగుతుంది. ఒకవేళ ఒంటరిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి, డీఎంకేకు లబ్ధి చేకూరుతుంది. అందుకే ఉభయ ద్రవిడ పార్టీలు విజయ్ అడుగులనూ, ఆయనకు లభించే ప్రజాదరణనూ జాగ్రత్తగా గమనిస్తున్నాయి.దిలీప్ రెడ్డి వ్యాసకర్త ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ -
ముస్లిం ఓట్ల చుట్టూ ముగ్గుపోత!
రెండు బలమైన కూటములు తలపడుతున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర పోటీ సూచనలే కనిపిస్తున్నాయి. మిత్ర విభేదాలు, పార్టీ చీలికలు, కొత్త కలయికలు, మారే సమీకరణాలు, ఒకరిపై ఒకరి పోటీ ప్రభుత్వాల ఏర్పాటు... వెరసి గడచిన అయిదేళ్లలో మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి రాజ్యమేలింది. గట్టి సంఖ్యాబలంతో ఈసారి స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న పట్టుదల అటు ‘మహాయుతి’, ఇటు ‘మహా వికాస్ అఘాడీ’ (ఎమ్వీఏ) కూటముల్లో స్పష్టంగా కనిపి స్తోంది. అందుకే, ఎవరూ ఏ అవకాశాన్నీ వదలకూడదనే తలంపుతో పావులు కదుపుతున్నారు. ప్రధాన స్రవంతి ప్రత్యర్థులైన బీజేపీ, కాంగ్రెస్‌కు తోడు ప్రాంతీయంగా ప్రాబల్యమున్న శివసేన, జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లూ ఈ ఎన్నికల్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. రెండు కూటముల్లో క్రియాశీలక పాత్ర పోషించే శివసేన, ఎన్సీపీలు ఈసారి ప్రత్యేకంగా నాలుగు పార్టీలుగా తలపడుతున్నాయి. 2022–23లో చోటుచేసు కున్న ‘పవర్ పాలిట్రిక్స్’లో ఒక్కో పార్టీ రెండుగా చీలిన విషయం తెలిసిందే! ఏక్నాథ్ షిందే నేతృత్వంలోని శివసేన బీజేపీతో చేతులు కలిపి ‘మహాయుతి’లో భాగమైతే, ఉద్ధవ్ థాక్రే నాయకత్వం వహిస్తున్న శివసేన కాంగ్రెస్‌తో కూడి ‘మహా వికాస్ అఘాడీ’ భాగస్వామి అయింది. అలాగే అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ మహాయుతిలో ఉంటే, శరద్‌పవార్ నేతృత్వపు ఎన్సీపీ... ఎమ్‌వీఏలో భాగంగా ఉంది. ఇప్పుడీ రెండు కూటములూ, రాష్ట్రంలో 12 శాతంగా ఉన్న ముస్లిం ఓట్లపై దృష్టి కేంద్రీకరించాయి. వాటి చుట్టూ ముగ్గుపోసి వ్యూహాలు అల్లుతున్నాయి. మైనా రిటీలుగా ఉండి కూడా మెజారిటీ వారిని ఓడించడమనే ఎత్తుగడతో ముస్లింలు ‘వోట్ జిహాద్’కు పాల్పడుతున్నారని బీజేపీ విమర్శిస్తోంది. అవన్నీ తప్పుడు లెక్కలనీ, ముస్లింల ఉనికిని, త్యాగాలను కించపరిచేలా మాట్లాడుతున్న బీజేపీ నాయకత్వం, వారికి క్షమాపణలు చెప్పి ఎన్నికల బరిలో దిగాలనీ ప్రత్యర్థులు అంటున్నారు.‘తాము బహుళ సంఖ్యాకులుగా ఉన్న ఒక నియో జకవర్గంలో ముస్లిం మైనారిటీలు మూకుమ్మడిగా బీజేపీ ప్రత్యర్థులకు ఓటువేసి మెజారిటీ వర్గమైన హిందువులను ఓడిస్తున్నారు’ అన్నది బీజేపీ నాయకుల వాదన. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ‘ధూలే’ స్థానం పరిధి అయిదు అసెంబ్లీ సెగ్మెంట్లలో కలిపి బీజేపీ అభ్యర్థికి 1.9 లక్షల ఓట్ల ఆధిక్యత లభించినా, ముస్లిం ఆధిక్యత ఉన్న ఒక్క ‘మాలెగావ్ సెంటర్’ అసెంబ్లీ స్థానంలో ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థికి లభించిన ఏకపక్ష ఆధిక్యత వల్ల బీజేపీ అభ్యర్థి నాలుగువేల ఓట్లతో ఓడిపోయినట్టు, ఉదాహరణతో పీపీపీ ప్రదర్శన ఇచ్చి ప్రచారం చేశారు. ఇదే కారణంగా మహాయుతి కూటమి 14 స్థానాలు కోల్పోయిందన్నది వారి వాదన.హిందువులు జాగృతం కావాలని బహిరంగంగానే చెప్తు న్నారు. కానీ ఎమ్వీఏ కూటమి నాయకులు దీన్ని ఖండి స్తున్నారు. అదంతా బీజేపీ చేస్తున్న ఓ ‘సానుకూల అన్వయ వాదన’ తప్ప వాస్తవాలు వేరంటున్నారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న 38 అసెంబ్లీ స్థానాల్లో, 2019తో పోల్చి చూస్తే 20 (సగానికి ఎక్కువ) స్థానాల్లో మహాయుతి కూటమి అభ్యర్థులు 2024 ఎన్నికల్లో తమ ఓటు శాతాన్ని పెంచుకున్నట్టు జాబితా వెల్లడించారు. కిందటిసారి అసెంబ్లీకి ఎన్నికైన పదిమంది ముస్లింలలో 8 మంది ఆ స్థానాల నుంచే వచ్చారు. ప్రస్తుత సభలోని మొత్తం పదిమంది ముస్లిం ఎమ్మెల్యేలలో బీజేపీ, శివసేన, కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీల నుంచి ఇద్దరేసి ఉండగా మజ్లిస్, ఎన్సీపీ నుంచి ఒక్కొక్కరి చొప్పున ఉండటాన్ని గుర్తుచేస్తున్నారు. అధిక ముస్లిం జనాభా స్థానాలు కూడా ఏకపక్షంగా ఏం లేవనీ, ఆ 38లో కాంగ్రెస్ 11, బీజేపీ 11, అవిభక్త శివసేన 9, అవిభక్త ఎన్సీపీ 3, మజ్లిస్ 2, ఎస్పీ 2 స్థానాలు గత అసెంబ్లీ ఎన్ని కల్లో గెలుచుకున్న విషయాన్ని ఎత్తిచూపుతున్నారు.హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ (ఎఐఎంఐఎం) మహారాష్ట్ర ఎన్నికల్లో దశాబ్ద కాలంగా పాత్ర పోషిస్తోంది. 2014 ఎన్నికల్లో రంగ ప్రవేశం చేసి, ఔరంగాబాద్ సెంట్రల్, బైసుల్లా–2 అసెంబ్లీ స్థానాలు గెలిచి చరిత్ర సృష్టించింది. ప్రకాశ్ అంబేడ్కర్ నాయకత్వంలోని ‘వంచిత్ బహుజన్ అఘాడీ’ (వీబీయే)తో అప్పుడు ఏర్పడ్డ పొత్తు, 2019 ఎన్నికలప్పుడు సీట్ల పంచాయితీలో వికటించి ఆ రెండు స్థానాలు నిలబెట్టుకో లేకపోయింది. కానీ మాలెగావ్ సెంట్రల్, ధూలే –2 అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక పార్లమెంట్ స్థానం (ఔరంగాబాద్ సెంట్రల్) గెలిచి మజ్లిస్ మరోమారు వార్తలకెక్కింది. మరో నాలుగు చోట్ల రెండో స్థానంలో నిలిచింది. అంతే కాకుండా 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మజ్లిస్ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల శాతం, అక్కడి గెలుపు మార్జిన్ కంటే అధికం. 2014 లో 22 చోట్ల పోటీ చేసి 0.9 శాతం ఓట్లు సాధిస్తే, 2019లో 44 చోట్ల పోటీచేసి 1.34 శాతం ఓటువాటా పొందింది. పరిమిత ప్రభావమే అయినా... తక్కువ ఓటు వ్యత్యాసాలతో గెలుపోటములు నిర్ణయమయ్యే తీవ్ర పోటీలో మజ్లిస్ అభ్య ర్థులు నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశాలు న్నాయి. ముస్లిం ఓట్లను చీల్చి పరోక్షంగా బీజేపీకి సహకరించేందుకే పోటీ చేస్తోందనే ఆరోపణలు బీజేపీ వ్యతిరేకపార్టీల నుంచి మజ్లిస్ ఎదుర్కోవాల్సి వస్తోంది. గణాంకాలు మాత్రం ఆ వాదనను ధృవపరచడం లేదు. ఉదాహరణకు విజేతల మార్జిన్ కన్నా మజ్లిస్ ఎక్కువ ఓట్లు పొందిన 13 నియో జకవర్గాల్లో, 7 చోట్ల బీజేపీ దాని భాగస్వాములు గెలిస్తే... 6 చోట్ల కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి నెగ్గింది. ‘హరియాణా, జమ్మూ–కశ్మీర్లో మేం పోటీ చేయలేదు కదా, ముస్లిం ఓట్లు చీల్చలేదు కదా, మరి కాంగ్రెస్ ఎందుకు గెలవలేదు?’ అన్న అసద్ ప్రశ్న హేతుబద్ధమే అంటారు పరిశీలకులు. 5 చోట్ల అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన మజ్లిస్ ఈసారి కూడా ఎక్కువ స్థానాల్లో పోటీచేసే అవకాశాలున్నాయి. పొత్తులకు కలిసి రావాలంటే 28 స్థానాలు ఇవ్వాలన్న ఆ పార్టీ ప్రతి పాదనకు ఎమ్వీఏ అంగీకరించక పోవడం వల్ల ఇంకా పొత్తు కుదరలేదు. పొత్తు లేకుంటేనే బెటర్ అని ఎమ్వీఏ భావిస్తున్నట్టుంది.పోటీ తీవ్రంగా ఉన్న నియోజకవర్గాల్లో ముస్లిం ఓటింగ్ సరళి తమ అభ్యర్థుల గెలుపోటముల్ని కచ్చితంగా ప్రభావితం చేస్తుందనేది ప్రధాన పార్టీల ఆలోచన. బీజేపీ పక్షాలు ఆందోళన చెందితే, వ్యతిరేక పక్షాలు కొంత ఆశా వహంగా ఉన్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 2 శాతం కన్నా తక్కువ ఓట్ల తేడాతో 27 చోట్ల, 2–3 శాతాల మధ్య ఓట్ల వ్యత్యాసంతో 14 చోట్ల, 3–4 శాతాల మధ్య ఓట్ల తేడాతో 11 చోట్ల, 4–5 శాతాల ఓట్ల మధ్య తేడాతో 19 చోట్ల అభ్యర్థులు గెలుపొందారు. అంటే 5 శాతం లోప ఓట్ల వ్యత్యాసంతో మొత్తం 71 మంది అభ్యర్థులు గెలుపొందారన్నమాట. ఇలా తక్కువ ఓట్ల మెజారిటీతో గెలిచిన వారిలో బీజేపీ (29), కాంగ్రెస్ (12), శివసేన (5)తో పాటు ఇండిపెండెంట్లూ (5) ఉన్నారు. ఇక ముస్లిం జనాభా 15 శాతానికి మించి ఉన్నవి 51 నిజయోజక వర్గాలు కాగా 10–15 శాతాల మధ్య ముస్లిం జనాభా ఉన్న నియోజక వర్గాలు 54 ఉన్నాయి. 5–10 శాతాల మధ్య జనాభా ఉన్నవి 91, ఐదు కన్నా తక్కువ ముస్లిం జనాభా ఉన్నవి 92 నియో జకవర్గాలు ఉన్నాయి. బీజేపీ, వారి మిత్రపక్ష అభ్యర్థులను ఎక్కడెక్కడ ఎవరు ఓడించగలుగుతారో... ఆ నమ్మకాన్ని బట్టే ముస్లిం ఓటర్లు అటువైపు మొగ్గవచ్చనే అభిప్రాయం ఉంది. ఏ అంశం ఏ మేరకు అభ్యర్థుల జాతకాలను మారు స్తుందో నవంబరు 23 వరకు వేచి చూడాల్సిందే!దిలీప్ రెడ్డి వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,పీపుల్స్ పల్స్ రీసెర్చి సంస్థ డైరెక్టర్ -
‘మహా’త్యాగం కాంగ్రెస్‌కు సాధ్యమా?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా దేశ ఎన్నికల ముఖచిత్రాన్నే సమూలంగా మార్చివేసిన భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నిక కోసం ఎప్పుడో సన్నద్ధమైపోయింది. హరియాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారానికి తెర పడ్డప్పుడు, ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్రలో పర్యటిస్తూ రాజకీయ ప్రసంగం చేయడం ఇందుకు నిదర్శనం. మహారాష్ట్ర ఎన్నికల కోసం కాంగ్రెస్‌లో ఇప్పుడిప్పుడే కద లిక ప్రారంభమయ్యింది. కాంగ్రెస్ సన్నద్ధతపై ఆ పార్టీ విజయమొక్కటే ఆధారపడి లేదు. బీజేపీకి, దాని నేతృత్వంలోని ఎన్డీఏకు సవాల్ విసురుతున్న ‘ఇండియా’ విపక్ష కూటమి బలం పుంజుకోవడం కూడా కాంగ్రెస్ మంచి చెడుల పైనే ఆధారపడి ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రవర్తన మీద!మహారాష్ట్ర, రెండు కూటములకూ ఎంతో కీలకమైన రాష్ట్రం. ప్రతి కూటమిలోనూ కనీసం మూడేసి ముఖ్య మైన భాగస్వామ్య పక్షాలున్నాయి. బీజేపీతో శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్)లు జట్టుకట్టి ఏర్పడ్డ ‘మహాయుతి’ కూటమి ఎన్డీఏ శిబిరంలో ఉంది.కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న శివసేన (ఉద్దవ్ థాక్రే), ఎన్సీపీ (శరద్ పవార్)ల ‘మహా వికాస్ ఆఘాడి’ (ఎమ్వీఏ) ఇండియా శిబిరంలో ఉంది. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్ర సంక్లిష్ట రాజకీయాల్లో కూటమి విజయాలన్నవి భాగస్వామ్య పక్షాల మధ్య పొత్తుల సాఫల్యతను బట్టి ఉంటాయి. 2019 ఎన్నికల తర్వాత ఎన్నో రాజకీయ పరిణా మాలు వేగంగా మారుతూ వచ్చాయి. కలిసి ఎన్నికల్లో పోరిన బీజేపీ– శివసేన పార్టీలు గెలిచి కూడా సర్కారు ఏర్పరిచే సఖ్యత కుదరక విడిపోయాయి. ఎన్సీపీ–కాంగ్రెస్ జోడీతో చేతులు కలిపి శివసేన ‘ఎమ్వీఏ’ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొత్త పొత్తులతో ఏర్పడ్డ ఎమ్వీఏ ప్రభుత్వం కొంత కాలానికే కుప్ప కూలింది. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ ‘చొరవ’ తీసుకొని, శివసేన చీలికవర్గం (తమదే అసలు శివసేన అంటారు) నేత ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొంత కాలం తర్వాత, ఎన్సీపీ నుంచి చీలి వచ్చిన (వీరిది అదే రాగం) అజిత్ పవార్‌ను ఉపముఖ్యమంత్రిని చేసి, ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. ఈ చీలికలు మహా రాష్ట్ర ప్రజలకు నచ్చినట్టు లేదు, అందుకే 2024 లోక్‌సభ ఎన్నికల్లో పాలక కూటమికి చుక్కెదురైంది. 48 లోక్‌సభ స్థానాలకుగాను మహాయుతికి 17 స్థానాలు దక్కితే, ఎమ్వీఏ 30 స్థానాల్లో నెగ్గి సత్తా చాటింది.ఇదివరకటిలా కాకుండా, రాహుల్‌గాంధీ రాజకీయంగా కొంత రాటుదేలుతున్నాడనే భావన ప్రజాక్షేత్రంలో వ్యక్తమౌతోంది. పొత్తుల్లో కొన్ని సార్లే కాంగ్రెస్ లాభపడ్డా, ఆ సానుకూల వాతావరణం వల్ల మిత్రులకు మేలు కలిగిన సందర్భాలే ఎక్కువ. 2004 తర్వాత మళ్లీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో అది కొట్టొచ్చినట్టు కనిపించింది. పొత్తుల్లో పట్టువిడుపులు లేకుండా కాంగ్రెస్మొండికేసిన చోట, వారి వల్ల మిత్రులు నష్టపోయిన సందర్భాలూ ఉన్నాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పట్టు బట్టి ఎక్కువ సీట్లు తీసుకొని, తక్కువ స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ కారణంగానే, ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కోల్పోయారనే భావన అత్య ధికుల్లో ఉంది. 243 స్థానాల్లో మ్యాజిక్ నంబర్ 122 అయితే ‘మహా ఘట్ బందన్’ 110 వద్ద ఆగిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు 12 సీట్లు తగ్గాయి. 70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 19 చోట్ల మాత్రమే నెగ్గింది. ఏ మాత్రం తేడా వచ్చినా ఇటీవల ముగిసిన జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో ఒమర్ ఫరూక్ పరిస్థితి అట్లానే ఉండేది! 90 సీట్లకు, పొత్తుల్లో 51 చోట్ల పోటీ చేసి నేషనల్ కాన్ఫరెన్స్ 42 చోట్ల నెగ్గితే, 32 స్థానాలు తీసుకొని (మరో 5 చోట్ల స్నేహపూర్వక పోటీలో ఉండి) 6 చోట్ల మాత్రమే కాంగ్రెస్ నెగ్గింది. హరియాణాలో, ‘ఇండియా’ కూటమి పక్షమైన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి పొత్తుల్లో పది స్థానాలు (90లో) ఇవ్వడానికి వెనుకాడిన కాంగ్రెస్, వారు దాదాపు అంతటా పోటీ చేయడానికి పురిగొల్పింది. సమాన ఓటు వాటా (సుమారు 40 శాతం) పొందిన బీజేపీ, కాంగ్రెస్ మధ్య సీట్ల తేడా 11 మాత్రమే! కానీ, ఆప్‌కు సుమారు 2 శాతం ఓటు వాటా లభించింది.క్షేత్రంలోని వాస్తవిక బలం తెలుసుకొని, పొత్తుల్లో కొంచెం తగ్గితే వచ్చే నష్టమేంటి? ఈ సంస్కృతి కాంగ్రెస్ మరచిపోతోంది. ఇటువంటి పరిస్థితే లోగడ తలెత్తినపుడు... సోనియాగాంధీ నేతృత్వంలోనే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వెనుకంజకు సిద్ధపడింది. ‘బీజేపీని, దాని నేతృత్వపు ఎన్డీఏను గద్దె దించడానికి ప్రతి యుద్ధం ప్రకటించాలి. ప్రతి పోరూ సాగించాలి. ఏ త్యాగానికైనా సిద్ధ పడాలి’ అని బెంగళూర్ (2001)లో జరిగిన ప్లీనరీలో నిర్ణ యించారు. ఆ మేరకు రాజకీయ తీర్మానం ఆమోదించారు. 2002 మౌంట్ అబూలో జరిగిన కాంగ్రెస్ ముఖ్య మంత్రుల కాంక్లేవ్‌లో, ఈ పంథాకు సోనియాగాంధీ మరింత స్పష్టత ఇచ్చారు. ‘ఛాందసవాదుల్ని గద్దె దించ డానికి లౌకిక శక్తుల్ని ఏకం చేయాలి... మన లక్ష్యం సొంతంగా ప్రభుత్వం ఏర్పరచడమే, కానీ, అవసరమైతే సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకూ మనం సంసిద్ధంగా ఉండాలి’ అని ఆమె ఉద్బోధించారు. నేను స్వయంగా విని, రిపోర్ట్ చేసిన, 1997 కలకత్తా ప్లీనరీలో సీతారాం కేసరి అధ్యక్షోపన్యాసం... ‘ఇది సంకీర్ణాల శకం అనుకోన వసరం లేదు. కాంగ్రెసే ఓ విజయవంతమైన సంకీర్ణం. మనకు ఏ పార్టీలతో పనిలేదు. సొంతంగా సర్కారు ఏర్ప రిచే సత్తా మనకుంది...’ అన్న ఆలోచనాసరళి దిశనే సోనియాగాంధీ పూర్తిగా మార్చేశారు. దీనికి, 1999 ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ కొత్త పాఠాలు నేర్చు కోవడమే కారణం. వివిధ రాజకీయ పార్టీల్లో నెలకొన్న ‘కాంగ్రెస్ వ్యతిరేక ధోరణి’ తారస్థాయికి చేరి, అప్పుడు తేలిగ్గా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. ‘పొత్తు లతో మాత్రమే కాంగ్రెస్ గెలువగలదు...’ అని ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని కమిటీ 2003 డిసెంబరులో ఇచ్చిన నివేదికతో సోనియా ఈ దిశలో మరింత క్రియా శీలమయ్యారు. 2004 ఎన్నికల్లో దాన్ని పక్కాగా అమలు పరచి, ఎన్నికలు గెలిచి, కాంగ్రెస్ నేతృత్వంలో విజయవంతంగా ‘ఐక్య ప్రగతిశీల కూటమి’ (యూపీఏ) ప్రభు త్వాన్ని ఏర్పాటు చేశారు. ‘త్యాగాలు’ అనే మాట ఊరకే రాలేదు. రాజీవ్‌గాంధీ హత్యలో డీఎమ్‌కేకు భాగముందని కాంగ్రెస్ స్వయంగా విమర్శించినా... తమిళనాడులో ఆ పార్టీతోనే పొత్తుపెట్టుకున్నారామె. ఆమె జాతీయతనే ప్రశ్నించి కాంగ్రెస్‌ను చీల్చిన శరద్‌పవార్ నేతృత్వపు ఎన్సీపీతో మహారాష్ట్రలో ఆమె పొత్తులకు సిద్ధమయ్యారు. సఖ్యతకు తలుపులు తెరచిన కమ్యూనిస్టులతో జతకట్టి యూపీఏను విజయతీరాలకు చేర్చారు. అవిభక్త ఆంధ్ర ప్రదేశ్‌లో ఉద్యమపార్టీ టీఆర్ఎస్తో చేతులు కలిపి గెలి చారు. ఈ పంథాయే ఇప్పుడు కాంగ్రెస్‌కు శరణ్యం.2029 ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే రాజకీయ పునరేకీకరణలకు కాంగ్రెస్ వ్యూహరచన చేయొచ్చు. బీజేపీతో ముఖాముఖి తలపడే రాజస్థాన్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హరియాణా, హిమా చల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు సరేసరి! మహారాష్ట్ర, బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,పంజాబ్, జార్ఖండ్, కేరళ వంటి రాష్ట్రాల్లో మరింత వ్యూహాత్మకంగా కాంగ్రెస్ కూటములను బలోపేతం చేసుకోవచ్చు. ఇతర ‘ఇండియా’ పక్షాలు లేని ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఒడిషా వంటి రాష్ట్రాల్లో కొత్త మిత్రుల్ని వెతుక్కోవచ్చు. అయితే వారే పేర్కొన్నట్టు ‘త్యాగాల’కు సిద్ధమైతే తప్ప పొత్తు ధర్మం పొద్దు పొడ వదు, రాజకీయ ఫలం సిద్ధించదు!దిలీప్ రెడ్డి వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,‘పీపుల్స్ పల్స్’ డైరెక్టర్ -
కాంగ్రెస్‌ను బీజేపీ నిలువరించేనా?
పదేళ్లుగా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీ హరియాణాలో ‘ప్రభుత్వ (ప్రజా) వ్యతిరేకత’ను ఎదుర్కొంటోంది. ఫలితంగా కొన్ని బలమైన వర్గాలు పార్టీకి క్రమంగా దూరమౌతున్న సంకేతాలున్నాయి. ఇటీ వలి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, పలు సర్వే సంస్థలు రాబట్టిన సమాచార వివ రాలు ఇదే విషయాన్ని నొక్కి చెబు తున్నాయి. కాంగ్రెస్ ఆధిక్యతను ప్రధాన సర్వే సంస్థలన్నీ చెప్ప కనే చెబుతున్నాయి. కానీ, ప్రజాక్షేత్రం కొన్నిసార్లు గోప్యంగా, గుంభనంగా ఉండటం రాజకీయాల్లో సహజం. క్షేత్ర సమాచారం, సంకేతాలు, మేధావుల విశ్లేషణలు ప్రతికూలంగా ఉన్నా తమ ప్రయత్నాలు మాత్రం మానకుండా పార్టీలు కొనసాగి స్తాయి. ప్రస్తుతం బీజేపీ పరిస్థితి కూడా అలాగే ఉంది. 2014, 2019 ఎన్నికల్లో పదికి పది లోక్‌సభ స్థానాలు గెలిచిన బీజేపీ, ఈసారి 5 చోట్ల ఓడిపోయింది. చేసిన తప్పులు దిద్దుకునే పనిలో బీజేపీ ఉంటే, అవన్నీ తప్పులనీ సదరు తప్పుడు విధానాలన్నీ తాము అధికారంలోకి రాగానే పక్కన పెడతామని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ప్రజలు ఎవరిని నమ్ముతారన్న దాన్ని బట్టే వారి మొగ్గు ఎన్నికల్లో ప్రతిబింబించే అవకాశముంది. కేంద్ర, రాష్ట్ర సర్కార్లపై హరియాణా ప్రజానీ కానికి కోపం ఎందుకు? మహిళా రెజ్లర్ల అవమానాలు, రైతు పంటకు ఎమ్మెస్పీ దక్కకపోవడం, మూడు వ్యవసాయ చట్టాలు పరోక్షంగా తొంగిచూడటం, కోటాల వివాదం, నిరుద్యోగం, అగ్నివీర్... వంటి విధాన వ్యవహార పరమైన అంశాల రీత్యా ప్రజావ్యతిరేకత పెరుగుతూ వస్తున్నట్టు ‘పీపుల్స్ పల్స్’ క్షేత్ర పరిశీలనలో వెల్లడవుతోంది. వీటికి తోడు, ఎలక్ట్రానిక్ పాలనకై బీజేపీ ప్రభుత్వం తీసుకున్న చొరవ, చివరకు అమలు లోపాల వల్ల వికటించింది. రైతుల పేరిట ఈ–అకౌంట్లు తెరిపించి, సబ్సిడీలు, పంట నష్టపరిహారాలు, ఇతర ప్రయోజనాలను నేరుగా వారికే అందేట్టు ఏర్పాటు చేసిన (మేరా ఫసల్ మేరా బయోరా – ఎమ్మెఫ్ఎంబీ) పథకం ఆచరణలో విఫలమైంది. సరైన శిక్షణ లేక, అవగాహన కల్పించక రైతులు దీన్ని వాడక పోగా చీదరించుకున్నారు. అటువంటిదే, ‘పరివార్ పహచాన్ పత్ర్’ (పీపీపీ) కూడా ప్రజలకు పెద్దగా నచ్చలేదు. మరోపక్క, ‘పోర్టల్ సర్కార్...’ అని విమర్శించిన కాంగ్రెస్ నేత హుడా, తాము అధికారంలోకి రాగానే ఇందులో చాలా పద్ధతులు, విధానాలను ఎత్తివేస్తామని చెబుతున్నారు.పంజాబ్‌తో విడిపోయి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత హరి యాణా వికాస్ పార్టీ, భారతీయ క్రాంతిదళ్, హరియాణా జన సభ, భారత జాతీయ లోక్‌దళ్, జననాయక్ జనతా పార్టీ... ఇలా పలు ప్రాంతీయ పార్టీలొచ్చాయి. కొన్ని పొత్తులు ఎన్నికల ముందు కుదిరితే, మరి కొన్ని ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటు సమయాల్లో కుదిరిన దాఖలాలున్నాయి. ఇప్పుడు హరియాణాలో ప్రధాన ప్రత్యర్థులైన బీజేపీ, కాంగ్రెస్‌కు ఎవరి తోనూ పొత్తు లేదు. ఎన్నికల ముందు మాత్రం ఐఎన్ఎల్డీ మాయావతి నేతృత్వంలోని బీఎస్పీతో జట్టుకట్టింది. వీరు చూపే ప్రభావం, ఆ యా నియోజకవర్గాల్లో చీల్చే ఓట్లను బట్టి జాట్లతో పాటు దళిత ఓటర్ల మొగ్గులో తేడాలు రావచ్చు. బయటకు కనిపించే దాన్ని బట్టి, అది విపక్షమైన కాంగ్రెస్‌కే దెబ్బగా పరిణమించొచ్చు. ఇటువంటి పరిస్థితే జేజేపీ–ఎఎస్పీ (కాన్షీరావ్‌ు వర్గం) జోడీ వల్ల కూడా ఎదురయ్యే ఆస్కార ముంది. సంఖ్యాపరంగా జనాభాలో జాట్లు (25 శాతం), దళి తులు (20 శాతం) అధికులుగా ఉండటమే ఈ సమీకరణాల ఆలోచనలకు కారణం. 2019 ఎన్నికల్లో తాను గెలిచిన 10 అసెంబ్లీ స్థానాలతో మద్దతు ప్రకటించి, బీజేపీతో సంకీర్ణ సర్కా రులో భాగమైన జేజేపీ ఇప్పుడు వారితో లేదు. అందుకు కారణం లేకపోలేదు. జాటేతర వర్గాల్లో పట్టుపెంచుకోవాలనే కోరిక బీజేపీది. అందుకే, మెజా రిటీ వర్గంగా, అంటే 30 శాతం జనాభాగా ఉన్న ఓబీసీలపై కన్నేసింది. జేజేపీకి రెండు కారణా లున్నాయి. ఒకటి, భాగస్వామిగా ఉన్న తమనే బీజేపీ కకావి కలు చేసిందని కోపం. గెలిచిన 10 మందికి గాను ఇప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే జేజేపీలో మిగిలారు. ప్రజా వ్యతిరేకత బలంగా ఉన్న బీజేపీతో అంటకాగటం వల్లే తమ ఉనికి, నిన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ప్రశ్నార్థకమైందని జేజేపీ ఆందోళన చెందుతోంది. ‘ఇండియా’ కూటమి భాగస్వామి ‘ఆప్’ ఇక్కడ విడిగా పోటీ చేయడం కాంగ్రెస్‌కు నష్టం కలిగిం చేదే! ‘ఎవరికీ మెజారిటీ రాదు, చివరకు మేమే కీలకం అవుతాం’ అని జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా ఇప్పటికే ప్రకటించారు.దాదాపు నేరుగా తలపడుతున్న ప్రధాన ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్, బీజేపీల్లో అంతర్గత కుమ్ములాటలున్నాయి. పదేళ్ల పాలకపక్షంగా 2014–19 కాలం కన్నా 2019–24 లోనే పార్టీ సంస్థాగతంగా ఇబ్బందులెదుర్కొంటోంది. మాజీ ముఖ్య మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రధాని మోదీ మనిషి. అయినా... ప్రజా వ్యతిరేకత గుర్తించి, ఇంకోపక్క ఓబీసీల్లో పట్టు పెంచుకునే క్రమంలో, 2024 ఎన్నికల ముందు ఆయన్ని దింపి నాయబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రి చేసుకున్నారు. అయినా... ఆశించిన ఓట్లు రాలలేదు. నాటి పరిస్థితిని మించి, ఇప్పుడు ఖట్టర్‌ను కేంద్ర మంత్రిని చేస్తే ఆయన మళ్లీ హరి యాణా ప్రజల ముందుకు వచ్చారు. ఏ మేర వారు ఆదరిస్తారో చూడాలి. 2019 ఎన్నికల్లో లభించిన 28.5 శాతం ఓటు వాటా నుంచి నిన్నటి (2024) ఎన్నికల్లో 43.67 శాతానికి ఓటు వాటా పెంచుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా అంతర్గత లుకలుకలతో రగు లుతోంది. ‘పార్టీ పునరుద్ధరణలో... మేమూ హక్కుదారులమే!’ అనే సంకేతాలతో పోటీ ర్యాలీలు జరుపుతూ, అసెంబ్లీ బరిలో పోటీకి ఆసక్తి కనబరచిన షెల్జాకుమారి, రణ్‌దీప్ సూర్జేవాలా... వంటి వారి అత్యుత్సాహానికి అధిష్టానం అడ్డుకట్ట వేసింది. పార్టీ నాయకత్వ పరంగా, ప్రజాదరణ పరంగా చివరకు భూపీందర్ హుడానే కాంగ్రెస్‌కు రథ సారథిగా నిలుస్తున్నారు. పార్టీ ఎంపీ లెవరూ అసెంబ్లీకి పోటీ చేయబోరని కాంగ్రెస్ నాయకత్వం స్పష్టత నిచ్చింది. ప్రజల దృష్టిలో బలమైన ప్రాంతీయ పరిక ల్పనలు, ఆశలు, ఆకాంక్షలుండే హరియాణాలో రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రత్యరు్ౖథలై ఒకరిపై ఒకరు ఏ మేరకు ఆధిపత్యం సాధిస్తారనేదే రేపటి ఎన్నికల ఫలితం! వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ సర్వే సంస్థదిలీప్ రెడ్డి -
దిలీప్ రెడ్డికి దేవులపల్లి రామానుజరావు పురస్కారం
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ దేవులపల్లి రామానుజరావు పురస్కారాన్ని 2023 సంవత్సరానికి ప్రముఖ పాత్రికేయుడు ఆర్ దిలీప్ రెడ్డికి అందజేయాలని తెలంగాణ సారస్వత పరిషత్తు నిర్ణయించింది. నాటి ఆంధ్ర సారస్వత పరిషత్తుకు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి అధ్యక్షులుగా, కవిగా, విమర్శకునిగా, శోభ పత్రిక సంపాదకునిగా విశేష సేవనందించిన దేవులపల్లి రామానుజరావు పేరుతో పురస్కారాన్ని ఏటా పరిషత్తు అందజేస్తున్నది. ఈ ఏడాదికిగానూ పురస్కారానికి ఎంపికైన దిలీప్ రెడ్డి మెదక్ జిల్లాకు చెందినవారు. ప్రముఖ తెలుగు దినపత్రికల్లో వివిధ హోదాల్లో సేవలు అందించడమే కాకుండా సమాచార హక్కు చట్టం కమిషనర్ గా, పర్యావరణ వేత్తగా విశిష్ట సేవలు అందించారని పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె చెన్నయ్య బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈనెల 25వ తేదీ ఉదయం 10:30 కు పరిషత్తులోని డాక్టర్ దేవులపల్లి రామానుజ రావు కళామందిరం లో జరిగే కార్యక్రమంలో పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కె.వి.రమణాచారి చేతుల మీదుగా అందజేస్తామని, 25 వేల రూపాయల నగదు, శాలువా,జ్ఞాపికతో సత్కరిస్తామని వారు పేర్కొన్నారు. -
బాధ్యత అనుకుంటేనే ఫలం, ఫలితం!
మన ఎదుగుదలకు ఇంత ఇచ్చిన సమాజానికి తిరిగి మనమేమి ఇస్తున్నాం? అన్న దృక్పథం నుంచి పుట్టిన సంస్థాగత కర్తవ్యమే కార్పొరేట్ల సామాజిక బాధ్యత(సీఎస్సార్). అలాంటి వ్యక్తిగత భావన మనిషి ఉత్కృష్ట ఆలోచన, ఉదారత నుంచి పుట్టే వితరణ. కానీ, కార్పొరేట్లకు ఇది వితరణశీలత మాత్రమే కాదు... సమాజంపట్ల వారి బాధ్యత! కానీ జాతీయ స్టాక్ ఎక్స్చేంజీలో నమోదైన 1,627 కంపెనీలు తమ సామాజిక బాధ్యతను నిర్వర్తించలేదు. కంపెనీల సీఎస్సార్ వ్యయానికి సంబంధించిన నివేదికను మూడు నెలల్లో సమర్పించాలని పార్లమెంటు ఆర్థిక స్థాయీసంఘం కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆదేశించింది. చిత్తశుద్ధితో స్వయంగా పాల్గొనడం ద్వారా సమాజాభివృద్ధిలో కార్పొరేట్లు భాగం కావడమే నిజంగా కావాల్సింది! కార్పొరేట్ల సామాజిక బాధ్యత (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ–సీఎస్సార్) ఒట్టి నినాదం కాకుండా దేశంలో దీన్ని చట్టబద్ధం చేసి నేటికి సరిగ్గా ఎనిమిదేళ్లు! కంపెనీ చట్టం సెక్షన్ 135 ప్రకారం నిర్దిష్ట పెట్టుబడి, లావాదేవీలు, లాభం కలిగిన దేశంలోని కంపెనీలన్నీ వాటి వార్షిక నికర లాభంలో 2 శాతం నిధుల్ని ఏటా సీఎస్సార్ కింద కచ్చితంగా వ్యయం చేయాలి. రూ. 500 కోట్ల నికర విలువ కలిగిన, లేదా ఏటా రూ. 1,000 కోట్ల లావాదేవీలు జరిపిన, లేదా ఏటా రూ. 5 కోట్ల లాభాలార్జించిన కంపెనీలన్నీ ఈ నిబంధన పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వం, పౌర సమాజం, కార్పొరేట్లు ఉమ్మడిగా పనిచేస్తే సమ్మిళిత ప్రగతికి ఆస్కారం ఉంటుందన్న నమ్మకమే దీనికి పునాది. 2014 ఏప్రిల్ 1 నుంచి ఆచరణలోకి వచ్చిన ఈ విధానంతో... నిజంగా సాధించిందేమిటని వెనక్కి చూసుకుంటే, గొప్ప ఆశావహ వాతావరణమేమీ కనిపించదు. ఇందుకు కారణాలనేకం! దీన్నొక తంతుగా కొంత డబ్బు వెచ్చించి చేతులు దులుపుకొంటున్నాయి తప్ప సమాజ హితంలో ఏ మేర పాత్ర వహిస్తున్నామన్న సోయితో చేయ ట్లేదు. కొన్ని కార్పొరేట్లయితే వ్యయమే చేయట్లేదు. ఇంకొన్ని తమ వ్యాపార వృద్ధికే తప్ప సమాజం కోసం వ్యయం చేయట్లేదు. మరికొన్ని ఈ నిధుల వ్యయం కోసం సొంతంగా ట్రస్టులు, ఫౌండేషన్లు స్థాపించి మొక్కు బడిగా నిర్వహిస్తున్నాయి. ఇంకొందరైతే బోగస్ సంస్థలతో చేతులు కలిపి లెక్కలు మాత్రమే చూపించి, ఇరువురూ సీఎస్సార్ నిధుల్ని నొక్కేస్తున్నారు. అలా అని, సమాజాభివృద్ధికి తోడ్పడుతున్న కార్పొరేట్లు అసలు లేవని కాదు, కానీ, వాటి సంఖ్య పరిమితం! నివేదిక కోరిన స్థాయీ సంఘం వివిధ విభాగాల్లోని పదేసి అగ్ర కంపెనీల సీఎస్సార్ వ్యయానికి సంబంధించిన సమగ్ర నివేదికను మూడు నెలల్లో సమర్పించాలని పార్లమెంటు ఆర్థిక స్థాయీసంఘం కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఇటీవలే ఆదేశించింది. నియోజకవర్గాల వారీగా ఎక్కడెక్కడ, ఎంతేసి వ్యయం చేశారో చూపాలని పేర్కొంది. అభివృద్ధి చెందిన చోటనే తూతూ మంత్రంగా వెచ్చించడం కాకుండా, నిజంగా అవసరం ఉన్న వెనుకబడిన ప్రాంతాల్లో ప్రగతి సమతూకం సాధించాలన్నది ఇందుకు ఉద్దేశించిన లక్ష్యాల్లో ఒకటి! సీఎస్సార్ వ్యయంపై ఆయా కంపెనీలిచ్చే నివేదికల్లో సమాచారం అసమగ్రంగా ఉందనీ, వాటిపై నిఘా, నియంత్రణ వ్యవస్థ కూడా సరిగా లేదనీ స్థాయీ సంఘం అభిప్రాయపడింది. మైనింగ్, రియల్ ఎస్టేట్, నిర్మాణ తదితర కీలక రంగాల్లో సీఎస్సార్ వ్యయాలు స్థానికంగా జరపటం లేదనే విష యాన్ని సంఘం గుర్తించింది. కార్పొరేట్ రంగంలో జరిగే తీవ్రమైన మోసాల దర్యాప్తు విభాగం (ఎస్ఎఫ్ఐవో) నిర్వహణ సరిగా లేదనీ తప్పుబట్టింది. అసాధారణంగా 60 శాతం పోస్టులు ఖాళీగా ఉండి, దర్యాప్తులు జాప్యమవటం పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపు తోందని పేర్కొంది. సత్వరం సరిదిద్దాలని నిర్దేశించింది. గత ఏడేళ్లలో లక్షా తొమ్మిది వేల కోట్ల రూపాయలు సీఎస్సార్ కింద వ్యయమైనట్టు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రి రావ్ ఇందర్జిత్ సింగ్ నిరుడు పార్లమెంటుకు తెలిపారు. నిజానికిది నామ మాత్రమే! సగానికి మించి విఫలమే! సీఎస్సార్ నిధుల వ్యయం ద్వారా... విద్య, వైద్యం మెరుగు, ఆకలి, లింగ వివక్ష, పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత, గ్రామీణా భివృద్ధి, క్రీడాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, బలహీన వర్గాల సంక్షేమం– నైపుణ్యాల శిక్షణ వంటి పది లక్ష్యాల్ని నిర్దేశించారు. ఆయా అంశాల్లో వివిధ కార్యక్రమాల ద్వారా నిధుల్ని వ్యయం చేయవచ్చు. తగు ప్రాజెక్టుల్ని రూపొందించి, సొంతంగా ఏర్పరచుకున్న విభాగాల ద్వారానో, విశ్వసనీయత కలిగిన మూడో పక్ష ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతోనో ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. కానీ, దేశంలో వంద అతి పెద్ద కార్పొరేట్లలో 52 నిర్దేశించిన సీఎస్సార్ నిధుల్ని వ్యయం చేయలేదని ప్రపంచ స్థాయి అంచనాలు, అధ్యయన సంస్థ కేపీఎమ్‌జీ తాజా (2019) నివేదిక చెబుతోంది. ఒక్క 2017–18 లోనే పదివేల కోట్ల రూపాయలకు పైగా వ్యయం చేయాల్సి ఉండిం దని ‘ప్రైమ్ డాటా గ్రూప్ అనాలిసిస్’ నివేదిక పేర్కొంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీలో నమోదైన 1,627 కంపెనీలు తమ సామాజిక బాధ్యతను నిర్వర్తించలేదు. సరైన ప్రాజెక్టులు గుర్తించలేదనో, భాగస్వామ్యానికి విశ్వసనీయ సంస్థలు దొరకలేదనో చెప్పడం కూడా ఓ కుంటి సాకే! ఎందుకంటే, చట్టం అమల్లోకి వచ్చి 8 ఏళ్లవుతోంది. ఈ పనుల నిర్వహణకు దేశవ్యాప్తంగా కొన్ని వేల సంస్థలు, ఏజెన్సీలు కేంద్ర ప్రభుత్వం వద్ద రిజిస్టరై ఉన్నాయి. సీఎస్సార్ కార్యకలాపాలు, నిధుల వ్యయానికి సంబంధించి వివరాల వెల్లడిలో మరింత పార దర్శకత కోసం నిబంధనల్లో ప్రభుత్వం ఇటీవల కొన్ని సవరణలు తెచ్చింది. (క్లిక్: పర్యావరణాన్నే పణంగా పెడదామా?) ఒక సంవత్సరం నిర్దేశించిన మొత్తం నిధుల్ని వ్యయం చేయ కుంటే, తర్వాతి సంవత్సరాలకు బదలాయించడం కాకుండా, కేంద్రం ఇదే అవసరాల కోసం ఏర్పాటు చేసిన ఒక నిధికి మళ్లించే వ్యవస్థను కూడా కల్పించింది. సీఎస్సార్– ఫారమ్ 2 ద్వారా చాలా వివరాలను కంపెనీలు/కార్పొరేట్లు పారదర్శకంగా వెల్లడించాల్సి ఉంటుంది. మంత్రిత్వ శాఖకు, బోర్డుకు, సభ్యులకిచ్చే వార్షిక నివేదికల్లో విధిగా ఇది ఉండాలి. తాము సీఎస్సార్ కింద నిర్వహించిన కార్యక్రమ సామాజిక ప్రభావాల అంచనా నివేదిక కూడా ఇందులో భాగం. మన కార్పొరేట్లు మారాలి! సీఎస్సార్ విషయంలో ప్రపంచ కంపెనీల దృక్పథంలో వచ్చిన మార్పు భారతీయ కార్పొరేట్లలో రావటం లేదు. ‘వాతావరణ సంక్షోభం’ వంటి విపత్కర పరిస్థితుల్లో గ్లోబల్ కార్పొరేట్ల మౌలిక ఆలోచనలే మారుతున్నాయి. సామాజిక బాధ్యతను తదేక దృష్టితో ఆచరిస్తున్నాయి. ‘ఎల్పీజీ’ (సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ) తర్వాత కంపెనీల్లో ప్రజాపెట్టుబడులు పెరిగాయి. పెట్టుబడుల భాగస్వాములుగా, ఉత్పత్తులు, సేవల వినియోగదారులుగా సాధారణ ప్రజానీకం ఆశలు, ఆకాంక్షల్ని కూడా కార్పొరేట్లు పరిగణనలోకి తీసుకుంటున్నాయి. తమ నడతను మార్చుకుంటున్నాయి. వస్తు సేవల నాణ్యత, ధర మాత్రమే కాకుండా కంపెనీ నడత, నిర్వహించే సామాజిక బాధ్యతను కూడా పౌరసమాజం లెక్కలోకి తీసుకుంటుందనే గ్రహింపు వారిలో ఈ పరివర్తనకు కారణం. 2015–16లో భారత్‌లో జరిగిన ఓ అధ్యయనం ప్రకారం, వస్తు సేవల నాణ్యత మాత్రమే కాకుండా పర్యావరణ, సామాజిక అంశాల్లో ఆయా కంపెనీలు, కార్పొ రేట్ల క్రియాశీలత, బాధ్యత, జవాబుదారీతనాన్నీ వినియోగదారులు పరిగణనలోకి తీసుకొని అటు మొగ్గినట్టు తేలింది. కార్పొరేట్ల నైతికత, సామాజిక స్పృహ కూడా వారి వ్యాపారాభివృద్ధిని ప్రభావితం చేసే అంశమే! ఈ గ్రహింపు వల్లే టాటా గ్రూప్ వంటి కొన్ని పెద్ద సంస్థల సీఎస్సార్ నిర్వహణ ఎంతో పద్ధతిగా ఉంటుంది. కొన్ని సంస్థలైతే తప్పుడు పద్ధతులు అనుసరించడం, స్టాక్ ఎక్స్ఛేంజీలకు తప్పుడు సమాచారం ఇవ్వడం, సీబీఐ, ముంబై పోలీస్ వంటి విభాగాలు కేసులు నమోదు చేసే పరిస్థితుల్ని ఎదుర్కోవడం వరకూ వెళ్లాయి. (క్లిక్: మనమే రాస్తున్న మరణ శాసనం) పబ్లిక్ రంగ సంస్థల్లోనూ సీఎస్సార్ నిధులు దుర్వినియోగం అవు తున్నాయి. మంత్రుల ప్రత్యేక విమాన ప్రయాణాలకు, అధికారుల విలాసాలకు దుబారా చేస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యోగుల సంక్షేమానికి వాడి లెక్కలు చూపుతున్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత అంటే, కేవలం నిధులిచ్చి పేరు తెచ్చుకోవడం అన్న భావన కన్నా అతీతమైంది. స్వయంగా పాల్గొనడం ద్వారా సమాజాభివృద్ధిలో కార్పొరేట్లు భాగం కావడం! కంపెనీలు, కార్పొరేట్లు చిత్తశుద్ధితో ‘అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి’ అనే విశాల దృక్పథంతో ఉంటేనే... సీఎస్సార్కి ఓ అర్థం, పరమార్థం! - దిలీప్ రెడ్డి సీనియర్ పాత్రికేయులు -
GO 111 Hyderabad: పర్యావరణాన్నే పణంగా పెడదామా?
వందేళ్ల క్రితం మూసీకి వరద ఉధృతి వచ్చి హైదరాబాద్ నగరం అల్లకల్లోలమైనప్పుడు... మూసీ ఒడ్డున, ప్రస్తుత ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలోని చింతచెట్టొకటి వంద మందికి పైగా ఆశ్రయమిచ్చి వారి ప్రాణాలు కాపాడిందని ప్రతీతి! అంతటి వరదతో కలత చెందిన నిజాం రాజు నాటి మేటి ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను సంప్రదించారు. మూసీ, ఈస ఉపనదులపై జలాశయాలు నిర్మించి, తద్వారా నగరానికి వరద ప్రమాదాన్ని నివారించడంతోపాటు, ఖర్చు లేకుండా తాగునీటిని అందించొచ్చని ప్రణాళిక వేశారు. అలా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఉనికిలోకి వచ్చాయి. కానీ ఇప్పుడు పడుతున్న పర్యావరణ హితం కాని అడుగులు ఆ జలాశయాల ఉసురునే తీస్తాయా అనే అనుమానాలు నెలకొన్నాయి. జీవో నూట పదకొండు (111) ఉంటుందా? ఊడుతుందా? ఇప్పుడిదొక పెద్ద చర్చ! జీవో ఉన్నా సరే... ‘ఉండదు’ అనే గట్టి ప్రకటన, ప్రచారం ఎవరైనా ఆశిస్తున్నారా? హైదరా బాద్‌కు ఆనుకొని పర్యావరణ ఊపిరి తిత్తులుగా ఉన్న ఉస్మాన్ సాగర్(గండిపేట), హిమాయత్ సాగర్ జంట జలాశయాల పరిరక్షణ లక్ష్యంతో తెచ్చిన జీవో 111 చాన్నాళ్లుగా వివాదాంశమే. అనుకూల ప్రతి కూల వాదనలు... పాతికేళ్ల కింద (1996) జీవో వచ్చినప్పటి నుంచీ ఉన్నాయి. జలాశయాల పూర్తి సామర్థ్యపు నీటి మట్టం నుంచి ఎటూ పది కిలోమీటర్ల పరిధిని ‘జీవ పరిరక్షణ ప్రాంతం’ (బయో కన్జర్వేషన్ జోన్)గా ప్రకటించి, నిషేధిత కార్యకలాపాలు నిర్వహించొద్దనటమే ఇందులోని విశేషం! ఈ జీవో ప్రకారం, పరిశ్రమలు ఏర్పాటు, భారీ నిర్మాణాల వంటి వ్యవసాయేతర కార్యకలాపాలకు అనుమతి లేదు. అయినా లెక్కకు మించి ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. పర్యావరణ హితం కోరే వాళ్లు సదరు యత్నాల్ని, చర్యల్ని వ్యతిరేకించి హరిత న్యాయస్థానం, సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జీవో వివాదం మలుపులు తిరిగి, రాజకీయంగా ముఖ్యాంశమై కూర్చుంది. తాగునీటి కోసమే కాదు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు దశాబ్దాలుగా జంటనగరాల దాహార్తిని తీరుస్తున్నా... వాటి నిర్మాణ లక్ష్యం కేవలం తాగునీరే కాదు. మూసీకి 1908లో వరద ఉధృతి వచ్చి హైదరాబాద్ నగరం అల్లకల్లోలమైంది. భారీ జన, ఆస్తినష్టం వాటిల్లింది. మూసీ ఒడ్డున, ప్రస్తుత ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలోని చింతచెట్టొకటి ఆ రోజున వంద మందికి పైగా ఆశ్రయమిచ్చి కాపాడిందని ప్రతీతి! అంతటి వరదతో కలత చెందిన నిజాం రాజు నాటి మేటి ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను సంప్రదించి, సలహా కోరారు. మూసీ, ఈస ఉపనదులపై జలాశయాలు నిర్మించి, తద్వారా నగరానికి వరద ప్రమాదాన్ని నివారించడమే కాక పైపుల ద్వారా తాగునీటిని పౌరులకు ఖర్చు లేకుండా, భూమ్యాకర్షణతో అందించొచ్చని ప్రణాళిక ఇచ్చారు. ఆ మేరకు 1920లో ఉస్మాన్ సాగర్, 1927లో హిమాయత్ సాగర్ వినియోగంలోకి వచ్చాయి. తాగునీటికి 80ల వరకు ఇవే పెద్దదిక్కు! మంజీరా, కృష్ణా, గోదావరి నుంచి తరలింపులు మొదలయ్యాక వీటి వాటా తగ్గింది. ఏ నదీ జలాలతో పోల్చినా... ఇవే రుచికరం, చౌక! ఇవి అవసరమే లేదనే మాట ఇప్పుడొస్తోంది. కానీ, పర్యావరణ పరంగా నగరాల్లో 25 నుంచి 29 శాతం భూభాగం నీరు, హరితంతో కూడి ఉండాలి. మిషన్ కాకతీయతో ఒక వైపు చెరువులు, కుంటల్ని పునరుద్ధరిస్తూ... ఇంకొక వైపు ఇంత ముఖ్యమైన జలాశయాలతో పనిలేదనడం సరికాదు. జీవో 111 ఎత్తివేసి, నిషేధాల్ని తొలగిస్తే పరిశ్రమలు, భారీ నిర్మాణాలు, వ్యర్థ జలాలు, కాలుష్యాలతో రెండు జలాశయాలు క్రమంగా అంతరించే ప్రమాదముంది. అదే జరిగితే, గాలిలో తేమ శాతం తగ్గి, నగరంపైకి వేడిగాలుల ప్రభావం, వేసవిలో మరణాల సంఖ్య పెరుగుతుంది, గొప్ప సహజ వాటర్షెడ్స్గా ఉన్న జలాశయాలు అంతరిస్తే భూగర్భజల మట్టాలు దారుణంగా పడిపోతాయి. జీవో ఉన్నా ఉల్లంఘనలు జలాశయాల రక్షణ దిశలో 111 తొలి జీవో కాదూ, చివరిదీ కాదు. జల సంరక్షణ కోసం 1989 జనవరిలో జీవో 50 తెచ్చారు. పారిశ్రామిక కాలుష్యాల నుంచి రక్షణకు 1994లో జీవో 192 వచ్చింది. 2009 (జీవో 1113), 2011 (జీవో 293) లోనూ వచ్చిన పలు జీవోలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ జలాశయాలతో పాటు పరీవాహక ప్రాంతం, అక్కడి జీవావరణ రక్షణకు ఉద్దేశించినవే! కానీ, నిబంధనల్ని ఉల్లంఘిస్తూ నీటి సహజ ప్రవాహాల్ని అడ్డుకున్నారు, 25,000 అక్రమ నిర్మాణాల్ని గుర్తించినట్టు కలెక్టరే రెండేళ్ల కింద ప్రకటించారు. వికారాబాద్‌లో వర్షం కురిసినా చెరువులకు నీరు రాని పరిస్థితి నేడు నెలకొంది. విద్యా సంస్థలు, గేటెడ్ కమ్యూనిటీలు, బహుళ అంతస్తు భవనాలు, రిసార్టులు, ఇతరేతర కార్యక్రమాలు పెరిగాయి. భూవినియోగ స్థితిని మార్చకున్నా భూబదలాయింపులు యధేచ్ఛగా సాగుతున్నాయి. ఠాకూర్ రాజ్‌కుమార్‌సింగ్, ప్రొ. ఎమ్వీరావ్ వంటి వారు న్యాయస్థానాల్ని సంప్రదించారు. జీవోను ఎత్తివేయడమో, సడలింపో చేయొద్దనీ, జీవోలోని విధానాలనే కాక స్ఫూర్తినీ కాపాడాలనీ సుప్రీంకోర్టు చెప్పింది. ఒక నిపుణుల కమిటీ గురించి ప్రభుత్వం చెప్పినపుడు, సరే అంటూ, యధాతథ స్థితి కొనసాగించా లని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించింది. ఎవరైనా ప్రకటనే ఆశిస్తున్నారా ? ‘వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ రాజేంద్రసింగ్ అన్నట్టు, ఒకవైపు నివేదిక రావాలంటూనే... మరోవైపు ఏకపక్షంగా జీవో ఎత్తివేస్తామంటే, ఎత్తివేయడానికి అనుకూలంగా నివేదిక తెప్పించుకుంటారా? అన్న సందేహాలు సహజం. ఇంతకీ జీవో ఎత్తివేయాలని కోరుతున్నదెవరు? పొరుగువారి కన్నా అభివృద్ధిలో వెనుకబడి పోతున్నామనే ఆందోళనలో ఉన్న జీవో పరిధి స్థానికులు. ఏడు (శంషాబాద్, మొయినాబాద్, రాజేంద్రనగర్, షాబాద్, శంకర్పల్లి, చేవెళ్ల, కొత్తూరు) మండలాల్లోని 84కు గానూ చాలా గ్రామాల్లో పాలకమండళ్లు జీవో ఎత్తేయమని ఏకగ్రీవంగా తీర్మానాలు చేశాయి. రియల్ ఎస్టేట్ లాబీ, పారిశ్రామిక లాబీలు కూడా ప్రభుత్వంపై జీవో ఎత్తివేతకు ఒత్తిడి తెస్తున్నట్టు వార్తా కథనాలు వస్తున్నాయి. మరోవైపు జీవో ఉనికితో నిమిత్తం లేకుండా వేల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి. చుట్టు పక్కల ఎకరం రెండు, మూడు కోట్ల నుంచి యాభై కోట్ల రూపాయల వరకు (ఇటీవల ప్రభుత్వ వేలంలో పలికిన ధరల ప్రకారమే) వెళ్లాయి. నిషేధాజ్ఞలు ఎత్తేస్తే ఈ జోన్‌లోని భూముల ధరలు కూడా అసాధారణంగా పెరుగుతాయి. ఎన్జీటీ, సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న అంశంగా జీవో ఎత్తివేత అంత తేలికయిన వ్యవహారమేం కాదు. ఈ పరిస్థితుల్లో జీవో తొలగకపోయినా... ఇదుగో ఎత్తివేస్తున్నారు అన్న వాతావరణం చాలు అనుకునే భూదందాల వాళ్లూ ఉంటారు. అందరి ప్రయోజనాలూ ముఖ్యమే! సర్కార్లకు చిత్తశుద్ధి ఉంటే 111 జీవోనే కానక్కర్లేదు, ఎప్పట్నుంచో ఉన్న ‘వాటర్ యాక్ట్’ని వాడి కూడా జలాశయాల్నీ, జీవావరణాన్నీ, జీవ వైవిధ్యాన్నీ కాపాడొచ్చు అనే వారూ ఉన్నారు. ఈ వివాదాలు, ఉల్లంఘనలు, జీవో ఎత్తివేత యత్నాలు... తెలుగుదేశం, కాంగ్రెస్, తెరాస వరుస ప్రభుత్వాల కాలంలోనూ ఉన్నాయి. జీవో ఉంచాల్సిందేనని న్యాయస్థానాలు చెబితే నిష్కర్షగా ఉల్లంఘనల్ని అరికట్టాలి. జీవోని ఉంచే, తగు రీతిన సవరించే పక్షంలో... నిర్దిష్ట చర్యలు తప్పనిసరి. ఎవరెవరి అజమాయిషీలో ఎన్నెన్ని భూములు న్నాయి? వాటి వినియోగపు హక్కులేంటి? ఇప్పటివరకు జరిగిన అక్రమాలపై ఏం చర్య తీసుకుంటారు? రైతులు ఎందరు, వారి వద్ద ఎంత భూమి ఉంది? వంటి వాస్తవిక లెక్కలతో శ్వేతపత్రం విడుదల చేయాలి. కాలుష్య కారకం కాని విధంగా సహజ వ్యవసాయాన్ని, తగిన సహాయాన్ని ప్రభుత్వం కల్పించాలి. జోన్ పరిధి గ్రామాల్లో భూమి లేని నిరుపేదలెవరో గుర్తించి, వారి కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలి. ఇవేవి చేయకుంటే... పర్యావరణ హితాన్ని పణంగా పెట్టి, సర్కారే భూముల విలువ పెంచేందుకు మనుషుల విలువ తగ్గించినట్టే లెక్క! దిలీప్ రెడ్డి వ్యాసకర్త సీనియర్ పాత్రికేయుడు -
మనమే రాస్తున్న మరణ శాసనం
భవిష్యత్ తరాల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకుని, ప్రస్తుత తరాలు ప్రకృతి వనరులను సమర్థంగా వినియోగించుకున్నప్పుడే అది సుస్థిరాభివృద్ధి అవుతుంది. కానీ అలా చేస్తున్నామా? భూతాపోన్నతిని అనుకున్నట్టుగా రెండు డిగ్రీల లోపు నియంత్రించకపోతే, మూడో వంతు జీవరాశి అంతమయ్యే ప్రమాదముంది. ఐక్యరాజ్యసమితి ‘పర్యావరణ మార్పు’పై ఏర్పరచిన అంతర్ ప్రభుత్వాల బృందం (ఐపీసీసీ) నివేదిక కూడా ఇదే నిజాన్ని మరోమారు నొక్కి చెప్పింది. అయినా మన ప్రభుత్వాలు నిష్క్రియాపరత్వం వీడటం లేదు. ఈ నివేదిక సిఫారసుల్ని పాటించే సంకల్పం తీసుకోవడానికి ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ కొత్త సమీకృత హరిత అజెండాతో ముందుకు రావాలి. ప్రతి పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇది అజెండా కావాలి. పరిశోధన పత్రాలు పనికిరావు... అధ్యయన నివేదికలు ఆలోచనకు ఆనవు... శాస్త్రవేత్తల హెచ్చరికలు నెత్తికెక్కవు... మరెప్పుడు మేల్కొనేది? ఇంకెప్పుడు ముంచుకొస్తున్న పర్యావరణ ముప్పు నుంచి మనల్ని మనం కాపాడు కునేది? ఇది ఇప్పుడు భారత పౌరసమాజం ముందున్న కోటి రూకల ప్రశ్న. సరైన సమయంలో తగు రీతిన స్పందించని నిష్క్రియాపర త్వమే సమస్యను మరింత జటిలం చేస్తోందని పలు అధ్యయన నివేది కలు తరచూ చెబుతున్నాయి! అసలు సమస్యకు పెరుగుతున్న భూతా పోన్నతి మూల కారణమైతే, ఎన్నో హెచ్చరికల తర్వాత కూడా కద లని మన ప్రభుత్వాల వైఖరే సమస్యను మరింత తీవ్రం చేస్తోంది. ఐక్యరాజ్యసమితి ‘పర్యావరణ మార్పు’పై ఏర్పరచిన అంతర్ ప్రభు త్వాల బృందం (ఐపీసీసీ) నివేదిక కూడా ఇదే నిజాన్ని మరోమారు నొక్కి చెప్పింది. ఐపీసీసీ ఆరో అంచనా నివేదికలో భాగంగా ‘వర్కింగ్ గ్రూప్’ ఇచ్చిన 2022 తాజా (రెండో భాగం) నివేదిక ఎన్నో హెచ్చరికలు చేస్తోంది. గత సంవత్సరం విడుదల చేసిన నివేదిక (తొలి భాగం) లోనే, అంచనాలకు మించిన వేగంతో వాతావరణ సంక్షోభం ముంచుకువస్తోందని హెచ్చరించిన ఈ బృందం, ప్రమాదం మరింత బహుముఖీనంగా ఉందని తాజా నివేదికలో గణాంకాలతో సహా వివరించింది. భూగ్రహం మొత్తానికి సంబంధించిన సమస్యను నివేదికలో పేర్కొన్నా... ఆసియా ఖండానికి సంబంధించి, ముఖ్యంగా భారత్‌కు వర్తించే హెచ్చరికలు ఈ నివేదికలో తీవ్రంగా ఉన్నాయి. అయినా దీనికి సంబంధించిన కీలక చర్చ ఎక్కడా జరగటం లేదు. భారత్‌కే హెచ్చు ప్రమాదం హిమాలయాల దిగువన, మూడు సముద్రాల మధ్యనున్న ద్వీప కల్పమవడంతో వాతావరణ మార్పు ప్రతికూల ప్రభావం భారత్‌పైన ఎక్కువగా ఉన్నట్టు స్పష్టమౌతోంది. హెచ్చు తేమ, వేడి వల్ల తలెత్తే దుష్పరిణామాలు (వెట్ బల్బ్ సిండ్రోమ్), నగర, పట్టణ ప్రాంతాల్లో తీవ్రంగా ఉంటాయని తాజా నివేదిక నిర్దిష్టంగా పేర్కొంది. అహ్మదా బాద్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించినప్పటికీ హైదరాబాద్‌తో సహా చాలా మెట్రో నగరాలదీ ఇదే దుఃస్థితి! ఫలితంగా వడదెబ్బ మరణాలు మితిమీరతాయి. మిగతా సముద్రాల కన్నా హిందూ మహాసముద్రం వేగంగా వేడెక్కుతోందని ఐపీసీసీ ఆరో నివేదిక తొలిభాగంలోనే పేర్కొన్నారు. దాంతో సముద్ర గాలులు పెరిగి, దక్షిణాసియా దేశాల్లో ముఖ్యంగా భారత్‌లో తుపాన్లు, వర్షాలు, వరదలు, కరవులు సాధా రణం కన్నా ఎక్కువవుతాయని నివేదించారు. నివేదిక తొలి భాగం ప్రధానంగా ‘వాతావరణ మార్పు’ తాలూకు శాస్త్ర, సాంకేతిక, సామా జికార్థికాంశాలతో ఉంది. రెండో భాగం ముఖ్యంగా ‘వాతావరణ మార్పు ప్రభావాలు, సర్దుబాటు (అడాప్టేషన్), ప్రమాద ఆస్కారం’ కోణంలో విషయాలను నివేదించింది. వచ్చే ఏప్రిల్‌లో రానున్న మూడో భాగం ఏ రకమైన దిద్దుబాటు (మిటిగేషన్) చర్యలు అవసర మౌతాయో స్పష్టం చేస్తుంది. దీంతో, ఐపీసీసీ ఆరో అంచనా నివేదిక పూర్తవుతుంది. భూతాపోన్నతి వల్ల పుడమి ధ్రువాల్లోనే కాకుండా మన హిమాలయాల్లో ఉన్న మంచు అసాధారణంగా కరిగి కింద ఉండే భూభాగాల్లోనూ, నదుల పైనా ఒత్తిడి పెరుగుతుంది. అముదర్య (మధ్యాసియా నది), సింధు, గంగ, బ్రహ్మపుత్ర నదీ లోయ ప్రాంతాల్లో వరదలు పెరిగి తీవ్ర ప్రతికూల పరిణామాలుంటాయని నివేదిక చెబుతోంది. ‘వెట్ బల్బ్ టెంపరేచర్’ (అంటే, గాలిలో తేమ శాతం అసాధారణంగా పెరిగినపుడు 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కూడా తీవ్రంగా ఉంటుంది; 30–35 డిగ్రీల మధ్య వేడి అత్యంత ప్రమాదకారి) ఇప్పటికే 30 డిగ్రీలను దాటుతున్నట్టు నివేదిక చెబు తోంది. మనది స్థూలంగా వ్యవసాయాధారిత జీవనం, ఆర్థిక వ్యవస్థ అయినందున వాతావరణ ప్రతికూల పరిస్థితులు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయనేది నివేదిక సారాంశం. సాధారణ జీవనంతో పాటు వ్యవసాయం, ఆహారోత్పత్తి, పంపిణీ వంటివి తీవ్రంగా ప్రభావితం అవుతాయి. ఐపీసీసీ ఛైర్మన్ హీసంగ్ లీ చెప్పినట్టు ‘నష్ట నివారణ, దిద్దుబాటు, సర్దుబాటు చర్యల తర్వాత కూడా 300 నుంచి 350 కోట్ల మంది విశ్వజనుల జీవితాలపై ప్రతికూల ప్రభావం ఉండేటప్పుడు... స్థానికంగా ఎక్కడికక్కడ ప్రభుత్వాల నిష్క్రియాపరత్వం చేసే నష్టం మరింత అపారం’ అన్నది కఠోరసత్యం! ‘కోడ్ రెడ్’ కన్నా తీవ్రం విశ్వవ్యాప్తంగా వచ్చే రెండు దశాబ్దాలు తీవ్రమైన వాతావరణ ప్రతికూల పరిస్థితుల్ని జీవరాశి ఎదుర్కోవాల్సి వస్తుందని ఐపీసీసీ నివేదిక చెబుతోంది. ఆరో అంచనా నివేదిక తొలిభాగంలోనే, ఇది మానవాళికి తీవ్రమైన ‘కోడ్ రెడ్’ ప్రమాదమని హెచ్చరించిన అధ్య యన బృందం, పరిస్థితులు మరింత తీవ్రంగా ఉండబోతున్నాయని తాజా నివేదికలో చెప్పింది. ప్రపంచ స్థాయిలో సత్వర నివారణ, దిద్దుబాటు, సర్దుబాటు చర్యలు చేపట్టకపోతే ‘జీవయోగ్య, నిలకడైన భవితను పరిరక్షించుకునే అవకాశాన్ని మనం చేజేతులా జారవిడుచు కున్న వారమవుతాం’ అని హెచ్చరిస్తోంది. ప్రధానంగా అరడజను అంశాల్లో పరిస్థితులు విషమించే ఆస్కారాన్ని నొక్కి చెప్పింది. 1. మితిమీరిన కర్బన ఉద్గారాల వల్ల భూతాపోన్నతి పెరిగి జీవన పరిస్థితులు సంక్లిష్టమౌతాయి. వెట్ బల్బ్ సిండ్రోమ్‌తో, ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలు దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కొం టాయి. అసాధారణ సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటాయి. 2. పెరిగే తుపాన్లు, అతి వర్షాలు, వరదలు, కరవులు వంటి అతివృష్టి, అనా వృష్టి పరిణామాల కారణంగా ఆహారోత్పత్తి రమారమి తగ్గిపోతుంది. 2050 నాటికి భారత్‌లో 40 శాతం జనాభా నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది. తిండి గింజలు ఖరీదై పెద్ద సంఖ్యలో పేదలు తిండి కోసం అల్లాడుతారు. పిల్లల ఎదుగుదలపై పౌష్టికాహార లోపం ప్రతికూల ప్రభావం చూపుతుంది. 3. భూతాపోన్నతి వల్ల ధ్రువాల మంచు కరిగి, సముద్ర జల మట్టాలు 44–76 సెం.మీ. పెరగటం వల్ల దీవులు, తీర నగరాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటాయి. ప్యారిస్‌లో చేసిన ప్రతిజ్ఞలకు ప్రపంచ దేశాలు కట్టుబడ్డా ఈ దుఃస్థితి తప్పదు. ఉద్గారాల్ని ఇంకా వేగంగా నియంత్రించగలిగితే... సముద్ర జల మట్టాల పెరుగుదలను 28–55 సెం.మీ. మేర నిలువరించవచ్చు. తీరనగరాల మునక, నగరాల్లో వరద సంక్షోభం, భూక్షయం, తీరాలు ఉప్పుగా మారి వ్యవసాయ అయోగ్యత వంటి వాటిని కొంతలో కొంత అదుపు చేయొచ్చు, 4. అతి వేడి, వడగాలులు, అసాధారణ వాతా వరణ పరిస్థితుల వల్ల జబ్బులు పెరిగి అనారోగ్యం తాండవిస్తుంది. శ్వాస, రక్తప్రసరణ, చర్మ సంబంధ రోగాలతో పాటు మధుమేహం వంటివి అధికమౌతాయి. 5. సీసీ (క్లైమేట్ ఛేంజ్)తో విద్యుత్తు వంటి ఇంధన వినియోగంలో అసాధారణ మార్పులు వస్తాయి. 6. అటవీ, సముద్ర తదితర అన్ని రకాల జీవావరణాలు (ఎకోసిస్టమ్స్) దెబ్బతిని జీవవైవిధ్యం అంతరిస్తుంది. భూతాపోన్నతిని అనుకున్నట్టు 2 డిగ్రీల కన్నా లోపు నియంత్రించకపోతే, మూడో వంతు జీవరాశి అంత మయ్యే ప్రమాదముంది. సానుకూల మార్పే నిర్ణాయక శక్తి అభివృద్ధి నిర్వచనంతో పాటు సమకాలీన రాజకీయాల దశ, దిశ మారాల్సిన అవసరం ఎంతో ఉంది. ఐరాస నిర్వచించినట్టు సుస్థిరా భివృద్ధి అంటే, ‘భవిష్యత్తరాల ప్రయోజనాల్నీ పరిగణనలోకి తీసు కొని, వాటిని పరిరక్షిస్తూ... ప్రస్తుత తరాలు తమ అవసరాల్ని తీర్చు కునేలా ప్రకృతి వనరుల్ని సమర్థంగా వినియోగించుకోవడం’. ఐపీసీసీ వంటి ముఖ్యనివేదికల సిఫారసుల్ని పాటించే సంకల్పం తీసుకోవ డానికి ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ కొత్త సమీకృత హరిత అజెండాతో రావాలి. ప్రతి పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇది అజెండా కావాలి. సంబంధిత వర్గాలన్నీ సత్వరం నడుం కడితే తప్ప జీవరాశి మనుగడకు భరోసా లేదు. ఇదే మనందరి తక్షణ కర్తవ్యం. వ్యాసకర్త: దిలీప్ రెడ్డి సీనియర్ పాత్రికేయులు -
కనురెప్పే కాటేస్తే... కన్నుకేది రక్ష?
కిందటి వారాంతంలో సాయుధబలగాలు నాగాలాండ్‌లోని ఓ మారుమూల సరిహద్దులో పదమూడు మంది గనికూలీలను ‘గుర్తెరుగక’ కాల్చి చంపిన దుర్ఘటన తాలూకు విషాదమింకా తాండవిస్తూనే ఉంది. ఎడతెగని దుఃఖం నుంచి పుట్టిన నిరసన క్రమంగా విస్తరిస్తోంది. మనిషి పచ్చి రక్తం మరోమారు నేలను తడిపాక... సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం మరోసారి చర్చకు వస్తోంది. ‘దేశ పౌరులపై చర్యలకు తలపడేటప్పుడు సాయుధ బల గాలు సంయమనం, కనీస బలప్రయోగం అనే సూత్రాలకు కట్టుబడి, జాగ్రత్తపడాలి’ అని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం (1997) చెప్పింది. సుప్రీం కోర్టు, ఈశాన్య ప్రాంత ప్రజలు, అక్కడి ముఖ్యమంత్రులు సైతం నిరంకుశ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. మరెప్పుడు రద్దు? ఢిల్లీ సరిహద్దుల్లో రైతు నాయకులు తమ నిరసన శిబిరాన్ని గురువారం ఎత్తివేస్తున్న సమయానికి నాగాలాండ్‌లోని ఓ మారుమూల సరిహద్దులో పరిస్థితి భిన్నంగా ఉంది. మయన్మార్‌తో సరిహద్దు కలిగిన మోన్ జిల్లా ఓటింగ్ పరిసరాల్లోనే కాక చుట్టుపక్కల గ్రామాల్లో నల్ల జెండాలు దర్శనమిస్తున్నాయి. క్రిస్టమస్ కొనుగోళ్లతో సందడిగా ఉండాల్సిన దుకాణాలపైన, దారి పొడుగు స్థంబాలపైన, వాహనాలపైన నల్లజెండాలు ఎగురవేస్తూ స్థానికులు నిరసన చెబుతున్నారు. కిందటి వారాంతంలో సాయుధ బలగాలు పదమూడు మంది గనికూలీలను ‘గుర్తెరుగక’ కాల్చి చంపిన దుర్ఘటన తాలూకు విషాధమింకా తాండవిస్తూనే ఉంది. ఎడతెగని దుఃఖం నుంచి పుట్టిన నిరసన క్రమంగా విస్తరిస్తోంది. సైనికులతో సహా ఎవరినీ తమ ప్రాంతంలోకి ఓటింగ్ గ్రామస్తులు ఇపుడు అను మతించడం లేదు. కేంద్ర గృహమంత్రి అమిత్‌షా పార్లమెంటులో చేసిన ప్రకటనను ‘నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్’ (ఎన్ఎస్సీఎన్) ఖండిస్తూ తీవ్రంగా ద్వజమెత్తింది. రక్షణ బలగాలకు విశృంఖల స్వేచ్చ, అధికారం కల్పిస్తున్న ‘సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాల) చట్టం–ఏఎఫ్ఎస్పీయే’ ఒక నల్లచట్టమంటూ, వ్యతిరే కంగా ప్రకటన జారీ చేసింది. ఆ చట్టం ఎత్తివేయకుండా, ఏ రాజకీయ ప్రక్రియనూ సాగనివ్వబోమని తేల్చి చెప్పింది. పలు నాగా తిరుగు బాటు సంస్థల్ని ఒప్పించి, కేంద్ర ప్రభుత్వం కొంత కాలంగా నిర్వ హిస్తున్న శాంతి ప్రక్రియపై తాజా పరిణామాలు ఏ మేరకు ప్రభావం చూపిస్తాయన్నది వేచి చూడాల్సిందే! కానీ, ఇదంతా దేశపు ఈశాన్యం లోని ఓ మారుమూలలో జరుగుతున్న చిన్నపాటి ‘కుంపటి రగలడం’ మాత్రమే! దినకూలీతో బతికే సామాన్యుల్ని, కర్కషంగా సాయుధ బలగాలు నలిపేసిన ఓ దుర్ఘటనపై దేశం తగు రీతిలో స్పందించలేదనే భావన వ్యక్తమౌతోంది. అంతర్జాతీయంగా... మానవహక్కుల పరి రక్షణ సూచీలో మనది ఎప్పుడూ నేల చూపే! తాజా ఘటనతో సహా ‘సైనికులది తప్పే’ అని ఏలినవారు ముక్తసరిగా అంగీకరించినా... అటువంటి తప్పులు పునరావృతం కాకుండా తీసుకుంటున్న చర్య లేమీ లేవు. బలగాల అకృత్యాలను నిలువరించే కట్టుదిట్టమైన వ్యవస్థ ఏర్పడటం లేదని ఈశాన్య రాష్ట్రాల మానవహక్కుల కార్యకర్తలు, పౌర సంఘాల ప్రతినిధులు అంటున్నారు. పదమూడు నెలలకు పైబడి రైతాంగం, ఫలితం రాబట్టుకునే దాకా జరిపినట్టు పోరాటం అన్ని సందర్భాల్లో, అందరివల్లా అవుతుందా? పలు ఈశాన్య రాష్ట్రాల్లో దశా బ్దాలుగా పోరాడినా... ఒక నల్లచట్టాన్ని ప్రభుత్వాలు రద్దు చేయటం లేదనే ఆందోళన ఉంది. మనిషి పచ్చి రక్తం మరోమారు నేలను తడి పాక సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం మరోసారి చర్చకు వస్తోంది. మానవ తప్పిదమా, మానని జాడ్యమా? తప్పు చేసినా తప్పించుకోవచ్చు, శిక్ష ఏమీ ఉండదన్న ధీమాయే సాయుధ బలగాల దుశ్చర్యలకు కారణమని పలుమార్లు రుజువైంది. ఈ చట్టంలోనూ అటువంటి లొసుగులే ఉన్నాయి. చట్టం కల్పించిన అధికారం, చేతిలో ఆయుధం ఇచ్చే బలం ఉన్నాయని అక్కడక్కడ రక్షణ బలగాలు చేసే ఆగడాలను ఉపేక్షించడం తప్పు. ఇలాంటి దుర్ఘటనల వల్ల ప్రభుత్వానికి అపకీర్తి వస్తుందని, పాలకులు సదరు ఆగడాలను వెనుకేసుకొస్తున్నారు. అతకని వాదనల్ని సమర్థిస్తూ మాట్లాడటం, చిన్న తప్పిదంగా కొట్టిపారవేసే వైఖరి మంచిది కాదు. దేశ సరిహద్దుల్లో, కల్లోలిత ప్రాంతాల్లో ఉగ్రమూకల తీవ్రవాదం, హింస, వి«ధ్వంస కార్యకలాపాలను నియంత్రించే క్రమంలో ఇటువం టివి మామూలే! అని బాధ్యత కలిగిన పౌరసమాజం కూడా సాధార ణీకరించడం దుర్మార్గం. ఎవరివైనా ప్రాణాలే! దేశవాసులకు తాము నిరంతర రక్షణ కల్పిస్తున్నామనే ‘త్యాగ భావన’ నీడలో... ఏ సామా న్యుల ప్రాణాలో నిర్హేతుకంగా తీసే హక్కు రక్షణ బలగాలకు ఉంటుందా? ఈ ప్రశ్న ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పలు తెగల గిరిజ నులు, ఆదివాసీలు, అల్ప సంఖ్యాకులు, విభిన్న జాతుల వారు తరచూ లేవనెత్తుతున్నారు. జాతుల సమస్య, అస్తిత్వ ఆరాటాలుండే నిత్య పోరాట నేలల్లో సామాన్యుల బతుకు సదా దర్బరమౌతోంది. బలగాల దీష్టీకాలకు అడ్డు–అదుపూ ఉండదు. కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా వీరిపై ఏ విచారణా జరుగదు. సాయుధబలగాలు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలపై అకృత్యాలు, అత్యాచారాలు, యువకుల్ని ఎత్తుకుపోవడం, ఎదురుకాల్పుల పేరిట మట్టుపెట్టడం... మానవ హక్కుల హననానికి ఎన్ని రూపాలో! వీటిని నిరసిస్తూ... హక్కుల కార్యకర్త – ఉక్కు మహిళ, ఇరోమ్ షర్మిల పద హారేళ్లు మౌన–నిరాహార దీక్ష చేసి ప్రపంచ దృష్టినాకర్శించినా మన ప్రభుత్వాలు కదల్లేదు, చట్టం రద్దవలేదు, ఫలితం శూన్యం! 2000–12 మధ్య ఒక్క మణిపూర్‌లో సాయుధబలగాలు జరిపిన 1528 ఎన్‌కౌం టర్ల పై సీబీఐ ప్రత్యేక దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదే శానికి ఇవాల్టికీ అతీ–గతీ లేదు. కట్టుకథలదే ‘రాజ్యం’! గత శని–ఆది వారాల దుర్ఘటనలు పుండైతే, మాన్పే ప్రయత్నం చేయక పోగా కేంద్రం వైఖరి దానిపై కారం రుద్దినట్టుందనే విమర్శ వస్తోంది. మూడు రోజుల తర్వాత నోరిప్పిన ఓటింగ్ గ్రామస్తులు చెప్పే విష యాలు గగుర్పాటు కలిగిస్తున్నాయి. కాల్పుల్లో మరణించిన గని కూలీల శవాలను పక్కకు తీసి, వారి చొక్కాలు విప్పి మిలిటెంట్ల గుడ్డలు, బూట్లు తొడిగి, వారి చేతుల్లో ఆయుధాలు పెట్టి... బమటి ప్రపంచానికి చూపే యత్నం చేశారని! తద్వారా తమ దాష్టీకానికి హేతుబద్ధత తెచ్చే ప్రయత్నంలో సాయుధబలగాలు గ్రామస్తులకు దొరికాయి. ఆగ్రహోదగ్రులైన గ్రామస్తులు ప్రతిదాడికి దిగారు. నిరసన చల్లార్చే క్రమంలో మరో ఏడుగురు గ్రామస్తుల్ని బలగాలు పొట్టన పెట్టుకున్నాయి. ట్రాలీ కూలీల్లో బతికిన∙షీవాంగ్ చెప్పడమేమిటంటే, సాయుధులు తమ వాహనాన్ని అడ్డుకోలేదు, ఆపమని అడగలేదు, అదుపులోకి తీసుకునే ఏ ప్రయత్నమూ చేయకుండానే నేరుగా కాల్పులు జరిపారని. మయన్మార్ సరిహద్దుల్లో మిలిటెంట్లు ఎకే–47 మారణాయుధాలు, మర తుపాకులు, గ్రెనేడ్ల అక్రమ రవాణాకు పాల్ప డుతున్నట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చింది అనేది ‘21 పారా స్పెషల్ ఫోర్స్’ బృంద కథనం! సరే, వాదన కోసమైనా, ‘వారు చెప్పేది’ కాసేపు నిజమనుకుందాం, ఈ విషయం స్థానిక పోలీసులకు, అస్సాం రైఫిల్స్‌కి ఎందుకు చెప్పలేదు? దారికాచి వాహనాన్ని అడ్డ గించే ప్రయత్నమో, టైర్లనో, ఇంజన్నో కాల్పులతో పనికి రాకుండా చేసి అనుమానితుల్ని నిర్బంధంలోకి తీసుకోవడమో, బలవంతపు లొంగుబాట్లకో ఎందుకు యత్నించలేదు? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి. అసలక్కడ కవ్వింపులే లేవు! వారు జరిపింది ఆత్మరక్షణ కాల్పులు కాదు, అణచివేసే అహంతోనో, అధికారాలున్నాయనే మిడి సిపాటో, ట్రిగ్గర్ మోజో... అయి ఉంటుందనేది విశ్లేషణ! వదలని వలసవాద మూలాలు ఎన్ని కమిటీలు? ఎన్ని అధ్యయనాలు? ఎన్నెన్ని నివేధికలున్నా.... చట్టంపై పునరాలోచనే లేదు. 1958 సాయుధ బలగాల ప్రత్యేక అధి కారాల చట్టమైనా,1972 కల్లోలిత ప్రాంతాల చట్టమైనా... వీటి మూలాలు బ్రిటిష్ వాలసపాలకులు, 1942లో ‘క్విట్ ఇండియా’ ఉద్య మాన్ని అణచివేసేందుకు తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌లో ఉన్నాయి. సర్వ సత్తాక సార్వభౌమ దేశానికి అవి పొసగేవి కావు. ‘దేశ పౌరులపై చర్య లకు తలపడేప్పుడు సాయుధ బలగాలు సంయమనం, కనీస బల ప్రయోగం అనే సూత్రాలకు కట్టుబడి, జాగ్రత్తపడాలి’ అని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం (1997) చెప్పింది. జస్టిస్ సంతోష్ హెగ్డే కమిషన్, జస్టిస్ జె.ఎస్.వర్మ కమిషన్ కూడా ఈ చట్టం వద్దనే సిఫారసు చేశాయి. ప్రస్తుతం నాగాలాండ్, మెఘాలయ ముఖ్యమం త్రులే కోరుతున్నారు. కేంద్రం 2004లో, జస్టిస్ జీవన్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, సమాచారం సేకరించి 2005లో ఇచ్చిన నివేదికలో ‘సత్వరమే ఈ చట్టాన్ని రద్దు చేయాలి’ అని నివేదించింది. మరెప్పుడు రద్దు? దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
మలి సమరం మొదలు!
ఏడాది పాటు ఆందోళనలతో అశాంతి రగిల్చిన ఉద్యమ కారణమైన చట్టాలు ఎలాగూ రద్దవుతున్నాయి. దేశ అధిక సంఖ్యాకులైన రైతాంగానికి, కేంద్రానికీ మధ్య పోరు ముగిసింది. ఇక, ఉభయత్రా అంగీకార సయోధ్య తక్షణావసరం. తీవ్రంగా నలుగుతున్న వ్యవసాయ రంగానికి తదుపరి చర్యలు ఊరట కలిగించాలి. రైతులు ఎదుర్కొంటున్న జటిల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు లభించాలి. కార్పొరేట్ శక్తులకు దన్నుగా కేంద్రం మూడు చట్టాల్ని తెచ్చిందని విమర్శిస్తున్న రైతు సంఘాలు, దేశవ్యాప్తంగా ఇప్పుడా విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోతామని చెబుతున్నాయి. తదుపరి చర్యలన్నీ రైతు హితంలోనే చేపట్టాలి. చట్టాల రద్దు... ప్రజాభిప్రాయాన్ని మన్నించే అయితే, వ్యవసాయ సంస్కరణలకు కూడా అదే రాచబాట! వ్యవసాయ రంగానికి ఊరట!! మూడు చట్టాల రద్దు, దీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న వ్యవసాయ సంస్కరణల్ని వెనక్కి నెట్టినట్టా? ఇదేం అవాంతరం కాదా? ఇప్పుడిదొక చర్చనీయాంశం. దేశ రైతుల్ని ఉద్ధరించే సంస్కరణల బాటలో పెద్ద ముందడుగు అని చెప్పిన చట్టాల్ని ఉపసంహరించే ప్రక్రియ కేంద్రం ప్రారంభించింది. ప్రధాని ప్రకటన బాటలోనే బిల్లు ప్రతిపాదనల్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. రేపు పార్లమెంటు సమావేశాల్లో రద్దు బిల్లును ఆమోదిస్తారు. తదుపరి ఏంటి? కోరినట్టే చట్టాల రద్దు సాధించిన రైతు సంఘాలు తమ అసలు డిమాండ్‌తో స్వరం పెంచుతున్నాయి. వ్యవసాయోత్పత్తుల కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)కు చట్టబద్దత వచ్చే వరకు ఆందోళన విరమించమంటున్నారు. మార్కెట్ వ్యవస్థ బలోపేతం డిమాండ్ కూడా ఉంది. ఈ మేరకు 40 సంఘాలతో శనివారం ఢిల్లీలో సమావేశమై సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) తమ భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయనుంది. రైతాంగం కోరుతున్నట్టు చర్చల ప్రక్రియ చేపట్టాలా? కమిటీ ఏర్పాటు చేసి నివేదిక తెప్పించుకోవాలా? వేర్వేరు అవకాశాలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు లోతుగా ఆలోచిస్తున్నారు. ఏడాది పాటు ఆందోళనలతో అశాంతి రగిల్చిన ఉద్యమ కారణమైన చట్టాలు ఎలాగూ రద్దవుతున్నాయి. దేశ అధిక సంఖ్యాకులైన రైతాంగానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య పోరు ముగిసింది. ఇక, ఉభయత్రా అంగీకార సయోధ్య తక్షణావసరం. తీవ్రంగా నలుగుతున్న వ్యవసాయ రంగానికి తదుపరి చర్యలు ఊరట కలగించాలి. రైతులు ఎదుర్కొంటున్న జటిల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు లభించాలి. లాబీయింగ్‌లో సిద్ధహస్తులైన కార్పొరేట్లకు కాకుండా వ్యవసాయ సంస్కరణలు రైతుకు మేలు చేయాలి. విశాల ఆర్థిక సంస్కరణల్లో భాగమైన వ్యవసాయ సంస్కరణలే కాకుండా సంస్కరణల ప్రక్రియలోనూ మార్పు రావాలి. చట్టబద్ధతే కీలకం వ్యవసాయ సంస్కరణల్ని స్థూల దృష్టితో చూడాలి. ప్రభుత్వంతో పాటు రైతు నాయకులకు పట్టువిడుపులు అవసరం. ఉభయత్రా నిర్మాణాత్మక ప్రతిపాదనలు, ఆచరణాత్మక అంగీకారాలు కుదరాలి. తమ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర, దానికో చట్టబద్ధత కావాలని ఇప్పుడు రైతాంగం కోరుతోంది. మద్దతు ధర, మార్కెట్ వ్యవస్థా కొనసాగుతాయని, దానికి ప్రయివేటు కొనుగోలు వ్యవస్థ తోడవుతుందని ప్రభుత్వం చెబుతోంది. చట్టబద్ధత కల్పిండానికి కొన్ని ఇబ్బందులున్నాయనేది ప్రభుత్వ వాదన. ప్రపంచ వాణిజ్య సంఘం (డబ్లుటీవో) ఒప్పందాల రీత్యా అంతర్జాతీయ న్యాయ సూత్రాల వల్ల ఈ విషయంలో భిన్నమైన ఒత్తిళ్లున్నాయి. వారేమో, ఏ సబ్సిడీలైనా పది శాతాన్ని మించొద్దంటారు. అందుకు అంగీకరించకుండా, వాయిదాలు వేస్తూ వచ్చింది ఇదివరకటి యూపీఏ ప్రభుత్వం. స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టుబడులు, ఎగుమతి–దిగుమతుల వంటి అంశాల దృష్ట్యా ఈ అంకానికి తెర తీసే ఆలోచన ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం చేస్తోంది. కానీ, కనీస మద్దతు ధర ప్రకటనకు, ఖచ్చితమైన అమలుకు చట్టబద్ధత ఉంటేనే మేలని రైతాంగం కోరిక. దాంట్లోనూ లోపాలున్నాయి. కొన్ని (23) పంటలకే ఎమ్మెస్పీ ప్రకటన, రెండు పంటలకే ప్రభుత్వం ధాన్యం సేకరణ, దానికీ భరోసానిచ్చే స్థాయి మార్కెట్ వ్యవస్థ లేకపోవడం ప్రధాన సమస్యలు. చిరుధాన్యాలకూ ఎమ్మెస్పీ ఉండాలి, గణింపు శాస్త్రీయంగా జరగాలి, సగటు పద్ధతిన కేంద్ర స్థాయిలో కాకుండా.. పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకుంటూ రాష్ట్రాల వారీ ఎమ్మెస్పీ ఉండాలని రైతులు కోరుతున్నారు. పంజాబ్‌లో ఉన్నట్టు ప్రతి 25 చ.కి.మీ పరిధికి ఒక మార్కెట్ యార్డ్ ఉండాలనేది వారి వాదన. ఎమ్మెస్పీ ఉల్లంఘనలకు శిక్షలుండాలి. చట్టబద్ధతకు కొత్తగా కమిటీ వేసి కాలాయాపన చేయడంకన్నా, లోగడ ముఖ్యమంత్రుల బృందం ఇచ్చిన ప్రతిపాదన ఆమోదించాలని రైతు నేతలంటారు. మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉన్నపుడు నాటి గుజరాత్ ముఖ్యమంత్రి (ప్రస్తుత ప్రధాని) నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఈ బృందం ఎమ్మెస్పీ చట్ట ముసాయిదా ప్రతిపాదించింది. రెట్టింపు ఆదాయం ఎలా? వచ్చే జనవరి నాటికి రైతుకు రెట్టింపు ఆదాయం వచ్చేలా చేయడం లక్ష్యమని కేంద్రం ప్రకటించింది. ఆ దిశలో రైతు ఆదాయం పెరగపోగా పడిపోతోంది. మార్కెట్ మాయాజాలంలో పెనంలోంచి పొయ్యిలో పడ్డట్టుంది రైతు పరిస్థితి. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు లేక, నువ్వా–నేనా అనే కేంద్ర–రాష్ట్ర వివాదాల్లో రైతు నిత్యం నలుగుతున్నాడు. వాతావరణ మార్పు ప్రతికూల ప్రభావాలు కూడా వ్యవసాయంపై మొదలయ్యాయి. ఒక సర్వే (ఎస్యేఎస్) ప్రకారం కర్షక కుటుంబాల రోజువారీ సగటు సంపాదన రూ.277 (ఉపాధిహామీ దినకూలీ సమానం) గా తేలింది. దేశంలో సగానికి పైగా రాష్ట్రాల్లో రైతుల సగటు నెలసరి రాబడి రూ. 4–10 వేల మధ్య ఉంది. దేశంలో 80 శాతం సన్న చిన్నకారు రైతులే! ఆదాయం లేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. పిల్లల చదువులు, వైద్యం, పెళ్లిల్ల వ్యయాలు భరించలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రోజుకు సగటున 2000 మంది వ్యవసాయం నుంచి ఇతరేతర వృత్తులకు మళ్లుతున్నారు. ఎమ్మెస్పీనే కాక... భూమి, కూలీలు, పెట్టుబడి, విత్తనం, రుణం, వాతావరణం, ఉత్పత్తి, ధర, మార్కెట్... అన్నీ సమస్యలే! ఇంతటి దయనీయ స్థితిలో దేశానికి అన్నం పెట్టే రైతు కోలుకోలేకుండా ఉంటే, మన ఒప్పందాలు, సంస్కరణలు అతన్ని ఆదుకునేలా కాక మార్కెట్ శక్తులకు దన్నుగా ఉంటే ఎలా? అన్న ప్రశ్న రైతు ఆందోళనకు దేశవ్యాప్తంగా మద్దతు పెంచింది. రైతుల ఆర్థిక స్వేచ్ఛ కోరిన దివంగత శరద్ జోషి (శెట్కారీ సంఘటన్) తన పుస్తకంలో రెండు విలువైన మాటలు చెప్పారు. మార్కెట్‌తో ఒప్పందపు షరతులు రైతు పక్షంలో ఉండాలి. పట్టణ, పల్లె ఉత్పత్తులు–సేవల ధరల్లో సామ్యం పుండాలంటారు. రైతు ఆదాయాన్ని పెంచేలా కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దిష్ట చర్యలు చేపట్టాలి. దాదాపు ఏడువేల కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలతో పదివేల రైతు ఉత్పత్తి సంఘాల (ఎఫ్‌పీఓ) ఏర్పాటును కేంద్రం ప్రకటించింది. కానీ, కార్యాచరణలో చిత్తశుద్ధి లేదు. స్థానిక సహకార సంఘాల్ని ప్రోత్సహించాలి. వ్యవసాయోత్పత్తులు పెరిగిన చోట, ప్రభుత్వం చొరవతో.. విలువపెంచే ప్రక్రియను, అనుబంధ పరిశ్రమల్ని ప్రోత్సహించాలి. రైతు రాబడి పెంచాలి. నేలకిప్పుడు సాంత్వన కావాలి రైతాంగం సాగు పద్ధ తులు మార్చుకోవాలి. సాగు వ్యయాన్ని రమారమి తగ్గించుకొని, కనీస మద్దతు ధరపై ఆధారపడాల్సిన దుస్థితి లేకుండా చూసుకోవాలి. విష రసాయనాల వాడకం తగ్గించి క్రమంగా ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలి. ఫలితంగా రైతుపై ఒత్తిడి, ఘర్షణ తగ్గుతుంది. లాభసాటి ప్రకృతి సాగుతో పుడమి తల్లికి సాంత్వన కూర్చాలి. రసాయన ఎరువుల బదులు సేంద్రియ ఎరువులకు ప్రభుత్వం సబ్సిడీలివ్వాలి. రైతాంగం అదే డిమాండ్ చేయాలి. సంబంధీకులతో సంప్రదించకుండా, కార్పొరేట్ శక్తులకు దన్నుగా కేంద్రం మూడు చట్టాల్ని తెచ్చిందని విమర్శిస్తున్న రైతు సంఘాలు, దేశవ్యాప్తంగా ఇప్పుడా విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోతామని చెబుతున్నాయి. తదుపరి సంస్కరణల్ని రైతు హితంలోనే చేపట్టాలని ఇకపై కేంద్రంపై నిరంతర ఒత్తిడి ఉంటుంది. 1992 నుంచి వ్యవసాయ సంస్కరణలపై గొంతెత్తుతున్న ఉదారవాదులు, రైతుకు లభించే సంస్థాగత మద్దతుకు ఎసరు పెడుతున్నారు. 1960–80ల నడుమ ఈ మద్దతే వ్యవసాయాన్ని అదుకుంది. రాష్ట్రాల జాబితాలో ఉన్న వ్యవసాయ మార్కెట్ అంశాల్లోనూ జోక్యంతో ఏకపక్షంగా చట్టాలు తెచ్చి, సమాఖ్య స్ఫూర్తికి కేంద్రం భంగం కలిగించిందని విమర్శ ఉంది. ఆ మచ్చ తొలగించుకునేందుకైనా తదుపరి చర్యలన్నీ రైతు హితంలోనే చేపట్టాలి. చట్టాల రద్దు... ప్రజాభిప్రాయాన్ని మన్నించే అయితే, వ్యవసాయ సంస్కరణలకు కూడా అదే రాచబాట! వ్యవసాయ రంగానికి ఊరట!! దిలీప్ రెడ్డి -
పడవ మునిగితే... ఎవరం మిగలం!
వచ్చే ఆదివారం నుంచి 13 రోజులపాటు జరుగనున్న ఐక్యరాజ్యసమితి 26వ వాతావరణ మార్పు సదస్సు (కాప్–26) కీలక ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంది. వాతావరణంలోకి విడుదలవుతున్న అసాధారణ కర్బన ఉద్గారాలను నియంత్రించడం ద్వారా మాత్రమే వేడిని తగ్గించగలుగుతామని శాస్త్రవేత్తలు ఎప్పట్నుంచో చెబుతున్నా రాజకీయ వ్యవస్థే కదలటంలేదు! ప్రభుత్వాలు కార్పొరేట్లకు దన్నుగా ఉండేకన్నా పర్యావరణ పరిరక్షణకే కట్టు బడాలనే ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. భూమి మునిగిపోయే పడవ అనుకుంటే, మనం ఏ మూలన కూర్చున్నా... ఆ పడవే మునిగితే... ఎవరం మిగలం! లక్ష్యం పెద్దదిగా ఉంటే... ఫలితం ఆశించిన దానికి దగ్గరగా ఉండొచ్చు. లక్ష్యమే చిన్నదైతే సాధించేదీ పరిమితమే! పెద్ద లక్ష్యం వల్ల మహా అంటే, ఎక్కువ కష్టపడాల్సి రావొచ్చేమో? కానీ, ఆశించింది సాధిస్తే అంతకన్నా మేలేముంటుంది? ఈ సూత్రం, గ్లాస్గో (స్కాట్లాండ్)లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి (యూఎన్) 26వ వాతావరణ మార్పు సదస్సు (కాప్–26)కు వర్తించదా? వర్తింపజేస్తే, అందుకు ప్రపంచ దేశాలు, అదే భాగస్వాములు (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్–కాప్) సిద్ధమేనా? నిజానికి... ఆ సదస్సు ఏమి ఆశిస్తోంది? ఏమి సాధించనుంది? వచ్చే ఆదివారం నుంచి 13 రోజులు జరుగ నున్న సదస్సు ముందర ఇలాంటి ప్రశ్నలు చాలానే తలెత్తుతున్నాయి. కాలుష్యాల వల్ల పెరుగుతున్న భూతాపోన్నతిని నియంత్రించడం, తద్వారా వాతావరణ మార్పు దుష్ప్రభావాల్ని కట్టడి చేయడం సదస్సు ముందున్న ప్రధాన లక్ష్యం! వాతావరణ మార్పు విపరిణామాలు శాస్త్రీయ నివేదికలు, పరిశోధనా పత్రాల్లో కనిపించడమే కాకుండా... ప్రతి మనిషిని తాకుతున్నాయి. కొత్త రోగాలు, అడవుల దగ్ధం, తుఫాన్లు, అకాలవర్షాలు, వరదలు–కరువులు, ధ్రువమంచు కరగటం, సముద్రమట్టాలు పెరగటం వంటివన్నీ వాతావరణ మార్పువల్లే! దాంతో, మునుపెన్నడూ లేనంతగా మానవాళి చూపు ‘కాప్’ వైపు మళ్లింది. వాతావరణంలోకి విడుదలవుతున్న అసాధారణ కర్బన ఉద్గారాల (జిహెచ్జి)ను నియంత్రించడం ద్వారా మాత్రమే వేడిని తగ్గించగలుగుతామని ధ్రువపడింది. శాస్త్రవేత్తలు ఎప్పట్నుంచో చెబు తున్నా రాజకీయ వ్యవస్థే కదలలేదు! హామీలివ్వడం, ప్రమాణాలు చేయడం కాదు, చర్యలు కావాలనే ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. శతాబ్దాం తానికి (2100) ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్‌ను మించనీకుండా కట్టడి చేయాలని, 1.5 డిగ్రీలకన్నా తక్కువకే నిలువ రిస్తే మంచిదని ఆరేళ్ల కింద పారిస్‌లో (2015) భాగస్వామ్య దేశాలన్నీ ఒప్పందానికి వచ్చాయి. ఇది కూడా గొప్ప లక్ష్యమేం కాదని, కర్బన ఉద్గారాల తీవ్రత, భూమి వేడెక్కుతున్న వేగాన్ని బట్టి చూస్తే లక్ష్యాలే అరకొరగా ఉన్నాయి, వాటి సాధన కృషి మరింత నిస్సారమని ‘వాతావరణ మార్పుపై యూఎన్ ఏర్పరచిన అంతర్ప్రభుత్వాల బృందం’ (ఐపీసీసీ) తాజా నివేదిక చెప్పింది. దాంతో లక్ష్యాల్నే ఇంకాస్త పెద్దవిగా పెట్టుకొని, ఎక్కువ కష్టపడితే మేలనే అభిప్రాయం వ్యక్తమౌ తోంది. పారిశ్రామికీకరణ (1850–60) నాటి భూతాపం కన్నా పెరుగు దలను 2 డిగ్రీల దాకా అనుమతించే ఉదారవాదమో, 1.5 డిగ్రీలలోపే కట్టడి చేద్దామనే పరిమిత వాదమో ఎందుకు? పెరుగుదలను 1 డిగ్రీ మించనీకుండా కట్టడి చేద్దామనే కొత్త లక్ష్యాల ప్రతిపాదన వస్తోంది. ఆ మేర ఉద్గారాలను నియంత్రించాలని, సంపన్న దేశాలతో పాటు భాగ స్వాములంతా ముందుకు వచ్చి కార్యాచరణను వేగవంతం చేయాలని పౌరసమాజం కోరుతోంది. తాపోన్నతి కట్టడి సాధ్యమా? సగటు భూతాపోన్నతి ఇప్పటికే 1.12 డిగ్రీలు పెరిగింది. ఇదే పంథా సాగితే 2050 నాటికి 1.5 డిగ్రీలు దాటే ప్రమాదాన్ని శాస్త్రరంగం శంకిస్తోంది. ‘మా దేశం కట్టుబడ్డట్టు, మేమిది చేస్తాం’ (ఎన్డీసీ) అంటూ, భాగస్వాములు పారిస్‌లో పెద్ద హామీలే ఇచ్చారు. కానీ, కార్యాచరణకు మనస్ఫూర్తిగా పూనుకోలేదు. పెట్రోలియం, బొగ్గు వంటి శిలాజ ఇంధనాల వినియోగం నుంచి సౌర–పవన విద్యుత్తు వంటి పునర్వినియోగ ఇంధనాల (ఆర్ఈ) వైపు దారి మళ్లాలి. ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలి. ఎక్కడా అది ఆశించిన స్థాయిలో జరగటం లేదు. 194లో 113 దేశాలు, యూఎన్‌కు ఇచ్చిన ఎన్డీసీ నివేదికల సార మేమంటే, 2010 స్థాయిపై 2030 నాటికి కర్బన ఉద్గారాలు తగ్గకపోగా 16.3 శాతం పెరిగే ఆస్కారముంది. ఐపీసీసీ నివేదిక ప్రకారం 2010 నాటి స్థాయిపైన 2030 నాటికి, ఉద్గారాలను 45 శాతం తగ్గించగలిగి తేనే... భూతాపోన్నతి పెరుగుదలను 1.5 డిగ్రీలకు నిలువరించగలం. హామీలకు–ఆచరణకు ఇంత వ్యత్యాసం ఉన్నపుడు, పెరుగుదల 2 డిగ్రీలకు కట్టడిచేస్తే చాలనే చిన్న లక్ష్యం వల్ల ప్రయోజనం లేదని, 1 డిగ్రీకి మించనీయవద్దనే పెద్ద లక్ష్యంతోనే ఎంతో కొంత సాధించగల మనేది తాజా ఒత్తిడి! ప్రపంచవ్యాప్తంగా సగటున ఏటా 3400 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ (సీవో2)ను వాతావరణంలోకి వదులు తున్నాం. 2030ని మైలురాయిగా పెట్టుకొని, ఉద్గారాలను తగ్గించే చర్యలు చేపడితేనే కట్టడి సాధ్యం. గాలిలోకి వదిలే సీవో2ను, 2005 స్థాయి నుంచి 2030 నాటికి, 33–35 శాతం తగ్గిస్తామన్నది పారిస్‌లో మన హామీ! వీటిని మార్చుకొని, విడుదలను అంతకన్నా ఎక్కువ శాతాల్లోనే నియంత్రిస్తామని కొత్త లక్ష్యాలు పెట్టుకోవాలి. ఉద్గారాల ‘శూన్య స్థితి’కి సిద్ధపడని భారత్! సీవో2 వంటి వాయువుల్ని మానవ ప్రమేయం తర్వాత కూడా, వాతా వరణంలో సహజ స్థాయికి పరిమితం చేయడాన్ని ఉద్గారాల ‘శూన్య స్థితి’ అంటారు. శిలాజ ఇంధనాల నుంచి ఆర్ఈ వెపు మళ్లడం ద్వారా ఎప్పటి వరకు ఆ శూన్యస్థితిని సాధిస్తారో ఆయా దేశాలు నిర్దిష్టంగా హామీ ఇస్తున్నాయి. 2050 నాటికని అమెరికా, ఐరోపా సంఘం హామీ ఇస్తే, 2060 నాటికి అని చైనా చెప్పింది. ఆస్ట్రేలియా ఇటీవలే తన గడువు ప్రకటించడంతో ఇక భారత్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ప్రపంచ సగటు (6.5 టన్నుల) కన్నా భారత్ తలసరి సీవో2 విడుదల (2.5 టన్నులు) చాలా తక్కువ! భారత్ తలసరి విడుదల కన్నా అమెరికా ఏడున్నర రెట్లు, చైనా మూడున్నర రెట్లు, ఐరోపా సంఘం మూడు రెట్లు అధిక తలసరి విడుదల నమోదు చేస్తున్నాయి. అయినా, భారత్ శూన్యస్థితికి హామీ ఇవ్వటం లేదు. ఎప్పట్నుంచో సహజ వనరుల్ని మితిమీరి వాడుకుంటూ, వాతావరణ కాలుష్యానికి కారకులైన అభి వృద్ధి చెందిన దేశాలు (కాలుష్య కారకులే!) మూల్యం చెల్లించాలని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సహాయం, సాంకేతిక బద లాయింపు చేయాలని కోరుతోంది. 2009 (కొపెన్ హెగెన్)లో హామీ ఇచ్చినట్టు, ఏటా పదివేల కోట్ల డాలర్ల సహాయం ద్వారా ‘వాతావరణ ఆర్థికాంశా’ నికి కట్టుబడాలని ఒత్తిడి తెస్తోంది. ఈ ‘పర్యావరణ న్యాయం’ జరిగే వరకు కర్బన ఉద్గారాల ‘శూన్యస్థితి’పై ప్రకటనకు భారత్ సిద్ధంగా లేదు. శిలాజ ఇంధనాల నుంచి ఆర్ఈ వైపు క్రమంగా మళ్లుతున్నట్టు మనమొక చిత్రం చూపిస్తున్నాం. సౌర, పవన, చిన్న పాటి జల విద్యు దుత్పత్తి ద్వారా 2030 నాటికి 450 గిగావాట్ల హరిత ఇంధనోత్పత్తి లక్ష్యమని చెబుతున్నాం. కానీ, బొగ్గు వినియోగం కథ భిన్నంగా ఉంది. మనం వాడే విద్యుత్తులో థర్మల్ వాటా కొన్ని సంవ త్సరాల కింద 75 శాతం కాగా ఇప్పుడది 67 శాతం. 2030 నాటికి 50 శాతంగా ఉండొచ్చు! కానీ, అప్పుడు వినియోగమయ్యే మొత్తం విద్యు త్తుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ! 2030–40 మధ్య మన బొగ్గు విని యోగం ఉచ్ఛస్థితికి వస్తుందని ఒక అంచనా! సర్కార్లు–కార్పొరేట్లు మారితేనే! భూతాపోన్నతి పెరుగుదల 2 డిగ్రీలకు కట్టడి, ఉద్గారాల శూన్యస్థితి ఇప్పట్లో దుస్సాధ్యమనే వాదన తరచూ తెరపైకి వస్తోంది. దీని వెనుక బొగ్గు లాబీ, చమురులాబీ, వాహనోత్పత్తి వంటి బలమైన లాబీలే కారణమని తెలుస్తోంది. యూఎన్ నివేదికనే మార్చే ఎత్తుగడలు వేసిన కార్పొరేట్ దళారీలు ఏమైనా చేయగలరనే విమర్శ వ్యక్తమౌతోంది. ప్రభుత్వాలు కార్పొరేట్లకు దన్నుగా ఉండేకన్నా పర్యావరణ పరిరక్షణకే కట్టుబడాలనే ఒత్తిళ్లు సామాజికవేత్తలు, కార్యకర్తల నుంచి పెరుగు తున్నాయి. కార్పొరేట్లు తమ సామాజిక బాధ్యత (సీఎస్సార్) కింద స్వచ్ఛ, హరిత ఇంధనాలవైపు మొగ్గడం వారికే ఉపయోగం! యువ తరం, షేర్హోల్డర్లు కూడా కార్పొరేట్లపై ఒత్తిడి పెంచితే సానుకూల ఫలితాలుంటాయి. రేపు యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలన్నీ హరితంలోనే! ఈ పర్యావరణ సంక్షోభంలో... అందరం బాగుంటేనే, ఎవరమైనా బాగుండేది. జీవమున్న ఏకైక గ్రహం భూమి మునిగి పోయే పడవ అనుకుంటే, మనం ఏ మూలన, ఎంత పద్ధతిగా కూర్చున్నా... ఆ పడవే మునిగితే.... ఎవరం మిగలం! -దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
చట్టం బలపడితేనే అడవి నిలబడేది
అడవులు వేగంగా అంతరిస్తున్న క్రమంలో.. దాన్ని అడ్డుకొని, వాటిని పరిరక్షించేందుకు ‘అటవీ సంరక్షణ చట్టం’ని పలు అనుమతి షరతులు, కఠిన నిబంధనలతో తెచ్చారు. 1988లో జరిగిన చట్ట సవరణ కూడా అడవుల రక్షణకు దన్నుగా నిలిచింది. ఇప్పుడు వాటన్నింటిని ఏదో రూపంలో సడలించి, చట్ట పరిధి నుంచి బయటకు తెచ్చే యత్నించేస్తున్నారు. పైకి చట్టం స్ఫూర్తిని కాపాడుతున్నట్టు చెబుతున్నా.... లోపల సవరణ ఫలాలు కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేవే! సహజవనరుల దోపిడీకి రాచబాటలే! ఉన్న అడవికే రక్షణ లేని ప్రమాదం ముంచుకొస్తోంది. అడవి అమ్మలాంటిది. అన్నీ తనలో ఇముడ్చుకుంటుంది. యుగాలుగా మనిషి మను గడ అడవితో ఎంత గాఢంగా పెనవేసుకుందో వేద–వేదాంగాలు, పురాణ–ఇతిహాసాలు, సంస్కృతీ సంప్రదాయాలు చెప్పకనే చెబుతాయి. రామాయణ, మహాభారత ఇతిహాసాల నుంచి నైమి«శారణ్య బోధనలూ, పంచతంత్రం వరకు ఎన్నో గాథలకు వేదిక అడవి! కోట్ల ఏళ్లుగా మానవేతిహాసం అడవితో–సకల జీవరాశితో సహజీవన యానం (సింబయాసిస్ లివింగ్) చేస్తోంది. నింగి, నేల, గాలి, నీరు, ఆకాశం.... పంచభూతాలే ఇందుకు సాక్ష్యం! స్వార్థంతో మనిషి ప్రకృతికి చేసిన విఘాతాలే నేడు ఉగ్రరూపంతో మానవాళిని వేధిస్తున్న విపత్తులకు, ఉపద్రవాలకు కారణం. ఆ వరుసలో.. తాజాగా ఇపుడు అడవికి ముప్పు తెస్తున్నారు. భూతాపోన్నతి పెరిగి వాతావ రణ విపత్తులు ముంచుకు వస్తున్న వేళ, అడవుల్ని కాపాడుకొని, విస్తీర్ణం పెంచుకోవాల్సిన సమయంలో... ఉన్న చట్టానికి కేంద్రం తల పెట్టిన సవరణ ప్రతిపాదనలు మేలు చేయకపోగా కీడు చేసేవిగా ఉండటం యాదృచ్ఛికమేమీ కాదు, ఉద్దేశపూర్వకం! పైకి చట్టం స్ఫూర్తిని కాపాడుతున్నట్టు చెబుతున్నా... లోపల సవరణ ఫలాలు కార్పొరేట్లకు మేలు చేసేవే! సహజవనరుల దోపిడీకి రాచబాటలే! ఉన్న అడవికే రక్షణ లేని ప్రమాదం ముంచుకొస్తోంది. అటవీ భూముల్ని అటవీయేతర అవసరాలకు వాడే భూబదలాయింపులకు ఇక తలుపులు బార్లా తెరచినట్టే! కీలకాంశాల్ని చట్ట పరిధి నుంచి తప్పించనున్నారు. అప్పుడిక ఏ ముందస్తు అనుమతులూ తీసుకునే పనిలేదు. గిరిజనులకు, అడవి బిడ్డలకు తీరని కష్టాలే! గ్రామీణులు, వనవాసీల సహకారంతో చేపట్టే వనసంరక్షణ స్ఫూర్తి గాలికే! ప్రతి పాదనల్లోని కొన్ని అంశాలు 73, 74వ రాజ్యాంగ సవరణల స్ఫూర్తికి విరుద్ధం. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం. కేంద్ర అధికారాల్ని మరింత కేంద్రీకృతం చేసేవే! చట్టం చేసే ముందరి సంప్రదింపుల విధాన (పీఎల్‌సీపీ) ప్రక్రియలో భాగంగా సంబంధీకుల వ్యాఖ్యలు, సూచ నల్ని ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావ రణ మార్పు మంత్రిత్వ శాఖ ఒక (ఎఫ్.నం. ఎఫ్‌సీ–11/61/2021– ఎఫ్‌సీ) పత్రం విడుదల చేసింది. వాటిపై రాష్ట్ర–కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలే కాకుండా పర్యావరణవేత్తలు, శాస్త్రజ్ఞులు, హక్కుల కార్య కర్తలు.... ఆసక్తిగల పౌరులెవరైనా తమ అభిప్రాయాల్ని, అభ్యంత రాల్ని తెలుపవచ్చు. అక్టోబరు నెలాఖరు వరకు గడువుంది. పయనం ఎటు? మార్పు ఏదైనా మంచికి జరగాలి. 1980లో వచ్చిన ‘అటవీ సంరక్షణ చట్టం’ ముందుగా ఒక అత్యవసర ఆర్డినెన్స్! ఆ తర్వాత చట్టమైంది. అడవులు వేగంగా అంతరిస్తున్న క్రమంలో.. దాన్ని అడ్డుకొని, వాటిని పరిరక్షించేందుకు (42వ రాజ్యాంగ సవరణలో భాగంగా) ఈ చట్టాన్ని పలు అనుమతి షరతులు, కఠిన నిబంధనలతో తెచ్చారు. 1988లో జరిగిన చట్ట సవరణ కూడా అడవుల రక్షణకు దన్నుగా నిలిచింది. సుప్రీంకోర్టు 1996 (గోదావర్మన్ తిరుముల్పాడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు)లో సంచలన తీర్పిచ్చింది. అటవీ భూమి అయినా కాకపోయినా, ప్రయివేటు భూములైనా... ఏ ప్రాజెక్టు–కార్యక్రమం కింద అభివృద్ధి చేస్తున్నదైనా అడవి అడవేనని, అవన్నీ సదరు చట్ట పరిధిలోకే వస్తాయని, అలాంటి ఏ భూవినియోగ మార్పిడికైనా అను మతులు తప్పనిసరి అంది. అప్పట్నుంచి భూయాజమాన్య హక్కు లతో నిమిత్తం లేకుండా.. అడవులు, చెట్లు, మొక్కలు, ఇతర పచ్చ దనం అభివృద్ధి పరుస్తున్న వ్యవసాయేతర కార్యకలాపాలన్నీ అటవీ చట్ట పరిధిలోకి వచ్చాయి. ఫలితంగా పచ్చదనం పెరిగింది. ఇప్పుడు వాటన్నింటిని ఏదో రూపంలో సడలించి, చట్ట పరిధి నుంచి బయటకు తెచ్చే యత్నం చేస్తున్నారు. కానీ, పైకి ‘చట్టంలోని పలు అంశాలను చక్కదిద్దడానికి’ అని చెబుతున్నారు. ‘ఒకవైపు అడవుల రక్షణ, మరో వైపు అభివృద్ధిని వేగంగా సమీకృత పరచటానికే ఈ చట్ట సవరణ’ అనేది సర్కారు వాదన. సమాచార హక్కు చట్టాన్ని సవరించేప్పుడూ ఇదే చెప్పారు. చివరికేమైంది అందరికీ తెలుసు. అటవీ చట్టానికే గతి పట్టనుందో! ఎవరు ప్రస్తుత మార్పు కోరారు? ఏమడిగారు? ఎందు కడిగారు? వంటి విషయాల్లో పారదర్శకతే లేదు. ఈ 40 ఏళ్లలో చట్టం ఎలా అమలయింది? అందులో మంచి–చెడు ఎంత? అధ్యయనాలేవీ లేవు. మార్పులు చేస్తే... ఎక్కడ? ఎందుకు? దానికో హేతుబద్ధత లేదు. ప్రభుత్వం తలపోసింది, అధికారులు పత్రం రూపొందించారు, అంతే! ప్రస్తుత చట్టంలో ఉన్న రక్షణ వ్యవస్థను పలుచన చేయడం, విలువైన అటవీ భూముల్ని చట్టం ఛత్రచ్ఛాయ నుంచి తప్పించడం, ‘అభివృద్ధి’ ముసుగులో సహజవనరుల్ని కొల్లగొట్టేవారికి చేయూతే పాలకుల రహస్య ఎజెండా అని పర్యావరణవేత్తల ఆందోళన! కార్పొ రేట్ వ్యాపారాల్ని సులభం చేసే చర్యల్లో ఇదొక భాగమన్నది విమర్శ. రోగం కన్నా చికిత్స ఘోరమైతే....? అటవీ చట్ట సవరణకు పద్నాలుగంశాలు ప్రతిపాదించారు. వివిధ రకాల రక్షిత అటవీ భూముల్ని చట్టపరిధి నుంచి తప్పించడమో, భూబదలాయింపుల్ని సులభం చేయటమో, నియంత్రణ పట్టు సడలిం చడమో, నిబంధనల్ని నీరుగార్చడమో.. ఇలాగే సాగింది. ప్రయివేటు అటవీ భూముల్ని చట్టపరిధి నుంచి తప్పించడం, రైల్వేలు, హైవే అథారిటీ, ఇతర రవాణా సంస్థలు 1980కి పూర్వం పొందిన భూముల్ని మినహాయించడం, ఆయా సంస్థలు రోడ్డు, ట్రాక్ పక్క చెట్లు, పచ్చదనం పెంచిన స్థలాల్ని ఈ పరిధి నుంచి తప్పించటం, నివాస–ఇతర ప్రాజెక్టు అవసరాలకు 250 చదరపు మీటర్లలో నిర్మా ణాలు అనుమతించడం... వంటివి ప్రతిపాదించారు. అంతర్జాతీయ సరిహద్దుల్లో దేశ భద్రత–వ్యూహాత్మక మౌలిక వసతుల కోసం అటవీ భూముల్ని బదలాయించాల్సి వస్తే... అనుమతులు అక్కర్లేదంటు న్నారు. స్థలయాజమాన్య హక్కులు బహుళ రికార్డుల్లో నమోదై అటవీ –రెవెన్యూ, ఇతర విభాగాల మధ్య వివాదం ఉంటే, సదరు భూముల్ని చట్టపరిధి నుంచి తప్పించాలంటున్నారు. ఇలాంటి భూమి, ఒక్క తెలంగాణలోనే అయిదారు లక్షల ఎకరాలుంది. దేశమంతటా కనీసం 150 లక్షల ఎకరాలు చట్టపరిధి నుంచి బయటపడి, అటవీయేతర అవసరాలకు దారి మళ్లుతుంది. అడవుల విస్తరణపై ఇది ప్రతికూల ప్రభావమే! పోడు వ్యవసాయం చేసుకునే వనవాసీలకు హక్కులు కల్పించడం ఇప్పుడొక పెద్ద వివాదాస్పదాంశం, దాన్ని తేల్చరు. కానీ, ఖనిజాలు తవ్వే కార్పొరేట్లకు ఎర్రతివాచీ స్వాగతాలు ఇక సులభం. అడవి పెరిగేనా? తరిగేనా? సర్కారుది ఇంకో విచిత్ర వాదన. అడవులుగా ఉన్న అటవీయేతర, ప్రయివేటు భూముల్ని ఈ చట్టపరిధి నుంచి తప్పించి, భూయజమా నుల్లో భయాల్ని తొలగించాలట! నిర్భయంగా వారు ముందుకు వస్తారు కనుక, ఇప్పుడు 24.5 శాతంగా ఉన్న అడవుల వాటాను మొత్తం భూభాగంలో మూడో వంతుకు పెంచాలనే లక్ష్యం సాధ్యమౌ తుందట! అడవికి ఏ నష్టం కలిగించని ఆధునిక సాంకేతికత వచ్చింది కనుక.. చమురు, సహజవాయువు కోసం అడవుల కింద, ఏ ముందస్తు అనుమతులు లేకుండానే తవ్వకాలు జరుపుకోవచ్చని ప్రతి పాదించారు. ఖనిజాలు, ఇతర వనరుల తవ్వకాలకు జరిపే సర్వేలను కూడా అటవీ చట్ట పరిధి నుంచి మినహాయించాలన్నారు. అంటే, మన అమ్రాబాద్ ప్రాంతంలో యురేనియం తవ్వకాల వంటి సర్వేలు ఏ అనుమతులు లేకుండా చేసుకోవచ్చు! అంటే, ఏ అటవీ భూమి ఏ ఇతర అవసరాలకు దారి మళ్లుతుందో ఎవరికీ తెలియదు. నిశ్శబ్దంగా అంతా జరిగిపోతుంటుంది. తెలియనపుడు ప్రజాందోళనలుండవ్! న్యాయస్థానాలు సుమోటోగా స్వీకరించే సందర్భాలుండవు. ప్రస్తుత ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, పర్యా వరణ సంస్థలు, నిపుణులు, కార్యకర్తలు ఇతర బాధ్యతకలిగిన పౌరులు ఎలా స్పందిస్తారు? అన్నదాన్ని బట్టే దేశంలో అడవులు, పర్యావరణ భవిత ఆధారపడి ఉంది. అడవి ఎవరికీ శత్రువు కాదు. ఆయుధమెప్పుడూ అలీనం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రా యమే ఆయుధం. శమీ వృక్షంపైనుంచి దించి, జరిపే ఆయుధపూజకు వేళైంది. చెడుపై మంచి గెలుపే విజయదశమి! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
హరిత ఇంధనమే భవితకు బాట
పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అసాధారణంగా పెరిగిపోతున్నాయి. ఇతర సహజవనరుల విషయంలోనూ పర్యావరణపరమైన ఒత్తిళ్ళున్నాయి. ఈ నేపథ్యంలో ఇంధన వనరుల రంగం సమూలంగా దిశ మార్చుకుంటోంది. వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న శిలాజ ఇంధనాల వినియోగం నుంచి ప్రపంచం సౌర, పవన, హైడ్రోజన్ వంటి పునర్వినియోగ ఇంధనాల వైపు మళ్లుతోంది. విద్యుత్తు వినియోగం, రవాణా–ప్రయాణ రంగంలో వాహ నాలకు పునర్వినియోగ ఇంధన వాటా పెరిగితేనే, ‘వాతావరణ మార్పు’ ప్రతికూల ప్రభావాల నుంచి స్థూలంగా ప్రపంచానికి, ప్రత్యేకంగా భారత్‌కు రక్ష! ఆధునిక మానవుడి నిత్యావసరమైన ఇంధన వనరు రంగం సమూలంగా దిశ మార్చుకుంటోంది. కర్భన ఉద్గారాలతో వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న శిలాజ ఇంధనాల వినియోగం నుంచి ప్రపంచం సౌర, పవన, హైడ్రోజన్ వంటి పునర్వినియోగ (స్వచ్ఛ– హరిత) ఇంధనాల వైపు మళ్లుతోంది. ఇదొక... అవసర, అనివార్య స్థితి! ఈ మార్పుకనుగుణంగా భారత్‌లోనూ బలమైన అడుగులే పడు తున్నాయి. అక్టోబర్ నెలాఖరుకి 150 గిగావాట్లు, 2022 సంవత్సరాం తానికి 175 గిగావాట్ల పునర్వినియోగ విద్యుత్ ఇంధన (ఆర్ఈ) స్థాపక సామర్థ్యానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమౌతోంది. (ఒక గిగా వాట్ అంటే వెయ్యి మెగావాట్లు) గాంధీ జయంతి రోజైన శనివారం 2.2 గిగావాట్లు, నెలాఖరున మరో 2.32 గిగావాట్ల స్థాపక సామర్థ్య ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. కార్పొరేట్ రంగం నుంచి ఇటీవల వచ్చిన భారీ ప్రకటనల ప్రకారం.... రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ వచ్చే మూడేళ్లలో రూ 75 వేల కోట్లు (పది బిలియన్ డాలర్లు), అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ వచ్చే పదేళ్లలో రూ 1.50 లక్షల కోట్లు (ఇరవై బిలియన్ డాలర్లు) çపునర్వినియోగ ఇంధన రంగంలో వ్యయం చేయనున్నారు. ప్రభుత్వాలు, పరిశ్రమ, పౌర సమాజం... అప్రమత్తంగా ఉండి భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా బాటను చక్కదిద్దుకోవడమే వారి ముందున్న కర్తవ్యం. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అసాధారణంగా పెరిగిపోతున్నాయి. ఇతర సహజ వనరుల విషయంలోనూ పర్యావరణపరమైన ఒత్తిడులున్నాయి. వాటి లభ్యత కష్టం–ఖరీదవుతుండగా, వినియోగం దుర్భరమౌతున్న పరిస్థి తుల్లో పర్యావరణ సానుకూల çపునర్వినియోగ ఇంధనాల వినియోగ వాటాను పెంచడం ఆరోగ్యకర పరిణామం! ఐక్యరాజ్యసమితి (యూఎన్) నిర్దేశించనట్టు, 2015 పారిస్ పర్యావరణ ఒప్పందం ప్రకారం నిర్దేశిత లక్ష్యాలు చేరుకోవడానికి ఈ దిశలో పయనం అత్య వసరం! అదే సమయంలో సుస్థిరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుంటే, ఇప్పుడు చైనా ఎదుర్కొంటున్న తీవ్ర విద్యుత్ సంక్షోభ దుస్థితి మనకూ తప్పదు! ప్రపంచంలో అత్యధికంగా బొగ్గు వినియో గించే చైనా సదరు శిలాజ ఇంధన వాడకాన్ని రమారమి తగ్గించింది. గత దశాబ్దారంభంలో 68 శాతం ఉన్న బొగ్గు వినియోగం వాటాని, 2020లో 56 శాతానికి తగ్గించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సరిగా లేనందున ఇప్పుడు పారిశ్రామిక, నివాస, ట్రాఫిక్ నిర్వహణ వంటి నిత్యావసరాలకూ తీవ్ర విద్యుత్ కొరత ఎదుర్కొంటూ దిగుమతుల కోసం దిక్కులు చూస్తోంది. సరైన దిశలోనే భారత్! అమెరికా, చైనా తర్వాత ఎక్కువ కర్బన ఉద్గారాలను (గ్రీన్ హౌజ్ గ్యాసెస్) విడుదల చేస్తున్న దేశంగా భారత్‌పై పర్యావరణ పరిరక్షణ బాధ్యత ఎంతో ఉంది. 2030 నాటికి, కార్బన్ ఫుట్‌ప్రింట్‌ని 33–35 శాతం (2005 నాటి స్థాయిపై లెక్కించి) మేర తగ్గిస్తామని పారిస్‌లో మాటిచ్చాం. పునర్వినియోగ ఇంధన వాటాని 40 శాతానికి పెంచుతా మన్నది కూడా ఒప్పందంలో భాగమే! ఇప్పటికే 38.4 శాతానికి చేరు కున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది. ప్రభుత్వ–ప్రయివేటు రంగంలో తాజాగా వస్తున్న పెట్టుబడులు, ప్రణాళికల్ని బట్టి ఈ వాటాను 2030 నాటికి 66 శాతానికి పెంచే ఆస్కారముంది. పర్యా వరణ సానుకూల దిశలో గట్టి ముందడుగు పడ్డట్టే! కార్బన్ డైయాక్సైడ్ (సీవోటూ) వంటి కర్బన ఉద్గారాలను 28 శాతానికి తగ్గించినట్టు ప్రభుత్వం చెబుతోంది. కోవిడ్ రెండో అల సమయంలో దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం తగ్గి, బొగ్గు ఉత్పత్తి పెరిగింది. కానీ, సాధారణ పరిస్థితుల్లో విద్యుత్ వినియోగం మనదేశంలో పెరుగుతోంది. గరిష్ట వినియోగ సమయంలో (పీక్) గత జూలై 7న, 200.57 గిగావాట్ల విద్యుత్ వినియోగం జరిగినట్టు కేంద్ర ఇంధన మంత్రి రాజ్‌కుమార్ సింగ్ తెలిపారు. ప్రపంచ సగటు తలసరి కర్బన ఉద్గారాలతో పోలిస్తే మన తలసరి మూడో వంతేనని ఇటీవల ఒక అంతర్జాతీయ వేదిక నుంచి, సదరు మంత్రి సెలవిచ్చారు. కర్బన ఉద్గారాల సున్నాస్థితి (జీరో న్యూట్రాలిటీ) సాధించే విషయమై భారత్ నిర్దిష్ట ప్రకటన చేయాలన్న వాదనను తోసిపుచ్చుతూ ఆయనీ మాటలన్నారు. కానీ, అది సరైన వాదన కాదనేది పర్యావరణ కార్యకర్తల భావన! ప్రపం చంలో రెండో అతి పెద్ద ఉత్పత్తి దేశం, రెండో అత్యధిక జనాభా దేశం, కర్బన ఉద్గారాల్లో మూడో అతిపెద్ద దేశం. తలసరి ఉద్గారాల వెల్లడి తక్కువే అయినా, విస్తృత జనాభా రీత్యా, దీన్ని తీవ్ర సమస్యగానే పరిగణించాలి. నెల రోజుల్లో గ్లాస్గోవ్లో జరుగనున్న ‘కాప్–26’ యూఎన్ సదస్సులోగానీ, ముందేగానీ దీనిపై నిర్దిష్ట ప్రకటన చేయా లని భారత్‌పై అంతర్జాతీయ సమాజం నుంచి వత్తిడి పెరుగుతోంది. భూమి ఒక వివాదాంశమే! భారత్ పురోగమిస్తున్న çపునర్వినియోగ ఇంధన రంగంలో, అందుక వసరమైన భూలభ్యత, సేకరణ, వినియోగం జఠిల సమస్యే కానుంది. హరిత మార్గాలైన సౌర విద్యుత్కైనా, పవన విద్యుత్తుకైనా నిర్దిష్టంగా స్థలం అవసరమౌతుంది. పునర్వినియోగ ఇంధనాల ద్వారా. 2050 నాటికి కర్భన ఉద్గారాల శూన్యస్థితి సాధించాలంటే ‘ఇంధన వ్యయ– ఆర్థిక విశ్లేషన సంస్థ’ (ఐఈఈఎప్ఎ) అధ్యయనం ప్రకారం, పెద్ద మొత్తం భూమి అవసరమౌతుంది. సౌర విద్యుత్ వ్యవస్థకు 50,000 నుంచి 70,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, పవనవిద్యుత్ వ్యవస్థ కోసం మరో 15,000 నుంచి 20,000 చ.కి.మీ భూమి అవసరమౌతుంది. అంటే ఒక్క విద్యుత్తుకే మొత్తం భూభాగంలో 1.7 నుంచి 2.5 విస్తీర్ణం, అటవీయేతర భూభాగంలో దీన్ని 2,2 నుంచి 3.3 శాతంగా లెక్కగట్టారు. ఇది మంచిది కాదని, భూమ్యావరణ వ్యవస్థకు చేటని పర్యావరణవేత్తలంటున్నారు. ఆహారోత్పత్తిపైనా ప్రతికూల ప్రభా వమే! బడా కార్పోరేట్ల స్పర్థలో భూసేకరణ, భూదురాక్రమణలు మళ్లీ వివాదాస్పదమనే అభిప్రాయం ఉంది. ఈ విషయంలో తగినంత కస రత్తు జరగాలని, భూవినియోగ విధానాలు సమగ్రంగా ఉండాలని ఆ సంస్థ సిఫారసు చేసింది. సౌరవిద్యుత్ పలకలు (ప్యానల్స్), పవన్ విద్యుత్ టవర్స్ ఏర్పాటు చేసే భూములు, సామాజికంగా–వ్యావసా యికంగా–పర్యావరణ పరంగా తక్కువ ప్రభావితమయ్యే ప్రాంతాలు, ప్రభుత్వ ఖాళీ, పోరంబోకు, గైరాన్ వంటి భూముల్ని ఎంపిక చేయాలి. గరిష్ట ప్రయోజనం–కనీస వివాదం ప్రాతిపదకగా ఉండాలనీ సూచించింది. పంట కాల్వలపైన, ప్రయివేటు–కృత్రిమ జలాశయాల పైన సౌరపలకలు ఏర్పాటు చేయడం మంచిదంటున్నారు. ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నపుడు, నీటిపారుదల ప్రాజెక్టు కాలువ లపై సౌరపలకలు ఏర్పాటు చేసిన నమూనాకు ‘జాతీయ సోలార్ మిషన్’గా యూఎన్ స్థాయిలో ప్రచారం కల్పించారు. ఇపుడు దేశ వ్యాప్తంగా దాన్ని మరింత విస్తృతపరచవచ్చు. ఇళ్లు, ఇతర నివాస ప్రదేశాలు, కార్యాలయాలపైన (రూప్‌టాప్) కూడా ప్యానల్స్ ఏర్పాటు చేయడం సముచితమనే అభిప్రాయముంది. ఫ్రాన్స్‌లో ఒక దశలో, ప్రతి ఇంటి పైకప్పునూ అయితే హరితంతో లేదా సౌరపలకలతో గానీ కప్పి ఉంచేట్టు ఇచ్చిన ఆదేశాలు ఫలితమిచ్చాయి. పెట్రోలియం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో వేగంగా పెరుగు తున్నాయి. బ్యారెల్ క్రూడ్ 90 డాలర్లకు చేరనుందని వార్తలొస్తు న్నాయి. భారత్, 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. దేశీయంగా పెట్రో ఉత్పత్తి విస్తరణ అవకాశాలు తక్కువ. ఎలక్ట్రిక్ వాహనాలు రావాల్సినంత త్వరగా భారత్ మార్కెట్లోకి రావటం లేదు. ఏయే లాబీలు బలంగా పనిచేస్తున్నాయో గానీ, వాటికెన్నో ప్రతి బంధకాలు! పెట్రో ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్) అధ్యయనం ప్రకారం, వచ్చే పాతికేళ్లలో, డీజిల్–గ్యాసోలైన్పై ఆధారపడి నడిచే మన వాహనాల వాటా 51 శాతం నుంచి 58 శాతానికి పెరుగనుంది. ఇది, పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. విద్యుత్తు వినియోగం, రవాణా–ప్రయాణ రంగంలో వాహనాలకు పునర్వినియోగ ఇంధన వాటా పెరిగితేనే, ‘వాతావరణ మార్పు’ ప్రతికూల ప్రభావాల నుంచి స్థూలంగా ప్రపంచానికి, ప్రత్యేకంగా భారత్‌కు రక్ష! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
‘మనం’ మారితేనే మనుగడ!
దేశంలోని నగరాలు, పట్టణాలు, నదులు, అడవులు, కొండలు... అన్నీ అసాధారణ ఒత్తిడికి గురవుతున్నాయి. వాతావరణ సంక్షోభాన్ని బహుళ కారణాలు జఠిలం చేస్తున్నాయి. అన్ని విధాన నిర్ణయాలలో అంతర్లీనంగా ఈ అంశం ఉండేలా చూడాలి. ఎన్నడూ ఈ సమస్యను పట్టించుకోని మన రాజకీయ వ్యవస్థలో కదలిక రావాలి. ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా ఎదిగి భవిష్యత్తరాలనే కాకుండా ప్రస్తుత ప్రజానీకాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలి. నార్వేతో సహా పలు ఐరోపా దేశాల్లో గ్రీన్ పార్టీ రాజకీయాలు మొదలయ్యాయి. నేడు కాకుంటే రేపు... మన దగ్గరా అవి అనివార్యం! ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు దిశ మార్చు కుంటున్న సంధి కాలమిది! పునరుత్పాదక ఇంధనాలు, నికర శూన్య ఉద్గారాలు, పచ్చ పెట్టుబడులు, వాతావరణ బడ్జెట్లు, హరిత ఆర్థిక వ్యవస్థలు .... వంటి ఆధునిక పదజాలం తెరపైకి వచ్చి ఆధిపత్యం చెలాయిస్తున్న సంక్లిష్ట సమయం. ప్రకృతిలో మానవ ప్రమేయపు అలజడి, భూగ్రహంపై మనిషి మనుగడ పెంచిన ఒత్తిడి అంతా ఇంతా కాదు! అది సృష్టిస్తున్న అనేక రూపాల కాలుష్యం ‘వాతావరణ మార్పు’గా ఉపద్రవమై ముంచుకు వచ్చింది. భూతాపోన్నతి పెరుగుతూ ఎండలు, వానలు, వరదలు, కార్చిచ్చులు... అన్నీ పరిమితులు దాటి విలయం సృష్టిస్తు న్నాయి. సరికొత్త వైరస్లు మానవాళి ఉనికినే ఊగిసలాటలోకి నెడుతు న్నాయి. ఇందుకు కోవిడ్–19 తార్కాణం! ధ్రువాల్లో మంచు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. లోతట్టు దీవులతో పాటు తీర నగరాలూ ప్రమాదంలో పడ్డాయి. అంచనాకు మించిన వేగంతో విధ్వంసం కమ్ముకొస్తోంది. ‘వెనక్కి తిరిగి సరిదిద్దుకునే వీలులేని అన ర్థాలు జరిగిపోతున్నాయ’ని ఐక్యరాజ్యసమితి (యూన్) తాజా నివేదిక హెచ్చరించింది. దక్షిణాసియా దేశాలకు ముప్పు ఎక్కువుంది. పర్యా వరణం ఇప్పుడు శాస్త్రవేత్తలు, కార్యకర్తలు.. అనే దశ దాటి అందరి నోళ్లలోనూ నిత్యం నానుతోంది. ప్రకృతి వైపరీత్యాలు పెరిగి, కొడు తున్న దెబ్బలు ‘తమ దాకా వస్తే గాని...’ జనాల్లో కదలిక రాలేదు! పాలనాపీఠాలు అధిష్టించిన రాజకీయ వ్యవస్థలే ప్రాధాన్యాంశంగా ఇంకా ఎజెండాపైకి తేవటం లేదు. ఇప్పుడిక అనివార్యం! అభివృద్ది చెందుతున్న ఓ పెద్ద దేశంగా భారత్ నేడు కీలక స్థానంలో ఉంది. ఆరేళ్ల కిందటి పారిస్ ఒప్పందాల నుంచి సాగుతున్న ప్రయాణంలో... ఇచ్చిన హామీల అమలు, ఫలాలు, వైఫల్యాలు, మున్ముందరి సవాళ్లు– అవకాశాలను ప్రపంచమంతా సమీక్షించుకునే ‘భాగస్వాముల సదస్సు’ (కాప్26) వైపు అడుగులు పడుతున్నాయి. గ్లాస్గో (నవంబరు1–12)లో జరిగే ఈ సదస్సునాటికి చాలా విషయాల్లో మనం విధాన నిర్ణయాలతో సన్నద్ధం కావాలి. పరిష్కారంలో భాగమైతేనే... వాతావరణ సంక్షోభంలో మన పరిస్థితి సంక్లిష్టమే! భారత భూభా గంలో 65 శాతం కరువు ప్రభావిత ప్రాంతం, 12 శాతం భూమి వరదలు, 8 శాతం భూభాగం తుఫాన్ల ప్రభావితం. దీనికి తోడు భూతాపోన్నతికి కరుగుతున్న మంచు పర్వతశ్రేణి, హిమాలయాలు ఉత్తర సరిహద్దులుగా ఉన్న దేశం. మేఘ విచ్ఛిత్తితో కుండపోత వర్షాలు, మెరుపు వరదలు, కొండచరియలు విరిగిపడే విధ్వంసాలు ఇప్పటికే పెచ్చుమీరాయి. ‘వాతావరణ మార్పుల’పై యూఎన్ ఏర్పాటు చేసిన అంతర్ ప్రభుత్వ వేదిక (ఐపీసీసీ) ఆరో నివేదిక ప్రకారం మిగతా సముద్రాల కన్నా హిందూమహాసముద్రం వేగంగా వేడెక్కడం మనకు అరిష్టం. వేడి గాలులే కాకుండా రుతుపవనాలను, వ్యవసాయ పరిస్థితుల్నీ ప్రతికూలంగా ప్రభావితం చేస్తోంది. సుదీర్ఘ తీరం ఉండటంతో సముద్రమట్టాల పెరుగుదల ప్రమాదమౌతోంది. మన సముద్ర తీరంలోని ఖిదిర్పూర్ (కోల్‌కత), పారాదీప్ (ఒడిశా), విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్), ట్యూటీకొరిన్, చెన్నై (తమిళనాడు), కొచ్చి (కేరళ), మంగళూరు (కర్ణాటక), మార్ముగోవా (గోవా), ముంబాయి (మహారాష్ట్ర), కండ్ల, ఓఖా, భావ్‌నగర్ (గుజరాత్) ఈ 12 నగరాలు/ పట్టణాలు జలమయమయ్యే ప్రమాద సంకేతాలున్నాయి. తాజా ఐపీసీసీ నివేదిక ఆధారంగా, ఈ శతాబ్ది అంతానికి ఇవి సుమారు మూడు అడుగుల మేర నీట మునిగే ప్రమాదముందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ విశ్లేషించింది. ‘వాతా వరణ మార్పు’ విశ్వవ్యాపితమైనా సమస్యలు, సంక్షోభాలు స్థానిక మైనవే! పరిష్కరాలను స్థానికంగా యోచించాలి. సమస్య తీవ్రత అధి కంగా ఉన్న దేశాల్లో ఉన్న మనం, బాధిత దేశమే అయినా.. సమస్యలో కన్నా పరిష్కారంలో భాగం కావాలి. పెద్దన్న పాత్ర పోషించాలి ప్రపంచంలో మనం రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఎదిగాం. చైనా తర్వాత మనదే స్థానం! వాతావరణ కాలుష్యానికి, తద్వారా భూతాపో న్నతికి కారణమవుతున్న కర్భన ఉద్గారాల విడుదలలో మనది మూడో స్థానం. విద్యుత్ వినియోగంలో చైనా, అమెరికా, ఐరోపా సంఘం (ఈయూ) తర్వాత భారత్‌ది నాలుగో స్థానం! శిలాజ ఇంధనాల వినియోగమే 80 శాతం కర్బన ఉద్గారాలకు కారణం. ఆయా దేశాల ఇంధన విధానాలు, నూతన వైఖరులే వాతావరణ సంక్లిష్టతను నిర్దేశి స్తున్నాయి. పారిశ్రామిక విప్లవం తర్వాత, రెండో ప్రపంచ యుద్ధానం తరం, మరీ ముఖ్యంగా ప్రపంచీకరణ తర్వాత జరిగిన వాతావరణ నష్టమే అపారం. అభివృద్ధి చెందిన దేశాలు, ఆ క్రమంలో విడుదల చేసిన–చేస్తున్న ఉద్గారాలు, వెదజల్లిన కాలుష్యాలు, ప్రకృతివనరుల దోపిడీకి లెక్కేలేదు. ఇది నొక్కి చెబుతూ పారిస్ ఒప్పంద సమయంలో భారత్ క్రియాశీల పాత్ర పోషించింది. మారిన మార్కెట్ పరిస్థితులు, ప్రపంచ రాజకీయార్థిక పరిణామాల నేపథ్యంలో, రానున్న కాలం లోనూ భారత్ పోషించాల్సింది కీలక భూమికే! మన వాణికి ఎక్కువ ఆదరణ! కర్బన ఉద్గారాల స్థాయిని బట్టి, అభివృద్ధి సమాజాల పాపమే అధికమైనప్పటికీ, అభివృద్ధి చెందిన దేశాలను ఆర్థికంగా, సాంకేతికంగా ఆదుకునేందుకు ఆయా దేశాలు ఉదారంగా ముందుకు రావడం లేదు. మన పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. మనం బాధితు లమైనా పరిష్కర్తలుగా ముందున్నాం. వాతావరణ సంక్షోభంలో... ‘కారణ’మైనదానికి నాలుగు రెట్లు ‘భారం’ మనం మోస్తున్నాం. విధానాలు మార్చుకోక తప్పదు! విద్యుదుత్పత్తి ఇంధన వనరుల వినియోగం తర్వాత కర్బన ఉద్గారా లకు, కాలుష్యానికి కారణమవుతున్న వాటిలో పౌర రవాణా, నిర్మాణ, ఉత్పత్తి, వస్తు రవాణా, సేవా తదితర రంగాలున్నాయి. విధాన నిర్ణయాలు చేసేటప్పుడు ‘వాతావరణ మార్పు’ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఉద్గారాలు, ఇతర కాలుష్యాల్ని నివారించేలా ప్రాధాన్య తలు మార్చాలి. ముఖ్యంగా శిలాజ ఇంధన వినియోగం తగ్గించాలి. పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంతో కార్బన్డయాక్సైడ్ (సీవో2) విడుదలే కాక 80 శాతానికి మించి దిగుమతులే కనుక ఇదొక ఆర్థిక భారమే! ధరలు రమారమి తగ్గిన పరిస్థితుల్లో సౌర, పవన విద్యుత్తు వంటి పునరుత్పాదక ఇంధనాల వైపు మళ్లాలి. బొగ్గు వినియోగాన్నీ తగ్గించాలి. 2050 నాటికి కర్భన ఉద్గారాల నికర శూన్య స్థితి సాధిం చేందుకు మనం సంకల్పం తీసుకోవాలి. అవసరమైతే గ్లాస్గోలో ప్రకటించాలి. ఇప్పటికే 100 దేశాలు ప్రకటించాయి. ఇతర మెజారిటీ దేశాలు ఈ దిశలో నడిచేలా ఒత్తిడి పెంచాలి. శిలాజ ఇంధనాల వాడకం ఏటా 83 కోట్ల టన్నుల సీవో2 విడుదలకు కారణమవుతోంది. ఇది మారాలి! అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) సూచించినట్టు సింగపూర్‌తో సహా ఇప్పటికే 40 దేశాలు కార్బన్ పన్ను విధిస్తున్నాయి. పన్ను ఏకరీతిలో ఉండాల్సిన పనిలేదు. ప్రపంచ సగటు కింద టన్ను సీఓ2 ఉత్పత్తికి 5 నుంచి 10 డాలర్లు పన్ను ఖరారు చేసి, భారత్‌లో (25), చైనాలో (50), అమెరికాలో (70 డాలర్లు) ఇలా, విభిన్నంగానూ ప్రతిపాదించవచ్చు. డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా గ్రీన్ హైడ్రోజన్ వాడకాన్ని ప్రోత్సహించాలి. వాతావరణ మార్పును తట్టుకునే సామ ర్థ్యాల కోసం వెచ్చిస్తున్న (ఎన్‌ఏఎఫ్‌సీసీ) నిధులు పెంచాలి. తమ వాటా చెల్లించి, రాష్ట్రాలు గరిష్టంగా వినియోగించుకునేలా చూడాలి. దేశంలోని నగరాలు, పట్టణాలు, నదులు, అడవులు, కొండలు... అన్నీ అసాధారణ ఒత్తిడికి గురవుతున్నాయి. వాతావరణ సంక్షోభాన్ని బహుళ కారణాలు జటిలం చేస్తున్నాయి. అన్ని విధాన నిర్ణయాలలో అంతర్లీనంగా ఈ అంశం ఉండేలా చూడాలి. ఎన్నడూ ఈ సమస్యను పట్టించుకోని మన రాజకీయ వ్యవస్థలో కదలిక రావాలి. ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా ఎదిగి భవిష్యత్తరాలనే కాకుండా ప్రస్తుత ప్రజానీకాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలి. నార్వేతో సహా పలు ఐరోపా దేశాల్లో హరిత పక్ష (గ్రీన్ పార్టీ) రాజకీయాలు మొద లయ్యాయి. నేడు కాకుంటే రేపు... మన దగ్గరా అవి అనివార్యం! ఈమెయిల్:dileepreddy@sakshi.com -
ముప్పు వచ్చేసింది... మనకు మరింత!
భూగోళమంతటికీ విస్తరించి మానవాళి మనుగడని భయాందోళనకు గురిచేస్తున్న ‘వాతావరణం మార్పు’ ప్రతికూల ప్రభావాలు.. కార్చిచ్చు, వరదలు వంటివి అమెరికా, కెనడా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రెజిల్, టర్కీ వంటి దేశాలను తాజాగా గజగజలాడిస్తున్నాయి. ప్రపంచం మొత్తం అప్రమత్తమై వాతావరణ మార్పు ఉపద్రవాలపై కార్యాచరణను వేగవంతం చేయాల్సిన ప్రమాద స్థితికి చేరుకున్నాం. ముఖ్యంగా మన దేశం! ఈ ప్రమాదంలో భారత్‌ది మరింత దయనీయ పరిస్థితి అని ఇటీవలి ఐక్యరాజ్యసమితి నివేదిక హెచ్చరించింది. వాతావరణ మార్పు అందరి సమస్య కనుక, ముఖ్య కారకులైన అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థికంగానో, సాంకేతికంగానో అభివృద్ధి చెందుతున్న, చెందని సమాజాలకు సహకారం అందించాల్సి ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 20 ఏళ్ల రికార్డు వర్షం నిన్న 24 గంటల్లో కురిసింది. ఉత్తర అమెరికాను నూరేళ్లలో లేని ఎండలు ఇటీవల మండించాయి. కెనడా, బ్రిటిష్ కొలంబియాలో 49.6 (జోరెండకాలం, థార్ ఎడారిలో కన్నా ఎక్కువ) డిగ్రీలకు తాకిన ఎండవేడి వల్ల నెలలో 370 మంది మరణించారు. చైనాలో వర్షం–వరదలు వెయ్యేళ్ల కిందటి రికార్డును బద్దలు కొట్టాయి. కాలిఫోర్నియా, ఆస్త్రేలియా, ఆమెజాన్ (బ్రెజిల్), టర్కీ, చివరకు సైబీరియాలోనూ అడవులు అంటుకొని కార్చిచ్చు దీర్ఘకాలం రగులు తూనే ఉండింది. జర్మనీలో పట్టణాలు పట్టణాలనే ఊడ్చుకుపోయిన వరదలకు విస్తుపోయిన ఆ దేశ చాన్స్‌లర్ అంజెలీనా ‘ఈ వైపరీత్యాన్ని వర్ణించడానికి జర్మనీ భాషలో నాకు మాటలు దొరకటం లేద’ని కంటతడి పెట్టారు. ఏమిటిదంతా? ‘వాతావరణం మార్పు’ ప్రతికూల ప్రభావాలివన్నీ! (చదవండి: పెట్రోల్ బంకుల్లోనే ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్) వాతావరణ మార్పులపై ఏర్పడ్డ, యూఎన్ సభ్య దేశాల అంత ర్ప్రభుత్వ బృందం (ఐపీసీసీ) తన ఆరో నివేదికగా ‘మానవాళికి రుధిర సంకేతం’ పంపింది. దాన్ని ప్రపంచం ఎలా స్వీకరిస్తుంది? ఏ రీతిన– ఎంత వేగంగా స్పందిస్తుంది? అన్న దానిపైనే వచ్చే శతాబ్ది, ఆ మాట కొస్తే సహస్రాబ్ది మానవ మనుగడ ఆధారపడి ఉంటుంది. ప్రమాద తీవ్రతను గుర్తించి చేపట్టే ఏ కార్యాచరణకైనా ప్రస్తుత దశాబ్ది (2020 –30) ఎంతో కీలకమైందని పర్యావరణ శాస్త్రవేత్తలు ఎప్పట్నుంచో హెచ్చరిస్తూ వస్తున్నారు. ప్రకృతిని వంచించిన మానవ తప్పిదాల వల్ల, కర్బన ఉద్గారాలు, ఇతర కాలుష్యాల కారణంగా భూతాపోన్నతి పెరుగుతోంది. 2100 నాటికి 2 డిగ్రీల సెల్సియస్‌కు మించి పెరగనీ యకుండా కళ్లెం వేయాలన్న లక్ష్య సాధనకు, ఆచరణలో పట్టు సడలు తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 1.09 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగింది. 2030 నాటికి ఇది 1.5 డిగ్రీలకు చేరే ప్రమాదాన్ని నిపుణులు శంకిస్తున్నారు. మొదట సహస్రాబ్ది లక్ష్యాలు (మిలీనియం గోల్స్), తర్వాత సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీస్) ఏర్పాటు చేసు కొని పురోగమించాలని ప్రపంచ దేశాల ముందు యూఎన్ లక్ష్యాలు నిర్దేశించినా ఎవరికీ పట్టడం లేదు. ఆరేళ్ల కింద పారిస్‌లో సభ్య దేశాలన్నీ సమావేశమై ఒక చరిత్రాత్మక ఒప్పందం చేసుకున్నా... ఆశించిన స్థాయిలో ముందడుగు పడటం లేదు. వాతావరణ మార్పు లను దీటుగా ఎదుర్కొనే, తట్టుకొని నిలువగలిగే, నష్టనివారణతో సర్దుకు పోగలిగే చర్యలేవీ... స్వీయ ప్రతినల స్థాయిలో లేవు. మన కష్టాలు మనవి భౌగోళిక, నైసర్గిక పరిస్థితుల దృష్ట్యా వాతావరణ మార్పు ప్రతి కూల ప్రభావాలు దక్షిణాసియాలో అధికం. అందులోనూ భారత్‌పై ఎక్కువ అని తాజా (ఐపీసీసీ) నివేదిక వెల్లడిస్తోంది. ఫలితంగా పౌరుల ఆరోగ్యం, వ్యవసాయం, ఆహారోత్పత్తి వంటి అంశాల్లో తీవ్ర పరిణామాలుంటాయని అంచనా! ప్రపంచ సముద్రాల సగటుకన్నా హిందూ మహాసముద్రం వేగంగా వేడెక్కుతోంది. భూమధ్య రేఖకు దగ్గరగా ఉండటం, అసాధారణ జనసాంద్రత, అతిగా భూమ్యావరణ వ్యవస్థ పాడవడం, నియంత్రణలో లేని కాలుష్యం, ఆహారోత్పత్తి– వినియోగానికి సంబంధించి సుస్థిరం కాని అననుకూల విధానాల్ని ఇంకా పాటించడం వంటివి ఈ దుస్థితికి కారణాలు. అతి ఉష్ణోగ్రత వల్ల హిమాలయాల మంచు పొరలు కరగడం, కొండచరియలు విరిగి పడటం తరచూ జరుగుతోంది. ధ్రువాల మంచు కరుగుతున్నందున సముద్ర జల మట్టాలు పెరిగి, సుదీర్ఘ తీరమున్న భారత్‌ను ప్రమాదం లోకి నెడుతోంది. వాతావరణ మార్పు వల్ల మేఘ విచ్ఛిత్తితో అసాధారణ వర్షాలు, తుఫాన్లు, వరదలు వంటి వైపరీత్యాలు పెరుగు తాయి. ఇంకోపక్క కరువులు కూడా అధికమవడం మరో అరిష్టం! వ్యవసాయాధారిత దేశమైన భారత్‌కి ఇదెంతో ప్రతికూలాంశం. వేగంగా నగర–పట్టణీకరణ జరుగుతున్న మన దేశంలో ఈ మార్పులు ఎన్నో అనర్థాలకు దారితీస్తాయి. ఇప్పటికే ముంబై, చెన్నై, హైదరాబాద్ సాధారణ వర్షాలకే అల్లాడే పరిస్థితిని యేటా కళ్ల జూస్తున్నాం. గత అయిదారేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండ–వడగాలికి మరణిస్తున్న వారి సంఖ్య అసాధారణంగా ఉంటోంది. దేశంలో, 40 డిగ్రీల సెల్సియస్‌కు మించిన ఉష్ణోగ్రత దినాలు యేడాదిలో బాగా పెరి గాయి. 2013–19 మధ్య ఇవి యేడాదికి సగటున 114 దినాలుగా నమోదయ్యాయంటేనే తీవ్రత అర్థమౌతోంది. ఆ దేశాలు దిగిరావాలి కాలుష్య కారకులే పరిష్కారాల వ్యయం భరించాలి. అవి దిద్దుబాటు చర్యలైనా, సుస్థిరాభివృద్ధి దిశలో అడుగులైనా, ముందు జాగ్రత్త చర్యలైనా... అని భారత సర్వోన్నత న్యాయస్థానం ఎన్నో సందర్భాల్లో నొక్కి చెప్పింది. జెనీవా అంతర్జాతీయ న్యాయస్థానం కూడా చెప్పిందిదే! పారిశ్రామిక విప్లవ క్రమంలో, రెండో ప్రపంచ యుద్ధానంతరం పలు అభివృద్ధి చెందిన దేశాలు ప్రకృతి వనరుల్ని అడ్డదిడ్డంగా వాడుకున్నాయి. ఏ జాగ్రత్తలూ తీసుకోనందున... కర్బన వ్యర్థాలు, వాయువులతో సహా పలు ఉద్గారాలకు కారణమయ్యాయి. సృష్టి పరిణామ క్రమంలో 8 లక్షల సంవత్సరాల్లో పెరిగిన భూతా పోన్నతి కంటే ఎక్కువగా గడచిన 200 సంవత్సరాల్లో పెరిగింది. ముఖ్యంగా గత వందేళ్లలో, మరీ ముఖ్యంగా ఇటీవలి 20 ఏళ్లలో ఈ పెరుగుదల ప్రమాదకర స్థాయిలో ఉంది. వాతావరణం, కాలుష్యం వంటి అంశాలపై స్పృహ పెరిగేనాటికే ఆయా దేశాలు ఒక స్థాయికి వెళ్లిపోయాయి. ఇప్పుడు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, ముఖ్యంగా మూడో ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందే క్రమంలో చేపట్టే చర్యలపై కట్టడి గురించి అభివృద్ధి సమాజాలు మాట్లాడుతున్నాయి. ఇది ఒక అసమతుల్య ప్రతిపాదన. పారిస్ సదస్సుకు ముందు ఇదొక పెద్ద చర్చ! మనిషి సౌఖ్యం అనుభవించే క్రమంలో... ఇప్పటికీ, ఆయా అభివృద్ధి సమాజాల సగటు ఉద్గారాలు అత్యధిక స్థాయిలోనే ఉన్నాయి. మనం ప్రపంచ సగటుకన్నా చాలా తక్కువ విడుదల చేస్తు న్నాము. ప్రపంచ సగటు తలసరి ఉద్గారాలు (ముఖ్యంగా కార్బన్ డయాక్సైడ్) 6.55 టన్నులైతే, భారత్ తలసరి సగటు 1.96 టన్నులు మాత్రమే! అదే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలలో రెండున్నర రెట్లు అధికంగా ఉంది. జర్మనీ, యూకే, ఫ్రాన్స్ వంటి ఐరోపా సమాజ దేశాలు దాదాపు ప్రపంచ సగటుతో సమానంగా ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న చైనా కూడా అంతే! వాతావరణ మార్పు అందరి సమస్య కనుక, ముఖ్య కారకులైన అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థికంగానో, సాంకేతికంగానో అభివృద్ధి చెందుతున్న, చెందని సమాజాలకు సహకారం అందించాలన్నది అందరూ అంగీకరించిన సత్యం. (చదవండి: అఫ్గాన్‌లో ఆహార కొరత తీవ్రం!) మాట తప్పుతున్న జాడ... ప్రపంచ దేశాలన్నీ వాతావరణ అత్యయిక స్థితిని ప్రకటించి, భూతాపోన్నతి నియంత్రించే సత్వర ఉపశమన చర్యలకు దిగాలి. మరోపక్క వాతావరణ బడ్జెట్‌ను రూపొందించుకొని ముందుకు కదలాలి. కోపన్‌హెగన్ (2009) సదస్సులో అంగీకరించినట్టు అభి వృద్ధి చెందిన దేశాలు ఏటా 100 బిలియన్ డాలర్లు ఆర్థిక సహాయం అందించాలి. కర్బన ఉద్గారాలను అదుపుచేసే అభివృద్ధి నమూనా సాంకేతికతను అభివృద్ధి చెందుతున్న, చెందని దేశాలకు బదలాయిం చాలి. ఇటీవల జరిగిన జీ–7 దేశాల సదస్సులోనూ ఇది చర్చకు వచ్చింది. జీ–20 దేశాలు, ఇంకా కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు తమ బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమౌతున్నాయి. మాటలకు చేతలకు పొంతన లేకుండాపోతోంది. ఇది ఉమ్మడిగా నిర్వహించాల్సిన బాధ్యత. వచ్చే నవంబరులో గ్లాస్గో (స్కాట్లాండ్)లో జరిగే (కాప్– 26) సదస్సు నాటికి నిర్దిష్టమైన విధానాలతో ముందుకు రావాలి. అంతా కలిసి, చిత్తశుద్ధితో ముందుకు కదిలితేనే జఠిలమైన ఈ సమ స్యకు ఉపయోగకరమైన పరిష్కారం. మానవాళి మనుగడకు రక్ష! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com (భారత్ తక్షణ కర్తవ్యం–వచ్చే వారం) -
పెనం మీంచి పొయిలో వేసిన పెద్దన్న!
చికిత్స ఎప్పుడూ రోగం కన్నా ఘోరంగా ఉండకూడదు. అల్‌ఖైదా, దానికి దన్నుగా ఉన్న తాలిబన్ల తాట తీస్తామని అమెరికా అఫ్గాన్‌లో చేరింది. ఇదే అఫ్గాన్ నుంచి 1990లలో రష్యా వైదొలగిన నాటి కంటే, 2001లో అమెరికా అక్కడ కాలూనిన నాటికంటే, తాను అర్థాంతరంగా వైదొలగుతున్న నేటి పరిస్థితులే దారుణం. 3 లక్షల మంది సైనికులకు శిక్షణ ఇచ్చారు, శిక్షణ-ఆయుధాల కోసం తొమ్మిది వేల కోట్ల డాలర్లు (రూ.6.8 లక్షల కోట్లు) ఖర్చు చేశారు. ఇంత చేసి అమెరికా, నాటో దేశాలు ఏం సాధించినట్టు? నేలను చీల్చుకువచ్చే పచ్చని పసరికను ఎంతో ఆశావహంగా చూస్తుంది ప్రపంచం. ఆకుల స్వరూపం ఏర్పడని లేతపిలక ఏం మొక్కై ఉంటుందా? అన్న ఆసక్తి చూపరులకు సహజం! ఎవరి సంగతెలాఉన్నా.... విత్తు అలికిన వాడికి తెలుస్తుంది మొలుచుకు వచ్చే మొక్క ఏంటో? అమెరికా అధ్యక్షుడు బైడన్ మాటలు... ‘‘ఇంకా ఒకటో, ఐదో, ఇరవయో.. ఏళ్లు మేం ఇక్కడే ఉండి సహాయం చేసినా, అప్పటికీ తుది ఫలితం ఇలాగే ఉంటుంది’’ అని అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు అధికారం చేజిక్కించుకోవడంపై చేసిన వ్యాఖ్యలు సాపేక్షంగా ఇదే వెల్లడిస్తాయి. ‘పుల్లగుంజుడు ఆట’లో నెపం నెత్తిన పడ్డ ఆఖరివాడు బైడన్... ఓ నలుగురు అమెరికా అధ్యక్షులు, ఇరవై ఏళ్ల కాలం, వేల కోట్ల డాలర్ల సాక్షిగా జరుగుతున్న మారణ హోమమిది. పెనంలోంచి పొయ్యిలోకి పడ్డ అఫ్ఘాన్ తాజా దుస్థితి కారణాల్లో అమెరికా మొదటిది. ఎందుకంటే, తమ గూడాచార సంస్థ సీఐఏని వాడి తాలిబన్లను, ఉగ్రవాదాన్ని ప్రేరేపించింది అమెరికాయే! రష్యా, చైనాలకు వ్యతిరేకంగా మొదట తాలిబన్లను, వారి స్థావరాలను పెంచి పోషించింది. తర్వాత వారు రష్యాకు దగ్గరైన పరిస్థితులు అమెరికా వైఖరిలో మార్పు తెచ్చాయి. ఉగ్రవాద ముప్పు వేడి తమకు తాకిన ‘జంట భవనాల విధ్వంసం’ తర్వాత అఫ్గానిస్తాన్నే స్వాధీనపరచుకుంది. అల్‌ఖైదా, దానికి దన్నుగా ఉన్న తాలిబన్ల పీఛమణచడానికని నాటో మిత్ర దేశాల సహకారంతో తిష్ట వేసింది. అఫ్గానిస్తాన్‌ని సుస్థిర–ఆధునిక దేశంగా తీర్చిదిద్దుతామని ప్రకటించి, అందుకు భిన్నంగా గడచిన రెండు దశాబ్దాలుగా చేస్తున్న నిర్వాకం కూడా బైడన్ మాటల వెనుక నుంచి తొంగి చూసింది. తాలిబన్లతో ఒప్పందం, దేశం నుంచి వైదొలగిన సమయం, కార్యాచరణ తీరు, వైఖరి సమర్థన... ఇదంతా ఘోర వైఫల్యాల శృంఖలం. మరోవైపు, ‘ఇప్పుడు మేం మారిన మనుషులం, విధానాలు మార్చుకున్న పాలకులం’ అంటున్న తాలిబన్ల మాటల్ని అంతర్జాతీయ సమాజం వింతగా చూస్తోంది. ఏ మాత్రం ప్రతిఘటన ఎదుర్కోకుండా కాబూల్‌ని స్వాధీనపరచుకున్న ఆదివారం నుంచి తాలిబన్లు చెబుతున్న మాటలకు భిన్నంగా గత 24 గంటల్లో హింసాత్మక పరిణామాలు, తాలిబన్లు సంయమనం కోల్పోయిన ఉదంతాలు సందేహాలను మరింత బలోపేతం చేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి (యూఎన్) తో సహా ముఖ్య దేశాలు ఒకటొకటిగా స్పందిస్తున్నాయి. (కనీసం మా బిడ్డల్ని అయినా కాపాడండి! బావురుమంటున్న అఫ్గన్లు వైరల్ వీడియో) భారత్ ఒంటరవుతోందా? దక్షిణాసియాలో క్రమంగా భారత్ ఒంటరవుతోందా? విస్తరణ తత్వాన్ని పెంచుకున్న చైనా వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ, భారత్ స్థానే దక్షిణాసియాలో ఆధిపత్యం కోసం ఎత్తులు వేస్తోంది. దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార కూటమి (సార్క్) చప్పబడిన ప్రస్తుత పరిస్థితుల్లో, భారత్‌ను మినహాయించి, మెజారిటీ సార్క్ సభ్యదేశాలతో చైనా కొత్తగా జట్టుకడుతోంది. ఈ దిశలో ‘ఒక బెల్టు, ఒక రోడు’్డ పథకం వారికి కలిసివచ్చిన అదృష్టం! ఇప్పుడు అఫ్గాన్‌లో స్వేచ్ఛ లభించిందని పాక్ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్ బహిరంగ ప్రకటన చేశారు. (Afghanistan: అశ్రఫ్ ఘనీ స్పందన, ఫేస్బుక్లో వీడియో) ఇటీవలి కాలంలో, భారత్ విదేశీ విధానంలో కొట్టిచ్చిన మార్పు అమెరికాతో అతిగా అంటకాగటం! అలా అని, అమెరికా ఏమైనా భారత్ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటుందా? అంటే, అదేం లేదు. అమెరికాకు ఎంతసేపూ, తన ప్రయోజనాలే ముఖ్యం. అఫ్గాన్ విషయంలోనూ అదే జరిగింది. దేశం విడిచివెళ్లాక కూడా మధ్య ఆసియాపై పెత్తనానికి అమెరికా ఏర్పాటు చేసుకున్న ‘చతుష్ట కూటమి’ (క్వాడ్)లో తనతో పాటు అఫ్గానిస్తాన్, ఉజ్బెకిస్తాన్, పాకిస్తాన్లను చేర్చింది తప్ప భారత్‌కు చోటు లేదు. అమెరికా శక్తిసా మర్థ్యాలపై అతినమ్మకం, ముఖ్యంగా అఫ్గానిస్తాన్ విషయంలో అమెరికా చర్యలన్నింటికీ మద్దతిచ్చిన మనతీరు దౌత్య వైఫల్యంగానే నిపుణులు చెబుతారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఇప్పటికి రెండు మార్లు భేటీ అయిన రక్షణ మంత్రివర్గ సంఘం (సీసీఎస్) వేచి చూసే «ధోరణికే ప్రాధాన్యతనిస్తోంది. ‘జియోపాలిటిక్స్’ ప్రాధాన్యత సంతరించుకుంటున్న ఈ రోజుల్లో, పలు దేశాల సరిహద్దులతో భౌగోళికంగా ఎంతో కీలక స్థానంలో ఉన్న అఫ్గానిస్తాన్ వ్యూహాత్మకంగా పాకిస్తాన్, రష్యా, చైనాలకు దగ్గరవడం... మనను అస్థిరపరిచేదే! ఎలా చూసినా ఇది భారత్‌కు ప్రమాదకరమనే భావన వ్యక్తమౌతోంది. ముఖ్యంగా ఉగ్రవాదం–కశ్మీర్ సమస్యల దృష్ట్యా ఈ లెక్కలు. తాలిబన్లతో ఒక దొడ్డిదారి సంపర్కం భారత్‌కు ఏర్పడిందని, తద్వారానే సురక్షితంగా మన దౌత్య సిబ్బందిని కాబూల్ నుంచి ఢిల్లీ రప్పించగలిగారనీ వార్తలు. కవలలతో ప్రపంచమే కలవరం బయటకు పోరాడుతున్నట్టే కనిపించినా, పరస్పరం పెంచి పోషించుకునే సామ్రాజ్యవాదం, మతోన్మాదం... ఈ రెండూ ప్రమాదకర కవలలే! విస్తరణ తత్వంతో ఆధిపత్య పోరు జరిపే అగ్రరాజ్యాలు వివిధ దేశాల్లో పెట్టే చిచ్చు చరిత్ర చెప్పే సత్యం. జాతి–మత–ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టి అంతర్యుద్ధాలు, ప్రచ్చన్న యుద్ధాఓలను ఆయా దేశాలపై రుద్దిన సందర్భాలెన్నో! ఉగ్రవాదాన్ని ఒక్కో సందర్భాన్ని బట్టి పుట్టించడం, పెంచి పోషించడం, పీఛమడచినట్టు వ్యవహరించడం ఈ పెద్దన్నలకు రివాజు! మతోన్మాద సంస్థలు కూడా తమ సంకుచిత ప్రయోజనాలకు, ఆయుధాలు, స్థావరాలు, డబ్బు కోసం సామ్రాజ్యవాద శక్తుల చేతుల్లో సందర్భాన్ని బట్టి పావులుగా మారతాయి. వారి స్థూల ప్రయోజనాలు నెరవేర్చి, తమ పబ్బం గడుపుకుంటాయి. చికిత్స ఎప్పుడూ రోగం కన్నా ఘోరంగా ఉండకూడదు. అల్‌ఖైదా, దానికి దన్నుగా ఉన్న తాలిబన్ల తాట తీస్తామని అమెరికా అఫ్గాన్‌లో చేరింది. ఇదే అఫ్గాన్ నుంచి 1990లలో రష్యా వైదొలగిన నాటి కంటే, 2001లో అమెరికా అక్కడ కాలూనిన నాటికంటే, తాను అర్థాంతరంగా వైదొలగుతున్న నేటి పరిస్థితులే దారుణం. 3 లక్షల మంది సైనికులకు శిక్షణ ఇచ్చారు, శిక్షణ–ఆయుధాల కోసం తొమ్మిది వేల కోట్ల డాలర్లు (రూ.6.8 లక్షల కోట్లు) ఖర్చు చేశారు. ఇంత చేసి అమెరికా, నాటో దేశాలు ఏం సాధించినట్టు? నిజానికి ఏమీ లేదు. తన సామ్రాజ్యవాద ప్రయోజనాలు, ఆధిపత్య అవసరాలు, ఆయుధ విక్రయాలు, వ్యాపార లాభాలు... ఇవే అమెరికాకు కావాలి. కరడుగట్టిన తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను 2011, పాకిస్తాన్లో మట్టుపెట్టిన తర్వాత అఫ్గాన్‌లో అమెరికా మిషన్ ముగిసింది. తర్వాత దశాబ్దం, గడువు మించి ఉండటమే! తాలిబన్ల శక్తి–విస్తరణని, అఫ్గాన్ సైనిక చేవను, అక్కడి కీలుబొమ్మ ప్రభుత్వ సామర్థ్యాన్ని అంచనా వేయడంలో అమెరికా ఘోరంగా విఫలమైంది. సర్కారు మనుగడ 3 నెలలని జోస్యం చెప్పినా, రెండు వారాల్లో ప్రభుత్వం చేతులెత్తి పలాయనం చిత్తగించింది. ఇదంతా, అమెరికా చరిత్రలోనే హీనమైన ఓటమికి తార్కాణమన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య అక్షర సత్యం! ఇక ఆయన నిర్వాకానికి వస్తే, అఫ్గాన్ ప్రభుత్వాన్ని, ప్రజల్ని భాగం చేయకుండా 2020 ఫిబ్రవరి, దోహా(కతర్)లో తాలిబన్లతో కుదుర్చుకున్న శాంతి ఒప్పందమే ఓ గుల్ల, ఏకపక్షం! అనుచిత జోక్యాలు, ఆధిపత్య పోకడలు, సొంత మేళ్లు, నికర నష్టాలు, జారుకొని వైదొలగడాలు అమెరికాకు కొత్తేమీ కాదు. 1970లలో వియత్నాం నుంచి, 2011లో ఇరాక్ నుంచి వైదొలగడాలూ వైఫల్యాలే తప్ప వారి ఖాతాలో విజయాలు శూన్యం! (Afghanistan: ఆమె భయపడినంతా అయింది!) అఫ్గాన్‌లో ఛాందసవాదం వీడిన సమ్మిళిత సర్కారును అంతర్జాతీయ సమాజం కోరుకుంటోంది. అప్పుడే... మహిళలు, పిల్లలు, మైనారిటీలకు రక్ష! మానవహక్కులు భద్రం! పాకిస్తాన్ నిఘా సంస్థ (ఐఎస్ఐ) అదుపాజ్ఞల్లో, ఇస్తామాబాద్ కనుసన్నల్లో పనిచేసే సర్కారయితే... అఫ్గాన్‌లో ఇక నిత్యం రగిలేది రావణ కాష్టమే! ప్రపంచంలోని దాదాపు ఉగ్రవాద సంస్థలన్నిటికీ అక్కడ ఇప్పటికే స్థావరాలున్నాయి. తాలిబన్ల వైఖరిని బట్టే వాటి భవిష్యత్ మనుగడ! ఉగ్రవాద పోషణకు, ఎగుమతికి అఫ్గాన్‌ను కేంద్రం చేస్తే అంతర్జాతీయ సమాజం ఉపేక్షించదు. తాలిబన్లు ఆశిస్తున్నట్టు అధికారం సుస్థిరం కావాలంటే, అంతర్జాతీయ ఆర్థిక సహకారం అందాలంటే, వారే చెప్పుకుంటున్నట్టు వారి పంథా మారాలి. అప్పుడే తాలిబన్ల విజయం సార్థకం! దిలీప్ రెడ్డి -
దొంగ‘చూపు’లెవరివి?
హక్కుల కార్యకర్తల నుంచి జర్నలిస్టులు, ఎన్నికల ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు, విపక్షనేతలు, మంత్రులు.. పరిమితి లేకుండా, ఎంపిక చేసిన అందరి కదలికల్ని, భావాల్ని, ఆలోచనల్ని, సంభాషణల్ని, ఫోటోలని, డాక్యుమెంట్లనూ చడీచప్పుడు లేకుండా ‘నిరంతర నిఘా’తో లాక్కుంటే ఇక ఏమి మిగులుతుంది? ప్రత్యక్షంగా ఇది ప్రజాస్వామ్య హక్కులపైనే దాడి. మొత్తం పౌర సమాజమే ఓ అనధికారిక నిఘా నేత్రం కింద, నిరంతరం నలుగుతున్నట్టు లెక్క! తాజా ‘పెగసస్’ స్పైవేర్ అలజడి ఈ ఉల్లంఘనే! రాజ్యమే ఈ చర్యకు పాల్పడితే ఇక పౌరులకు దిక్కేది? గ్రీక్ ఇతిహాసంలోదే అయినా... ఎగిరే రెక్కల గుర్రం (పెగసస్) అంటేనే అసాధారణ శక్తి. అది ఆధునిక శాస్త్ర సాంకేతికత రూపంలో కనబడకుండా, వినబడకుండా అన్ని వ్యక్తిగత గోప్య ప్రదేశాల్లోకి చొర బడితే పరిస్థితి ఏంటి? పురమాయించిన పనే రహస్య నిఘా, నివేదిం చడం అయితే, రాజ్యాంగం దేశ పౌరులకు హామీ ఇచ్చిన వ్యక్తిగత గోప్యత హక్కు గాలికిపోయినట్టే! సదరు స్వేచ్ఛ ఆధారంగా అభిప్రా యాలు ఏర్పరచుకోవడం, భావ వ్యక్తీకరణ, పాలనలో పాల్గొనడం మొదలు... గౌరవప్రదంగా జీవించడం వరకుండే ప్రజాస్వామ్య మౌలిక హక్కులన్నీ భంగపోయినట్టే! హక్కుల కార్యకర్తల నుంచి జర్నలి స్టులు, ఎన్నికల ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు, విపక్ష నేతలు, మంత్రులు.... పరిమితి లేకుండా, ఎంపిక చేసిన అందరి కద లికల్ని, భావాల్ని, ఆలోచనల్ని, సంభాషణల్ని, ఫోటోలని, డాక్యుమెం ట్లనూ చడీచప్పుడు లేకుండా ‘నిరంతర నిఘా’తో లాక్కుంటే ఇక ఏమి మిగులుతుంది? ప్రత్యక్షంగా ఇది ప్రజాస్వామ్య హక్కులపైనే దాడి. మొత్తం పౌర సమాజమే ఓ అనధికారిక నిఘా నేత్రం కింద, నిరం తరం నలుగు తున్నట్టు లెక్క! తాజా ‘పెగసస్’ స్పైవేర్ అలజడి ఈ ఉల్లంఘనే! ఇంతటి దుశ్చర్యకు పాల్పడిందెవరు? ఎవరు చేయిం చారు? విస్తృతి ఎంత? అన్నది తేలితే కాని, ప్రమాద తీవ్రత బోధ పడదు. విపక్షాలు, హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నట్టు రాజ్యమే ఈ చర్యకు పాల్పడితే ఇక పౌరులకు దిక్కేది? కేంద్ర ప్రభుత్వం చెబుతు న్నట్టు తనకు ప్రమేయం లేకుంటే, మరెవరు చేసినట్టు? దేశంలోని అత్యున్నత వ్యవస్థలు, వ్యక్తుల గోప్య సమాచారంపైన, కేంద్ర ప్రభు త్వానికి తెలియకుండా ఏ విదేశీ ఎజెన్సీలదో నిఘా ఉంటే, సమాచార మంతా రహస్యంగా వారికి చేరుతుంటే, దేశ భద్రతకది ముప్పు కాదా? నిజాలు నిగ్గుతేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? ఇవీ తాజా ప్రశ్నలు. పార్లమెంటు కార్యకలాపాలు గత నాలుగు రోజులుగా ఇదే వివాదంపై దాదాపు స్తంభించాయి. సాంకేతిక పరిజ్ఞానమే ఉపకర ణంగా ‘పెగసస్’ ఓ నిఘా దాడి. ఇజ్రాయెల్‌కు చెందిన జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్ఓ) ఈ స్ఫై(సాఫ్ట్)వేర్ విక్రేత! ప్రపంచ వ్యాప్తంగా 45 దేశాల్లో యాబై వేలమంది మొబైల్ నంబర్లు ఈ నిఘా కింద ఉండగా, వెయ్యిమంది ఫోన్ల నుంచి సమాచార చౌర్యా(హాక్)నికి లంకె ఏర్ప డ్డట్టు తాజా పరిశోధనలో వెల్లడైంది. పారిస్ కేంద్రంగా పనిచేసే లాభా పేక్షలేని ఓ మీడియా కూటమి (ఫోర్బిడెన్ స్టోరీస్)– హక్కుల సంఘం (ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్) జరిపిన పరిశోధనలో ఇది ధ్రువపడింది. అందులో మన దేశానికి చెందిన 300 నంబర్లు బయట పడ్డాయి. తొలిసారి కాదు తెలియకుండానే ‘పెగసస్’ నిఘా దేశంలో పలువురిపై ఉందని వెల్లడ వడం ఇదే మొదటిసారి కాదు. రెండేళ్ల కిందటే వెలుగులోకి వచ్చింది. భీమా–కోరేగావ్ నిందితులైన హక్కుల కార్యకర్తలు, న్యాయవాదుల టెలిఫోన్లు ట్యాప్/హ్యాక్ అయ్యాయని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. తెలియకుండానే కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలోకి ఓ మాల్వేర్ చొరబడి పోయింది. అప్పటికే పెగసస్ ప్రస్తావన వచ్చింది. 2019లో పార్ల మెంట్ (ఐటీ) స్థాయీ సంఘం విచారించినపుడు, 121 మంది ఫోన్లు ట్యాపింగ్‌కు గురైనట్టు అధికారులు తెలిపారు. రిమోట్ పద్ధతిలో మొబై ల్లోకి వచ్చి తిష్టవేసే ఈ మాల్వేర్, ఫోన్ యజమానికి స్పృహలో లేకుండానే సమాచారాన్ని వేరెక్కడో కేంద్రకంగా పనిచేసే నిర్వాహ కులకు చేరుస్తుంది. కాంటాక్ట్ నంబర్లు, మెసేజ్‌లు, కాల్డాటాయే కాకుండా సంభాషణలు, మెయిల్ సమాచారం, పత్రాలు, ఫోటోలు కూడా పంపిస్తుంది. రిమోట్ ఆపరేషన్ పద్ధతిలోనే కెమెరా కూడా పని చేస్తుంది. మన దేశంలో, బయట కూడా ఇది వెలుగుచూశాక... వాట్సాప్, ఫేస్బుక్, యాపిల్ వంటి సామాజిక మా«ధ్యమ వేదికలు పెగసస్ బారిన పడకుండా సెక్యూరిటీ ఫీచర్స్‌ను ఆధునికీకరించు కున్నాయి. అయినా, ఆ స్ఫైవేర్ మరింత ఆధునికతతో ఆపిల్, ఆండ్రా యిడ్లలో చొరబడగలుగుతోంది. ‘పెగసస్’ సేవల్ని ప్రభుత్వం విని యోగించుకుంటోందా? అన్న నిర్దిష్ట ప్రశ్నకు నాటి ఐ.టీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ రాజ్యసభలో సూటిగా సమాధానం చెప్పకుండా దాట వేశారు. ‘ఏది జరిగినా చట్టనిబంధనలకు లోబడి, అధికారిక అనుమ తులతోనే నిఘా ఉంటుంది’ అని ఓ నర్మగర్భ సమాధానమిచ్చారు. మాల్వేర్ విక్రేత ఎన్ఎస్ఓ కథనం ప్రకారం ఇది కేవలం ప్రభు త్వాలకు, వారి అధీకృత సంస్థలకే విక్రయిస్తారు. నిర్దిష్టంగా దేశ భద్రత, తీవ్రవాద కార్యకలాపాల నియంత్రణ కోసమే! అలాంట ప్పుడు సమాజంలోని వివిధ వృత్తుల, స్థాయిల వారి ఫోన్లు ఎందుకు హ్యాక్ అయ్యాయి? ప్రభుత్వ విధానాలను నిరసించే వారు, చీకటి వ్యవహారాల నిగ్గుతేల్చే పరిశోధనా జర్నలిస్టులు, గిట్టని అధికారులు, రాజకీయ ప్రత్యర్థులు ఎందుకు లక్ష్యం అవుతున్నారు? జాబితాలోని పేర్లను బట్టి చూసినా, ఈ నిర్వాకం ఎవరి చర్య? వారిపై నిఘా వేయా ల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? అన్నది ఇట్టే తెలిసిపోతోంది. వెల్లడైన జాబితా ఊహాజనితమని ఒకసారి, తామేమీ నిర్వహించం, స్ఫైవేర్ ఒకసారి విక్రయించాక, నిర్వహణ అంతా ఆయా దేశాలదే అని మరోమారు ఎన్ఎస్వో పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తోంది. సంస్కరణలు రావాలి మన దేశంలో నిఘా వ్యవస్థ నిర్వహణ సరిగా లేదు. సమూల సంస్క రణల అవసరం. వ్యక్తుల గోప్యత హక్కు–దేశ భద్రత మధ్య సమ తూకం సాధించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని కేంద్ర గృహమంత్రి అమిత్ షా తాజా వివాద నేప«ధ్యంలో వెల్లడించారు. కానీ, చట్టాలకు అతీతంగా, అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రభుత్వ నిఘా నిర్వాకాలు భంగం కలిగించిన సందర్భాలే ఎక్కువ. ‘వ్యక్తిగత సమాచార సంరక్షణ చట్టం’ దేశంలో ఇంకా తుది రూపు సంతరించుకోలేదు. ‘గోప్యత పౌరుల ప్రాథమిక హక్కే’ అని 2018లోనే సుప్రీంకోర్టు తేల్చింది. పౌరుల వ్యక్తిగత సమాచారంలోకి అనుచితంగా జొరబడే అధికారం ప్రభుత్వానికి, దర్యాప్తు–నిఘా సంస్థ లకి లేదు. సంభాషణల్ని అడ్డగిస్తూ, టెలిఫోన్ ట్యాప్ వంటివి చేయాల్సి వచ్చినా.. చట్టాలకు లోబడి, సుప్రీంకోర్టు వేర్వేరు సంద ర్భాల్లో వెల్లడించిన తీర్పుల స్ఫూర్తిని నిలబెడుతూ జరపాలి. అలా నిఘా వేయాలంటే, ఏయే పరిస్థితులు ఉండాలో 2017లో, 2019లో జస్టిస్ పుట్టుస్వామి ఇచ్చిన తీర్పులే స్పష్టం చేశాయి. ‘నేర ప్రక్రియ çస్మృతి’ (సీఆర్పీసీ) సెక్షన్ 92, ‘భారత టెలిగ్రాఫ్ చట్టం’, నిబంధన 419ఎ తో పాటు ‘ఐ.టీ చట్టం’, సెక్షన్లు 69, 69బి కింది నిబంధనల ప్రకారమే ప్రస్తుతం పౌరుల టెలిఫోన్ సంభాషణలు, ఇతర సమా చార–ప్రసార మార్పిడులలో అధికారులు కల్పించుకుంటున్నారు. నిఘా వేస్తున్నారు. విధివిధానాల్లో స్పష్టత లేక, రాజకీయ ప్రయోజ నాలకోసం దురుపయోగం ఎక్కువనేది విమర్శ. హిమాచల్‌ప్రదేశ్‌లో, 2012లో కొత్త ప్రభుత్వం పోలీసు దర్యాప్తు సంస్థలపై దాడి జరిపి నపుడు, వెయ్యి మందికి సంబంధించిన లక్ష సంభాషణలు దొరికాయి. 2009లో సీబీడీటీ–నీరారాడియా వ్యవహారంలో, 2013లో గుజరా త్లో అమిత్‌షాపై అభియోగాలు వచ్చిన కేసులో... ఇలా చాలా సంద ర్భాల్లో ఇదే జరిగింది. పౌరుల హక్కుల భంగంతో పాటు దేశ ప్రతిష్ట విశ్వవేదికల్లో ఇటీవల దిగజారిపోతోంది. అమెరికాకు చెందిన ‘ఫ్రీడమ్ హౌజ్‘ భారత్‌ను స్వేచ్ఛాయుత స్థితి నుంచి పాక్షిక స్వేచ్ఛా దేశంగా వెల్లడిం చింది. ‘వి–డెమ్’ అనే స్వీడన్ సంస్థ అతిపెద్ద ప్రజాస్వామ్యమే కాదు, మనది ‘ఎన్నికల నియంతృత్వం’ అని తన వార్షిక నివేదికలో అభివ ర్ణించింది. ‘ప్రజాస్వామ్య సూచిక’లో భారత్ ‘లోపభూయిష్ట ప్రజా స్వామ్యం’గా ముద్రపడి 53వ స్థానానికి పడిపోయింది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో 142 (180 దేశాలకు) స్థానానికి దిగజారి పోయాం. నిర్హేతుకమైన నిఘా, వ్యక్తిగత గోప్యతపై దాడి జరిగిన తాజా వివాదంపై నిష్పాక్షికమైన, స్వతంత్ర దర్యాప్తు జరగాలి. నిజాలు నిగ్గుతేలాలి. అప్పుడే, పౌరులకు రక్ష, మన ప్రజాస్వామ్యానికి విలువ. దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
నిన్నటి తప్పు నేడు చేయొద్దు!
‘డెల్టా ప్లస్’ అత్యంత ప్రమాదకారి అని అంతర్జాతీయ శాస్త్రసమాజమే అభిప్రాయపడుతోంది. ‘అసలు డెల్టాయే ప్రమాదకారి, డెల్టా ప్లస్ ఇంకా...’ అని ప్రఖ్యాత వైరాలజిస్టు, అమెరికా శ్వేతసౌధ ముఖ్య సలహాదారు ఆంథోనీ ఫౌచీ పేర్కొన్నారు. గత రెండు రోజులుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తున్న సూచనలు, చేస్తున్న హెచ్చరికలు ఇదే ధ్రువపరుస్తున్నాయి. ‘ఇది అత్యంత ప్రమాదకారి, దీంతో జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో వైద్యులు, శాస్త్ర నిపుణుల నిర్దేశించే ప్రవర్తన కలిగి ఉండటం పౌర సమాజపు ప్రధాన కర్తవ్యం! పౌరసమాజానికిది పరీక్షా కాలం! ప్రభుత్వాలకు, అంతకుమించి మన ప్రజారోగ్య వ్యవస్థకున్న పరిమితులు తేటతెల్లమైన తర్వాత ఎవరైనా పౌరసమాజంపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. ప్రభుత్వ చర్యల వైపు చూస్తూనే విశాల జనబాహుళ్యపు పూర్తి సహకారం అర్తించే సమయమిది. ప్రజలు సంయమనం, క్రమశిక్షణ, శ్రద్ధ వహిస్తేనే... కోవిడ్–19 వంటి మహమ్మారి నుంచి సమాజం బయటపడగలుగుతుంది. ఇలాంటి ఉపద్రవాలనెన్నింటినో అధిగమిం చిన చారిత్రక సందర్భాలు ప్రజల ‘సమష్టి–నిబద్ధ కృషి’ ఖాతాలో చాలా ఉన్నాయి. ఏడాదిన్నర కాలంగా ప్రపంచ మానవాళినే వణికి స్తున్న కోవిడ్–19 తగ్గినట్టే తగ్గుతూ... వైరస్ కొత్త రకాల్ని సృష్టి స్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. మనిషి సహజ రోగనిరోధక శక్తి, చికిత్స ద్వారా ఇచ్చే ఔషధాలను తట్టుకునేందుకు వైరస్ తనంత తాను రూపు–స్వభావం మార్చుకోవడం (మ్యుటేషన్) సహజం. ఈ క్రమంలో పుడుతున్న కొత్త రకాలు (వేరియంట్స్) ఎన్నో! వూహాన్ (చైనా) మౌలిక రకం నుంచి... ఆల్ఫా (యు.కె.లో గుర్తించిన రకం), బీటా (దక్షిణాఫ్రికాలో బయటపడిన రకం), డెల్టా (భారత్‌లో వెలుగు చూసిన రకం)లను దాటి తాజాగా పుట్టి క్రియాశీలమౌతున్న ‘డెల్టా ప్లస్’ రకం దడ పుట్టిస్తోంది. దేశంలో 40 కేసులు దాటాయి. మననే కాక మరో 8 దేశాలకూ నిద్ర లేకుండా చేస్తోంది. దాని లక్షణాలు, కన బరిచే స్వభావం, చూపే ప్రభావం... సరికొత్త సవాల్! ఇప్పుడు మనం వాడుతున్న టీకామందులు కొత్త రకం వైరస్ నుంచి ఏమేర రక్షణ కల్పిస్తాయనే విషయమై విశ్వవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతు న్నాయి. ‘డెల్టా’ మౌలిక రకం వైరస్ బారిన పడినా, ఆస్పత్రి వెళ్లే దాకా పరిస్థితిని రానీయకుండా ఫైజర్, ఆస్ట్రాజెనికా (మన కోవిషీల్డ్) టీకా మందు రక్షణనిస్తుందని ఆక్స్ఫర్డ్ అధ్యయనంలో వెల్లడైంది. ‘డెల్టా ప్లస్’ వైరస్ నుంచి కూడా సదరు రక్షణ లభిస్తుందా? అన్నది ఇంకా పరీక్షల స్థితిలోనే ఉంది. ఇదే విషయమై భారత వైద్య పరిశోధనా మండలి (ఐ.సి.ఎం.ఆర్) నిర్వహిస్తున్న పరీక్ష ఫలితాలు త్వరలోనే వెలువడనున్నాయి. ‘టీకామందు తీసుకున్న వారిలో పుట్టే యాంటీ బాడీలు, కొత్త వైరస్‌ను నిర్వీర్యం చేస్తున్నాయా? అనేది మా పరీక్షల్లో తేలుతుంది’ అంటూ మండలి శాస్త్రవేత్త డాక్టర్ సమీరన్ పండ చెప్పిన మాటలు కొత్త ఆశల్ని, ఆకాంక్షల్ని రేకెత్తిస్తున్నాయి. అతి ప్రమాదకారి కొత్త రకం ‘డెల్టా ప్లస్’ అత్యంత ప్రమాదకారి అని అంతర్జాతీయ శాస్త్రసమాజమే అభిప్రాయపడుతోంది. ‘అసలు డెల్టాయే ప్రమాదకారి, డెల్టా ప్లస్ ఇంకా...‘ అని ప్రఖ్యాత వైరాలజిస్టు, అమెరికా శ్వేతసౌధ ముఖ్య సల హాదారు ఆంథోనీ ఫౌచీ పేర్కొన్నారు. లోతైన పరిశీలనల్ని బట్టి.... వేగంగా వ్యాప్తి, ఇన్ఫెక్షన్ను పెంచడం, సోకిన వారి–ఊపిరితిత్తుల కణజాలాన్ని బలంగా అంటిపెట్టుకోవడం, మోనోక్లోనల్ యాంటీ బాడీల ప్రభావాన్ని బాగా తగ్గించడం వంటివి తాజా వైరస్ లక్ష ణాలుగా చెబుతున్నారు. అందుకే, వ్యూహాత్మకంగా ముందుకు సాగా లని ప్రభుత్వాలూ హెచ్చరిస్తున్నాయి. గత రెండు రోజులుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తున్న సూచనలు, చేస్తున్న హెచ్చరికలు ఇదే ధ్రువపరుస్తున్నాయి. మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. ‘ఇది అత్యంత ప్రమాదకారి, తీవ్ర రూపం దాల్చకుండా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని రాష్ట్ర ప్రభుత్వాలను అప్ర మత్తం చేసింది. మరో మూడు రాష్ట్రాల్లోనూ ఈ కేసుల్ని గుర్తించినట్టు చెబుతున్నా అధికారికంగా సమాచారం లేదు. డెల్టా ప్లస్ కేసులు రాగానే అప్రమత్తం కావాలని, ఆయా ప్రాంతాల్లో స్థానిక కట్టడి (కంటైన్మెంట్ జోన్ల ప్రకటన) ఏర్పరచాలని, నమూనాలను తదుపరి పరీక్ష–విశ్లేషణ కోసం ‘జీనోమిక్ కన్సార్షియం’ (ఐఎన్ఎస్ఏసీవోజీ)కి పంపించాలనీ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్దేశించింది. డెల్టా రకం వైరస్ 80 దేశాల్లో కనిపించినా, డెల్టా ప్లస్ భారత్‌తోపాటు అమెరికా, బ్రిటన్, పోలాండ్, పోర్చ్‌గల్, రష్యా, చైనా, జపాన్, నేపాల్ దేశాల్లో వెల్లడైంది. ఆల్ఫా రకం ఒకరి నుంచి సగటున నలుగురికి వ్యాప్తి చెందే ఆస్కారం ఉంటే, డెల్టా ప్లస్ 5 నుంచి 8 మందికి సోకే ప్రమాదముంది. డెల్టా మౌలిక రకం కూడా ప్రమాదకారేనని పశ్చిమ దేశాల వైద్యులు, శాస్త్రవేత్తలంటున్నారు. బ్రిటన్ గణాంకాల ప్రకారం, డెల్టా సోకిన వారిలో లక్షణాలు బయటకు కనిపించిన నాటి నుంచి కేవలం 3–4 రోజుల్లోనే ఇన్ఫెక్షన్ తీవ్ర స్థితికి వెళ్లిపోతున్నట్టు స్పష్టమైంది. అడుగులు ముందుకే పడాలి దేశంలో కోవిడ్ కేసులు రమారమి తగ్గుతున్న పరిస్థితి. మొత్తమ్మీద 40 కోట్ల మందికి పరీక్షలు జరుపగా, 3 కోట్ల మందికి కరోనా సోకినట్టు రికార్డయింది. ఒకరోజు కొత్త కేసులు సగటున 40 వేలకు తగ్గాయి. ఒకరోజు కోలుకున్న వారి సంఖ్య 82 వేలకు పెరిగింది. కొత్త కేసుల కన్నా రోగులు కోలుకున్న కేసుల సంఖ్య ఎక్కువ గత 40 రోజుల నుంచి నిరవధికంగా నమోదవుతోంది. ఈ పరిస్థితుల్లో... వైరస్ కొత్తరకం వ్యాప్తి పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా, కోవిడ్ మూడో అల అనుకున్న దానికన్నా ముందే ముంచుకు వచ్చే ప్రమాదాన్ని ప్రభు త్వాలతో పాటు నిపుణులూ శంకిస్తున్నారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల చర్యలెలా ఉన్నా... పౌరసమాజం బాధ్యతగా వ్యవహరించాలంటు న్నారు. కోవిడ్ సముచిత ప్రవర్తన (సీఏబీ) కలిగి ఉండాల్సిన అవ సరం ఏమిటో రెండో అలలో మనకు స్పష్టంగా బోధపడింది. వ్యూహం కొరవడ్డ ప్రభుత్వ విధాన లోపాలు, అవసరానికి తగ్గట్టు లేని మన వైద్య–ప్రజారోగ్య వ్యవస్థ అగచాట్లకు పౌరుల విపరీత ప్రవర్తన తోడై రెండో అలలో తీవ్ర నష్టమే జరిగింది. లక్షలమంది ప్రాణాలు కోల్పో యారు. ఇరవై రోజుల్లో లక్షమంది భారతీయులు చనిపోయిన పాడుకాలం ఈ అలలోనే చూశాం. లక్షలాది మంది వ్యాధి బారిన పడి కోలుకున్నా... కోవిడ్ తర్వాతి ఇబ్బందులతో ఇంకా సతమతమౌ తున్నారు. కోట్లాది మంది ప్రాణాలు అరచేత పట్టుకొని బిక్కుబిక్కు మంటూ గడిపిన దిక్కుమాలిన కాలం. మొదటి అల ముగింపు దశలో మన అలసత్వానికి తగిన మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. అంత దాకా ఉన్న కట్టడిని క్రమంగా ఎత్తివేసి ప్రభుత్వాలు కొంత వెసులు బాటు ఇవ్వగానే, పౌరులు విచ్చలవిడిగా బయటకు వచ్చారు. మహ మ్మారి నుంచి గట్టెక్కామనుకున్నారు. గుంపులుగా తిరిగి, పండుగలు– పబ్బాల్లో గుమిగూడి, మాస్క్‌లు లేకుండా, భౌతిక దూరం లెక్క చేయక ఇష్టానుసారం నడిచారు. అప్పుడే డెల్టా రకం వైరస్ వచ్చి తీరని నష్టం కలిగించింది. గత డిసెంబరులో తొలిసారి ఇక్కడే వెలుగు చూసింది. రెండో అల వేగంగా ముంచుకు వచ్చి, తీరని నష్టం కలిగిం చడం వెనుక బలమైన కారణాలు ఇవే అని ఆధారాలతో వెల్లడైంది. వైరస్ ప్రభావం, కేసుల సంఖ్య తగ్గుతూ ఇప్పుడిప్పుడే ఊరట చెందు తుంటే... వైరస్ కొత్త రకం మళ్లీ బయపెడుతోంది. అవసరం మనది... ఒక వంక వైరస్ వ్యాప్తిని నిలిపి, వైద్యం అందించి ప్రాణాలు నిలు పడం మరో వైపు కార్యకలాపాలు సాగించి ఆర్థికవ్యవస్థను మెరుగు పరచడం ప్రభుత్వాల బాధ్యత. రెంటి మధ్య సమతూకం పాటించి ప్రాణాలు, ప్రాణాధారాలను కాపాడే ద్విముఖపాత్ర ప్రభుత్వాలు పోషిస్తాయి. కానీ, ప్రాణాధారాలు కాపాడుకుంటూనే ప్రాణాలు నిలుపుకోవలసిన అవసరం ప్రజలది. ఇంతటి మహమ్మారిని ఎదు రొడ్డి నిలిచే నిత్య పోరాటం ఒక ఉమ్మడి బాధ్యత! వైరస్ వ్యాప్తిని, కోవిడ్ ప్రభావాన్నీ నిలువరించేలా పౌరులు అన్ని జాగ్రత్తలు పాటిం చాలి. వైరస్ కొత్తరూపంలో ప్రమాదం ముంచుకొస్తున్నప్పుడు... అప్రమత్తత ఎంతో అవసరం. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతుల్ని నిరంతరం శుభ్రపరచుకోవడం... ఇలా వైద్యులు, శాస్త్ర నిపుణుల నిర్దేశించే ప్రవర్తన కలిగి ఉండటం పౌర సమాజపు ప్రధాన కర్తవ్యం! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
లోకం చూపు టీకావైపు!
సరైన డాటా వెల్లడి, సముచిత నిర్ణయాలు, అమల్లో పారదర్శకతే కోవిడ్ విముక్తి పోరులో కీలకమని నిపుణులంటున్నారు. కేసుల లెక్క, మరణాల సంఖ్య, వ్యాధిగ్రస్తులవడం–కోలుకోవడం వంటి విషయాల్లో నిజాలు చెప్పట్లేదని, తప్పుడు గణాంకాలిస్తున్నారనే విమర్శలున్నాయి. మరో వంక, టీకామందు నిల్వల గురించి సమాచారం జనబాహుళ్యంలో పెట్టకూడదని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, ఇతర సంస్థలకు ఇటీవలే నిర్దిష్ట ఆదేశాలిచ్చింది. ఈ చర్యలు మరిన్ని సందేహాలకు తావిస్తున్నాయి. ఇవన్నీ అధిగమించి ముందుకు సాగితేనే యుద్ధంలో గెలుస్తాం. కోవిడ్‌ను ఓడించి నిలుస్తాం! దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గి కోవిడ్ రెండో అల వెనక్కి జారుతున్న క్రమంలోనే... టీకా ప్రక్రియ (వ్యాక్సినేషన్) పైకి అందరి దృష్టీ మళ్లుతోంది. ఇప్పుడిదొక ముఖ్యాంశమైంది. కోవిడ మూడో అల రాకుండా, వచ్చినా తీవ్రత లేకుండా చూసుకోవాలంటే వేగంగా టీకా ప్రక్రియ జరిపించాలనేది దేశం ముందున్న లక్ష్యం. దీనిపై కేంద్ర– రాష్ట్రాల ప్రభుత్వాలు దృష్టి సారించాయి. తగు దిద్దుబాటు చర్యలతో, విధానమార్పు ప్రకటించిన ప్రధాని మోదీ, ఇకపై టీకామందును కేంద్రమే రాష్ట్రాలకు ఉచితంగా ఇస్తుందని చెప్పారు. ప్రక్రియను పరు గులు తీయిస్తామన్నారు. అదే సమయంలో ముళ్లపొదల్లా... పలు అంశాలు టీకా చుట్టే అల్లుంటున్నాయి. ఇందులో కొన్ని వ్యూహ వైక ల్యాలు, నిర్వహణా లోపాలు, విధానపరమైన వైఫల్యాలైతే మరికొన్ని అనుకోకుండా పుట్టుకు వచ్చిన సవాళ్లు! ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, ఈ చిక్కుముడులన్నిటినీ విప్పి ముందుకు సాగితేనే మనమీ ఉపద్రవం నుంచి తక్కువ నష్టంతో బయటపడగలుగుతాము. కోవిడ్ విషకోరల నుంచి విశాల భారతాన్ని కాపాడుకోగలుగుతాం. టీకామందుల తయారీలో ఘన చరిత్ర, పంపిణీలో మనకున్న సామర్థ్యాన్ని బట్టి ఈ పాటికి ప్రపంచంలోనే భారత్ ముందుండాల్సింది! మరెన్నో దేశాలకు ఆపన్న హస్తం అందించి ఉండాల్సింది. ఉంటామనే మొదట్లో మన ప్రధాని, దావోస్ ఆర్థిక సదస్సు వేదిక నుంచి ప్రపంచానికి తెలియ జెప్పారు. కానీ, ఆ పరిస్థితిపుడు లేదు. లక్ష్యం వైపు ఇప్పుడిప్పుడే నెమ్మదిగా నడుస్తున్నాం. అమెరికా, యూరప్, ఇతర అభివృద్ధి చెందిన సమాజాలు రెండు డోసుల టీకా ప్రక్రియ ముగించుకొని తలసరి రెండు, మూడు డోసుల టీకా భవిష్యత్తు కోసం రిజర్వు చేసుకున్నాయి. కెనడా ఒక్కో పౌరుడికి (తలసరి) 9 డోసుల చొప్పున రిజర్వు చేసు కుంది. క్రమంగా ఆంక్షలు ఎత్తివేస్తూ, పలు దేశాల్లో కట్టడి ఉపసంహ రిస్తున్నారు. జనజీవనాన్ని సాధారణ స్థాయికి తెస్తున్నారు. ఆర్థిక వ్యవ స్థల్ని పునరుత్తేజం చేస్తున్నారు. జనవరి మధ్యలో టీకా ప్రక్రియ ప్రారంభించిన మనం, ఇప్పటికి సుమారు 20 కోట్ల మందికి కనీసం ఒక డోసు, దాదాపు 5 కోట్ల మందికి సంపూర్ణ టీకా (రెండు డోసులు) ఇచ్చాం. 137 కోట్ల భారతావనిలో భారీ లక్ష్యాలే ముందున్నాయి. శరవేగంతో వెళితేనే..... ఆర్థిక వ్యవస్థను పూర్వపుబాట పట్టించాలంటే వాణిజ్యం, వ్యాపారం వంటి దైనందిన ప్రక్రియలు పూర్తిస్థాయిలో పనిచేయాలి. అందుకు, ‘సామూహిక రోగనిరోధకత’ (హెర్డ్ ఇమ్యూనిటీ) రావాలి. జనాభాలో 70 శాతం మందికి టీకామందు, కనీసం ఒక డోసైనా ఇస్తేనే ఇది సాధ్యమవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా నెలవారీ(మే) నివేదిక చెబుతోంది. సెప్టెంబరు మాసాంతానికి ఈ లక్ష్యం సాధించా లంటే సగటున రోజూ 93 లక్షల మందికి టీకా మందు వేయాలి. గడ చిన 5 మాసాల్లో అత్యధికమంటే, ఒక రోజు 42.65 లక్షల డోసులే ఇవ్వగలిగారు. ఈ వేగం సరిపోదు. ఇకపై స్వదేశీ ఉత్పత్తి పెరగడం, విదేశీ కంపెనీలతో కొనుగోలు ఒప్పందాలు, కేంద్రమే సమకూర్చుకొని పంపిణీ చేయడం, రాష్ట్రాలూ ఈపాటికే కోవిడ్ సెంటర్లను ఏర్పరచి నిర్వహిస్తున్నందున లక్ష్యం సాధ్యమే అంటున్నారు. నమోదు సైట్లు, టీకామందు సెంటర్లు, వైద్య–అనుబంధ సిబ్బంది, టీకామందు సరఫ రాలను సమన్వయ పరచి, రాత్రీపగలు (27/7) శ్రమిస్తే లక్ష్యం సాధ్య మేనని నివేదిక పేర్కొంది. టీకామందు ఉత్పత్తిపై సందేహాలు, అపో హలతో టీకాకు పౌరుల వెనుకంజ, ఇతర నిర్వహణా లోపాల్ని అధిగ మించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. వివిధ కంపెనీల టీకామం దుల్లో ధర వ్యత్యాసాల సమస్య అలాగే ఉంది. సుప్రీంకోర్టూ దీన్ని తప్పుబట్టింది. ప్రయివేటు ఆస్పత్రులకు 25 శాతం టీకామందు కేటా యింపు, వారి దోపిడీకి లైసెన్సు ఇవ్వడమేననే విమర్శలున్నాయి. కోవిడ్ సమాచార వెల్లడిలో పారదర్శకత లోపిస్తోందనే ఆరోపణలు న్నాయి. అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్లుహె చ్వో) అనుమతించిన జాబితాలోకి, స్వదేశీ టీకామందు కోవాక్సిన్ (భారత్ బయోటెక్ వారి ఉత్పత్తి) ఇంకా ఎక్కకపోవడం పెద్ద సమ స్యగా మారుతోంది. ఈ టీకా రెండు డోసులు తీసుకున్నా, దాన్ని ‘వాక్సినేషన్’గా పరిగణించక పలు దేశాలు అనుమతి నిరాకరిం చడంతో, భారతీయుల అంతర్జాతీయ ప్రయాణాలకిది అవరోధంగా మారింది. కోరిన సమాచారం కంపెనీ ఇచ్చి, కేంద్ర ప్రభుత్వం మరింత చొరవతో సత్వరం డబ్లుహెచ్‌వో ఆమోదం తీసుకురావాలి. ఉత్పత్తి ఊపందుకోవాలి దేశీయ, విదేశీ కంపెనీలయినా టీకామందు ఉత్పత్తి ఎన్నో రెట్లు పెంచాలి. సెప్టెంబరు–డిసెంబరు మధ్య 216 కోట్ల డోసుల ఉత్పత్తి చేస్తామని కేంద్రం లోగడ ప్రకటించింది. కానీ, ఇదే కాలంలో సరఫ రాకై 44 కోట్ల డోసుల ఉత్పత్తికి ఆర్డర్లు, అడ్వాన్సులు ఇస్తున్నట్టు ఇటీ వలే వెల్లడించింది. ఎందుకీ వ్యత్యాసమో తెలియదు. దాదాపు 90 శాతం ఉత్పత్తికి బాధ్యత వహిస్తున్న భారత్ సీరమ్ సంస్థ (కోవీషీల్డ్) ఇకపై ఉత్పత్తిని పెంచనున్నట్టు పేర్కొంది. ముడి పదార్థాల దిగుమతి ఓ సమస్యగా ఉండింది. కేంద్ర ప్రభుత్వ సంప్రదింపుల తర్వాత అమెరికా (యుఎస్), ఆయా పదార్థాల ఎగుమతు లపై ఉన్న నిషే«ధం తొలగించింది ‘అమెరికా రక్షణ ఉత్పత్తుల చట్ట’ నిబంధనల్ని సడలిం చామని యుఎస్ అధికారవర్గాలు వెల్లడించాయి. ముడిసరుకు దేశానికి వచ్చి, ఉత్పత్తి పెరిగేది ఆగస్టు నెలాఖరులోనే! భారత్ బయోటెక్ సంస్థ కూడా తమ ఉత్పత్తుల్ని జూన్ నుంచి పెంచుతున్నట్టు చెప్పింది. జూలైలో 7.4 కోట్ల డోసులు ఈ సంస్థ ఉత్పత్తి చేయనుందని కేంద్రం వెల్లడించింది. ఇదంతా గజిబిజిగా ఉంది. ఫైజర్ (యూఎస్) టీకా మందు ఉత్పత్తి చేసే కంపెనీ, తాము భారత్‌లో సరఫరాకు ఒప్పందం కుదుర్చుకోవాలంటే న్యాయపరమైన రక్షణ కల్పించాలని కేంద్ర సర్కా రును అడుగుతోంది. పాక్షికంగా కల్పించే అవకావాలున్నాయి. స్వదే శీతో సహా ఇప్పటి వరకు ఏ కంపెనీకి ఇటువంటి రక్షణ కల్పించలేదు. ధరల్లో అసాధారణ తేడా! లాభాపేక్షలేని పద్ధతిన భారత్‌లో పది డాలర్ల (రూ.730)కే ఒక్కో డోసు టీకామందు ఇస్తామని ఫైజర్ ఉత్పత్తిదారు చెబుతోంది. ఇదే కంపెనీ అమెరికాలో, ఐరోపాలో ఇస్తున్న ధర కంటే ఇది తక్కువ. అంటే, భారత్‌లో ఇది దేశీయ ఉత్పత్తి కోవిషీల్డ్ ధర (రూ.780) కన్నా తక్కువ! మరి, రష్యాకు చెందిన స్పుత్నిక్–వి (రూ.1145), మరో దేశీయ ఉత్పత్తి కోవాక్సిన్ (రూ.1410) ధరలు ఎందుకంత ఎక్కువ అనేది ప్రశ్న. ముఖ్యంగా ప్రైవేటు ఆస్పత్రులకు 25 శాతం కోటా కేటా యించిన నేపథ్యంలో, ఈ ధర వ్యత్యాసం పలు సమస్యలకు దారి తీస్తుందని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా అభిప్రాయ పడింది. టీకామందు ఉత్పత్తి ఫార్ములాలను బట్టి ఈ వ్యత్యాసమని, అధికధర నిర్ణయించిన కంపెనీలు చెబుతున్నాయి. అడెనోవైరస్ ఫార్ములాతో రూపొందించే మిగతా టీకామందు తయారీ చౌకలో అవుతుందని, తమలా ఇనాక్టివేటెడ్ వైరస్ వినియోగ ఫార్ములా వల్ల, పెద్దమొత్తంలో ఉత్పత్తి చేసినా వ్యయం తగ్గదని కోవాక్సిన్ ఉత్పత్తి దారు చెబుతున్నారు. ధర ఎక్కువున్నప్పటికీ, ఆయా టీకా మందుల సామర్థ్యం తక్కువని వస్తున్న అధ్యయనాలు పౌరుల్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. సదరు నివేదికలు సత్య దూరం, అసమగ్రమని ఉత్ప త్తిదారు అంటున్నారు. ఏమైనా.. ప్రభుత్వం ఇంకా సమర్థంగా ఆయా కంపెనీలతో చర్చించి, సహేతుక ధరల్ని ఖరారు చేసుండాల్సింది. సరైన డాటా వెల్లడి, సముచిత నిర్ణయాలు, అమల్లో పారదర్శకతే కోవిడ్ విముక్తి పోరులో కీలకమని నిపుణులంటున్నారు. కేసుల లెక్క, మరణాల సంఖ్య, వ్యాధిగ్రస్తులవడం–కోలుకోవడం వంటి విష యాల్లో నిజాలు చెప్పట్లేదని, తప్పుడు గణాంకాలిస్తున్నారనే విమర్శ లున్నాయి. మరో వంక, టీకామందు నిల్వల గురించి సమాచారం జనబాహుళ్యంలో పెట్టకూడదని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, ఇతర సంస్థలకు ఇటీవలే నిర్దిష్ట ఆదేశాలిచ్చింది. ఈ చర్యలు మరిన్ని సందేహాలకు తావిస్తున్నాయి. ఇవన్నీ అధిగమించి ముందుకు సాగితేనే యుద్ధంలో గెలుస్తాం. కోవిడ్‌ను ఓడించి నిలుస్తాం! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
అస్త్రాలు లేకుండా గెలిచేదెలా?
రాష్ట్రాలు కోరిన డోసులు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రయివేటు ఆస్పత్రులు, కార్పొరేట్లకు టీకామందు అందుబాటులోకి తేవడం ఆశ్చర్యకరం.18 ఏళ్లు పైబడ్డ ఎవరికైనా ప్రయివేటు ఆస్పత్రులు టీకామందు ఇవ్వొచ్చన్న వెసులుబాటుతో సమీకరణాలు మారుతున్నాయి. పౌరులకు ఉచితంగా టీకాలిస్తున్న రాష్ట్రాలు కొంటామన్నా, కోరినన్ని టీకాడోసులు అందివ్వలేనపుడు, ప్రయివేటు పంపిణీ ఎలా సమంజసం అని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి లాంటి వాళ్లు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం వద్ద సమాధానం లేదు. పాలకులు బేషజాలకు వెళ్లకుండా తప్పులు అంగీకరించడం, సరిదిద్దుకోవడమే సమస్యకు పరిష్కారం. సత్తా ఉంది, సమయమే లేదు. ఆయుధం తెలుసు, అవసరమైనన్ని లేవు. ఈ యుద్దం గెలిస్తేనే నిలుస్తాం, యుద్ధవ్యూహమే లోపం. శత్రువు రూపం మార్చుకుంటూ చేస్తున్న దాడిలో రెండో కెరటం కూల నేలేదు, ముంచుకొస్తున్న మూడో కెరటం పొడ భయపెడుతోంది. కోవిడ్–19పై పోరాటంలో మనదేశ పరిస్థితి ఇది. ‘కోవిడ్ యుద్ధం గెలిచేది టీకా (వ్యాక్సినేషన్) అస్త్రంతోనే!’ వైద్యులు, శాస్త్రవేత్తల నుంచి పాలకుల వరకు అంతా ఒక గొంతుతో చెబుతున్నదిదే! ప్రధాని మోదీ కూడా బుద్ధపూర్ణిమ సందర్భంగా ఓ కీలకోపన్యాసం చేస్తూ, ఈ పోరులో టీకాయుధమే శరణ్యమని చెప్పారు. మరి, సమయం దొరి కినా ఆయుధాలెందుకు సమ కూర్చుకోలేదు? కారణం యుద్ధ వ్యూహం కొరవడటమే! యుద్ధమని తెలిశాక, వ్యూహం ఏర్పాటు చేసుకోకపోవడం పెద్ద తప్పు. ఇప్పుడు తప్పొప్పులు సమీక్షించుకునే సందర్భం కాదు, సమయమూ లేదు. ఎందుకంటే, ప్రమాదం మరింత తీవ్రతతో ముంచుకు వస్తోంది. ఉపద్రవాన్ని తట్టుకునే రక్షణ వ్యవస్థను ముందే ఏర్పాటు చేసుకోవాలి. రాగల ప్రమాద తీవ్రత తగ్గించే భూమిక సిద్ధం చేయాలి. మనకున్న చతురంగ బలాల్ని, బల గాల్ని ఉపయోగించి శత్రువును ఢీకొట్టాలి. యుద్ధ ఎత్తుగడల్లో తేఢా లొస్తే అసలుకే మోసం! కోవిడ్‌ను ఎదుర్కొనే క్రమంలో... టీకా ప్రక్రియ తగినంత వేగంగా, నిర్ణీత గడువులోగా జరగకపోతే ఓ ప్రమా దముంది. కరోనా వైరస్ తన రూపాన్ని మార్చుకుంటూ వైవిధ్యాలతో దెబ్బకొట్టే ఆస్కారాన్ని నిపుణలు హెచ్చరిస్తున్నారు. నేటికి సరిగ్గా నాలుగు నెలల కిందట, జనవరి 28న దావోస్, ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ ఆన్లైన్ భేటీనుద్దేశించి మాట్లాడుతూ మన ప్రధాని చేసిన ప్రకటన లోని గాంభీర్యత నేడేమైంది? టీకా ప్రక్రియ మందగించి, టీకామందు దొరక్క, సత్వరం సమకూర్చుకునే స్వదేశీ–విదేశీ మార్గాలు మూసుకు పోయి, కేంద్ర–రాష్ట్రాల మధ్య పొరపొచ్చాలొచ్చి... ఈ గందరగోళం ఎందుకేర్పడింది? చిక్కుముడి వీడేదెలా? ఆ రోజున ఆయన ఏమ న్నారంటే, ‘ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తిదారు భారత్!... ఇపుడు కరోనా వైరస్ నుంచి ప్రపంచాన్ని కాపాడే బాధ్యతను నెత్తి కెత్తుకుంటోంది. దేశ ఆర్థిక చరిత్రలో ఒక కీలక మలుపు కానుంది. భారత్ గొప్పతనం మరోమారు కీర్తించబడుతుంది’ అని. కానీ, వాస్త వాలు నేడెందుకు భిన్నంగా మారాయి? టీకా మందు కోసం ఇంటా, బయటా అయ్యా! అప్పా! అని దేబిరించాల్సిన పరిస్థితి ఎలా దాపు రించింది? టీకా కోసం దేశమంతా నిరీక్షించాల్సిన దుస్థితి ఎందు కొచ్చింది? ‘18 ఏళ్లు దాటిన వారికి రేపటి నుంచి టీకా’ అని, ఎందుకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలకు, సగటు భారతీయులు సమా ధానం అడుగుతున్నారు. టీకా విధానమే కరువు దేశంలో టీకామందు విధానమే సవ్యంగా లేదు. ఫలితంగా ఉత్పత్తి, పంపిణీ, రేపటిపై ఆశ అంతా అస్పష్టమే! రాజ్యాంగం 21 అధికరణం ప్రకారం జీవించే హక్కులో భాగంగా ఖర్చు భరించగలిగే, అందు బాటులో ఉండే, వైద్యారోగ్య సదుపాయాలు పౌరులకు సమానంగా కల్పించాలి. ఏదీ! ఎక్కడ? కోవిడ్ ప్రమాద తీవ్రత తెలిసీ, టీకా ప్రక్రియ విషయంలో కేంద్రం బాధ్యతల నుంచి వైదొలగినట్టే వ్యవ హరించింది. ఏడాది కిందటే కోవిడ్ మహమ్మారి మనల్ని అంటు కున్నా, ఈసారి బడ్జెట్లో టీకామందు కోసం కేంద్రం తన వంతుగా రూపాయి కేటాయించలేదు. ముప్పై అయిదు వేల కోట్ల రూపాయలు అప్పు/గ్రాంట్ కింద తానిచ్చేట్టు, వ్యయ బాధ్యతను రాష్ట్రాలకు బద లాయించింది. స్వతంత్ర భారతంలో ఏడు దశాబ్దాలు పాటించిన, విజయవంతమైన ‘సామూహిక టీకా’ పద్ధతికి తిలోదకాలిచ్చింది. మశూచి, పోలియో వంటి టీకాలను ఇన్నేళ్లు కేంద్రం ఇదే పద్ధతిన ఇచ్చింది. టీకామందు కేంద్రం సమకూర్చేది, ఎక్కడికక్కడ పంపిణీ– నిర్వహణ రాష్ట్రాల బాధ్యతగా అమలైంది. కానీ, ఈసారి టీకా మందును రాష్ట్రాలే సమకూర్చుకోవాలని తేల్చిచెప్పింది. జనాభా దామాషా ప్రకారం ఎవరికెంత అనే వాటాలు మాత్రం తానే నిర్ణయి స్తానంది. కానీ, దేశంలో... ఉత్పత్తికి సవ్యమైన విధానం లేక, అను మతించిన రెండు కంపెనీలు, సీరమ్ (కోవిషీల్డ్), భారత్ బయోటిక్స్ (కోవాగ్జిన్) తగు ఉత్పత్తి చేయలేక, వారికి కేంద్రం ఇతోధిక సహాయం చేయక, రాష్ట్రాలు కోరినంత టీకామందు వారు అందించలేక, ప్రపంచ మార్కెట్ల నుంచి గ్లోబల్ టెండర్లతో రాష్ట్రాలు నేరుగా టీకామందు సమ కూర్చుకునే వెసులుబాటు లేక... నానా ఇబ్బందులు ఎదురవుతు న్నాయి. రెండు డోసుల టీకా మందే పరిష్కారమని ప్రపంచమంతటా రుజువవుతుంటే, ఇక్కడ టీకామందే దొరకటం లేదు. కొండంత కొత్త లక్ష్యం వచ్చే ఆగస్టు–డిసెంబర్ నడుమ 216 కోట్ల డోసుల టీకామందు సమ కూర్చుకునే లక్ష్యాన్ని కేంద్రం ప్రకటించింది. అంటే, నూరు కోట్ల మందికి పైగా రెండు డోసులూ అందుతాయన్న మాట! ఇప్పటికున్న అనుభవాన్ని బట్టి దేశీయ సీరమ్, భారత్ బయోటిక్స్ల ఉత్పత్తి సామర్థ్యం ఆ చాయల్లో కూడా లేదు. ప్రపంచ మార్కెట్ విదేశీ ఉత్పత్తి దారుల నుంచి సమకూర్చుకోవడానికి ఎన్నో ప్రతిబంధకాలున్నాయి. నిజానికి ఈ ఇబ్బందులు రాకూడదు. సరైన ముందస్తు వ్యూహం లేక పోవడం, అవసరాలకు తగ్గట్టు సకాలంలో స్పందించకపోవడం వల్లే ఈ దుస్థితి. దేశంలో టీకాప్రక్రియ జనవరి మధ్యలో ప్రారంభించి నాలుగు నెలలు దాటినా ఇప్పటికి సుమారు 15 కోట్ల మందికి ఒక డోసు, 5 కోట్ల మందికి రెండు డోసుల టీకామందు ఇచ్చాం. ఒక దశలో రోజుకు 40 లక్షల వరకు టీకాలిచ్చిన ప్రక్రియ మందగించి, ఇపుడు రోజూ అయిదారు లక్షలకు పడిపోయింది. కొత్త లక్ష్యాలు అందుకోవడం, అయిదు నెలల్లో (150 రోజులు) రోజూ సగ టున 1.4 కోట్ల మందికి టీకాలిస్తే తప్ప సాధ్యపడదు. మే నెల మొత్తం 6 కోట్లు కోవిషీల్డ్ , 2 కోట్లు కోవాగ్జిన్ టీకా డోసుల ఉత్పత్తే జరిగింది. నెలలో 5 కోట్ల మందికి టీకాలిచ్చినట్టు అధికారుల కథనం. మరో అయిదు స్వదేశీ కంపెనీల కొత్త టీకాలు, ఇంకా క్లినికల్ ట్రయల్స్ దశలోనే ఉన్నాయి. రష్యా టీకా స్పుత్నిక్–వీని దేశంలో వాడేందుకు కేంద్రం ఇప్పటికే అనుమతించినా దిగుమతి, పంపిణీ మందకొడిగా సాగు తోంది. ఇతర అంతర్జాతీయ ఉత్పత్తిదారుల నుంచి గ్లోబల్ టెండ ర్లతో టీకామందు సమకూర్చుకునేందుకు డజన్ రాష్ట్రాలు చేసిన యత్నా లన్నీ విఫలమయ్యాయి. ఫైజర్, మోడెర్నా వంటివి తాము రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకోలేమని, కేంద్రంతోనే వ్యవహరించగల మని ప్రక టించాయి. తాము సంప్రదించినా, ఇప్పటికే పలు దేశాలతో కుదుర్చు కున్న ఒప్పందాల దృష్ట్యా, తమ మిగులు ఉత్పత్తి ఏమైనా ఉంటే ఇవ్వగలమని సదరు కంపెనీలు పేర్కొన్నట్టు కేంద్రం వెల్లడించింది. ప్రయివేటు విక్రయాలు పుండుమీద కారం రాష్ట్రాలు కోరిన డోసులు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రయివేటు ఆస్ప త్రులు, కార్పొరేట్లకు టీకామందు అందుబాటులోకి తేవడం ఆశ్చర్య కరం. మే 1 నుంచి 18–44 ఏళ్ల మధ్య వయస్కులకు ఇస్తామని ప్రక టించీ, తగు ఉత్పత్తి లేక పంపిణీని ప్రభుత్వాలు నిలిపివేశాయి. 45 ఏళ్లు పైబడ్డవారికి టీకాలివ్వడంపై ఇప్పుడు దృష్టి కేంద్రీకరించాయి. ఈ స్ఫూర్తిని తాజా నిర్ణయం దెబ్బతీస్తోంది. 18 ఏళ్లు పైబడ్డ ఎవరికైనా ప్రయివేటు ఆస్పత్రులు టీకామందు ఇవ్వొచ్చన్న వెసులుబాటుతో సమీకరణాలు మారుతున్నాయి. టీకామందు నల్లబజారుకు చేరే ఆస్కారాలు పెరిగాయి. ఇది సామాజికంగానూ అంగీకారం కాదని, అసమానతలకు దారితీస్తుందనే విమర్శ వస్తోంది. పౌరులకు ఉచి తంగా టీకాలిస్తున్న రాష్ట్రాలు కొంటామన్నా, కోరినన్ని టీకాడోసులు అందివ్వలేనపుడు, ప్రైవేటు పంపిణీ ఎలా సమంజసమని ఏపీ సీఎం వైఎస్ జగన్‌లాంటి వాళ్లు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం వద్ద సమాధానం లేదు. పాలకులు బేషజాలకు వెళ్లకుండా తప్పులు అంగీకరించడం, సరిదిద్దుకోవడం, తగిన పంథాలో సాగడమే సమస్యకు పరిష్కారం. సరైన అస్త్రాన్ని, సకాలంలో, గురిచూసి సంధిస్తేనే ఏ యుద్ధమైనా గెలి చేది! ఇది తప్పక గెలిచితీరాల్సిన యుద్ధం!! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
అశ్రద్ధ వీడకుంటే పల్లె గుల్లే!
కోవిడ్ సెకండ్ వేవ్ బారిన పడుతున్నవారి సంఖ్య గ్రామాల్లో రమారమి పెరుగుతోంది. వైరస్ వ్యాప్తి వేగం ఆందోళన కలిగిస్తోంది. గ్రామాలు, చిన్న పట్ట ణాల్లో వైద్య సదుపాయాలు అరకొర. ప్రమాదం ముంచుకు వచ్చినపుడు పెద్ద పట్టణాలు, నగరాలకు పరుగు తీయాల్సి వస్తోంది. మూడో ఉధృతిపై కూడా హెచ్చరికలు వస్తున్న తరుణంలో గ్రామీణ భారతాన్ని నిర్లక్ష్యం చేస్తే, రాగల రోజుల్లో తీవ్ర పరిణామాలుంటాయి. జాతిపిత గాంధీజీ చెప్పినట్లు భారతీయ ఆత్మ అయిన గ్రామాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరం దృష్టిపెట్టి కోవిడ్ నుంచి విముక్తి కలిగించాలి. దీనికి తక్షణ కార్యాచరణ అవసరం. కోవిడ్ రెండో ఉధృతి గ్రామీణ భారతాన్ని పట్టి పీడిస్తోంది. నిరుడు నెలల పాటు కోవిడ్ తొలి ఉధృతి వివిధ స్థాయిల్లో ఉన్నపుడు నగరాలు, పట్టణాల్లో కనిపించిన తీవ్రత గ్రామీణ ప్రాంతాల్లో లేదు. ఒక రకంగా గ్రామాలే సురక్షితమని నగర, పట్టణ వాసులు స్వస్థలా లకు వెళ్లి గడిపిన ఉదంతాలు చాలా ఉన్నాయి. కానీ, ఈ సారి పరిస్థితి అందుకు భిన్నం. కొన్ని ప్రధాన మెట్రో నగరాలు మినహాయిస్తే దేశ మంతటా ఇదే పరిస్థితి! ముంబాయి, ఢిల్లీ, బెంగళూరు వంటి మహానగరాల్లో పెద్ద సంఖ్యలో కేసులు–మరణాలు నమోదవుతు న్నాయి. అదే క్రమంలో మిగతా రాష్ట్ర రాజధానులు, ఇతర ప్రధాన నగరాలు, పట్టణాల్లోనూ కేసులు పెరిగాయి. ప్రభుత్వాలు, వైద్య రంగం, సహాయక విభాగాలు, నిపుణులు... ఇలా అందరి దృష్టీ నగర –పట్టణ ప్రాంతాలపైనే కేంద్రీకృతమైంది. టీకామందిచ్చే ప్రక్రియ కూడా అక్కడే ఎక్కువ! మరోవైపు కోవిడ్ బారిన పడుతున్నవారి సంఖ్య గ్రామాల్లో రమారమి పెరుగుతోంది. మరణాల రేటూ లోగడ కన్నా ఎక్కువే! వైరస్ వ్యాప్తి వేగం ఆందోళన కలిగిస్తోంది. గ్రామాలు, చిన్న పట్టణాల్లో వైద్య సదుపాయాలు అరకొర. ప్రమాదం ముంచుకు వచ్చినపుడు పెద్ద పట్టణాలు, నగరాలకు పరుగు తీయాల్సి వస్తోంది. ఇది దేశం అన్ని ప్రాంతాల్లోనూ ఉంది. పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాల నుంచి దక్షిణాది చిన్న రాష్ట్రం కేరళ వరకు ఇదే పరిస్థితి నెలకొంది. గడచిన పక్షం, రోజువారీ కేసుల సంఖ్య దేశంలో మూడున్నర నుంచి నాలుగు లక్షలు తాకుతూ బెంబేలెత్తిం చింది. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఈ ఉధృతి రెండు రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టింది. దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎక్కడికక్కడ జనం కదలికలపై కట్టడి (లాక్డౌన్) విధిం చడం వల్లే వైరస్ వ్యాప్తి తగ్గి ఈ ఫలితం లభిస్తున్నట్టు నిపుణులూ, కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. తాజా కట్టడితో ఉపాధిపోయిన వలస కూలీలు తిరిగి సొంతూళ్ల దారిపట్టారు. దేశవ్యాప్తంగా తొలి ఉధృతిలో సొంతూళ్లకు వచ్చిన దాదాపు ఏడెనిమిది కోట్ల మందిలో 37 శాతమే, మళ్లీ పని ప్రదేశాలకు వెళ్లినట్టు ఒక అంచనా! మిగిలిన వారంతా ఇంకా గ్రామాల్లోనే ఉన్నారు. తాజాగా వెనుదిరిగే వారితో గ్రామాలపై మరింత ఒత్తిడి ఖాయం. రెండో ఉధృతి కలవరపరుస్తుండగానే, మూడో ఉధృతిపై హెచ్చరికలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో గ్రామీణ భారతాన్ని నిర్లక్ష్యం చేస్తే, రాగల రోజుల్లో తీవ్ర పరిణామాలుం టాయి. అందుకు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందని దేశీయ, అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరిదిద్దకుంటే ప్రమాదమే! దేశవ్యాప్త గణాంకాలకు తోడు సాధారణ అంచనాలు, శాస్త్రీయ అధ్య యనాలు కూడా గ్రామీణభారత దుస్థితికి అద్దం పడుతున్నాయి. దేశంలో నాలుగింట మూడొంతు ప్రాంతాలు ఇప్పుడు కట్టడి నీడన ఉన్నాయి. పరీక్షించిన వారిలో వైరస్ సోకినవారు (పాజిటివిటీ రేటు) 10 శాతం దాటిన జిల్లాలు దేశంలో 718 ఉన్నట్టు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) చెబుతోంది. వచ్చే 6–8 వారాల దాకా ఇక్కడ కట్టడి కొనసాగించాల్సిందేనని మండలి ఛైర్మన్ డా.బలరాం భార్గవ పేర్కొన్నారు. 24 ప్రధాన రాష్ట్రాలకుగాను 13 రాష్ట్రాల్లోని జిల్లాలను, పట్టణ–గ్రామీణ ప్రాంతాలుగా వేర్పరచే వీలుంది. వాటిల్లో నగరాలు, పెద్ద పట్టణాల కన్నా చిన్న పట్టణాలు, గ్రామాల్లోనే ఎక్కువ కోవిడ్ కేసులున్నాయి. మిగిలిన 11 రాష్ట్రాల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు, మరణాలు నమోదవు తున్నాయి. అధి కారిక లెక్కల్లో చేరని కేసులు–మరణాలు గ్రామీణ భారతంలో ఎన్నో రెట్లు అధికం! ఓ ఉజ్జాయింపు లెక్క ప్రకారం, రోజు వారీ (వారం సగటు) కేసుల్లో 65 నుంచి 89 శాతం కేసులు గ్రామీణ ప్రాంతాల నుంచే వచ్చాయి. ఛత్తీస్‌గఢ్ (89 శాతం), హిమాచల్ ప్రదేశ్ (79), బీహార్ (76), ఒడిశా (76), రాజస్తాన్ (72), ఏపీ (72), ఉత్తరప్రదేశ్ (65), జమ్మూ–కశ్మీర్ (65) రాష్ట్రాల్లో మెజారిటీ కేసులు గ్రామీణ ప్రాంతాలవని ఒక పరిశీలన. ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితి తీవ్రంగా ఉంది. కోవిడ్ కేసులు, మరణాల సంఖ్య పెరగటమేకాక, ఏ పరీక్షలూ చేయించుకోకుండా కోవిడ్ లక్షణాలతో అసంఖ్యాకులు న్నారు. రాష్ట్రాన్ని జ్వరం మాగన్నులా కమ్మింది. గ్రామీణ ప్రాంతాలు కోవిడ్ కోరల్లో నలుగుతుంటే, స్థానిక సంస్థలు, ఇతర ఎన్నికలు ఎలా జరిపిస్తున్నారని రాష్ట్రప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని అలహాబాద్ హైకోర్టు మంద లించింది. ‘మేమీ పరిస్థితిని అంచనా వేయలేక పోయాం, ఇంత వేగంగా గ్రామగ్రామానికీ వైరస్ వ్యాప్తి చెందుతుం దనుకోలేదు’ అని అధికార బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రాదేశ్ సింగ్ చెప్పిన మాటలు అక్కడి పరిస్థితికి నిదర్శనం. గతంతో పోలిస్తే, పంజాబ్ గ్రామీణ ప్రాంతాల్లో మరణాల రేటు (2.8 శాతం) పెరిగింది. అదే పట్టణ ప్రాంతాల్లో తక్కువ (0.7) నమోదయింది. పరిస్థితి విశ్లే షిస్తే, దేశ వ్యాప్తంగా దాదాపు ఒకేరీతి కారణాలు కనిపిస్తున్నాయి. గ్రామాల్లో కోవిడ్ లక్షణాలు కనిపించినా అత్యధికులు పరీక్షలకు, చికి త్సకు వెళ్ల టంలేదు. వెళ్లిన చోట కూడా, రెండు రోజుల్లో రావాల్సిన ఆర్టీ–పీసీఆర్ రిపోర్టుకు వారంపైనే పడుతోంది. ఈ లోపు, వైరస్ సోకినవారి వ్యాధి ముదిరి, బాగుచేయలేని స్థితికి చేరుతోంది. ప్రభుత్వ, ప్రయివేటు రంగంలో ఆధునిక వైద్య సదుపాయాలు, పరీక్ష అవకాశాలు, ఆక్సిజన్ అందుబాటు... ఇలా ఏవైనా గ్రామీణ ప్రాంతాల్లో సరిగా లేవు. సరైన అవగాహన లేక కొంత, తప్పుడు భావనలతో మరికొంత గ్రామాల్లో ‘కోవిడ్ సముచిత ప్రవర్తన’ (సీఏబి) ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. అత్యధికులు మాస్క్‌లు లేకుండా, భౌతికదూరం పాటించ కుండా, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోకుండా నిర్లక్ష్యంగా లెక్కలేనితనంతో తిరుగుతున్నారు. పరస్పర విమర్శలు పరిష్కారమా? నిర్దిష్ట చర్యలతో కార్యాచరణ మాని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సరి హద్దు రాష్ట్రాలు, వేర్వేరు విభాగాలు... పరస్పర విమర్శ–ప్రతివిమర్శ చేసుకుంటున్నాయి. గ్రామీణ ప్రాంతాలను పూర్తిగా గాలికి వదిలే శాయి. టీకా మందు విషయంలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇప్పటికే యుద్ధ వాతావరణం నెలకొంది. దేశీయ ఉత్పత్తి తమ అవసరాలు తీర్చటం లేదని, కేంద్ర పంపిణీ పద్ధతి కూడా బాగోలేదని కొన్ని రాష్ట్రాలు ప్రపంచ టెండర్లకు సన్నద్దమయ్యాయి. ‘రాష్ట్ర ప్రభు త్వాలు టీకా మందు సేకరణ విషయమై అవాస్తవిక ఆలోచనలు వీడాలి, మేం శాస్త్రీయంగానే పంపిణీ చేస్తున్నాం. దేశీయ ఉత్పత్తి పెంచే యత్నం చేస్తున్నామం’టూ కేంద్ర వైద్యారోగ్య శాఖామంత్రి పుండు మీద కారం చల్లినట్టు మాట్లాడారు. కేసుల ఉధృతి రాష్ట్రాలతో తమ కున్న సరిహద్దుల్ని కొన్ని రాష్ట్రాలు మూసివేస్తున్నాయి. షరతులతో రాకపోకల్ని నియంత్రిస్తున్నాయి. కోవిడ్‌తో గతించిన వారి, వందకు పైగా శవాలు గంగానదిలో కొట్టుకు వస్తే ‘మీ శవాలం’టే, ‘కాదు మీ శవాలే’ అని ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు తిట్టుకుంటున్నాయి! వేర్వేరు గట్లలో నాలుగైదు రోజుల కిందట, వారంపది రోజుల కిందటే మరణించగా... కుళ్లిన శవాలని ఒడ్డుకు చేర్చి, అంతిమ సంస్కారాలు చేశామని, శరీర అవశేషాల నుంచి డీఎన్ఏ పరీక్షలకుగాను శాంపిళ్లు తీసి భద్రపరిచామని బీహార్ ప్రకటించింది. భారత్‌లో పరిస్థితులు గంభీరంగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర అంతర్జాతీయ, దేశీయ సంస్థలు, నిపుణులు హెచ్చరిస్తు న్నారు. టీకామందు రెండు డోసులు తీసుకున్న వారిపై వైరస్ ప్రభావం లోపించి, ప్రమాదస్థాయి రమారమి తగ్గిపోయినట్టు పరిశోధన ఫలి తాలు వస్తున్న వేళ... టీకా ప్రక్రియను వేగవంతం చేయాలి. కోవిడ్ విష కోరల నుంచి గ్రామాలను రక్షించడానికి అవగాహన, నిఘా. పరీక్షలు, క్వారంటైన్ సెంటర్లు, వైద్యచికిత్స కేంద్రాలు, మందులు–ఇతర అను బంధ సహాయకాలను విరివిగా పెంచాలి. అత్యధిక భారత జనాభా నివ సిస్తున్న, జాతిపిత గాంధీ చెప్పినట్టు భారతీయాత్మ అయిన గ్రామాలపై కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరం దృష్టి పెట్టి కోవిడ్ నుంచి విముక్తి కలిగించాలి. దీనికి తక్షణ కార్యాచరణ అవసరం. దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
ప్రయి‘వేటు’ పడగ నీడ!
ప్రబల శక్తిగా ఉన్న యువతకు ఉద్యోగ–ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన తమ బాధ్యతను కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. దీంతో ప్రపంచం లోనే అత్యధిక శాతం యువ జనాభా ఉన్న భారతదేశం ఇప్పుడు నిరుద్యోగితతో అల్లాడుతోంది. చిత్తశుద్ది ఉంటే ఎన్నెన్నో మార్గాల్లో యువతకు ఉపాధి– ఉద్యోగాలు కల్పించవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరూపించింది. ఎందుకో అన్ని ప్రభుత్వాలు ఈ అంశంపై దృష్టి పెట్టకపోవడం విచిత్రం. ప్రభుత్వ రంగ సంస్థల స్థిరాస్తుల మీద కన్నేసిన కార్పొరేట్ శక్తులు.. రేపు ఫక్తు వ్యాపారం చేస్తాయి తప్ప, ప్రజాప్రయోజనాలు ఎందుకు పట్టించుకుంటాయి? కార్యదక్షత తెలిసేది కష్టకాలంలోనే! అన్నీ సాఫీగా నడిచినపుడు కాక సంక్షుభిత సమయాలే పాలకుల్లో సమర్థత ఉందో, లేదో అద్దంపడుతాయి. ప్రజల పట్ల ప్రభుత్వాల నిబద్ధతను నిగ్గు తేలు స్తాయి. మాటకి–చేతకి పొంతన ఎంతో తేల్చి చెబుతాయి. ప్రపంచంలోనే అత్యధిక శాతం యువ జనాభా ఉన్న భారతదేశం ఇప్పుడు నిరుద్యోగితతో అల్లాడుతోంది. కోవిడ్ మహమ్మారి కొట్టిన దెబ్బకు దేశంలోని కోట్లాది కుటుంబాలు విలవిల్లాడుతున్నాయి. సంవత్సరాల నుంచి ఉద్యోగమో, ఉపాధో అని నిరీక్షిస్తున్న కుటుంబాల గతి ఇప్పటికే దీనంగా ఉంటే, ఉన్న ఉద్యోగం–ఉపాధి కోవిడ్ వల్ల కోల్పోయి రొడ్డున పడ్డ జీవితాలు దిక్కుతోచని స్థితిలో అలమటిస్తున్నాయి. తమ ఉద్దీపన చర్యలతో కోలుకుంటోందని ప్రభుత్వాలు ఊదరగొట్టిన ఆర్థిక వ్యవస్థ, కోవిడ్ రెండో విజృంభణతో వెనక్కి జారుతోంది. పూర్తి మూసివేత (లాక్డౌన్) లేకపోయినా... దాదాపు అలాంటి పరిస్థితినే తలపిస్తున్న నిర్బంధాలు, నిషేధాలు, కఠిన ఆంక్షలు వివిధ కార్య కలాపాల్ని స్తంభింపజేస్తున్నాయి. సామాన్యుల మనుగడ దుర్భరం చేస్తూ ఆర్థిక వృద్ధిని అడ్డగిస్తున్నాయి. దినకూలీల ఉపాధి ఉట్టెక్కుతోంది. ఉద్యోగాలు ఊడుతున్నాయి. రాబడి తగ్గిన ఈ కష్టకాలం లోనే.. ఖర్చులు రమారమి పెరిగాయి. అత్యధికుల బతుకు దుర్భర మౌతోంది. ప్రకృతి దెబ్బకు ప్రభుత్వాల నిర్వాకంతోడై సమాజంలో ఆర్థిక అంతరాలు అధికమౌతున్నాయి. సంపన్నులు మరింత సంపన్ను లవుతుంటే, పేదలు నిరుపేదలవుతున్నారు. మధ్యతరగతి జీవులు దీనంగా దారిద్య్రరేఖ దిగువకు జారిపోతున్నారు. అశాంతి ప్రబలుతోంది. ఈ నెల 11తో ముగిసిన వారం నమోదైన జాతీయ నిరుద్యోగిత 8.58 శాతానికి చేరింది. గత నెలా ఖరుకున్న 6.65%పైన ఇది దాదాపు 2% పెరుగుదల. నగర–పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత సుమారు పది శాతానికి చేరుకున్నట్టు ‘భారత ఆర్థిక నిర్వహణ కేంద్రం’ (సీఎంఐఈ) అధ్యయనం చెబుతోంది. ఇవి ప్రమాద సంకే తాలు. ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వాలు నిర్దిష్ట చర్యలు చేపట్టాలి. సర్కార్ల చిత్తశుద్ధే ముఖ్యం! ఆత్మహత్యలు ఏ సమస్యకూ పరిష్కారం కావు. కనుకే, అందుకు తలపడవద్దని, పోరాడి నిలిచి–గెలవాలనీ అందరూ చెబుతారు. అయినప్పటికీ ఆత్మహత్య చేసుకునే వారి మానసిక పరిస్థితి గురించి ఒక క్షణం ఆలోచించాలి. ‘నేను చాతకాక చావటం లేదు, నా చావుతోనైనా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి.. ఆరేళ్లుగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా, ఏ యత్నమూ ఫలించలేదు, సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తేవాలని...’ అంటూ వీడియో చేసి ఆత్మహత్య చేసుకున్న కాకతీయ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి సునీల్ నాయక్ ఒక హెచ్చరిక! మరో నిరుద్యోగి, నాగార్జునసాగర్‌లో ఆత్మహత్య చేసుకున్న రవికుమార్, దుస్థితి తట్టుకోలేక తానూ బలవన్మరణంతో తనువు చాలించిన అతని భార్య అక్కమ్మ... ఇవన్నీ సమస్య తీవ్రతకు ప్రతీకలే! ప్రబల శక్తిగా ఉన్న యువతకు ఉద్యోగ–ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన తమ బాధ్యతను కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. చిత్తశుద్ధి ఉంటే ఎన్నెన్నో మార్గాల్లో యువతకు ఉపాధి–ఉద్యోగాలు కల్పించవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరూపించింది. వాలంటీర్లు, గ్రామ–వార్డు సచివాలయ ఉద్యోగులు, నర్సులు, టీచర్లు, పోలీసులు, సర్వీసు కమిషన్ ద్వారా ఉన్నతస్థాయి ఉద్యోగులు... ఇలా వివిధ విభా గాల్లో కలిపి రెండేళ్ల కాలంలోనే 4 లక్షల మందికి పైగా ఉద్యోగ–ఉపాధి కల్పించింది. వారంతా, రాష్ట్రాన్ని ప్రగతి పథాన నడపడంలో భాగమౌతున్నారు. ఎందుకో అన్ని ప్రభుత్వాలు ఈ అంశంపై దృష్టి పెట్టక పోవడం విస్మయం. ఖాళీలు భర్తీ చేయరు. వాటిని ఖాళీగా చూపించడం ఇష్టం లేక, విమర్శల్ని ఎదుర్కోలేక పోస్టుల్నే రద్దు చేస్తారు. అయినా, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల కింద కలిపి సుమారు 60 లక్షల ఉద్యోగాలు ప్రస్తుతం దేశవ్యాప్తం ఖాళీగా ఉన్నట్టు ఓ లెక్క! వాటిని భర్తీ చేసే ప్రయత్నం జరగటం లేదు. ఎన్నికవడానికి ముందు దేశ ప్రజలకు హామీ ఇస్తూ, ‘ఏటా కోటి నుంచి రెండు కోట్ల ఉద్యోగాలి స్తాం’ అన్నారు, ఏవీ? అలాంటిదే మరో ఎన్నికల హామీ, ‘రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం’ అన్నారు, అవెక్కడ? తెలంగాణలో పాలక– విపక్షాల మధ్య ఇదో నిత్యరగడ! ఆరేళ్లలో 1.35 లక్షల మందికి ఉద్యోగ –ఉపాధి కల్పించామని పాలకపక్షం అంటే, నిజానికి ఆ సంఖ్య 35 వేలే అని విపక్షాలంటున్నాయి. ప్రైవేటు రంగంలో వచ్చిన ఉద్యోగాలూ తమ ఘనతే అంటే, అక్కడ ఊడిపోతున్న అవకాశాలకూ సర్కార్లు బాధ్యత వహించాలి, వహిస్తాయా? పెరగాల్సిన ఉద్యోగులు తగ్గితే? ఏటా లక్షలాది మంది డిగ్రీలు పొంది ఉద్యోగాల కోసం వీధుల్లోకి వస్తు న్నారు. తగినన్ని అవకాశాలు ఉండటం లేదు. 2017–18 లో నిరుద్యోగిత తీవ్రస్థాయికి చేరింది. 1972–73 తర్వాత, 45 ఏళ్లలో ఇదే అత్యధికమని జాతీయ నమూనా సర్వే (ఎన్ఎస్ఎస్) వెల్లడించింది. 2017 నుంచి 2018 కి వచ్చే సరికి పెరగాల్సింది పోయి, 1.09 కోట్ల మంది ఉద్యోగులు తగ్గినట్టు సీఎంఐఈ అధ్యయనం తెలిపింది. ఖాళీలు భర్తీ చేయడం లేదు. ప్రయివేటు రంగంలోనూ విస్తరణలు ఆశించిన స్థాయిలో లేవు. పెద్ద కార్పొరేట్లు మధ్యతరహా పరిశ్రమల్నీ మననీయటం లేదు. ఉద్యోగిత పెంచే చిన్న, మధ్యతరహా పరిశ్రమల్ని ప్రభుత్వాలు తగినంత ప్రోత్సహించడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి ఇప్పటివరకు దాదాపు 3 లక్షల ఖాళీలు ఏర్పడ్డాయని ఒక అంచనా! 1.91 లక్షల ఖాళీలున్నాయని ఇటీవల పీఆర్సీ నివేదికే చెప్పింది. 25 లక్షల మంది నిరుద్యోగులు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోర్టల్‌లో రిజిష్టర్ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా కోట్లాది యువకులు ఉద్యోగ–ఉపాధి అవకాశాల కోసం నిరీక్షిస్తున్న తరుణంలో.. కోవిడ్ పెద్ద దెబ్బే కొట్టింది. మొదటి విజృంభణలో గత సంవత్సరం కష్ట నష్టాలకోర్చి స్వగ్రామాలకు వెళ్లిన వలస కార్మికుల్లో 38.6 శాతం మంది మాత్రమే, తమ పని ప్రదేశాలకు తిరిగి వెళ్లినట్టు ఓ అధ్య యనం చెప్పింది. ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్న జాతీయ ఉపాధి హామీ పథకమే (ఎన్నార్ఈజీ) అత్యధికుల్ని ఆదుకుంది. ఈ పథకం ద్వారా 2019–20 లో 7.88 కోట్ల మంది, 2020–21 లో 11.17 కోట్ల మంది శ్రామిక ప్రజలు లబ్ధి పొందారు. కాలం మారుతోంది, కర్కశంగా... ఇదివరకెన్నడూ లేని విధంగా, ‘అవునూ, అన్నీ ప్రైవేటుపరం చేస్తాం, ఏమిటి తప్పు?’ అని దర్జాగా, ధాటిగా సర్కార్లు ఎదురు ప్రశ్నించే కాలం వచ్చింది. సంక్షేమ రాజ్యం–జవాబుదారీతనం అర్థాలే మారుతున్నాయి. ‘‘ప్రభుత్వ నిర్వాకాల వల్ల నష్టాలొస్తున్నాయి, అందుకే పబ్లిక్ రంగ సంస్థల్ని ఎంతో ‘సామర్థ్యం’ ఉన్న ప్రైవేటుపరం చేస్తు న్నామం’’టున్నారు. అంతటా ప్రైవేటు రంగానికి అంతటి సామర్థ్యమే ఉంటే, వాళ్లు తీసుకున్న అప్పులు, ఇన్నిన్ని బ్యాంకుల్లో ఇన్నేసి లక్షల కోట్లు నిరర్థక ఆస్తులు (ఎన్పీయే)గా ఎందుకు మారుతున్నాయి? ప్రజాధనాన్ని ఎందుకిలా కొల్లగొడుతున్నారు? ఇప్పటికే నదులు, సముద్రాలు, అడవులు, కొండలు, కోనలు, ఖనిజాలు.. ఇలా సహజ వనరుల్ని ప్రైవేటుపరం చేసి, కొత్త ఆశ్రిత వర్గాల్ని బలోపేతం చేసు కుంటున్నారు. పరిశ్రమలని, సెజ్లని, ఫార్మాసిటీలని ప్రజల భూముల్ని బలవంతంగా లాక్కొని కార్పొరేట్ శక్తుల కిచ్చేస్తున్నారు. కర్షకులు, కార్మికులు, ఇతర పౌర సమాజం పోరాడి సాధించుకున్న చట్టాల్ని, హక్కుల్ని క్రమంగా నీరుగారుస్తున్నారు. చట్టాల్ని మారుస్తూ, ప్రజల దృష్టి ఏమారుస్తూ... ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. అరవై, డెబ్బై ఏళ్లుగా ప్రజాధనం వెచ్చించి, ఇటుక ఇటుకగా పేర్చి అభివృద్ధి చేసిన పబ్లిక్‌రంగ సంస్థల్ని (వ్యూహాత్మ కమైనవి తప్ప) అన్నింటినీ ప్రైవేటుకు అమ్మేస్తున్నారు. పప్పు బెల్లాలకు ధారా దత్తం చేస్తున్నారు. అందులో నష్టాలొచ్చేవే కాదు, లాభాలు గడించేవీ ఉన్నాయి! వాటి స్థిరాస్తులమీద కన్నేసిన కార్పొరేట్ శక్తులు.. రేపు ఫక్తు వ్యాపారం చేస్తాయి తప్ప, ప్రజాప్రయోజనాలు ఎందుకు పట్టించు కుంటాయి? జీతాలు కోస్తే అడిగేదెవరు? ఉద్యోగుల్ని తొలగిస్తే పట్టించుకునేదెవరు? అది పరోక్షంగా నిరుద్యోగితకే దారి తీస్తుంది. అందుకే అంటారు, విప్లవం ప్రత్యక్ష ఉత్పత్తి కాదు, విప్లవ పరిస్థితుల ఉప ఉత్పత్తి అని! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
సమాజ టీకా తోడవ్వాలి!
వైరస్ విజృంభణతో ‘కోవిడ్–19 రెండో ఉధృతి’ ప్రమాదఘంటికలు మోగిస్తోంది. ప్రభుత్వ అలసత్వం, ప్రజల నిర్లక్ష్యం.. వెరసి కోవిడ్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. దీని కట్టడికి వైద్య టీకాతో పాటు సామాజిక టీకా ముఖ్యం. ‘బహుముఖ పంథా కావాలి. ప్రభుత్వం– సమాజం కలిసి చేయాల్సిన కర్తవ్యమిది. అన్ని ఉపకరణాల్నీ ప్రభావవంతంగా వాడాలి. క్రమం తప్పని పరీక్షలు, వ్యాధి కట్టడి, పాజిటివ్‌లపై నిఘా, వైద్య రక్షణ, కోవిడ్– సముచిత అలవాట్లు, టీకా... వీటన్నిటి సమర్థ నిర్వహణతోనే కోవిడ్‌పై విజయం సాధ్యం’ అన్న నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్ మాటలు అక్షర సత్యాలు. దేశం మరో లాక్‌డౌన్‌కి సిద్దంగా లేదు. మంచిది కూడా కాదు! కానీ, పరిస్థితులు వికటించి, అదే జరిగితే... ఆర్థిక వ్యవస్థ కోలుకో లేనంత అధ్వానంగా మారి మనుగడ ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం పొంచి ఉంది. సామాన్యుడితో పాటు అప్పుడిక అందరి బతుకూ దుర్భరం. అంతా ఒక్కటై ఆ దుస్థితి రాకుండా అడ్డుకోవాలి. వైరస్ విజృంభణతో ‘కోవిడ్–19 రెండో ఉధృతి’ ప్రమాదఘంటికలు మోగి స్తోంది. ప్రభుత్వ అలసత్వం, ప్రజల నిర్లక్ష్యం... వెరసి కోవిడ్ మహ మ్మారి వేగంగా విస్తరిస్తోంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇది ఏకరీతిలో లేదు. ఉన్నచోట క్రమంగా–వేగంగా విస్తరిస్తున్న తీరే ఆందో ళన కలిగిస్తోంది. ఏడాది కిందట తొలిసారి వచ్చినప్పటికంటే ఇప్పుడు వైరస్ తీవ్ర ప్రభావం చూపుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. వైరస్ ఉత్పరివర్తన వల్ల వచ్చిన వైవిధ్యం కూడా ఓ కారణం. జనం కరోనా బారిన పడ్డాక... రికవరీ రేటు తగ్గుతోంది. పాజిటివిటీ రేటు ఎక్కు వౌతోంది. ఆందోళనకరంగా మరణాల రేటు పెరుగుతోంది. ప్రభుత్వ, ప్రయివేటు అని లెక్క లేకుండా ఆస్పత్రుల్లో కోవిడ్ వార్డులు మళ్లీ తెర చుకుంటున్నాయి, నిండుతున్నాయి. పలు రాష్ట్రాల్లో అసాధారణంగా కేసులు పెరిగాయి. అక్కడ్నుంచి ఎక్కువ రాకపోకలున్న పొరుగు రాష్ట్రాల్లోనూ కొత్తగా కేసులు నమోదవుతున్నాయి, రోజు రోజుకు అధి కమవుతున్నాయి. గమనించి, లోతుగా విశ్లేషిస్తే గణాంకాలు భయం కలిగిస్తున్నాయి. తగు చర్యలతో నియంత్రించాల్సిన వ్యవస్థలు ఇప్పుడిప్పుడే నిద్రమత్తు వదిలినట్టు జాగృతమవుతున్నాయి. ‘పరిస్థితులు అధ్వానం నుంచి మరింత దయనీయ స్థితికి జారిపోతున్నాయం’టూ తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. ప్రజలు ఇంకా మెలుకున్నట్టు కనిపించడం లేదు! టీకా (వాక్సిన్) అందుబాటులోకి వచ్చి, మనదేశం వాటిని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నా... జనానికి టీకా ఇస్తున్న/వారు తీసుకుంటున్న ప్రక్రియలో మందకొడితనం నిరాశ కలిగిస్తోంది. లక్ష్యానికి ఆమడ దూరమే! దేశంలో అత్యధికులు కరోనాను తేలికగా తీసుకుంటున్నారు. టీకా తీసుకున్నప్పటికీ కోవిడ్ జాగ్రత్తలు అవసరమే అని ఎంత చెబు తున్నా... పౌరుల నిర్లక్ష్యం పతాక స్థాయిలో ఉంది. మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం, తరచూ చేతులు కడుక్కోవడం/శానిటైజ్ చేసుకోవడం వంటి కనీస పద్ధతులు అనుసరించడంలోనూ తీవ్ర అలసత్వం, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇతర కారణాలకు తోడు ఈ నిర్లక్ష్యమే ప్రమాద తీవ్రతను ఎక్కువ చేస్తోంది. ఇలా అయితే ఎలా? అవగాహన వేరు చైతన్యం వేరు. అవగాహన లేక ఆచరించకపోవడం ఒక స్థితి. దాన్ని అధిగమించడానికి ఏమైనా చేయొచ్చు! అవగాహన ఉండీ ఆచరించకపోవడమే నిర్లక్ష్యం! ఒక అంతర్గత సర్వే ప్రకారం, కోవిడ్ వ్యాప్తి నివారణకు మాస్క్ ధరించడంతో పాటు కనీస జాగ్ర త్తలు ముఖ్యమని 90 శాతం మందికి తెలుసు. కానీ, 44 శాతం మంది మాత్రమే మాస్కులు ధరిస్తున్నారు. అది కూడా నగర, పట్టణ ప్రాంతాల్లోనే, గ్రామీణ ప్రాంతాల్లో అదీ లేదు. కనీస దూరాలు ఎవరూ పాటించడం లేదు. ప్రతి చిన్న అవసరానికీ, ఒకోసారి అవసరం లేకున్నా లెక్కలేకుండా గుమిగూడుతున్నారు. గోప్య కెమెరాలతో నిఘా పెట్టి, మాస్క్‌లేని వారికి వెయ్యేసి రూపాయల జరిమానా విధించే పరిస్థితి తెచ్చారు. విమానాశ్రయాల్లో కూడా కనీస పద్ధతులు పాటించనివారిపై చర్యలకు నిర్ణయించారు. సంతలు, బార్లు, వర్తక– వాణిజ్య కేంద్రాల వద్దే కాకుండా పండుగలు, పబ్బాలు, గుడి– గోపురాలు, శుభకార్యాలు .. ఇలా అన్నింటికీ తోసుకొని వెళ్లడమే, ఒక రికొకరు రాసుకు–పూసుకు తిరగడమే! నెల పాటు జరిగే కుంభమేళా ఉత్సవాలు గురువారమే మొదలయ్యాయి. లక్షలాది మంది పోగవుతారు. అప్పటికీ ఉత్తరాఖండ్ హైకోర్టు కఠిన నిబంధనల్ని నిర్దేశిం చింది. 72 గంటల లోపు తీసుకున్న కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ ఉంటేనే ఉత్సవాల్లోకి అనుమతించాలంది. హరిద్వార్ ప్రాంతంలోకి రావడానికీ ఆంక్షలు పెట్టారు. ఇలాంటి కట్టడి అంతటా రావాలి. పౌరులు తమ వంతు బాధ్యత గుర్తించాలి. కోవిడ్ వ్యాప్తి అరికట్టే కనీస నిబంధ నలు–పద్ధతులు (ప్రొటోకాల్స్) పాటించకుండా, పౌరులు సహకరించ కుండా ప్రభుత్వ చర్యలతోనే అంతా అయిపోవాలనుకోవడం అత్యాశే! మహారాష్ట్రతో పాటు గుజరాత్, హర్యానా, జమ్మూ–కాశ్మీర్, బీహార్, పంజాబ్, ఢిలీ, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కేసులు ఎక్కువ నమోద వుతున్నాయి. ఛత్తీస్‌ఘడ్, తమిళనాడుతో పాటు కొన్ని ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. వైద్య టీకాతో పాటు సామా జిక టీకా ముఖ్యం. ‘బహుముఖ పంథా కావాలి. ప్రభుత్వం– సమాజం కలిసి చేయాల్సిన కర్తవ్యమిది. అన్ని ఉపకరణాల్నీ ప్రభా వవంతంగా వాడాలి. క్రమం తప్పని పరీక్షలు, వ్యాధి గుర్తించి కట్టడి, పాజిటివ్‌ల పై నిఘా, వైద్య రక్షణ, కోవిడ్–సముచిత అలవాట్లు, టీకా... వీటన్నిటి సమర్థ నిర్వహణతోనే కోవిడ్ పై విజయం సాధ్యం’ అన్న నీతి ఆయోగ్ సభ్యుడు, ప్రభుత్వ సాధికార కమిటీ ఛైర్మన్ డాక్టర్ వినోద్ కె పాల్ మాటలు అక్షర సత్యాలు. టీకా ప్రక్రియ వేగం పెరగాలి కోవిడ్ టీకా ఇచ్చే ప్రక్రియ వేగిరపరచడంలో ప్రభుత్వం వద్ద వ్యూహం కొరవడింది. పౌరుల్లో బాధ్యత లోపించింది. టీకా ఉత్పత్తిలో, ప్రపం చంలోనే మూడో పెద్ద దేశం భారత్‌లో టీకాలిచ్చే ప్రక్రియ మంద కొడిగా సాగుతోంది. మనకున్న వ్యవస్థలకు ఇది మరింత వేగంగా జరగాలి. జూన్ మాసాంతానికి 30 కోట్ల మందికి టీకా ఇవ్వాలన్నది లక్ష్యం. కానీ, గడచిన రెండున్నర మాసాల్లో ఇచ్చింది 6 కోట్ల మందికే! ఇదే సమయంలో 6.4 కోట్ల టీకా డోసుల్ని మనదేశం 82 దేశాలకు పంపిణీ చేయగలిగింది. రాష్ట్రాలతో చర్చించి, ప్రణాళిక రచించి, కేంద్రం తగు కార్యాచరణ చేపట్టాలి. టీకా ఉత్పత్తి, అట్టడుగు కేంద్రా లకు చేర్చడం, వినియోగంలో వృధా అరికట్టడం, పౌరులు ముందు కొచ్చేలా చైతన్యపరచడం... ఇలా కొన్ని సమస్యల్ని ఇంకా అధిగమిం చాలి. ప్రయివేటు ఆస్పత్రుల సహకారంతో టీకా కేంద్రాలు పెంచినా, గ్రామీణ ప్రాథమిక వైద్య కేంద్రాల స్థాయికి టీకా మందు అందుబాటులోకి తెచ్చినా.. ఇదీ పరిస్థితి! కరోనా మృతుల్లో 88 శాతానికి మించి 45 ఏళ్లు పైబడ్డ వాళ్లే! షరతులతో పనిలేకుండా, 45 ఏళ్లు దాటిన వారందరికీ టీకా ఇచ్చే ప్రక్రియ గురువారం మొదలైంది. ఇప్పుడిక వేగం పెరగాలి. ఈ లక్ష్యం వచ్చే రెండు వారాల్లో నూరు శాతం పూర్తి కావాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ రాష్ట్రాలను నిర్దేశిం చింది. ఇంకా టీకా రెండో డోసు ప్రక్రియ ఉంటుంది. ఆ తర్వాత పది–పదిహేను రోజులకు గాని యాంటీబాడీలు శరీరంలో వృద్ధి చెందవంటారు. ఆ తర్వాతే ‘సామూహిక రోగనిరోధకత’ గురించి ఆలోచించాలి. అందుకని, పౌరులు చొరవ చూపాలి. ఎవరికి వారు బాధ్యతగా భావించి, కేంద్రాలకు వెళ్లి టీకా తీసుకోవాలి. ఇంకా... కోవిషీల్డా? కోవాక్సినా? అనే మీమాంస ప్రజల్లో ఉంది. నిజానికి ఏదైనా ఒకటే! ఉత్పత్తిలో తగు ప్రమాణాలు లేవని బ్రెజిల్ వంటి దేశాలు కోవ్యాక్సిన్ అనుమతి నిరాకరించడం ఇలాంటి సందేహాలకు కారణం కావచ్చు! ఉత్పత్తిదారు–ప్రభుత్వం ఈ సందేహాల్ని నివృత్తి చేయాలి. మరో టీకా స్పుత్నిక్–వి(రష్యా)ని దేశంలోకి అనుమతిం చడం ఇప్పుడు పరిశీలనలో ఉంది. అదీ వస్తే మరింత మేలు. మేలుకోకుంటే ప్రమాదమే! మన వాతావరణం, జీవనశైలి, ఇక్కడి పరిస్థితులు ఇన్నాళ్లూ కాపాడాయి. కిందటి వారంతో పాలిస్తే దేశంలో గత వారం కోవిడ్ మరణాల రేటు 51 శాతం పెరిగింది. ఇంకా చాలా మరణాలు కోవిడ్ వల్లే అయినా, అధికారికి లెక్కల్లో అంతకు ముందరి జబ్బుల కిందే చూపుతున్నారు. ఆస్పత్రులకు వచ్చిన కోవిడ్ కేసులు తెలంగాణ రాష్ట్రంలోనూ పది రోజుల్లో రెట్టింపయ్యాయి. కేసులు బాగా పెరుగు తున్న, వేగంగా వ్యాధి విస్తరిస్తున్న జిల్లాల సంఖ్య దేశంలో 47కు చేరింది. వాటిలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణెతో కలుపుకొని పది జిల్లాల్లో తీవ్ర పరిస్థితులు న్నాయి. మన నిర్లక్ష్యం స్థాయి ఇలాగే ఉంటే.... పరిస్థితులు చేయి దాటిపోయే ప్రమాదం ఉంది. అందరూ బాగుంటేనే, అందులో ఎవరమైనా బాగుంటాం. అందుకే తస్మాత్ జాగ్రత్త! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
ఏప్రిల్ 10,11 తేదీల్లో ప్రపంచ తెలుగు మహాకవి సమ్మేళనం
ఉగాది సందర్భంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏప్రిల్ 10,11 తేదీలలో తానా ప్రపంచ సాహిత్య వేదిక అధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాకవి సమ్మేళనం-21ను ఏర్పాటుచేశారు. కార్యక్రమాన్ని అంతర్జాల దృశ్య సమావేశం ద్వారా నిర్వహించనున్నారు. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వ్యక్తులతో పాటు, 21 దేశాలలోని 21 సంస్థల అధ్యక్షులు పాల్గొంటారు. కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జస్టిస్ జి. చంద్రయ్య (తెలంగాణ మానవ హక్కు కమిషన్ చైర్మన్), విశిష్ట అతిథిగా బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు, ప్రత్యేక అతిథిగా కృతివెంటి శ్రీనివాసరావు (కేంద్ర సాహిత్య అకాడమి కార్యదర్శి) హాజరుకానున్నారు. 21 గంటలపాటు కొనసాగే ఈ కార్యకమ ముగింపు వేడకకు పద్మభూషణ్ కె.ఐ. వరప్రసాద్ రెడ్డి, ప్రఖ్యాత రచయిత తనికెళ్ల భరణి, సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్ రెడ్డి, ఈనాడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ సబ్ఎడిటర్ విష్ణు జాస్తి, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్, మనతెలంగాణ ఎడిటోరియల్ అడ్వైజర్ గార శ్రీరామ మూర్తి హాజరవుతారు. -
నిబద్ధతే అసలైన కొలబద్ద
పదవీవిరమణ చేసిన అఖిల భారత సర్వీస్ అధికారుల్ని ఎక్కువ మందిని సమాచార హక్కు కమిషనర్లుగా నియమించడం పట్ల దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. కేంద్ర విజిలెన్స్ కమిషన్‌లోకి ఓ అధికారి థామస్ నియామక ప్రక్రియ వివాదాస్పదమైనపుడు సుప్రీంకోర్టు కూడా, ‘మీకు నిపుణులంటే రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే కనిపిస్తారా? పౌర సమాజంలోని ఇతర మేధావుల్ని ఎంపిక చేసుకోవడంపై ఎందుకు దృష్టి పెట్టరు?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నాయకులైనా, అధికారులైనా... జనహితమే లక్ష్యంగా పాలనా రథాన్ని సజావుగా నడపాల్సిన జోడు గుర్రాలు. ప్రభుత్వ ఉన్నతాధికారులు స్వతంత్రులా? అస్వతంత్రులా? స్వతంత్రులైతే... తరచూ న్యాయస్థానాల మందలింపులెందుకు? విప క్షాల విమర్శలేల? సర్కార్లు మారినపుడల్లా సాధింపులెందుకు? అస్వ తంత్రులైతే... ఇంతకీ వారు ఎవరికి కట్టుబడి ఉండాలి, అప్పటి పాల కులకా? ప్రభుత్వ విధానాలకా? రాజ్యాంగ పరిధి చట్టాలకా? ఎందు కిన్ని ప్రశ్నలంటే.. వారి పనితీరు రేకెత్తిస్తున్న సందేహాలే కారణం! నిబంధనలకు నీళ్లొదిలి కొన్ని ప్రభుత్వాలు వారి సేవల్ని దుర్విని యోగం చేస్తున్న వైఖరొక హేతువు! సంగారెడ్డి అదనపు కలెక్టర్‌ను హైకోర్టు మందలించడం, ముంబై నగర పోలీస్ కమిషనర్ ఆక స్మిక బదిలీ, గోవా రాష్ట్ర ఎన్నికల కమిషన్ అదనపు బాధ్యతల నుంచి ఆ రాష్ట్ర న్యాయకార్యదర్శిని సుప్రీంకోర్టు తప్పించడం.. ఇటువంటి తాజా పరిణామాలన్నీ ఇదే స్పష్టం చేస్తున్నాయి. దేశంలో అత్యున్నత అధికార వ్యవస్థను నడిపే అఖిల భారత సర్వీస్ అధికారులు తరచూ వివా దాలకు, విమర్శలకు కేంద్ర బిందువవుతున్నారు. నిజానికి ఎక్కువ మంది అధికారులు చట్టాలకు, విధానాలకు లోబడి ప్రజా సంక్షేమం కోసం పనిచేసే వారయినా, ఉద్యోగవర్గంపై విమర్శలకు కొదువ లేదు. కొన్నిసార్లు పాలకుల చేష్టలు కారణమైతే, మరికొన్నిసార్లు సదరు అధి కారుల వ్యవహారశైలే ఇందుకు దారితీస్తోంది. ఫలితంగా ఉన్నతాధికార వ్యవస్థ ప్రజా విశ్వాసం కోల్పోతోంది. మరేమిటి మార్గం? అనే ప్రత్యామ్నాయ ఆలోచనలు తెరపైకి వస్తున్నాయి. తాము తలపెట్టిన సంస్కరణలు నెమ్మదించడానికి అధికార వ్యవస్థ మందకొడితనమే కారణమని దేశ ప్రధాని మోదీ ఇటీవల వ్యాఖ్యానించారు. సంప్రదాయానికి భిన్నంగా, వయసు మళ్లిన నిపు ణుల్ని పాలనావ్యవస్థలోకి నేరుగా తీసుకోవడం (లేటర్ ఎంట్రీ) క్రమంగా ఎక్కువౌతోంది. ఆర్థిక వ్యవస్థ ఛిద్రమై, కేంద్ర ప్రభుత్వం యథేచ్ఛగా ప్రైవేటీకరణకు వాకిళ్లు తెరుస్తున్న ప్రస్తుత సంక్షుభిత సమయంలో ఈ అంశం ప్రధానంగా చర్చకు వస్తోంది. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని సర్కారు ఎందుకు నడపాలి? అని ప్రశ్నించే ముందు, అందుకు బాధ్యులెవరో శోధించరా? కడదాకా నిలువని తొలినాళ్ల స్ఫూర్తి దేశంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర అఖిల భారత సర్వీసు అధికారులు అత్యధికుల్లో తొలినాళ్ల ఉత్సాహం, నిబద్ధత తర్వాతి సంవత్సరాల్లో కనబడటం లేదు. పలు రకాల జాడ్యాలకు వారు లోబడిపోతున్నారనే విమర్శలున్నాయి. అత్యున్నత ప్రమాణాలతో ఎంపిక వల్ల ప్రతిభ, నైపుణ్యం కలిగిన వారే వస్తుంటారు. ఉత్తమ శిక్షణ వల్ల మంచి ఆశయాలతో సర్వీసులో చేరుతారు. ఇటీవలి సంవత్స రాల్లో అయితే... ఐఐటీ, ఐఐఎం తదితర ప్రామాణిక సంస్థల నుంచి పట్టాలు పొందిన వారు అఖిల భారత, రాష్ట్రాల సర్వీసులకు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. మొదట్లో వారు పూర్తి సమయం వెచ్చించి, ఉదాత్తమైన సేవల్ని అందిస్తారు. సంక్షేమమైనా, అభివృద్ది కార్యక్రమా లైనా క్షేత్రంలో మంచి చొరవ, నాయకత్వ స్ఫూర్తితో నిర్వహించి ఆద రణ పొందుతారు. కాలం గడుస్తుంటే పరిస్థితిలో చాలా మార్పు వస్తోంది. అధికారం కేంద్రీకృతమయ్యే రాజకీయ వ్యవస్థ ప్రాపకం కోసం ప్రయాసలో దారి తప్పుతుంటారు. కొన్నిసార్లు రాజకీయ క్రీ(నీ)డల్లో సమిధలవుతారు. అందుకే తరాలు మారుతున్నా... అధికా రుల మంచితనం మాట్లాడేటప్పుడు ఒక శంకరన్, ఒక వేణుగోపాల్, ఒక నాగిరెడ్డి వంటి కొన్ని పేర్లే ఉదహరించాల్సి వస్తోంది. ‘అధికార వ్యవస్థ–వృద్ధి’ అనే అంశంపై ఓ ప్రపంచ స్థాయి సదస్సులో సమ ర్పించిన పత్రం ప్రకారం, అభివృద్ధి చెందుతున్న 35 దేశాల్లో ఆర్థికాభివృద్ధికి అధికారుల నైపుణ్యాలే కారణంగా వెల్లడైంది. ‘తూర్పు ఆసియా అద్భుతం’ పేరిట ప్రపంచ బ్యాంకు ఇచ్చిన నివేదికలోనూ జపాన్, కొరియా వంటి దేశాల్లో ఇది సాధ్యమైనట్టు స్పష్టమైంది. మనది సహజంగానే ‘వృద్ధి ప్రతిబంధక’ ఉద్యోగ వ్యవస్థ అనే భావన వ్యాప్తిలోకి వచ్చింది. వీరప్పమొయిలీ నేతృత్వాన 2005లో ఏర్పాట యిన రెండో పాలనా సంస్కరణల కమిషన్ సిఫారసుల్లోనూ అత్య ధికం సీనియర్ అధికారులకు సంబంధించిన అంశాలే ఉన్నాయి. కానీ, అవేవీ సరైన రీతిలో అమలుకు నోచలేదు. పాలనా సంస్కరణలు కష్టమేమో కానీ, అసాధ్యమేమీ కాదు. చట్టాలు, నిబంధనల్ని మెలితిప్పి.. అధికార వ్యవస్థ చెడ్డపేరుకు కారణాలెన్నో! వారి పనుల్లో రాజకీయ అనుచిత జోక్యాలు, నేతల ప్రాపకానికి అధికారులు అర్రులు చాచడం వంటివి ముఖ్యం. మంచి హోదాలు పొందడానికో, ఇష్టమైన చోటుకు బదిలీనో–ఇష్టం లేని చోటు తప్పించుకోవడానికో కొందరు నేతల చెప్పుచేతల్లో ఉంటున్నారు. అంతిమంగా వివిధ స్థాయిల్లో జరిగే అవి నీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నాయి. చట్టాలు, నిబంధనల్ని ఉల్లంఘించే పనులు నాయకులు చెప్పినా... కూడదని నిరాకరించి, అడ్డంగా నోట్‌ఫైల్ రాసే అధికారులు ఎందరుంటారు? దేశంలో మధ్యాహ్న భోజన వ్యవస్థకు తమిళనాడులో బీజం పడింది. సదరు ప్రతిపాదన వచ్చినపుడు ఇది ఆచరణ సాధ్యం కాదంటూ ఫైలును ఆర్థికాధికారి తిప్పిపంపారు. నాటి ముఖ్యమంత్రి ఆ అధికారిని పిలిపించి, ‘ఈ పూట భోజనం ఎక్కడ్నుంచి, ఎవరు పంపితే వచ్చిందో తెలియకుండా.. తదుపరి పూట భోజనం అసలు వస్తుందో రాదో తెలియని పరిస్థితి నీవెప్పుడైనా ఎదుర్కొన్నావా?’ అని అడిగారట. ‘లేదు’ అని చెప్పిన అధికారికి, ‘నేనా పరిస్థితి ఎదు ర్కొన్నాను. రాష్ట్రంలో ఎందరో అలాంటి వారున్నారు. సంక్షేమ రాజ్యంగా వారిని ఆదుకోవడం మన బాధ్యత, ఎలా సాధ్యమో నే చూసుకుంటాను, నీ అభిప్రాయాన్ని ఓవర్‌రూల్ చేస్తూ నోట్ రాస్తున్నాలే!’ అని సౌమ్యంగా చెప్పి పంపారట. ఆయన ఎవరో కాదు, దివంగత ఎమ్జీ రామచంద్రన్. రాజకీయ వ్యవస్థకు లొంగి చట్టాలు, నిబంధనల్ని మెలితిప్పటమే కాదు, కోర్టు ఉత్తర్వుల్నీ అమలు చేయని అధికారులుంటారు. అది న్యాయ ధిక్కారం కేసు అయినపుడు కోర్టుల నుంచి చీవాట్లు. ‘ఈ పద్ధతేం బాగోలేదు. కోర్టు ఆదేశాలు అమలు చేయరు. చివరి నిమిషం దాకా ఎలా భంగపరచాలని చూస్తారు. తప్పనపుడు... బేషరతుగా క్షమాపణలు అడుగుతారు’ అని తెలంగాణ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం సంగారెడ్డి జిల్లా అధికారుల్ని మందలించింది. పరస్పర లబ్ధికి లొంగుబాట్లు.. విభేదించినప్పటి కన్నా, నేతలతో అధికారులు అంటకాగటం వల్ల ఉద్యోగ వ్యవస్థ భ్రష్టుపట్టిందే ఎక్కువ! అలా అని అన్నింటికీ అధికా రులు నేతల్ని విభేదించాలని ఎవరూ అనరు. పాలకులకు అనుచిత ప్రయోజనాలు కల్పించినందుకు ఉద్యోగ విరమణ తర్వాత మంచి హోదాలు పొందిన వారుంటారు. వాటిపై కన్నేసి... రాజ్యాంగానికి, చట్టానికీ అతీతంగా ఉద్యోగం చివరి రోజుల్లో రాజకీయ వ్యవస్థకు ఊడిగం చేసిన అధికారులూ ఉన్నారు. అందుకే, వివిధ కమిషన్లు, కార్పొరేషన్లు, ఇతర నామినేటెడ్ పదవుల్లోకి పదవీ విరమణ తర్వాత అధికారులు రావడాన్ని పౌరసమాజం తరచూ విమర్శిస్తోంది. యోగ్యులు, వివాద రహితులైన తటస్థ అధికారులు రావటాన్ని స్వాగతించిన సందర్భాలెన్నో! యోగ్యత లేకుండా జరిగే అడ్డదిడ్డపు నియామకాలను కోర్టులూ తప్పుపట్టాయి. పదవీ విరమణ చేసిన అఖిల భారత సర్వీస్ అధికారుల్ని ఎక్కువ మందిని సమాచార హక్కు కమిషనర్లుగా నియమించడం పట్ల దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. అధికారులకు పునరావాస కేంద్రాలవుతున్నాయన్నది ముఖ్య విమర్శ. అధికారులు సమాచారం సరిగా ఇవ్వనందుకే, సర్వీసు నిబంధనల్ని ఉన్నతాధికారులుగా ఉల్లంఘించినందుకే... అప్పీళ్లు వచ్చే ఆర్టీఐ కమిషన్లలో, పాలనా ట్రిబ్యునళ్లలో తిరిగి రిటైర్డ్ అధికారులే తీర్పులు చెప్పడమేమిటి? అన్నది సగటు మనిషి విస్మయం. కేంద్ర విజిలెన్స్ కమిషన్‌లోకి ఓ అధికారి థామస్ నియా మక ప్రక్రియ వివాదాస్పదమైనపుడు సుప్రీంకోర్టు కూడా, ‘మీకు నిపుణులంటే రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే కనిపిస్తారా? పౌర సమాజంలోని ఇతర మేధావుల్ని ఎంపిక చేసుకోవడంపై ఎందుకు దృష్టి పెట్టరు?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నాయకులైనా, అధికారులైనా... జనహితమే లక్ష్యంగా పాలనా రథాన్ని సజావుగా నడపా ల్సిన జోడు గుర్రాలు. - దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
కట్టడి సరే! కర్ర పెత్తనమొద్దు
ఆన్లైన్ కంటెంట్ విచ్ఛలవిడితనాన్ని నియంత్రించే క్రమంలో పౌరుల హక్కుల్ని భంగపరిచే ప్రమాద సూచికలున్నాయి. అభ్యంతరకర కంటెంట్ డిజిటల్ వేదికల్లో వ్యాప్తి చెందుతున్నపుడు, దాన్ని సృష్టించిన వ్యక్తిని 72 గంటల్లో గుర్తించాలన్నది తాజా నిబంధన. అందుకు వీలు కల్పించే నిర్వహణ సదరు సంస్థలే ఏర్పాటు చేసుకోవాలి. అంటే, మాధ్యమిక వేదికగా, వినియోగదారులిద్దరి మధ్య పరస్పరం మార్పిడి జరిగే సమాచారానికి ఇక గోప్యత ఉండదు. ఇది గోప్యతా నిబంధనకు పూర్తి విరుద్ధం. ఇంకా సమగ్రంగా డాటా పరిరక్షణ చట్టం, గోప్యతా చట్టం రూపుదిద్దుకోని దేశంలో ఇది ప్రమాద సంకేతం. భరోసా ఇవ్వాల్సిన నిబంధనలు భయాలు రేపితే? పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టే! ‘డిజిటల్ మీడియా’లో వచ్చే కంటెంట్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిబంధనలు చర్చ రేపుతున్నాయి. ఇదొక ‘మృదు స్పర్శ’ అని సర్కారు ముచ్చటగా పేర్కొన్నా, చివరకు కఠువైన కర్రపెత్తనానికి దారితీసే జాడే కనిపిస్తోంది. అదే జరిగితే, ఇంతటి కసరత్తు తుదిస్వరూపం... భావ వ్యక్తీకరణ హక్కుకు ఒకడుగు దూరం, సెన్సార్‌షిప్‌కు మరొకడుగు దగ్గరైనట్టే లెక్క. ఇన్నాళ్లూ వాటిపై చట్ట నియంత్రణ లేకపోవడం ఓ లోపమైనా, ఎంతో ఆసక్తితో నిరీక్షించింది ఇందుకా? అన్న పెదవి విరుపు మీడియా వర్గాల్లో వస్తోంది. పౌరులు కూడా ఏం బావుకుంటారనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. నిబంధనల వెనుక పేర్కొన్న లక్ష్యాలు ఆదర్శవం తంగా అమలయితే, హానికి బదులు సమాజానికి మంచి జరగొచ్చు! కానీ, నిబంధనల నీడలో కేంద్ర సర్కారు పెద్దలకు లభించే నిర్హేతుక విచక్షణాధికారాల వల్ల దురుపయోగానికి ఆస్కారం పెరుగుతుంది. నిబంధనావళి రూపొందించిన తీరే అందుకు కారణం. ఆన్లైనే వేదికగా... ఏలిన వారి సానుకూల ప్రచార ద్వారాలు తెరచుకునేందుకు, గిట్టని ప్యత్యర్థి పక్షాల వారి భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు బంధాలు వేసేందుకూ ఇది ఊతమిస్తుంది. ఆన్లైన్ కంటెంట్ విచ్చలవిడితనాన్ని నియంత్రించే క్రమంలో పౌరుల హక్కుల్ని భంగపరిచే ప్రమాద సూచికలున్నాయి. ఆన్లైన్ సమాచార వ్యవస్థల ఊపిరైన భావవ్యక్తీకరణ హక్కుకు గండి పడొచ్చు. డిజిటల్ మాధ్యమాలే వేదికగా పరస్పర సమాచార మార్పిడి చేసుకునే వినియోగదారుల గోప్యత గోడలె క్కొచ్చు! ఓటీటీ వేదికల్లో పుట్టే కంటెంట్ సృజన భంగపడచ్చు! నచ్చని సర్కారు విధానాలని ఎండగడుతూ వేర్వేరు సామాజిక వేది కల నుంచి నిరసనలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేసే ప్రజాస్వామ్యవాదుల గొంతును నొక్కే ఆయుధంగా మారే ప్రమాదముంది. ఇప్పుడెందుకీ నిబంధనలు? సామాజిక మాధ్యమాలతో సహా ఇతర ఆన్లైన్ డిజిటల్ వేదికల నుంచి వస్తున్న కంటెంట్ తరచూ వివాదాస్పదమౌతోంది. రాజకీయ అనుకూల, ప్రతికూల వాదనల నడుమ ట్విటర్, ఫేస్బుక్ వంటి మాధ్యమిక డిజిటల్ వేదికలు అంతర్జాతీయ స్థాయిలో విమర్శలనెదు ర్కొంటున్నాయి. వినియోగదారుల వ్యక్తిగత గోప్యత, దానికి భంగం కలిగేలా ‘వాట్సాప్’ ఇటీవల తాజా నిబంధనావళిని తెచ్చే యత్నం, వ్యతిరేకత రావడంతో ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం తెలిసిందే! ఇక్కడొక పద్ధతి, పకడ్బందీ చట్టాలున్న ఇంగ్లండ్ వంటి ఐరోపా దేశాల్లో మరో పద్ధతి ఎలా పాటిస్తారంటూ కేంద్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టు సదరు మాధ్యమిక డిజిటల్ వేదికను ప్రశ్నించాయి. ఆ పరిస్థితి కూడా, దేశంలో ఇందుకు సంబంధించి ప్రత్యేక చట్టం, ఒక నియం త్రణ వ్యవస్థ అవసరాన్ని నొక్కి చెప్పింది. డిజిటల్ మీడియా వేదికల నుంచి పిల్లలను పెడదారి పట్టిస్తున్న శృంగార వీడియోలు (పోర్నో), మహిళల్ని అసభ్యంగా, అభ్యంతరకరంగా చూపించే వీడియోలు, చిత్రాలు ప్రసారమౌతున్న తీరుపట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2018 ప్రజ్వల కేసులో కేంద్ర ప్రభుత్వానికి నిర్దిష్టమైన ఆదేశాలిచ్చింది. వినియోగదారుల సమాచారం పంచుకునే మాధ్యమిక వేదికలతో సహా వివిధ డిజిటల్ మీడియాలో వస్తున్న కంటెంట్‌ను కట్టడి చేయాలని, అవసరమైతే మార్గదర్శకాల్ని జారీ చేయాలని, నియంత్రణ వ్యవస్థల్ని ఏర్పాటు చేయాలనీ ఆదేశించింది. ప్రస్తుత మార్గదర్శకాలు ఆ క్రమంలో వచ్చినవే! అయితే వీటిని పార్లమెంటు లోగానీ, మరే ఇతర శాసన వేదికల్లోగానీ చర్చించ లేదు. డిజిటల్ మీడియాపై అధికారిక నియంత్రణ, వారి పనితీరును నిర్దేశించే చట్ట మేదీ లేకపోవడం లోపంగానే ఉంది. కొత్తగా చట్టం తీసుకురాకుండా కేంద్రం తాజా నిబంధనలతో ఆ లోటును పూడ్చే ప్రయత్నం చేసింది. ఎటు దారి తీసేనో...! డిజిటల్ వేదికల్లో కంటెంట్ ఏ అదుపూ లేకుండా, విచ్చలవిడిగా ఉండా లని ఎవరూ కోరుకోరు. నియంత్రణ, అందుకు తగిన మార్గదర్శకాలు, అమలుపై నిఘా ఉండాల్సిందే! అవి ఏ మేర సముచితమన్నది ప్రజా స్వామ్య వ్యవస్థలో చర్చ పుట్టిస్తుంది. ఫిర్యాదుల్ని పరిష్కరించడం, డిజిటల్ వేదికలని నియంత్రించడం, వారి ప్రక్రియల్ని చట్టబద్ధం చేయడం కోసమే ప్రస్తుత నియమావళి. డిజిటల్ అన్న మౌలిక పదం కింద... అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ వేదికల్ని, ఫేస్బుక్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల్ని, వాట్సాప్, సిగ్నల్ వంటి సమాచార మార్పిడి–మాధ్యమిక వేదికల్ని, వివిధ న్యూస్ వెబ్సైట్ల వంటి సమా చార మాధ్యమాల్ని... అన్నింటినీ ఒక గాటన కట్టడం ఆశ్చర్యం కలిగి స్తోంది. వాటి స్వరూప స్వభావాలు, పనితీరు, కంటెంట్ నిర్మాణం, పంపిణీ, లక్ష్యిత వినియోగదారులు... భిన్నం. కంటెంట్ పట్ల అభ్యంత రాలతో ఎవరైనా ఫిర్యాదు చేస్తే వాటిని పరిష్కరించేందుకు ఆయా సంస్థల్లో నిర్దిష్ట మూడంచెల వ్యవస్థ ఉండాలని నిర్దేశించారు. అంతర్గ తంగా మొదట గ్రీవెన్స్ ఆఫీసర్, తర్వాత ఫిర్యాదుల్ని పరిష్కరించే ‘గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీ’ ఉండాలి. అప్పటికీ పరిష్కారం లభించ కుంటే, సదరు అంశం మూడో స్థాయిలో, ప్రభుత్వంలోని వివిధ శాఖల అధికారులతో ఏర్పడే ‘తుది అంచె కమిటీ’కి వెళ్తుంది. వారిచ్చే తీర్పుకు లోబడి ఉండాలి. అంటే, పాలకపక్షాల కనుసన్నల్లోని వీర విధేయ అధికారులు ఆయా స్థానాల్లో ఉంటే, ఇది ’సూపర్ సెన్సా రింగ్’ కాక మరేమవుతుందన్నది ప్రశ్న! ఆన్లైన్ మీడియాలో ఏం రావాలి? ఏం రావొద్దు? అన్నది ప్రభుత్వాధికారుల నిర్ణయాల ప్రకారం జరిగితే, మీడియా స్వేచ్ఛ– వాక్స్వాతంత్య్రానికి అర్థం చిన్న బోతుంది. చిన్న సంస్థలు ఇంతటి ఫిర్యాదు–పరిష్కార వ్యవస్థల్ని ఏర్పరచుకోలేవు. పెద్ద సంస్థలు సర్కారు పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడ సాహసించలేవు. చివరకిది, ఫక్తు ప్రచారానికి–సమాచార వ్యవస్థకి మధ్య విభజన రేఖను చెరిపేస్తుంది. మీడియా విశ్వసనీయ తను తగ్గిస్తుంది. కడకు ఆర్థికంగా మనలేని స్థితికి మీడియా దిగజారు తుందన్నది ఆందోళన. ఓటీటీలో వచ్చే కంటెంట్ వీక్షకులను వేర్వేరు వయసుల వారిగా వర్గీకరించాలన్న నిబంధన స్వాగతించదగ్గదే. న్యాయస్థానంలో నిలిచేనా...? పరస్పర విరుద్ధాంశాలు సందేహాల్ని రేకెత్తిస్తున్నాయి. అభ్యంతరకర కంటెంట్ డిజిటల్ వేదికల్లో వ్యాప్తి చెందుతున్నపుడు, దాన్ని సృష్టించిన వ్యక్తిని 72 గంటల్లో గుర్తించాలన్నది తాజా నిబంధన. అందుకు వీలు కల్పించే నిర్వహణ సదరు సంస్థలే ఏర్పాటు చేసుకోవాలి. అంటే, మాధ్యమిక వేదికగా, వినియోగదారులిద్దరి మధ్య పరస్పరం మార్పిడి జరిగే సమాచారానికి ఇక గోప్యత (ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టింగ్) ఉండదు. ఇది గోప్యతా నిబంధనకు పూర్తి విరుద్ధం. ఇంకా సమగ్రంగా డాటా పరిరక్షణ చట్టం, గోప్యతా చట్టం రూపుదిద్దుకోని దేశంలో ఇది ప్రమాద సంకేతం. ఇదే సమయంలో ఆ రెండు చట్టాలు తీసుకువచ్చే యత్నాలు మరోవైపు జరుగుతున్నాయి. గోప్యత ప్రాథమిక హక్కని సుప్రీంకోర్టు 2017 ఆగస్టులో విస్పష్టమైన తీర్పునిచ్చింది. పైగా, నిబం ధనల్లో పేర్కొన్న పలు అంశాలు నిర్ణయించే అధికారం సర్కారుకు/ అధికారులకు దఖలుపరిచే మూల స్వరూపమేదీ సదరు ‘ఐటి చట్టం– 2000’లో లేదు. చట్టాలన్నీ రాజ్యాంగానికి లోబడి ఉన్నట్టే, ఒక చట్టం కింద రూపొందే నిబంధనలు సదరు చట్టానికి లోబడే ఉండాలి. భిన్నంగా ఉంటే, సవాల్ చేసినపుడు న్యాయస్థానంలో నిలువ జాలవు. తగురీతిన పార్లమెంటులో చర్చించకుండా, చట్ట సవరణకూ సిద్దపడ కుండా, తనకు లేని అధికారాల్ని ప్రభుత్వం నిబంధనల రూపంలో తీసుకురావడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యాంగ బద్ధత అటుంచి, ముందు చట్టబద్ధతైనా ఉండాలిగా? అనే ప్రశ్న తలె త్తుతోంది. తప్పిదాల్ని సరిదిద్దుకోకుంటే... భారత రాజ్యాంగం అధిక రణం 19(1)(ఎ)లో, ఐక్యరాజ్యసమితి మానవహక్కుల ప్రకటన అధి కరణం 19లో నొక్కిచెబుతున్న భావ ప్రకటన స్వేచ్చ గాలికి ఎగిరిపోయి ప్రజాస్వామ్యం పరిహాసమవుతుంది. దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
అణచేస్తే అణగని జనగళం
దేశద్రోహం అభియోగంతో ‘టూల్‌కిట్ కేసు’లో దిశను, మరికొందరిని అరెస్టు చేయడం ద్వారా మరెవరూ.. ఉద్యమాలవైపు వెళ్లకుండా గట్టి సంకేతమివ్వా లన్న సర్కారు ఆలోచన వికటించింది. ఓ అంతర్జాతీయ హక్కుల కార్యకర్త, ఇక్కడి రైతు ఉద్యమం పట్ల సానుభూతిగా ఉండటం, వారి సమస్యకు పరి ష్కారం కోరడం తప్పెలా అవుతుంది? దేశీయంగా తలెత్తుతున్న వ్యతిరేకతను అణచే మోదీ ప్రభుత్వపు ప్రతి చర్యా, అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను ఒక్కో మెట్టు దిగజారుస్తోంది. రైతులకు ఏది మంచో, వారేం కోరుకుంటున్నారో... ఆ దిశలో నిజాయితీగా కృషి చేయడమే ప్రజాస్వామ్యానికి బలం. ప్రజాందోళనలు సునాయాసమైన ఆహ్లాద క్రీడలు కావు. ఎంతో శ్రమ, త్యాగాలతో కూడుకున్నవి. శక్తివంతమైనవి కూడా! తాము చేసేది, ‘సమాజ ఉమ్మడి ప్రయోజనాల కోసం’ అనే తలంపులోనే ప్రగాఢ శక్తి ఇమిడి ఉంది. ఎన్నో ప్రతీఘాత చర్యలకు ఎదురొడ్డి నిలుస్తాయి. వెంటనే ఫలితం కనపించకపోయినా... ఎప్పుడో ఒక ప్పుడు, ఏదో రూపంలో ఫలిస్తాయి. వాటిని కించపరిస్తే... అగ్నికి ఆజ్యం పోసినట్టు మరింత రగులుతాయి. అణచివేస్తే నేలకు కొట్టిన బంతిలా రెట్టించిన ఒత్తిడితో పైకి లేస్తాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యం. కేంద్రంలోని పాలకపక్ష వ్యూహకర్తలు ఈ చారిత్రక సత్యాన్ని ఎందుకు విస్మరించారు? వ్యవ సాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న రైతాంగ ఉద్యమం, దన్నుగా ఎక్కడికక్కడ జరుగుతున్న మద్దతు పోరా టాల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి విమర్శలనెదుర్కొంటోంది. కొన్ని నెలలుగా ఈ ఉద్యమాన్ని నీరుగార్చడానికి పాలకపక్షీయులు చేయని ఆలోచన లేదు, పన్నని వ్యూహరచన లేదు! అయినా, సాధిం చిందేమీ లేదు. గణతంత్ర దినోత్సవం నాటి దుర్ఘటనల ఆధారంగా... వేర్పాటు వాదులు, విధ్వం సక శక్తుల చేతుల్లోకి ఉద్యమం వెళిపోయిం దని చేస్తున్న ప్రచారానికీ స్పందన రాలేదు. ఆ ఒక్క ప్రతికూల పరి ణామంతో ఉద్యమ నాయకులూ ఢీలా పడ్డారు. ప్రభుత్వం దీన్ని ప్రచా రాస్త్రం చేయడంతో అంతా ‘ఇక అయిపోయింది’ అనుకున్నారు. కానీ, తిరిగి పుంజుకున్న రైతాంగ ఉద్యమం భౌగోళికంగా, భావజాలపరంగా ఇంకా విస్తరిస్తోంది. సరి కొత్త సవాళ్లు విసురుతోంది. మరోవైపు ప్రభుత్వం కూడా విరుగుడు ఆలోచిస్తూ కొత్త కార్యాచరణ చేపట్టింది. తాజాగా, పర్యావరణ కార్యకర్త దిశరవి అరెస్టు, అంతకు ముందు ఆమెపై దేశద్రోహం, కుట్ర, విద్వేషం రగిలించడం వంటి అభియో గాలతో ఢిల్లీ సైబర్ పోలీసులు కేసు పెట్టడం దేశం లోపల, బయట పెద్ద చర్చనే లేవనెత్తింది. మరో ఇద్దరు హక్కుల కార్యకర్తలపై దేశ ద్రోహం కేసు పెట్టి ‘బెయిల్‌లేని అరెస్టు వారెంట్’ (ఎన్బీడబ్ల్యూ) జారీ చేయడంతో వారిద్దరూ బెయిల్ తీసుకుంటున్నారు. ‘శాంతియుత అస మ్మతి, విమర్శ, నిరసన... దేశ పౌరుల ప్రాథమిక హక్కు’ రైతు ఉద్య మంలో అరెస్టయిన ఇద్దరికి బెయిల్ ఇస్తూ ఢిల్లీ అదనపు సెషన్స్ జడ్జి ఇటీవల చేసిన ఈ వ్యాఖ్య రాజ్యాంగపరమైన మౌలికాంశాన్ని తెరపైకి తెచ్చింది. ‘నిరసనల్ని తొక్కిపెట్టడానికో, విమర్శకుల నోరుమూయిం చడానికో దేశద్రోహం చట్టాన్ని దుర్వినియోగపరచనీయం’ అన్నారీ సందర్భంగా! ఏమనుకుంటే ఏమౌతోంది? ప్రభుత్వం, నిర్దిష్ట సంకేతమివ్వాలనే కొన్ని చర్యలు చేపడుతుంది. కానీ, కొన్నిమార్లు సదరు చర్య అందుకు భిన్నమైన సందేశాన్ని జనం లోకి తీసుకుపోతుంది. దిశ అరెస్టులోనూ అదే జరిగింది. దేశద్రోహం అభియోగంతో ‘టూల్‌కిట్ కేసు’లో దిశను, మరికొందరిని అరెస్టు చేయడం ద్వారా మరెవరూ.... ఉద్యమాలవైపు వెళ్లకుండా గట్టి సంకేత మివ్వాలన్న సర్కారు ఆలోచన వికటించింది. ‘56 ఇంచ్‌ల ఛాతీ, నిత్య కసరత్తులతో సడలని దృడఖాయం, వెరువని ధీరోదాత్తమైన వజ్ర సంకల్పం.. ఇరవయేళ్ల అమ్మాయికి ఇంతగా భయపడుతోందా?’ అంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వ్యాఖ్యలు, సంప్రదాయ మీడియాలో వెలసిన కార్టూన్లు పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయి. న్యూయార్క్‌లో ఉండే భారత మేధావి, ప్రఖ్యాత కాలమిస్ట్ సలీల్ త్రిపాఠీ దాదాపు ఇలాగే స్పందించారు. ‘‘ఢిల్లీ పోలీసులు పేర్కొన్న దాన్ని బట్టి... భారత్ ఇపుడు అతి ప్రమాదస్థితిలో ఉంది. 2.6 ట్రిలి యన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, అణ్వాయుధంతో ప్రపంచంలోని అయి దింట ఒకటైన మహాదేశం, ఓ బలీయశక్తి ముందు అత్యంత దుర్భ లంగా కనిపిస్తోంది. అదేదో మరో అణ్వాయుధమున్న శత్రుదేశం కాదు, విడివిడిగా–ఎవరికి వారుగా ఉండే సెలబ్రిటీలు, విభిన్నరంగాల సామాజిక కార్యకర్తలు, పోరాటాలు–ఉద్యమాలతోనే జీవించే, ప్రధాని మోదీ పరిభాషలో ‘ఆందోళన జీవుల’ బృందమది’’ అంటారాయన. డిజిటల్ సాంకేతికత వచ్చాక, ఐటీ తదితర రంగాల నెట్వర్కింగ్ వ్యూహకర్తలే కాకుండా ప్రజాపోరాటాలు జరిపేవారు కూడా ‘టూల్ కిట్’ ఉపకరణాన్ని వాడుతారు. ఇదేం మారణాయుధం కాదు. ఐటీ యుగంలో ఇదొక పరస్పర సమాచార మార్పిడి వేదిక. భాగమైనవారు, సమాచారాన్ని వేర్వేరు రూపాల్లో పంచుకుంటారు. ఇది చాలా సాధా రణ ప్రక్రియ. అయితే, దీన్ని ‘ఖలిస్తాన్’ వేర్పుటువాదంతో ముడిపెట్టి, వారితో రహస్యంగా సంబంధాలు నెరపడం కింద నిర్దిష్ట అభియోగా లతో దిశరవితో పాటు మరో హక్కుల కార్యకర్త, ముంబై అడ్వకేట్ నికితా జాకోబ్, పర్యావరణ కార్యకర్త–ఇంజనీర్ శంతను ములుకుల పైనా కేసులు నమోదు చేశారు. ఢిల్లీ హైకోర్టు ఇదివరకే జారీ చేసిన మార్గదర్శకాల్ని బేఖాతరంటూ, అంతర్రాష్ట్ర అరెస్టుల్లో పాటిం చాల్సిన కనీస పద్దతుల్నీ ఢిల్లీ పోలీసులు విస్మరించారు. దిశను బెంగళూరు నివాసంలో అరెస్టు చేసేటప్పుడు పోలీసులు భయోత్పాతం సృష్టిం చారు. ఇదంతా పోలీసుల, తద్వారా ప్రభుత్వం వైఖరిని వెల్లడించేదే అనే విమర్శలున్నాయి. మొరటు చర్యలు అణచగలవా? సమస్యను, దాని మూలాలను అర్థం చేసుకోవడంలో వైఫల్యం వల్లే పలు విషయాల్లో కేంద్ర ప్రభుత్వం అతిగా స్పందిస్తోందన్నది విమర్శ. స్వీడన్ పర్యావరణ యువకార్యకర్త గ్రెటా తన్‌బర్గ్ ట్వీట్‌కు స్పందిం చడం ఓ ఉదాహరణ. వేర్వేరు రంగాల దేశీ ప్రముఖులతో ప్రతిస్పం దనలు ఇప్పించి, వ్యవహారాన్ని జటిలం చేయడమే కాక దేశ ప్రతిష్టను అంతర్జాతీయ సమాజంలో దిగజార్చారు. ఓ అంతర్జాతీయ హక్కుల కార్యకర్త, ఇక్కడి రైతు ఉద్యమం పట్ల సానుభూతిగా ఉండటం, వారి సమస్యకు పరిష్కారం కోరడం తప్పెలా అవుతుంది? దాన్ని దేశ సార్వ భౌమాధికారంలో చొరబాటుగా పరిగణించడం విమర్శలకు తావి చ్చింది. ఇదే నిజమైతే... నేటి చైనా నాయకత్వ సరళిపైన, నిన్నటి ట్రంప్ నిర్ణయాల పట్ల, మొన్నటి హిట్లర్ నియంతృత్వం మీద మనం, మన మేధావులు చేసిన వ్యాఖ్యలన్నీ ఆయా దేశాల సార్వభౌమాధికార ధిక్కరణలేనా? ఎవరిపైన అయినా దేశద్రోహం ఆరోపించడం తేలిక! నిరూపించడం దుర్లభం. లేనపుడు రుజువుచేయడం అసంభవం. ఉద్యమాలను బలహీనపరచడానికి, సాధారణ జనంలో దురభిప్రాయం కలిగించడానికి దేశద్రోహం ఆపాదిస్తున్నారనే విమర్శ బలపడుతోంది. రైతాంగ పోరాటాన్ని అణచే ఎత్తుగడల్లో ఇదీ ఒకటనే భావన జనంలోకి చొచ్చుకు పోతోంది. ఉద్యమాలను సామరస్యంగానే తప్ప మొరటు, అణచివేత చర్యల ద్వారా అదుపుచేయలేమన్నది ప్రపంచవ్యాప్తంగా నిరూపిత మైంది. అమెరికా మేధావి, విశ్లేషకుడు జెనె షార్ప్ 200కు పైగా అహింసాయుత నిరసన పోరాటాలను, ‘నియంతృత్వం నుంచి ప్రజా స్వామ్యం వైపు’ అనే తన పుస్తకంలో నిర్వచించారు. అనేక దేశాల్లో కార్యకర్తలు, ఉద్యమనేతలు దీన్నొక మార్గదర్శిగా మలుచుకొని నియం తృత్వాల స్థానే ప్రజాస్వామ్యాలు ఏర్పరచుకున్నారు. బ్రిటిష్ విశాల సామ్రాజ్యాధీశుల్ని పిడికెడు ఉప్పుతో వణికించిన మహాత్ముడిని పలుమార్లు ఆ పుస్తకంలో ఆయన ఉటంకించారు. దేశీయంగా తలెత్తుతున్న వ్యతిరేకతను అణచే మోది ప్రభుత్వ ప్రతి చర్యా, అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను ఒక్కో మెట్టు దిగ జారుస్తోంది. ఉదారప్రజాస్వామ్యమనే కీర్తి క్రమంగా పలుచబారు తోంది. మోదీ వీసాను అమెరికా పునరుద్దరించాక, సదరు సంబంధాల మెరుగుకు ఎన్ని యేళ్లు ఆయన శ్రమించాల్సి వచ్చింది? ఈ అయిదా రేళ్ల కృషిలో అంతర్జాతీయంగా భారత్‌కు లభిం చిన పేరు ప్రతిష్టల్ని, కీలక పాత్రనీ ఎందుకు కాలదన్నుకోవడం? రైతాంగం మదిలో చోటు కోల్పోవడం వల్లే, తమకు బాగా పట్టున్న ఉత్తరాదిలోనూ జనాదరణ కోల్పోవాల్సి వస్తోందని పంజాబ్ పట్టణ ఎన్నికల ఫలితాల్ని చూసి పాలకపక్షం గ్రహించాలి. పంతం వీడి, రైతులకు ఏది మంచో, వారు ఏం కోరుకుంటున్నారో... ఆ దిశలో నిజాయితీగా కృషి చేసి, జనాభీ ష్టాన్ని నిరవేర్చడమే ప్రజాస్వామ్యానికి బలం. దిలీప్ రెడ్డి ఈ–మెయిల్: dileepreddy@sakshi.com -
సయోధ్య సర్కారు విధి
ప్రజాస్వామ్యంలో పౌరులకు ప్రభుత్వం జవాబుదారుగా నిలవాలి. సమస్యల్ని పరిష్కరించడమే కాకుండా అందుకు దారితీసే పరిస్థితుల్ని తానే సృష్టించుకోవాలి. దారులు మూసుకుపోయే పరిస్థితులు కల్పించడం తన వైపు నుంచి జరుగకూడదు. వ్యవసాయం బాగు చేసి, రైతుకు రెట్టింపు ఆదాయం తెచ్చేందుకే ఈ చట్టాలు అంటున్న కేంద్రం, సదరు విశ్వాసాన్ని రైతుల్లో ఏ దశలోనూ కల్పించలేకపోయింది. ఆందోళన కొన్ని రాష్ట్రాల్లోనే ఉందని ప్రచారం చేసినా, వ్యతిరేక భావన అన్ని రాష్ట్రాల్లోనూ ఉందని వెల్లడవుతూ వచ్చింది. వివాదాస్పద చట్టాల జన్మస్థానమైన పార్లమెంటు వైదికనుంచైనా ఈ సమస్యకు పరిష్కారం లభించాలని, ప్రస్తుత ప్రతిష్టంభన తొలగాలని రైతులతో పాటు ఇతర ప్రజాస్వామ్యవాదుల ఆకాంక్ష. వెన్నెముక శస్త్రచికిత్స సున్నితమనే భావన వైద్యవర్గాల్లోనే కాక సామాన్యుల్లోనూ ఉంది. అందుకే, వైద్యులు శ్రద్ధతో సిద్ధమౌతారు. వైద్యపరంగా అనివార్యం, రోగి అంగీకారం అయితే తప్ప శస్త్రచికిత్సకు పూనుకోరు. దేశానికి వెన్నె ముక అయిన రైతు వ్యవసాయ సమస్యల్ని పరిష్కరించేప్పుడు పాలకు లకు ఎందుకు ఆ శ్రద్ధ ఉండదు. ఇది కోటిరూకల ప్రశ్న! జనాభాలో అత్యధికులు ఆధారపడ్డ వ్యవసాయరంగంలో సంస్కరణలు వెన్నెముక శస్త్రచికిత్సకన్నా కీలకం. రైతుల ఎడతెగని పోరొకవైపు కేంద్ర ప్రభుత్వ మొండివైఖరి మరోవైపు సమస్యను జటిలం చేశాయి. ప్రతిష్టంభన కొనసాగుతోంది. చర్చల ద్వారా పరిష్కార అవకాశాలు సజీవంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నా... అటు కేంద్రం, ఇటు రైతాంగం పర స్పర విశ్వాసరాహిత్య స్థితికి చేరాయి. సర్కారు కవ్వింపు చర్యలు ఉద్యమిస్తున్న రైతాంగాన్ని రెచ్చగొడుతున్నట్టున్నాయి. ఉద్యమంలో అసాం ఘిక శక్తులు చేరాయంటున్న సర్కారు, గణతంత్ర దినోత్సవం నాటి దుర్ఘటనల్ని ఉటంకిస్తోంది. ప్రజాస్వామ్యంలో పౌరులకు ప్రభుత్వం జవాబుదారుగా నిలవాలి. సమస్యల్ని పరిష్కరించడమే కాకుండా అందుకు దారితీసే పరిస్థితుల్ని తానే సృష్టించుకోవాలి. వ్యవసాయం బాగుచేసి, రైతుకు రెట్టింపు ఆదాయం తెచ్చేందుకే ఈ చట్టాలు అంటున్న కేంద్రం, సదరు విశ్వాసాన్ని రైతుల్లో ఏ దశలోనూ కల్పించ లేకపోయింది. ఆందోళన కొన్ని రాష్ట్రాల్లోనే ఉందని ప్రచారం చేసినా, వ్యతిరేక భావన అన్ని రాష్ట్రాల్లోనూ ఉందని వెల్లడవుతూ వచ్చింది. వ్యవసాయరంగ మనుగడతో నేరుగా ముడివడిన మూడు కీలక చట్టాల ప్రతిపాదన, పొందుపరచిన అంశాలు, ముసాయిదా తీరు, పార్లమెంటులో ఆమోదించుకున్న వైనం, కడకు అమలు... అన్నీ వివా దాస్పదమే! అమలు నిలిపివేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. రైతు సందేహాలను నివృత్తిచేసే సంతృప్తికర జవాబు ఇంతవరకు రాలేదు. పైగా, తాజా బడ్జెట్లోని వ్యవసాయ అంశాలు దేశ రైతాంగంలో కొత్త సందేహాలను రేకెత్తిస్తున్నాయి. తమ అనుమా నాలు అపోహలు కాదని, వాటిని ధ్రువీకరించే సంకేతాలు బడ్జెట్ ప్రతి పాదనల్లో పుష్కలంగా ఉన్నాయని వారు భావిస్తున్నారు. వ్యవసా యాన్ని రైతుల చేతుల్లోంచి జార్చి, కార్పొరేట్లకు ధారాదత్తం చేసే భూమికను కేంద్రం సిద్ధం చేస్తున్న జాడలే çస్ఫుటమని వారంటున్నారు. కొత్తగా వ్యవసాయ మౌలికరంగాభివృద్ధి సెస్ (ఎఐడీసీ) విధింపుపైనా రైతాంగానికి అనుమానాలున్నాయి. సమాఖ్య స్ఫూర్తికి భంగం పరిమిత వస్తువులపై వేర్వేరు శాతాల్లో ఎఐడీసీ విధింపును కొత్త బడ్జె ట్లో ప్రతిపాదించారు. పెట్రోలు, డీజిల్ పైనే కాకుండా కొన్ని ఆహార పదార్థాల దిగుమతి పైనా ఈ సెస్ రానుంది. అది వినియోగదారులపై భారం కాకుండా ఉండేందుకు ఆ మేర, ప్రస్తుత కస్టమ్స్, ఎక్సైజ్ డ్యూటీ తొలగింపో, తగ్గింపో ప్రతిపాదించారు. ఇక్కడొక మతల బుంది. సెస్‌పై కేంద్ర ప్రభుత్వానికే పూర్తి అజమాయిషీ! రాష్ట్రాలకు వాటా ఇచ్చే పనిలేదు. కస్టమ్స్, ఎక్సైజ్ డ్యూటీ కింద వసూలయిం దాంట్లో రాష్ట్రాలకు నిర్ణీత వాటా ఇవ్వాలి. ఇలా రాష్ట్రాలకు రావాల్సిన నిధులకు తాజా మార్పు గండి కొడుతుందని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని కొన్ని రాష్ట్రాలు స్పందించాయి. వ్యవసాయం రాష్ట్ర ప్రభు త్వాల జాబితాలోని అంశమైనా కేంద్రం ఏకపక్షంగా మూడు చట్టాలను తీసుకువచ్చిందనే విమర్శ ఉంది. సదరు చట్టాల్లోని అంశాలు ప్రభావం చూపకుండా ఉండే విరుగుడు చట్టాలను దేశంలోని ఏడు రాష్ట్రాలు ఇప్పటికే తీసుకువచ్చాయి. ఇది కూడా సమాఖ్య స్ఫూర్తికి భంగమే! వ్యవసాయరంగంలోకి పెద్ద మొత్తంలో ప్రయివేటు పెట్టు బడుల్ని ఆకర్శించి తద్వారా ఉత్పాదకత, సామర్థ్యం పెంచాలంటే సంస్కరణలు అనివార్యం అని కేంద్రం అంటోంది. ప్రభుత్వం ఇదే విషయం రాష్ట్రాలతో సంప్రదించి, రైతాంగాన్ని ఒప్పించి చేసి ఉండా ల్సిందనే అభిప్రాయం ఉంది. పార్లమెంటులోనూ బిల్లుపై విపులంగా చర్చించలేదని, స్థాయీ సంఘానికో, సంయుక్త పార్లమెంటరీ కమిటీకో పంపి ఏకాభిప్రాయ సాధన చేసి ఉండాల్సిందంటారు. అలా జరిగి ఉంటే రాష్ట్రాల సహకారంతో చట్టాల అమలు సజావుగా సాగేదనేది అంతరార్థం. అది లోపిండం వల్లే ఇంతటి వ్యతిరేకత, ప్రస్తుత ప్రతిష్టంభన! ఆధిపత్యానికి ఊతం కొత్త చట్టాల్లో పొందుపరచిన పలు అంశాలు తమకు ప్రతికూలమని రైతాంగం అంటోంది. వాటి వల్ల వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర, ప్రభుత్వ కొనుగోళ్లు, వ్యవస్థీకృత మార్కెటింగ్, తద్వారా ప్రయి వేటులోనూ లభించే మార్కెట్ స్పర్ధ క్రమంగా కొరవడుతాయని వారి ఆందోళన. అది తప్పు, వారిది అపోహ మాత్రమే అని కేంద్రం అంటోంది. కనీస మద్దతుధర కొనసాగుతుందని, వ్యవసాయోత్ప త్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ)లు ఉంటాయని ప్రభుత్వం నమ్మ బలుకుతోంది. ప్రయివేటు రంగం రాకవల్ల పోటీ ఏర్పడి వ్యవసాయో త్పత్తులకు డిమాండ్ పెరుగుతుందని, రైతులకు మేలని సర్కారు వాదన. బడా వ్యాపారులు రిటేల్ వస్తు విక్రయరంగంలోకి వచ్చి, చిన్నా, చితకా దుకాణాలు, నాలుగు చక్రాల బళ్లపై విక్రయాలు లేకుండా చేసి, పూర్తి ఆధిపత్యం సాధించిన తర్వాత తమకు అను కూలంగా ధరల్ని నియంత్రించిన ఉదాహరణలు కోకొల్లలు. తమది అపోహ కాదని, ప్రభుత్వం వెనక్కి తగ్గి ప్రయివేటు ఆధిపత్యంలోకి వ్యవసాయంరంగం చేజారాక తలెత్తే అనర్థాలకు అంతుండదని రైతు సంఘాలంటున్నాయి. ఇదంతా ఓ పెద్ద కుట్ర అని, సంస్కరణల ముసుగులో ప్రయివేటుకు తివాచీలు పరచి, క్రమంగా రైతును నిస్స హాయ స్థితిలోకి నెడతారనేది రైతు సంఘాల భయాందోళన. ప్రయి వేటు పెట్టుబడుల్ని పెద్ద మొత్తాల్లో ఆకర్శించి, ఆహ్వానించకుండా వ్యవ సాయాన్ని లాభసాటిగా మార్చలేమని ప్రభుత్వం చెబుతోంది. మొదట అలా కనిపించినా, రాను రాను అసంఘటిత రైతాంగాన్ని మరింత దీనస్థితిలోకి నెడుతుందనే అభిప్రాయం అత్యధికుల్లో ఉంది. బడ్జెట్లోనూ కవ్వింపు ప్రతిపాదనలా? వ్యయ ప్రయాసలకోర్చి, రైతాంగం ఎడతెగని ఉద్యమం చేస్తున్నా, వారిని అనునయించి మచ్చిక చేసుకునే సర్కారు ప్రయత్నమేదీ బడ్జెట్ ప్రతిపాదనల్లో లేదని వ్యవసాయ నిపుణులంటున్నారు. పైగా కొన్ని కవ్వింపు చర్యల సంకేతాలున్నాయనేది వారి భావన! వ్యవసాయ రంగానికి నిధులు పెంచకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. రుణ సదుపా యాన్ని స్వల్పంగా పెంచినా ప్రతిష్టాత్మకమైన ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద రైతాంగానికి అందిస్తున్న పెట్టుబడి సహాయానికి కత్తెర వేశారు. గత సంవత్సరపు నిధి రూ. 75 వేల కోట్ల నుంచి ఈ సారి రూ. 65 వేల కోట్లకు (13 శాతం) తగ్గించారు. రైతు సంక్షేమ వ్యయం లోనూ 8.5 శాతం కోత విస్మయం కలిగించింది. కార్పొరేట్ శక్తుల గుత్తాధిపత్యానికి సర్కారు దారులు పరుస్తోందన్న విమర్శకులే, తాజా బడ్జెట్లో కేంద్రం ఆ దారుల్ని మరింత చదును చేయజూస్తోందని ఆరోపిస్తున్నారు. ప్రయివేటు శక్తుల ఇష్టారాజ్యానికి కొత్తచట్టాల పక డ్బందీ అమలుకు భూమిక, అదికూడా ప్రజాధనంతో సిద్ధం చేస్తోం దనేది అభియోగం. వ్యవసాయ మౌలికరంగాభివృద్ధే సెస్ సమీకరణ వెనుక ఉద్దేశం. కానీ, ఈ నిధుల్ని ఎక్కడ? ఏ మౌలిక వ్యవస్థ ఏర్పా టుకు? ఏ ప్రాతిపదికన వెచ్చిస్తారో స్పష్టత ఉండాలని రైతాంగం కోరు తోంది. రోడ్లు వేస్తారా? గిడ్డంగులు కడతారా? యాంత్రికత పెంచు తారా? ఏం చేస్తారు? తద్వారా ఎవరికి ప్రయోజనం, రైతుకా, పరిశ్ర మకా? వ్యాపారులకా? స్పష్టత ఉండాలనేది విమర్శకుల వాదన. వివా దాస్పద చట్టాల జన్మస్థానమైన పార్లమెంటు వైదికనుంచైనా ఈ సమ స్యకు పరిష్కారం లభించాలని, ప్రస్తుత ప్రతిష్టంభన తొలగాలని రైతు లతో పాటు ఇతర ప్రజాస్వామ్యవాదులంతా కోరుకుంటున్నారు. దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
డేటా చోరీ.. గోప్యతకు గోరీ
వ్యక్తిగత సమాచార భద్రత! ‘అబ్బో! అది దుర్వినియోగమైతే ఎలా...?’ మన సమాజం ఒక్కసారిగా అప్రమత్తమైంది. సదరు ప్రాధాన్యతను నిజంగా గుర్తించిందా? ఏమో! పరస్పర సందేశాల మార్పు ఉపకరణం (మెసే జింగ్ యాప్) ‘వాట్సాప్’ను మునివేళ్లపై నిలిపి, నిర్ణయాన్ని వాయిదా వేసుకునేలా చేసిందంటే నిజమేనేమో! అనిపిస్తుంది. ‘ఫలానా తేదీ లోపు మా కొత్త గోప్యతా విధానానికి అంగీకారం తెలపండి లేదా సేవల నుంచి వైదొలగండి’ అన్న వాట్సాప్, భారతీయుల్లో పెల్లుబికిన వ్యతిరేకత దెబ్బకు వెనక్కి తగ్గింది. వాయిదాతో తన ప్రతిపాదన మూడు నెలలు వెనక్కి నెట్టింది. ‘మీ సమాచార వివరాలు చూడబోము, వాడబోము’ అని వినియోగ దారుల్ని నమ్మించే కాళ్లబేరానికొచ్చింది. ఎందుకంటే, 40 కోట్ల అకౌంట్లతో ఈ దేశంలో తనకున్న అతి పెద్ద మార్కెట్ పడిపోతే ఎలా? భయం! తాజా ప్రతిపాదన నచ్చక లక్షలాదిమంది వేగంగా ‘సిగ్నల్’ ‘టెలిగ్రామ్’ వంటి ప్రత్యామ్నాయ యాప్‌లకు దారి మళ్లడంతో జడు సుకుంది. కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి నిద్రమత్తు వదిలినట్టు లేచి, వాట్సాప్‌ను ప్రశ్నావళితో గద్దిస్తోంది. అసలు మీ విధానమేంటి? మా పౌరుల నుంచి మీరేం సమాచారం సేకరిస్తున్నారు? ఇక్కడ–యూర ప్లో తేడాలెందుకు? అని ప్రశ్నలు సంధిస్తోంది. గోప్యత విధానంలో మార్పులేమీ తేకండి అంటోంది. వాట్సాప్ ప్రతిపాదన వాయిదా పడిందే తప్ప సమస్య తొలగిపోలేదు. ప్రమాదం నిరంతరం పొంచి ఉంటుందన్నది నిజం. సామాజిక మాధ్యమాలన్నింటితోనూ ఈ ప్రమాదం ఉంది, ఉంటుంది. తమ వినియోగదారుల నుంచి వేర్వేరు రూపాల్లో సేకరించే, పొందే, నిల్వ చేసే, అనుసంధానమయ్యే వ్యక్తిగత సమాచారం వారి వద్ద ‘డాటా’గా నిక్షిప్తం అవుతుంది. దాన్ని వారు గోప్యంగా ఉంచాలి. ఉంచుతు న్నామనే చెబుతారు. కానీ, ఉంచరు. వేర్వేరు వ్యాపార అవసరాలకు తామే వాడినట్టు, వ్యాపార ప్రయోజ నాలున్న మూడో పక్షానికి అమ్ముకున్నట్టు చాలా సార్లు వెల్లడయింది. ఇప్పుడదే పెద్ద సమస్య! అది తప్పించాలంటే పౌరుల వ్యక్తిగత సమాచారానికి ప్రభుత్వ పరమైన భద్రత కావాలి. చట్టపరమైన రక్షణ ఏర్పడాలి. దానికి కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న ‘వ్యక్తిగత సమా చార రక్షణ చట్టం’ (పీడీపీ) పకడ్బందిగా ఉండాలి. తగిన నిఘా, నియంత్రణ వ్యవస్థలతోనే వ్యక్తిగత సమాచార దోపిడీ, దుర్వినియో గానికి కళ్లెం వేయగలం. ఉచిత సేవ, ధనార్జన యావ! ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచ గతి మారింది. కమ్యూని కేషన్ రంగంలో శాస్త్ర–సాంకేతిక విప్లవమే వచ్చింది. ఎన్నో విధాలుగా సమాచారం సేకరించడం, ప్రోదిచేయడం, మార్పిడి చేయడం నుంచి క్లౌడ్ కంప్యూటింగ్‌తో అపరిమితంగా, గోప్యంగా దాచిపెట్టడం వరకు ఆశ్చర్యకరమైన పరిణామాలొచ్చాయి. దొంగచాటుగా, బహిరంగంగా అమ్ముకోవడమూ రివాజయింది. డిజిటల్ ఎకానమీలో ఇదే ఓ ఇంధన మైంది. ఈ–కామర్స్‌కు రాచబాట పడింది. క్షణాల్లో సమాచార మార్పిడి జరిగిపోతోంది. వ్యాపార–వాణిజ్య వ్యవహారాల్లో పెను మార్పులకు వాకిళ్లు తెరుచు కున్నాయి. ఫేస్బుక్, వాట్సాప్, ట్విటర్, గూగుల్... ఇలా ఎన్నెన్నో వైవిధ్యభరిత ఉపకరణాలొచ్చాయి. ఈ– కామర్స్ ప్రక్రియలో మెసేజింగ్ యాప్‌లూ బలపడ్డాయి. కరోనా మహమ్మారి మనుషుల భౌతిక కదలికల్ని కట్టడి చేసిన దరిమిళా.. వస్తు, సేవల రంగంలో ‘ఆన్లైన్’ ఒక కీలక ప్రక్రియ అయిపోయింది. అంతకు ముందునుంచే సామాజిక మాధ్యమ వేదికలతో కోట్లమంది అనుసంధానమయ్యారు. వారెవరు, ఎక్కడివారు, ఎంత వయసు, ఏం చేస్తుంటారు, ఆదాయమెంత, వ్యయమెంత, అభిరుచులేంటి, వ్యవహా రాలేంటి... ఒక్కటేమిటి? వారికి సంబంధించిన సమస్త సమాచారం ఆయా యాప్‌లలోకి చేరుతోంది. ఇంకోరకంగా చెప్పాలంటే, మనమే.. వారిని ఆహ్వానించడమే కాక చొచ్చుకు వచ్చేంత చనువిచ్చాం. నిజానికి ఈ సమాచారమంతా వారు గోప్యంగా ఉంచాలి. నిర్దేశించిన అవసరానికే వినియోగించాలి. అలా కాకుండా వేర్వేరు వ్యాపార సంస్థలకు విక్రయిస్తు న్నారు. ఆయా కంపెనీల వ్యాపార వృద్ధికి తోడ్పడే వాణిజ్య ప్రకటనలు చేర్చడానికి, భావజాల వ్యాప్తికి, ఆలోచనా సరళిని ప్రభా వితం చేయడానికీ... ఇలా ఎన్నో వ్యాపార, కొన్ని చోట్ల రాజకీయ అవసరాలకు పౌరుల వ్యక్తిగత గోప్య సమాచారాన్ని వాడుకుంటున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, గూగుల్ వంటివి రుసుమేమీ తీసుకోకుండా ఉచిత సేవలు అందిస్తున్నట్టే ఉంటుంది. కానీ, తమ విని యోగదారుల సమాచారాన్ని అందివ్వడం–అమ్ముకోవడం ద్వారా వస్తోత్పత్తి, సేవా విక్రయ సంస్థల నుంచి పెద్దమొత్తాల్లో వారు డబ్బు గడిస్తున్నారు. ఇదో పెద్ద వ్యాపారం. సదరు యాప్ సంస్థలు పౌరుల వ్యక్తిగత ఉనికి వివరాలే కాకుండా ఆశలు, ఆకాంక్షలు, ఆలోచనల్లోకి చొరబడటంతో సగటు మనిషి వ్యక్తిగత సమాచారం అంగడి వస్తువయింది. ప్రతొక్కరి బతుకు వాల్పోస్టరయింది. వాట్సాప్ గగుర్పాటే సాక్ష్యం! సమాచార గోప్యత విషయంలో వాట్సాప్ కొత్త ప్రతిపాదన ఏక పక్షంగా ఉన్నందున నిలిపివేయాలన్న ఒక అడ్వకేటు పిటిషన్ విచా రిస్తూ డిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘అది ప్రయివేటు యాప్, మీ సమాచారానికి భద్రత లేదనుకుంటే అక్కడ్నుంచి తొలగించండి, వారి సేవల నుంచి మీరు తొలగిపోండి, భద్రత ఉన్న వేరే యాప్‌కు మారండి’ అని జస్టిస్ సంజయ్ సచ్దేవ్ అన్నారు. అదంత చిన్న విషయమా? కోట్ల మందికి సంబంధించిన అంశం. తమ వద్ద వినియోగదారుల సమాచారం ‘తొలికొస నుంచి కడకొస దాకా’ గోప్యమే! అని హామీ ఇస్తాయి. ఈ హామీకి ఎందుకు కట్టుబడవు? అన్నది మౌలిక ప్రశ్న. తమ కొత్త విధానానికి అంగీకారం తెలపండి అని వాట్సాప్ ప్రకటించాక వారం (జనవరి5–11)లోనే ప్రత్యా మ్నాయ యాప్ ‘సిగ్నల్‘ను దేశంలో 33 లక్షల మంది డౌన్లోడ్ చేసు కున్నారు. అదే వారంలో వాట్సాప్ డౌన్లోడ్లు 39 శాతం తగ్గాయి. దేశంలో ప్రతి నాలుగో వ్యక్తి వాట్సాప్ వినియోగదారుడే! వారు జారి పోతున్న ఆ వేగం చూసి వాట్సాప్ జడుసుకుంది. సత్వర దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఏ ప్రయోజనాలు లేకుంటే ఇంత దేబిరింపు దేనికి? నిజానికి వారి ఉద్దేశం కొత్త గోప్యత నిబంధనల ప్రకారం తాము సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో పంచుకోవడానికి వినియోగదారులు సమ్మతించడం. సమ్మతిలేని వారు వైదొలగడం. ఫేస్బుక్ ఇక యథేచ్చగా సదరు సమాచారాన్ని తన, తన ఒప్పంద వ్యాపార సంస్థలు స్వేచ్ఛగా విని యోగించుకోవడం. వాణిజ్య ప్రకటనల ఆదాయాన్ని పెంచుకోవడం. ఉభయత్రా లాభం! ఇదీ తలంపు. కానీ, ఇప్పుడిస్తున్న తాజా వివరణ ప్రకారం కేవలం వ్యాపార అకౌంట్ల విషయంలో తప్ప సాధారణ పౌరుల వ్యక్తిగత సమాచారం, కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు, ప్రేమికులు వంటి వారి సంభాషణల జోలికి రామంటున్నారు. అసలు అలాంటి డాటాను మేం చూడం, వాడం అని నమ్మబలుకు తోంది. కానీ, పౌరులకు అనుమానాలు న్నాయి. ఆ భయ–సందేహాలతో ఇవాళ పౌరులు ప్రత్యామ్నాయ ‘యాప్’లకు వెళ్లవచ్చు! కానీ, రేపు ఏదో రోజు అదే ఫేస్‌బుకో, మరో పోటీదారో ప్రత్యామ్నాయ యాప్‌లను కొనరని, మంచి ధర పలికితే అవి మాత్రం అమ్ముడు పోవని గ్యారెంటీ లేదు. వ్యక్తిగత సమాచారం చౌర్యానికి గురయ్యే ప్రమాద ఆస్కారం నుంచి పౌరులకు శాశ్వత రక్షణ కావాలి. సర్కార్‌పై కన్నేయాల్సిందే! వ్యక్తిగత సమాచార దుర్వినియోగ ప్రమాదంపై మెసేజింగ్ యాప్‌ల పట్ల పౌరులు ఎంత జాగ్రత్తగా ఉండాలో ప్రభుత్వాల పట్ల కూడా అంతే అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం అధికారికంగా సేకరించిన ఆధార్ సమాచారం లోగడ దుర్వినియోగమైన సందర్భాలెన్నో వెలుగు చూశాయి. పౌరుల ఫోన్ నంబర్ల సమాచారాన్ని పదిహేడు పైసల చొప్పున అమ్ముకున్న నీచ ఘటనలున్నాయి. సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం గత సంవత్సరం విస్పష్టంగా తేల్చి చెప్పే వరకు వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కే కాదని కేంద్ర ప్రభుత్వం భావించిన, వాదించిన దేశం మనది. పౌరుల హక్కుల కన్నా కార్పొరేట్ల వ్యాపార ప్రయోజనాలకు పెద్దపీట వేసే సర్కార్ల ఎత్తుల్ని పసిగట్టాల్సిందే! వ్యక్తిగత సమాచార భద్రత పేరిట ఇప్పుడు తీసుకురానున్న పీడీపీ చట్టం ఎంత పకడ్బందీ అన్నదీ కాపెట్టుకొని ఉండాలి. ఎందుకంటే, గత శీతాకాల సమావేశాల్లోనే ముసాయిదాను పార్లమెంటు ముందుకు తెచ్చినా, అభ్యంతరాల నడుమ సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపారు. అధికార భాజపా ఎంపీ మీనాక్షీ లేకీ నేతృత్వం లోని జేపీసీ సంప్రదింపుల ప్రక్రియ ముగించి, చట్టం పేరుతో సహా 89 సవరణలతో తుది ముసాయిదాను ఇటీవలే సిద్ధం చేసింది. రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఆమోదింపచేయాలన్నది తలంపు. ప్రయివేటు యాప్‌ల నుంచి, సామాజిక మాధ్యమాల నుంచి పౌరుల వ్యక్తిగత సమాచారానికి భద్రత అనే వంకతో సదరు సమాచారాన్ని కేంద్రం తన గుప్పెట్లోకి, నియంత్రణలోకి తెచ్చుకునేలా ముసాయిదా ఉందనే విమ ర్శలున్నాయి. అప్పుడది, రాజ్యాంగం పౌరులకు కల్పించిన వ్యక్తిగత సమాచార గోప్యతా హక్కుకే భంగకరం! వ్యక్తిగత–వ్యక్తిగతం కాని సమాచారాన్ని నిర్వచించడమైనా, సదరు డాటా సేకరణ–నిర్వహణ– నిలువ–వినియోగం, దుర్వినియోగ నియంత్రణ, భద్రత వంటి విషయాల్లో ఎటువంటి చట్టరక్షణ కల్పిస్తారన్నది ముఖ్యం. నిన్నటి వాట్సాప్ ఎత్తుగడైనా, రేపు మరే ఆన్లైన్ యాప్ నిర్వహకులో చేసే లోపాయికారి ప్రతిపాదనలనైనా.. ఈ చట్టం ఎలా నిలువరిస్తుంది? అన్నది చట్టరూపకల్పనను బట్టే ఉంటుంది. అందుకే, ప్రజాప్రతి నిధులు, పౌర సమాజం అప్రమత్తంగా ఉండాలి. రెండు నియంత్రణలూ ఉండాలి చట్టం ఒక్కటే సరిపోదు. గట్టి చట్టం అమల్లోకి వచ్చాక ఏర్పాటయ్యే రక్షణ ప్రాధికార సంస్థ, నియంత్రణ వ్యవస్థ పనితీరు ముఖ్యం. నిఘా –నియంత్రణ వ్యవస్థలు గోప్యత ఉల్లంఘనలకు ప్రతిస్పందించడమే కాకుండా ముందస్తు నివారణా వైఖరితో పనిచేయాలి. చట్టాలు చేసే– ఉల్లంఘించే వారి మధ్య పిల్లి–ఎలుక ఆట ఎప్పుడూ ఉంటుంది. ఒక నిబంధన తమని అడ్డగిస్తే, దాన్ని అధిగమించి పని కానిచ్చుకునే సాంకేతికతను నేరబుద్ది కలిగిన సంస్థలు సృష్టించుకుంటాయి. ఇదొక చక్రీయ ప్రక్రియ. పౌరులు కూడా స్వీయ నియంత్రణ పాటించాలి. ఉచితంగా వస్తుందంటే చాలు, ఏ ఆధునిక సదుపాయమైనా నిబంధ నలు చదువకుండానే గుడ్డిగా సమ్మతి తెలుపడం మానుకోవాలి. అవసరం ఉన్నా, లేకున్నా వ్యక్తిగత, సున్నితమైన సమాచారాన్ని ఎక్కడపడితే అక్కడ పంచుకునే అలవాట్లను తగ్గించుకోవాలి. తెలిసో తెలియకో.. కనీస గోప్యత లేకుండా సొంత జీవితాన్ని ఎంతగా బజారుకీడ్చుకుంటున్నామో... కొంచెం ఇంగితంతో వ్యవహరిస్తేనే మనకూ, సమాజానికీ మంచిది. దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
ఆశల రెక్కలు విరవొద్దు
కొత్త ఆశలతో సరికొత్త యేడాదిలోకి... ఆశే మనిషిని ముందుకు నడిపే చోధకశక్తి! అదే లేకుంటే, ఎప్పుడూ ఏదో ఒక నిస్సత్తువ ఆవహించి బతుకును దుర్భరం చేయడం ఖాయం! అగణిత కాలగమనంలో రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు... మనం కల్పించుకున్న విభజనరేఖలే అయినా... ఒక్కొక్క గీత దాటుతున్నపుడు ఒక్కో రకమైన భావన, అనుభూతి సహజం! అదే సరికొత్త ఆశలకు ప్రేరణ! రెండు సంవత్సరాల నడిమధ్య నిలబడ్డ ఈ సంధి వేళ... విస్తృతమైన చర్చ సాగుతోంది. ముఖ్యంగా గత ఏడాది పొడుగూ మనిషి మనుగడను శాసిస్తూ, ప్రతి పార్శా్వన్నీ తడుముతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసిన కోవిడ్–19 ఇవాళ చర్చనీయాంశమై ప్రతినోటా నాను తోంది. కొత్త ఏడాదిలోకి... అనే ఆనందం కన్నా ఓ పీడకలలాంటి 2020 ముగిసిందనే సంతోషమే ఎక్కువ అని కొందరు. ఎట్లయితేనేం, ఓ యేడాది భారంగా గడిచిపోయింది. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తున్న, తెస్తున్న కొత్త సంవత్సరం 2021 మన ఆశల పేటి! అని మురిసేది మరికొందరు. రెండు భావనలూ సహేతుకమే! మనిషి ఆశాజీవి అనడానికిదో తాజా ఉదాహరణ! ప్రతి ప్రకృతి విలయం నుంచి, దౌర్భాగ్య పరిస్థితి నుంచీ ఎంతోకొంత సానుకూలతను తీసు కోగలిగే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఇది మానవేతిహాసం ఎన్నో మార్లు రుజువుచేసిన సత్యం! ఇప్పుడా సందర్భం వచ్చిందని, ఇంత దయనీయ పరిస్థితుల్లో కూడా మనం నేర్చుకోగలిగే, నేర్చుకోదగ్గ గుణపాఠాలు చాలానే ఉన్నాయనేది మేధావుల విశ్లేషణ. సామాజిక మాధ్యమాల్లో సంప్రదాయ మీడియాలో కూడా ‘2020 మనకేమైనా నేర్పిందంటే..?’ అనే కథలు, కథనాలు, వ్యాస పరంపర పుంఖాను పుంఖాలుగా వస్తోంది. కరోనా సృష్టించిన అలజడి, చేసిన నష్టం అంతా ఇంతా కాదు. చైనాలో పుట్టి, ఏడాది కాలంలోనే ఏతా వాతా 218 దేశాలను చుట్టుముట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 8.32 కోట్ల మందికి వ్యాధి సోకగా 18 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతటి విలయం సృష్టించిన మహమ్మారి నేర్పేదేమిటి? ఒనగూర్చిన మంచి ఏముంటుంది? అనే ప్రశ్న తలెత్తవచ్చు! కానీ, నిరంతర పరిశో ధకుడైన మనిషి, ప్రతి ప్రతికూలతనూ అధిగమించే క్రమంలో పోరాటం చేస్తాడు. ఈ మధనంలో కొన్ని సానుకూలతలనూ సాధి స్తాడు. ఎంతో కొంత కలిసొచ్చిన మంచి అటువంటిదే! పర్యావర ణంలో వచ్చిన అనూహ్య పరిణామాలైనా, ఆటోమేషన్ అయినా, ఆరోగ్య సంరక్షణ–జీవనశైలి మార్పులైనా, స్వయంసమృద్ధి యత్నా లైనా, రాజకీయ పరిష్కారాలైనా.. జాగ్రత్తగా గమనించి, మేలైన అంశాల్ని తెలివిగా శాశ్వతీకరించుకుంటే మానవాభ్యున్నతికి తక్షణ, భవిష్యత్తు ప్రయోజనాలుంటాయి. కానీ, కుక్క తోక వంకర అన్న చందంగా ఏవో సాకులు చూపి, పాత పెడదారుల్లోనే సాగితే మరింత ప్రమాదం తప్పదు. కొన్ని విషయాల్లో ఇప్పుడదే జరుగుతోంది. ఒక దృశ్యం కనబడి... కనుమరుగవుతోంది! కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు ప్రపంచం ‘లాక్డౌన్’ విధించుకొని మునగదీసుకుంది. మానవ ప్రేరిత కార్యకలాపాలు చాలావరకు స్తంభించాయి. జూలై మాసాంతం వరకూ ఇది ప్రభావం చూపింది. ఫ్యాక్టరీలు, కంపెనీలు పనిచేయక, నిర్మాణాలు ఆగి, వాహన రాకపోకలు నిలిచిపోవడంతో పర్యావరణపరంగా మార్పు కొట్టొచ్చినట్టు కనిపించింది. ఎన్నెన్నో నగరాల్లో వాయు నాణ్యత పెరిగి నట్టు, శబ్ద–నీటి కాలుష్యాలు తగ్గినట్టు అధ్యయన నివేదికలొచ్చాయి. కర్బన ఉద్గారాలు రమారమి తగ్గాయి. వన్యప్రాణులు, అటవీ జంతు వులు స్వేచ్ఛగా తిరుగాడిన వార్తలు–ఫొటోలొచ్చాయి. పక్షుల కిల కిలలు పట్టణాల్లోనూ వినిపించాయి. వందల కిలోమీటర్ల దూరం వరకు హిమాలయాలు కనిపించాయి. చాలాచోట్ల భూమ్యావరణ స్థితి మెరు గయింది. ఆర్థిక పునరుద్ధరణ కోసం మళ్లీ మానవ కార్యకలా పాలు పెంచడంతోటే కాలుష్యపు జాడలు పెరిగాయి. ఉత్పత్తి జరుగొ ద్దని, నిర్మాణాలు–ప్రయాణాలు ఉండొద్దని ఈ వాదనకు అర్థం కాదు. ప్రకృతితో మన సహజీవన విధానాన్ని పునర్నిర్వచించుకోవాల్సిన గుణపాఠమిది! సుస్థిరాభివృద్ధి సాధనకు దీన్నొక నమూనాగా తీసు కోవాలి. కానీ, నేర్చుకున్న జాడలు లేవు! కరోనా మిష చూపి, ఆర్థిక పునరుద్ధరణ వేగంగా జరగాలనే వంకతో... చట్టాలను, నిబంధనల్ని గాలికొదులుతున్నారు. తాజా చర్యలు, పరిణామాలతో పర్యావరణ ముప్పు రెట్టింపవుతోంది. పలు రాష్ట్రాల్లో కార్మిక చట్టాలను సస్పెండ్ చేయడం ఈ దురాగతాల్లో భాగమే! కంపెనీలు, కర్మాగారాల ఆగ డాలకు ద్వారాలు తెరచినట్టే! భౌతిక దూరం పాటించేందుకు ప్రజా రవాణా సరిపడదనే భావనతో వ్యక్తిగత వాహనాల జోరు పెరిగి వాయుకాలుష్యం మరింత హెచ్చింది. విపత్తులోనూ లభించిన సాను కూలతను విచక్షణారహితంగా గండికొడితే తలెత్తిన తాజా ప్రతికూలత లివి! కరోనా ముందరి వాతావరణం కన్నా ప్రమాదకరంగా మారే ఆస్కారముంది. దూసుకొచ్చిన యాంత్రీకరణ–కృత్రిమ మేధ! శాస్త్ర సాంకేతిక రంగం అనుకున్నదానికన్నా వేగంగా మనిషి నిత్య జీవితంలో యాంత్రీకరణ పెరిగింది. కృత్రిమ మేధ (ఏఐ) విరివిగా వినియోగిస్తున్నారు. ఒకరకంగా కోవిడ్–19 బలవంతపెట్టిన పరిణా మమిది. కృత్రిమ మేధను అనుసంధానం చేసిన కార్లు, డ్రోన్స్, రోబోల వినియోగం ఇప్పటికే పెంచారు. వైరస్ వ్యాప్తిని నివారించేలా మనిషికి–మనిషి తగలకుండా, భౌతిక దూరం పాటిం చేందుకు ఉపక రించే సాధనాలయ్యాయి. కనబడని మారీచునితో యుద్ధం వంటి ఈ మాయా వైరస్‌లతో పోరులో ఒకరకంగా ఇవి అనివార్యమయ్యాయి. 2030 నాటికి 30–40 శాతం ఉద్యోగాలు యంత్రాలు–ఏఐతోనే అనే అంచనా ఒకటుంది. ఇంటి నుంచే పని (డబ్ల్యూఎఫ్‌హెచ్) విధానం ప్రస్తుత విపత్కాలంలో విస్తృతమైంది. మంచి ఫలితాలు కూడా వచ్చాయి. సింగపూర్, హాంకాంగ్ వంటి విశ్వనగరాల్లోనూ ఇది స్పష్టంగా కనిపించింది. ప్రపంచస్థాయి గల ఒక ఐటీ కంపెనీ అధ్యయనం ప్రకారం, ఇంటి నుంచి పని వల్ల 17 శాతం ఉత్పత్తి పెరి గింది. కరోనా అనంతర కాలంలోనూ ఈ పద్దతిని ఎంతో కొంత మేర శాశ్వతీకరిస్తూ పలు కంపెనీలు బడ్జెట్లు రూపొందించుకుంటున్నాయి. ఉభయ ప్రయోజనకరంగా... ఉద్యోగుల ప్రయాణాల్లో సమయాన్ని, కార్యాలయ నిర్వహణ వ్యయాన్నీ నియంత్రించుకునే సానుకూలాం శమైంది. కొరోనా దెబ్బకు అంతర్జాతీయ ప్రయాణాలు పూర్తిగా తగ్గి పోయాయి. ప్రపంచ ప్రయాణ–పర్యాటక మండలి (డబ్ల్యూటీటీసీ) అధ్యయనం ప్రకారం 3.9 శాతం వృద్ధితో, ఉత్పాదక రంగం తర్వాత వేగవంతమైన వృద్ధి నమోదు చేసిన ఈ రంగం కోవిడ్–19తో కుదే లయింది. వెబినార్లు, వీడియో కాన్ఫరెన్స్‌లు అతి సాధారణమ య్యాయి. వైద్యులు–రోగులు ప్రత్యక్షంగా కలుసుకోనవసరం లేకుండా చేపడుతున్న ‘టెలిమెడిసిన్’ విధానం, ఒక అనువైన చికిత్స పరిష్కారం అయింది. ఆరోగ్య భద్రత పథకాల కింద ప్రభుత్వ యంత్రాంగం దీన్నొక సాధనంగా మలచుకొని, గ్రామీణ ప్రాంతాలకు ఆధునిక వైద్య సదుపాయాల్ని విస్తరించవచ్చు. రోగుల్లో కొత్త నమ్మకం పెంచే వీలుంటుంది. స్వయం సమృద్ధి–జీవనశైలి! ప్రపంచీకరణ–విశ్వవిపణి విధానం ఆచరణలోకి వచ్చిన తర్వాత మొదటిసారి అందుకు విరుద్ధ పరిస్థితి కోవిడ్–19తో తలెత్తింది. గ్లోబలీకరణతో బలపడ్డ ‘బల్లపరుపు ప్రపంచమ’నే మార్కెట్ వాదన కరోనా దెబ్బకు తల్లకిందులయింది. ఏకీకృత మార్కెట్‌తో ఇన్నాళ్లు ఆహారం, వస్తు–సేవలు ఎక్కడపడితే అక్కడ విస్తారంగా లభించేవి. దేశాల మధ్య పరస్పరాధార మార్కెట్ నమూనా వృద్ధిచెందింది. నాణ్యమైన వస్తు–సేవలు ప్రపంచం ఏ మూలన ఉన్నా అక్కడ్నుంచి ఎవరైనా యథేచ్ఛగా పొందగలిగే వారు. అమెరికా–చైనా ఇందుకు ఓ పెద్ద ఉదాహరణ! ఈ యేడు పరిస్థితి మారింది. విమానాలు రెక్కలు ముదురుకొని, దేశ సరిహద్దులకు తాళాలు పడ్డపుడు... ఎవరి ఆహారం, వస్తువులు, సేవల్ని వారే సమకూర్చుకోవాల్సి వచ్చింది. స్వయం సమృద్ధి అవసరం అందరికీ తెలిసివచ్చింది. ఆహార ఉత్పత్తి విషయం లోనే కాకుండా, ఆహార సరఫరా శృంఖలాల్లోనూ పెనుమార్పులు అని వార్యమయ్యాయి. ఇక మనుషుల జీవన శైలిలోనూ కరోనా ఎన్నో మార్పులు తెచ్చింది. పెళ్లయినా, చావయినా ఇక హంగూ ఆర్భాటాలు, డాబూ–దర్పం ప్రదర్శించలేని ప్రతిబంధకాల్ని అది సృష్టించింది. పేద, అల్పాదాయవర్గాలకు ఇదొక రకంగా మేలే చేసింది. కొందరి ఇళ్లలో పెళ్లిళ్లంటే, జుగుప్సాకర సంపద ప్రదర్శనకు వేదికల్లా ఉండేవి. ఈ ఒక్క విషయంలోనే కాకుండా.... దైనందిన జీవితానికి సంబం ధించిన చాలా అంశాల్లో కనీసాలతో సరిపెట్టుకునే జీవన విధానాన్ని కరోనా నేర్పింది. వ్యక్తిగత పరిశుభ్రత, గృహ–పరిసరాల్లో పారిశుధ్యం ప్రాముఖ్యత అందరికీ తెలిసి వచ్చింది. 2003 ‘సార్స్’ వైరస్ విజృం భణ తర్వాత శానిటైజర్, మాస్క్ జపాన్‌లో అతి సాధారణమ య్యాయి. సదరు ప్రొటోకాల్ అందరికీ ఒక జీవనశైలిగా అలవడింది. అటువంటి పరిస్థితులు ఇప్పుడు అంతటా విస్తరించాయి. తిండి పద్ధతులు మార్చుకుంటున్నారు. జంక్ ఫుడ్స్ కాకుండా, రోగనిరోధక శక్తినిచ్చే ఆహారపదార్థాల పైన, సంప్రదాయ జీవనశైలి పైన దృష్టి కేంద్రీకరిస్తున్నారు. కరోనా తెచ్చిన సానుకూలమైన మార్పే ఇది! రాజకీయ మార్పులకు... రంగస్థలం కావాలి కరోనా మహమ్మారి సమస్త ప్రజల దృష్టిని తనవైపు మళ్లించిన సంద ర్భాన్ని రాజకీయ, పాలనా వ్యవస్థలు తమకనుకూలంగా మలచుకు న్నాయి. ప్రజలకిది కంటకంగా మారింది. ఇలా ప్రపంచంలోని చాలా దేశాల్లో జరిగింది. కరోనా మార్గదర్శకాల ముసుగులోనో, లాక్డౌన్ నీడలోనో, ఆర్థిక పునరుద్ధరణ సాకుతోనో నియంతృత్వ పాలకులు ప్రజాస్వామ్య ప్రక్రియని నిర్వీర్యపరచిన ఉదంతాలున్నాయి. ప్రజల్ని వంచించారు. పౌరహక్కుల్ని పలుచన చేయడం, కార్మిక చట్టాలను నీరుగార్చడం, కార్పొరేట్ శక్తులకు తివాచీలు పరవడం వంటి చర్య లకు ఆయా ప్రభుత్వాలు పూనుకున్నాయి. మన దేశంలోనూ ఇటు వంటివి జరిగాయి. కరోనా కడగండ్లతో దేశం కుదేలయినపుడు.. వ్యూహాత్మకమైనవి తప్ప పబ్లిక్‌రంగ సంస్థలన్నింటినీ ప్రయివేటు పరంచేయాలనే కేంద్ర మంత్రివర్గ నిర్ణయం, కొన్ని రాష్ట్రాల్లో కార్మిక చట్టాల సస్పెన్షన్ వంటివి ప్రజల్ని విస్మయపరిచాయి! ఒక వంక కరోనా... మరో వంక ప్రజా ఉద్యమాలతో 2020 అట్టుడికింది. నాటి షాహిన్‌బాగ్ బైటాయింపు నుంచి నేటి సింఘిలో తిష్టవేసిన రైతు ఉద్యమం వరకు ప్రజాందోళనలు వేడి రగిలించాయి. ప్రభుత్వం దిగి వచ్చి, వ్యవసాయ కొత్త చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతాంగం అభిప్రా యాల్ని గౌరవించడం పెనుమార్పు! ప్రజాస్వామ్య పాలనలో చర్చల తోనే ప్రతిష్టంభనలు తొలగుతాయన్న గ్రహింపు, ముక్తాయింపు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన కొంగ్రొత్త ఆశ! ఇదే ప్రజాస్వామ్య వాదుల ఆకాంక్ష!! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
‘రైతు క్షేమం’ రాజ్యం బాధ్యతే!
కరుకు కరోనా అనేక రంగాలను కుదిపి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన సంవత్సరం... మనదేశ అగ్రశ్రేణి కుబేరుల సంపద వృద్ధిరేటు నాల్గింట మూడొంతులు పెరిగి నమోదైంది. కరోనా దెబ్బతో ఇదే సంవత్సరం చిన్న, మధ్యతరగతి సమాజం కుదైలై దేశంలో పేద రికం రెట్టింపయినట్టు అంతర్జాతీయ అధ్య యనాలు చెబుతున్నాయి. పరస్పర విరుద్ధ మైన ఈ రెండు పరిణామాలు సామాజంలో ఆర్థిక అంతరాలు అనూహ్యంగా పెరిగిన తీరుకు సంకేతాలు. ఈ పరిణామాలకి, ఇప్పుడు ఢిల్లీ చుట్టూ కేంద్రీకృతమై దేశవ్యాప్తంగా అంటుకున్న రైతు ఉద్యమానికి ప్రత్యక్ష సంబంధం ఉంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు యథా తథం అమలైతే... సమీప భవిష్యత్తులో ఆర్థిక అంతరాలు అసాధారణ స్థితికి చేరి, సమాజం అశాంతి కుంపటిపై రగులనుందనే భావన వ్యక్త మౌతోంది. ఈ ప్రచారం రాజకీయ ప్రత్యర్థుల కుట్ర అని, తాము ఎన్ని కల్లో హామీ ఇచ్చినట్టు 2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే క్రమంలో తాజా సంస్కరణలు పెద్ద ముందడుగని పాలకపక్ష వాదన. కీలక వ్యవసాయ రంగంలో వృద్ధి దేశ ఆర్థిక వ్యవస్థను ఎంతో ప్రభా వితం చేస్తుంది కనుక తమ చర్యల వల్ల ఆర్థిక అంతరాలు తగ్గుతాయని కేంద్రం అంటోంది. కొత్త చట్టాలను నిరసిస్తూ రైతాంగం ఉద్యమిస్తున్న తాజా పరిస్థి తికి పలువురు మేధావులు విభిన్న భాష్యాలు చెబుతున్నారు. వ్యవ సాయ రంగంలో ఎప్పట్నుంచో రావాల్సిన సంస్కరణలకు ఇది తోవ అని కొందరు పొగడుతుంటే, ఇవి రైతును, వ్యవసాయ రంగాన్ని ధ్వంసం చేసే కార్పొరేటీకరణ చర్యలని మరికొందరు తెగుడుతు న్నారు. నడ్డివిరిగి ఉన్న నిస్సహాయ రైతాంగాన్ని మెడబట్టి బహుళ జాతి కంపెనీలు, పెద్ద పెద్ద కార్పొరేట్ల సందిట్లోకి నెట్టడమేనని వారం టున్నారు. పూర్తి భిన్నమైన వాదనలు సాగుతున్నాయి. మరో వంక, సర్కారు–రైతు సంఘాల మధ్య జరిగిన చర్చల ప్రక్రియ విఫలమై, ఉద్యమం కొనసాగుతూనే ఉంది. వ్యవసాయ రంగంలో కీలక పరి ణామమిది. కొత్త చట్టాల మంచి చెడులు, వాదవివాదాలెలా ఉన్నా... ఉద్యమిస్తున్న రైతులను సముదాయించి, నిర్దిష్ట చర్యలతో సంతృప్తి పరచి, వెంటనే ఆందోళనను కేంద్ర ప్రభుత్వం విరమింపజేయా ల్సింది. ఉద్యమం వెనుక ఇతరేతర శక్తులున్నాయనో, ఇది రెండున్నర రాష్ట్రాల వాళ్లు చేస్తున్న అలజడి అనో రైతు ఉద్యమాన్ని తక్కువ చేసి చూడటం సరైన స్పందన కాదు. తమ జీవితాలతో ముడివడి ఉన్న నిర్ణయాలను రైతాంగం ప్రశ్నిస్తున్నపుడు వారు లేవనెత్తే అంశాలకు, భయ–సందేహాలకు సహేతుకమైన సమాధానాలివ్వడం పాలకుల కర్తవ్యం. భరోసా కల్పించాలి. చట్టాల అమలుకు ముందు ప్రజాభి ప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం ప్రజాస్వామ్య ప్రభుత్వాల బాధ్యత. రైతు కష్టాలు ఇన్నన్ని కావు అత్యధిక పౌరులు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయం మీదే ఆధార పడ్డ దేశం మనది. రైతు అసంఘటిత రంగంలో ఉన్నందున, వ్యవసా యాన్ని పరిశ్రమగా గుర్తించనందున వరుస ప్రభుత్వాలు, పాలక పక్షాలు నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాయి. పాలకులు రైతాంగంపై శ్రద్ద పెట్టిన దాఖలాలు పరిమితమే! వేర్వేరు కారణాలతో వ్యవసాయ రంగం నేడు తీవ్ర సంక్షోభంలో ఉంది. రైతాంగం తీరని కష్టాల్లో కూరుకుపోయింది. దుర్భరమైన బతుకీడ్చలేక ఏటా పెద్ద సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కుటుంబాలు దిక్కులేనివవు తున్నాయి. పెట్టుబడి వ్యయం ఎన్నో రెట్లు పెరిగింది. విత్తనంపై కార్పొ రేట్ల పెత్తనం. ఎరువులతో వ్యాపార జిమ్మిక్కు, పంట భీమాలో మోసాలు, సబ్సిడీల్లో అవినీతి, రుణాల్లో దగా, సర్కారు అప్పులు దొరకవు–ప్రయివేటు అప్పులు భారం, అతివృష్టి–అనావృష్టితో ప్రకృతి కన్నెర్ర, దిగుబడికి భరోసా లేదు, పంట పండినపుడు ధర రాదు, కాటేసే మార్కెట్ల మాయాజాలం... ఇన్ని ప్రతిబందకాల మధ్య కొట్టుమిట్టాడే రైతుకు చట్టాల రూపంలోనైనా సర్కార్ల సహకారం లభించకుంటే పరిస్థితి దుర్భరమే! ఆర్థిక–సరళీకరణ విధానాలు అమల్లోకి తెచ్చిన ప్రపంచీకరణ నుంచి ఎడతెగని కడగండ్లే! దాదాపు ముడు దశాబ్దాలుగా సానుకూల సంస్కరణల కోసం రైతులు నిరీక్షిస్తు న్నారు. తాజా సంస్కరణలు ఎవరి హితంలో ఉన్నాయన్నది పెద్ద ప్రశ్న. కనీస మద్దతు ధర తొలగిపోయి, మార్కెట్లో «కొనుగోలు భరోసా లేకుండా మనుగడ ఎలా? ఉద్దేశపూర్వకంగానే బాధ్యతల నుంచి ప్రభుత్వం క్రమంగా వైదొలగుతోంది. బలహీనమైన రైతులకు–శక్తి మంతులైన కార్పొరేట్లకు మధ్య పోటీ ఎలా సమంజసమనే వాదన వినిపిస్తోంది. ఏకపక్షంగా కార్పొరేట్ కబంద హస్తాల్లోకి జారే దుస్థితి అయితే ‘బతుకెట్లా?’ అనే ప్రశ్నను రైతాంగం లేవనెత్తుతోంది. ఈ అంశం కేంద్రకంగానే రైతు సంఘాలు ఉద్యమాన్ని బలోపేతం చేశాయి. కొత్త చట్టాల్ని వెనక్కి తీసుకోమంటున్నాయి. ఇప్పుడు తెచ్చిన రెండు చట్టాలు, సవరణలు చేసిన మూడో చట్టం, విద్యుత్ సంస్కర ణలు... ఇవన్నీ రైతుకు మేలు చేయకపోగా నష్టం. ఉన్న సదుపా యాల్ని తొలగించి పెనం మీంచి పోయ్యిలో వేసినట్టుందనే అభి ప్రాయం రైతు సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని సవరణలకు సరే తప్ప చట్టాలు వెనక్కి తీసుకోమని కేంద్ర సర్కారు అంటోంది. ఏమిటి భయాలు, ఎందుకు సందేహం? ‘రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య చట్టం’ ముఖ్య ఉద్దేశ్యం రైతు తన ఉత్పత్తుల్ని వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్(మండీ)లలోనే అమ్ముకోవా ల్సిన కట్టుబాటు లేకుండా, ప్రాంత పరిమితులు దాటి ఎక్కడైనా విక్ర యించుకునే వెసలుబాటు అని ప్రభుత్వం చెబుతోంది. ఎక్కడ ఎక్కువ ధర లభిస్తే రైతు అక్కడికి వెళ్లి అమ్ముకునే సంస్కరణ అంటోంది. రైతు నేతలు దీన్ని మరోలా చెబుతున్నారు. తిరగేసి చూస్తే, ప్రయివేటు కొనగోలుదారుకు లభిస్తున్న వెసలుబాటు అంటోంది. బాధ్యత–జవా బుదారుతనం లేని ప్రయివేటు మార్కెట్లొస్తాయి. కేంద్ర ప్రభుత్వం ప్రజాపంపిణి వ్యవస్థ (పీడీఎస్)ను క్రమంగా బలహీనపరచి, బదు లుగా లబ్దిదారులకు నగదు బదిలీని ప్రోత్సహిస్తోంది. తాజా చట్టాలతో క్రమంగా సర్కారు మార్కెట్ కమిటీలు బలహీనపడతాయి. ధాన్యం సేకరణ తగ్గుతుంది, మద్దతు దర ఉండదు, మార్కెట్ స్వేచ్ఛ వల్ల పెద్ద ప్రయివేటు సంస్థలు బరిలో దిగి ఆధిపత్యం చెలాయిస్తాయి. గిట్టుబాటు ధర దేవుడెరుగు, కనీస మద్దతు ధరకూ రైతు నోచుకోడు. ఇదీ భయం! వ్యవసాయం చేయలేక, విధిలేని పరిస్థితుల్లో భూము లను కార్పొరేట్లకు అప్పగించి, ఒప్పంద వ్యవసాయానికి తలపడేలా చిన్న, సన్నకారు రైతాంగాన్ని నెట్టడమే అన్నది వారి ఆందోళన! ఇప్పుడు తెచ్చిన ‘ఒప్పంద వ్యవసాయ చట్టం’ నిబంధనలు కూడా కార్పొరేట్లకే తప్ప రైతుకు అనుకూలంగా లేవు. ఇదే జరిగితే, సమా జంలో ఇప్పుడున్న గౌరవం కూడా దక్కదని, కార్పొరేట్లకు రైతులు కట్టుబానిసగా బతకాల్సిందేనని వాపోతున్నారు. దిగుబడి ఉన్నపుడు నాణ్యతకు ముడిపెట్టి, దిగుబడి లేనపుడు మరో వంక చూపి బహుళ జాతి కంపెనీలు చేసే అరాచకాలకు రైతు బలి కావాల్సిందే అన్నది ఆందోళన! లోగడ పలు రాష్ట్రాల్లో పెప్సీ వంటి బహుళ జాతి కంపెనీలు చిప్స్ ఉత్పత్తి కోసం, ఆలూ పండించే రైతులతో జరిపిన ఒప్పంద వ్యవ సాయం ఎన్ని అనర్థాలకు దారి తీసిందో రైతాంగం మరచిపోలేదు. కోర్టుల చుట్టూ తిప్పి, భూములు విక్రయించినా కట్టలేనంత జరిమా నాలతో వేధించిన ఉదంతాలు మరపురాని చేదు జ్ఞాపకాలే! ఇప్పుడా న్యాయ తనిఖీలు కూడా లేకుండా, న్యాయస్థానాల పరిధి తొలగించి, కేవలం అధికార వ్యవస్థ పరిధిలోనే వివాదాల్ని పరిష్కరించుకోవాలని కొత్త చట్టం చెబుతోంది. రాజ్యాంగ పరిధిలో తమకున్న హక్కుల్ని కాల రాయడమేనని రైతు సంఘాలంటున్నాయి. ఇక నిత్యావసరాల చట్ట పరిధిలో, నిలువ నిబంధనల నుంచి చాలా సరుకుల్ని మినహాయిం చడం కార్పొరేట్లకు కార్పెట్ పరవడమే! ఏయే సరుకుల్ని, ఎంతైనా నిలవ చేయవచ్చు! తద్వారా వారు ధరల హెచ్చుతగ్గుల్ని తమ చెప్పు చేతల్లో ఉంచుకోగలరు. కొనుగోలు సమయంలో రైతులకు తక్కువ ధర, విక్రయించేప్పుడు వినియోగ దారులకు ఎక్కువ «భారం పడేలా చేసి లాభాలార్జిస్తారు. ఇది ఆహార సరఫరా, భద్రతపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇలా డబ్బు గడించే ప్రయివేటు శక్తులు ఎన్ని కల్లో రాజకీయ పక్షాలకు విరాళాలిస్తాయి. ఇదో తెగని విషవలయం! మండీలను సంస్కరిస్తే తప్పేంటి? రైతు ఉద్యమం వెనుక దళారీలున్నారంటున్న కేంద్ర ప్రభుత్వం, ఈ వ్యవసాయ మార్కెట్ (ఎపీఎమ్సీ)లలో లొసుగుల్ని తమ వాదనకు దన్నుగా వాడుకుంటోంది. దశాబ్దాలుగా రైతులు అక్కడ మోస పోతు న్నారు, మేం విముక్తి కలిగిస్తున్నామంటారు. మండీలు రాష్ట్ర ప్రభు త్వాల నియంత్రణలో ఉన్నాయి. కానీ, ప్రకటించిన కనీస మద్దతు ధరకు ధాన్యం, ఇతర వ్యవసాయోత్పత్తుల సేకరణ చేసేది కేంద్ర పరిధిలోని ‘భారత ఆహార సంస్థ’ (ఎప్సీఐ). రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల జాబితాలోని వ్యవసాయంపై ఈ కొత్త చట్టాలతో కేంద్రం పెత్తనం చేస్తోందని చాలా రాష్ట్రాలు విమర్శిస్తున్నాయి. సమాఖ్య స్ఫూర్తికి ఇది భంగకరమనేది వాదన. అందుకే, తాజా చట్టాలు వర్తించనీకుండా కొన్ని రాష్ట్రాలు స్థానికంగా విరుగుడు చట్టాలు కూడ తీసుకువచ్చాయి. ఇంతకన్నా, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతును ఆదుకోనేట్టు, వారికి ఉపయోగపడేలా మండీల్లో సంస్కరణలు తీసుకు వస్తే బాగుండేది. అక్కడ కనీస మద్దతు ధర లభించేది. రైతు కిన్ని కష్టాలుండేవి కావు. కమిషన్ ఎజెంట్ల దోపిడీ, వ్యాపారులు కుమ్ము క్కయి వ్యవసాయోత్పత్తుల ధరల్ని తగ్గించడం, చెల్లింపుల్లో జాప్యం, నగదు ఇచ్చేట్టయితే ధరల్లో కొత, తామిచ్చిన అప్పులకు అధిక వడ్డీ వసూళ్లు, సెస్సు విధింపు, నాసిరకం సదుపాయాలు.. ఇలా మండీల్లో చాలా సమస్యలే ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక సర్వే జరిపినపుడు, 57 శాతం మంది రైతులు మండీల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. 43 శాతం మంది ఓకే అన్నారు. ఈ రెండు వర్గాల్లోనూ అత్యధికులు మండీల్లో మార్పులు కోరారు. ఇక మొత్తానికే మండీలు ఉండవంటే ‘మద్దతు ధర’ ఎలా? అని భయపడుతున్నారు. ఉద్యమించేది రైతులు కాదనడం అన్యాయం. ఏ దళారులూ 3 డిగ్రీల చలిలో మూడువారాలపాటు రోడ్డుపక్క దీక్షకు దిగరు. పది కిలోమీటర్ల నిడివి రోడ్లను ఆక్రమించి నెలల కాలమైనా సరే పరిష్కారంతోనే వెళ్తామంటున్న రైతుల సహనాన్ని పరీక్షించొద్దు. రైతాంగ ఆందోళనను విరమింపజేసే అన్ని అవకాశాల్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలి. సమస్యను సానుభూతితో పరిష్కరించాలి. మనదేశ వెన్నెముకను కాపాడాలి. ‘ఈ మొగులు కింద, ఎముకలు కొరికే చలిలో కూర్చో వడం మాకేమైనా సరదానా? కరోనా చంపుతుందో లేదో కానీ, ఈ చట్టాలు మాత్రం మమ్మల్ని తప్పక చంపుతాయి. అన్నీ ఎత్తేసి, కార్పొరేట్ కంపెనీలకు బలిపెడితే బతికేది ఎలా?’ అన్న ఉద్యమ కారుడు, సోనిపత్ రైతు రమేష్ అతిల్ మాటలు మనందరినీ తప్పకుండా ఆలోచింపజేసేవే! ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com దిలీప్ రెడ్డి -
అయినను... వేసి రావలెను...
‘ఓటింగ్ పట్ల ఓటరు నిరాసక్తత, విముఖత ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం’ అన్నది అక్షరసత్యం. ఆదర్శవంతమైన ఆలోచనల పరంగానే కాకుండా శాస్త్రీయంగానూ ఇది రుజువైన అంశం. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో ఓటింగ్ శాతం దయనీయంగా, సగం కన్నా తక్కువ నమోద వడం పట్ల రాజకీయ, సామాజిక వర్గాల్లో ఆందోళన వ్యక్తమౌతోంది. నిపుణులు, మేధా వులు పలురకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రసార మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కొందరైతే ఆవేదనను మించిన ఆవేశంతో స్పందిస్తున్నారు. ఓటేయని వారి హక్కును రద్దు చేయా లనో, ఆధార్‌కార్డు వెనక్కి తీసుకోవాలనో, ప్రభుత్వ సంక్షేమ ప్రయోజ నాలు వారికిక నిలిపివేయాలనో... తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓటరు నిర్లిప్తత, గైర్హాజరీని మరికొందరు సమర్థిస్తున్నారు. రాజకీయ వ్యవ స్థను సరిదిద్దుకోండి తప్ప ఓటరును ఏమీ అనొద్దని వారి తరపున వకాల్తా పుచ్చుకు మాట్లాడుతున్నారు. ఇక, సామాజిక మాధ్యమ వేది కలపై ఈ ఇరుపక్షాల వాదనలకు, ఖండనమండనలకు, తిట్లపురాణా నికి అంతే లేదు. గ్రామీణ ప్రాంతాలతో పోల్చి చూసినా పట్టణ, నగర ప్రాంతాల్లో ఎందుకు ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతోంది? అన్నది కాస్త లోతుగా పరిశీలించాల్సిన అంశం. ఈసారి హైదరా బాద్‌లో 47 శాతం మంది ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఏ ప్రమాణాలతో చూసినా ఇది ఆరోగ్యకరమైన పరిస్థితి కాదు. గడచిన ఇరవయ్యేళ్లలో హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్ని పరిశీలిస్తే, కొంచెం కుడి ఎడమగా ఎప్పుడైనా ఇదే పరిస్థితి! ఎందుకిలా జరుగుతోంది? కారణాలేంటి? ఓటింగ్ శాతం తక్కువ నమోదు కావడానికి దారితీస్తున్న కారణాల్ని గుర్తించి, తగు రీతిలో విశ్లేషించి, విరుగుడు మార్గాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓటర్లందరూ క్రియాశీలంగా పోలింగ్ ప్రక్రియలో పాల్గొని, తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడవలసిన బాధ్యత ఎన్నికల సంఘం, ప్రభుత్వాలు, పౌరసమాజంపైన ఉన్నాయి. ఇందుకోసం నిర్దిష్ట చర్యలు తీసుకోవాలి. కార్యాచరణ ఉండాలని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. లేకుంటే, ప్రజాస్వామ్యం మరింత అపహాస్యం పాల వుతుంది. మనది ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం, భాగస్వామ్య ప్రజా స్వామ్యం అన్న మాటలు అర్థం లేకుండా పోతాయి. నిర్ణయాధి కారంలో ప్రజల పాత్ర–ప్రమేయం దారుణంగా పడిపోతుంది. భంగ పోయేది ప్రజలే! మలి విడత సంస్కరణలు రావాల్సిందే! పట్టణ, నగర ఓటరు నిర్లిప్తత కొత్తది కాదు. స్వాతంత్య్రానంతర కాలంలో ఈ దురవస్థ ముదురుతూ వస్తోంది. ఎవరూ సరిగా పట్టిం చుకోవడం లేదు. హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లోనే వరు సగా 2002 (41.22 శాతం), 2009 (42.95 శాతం), 2016 (45.27 శాతం), 2020 (46.55 శాతం) యాభైకన్నా తక్కువ శాతం ఓటింగ్ నమోదవుతూ వస్తోంది. జాగ్రత్తగా గమనిస్తే, ఎక్కువ చదువుకున్న వాళ్లు, ఐటీ తదితర రంగాల ఉద్యోగులు, ఆర్థిక స్థితిమంతులున్న ప్రాంతాల్లోనే ఓటింగ్ శాతం తగ్గిపోతోంది. ఈసారి కూడా పేదలు, పెద్దగా విద్యార్హతలు లేని వాళ్లు నివసించే బస్తీల్లో ఎక్కువ శాతం పోలింగ్ జరిగింది. ఇది అఖిల భారత స్థాయి కొన్ని అధ్యయనాల్లో తేలినదానికి భిన్నం. పేదలు, అణచివేతకు గురైన వారే తక్కువగా ఓటింగ్‌లో పాల్గొంటారని ‘ఎస్బీఐ–ఎకోరాప్’ దేశవ్యాప్త అధ్యయనం చెబుతోంది. పేదలు ఎక్కువగా ఉన్న బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్య ప్రదేశ్, జార్ఖండ్ వంటి ఉత్తరాధి రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం తక్కువ నమోదును ఈ నివేదిక ఉటంకించింది. అణచివేత తక్కువగా ఉండే హరియాణా, పంజాబ్‌లతోపాటు పౌర చైతన్యం గల దక్షిణాది కేరళ, తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, గోవా వంటి రాష్ట్రాల్లో పోలింగ్ శాతం ఎక్కువ ఉండటాన్ని ఈ నివేదిక ఎత్తిచూపింది. కానీ, నగరాల్లో, ముఖ్యంగా హైదరాబాద్‌లో, అదీ నగరపాలక సంస్థ ఎన్నికల్లో ప్రతిసారీ ఓటింగ్ శాతం తక్కువ నమోదవడం ఇందుకు భిన్నమైన పరిస్థితి. మెరుగైన ఆర్థిక స్థితిగతులకు, విద్యార్హతలకు ఓటింగ్ పట్ల అనురక్తి–బాధ్యతకు సంబంధమే లేదని, వారిలోనే అత్యధికులు గైర్హా జరవుతున్నారని ఇక్కడి గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వాలు, పాలక సంస్థ వైఫల్యాలను అంగీకరిస్తూనే, ఒకరకంగా ఇది వారి బాధ్యతారాహిత్యమని సామాజికవేత్తలంటున్నారు. తొలివిడత ఎన్ని కల సంస్కరణల్ని సమర్థంగా అమలుపరచిన టీ.ఎన్.శేషన్ వంటి అధికారులే ఇవి సరిపోవని, ఇంకో విడత సంస్కరణలు అవసరమని నొక్కి చెప్పారు. ఓటరును చైతన్యపరచి, ఓటింగ్ ప్రక్రియలో విధిగా పాల్గొనేట్టు వ్యవస్థల్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నిపుణులు నొక్కి చెబుతున్నారు. అత్యధికులు ఓట్లు వేయలేదని నిందించడం కాకుండా, వారిని ఓటింగ్‌కు రప్పించలేని మన వ్యవస్థల దురవస్థను మార్చుకోవాలనేది సూచన. ఏం విశ్వాసం కల్గిస్తున్నారని? పోలింగ్‌కు 53 శాతానికి పైగా గైర్హాజరయ్యారని ఓటరును తప్పు బట్టేటప్పుడు ఏయే అంశాలు అందుకు కారణమై ఉంటాయో ఆలో చించాలి. హైదరాబాద్ ఓటరు ఓటింగ్ పట్ల నిర్లిప్తంగా ఉండటానికి చాలా కారణాలే ఉన్నాయి. ఓటరు నమోదు, పేర్ల సవరణ, జాబితా ఖరారు... వంటి ప్రక్రియ సజావుగా జరగట్లేదు. అంతా అయి పోయాక, ‘అవును పొరపాట్లు జరిగాయి, నిజమే!.. ఇక ముందు జర క్కుండా సరిదిద్దుకుంటాం’ అని ఎన్నికల సంఘం ప్రకటిస్తే సరి పోతుందా? ఇటీవల ఒక టీవీ చర్చలో పొల్గొన్న పాలసీనిపుణుడు దొంతి నర్సింహారెడ్డి లేవనెత్తిన మూడంశాలు నాటి చర్చ సరళినే మార్చాయి. 1. సెలబ్రిటీలతో సహా, తమ ఓట్లు గల్లంతయ్యాయని ముందుగా చెప్పినా సవరించే వ్యవస్థ లేని ఎన్నికల ప్రక్రియపైనే ఓటర్లు విశ్వాసం కోల్పోతున్నారు. 2. ఒకవంక కరోనా మహమ్మారి భయపెడుతుంటే మరోవంక వరద బీభత్సం నుంచి నగరవాసులింకా కోలుకోని ఈ సమయంలో తగిన వ్యవధి ఇవ్వ కుండా ఎన్నికల నిర్వహణ సరైంది కాదు. 3. నగర సమస్యలు, అభివృద్ధి వంటి అంశాల్ని పక్కకునెట్టి ఇతరేతర విషయాల్ని ప్రచారంలోకి తెచ్చిన రాజకీయ పార్టీలు, అభ్యర్థులు భవిష్యత్ పాలనపై ఏమాత్రం భరోసా ఇవ్వలేకపోవడం. ఫలితంగా, మొత్తం ఎన్నికల ప్రక్రియను ఒక తంతులా నిర్వహించారనే భావన నగర వాసుల్లో బలపడింది. గతంలో కనీసం ఓ ముసుగైనా ఉండేది, ఈ సారి ముసుగుకూడా లేకుండా, పచ్చిగా మతాన్ని ప్రచారాస్త్రం చేసినా ఎన్నికల సంఘం కిమ్మనలేదు. ఇవే ఓటరు నిరాసక్తతకు ప్రధాన కారణాలనే అభి ప్రాయం సర్వత్రా ఉంది. ఓటరు జాబితాల్లో పలు అవాంఛనీయ మార్పులు జరిగాయి. ఒకచోట భర్త ఓటుండి భార్యది గల్లంతు, మరో చోట భార్యది ఉండి భర్త ఓటు గాయబ్! ఒకోచోట గంపగుత్తగా ఓట్లు లేకపోవడం... ఇదీ జరిగింది. పోల్ చిట్టీల పంపిణీ సవ్యంగా జరుగ లేదు. ఓటర్ని చైతన్యపరిచే ప్రచారం కూడా అంతంతే! పోలింగ్ శాతం తగ్గడానికి ఇవన్నీ కారణమయ్యాయి. మాదేనా....! ఎవరి నగరమిది? ‘ఉద్యోగ, ఉపాధి, వ్యాపార తదితర కారణాలవల్ల ఇక్కడ ఉంటున్నాం తప్ప ఈ నగరం మనది కాదు, మనమీ నగరానికి చెందిన వారం కాదు’ అన్న భావనే అధికుల్లో ఉంటోంది. ఎంతసేపూ సొంతూరిపైనే ధ్యాస! ముఖ్యంగా రాజకీయ పరమైన ఎన్నికలు వంటి ప్రక్రియలో క్రియాశీలంగా పాల్గొనకపోవడానికి ఇదొక ముఖ్య కారణమని నిపుణుల విశ్లేషణ. అందుకే, లక్షలాది మందికి ఇక్కడే కాకుండా వారి స్వస్థలాలలోనూ ఓటుంటుంది. అక్కడ ఓటేస్తే చాలను కుంటారు. రెండు చోట్ల ఉండటం చట్టరీత్యా తప్పన్నపుడు, కొందరు నగరంలో తమ ఓటును రద్దు చేసుకున్నారు. ఇక్కడ ఓటున్నా వేయడానికి ఆసక్తి చూపరు. ‘ఈ నగరం మాది’ అని అందరిలో సొంతం చేసుకునే భావన తెచ్చే ఏ సాంస్కృతిక, సామాజిక కార్య క్రమాలూ ఇక్కడ జరుగవు. ప్రభుత్వాలు, నగరపాలక సంస్థ పనిగట్టుకొని ప్రత్యేకంగా అటువంటి ఏ పండుగా నిర్వహించవు. బోనాలు, సదర్, రంజాన్, క్రిస్టమస్ వంటి సంప్రదాయ పండుగ ల్లోనూ అంతో ఇంతో మూల హైదరబాదీలైన వారే ఉత్సాహంగా పాల్గొంటారు తప్ప, బయటి నుంచి వచ్చి స్థిరపడిన వారు, శివారు కాలనీల భాగస్వామ్యం అంతంతే! ఈసీ–మూసీ నదుల సంగమం, రిజర్వాయర్లకు వందే ళ్లయింది, గొప్ప ‘హైదరబాదీ’ పండుగ జరు పొచ్చు! ఎవరికీ పట్టలే! గోల్కొండ ఉత్సవాల ఊసేలేదు. అందర్నీ ఒక్కటి చేసే నగరాత్మ లేకుండా చేశారు. పైపెచ్చు, మతాల ప్రాతిపదికన విభజించే యత్నాలు ముమ్మరమయ్యాయి. నగరానికి సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. ముఖ్యమంత్రో, మున్సిపల్ మంత్రో... అలా పైవాళ్లే తప్ప నగర పాలక సంస్థ, మేయర్, గవర్నింగ్ కౌన్సిల్‌ను నామమాత్రం చేయడాన్ని నగర పౌరులు బాగా గుర్తించారు, జీర్ణించుకోలేకపోతున్నారు. ఐక్యరాజ్య సమితి (యూఎన్) సుస్థిరాభివృద్ధి లక్ష్యా(ఎస్జీడీ–16)ల్లో పేర్కొన్నట్టు సంస్థలు బలోపేతం కావాలి. అప్పుడే ప్రజలకు విశ్వాసం, వాటిపట్ల మమకారం పెరుగుతాయి. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఇవన్నీ ఓటింగ్ శాతాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసిన అంశాలే! ఇరువైపులా తప్పున్నట్టే! ప్రజాస్వామ్యంలో తమ ప్రతినిధుల్ని, తద్వారా ప్రభుత్వాల్ని ఎన్నుకునే ఓటు హక్కు పౌరులకు జీవనరేఖ! ఎన్ని ఇబ్బందులున్నా, ప్రతికూల పరిస్థితులున్నా ఓటు వేయాలి. పల్లెటూర్లో ఒక నిర క్షరాస్యుడికి ఉన్న స్పృహ చదువరుల్లో కొరవడుతోంది. ఆ హక్కును వినియోగించుకొని పాలనా నిర్ణయాధికారంలో పౌరులు భాగస్వా ములు కావాలి. తాము కోరుకునే విధానాలు, వ్యవస్థల్ని అలా తెచ్చుకోవాలి. లేకుంటే అంతిమంగా నష్టపోయేది వారే! సౌకర్యాలు– అసౌకర్యాలనే దృష్టి కోణంలో ఆలోచించి ఓటు వేయకపోవడం సమర్థనీయం కాదు. రాజకీయ వ్యవస్థలు బాగో లేవనో, ప్రచా రాంశాలు దుర్మార్గంగా ఉన్నాయనో, అర్హులైన అభ్యర్థులు లేరనో.... భావించే ఓటర్ల గైర్హాజరీని, వారి నిరసనగా గౌరవించాలనే వాదనను కొందరు ముందుకు తెస్తున్నారు. అది తప్పు. ఓటింగ్ శాతం తగ్గితే, నిర్ణయాధికారంలో ప్రజాభాగస్వామ్యం తగ్గినట్టే లెక్క! ఎందుకంటే, ఎంత తక్కువ శాతం పోలింగ్ జరిగినా ఎన్నిక రద్దయ్యే వ్యవస్థ లేనపుడు, తమ గైర్హాజరీ ప్రభావం శూన్యం. తాము పాల్గొనకుండా, జరిగే తక్కువ శాతం ఓటింగ్ వల్ల తమ అభీష్టానికి వ్యతిరేక ప్రతినిధులు వచ్చే, ప్రభుత్వాలు ఏర్పడే, నిర్ణయాలు జరి గిపోయే పరిస్థితిని పౌరులు నిలువరించలేరు. అది వారికి జరిగే నికర నష్టం, ప్రజాస్వామ్య వ్యవస్థకు జరిగే ఉమ్మడి నష్టం. ఓటరు ఉత్సా హంగా పాల్గొనే వ్యవస్థను కల్పించలేని ప్రభుత్వాల వైఫల్యం ఎంత తప్పో, నిర్లక్ష్యమో, ఉదాసీనతో, బద్దకమో, మరే నిర్హేతుక కారణ మైనా... పౌరులు తమ ఓటు హక్కు వినియోగించుకోకపోవడం అంతే తప్పు! -దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
కొత్తగాలి.. ఆశ – పాత ‘స్వరం’.. ఘోష
కేవలం రాహుల్ గాంధీని నమ్ముకుంటే గట్టెక్కుతామా? ప్రత్యామ్నాయమేమైనా ఉందా? ప్రియాంక గాంధీ నూతన ఆశాజ్యోతి అయ్యేనా? కాంగ్రెస్ శ్రేణుల్ని వెంటాడుతున్న ప్రశ్నలివి. కేంద్రంలో అధికారం చేజారిన తర్వాతి ఆరేళ్లలో పార్టీ పరిస్థితి రాజకీయంగా ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్నట్టు తయారయింది. సంస్థాగతం, ప్రజా దరణ... ఎలా చూసినా ఎదుగుదల లేదు. ఒక సంక్షోభం నుంచి మరో సంక్షోభానికి జారిపోతున్నట్టుంది. సుస్థిర, ఆధారపడదగ్గ నాయకత్వ లేమి పార్టీలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రత్యామ్నాయ రాజకీయ, ఆర్థిక, వ్యవసాయ, పారిశ్రామిక విధానాల్ని వెల్లడించలేకపోవడమూ లోపమే! దేశవ్యాప్తంగా తాము, తమ కూటమి (యుపీఏ) ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అని ఎక్కడికక్కడ ఉనికి చాటుకునేందుకే పోరాడాల్సి వస్తోంది. ఒకటొకటిగా రాష్టాలన్నీ ‘చే’జారిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాహుల్ పంజాబ్ రైతులతో ‘ఖేతీ బచావ్’ట్రాక్టర్ ర్యాలీలు, సోదరి ప్రియాంకతో కలిసి ఉత్తర్ ప్రదేశ్‌లో జరిపిన ‘హథ్రాస్ పర్యటన’ పార్టీలో నూతనోత్సాహాన్ని నింపాయని అధినాయకత్వం భావిస్తోంది. ‘పోరాడొచ్చు, మరీ చేతు లెత్తేయాల్సిన దుస్థితిలేదు’ అన్న కొత్త నమ్మకం శ్రేణుల్లో కలుగు తున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం మొదలైంది. అందుకే, నాయకత్వం క్షేత్రస్థాయి నుంచి స్పందన సమాచారం (ఫీడ్‌బ్యాక్) తెప్పించుకుం టోంది. రెండు పరిణామాలకు సంబంధించీ... కాంగ్రెస్ నాయక త్వంలో, దాని విధానాలు–అమలులో ద్వైదీభావమున్నట్టు కనిపి స్తోంది. సొంత వైఖరిని గట్టిగా సమర్థించుకోలేని స్థితి, గతానికి జవా బుదారుగా నిలువలేని పరిస్థితి! దీన్నొక అవకాశంగా మలుచుకుంటూ పాలక బేజీపీ కాంగ్రెస్‌ను ఎండగట్టే పనిలోపడింది. అధికారంలో ఉంటే ఒక పంథా, విపక్షంలో ఉంటే మరో వైఖరా? అని ప్రశ్నిస్తు న్నాయి. దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఇస్తామనే వాళ్లు ఏకరీతి వ్యవసాయ విధానాన్ని ప్రకటించాలని నిలదీస్తున్నాయి. ఇదివరకటి విధానాల నుంచి దారిమళ్లుతున్నపుడు సంజాయిషీ ఇవ్వాలంటున్నాయి. అందుకు కాంగ్రెస్ నాయకత్వం సిద్ధంగా ఉందా? అనే ప్రశ్న కాంగ్రె‹స్కు ఇంటా బయటా ఎదురౌ తోంది. (చదవండి: ‘ఎవరికీ భయపడం.. న్యాయం తప్ప ఇంకేమీ వద్దు’) వాటన్నింటికన్నా ముందు సంస్థాగతంగా పార్టీ బలోపేత మవ్వాలి, బలమైన నాయకత్వాన్ని సుస్థిరపరచుకోవాలి, అందుకు నాయకత్వం ఏం చేస్తోందనే ప్రశ్న పార్టీ అన్ని స్థాయిల నుంచీ వస్తోంది. ఇదే విషయమై 23 మంది సీనియర్లు పార్టీ అధినేత్రికే లేఖ రాసి, ఇటీవలి వర్కింగ్ కమిటీ (సీడబ్లు్యసీ) భేటీలోనూ లేవనెత్తారు. ఆ అంశాలకు తామింకా కట్టుబడే ఉన్నట్టు వారిలో ఒకరైన మనీష్ తివారీ తాజాగా ఒక ఇంటర్వూ్యలో ప్రకటించారు. వీటికి సంతృప్తికర సమా ధానాలిచ్చి, శ్రేణుల్లో నైతిక స్థయిర్యం నింపితే తప్ప ముందుకు కదల లేని స్థితిలో నాయకత్వం సతమతమౌతోంది. అన్నీ, అంతటా చేయగలరా? ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబడుతోంది. అలాంటి చట్టాల్ని తీసుకు వస్తామని లోగడ తమ ఎన్నికల మానిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్, భిన్న వైఖరితో ఇప్పుడు ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోం దని పాలకపక్షం చేసే విమర్శకు వారివద్ద సమాధానం లేదు. కాంగ్రెస్ లోగడ ఆర్జేడీతో కలిసి మహాకూటమిగా గెలుపొందిన బిహార్‌లో ప్రయివేట్ మండీ వ్యవస్థ అమలౌతోంది. ఇప్పుడు తామధికారంలో ఉన్న రాజస్తాన్‌లోనూ వ్యవసాయోత్పత్తులకు ప్రయివేటు మార్కెట్ వ్యవస్థ ఉంది. రైతులు ఇబ్బంది పడుతున్నారు. (చదవండి: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్) అక్కడ వాటిని రద్దు చేసి, ప్రభుత్వ మార్కెట్ వ్యవస్థల్ని పటిష్టపరుస్తూ, మద్దతు ధర లభిం చేలా చేస్తామని కాంగ్రెస్ ప్రకటించగలదా? అన్న ప్రశ్నకు స్పందిం చాలి. కొత్త చట్టాలతో తమకు దక్కకుండా పోతాయేమోనని పంజా బ్లో రైతాంగం ఆందోళన చెందుతున్న మద్దతు ధర, ప్రభుత్వ పక్కా మార్కెటింగ్ వ్యవస్థల్ని దేశవ్యాప్తంగా ఏకరీతిన అమలు చేస్తామని ప్రకటిస్తే తప్ప రైతాంగం కాంగ్రెస్‌ను విశ్వసించదు. కొత్త వ్యవసాయ చట్టాలను తాము అధికారంలోకి వచ్చాక బుట్టదాఖలు చేస్తామని రాహుల్ ప్రకటించారు. హత్రాస్ వంటి దాష్టీకాలు దేశంలోని పలు చోట్ల జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ప్రజలు రకరకాల సమస్య లతో సతమతమవుతున్నారు. వాటన్నిటికి ఇదే స్ఫూర్తితో నాయకత్వం ఎందుకు స్పందించదనే ప్రశ్న తలెత్తుతోంది. ఉత్తరాదిపై చూపే శ్రద్ధ దక్షిణాది రాష్ట్రాలపై చూపరని, ఉత్తరాదిలోనూ శ్రద్ధ ఉత్తరప్రదేశ్‌పైనే ఉంటుందనే విమర్శ ఉంది. 2022లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలుం డటం, తమ కుటుంబానికి అది రాజకీయ కార్య క్షేత్రం కావడమే కారణమైతే ఈ వివక్ష తగదనే భావన పార్టీ శ్రేణుల్లో ఉంది. అసలెక్కడ బావుందని? కాంగ్రెస్ పరిస్థితి దేశమంతటా దిగదుడుపుగానే ఉంది. 2004 నుంచి పదేళ్ల పాలన తర్వాత 2014 లోక్‌సభ ఎన్నికల్లో చరిత్రాత్మక అత్యల్ప సంఖ్య, 44 నమోదు చేసింది. కొత్తగా ఏర్పాటైన నరేంద్రమోదీ నేతృ త్వపు ఎన్డీయే ప్రభుత్వంపై యువనాయకుడు రాహుల్ నేతృత్వంలో పార్టీ అయిదేళ్లు పోరాడి, 2019 ఎన్నికల్లో 8 స్థానాలు మాత్రమే (మొత్తం 52) పెంచుకోగలిగింది. అతి పెద్ద వైఫల్యమిది. దేశంలో విస్తీర్ణపరంగా, రాజకీయంగా కీలకమైన అయిదు రాష్ట్రాలు ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడుల్లో కలిపి 249 లోక్‌సభ స్థానాలుంటే కాంగ్రెస్ ప్రాతినిధ్యమున్నది 12 చోట్ల. ఇక్కడే మొత్తం 1462 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్కున్నవి 130 మాత్రమే! ఏపీ, ఢిల్లీ, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్‌లలో కనీసం ఒక స్థానం కూడా లేదు. సొంతంగా ప్రభుత్వాలున్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సంఖ్య దేశంలో 3కు తగ్గిపోయింది. పంజాబ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ కాకుండా పాలనలో ఉన్న పాండిచ్చేరి సగం రాష్ట్రమైతే, మహారాష్ట్రలో కాంగ్రెస్ సంకీర్ణ భాగస్వామి. కర్ణాటకలో 13 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను, సంకీర్ణ ప్రభుత్వం ‘చే’జారడాన్ని ఆపలేక పోయింది. అంతకు ముందు గోవా, మణిపూర్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించి కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేక చతికిల పడింది. సమర్థనాయకత్వం లేదనే భావన కాంగ్రెస్ శ్రేణుల్లో బలపడు తోంది. రాజకీయాల్లోకి వచ్చి, ఎదగాలనుకునేవారు నాయకత్వంపై నమ్మకం కుదరనపుడు ప్రత్యామ్నాయ రాజకీయ వేదికల్ని వెతుక్కో వడం çసహజం. బీజేపీ తరఫున గెలిచిన 300 పైచిలుకు ఎంపీల్లో కనీసం పది శాతం, అంటే 30 మందిపైనే మాజీ కాంగ్రెస్ నాయకు లున్నారు. గెలిచిన తర్వాత పార్టీ ఫిరాయించి పాలకపక్షం పంచన చేరిన వారిలో లోక్‌సభ సభ్యులకన్నా శాసన సభ్యులే అధికం. తరాల మధ్య తరగని అంతరాలు ఇంకా గాంధీ–నెహ్రూ కుటుంబాన్ని నమ్ముకుంటే ఓట్లు రాలటం లేదు. కాదని బయటకు నడుద్దామంటే పార్టీ నిలిచే పరిస్థితి లేదు. పార్టీని సమైక్యంగా ఉంచడానికి ఆ కుటుంబంపైనే ఆధారపడాల్సి వస్తోంద న్నది పార్టీ వర్గాల నిశ్చితాభిప్రాయం. నాయకత్వానికి పరిష్కారం తట్టడం లేదు, దానికి వర్కింగ్ కమిటీ భేటీలో రభసే నిదర్శనం. రాహుల్ తన స్థానాన్ని దిటువు చేసుకోకపోవడం ప్రధాన సమస్య. ఒకటిన్నర దశాబ్దాల పరిణామాల్లో సోనియాగాంధీ వృద్ధకోటరీ పాత తరం, రాహుల్ కేంద్రకంగా తయారైన ‘నవతరం’ మధ్య పెనుగులాట సాగుతోంది. ఇందులో మేలైన స్పర్థ కన్నా పొసగనితనమే ఎక్కువ. ఫలితంగా పార్టీకి ఏ మేలూ జరగట్లేదు. ఫలితాలు ఆశాజనకంగా లేవు. పదిహేడేళ్ల కింద పడ్డ ఓ బీజం, ఎదుగుదల సరిగా లేదు. 2003 సిమ్లాలో పార్టీ ‘చింతన్ శిబిర్’ జరుగుతున్నపుడు, సోనియా కోటరీ ప్రధానకార్యదర్శి ఒకరు సర్వే జరిపించారు. పార్టీలో యువతను ప్రోత్స హించాల్సి వస్తే ఎవరైతే బావుంటుంది? అప్పుడు జ్యోతిరాధిత్య సింధియా, సచిన్‌పైలట్, జితిన్‌ప్రసాద్, మిలింద్ దేవర, ఆర్పీఎన్ సింగ్ వంటి పేర్లు వచ్చాయి. ఒక ఎమ్మెల్యేను మినహా యించి 2004 ఎన్నికల్లో వారందరికీ పార్టీ టిక్కట్లిచ్చి నాయకత్వం లోక్‌సభకు తెచ్చింది. అప్పుడే 33 ఏళ్ల రాహుల్ కూడా సభకు వచ్చారు, రాహుల్ యువ బృందం ఏర్పడింది. నిజానికి, మంత్రిపదవి తీసుకొని 2004లో ఏర్పడ్డ యూపీఏ ప్రభుత్వంలోనో, తర్వాతి 2009 ప్రభుత్వంలోనో రాహుల్ భాగస్వామి అయుండాల్సిందనే అభిప్రాయం కొందరు ఇప్ప టికీ వ్యక్తం చేస్తారు. కానీ ఆయన పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. తారుమారైన పరిస్థితి సంస్థాగత వ్యవహారాల్లో రాహుల్ క్రియాశీల పాత్ర ప్రారంభించారు. చొరవ తీసుకొని రాజస్థాన్ కాంగ్రెస్ పగ్గాలు సచిన్ పైలట్‌కు, హరి యాణా పీసీసీ పీఠం అశోక్ తన్వర్‌కు ఇప్పించడంతో కాంగ్రెస్‌లో నెమ్మదిగా ఇక తరం మారుతోందనుకున్నారు. కానీ, 2014 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత వృద్ధ తరం ఆధిపత్యం పుంజుకుంది. వివిధ స్థాయిల్లో నాయకత్వ మార్పిడితో యువతకు పట్టం కట్టాలన్న రాహుల్ ప్రతిపాదనను వారు పొసగనీయలేదు. అధికారంలో లేన పుడు అటువంటివి సత్ఫలితాలివ్వవంటూ మార్పును అడ్డుకున్నారు. బిహార్‌లో సంకీర్ణ విజయం (2015), పంజాబ్‌లో సొంత గెలుపు (2017), గుజరాత్లో దాదాపు గెలుపు వాకిట్లోకి రావడం (2017 చివర్లో), ఎంపీ, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ మూడు రాష్ట్రాల్లో విజయాలు (2018) పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపాయి. కానీ, వృద్ధతరం ఆధిపత్యం యువతరాన్ని వెనక్కినెట్టి మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో జ్యోతిరాదిత్య, సచిన్ పైలెట్లు ముఖ్యమంత్రులు కానీకుండా అడ్డు కున్న నాటకం పార్టీకి తగిలిన పెద్ద దెబ్బే! కమల్‌నాథ్, అశోక్ గెహ్లా ట్లు ముఖ్యమంత్రులయ్యారు కానీ, యువత అసంతృప్తి వల్ల పార్టీ చితికిపోయింది. అసంతృప్తికి గురైన సింధియా తన అనుచర ఎమ్మెల్యే లతో నిష్క్రమించడంతో ఎంపీలో ప్రభుత్వం బీజేపీ పరమైంది. చివరి క్షణం రాజీతో రాజస్తాన్‌లో చావుతప్పి కన్నులొట్టబోంది. రాహుల్ ‘పప్పు’ అనే ప్రచారాన్ని బీజేపీ తీవ్రం చేసింది. మోదీ–అమిత్‌షా ద్వయం చేపట్టిన ‘కాంగ్రెస్ విముక్త భారత్’ ఊపందుకుంది. రాహుల్ వ్యవహారశైలి కూడా విమర్శలకు గురైంది. బాధ్యత తీసుకోరని, రిమోట్ పద్ధతిన అధికారం చెలాయింపజూస్తారనేది ముఖ్యారోపణ. అంతటా తన మనుషులుండాలనుకుంటారు, కానీ, అవసర సమ యాల్లో వారికీ అందుబాటులో ఉండరని ఆరోపణ. అందుకు తగ్గట్టు గానే ఒక్క హిమంత్ బిశ్వశర్మను లెక్కజేయనితనంవల్ల నేరుగా ఓడిపోయో, పరోక్ష కారణాలతో సర్కార్లు కూలిపోయో మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకొని పలుచోట్ల చతికిల పడింది. తెలంగాణ కాంగ్రెస్‌లో ఇంకా వీడని అయోమయం. ఏపీలో ఇప్పటికీ పార్టీకి నామరూపాల్లేవు. బిహార్‌లో ఆశాజనక పరిస్థితి లేదు. కేరళలో పుంజుకునే సంకేతాల్లేవు. నాయకత్వలేమి, సమిష్టి తత్వలోపం, విధానాల అస్పష్టత వంటి సమస్యల నుంచి పార్టీ గట్టెక్కితే గాని బీజేపీ సంకీర్ణానికి కాంగ్రెస్ గట్టిపోటీ ఇవ్వలేదు. ట్రాక్టర్ ర్యాలీ, హాథ్రస్ పర్యటన కొత్త స్ఫూర్తి అనుకుంటే... ప్రయాణం ఇప్పుడిప్పుడే తిరిగి మొదలైనట్టు భావించాలి. వ్యాసకర్త: దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
విభజన రేఖ చెరపవద్దు
ప్రశ్న, నిరసన... వీటి గొంతు నులిమితే న్యాయవ్యవస్థకే కాదు మొత్తం ప్రజాస్వామ్యానికే ప్రమాదం. అన్యాయాలపై ఇక గొంతెత్తే వారే ఉండరు. భయంతో ఏ గొంతులూ పెగలకుంటే అరిష్టాలకు అడ్డూ అదుపుండదు. అప్పుడు వ్యవస్థలన్నీ గతి తప్పుతాయి. అరాచకం రాజ్యమేలుతుంది. ఇంతటి తీవ్ర ప్రమాదం ముంచుకు రాకుండా పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు రక్షణ ఉండాలి. సద్విమర్శకు తావుండాలి. కోర్టుల పరువు, ప్రతిష్టలు నిల వాలి. ప్రజాస్వామ్యపు వివిధ అంగాల మధ్య సంఘర్షణ తుది ఫలితం మధ్యేమార్గం, ఉభయతారకంగా ఉండాలి. అంతే తప్ప, ఒకదాని కోసం మరోటి బలిపెట్టకూడదు. కోర్టుల పరువు నిలపాలనే తొందర పాటులో పౌరహక్కుల్ని కాలరాయొద్దు. పౌరహక్కుల పేరిట వ్యవస్థల గౌరవాన్ని నేరపూరితంగా నేలకు దించొద్దు. ప్రముఖ న్యాయవాది, హక్కుల కార్యకర్త ప్రశాంత్ భూషణ్‌ను కోర్టు ధిక్కారం కేసులో దోషిగా సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిన కేసు గురువారం కొత్త మలుపు తిరి గింది. శిక్ష ఖరారు చేయాల్సిన వేళ తాజా పరిణామాలు చోటుచేసుకు న్నాయి. ట్వీట్లలో చేసిన వ్యాఖ్యల పునరాలోచనకు రెండు, మూడు రోజులు సమయం ఇస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది. తప్పు గ్రహించి, పశ్చాత్తాపం ప్రకటిస్తే తప్ప శిక్ష విషయంలో మరో అభి ప్రాయానికి తావు లేదంది. తన అభిప్రాయంలో మార్పు లేదని, తానా వ్యాఖ్యలు పూర్తి ప్రజ్ఞతోనే చేసినందున పునరాలోచన ఉండబోదని భూషణ్ నిర్ద్వంద్వంగా చెప్పారు. తీర్పు తనను కలతకు గురిచేసిందని, శిక్ష గురించి కాదు, న్యాయస్థానం తనను తప్పుగా అర్థం చేసుకుందని, దురుద్దేశ్యాలు ఆపాదించి ఆధారాలు చూపకుండానే దోషిగా తేల్చడం బాధించిందనీ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ ఒక కేసులో కోర్టు ముందు వెల్లడించిన భావాల్ని గుర్తుచేస్తూ ‘దయ చూపమని అడ గను, ఉదారత కోసం కోరను.. ప్రజాస్వామ్య పరిరక్షణకు బహిరంగ విమర్శ తప్పనిసరి అని భావించా, బాధ్యతగానే వ్యాఖ్యలు చేశాను. ఏ శిక్షకైనా సిద్ధమే’ అని తెలిపారు. తదుపరి నిర్ణయం ఇక కోర్టుదే! దేశ వ్యాప్తంగా ఈ అంశం ఓ విస్తృత చర్చకు తెరలేపింది. న్యాయవ్యవస్థ పనితీరుతో పాటు పౌరుల హక్కులు, ప్రశ్న–నిరసన– విమర్శ వంటి పలు అంశాలు ప్రస్తావనకొస్తున్నాయి. విమర్శకు తావులేని పరిస్థితి కల్పిస్తే, ఇక రాజ్యాంగం పూచీగా నిలిచిన భావప్రకటనా స్వేచ్ఛ (అధికరణం 19–(ఎ)) హక్కుకున్న అర్థమేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. రెంటినీ కలగాపులగం చేయొద్దు రాజ్యాంగబద్ధమైన సంస్థల పనితీరు సజావుగా సాగేందుకు వాటి లోపాలు ఎత్తిచూపడం, సద్విమర్శ పౌరునిగా తన బాధ్యత అని భావించినట్టు ప్రశాంత్ భూషణ్ చెబుతున్నారు. నెల రోజుల వ్యవ ధితో ఆయన చేసిన రెండు ట్వీట్లు ప్రస్తుత వివాదానికి కారణం. ఒకటి, బయట సుప్రీంకోర్టు ఛీఫ్ జడ్జి ప్రవర్తనకు సంబంధించింది. ఇంకొ కటి, గత ఆరేళ్లుగా దేశంలో ఎమర్జెన్సీ విధించకుండానే ప్రజాస్వా మ్యాన్ని బలహీనపరుస్తున్న తీరు, అదే (నలుగురు ప్రధాన న్యాయ మూర్తుల) సమయంలో సుప్రీంకోర్టు పాత్ర గురించి చేసిన వ్యాఖ్య! ఈ రెండూ న్యాయవ్యవస్థ గౌరవాన్ని, ప్రజల్లో విశ్వసనీయతను తగ్గిం చేవిగా ఉన్నాయని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఒక ఫిర్యాదు ఆధారంగా తనంతతాను సుప్రీం ఈ కేసు చేపట్టి, సదరు చర్యను కోర్టు ధిక్కారంగా, భూషణ్‌ను దోషిగా తేల్చింది. ఇది వివాదాస్పదమౌ తోంది. న్యాయస్థానాలపైన, జడ్జీలపైన ఇలాంటి విమర్శలు కొత్త కాదు. 2018లో నలుగురు సుప్రీం కోర్టు సీనియర్ జడ్జీలు విలేకరుల సమావేశం పెట్టి, ‘సుప్రీంకోర్టు పనితీరు అంత సవ్యంగా లేదు, ప్రధాన న్యాయమూర్తి పని కేటాయింపు ప్రక్రియ లోపభూయిష్టం’ అని విమర్శ చేశారు. అదెందుకు కోర్టుధిక్కారం కాలేదు? అన్నది ప్రశ్న. అంటే, ఒకే విషయంలో... న్యాయమూర్తులకు, న్యాయవాదు లకు, సాధారణ పౌరులకు వేర్వేరు న్యాయాలు ఉంటాయా? అనేది సందేహం. విమర్శకు, న్యాయధిక్కారానికి మధ్య విభజన రేఖ గుర్తిం చాలి. రెంటినీ ఒకేగాట కట్టడం తప్పని సుప్రీంకోర్టే తన తీర్పుల్లో పలుమార్లు పేర్కొంది. కోర్టు ధిక్కార చట్టం–1971 సెక్షన్ 13 అదే చెబుతోంది. ఒక చర్య లేదా వ్యాఖ్య న్యాయ ప్రక్రియ నిర్వహణలో తగినంత అనుచిత జోక్యమని సంతృప్తి చెందితే తప్ప దాన్ని కోర్టు ధిక్కారంగా పరిగణించకూడదన్నది చట్టం. తన వ్యాఖ్య సత్యమని, జనహితంలో చేసిందని నిరూపించుకునే నిందితుని వాదనకూ అవ కాశం కల్పిస్తూ చట్ట సవరణ (13–బి) కూడా జరిగింది. నిఖార్సయిన విమర్శ కోర్టుధిక్కారం కాబోదనీ ఇదే చట్టం (సెక్షన్–5) చెబుతోంది. దేశ విదేశాల్లో ఎందరెందరో న్యాయకోవిధులు ఈ విషయంలో స్పష్ట మైన తీర్పులిచ్చారు. న్యాయవ్యవస్థలో అవినీతి లేదా? ట్వీట్లలో ఒక న్యాయవాది చేసిన రెండు వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ ప్రతిష్టను భంగపరచి, ప్రజల్లో విశ్వసనీయతను తగ్గిస్తాయన్న భావ నతో ఉన్నత న్యాయస్థానం వ్యక్తి ప్రాథమిక హక్కును నలిపివేయ డాన్ని ప్రజాస్వామ్య వాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజంగా మన న్యాయవ్యవస్థ, కోర్టులు, మొత్తంగా ప్రజాస్వామ్యం ఈ రోజు అంతటి బలహీన పునాదులపై ఉన్నాయా? అని ప్రశ్నిస్తున్నారు. ‘బార్ (న్యాయవాదుల సంఘం)ను నోరు మూయించి న్యాయస్థానాల్ని బలోపేతం చేయలేర’నే నినాదం దేశవ్యాప్తంగా పెల్లుబుకుతోంది. కోర్టుల గౌరవాన్ని నిలబెట్టే ఉద్దేశంతో, వాటి పనితీరుపై ఎటువంటి వ్యాఖ్యలు చేయనీయకుండా పౌరుల భావప్రకటనా స్వేచ్ఛకు ‘కోర్టు «ధిక్కార’ అస్త్రంతో ముందే బంధనాలు విధించడం సబబా? తద్వారా కోర్టుల గౌరవం, విశ్వసనీయత పెరుగుతాయా అంటున్నారు. 108 పేజీల తన తీర్పులో, ‘నాలుగు స్తంభాల్లో ఒకటిగానే కాదు, భారత ప్రజాస్వామ్యానికి న్యాయవ్యవస్థ మూలస్తంభం’ అని పేర్కొన్న సర్వో న్నత న్యాయస్థానం, దేశంలో నెలకొన్న పరిస్థితులకూ బాధ్యత వహిం చాలన్న విమర్శను ఎందుకు స్వీకరించలేకపోయింది? వ్యాఖ్యను విమ ర్శగా కాకుండా కోర్టుధిక్కారంగా ఎలా పరిగణించారనేది విస్మయం! ‘ఇప్పుడే కాదు, 16 మందిలో సగంమంది సుప్రీం ప్రధాన న్యాయ మూర్తులు అవినీతిపరులన్న విమర్శ చేసినపుడు కూడా తన ఉద్దేశం కేవలం ఆర్థిక అవినీతి కాదని, ‘అవినీతి’ని విస్తృతార్థంలో వినియోగిం చానని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆగస్టు 4న ఇచ్చిన వివరణలో, ఆగస్టు 10న కోర్టు ఆదేశాలకు బదులిచ్చినపుడూ పేర్కొన్నారు. ‘కింది స్థాయి న్యాయవ్యవస్థలో దేశమంతటా అవినీతి ఉంది, అక్కడక్కడ ఉన్నతస్థాయిలోకీ విస్తరించింది’ అని 1964లోనే పార్లమెంటరీ కమిటీ నివేదించింది. ‘జడ్జీల్లోనూ అవినీతి పరులున్నార’ని మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎస్పీ బరూచా, ‘అవినీతి అంటుకోకుండా న్యాయ వ్యవస్థ ఏమీ పవిత్రంగా లేదని నేను నిజాయితీగా అంగీకరించా ల్సిందే’ అని మరో మాజీ ప్రధాన న్యాయమూర్తి సదాశివంలు బహి రంగంగా పేర్కొనడాన్ని భూషణ్ తన వాదనలో ఉటంకించారు. న్యాయవ్యవస్థపై విమర్శ న్యాయధిక్కారమో, కోర్టుధిక్కారమో ఎలా అవుతుందన్న ఆయన ప్రశ్నకు సహేతుకమైన సమాధానం రావట్లేదు. ఒక గిడసబారిన ఉపకరణం (కోర్టుధిక్కారం)తో ఉన్నత న్యాయస్థానం మొరటు దెబ్బ వేసిందని, ఇది న్యాయవ్యవస్థ ప్రతిష్టను, ప్రజల్లో విశ్వ సనీయతను పెంచకపోగా సన్నగిల్ల చేస్తుందన్న భయాన్నీ కొందరు వ్యక్తం చేస్తున్నారు. తప్పుగా వాడితే వికటించే ప్రమాదం కోర్టుధిక్కారం, న్యాయధిక్కారం వంటి అస్త్రాల్ని కోర్టులు, జడ్జీలు ఎంతో ఆచితూచి వాడాలని విశ్వవ్యాప్తంగా ఓ బలమైన అభిప్రాయం. అమెరికా, బ్రిటన్, ఐక్యరాజ్యసమితి స్థాయిలోనే కాక దీనిపై మన దేశంలోనూ లోగడ విస్తృత చర్చ జరిగి, నిక్కచ్చి అభిప్రాయాలు వ్యక్త మయ్యాయి. బ్రిటన్‌లో 2013లో ఏకంగా కోర్టుధిక్కార చట్టాన్ని రద్దు చేశారు. ఆ సందర్భంగా తెచ్చిన బిల్లుపై చర్చలో మాట్లాడుతూ, ‘విమర్శ అసమంజసంగా ఉన్నా, నిందాపూర్వకంగా ఉన్నా, చివరకు ఉద్దేశపూర్వకంగా తప్పుదోవపట్టించేదైనా... జడ్జీలు కటువుగా దాన్ని పట్టించుకోకుండా ఉండటమే మేలు’ అని సుప్రసిద్ధ న్యాయమూర్తి (ఐర్లాండ్) లార్డ్ కార్స్వెల్ అంటారు. ఇంగ్లండ్‌కు చెందిన ఇరవయ్యో శతాబ్ది గొప్ప న్యాయవాది, న్యాయమూర్తి టామ్ డెన్నింగ్ స్ఫూర్తి ఇక్కడ కావాలి. ఆయనే ఓ పుస్తకంలో రాసినట్టు, లేబర్‌పార్టీ నాయ కుడు, న్యాయవాది హార్టీ›్ల షోక్రాస్ ఓ కేసు తీర్పు నచ్చక ‘డెన్నింగ్ ఒక గాడిద’ అని వ్యాఖ్యానించడంతో అది ‘ది టైమ్స్’ (లండన్)లో ప్రచురి తమయింది. కోర్టు/న్యాయ ధిక్కారం కింద తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. ‘అవును ఆయన విమర్శించినట్టు నేను గాడిద కాను అని... కోర్టుధిక్కారం కింద తీసుకొని కాదు, నా పనితీరు ద్వారా నిరూ పించాలి’ అన్నది ఆయన వైఖరి. 1964లోనే సుప్రీం మాజీ న్యాయ మూర్తి గజేంద్ర గడ్కర్, ‘న్యాయధిక్కారాధికారాన్ని జడ్జీలు ఆలోచించి వాడాలి, వికటిస్తే అది న్యాయవ్యవస్థ ప్రతిష్టను, ప్రజల్లో విశ్వాసాన్ని పెంచకపోగా తగ్గించే ప్రమాదముంది’ అన్నారు. ఇప్పుడదే జరుగు తోందన్నది అత్యధికుల భయం! నిజానికి న్యాయ/కోర్టు ధిక్కార అంశాన్ని జడ్జీలు పౌరుల విమర్శలకు కాకుండా రెండే సందర్భాల్లో వాడాలని న్యాయకోవిదుల భావన! ఒకటి, కోర్టులు చెప్పింది ఎవరైనా పాటించనపుడు. రెండు, చేస్తామని (అఫిడవిట్లో, అండర్టేకింగో) కోర్టులకు చెప్పిన మాట ఎవరైనా ఉల్లంఘించినపుడు మాత్రమే అన్నది సారం. రక్షించాల్సిన వారే రౌద్రం వహిస్తే...? తన పట్ల ఫలానా జడ్జి వివక్షతో ఉన్నారు, కేసు విచారణ మరో బెంచీకి మార్చండన్న వినతి పట్టించుకోవాలి. కానీ, ప్రస్తుత కేసులో రెండు మార్లు అలా కోరినా నిరాకరించారు, ఎందుకో తెలియదు. ‘వివక్ష లేదని జడ్జి్జ దృష్టిలో కాదు, నిందితుని దృష్టిలో చూడాల’ని లోగడ ఒక కేసులో జస్టిస్ వెంకటాచలయ్య చెప్పారు. కీలక వ్యవహారాల్లో నత్త నడకన సాగే విచారణ ఈ కేసులో ప్రశాంత్ భూషణ్ వెంటపడ్డట్టు వేగంగా సాగడమే విస్మయం! జడ్జీల అవినీతిపై చర్చ చాలా ముఖ్యం. దాని ఫలితంగానే విచారణలు, రుజువైతే అత్యున్నత చట్టసభల్లో వారి తొలగింపు ప్రతిపాదనలు–నిర్ణయాలు సాధ్యం. అలాంటి పరిస్థితు ల్లోనే హైకోర్టు జడ్జీలు పి.డి.దినకరన్, సుమిత్రాసేన్ రాజీనామాలు మనం చూశాం. సహేతుకమైన విమర్శల పట్ల ఉదారంగా వ్యవహరిం చడం ద్వారా మాత్రమే న్యాయస్థానాలు మరింత స్వేచ్ఛగా స్వతం త్రంగా పనిచేస్తాయి, గౌరవం–విశ్వసనీయత పొందుతాయి. అంతే తప్ప, కోర్టుల గౌరవం, విశ్వసనీయత పెంచడానికి పౌరుల హక్కుల్ని పణంగా పెట్టడం సరికాదు. సుప్రీంకోర్టు పౌరుల ప్రాథమిక హక్కుల రక్షణ సంస్థే కాదు, ఇతర ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ రాజ్యాంగానికి లోబడి నడుచుకునేలా చూసుకోవాల్సిన వ్యవస్థ! తెలుగునాట ఓ సామెత ఉంది. ‘కన్నతల్లే దయ్యమైతే.. ఇక తొట్టెల (ఉయ్యాల) కట్టే తావెక్కడ?’ అని. సర్వో న్నత న్యాయస్థానం, దయ్యాల బారి నుంచి బిడ్డల్ని కాపాడుకునే దయగల కన్నతల్లి కావాలని జనం కోరిక! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
ఇది వేకువ తెచ్చే వేగుచుక్కేనా?
నాగరికత క్రమంలో... ప్రపంచం విజ్ఞానం కోసం వెతుకులాడుతున్నపుడు విశ్వవిద్యా లయ బోధనా పద్ధతులు ఆవిష్కరించి, సంస్థల్ని దిగ్విజయంగా నడిపిన నేల భారత దేశం. ఎన్నో దేశాల వారిక్కడికి వచ్చి నలంద, తక్షశిల, విక్రమశిల వంటి విశ్వవిద్యాలయాల్లో చదివి పట్టాలు, స్నాతకోత్తర డిగ్రీలు పొందిన చరిత్ర. సంవత్సరాల తరబడి ప్రపంచంలో మేటి విద్యాసంస్థలుగా ఐఐటీలను నిలిపిన నాణ్యత మనది. ప్రమాణాల విద్యా సంస్థలే లేని దురవస్థకు నేడు దిగజారిపోయాం. చివరకు ప్రపంచ వ్యాప్తంగా వంద ఉత్తమ విద్యా సంస్థల్ని ఎవరు ఎంపిక చేసినా, మనది చోటే దక్కని దుస్థితి! ఎక్కడో దారి తప్పాం! పాఠశాల, కాలేజీ, విశ్వవిద్యాలయ స్థాయిల్లో.. మధ్య లోనే విద్య మానేస్తున్న వారి సంఖ్య అపారం. ప్రమాణాలు దిగజారి బడిచదువులు గుడ్డిదీపాలయ్యాయి. కాలేజీ చదువులు కాలక్షేపానిక య్యాయి. కడకు కూడైనా పెట్టలేని అలంకారపు విద్యలుగా మిగులు తున్నాయి మన డిగ్రీలు! ఎంతోకాలం వృత్తి విద్యలకు వన్నెలద్దిన కోర్సులన్నీ ఇప్పుడు మరుగునపడ్డాయి. నైపుణ్యాలను తీర్చిదిద్దే శిక్షణ నేడు కరువైంది. వేల సంవత్సరాలు వారసత్వంగా వస్తున్న అనువంశిక జ్ఞానం ఆదరణ లేక కనుమరుగవుతోంది. కాలం చెల్లిన విద్యావిధా నాలు ఒకవైపు, శరవేగంగా వస్తున్న సామాజిక మార్పులు–డిమాండ్లు మరోవైపు, ఫలితంగా ‘చదువుకున్న యువత’ చతికిలపడుతున్నారు. పునాది సరిగాలేని అత్తెసరు చదువులతో నైపుణ్యాల కొరతే కాదు విలువల లేమి రాజ్యమేలుతోంది. దీనికి విరుగుడుగా విద్యావిధా నంలో సమూల మార్పులు రావాలనేది సుదీర్ఘ కాలంగా ఈ దేశంలో ఓ డిమాండ్! దానికి జవాబుగా కేంద్ర మంత్రి వర్గం నూతన ‘జాతీయ విద్యా విధానాని’కి పది రోజుల కింద ఆమోదం తెలిపింది. వచ్చే రెండు దశాబ్దాల పాటు దాదాపు ఇదే అనుసరణీయం! అంతకు ముందు, సుదీర్ఘకాలంగా విభిన్న వర్గాల నుంచి వచ్చిన ప్రతిపాద నలు, పలు స్థాయిల్లో చర్చోపచర్చలు, మార్పు చేర్పుల తర్వాత వచ్చిందే ఈ స్థూలవిధానం. ఇది ఇలాగే యథాతథం అమలవదు. పలు అంశాల అమలుకుగాను పార్ల మెంటులో, రాష్ట్ర అసెంబ్లీల్లో ఏర్పడే చట్టాల మద్దతు కావాలి. పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల్లో డాక్టరేట్ పట్టా వరకు, వివిధ స్థాయిల్లో సంస్క రణలతో మంత్రివర్గం ఆమోదించిన ఈ విధానం మంచి–చెడులపై దేశవ్యాప్త చర్చ జరుగుతోంది. నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ నేతృత్వపు కాంగ్రెస్ ప్రభుత్వం 1986లో తెచ్చిన విద్యావిధానం (34 ఏళ్ల) తర్వాత కొత్త విధానం రావడం ఇదే! బడి చదువుల క్రమతనే మార్చారు! మారిన పరిస్థితుల్లో బాల్యం నుంచే విద్యాభద్రతకు గాను, ఇదివరకటి 10+2 సంవత్సరాల పద్ధతికి బదులు 5+3+3+4 పద్ధతి ప్రతిపాదిం చారు. ఇంటర్మీడియట్ లేకుండా 12 గ్రేడ్ వరకు ఇక పాఠశాల చదువే! ఇదివరకటి ప్రాథమిక విద్య ఆరంభం కన్నా ముందు మూడేళ్ల (3–6 ఏళ్ల వయస్కుల కోసం) నుంచే పిల్లలకు విద్యాభద్రత లభించేలా చూస్తారు. ఫలితంగా ఇదివరకు హామీ ఇచ్చినట్టు 6–14 సంవత్సరాల మధ్య వయస్కుల నిర్బంధ విద్య, ఇక ఇప్పుడు 3–18గా మారు తుంది. అంటే ఇకపై పాఠశాలవిద్యలో క్రమంగా, మూడేళ్ల పూర్వ ప్రాథమిక విద్యాబోధనను కలుపుకొని ఒకటి, రెండు గ్రేడ్లతో అయి దేళ్ల ‘పునాది దశ’ (3–8 వయస్కులకు) ఉంటుంది. మూడు, నాలుగు, అయిదు గ్రేడ్లతో ‘సన్నాహక దశ’ (8–11 వయస్కులకు), ఆరు, ఏడు, ఎనిమిది గ్రేడ్లతో ‘మాధ్యమిక దశ’ (11–14 వయస్కులకు), తొమ్మిది, పది, పదకొండు, పన్నెండు గ్రేడ్లతో ‘ఉన్నత పాఠశాల దశ’ (14–18 వయస్కులకు) ఉంటాయి. మారిన కాలమాన పరిస్థితుల్లో పిల్లల మేధోవికాసం భిన్నంగా ఉంటోందని, దానికి తోడు తల్లిదం డ్రుల్లో విద్యాభివృద్ధి, వెల్లువెత్తిన శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం వల్ల బోధనా పద్ధతుల్లో వచ్చిన మార్పులు, ఇతరేతర కారణాల వల్ల కాస్త ముందునుంచే పిల్లలకు విద్యనేర్పాల్సిన అవసరాల దృష్ట్యా ఈ మార్పు ప్రతిపాదించారు. విద్య బోధించే మాధ్యమం 5 గ్రేడ్ వరకు, వీలయితే అటుపైన 8 గ్రేడ్ వరకు, ఆ పైన కూడా తల్లి భాష/స్థానిక భాష/ప్రాంతీయ భాష ఉండాలని పేర్కొన్నారు. నిర్ణయాధికారం రాష్ట్రాలకుంటుంది. పూర్వప్రాథమిక విద్యా బోధన అంగన్వాడీల్లో అని ఈ విధానం చెబుతోంది. ఈ ‘లేబాల్యం విద్యాభద్రత’ (ఈసీసీఈ)కి విద్యాశాఖతో పాటు మహిళాశిశు సంక్షేమం, ఆరోగ్య– కుటుంబ సంక్షేమం, అక్కడక్కడ... గిరిజన సంక్షేమ శాఖలు ఉమ్మడిగా బాధ్యత వహిస్తాయి. శాస్త్ర సాంకేతిక–సామాజిక శాస్త్రాలకు, సిలబస్– సిలబసేతర క్రీడాది విషయాలకు, వృత్తివిద్యా అంశాలు–ప్రధాన స్రవంతి అంశాలకు మధ్య అంత నిషిద్ధమేమీ ఉండదు. అడ్డులేకుండా, ఐచ్ఛికమైన వాటిని ఎంపిక చేసుకోవచ్చు. చిన్నతనం నుంచే భాష, సంస్కృతి విలువల్ని బాలల్లో పాదుకొల్పడం లక్ష్యంగా విధాన రూప కల్పన జరిగినట్టు చెబుతున్నారు. 6 గ్రేడ్ నుంచే సాధారణ బోధనకు వృత్తి విద్య, పరిశోధనల్ని అనుసంధానం చేస్తారు. 10, 12 గ్రేడ్లకు తాజాగా మార్చిన బోర్డు పరీక్ష విధానం ఉంటుంది. అనుభవ పూర్వక అధ్యయనాల కోసం సాధారణ సిలబస్‌ను ఆ మేరకు కుదిస్తారు. ఎప్ప టికప్పుడు విద్యార్థి ప్రగతిని అంచనా వేస్తామంటూనే, 3, 5, 8 గ్రేడ్ లలో మళ్లీ సార్వత్రిక పరీక్ష విధానాన్ని ప్రతిపాదించారు. తరగతికి తగ్గ స్థాయి కల్పించడానికి ఇదంతా చేశామని సర్కారు పెద్దలు చెప్పు కున్నారు. ఉన్నత విద్యలో భారీ మార్పులు ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉన్న దేశంలో, మారిన పరిస్థితుల్ని బట్టి ఉన్నత విద్యలోనూ పెనుమార్పులకు జెండా ఊపు తున్నారు. పలు రకాల డిగ్రీ కోర్సులకు, అన్ని సంస్థలకూ కలిపి, దేశ వ్యాప్తంగా ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. జాతీయ పరీక్షా సంస్థ (ఎన్టీఏ) ఏటా రెండుసార్లు ఈ పరీక్ష నిర్వహిస్తుంది. అందులో విద్యార్థులు పొందే ర్యాంకుల్ని బట్టే ఘనత వహించిన (న్యాక్ అక్రెడిటేషన్) ఉన్నత విద్యా సంస్థల్లో వారికి ప్రవేశాలు. గత కొన్నేళ్లు ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ‘ఐచ్ఛిక అంశాల ఆధారిత విషయ విధానా’న్ని (చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్) మరింత పరిపూర్ణం చేశారు. ఇక ఇది పక్కాగా అమలవుతుంది. శాస్త్ర, సాంకేతిక, ఆర్థిక, సామాజిక శాస్త్రాలు తదితర గ్రూపుల నుంచి ఇష్టమైన ఏయే అంశాలనైనా అడ్డు, వ్యత్యాసం లేకుండా కలగలిపి ఎంపిక చేసుకునే వెసులుబాటు విద్యా ర్థులకుంటుంది. వేర్వేరు సంస్థల నుంచి కూడా విద్యార్థులు సదరు నిర్దేశిత క్రెడిట్స్ సంపాదించవచ్చు. ఇదే అవసరాల నిమిత్తం ప్రభుత్వం ‘అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్’ (ఏబీసీ) నెలకొల్పు తుంది. తాము పొందిన క్రెడిట్స్‌ని విద్యార్థులు ఈ బ్యాంకులో దాచుకొని, తర్వాత పూర్తి పట్టా పొందడానికి వాడుకోవచ్చు. మూడేళ్లు లేదా నాలుగేళ్ల డిగ్రీని ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. కళాశాల–క్షేత్రాన్ని మరింత అనుసంధానం చేస్తూ కోర్సులోకి ఎప్పు డైనా వచ్చి, ఎప్పుడైనా వెళ్లే సరళతర విధానానికి తాజాగా తెర తీస్తున్నారు. అంటే, డిగ్రీ మూడేళ్లో, నాలుగేళ్లో ఏకబిగిన చదవాల్సిన పని లేదు. ఏడాది చదివి ఉద్యోగానికనో, పరిశోధనకో, వృత్తివిద్యా పనులకనో, కంపెనీలు–ఉత్పత్తి కేంద్రాల్లో అనుభవానికనో బయటకు వెళితే ‘సర్టిఫికేట్ కోర్సు’గా, రెండేళ్లు చదివి వెళితే ‘డిప్లొమా కోర్సు’గా గుర్తించి, ఆ మేరకే పట్టా ఇస్తారు. బయటి పనులు చేసుకొని వచ్చి మిగతా ఏడాదో, రెండేళ్లో చదివి సమగ్ర డిగ్రీపట్టా పొందవచ్చు. ఎం.ఫిల్, పీహెచ్‌డీల విషయంలోనూ కొన్ని సడలింపులు ప్రతిపాదిం చారు. ప్రయివేటు రంగంలో కాలేజీలు, అవి పొందే ‘న్యాక్’ క్రెడిట్ ను బట్టి వారే ఫీజులు నిర్ణయించుకోవచ్చు, ఏ కోర్సుకు, ఏ క్రెడిట్ కాలేజీకి ఎంత అన్న గరిష్ట పరిమితి సర్కారు విధిస్తుంది. కాలేజీలు స్వతం త్రంగా డిగ్రీలు ప్రధానం చేయొచ్చు, ఏ విశ్వవిద్యాలయానికీ అను బంధంగా ఉండాల్సిన అవసరం లేదు. మెరుగైన వంద విదేశీ విశ్వ విద్యాలయాలు ఇక్కడ, ఇక్కడి మెరుగైన విశ్వవిద్యాలయాలు విదే శాల్లో కొన్ని కోర్సులు నిర్వహించే పద్ధతి తీసుకువస్తారు. భిన్న వాదనలు–వీడని సందేహాలు స్వయంప్రతిపత్తి, సాధికారతతోనే విద్యావ్యవస్థ బలోపేతమౌతుం దని కేంద్రం అంటోంది. అందుకే తామీ సంస్కరణలకు పూనుకున్నా మనేది వారి వివరణ. ఉన్నత విద్య ఇదివరకటిలా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఏఐసీటీఈ వంటి సాంకేతిక సంస్థలు ఇక విడిగా ఉండవు. అన్నీ విలీనమై ‘భారత ఉన్నత విద్యా కమిషన్’ (హెచ్ఈ సీఐ) మాత్రమే ఉంటుంది. నిఘా–నియంత్రణతో పాటు బోధకుల శిక్షణ, నిధుల కేటాయింపు, న్యాక్ గుర్తింపులివ్వడం వంటి వన్నీ దీని పరిధిలోకే వస్తాయి. కేంద్ర విద్యామంత్రి నేతృత్వంలోని సలహా మండలి సూచనల మేరకు పనులు జరుగుతాయి. ఇదంతా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, ఉమ్మడి జాబితాలో ఉన్న విద్య మొత్తాన్ని క్రమంగా కేంద్రీకృతం చేసే కుట్ర అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. విద్య మెరుగుపరిచే మౌలిక విషయాల్ని గాలికి వదిలి, సిలబస్–కోర్సు విధానాల మార్పు అంటూ మాటల గారడీ చేస్తున్నార నేది విమర్శ. పూర్వ ప్రాథమిక విద్య (నర్సరీ, ఎల్కేజీ–యూకేజీ), 10+2 ఉన్నత పాఠశాల విద్య (సీబీఎస్ఈ), చాయిస్‌బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (పలు యూనివర్సిటీలు)... ఇలా అన్నీ ఏదో రూపంలో ఇది వరకు ఉన్నవే నని, వాటికి కొత్తగా భాష్యం చెప్పి, మసిబూసి మారేడు కాయ చేస్తు న్నారని వామపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. విద్యా మౌలిక వసతులు, బోధనలో నాణ్యత, వారికి నైపుణ్యాల శిక్షణ.... ఇవేవీ లేకుండా, తగిన నిధులు ఇవ్వకుండా ఇపుడు చెప్పే ఏ లక్ష్యాల సాధనా జరుగదని వారంటున్నారు. కాగితాల్లో కథల ప్రకారం ఇదొక గొప్ప ‘దార్శని కత’గా కనిపిస్తున్నా, ఆచరణలో ప్రతికూల ఫలితాలుంటాయనేది వారి వాదన. విద్యను మరింత ప్రయివేటు పరం చేయడమేనన్న సందే హాలు వ్యక్తమౌతున్నాయి. కేంద్రం మూడు ‘సి’లకు తెగబడుతోందని, విద్యను కేంద్రీకృతపరచడం, మతీకరించడం, వాణిజ్యపరం చేయడం దిశలో ఇది వేగంగా కదలడమేనన్న విపక్షాల అభియోగానికి సమా ధానం కావాలి. పటిష్ట, గతిశీలమైన విద్యావిధానమే ప్రజాస్వామ్యా నికి గట్టి పునాదినివ్వగలదు. అదే తక్షణావసరం! ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com ఆర్. దిలీప్‌రెడ్డి -
తోవ పరిచిన తొలి అడుగు
సుదీర్ఘంగా సాగే మహాయాత్ర కూడా ఒక చిన్న అడుగుతోనే మొదలయ్యేది. ఆ అడుగెలా పడిందన్నది ముఖ్యం. అందుకే, ఫ్రెంచ్ రచయిత, తాత్వికుడు వాల్టేర్ ‘ఈ ప్రపంచంలో... మనం వేసే తొలి అడుగును బట్టే మన తదుపరి పయనం ఆధారపడి ఉంటుంది’ అంటారు. పూర్ణ విశ్వాసంతో అధికారంలోకి తెచ్చిన ప్రజలకు, ‘మీరు మెచ్చే పాలన అందిస్తా’నని తొలిరోజే మాటిచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి, మాట నిలబెట్టుకుంటూ గట్టి తొలి అడుగు వేశారు. నేటితో ఆయన పాలనకు ఏడాది. గద్దెనెక్కే నాటికి అత్యధికుల్లో వ్యక్తమైన నమ్మకాన్ని నిలబెడుతూ, అతి కొద్ది మంది సందేహాలు పటాపంచలు చేస్తూ ఏడాది పాలన సాగింది. సుదీర్ఘ పాదయాత్రలో, ఇతరత్రా ఇచ్చిన హామీలతో రూపొంది, ప్రకటించిన ఎన్నికల ప్రణాళికే తన కార్యపత్రమైంది. ఎంతో ప్రాధాన్యత ఇచ్చి దాన్నే ఆచరించారు. అప్పుడప్పుడు ఓ అడుగు ముందుకేసి కొత్త నిర్ణయాలకూ వెళ్లారు. అందుకే, ఇంటా బయటా ఆయన ఆశించిన ‘మెప్పు’ అపారంగా లభిస్తోంది. కొన్ని అంశాల్లో దేశానికే ఆదర్శ ప్రాయ విధానాలు ఏపీలో అమలుపరుస్తున్నారు. అది కూడా స్వయంగా సంక ల్పించి, ప్రకటించిందే! ఏడాది కింద ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే, తనను కలిసిన ఆత్మీయ బృందంతో జగన్మోహన్రెడ్డి పిచ్చాపాటి మాట్లాడుతున్నపుడు పరిపాలనాంశం ప్రస్తావనకొచ్చింది. ఆయన తండ్రి డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి నాటి ఉమ్మడి రాష్ట్రంలో పాలనను కనీస ప్రామాణికం (బెంచ్ మార్క్) చేశారన్న మాటకు స్పందిస్తూ, ‘దేశంలోనే ఏపీని మనం ఆదర్శప్రాయం (రోల్ మాడల్) చేద్దాం’ అని వెల్లడించిన సంకల్పమాయనది. తర్వాత బహిరంగం గానూ ప్రకటించారు. రాష్ట్ర విభజనతో తలెత్తిన సమస్యలు, కిందటి ప్రభుత్వం ధ్వంసం చేసిపోయిన వ్యవస్థల–అవస్థలు, ఆర్థిక ఇబ్బం దులు ముప్పిరిగొన్నా.. సడలని ఆత్మవిశ్వాసంతో సాగిన పాలన. అను భవానికి–ఆవేశానికి మధ్య పొంతనా? అంటూ పడని వారు చేసిన దుష్ప్రచార కుట్రలన్నీ భగ్నమయ్యాయి. ప్రజాహితంలో లేని, పని కొచ్చేది కాని అనుభవం కన్నా... విజన్, విశ్వసనీయత కలిగిన నిబద్ధతే నిలుస్తుందని నిరూపితమైన పరీక్షా సమయమిది. ఫలితాలే అందుకు నిదర్శనం. అన్నం ఉడికిందా లేదా అని మొత్తం చూడనక్క ర్లేదు, నాలుగు మెతుకులు ముట్టి చూస్తే చాలు! గ్రామ స్వరాజ్యం వ్యవసాయాధారిత రాష్ట్రంలో రైతుకు దన్నుగా నిలుస్తూనే సమగ్ర గ్రామీణ వికాసం ఎజెండా చేశారు. గ్రామ–వార్డు సచివాలయం, వాలంటరీ సర్వీసు వ్యవస్థతో గ్రామీణ విప్లవానికి నాందిపలికి దేశానికి ఆదర్శమయ్యారు. ‘నా ఆలోచనల్లో గ్రామ స్వరాజ్యం అంటే, పూర్తి గణతంత్రం, తనకు కావాల్సింది సమకూర్చుకునే స్వేచ్ఛ, స్వతం త్రాలతో గ్రామం శక్తివంతం అవడం... సహకార పద్దతిలో పనిచేస్తే ప్రతి గ్రామం ప్రగతిపథంలో సాగుతుంది. అన్నీ అక్కడే సమకూరాలి. ఊళ్లో ఎవరూ ఖాళీ ఉండొద్దు. వాళ్లకు వాళ్లే గ్రామస్తులు జాగ్రత్తప డాలి...’ అని జాతిపిత గాంధీ సేవాగ్రామ్‌లో ప్రసంగం (22.10.41), హరిజన్ పత్రికలో వ్యాసం (26.6.1942), నెహ్రూకు లేఖ (5.10. 1945) వేర్వేరు సందర్భాల్లో చెప్పారు. గాంధీజీ కలలు నిజం చేసే కార్యాచరణ ఏపీలో మొదలైంది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులెవరూ తమ అవస రాలకు నాయకుల, అధికారుల, పైరవీకార్ల వెంట తిరిగే పనిలేకుండా ముంగిట్లోకే సౌకర్యాలన్నీ సమాకూర్చే వ్యవస్థను తెచ్చారు. 15003 సచివాలయాలు ఏర్పడ్డాయి. వాటిల్లో 1.34 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించారు. 2.70 లక్షల మంది వలంటీర్లు లబ్ధిదారులకు చేయూతనిస్తున్నారు. సంక్షేమ ఫలాలను ఇంటికి వెళ్లి అందిస్తున్నారు, వారి వినతులు–ఫిర్యాదుల్ని స్వీకరిస్తున్నారు, పరిష్కరించే సంధాన కర్తలుగా వలంటీర్లు వ్యవహరిస్తున్నారు. తాజా సమీ క్షల్లో మాట్లాడుతూ ‘80 శాతం పైగా వలంటీర్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నుంచి రావటం... ఆయా వర్గాలే ప్రభుత్వ పథకాల్లో ముఖ్య లబ్ధిదారులవడంతో అవినీతి, అవకతవకలకు ఆస్కారం లేని సామాజిక న్యాయసాధనకు అవకాశం పెరిగింది’ అని సీఎం చేసిన వ్యాఖ్య అక్షరసత్యం. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా అర్హు లైన అందరికీ ప్రభుత్వ పథకాల మంజూరీ ఆన్ లైన్లో 72 గంటల్లోనే జరిగేలా చూస్తున్నారు. ఈ సచివాలయ–వలంటరీ వ్యవస్థ పలు సర్వేలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి గ్రామ స్థాయిలో ఇటు కాళ్లూ–చేతు లుగా అటు కళ్లూ–చెవులుగా ఉంటోంది. కోవిడ్–19 వంటి విపత్కర కాలంలో వారి సేవలు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. విద్యతోనే భవిత ఎవరి జీవితాల్నైనా శాశ్వత ప్రాతిపదిక బాగుచేయాలంటే వారికి కచ్చి తమైన విద్యావకాశాలు కల్పించాలని ఏపీ సీఎం తరచూ అంటుం టారు. ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడకుండా రాష్ట్రంలో ఒక సమగ్ర విద్యావిధానానికి ఆయన రూపమిచ్చారు. ‘విద్యే భవితకు యోగ్యతా పత్రం, దానికోసం ఇవాళ సంసిద్ధమైన వాళ్లకే రేపు దక్కుతుంది’ అని అమెరికా పౌరహక్కుల పోరాట యోధుడు మాల్కమ్ ఎక్స్ అంటారు. పేదలకు సరైన విద్య దక్కాలంటే ఎన్ని కష్టాలో ప్రభుత్వం గుర్తించింది. పిల్లలందరినీ బడికి పంపేలా తల్లులకు ఆర్థికంగా సహాయ పడే ‘అమ్మఒడి’, బడుల్లో మౌలిక సదుపాయల్ని పెంచే ‘నాడు నేడు’, పిల్లలు పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫామ్ తదితరాలు సమకూర్చు కునేలా ‘విద్యాదీవెన’, బయటుండి చదివే పెద్ద పిల్లల ఖర్చుల నిమిత్తం ‘వసతి దీవెన’ ఇలా ఎన్నో కార్యక్రమాల్ని తలిదండ్రులే కాక ఇరుగుపొరుగు రాష్ట్రాల నిపుణులు, విద్యావేత్తలూ ప్రశంసిస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు ఇంగ్లిష్ మాధ్యమ బోధన లభించక ఉద్యోగావకాశాల్లో, ఇతర పోటీల్లో వెనుకబడి పోతు న్నామనే భావన బలంగా ఉంది. ఈ కష్టం పేదలది మాత్రమే కాదు. దిగువ, మధ్య తర గతి కుటుంబాలు కూడా తమ స్థాయిని మించిన వ్యయంతో ప్రైవేటు ఇంగ్లిష్ చదువులు చెప్పించాల్సి వస్తోంది. పరిష్కారంగా రాష్ట్రంలోని 44,512 సర్కారు బడుల్లో దాదాపు 42 లక్షలమంది విద్యారులకు మేలు జరిగేలా ఆంగ్లమాధ్యమ విద్యావకాశాన్ని ప్రభుత్వం కల్పి స్తోంది. ఆహార నాణ్యత మెరుగయ్యే ‘మెనూ’ స్వయంగా ముఖ్య మంత్రే నిర్ణయిస్తూ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పకడ్బందీగా అమలు పరచడం విద్యాప్రమాణాలు పెంచేదే! పేదలకు ఉన్నత విద్యావకాశం కల్పించే ‘ఫీజు రీయింబర్స్ మెంటు’ను పూర్తిస్థాయిలో అమలుపరచడమూ దేశంలో రికార్డే! ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ డాక్టర్ వైఎస్సార్ విప్లవాత్మకంగా చేపట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇప్పుడు ఏపీలో విస్తృతపరిచారు. అనుమతించే జబ్బుల సంఖ్య, ఆస్ప త్రుల సదుపాయం, అర్హుల ఎంపిక, మందుల లబ్ది... ఇలా పలు విధా లుగా ఈ పథకం విస్తృతి పెంచారు. ఆరోగ్యశ్రీ కింద ప్రత్యేక వైద్య సేవలు రాష్ట్రంలోనే కాక బయట ఎక్కడైనా పొందవచ్చు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రధాన చికిత్స ముగిసి, కోలుకునే సమయంలో రోజుకు రూ.225 చొప్పున ‘ఆరోగ్య ఆసరా’ కింద డబ్బిచ్చే విధానాన్ని కొత్తగా తీసుకువచ్చారు. కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడేవారికి నెలకు రూ. 5వేల పెన్షన్ ఇస్తున్నారు. ‘మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యం, వరం’ అన్న గౌతమ బుద్ధుడి మాటల స్ఫూర్తి పాలనలో ప్రతిబింబిస్తోంది. వైద్య సదుపాయాల్ని వికేంద్రీకరిస్తూ, జబ్బొస్తే సామాన్యులు నలిగిపోకుండా సేవలు–సదుపాయాల్ని పెంచే ఏర్పా ట్లలో సర్కారుంది. ‘నాడు–నేడు’ పథకం ద్వారా మౌలిక సదుపా యాల్ని పెంచుతున్నారు. పీహెచ్‌సీలు 989 భవనాల పునర్నిర్మాణం, 149కి కొత్త భవనాలకు రూ.671 కోట్లు వ్యయం చేయనున్నారు. ‘108 అంబులెన్స్’, ‘104 అత్యవసర వైద్య వాహన’ సదుపాయాల్ని ప్రతి మండలానికీ అందుబాటులోకి తెస్తున్నారు. 52 ఏరియా ఆస్పత్రుల్లో, 117 సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో సదుపాయాల వృద్ధికి రూ.1,236 కోట్లు వ్యయం చేస్తున్నారు. గ్రామ–వార్డు సచివాలయాలకు అను బంధంగా 10,060 విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటుకు నిర్ణయించారు. వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల సంఖ్య పెంచుతున్నారు. కోవిడ్ పరీక్ష ల్లోనూ దేశంలోనే రికార్డు సామర్థ్యం ఏపీ సాధించింది. పాజిటివ్ కేసుల, మరణాల రేటు తగ్గించి, రికవరీ రేటు పెంచగలిగింది. మహిళాభ్యుదయం ప్రత్యేక చర్యలు, కార్యక్రమాలు ద్వారా ఏపీ ప్రభుత్వం మహిళల్లో అపారమైన ఆత్మవిశ్వాసాన్ని నింపింది. మహిళా ప్రగతి రాష్ట్రానికి పలు రెట్లు మేలని సీఎం తరచూ చెబుతుంటారు. వారిపై అఘాయిత్యాల్ని నిరోధించేందుకు పకడ్బందీ ‘దిశ’ చట్టం తెస్తూ దేశానికే ఆదర్శమ య్యారు. ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటు హోంమంత్రిత్వ శాఖ ఇస్తూ మహిళలకు మంత్రివర్గంలో పెద్ద పీట వేశారు. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్... పథకాల్లో నగదు లబ్ధిని మహిళల అకౌంట్లలోకే జమ చేస్తున్నారు. జీరో వడ్డీ రుణ సదుపాయంతో పాటు రేపు పెద్ద సంఖ్యలో జరిపే ఇళ్లనిర్మాణం కూడా మహిళల పేరిటే జరుగుతోంది. నిజమైన మహిళాసాధికారత ద్వారా రాష్ట్రంలో కుటుంబ వికాసాన్ని ప్రభుత్వం ఆశిస్తోంది. ‘జనాభాలో సగ భాగాన్ని అలా వెనక్కి వదిలేసిన ఏ దేశమూ నిజమైన ప్రగతి సాధించ లేదు’ అంటారు బ్రిటన్ మాజీ మంత్రి జస్టిన్ గ్రీనింగ్. ఇవి మచ్చుకు కొన్నే! రైతు భరోసా, ఉచిత విద్యుత్తు, దశల వారీ మద్యనిషేధం, చేతి వృత్తులకు చేయూత వంటి ‘నవరత్నాల’తో ఏపీ పాలన పురోగమిస్తోంది. సీఎం చెప్పినట్టు తొలి ఏడాదే ఎన్నికల ప్రణా ళికను 90 శాతం నెరవేర్చడం రికార్డు. తండ్రి వైఎస్సార్ వంటి మహా నేత నుంచి స్ఫూర్తి పొందారు. స్వయంగా ఓదార్పు, పాదయాత్రలతో జనం కష్టాల్ని లోతుగా పరిశీలించిన అనుభవంతో పాలనకు జగన్ మోహన్‌రెడ్డి మెరుగులు దిద్దడం చూస్తుంటే విన్స్టన్ చర్చిల్ చెప్పిన ఓ గొప్ప మాట గుర్తొస్తోంది. ‘శిఖరాగ్రాలు నేతలకు స్ఫూర్తినిస్తాయి. కానీ, లోయలే వారిలో పరిపక్వత తీసుకువస్తాయి’. దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
కోరుకో.. కొత్త ఆరోగ్య లోకం!
ఉపద్రవాలు మానవ సమాజానికి ఎంత నష్టం కలిగిస్తాయో, ఏ మాత్రం తగ్గని రీతిలో గుణపాఠాలూ నేర్పుతాయి. సరిగ్గా నేర్చుకొని తమ పరిస్థితిని చక్కదిద్దుకున్న సమాజాలు బాగుపడటం చరిత్ర చెప్పే సత్యం! ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కోవిడ్– 19 కూడా ఏకకాలంలో ఎన్నో పాఠాలు చెబు తోంది. అందులో వైద్యం ఒకటి! ముఖ్యంగా భారత్ వంటి దేశాలు ప్రజావైద్యం విష యంలో నేర్చుకోవాల్సిన పాఠాలెన్నో! మర్చిపోయిన మంచి, అల వాటుపడ్డ తప్పు, జరుగుతున్న అనర్థం... ఇవన్నీ ఎత్తి చూపింది కోవిడ్. ప్రజావైద్యానికి ఏటా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో అటూఇటూగా ఒక శాతం మాత్రమే వెచ్చించే దేశమిది. కానీ, విపత్తు నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించే ఉద్దీపనలకే జీడీపీలో 10 శాతం, అంటే రూ. 20 లక్షల కోట్లు వెచ్చించాల్సి రావడం పెద్ద గుణపాఠమే! ప్రజా వైద్య వ్యవస్థలు గొప్పగా ఉన్న చిన్న దేశాలు కూడా ఉపద్రవాన్ని సమర్థంగా ఎదుర్కొంటున్నాయి. వైద్యం ప్రయివేటీకరించిన అగ్ర రాజ్యం అమెరికా తుఫాన్లో అరటి తీగలా అల్లాడుతోంది. ప్రజా వైద్యం నుంచి ప్రయివేటు వైపు దారిమళ్లిన ఇటలీ, ఉన్న ప్రజా వైద్యాన్ని కొన్నేళ్లుగా చిన్నచూపు చూస్తున్న బ్రిటన్ వంటి దేశాలకూ కోవిడ్‌లో చేదు అనుభవాలు తప్పలేదు. (చదవండి: వదంతుల మహమ్మారి) మూడు నెలలుగా ఈ దేశంలో కరోనా సృష్టిస్తున్న కల్లోలానికి అల్లాడిన జనాన్ని ఏ వైద్యులు ఆదుకున్నారు? ప్రయివేటు వైద్యులా! ప్రజా వైద్యులా? ఈ పాటికే సదరు ప్రశ్న ఎన్నో మెదళ్లను తొలిచే ఉంటుంది. సమాధానం నిస్సందేహంగా ఒకటే! అవును... మన ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులే! దేశ ప్రజావైద్య వ్యవస్థలో భాగమైన వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది మొక్కవోని ధైర్యంతో, దీక్షతో, నిబద్ధతతో కోవిడ్ వార్డుల్లో మృత్యువును వెనక్కి నెట్టి వైరస్‌తో యుద్ధం చేస్తున్నారు. వ్యాధిగ్రస్తులకు దన్నుగా నిలుస్తున్నారు. మరి మనకెందుకు ప్రభుత్వ ఆస్పత్రులంటే, ప్రజా వైద్యులంటే చిన్న చూపు? గత కొన్నేళ్లుగా ప్రజా వైద్యానికి మన ప్రభుత్వాలిచ్చే ప్రాధా న్యత అలాంటిది. దానికి తోడు ఎక్కడికక్కడ అవినీతి, స్వార్థం పెచ్చ రిల్లి ప్రయివేటు వైద్య రంగ వికాసం కోసం ప్రజా వైద్య వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిన సందర్భాలూ కొల్లలు. కరోనాతో మన సహజీవనం అనివార్యమంటున్నారు కనుక, ఈ పరిస్థితి మారాలి. పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించి అయినా ప్రజావైద్య రంగాన్ని బలోపేతం చేయాలి. సమగ్ర, సంక్లిష్ట వైద్యానికి ప్రయివేటు రంగంలో ఆరోగ్యకర పోటీని ఆహ్వానిస్తూనే ప్రజావైద్య రంగాన్ని పటిష్టపరచాలన్నది కోవిడ్ నేర్పుతున్న పాఠం. (చదవండి: భారీ ప్యాకేజీ: భారత్‌పై ఐరాస ప్రశంసలు) తుప్పుపట్టిన తుపాకులతోనే.... అరకొర వసతులతోనే మన సర్కారు వైద్యులు అద్భుతాలు సృష్టిస్తు న్నారు. సహజ వాతావరణ పరిస్థితులు కొంత, సార్స్ తెగ వైరస్‌లను తట్టుకునే మన దేశీయుల రోగనిరోధక శక్తి కొంత, తగినన్ని పరీక్షలు జరిపించకపోవడం వల్ల కొంత... మొత్తానికి దేశంలో తక్కువ సంఖ్య కరోనా కేసులు నమోదై ఉండవచ్చు. అంత మాత్రాన మన సర్కారు వైద్యులు, నర్సులు, సిబ్బంది కృషిని తక్కువచేసి చూడలేం. వైరస్ సోకిన వారికి వైద్యం చేసే క్రమంలో పాజిటివ్ లక్షణాలు వచ్చిన వైద్యులు, సిబ్బంది ఆపై కోలుకొని, 14 రోజుల క్వరైంటైన్ తర్వాత కూడా అవే వార్డుల్లో విధులు నిర్వహిస్తున్నారు. తగినన్ని కిట్లు, వెంటి లేటర్లు లేకున్నా, ఎన్–95 మాస్కుల కొరత ఉన్నా, సరైన ప్రమా ణాలతో పీపీఈలు లేకున్నా... ఎక్కడా తగ్గకుండా 75 వేలకు పైబడి పాజిటివ్ కేసుల్లో వైద్యం అందిస్తూ, దాదాపు మూడో వంతు రోగుల్ని చికిత్స చేసి ఇళ్లకు పంపారు. దీన్నంతటినీ ప్రయివేటు వైద్యరంగం గత మూడు నెలలుగా దూరం నుంచి చూస్తోంది. కార్పొరేట్ నుంచి మధ్య, చిన్న తరహా ప్రయివేటు ఆస్పత్రుల దాకా.. పూర్తిగానో, పాక్షికంగానో మూతబడి ఉన్నాయి. లేదా అక్కడక్కడ ఎమర్జెన్సీ కేసులు మాత్రం చూస్తున్నారు. ఇప్పుడిప్పుడే దశలవారీగా వైద్య సేవల్ని పునరుద్ధరి స్తున్నారు. ప్రయివేటు ఆస్పత్రుల నుంచి ప్రిస్కిప్షన్లు, ఫార్మా కంపెనీ లకు ఇన్వాయిస్లు రమారమి తగ్గాయి. ప్రయివేటు డయాగ్నసిస్ ల్యాబ్‌ల పరీక్షలు కూడా 3, 4 శాతానికి పడిపోయినట్టు నివేదికలు న్నాయి. ప్రయివేటు రంగం ఇలా ఉంటే, మరో పక్క ప్రభుత్వ రంగంలో క్రమేపీ కరోనా పరీక్షల్ని దేశ వ్యాప్తంగా పెంచారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో పరీక్షలు, పద్ధతులు, చికిత్సలు నిర్వహిస్తున్నారు. మార్చి 12న కేవలం 90 మందికి మాత్రమే పరీక్షలు జరుపగలిగిన స్థితి నుంచి, మే 12 నాటికి ఒకేరోజు పదివేల మందికి పరీక్ష జరిపే సామర్థ్యాన్ని మెరుగు పరిచారు. ప్రభుత్వ వైద్యుల సేవలు ప్రజా మన్నన పొందుతున్న క్రమంలోనే ప్రజా వైద్యాన్ని ప్రభుత్వం మెరుగపరచాల్సిన అవసరం ఉంది. వారం కింద విశాఖపట్నం శివారుల్లో గ్యాస్ లీక్ దుర్ఘటన చోటు చేసుకున్నపుడు అక్కడి కేజీహెచ్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల సేవలకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. చికిత్స కోసం 324 మంది బాధి తులు అక్కడ చేరగా తీవ్రంగా ప్రభావితులైన ముగ్గురు మరణించారు. మిగతా అందరికీ చికిత్స అందించి, గురువారం వరకు విడతలుగా వారిని ఇళ్లకు పంపించారు. అప్పటికే అక్కడ ఉన్న వైద్య వ్యవస్థ, వైద్యుల సంఖ్య, వారి నిబద్ధత అందుకు దోహదపడింది. ఈ స్థితి దేశమంతటా రావాలి. కరోనా కేసులు ఒక్క పెట్టున పెరిగే సరికి వాటికి తట్టుకోలేని పరిస్థితి నేడు ముంబయిలో తలెత్తుతోంది. ఏమంటే సదుపాయాల కొరత! ప్రభుత్వ వైద్య రంగంలో మౌలిక సదుపాయాల లేమి దేశ వ్యాప్తంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అందుకే, ప్రధాని మోదీతో వీడియో సమావేశం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి వైద్య మౌలిక రంగ పటిష్టతకు వడ్డీలేని, లేదా స్వల్ప వడ్డీ రుణ సదుపాయం కల్పించాలని కోరారు. తద్వారా గ్రామ స్థాయి నుంచి బోధనాసుపత్రుల స్థాయివరకు వైద్యసదుపాయాల్ని మెరుగు పరుస్తామన్నారు. ప్రాధాన్యతలు మారాలి కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజావైద్యానికి నిధులు పెంచాలి. కేంద్రీకృత వైద్య సదుపాయాల వ్యవస్థ సరైంది కాదు. వికేద్రీకరణ జరగాలి. గ్రామ, మండల, జిల్లా స్థాయి నుంచి సదుపాయాల్ని మెరు గుపరచాలి. ఇప్పటికీ వైద్యం కోసం పెట్టే తలసరి వ్యయం భారత్‌లో చాలా తక్కువ. ‘బ్రిక్స్’ దేశాలు, ఇటీవలే పారిశ్రామికీకరణ జరిగిన ఇతర దేశాలతో పోల్చి చూసినా మనం అట్టడుగునే ఉంటాం. బ్రెజిల్ (947), రష్యా (893), దక్షిణాఫ్రికా (570), టర్కీ (568), మలేషియా (456), చైనా (420), ఇండొనేషియా (99) తదితర దేశాల్లో తలసరి వైద్య వ్యయం అన్నేసి డాలర్లలో ఉంటే, భారత్‌లో అది 75 డాలర్లు మాత్రమే! అందులోనూ... 30 శాతమే ప్రభుత్వ రంగంలో జరుగు తుంటే, 70 శాతం వ్యయం ప్రయివేటు రంగంలో రోగులు నేరుగా జేబుల్లోంచి వెచ్చిస్తున్నారు. కేంద్రం–రాష్ట్రాలు కలిపి, 2008–09 నుంచి 2019–20 వరకు ప్రజారోగ్య–వైద్యానికి వెచ్చించింది స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 1.2 శాతం నుంచి 1.6 శాతం మాత్రమే! ఇది ఏ మాత్రం సరిపోదు. అందుకే, కనీస వైద్యావసరాలు తీర్చు కోవడానికి పౌరులు పెద్దమొత్తం తమ కష్టార్జితాన్ని మంచి నీళ్లలా ప్రయివేటు వైద్యరంగంలో ఖర్చు చేస్తున్నారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో సగటున 72 శాతం మంది, పట్టణ–నగర ప్రాంతాల్లో సగటున 79 శాతం మంది ప్రయివేటు వైద్య రంగ సేవల్ని వినియో గించుకోవాల్సి వస్తోంది. జాతీయ నమూనా సర్వే (ఎన్ఎస్ఎస్) 2017–18 ఫలితాలు గగుర్పాటు కలిగిస్తున్నాయి. ఈశాన్యంలోని చిన్న రాష్ట్రాలు కాకుండా... హిమాచల్ ప్రదేశ్, ఒడిషా, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లోనే పౌరులు 50 శాతానికి పైబడి ప్రభుత్వ వైద్య సేవల్ని పొందుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి పెద్ద రాష్ట్రాల్లో పౌరులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పొందుతున్న వైద్య సేవలు 25 శాతం లోపే! ప్రజారోగ్యం–ఉత్పత్తి, ఉపాధికి అనుసంధానం ప్రతి వెయ్యి మంది జనాభాకి కనీసం ఒక డాక్టర్ ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌వో) చెబుతోంది. మన దగ్గర 1:1400 నిష్పత్తి ఉంది. వైద్య కళాశాలలు, వైద్యుల్ని పెంచాలి. బ్రిటన్‌లో ఈ నిష్పత్తి 1:800 ఉంటే, క్యూబా వంటి చిన్న దేశంలో ఇది 1:150. కానీ, అమెరికా వాణిజ్య ఆంక్షలతో పెద్ద ఎత్తున మౌలిక వ్యవస్థ ఏర్పాటు చేసుకోలేని దుస్థితిలో క్యూబా చికిత్స కన్నా వ్యాధినిరోధక పరిస్థితుల్నే నమ్ముకుంటుంది. అక్కడి వైద్య ప్రమాణాలకు మూలాలు విప్లవో ద్యమాల నుంచి పుట్టిన సామ్యవాద విధానాల్లో ఉన్నాయి. ఏపీలో గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ కోవిడ్‌ను ఎదుర్కో వడంలో, వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో సమర్థంగా పనికొచ్చింది. కేరళలో ప్రాథమిక–కమ్యూనిటీ వైద్య వ్యవస్థ, 67 వేల అంగన్వాడీలు, 27 వేల ఆశావర్కర్లు కీలకపాత్ర పోషించారు. ఈ పరిస్థితుల్ని దేశ వ్యాప్తం చేయాలి. కోవిడ్ ఇప్పుడప్పుడే సమిసేది కాదంటున్నారు. మనుషులకు వైరస్‌తో సహజీవనం అనివార్యమైనందున మాస్క్‌లు, శానిటైజర్లు, భౌతిక దూరాలు పాటించే క్రమంలో ఎంతో కొంత ఆరోగ్య పరిస్థితులు స్థూలంగా మెరుగవుతాయి. ఇదే అదునుగా వైద్యాన్ని పూర్తిగా ప్రభుత్వ పరిధిలోకి తెస్తే దేశ భవిష్యత్తు ఆరోగ్య దాయకంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. అంటువ్యాధుల నివారణ కోసం సిబ్బందికి, యువతకు స్వల్ప కాలిక కోర్సును కూడా రూపొందించాలి. ఏపీలో 16 కోట్ల మాస్క్‌లు తయారు చేసినట్టు ఇకపై వివిధ వైద్యోపకరణాల తయారీకి పూనుకోవాలి. వైద్యానికి ఉత్పత్తి, ఉపాధిని అనుసంధానం చేస్తే నిరుద్యోగ సమస్యను కూడా కొంత పరిష్కరించినట్టవుతుంది. కోవిడ్ నేర్పిన పాఠాలతో కొత్త ఆరోగ్య లోకాన్ని ఆవిష్కరించాలి. -దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
తల్లిభాష నిలవాలి ఇంగ్లిష్తో గెలవాలి!
తల్లి భాషమీద తెలుగువారికి భావోద్వేగం ఉన్నంత పట్టుదల లేదు. వీరభక్తి పొంగి పొర్లేపాటి వివేకం లేదు. విధిగా ఏం చేసి భాషను బతికించుకోవచ్చో వివేచన లేదు. పాలకుల్లోనూ గాలి మాటలు చెప్పడము న్నంత కార్యాచరణ లేదు. తల్లి భాషగా తెలుగు బాగుకు, భాషాభివృద్ధికి ప్రభుత్వాల పరంగా చేస్తున్నది పెద్ద బండిసున్న. రెండు వేల ఏళ్లకు పైన వాడుకలో, వెయ్యేండ్లకు పైబడి సాహిత్యంలో తెలుగు నిలిచిందంటే... కవి–పండితులు, ఇతర సాహిత్యకారులు, భాషాభిమానులు, సామాన్యుల నిరంతర కృషి, సాధన, వ్యాప్తి, వ్యవహారమే తప్ప పనిగట్టుకొని ప్రభుత్వాలు చేసిన గొప్ప మేళ్లేమీ లేవు. నిర్దిష్ట కార్యాచరణే లేదు. సర్కార్లు చేసిన మేలు లేకపోగా... అధికారుల ఆంగ్ల ఆధిపత్యధోరణి వల్ల ఇన్నాళ్లు తెలుగుకు జరిగిన ద్రోహమే ఎక్కువ! ఇక భాష వివిధ రూపాల్లోకి, మాండలి కాల్లోకి మారుతూ కూడా మౌలికంగా తన స్వభావాన్ని నిలుపుకొని ఈ నేలపై మనుగడ సాగిస్తోందంటే, అందుకు తెలుగు సమాజపు అవస రాలే కారణం. సామాన్యుల నుంచి సంపన్నులు, మహా విద్యావంతుల వరకు రోజువారీ వాడుక, వ్యవహారం వల్ల, అంతో ఇంతో వారి సాహితీ సృజన, ఆసక్తి వల్ల తెలుగు నిలిచింది. ఇప్పుడు తల్లి భాష గురించి తల్లడిల్లే వారిది, ఆంగ్ల భాషను తిట్టిపోసుకునే వారిదీ ఆవేశమే తప్ప సమగ్ర ఆలోచన కాదు. అసలు తెలుగుకు గడ్డుకాలం దాపురిం చడంలో లోపమెక్కడుందో గుర్తించే తెలివిడీ కాదు. తెలుగుపై సాను భూతి ప్రకటనలో ఆడంబరమే తప్ప కనీసం తమ పిల్లలకు తెలుగు నేర్పించడంలోనూ ఆచరణ శూన్యం! తెలుగు మాతృభాషలోనే ప్రాథ మిక విద్యాబోధన జరగాలనే వాదనలో హేతువుంది. మామూలుగా చూసినపుడు ఆ ప్రతిపాదన బాగానే కనిపిస్తున్నా... అలా చదివిన వారు ప్రాథమిక విద్యో, మాధ్యమిక విద్యో ముగిశాక ఎక్కడ మునిగి ఎక్కడ తేలుతున్నారో చూడాలి. తర్వాతి కాలంలో వారెంతగా ఆంగ్లంపై ఆధారపడాల్సి వస్తున్నదో పరిశీలించాలి. అప్పటిదాకా తెలుగులో సాగించిన విద్యాభ్యాసం తమ తదనంతర ఉన్నత విద్యకు, ఉద్యోగం–ఉపాధి పొందడానికి ఎలా ప్రతిబంధకమౌతోందో గమనిం చాలి. పదో తరగతి, ఇంటర్మీడియట్ దాటాక కూడా తెలుగు మాధ్య మంలోనే కొనసాగడానికున్న అవకాశాలు–పరిధులు, వనరులు–పరి మితులు, ఇతర సాధన సంపత్తి–కొరత ఏ స్థాయిలో ఉన్నాయో గుర్తించాలి. వాటన్నిటికీ మించి, ఉన్నత–వృత్తి విద్యా కోర్సుల్లో విధి లేని పరిస్థితుల్లో ఇంగ్లీషు మాధ్యమంలోకి మారడం వల్ల వారు ఎదు ర్కొంటున్న కష్ట–నష్టాలు బేరీజు వేయాలి. అప్పుడుగాని, మన వాళ్ల భావావేశంలో కొరవడుతున్న సంబద్ధత, తెలుగే కావాలంటూ ఇంగ్లీషు ను ఈసడించుకోవడంలో లోపిస్తున్న హేతుబద్ధత అర్థం కావు. పోటీకి సమస్థితి కల్పించాలి జర్మనీ, జపాన్, చైనా, రష్యా, ఫ్రాన్స్, ఇటలీ... ఇలా అభివృద్ధి చెందిన దేశాలను ఉటంకిస్తూ, వారంతా తల్లిభాషలో ప్రాథమిక విద్య బోధన వల్లే అత్యంత సృజనతో ఎదుగుతున్నారనే వాదన ఉంది. అది నిజమే! ప్రాథమిక విద్య తల్లి బాషలోనే సాగాలన్నప్పుడు, ఇతరేతర సదుపా యాలు, వనరుల కల్పన, సన్నద్ధత ఎంతో అవసరం. పోటీదారుల మధ్య సమ, సానుకూల వాతావరణమూ ముఖ్యమే! ఆంగ్ల–తెలుగు మాధ్యమ విద్యార్థులకు విద్య–ఉద్యోగ–ఉపాధి అవకాశాల్లో వ్యత్యాసా లకు తావులేని సమస్థితి ప్రభుత్వాలు కల్పించాలి. అవసరమైతే తెలుగు మాధ్యమ విద్యార్థులకు ప్రోత్సాహకాలివ్వాలి. రిజర్వేషన్ కల్పించాలి. ఆయా దేశాల్లో లేని ఒక విచిత్ర పరిస్థితి బ్రిటీష్ వలస దేశాల్లో ఉంది. ముఖ్యంగా భారత్ వంటి దేశాల్లో కొఠారీ విద్యా విధాన ప్రభావం వల్ల ఇంగ్లీషు చదువులొక పార్శ్వంలో వృద్ధి చెందుతూ వచ్చాయి. తెలుగు, తమిళ, కన్నడ వంటి స్థానిక భాషలకు, విశ్వ భాషగా పరిగణించే ఇంగ్లీషుకు మధ్య పోటీ వాతావరణం ఉంటుంది. పైన పేర్కొన్న అభివృద్ధి సమాజాల్లో ఈ పంచాయతీ లేదు. వారికి తల్లి భాషలోనే అన్నీ ఉంటాయి. ఆంగ్ల మాధ్యమంతో పోటీ పడే వారెవరూ ఉండరు. దేశంలోని అన్ని స్థాయిల వారికీ తల్లి భాషలోనే పోటీ! ఇక భాషాపరమైన వ్యత్యాసాలు, వివక్షకు తావెక్కడ? మన దగ్గర ఇప్పటికీ సంపన్నులు, ఎగువ మధ్య తరగతి, అంతో ఇంతో ఆర్థిక స్తోమత కలి గిన వారు తమ పిల్లలకు ఇంగ్లీషు మాధ్యమంలో విద్యా బోధన జరిపిస్తుంటారు. అది సైన్స్–టెక్నాలజీ అయినా, సామాజిక శాస్త్రా లైనా, వృత్తి కోర్సులయినా... ప్రపంచ స్థాయి విషయ వనరులు, ఆధు నిక సమాచారం, కొత్త పరిభాష ఆంగ్లంలోనే లభిస్తుంది. కానీ, తెలుగు వంటి స్థానిక భాషల్లో శాస్త్రీయ పరిశోధనల లేమి, భాష ఎదుగుదల లేకపోవడం, భాషాంతరీకరణలు, అనువాదాలు ఎప్పటికప్పుడు జర గకపోవడం, పారిభాషక పదకోశాలు, నిఘంటువులు సరిగా నిర్మాణం కాకపోవడం వల్ల విషయ వనరుల కొరత ఉంటుంది. బోధన కూడా ఆ స్థాయిలో ఉండదు. భావ ప్రసరణ నైపుణ్యాల్లోనూ వెనుకబాటుత నమే! దాంతో, ఉన్నత విద్యా ప్రవేశాలు, ఉద్యోగ నియామకాలప్పుడు ఆంగ్ల మాధ్యమ విద్యార్థులతో పోటీ పడలేని స్థితి తెలుగు మాధ్యమ విద్యార్థులకుంటుంది. ఇందుకు నేపథ్యం... పేద, దిగువ మధ్య తర గతి పిల్లలు ఆంగ్ల మాధ్యమ విద్యాబోధన దొరకని సర్కారీ బడుల్లో, తెలుగులోనే చదువుకోవాల్సి రావడం. ఒక స్థాయి దాటిన తర్వాత వారికి కష్టాలు ఎదురవుతున్నాయి. అవకాశపు తలుపులు మూసుకు పోతున్నాయి. తెలివి, చొరవ, ఆసక్తి, వాటన్నిటికీ మించి అవసరం ఉండి కూడా పోటీని తట్టుకోలేక చతికిలపడుతున్నారు. అందుకే, ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమ విద్యాబోధ నను వారు స్వాగతిస్తున్నారు. ఇవేవీ ఆలోచించకుండా సర్కారు బడుల్లో తెలుగే మాధ్యమంగా ఉండాలని, ఇంగ్లీషు మాధ్యమంగా ఉండకూడదనే వాదన సరికాదు. అది కడకు ఉన్నవారికి–లేనివారికి మధ్య దూరం పెంచడమే! అవకాశాల్లో వివక్షను పెంచి పోషించడమే అవుతుంది. పేదవర్గాలకు చెందిన తెలుగు మాధ్యమ విద్యార్థుల అవ కాశాల్ని కర్కశంగా నలిపేయడమే అవుతుంది. బతికుంచుకునే ఏ యత్నమూ జరగట్లే! భాష ఎన్నో ప్రయోజనాలు కలిగిన మానవ పనిముట్టు. ఇతర జీవుల నుంచి మనిషిని వేరుపర్చే ప్రత్యేక లక్షణం భాషది. మరే జీవీ మనిషి లాగా భాషనొక సాధనంగా మార్చుకొని తన రోజువారీ అవసరాలు తీర్చుకున్నది లేదు. భాషలెన్ని ఉన్నా... తల్లి భాష ఎంతో ముఖ్య మైంది. రోజువారీ వ్యవహారాల్లోనే కాక మనసు ప్రకటించడం, బంధా లల్లుకోవడం, వక్తిత్వ వికాసం, ఊహ పరిధి విస్తరణ, మానవ సంబం ధాల వృద్ధి... ఇలా ఎన్నెన్నో ప్రయోజనాలు భాష వల్లే సాధ్యం. ఇలా పరస్పర భావ ప్రసరణకే కాకుండా వారసత్వంగా వస్తున్న సంప్ర దాయ విజ్ఞానాలను భవిష్యత్తరాలకు అందించడానికి, భద్రపరచడా నికీ భాష సాధనం. ఐక్యరాజ్య సమితి ఫిబ్రవరి 21 అంతర్జాతీయ తల్లి భాషా దినోత్సవంగా ప్రకటించడానికి ప్రేరణ మన బెంగాలీలే! తూర్పు పాకిస్తానీయులు తమ తల్లి భాష బంగను జాతీయ భాషగా గుర్తించాలని 1952 ఫిబ్రవరి 21న ఢాకాలో ఆందోళన చేస్తున్నపుడు పోలీసులు జరిపిన కాల్పుల్లో పలువురు యువకులు బలయ్యారు. దాంతో కదిలిపోయిన పాక్ ప్రభుత్వం బంగను ఒక జాతీయ భాషగా ప్రకటించింది. తర్వాత 1971లో బంగ్లాదేశ్ ఏర్పడ్డపుడు బంగ భాషే అక్కడ అధికార భాషయింది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన తల్లి భాషను కాపాడుకునే నిర్మాణాత్మక ప్రయత్నమేదీ తెలుగు సమాజంలో జరగటం లేదు. రాను రాను తెలుగు చదివే, రాసే వారి సంఖ్య రమా రమి తగ్గిపోతోంది. తెలుగుపట్ల కొత్తతరం ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. తెలుగు నేర్చుకొండని తలిదండ్రులూ తమ పిల్లల్ని ఒత్తిడి చేయడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ప్రతి తరగతిలో తెలుగు ఒక తప్పనిసరి ‘విషయం’గా నిర్బంధం చేస్తూ ఆదేశాలి చ్చారు. ఇదివరకు అలా లేదు. తెలుగు, హిందీ, సంస్కృతం, ఇంకా ఫ్రెంచ్ తదితర భాషల్లోంచి ఏదైనా ఒకటి ఎంపిక చేసుకునే అవ కాశమిస్తూ వచ్చారు. దాంతో, తేలిగ్గా ఉంటుందని, ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చని ఏ హిందీనో, సంస్కృతమో, ఫ్రెంచో ఎంపిక చేసు కోవడం మన పిల్లలకు అలవాటయింది. దాంతో తెలుగుకు పూర్తిగా దూరమయ్యారు. ఇప్పుడు రెండు ప్రభుత్వాలు తెలుగును నిర్బంధం చేయడం వల్ల విధిగా చదవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తల్లి భాష పరిరక్షణలో ఇదో ముందడుగు. ఇంకెంతో చేయాలి ఉన్నత విద్య ప్రవేశాల్లో, ఉద్యోగ–ఉపాధి అవకాశాల కల్పనలోనూ తెలుగులో అభ్యర్థులకుండే ప్రావీణ్యానికి అదనపు వెయిటేజీ మార్కు లివ్వాలి. శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఆధునిక పరిశోధనలు, పరిణామాల సమాచారం నిరంతరం తెలుగులోకి తర్జుమా అయ్యేట్టు చూడాలి. ఇంటర్నెట్తో పాటు ఇతర సామాజిక మాధ్యమ వేదికల్లో తెలుగు అందుబాటులో ఉండేట్లు ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకోవాలి. తెలుగును ఓ ఆధారపడదగ్గ భాషగా నేటి యువతరానికి విశ్వాసం కల్పించాలి. అధికార భాషా చట్టం నిర్దేశిస్తున్నట్టు, ప్రభుత్వ ఉత్త ర్వులు, ఆదేశాలు, నివేదికలు, విధివిధానాలు, నిత్య వ్యవహారాలు... ఇలా అన్నీ తెలుగులోనే జరిగేలా కట్టడి చేయాలి. స్థానిక న్యాయ స్థానాల్లో తెలుగులోనే తీర్పులు వెలువడేలా చూడాలి. వారికెంత ఇంగ్లీష్ వచ్చినా, తెలుగువాళ్లు పరస్పరం తెలుగులోనే మాట్లాడు కోవాలి. తల్లి భాషలో మాట్లాడటాన్ని తక్కువ చేసి చూడకూడదు. మాండలికాల్ని ఆదరిస్తూనే ఓ ప్రమాణభాష రూపొందించుకోవాలి. సంపూర్ణ అక్షరాస్యత సాధనకు తెలంగాణ ప్రభుత్వం ‘ప్రతి ఒకరు మరొకరికి నేర్పండి’ (ఈచ్ వన్ టీచ్ వన్) అంటోంది. తల్లిభాష వ్యాప్తికి ఇదొక చక్కని అవకాశం. తల్లి భాష తెలుగును కాపాడుకోవ డమంటే ప్రపంచపు కిటికీ ‘ఇంగ్లీషు’ను వ్యతిరేకించడం కాదు. తెలు గును విని, మాటాడి, చదివి, రాయగలిగితే చాలు. మహా కథకుడు కొడవటిగంటి కుటుంబరావు అన్నట్టు ‘తల్లిభాషలో ఒక ఉత్తరం రాయటం చాతగాని వాడు ఎన్ని డాక్టరేట్లు సంపాదించినా నిరక్షరుడే!’ (నేడు అంతర్జాతీయ తల్లిభాషా దినోత్సవం) ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com దిలీప్ రెడ్డి -
ప్రాణం నిలిపే పోషణ ఏది?
‘మీ మిత్రులెవరో చెప్పండి, మీరేంటో నే చెబుతాన’ని ప్రఖ్యాత రచయిత బెర్నార్డ్ షా అన్నారని ప్రతీతి. ‘మీరేం తింటున్నారో చెప్పండి, మీ ఆరోగ్య భవితవ్యం మేం చెబుతాం’ అంటున్నారిప్పుడు పౌష్టికాహార నిపుణులు. మన తిండి మన ఆరోగ్యాన్ని, భవిష్యత్తును నిర్దారిస్తుంది. దేశ సౌభాగ్యాన్ని కూడా తేలుస్తుంది. నూరేళ్ల కింద, ‘... తిండి కలిగితె కండ కలదోయ్, కండ కలవాడె మని షోయ్!’ అన్న మహాకవి గురజాడ కూడా ఈ రోజున ఉండుంటే, తిండి అన్న మాటను ‘సరైన తిండి’ అని సవరించి ఉండేవాడే! ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్న సామెతను మరింత విస్తృత పరచి చూస్తే, ఒక దేశంలో తిండి, ఆహార పద్ధతులు, పరిస్థితులు ఆ దేశ సౌభాగ్యాన్ని నిర్ణయిస్తాయనొచ్చేమో! ఆయా దేశాల్లో నెలకొన్న ఆరోగ్యపరిస్థితు లను వారి ఆహార స్థితిగతులతో పోల్చి పరిశీలించినపుడు అదే నిజమ నిపిస్తుంది. భారతదేశ ప్రజల ఆరోగ్య–అనారోగ్య స్థితుగతుల్ని కాస్త లోతుగా విశ్లేషించినపుడు ఇక్కడి ఆహార సంపద, పౌష్టికాహార లభ్యత, అవకాశాల్లో అసమానత, తిండి అలవాట్లు... తీవ్రమైన ప్రభా వకాలే అని స్పష్టమౌతోంది. అందుకే ఈ అంశాల పట్ల దేశప్రజల్లో నెమ్మదిగా స్పృహ పెరుగుతోంది. ప్రభుత్వాలూ ప్రత్యేక కార్యక్రమా లతో శ్రద్ధ పెంచుతున్నాయి. మూడేళ్లుగా దేశంలో అమలు పరుస్తున్న ‘పోషణ్ అభియాన్’ అటువంటిదే! తాజాగా నిన్నటి కేంద్ర బడ్జెట్లో ఈ అభియాన్ కింద ప్రత్యక్షంగా రూ.3700 కోట్లు కేటాయిస్తే, పౌష్ఠికా హార సమృద్ధి కోసం పరోక్షంగా వివిధ శాఖల ద్వారా రూ.35,600 కోట్లు వ్యయం చేయనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో చెప్పారు. ఇప్పుడు చైనాలో అల్లకల్లోలం సృష్టించి ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్న కరోనా వైరస్, వారి విపరీత ఆహారపు అలవాట్ల వల్లే వచ్చిందన్న అభిప్రాయం విశ్వమంతా వినిపిస్తోంది. ఈ వైరస్ ఒక రకపు గబ్బిలాలు, పాముల్లోనూ ఉన్నందున, అవే ద్వితీయ వాహకా లుగా వైరస్ జనానికి వ్యాపించిందేమోనని సదరు అనుమాన మున్న మాట నిజమే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌వో) అంగీకరిం చింది. కానీ, ఆహారపు అలవాట్లవల్లే వ్యాధి ఖచ్చితంగా వచ్చి ప్రబలుతోందని నిర్దారించే ఆధారాలేమీ లేవని కూడా స్పష్టం చేసింది. ఆహారం, తిండి అలవాట్లు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయన్న దాంట్లో ఎవరికీ సందేహం లేదు. తిండి విషయంలో అతిచిన్న అంశాల్లోనూ సరైన అవగాహన దేశ ప్రజల్లో లేకపోవడం దురదృష్టకరం! పౌష్టికా హార లోపం దేశ ప్రజల ఆరోగ్యస్థితికే కాకుండా భవిష్యత్తరాలకు కూడా ఓ పెనుసవాల్ విసు రుతోంది. ఈ లోపం వల్ల బాల్యం బలిపశువుగా మారింది. తల్లులు అనారోగ్యంతో తల్లడిల్లుతున్నారు. దేశంలో రికార్డుస్థాయి మాతా–శిశు మరణాలకు పౌష్ఠికాహార లోపమే ప్రధాన కారణం. ‘ఇది న్యూట్రీషన్ బడ్జెట్’ అని కేంద్ర ప్రభుత్వం జబ్బలు చరుస్తున్నా... అతి సాధారణ విషయాల పట్లా సగటు పౌరుల్లో గూడుకట్టుకున్న అవగాహనా లేమి పాలకులను, ప్రణాళికా నిపుణుల్ని ఇంకా వెక్కిరిస్తూనే ఉంది. అసమానతలు తగ్గి, అవకాశాలు పెరగాలి మేటి పారిశ్రామికవేత్త రతన్ టాటా ఓ ఆంగ్ల దినపత్రికలో బుధవారం ఒక వ్యాసం రాశారు. దేశంలో ఈ దశాబ్ది (2020–30) అన్ని లోపా లను అధిగమించేదిగా నిలవాలని, అందుకీ దేశాన్ని పౌష్టికాహార సమృద్ధంగా తీర్చిదిద్దితేనే అది సాధ్యమని అభిప్రాయపడ్డారు. అంత రాలు తగ్గాలని, ముఖ్యంగా సమాజపు వివిధ స్థాయి పౌరుల మధ్య ఆహారపు అవకాశాల అంతరం ప్రమాదకరంగా ఉందనీ ఆయన న్నారు. ఫలితంగా లక్షలాది శిశువుల్ని కోల్పోవడం, గర్భిణుల్ని పోగొ ట్టుకోవడం, తల్లులు ఆరోగ్యవంతమైన పిల్లల్ని కనలేని దుస్థితి బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తినాల్సిన ఆహారం తగినంత తినకపోవడం, మోతాదుకు మించి తినడం, ఒంటికి సరిపడని ఆహారం తినడం. అసలేమీ తినకపోవడం... వీటివల్లే పౌష్టికాహార లోపమని చెబుతారు. మన దేశంలో దాదాపు 20 కోట్ల మంది ఈ దుస్థితిలో ఉన్నారు. ఇది ప్రపంచంలోని పౌష్టికాహార లోప జనాభాలో మూడో వంతు! ఈ కారణంగానే ఏటా 25 లక్షల మంది అర్ధాం తరంగా తనువు చాలిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో చూసిన పుడు తక్కువ బరువు, తక్కువ ఎత్తు, తక్కువ స్వస్థత, తక్కువ మెదడు వికాసంతో పుట్టే పిల్లల సంఖ్య దేశంలో పెద్ద మొత్తంలో ఉంటోంది. ఈ రకం పిల్లల్లోనే అత్యధికులకు అయిదేళ్లలోపు ఆయువు తీరుతోంది. అయిదేళ్ల తర్వాత కూడా సరైన పౌష్టికాహారం లభించక జరిగే బాల్య మరణాలెన్నో! దేశం యువ భారత్ అని మనం గంభీరంగా చెప్పు కుంటున్నా... దేశంలో బాలల సంఖ్య ఏయేటి కాయేడు తగ్గిపోతోంది. దేశంలో 6–15 సంవత్సరాల మధ్య వయస్కుల్నే (ప్రాథ మిక–ఉన్నత విద్యా స్థాయి) తీసుకుంటే, ఈ సంఖ్య ఏటా తగ్గిపోతు న్నట్టు విద్యా శాఖ గణాంకాల్లో ఉంది. మొత్తం జనాభాలో 14 ఏళ్లలోపు వయస్కుల సంఖ్య 29.5 శాతం ఉన్నట్టు 2011 జనాభా లెక్కలు చెబుతున్నాయి. కానీ, ఇదే వయస్కులు 1971లో, నాటి మొత్తం జనాభాలో 41.2 శాతంగా ఉన్నారు. అప్పట్నుంచి ప్రతి పదేళ్ల జన గణనలోనూ ఇది తగ్గుతూ వస్తోంది. వృద్ధి రేటును నియంత్రించి జనాభా కట్టడిలో మనం సాధించిన సత్ఫలితాల వల్ల ఇలా జరిగి ఉండొచ్చు! పుట్టకపోతే అదో పద్ధతి. కానీ, పుట్టి నేలపైకి వచ్చిన అరు దైన, అపురూపమైన మానవవనరుల్ని పౌష్టికాహారం అందించలేక కోల్పోవడం కన్నా దురదృష్టకర పరిస్థితి ఇంకోటుండదు. చిత్తశుద్ధితోనే అవగాహన వృద్ధి ఆహారం సరిపోని పరిస్థితి వేరు! కానీ, ఏ ఆహారం ఏ పాళ్లలో తినాలో తెలియక ప్రాణాలమీదకు తెచ్చుకోవడం ఆందోళన చెందాల్సిన అంశం. పిల్లలు, తల్లుల్లోనే కాకుండా అన్ని వయస్కుల్లోనూ నేటి అనారోగ్య పరిస్థితులకు ప్రధాన కారణం పౌష్టికాహార లోపమే! తిండి, అందులో ఉండాల్సిన పోషక విలువలు, వాటి సమతుల్యతపై కనీస అవగాహన లోపించడం వల్లే ప్రమాద పరిస్థితులు. అందుకే, ‘కరోనా’ ఉపద్రవ నేపథ్యంలో డబ్లుహెచ్‌వో ఓ హెచ్చరిక చేస్తోంది. సరైన ఆహారం, ముందు జాగ్రత్తలకు కొన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తే సరిపోయే దానికి, నిర్లక్ష్యం చేసి తర్వాత వైద్యారోగ్యం కోసం వేల, లక్షల కోట్లు వ్యయం చేయాల్సిన పరిస్థితి తెచ్చుకోకండి అన్నది ఆ హెచ్చరిక సారాంశం. ఏ వైద్య పరీక్షలు చేయకుండానే ఈ దేశంలో ప్రతి ముగ్గురు మహిళల్లో ఇద్దరికి రక్త హీనత ఉందని చొప్పొచ్చు. ఏ ప్రమాణాలతో లెక్కించినా మహిళల్లో 65 శాతానికి తగ్గకుండా రక్తహీనత (సాధారణ, మధ్య, తీవ్ర స్థాయి)తో బాధపడుతున్నట్టు వైద్య గణాంకాలు చెబుతాయి. రోజుకు ఒక మైక్రోగ్రామ్ ఇనుము (అంటే 50 గ్రాములకు తగ్గకుండా ఏ ఆకు/కాయ కూరలో) తీసు కుంటే జీవితంలో రక్తహీనత వచ్చే ఆస్కారమే ఉండదు. ఈ విషయాన్ని గ్రహించలేని స్థితిలో సగటు పౌరులుంటారు. ప్రజల్లో కనీస అవగాహన కలిగించే వాతావరణం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వారి ఆర్థిక పరిస్థితికి లోబడి సమృద్ధ పౌష్టికాహారాన్ని తీసుకునే వీలున్నా ప్రాధాన్యతలు తెలియవు. ఆశా, అంగన్వాడీ కార్య కర్తలు చేయాల్సిన ప్రధాన విధి ఇదే! కానీ, అది ఆశించిన స్థాయిలో జరగదు. సర్వత్రా అవినీతి, నిర్లక్ష్యం, నియం త్రణ లోపం తాండ విస్తుంది. తినొద్దని వైద్యులు, ఆహార నిపుణులు చెప్పే ‘జంక్‌ఫుడ్’ తినండని చేసే కార్పొరేట్ ప్రచారం కొన్ని కోట్ల రూపాయలతో జరుగుతుంది. సంప్రదాయ మీడియా, సోషల్ మీడియా వేదిక నుంచి కుమ్మేసే ఈ ప్రచారం ముందు మన ప్రభు త్వాలు చేసే పౌష్టికాహార ప్రచార కార్యక్రమాలు ఎల్యీడీ బల్పుల ముందు కొవ్వొత్తి దీపాల్లా వెలవెలబోతాయి. ప్రణాళికాబద్ధ కార్యక్ర మాలతో ఈ దేశంలో 27 కోట్ల మందిని దారిద్య్రరేఖ దిగువనుంచి పైకి తెచ్చి పేదరిక నిర్మూలన చేయడం ఘన విజయమే! పౌష్టికాహార లోపాన్ని అధిగమించే కృషి కూడా వ్యూహం, చిత్తశుద్దితో జరగాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్దతో రూ. 344 కోట్ల అదనపు నిధుల్ని కేటాయించి బడి పిల్లల మధ్యాహ్న భోజనాన్ని మరింత నాణ్యం, సమృద్ధం చేసింది. అంగన్ వాడిల ద్వారా పిల్లలు, గర్భిణిలకు పౌష్టికాహారం అందించే కార్య క్రమాన్ని మెనూ మార్చి మరింత పకడ్బందీగా నిర్వహిస్తోంది. ఆహ్వానించదగ్గ ఈ చొరవను ఇతర రాష్ట్రాలూ అందిపుచ్చుకోవాలి. కేంద్రం, రాష్ట్రాలు పరస్పర సహకారం, అవగాహనతో బాధ్యతగా ఈ కృషి చేపట్టాలి. భారత రాజ్యాంగం నిర్దేశించిన ఆదేశిక సూత్రాల (అధికరణం 47) ప్రకారం పౌష్టికాహార ప్రమాణాలను పెంచడం ప్రభుత్వ నిహిత బాధ్యత. తద్వారా పౌరుల ఆరోగ్య రక్షణ, జీవన ప్రమాణాల వృద్ధి ప్రభుత్వాల ప్రాథమిక కర్తవ్యం. ఆరోగ్యానికి హానికరమైన ఆహార పదార్థాలు, పానీయాలు, డ్రగ్స్ వంటి వాటిని నిషేధించే అధికారం కూడా ఈ అధికరణం ద్వారా ప్రభుత్వానికి సంక్రమించింది. సుస్థిరాభివృద్ధి సాధనలో మూలసూత్రమిదే! ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 అంశాల సుస్థిరాభివృద్ది లక్ష్యాల్లో తొలి మూడు ఏదో రకంగా పౌష్టికాహారంతో ముడివడి ఉన్నవే! ప్రపం చంలో ఏ మూల, ఏ రూపంలో ఉన్నా పేదరికాన్ని నిర్మూలించాలి. ఎవరి పౌష్టికాహారానికి పేదరికం అవరోధం కాకూడదు. ఇక రెండో లక్ష్యం, ఆకలిని పూర్తిగా నిర్మూలించాలి. ప్రతి తొమ్మిది మందిలో ఒకరు ఆకలితోనే రాత్రి పడక ఎక్కుతున్నారు. ఇక మూడోది.. అన్ని వయసులకు చెందిన ప్రజలంతా ఆరోగ్యంగా, హాయిగా ఉండాలి. ఆరో లక్ష్యం అందరికీ రక్షిత నీరు, పదో లక్ష్యం అసమానతలు తగ్గిం చడం... ఇవన్నీ కూడా పౌష్టికాహార కల్పన వల్ల సాధ్యపడేవే. ప్రజలు అవగాహన పెంచుకోవడమే కాకుండా స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం, వరుస ప్రభుత్వాలు ఈ కృషిలో మొక్కవోని దీక్షతో ముందుకు కదిలితేనే లక్ష్యం సుసాధ్యం! ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com దిలీప్ రెడ్డి -
ప్రశ్నను చిదిమే పన్నాగం!
ఈ దేశ యువత సామాజిక స్పృహతో మళ్లీ చైతన్యమౌతోందా? ఒకింత ఆశ కలుగు తోంది. రాజకీయ శక్తుల చేతుల్లో పావుగా మారి జారిపోతోందా? కాస్త భయం కలు గుతోంది. రెండు పార్శా్వల నడుమ ఏదో సంఘర్షణ సంకేతాలు వెలువడుతున్నాయి. దేశవ్యాప్తంగా నేడు నెలకొన్న వివాద పరి స్థితుల్లో యువతరం, ముఖ్యంగా విద్యార్థి లోకం నడక భిన్న వైఖరుల్ని వెల్లడి చేస్తోంది. ఏవో శక్తులు దూరం చేస్తున్న తమ భవిష్యత్తును, వెనక్కి లాక్కో వాలనే స్పృహ యువతలో కనిపిస్తోంది. ఈ మొగ్గు నిజంగా ప్రజా స్వామ్య పరిరక్షణ వైపు సాగితే, దేశ భవిష్యత్తు ఆశావహంగా ఉండటం ఖాయం! మరో రెండు రోజుల్లో జాతీయ యువజన దినో త్సవ (స్వామీ వివేకానంద జయంతి) వేడుకలకు అంతటా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘యువత రోజుకై నినాదం’ అన్నది ఈ యేటి (2020) అంశంగా నిర్ణయించారు. మరో పక్క దేశం వివిధ ప్రాంతాల్లో నిరసనోద్యమాలు, అసమ్మతి ప్రదర్శనల్లో యువత కీలకపాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా యువతకు నెలవైన పలు విశ్వవిద్యాలయాలు నిప్పురవ్వలై రగులుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ (జేఎన్‌యూ) ప్రాంగణంలో చిందిన నెత్తుటి తడి ఇంకా ఆరనే లేదు. దాడి చేసిన ముష్కర మూకల ఆనవాళ్లున్నా దోషుల జోలికెవరూ వెళ్లటం లేదు! వెంటనే చర్యలు తీసుకోవాలనే ఆందోళనలు ఆగటం లేదు. సినీనటి దీపికా పడుకొనే ఈ దేశపు యువతరానికి ప్రాతినిధ్యం వహిస్తారో లేదో గానీ, ఆమె ఆలోచనలు నేటి యువత మారుతున్న భావజాలానికి సంకేతం కాకుండా పోవు. జేఎన్‌యూలో విద్యార్థులు –టీచర్లపై దాడిని నిరసిస్తూ ఆమె సరాసరి విశ్వవిద్యాలయానికి వెళ్లి వారిని పరామర్శించడం దేశ వ్యాప్త చర్చకు తెరలేపింది. సగానికి పైగా జనాభా యువతరంతో నిండిన అతి పెద్ద దేశంగా ప్రపంచ పటంలో పతాకం ఎగురుతున్న కీర్తి మనది. వచ్చే ఒకటి, రెండు దశాబ్దాల్లో విశ్వవ్యాప్తంగా అత్యధిక పనివాళ్లున్న దేశంగా పీఠం మనకే దక్కనుంది. ఈ పరిస్థితుల్లో మన యువత ప్రస్తుత ఆలోచనా ధోరణి నిస్సందేహంగా భవిష్యత్తును శాసించేదే! అందుకే, ఈ దేశపు మేధావి వర్గమంతా యువత అడుగుల్ని, నడకని, గమనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. భవిష్యత్తుకు భరోసా వెతు క్కుంటున్నారు. కొత్తగాలి దేనికి సంకేతం? పౌరసత్వ చట్ట సవరణ (సీఏఏ), జాతీయ పౌరసత్వ నమోదు (ఎన్నార్సీ) ప్రక్రియకు వ్యతిరేకంగా జరుగుతున్న విద్యార్థి ఆందో ళనల విస్తృతి వారి ఆలోచనా దోరణిని ప్రతిబింబిస్తోంది. విశ్వవిద్యా లయాల్లోని సామాజిక శాస్త్రాల వారే కాక న్యాయ, వైద్య, ఇంజ నీరింగ్, ఎంబీయే వంటి వృత్తి కోర్సుల విద్యార్థులూ వీధుల్లోకొ చ్చారు. తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటూ కూడా స్పష్టమైన వైఖరినే వెల్లడిస్తున్నారు. రాజధాని ఢిల్లీలోని జేఎన్‌యూ, జామియా వంటి చైతన్యస్రవంతి సంగతి సరేసరి! అహ్మదాబాద్‌లోని ఐఐఎమ్ విద్యా ర్థులు చేతుల్లో రాజ్యాంగ ప్రతిని పట్టుకొని సామూహికంగా ‘రాజ్యాంగ పీఠిక’ బహిరంగ పఠనకు సిద్ధమయ్యారు. మరో రోజు, పోలీసు లాఠీలనెదుర్కొంటూ కొవ్వొత్తులతో మౌన ప్రదర్శన చేశారు. పుణే లోని ఫిల్మ్–టెలివిజన్ సంస్థ, బరోడా సాయాజీరావ్ విశ్వవిద్యా లయ లలితకళల విభాగం, ఢిల్లీ అఖిల భారత వైద్య విజ్ఞానాల సంస్థ (ఎయిమ్స్)ల విద్యార్థులు ప్రస్తుత ఉద్యమాలకు దూరంగా లేరు. దూసుకొని వెళ్తూ స్పష్టమైన తమ వైఖరి, వ్యక్తీకరణతోనే ఉన్నారు. స్వతహాగా నిరసన గళాలు వినిపించే మార్గాలు వెతుక్కుంటున్నారు తప్ప, రాజకీయ పార్టీలు చూపే దారుల్లో నడిచేందుకు వారు సిద్ధంగా లేరు. లక్నోలో ఒక విద్యార్థిని జాతీయ టీవీ మీడియాతో మాట్లా డుతూ, ‘మేం చెప్పే లౌకిక వాదమంటే, ఏదో.. ఫలానా... రాజకీయ పార్టీ వల్లించే కుహనా లౌకికవాదం కాదు, మహాత్మాగాంధీ ఆశించి నట్టు, భిన్నమతాల వారు కలిసి సాగించే సయోధ్య–సహజీవన వాదం...’ అని పలికిన స్వరం గంభీరంగానే కాదు, నిజాయితీగానూ ఉంది. ఇంతటి సంక్లిష్ట సమయంలో గాంధీ ప్రస్తావన ఓ సాను కూలాంశం. అస్సాంలో కొత్త జవజీవాలు నింపుకున్న అఖిల అస్సాం విద్యార్థి సంఘం (ఆసు) నిరసన భయానికి ప్రధాన మంత్రి పర్యటన రద్దయినట్టు ప్రకటన వెలువడింది. ప్రస్తుత విద్యార్థి లోకం చేస్తున్న వ్యక్తీకరణలు ఏ విద్యాసంస్థలకో, పార్టీ సిద్ధాంతాలకో, మత–కుల వర్గ సమూహాలకో పరిమితమైన భావజాలంలా లేవు. దేశ చారిత్రక నేపథ్యాన్ని, రాజ్యాంగం అక్షరబద్ధం చేసిన ప్రజాస్వామ్య స్ఫూర్తినీ, నిజమైన లౌకకవాదపు పునాదుల్నీ ప్రతిబింబించేవిగా ఉండటం ఆహ్వానించదగ్గ పరిణామం! కొత్తగా తెస్తున్న చట్టాల కన్నా, పాత చట్టాలకు చేస్తున్న మార్పుల కన్నా ప్రభుత్వాల నియంతృత్వ ధోరణుల్ని తప్పుబడు తున్నారు. ప్రజల నిరసన సహించని అసహనాన్ని వారెక్కువగా వ్యతిరేకిస్తున్నారు. అసమ్మతి గళాల్ని తొక్కేసే పాలకుల ధోరణిని నిశితంగా నిరసిస్తున్నారు. ‘ఎందుకిలా?’ అని ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ లోని లజపతినగర్లో కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షా ఇల్లిల్లూ తిరిగి ప్రచారం చేస్తున్నపుడు ఒక అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి బ్యానర్‌తో నిరసన ప్రదర్శన, నినాదాలు చేసిన యువతి సాహసం ఇందుకొక ఉదాహరణ! ఇంటి యజమానిని అడ్డుపెట్టి, 24 గంటల్లో ఆమె ఉంటున్న అద్దె ఇల్లు ఖాళీ చేయించడం పాలకుల దమననీతికి పరాకాష్ట! ఆధిపత్యం కోసం అరాచకం జేఎన్‌యూలో విద్యార్థి వివాదాలు, భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణలు కొత్త కాదు. సాంస్కృతిక, రాజకీయ, సామాజికార్థికాంశాలపై లోతైన చర్చలు, వాదోపవాదాలు ఇక్కడ నిత్యకృత్యం. పాలకుల విధానాలపై ఓ ఆరోగ్యవంతమైన చర్చకు వేదికై, దేశమంతటికీ లోతైన భావాలు వ్యాప్తి చేసే కేంద్రమై అర్ధ శతాబ్ద కాలంగా విరాజిల్లుతోంది. కానీ, అక్కడ గత ఆదివారం జరిగింది ఓ దుర్మార్గమైన చర్య. ఒక విద్యార్థి సంఘం వారు బయటి గూండాలను ముసుగులతో తీసుకువచ్చి, పాలకుల విధానాల్ని వ్యతిరేకిస్తూ నిరసిస్తున్న విద్యార్థులు–బోధకు లపై హాకీ స్టిక్స్, క్రికెట్ బ్యాట్లు, ఇనుప రాడ్లతో జరిపిన పాశవిక దాడి దారుణం. విశ్వవిద్యాలయ భద్రతా సిబ్బంది కనిపించకుండా పోతే, పోలీసులు మౌన ప్రేక్షక పాత్ర వహించారు. ఈ దుర్నీతిని ప్రజా స్వామ్య వాదులంతా ఖండించారు. ముసుగుల వెనుక ముఖాలు దాచుకున్న ముష్కర మూకకు జేఎన్‌యూ ఔన్నత్యమేమి తెలుసు? వివాద సంక్షోభం తలెత్తిన ప్రతిసారీ, భారతావనికి ప్రత్యామ్నాయ ఆలోచనాధారను అవి రళంగా అందించిన జ్ఞాన కేంద్రం జేఎన్‌యూ అని తెలుసా? మూకలే కిరాయివా? వారిని తీసుకువచ్చిన విద్యార్థి విభాగాలూ భావపరమైన రాజకీయ దాస్యంలో మగ్గుతున్నాయా? అనే సందేహాలు వ్యక్తమౌతు న్నాయి. ప్రత్యర్థులూ మరో రాజకీయ పక్షానికి ప్రతినిధులనే ప్రత్యా రోపణలూ ఉన్నాయి. ఆ సందేహాలే, చిగుళ్లు తొడుగుతున్న సరికొత్త ఆశలను చిదుముతున్నట్టనిపిస్తోంది. ఆయా విద్యార్థి సంఘాలను రాజకీయ పక్షాలు వెనుకేసుకొస్తున్న ధోరణి అనుమానాలకు తావి స్తోంది. ప్రశ్నించే తత్వం విస్తరించి, చైతన్యం వెల్లివిరిసే వేళ విద్యార్థి లోకాన్ని రాజకీయ శక్తులు మళ్లీ తమ గుప్పిట్లోకి లాక్కుంటు న్నాయా? అనే భయ–సందేహాలు కలుగుతున్నాయి. రాజకీయాల కతీతంగా అక్కడక్కడ పెల్లుబికే స్వేచ్ఛా–స్వతంత్ర వాదనలు ఆశలు రేపుతున్నాయి. ప్రశ్నే ప్రజాస్వామ్యానికి వన్నె! చైతన్య దీపికలుగా వెలగాల్సిన విశ్వవిద్యాలయాలను ఇటీవలి కాలంలో ప్రభుత్వాలు గుడ్డి దీపాలు చేస్తున్నాయి. అణుమాత్రం వ్యతి రేకతనూ అంగీకరించే స్థితిలో లేవు. అందుకే, విద్యా విషయంగా, నిర్వహణ రీత్యా, ప్రవేశాల పరంగా... అన్ని విధాలా వాటిని నిర్వీర్యం చేస్తున్నాయి. విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచనా సరళి, స్వేచ్ఛా భావధారను మొగ్గలోనే చిదిమేస్తున్నాయి. సమాజంలో సంఘర్షణను ఎదుర్కొనే, ప్రశ్నించే సామాజిక వర్గాలకు అక్కడ తావులేని స్థితి కల్పిస్తున్నాయి. మేలిమైన ఉన్నత విద్యకు వారిని క్రమంగా దూరం చేస్తున్నాయి. రిజర్వేషన్ల కోత విధించి, రమారమి ఫీజులు పెంచి, సంఘర్షణతో ఆధిపత్యం సాధించి అల్పాదాయ, మధ్య తరగతిని అక్కడికి రానీకుండా చేస్తున్నాయి. ప్రశ్నించకుండా అన్నిటికీ ఊ కొట్టే, కడుపు నిండిన ఉన్నత–సంపన్న వర్గాల వారికే అవి అందుబాటులో ఉండేట్టు చేస్తున్నాయి. ఈ ప్రక్రియలన్నింటి వెనుక కుట్ర దాగుందని మేధావివర్గం భావిస్తోంది. ఇప్పుడు జెఎన్యూలో తాజా వివాదం కూడా అక్కడే మొదలయింది. విద్యార్థి లోకం, ఇతరేతర యువతరం ఈ గుంజా టన నుంచి బయటపడాలి. స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఆలోచించాలి. ప్రశ్నించే తత్వానికి మరింత సానపెట్టాలి. నిరసన తప్పు కాదు. ప్రజాస్వామ్య పరిధిలో అసమ్మతి వ్యక్తీకరణ నేరమూ కాదు. మానవేతిహాసం మొదలైన్నుంచీ నిరసన, అసమ్మతికి తావుంది. వేద కాలం, పురాణ–ఇతిహాస కాలంలోనూ తప్పలేదు. భిన్నాభిప్రా యాలకు తావుంది కనుకే... విభీషణ విభేదమైనా, రామాంజనేయ– కృష్ణార్జున యుద్ధాలెనా జరిగిందందుకే! ‘నేనేదైనా చేయగలను!’ అనుకోవాలి. ‘పట్టుదలతో నిరాకరిస్తే, పాము విషం కూడా పని చేయకుండా పోతుంది’ అన్న స్వామీ వివేకానందుడి మాటలే నేటి యువతకు స్ఫూర్తి కావాలి! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
వివక్ష విసిరిన భయోత్పాతం
ఆపత్కాలంలో తన తోక కొసను తానే శరీరం నుంచి విడగొట్టుకోగలిగే ప్రత్యేక లక్షణం బల్లికి ఉంది. అలా విడివడిన తోక భాగం గిలగిలా కొట్టుకుంటుంటే అప్పటి వరకు తనను వెంటాడిన శత్రువు క్షణాల పాటు విస్మయానికి గురౌతుంది. అదే అదునుగా... సదరు బల్లి శత్రువుకి చిక్కే గండం తప్పించుకొని మెల్లగా సురక్షిత ప్రాంతానికి జారుకుంటుంది. మొండి శరీ రానికి మళ్లీ తోక మొలిచి బల్లి మామూలు స్థితికి వస్తుంది, అది వేరే విషయం! పాలకులూ ప్రధానమైన ప్రజాసమస్యలు, తాము నేరుగా బాధ్యత వహించాల్సిన ముఖ్యాంశాల నుంచి జనం దృష్టి మళ్లిం చేందుకు ఇతరేతర విషయాల్ని తెరపైకి తెస్తుంటారు. అది గ్రహించని సాధారణ ప్రజలు, విద్యావంతులు, సమకాలీన ప్రసారమాధ్యమా లతో సహా... అలా తెరపైకి తీసుకువచ్చిన అప్రస్తుత అంశాల చుట్టే తిరుగుతూ, జనాల్ని తిప్పుతూ ఉంటారు. దాంతో అసలు సమస్యలు చర్చకు రాకుండా మరుగున పడిపోతుంటాయి. ఇది మన ప్రజాస్వా మ్యంలో ఇటీవల రివాజుగా మారింది. జాతీయ పౌర నమోదు పట్టి (ఎన్నార్సీ), పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) విషయంలో జరుగు తున్న రగడ కూడా అటువంటిదేనేమో! అన్న భావన మొదట కలిగినా, అంతకన్నా ఎక్కువ ప్రమాద సంకేతాలే ఇప్పుడు కనిపిస్తు న్నాయి. మొదట దీన్నొక దృష్టి మళ్లింపు చర్యగా పలువురు భావిం చడానికి బలమైన కారణాలే ఉన్నాయి. దేశ ఆర్థిక పరిస్థితి దిగ జారడం, వార్షిక ఆర్థికాభివృద్ధి రేటు పడిపోయి 5–4 శాతం మధ్య కొట్టుమిట్టాడటం, నిరుద్యోగ సమస్య జఠిలమవడం, వ్యవసాయం కునారిల్లడం... వంటి వైఫల్యాల నుంచి జనం దృష్టి మళ్లించడానికి కేంద్రం చేపట్టిన చర్యనేమో అనుకున్నారు. కానీ, ఎన్నార్సీ అమలుకు పూర్వ రంగంగా ఇప్పుడు జాతీయ జనాభా నమోదు పట్టి (ఎన్పీఆర్) తయారీకి నడుం కట్టడంతో, ఎన్నార్సీ అమలుకే కేంద్రం కట్టుబడినట్టు రూఢీ అయింది. ఈ విషయంలో ఎన్డీయే ప్రభుత్వ పెద్దల మాటలకు, చేతలకు పొంతనలేనితనం సందేహాలకు తావి స్తోంది. మత ప్రాతిపదికన వివక్షాపూరిత విధానాలతో ఈ ప్రక్రియ చేపడుతున్నారనే విమర్శతో దేశవ్యాప్త నిరసనలు చెలరేగుతు న్నాయి. భారతీయ ముస్లీంలలో ఒక విధమైన భయాందోళనలకు ఇది కారణమౌతోంది. ఈ విషయంలో దేశ ప్రజల, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయ ఝరి రెండు పాయలుగా చీలింది. ఎనార్సీ, సీఏఏ, ఎన్పీఆర్ ఒకటికొకటి సంబంధం లేనివిగా చెబుతున్న కేంద్ర ప్రభుత్వపు మాటలూ నిజం కాదు. చర్చించలేదంటే.....!? రాజకీయాల్లో కొన్నిసార్లు వ్యూహాత్మక వెనుకడుగు సహజమే! పాల కులు తమ ఆలోచనల్ని శైశవ దశలోనే జనబాహుళ్యంలోకి వదిలి, స్పందనను బట్టి ముందుకు సాగటమో, వెనక్కి తగ్గటమో చేస్తుం టారు. ఎనార్సీ విషయంలోనూ బీజేపీ నాయకత్వం ఇదే పంథా అనుసరిస్తోందేమో అనుకున్నారు. అసోమ్‌లో చేసినట్టు, దేశమం తటా అమలు చేస్తామని ముందు పార్లమెంట్ వేదిక నుంచి, బయటా చెప్పిన వారే దేశ వ్యాప్త నిరసనలు చూసి, ‘మేమసలు చర్చించనే లేద’ంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనని ధృవీ కరిస్తూ హోమ్ మంత్రి, బీజేపీ అధినేత అమిత్‌షా మాట్లాడారు. కానీ, స్పష్టత కొరవడింది. ఆలోచించలేదన్నారు కదా! పోనీ, ‘అమలు తలంపు లేదు’ అంటున్నారా? అంటే, అనటం లేదు. అందుకే, నిరస నలు పెల్లుబికి సర్వత్రా నిప్పు రగులుతూ ఉంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు తాము ఎన్నార్సీ అమలు పరిచేది లేదని కరాఖండిగా ప్రకటించాయి. తాజాగా జాతీయ జనాభా నమోదు పట్టి (ఎన్పీఆర్) రూపొందించే ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. దీనికోసం ప్రత్యేకంగా బడ్జెట్ పెట్టడమే కాకుండా వచ్చే సంవత్సరం ఏప్రిల్– సెప్టెంబరు మధ్య ఈ ప్రక్రియ పూర్తిచేయాలని మంత్రివర్గం ఆమో దించింది. ఈ చర్యలతో సర్కారు వైఖరి స్పష్టమైంది. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకత రాగానే, ఎన్నార్సీకి, సీఏఏకి సంబంధం లేదని ఇన్నాళ్లు చెబుతూ వస్తున్న ప్రభుత్వం ఇప్పుడు ఎన్నార్సీకి, ఎన్పీఆర్కు సంబంధం లేదని చెబుతోంది. ఈ వాదనే విచిత్రం. ఇవన్నీ ఒక తాను (పౌరసత్వ చట్టం–1955) ముక్కలే! కేంద్ర ప్రభుత్వ పెద్దలు, మంత్రులు లోగడ చేసిన అధికారిక ప్రకటనకు తాజా వాదన పూర్తి విరుద్దం! హోమ్ మంత్రిత్వ శాఖవారు లోగడ (2014 కు పూర్వం, తర్వాత కూడా) లోకసభలో పలు సందర్భాల్లో... ఎన్నార్సీ అమలుకు ఎన్పీఆర్ తొలిమెట్టని సెలవిచ్చారు. రెండు వేర్వేరు ప్రక్రియలే అయినా, ఒకదానితో ఒకటి ముడివడి ఉన్న వ్యవ హారాలే! సాపేక్షంగా చెప్పాల్సి వస్తే.... పిండి పిసకటం, రొట్టె కాల్చడం రెండూ ఒకటి కాదు. వేర్వేరనే మాట నిజమే! కానీ, పిండి పిసికేది దేనికి? రొట్టె కాల్చడానికి కాదా? మరి సంబంధం లేదని ఎలా అనగలం? కాంగ్రెస్ సందిగ్దతకు కారణమేంటో! మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ భాగస్వామ్యంతో ఉన్న మహా రాష్ట్ర ప్రభుత్వాధినేతలు... తాము ఎనార్సీ అమలుపరచమని ప్రకటిం చారు. అలా ప్రకటించిన మమతా బెనర్జీ (పశ్చిమబెంగాల్), వైఎస్ జగన్మోహన్రెడ్డి (ఆంధ్రప్రదేశ్), నితీష్‌కుమార్ (బీహార్), నవీన్ పట్నాయక్ (ఒడిశా) తదితర ముఖ్యమంత్రులు వేర్వేరు పార్టీలకు స్వయంగా అధినేతలు. కాంగ్రెస్ విషయానికి వస్తే పరిస్థితి భిన్నం. ఢిల్లీ అధినాయకత్వం విధాన ప్రకటన చేయాలి. ఎన్నార్సీని ఇంతగా ప్రతిఘటిస్తున్న కాంగ్రెస్ అధినాయకత్వం, తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దీన్ని అమలుపరచబోమని ప్రకటించడం లేదు. ఇది, అదు నుగా బీజేపీ నాయకత్వం కాంగ్రెస్‌పైనే బాణాలు ఎక్కుపెడుతోంది. పౌరసత్వ ప్రస్తుత సవరణ చట్టం మూలాలు 2003 సవరణలోనే ఉన్నాయి. పౌరసత్వ చట్టం–1955ను నాటి వాజ్‌పేయి ప్రభుత్వం సవరించింది. దశాబ్ద కాలం (2004–14) అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎందుకీ సవరణల్ని తొలగించలేదని అడుగుతున్నారు. నాటి యూపీఏ ప్రభుత్వం (2010–11) ఎన్పీఆర్ జరిపినా ఎన్నార్సీకి సాహసించలేదు. 2014 తర్వాత పార్లమెంటులోనే పలు సందర్భాల్లో తాము దేశవ్యాప్త ఎన్నార్సీ, ఎన్పీఆర్లతో వెళతామని ఎన్టీయే పాల కులు విస్పష్టంగా చెప్పినా కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకించలేదు? అనే ప్రశ్న సంధిస్తున్నారు. అందుకేనేమో, కాంగ్రెస్ ప్రస్తుత సంకట పరి స్థితి! కానీ, ఇప్పుడు వివాదమంతా వాజ్‌పేయి నేతృత్వంలో (2003) జరిగిన పౌరసత్వ సవరణ చట్టంపైనే అన్నది గుర్తెరగాలి. దాని ప్రకారం, భారత పౌరుల్ని లెక్కించి ఎన్పీఆర్ రూపొందిస్తారు, లెక్కిం చిన పౌరుల పౌరసత్వాన్ని ప్రభుత్వం గుర్తించాలి. అలా గుర్తింపు పొందిన పౌరులంతా మరో అధికారిక పత్రం ‘జాతీయ భారత పౌర నమోదు పట్టి’ (ఎన్ఆర్ఐసీ)లో భాగమవుతారు. దాన్నే మనమిపుడు ఎన్నార్సీ అంటున్నాం. ఈ ప్రక్రియ మధ్యలో, లెక్కించిన పౌరుల గుర్తింపునకు తాజా పౌరసత్వ సవరణ చట్టం–2019 ప్రాతిపదిక అవుతుంది. అదే తాజా వివాదానికి ఆజ్యం పోస్తోంది. ఎందుకంటే, తాజా సవరణల్లో పొందుపరిచిన ప్రాతిపదికలే వివాదాస్పదంగా, వివక్షాపూరితంగా ఉన్నాయి. ఇక, ఒకటికొకటి సంబంధం లేదనే వాదనకు అర్థమే లేదు. సవరణ–ప్రాతిపదికలతోనే తంటాలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాం 2010–11లో జరిగిన ఎన్పీఆర్కి, ఇప్పుడు జరుపబోయేదానికి ఎంతో వ్యత్యాసముంది. సవరణ చిన్న దిగా కనిపిస్తున్నా, ఎన్నార్సీ ప్రక్రియకు సీఏఏ చట్ట తాజా సవరణాం శాల్ని అనుసంధానించినపుడు సమస్య జఠిలమౌతోంది. ప్రాతిపదిక లలా ఉన్నాయి. లెక్కించిన పౌరుల్ని గుర్తించి, పౌరసత్వం ఇచ్చే అంశంపైనే (అంటే... మిగిలిన వారికి నిరాకరించే, అనే అర్థం కూడా తీసుకోవాలి) ఈ ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టినట్టు స్పష్టమౌతోంది. ఎలా అంటే, తాజా ఎన్పీఆర్లో, మీవే కాకుండా మీ తలిదండ్రుల పుట్టిన స్థలం, తేదీల ధ్రువీకరణనూ అడుగుతారు. ఉదా: మీరు 26 జనవరి, 1950–1 జులై, 1987 ల మధ్య పుట్టిన భారతీయులైతే, మీ పుట్టిన స్థలం–తేదీ ఉంటే సరిపోతుంది. కానీ, 2 జులై 1987–2 డిసెంబరు 2004 మధ్య పుట్టిన వారైతే, మీ తలిదండ్రుల్లో ఒకరైనా భారతదేశంలో పుట్టిన పౌరులై ఉండాలి. అడిగితే, వారి పుట్టిన స్థలం, తేదీని ధ్రువీకరించాల్సి ఉంటుంది. 2004 డిసెంబర్ 3, లేదా తర్వాత పుట్టిన వారైతే మరింత సంక్లిష్టమైన ప్రక్రియ ఉంది. మీరు భారత్ లోనే పుట్టినా, మీకు ఓటరు–ఆధార్ కార్డు ఉన్నా తలిదండ్రుల పుట్టిన తేదీ–స్థలం ధ్రువీకరణ లేకుంటే మీకు పౌరులుగా గుర్తింపు దక్కదు. మూడు పొరుగు దేశాలు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లను ఎంపిక చేసుకోవడం, ఆయా దేశాల్లో అల్ప సంఖ్యాకులైన అయిదు మతాల వారిని తీసుకొని, ముస్లింలను పరిగణనలోకి తీసుకోకపోవ డంతో ప్రస్తుత వివక్ష నెలకొందనే వాదన ఉంది. ఇది రాజ్యాంగం కల్పించిన సమానత్వ స్ఫూర్తికి, నిబంధనలకు వ్యతిరేకమని వారం టున్నారు. అసోమ్‌లో అమలైన ఎన్నార్సీ వల్ల స్థానికులు, హిందు వులు, గిరిజనులతో సహా దాదాపు పదిలక్షల మంది పౌరసత్వం దక్కక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అక్కడి సంక్షోభాన్ని పరిష్కరించకుండానే దేశవ్యాప్త ఎన్నార్సీ అమలు లెక్కలేనన్ని చిక్కుల్ని స్వాగతించడమే అని విపక్షాల విమర్శ. ఇంకా చాలా.. సమాధానా ల్లేని సందేహాలు, జవాబులు దొరకని ప్రశ్నలు భారత దేశ లౌకిక మూల సూత్రపు పునాదుల్ని వణికిస్తున్నాయి. -దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
సత్వరమైతేనే.. న్యాయం!
న్యాయం అందించడం ఒక ఎత్తైతే న్యాయం అందుతుందనే విశ్వాసం ప్రజల్లో కలిగించడం మరో ఎత్తు! అవిచ్ఛిన్నంగా, కచ్చితంగా, సత్వరంగా ఒకటోది అందితే రెండోది దానంతట అదే సిద్ధిస్తుంది. మనం, మన వ్యవస్థలు, ప్రభుత్వాలు పనిగట్టుకొని అందించాల్సింది మొదటిదే! రెండోదాని కోసం ఎవరూ ప్రత్యేకంగా కృషి చేయాల్సిన పని లేదు. అంతటా న్యాయం సులువుగా అందుతున్న క్రమంలో అంతే సహజంగా విశ్వాసం ప్రజల్లో ఏర్పడు తుంది, క్రమంగా బలపడుతుంది. రెండోది లేదంటే, మొదటిది లభించడం లేదనే అర్థం! ఈ దుస్థితి ఇటీవల బాగా పెరిగింది. న్యాయం అంత తేలిగ్గా దొరక్కపోవడం, కొన్నిసార్లు ఎంతకీ లభించక పోవడంతో అది లభిస్తుందనే విశ్వాసం పౌర సమాజంలో సన్నగిల్లు తోంది. అనుచిత జాప్యాలతో సాగే నేర దర్యాప్తు–న్యాయ విచారణ ప్రక్రియ (క్రిమినల్ జస్టిస్ సిస్టమ్) న్యాయనిరాకరణే కాక తీరని నష్టమనే భావన జనంలో బలపడుతోంది. ముఖ్యంగా ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరిగి, పట్టుబడ్డ నిందితులు బేషుగ్గా జైళ్లలోనో, బెయిల్‌పై వచ్చి బయటో కాలం వెళ్లదీస్తున్నపుడు... న్యాయం జరుగుతుందనే నమ్మకం సడలుతోంది. ఇది ఆరంభం నుంచీ ఉన్న పరిస్థితేం కాదు. పలు జాడ్యాల వల్ల ముప్పిరిగొంటున్న ఇటీవలి అనుచిత జాప్యాలే ఇందుకు కారణం. మన పరిపాలన, పోలీసు– దర్యాప్తు, న్యాయ వ్యవస్థ ఇలా అన్నిచోట్లా నిర్వాకాలు వెరసి ఉమ్మ డిగా విశ్వాసాన్ని సన్నగిల్లజేస్తున్నాయి. ఫలితంగా, ప్రజాస్వామ్య ప్రక్రియను కాదని ప్రజలు సత్వర ఫలితాల కోసం ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. అవి ప్రజా స్వామ్యబద్ధమైన చర్యలు కావు అని తెలిసినా... కాప్ పంచాయతీల వైపు మొగ్గుతున్నారు. అసాంఘిక శక్తుల సెటిల్మెంట్లకు తలొగ్గుతు న్నారు. అసహజ ఎన్కౌంటర్లనూ సమర్థిస్తున్నారు. హక్కుల సంఘాల కృషినీ అభిశంసిస్తున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఎక్కడికక్కడ తీర్పులిచ్చే చర్యల్ని తప్పుపట్టకపోగా... గట్టిగా సమ ర్థిస్తున్నారు. పట్టరాని హర్షాలు, పాలాభిషేకాలు అందుకే! ఇదివర కెప్పుడూ లేనంత తీవ్ర స్థాయిలో ఈ రకం భావజాలం వ్యాపిస్తోంది. ప్రమాదకరంగా ఇది బలపడుతోంది. తీవ్ర భావోద్వేగాలకు లోన వుతున్న కొందరు ఈ పరిస్థితిని సామాజిక మాధ్యమాల్లో నెత్తికెత్తు కుంటున్నా... ఇదంత మంచిది కాదనేది విజ్ఞుల అభిప్రాయం. తాజా ఘటనల్లో అది కొట్టొచ్చినట్టు కనిపించింది. ఒక ప్రజాస్వామ్య వ్యవ స్థలో ప్రజలు ఏం కోరుకోవాలి, నిజానికి ఏం కోరుకుంటున్నారు? అని లోతుగా చూస్తే... ఈ పరిణామాలు ఆలోచనాపరుల్లో కాస్త గగు ర్పాటు కలిగిస్తున్నాయి. కఠిన శిక్షా? కచ్చితమైన శిక్షా? నేర దర్యాప్తు, న్యాయ విచారణల్లో జరిగే అనుచిత జాప్యాల వల్ల తీవ్రమైన నేరాల్లోనూ కేసులు కొలిక్కి రావట్లేదు. సత్వర న్యాయం దొరకటం లేదు. నేరస్తులకు శిక్షలు లేవు. బాధితుల కడగండ్లు తీరటం లేదు. ఇది ప్రజల్ని అసహనానికే కాకుండా ఆగ్రహానికీ గురిచేస్తోంది. బాధితులకు, ప్రజాస్వామ్యవాదులకు న్యాయవ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లడంతోపాటు దీనివల్ల మరో ప్రమాదం కూడా ఉంది. ఆడ వాళ్లపై అఘాయిత్యాలు చేసే వారికి, ఆ మాటకొస్తే నేరస్వభావు లెవరికైనా చట్టమంటే, శిక్షలంటే భయం లేని తెంపరితనం వచ్చే స్తుంది. అది బరితెగింపులకు దారితీస్తోంది. మొత్తం జనాభాతో పోల్చినపుడు నేరాలకు పాల్పడే వారి సంఖ్య చాలా తక్కువే అయినా, చట్టాలంటే భయంలేనితనం వల్ల సర్వత్రా అభద్రత రాజ్యమేలు తోంది. ‘తప్పు చేసిందెవరైనా, ఎంతవారైనా శిక్ష తప్పదు...’ అన్న నమ్మకం బలపడాలి. అది బలహీనులకు భరోసా కల్పిస్తూనే నేర స్వభావులకు భయాన్నీ కలిగిస్తుంది. ఏడేళ్ల కింద జరిగి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిర్భయ కేసు’లో నిందితులైన వారికి ఇప్ప టికీ శిక్షలు అమలు కాకపోవడాన్ని సాధారణ జనం కూడా జీర్ణించు కోలేకపోతున్నారు. నేర నిర్ధారణ జరిగి, శిక్షలు ఖరారై... అమలు జరు గకపోవడం వారికి మరింత కోపకారణమవుతోంది. న్యాయ ‘ప్రక్రియ’ అంటేనే పరిహాసం చేస్తున్నారు. మరోవంక, ఇక్కడ హైదరాబాద్ శివార్లలో జరిగిన ‘దిశ’ దుర్మార్గం తర్వాత స్వల్ప వ్యవధిలోనే ‘ఎన్కౌంటర్’లో నిందితులు నలుగురు చనిపోవడం ఒకింత ఉపశమనం కలిగించింది. దాంతో, ఎక్కువ మంది ఈ రెండు... నిర్భయ, దిశ కేసుల అంతిమ ఫలితాన్ని సరిపోల్చి చూస్తున్నారు. దేనికన్నా ఏది నయం? అని బేరీజు వేస్తు న్నారు. నిర్భయ ఘటన తర్వాతనాడే దేశం అట్టుడికింది. సాక్ష్యాత్తూ దేశ రాజధాని నడిబొడ్డున ఇంత దారుణమా? అనే ఆగ్రహావేశాలు సర్వత్రా పెల్లుబికాయి. కేంద్ర ప్రభుత్వం జస్టిస్ వర్మ నేతృత్వంలో కమిషన్ వేసింది. దాని ముందుకు రకరకాల ప్రతిపాదనలు వచ్చాయి. పిల్లలు, మహిళలపై అత్యాచారం, హత్యోదంతం వంటి అఘాయిత్యాలకు తలపడే వారికి కఠిన శిక్షలు అమలు పరచాలనే వాదనా వచ్చింది. అక్కడికక్కడే మరణ శిక్ష విధించాలని, నేరుగా ఉరి తీయాలని... ఇలా వచ్చిన పలు ప్రతిపాదనల్లో చట్టాల్ని సమూలంగా మార్చే అంశం కూడా తెరపైకొచ్చింది. ప్రస్తుత చట్టాల్లోనూ ఆయా శిక్షలున్నాయని, కొత్తగా అమానుష శిక్షలు ప్రతిపాదించి నాగరిక సమాజం వెనక్కి నడవాల్సిన పనిలేదనే వాదనా వినిపించింది. అయితే ప్రక్రియలో జాప్యం నివారించి, సత్వర న్యాయం అందించేం దుకు చర్యలు తీసుకోవాలనే గట్టి వాదన ముందుకు వచ్చింది. సమయపరిమితే సరైన మార్గం అన్నిస్థాయిల్లోనూ సమయపరిమితులు విధించి నేర దర్యాప్తు– న్యాయ విచారణ ప్రక్రియను వేగవంతం చేయడం ఓ పరిష్కారం. అవసరం మేర ఎప్పటికప్పుడు ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు ఒక మార్గం. దయాబిక్షతో సహా తీర్పు తదనంతర ప్రక్రియకూ సమయ పరిమితులుండాలి. కొన్ని నేరాల్లో దయాబిక్షే ఉండకూడదు. కఠిన శిక్షల్ని వర్తింప చేయడం ద్వారా, ఎవరూ మహిళలపై ఏ దుశ్చర్యకూ తలపడలేని విధంగా భయం పుట్టించాలి. జాప్యాల్ని హరించి, ప్రక్రి యను సత్వరం పూర్తి చేస్తే ఫలితాలుంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిందదే! సీఆర్పీసీ, ఐపీసీలను తగు విధంగా సవరించడంతో పాటు సొంతంగా ఒక చట్టాన్ని తీసుకురావాలనే ప్రతి పాదనకు మంత్రివర్గం ఆమోదించింది. సామాజిక మాధ్యమాల వేది కగా జరిగే దుశ్చర్యలకూ పగ్గాలు వేసే చర్యల్ని ప్రతిపాదించారు. ముసాయిదా కూడా సిద్ధమైంది. ఇక నేడో, రేపో అసెంబ్లీలో ఆ బిల్లు చట్టరూపు సంతరించుకోవడమే తరువాయి. మహిళలపై దుర్మార్గపు హింస జరిగినపుడు వారం రోజుల్లో నేర దర్యాప్తు, పక్షం రోజుల్లో న్యాయ విచారణ పూర్తిచేసి, నిర్ధారించే సాక్ష్యాలున్న కేసుల్లో మూడు వారాల్లో తుది తీర్పు ఇప్పించాలనేది తాజా చొరవ ఉద్దేశం. న్యాయ ప్రక్రియపై ప్రజలకు భరోసా కల్పిం చడమే కాకుండా నేర స్వభావుల్లో భయం కలిగిస్తే లక్ష్యం నెరవేరినట్టే! ఇదొక్కటే సరిపోతుందా? అని సందేహం వ్యక్తం చేసేవాళ్లుంటారు. ఇలాంటి సంస్కరణలు, చట్ట సవరణలు, సత్వర చర్యలు అన్ని స్థాయిల్లో ఉంటే పని సజావుగా జరిగిపోతుంది. హైకోర్టు, సుప్రీం కోర్టు స్థాయిలో విచారణకు గడువెలా విధిస్తారనే వాదన రావొచ్చు! అసాధారణ పరిస్థితుల్లో తప్ప కేసు విచారణలకు సమయ పరిమి తులు విధించుకోవచ్చు. ప్రక్రియను సత్వరం పూర్తిచేసి ఒక హేతు బద్ధమైన ముగింపునకు తీసుకురావాలనే ఒత్తిడయితే ఉన్నత స్థాయి న్యాయ వ్యవస్థపైనా పెరుగుతుంది. సత్వర విచారణ, తగు తీర్పు తోనే సరిపోదు, సదరు శిక్షలు అమలు కావాలి. జరిగిన నేరపు ఘోర త్వం జనుల స్మృతిపథం నుంచి జారక ముందే నేరస్తులకు శిక్షలు అమలయితేనే సార్థకం. ఏకకాలంలో ఎన్ని కావాలో...! కేసు నమోదు దశ నుంచి ప్రాసిక్యూషన్ ముగిసే దాకా నేర దర్యాప్తు ప్రక్రియను పోలీసులు వేగిరపర్చాలి. పాలన, సాంకేతిక, దురుద్దేశ పూర్వక జాప్యాలన్నింటినీ çహరించాలి. ముఖ్యంగా దేశంలో అత్యా చార నేరాల పెరుగుదల తీరు ఆందోళన కలిగిస్తోంది. జరిగినా, పలు సాంఘిక కారణాల వల్ల నమోదయ్యేవే తక్కువంటే, ఈ అధికారిక గణాంకాలు గగుర్పాటు కలిగిస్తున్నాయి. గత 15 ఏళ్లలో 3.41 లక్షల అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఒక వైపు ఘటనలు పెరుగు తుంటే, మరోవైపు శిక్షల రేటు తగ్గుతోంది. 2016లో 38,947 కేసులు రాగా 6,289 కేసుల్లోనే శిక్షలు పడ్డాయి. మహిళలపై జరిగే నేరాల్లో పోలీసుల సత్వర స్పందన, బాధ్యతాయుత ప్రవర్తన చాలా ముఖ్యం. దర్యాప్తుతో పాటు న్యాయ విచారణ ప్రక్రియలోనూ వేగం పెరగాలి. గర్భస్థ పిండాలుగా ఉన్నప్పటి నుంచి కడ శ్వాసవరకు మహిళలపై గౌరవ భావం కలిగేలా మన సమాజానికి అవగాహన పెంచాలి. కుటుంబం, బడి, పనిప్రదేశం, బహిరంగ స్థలం.... ఇలా అన్ని చోట్లా, ప్రతి స్థాయిలో వివక్ష పోవాలి. మనిషి తప్ప సృష్టిలో మరే జీవి పాల్పడని అతి హీనమైన నేరం అత్యాచారం. అది సామూహికంగా జరిగి, ఘాతుకమైన హత్యతో ముడివడటం భూమ్మీద అతిపెద్ద నేరం! దీనికి సమాజం నుంచే పరిష్కారం లభించాలి. దీన్ని పూర్తిగా నిర్మూలించడానికి అన్ని విధాలుగా, అన్ని స్థాయిల్లో సమాజం సమాయత్తం కావాలి. ఇది సమష్టి బాధ్యత. దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
ఆ బాధ్యత అందరిదీ కాదా?
మన రాజ్యాంగం, మూడో అధ్యాయంలో ప్రాథమిక హక్కులకు భద్రత కల్పించారు. అయినా సగటు మనిషి హక్కుల్ని కోల్పోతూనే ఉన్నాడు. రోజూ ఏదో రూపంలో వంచనకు గురవుతూనే ఉన్నాడు. సర్వ వ్యవస్థల్ని చెరబట్టి, అధికారాన్ని కేంద్రీకృతం చేస్తున్న వారు పౌరులకు ఒరగబెట్టిందేమిటి? నెల రోజుల పాటు విచారణ జరుపుతూ వివిధ వ్యాఖ్యలతో ఆశలు రేపిన న్యాయస్థానం చివర్న ‘సమ్మె తప్పో ఒప్పో తేల్చడం మా పరిధిలో లేదు’ అంటే ఆర్టీసీ కార్మికులు ఎటు వెళ్లాలి? ‘సమ్మెకట్టి విధులకు రానంత మాత్రాన ఉద్యోగాలు కోల్పోయినట్టు కాదు..’ అని హైకోర్టు విస్పష్టంగా చెప్పిన తర్వాత కూడా సమ్మె విరమించిన ఉద్యోగులు చాలా వేదనకు గురికావలసి వచ్చింది. పౌరుల నుంచి ఆశిస్తున్నట్టే ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ తమ నిర్దేశిత విధుల్ని బాధ్యతగా నిర్వర్తిస్తే అందరం బాగుపడతాం! భారతీయ సనాతన సంస్కృతి, వారసత్వ సంపదకు సంబంధించిన సమస్త సాహి త్యంలో ఎక్కడైనా ‘హక్కు’ అనే మాట ఉందా? చెప్పండి! అని సర దాగా సవాల్ చేశారు ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి పుష్కర కాలం కిందట. సమాచార హక్కు చట్టం కమిషనర్‌గా ఉన్నాను నేనపుడు. అధికార వ్యవస్థ పారదర్శకంగా ఉండి, ప్రజా సమాచారం ప్రజల కివ్వడం తమ విధిగా భావిస్తే పౌరులు దాన్ని హక్కుగా డిమాండ్ చేయాల్సిన అవసరమే రాదన్నది ఆయన కవి హృదయం. నిజమే! ఈ సూక్ష్మం గ్రహించినందునే కాబోలు మన వేదాలో, వేదాంగాలో, ఉపనిషత్తులో, బ్రహ్మసూత్రాలో, పురాణాలో, ఇతిహాసాలో... భారత సనాతన ఆధ్యాత్మిక వాఙ్మయంలో ఎక్కడా హక్కు అనే మాటే కని పించదు. ఎందుకంటే, హక్కులు–విధులు ఒకే నాణేనికి రెండు పార్శా్వలు. ఒకరి హక్కులు ఎదుటి వారి విధులవుతాయి. అలాగే ఎదుటి వారి హక్కులు వీరికి విధులవుతాయి. వ్యక్తులు, జన సమూ హాల మధ్యే కాకుండా, పరస్పరం ఆధారపడ్డ రెండు సంస్థల మధ్య, చివరకు... పౌరులు–రాజ్యం మధ్య కూడా ఇదే బంధం ఉంటుంది. ఎవరికి వారు, ఎక్కడికక్కడ తమ విధులు–బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తిస్తే, ఇక ఎదుటి వారెవరూ హక్కుల గురించి మాట్లాడాల్సిన అవసరమే రాదు. మన పురాణ గాథల్లో కుటుంబంలోని వ్యక్తుల మధ్యే కాదు, అందరికీ, కుటుంబాలకు, సమాజాలకు, రాజ్యానికి కూడా విధుల్ని నిర్దేశించారు. వాటిని పాటించేలా కట్టడి చేశారు. తద్వారా ఎదుటి వారి హక్కులు నెరవేరేలా, వాటికి భంగం కలుగకుండా భద్రత కల్పించారు. డిమాండ్ చేసి హక్కులు సాధించుకోవాల్సిన పరిస్థితి ఎవరికీ రానీయవద్దనేది లక్ష్యం. సదరు భావన ఇపుడు లోపిస్తోంది. రాజ్యం, దాని అవిభాజ్య అంగాలు, వివిధ వ్యవస్థలు, సంస్థలు... తమ నిర్దేశిత విధుల్ని, బాధ్యతల్ని, కర్తవ్యాల్ని విస్మరిస్తున్నాయి. ఫలితంగా పౌరులు కడగండ్లపాలవుతున్నారు. విధుల్ని నిర్వర్తించ డంలో అప్పుడప్పుడు పౌరులూ విఫలమౌతున్నారు. మన రాజ్యాం గంలో పౌరులకు కొన్ని విధుల్ని నిర్దేశించారు. సదరు విధుల్ని పాటిం చండని పెద్దలు నొక్కి చెబుతున్నారీ రోజు. మన రాజ్యాంగాన్ని ఆమో దించి 70 ఏళ్లయిన సందర్భంగా మాట్లాడిన భారత రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సహా పెద్దలు పౌరుల విధులు–బాధ్యతల్ని నొక్కి చెప్పారు. విధులు నిర్వ ర్తించకుంటే హక్కులకు రక్షణ ఉండదనీ ధ్వనించారు. బాధ్యతలు లేనిదెవరికి? నిజమే! పౌరులకు నిర్దిష్ట విధులున్నాయని భారత రాజ్యాంగం చెబు తోంది. ఎవరికి లేవు? శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలతో సహా ముఖ్యమైన ప్రజాస్వామ్య విభాగాలన్నింటికీ నిర్దేశిత బాధ్యత లున్నాయి. ప్రసార మాధ్యమ (మీడియా) వ్యవస్థతో సహా! రాజ్యం నిర్వహించాల్సిన బాధ్యతల్ని రాజ్యాంగం నాలుగో అధ్యాయంలో ఆదేశిక సూత్రాలుగా పేర్కొన్నారు. శాసన–కార్యనిర్వాహక వ్యవస్థల పనితీరు సమీక్షించి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడే బాధ్యతను న్యాయ వ్యవస్థకు అప్పగించారు. సమాజ సర్వతోముఖాభివృద్ధికి మీడియా పోషించాల్సిన పాత్ర గురించి ప్రెస్ కమిషన్ నివేదికతో పాటు ప్రెస్ కౌన్సిల్ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. అన్ని వ్యవస్థలూ దేనికదిగా పనిచేసే క్రమంలో పౌరుల హక్కులకు ఎక్కడైనా భంగం కలిగితే న్యాయం పొందవచ్చు. మన రాజ్యాంగం, మూడో అధ్యాయం, ప్రాథమిక హక్కుల రూపంలో ఇందుకు భద్రత కల్పించారు. అయినా సగటు మనిషి హక్కుల్ని కోల్పోతూనే ఉన్నాడు. రోజూ ఏదో రూపంలో వంచనకు గురవుతూనే ఉన్నాడు. సర్వ వ్యవస్థల్ని చెరబట్టి, అధికారాన్ని కేంద్రీకృతం చేస్తున్న వారు పౌరులకు ఒరగబెట్టిందే మిటి? నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన పదిహేడేళ్ల దేవేందర్ ఆత్మహత్య చేసుకుంటూ రాసిన లేఖ ఎందరికో కంటతడి పెట్టిం చింది. కారణమేదైనా ఆత్మహత్యలు గర్హనీయం, అందరం ఖండించా ల్సిందే! కానీ, ‘....ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారు, పేదలు ఇంకా నిరుపేదలవుతున్నారు... మా వైపు చూడండి, మా అమ్మానాన్నలు రోజూ కూలీ చేస్తున్నా మాకంటూ ఓ ఇల్లు లేదు, నే చచ్చాకయినా మాకో ఇల్లు ఇప్పించండి’ అంటూ ఆలేఖలో ప్రతి ధ్వనించిన యువకుడి ఆర్తి గురించి ఒక నిమిషమైనా ఆలోచించాలి కదా! ‘నిందితులెవరో వెంటనే తెలియదు తప్ప, ఆత్మహత్యలన్నీ హత్యలే!’ అని ఓ సామాజిక శాస్త్రవేత్త అన్నది ఇందుకేనేమో! నెల రోజుల పాటు విచారణ జరుపుతూ వివిధ వ్యాఖ్యలతో ఆశలు రేపిన న్యాయస్థానం చివర్న ‘సమ్మె తప్పో ఒప్పో తేల్చడం మా పరిధిలో లేదు’ అంటే ఆర్టీసీ కార్మికులు ఎటు వెళ్లాలి? ‘సమ్మెకట్టి విధులకు రానంత మాత్రాన ఉద్యోగాలు కోల్పోయినట్టు కాదు...’ అని హైకోర్టు విస్పష్టంగా చెప్పిన తర్వాత కూడా సమ్మె విరమించిన ఉద్యోగులు చాలా వేదనకు గురికావలసి వచ్చింది. ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం, ‘పిల్’ (అమరావతి రాజధాని భూములు–ఏబీకే ప్రసాద్ కేసు) విచారిస్తూ, బాధ్యత కలిగిన ఓ సంపాదకుడిని, ‘... మీకేమి సంబంధం? మీ భూములు లాక్కొన్నప్పుడు వద్దురు పొండి!’ అని సాక్షాత్తు సుప్రీంకోర్టే అంటే ఇక సాధారణ పౌరులకు దిక్కేది? పౌర విధులు స్వీయ బాధ్యత పౌరుల ప్రాథమిక విధులు రాజ్యాంగంలో మొదట్నుంచి లేవు. 42వ రాజ్యాంగ సవరణతో, అధికరణం 51ఎ ద్వారా 1976 నుంచి అమ ల్లోకి వచ్చాయి. రాజ్యాంగానికి కట్టుబడి ఉండటం, స్వాతంత్య్ర పోరా టాన్ని ప్రభావితం చేసిన విలువల పరిరక్షణ. దేశ సమైక్యత, సమ గ్రత, సార్వభౌమాధికారాన్ని నిలబెట్టడం వంటివన్నీ ఈ ప్రాథమిక విధుల్లో ఉన్నాయి. అవసరం ఏర్పడ్డపుడు దేశ రక్షణకు సేవలందిం చాలి. కుల, మత, వర్గ, వర్ణ, లింగ, ప్రాంత, భాషా భేదాలకతీతంగా మనుషుల్లో సోదర భావం పెంచాలి, మహిళల్ని గౌరవించాలి. మన వైవిధ్య సంస్కృతి, వారసత్వ సంపదకు విలువిచ్చి పరిరక్షించాలి. అడవులు, నదులు, కుంటలు, జీవవైవిధ్యంతో పాటు సర్వ సహజ వనరుల్ని కాపాడుతూ, జీవకారుణ్యంతో ఉండాలి. హింసను నిలువ రించి, ప్రజా ఆస్తుల్ని పరిరక్షించాలి. శాస్త్రీయ దృక్ప«థం, మానవ విలు వల వృద్ధితో అన్వేషణ–సంస్కరణ పంథాలో సాగాలి. అన్ని రంగాల్లో వ్యక్తిగత, సామూహిక సామర్థ్యాల ద్వారా దేశం ప్రగతి పథంలో సాగేందుకు తోడ్పడాలి. ఆరు–పద్నాలుగేళ్ల మధ్య వయసు పిల్లల తలిదండ్రులుగానో, సంరక్షకులుగానో వారికి విద్యావకాశాలు కల్పిం చాలి. ఇవన్నీ నిర్వర్తించడం దేశ పౌరుల ప్రాథమిక విధి అని రాజ్యాంగం చెబుతోంది. వీటి ఉల్లంఘనలకు నేరుగా న్యాయస్థా నాల్లో న్యాయ పరిష్కారం లేదు. కానీ, ఎప్పటికప్పుడు ఇవన్నీ పౌరులు పాటించేలా సంబంధిత ప్రభుత్వాలు చట్టాలు చేయవచ్చు. వీటిని రాజ్యాంగంలో చేర్చడం పట్ల కొంత వివాదం, విమర్శ కూడా ఉంది. ఇవన్నీ పౌరులు సహజంగానే చేస్తారని, పైగా ఆచరణ పరమైన స్పష్టత కొరవడిందనేది విమర్శ. నిజానికి 42వ రాజ్యాంగ సవరణే ఒక పీడకల అనే స్థూల అభిప్రాయముంది. 1975లో అర్థరాత్రి విధిం చిన ఆంతరంగిక అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) నీడలో వచ్చిన సవరణలివి. విధులు పాటించడమే హక్కులకు రక్షణ ఎవరో చెప్పారని కాదు గానీ, ఎవరికి వారు తమ విధుల్ని నిర్వర్తిం చాలి. ఫలితంగా అందరి హక్కులకు రక్షణ లభిస్తుంది. ఏ చట్టం, రాజ్యాంగపు ఏ అధికరణం నిర్దేశించనవసరం లేకుండా మన వ్యక్తిత్వ రీత్యానే ఈ ప్రాథమిక విధుల్ని పాటించవచ్చు. సద్గురు జగ్గీవాసుదేవ్ ఒక పుస్తకంలో బాధ్యతను చక్కగా వివరించారు. ‘బాధ్యత... మూడొంతుల మంది తప్పుగా అర్థం చేసుకున్న పదమిది. అది ఎంత విస్తృతంగా, ఎంత విచక్షణారహితంగా వాడబడుతోందంటే, అది దాని ప్రబలమైన శక్తిని చాలా వరకు కోల్పోయింది. బాధ్యత అంటే ప్రపంచ బరువుని మనమీద వేసుకోవడం కాదు. మీరు చేసినదానికీ చెయ్యని దానికీ నిందని భరించడం కాదు. దానర్థం నిరంతరం అప రాధ భావనతో బ్రతకడం అంతకంటే కాదు. బాధ్యత అంటే కేవలం మీ స్పందనా సామర్థ్యమే. ‘నేను బాధ్యున్ని’ అని మీరు నిర్ణయిం చుకుంటే, స్పందించే సామర్థ్యం మీలో ఏర్పడుతుంది. ‘నేను బాధ్యున్ని కాదు’ అని నిర్ణయించుకుంటే, స్పందించే సామర్థ్యం ఉండదు. దాన్నంత తేలిగ్గా వివరించవచ్చు, అదంత సరళమైంది..... ఈ క్షణంలో, చెట్లు వదిలే గాలినే మీరు తీసుకుంటున్నారు. మీరు వదిలే శ్వాసనే అవి తీసుకుంటున్నాయి. ఈ ఉచ్ఛ్వాస–నిశ్వాసల లావాదేవీ నిరంతరం సాగుతోంది. మీకిది తెలిసినా తెలియక పోయినా మీ శ్వాసకోశంలో సగభాగం ఆ చెట్లకి వేలాడుతోంది. ఇలా పరస్పరం ఆధారపడి ఉన్నారన్న సంగతి మీరెన్నడూ అనుభూతి చెంది ఉండకపోవచ్చు. మహా అయితే మేధోపరంగా ఆలోచించి ఉంటారు. కానీ, ఈ అనుబంధాన్ని మీరు అనుభూతి చెంది ఉంటే, మీకెవరైనా ‘మొక్కలు నాటండి, అడవుల్ని రక్షించండి, ప్రపంచాన్ని కాపాడండి’ అని చెప్పాలా? అసలు అది అవసరమా?’అన్నారాయన. ఇది గ్రహిస్తే రాజ్యాంగం నిర్దేశించే విధుల్ని మనం విడువకుండా పాటిస్తాం. ఇప్పటికే పాటిస్తున్నాం కూడా! పౌరుల నుంచి ఆశిస్తు న్నట్టే ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ తమ నిర్దేశిత విధుల్ని బాధ్యతగా నిర్వర్తిస్తే అందరం బాగుపడతాం! ఇది నిజం! వ్యాసకర్త: దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
ఎన్నో సందేశాలు–కొన్ని సందేహాలు
న్యాయ పాలనలో పారదర్శకత న్యాయ వ్యవస్థ స్వయంప్రతిపత్తికి భంగకరమేమి కాదని రాజ్యాంగ ధర్మాసనం చేసిన వ్యాఖ్య కీలకం. పలువురు భావిస్తున్నట్టు ఈ తీర్పు ద్వారా భారత ప్రధానన్యాయమూర్తి/కార్యాలయాన్ని సమాచార హక్కు చట్ట పరిధిలోకి కొత్తగా తీసుకురాలేదు. ఆర్టీఐ–2005 చట్టంలో ఉన్న విషయాన్నే సందేహాలకు అతీతంగా ధర్మాసనం ఇప్పుడు ధ్రువీకరించింది. ఈ దేశంలో గుర్తింపు పొందిన ప్రధాన రాజకీయ పార్టీలు, తాము సమాచార హక్కు చట్ట పరిధిలోకి రామని భీష్మించుకొని వివాదం సృష్టించాయి. ఇన్నాళ్లూ సుప్రీం సీజే కార్యాలయం చేసినట్టే! తాము ప్రజాసంస్థలు (పీఏ) కామని, అందుకే ఆర్టీఐ పరిధిలోకి రాబోమని కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఐ(ఎం)లు బదు లిచ్చాయి. బీజేపీ, బహుజన సమాజ్ పార్టీలు మొదట స్పందించనే లేదు. తమ సిద్థాంత వైరుధ్యాలకతీతంగా అన్ని పార్టీలూ ఒక్కటయ్యాయి. ఒక తీర్పు.... అనేక సందేశాలు. కొండొకచో సందేహాలు! తనకే సంబంధించి దాదాపు పదేళ్లుగా నలుగుతున్న ఓ వివాదాన్ని దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తేల్చింది. పారదర్శకత–న్యాయ వ్యవస్థ స్వయంప్రతిపత్తి పరస్పర విరుద్ధాంశాలు కావని, రెండూ చెయ్యిచెయ్యి జోడించి సాగాల్సిందేనని తేటతెల్లం చేసింది. న్యాయ పాలనలో పారదర్శకత న్యాయ వ్యవస్థ స్వయంప్రతిపత్తికి భంగకర మేమి కాదని రాజ్యాంగ ధర్మాసనం చేసిన వ్యాఖ్య కీలకం. పలువురు భావిస్తున్నట్టు ఈ తీర్పు ద్వారా భారత ప్రధానన్యాయమూర్తి/కార్యా లయాన్ని సమాచార హక్కు చట్ట పరిధిలోకి కొత్తగా తీసుకురాలేదు. ఆర్టీఐ–2005 చట్టంలో ఉన్న విషయాన్నే సందేహాలకతీతంగా ధర్మా సనం ఇప్పుడు ధ్రువీకరించింది. ఈ వివాదంపై కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ), ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి, అదే కోర్టు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం లోగడ వెలువరించిన తీర్పులను సమర్థిస్తూ, దాన్ని విభేదించిన సుప్రీంకోర్టు కార్యాలయ వాదనను తోసిపుచ్చింది. కానీ, అదే సమయంలో... ధర్మాసనం తన తీర్పులో అక్కడక్కడ చేసిన కొన్ని వ్యాఖ్యలు సమాచారం ఇచ్చే వెసులుబాటు కన్నా ఇవ్వకూడని ఆంక్షల పరిధిని పెంచినట్టు ధ్వనిస్తున్నాయి. ఇది కొంత ప్రమాదకరం. ఏ కోణంలో చూసినా ఈ తీర్పు పద్నాలుగేళ్ల ఆర్టీఐ ప్రస్తానంలో కీలకమైందే! ఈ తీర్పుతో... పారదర్శకతకు సంబం ధించిన కొన్ని మౌలికాంశాలపై అటు శాసన వ్యవస్థ ఇటు కార్యనిర్వా హక వ్యవస్థకు గట్టి సందేశం పంపినట్టయింది. ఇంతకాలం తన మైదానంలో స్తబ్దుగా ఉన్న బంతిని శాసనవ్యవస్థ మైదానంలోకి సుప్రీంకోర్టు నెట్టినట్టే భావించాలి. ఎందుకంటే, ఈ దేశంలో గుర్తింపు పొందిన ప్రధాన రాజకీయ పార్టీలు, తాము సమాచార హక్కు చట్ట పరిధిలోకి రామని భీష్మించుకొని వివాదం సృష్టించాయి. ఇన్నాళ్లూ సుప్రీం సీజే కార్యాలయం చేసినట్టే! ‘కాదు, మీరు ప్రజా సంస్థలే, సమాచారం ఇచ్చి తీరాల్సిందే...’ అని సీఐసీ ఇచ్చిన ఆదేశాల్ని అవి బేఖాతరంటున్నాయి. తాజా తీర్పు దరిమిలా ఈ వివాదం కూడా తేలాల్సిన సమయం ఆసన్నమైంది! సుప్రీం తీర్పు పరోక్షంగా రాజ కీయ వ్యవస్థపై ఒత్తిడి పెండచం ఖాయం. ఈ వివాదమూ ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణ పరిధిలోనే ఉంది. అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి (సీఈసీ) నోటీసులు ఇచ్చి ఉంది. రాజకీయ పార్టీలే కాకుండా కొన్ని ప్రయివేటు సంస్థలు, ట్రస్టులు, విద్యాసంస్థలు, పబ్లిక్–ప్రయివేట్ భాగస్వామ్య సంస్థలు ఇన్నాళ్లుగా ఇదే మొండి వైఖరితో ఉన్నాయి. సమాచారం నిరాకరిస్తున్నాయి. ఆర్టీఐ–2005 చట్ట నిర్వచనం (సెక్షన్ 2 హెచ్) ప్రకారం పబ్లిక్ అథారిటీస్ (పీఏ) అయిన సంస్థలు కూడా తామీ చట్ట పరిధిలోకి రామని తప్పించుకుంటున్నాయి. వాటి విషయంలో బాధి తులైన వారో, ఆర్టీఐ కార్యకర్తలో ఎక్కడికక్కడ న్యాయస్థానాలను సం ప్రదించి, ఈతాజా తీర్పును ఉటంకించడానికి మార్గం సుగమమైంది. వివాదమే దురదృష్టకరం! దేశంలోని ఎందరెందరో మేధావులు, సామాజికవేత్తలు, హక్కుల కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నట్టు ‘ఎవరూ చట్టానికి అతీతులు కారు’ అన్న బలమైన సందేశం తాజా తీర్పులో ఉంది. అస్పష్టత లేకపో యినా, సందేహం సృష్టించి వక్రమార్గంలో చట్టాన్ని అన్వ యించడానికి ఇక వీల్లేకుండా పోవాలి. భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు అనే సంస్థలోని అవిభాజ్య అంగమే తప్ప స్వతంత్ర సంస్థ కాదనీ ఈ తీర్పులో పేర్కొన్నారు. అసలు వివాదం అక్కడే మొదలయింది. సుప్రీం కోర్టు 1997లో చేసిన ఒక తీర్మానపు ప్రతిని సమాచారంగా ఇవ్వాలని హక్కుల కార్యకర్త 2007లో పెట్టుకున్న వినతిని సుప్రీంకోర్టు కార్యాలయం నిరాకరించడమే ఈ వివాదానికి బీజం. ప్రతి న్యాయమూర్తీ తన ఆస్తుల్ని వెల్లడించాలన్నది సదరు తీర్మానం. కొందరు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి కొలీజియం –కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన పరస్పర సంప్ర దింపుల వివరాలనూ ఆ కార్యకర్త విడిగా కోరారు. కొన్ని అవి నీతి ఆరోపణలకు సంబంధించి మద్రాసు హైకోర్టు న్యాయ మూర్తికి–సుప్రీంకోర్టుకి మధ్య జరిగిన సంప్రదింపుల సమాచారాన్నీ మరో దరఖాస్తులో కోరారు. ఈ సమాచారమేదీ ఇవ్వబోమని, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం రాజ్యాంగపరమైన సంస్థ కనుక ఆర్టీఐ చట్ట పరిధిలోకి రాదంటూ దరఖాస్తుల్ని తిరస్కరించారు. దరఖాస్తు దారు సీఐసీని సంప్రదించినపుడు చీఫ్ జస్టిస్ కార్యాలయం (సీజేఐ) ఆర్టీఐ చట్ట పరిధిలోకి వస్తుందని, న్యాయమూర్తుల ఆస్తుల ప్రకటన వ్యక్తిగత గోప్య సమాచారమేమీ కానందున సమాచారం ఇవ్వాల్సిం దేనని సీఐసీ రెండు వేర్వేరు కేసుల్లోనూ తన నిర్ణయం ప్రక టించింది. సీజేఐ కార్యాలయం దాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లింది. విచారణ తర్వాత అక్కడ న్యాయమూర్తి (సింగిల్ జడ్జి), ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం (2009లో, 2010లో)కూడా సీఐసీ నిర్ణయాన్ని సమర్థించాయి. ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు కార్యాలయమే సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఇంతటి సుదీర్ఘ విచారణ, తాజా తీర్పు అని వార్యమైంది. ఈ కేసు సాగతీతలో సుప్రీం కార్యాల యమే కాకుండా కేంద్ర ప్రభుత్వ సిబ్బంది–శిక్షణ విభాగం(డీవోపీటీ) పాత్ర కూడా ఉంది. రాజకీయ పార్టీలు అతీతమా? నిత్యం ప్రజలతో మమేకమై, ప్రజల కొరకు ప్రజలనే ఆసరా చేసుకొని ప్రజా వ్యవహారాలు నడిపే రాజకీయ పార్టీలు తాము ప్రజా సంస్థలు (పబ్లిక్ అథారిటీ) కామని ప్రకటించుకుంటున్నాయి. పారదర్శకంగా ఉండనవసరం లేదని, పౌరులు కోరిన సమాచారం ఇవ్వబోమని వాదిస్తున్నాయి. పార్లమెంటు ద్వారా తామే తయారుచేసి, అమలు పరుస్తున్న ఓ చట్టాన్ని అడ్డంగా ఉల్లంఘిస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని నీరుగారుస్తున్నాయి. పిడివాదంతో, ఆరేళ్ల కింద సీఐసీ ఇచ్చిన ఉత్త ర్వుల్ని ఇంకా వ్యతిరేకిస్తున్నాయి. పోనీ, సీఐసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ న్యాయస్థానానికి వెళ్తున్నారా అంటే, అదీ లేదు. ఇది న్యాయ ధిక్కారమే! ఓ హక్కుల కార్యకర్త, ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలను కొంత సమాచారం కోరుతూ పెట్టిన ఆర్టీఐ దరఖాస్తులకు తిరస్కరణ ఎదురవడంతో వారు సీఐసీని సంప్రదించారు. సీఐసీ ఇచ్చిన నోటీ సులకు ముందు సానుకూలంగా స్పందించిన సీపీఐ తర్వాత తన వైఖరి మార్చుకుంది. తాము ప్రజాసంస్థలు (పీఏ) కామని, అందుకే ఆర్టీఐ పరిధిలోకి రాబోమని కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఐ(ఎం)లు బదులిచ్చాయి. బీజేపీ, బహుజన సమాజ్ పార్టీలు మొదట స్పందించనే లేదు. తమ సిద్ధాంత వైరుధ్యాలకతీతంగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలూ మరోమారు ఒక్కటయ్యాయి. ఎన్నికల సంస్కరణల్లో భాగం గా క్రిమినల్ కేసులు–పోటీ అనర్హత విషయమై లోగడ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కూడా రాజకీయ పార్టీలన్నీ ఇలా ఒక్కట య్యాయి. తాము ఆర్టీఐ పరిధిలోకి రాబోమనే వాదనతో ఇప్పుడూ పార్టీలన్నీ ఐక్యంగా ఉన్నాయి. రాజకీయ పక్షాలకు లభించే విరాళాల వివరాలు, పార్టీ అంతర్గత ప్రజాస్వామ్య అవసరాల దృష్ట్యా వారి నిర్ణాయక వ్యవస్థ సమాచారం ప్రజలకు తెలియాలని సామాజిక కార్యకర్తలంటున్నారు. విరాళాల గోప్యత వల్ల ఎన్నికల అనంతరం అధికార వ్యవస్థకు–ఆశ్రిత వర్గాలకు మధ్య పరస్పర ప్రయోజన వైరుధ్యత (కాన్ల్ఫిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్) ఉంటుందనేది వారి వాదన. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత, ఆర్టీఐ చట్ట నిర్వచనం ప్రకారం రాజకీయ పార్టీలు ప్రజా సంస్థ(పీఏ)లేనని, పౌరులు అడిగిన సమా చారం ఇవ్వాల్సిందేనని 2013 జూన్‌లో సీఐసీ నిర్ణయించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం, సెక్షన్ 29ఎ కింద గుర్తింపు పొందిన పార్టీలన్నిం టినీ ఆర్టీఐ చట్టప్రకారం పీఏ లుగా ప్రకటించాలని కోరుతూ కొందరు ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయడంతో గత మార్చిలో సుప్రీంకోర్టు సంబంధితులకు నోటీసులిచ్చింది. తుదితీర్పు రావాల్సి ఉంది. చట్టం పటిష్టతే శ్రీరామరక్ష సమచార హక్కు చట్టం–2005 గొప్పదనమంతా ఆ చట్టం కూర్పులో ఉంది. నిర్వచనాలైనా, నిబంధనలైనా పాలకుల పక్షంలో కాక నిఖా ర్సుగా ప్రజాహితంలో ఉన్నాయి. గోప్యత పౌరుల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవలే తేల్చినా, సదరు జాగ్రత్తల్ని ఆర్టీఐ చట్టంలో పద్నాలుగేళ్ల కిందటే పొందుపరిచారు. ఏయే సంద ర్భాల్లో సమాచారం ఇవ్వనవసరం లేదో సెక్షన్ 8 (మిన హాయింపులు) విస్పష్టంగా చెబుతోంది. పౌరులు కోరిన సమాచారం ఇచ్చేప్పుడు న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తిని దృష్టిలో ఉంచు కోవాలని తాజా తీర్పులో ధర్మాసనం వ్యాఖ్య చేసింది. దాపరికం వల్ల వ్యక్తిగత గోప్యతకు లభించే రక్షణ కన్నా వెల్లడి ద్వారా విస్తృత ప్రజా ప్రయోజనాలున్నపుడే సమాచారం వెల్లడించాలని వ్యాఖ్య చేసింది. నిజా నికి ఇటువంటి చాలా విషయాల్లో చట్టంలోనే స్పష్టత ఉంది. పలు కీలకాంశాల్లో అస్పష్టతకు తావులేని విధంగా చట్టాన్ని రూపొం దించారు. వాటిని తిరిగి పార్లమెంటు వేదికగా సవరించనంత కాలం అవే చెల్లుబాటవుతాయి. అలా కాక ఇతరేతర ప్రయో జనాలనాశించే వారు తాజా తీర్పులోని వ్యాఖ్యల్ని ఇష్టానుసారం అన్వయించి, చట్టం స్ఫూర్తికి గండికొడితే ప్రమాదం! పెనంలోంచి పోయ్యిలో పడ్డట్టే! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
గోడలు మొలిచి.. గొడవలు పెరిగి!
విలువలు బోధించని నేటి విద్యా విధానం, నిఘా–నియంత్రణ లోపించిన టీవీ కార్యక్రమాలు, సామాజిక మాధ్యమ వేదికల్ని చేరువ చేసిన మొబైల్, ప్రపంచీకరణలో పెరుగుతున్న ఆర్థిక అంతరాలు... ఇవన్నీ కూడా మానవ సంబంధాల్ని చెదరగొడుతున్నాయి. విలువల్ని హరించి, జుగుప్సాకరమైన అట్టడుగుస్థాయికి చేరుస్తున్నాయి. వేధింపులు, బ్లాక్మెయిల్ బెదిరింపులు, డబ్బు గుంజడం, హింస, హత్యలు వంటి నేరాలకు ఇది దారితీస్తోంది. ఇంతటి వేదన, అశాంతి, హింసకు కారణమౌతున్న మూలాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. వీటిని ఒట్టి నేరాలుగానే చూడకుండా, నేపథ్యంలో ఉన్న సామాజికార్థికాంశాల్నీ పరిశీలించాలి. మూల కారణాల్ని వెతికి, తగిన సామాజిక, చట్టపరమైన చికిత్స చేయాల్సిన అవసరముంది. ఈ ఉపేక్ష సమాజానికి ఎన్నో రెట్ల నష్టం చేస్తోంది. ఈ సమస్యను ఇకనైనా పట్టించుకోవాలి. సాంకేతిక పరిజ్ఙానం ఆకాశపు అంచులు తాకుతుంటే మానవతా విలువలు పాతా ళాన్ని అంటుతున్నాయి. మానవ సంబంధాలు రోజు రోజుకు పలుచ బారి భవిష్యత్తు భయంకరంగా కనిపిస్తోంది. కనుచూపు మేర పరి ష్కారం కనిపించనంత అయోమయం నెలకొంది. స్థలం కోసం తలి దండ్రుల్ని తగులబెట్టి చంపే కొడుకు–మనవలు, ప్రియుడి చేతిలో కీలుబొమ్మై కన్న తల్లిని కడతేర్చే కూతుళ్లు, నిద్రపోయే తండ్రికి ఆస్తి యావతో నిప్పంటించే తనయులు, బడిపిల్లల్ని గర్భవతులు చేసే నవ కీచకులు... ఇవన్నీ అక్కడక్కడ జరిగే ఒకటీ, అరా అరుదైన ఘటన లుగా చూడటంలోనే లోపముంది. ఈ దారుణాల్ని కేవలం నేర ఘట నలుగా పోలీసు కేసు–దర్యాప్తులు, కోర్టు విచారణ–తీర్పులు, జరి మానా–శిక్షలు... ఈ దృష్టికోణంలో పరిశీలించడమే మన సమాజం పాలిట శాపమౌతోంది. ఇంతటి వేదన, అశాంతి, హింసకు కారణమౌ తున్న మూలాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. సమాజాన్ని ఈ దుస్థితిలోకి నెడుతున్న ప్రభావకాల గురించి ఆలోచించడమే లేదు. లోతైన పరిశీలన, ఓ చర్చ, దిద్దుబాటు చర్యలు... ఏమీ లేవు. ఇవి కేవలం నేర ఘటనలు కావు, వాటి వెనుక బలమైన సామాజిక, ఆర్థిక కారణాలున్నాయన్న స్పృహే లేకుండా పోతోంది. ప్రాధాన్యతలు మారిన ప్రభుత్వాలకివి ఆనవు. పాలకులకివి జలజల ఓట్లు రాల్చే అంశాలే కావు కనుక పట్టదు. పేరుకుపోయిన కేసుల ఒత్తిళ్లలో నలిగే కోర్టులు సకాలంలో సరైన న్యాయం చేసే ఆస్కారం లేదు. సామాజిక వేత్తలు, విద్యావంతులు, మేధావి వర్గం తీవ్రంగా ఆలోచించాల్సిన పరిణామాలివి. సామాజిక సమిష్ఠి బాధ్యత కరువౌతోంది. డబ్బు డబ్బును పెంచినట్టే నేరం నేర ప్రవృత్తిని, సంస్కృతిని పెంచుతోంది. మన నేర–న్యాయ వ్యవస్థ లొసుగులు మనుషుల్లో విచ్చలవిడితనాన్ని ప్రేరేపిస్తున్నాయి. కుదేలయిన కుటుంబం బలమైన కుటుంబం ఓ మంచి సమాజానికి మూల స్తంభం. రక రకాల కారణాలు ఈ రోజున కుటుంబాన్ని చిద్రం చేశాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగవుతోంది. ఇంటి సభ్యుల కష్టనష్టాలకు అనునయింపు, తప్పిదాలకు దిద్దుబాటో, సర్దుబాటో చేసే కుషన్ సమిష్ఠి కుటుంబ వ్యవస్థలో దొరికేది. విలువలు, మానవ సత్సంబం ధాలు కూడా వారసత్వంగా లభించేవి. కానీ, సామాజిక–ఆర్థిక కార ణాల వల్ల ఉమ్మడి కుటుంబాలు క్రమంగా తగ్గుతున్నాయి. చిన్న కుటుంబాలు, భార్య–భర్త, చిన్న పిల్లలు మాత్రమే ఉండే క్యూబికల్ ప్యామిలీ నమూనా బలపడుతోంది. ఇది ఇంట్లో ఉండే వృద్ధుల పాలిట శాపమౌతోంది. స్థాయి, స్థోమత ఉన్న వారు కూడా తలి దండ్రుల్ని నిర్దయగా వృద్ధాశ్రమాల పాల్జేస్తున్నారు. అవి సౌకర్యంగా ఉండి, వృద్ధులు సమ్మతితో వెళితే వేరు! కానీ, బలవంతంగా పంపే సందర్భాలు, ఆశ్రమాల్లో వసతులు లేక వారు అల్లాడే దయనీయ పరిస్థితులే ఎక్కువ. వేర్వేరు సమాజాల మధ్య, సమూహాల మధ్య, కుటుంబాల మధ్య, చివరకు వ్యక్తుల మధ్య సంబంధాలు సన్న గిల్లాయి. ఇందుకు సామాజిక, ఆర్థికాంశాలే ప్రధాన కారణం. ముఖ్యంగా పట్టణ, నగర ప్రాంతాల్లో ఈ ‘ఇరుగుపొరుగు పట్టని తనం’(సోషల్ అన్కన్సెర్న్నెస్) బాగా పెరిగిపోయింది. ఆ ఇంట్లో ఏం జరుగుతోందో ఈ ఇంటి వారికి పట్టదు. పొరుగువారి ఆర్థిక స్థితి, సాధకబాధకాల సంగతలా ఉంచి ఆయా ఇళ్లకు ఎవరు వచ్చి వెళు తున్నారు? ఇంట్లో వాళ్లెలా ఉంటున్నారు అన్నది కూడా తెలియని పరిస్థితి. తలుపేసి ఉంచిన ఇంట్లోని వారు ఏ కారణంగానో చనిపోతే, శవం కుళ్లి వాసనపట్టే వరకు అటువైపు తొంగి చూసే వారుండరు. పలు రెట్లుగా భూముల విలువ పెరిగిపోవడం కుటుంబాల్లో నిప్పులు పోసి, మానవ సంబంధాల్ని మంట కలుపుతోంది. గుంటూరు జిల్లాలో తల్లిని తనయ చంపిన తాజా ఘటన ఇందుకు నిలువెత్తు సాక్ష్యం. భర్తను, కొడుకును పోగొట్టుకున్న ఓ తల్లికి కన్నకూతురే హంతకురాలవడం క్షీణించిన మానవ సంబంధాలకు పరాకాష్ట! భూమి విలువల పెరుగుదల రాజధాని అమరావతి పరిసరాల్లోని ఎన్నో కుటుంబాల్లో అశాంతి రగిలిస్తోంది. తలిదండ్రులు–పిల్లల మధ్య, అన్నదమ్ములు–అక్కచెల్లెల్ల మధ్య గోడలు మొలుస్తున్నాయి, గొడవలు పెరుగుతున్నాయి. సంపద ఘర్షణ, ఆస్తి తగాదాలు, భూవ్యాజ్యాలతో లిటిగేషన్ పెరిగింది. సివిల్ తగాదాలు క్రిమినల్ ఘటనలవుతున్నాయి, వచ్చి పోలీసుస్టేషన్లలో కేసులై వాలుతు న్నాయి. ఈ జాప్యం కూడా సహించనప్పుడు భౌతిక దాడులు, దారుణ హత్యలకు తలపడుతున్నారు. ఆజ్యం పోస్తున్న అసమానతలు ఆర్థిక అసమానతలు అధికంగా ఉన్న సమాజాల్లో మానవ సంబం ధాల పరమైన నేరాలు పెరిగాయి. ఎక్కడికక్కడ హింస, అశాంతి ప్రబలుతోంది. మధ్య, దిగువ మధ్యతరగతి ఉన్నపళంగా దనవంతు లైన చోట వ్యత్యాసాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. సంపన్నులు, వారి సౌఖ్యాలను పోల్చుకొని నయా సంపన్నులూ పరుగెడుతున్నారు. నిర్హేతుకంగా పెరిగిన వస్తువ్యామోహం స్థాయిని మించిన ఆశలు రేపి, తప్పుటడుగులు వేయిస్తోంది. సంపన్న–పేద కుటుంబ వ్యక్తుల మధ్య పోలికలు అశాంతినే కాక నేర ప్రవృత్తినీ ప్రేరేపిస్తు న్నాయి. కక్ష–కార్పణ్యాలకు, పశుప్రవృత్తికి కారణమవుతున్నాయి. హయత్‌నగర్‌లో ఓ మహిళ వివాహేతర సంబంధం నెరపుతున్న వ్యక్తి పనుపున కన్నతల్లినే హతమార్చిన దుర్ఘటన దీనికి నిదర్శనం. ఈ కేసులో నిందితుడు ఏ సంపాదనా లేని జులాయిగా ఉండీ... ఓ కారు, ప్రియురాలు, సౌఖ్యాలు అనుభవిస్తున్నాడు. ఇంకేదో ఆశిస్తున్నాడు. సఖ్యతతో ఉన్న యువతితో పెళ్లిపైనే కాక, తల్లి ఆస్తిపై కన్నేశాడు. భర్తెలాగూ తాగుబోతు, ఇక ఆమె అడ్డుతొలిగితే ఆస్తినెలాగయినా దక్కించుకోవచ్చన్న కుట్రకోణం దర్యాప్తులో వెల్లడవుతోంది. నమ్ము కున్న యువతిపై బ్లాక్‌మెయిల్‌కూ తలపడ్డాడు. అతని చేతిలో కీలు బొమ్మయిన ఆమె తన తల్లి హత్యకూ వెనుకాడలేదు. ఇంకో ఘట నలో, భార్యాభర్తా కూడబలుక్కొని, ఓ సంపన్నుడిని లైంగికంగా ముగ్గులోకి దించారు. రహస్యంగా తీసిన వీడియోతో బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజడం వంటివి దేనికి సంకేతం? ప్రభావకాలపై కన్నేయాలి విలువలు బోధించని నేటి విద్యా విధానం, నిఘా–నియంత్రణ లోపించిన టీవీ కార్యక్రమాలు, సామాజిక మాధ్యమ వేదికల్ని చేరువ చేసిన మొబైల్, ప్రపంచీకరణలో పెరుగుతున్న ఆర్థిక అంతరాలు... ఇవన్నీ కూడా మానవ సంబంధాల్ని చెదరగొడుతున్నాయి. విలువల్ని హరించి, జుగుప్సాకరమైన అట్టడుగుస్థాయికి చేరుస్తున్నాయి. వేధిం పులు, బ్లాక్మెయిల్ బెదిరింపులు, డబ్బు గుంజడం, హింస, హత్యలు వంటి నేరాలకు ఇది దారితీస్తోంది. వీటిని ఒట్టి నేరాలుగానే చూడకుండా, నేపథ్యంలో ఉన్న సామాజికార్థికాంశాల్నీ పరిశీలించాలి. మూల కారణాల్ని వెతికి, తగిన సామాజిక, చట్టపరమైన చికిత్స చేయాల్సిన అవసరముంది. నక్సలైట్ల హింసను శాంతిభద్రతల అంశంగా కాక సామాజికార్థికాంశంగా చూడాలని చెప్పే మేధావి వర్గం ఇక్కడెందుకో దృష్టి సారించడం లేదు. ఈ ఉపేక్ష సమాజానికి ఎన్నో రెట్ల నష్టం చేస్తోంది. విద్య ఫక్తు వ్యాపారమైన తర్వాత విలువల్ని బోధించడం కనుమరుగైంది. పాఠాలు బట్టీ పెట్టించి, ఫలితాలు సాధించి, ఉద్యోగాలు పట్టిచ్చే పరుగు పందెమయింది విద్య. టీవీ వినోద కార్యక్రమాల ముసుగులో వస్తున్న సీరియళ్లు మానవ సంబంధాలపై గొడ్డలి వేటు. ఆస్తి తగాదాలు, ఆధిపత్య పోరాటాలు, వివాహేతర సంబంధాలు, కక్ష–కార్పణ్యాలు, పగతీర్చు కునే హింస–దౌర్జన్యాలు, దారుణ హత్యలు... ఇవి లేకుండా వస్తున్న సీరియల్స్ ఎన్ని? మహిళను కేంద్ర బిందువు చేసి ఈ కాల్పనిక దౌష్ట్యాల్ని రుద్దితే, మహిళల్ని ఎక్కువగా ఆకట్టుకొని టీఆర్పీలు సాధించొచ్చనే కక్కుర్తి వారికి కలిసివస్తోంది. ఎక్కువ మహిళలు ఇవే చూస్తున్నారు. ఆ క్రమంలో ఇది ఎదిగే పిల్లలపై దుష్ప్రభావం చూపు తోంది. వారూ అనుకరిస్తున్నారు, వాటినే అనుసరిస్తున్నారు. మానవ సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇలా ఉండకూడదనే చర్చ గానీ, మార్గదర్శకాలు గానీ, చట్టపరమైన ప్రతిబంధకాలు గానీ లేవు. ఏ నియంత్రణా లేదు. ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ వంటి సామా జిక మాధ్యమ వేదికల్ని యువతకు చేరువ చేసిన మొబైల్ ఈ విష యంలో మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తోంది. వీటన్నింటిపై లోతైన అధ్యయనం చేసి తగు పరిష్కారం కనుక్కోకుంటే నష్టం మరింత వేగంగా, తీవ్రంగా జరిగే ప్రమాదం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
మనం మారితేనే మనుగడ
పాట్నాలో ఉప ముఖ్యమంత్రి కుటుంబాన్ని రబ్బరు పడవలో సురక్షిత ప్రాంతానికి తరలించిన స్థితి! నెల కింద కురిసిన భారీ వర్షం ముంబాయిని ముంచెత్తినపుడు పక్కనే మరాఠ్వాడాలో కరువు విలయతాండవం చేసింది. చైన్నైలో ఓ యేడు వరదలు ముంచెత్తితే మరో ఏడాది నీటి ఎద్దడి. హైదరాబాద్‌లో ఈసారి సగటు వర్షపాతం ఎక్కువ నమోదైనా, భూగర్భ జలమట్టాలు పెరక్కపోగా దాదాపు మరో మీటరు అడుక్కు పోయాయి. ఈ విపరీతాలన్నీ ‘వాతావరణ మార్పు’ కాక మరేంటి? ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే, తట్టుకునే సామర్థ్యాల్ని పెంచుకోవాలి. ప్రమాదస్థాయిని గ్రహించి ప్రభుత్వాలు–పౌరసమాజం వ్యూహాత్మకంగా జరిపే సమిష్టి కృషితోనే నగరజీవికిక మనుగడ! ‘పాట్నాతో సహా ఉత్తర బీహార్‌లో రాగల 48 గంటల్లో భారీ వర్ష సూచన’ అని వాతావరణ విభాగం హెచ్చరించి 24 గంటలయినా ప్రభుత్వ ఉన్న తాదికారులు, స్థానిక పాలకులు కొత్తగా చేపట్టిన సహాయక చర్యలేమీ లేవు. ఇప్పటికే అక్కడ కురుస్తున్న వర్ష బీభత్సమలా ఉంది. పాట్నా నగరంలోనూ వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీధులన్నీ కాలువలయ్యాయి. డజన్‌కు పైగా పెద్ద కాలనీల్లో మోకాళ్ల నుంచి నడుము లోతుకు నీరు ప్రవహిస్తోంది. నగరంలో విద్యుత్తు లేదు. ఉన్న జనరేటర్లన్నీ నీట మునిగి పనిచేయట్లేదు. నీటి అడుగున రోడ్డుపై ఎక్కడ మ్యాన్‌హోల్ నోరు తెరచి ఉందో...? ఎక్కడ లోతైన గుంత నీరు కమ్మి ఉందో....? తెలియదు. ఎలా నడవడం! జాతీయ పత్రికలన్నీ ఇదే రిపోర్టు చేశాయి. ఈ పరిస్థితి ఒక్క పాట్నాది కాదు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల దుస్థితీ ఇదే! మొన్న చెన్నై, నిన్న ముంబాయ్, నేడు పాట్నా, రేపు..... ఏదో నగరం, తప్పదీ విపత్తు ఎదుర్కొవడం! ఎంతకాలమీ దురవస్థ? ఎవరి దగ్గరా సమాధానం లేదు. ఎందుకంటే, ఈ సవాళ్లను ఎదుర్కోగల కార్యాచరణ ప్రణాళిక ఎవరూ రూపొందించలేదు గనుక! భూతాపోన్నతి ఫలితంగా వస్తున్న ‘వాతావరణ మార్పు’ విపరిణామాల్ని తట్టుకొని, ఎదుర్కొనే పథక రచనకు ప్రభుత్వాలు పూనుకోవట్లేదు. ఇక విపత్తుల్ని ధీటుగా ఎదుర్కొనే ఆచరణ అగమ్య గోచరమే! గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కరువై, పౌర సదుపాయాలు కొరవడి పట్టణాలు, నగరాలవైపు ప్రజలు పరుగు తీస్తున్న క్రమంలో నగరీకరణ అతి వేగంగా జరిగిపోతోంది. సరైన పథకం, ప్రణాళికల్లేని పట్టణ–నగరీకరణ కొత్త సవాళ్లను విసురుతోంది. అసాధారణ జనాభా–అరకొర సదుపాయాలకు తోడు ప్రకృతి వైపరీత్యాలు... వెరసి మహానగరాలు మురికి కూపాలవుతున్నాయి. నగరవాసుల జీవితాలు దుర్భరమౌతున్నాయి. వాతావరణ మార్పు దుష్పరిణామాల్లో భాగంగా ముంచుకొచ్చే అతివృష్టి–అనావృష్టి వంటి సవాళ్లు ఇప్పటికే ముంబాయి, చెన్నై నగర వాసులకు నమూనా రుచి చూపించాయి. మున్ముందు ఈ సమస్యలు మరింత జఠిలం కానున్నాయనడానికి పాట్నా సరికొత్త ఉదాహరణ మాత్రమే! ఆలోచనలు మారితేనే.... కాలం చెల్లిన ఆలోచనలు, విధానాలతో పాలకులు నెట్టుకొస్తున్నారు. భారీ వర్షాలు, వరదలు రాగానే హడావుడి చేస్తారు. పట్టణ ప్రణా ళిక–నీటి నిర్వహణ... అంటూ ఏవేవో ప్రకటనలు చేస్తారు. రోజులు గడిచాక అంతా మరచిపోతారు. మన నగర–పట్టణ ప్రణా ళికాధికారులు, ఇంజనీర్లు ఇంకా 70లు 80ల నాటి ఆలోచనా విధానంతోనే సాగుతున్నారు. అసలు సివిల్ ఇంజనీరింగ్ సిలబస్ పుస్తకాల్నే సమూలంగా మార్చాలి. పర్యావరణ సమస్యలు, ప్రకృతి విపత్తుల నుంచి నగరాలను కాపాడే వ్యవస్థలు–విధానాలే ప్రస్తుతం మనకు లేవు. మారే పరిస్థితులకు అనుగుణంగా చేపట్టాల్సిన అత్య వసరాలు, ప్రత్యామ్నాయాల అమలులో చొరవే కాదు చిత్తశుద్దీ కొరవడుతోంది. చట్టాల్లోనూ సమూల మార్పులు రావాలి. పౌరుల బాధ్యతను నిర్దేశించే నిబంధనలిపుడు పెద్దగా లేవు. సంస్థలుగా, సమూహాలుగా పౌరసమాజం నిర్వహించాల్సిన కర్తవ్యాలు ఎక్కడా అమలు కావు. నిఘా, నియంత్రణా వ్యవస్థల్లో అవినీతి తారస్థాయిలో ఉంది. అక్రమ కట్టడాలకు అంతే లేదు! నిబంధనల్ని పాటించడం కన్నా నిఘా–నియంత్రణ వ్యవస్థలకు లంచమిచ్చి పబ్బం గడపడం తేలిక, చౌక కావడంతో పౌరులు అటే మొగ్గుతున్నారు. ఫలితంగా చట్టాలు, నిబంధనల అమలు గాల్లో దీపమే! 4 నుంచి 8 (సగటున 6)సెంటీమీటర్లు మించి వర్షం కురిస్తే తట్టుకోలేని స్థితి మన మహానగరాలది. వలసల ఒత్తిడి తగ్గించడానికి మహానగరాలకు అన్ని వైపులా 30, 40 కిలోమీటర్ల దూరంలో శాటిలైట్ టౌన్‌షిప్‌లను అభివృద్ధి పరచాలన్న ప్రతిపాదన సవ్యంగా అమలు కావడం లేదు. ఇప్పుడు హైదరాబాద్‌కు లభించిన అవుటర్ రింగ్‌రోడ్డు, రేపు రాబోయే రీజనల్ రింగ్రొడ్డు వంటి మౌలిక సదుపాయాల పరిపుష్టి దృష్ట్యా అలాంటి టౌన్షిప్లుంటే ఇవ్వాళ నగరంపై ఒత్తిడి తగ్గేది. అందరి పరిస్థితీ అధ్వాన్నమే! ఇది ఒక హైదరాబాద్ సమస్యే కాదు. ముంబాయి, చెన్నై, బెంగ ళూరు, కలకత్తా, ఢిల్లీ... ఎవరి పరిస్థితీ బాగోలేదు. ఒకరిది వరద మునక, ఇంకొకరిది నీటి ఎద్దడి, మరొకరిది ఉష్ణతాపం, వేరొకరిది మురికి కూపం, మరొకరిది వాయు కాలుష్యం ... ఇలా అందరూ ఏదో రూపంలో సమస్యల్ని ఎదుర్కొంటున్న వారే! ప్రకృతి వైపరీ త్యాల్ని తట్టుకునే పరిస్థితులు ఎవరికీ లేవు. ముఖ్యంగా ‘వాతావరణ మార్పు’ వల్ల కురుస్తున్న అసాధారణ వర్షాలు నగరాలను వరదతో ముంచెత్తుతున్నాయి. పాట్నా చూడండి, ఉప ముఖ్యమంత్రి కుటుంబాన్ని రబ్బరు పడవలో సురక్షిత ప్రాంతానికి తరలించిన స్థితి! ఇలా ఎంతమందికి రక్షణ కల్పించగలరు? మొలలోతు నీటిలోనే ఇంకా కొట్టుమిట్టాడుతున్న సామాన్యుల పరిస్థితి ఏంటి? చెన్నైలో 2015 వరదల తర్వాత అధ్యయనం జరిపిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. నగరంలో చెరువులు, కుంటలు, నదీ తీరాల దురాక్రమణ, అక్రమ కట్టడాల వల్లే ఈ సమస్య ముదిరినట్టు పేర్కొంది. అడ్డదిడ్డమైన టౌన్ ప్లానింగ్ కూడా కారణమంది. 1975 తర్వాత ముంబాయి వరద విపత్తుపై పలు కమిటీలు ఏర్పడి, ఎన్నో అధ్యయనాలు జరిపాయి. ఐఐటీ ముంబాయి వారిచ్చిన దానితో సహా ఎన్నో నివేదికలొచ్చాయి. ప్లానింగ్ లోపాలతో పాటు అక్రమ కట్టడాలు, ప్లాస్టిక్–ఇతర వ్యర్థాల డంప్ ముంపులకు కారణమని పేర్కొన్నాయి. అక్రమ కట్టడాలకు తోడు డ్రయినేజీ వ్యవస్థను ఆధు నీకరించకపోవడం బెంగళూరులో ముంపు ప్రమాదాలకు ముఖ్య కారణమని ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, బెంగళూరు’ తన నివేదికలో చెప్పింది. ప్రణాళికలేని పట్టణాభివృద్దే ‘గౌహతి’ ముంపు కారణమని ‘అస్సాం రాష్ట్ర విపత్తుల ప్రాధికార సంస్థ’ నివేదించింది. ఇలా ఎక్కడికక్కడ పలు నివేదికలు, సిఫారసులున్నాయి. వాటి అమలే శూన్యం! పేద–మధ్యతరగతికే పెనుశాపం నగరాలు, పట్టణాలు... ఇలా విపత్తుతో ఏవి నీట మునిగినా ఎక్కువ నష్టపోయేది పేద–మధ్యతరగతివారే! ఇళ్లు జలమయం. వండిన వంట, ధాన్యంతో సహా సరుకు నిరుపయోగమౌతోంది. ఉన్నపళంగా ఉపాధి పోతుంది. రవాణా దుర్బరం. మనుగడ కష్టమౌతుంది. ప్రస్తుత సీజన్లో బీహార్‌లో 40 మంది చనిపోతే, ఉత్తరప్రదేశ్‌లో సెప్టెంబరు 26–30 మధ్యలో 110 మంది దుర్మరణం పాలయ్యారు. దాదాపు అంతా అల్పాదాయవర్గాల వారే! దేశంలోని నగరాలు, పట్టణాల్లో పాతిక నుంచి యాబై శాతం జనాభా పేద, అల్పాదాయ వర్గాలే! వాతావరణ మార్పుల మూలంగా రానున్న కాలంలో ఎక్కువ నష్టపోయది వీరేనని అధ్యయనాలు చెబుతున్నాయి. భూతాపోన్నతి వల్ల ఆహారోత్పత్తి తగ్గడం, కొత్త జబ్బులు పెరగటం, వరద–కరువు వంటి పరస్పర విరుద్ధ వైపరీత్యాలు... వీటన్నిటి ప్రత్యక్ష ప్రభావం పేదలపైనే అన్నది నివేదికల సారం! మరో 50 ఏళ్లలో భారత జనాభా 160 కోట్లకు చేరనుందనేదొక అంచనా! అప్పుడు దాదాపు 70 కోట్ల మంది నగరాల్లో నివసిస్తారు. ముంచుకొస్తున్న ‘వాతావరణ మార్పు’ల విపరిణామాలను తట్టుకునే, ఎదుర్కోగలిగే సామర్థ్యాన్ని మన నగరాలు సంతరించుకోకుంటే జీవనం దుర్బరమే! వాతావరణ మార్పు దుష్ప్రభావం వల్ల పేద, ఎదుగుతున్న (మూడో ప్రపంచ) దేశాలకు జరిగే నష్టమే ఎక్కువని అమెరికా ‘జాతీయ శాస్త్ర అధ్యయనాల సంస్థ’ (ఎన్ఏఎస్) నివేదిక చెబుతోంది. ఇది వాతావరణ మార్పుల దెబ్బే! పాలకులు ఇంకా సందేహిస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో సమస్య మరింత తీవ్రమవడానికి వాతావరణ మార్పే కారణమంటే వారు నమ్మట్లేదు. బీహార్‌లో 25 ఏళ్ల తర్వాత ఇంతటి వర్షపాతం (10 శాతం ఎక్కువ) నమోదైంది. నెల కింద కురిసిన భారీ వర్షం ముంబాయిని ముంచెత్తినపుడు పక్కనే మరాఠ్వాడాలో కరువు విలయతాండవం చేసింది. చైన్నైలో ఓ యేడు వరదలు ముంచెత్తితే మరో ఏడాది నీటి ఎద్దడి. హైదరాబాద్‌లో ఈ సారి సగటు వర్షపాతం ఎక్కువ నమోదైనా, భూగర్భ జలమట్టాలు పెరక్కపోగా దాదాపు మరో మీటరు అడుక్కుపోయాయి. ఈ విపరీతాలన్నీ ‘వాతావరణ మార్పు’ కాక మరేంటి? వాటినెదుర్కొనే, తట్టుకునే సామర్థ్యాల్ని పెం చుకోవాలి. కేంద్ర, రాష్ట్ర, స్థానిక పాలనా సంస్థలు సమన్వయంతో పనిచేయాలి. నగరాల్లో అక్రమ కట్టడాల్ని అడ్డుకోవాలి. పచ్చదనం పెంచాలి. జల, వాయు కాలుష్యాల్ని అరికట్టి పర్యావరణ పరిరక్షణకు పూనుకోవాలి. ప్రమాదస్థాయిని గ్రహించి ప్రభుత్వాలు, పౌర సమా జం వ్యూహాత్మకంగా జరిపే సమిష్ఠి కృషితోనే నగరజీవికిక మనుగడ! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
అత్యవసర పరిస్థితిని ప్రకటించండి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచానికి పెను సవాలుగా మారిన వాతావరణ మార్పు పరిస్థితుల నుంచి భావితరాలనే కాకుండా ప్రస్తుత తరాన్ని రక్షించేందుకు దేశంలో వాతావరణ అత్యవసర పరిస్థితి ప్రకటించాలని ‘కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ’ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సదస్సులో తీర్మానించారు. వాతావరణ మార్పులకు దారితీస్తున్న భూతాపం వల్ల మానవాళికి ఏర్పడుతున్న ముప్పును గ్రహించి ప్రపంచంలోని 18 దేశాలు ఇప్పటికే వాతావరణ అత్యవసర పరిస్థితిని ప్రకటించాయన్నారు. భారతదేశంలో పర్యావరణ పరిరక్షణకు ‘వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్వైర్మెంట్ అండ్ డెవలప్మెంట్ సంస్థ’మార్గదర్శకాల ప్రకారం కేంద్రం ప్రత్యేక విధానాలతో ముందుకు రావాలని తీర్మానించారు. హరితవిప్లవ మండలి, క్యాపిటల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలో జరిగిన సదస్సులో ఎన్జీటీ మాజీ చైర్మన్ జస్టిస్ స్వతంత్రకుమార్, గ్రేస్ చైర్మన్, సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి, పర్యావరణ వేత్తలు బూరె లాల్, విక్రంసోనీ, ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, ప్రొఫెసర్ పుష్ప కుమార్ లక్ష్మణ్, లక్ష్మారెడ్డి, సేవ్ రివర్ కన్వీనర్ ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. జీవించే హక్కులో భాగం: జస్టిస్ స్వతంత్ర కుమార్ ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును రాజ్యాంగం కల్పించింది. అందులో మంచి వాతావరణాన్ని కలిగి ఉండడం ఒక భాగమే. మన సంప్రదాయంలో ప్రకృతిని పూజించే మనం పూజ తర్వాత చెట్లను నరికేస్తున్నాం. పర్యావరణ రక్షణకు ఎన్నో చట్టాలున్నా.. సమర్థంగా అమలు చేయడంలో లోపాలున్నాయి. ప్రతిఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో బాధ్యత నిర్వర్తించాలి. ప్రజల్లో పూర్తి అవగాహనతో పర్యావరణ పరిరక్షణ: దిలీప్ రెడ్డి పర్యావరణ పరిరక్షణకు ప్రజల్లో వెల్లువెత్తే ఆందోళన ప్రభుత్వాలను దిగివచ్చేలా చేస్తుంది. దీనికి ఉదాహరణే నల్లమలలో యురేనియం తవ్వకాలపై ప్రభుత్వాలు వెనక్కు తగ్గడం. ఏపీలో గత ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలపై ఇష్టానుసారంగా అనుమతులిచ్చింది. ఆ తప్పిదాలను సరిదిద్దుతూ ఇప్పటి ప్రభుత్వం మేనిఫెస్టో హామీ మేరకు ఆ తవ్వకాల అనుమతులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. వాతావరణ మార్పులతో భావితరాలు నష్టపోతాయన్న అభిప్రాయాలు కల్పించారు. కానీ నేటి తరాలూ నష్టపోతున్నాయని గ్రహించి పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలి. దేశంలో విపరీత పరిణామాలు.. వాతావరణ మార్పుల కారణంగా దేశంలో విపరీత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, నీటికోసం చెన్నై ఎన్ని అవస్థలు పడుతోందో చూస్తున్నామని, వర్షాలతో ముంబై ఎలా అతలాకుతలమవుతోంది యావత్తు సమాజం చూసిందని ప్రొ.పురుషోత్తం రెడ్డి అన్నారు. -
‘వాతావరణ అత్యవసర పరిస్థితిని ప్రకటించాలి’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచానికి పెను సవాలుగా మారిన వాతావరణ మార్పు పరిస్థితుల నుంచి భావితరాలనే కాకుండా ప్రస్తుత తరాన్ని రక్షించేందుకు దేశంలో వాతావరణ అత్యవసర పరిస్థితి ప్రకటించాలని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సదస్సులో తీర్మానించారు. వాతావరణ మార్పులకు దారితీస్తున్న గ్లోబల్ వార్మింగ్ వల్ల మానవాళికి ఏర్పడుతున్న ముప్పును గ్రహించి ప్రచంలోని 18 దేశాలు ఇప్పటికే వాతావరణ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన దృష్ట్యా, భారతదేశంలో పర్యావరణ పరిరక్షణకు వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్వైర్మెంట్ అండ్ డెవలెప్మెంట్ సంస్థ మార్గదర్శకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విధానాలతో ముందుకు రావాలని తీర్మానించారు. ఈ సమావేశంలో పలువురు పర్యావరణ వేత్తలు పాల్గొని ప్రసంగించారు. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిందని, దానిలో భాగంగానే పౌరులందరికీ మంచి వాతావరణం ఉండాలని విస్తృత స్థాయిలో నిర్వచనం చెప్పినట్లు జస్టిస్ స్వతంత్ర కుమార్ అభిప్రాయపడ్డారు. చట్టాలు కఠినంగా అమలు చేస్తేనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని అన్నారు. ఒక్క ప్లాస్టిక్ బాటిల్ వల్ల 20 మందికి కాన్సర్.. సమావేశంలో స్వతంత్ర కుమార్ మాట్లాడుతూ.. ‘ప్రపంచంలో 785 మిలియన్ల ప్రజలకు సురక్షిత మంచినీరు దొరకడం లేదు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, వాతావరణాన్ని నాశనం చేస్తుండడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణం అందించడం మన బాధ్యత. ఢిల్లీలో విద్యార్థులకు బ్లాక్ మాస్కులు ధరించి పాఠశాలకు వెళ్తున్నారు. భవిష్యత్తు తరాలకు పాడైపోయిన వాతావరణ పరిస్థితులు ఇవ్వడం ఎంతవరకు సబబు. కోర్టుల జోక్యం కారణంగా పర్యావరణం కొంత కాపాడు కలుగుతుంది. అడవులు, పర్యావరణ పరిరక్షణకు పటిష్ట విధానాలు రావాలి. చెరువుల నగరంగా ఉన్న బెంగుళూర్లో చెరువులన్నీ మాయం అయ్యాయి. ఢిల్లీలో 1650 మెట్రిక్ టన్నుల చెత్త జమ అవుతుంది. ఒక ప్లాస్టిక్ బాటిల్ కాల్చడం వల్ల 20 మందికి కాన్సర్ రోగాలు వచ్చే ప్రమాదం. పర్యావరణాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి. పర్యావరణ చట్టాలు అనేకం వున్నాయి, కానీ అమలు జరగడం లేదు. కాలుష్యానికి సరిహద్దులు లేవు, అందరూ పర్యావరణ పరిరక్షణ చేయాలి. సమిష్టిగా ప్రజలు, ప్రభుత్వం కలిసి పనిచేస్తేనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది’ అని అన్నారు. భయానక పరిస్థితులు తప్పవు.. నల్లమల్ల అడవుల్లో యురేనియం తవ్వకాలు ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారరి ఆర్టీఐ మాజీ కమిషనర్ దిలీప్‌రెడ్డి అన్నారు. ప్రజల ఒత్తిడితో ప్రభుత్వం దిగివచ్చి యూనియన్ తవ్వకాలకు అనుమతి ఇవ్వడం లేదని చెప్పినట్లు ఆయన గుర్తుచేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘అనంతగిరిలో బాక్సైట్ తవ్వకాలను నిషేధించారు. ప్రజలు నిరంతరం అప్రమత్తంగా పర్యావరణాన్ని కాపాడుకోవాలి. లేదంటే చెన్నై నీటి కరువు, ముంబై వరదలు, ఢిల్లీ వాయు కాలుష్యము తరహాలో భయానక పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నీటి కరువు కారణంగా చెన్నైలో ఆఫీసులు రైల్వేలు సైతం తమ సర్వీసులో నిలిపివేయాల్సి వచ్చింది.’ అని పేర్కొన్నారు. గంటకు ఒకరు చనిపోయే పరిస్థితి.. రెన్యువబుల్ ఎనర్జీపై ప్రపంచమంతా దృష్టిసారించాలని ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ బూరెలాల్ అభిప్రాయపడ్డారు. ‘సోలార్ ఎనర్జీ ద్వారానే విద్యుత్ ఉత్పత్తి జరగాలి. అప్పుడే పర్యావరణానికి ఎటువంటి హాని జరగదు. న్యూక్లియర్ ఎనర్జీ వల్ల మన అవసరాలు తీరవు పర్యావరణానికి హాని జరుగుతుంది. దీనివల్ల వాయు, భూమి, నీటి కాలుష్యం ఏర్పడుతుంది. భూమి కేవలం ఎనిమిది బిలియన్ల ప్రజలను మాత్రమే మోయగలుగుతుంది. 21వ శతాబ్దం కల్లా ప్రపంచ జనాభా 9 మిలియన్ దాటుతుంది అదే జరిగితే పర్యావరణం తనంతట తానుగా విధ్వంసం సృష్టించే పోతోంది. వైద్యంపై పెట్టే ఖర్చు కొన్ని వందల రెట్లు పెరుగుతుంది. వాయు కాలుష్యం వల్ల ఢిల్లీలో గంటకు ఒకరు చనిపోయే పరిస్థితి ఏర్పడింది’ అని అన్నారు. -
ఒంటికి సెగ తగిలినా కదలరా?
బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారోతో సహా ఇప్పటికీ చాలా మంది ‘వాతావరణ మార్పు’ను అతిశయోక్తిగా పరిగణిస్తున్నారు. మనదేశంలోనూ చాలా మంది ‘భూతాపోన్నతి’, ‘వాతావరణ మార్పు’, ‘కర్బన ఉద్గారాలు’ వంటి మాటల్ని ఏ జర్నలిస్టులో, న్యాయవాదులో, పర్యావరణ కార్యకర్తలకో పరిమితమైన పదజాలంగా భావిస్తున్నారు. ఆ దశ ఎప్పుడో దాటిపోయింది. కాలుష్యాల వల్ల వాతావరణ వేడి పెరిగి వింత జబ్బులు రాజ్యమేలుతూ ప్రజానీకాన్ని ఆస్పత్రుల పాల్జేస్తున్నాయి. భరించలేని వేడి–చలి. రుతువులు గతి తప్పడం, అడవులు అంతరించడం, జబ్బులు శృతిమించడం.... ఇలా ప్రజలకిప్పుడిప్పుడే ఈ వేడి తెలిసివస్తోంది. ప్రభుత్వాలు అప్రమత్తం కావాల్సిన సమయమిది. విశాల జనహితంలో... ప్రజాభిప్రాయానికి విలువిస్తేనే ప్రజాస్వామ్యం! ‘జనం కిక్కిరిసిన థియోటర్లో ‘ఫైర్ ఫైర్’ అని, మంట లేకున్నా ఉత్తుత్తిగా అరవడం ఎంత తప్పో మనందరికీ తెలుసు. అగ్గి అంటుకొని అది నలువైపుల విస్తరిస్తున్నా ఏమీ జరుగనట్టు చూస్తూ మౌనంగా కూర్చోవడం కూడా అంతే తప్పనీ మనకు తెలుసు....’’– రిచర్డ్ ఆలె, జియోసైన్సెస్ ప్రొఫెసర్, పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ (యూఎస్) పృధ్వికి అనేక విపత్తులు కలిగిస్తున్న వాతావరణ మార్పు, అందుకు కారణమవుతున్న భూతాపోన్నతి గురించి మనందరికీ తెలుసు. కాలుష్యాల వల్ల భూమి, భూమ్యావరణం వేడెక్కి అనేక సమస్యలకు దారితీస్తోంది. తగు ప్రత్యామ్నాయాలతో పరిస్థితిని సమర్థంగా ఎదు ర్కోకుంటే మున్ముందు ప్రమాద తీవ్రత ఎన్నో రెట్లు ఉంటుందనీ తెలుసు. ముఖ్యంగా మన ప్రభుత్వాలు, పాలకులకు బాగా తెలుసు. అయినా, నిమ్మకు నీరెత్తినట్టు కదలిక లేకుండా కూర్చోవడమే విస్మయం కలిగిస్తోంది. ఐక్యరాజ్యసమితి (యూఎన్) నేతృత్వంలో జరిగిన పారిస్ ఒప్పందంలో భాగంగా భారత్ ప్రకటించిన ‘జాతి కట్టుబడ్డ కృషి సంకల్పం’(ఐఎన్డీసీ) అమలు కూడా అంతంతే! అక్కడి మన హామీలను నిలబెట్టుకునేందుకు చేస్తున్న కృషి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..!’ అన్నట్టుంది. భూగోళాన్ని ఉద్దరించడానికి మనం చేసే కృషి సంగతలా ఉంచితే, మనకు మనం ఈ విపత్తు నుంచి తప్పించుకునేందుకు చేస్తున్నదేమిటి? ప్రకృతి వైపరీత్యాల వల్ల సగటు మనిషి బతుకు దుర్భరం కాకుండా తీసుకుంటున్న నివా రణ చర్యలేవి? అని ప్రశ్నించుకోవాలి. వేగంగా ప్రభావం చూపుతున్న వాతావరణ మార్పు, దాని దుష్పరిణామాలు నేరుగా మనకు తగులు తున్నా గ్రహించే తెలివిడి, స్పందించే సున్నితత్వం ప్రభుత్వాల్లో కొర వడుతోంది. గాలి కాలుష్యమై ఊపిరాడక మొన్న ఢిల్లీ ఉక్కిరిబిక్కిర యింది. తాగునీరే కరువై నిన్న చెన్నై తల్లడిల్లింది. వర్షపు నీటికే జనజీవనం స్తంభించి నేడు ముంబాయి మూలుగుతోంది. వైద్యులకే అంతుబట్టని వింత జబ్బులు పలు రాష్ట్రాల్లో జనావళిని మంచమెక్కిం చాయి. అయినా... తాత్కాలిక ఉపశమన చర్యలే తప్ప శాశ్వత పరి ష్కారాలు లేవు. దీర్ఘకాలిక ప్రణాళికలు శూన్యం. అందుకే, పౌర సమాజం క్రమంగా చైతన్యమౌతోంది. పలువిషయాల్లో ప్రభుత్వా లపై ఒత్తిడి తీసుకువస్తోంది. దేశంలో ఇప్పుడు ‘వాతావరణ అత్య యిక పరిస్థితి’ విధించమని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. దేశవ్యాప్తంగా సదస్సులు, సమాలోచనలు సాగుతున్నాయి. వెంటనే అత్యయిక స్థితి ప్రకటించి, నిర్దిష్ట చర్యలు ప్రతిపాదించి, ఓ ప్రణా ళికతో కార్యాచరణ చేపట్టాలనేది మౌలిక డిమాండ్. వాతావరణ మార్పులకు ప్రకృతి ప్రకోపిస్తే... చేతులు కాలాక పట్టుకోవడానికి ఆకులు కూడా మిగలవు. అత్యయిక పరిస్థితితో జరిగేదేంటి? ప్రపంచంలో పలు దేశాలు ఇప్పటికే వాతావరణ అత్యయిక పరిస్థితిని ప్రకటించాయి. మొదట 2016 డిసెంబర్ 5న, ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ నగరం ప్రకటించింది. 2019 మే 1న యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ ఒక తీర్మానంతో ఈ అత్యయిక పరిస్థితిని ప్రకటించింది. అదే క్రమంలో కెనడా, ఫ్రాన్స్, ఐర్లాండ్, అర్జెంటీనా, ఆస్ట్రియా, స్పెయిన్, స్కాట్లాండ్, పోర్చుగల్ తదితర దేశాలు ఈ జాబితాలో చేరాయి. దేశాలుగానే కాకుండా సిడ్నీ, న్యూయార్క్‌తో సహా ప్రపం చంలోని చాలా నగరాలు ఇప్పటికే అత్యయిక పరిస్థితిని ప్రకటించి, వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను తట్టుకునే, ఎదుర్కోగల ప్రణాళికలు చేపట్టాయి. ముంచుకు వస్తున్న సమస్య తీవ్రత గుర్తించి ఎక్కడికక్కడ ఇలా అప్రమత్తం కావడమంటే, ‘ప్రపంచ సమస్యకు స్థానిక పరిష్కారం’ చూడటమన్న మాట! గత నెల 29న ప్రపంచ వ్యాప్తంగా 18 దేశాల్లోని వివిధ ప్రభుత్వాల ఆధ్వర్యంలో 983 పరి ధుల్లో వాతావరణ అత్యయిక పరిస్థితిని ప్రకటించారు. 21.2 కోట్ల జనాభా ఈ పరిధుల్లో ఉంది. మన దేశంలోనూ అత్యయిక పరిస్థితి ప్రకటించాలనే డిమాండ్ పెరుగుతోంది. కేవలం ప్రకటనతోనో, హామీలతోనో పని జరుగదు. వాతావరణ మార్పులను దీటుగా ఎదు ర్కోవడానికి, ప్రతికూలతలు తట్టుకోవడానికి అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలి. మెట్రో నగరాలకు వనరులు, అధికారాలు కల్పిం చాలి. కర్బన ఉద్గారాలు తగ్గించడానికి, 2025 నాటికి ‘జీరో’ ఉద్గా రాల స్థాయి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు వనరుల కల్పనతో పాటు లక్ష్య సాధనకు షరతులు విధించాలి. భూతాపోన్నతి వల్ల తలెత్తే ప్రమాదాన్ని తప్పించడానికి, మనుషుల, ఇతర జీవరాశి రక్ష ణకు నిర్దిష్ట చర్యలు చేపట్టాలి. బొగ్గు, పెట్రోలు వంటి శిలాజ ఇంధ నాల వినియోగం తగ్గించి సౌర, పవన విద్యుత్తు వంటి పునర్విని యోగ యోగ్య వనరులపైనే ఆధారపడాలి. కాలుష్య నియంత్రణ, ఉద్గారాల అదుపు కోసం ఇంధన, వ్యవసాయ, భూవినియోగ, పారి శ్రామిక రంగాల్లో ప్రాధాన్యతా చర్యలు వెంటనే చేపట్టాలి. ఏ ఇతర విధాన నిర్ణయం తీసుకునేటప్పుడైనా, పథకాలు రూపొందించేప్పు డైనా కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు విధిగా ‘వాతావరణ మార్పు’ అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఇందుకోసమే వాతావరణ అత్య యిక పరిస్థి తిని ప్రకటించాలి. ప్రభుత్వం అలా ప్రకటించినా, నిర్దిష్ట హామీలి చ్చినా... వాటి అమలును తిరిగి పౌరసమాజమే పర్యవేక్షించాలి. గరిష్ఠ బాధితులం మనమే! భూతాపోన్నతి, ఫలితంగా తీవ్రమౌతున్న వాతావరణ మార్పులకు ఎక్కువగా నష్టపోతున్నది, నష్టపోయేది మనమే! ఉష్ణమండలాల లెక్కన చూస్తే.. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని చాలా దేశాలు అధి కంగా ప్రభావితం కానున్నాయి. ఆహారోత్పత్తి తగ్గడంతో పాటు అనా రోగ్యం, అతివృష్ట–అనావృష్టి దెబ్బ వంటి సమస్యలు ఇక్కడ పీడించ నున్నాయి. ఇక సాంకేతికత, ఆర్థికవనరుల లేమితో సతమతమయ్యే మూడో ప్రపంచ దేశాల జాబితాలోనూ ఎక్కువ నష్టం మనకే! అమె రికా జాతీయ శాస్త్ర అధ్యయనాల సంస్థ (ఎన్ఏఎస్) ప్రకారం, గత 50 ఏళ్లలో వచ్చిన ‘వాతావరణ మార్పు’ ప్రపంచంలోని అత్యధిక దేశాల ఆర్థిక వ్యవస్థల్ని ప్రభావితం చేసింది. సంపన్న దేశాలు మరింత సంపన్నమయ్యాయి. పేద, అభివృద్ది చెందుతున్న దేశాలు మరింత పేదరికంలోకి జారిపోయాయి. ఇదే సమీకరణంతో ఇది మున్ముందు మరింత జోరుగా దుష్ప్రభావం చూపే ప్రమాదం పొంచి ఉంది. ప్రపంచవ్యాప్తంగా 21.5 కోట్ల మంది (ఆసియా, ఆఫ్రికా వాసులే అధికం) అత్యంత నిరుపేదలపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుందని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ‘వాతావరణ సంక్షోభంపై పోరుకు దక్షిణాసియా ప్రజా సంఘటన’ (ఎస్ఏపీఏ సీసీ) ఇటీవల ఏర్పడింది. దక్షిణాసియా దేశాల ప్రభు త్వాలపై ఒత్తిడి తెచ్చి, ఎక్కడికక్కడ వాతావరణ అత్యయిక పరిస్థితిని ప్రకటింప జేయాలన్నది ఈ సంఘటన ఎజెండా. దాని మూడు రోజుల సదస్సు ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. భారత్‌లో వాతావరణ అత్యయిక పరిస్థితి ప్రకటించాలని కేంద్ర ప్రభత్వాన్ని డిమాండ్ చేస్తూ ఒక జాతీయ సదస్సు, క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ (ఢిల్లీ), కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ (హైదరాబాద్) సంయుక్త నిర్వహణలో శుక్రవారం ఢిల్లీలో జరుగుతోంది. ఆ దశ ఎప్పుడో దాటిపోయింది! బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారోతో సహా ఇప్పటికీ చాలా మంది ‘వాతావరణ మార్పు’ను అతిశయోక్తిగా పరిగణిస్తున్నారు. మన దేశంలోనూ చాలా మంది ‘భూతాపోన్నతి’, ‘వాతావరణ మార్పు’, ‘కర్బన ఉద్గారాలు’ వంటి మాటల్ని ఏ జర్నలిస్టులో, న్యాయవాదులో, పర్యావరణ కార్యకర్తలకో పరిమితమైన పదజాలంగా భావిస్తున్నారు. ఆ దశ ఎప్పుడో దాటిపోయింది. దేశంలో కోట్లాది మంది ప్రత్యక్షంగా ప్రభావితులవుతున్నా వారికీ సమస్య పట్టడం లేదు. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగి మనుషుల మనుగడ కష్టమైన పరిస్థితి. నిన్నటికి నిన్న చెన్నైలో తాగునీటి సమస్య తారాస్థాయికి చేరి గొంతు తడా రింది. భారీ వర్షాలకు ఇప్పుడు ముంబాయి నీట మునికి వణుకు తోంది. కాలుష్యాల వల్ల వాతావరణ వేడి పెరిగి వింత జబ్బులు రాజ్యమేలుతూ ప్రజానీకాన్ని ఆస్పత్రుల పాల్జేస్తున్నాయి. భరించలేని వేడి–చలి. రుతువులు గతి తప్పడం, అడవులు అంతరించడం, జబ్బులు శృతిమించడం.... ఇలా ప్రజలకిప్పుడిప్పుడే ఈ వేడి తెలిసి వస్తోంది. ప్రభుత్వాలు అప్రమత్తం కావాల్సిన సమయమిది. విశాల జనహితంలో... ప్రజాభిప్రాయానికి విలువిస్తేనే ప్రజాస్వామ్యం! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
ఉపేక్షిస్తే ఇక ఉపద్రవాలే!
స్థానిక పాలనా సంస్థల నిర్వాకాల నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి దాటి అంతర్జాతీయ ఒప్పందాల వరకు పర్యావరణానికి అంతటా విఘాతాలే! నిజాయితీగా పర్యావరణ పరి రక్షణ జరుపడానికి ప్రభుత్వాలే అతి పెద్ద ప్రతిబంధకాలు. రాజకీయ విధాన నిర్ణ యాలు–అమలే అవరోధాలు. ఇది అన్ని స్థాయిల్లో జరుగుతోంది. ‘ఆవులు చేలో మేస్తే దూడలు గట్టున మేస్తాయా...?’ అన్న చందంగా కార్పొరేట్లు, కంపెనీలు, పరిశ్రమలు, జన సమూహాలు... ఇలా ఎవరికి వారు విచ్ఛల విడిగా కాలుష్య కారకాలవుతున్నారు. వెరసి సమస్య రోజురోజుకూ జఠిలమౌతోంది. శాస్త్రవేత్తల అంచనాల్ని మించి భూతాపోన్నతి హెచ్చుతోంది. వాతావరణ మార్పులు వేగం పుంజుకున్నాయి. ధృవపు మంచు అసాధారణంగా కరుగుతోంది. సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. తీర నగరాలు ప్రమాదపు అంచుకు జారుతున్నాయి. వర్ష రుతుక్రమం మారి వ్యవసాయ రంగం వికటిస్తోంది. ఎడారీకరణ వేగం పుంజుకుంది. అంతటా ప్రతి కూల ప్రభావం పడి ఆహారోత్పత్తి మందగిస్తోంది. ఇబ్బడి ముబ్బడి వినియోగంతో శిలాజ ఇంధన నిల్వలు అడుగంటుతున్నాయి. ప్రత్యా మ్నాయ–పునర్వినియోగ ఇంధనాల ఉత్పత్తి నత్తనడకన సాగుతోంది. అంత తేలిగ్గా నశించని ప్లాస్టిక్ భూమి, సముద్రం అని హద్దుల్లేకుండా సర్వత్రా వ్యాపిస్తోంది. ఇంటా బయటా గుట్టలుగా పేరుకుపోతోంది. ఇతరత్రా వ్యర్థాల నిర్వహణ కూడా దేశంలో నిరాశాజనకంగా ఉంది. భవిష్యత్తు భయం పుట్టిస్తోంది. ఐక్యరాజ్య సమితి (యూఎన్) ప్రతి పాదించిన పదిహేడు సుస్థిరాభివృద్ది లక్ష్యాల (ఎస్డీజీ) సాధనవైపు అడుగులు తడబడుతున్నాయి. న్యాయస్థానాలు కల్పించుకొని మంద లిస్తే తప్ప చలించని స్థితిలో ప్రభుత్వాలున్నాయి. అంతర్జాతీయ, జాతీయ ఒప్పందాలు, చట్టాలు, రాజ్యాంగ నిర్దేశాల ప్రకారం ప్రతిదీ నిర్వహించాల్సింది, నియంత్రించాల్సింది ప్రభుత్వాలే! అవి సక్ర మంగా నడిస్తేనే కార్పొరేట్లు అదుపాజ్ఞల్లో ఉంటాయి. పౌర సమాజం బాధ్యతగా వ్యవహరిస్తుంది. అంతే తప్ప, అన్నిసార్లూ న్యాయస్థా నాలే పరిస్థితి చక్కదిద్దాలంటే, సరైన నిర్వహణతో ఆదుకోవాలంటే అదంత తేలిగ్గా అయ్యేది కాదు. అంపైర్లు ఎన్ని మార్లని ఆటను ప్రభా వితం చేస్తారు...? ఆటగాళ్లు, జట్లు ప్రతిభ ప్రదర్శిస్తే తప్ప గెలు పోటముల్ని అంపైర్లే నిర్ణయించజాలరు. కానీ, చీటికి మాటికి న్యాయ స్థానాలు, న్యాయప్రాధికార సంస్థలపై ఆధారపడాల్సిన అవసరం తలెత్తుతోంది. వ్యర్థాల నిర్వహణ, ఇసుక విధానం, మొక్కల పెంపకం నుంచి అణు విద్యుదుత్పత్తి, అటవుల సంరక్షణ, భూతా పోన్నతి నిలువరించడం వరకు అన్నీ పెనుసవాళ్లే! పాలనా వ్యవస్థల సమర్థ నిర్వహణతోనే వాటిని ఎదుర్కొగలం. అందుకు, ఒక కొత్త జీవావరణ రాజకీయ సంస్కృతి అవసరం కనిపిస్తోంది. సర్కార్లు చేస్తున్నది మేలా? కీడా? తమ అధికారాల కోసం అరిచి అల్లరి చేసే ప్రభుత్వాలు, రాజ్యాంగ విహిత బాధ్యతల్ని విస్మరిస్తున్నాయి. రాష్ట్రాల హక్కుల్ని హరిస్తోందని కేంద్రంపై పెడబొబ్బలు పెట్టే రాష్ట్ర ప్రభుత్వాలు, మరోవంక స్థానిక సంస్థల్ని అన్ని విధాలుగా నిర్వీర్యం చేస్తుంటాయి. నిధులు, అధికా రాలు కల్పించకపోగా రాజ్యాంగం కల్పించిన వాటి అధికారాల్ని దొడ్డిదారిన లాక్కుంటాయి. సహజవనరుల పరిరక్షణ, వ్యర్థాల నిర్వ హణ, స్థానికంగా ఆదాయవనరుల పరికల్పన వంటి విషయాల్లో స్థానిక పాలనా సంస్థలకుండే అప్రతిహత అధికారాల్ని అవి కొల్లగొ డుతుంటాయి. ఈ నిర్వాకాలవల్ల గ్రామ పంచాయితీలకుండే నిర్ణయా ధికారం గాలికిపోతుంది. సహజవనరులకు విఘాతం కలిగించే ప్రభుత్వ విధానాల వల్ల తలెత్తే సామాజిక, పర్యావరణ ప్రభావాల అధ్యయనాలు కూడా సర్కారు జరిపించడం లేదు. జరిపినా, పలు నిర్బంధాల నడుమ వాటిని తూతూ మంత్రంగా ‘అయింద’ని పిస్తారు. గోదావరి నది వెంట 39 కిలోమీటర్ల నిడివి, 1400 హెక్టార్ల మేర (మేడిగడ్డ–అన్నారం బరాజ్‌ల వరకు) పూడిక తీసివేత పేరుతో ఇసుకు కొల్లగొట్టడాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తప్పుబట్టింది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని బుధవారం తీవ్రంగా మందలించింది. ‘ఇది పూడిక తీసివేత కాదు, విధ్వంసం’ అంది. ఆ ముసుగులో నదిగర్భం నుంచి 4 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక తరలించుకుపోవడాన్ని ఎన్జీటీ తీవ్రంగా పరిగణించింది. పర్యావరణ అనుమతి తీసుకోకపోవడం, పర్యావరణ ప్రభావాల అధ్యయనమే జరిపించకపోవడంపట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశంలో కీలకమైన పర్యావరణ చట్టాలేవీ రావడానికి ముందే, స్థానిక సంస్థల అధికారాలు–బాధ్యతలకు సంబంధించి... రాత్లమ్ మున్సిపా లిటీ కేసు (1980) విచారిస్తూ జస్టిస్ కృష్ణయ్యర్ ఓ గొప్ప మాట చెప్పారు. ‘పబ్లిక్ న్యూసెన్స్..... అనేది చట్ట ప్రకారం అందించాల్సిన సామాజిక న్యాయానికే ఓ సవాల్’ అన్నారు. ‘.... పద్ధతి, మర్యాద, గౌరవంగా బతకడం అనేవి మానవహక్కుల్లో రాజీపడటానికి వీల్లేని అవిభాజ్య అంశాలని, వాటి పరిరక్షణ స్థానిక పాలనా సంస్థల ప్రాథ మిక కర్తవ్యమ’ని ఆ తీర్పులో విస్పష్టంగా చెప్పారు. ‘స్వచ్ఛభారత్’ పేరుకే తప్ప, బాధ్యతాయుత కర్తవ్య నిర్వహణ స్థానిక సంస్థలు చేయట్లేదు. ప్రచార యావ తప్ప రాష్ట్ర–కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నదీ అంతంతే! పౌర సమాజం కూడా ఈ విషయంలో నిర్మాణాత్మక పాత్ర, బాధ్యత తీసుకోవాలి. చాలా చోట్ల అది జరగట్లేదు. ఫలితంగా ఆ కార్యక్రమమే మొక్కుబడిగా మారింది. పెనుభూతాన్ని అడ్డుకునేదెలా? మనిషి దైనందిన జీవితంలో భాగమైన ప్రమాదకర ప్లాస్టిక్కును నియంత్రించడం ఎలా? ఈ సమస్య ప్రపంచమంతటికీ ఓ సవాల్ విసురుతోంది. కరిగించి, మరో రూపంలో తిరిగి వాడడం సాధ్యపడే మందపు ప్లాస్టిక్‌తో పెద్దగా ఇబ్బంది లేదు. పునర్వినియోగం లేకుండా ఒకేసారి వాడి–పాడేసే పలుచని ప్లాస్టిక్ అత్యంత ప్రమా దకారి. రోజువారీ అనేకానేక అవసరాలకు విచ్చలవిడిగా మనం వీటిని వాడుతున్నాము. చేతి సంచులు, కప్పులు, పార్శిల్ కవర్లు, ప్యాకింగ్‌కు వినియోగించే ర్యాపర్లు, రవాణా అయ్యే ఎలక్ట్రానిక్ వస్తువుల భద్రతకు వాడే సన్నని వ్యాక్యూమ్ కవర్లు.. ఇలా వివిధ రూపాల్లో పలుచని ప్లాస్టిక్ ఉంటోంది. ఇది కరగదు, తరగదు, నాశన మవకుండా వేయి సంవత్సరాల పైనే మనుగడలో ఉంటుంది. దీంతో రకరకాల ఇబ్బందులున్నాయి. భూమిపైన, భూపొరల్లో, వివిధ జల వనరుల్లో, సముద్ర గర్భంలో గుట్టలుగా పేరుకుపోతూ మనిషి మను గడకు సవాల్‌గా మారింది. ఆహారంతో పాటు తక్కువ పరిమాణం, సూక్ష్మ రూపంలో ఇది జంతువుల, మనుషుల కడుపుల్లోకి వెళు తోంది. కేన్సర్ వంటి ప్రమాదకర జబ్బులకూ కారణమౌతోంది. ప్రధాని మోదీ, జాతినుద్దేశించి పది రోజుల కింద ‘మనసులో మాట’ చెబుతూ ప్లాస్టిక్ పెనుభూతంపై విరుచుకుపడ్డారు. ‘హానికర ప్లాస్టిక్ రహిత భరతమాత’ను తీర్చిదిద్దుకోవాలని జాతికి పిలుపునిచ్చారు. పునర్వినియోగం లేని తక్కువ మందపు ప్లాస్టిక్ ఉత్పత్తిని నిషేధించ బోతున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సంకేతాలిచ్చారు. మనిషి పరిణామ–ప్రగతి క్రమంలో ప్లాస్టిక్ క్రియాశీల భూమిక నిర్వహిం చింది. కానీ, కాలక్రమంలో చెడ్డ ప్లాస్టిక్ వల్ల ఉపయోగకరమైన మంచి ప్లాస్టిక్కూ అపకీర్తి వస్తోందని, సర్కారు ప్రచారంలోకి తెచ్చిన ఒక వీడియో టాక్‌లో కేంద్ర మంత్రి జావదేకర్ అన్నారు. 50 మైక్రాన్ల లోపు మందపు ప్లాస్టిక్ చేతి బస్తాలు, స్ట్రాలు, కప్పులు, కవర్లు తది తరాల్ని అక్టోబరు 2 (గాంధీ జయంతి) నుంచి నిషేధించే ఆలోచన ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పౌర సమాజం సహకరించి ప్రత్యామ్నాయాల్ని వినియోగించాలని కోరారు. తక్కువ మందపు ప్లాస్టిక్ వినియోగంపైనే ఇన్నాళ్లు కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో నిషేధం ఉండేది. అసలు ఉత్పత్తే లేకుంటే వినియోగం ఉండదు కదా! ఉత్పత్తినెందుకు నిషేధించరు? అనే ప్రశ్న జనసామా న్యంలో ఉదయించేది. ప్లాస్టిక్‌ను నిషేధించడం, లేదా అందుకోసం ఒక చట్టం తీసుకురమ్మని ఆదేశించడం తాము చేయజాలమని సుప్రీంకోర్టు 2016 (కరుణ సొసైటీ కేసు)లో స్పష్టం చేసింది. అది కార్యనిర్వాహక వ్యవస్థ బాధ్యత అనేది న్యాయస్థానం ఉద్దేశం. కఠిన నిబంధనలు, విధి విధానాలు రూపొందించుకొని అమలు చేయొ చ్చంది. బాధ్యత కలిగిన ప్రభుత్వాలు ఇందుకు సరిపోయే చట్టాలు– నిబంధనలు తెచ్చి, పకడ్బందీగా అమలుపరచడానికి ఉన్నత న్యాయ స్థానం తీర్పేమీ అడ్డంకి కాదు. కోట్లాది మందిని తరలించాల్సిందే! సముద్ర తీర ప్రాంతాల జనావాసాలు భవిష్యత్తులో పెను ప్రమా దాన్ని ఎదుర్కోబోతున్నాయి. కారణం, వేగంగా సముద్ర జలమట్టం పెరగటమే! నాగరికత వికాస క్రమంలో పెద్ద సంఖ్యలో జనుల వల సలకు గమ్యస్థానాలైన మహానగరాలెన్నో సాగరతీరాల్లోనే వృద్ధి చెందాయి. ఇప్పుడవే ప్రమాదంలో పడ్డాయి. కర్బన కాలుష్యాల క్రమం ఇలాగే ఉంటే, భూతాపోన్నతి ఇదే రీతిన పెరిగితే... సమీప భవిష్యత్తులోనే ధృవప్రాంతపు మంచు శిఖలు కరిగి సముద్ర మట్టాలు అసాధారణంగా పెరుగనున్నాయని ఐక్యరాజ్యసమితి (యూఎన్) ముసాయిదా పత్రమొకటి ఇటీవల వెల్లడించింది. ఈ ప్రమాద ప్రక్రియ ఇప్పటికే మొదలయిందని, వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే ఇది అత్యంత వేగంగా నష్టం కలిగిస్తుందన్నది నివేదిక సారం. ఉత్తర దక్షిణ ధృవాల్లోని గ్రీన్లాండ్, అంటార్కిటి కాలు వేగంగా కరిగిపోతున్నాయి. కర్బన ఉద్గారాలవల్ల, ఇతర కాలుష్యాల కారణంగా పెరిగే భూతాపొన్నతే ఈ మంచు ఖండాల్లోని ప్రస్తుత సంక్షోభానికి కారణం. ‘వాతావరణ మార్పులపై ఏర్పడ్డ అంతర్ప్రభుత్వాల కమిటీ’ (ఐపీసీసీ) ఇచ్చిన ప్రత్యేక నివేదిక ఇది. ఇప్పటికే మత్స్య సంపద తరుగుదల మొదలయింది. మానవ కారక కాలుష్యాన్ని తగు చర్యలతో నియంత్రించకుంటే, ఉత్తర ధృవపు మంచుకొండలు ఈ శతాబ్దాంతానికి కనీసం 30 శాతం కరిగి పోతా యనేది అధ్యయనం. అదే జరిగితే, 2050 నాటికి చిన్ని చిన్న దీవులు, కడలి తీరాల్లోని మహానగరాలు తీవ్ర ‘సముద్ర జల మట్టాల’ సమ స్యను ఎదుర్కోనున్నాయి. భూతాపోన్నతి 2 డిగ్రీలు మించి పెర క్కుండా కట్టడి చేసినా, 2100 నాటికి సముద్రమట్టాలు 43 సెంటీ మీటర్లు పెరుగుతాయనేది పరిశీలన. అప్పుడు సాగరతీరాల నుంచి 25 కోట్ల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. ఒక వైపు అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు అంతర్జాతీయ రాజకీయ పరిణా మాల్నే శాసిస్తోంది. ముప్పిరిగొనే ఈ ప్రకృతి విపత్తులు ఇంకే విపరి ణామాలకు దారితీస్తాయో తెలియదు! పాలకులు, ప్రభుత్వాలు, పౌరసమాజం సమన్వయంతో చొరవ చూపితేనే సమస్య తీవ్రతను కట్టడి చేయగలవు. వ్యాసకర్త: దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
నిఘా నీరసిస్తే ‘సమాచారం’ సమాధే!
పార్లమెంటు ఆమోదించిన తాజా సవరణ ద్వారా సమాచార హక్కు చట్టాన్ని నీరుగార్చి పారదర్శకతకు సర్కారు పాతరేయ జూస్తోంది. రాజ్యాంగం ప్రసాదించిన ‘పౌరులు తెలుసుకునే’ ప్రాథమిక హక్కుకే ఇది భంగం. సమాచార హక్కు అమలు సాకారానికి లభించిన చట్టభద్రతకి ఇక గండి పడనుంది. డెబ్బయ్యేళ్ల స్వతంత్ర చరిత్రలో, దాదాపు ఒకటిన్నర దశాబ్దాల పోరు తర్వాత ఆర్టీఐ రూపంలో దేశ ప్రజలకు దక్కిన అరుదైన వ్యవస్థకు తూట్లు మొదలయినట్టే! చట్టం అమల్లోకి వచ్చి దాదాపు 15 సంవత్సరాలవు తున్న తరుణంలో ఈ పరిస్థితి రావడం దురదృష్టకరం. పలువురు సందేహిస్తున్నట్టు ప్రస్తుత సవరణ ఈ చట్టాన్ని బలహీనపరచకూడదు. బలోపేతం చేయాలి. ప్రభుత్వాలు, పాలకపక్ష పెద్దలిచ్చే సంకే తాల్ని బట్టే చట్టాలు అమలవుతాయి, అధికార యంత్రాంగం పనిచేస్తుంది. పౌరులాశించిన పరిపాలనా ఫలాలు లభిస్తాయి. సంకేతాలే మాత్రం భిన్నంగా ఉన్నా, ఫలితం సున్నా, ఇక అంతే సంగతులు! యుగాలుగా ఇది నడుస్తున్న చరిత్ర అవటం వల్లే సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం అమలు పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఎన్నో సందేహాలు! పార్లమెంటు ఆమోదించిన తాజా సవరణ ద్వారా ఈ చట్టాన్ని నీరుగార్చి పారదర్శకతకు సర్కారు పాతరేయ జూస్తోందన్న విమర్శ. రాజ్యాంగం ప్రసాదించిన ‘పౌరులు తెలుసుకునే’ ప్రాథమిక హక్కుకే ఇది భంగం. హక్కు అమలు సాకారానికి లభించిన చట్టభద్రతకిక గండి పడనుంది. డెబ్బయ్యేళ్ల స్వతంత్ర చరిత్రలో, దాదాపు ఒకటిన్నర దశాబ్దాల పోరు తర్వాత ఆర్టీఐ రూపంలో దేశ ప్రజలకు దక్కిన అరుదైన వ్యవస్థకు తూట్లు మొదలయినట్టే! చట్టం అమల్లోకి వచ్చి దాదాపు ఒకటిన్నర దశాబ్దాలవుతున్న తరుణంలో ఈ పరిస్థితి రావడం దురదృష్టకరం. ప్రస్తుత చట్ట సవరణ ఏ కోణంలో చూసినా, సమాచార వెల్లువను పటిష్ట పరచకపోగా ఈ ప్రక్రియను పలుచన చేయడానికే ఆస్కారముంది. చట్టం అమల్లోకి వచ్చిన కొత్తలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా డా. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆర్టీఐ అమలుకు అనువైన భూమికను సిద్ధం చేశారు. నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కందాకు చెప్పి అధికారులకు, పౌర సంఘాల కార్యకర్తలకు, జర్నలిస్టులకు ప్రత్యేకంగా చట్టంపై శిక్షణ ఇప్పించారు. పౌరుల్లో అవగా హనకు ప్రత్యేక నిధులతో ప్రచార సామాగ్రి రూపొందించి, సదస్సులు పెట్టించారు. జాప్యం లేకుండా కమిషన్ ఏర్పరచి అమలు ప్రారంభిం చారు. ఒక సందర్భంలో ఎల్లంపల్లి సాగునీటి ప్రాజెక్టుపై విపక్ష సభ్యులు రభస చేస్తే, ‘... రాజకీయం చేయకండి, నిజంగా సమాచారం తెలుసు కోవడమే మీ ఉద్దేశమైతే, పది రూపాయలు వెచ్చించి ఆర్టీఐ దరఖాస్తు చేసినా మీకు సమాచారం లభిస్తుంద’ని శాసనసభావేదిక నుంచి భరోసా ఇచ్చారు. మొత్తం అధికార వ్యవస్థకే ఆ మాట ఒక బలమైన సంకేతమైంది. అడ్డుకున్నా ఆగని తొలి సవరణ సమాచార హక్కు చట్ట సవరణ బిల్లును పార్లమెంటు ఇటీవలే ఆమో దించింది. ఉభయసభల్లోనూ ఈ సమావేశాల్లోనే బిల్లుకు ఆమోదం లభించింది. ఇక రాష్ట్రపతి ముద్రపడి, గెజెట్‌లో ప్రచురితమవడంతో చట్ట సవరణ ప్రక్రియ పూర్తవుతుంది. ప్రధానంగా ఈ చట్ట సవరణ... కేంద్రంలో, రాష్ట్రంలో ఉండే సమాచార కమిషనర్ల హోదా, పదవీకాలం, వేతనాల మార్పులకు సంబంధించింది. అవన్నీ అధికంగా ఉన్నాయని, ప్రస్తుత సవరణ ద్వారా వాటిని హేతుబద్ధం చేసేందుకేనని బిల్లు ముసా యిదా లక్ష్యాలు–ఉద్దేశాల్లో కేంద్రం వెల్లడించింది. కానీ, అది సహేతు కంగా లేదు. ‘తాడిచెట్టెందుకెక్కావు?’ అంటే ‘దూడ గడ్డికోసం’అని తడు ముకుంటూ చెప్పే జవాబంత అసంబద్ధంగా ఉంది. 2005లో ఏర్పడ్డ నాటినుంచి ఆర్టీఐ చట్టానికి ఇదే తొలి సవరణ. ఇంతకు ముందు మూడు, నాలుగు మార్లు వేర్వేరు విషయాల్లో సవరణకు జరిగిన యత్నాలు ఫలించలేదు. పాలనలో కీలకమైన ‘నోట్‌ఫైల్స్’ను ఈ చట్టపరిధి నుంచి తప్పించే విఫల యత్నమూ జరిగింది. చట్టాన్ని మార్చ డానికి ఆయా సందర్భాల్లో కేంద్రంలోని ప్రభుత్వాలు చేసిన ప్రయ త్నాలను పౌరసమాజం ఎప్పటికప్పుడు ప్రతిఘటించింది. సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే నిరాహార దీక్షకు దిగి ఇటువంటి ఓ ప్రతి పాదనను లోగడ అడ్డుకున్నారు. ప్రతిసారీ చట్ట సవరణకు చేసిన ప్రతిపాదనలు ఏదో రూపంలో చట్టాన్ని బలహీనపరచి, పారదర్శకతకు భంగం కలిగిస్తాయని పౌర సమాజం కలవరపడింది. సవరణ వద్దని వివిధ స్థాయిల్లో ఉద్యమించింది. అందువల్ల, కేంద్రం చేసిన ఏ సవరణ ప్రయత్నమూ ఇంతకాలం ఫలించలేదు. ఒకసారైతే, కేంద్ర మంత్రివర్గం ఆమోదించినా జనాగ్రహానికి జడిసి, సవరణ బిల్లు ముసాయిదాను పార్లమెంటుకు తెచ్చే సాహసం చేయలేకపోయింది ప్రభుత్వం. ఈ సారి కూడా చట్టాన్ని సవరించకూడదని, తద్వారా సమాచార కమిషన్లు బలహీనపడి, చట్టం అమలు నీరుగారిపోతుందని ప్రజాసంఘాలు వ్యతిరేకించినా చట్ట సవరణ ప్రక్రియ ఆగలేదు. పార్లమెంటులో విపక్షం వ్యతిరేకించినా ప్రభుత్వ పట్టుదల వల్ల ఉభయసభల ఆమోదంతో ఆర్టీఐ చట్ట సవరణ జరిగిపోయింది. సమాన హోదాలతో సమస్యేమిటి? చట్ట ప్రకారం అఖిల భారతస్థాయి కేంద్ర సమాచార కమిషన్‌లోని ముఖ్య సమాచార కమిషనర్ హోదాను కేంద్ర ఎన్నికల ముఖ్య కమిషనర్ హోదాతో సమానంగా నిర్ణయించి, అమలు చేస్తున్నారు. ఆయా ప్రభు త్వాలు రూపొందించే రూల్స్‌లో కాకుండా ఈ అంశాల్ని మౌలికమైన చట్టంలోనే పొందుపరిచారు. ఇది 2005 నుంచి ఇలాగే ఉంది. మిగతా కేంద్ర సమాచార కమిషనర్ల హోదాను ఇతర ఎన్నికల కమిషనర్లతో సమంగా నిర్ణయించి, వేతనాలు, భత్యాలూ అదే లెక్కన చెల్లిస్తున్నారు. ఇంకొక లెక్క ప్రకారం... కేంద్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ హోదా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమానం. దాని వల్ల, ఆర్టీఐ కేంద్ర సమా చార ముఖ్య కమిషనర్ హోదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదాతో సమానమౌతోందని, ఇది సముచితం కాదనేది కేంద్ర ప్రభుత్వ వాదన. భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ సంస్థ కాగా ఆర్టీఐ కమిషన్ చట్టబద్ధ సంస్థ మాత్రమే అని కేంద్రం అంటోంది. అదే విధంగా రాష్ట్రాల్లోని ఆర్టీఐ ముఖ్య సమాచార కమిషనర్లకు కేంద్ర ఎన్నికల కమిషనర్‌తో సమాన మైన, రాష్ట్రాల్లోని ఆర్టీఐ కమిషనర్లకు రాష్ట్రాల్లో ఉండే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)తో సమానమైన హోదాను, జీత భత్యాలను ఇప్పటి వరకున్న చట్టం కల్పించింది. పైగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అయిదేళ్లు గాని, 65 ఏళ్ల వయసు వచ్చే వరకు గానీ, ఏది ముంద యితే అప్పటివరకు కేంద్ర–రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్లు పదవిలో ఉంటారు. చట్టం వచ్చిన కొత్తలో ఆదరాబాదరాగా ఇటువంటి నిర్ణయం తీసుకున్నా రని, ఇది సరికాదంటూ కేంద్ర ప్రభుత్వం పనిగట్టుకొని ప్రస్తుత సవరణ తెచ్చింది. ఈ సవరణతో ఇప్పుడు... ఆయా కమిషనర్ల హోదాలు, జీత భత్యాలు, పదవీ కాలం వంటివి నిర్ణయించే అధికారం కేంద్ర ప్రభుత్వా నికి దఖలవుతోంది. ఇకపై రాష్ట్రాల సమాచార కమిషనర్లకు సంబంధిం చిన హోదా, పదవీకాలం, జీత భత్యాలు కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్ణ యిస్తుంది. కమిషన్ల ఏర్పాటు, కమిషనర్ల నియామకాలు, వాటి నడక, నిర్వహణ... అంతా కూడా ఇకపై కేంద్ర ప్రభుత్వం చెప్పుచేతల్లోకి వచ్చి నట్టే! ఇక్కడే వివాదం తలెత్తుతోంది. ప్రస్తుత సవరణల వల్ల చట్టం అమ లుకు, పారదర్శకతకు వచ్చే అదనపు ప్రయోజనం ఏమీ లేదని, పైగా నష్టం జరుగుతుందనేది చట్ట సవరణ వ్యతిరేకిస్తున్న వారి వాదన. అటు వంటిదేమీ ఉండదని, అనవసర హోదాలు, అస్పష్టతలు తొలగి మరింత పకడ్బందిగా చట్టం అమలుకు ఈ సవరణ పనికొస్తుందనే డొల్ల వాద నను కేంద్ర వర్గాలు వినిపించాయి. రాజ్యాంగ సంస్థ హోదాలను చట్ట బద్ద సంస్థల్లోని వారికి కల్పించకూడదనే నిషిద్ధం కూడా ఎక్కడా లేదు. ఇప్పటికే కేంద్ర విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) వంటి రాజ్యాంగ సంస్థలే కాకుండా జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్చార్సీ), జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ), లోక్‌పాల్ వంటి చట్టబద్ధ సంస్థల ఛైర్మన్లు, సభ్యులకు కూడా రాజ్యాంగ సంస్థల్లోని వారితో సమాన హోదాలు న్నాయి. ఇలా చట్టబద్ద పదవులకు కూడా రాజ్యాంగ హోదాలతో సమాన స్థాయి కల్పించి, ఏ ఇబ్బందీ లేకుండా దశాబ్దాలుగా నిర్వహిస్తున్న ఉదా హరణలు కోకొల్లలు. మరి వాటన్నిటినీ ఇప్పుడు మారుస్తారా? ఇక్కడ మాత్రమే ఎందుకీ మార్పు? ఇవి సహజమైన ప్రశ్నలు. నిఘా, నిర్వహణ ఇక నిర్వీర్యమే! దేశంలో ఆర్టీఐ చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి అంటే, ఈ పద్నాలుగేళ్ల కాలంలో పాలనా వ్యవస్థల్లో పారదర్శకత పెరిగింది. ఆశించిన స్థాయి ఫలితాలు అందకున్నా... ప్రభుత్వంలోని చాలా విభాగాల నుంచి పౌరులు సమాచారం పొందగలుగుతున్నారు. ఇదివరలో సమాచారం లభించడం దుర్లభమైన విభాగాల్లో కూడా నేడు పౌరులు ఆర్టీఐ కింద ఒక దరఖాస్తు పెట్టి కోరిన సమాచారం తెచ్చుకోగలుగుతున్నారు. ఇందుకు, చట్టంలో పొందుపరచిన ప్రజాసానుకూల అంశాలే కారణం. చట్టం అమలు నిఘా–నియంత్రణ సంస్థలుగా కమిషన్లు స్వేచ్చగా–స్వతం త్రంగా వ్యవహరించే వెసలుబాటు మరో బలమైన కారణం. ప్రభుత్వాల ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా కమిషనర్ల హోదాలు, పదవీ కాలం, జీతభత్యాలు ఇన్నాళ్లు చట్టం నిర్దేశించినట్టు హూందాగా, నిలకడగా ఉంటూ వచ్చాయి! దాని వల్ల కమిషనర్లు... ప్రభుత్వాలకు, వారి ప్రలో భాలు–ఒత్తిళ్లకు లొంగకుండా, బెదిరింపులకు భయపడకుండా స్వేచ్ఛగా పనిచేయగలిగే వారు. ముఖ్యంగా ఆర్టీఐ కమిషనర్లకు ఎన్నికల కమి షనర్ల, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల స్థాయి హోదాలుండటం వల్ల ఉన్నత స్థాయి ఐఏఎస్. ఐపీఎస్ అధికారులు కూడా కమిషన్ల ఆదేశాలు పాటించే వారు. ఇక ఇప్పుడు అన్నీ కేంద్ర ప్రభుత్వం అదుపాజ్ఞల్లోకి రావడం, హోదాలు తగ్గడం వల్ల ఆర్టీఐ కమిషన్ల పనితీరు చప్పబడి పోతుంది. ప్రస్తుత సవరణ పరోక్షంగా కమిషన్ల స్వేచ్ఛను, స్వతంత్రతను దెబ్బతీయడమే అన్న విమర్శ తలెత్తుతోంది. దీనికి పాలక బీజేపీ నుంచి సరైన సమాధానం లేదు. నిజానికి 2005లో ఈ చట్టం తెచ్చినపుడు, కమి షనర్లకు తక్కువ హోదాలతో నాటి యూపీఏ ప్రభుత్వం చేసిన ప్రతి పాదనల్ని విపక్ష బీజేపీ వ్యతిరేకించింది. కమిషనర్లకు పెద్ద హోదాలతో, బలమైన కమిషన్లు ఉండాలని వాదించింది. నాటి పార్లమెంట్ స్థాయి సంఘంలో ఉన్న అయిదారుగురు బీజేపీ ఎంపీల్లో ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఉన్నారు. ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా వాదించింది. ఏ వాదనలెలా ఉన్నా, అంతిమ పరిణామాలను కాలమే నిర్ణయిస్తుంది. పౌరుల తెలుసుకునే హక్కు, పాలనలో పారదర్శకత విషయంలో ఆర్టీఐ ఒక విప్లవాత్మక చట్టం. మనకున్న మంచి చట్టాల్లో ఒకటైన ఆర్టీఐ పటిష్టంగా అమలుజరగాలనే ఎవరైనా కోరుకుంటారు. పలువురు సందేహిస్తున్నట్టు ప్రస్తుత సవరణ ఈ చట్టాన్ని బలహీనపరచ కూడదు. తాజా సవరణ, తద్వారా రాగల పరిణామాలన్నీ ఆర్టీఐ చట్టాన్ని మరింత బలోపేతం చేయడానికి దోహదపడాలనే ఎవరమైనా కోరుకుంటాం, కోరుకోవాలి కూడా! వ్యాసకర్త :దిలీప్ రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు పూర్వ కమిషనర్ ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
ఓ ప్రజాస్వామ్యవాది అలుపెరుగని ప్రస్థానం
తనను తాను రాజకీయ మేరునగధీరుడిగా మలచుకున్న కృషీవలుడు జైపాల్‌రెడ్డి. దేశం గర్వించదగ్గ పార్లమెంటరీ నాయకుడిగా భారత రాజకీయాలపై ఆయనొక బలమైన ముద్ర. సమకాలీన రాజకీయాలు–మేధావిత్వాన్ని జతకలిపి ఆలోచించిన ప్రతి సందర్భంలోనూ ఆయన పేరు గుర్తుకు రావాల్సిందే! ఎన్నో ప్రతికూల పరిస్థితుల నడుమా సిద్ధాంతాలు, విలువల్లో రాజీపడకుండా ఓ సంపూర్ణ, సంతృప్తికర జీవితం గడిపారాయన. జైపాల్‌రెడ్డి ఎదుగుదలకు ఉపకరించిన అంశాలెన్నో ఉన్నా.. ప్రాథమికంగా ఆయన బలమైన ‘ప్రజాస్వామికవాది’కావడమే ఎదుగుదలకు ప్రధాన కారణం. ఇది మామూలు సందర్భాల్లోకన్నా సంక్లిష్ట సమయాల్లోనే ఎక్కువగా వెల్లడైంది. కాంగ్రెస్‌లో ఎదుగుదల, ఎమర్జెన్సీని వ్యతిరేకించి కాంగ్రెస్‌ను వీడటం, తెలుగునాట ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం, జనతాపార్టీలో చేరడం తిరిగి కాంగ్రెస్ గూటికి రావడం.. వరించి వచ్చిన పదవుల్నీ తృణప్రాయంగా నిరాకరించడం.. ఇలా ఏ పరిణామాన్ని తీసుకున్నా తన మౌలిక రాజకీయ సిద్ధాంత బలమే ఆయన్ని నడిపింది. అంతకుమించి ఆయన్ని నిరూపించింది. అందుకే, ఆయన్ని గమనిస్తున్న ఓ తరం రాజకీయ నేతలు, పరిశీలకులు ‘ఒక శకం ముగిసినట్టే’అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో వ్యక్తి అటువంటి రాజకీయ జీవితం గడపడం అసాధ్యమంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని బలంగా విశ్వసించడమే కాకుండా దాని చుట్టే తన రాజకీయ మనుగడని అల్లుకొని, విలువల్ని వీడకుండా, అవకాశాల్ని వినియోగించుకుంటూ పైకెదిగిన నేత జైపాల్‌రెడ్డి. శారీరక వైకల్యం శాశ్వతమని గ్రహించిన క్రమంలోనే ఇతరులకన్నా తనని కాస్త విభిన్నంగా ఉంచగలిగిందేమిటనేదే ఆయనలోని మొదటి సంఘర్షణ. తెలివి, విజ్ఞానం కొంతమేర తన అవకాశాల్ని మెరుగుపరుస్తుందని విద్యార్థి దశలోనే నిర్ణయించుకొని, అందుకోసం ప్రత్యేకంగా కృషిచేశానని ఆయనే చెప్పేవారు. రేయింబవళ్లు విస్తృతంగా చదివేవారు. ఇంగ్లీష్‌పై మక్కువతో ఎమ్మే ఇంగ్లీష్ చదివినా, రాజకీయాలపై ఆసక్తితో చరిత్ర–రాజనీతి శాస్త్రాన్ని అధ్యయనం చేసినా.. ఆ క్రమంలో తనకు తత్వశాస్త్రంపై మోజు పెరిగిందనేవారు. ఇటీవల ఆయన వెలువరించిన ‘టెన్ ఐడియాలజీస్’ఒక గొప్ప తత్వశాస్త్ర గని. తనకున్న సహజనాయకత్వ లక్షణాలకు విద్యార్థి దశలోనే పదునుపెట్టి భవిష్యత్ రాజకీయ మనుగడకు బాటలు వేసుకున్నారు. పీయూసీ చదివే రోజుల్లో, నిజాం కాలేజీ విద్యార్థిగా తెలివితేటలు పెంచుకోవడం, వీటిని ప్రదర్శించడం మొదలైంది. ఇతర కాలేజీల నుంచి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యార్థులు కేవలం ఆయన ప్రసంగాల్లోని భాషా పటిమ, బలమైన భావాలు, పదునైన వ్యక్తీకరణ కోసమే నిజాం కాలేజీకి వచ్చేవారు. వేదికల మీద, కింద కూడా వక్తగా ఆయనొక ప్రభావశాలి! ఆయన ఎప్పుడు రెడ్డి హాస్టల్ సందర్శించినా.. అదొక చర్చావేదికయ్యేది. రహస్యమెరిగిన నిపుణుడు పార్లమెంటరీ ప్రసంగ నైపుణ్యమెరిగిన వాడు కనుకే సభ లోపలా, బయటా అధికుల్ని ఆకట్టుకునేలా జైపాల్‌రెడ్డి మాట్లాడేవారు. వాజ్‌పేయి ప్రభుత్వం పార్లమెంటులో ఒక ఓటు తేడాతో కూలిపోవడానికి ముందు, విపక్షం తరపున ఆయన చేసిన ప్రసంగాన్ని ప్రసారమాధ్యమాలు ఆకాశానికెత్తాయి. ‘రాజ్యాంగ నిర్మాణ సభ’లో జరిగిన విస్తృత చర్చల్ని క్షుణ్ణంగా చదివేవారు. అందుకే, ఏదైనా అంశం సభలో వివాదాస్పదమైనపుడు, సదరు అంశానికి మూలాలు రాజ్యాంగంలో ఎక్కడున్నాయి? ఎందుకు? ఎలా పొందుపరిచారు? అప్పుడు ఏమనుకున్నారు? ఉటంకిస్తూ.. అదెలా తప్పో, ఒప్పో చెప్పే వారు. ఆయన ప్రసంగాలు సూటిగా, అతి ప్రభావవంతంగా ఉంటా యే తప్ప సుదీర్ఘంగా ఉండవు. దక్షిణాది నుంచి తొలి ఉత్తమపార్లమెంటేరియన్‌గా అవార్డు దక్కినపుడు, ఇంగ్లీష్ దినపత్రిక దిహిందూ ‘దేశంలోనే అత్యుత్తమ రాజకీయ పదసముచ్ఛయ కర్త’అని రాయడం ఆయనకు నిజమైన ప్రశంస. పదాల ఉచ్ఛరణ (ఫొనెటిక్స్) పైనా తగు అధ్యయనంతో ఆయన వాడే కొన్ని ఆంగ్ల పదాలకు చట్టసభ లేఖకులు, నేతలు, చివరకు జర్నలిస్టులు డిక్షనరీలు వెతకాల్సి వచ్చేది. బీజేపీ నేత సుష్మాస్వరాజ్ దీన్ని సభలోనే అంగీకరించారు. జర్నలిస్టుల్లో అత్యధికులు ఆయనకు ఆత్మీయులు. ఢిల్లీలో ఏటా ఓరోజు జర్నలిస్టులకు విందు ఇచ్చేవారు. తరచూ నియోజకవర్గాలు మారుతారు అనే విమర్శను సున్నితంగా తిప్పికొడుతూ, ‘నిజానికి మీడి యా నా స్థిర నియోజకవర్గం’అని ఛలోక్తి విసిరేవారు. సిద్ధాంతాలు, పార్టీ విధానాలు, రాజకీయ విలువలు, వాస్తవిక పరిస్థితులపై ఆసక్తిగా చర్చించే వారు కలిస్తే, సుదీర్ఘంగా ముచ్చటించడానికి ఇష్టపడేవారు. ఆయనతో అప్పుడప్పుడు భేటీ అయ్యే అవకాశం లభించిన వారిలో నేనొకడ్ని! తను రచించిన ‘టెన్ ఐడియాలజీస్’తొలి పలుకుల్లో ఓ ప్రస్తావన చేస్తూ, ‘గరిష్ట సంక్షేమం, కనీస యుద్ధకాంక్షను సాధించడమే రాజకీయ సిద్ధాంతాల అసలు లక్ష్యం’అన్నారు. ప్రజాస్వామ్యవాదమే పరమావధిగా సిద్దాంతాలు, విలువలు, మేధస్సు నడిపిన నేత జైపాల్‌రెడ్డి. చెదరని మనోధైర్యం శారీరక వైకల్యం ఉన్నా ఇతరరేతర నైపుణ్యాల్ని వృద్ధి చేసుకొని శారీరక లోపాల్ని అధిగమించవచ్చని నిరూపించిన జైపాల్‌రెడ్డి ఒక స్ఫూర్తిదాత! శరీర భౌతిక ధర్మాన్నే కాక అంతర్గత రసాయన ధర్మాల పట్లా ఆయనది లోతైన అవగాహన. దశాబ్దాలుగా తనలో భాగమై ఉన్న మధుమేహాన్ని ఎప్పుడూ నియంత్రణలో ఉంచేవారు. నిమోనియా తో బాధపడుతూ, పలురకాల ఇన్ఫెక్షన్లతో ఆహారం అరుగుదల క్షీణించిన చివరి రోజుల్లోనూ, ‘ఇక గుండె ఆగడం ఏ నిమిషమైనా జరగొచ్చు’అని కుటుంబీకులతో సాదాసీదాగా మాట్లాడిన నిబ్బ రత్వం ఆయనది. భారత స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి ఆయన్ని చాలా ప్రభావితం చేసింది. 1942లో జన్మించిన ఆయన, దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి బాలుడే అయినా, స్వాతంత్య్రానంతర తొలి దశకాల ఆదర్శ వాతావరణ ప్రభావం ఆయన ‘ప్రజాస్వామ్య’ఆలోచనా సరళిని ఆవిష్కరించింది. గాంధీ, రాజగోపాలచారి, నెహ్రూ తననెంతో ప్రభావితం చేశారని చెప్పేవారు. స్థిరమైన సిద్ధాంత బలం ఆయన ఆస్తి! ‘రచయితలు, రాజకీయ నేతలు తమ ఆస్తులు–అప్పుల వెల్లడి కన్నా తమ సిద్ధాంత వైరుధ్యాల్ని ప్రకటించడం ముఖ్యం’అనేవారు. కాంగ్రెస్‌లో కీలకస్థాయికి ఎదిగి, ఎమర్జెన్సీని, ఇందిరాగాంధీని వ్యతిరేకించి పార్టీని వీడిన సాహసం ఆయన సిద్ధాంత బలమే! సుదీర్ఘకాలం కాంగ్రెస్‌ను, వారి అవినీతిని వ్యతిరేకిస్తూ దేశవిదేశాల్లో పెరుతెచ్చుకొని కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారేమని జర్నలిస్టులడిగిన ప్రశ్నకు సమాధానమే ఆయన నిబద్ధతకు నిదర్శనం. ‘జనతాదళ్ విచ్ఛిన్నమవడం వల్ల బీజేపీ బలపడుతోంది, అందుకే, ఇన్నేళ్లు నేను సంపాదించుకున్న వ్యక్తిగత పేరు–ప్రతిష్టల్ని కూడా పణంగా పెట్టి, నా సిద్ధాంతమైన లౌకికవాద పరిరక్షణ కోసం కాంగ్రెస్‌లో చేరాల్సివస్తోందన్నా’రు. ఎన్టీఆర్‌ను అక్రమం గా గద్దె దించినపుడు జరిగిన ‘ప్రజాస్వామ్య పునరుద్ధరణ’ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆయన, ‘ఇది ఎన్టీయార్ కోసం కాదు, ప్రజాతీర్పు వక్రీకరణకు గుణపాఠం, ప్రజాభిప్రాయానికి పట్టం’అని తన ప్రజాస్వామ్య స్ఫూర్తిని వెల్లడించారు. - దిలీప్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, సాక్షి -
సాక్షి జర్నలిజం స్కూల్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : సాక్షి జర్నలిజం స్కూల్ ప్రింట్, టీవీ, వెబ్ జర్నలిజం విభాగాల్లో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 9 న నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను స్కూల్ ప్రిన్సిపాల్ దిలీప్‌రెడ్డి సోమవారం విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా నుంచి రాత పరీక్షలో 175 మంది బృంద చర్చలు, ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. వీరికి జూలై 8 నుంచి హైదరాబాద్ బంజారాహిల్స్, రోడ్ నంబర్ 1లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో బృంద చర్చలు, ఇంటర్వ్యూలు జరుగుతాయి. కాల్ లెటర్లను www.sakshischoolofjournalism.com, www.sakshi eduction.com,sakshi.com వెబ్సైట్లలో ఈనెల 28 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు హాల్‌టికెట్, కాల్ లెటర్, నాలుగు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు , విద్యార్హతల సర్టిఫికెట్లు, వాటి జిరాక్స్‌లతో పాటు వయసు నిర్ధారణ కోసం పదోతరగతి మెమోను తప్పనిసరిగా తీసుకురావాలి. అభ్యర్థులు నిర్దేశిత తేదీన సూచించిన సమయానికి అరగంట ముందుగానే సాక్షి ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలి. www.sakshi eduction.com www.sakshischoolofjournalism.com -
హక్కులు దక్కితేనే రైతుకు రక్ష!
ఎంత చేసినా వ్యవసాయం వాణిజ్య వ్యాపకంగా మనలేని గడ్డు స్థితులు నేడు దేశవ్యాప్తంగా నెలకొన్నాయి. వ్యవసాయాన్ని గౌరవప్రదమైన వృత్తిగా బతకనీయాలంటే రైతుకు పనికొచ్చే సహాయక చర్యలు ఇంకా పెంచాలి. వాటికో చట్టబద్ధత తీసుకురావాలి. కేంద్రంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు రైతుకు పెట్టుబడి ఆర్థిక సహాయం చేస్తున్నాయి. ఇది ఇటీవలి కాలంలో వ్యవసాయ రంగంలో వచ్చిన ఆహ్వానించదగ్గ పరిణామం! అయితే, ఇది మాత్రమే సరిపోదు. సమాచార హక్కు కమిషన్ తరహాలో కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ‘వ్యవసాయ కమిషన్లు’ ఏర్పాటు కావాలి. స్వతంత్ర ప్రతిపత్తితో, చట్టబద్ధమైన అధికారాలతో పనిచేసే ఈ కమిషన్లకు గట్టి అధినేతలు రావాలి. అలాగే రైతుకు సాంప్రదాయికంగా ఉంటున్న విత్తన హక్కును కాపాడటం, ఎమ్మెన్సీల దాష్టీకం నుంచి వారిని బయటపడేయటం కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు సాయం అవసరమైన స్థితిలో వ్యవసాయం ఉంది. ఒకేరకమైన సహాయంతో తీరేది కాదు. అనేక రకాల సహాయాలు అంది తేనే వ్యవసాయం బతికి బట్టకడుతుంది. ‘అజాత శత్రువే అలిగిన నాడు...’ అన్నట్టు, రైతన్నకు కోపమొచ్చి ‘నా తిండికి సరిపడా నే పండించుకు తింటాను, మిగతా భూమి పడావ్ (పంట విరామం) వేస్తా, ఏం చేసుకుంటారో చేసుకోండి..!’ అని ఆగ్రహిస్తే దేశం మలమల మాడాల్సి వస్తుంది. ఆ చేదు అనుభవాన్నీ తెలుగునేల ఎప్పుడో చవి చూపింది. ఎంత చేసినా వ్యవసాయం వాణిజ్య వ్యాపకంగా మనలేని గడ్డు స్థితులు నేడు దేశవ్యాప్తంగా నెలకొన్నాయి. మనది, కార్పొరేట్ వ్యవసాయం సాధ్యపడని చిన్న కమతాల దేశం. అందుకే, ఉన్నంతలో... పెట్టుబడి నుంచి గిట్టుబాటు ధర వరకు అన్ని దశల్లో రైతు బాగోగులు చూసి ఆదుకుంటేనే వ్యవసాయం. ఈ ఎరుకతోనే ప్రభుత్వాలు రైతుకు అంతో ఇంతో సహాయం చేయడానికి, చేసినట్టు కనబడటానికి ప్రయత్ని స్తాయి. కానీ, నిజంగా ఆదుకొని వ్యవసాయాన్ని గౌరవప్రదమైన వృత్తిగా బతకనీయాలంటే రైతుకు పనికొచ్చే సహాయక చర్యలు ఇంకా పెంచాలి. వాటికో చట్టబద్ధత తీసుకురావాలి. వ్యవసాయ విధానాలు, చట్టాలు, నిబంధనలు, విధివిధానాల అమలుపై సరైన నిఘా, నియం త్రణ ఉండాలి. ఇందుకు ప్రభుత్వాలు మరింత చొరవ చూపాలి. వృత్తికి భరోసా ఇవ్వాలి. బతుక్కి భద్రత కల్పించాలి. కష్టాల్లో రైతాంగాన్ని ఆదుకోవాలి. కేంద్రంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు రైతుకు పెట్టుబడి ఆర్థిక సహాయం చేస్తున్నాయి. ఇది ఇటీవలి కాలంలో వ్యవసాయ రంగంలో వచ్చిన ఆహ్వానించదగ్గ పరిణామం! అయితే, ఇది మాత్రమే సరిపోదు. నిన్నటికి నిన్న గుజరాత్లో బంగాళదుంప రైతాం గానికి, పెప్సీ కంపినీకి మధ్య జరిగిన న్యాయపోరాటం, రైతుకు కావాల్సిన ఇతరేతర భద్రతాచర్యల అవసరాన్ని నొక్కి చెప్పింది. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ‘వ్యవసాయ కమిషన్లు’ ఏర్పాటు కావాలి. స్వతంత్ర ప్రతిపత్తితో, చట్టబద్దమైన అధికారాలతో పనిచేసే ఈ కమిషన్లకు గట్టి అధినేతలు రావాలి. ప్రభుత్వాల తాబేదారులుగా ఉండే ‘జీ హుజూర్’లు కాకుండా కాసింత వెన్నెముక ఉన్న అధిపతులు వస్తేనే, దేశపు వెన్నెముక అయిన రైతుకు రక్ష. ఈ విషయంలో ‘మేం వ్యవసాయ కమిషన్’ ఏర్పాటు చేయబోతున్నాం అని ప్రకటించి ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఒక అడుగు ముందుకు వేశారు. వివిధ రాష్ట్రాల నుంచి ఆ దిశలో సాగే మరిన్ని అడుగులు ఢిల్లీ పీఠం వరకూ సాగాలి. పెట్టుబడి చేయూత గొప్ప సాయమే! రెండు తెలుగు రాష్ట్రాల నేతలు తెగువతో రైతుకు పెట్టుబడి నగదు సహాయం ప్రకటించి, అమలు పరచి అఖిల భారత నాయకత్వానికి దారి చూపుతున్నారు. తెలంగాణలో కే. చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా వరంగల్ సభలో, ఏపీలో వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాక ముందే గుంటూరు పార్టీ ప్లీనరీలో ఈ పెట్టుబడి సహాయం గురించి తొలుత ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ‘రైతు బంధు’ పేరిట ఏటా ఎకరాకి ఎనిమిది వేల రూపాయలు రెండు విడతల్లో (నాలుగేసి వేలుగా) గత సంవత్సరమే ఇచ్చింది. ఇప్పుడు ఆ మొత్తాన్ని పదివేల రూపా యలకు పెంచి ఇస్తున్నారు. ఏపీలోనూ ‘రైతు భరోసా’కింద కుటుంబా నికి ఏటా రూ. 12,500 చొప్పున నాలుగేళ్ల పాటు ఇవ్వాలన్నది పథకం. వచ్చే ఖరీఫ్ నుంచి ప్రారంభమౌతుందని ముందు ప్రకటించినా, రైతులకు వీలయినంత తొందరగా మేలు కల్పించాలని ప్రస్తుత రబీ నుంచే, అంటే అక్టోబర్ 15 నుంచి ఇవ్వనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో 54.50 లక్షలు, ఏపీలో ఉజ్జాయింపుగా 56 లక్షలు, మొత్తంగా కోటి కుటుంబాలకు పైగా ఈ ప్రత్యక్ష ప్రయోజనం పొందు తున్నాయి. ఇటీవలి సార్వత్రిక ఎన్నికలకు ముందరి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతు కుటుంబాలకు ఏటా ఆరేసి వేల రూపాయల చొప్పున నగదు సహాయాన్ని ప్రకటించింది. అయిదెకరాల లోపు భూమి ఉన్న రైతులకే అని ముందు ప్రకటించినప్పటికీ, సదరు పరిమితి లేకుండా ఇవ్వడానికి సిద్దపడింది. ఊబిలో పీకల్లోతుకు కూరుకొనిపోయి ఉన్న రైతాంగాన్ని, పెట్టుబడి సాయమొక్కటే గట్టెక్కించకపోవచ్చు! కానీ, వ్యవసాయ సీజన్ మొదలయ్యేటప్పుడు ఖాళీ చేతులతో ఉండే సగటు రైతుకు ఈ నగదు సహాయం ఓ వరం, ఎంతో భరోసా! కౌలు రైతులకు ఈ సహాయం అందటం లేదన్నదే, వ్యవసాయ రంగం శ్రేయో భిలాషుల మనసును కలచివేసే బాధ! రైతు హక్కులకు రక్షణ ఏది? తగిన చట్టాలు లేక కొంత, ఉన్నపుడు కూడా వాటి అమలు సవ్యంగా లేక మరికొంత... వ్యవసాయ రంగం, తద్వారా దేశమే స్థూలంగా నష్టపో తోంది. ఫలితంగా రాజ్యాంగ, చట్ట బద్దమైన హక్కులు రైతుకు దక్కని పరిస్థితి. బాధ్యతగా ఉండే ప్రభుత్వాలకు కొంత చొరవ ఉన్నచోట సరే! కానీ, అటువంటి చొరవ కొరవడిన చోట రైతుకు ఏ సహాయమూ లభించటం లేదు. భూ యాజమాన్య హక్కుల నుంచి రైతుకు అన్నీ సమస్యలే! పట్టాదారు పాసు పుస్తకాలు పొందడమూ గగనమే! రైతుకు దన్నుగా ఉండే సహజవనరుల్ని కార్పొరేట్లు, పలుకుబడి కల్గిన వారు స్వార్థంతో కొల్లగొడుతున్నారు. నాణ్యమైన విత్తనం లభించదు. బ్యాంకు రుణాలు, ఎరువులు, సరైన క్రిమిసంహారకాలు... ఏది పొందడమైనా రైతాంగానికి ఓ పోరాటమే. అతివృష్టి–అనావృష్టి వంటి ప్రకృతి వైప రిత్యాల నష్టపరిహారాల నుంచి పంట భీమా వర్తించి లబ్ధి దొరకటం వరకు... ప్రతిదీ జీవన్మరణ సమస్య. పంట పండి చేతికి అందడం ఒక ఎత్తయితే, చేతికందిన పంటకు ధర, మార్కెట్, నిలువ వసతి లభించడం అంతే సవాల్‌గా పరిణమిస్తోంది. ప్రభుత్వ పరంగా కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) ప్రకటిస్తారు తప్ప అది ఖచ్చితంగా రైతుకు లభించేలా చూడరు. ఒకోసారి, ఉత్పత్తి అంతా రైతు చెయ్యిదాటి దళా రుల వశమయ్యాక ఎమ్మెస్పీతో కొనుగోళ్లు జరిగేలా ప్రభుత్వాలు అప్రమత్తమవుతాయి. ప్రత్యేక చర్యలు తీసుకుంటాయి. అది ఎవరి ప్రయోజనాల కోసమో ఇట్టే అర్థమవుతుంది. పంటకు ఆశించిన ధర లభించనపుడు, నేరుగానో, ఇతరేతరంగానో నిలువ చేద్దామన్నా తగి నన్ని గిడ్డంగులుండవు. వ్యవసాయాధారిత పరిశ్రమలు, ఉత్పత్తి కేంద్రాలు కూడా ఉండవు. ప్రయివేటు, ప్రభుత్వ రంగంలో సదరు పరిశ్రమల్ని ప్రోత్సహించకపోవడం రైతుకు శాపంగా తయారవుతోంది. వీటన్నిటినీ అధిగమించడానికి కేంద్ర, రాష్ట్రాల స్థాయిల్లో చట్టబద్ధమెన ‘వ్యవసాయ కమిషన్లు’ ఏర్పడవలసిన అవసరం ఉంది. విత్తనంపై ఎమ్మెన్సీల పెత్తనం వేల సంవత్సరాల నుంచి మన దేశంలో ఓ గొప్ప సంప్రదాయంగా వస్తున్న రైతాంగం విత్తన హక్కు క్రమంగా హరించుకుపోతోంది. ఇప్పు డది తీవ్ర ప్రమాదంలో పడింది. పాతిక, ఇరవై సంవత్సరాల కిందటి దాకా కూడా, వీసమెత్తు భంగం లేకుండా రైతు అనుభవించిన అప్రతి హతమైన హక్కు ఇది. గత దశాబ్ద కాలంలో పరిస్థితులు చాలా మారాయి. విత్తన స్వేచ్ఛ, హక్కు నుంచి రైతును మెలమెల్లగా దూరం చేసే అంతర్జాతీయ కుట్ర యధేచ్ఛగా సాగుతోంది. ఇది పరోక్షంగా దేశ సార్వభౌమాధికారంపైనే దాడి. చట్టాల్లో తగు రక్షణ కల్పించినప్పటికీ వాటికి వక్ర భాష్యాలెక్కువయ్యాయి. విధాన పరంగా ప్రభుత్వాలు, సాంకేతికాంశాల వల్ల అక్కడక్కడ న్యాయస్థానాలు కూడా రైతును కాదని కార్పొరేట్లు, బహుళజాతి కంపెనీ (ఎమ్మెన్సీ)ల వైపే మొగ్గుతున్నాయి. పేటెంట్ చట్టాలు, మేథోసంపత్తి హక్కులు, ట్రిప్స్–డబ్లుటీవో ఒప్పం దాల నీడలో ఈ ఎమ్మెన్సీలు పెట్రేగిపోతున్నాయి. మోన్సాంటో, పెప్సీ, బేయర్... వంటి బడా కంపెనీల అకృత్యాలు, ఆధిపత్య ధోరణులు పెచ్చుమీరాయి. గుజరాత్లో బంగాళదుంప రైతులపై పెప్సీ కంపెనీ దావా వేయడం ఈ దాష్టీకాల్లో భాగమే! పెద్ద ఎత్తున ‘ఆలు చిప్స్’ తయారీకి స్థానికంగా రైతులతో ఒప్పందం కుదుర్చుకొని పండిస్తున్న ‘ఎఫ్.ఎల్ 2027’ రకం బంగాళదుంపపై తనకు పేటెంట్ హక్కులు న్నాయనేది వాదన. తన అనుమతి లేకుండా నలుగురు రైతులు ఆ రకం పంట పండించి, అమ్ముకుంటున్నారనేది పెప్సీ కంపెనీ అభియోగం. అంతకు ముందు అయిదుగురిపైన ఇవే రకం ఆరోపణలు. ఒక్కో రైతు కోటి రూపాయల పైన నష్టపరిహారం చెల్లించాలని దావా! స్థానిక రైతులు, రైతాంగ సంఘాల వారు, మేథావులు అహ్మదాబాద్‌లో సమా వేశమై ప్రతిఘటించారు. దావా వేయడానికి పెప్సీ కంపెనీ, ‘ప్లాంట్ రకాలు, రైతుల హక్కుల (పిపివి అండ్ ఎఫ్ ఆర్) చట్టం–2001’ లోని సెక్షన్ 64ని ఉటంకిస్తే, రైతులు అదే చట్టంలోని సెక్షన్ 39ని వాడు కున్నారు. ‘తమ వ్యవసాయ ఉత్పత్తికి విత్తనాలను దాచుకోవడం, వాడడం, విత్తనాలను నాటడం, తిరిగి నాటడం, మార్చుకోవడం, పంచు కోవడం లేదా విక్రయించుకోవడం....’ వంటి రైతు హక్కుల్ని చట్టంలోని ఈ సెక్షన్ రక్షిస్తుంది. అయితే, ఈ చట్టం కింద ‘బ్రాండెడ్ సీడ్’ను విక్రయించ కూడదు. రైతు పోరాటం ఫలితంగా పెప్సీ కంపెనీ తన కేసుల్ని ఉపసంహరించుకోవడం ఒక రకంగా రైతాంగ విజయమే! అన్ని చోట్ల, అన్ని సార్లూ ఇది సాధ్యపడకపోవచ్చు. అందుకే, న్యాయాధికారా లతో కూడిన ఓ చట్టబద్ధ కమిషన్ అవసరం. ముసాయిదా సిద్ధంగానే ఉంది తమ హక్కులకు భంగం కలిగిన ప్రతి సందర్భంలోనూ రైతులు ఈ కమిషన్‌ను సంప్రదించవచ్చు. మానవహక్కుల సంఘం, సమాచార హక్కు కమిషన్ తరహాలో వ్యవసాయానికి కేంద్ర, రాష్ట్ర కమిషన్లను ఏర్పాటు చేసుకోవాలి. వ్యవసాయానికి సంబంధించిన అన్ని చట్టాల అమలును పర్యవేక్షిస్తూ, ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకు ఈ కమిషన్లు వ్యవసాయాభివృద్ధికి సంబంధించిన సిఫారసులు చేస్తాయి. రైతుకు నష్టం జరిగిన పుడు బాధ్యులపై చర్యలు పుర మాయిస్తూనే, రైతుకు సత్వర న్యాయం జరిగేలా ప్రభుత్వాలకు తగు ఆదేశాలిస్తాయి. వ్యవసాయానికి జరిగిన, జరుగుతున్న, జరుగబోయే నష్టాల్ని కూడా కమిషన్ నివారించగలుగు తుంది. కమిషన్ పరిధి, అధికారాలు, పనితీరు, విధి–విధానాలకు సంబం ధించిన అంశాలతో ముసాయిదా ఎప్పుడో సిద్దమైంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ న్యాయశాఖ దీన్ని లోతుగా పరిశీలన చేసింది. ఇలాంటి విషయాల్లో ‘ముసాయిదా’ కన్నా ‘సంకల్పం’ (విల్ రాదర్ దెన్ బిల్) ముఖ్యం. దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
ప్రజలు కోరుకున్నదే చట్టం కావాలి
హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరుకున్నదే చట్టం కావాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు పద్మనాభ రెడ్డి అన్నారు. మహిళలపై అత్యాచారం జరిగితే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసే ధైర్యం రావాలన్నారు. రేప్ ఫ్రీ ఇండియా పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరం సహకరించాలన్నారు. 50 స్వచ్ఛంద సంస్థలు కలిసి ‘రేప్ ఫ్రీ ఇండియా’పేరుతో సంస్థ ఏర్పాటు చేసుకుని మహిళలు, పిల్లలపై జరుగుతున్న వేధింపులపై ప్రత్యేక చట్టం తయారుచేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. దీనికోసం దేశవ్యాప్తంగా ప్రస్తుతం బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులతో సంతకాల సేకరణ నిర్వహించి మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సాక్షి జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాల వారూ రేప్ ఫ్రీ ఇండియా ఉద్యమానికి సహకరించాలన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను ఆపేందుకు చేస్తున్న ఏ చిన్న ప్రయత్నమైనా అభినందించాలన్నారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో 70 నుంచి 80 శాతం మంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కాలేజ్ డ్రాప్ అవుట్ అయినవారే ఉన్నారని, వారు తీసే సినిమాలవల్ల సమాజంపై ఎలాంటి ప్రభావం పడుతుందో వారికి అవగాహన లేదని, అందుకే కమర్షియల్ సినిమాలను నిర్మిస్తున్నారన్నారు. కైలాష్ సత్యార్థి ఫౌండేషన్ రీజినల్ డైరెక్టర్ ఓం ప్రకాష్ మాట్లాడుతూ, మహిళలపై అత్యాచారాలు నిరోధించేందుకు తాము చేపట్టిన భారత యాత్ర విజయవంతమైందని తెలిపారు. ఎంవీ ఫౌండేషన్ నేషనల్ కన్వీనర్ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. బాల్య వివాహాలను ఆపాలని, మహిళలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలపై అవగాహన కల్పించాలన్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ శ్యామల మాట్లాడుతూ.. చట్టాలు పిల్లలకు అనుకూలంగా ఉండాలన్నారు. హ్యూమన్ రైట్స్ ఫోరం ప్రతినిధి జీవన్‌కుమార్ మాట్లాడుతూ.. పోలీసుల మైండ్ సెట్లో మార్పు రాలేదని, అత్యాచార కేసుల్లో ఇప్పటికీ ఫిర్యాదులు స్వీకరించడం లేదన్నారు. తరుణి స్వచ్ఛంధ సంస్థ అధ్యక్షురాలు మమతా రఘువీర్, అసోసియేషన్ ఫర్ ప్రమోటింగ్ సోషల్ యాక్షన్ డైరెక్టర్ ఎస్. శ్రీనివాస్‌రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ప్రజాతీర్పు వండి వారుస్తారా?
గత వారం రోజుల సభలు, సమావేశాలు, ప్రజాస్పందన చూస్తున్న వారికి ఒక విషయం స్పష్టమౌతోంది. ఏపీ జనాభిప్రాయం ఇప్పటికే వారి మెదళ్లలో నిశ్చయం అయిపోయింది. ఇక అది ఈవీఎంలలోకి బదిలీ కావడమే తరువాయి. కానీ, కులాల వారిగా ఓట్లను చీల్చడానికి, వర్గాల వారిగా ప్రత్యర్థిని బలహీనపరచడానికి, లేని నిందారోపణలతో విపక్షనేతను చిన్నబుచ్చడానికి, పౌరుల్ని తక్కువ అంచనా వేసి సాను‘కుల’ మీడియాతో జనాభిప్రాయం తిరగరాయడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ దింపుడు కళ్లం ఆశే! రాజకీయ స్వార్థంతో చేసే ఏ చర్యలు ఎలా ఉన్నా, ప్రజల్ని తక్కువ అంచనా వేయడం, జనాభిప్రాయాన్ని ఇష్టానుసారంగా తిరగరాస్తామనుకోవడం భ్రమ మాత్రమే! ‘ఇక్కడ చట్టం అమలు కాదు, ఉపయోగించ బడుతుంది’ (యహా ఖానూన్ లాగూ నహీ హోతా, ఇస్తెమాల్ కియా జాతా హై) అనే డైలాగ్ అమితాబ్ నటించిన ‘అంధా ఖానూన్’ సినిమాలోది. అధికారం అండతో చట్టాలను చెరబట్టినవారు ఇష్టానుసారం వ్యవహరించే స్థితిని ప్రతిబింబించే అహంకారపు మాట అయినందున, సదరు డైలాగ్ నేరుగా ప్రేక్షకుల గుండెను తాకుతుంది. సన్నివేశం ఉత్కంఠ రేపుతుంది. దాదాపు అలాంటి వాతావరణమే నెలకొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇపుడు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమైంది. గెలుపు సందేహమై, ఓటమి తప్పదనే సంకేతాల కారణంగా అధికారపక్షం వైపునుంచి అన్ని మాయోపాయాలూ మొదలయ్యాయి. అయిదేళ్ల పాలనలో ప్రజాస్వా మ్యపు వ్యవస్థలన్నింటినీ చిద్రం చేసిన పాలకులు, ఇప్పుడు ఒకటొకటిగా అన్ని సంప్రదాయాలు, పద్దతులు, మర్యాదల్ని మంటగలుపుతున్నారు. ప్రజాక్షేత్రంలో గందరగోళం సృష్టించడం ద్వారా, ఇప్పటికే సిద్ధాంత పటుత్వం తగ్గి పలుచనైన రాజకీయాల్ని మరింత కలుషితం చేస్తున్నారు. అవసరానికో, అవకాశవాదానికో పనికొచ్చే పొత్తులతో, లోపాయికారి ఒప్పందాలతో ఎన్నికల చిత్రాన్నే మారుస్తున్నారు. జనాభిప్రాయాన్నే వంచించాలని ఎత్తుగడలు వేస్తున్నారు. స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆలోచించి, ఓటువేసే వాతావరణం ఓటర్లకు దక్కనీకుండా, ఏదోలా వారిని ప్రభావితం చేసే వ్యూహ రచనల్లో మునిగితేలుతున్నారు. అధి కారపు అండదండలు, ఆర్థిక ప్రయోజనాల రుచి మరిగిన చిన్న చితక పార్టీలు, పచ్చ మీడియా బేషరతుగా పాలకపక్షానికి ఊడిగం చేస్తు న్నాయి. రాజకీయ శిబిరాలకు దన్నుగా అనుకూల మీడియా... బలపడు తున్న జనాభిప్రాయాన్ని వక్రీకరింప జూస్తోంది. నిజం ప్రతిబింబించడం కాదు, నిర్మించడం అంతకన్నా కాదు, ప్రఖ్యాత జర్నలిస్టు ‘నామ్ చోమ్స్కీ’ చెప్పినట్టు, ‘జనాభిమతాన్ని’ తామే వండి, వార్చే పని ఇప్పుడు తెలుగునాట య«ధేచ్ఛగా సాగిస్తున్నారు. సంక్షుభిత సమ యాలు, సంక్లిష్ట ఎన్నికల్లోనూ విజ్ఞతతో వ్యవహరించే ఆంధ్ర సమాజాన్ని చిన్నచూపు చూసే రాజకీయ వైఖరి ఇది. దానికి ‘తందాన’ పలికే అను‘కుల’ మీడియా పోకడ రాజకీయ–మేధావి వర్గాల్లో విస్మయం కలిగిస్తోంది. జనాన్ని తప్పుదోవ పట్టించే ఎత్తుగడలు ఎన్ని పన్నినా... ప్రజాక్షేత్రంలో మాత్రం అస్పష్టత ఉండదు. రంగు తొలగడం తరువాయి పరిస్థితి సానుకూలంగా లేనపుడు ప్రజల్లో గందరగోళం సృష్టించి పబ్బం గడుపుకోవాలని చూడటం రాజకీయాల్లో ఓ నమూనా! ఫక్తు అదే పాటి స్తున్నారిపుడు. ఓట్లే యావ, గెలుపే లక్ష్యం! మతాన్ని, ముఖ్యంగా కులాన్ని మున్నెన్నడు లేనంతగా ఈ ఎన్నికల్లో వాడుకునే కుటిల వ్యూహాలు పన్నుతున్నారు. ప్రత్యక్ష–పరోక్ష పొత్తులు–అవగాహనలు కూడా పక్కా అవకాశవాదంతోనే తప్ప ఏ సిద్ధాంత సారూప్యతా, నిబ ద్ధతా లేదు. పాలకపక్షమైన తెలుగుదేశంతో జనసేన సఖ్యత జనానికి తెలియంది కాదు! తానొక విపక్షమై ఉండి, చాలా ప్రజాసంబంధ విషయాల్లో ప్రభుత్వంపై విమర్శల కన్నా సాటి ప్రధాన ప్రతిపక్షంపైనే విమర్శలు ఎక్కుపెట్టారు జనసేన నేత! కీలకమైన ప్రజా సమస్యలు ముప్పిరిగొన్నపుడు, తగుదునమ్మా అని తాను రంగ ప్రవేశం చేసి, జనా నికి ఊరట కన్నా ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించిన సందర్భాలెన్నో! అయినా, అటువంటిదేదీ లేదని మభ్యపెట్టడానికి ఎన్నెన్ని మాటలు చెప్పారో! కానీ, వారి లాలూచీ కుస్తీ క్రమ క్రమంగా బయటపడుతోంది. ఎక్కడో ఉత్తరాదిలో ఉన్న బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రితో పొత్తుకు ఎంత వేగంగా పావులు కదిపారు? దీని వెనుక ఉండి వ్యవ హారం నడిపిందెవరు? ఎవరి ప్రయోజనాలు నెరవేరడానికి? దళిత, బడుగు బలహీనవర్గాలు ప్రధాన దన్నుగా ఉన్న వైఎస్సార్సీపీని రాజకీ యంగా దెబ్బతీయాలనే ఎత్తుగడ కాదా? ఏపీలో బీఎస్పీ–జనసేన–లెఫ్ట్ కూటమి వ్యూహాత్మక పొత్తుల తెరవెనుక ఉన్న పరోక్ష పథగామి ఎవరు? రాజకీయాల్లో ఓనమాలు తెలిసిన ప్రతి ఒక్కరూ అంచనా వేయగలరు. మైనారిటీ ఓట్లు దక్కనీయొద్దనే కుటిల నీతితోనే, విపక్షనేతకు బీజేపీతో లేని బంధం అంటగట్టడం. ఆంధ్ర–తెలంగాణ వివాదాన్ని రగల్చడానికి కేసీఆర్–జగన్ ఒకటనే దుష్ప్రచారం. వైఎస్సార్‌ని అభిమానించే పెద్ద సంఖ్య కాంగ్రెస్ వాదుల్ని వైఎస్సార్సీపీకి కానీకుండా చేసేందుకు కాంగ్రెస్‌తో తన అంగీకారం.. ఇన్ని వ్యూహాలా? ఆయా గ్రూపులు పోటీ చేసే స్థానాల ఎంపికతోనే రంగు బయటపడుతోంది, రేపు అభ్యర్థిత్వాలు ఖరారయ్యాక ఏ వ్యూహం వెనుక ఏ కుటిల నీతో తెలియకుండా ఉంటుందా? పులుముకున్న పులివర్ణం కలకాలం నిలువదు. తుంపర వర్షానికే కరిగిపోతోంది, ఇక రేపటి జడివానకు నిలుస్తుందా? ఊహు! రంగు వెలసి గాడిద బయట పడటం ఖాయం! దిగితే తెలుస్తుంది లోతు ఇంత కాలం ముసుగులో గుద్దులాటలు ఎలా ఉన్నా, ఒకసారి రాజకీయ బరిలోకి దిగాక అసలు రంగు తెలిసిపోవాల్సిందే! నిలదొక్కుకోకుంటే వెలిసిపోవాల్సిందే! వేగంగా తరం మారుతోంది. సామాజిక మాధ్య మాల ప్రభావం పెరిగాక సామాన్యులు కూడా తెలివిపరులైపోతున్నారు. ఆలోచిస్తున్నారు. ప్రత్యక్ష సమాచారంతో స్పష్టమైన అభిప్రాయాలు ఏర్ప రచుకుంటున్నారు. ఏ రంగంలో నిపుణుల్ని అక్కడే ఆదరిస్తున్నారు తప్ప ఇతర రంగాల్లో పెద్దపీట వేయడానికి వెనకాడుతున్నారు. సినీ తారలు, ఆ గ్లామర్‌తో రాజకీయాల్లో వెలగడమిక కష్టమే! తమిళ రాజకీయాలేలిన జయలలితే ఆ తరంలో ఆఖరు అనిపిస్తుంది. ఉత్సాహంతో ఎవరైనా సినీ రంగం నుంచి వచ్చినా... రాజకీయాల్లో నిబద్ధతతో నిలదొక్కుకోవా ల్సిందే! ఇప్పుడు పవన్‌కళ్యాణ్ అయినా, జేడీ లక్ష్మీనారాయణ అయినా తమను తాము నిరూపించుకోవాల్సి ఉంటుంది. 2014 ఎన్నికల ముందు టీడీపీని సమర్థించినపుడున్నంత స్పష్టత ఇప్పుడు జనసేనాధిప తిలో కొరవడింది. చంద్రబాబునైనా, జగన్మోహన్రెడ్డినైనా ఆయన సమర్థిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? ఏదైతే, ఎందుకు? స్పష్టంగా వ్యక్త పరచాలని ప్రజలు డిమాండ్ చేస్తారు. ప్రజాకవి శ్రీశ్రీ అన్నట్టు, ‘ప్రజా జీవితంలోకి వచ్చాక ఏమైనా, ఎన్నైనా అంటాం’ అంటారు జనం. విశాఖ పట్నం లోక్‌సభ అభ్యర్థిత్వం ఖరారైన లక్ష్మీనారాయణ సీబీఐ అధికారిగా వ్యవహరించిన తీరు మరోమారు రాజకీయ తెరపైకి వస్తుంది. జగన్మో హన్ రెడ్డిపై కేసుల విచారణలో చూపిన అత్యుత్సాహం, చంద్రబాబుపై కేసుల విషయానికొచ్చే సరికి ఎందుకు తగ్గిందనే ప్రశ్న ఎప్పటికీ రేగు తూనే ఉంటుంది. తమ వద్ద తగిన సిబ్బంది లేరు కనుక విచారించలే మని న్యాయస్థానానికి ఆయన నేతృత్వపు సీబీఐ బదులివ్వడం అప్పట్లో వార్తయింది. నైపుణ్యాలు, సానుకూల ప్రచారాలే కాకుండా ప్రతికూల వాఖ్యలు కూడా ఇప్పుడు జనం చర్చల్లోకి వస్తాయి. ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఓ సీబీఐ కేసు విచారణను ఆదిలాబాద్ జిల్లా జడ్జి తప్పుబట్టడం వంటివి ఇప్పుడు ప్రచారంలోకి రావచ్చు. 2010లో ఆదిలాబాద్ వాంకిడి మండలం సర్కెపల్లి అడవిలో జరిగన ఆజాద్ (మావోయిస్టు), హేమ చంద్ర ప్రసాద్ (జర్నలిస్టు) ఎన్కౌంటర్ కేసు దర్యాప్తు సవ్యంగా జరగ లేదని, పోలీసులకు అనుకూలంగా సాగిందని జడ్జి వ్యాఖ్యానించారు. సమాధానం లేకే ఎదురుదాడి అయిదేళ్లు అధికారం అప్పగిస్తే అన్నిటా విఫలమైన ప్రభుత్వ పెద్ద, విపక్షం విమర్శల్ని తట్టుకోలేక ఎదురుదాడికి తలపడుతున్నారు. చేసిన ప్రగతిని చెప్పుకోలేని దుస్థితిలో విపక్షనేతపై నోటికొచ్చిన నిందలు మోపుతున్నారు. నలబై యేళ్ల అనుభవమని చెప్పే ముఖ్యమంత్రికి ఒక నిందితుడికి, నేరస్తుడికి తేడా తెలియదా? విపక్షనేత ఎదుర్కొంటున్న వన్నీ తామే వేసిన తప్పుడు కేసులని, ఏ కేసులోనూ ఏదీ నిరూపిత మయ్యే పరిస్థితి లేదని తెలిసీ చేసేది కువిమర్శ కాదా? 1999 ఎన్నికల్లోనూ నాటి పీసీసీ అధ్యక్షుడు డా.వైఎస్.రాజశేఖరరెడ్డిపై ఈయన ఇటువంటి నిందలే మోపారు. వారొస్తే అభివృద్ధి ఆగిపోతుందని, శాంతి భద్రతలుండవని, రౌడీయిజం రాజ్యమేలుతుందనీ ప్రజల్లో భయాందోళ నలు రేపారు. అదృష్టంతో ఆ ఎన్నికల్లో నెగ్గి, నిరూపితం కాని అవే నిందల్ని వైఎస్‌పై మళ్లీ మోపే ప్రయత్నం 2004లోనూ చేసి భంగ పడ్డారు. అవన్నీ రాజకీయ దుగ్ధతో చేసిన నిరాధారపు నిందలని డా‘‘ వైఎస్. హయాం నిరూపించింది. ‘అభివృద్ధి–సంక్షేమం’ జోడెడ్ల బండిలా పాలనను వై.ఎస్ పరుగులు తీయించారు. తర్వాతి తరాల పాలకులకు వైఎస్సార్ హయాం బెంచ్మార్కయింది. ఉత్తుత్తి నిందలు నమ్మి, అయ్యో... బంగారు పాలన అయిదేళ్లు జాప్యం చేసుకున్నామే! అని ప్రజలు పశ్చాత్తాప పడ్డారు. ఇప్పుడు ప్రజలు నిందలు నమ్మడానికి, సుపరిపాలనను జాప్యం చేసుకోవడానికి సిద్దంగా లేరు. సడలిన నమ్మకానికి ఇవే ఆధారాలు! గత వారం రోజుల సభలు, సమావేశాలు, ప్రజాస్పందన చూస్తున్న వారికి ఒక విషయం స్పష్టమౌతోంది. ఏపీ జనాభిప్రాయం ఇప్పటికే వారి మెదళ్లలో నిశ్చయం అయిపోయింది. ఇక అది ఈవీఎంలలోకి బదిలీ కావ డమే తరువాయి. అందుకు మూడు వారాల గడువుంది. ఈ లోపున ఎన్నెన్ని సర్కస్ ఫీట్లో! సీఎం విశ్వాసం నడలిందనడానికి పరస్పర విరు ద్ధపు ఆయన మాటలు, వ్యవçహారమే సంకేతం. ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగుతున్న ఇద్దరు మంత్రుల్ని తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయించిన సీఎం, తన తనయుడు లోకేష్‌తో మాత్రం చేయించలేదు. రిస్కు తీసుకోవడానికి సిద్ధంగా లేరన్న మాట! రెండు విధాలా, ఓటమి ఆస్కారాన్ని అంగీకరించారన్నట్టే! ‘నా నలభయేళ్ల రాజకీయ జీవితంలో ఇంత సానుకూలత ఎప్పుడూ చూడలేదు’ అని గంభీరంగా ప్రకటన చేసిన ఆయన, హిందూపూర్‌లో ఒక సీఐ స్థాయి అధికారి పోటీని నివా రించడానికి తన ప్రభుత్వంతో ఎలా మోకాలడ్డారో జనం చూశారు. అడ్డు కోవడం సరికాదని, పూర్వపు తేదీతో సీఐ రాజీనామా అంగీకరించండని ట్రిబునల్తో చెప్పించుకోవాల్సి వచ్చింది. కులాల వారిగా ఓట్లను చీల్చ డానికి, వర్గాల వారిగా ప్రత్యర్థిని బలహీన పరచడానికి, లేని నిందారోప ణలతో విపక్షనేతను చిన్నబుచ్చడానికి, పౌరుల్ని తక్కువ అంచనా వేసి సాను‘కుల’ మీడియాతో జనాభిప్రాయం తిరగరాయడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ దింపుడు కళ్లం ఆశే! రాజకీయ స్వార్థంతో చేసే ఏ చర్యలు ఎలా ఉన్నా, ప్రజల్ని తక్కువ అంచనా వేయడం, జనాభిప్రాయాన్ని ఇష్టానుసారంగా తిరగరాస్తామనుకోవడం భ్రమ మాత్రమే! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
వారి పుట్టుకా ఆ గర్భం నుంచే!
‘మార్చి 8’ వస్తోందంటే చాలు, ప్రపంచమంతా అకస్మాత్చేతన పొందుతుంది. పత్రికల్లో, రేడియోల్లో, టీవీల్లో, వెబ్సైట్లలో, సామాజిక మాధ్యమాల్లో... ఆ 24 గంటలు, ఎక్కడ చూసినా ‘మహిళ’ కేంద్ర బిందువవుతుంది. కరుణ, దయ, జాలి, అనుకంపన... కట్టలు తెంచుకు ప్రవహిస్తాయి. కానీ, ఆచరణకు వచ్చేసరికి మన అడుగులు వెనక్కి పడుతున్నాయి. మన రోజువారీ నిర్వాకాలు మధ్యయుగాలకు నడుపుతున్నాయి. సభలు, సమావేశాలు, సదస్సులు, లక్ష్యాలు... సరే, అవన్నీ సాగుతూనే ఉంటాయి. ఏక కాలంలో సమాజం అట్టడుగుస్థాయి నుంచి మార్పు రావాలి. కుటుంబమే అందుకు మౌలిక యూనిట్ కావాలి. అప్పుడు, సమానత్వం నిజంగా ఎంత అందమైన ఫలం! ‘సమానత్వం’ ఎంత అందమైన పదం! మేధో సమాజం ఆదిపత్యం సాధించిన తర్వాత కూడా దశాబ్దాలు, శతాబ్దాలుగా మనం వల్లెవేస్తున్న పదం. అనేక సమానత్వాల్లో... ఆడ–మగ మధ్య అంతరాలు లేని లింగ సమానత్వం ఒకటి. ఇది ఎప్పటికీ అందమైన కలేనా? ఈ కల నెరవేర్చుకునే దిశలో సరైన అడుగులే పడుతున్నాయా? ఆచరణలో ఎక్కడున్నాం? 2030 నాటికి సాధించాలని ఐక్యరాజ్య సమితి (యుఎన్) నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఇదెంతో ప్రాధాన్యతాంశం! సుమారు రెండొందల దేశాలు ఆచరణకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన విధాన పత్రమిది. ‘‘అందరు మహిళలు, బాలికలు సాధికారత పొందేలా లింగ సమానత్వం సాధించాలి... అంతటా, వారి పట్ల అన్ని రకాల వివక్షను అంతమొందించాలి’’ అన్నది స్థూల లక్ష్యం. మరింత నిర్దిష్ట వ్యక్తీకరణ... ‘‘ప్రైవేటు, పబ్లిక్ అన్ని ప్రదేశాల్లోనూ మహిళలు, బాలికలు అందరిపైన లైంగిక హింసతో పాటు ఏ రూపంలోనూ హింస– వేధింపులు అన్నవి లేకుండా నిర్మూలించాలి’’అని పేర్కొన్నారు. ఈ విష యాల్లో, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న తాజా స్థితిని లోతుగా అధ్య యనం చేసి గణాంకాలు, వాస్తవాలు, వివరాలతో ‘హామీలను ఆచరణ లోకి తెద్దాం’ అంటున్న యుఎన్ తాజా నివేదిక ఈ సమానత్వ సాధనకు సరికొత్త సిఫారసులు చేస్తోంది. విధానాలు, ఆర్థిక వ్యయం, శాస్త్ర సాంకే తికత వినియోగం, భద్రత–నేరనియంత్రణ, సమగ్ర కార్యాచరణ ఇలా.. అనేకాంశాల్లో ఏం చేస్తే సమానత్వ సాధనలో ఆశించిన లక్ష్యాన్ని చేరుకుం టామన్నది ఈ నివేదికలో పొందుపరిచారు. సుస్థిరాభివృద్ధి కోసం ఉద్దే శించిన 17 అంశాల్లో ఒకటైన లింగసమానత్వం (అయిదోది) సాధించేం దుకు, మిగిలిన 16 లక్ష్యాల్లోనూ... ఈ అంశం స్థితి, ప్రాతినిధ్యం, ప్రాధా న్యత, ఫలితాల్ని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలన్నది తాజా సిఫా రసుల్లో ఒకటి. ముఖ్యమైన ఇంకో ఆరు సిఫారసులున్నాయి. ఇదంతా ప్రపంచస్థాయిలో జరుగుతోంది. మిగతా విషయాల్లో ఎలా ఉన్నా, ‘విశ్వ స్థాయిలో ఆలోచించు, స్థానికంగా ఆచరించు’ అన్న నినాదం లింగ వివక్షను రూపుమాపి, మహిళలకు తగు భద్రత కల్పించి, సమానత్వం సాధించడంలో అక్షరాలా సరిపోతుంది. కానీ, ఇప్పుడదే లోపిస్తోంది! ఆలోచనలు ఆకాశాన... ఆచరణ అట్టడుగున పెద్ద పెద్ద స్థాయిల్లో మన ఆలోచనలు, చర్చలు, అధ్యయనాలు, నివేది కలు ఏటా అందుతూనే ఉన్నాయి. ‘మార్చి 8’ వస్తోందంటే చాలు, ప్రపంచమంతా అకస్మాత్చేతన పొందుతుంది. పత్రికల్లో, రేడియోల్లో, టీవీల్లో, వెబ్సైట్లలో, ఇతర సామాజిక మాధ్యమాల్లో... ఆ 24 గంటలు, ఎక్కడ చూసినా ‘మహిళ’ కేంద్ర బిందువౌతుంది. కరుణ, దయ, జాలి, అనుకంప... కట్టలు తెంచుకు ప్రవహిస్తాయి. కానీ, ఆచరణకు వచ్చేసరికి మన అడుగులు వెనక్కి పడుతున్నాయి. మన రోజువారీ నిర్వాకాలు మధ్యయుగాలకు నడుపుతున్నాయి. నట్టిల్లే నరక కూపానికి బీజం వేస్తోంది. పిల్లల పెంపుదలే వివక్షకు ఆజ్యం పోస్తోంది. బాధ్యత మరచిన బడి, కాలేజీ, యూనివర్సిటీలకు చేష్టలుడిగాయి. ఎదిగీ ఎదగని లేత మెదళ్లను కలుషితం చేసే సాంస్కృతిక దాడి ముప్పేటా జరుగుతోంది. అదే క్రమంలో, కాలం చెల్లిన కట్టుబాట్లు, చేవలేని చట్టాలు, పదును తగ్గిన నేరదర్యాప్తులు, సకాలంలో న్యాయం అందించని న్యాయస్థా నాలు... ఇవన్నీ ఆమెకు ప్రతికూలమే! ముఖ్యంగా మహిళలు, బాలిక లపై సాగుతున్న హింస, వేధింపులను ఎవరూ తీవ్రంగా పట్టించుకో వడం లేదు. ఇల్లయితేం, పనిప్రదేశమైతేనేం... అంతర్–బహిర్ హింసకు నేడు అడ్డూ అదుపూ లేదు. నోరిప్పి వెళ్లడించని, ఎక్కడా నమోదుకాని హింస నాలుగ్గోడల మధ్య కర్కశంగా రాజ్యమేలుతోంది. నిర్హేతుకంగా యుక్తవయసులోనే యువతుల జీవితాలు ఆరిపోతున్నాయి. గృహిణులు అనామకంగా హత్యలకు గురై, కిరోసిన్–పెట్రోల్ మంటకు ఆవిరై, గుర్తు తెలియని శవాలై... కుటుంబాలే కుదేలైపోతున్నాయి. ముందు అవి ఆగి పోవాలి. కానీ, అది జరగట్లేదు. ఈ హింస నానాటికి పెరుగుతోంది. దేశంలో గడచిన నాలుగేళ్లలోనే మహిళపై హింస 34 శాతం పెరిగిందని అధికారిక క్రైమ్ రికార్డులు చెబుతున్నాయి. నమోదవని హింస ముందు ఇది పిసరంత! మన చుట్టూ మనం పట్టించుకోని, తగినంత శ్రద్ద చూపని పలు స్థానిక అంశాలే ఈ దుస్థితిని పెంచి పోషిస్తున్నాయి. భావజాలమే మూలకారణం మొన్కొక శిరీష, నిన్న జ్యోతి, నేడు రవళి... పేర్లేమైతేనేం, ప్రాంతమెక్క డయితేనేం దుర్మార్గంగా హత్యలకు గురయ్యారు. సభ్యసమాజం ప్రగా ఢంగా సానుభూతి తెలిపింది. ప్రసారమాధ్యమాలు ఎలుగెత్తి చాటాయి. దర్యాప్తు సంస్థలు వాటి స్థాయిలో ‘యధాశక్తి’ స్పందించాయి. ఈ మాట ఎందుకనాల్సి వస్తోందంటే, పాతిపెట్టిన శవాన్ని మట్టిపొరల్లోంచి తవ్వి పోస్టుమార్టమ్ చేసేంత ఒత్తిడి పెంచితే గాని నిందితుడి వైపు అడుగులు పడలేదు, హత్య దర్యాప్తు ఓ కొలిక్కి రాలేదు! ఇలా వెలుగు చూడని దురాగతాలెన్నో! డబ్బుకో, కులానికో, రాజకీయ ఒత్తిళ్లకో లొంగి దర్యా ప్తులు మందగించడంతో కంచికి చేరని కథలెన్నెన్నో!! ముదిరిన ఈ సామాజిక రుగ్మతకు నెమ్మదైన కాయకల్ప చికిత్సలు జరుగుతూనే ఉన్నాయి. మూలాల్లో మాత్రం మార్పులేదు. చదువురాని జులాయిల నుంచి, సంపన్న కుటుంబాల మోతుబరి యువకుల వరకు... ప్రేమకు, వ్యామోహానికి, వాంఛకు మధ్య తేడాలు తెలియని స్థితిలో యువతులపై బరితెగించే సాహసాలు నలువైపుల పెచ్చుమీరుతున్నాయి. ఏ మాధ్య మం ద్వారా ఏ రోజు ఏం వార్త వినాల్సివస్తుందో తెలియని భయం, ఆందోళనలు వెన్నాడుతూనే ఉన్నాయి! విచక్షణా జ్ఞానం లేని అపరిపక్వ స్థితిలో ‘ప్రేమించా–ప్రేమించు’ అని యువతులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. ఉన్మాదస్థితికి చేరి హత్యలు, హత్యాయత్నాలు, తీవ్రంగా గాయపరచ డాలు... ఇలా ఎన్నెన్నో అకృత్యాలు జరిగిపోతున్నాయి. బాధ్యతారహి తంగా తీసే చౌకబారు సినిమాలు, టీవీ సీరియళ్లు, విచ్ఛలవిడిగా అందు బాటులోకి వచ్చిన విశృంఖల శృంగార సైట్లు (పోర్నో) యువతరాన్నే గాక వివాహితులను కూడా వక్రమార్గాల్లోకి నడుపుతున్నాయి. వివాహే తర లైంగిక సంబంధాలు అనేక విపరిణామాలకు, హింసకు, చివరకు భౌతిక దాడులు, భౌతిక నిర్మూలనకూ దారి తీస్తున్నాయి. ఎన్నో కుటుం బాల్లో చిచ్చు రగులుస్తున్నాయి. అన్ని చోట్లా మహిళలే బలిపశువులవుతు న్నారు. స్త్రీని సొత్తుగా భావించే పురుషాధిక్య, భూస్వామ్య భావజాలం తాలూకు అవలక్షణాల వల్లే ఇది జరుగుతోంది. చట్టాలంటే భయముండాలి ఉన్మాదిగా మారినపుడు, మూర్ఖపు తెగింపే తప్ప చట్టమనే భయముం డదు. నిర్భయ వంటి కఠిన చట్టాల కింద కేసులు పెడతారని తెలిసినా లైంగిక దాడులకు, హింసకు పాల్పడటానికి ఇదొక గట్టి కారణం. అదే సమయంలో మన ‘నేర దర్యాప్తు–న్యాయ వ్యవస్థ’ లొసుగుల వల్ల, పట్టుబడ్డా తమకేమీ కాదనే ధీమా కూడా ఒకోసారి లేని తెగింపునిస్తుంది. మహబూబ్‌నగర్ హత్య కేసులో పట్టుబడ్డ ఒక నిందితుడు, గడచిన 15 ఏళ్లలో 12 హత్యలు చేసినట్టు వెల్లడయింది. తాజా దర్యాప్తు సందర్భం గానే ఇదంతా తేలింది. అంటే, 12 వ హత్యకు పాల్పడి ఉండకపోతే? దర్యాప్తు–విచారణ ప్రక్రియ లోపరహితంగా ఉంటేనే, చట్టాలంటే జనాలకు భయముంటుంది. ముఖ్యంగా లైంగిక నేరాల్లో వాటిని నిలువ రించడం కన్నా మేదడులో నేర ప్రవృత్తి బలపడకుండా నియంత్రించ డమే మంచిది. అభివృద్ది చెందిన దేశాల్లో ఇందుకు ప్రత్యేక శ్రద్ద పెడ తారు. పిల్లలపై లైంగిక హింసకు పాల్పడే మానసిక రుగ్మత (పిడో ఫైల్)ను చాలా తీవ్రంగా పరిగణిస్తారు. ఉన్మాద లక్షణాల్ని గుర్తించి, వారి కదలికలు, తదుపరి ఎత్తుగడలపై నిరంతర నిఘా వేస్తారు. మనదగ్గర, తమ కూతుర్ని పలానా యువకుడు వేధిస్తున్నాడని తలిదండ్రులు పోలీసు కేసు చేసి, కౌన్సిలింగ్ జరిపించిన తర్వాత జరిగిన హత్యలెన్నో! లైంగిక నేరాలెంత ప్రమాదకరమో తెలిసేలా హైస్కూల్ స్థాయిలో ఓ పాఠం పెట్టాలి. వివక్ష మంచిది కాదని, సమానత్వమే గొప్ప అనే భావ నను ఇల్లు, బడి, కాలేజీ స్థాయిల్లో బలోపేతం చేయాలి. సమాజపు వివిధ పార్శా్వల్లో ఆ భావనల్ని పరివ్యాప్తం చేయాలి. ఆ కడుపునే పుట్టి పెరుగుతున్నారు యుక్తవయసులో బయటకు వెళ్లే కూతుళ్లకు సవాలక్ష సూచనలు, హెచ్చ రికలు చేసే తలిదండ్రులు కొడుకులకు ఎందుకు చేయరు? ‘ఇదుగో.. నీకు ఇలాంటి సవాళ్లు, సమస్యలుంటాయి జాగ్రత్త!’ అని ఆడపిల్లలకు చెబుతారు. కంటికి రెప్పలా కాచుకుంటారు. మరి, ఆయా దురాగతాలకు పాల్పడేది తమ కొడుకులో, వారి వంటి ఇతర యువకులో అని ఆయా తలిదండ్రులకు తెలియదా? ‘మీకు ప్రమాద ఆస్కారం ఉంటుంది’ అని కూతురుకు చెప్పినట్టే, ‘మీ వల్ల ఇలాంటి ప్రమాదం జరుగొచ్చు, జరుగొద్దు’ అని కొడుకులకూ చెప్పాలి కద! కానీ, అది జరుగదు. అదే జరిగితే ఇంత విచ్చలవిడితనం, ఉన్మాదం, హింస ఉండవు. అర్థరాత్రి, అపరాత్రి ఇంటికొచ్చే యుక్తవయసు తనయులు ఎక్కడ తిరుగుతు న్నారు, ఏ చెడు సహవాసాలు చేస్తున్నారు పట్టించుకునే తలిదండ్రులెంత మంది ఉంటారు? గంట ఆలస్యమైతే కూతురికి ఏమైందో అని ఆందో ళన. ఒకోసారి... ఏ చెడుతిరుగుళ్లు తిరుగుతుందో అనే శంక! మరి, కుమారుల విషయంలోనూ అంతటి శ్రద్ద ఉండాలి. ‘వాడికేం, వాడు మగాడు’ అనే తప్పుడు భావజాలమే నేరాలకు, నేర స్వభావానికి బీజం వేస్తోంది. సదరు వివక్ష ఇంట్లోనే, తలిదండ్రుల బాధ్యతారాహిత్యం వల్లే మొలకెత్తుతోంది. తిండిలో, బట్టల్లో, వ్యయంలో, తిరుగుళ్లలో.... ఒక్కటే మిటి అన్ని విషయాల్లోనూ ఇదే వివక్ష! ఎదిగే చిరు మెదళ్లలో విభిన్న ఆలోచనా ధోరణులను ఈ వైఖరే పెంచుతోంది. ఆపై, సున్నితవిషయా లేవీ పట్టించుకోని బడుల్లో, కాలేజీల్లో ఆ విషపు మొక్క బలోపేతమౌ తోంది. దానికి... నేటి సినిమా, టీవీ, స్మార్ట్‌ఫోన్ ద్వారా తేలిగ్గా లభి స్తున్న ఉత్ప్రేరక మాల్–మసాలా మాంచి ఎరువులా పనిచేస్తోంది. ఇక అది వటవృక్షమౌతోంది. ఫలితంగా, విచక్షణ కోల్పోయి ఎంతటి ఉన్మా దానికైనా బరితెగిస్తున్నారు. సభలు, సమావేశాలు, సదస్సులు, సుస్థిరా భివృద్ధి లక్ష్యాలు... సరే, అవన్నీ సాగుతూనే ఉంటాయి, మంచిదే! ఏక కాలంలో సమాజం అట్టడుగుస్థాయి నుంచి మార్పు రావాలి. కుటుం బమే అందుకు మౌలిక యూనిట్ కావాలి. అప్పుడు, సమానత్వం నిజంగా ఎంత అందమైన ఫలం! (నేడు అంతర్జాతీయ మహిళాదినోత్సవం) వ్యాసకర్త: దిలీప్ రెడ్డి, ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
గ్రామీణ వికాసానికి గాలి వీస్తోంది
రైతు కేంద్రంగా పాలకుల విధానాలు మారుతున్నాయి. తెలంగాణలో కేసీఆర్ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతుబంధు, రైతుబీమా, కళ్యాణలక్ష్మి వంటి పథకాలతో ప్రజానుకూల ప్రభుత్వ విధానాలు, నేరుగా ప్రజలకు ఫలాలు అందించడం అనే పద్ధతికే ప్రాధాన్యత ఇచ్చారు. ఏపీలో అన్ని వ్యవహారాలు పార్టీ కార్యకర్తల కనుసన్నల్లో సాగించే పంథాను బాబు ఎంచుకున్నారు. పార్టీ శ్రేణుల్ని పాలనలో దొడ్డిదారి భాగస్వాముల్ని చేయడం ద్వారా, స్థానిక పంచాయతీ పాలనా వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఈ చీకటిని తొలగించే కొత్త వెలుగు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిరీక్షిస్తున్నారు. మార్పు కోసం ఏపీలోని 12,918 గ్రామ పంచాయతీలు ఎదురుచూస్తున్నాయి. పల్లెకు మంచి రోజులొస్తున్నాయి. సానుకూల వాతావరణం పెరుగుతోంది. ఇక ‘కనిపించని కుట్రల’ను ఛేదించే చొరవ గ్రామస్తులే తీసుకోవాలి. పల్లె కన్నీరు తుడవాలి. సుదీర్ఘకాలం వ్యవసాయం కుదేలవటం వల్ల గ్రామ స్వరూపం మారింది. చేతి వృత్తులు భంగపడి గ్రామం బోసి పోయింది. ఉద్యోగ–ఉపాధి అవకాశాలు సన్నగిల్లి పట్టణాలు, నగరాలకు వలసలు పెరిగాయి. పాలకుల నిర్లక్ష్యమూ తోడై చాన్నాళ్లుగా పల్లె కళ తప్పింది. నిన్నా, ఇవాల్టి వరకు ఏ ఊరు చూసినా జీవం కోల్పోయిన అచే తన కొట్టొచ్చినట్టు కనిపించేది. పరిస్థితులు మెలమెల్లగా మారుతు న్నాయి. పట్టణ, నగర జీవుల్లోనూ పుట్టినూరుపై మమకారం పెరుగు తోంది. చుట్టపు చూపుగానైనా సాగే సొంతూరు పర్యటనలు పెరుగుతున్నాయి. పల్లెతో బంధాన్ని పెనవేస్తున్నారు. పెరిగిన శాస్త్రసాంకేతిక పుణ్యమా అని గ్రామాల్లోనే ఏదైనా సమకూర్చుకునే వెసలుబాటొచ్చింది. నగర జీవనంపై మొహం మొత్తిన సంపన్నులూ, విడిదిలానైనా బాగుంటుందని ఊరితో బంధం పునరుద్దరిస్తున్నారు. పాలకుల విధానాల్లో, రాజకీయ దృక్కోణంలోనూ గ్రామీణ భారతానికి ప్రాధాన్యత పెరుగు తోంది. నాయకుల ఓట్ల గురి కావచ్చు, సంక్షోభం నుంచి రైతును గట్టె క్కించే సర్కార్ల చేయూత కావచ్చు, మారిన పరిస్థితుల్లో గ్రామాలకు నేరుగా నిధులు రావడం కావచ్చు.. కారణం ఏమైతేనేం పల్లెకు ప్రాధా న్యత లభిస్తోంది. కేంద్రం ప్రకటించిన పలు అభివృద్ధి–సంక్షేమ కార్యక్ర మాల్లోనూ గ్రామం కేంద్రబిందువుగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనూ పరిస్థితులు ఆశావహంగా కనిపిస్తు న్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలై తాజా సర్కారు ఏర్పడ్డ క్రమం లోనే పంచాయతీ ఎన్నికలూ ముగిసి గ్రామాలకు కొత్త పాలకులొచ్చారు. పంచాయతీరాజ్ కొత్త చట్టం విస్తృతాధికారాలు కల్పించడంతో పాటు స్థానిక పాలకుల బాధ్యతల్నీ పెంచింది. ఏపీ రాష్ట్రం ఇపుడు శాసనసభ ఎన్నికల ముంగిట్లో నిలిచింది. గ్రామీణ పాలనా విధానం సమూల మార్పు సంకేతాలు వెలువడుతున్నాయి. కొత్త వెలుగుకోసం జనం నిరీ క్షిస్తున్నారు. పల్లెల పునరుద్ధరణకు తెలుగునాట ఇది మంచి తరుణం. విభజనతో రెండు నమూనాలు విభజన తర్వాత ఏర్పడ్డ తెలంగాణ, ఏపీల్లో రెండు వేర్వేరు గ్రామీణ పాలనా నమూనాలు ఆవిష్కృతమయ్యాయి. తెలంగాణలో ముఖ్య మంత్రి చంద్రశేఖరరావు ఒక నమూనా అమలు చేస్తే, ఏపీలో సీఎం చంద్రబాబునాయుడు మరో నమూనాతో వెళ్లారు. ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల లబ్దిదారుల ఎంపిక నుంచి అన్ని వ్యవహారాలు పార్టీ కార్యకర్తల కనుసన్నల్లో సాగించే పంథాను బాబు ఎంచుకున్నారు. పార్టీ శ్రేణుల్ని పాలనలో దొడ్డిదారి భాగస్వాముల్ని చేశారు. స్థానిక పంచాయతీ పాలనా వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఈ దేశంలో బహుళ ప్రచారంలో ఉన్న కమ్యూనిస్టు పాలకుల ‘పశ్చిమ బెంగాల్’ నమూనానే ఆయన నమ్ముకున్నారు. తద్వారా సుదీర్ఘకాలం అప్రతిహతంగా రాజ్యం చేయాలనుకున్నారు. పార్టీ శ్రేణులతో జన్మభూమి కమిటీల ఏర్పాటు చేసి పాలన సాగిస్తున్నారు. కానీ, అదొక విఫల నమూనాగా ధ్రువపడిన విష యాన్ని ఆయన పరిగణనలోకి తీసుకోలేదు. తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ కూడా బెంగాల్లో అదే నమూనాతో ‘పార్టీ శ్రేణుల’ కేంద్రకంగా సాగిస్తున్న పాలన క్రమంగా బెడిసికొడుతోంది. ఆంధ్రప్రదేశ్ లోనూ అవే సంకేతాలు, అవినీతి ప్రజల కళ్లకు కట్టినట్టు కనిపించడం ఈ నమూనాలో బహిరంగ రహస్యం! దీనిపై పూర్తి అవగాహన ఉన్న కేసీఆర్ భిన్నమైన పంథాలో పాలనసాగించారు. ప్రజానుకూల ప్రభుత్వ విధానాలు, అధికార యంత్రాంగంపై సరైన అజమాయిషీ, నేరుగా ప్రజలకు ఫలాలు అందించడం.. అనే పద్ధతికే ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతుబంధు, రైతుబీమా, కళ్యాణ లక్ష్మి.. ఇవన్నీ ఇటువంటివే! పార్టీ శ్రేణుల్ని పాలనలోకి జొరనివ్వలేదు. అందుకే, తమ వ్యక్తిగత అవసరాలు తీర్చలేదని స్థానిక నాయకత్వంపైన, ప్రజాప్రతినిధులపైన ప్రజల్లో బలమైన అసంతృప్తి ఉన్నా, వ్యతిరేకత వెల్లువెత్తినా... ఇటీవలి ఎన్నికల్లో కేసీఆర్ అన్నీ తానై ప్రచారం చేసి ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా మలిచారు. ఘన విజయం సాధించారు. ఇటీవలి కాలంలో పాలకపక్ష శ్రేణులు ప్రజాభిప్రాయాన్ని సర్కా రుకు అనుకూలంగా మలచలేకపోతున్నాయనే ఒక అధ్యయన నివేదిక కేసీఆర్‌ను బాగా ప్రభావితం చేసినట్టుంది. అందుకే ఆయన తొలి నుంచి జాగ్రత్త పడ్డారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పుష్కరకాలం పైగా ఉద్యమించిన పార్టీ అయినా, అధికారంలోకి వచ్చాక పార్టీ శ్రేణుల విచ్చలవిడితనాన్ని ఆయన ప్రోత్సహించలేదు. అట్టడుగుస్థాయిలో జనాభిప్రాయాన్ని పాలక పక్ష శ్రేణులు ఓటుగా మలిచే ప్రభావం క్రమంగా సన్నగిల్లుతోందని ‘అభి వృద్ధి సమాజాల అధ్యయన కేంద్రం’(సీఎస్డీఎస్) పరిశీలనలో వెల్లడైంది. పార్టీలకతీతంగా గ్రామాలు ఎదగాలి తెలంగాణలో కొత్త పంచాయతీ చట్టం అమల్లోకి వచ్చింది. వారం కిందటి నుంచి కొత్త సర్పంచులు, పాలకమండళ్ల పాలన మొదలయింది. పార్టీలతో నిమిత్తం లేకుండా జరిగిన ఈ ఎన్నికల్లో యువతరం ఉత్సాహం పతాకస్థాయికి చేరింది. పెద్ద సంఖ్యలో యువత సర్పం చులుగా, వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారు. ప్రధాన పార్టీలు కూడా పెద్దగా పట్టింపులకు వెళ్లలేదు. ఒక పార్టీకే చెందిన ఇద్దరు, ముగ్గురు కూడా పోటీ చేశారు. పదేళ్లపాటు రిజర్వేషన్లు మారవనేది ప్రభావం చూపింది. బాగా పనిచేస్తే మరో దఫా ఎన్నికవొచ్చన్న భరోసా కలిగింది. ఈ సారి పట్టణాలు, నగరాల్లోని వ్యాపార–వాణిజ్య వేత్తలు, సంప న్నులు, మేధావులు తమ సొంతూళ్ల పంచాయతీ ఎన్నికల పట్ల ఆసక్తి చూపారు. అక్కడక్కడ తమ వారనుకునే అభ్యర్థులకు మద్దతో, సహాయ సహకారాలో అందించారు. పలుచోట్ల పట్టుబట్టి గెలిపించుకున్నారు. ఇదొక ప్రగతి సంకేతం! గ్రామ పంచాయతీలను పరిపుష్టం చేయడంలో, నిధుల్ని సక్రమంగా వినియోగించి గ్రామాభివృద్ధి సాధించడంలోనూ ఈ సహకారం కొనసాగాలి. పల్లె పట్టణం పెనవేయాలి. త్వరలో పంచాయతీ ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇవ్వనున్న శిక్షకులను చైతన్యపరుస్తూ మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీయార్ ప్రభుత్వ సంకల్పాన్ని విస్పష్టంగా చెప్పారు. గ్రామాభివృద్ధికి గ్రామస్తులే బాధ్యత వహించాలన్నారు. పాల కమండళ్లు నిబద్దతతో, లక్ష్యసాధనపై గురి–జవాబుదారితనంతో పనిచే యాలని పిలుపునిచ్చారు. 15వ ఆర్థిక సంఘం, కేంద్ర–రాష్ట్ర పథకాలు, ఎమ్మెల్యే–ఎమ్మెల్సీ–ఎంపీల అభివృద్ధి నిధులు.. ఇలా వివిధ పద్దతుల్లో గ్రామాలకు రాబోయే అయిదేళ్లలో నలబై వేల కోట్ల రూపాయలు రాను న్నాయని చెప్పారు. తెలంగాణలో 12,751 గ్రామ పంచాయతీలు న్నాయి. ఇదొక సువర్ణావకాశం. కొత్త చట్టం ఎన్నో అవకాశాల్ని కల్పి స్తోంది. ప్రతి రెండు నెలలకోసారి జరిగే గ్రామ సభలో గ్రామస్థులు విధిగా పాల్గొని, అభివృద్ది–సంక్షేమాన్ని గరిష్టంగా సాధించుకోవాలి. అధికారాలే కాకుండా వైఫల్యాలకు ప్రజాప్రతినిధుల్ని బాధ్యుల్ని చేసే, అవసరమైతే సర్పంచ్‌ను కలెక్టర్ సస్పెండ్ చేసే నిబంధనలు కూడా చట్టంలో ఉన్నాయి. అలా అని, పాలకపక్షం తన రాజకీయ ప్రయోజ నాలు నెరవేర్చుకునే సాధనంగా, దీన్ని సర్పంచుల ‘తలపై నిరంతరం వేలాడే కత్తి’ చేయకుండా ప్రజలే ప్రతిఘటించాలి. అవినీతిని అడ్డగించి, మంచిని సాధించుకునేలా నిఘావేయాలి. రాజ్యాంగేతర శక్తులకు చరమగీతం విభజన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి అవకాశాలు క్రమంగా సన్నగిల్లాయి. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది దారుల ఎంపికలో ఏ రాజ్యాంగబద్దత లేని జన్మభూమి కమిటీలకు ప్రాధాన్యతనివ్వటంతో అవినీతి రాజ్యమేలుతోంది. ఈ చీకటిని తొల గించే కొత్త వెలుగు కోసం ఏపీ ప్రజలు నిరీక్షిస్తున్నారు. చట్టబద్దమైన గ్రామసచివాలయాన్ని కేంద్రబిందువుగా చేసి, గ్రామీణ వికాసానికి బాటలు పరుస్తామని విపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెబుతున్న మాటలు ఇక్కడి ప్రజల్లో కొత్త ఆశలు రేపుతున్నాయి. దానికి కారణం, గ్రామీణ పాలనా వ్యవస్థను ఏపీలో బాబు ప్రభుత్వం బలహీనపరచడమే! ప్రజలతో ఎన్నికైన సర్పంచులు, పాలక మండళ్లను నిర్వీర్యం చేసి, పార్టీ కార్యకర్తలు కీలకంగా ఉండే జన్మభూమి కమిటీలకు పెత్తనం అప్పగించింది. రేషన్‌కార్డులు, ఇళ్లు, పెన్షన్లు... ఇలా ఏ ప్రయో జన లబ్దిదారుల ఎంపికలోనైనా వారిదే కీలక భూమిక! కేంద్ర ప్రభుత్వ నిధుల్ని కూడా రాష్ట్ర కేంద్రీకృత పథకాలకు దారి మళ్లించడం ఇక్కడ రివాజయింది. 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిదులకు కూడా దిక్కులేని పరిస్థితి! రెండు వేల జనాభా ఉన్న గ్రామాలకు కూడా ఏటా 9 లక్షల రూపాయలకు తగ్గని నిధులు వస్తున్నా, అవి నేరుగా గ్రామాభివృద్ధికి దక్కడం లేదు. చంద్రన్న బాట, సాలిడ్‌వేస్ట్ మేనేజ్మెంట్.. ఇలా ఏవేవో పథకాల్లోకి మళ్లించి వ్యయం చేస్తున్నారు. స్థానికంగా పన్నులు విధిం చడం ద్వారా ఏటా లభించే దాదాపు 500 కోట్ల రూపాయల్నీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కేంద్రీకృత కార్యక్రమాల్లో వ్యయం చేస్తున్నారు. గ్రామాల స్థానిక పరిస్థితిని బట్టి, అక్కడి అవసరాలు తీర్చుకునే వెసు లుబాటు కూడా వారికి లేకుండా చేస్తున్నారు. త్వరలోనే రాష్ట్ర శాసన సభకు ఎన్నికలు జరుగనున్న వేళ, ఈ దుస్థితిని తప్పించే అవకాశం కోసం ఏపీలోని 12,918 గ్రామ పంచాయతీలు నిరీక్షిస్తున్నాయి. ఇదే మంచి తరుణం గ్రామీణ వికాసానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నట్టు ఇటీవలి బడ్జెట్ స్పష్టం చేసింది. రైతుకు పెట్టుబడి, అసంఘటిత కార్మికులకు పెన్షన్, వైద్య పథకం విస్తరణ, గ్రామీణ రోడ్లు 3 రెట్లు పెంచడం, ‘గ్రామ్ జ్యోతి’ ప్రాధాన్యత, లక్ష గ్రామాల డిజిటలైజేషన్, ఉపాధిహామీకి నిధుల పెంపు... వంటివన్నీ గ్రామీణ వికాసానికి సానుకూల చర్యలే! కేంద్ర రాష్ట్రాలు కలిసి గ్రామాలను ఆర్థిక, ఉత్పత్తి కేంద్రాలుగా చేయాలి. గ్రామీణ గ్రోత్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. వ్యవసాయ మార్కెట్ సదు పాయాలు పెంచాలి. స్థానికంగా ఉద్యోగ–ఉపాధి అవకాశాల్ని మరింత మెరుగుపరచాలి. ఇదొక మంచి తరుణం. గ్రామీణ ప్రజానీకం, ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండి ప్రతి అవకాశాన్ని అందిపుచ్చు కోవాలి, సానుకూలంగా మలచుకోవాలి. ప్రగతి పల్లవించాలి, మళ్లీ పల్లెలు వికసించాలి. గడపగడపన ఆనందం వెల్లివిరియాలి. పూజ్య బాపూజీ కలలుకన్న ‘గ్రామస్వరాజ్యం’ విరాజిల్లాలి. దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
స్వేచ్ఛను లొంగదీసే దొంగాట!
ప్రజాస్వామ్య ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే ‘ఓటరు’ స్వేచ్ఛను ఆట వస్తువు చేస్తున్నారు. కోరిన రీతిన వంచుతున్నారు. ఓటు విలువను పలుచన చేస్తున్నారు. ప్రజా స్వామ్యంలో తనకిష్టమైన పాలకులను నిర్ణయించుకునేందుకు, తన మనోగతాన్ని వెల్లడి చేసేందుకు బలమైన ఆయుధం ‘ఓటు’. లాటిన్ అమెరికా సాహితీ ప్రపంచంలో వేగుచుక్క అనదగ్గ కవి, రచయిత, జర్నలిస్టు, సామాజిక వేత్త అయిన జోస్ మార్టి (క్యూబా) మాటల్లో చెప్పాలంటే.. ‘‘అన్నింటి కన్నా ఓటు అత్యంత సున్నితమైన విశ్వాసం. ఓటరు ప్రయోజనం మాత్రమే కాదు అతని జీవితం, పరువు, భవిష్యత్తు కూడా ఓటుతో ముడివడి ఉన్నాయి’’ ‘‘పైసల్ తీస్కొని ఓటేసుడా..? థూ... ఓటుకు పైసల్ తీస్కునుడంటే, పానం (జీవితం) అమ్ము కున్నట్టు లెక్క పటేలా! ఇజ్జత్ (పరువు) అమ్ము కున్నట్టు’’ సరిగ్గా ముఫ్ఫై ఏళ్ల కింద... 1989లో జరిగిన ఎన్నికలప్పుడు మెదక్ జిల్లా మారుమూల గ్రామం యెనగండ్ల (మా ఊరు)లో 42 ఏళ్ల వయసున్న ఒక వ్యవసాయ దినకూలీ అన్నమాటలివి. దాన్ని అవగాహన అనాలో, చైతన్యం అనాలో, నైతికత అనాలో, మరేమనాలో తెలియదు. నాటి పరిస్థితిని నేటితో పోలిస్తే... ఎన్నో రెట్లు అవగాహన పెరిగింది. చైతన్యం రగిలింది. నైతికతే దిగజారింది. ఓటుకింత అనే లెక్కలో తమకు తక్కువ డబ్బులిచ్చారని ఒక వార్డు వాసులు ఓ రాజకీయ పార్టీ కార్యాలయం ముందు ధర్నాకు దిగే పరిస్థితులు నేడు నెలకొన్నాయి. ‘ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో నాకు 11 కోట్ల రూపాయలు ఖర్చయింది’ అని రాజ్యాంగ హోదా అనుభవిస్తున్న ఓ బడా నేత నిర్భయంగా ప్రకటించుకునే పరి స్థితి! ఓటర్ల జాబితా సవరించాకా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి పేరిటే హైదరాబాద్‌లో రెండు ఓట్లున్న దుస్థితి! ప్రజాస్వామ్యంలో ఓటు విలువ గురించి ఎంతగా ప్రచారం చేస్తున్నామో, దాని విలువను దిగజార్చే పరి స్థితులు, పరిణామాలే అంతకు పలు రెట్లు అధికమవుతున్నాయి. తిలా పాపం తలా పిడికెడన్నట్టు ఆ పాతకానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యక్తులే కాక వ్యవస్థలూ కారణమవుతున్నాయి. ఏదో రీతిన ఓట్లు దండు కొని గద్దె నెక్కాలనే నాయకులు, ఓటరు జాబితాలు తారుమారు చేసే పార్టీ గణాలు, ఎన్నికల ప్రక్రియను ప్రహసనం చేసే అధికార యంత్రాం గం, ఓటు హక్కునే విస్మరిస్తున్న ‘నాగరికులు’, విడిగా–ఉమ్మడిగా వెల కట్టి అమ్ముకుంటున్న ఓటర్లు... ఇలా అన్ని వైపుల నుంచీ ఓటు విలువను దిగజారుస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థనే నవ్వుల పాల్జేస్తున్నారు. ప్రజాస్వామ్యం మీద, ఓటు విలువపైన విశ్వాసమున్న వారి నమ్మకం రోజు రోజుకు సడలిపోయేలా పరిస్థితులు విషమిస్తున్నాయి. దీనికి తోడు ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లపై తెలెత్తిన వివాదం గోటిచుట్టపై రోకటి పోటులా తయారయింది. మళ్లీ బ్యాలెట్‌కు వెళ దామా? అనే చర్చ–మీమాంస పుట్టుకొస్తోంది. ఎన్నిసార్లు సవరణ ప్రక్రియ చేపట్టినా... తప్పుల తడిక ఓటరు జాబితాలు సగటు ఓటరును వెక్కిరిస్తున్నాయి. వ్యవస్థల్ని చెరబట్టిన రాజకీయ దళారీలు ఈ జాబి తాల్ని కలుషితం చేస్తున్నారు. లక్షల దొంగ ఓట్లను చేర్చడం ద్వారానో, తమకు ఓటేయరనే భయంతో లక్షలాది అసలు పేర్లను తొలగిస్తూనో అరాచకం సృష్టిస్తున్నారు. ఈ నేర ప్రక్రియ క్రమంగా ప్రమాదకర స్థాయిలో వ్యవస్థీకృతమవుతోంది. ఎన్నికల సంఘం వైపు వేలు ప్రక్షాళన పేరిట రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓటర్ల జాబితాలను అత్యంత కలుషితం చేశారు. నిన్నటికి నిన్న అసెంబ్లీ ఎన్నికల ముంగిట తెలంగాణలో లక్షలాది ఓట్లు గల్లంతయ్యాయి. రేపు ఎన్నికలు జరగా ల్సిన ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది దొంగ, నకిలీ ఓట్లొచ్చి జాబితాలో తిష్ట వేశాయి. ప్రక్షాళనకోసం వాడుతున్న సాఫ్ట్వేర్ లోపభూయిష్టమే కాకుండా నిర్వహణ ప్రక్రియలోనూ అనేక లోపాలున్నాయి. వివిధ స్థాయిల్లో అధికార యంత్రాంగం అత్యంత నిర్లక్ష్యంగా, బాధ్యతారహి తంగా వ్యవహరించింది. జవాబుదారితనం లేకుండా యథేచ్ఛగా వ్యవ హరించి ఓటరును నిమిత్తమాత్రుడిని చేసింది. ఓటు నమోదు, తొల గింపు ద్వారా సవరణ, ప్రక్షాళన ప్రక్రియల్లో ప్రజాప్రాతినిధ్య చట్టం కింద పౌరుల (ఓటర్లుగా)కున్న హక్కుల్ని నిర్దాక్షిణ్యంగా కాలరాసింది. తెలిసి కొంత, తెలియక ఇంకొంత నేడున్న దురుద్దేశపు రాజకీయ వ్యవ స్థకు ఊడిగం చేస్తోంది. తెలంగాణలో చాలా చోట్ల జాబితాను ఓటర్లు తనిఖీ చేసినపుడు తమ పేరుంది, నంబరుంది... దాన్ని ఆధారం చేసుకొని తగిన గుర్తింపు కార్డుతో పోలింగ్ స్టేషన్‌కు వెళితే పేరు లేదు, ఓటే లేదు. ఓటేయకుండానే ఉస్సురంటూ వెనక్కి రావలసి వచ్చింది. ‘అవును 22 లక్షల ఓట్లను తొలగించామ’ని ఎన్నికల ప్రధానాధికారే అంగీకరించిన వాస్తవం. వివాదమిప్పుడు న్యాయస్థానం పరిధికి చేరింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 52 లక్షల దొంగ/నకిలీ ఓట్లు రాష్ట్ర ఓటర్ల జాబితాలో చేరినట్టు ఓ నిపుణుల బృందం శాస్త్రీయంగా నిరూపించింది. ఎన్నికల సంఘం దీన్ని పాక్షికంగా అంగీకరించి, తిరిగి సవరణ చేప డితే... పెనంలోంచి పొయిలో పడ్డట్టు, ఇప్పుడు మరో 6 లక్షలు నకిలీ ఓట్లు అదనంగా వచ్చి చేరాయి. దాదాపు 25 లక్షల నకిలీ ఓట్లున్న మాట నిజమే అని రాష్ట్ర ఎన్నికల (కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల తప్పించిన) ముఖ్యాధికారే స్వయంగా అంగీకరించి ఆమేరకు ప్రకటన వెలువరిం చారు. ప్రపంచమే అచ్చెరువొందేలా ఓ పెద్ద ఎన్నికల ప్రక్రియని దశా బ్దాల తరబడి నిర్విఘ్నంగా, ప్రశాంతంగా కొనసాస్తూ కీర్తి కిరీటం దక్కిం చుకున్న భారత ఎన్నికల సంఘం ఈ వైఫల్యాలకు జవాబు చెప్పు కోవాల్సి వస్తోంది. సగటు ఓటరు ముందు దోషిగా నిలబడింది. ఓటరు జాబితాలోంచి పేర్లు తొలగిస్తున్నపుడు పాటించాల్సిన చట్టబద్ద ప్రక్రి యను తూతూ మంత్రంగా నిర్వహించారు. అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం కల్పించకపోగా, ఎవరికి వారు ఆన్లైన్లో తనిఖీ చేసుకొని పేరు లేకుంటే, సంప్రదించి చేర్పించుకోవచ్చని బాధ్యతని ఓటరుపైకి నెట్టారు. వివిధ దశల్లో పాటించాల్సిన పారదర్శకతను మంటగలిపారు. రాజ్యాం గం కల్పించిన హక్కును హరించి అదనపు బాధ్యతను పౌరుల నెత్తిన రుద్దారు. సవరించిన జాబితాల్లోనూ తప్పులా! తప్పుడు, అక్రమ, రిపీట్, చెల్లని, దొంగ, బహుళ.... ఇలా వివిధ రూపాల్లో ఉన్న నకిలీ ఓట్లను తొలగించడానికి ఎన్నికల సంఘం అధికారులు వినియోగిస్తున్న సాఫ్ట్వేర్ సమగ్రంగా లేదు. ఫలితంగా ఒకే వ్యక్తికి వివిధ పోలింగ్ స్టేషన్ల పరిధిలో పలు ఓట్లుంటున్నాయి. తండ్రి/ భర్త పేరు మార్పుతో, ఇంటి నంబరు మార్పుతో, మగ–ఆడ అన్న లింగవైవిధ్యంతో ఒకరికే వేర్వేరు చోట్ల ఓట్లుంటున్నాయి. ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉండగలిగిన చిన్న ఇళ్లల్లో కూడా వందలాది ఓట్లుం టున్నాయి. ధ్రువీకరించడం తేలిగ్గా సాధ్యపడే కొన్ని తప్పిదాల్ని కూడా ఆధికార యంత్రాంగం ఇప్పుడు ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్ పట్టుకోలేక పోతోంది. అది దుస్సాధ్యమైందేమి కాదు, ప్రయివేటు వ్యక్తులు, సంస్థల వద్ద కూడా లభ్యమయ్యే సాధారణ సాఫ్ట్వేర్ అని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. రెండు రాష్ట్రాల్లో ఓటర్లుగా ఉన్న ఒకే వ్యక్తిని కూడా ఇప్పుడు అధికారులు వాడుతున్న సాఫ్ట్వేర్ పట్టుకోలేకపోతోంది. ఫలి తంగా రెండు, ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాష్ట్రాల్లో ఓటున్న వారి సంఖ్య 18.5 లక్షలున్నట్టు ప్రయివేటు నిపుణుల సంస్థ తేల్చింది. ఓటరు ఐడి, ఓటరు పేరు, తండ్రి/భర్త పేరు, ఇంటి నంబరు, వయసు, జెండర్, పేరు వెనుక–ముందు... ఇలా పలు అంశాల్ని పరిగణనలోకి తీసుకొని లెక్కిం చినపుడు ఏపీలో పెద్ద సంఖ్య నకిలీ ఓట్లు దొరికాయి. 13 జిల్లాలు, 175 నియోజకవర్గాలు, 45,920 పోలింగ్ బూత్‌ల పరిధిలోఉన్న 3.6 కోట్ల ఓటర్ల సమాచారాన్ని తీసుకొని శాస్త్రీయంగా తనిఖీ–విశ్లేషణ చేసి మరో 34.17 లక్షల (వెరసి 52.67 లక్షల) నకిలీ ఓట్లున్నట్టు తేల్చారు. ఇదంతా బట్టబయలై జరిపిన తాజా సవరణ తర్వాత కూడా జాబితా తప్పుల తడికే! మళ్లీ ఒకే వ్యక్తి పేరిట నాలుగేసి ఓటరు కార్డులు కూడా జారీ చేశారు. సవరణ తర్వాత... అసలు ఇంటి నంబరు, నిజమైన వయసు, వాస్తవిక జెండర్‌తో సవరించిన పేర్లు జాబితాలోకి వచ్చాయి. అదే సమయంలో, పాత (నకిలీ) పేర్లూ తుది జాబితాలో కొనసాగుతు న్నాయి. మీ ఇంట్లో, మీకు తెలియకుండా అయిదారుగురు పైశాచి (గోస్ట్) ఓటర్లుంటారు. ఇలాంటి ‘బోగస్’ ఓట్లు ఇంకెన్నో! మొత్తమ్మీద ఇదీ తెలుగునాట నెలకొన్న దుస్థితి! పెత్తనం కోసం సంపద వికృత రూపం అన్ని వ్యవస్థల మీద రాజకీయ పెత్తందారీతనం పెరిగి అటువైపు ఆకర్షణ అధికమైంది. ఏదో రూపంలో రాజకీయాధికారం దక్కించుకో వాలి. సంపద కలిగిన వారికి ఇదింకా మోజయింది. అడ్డదారి సంపాదన ఉన్న వారు వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేసైనా అధికారం చేజిక్కించుకోవా లని ఆరాటపడుతున్నారు. ఓటరు జాబితాల్లో కూడికలు, తీసివేతలు చేస్తూ తమ ఓట్ల పంట పండించుకుంటున్నారు. లేదంటే, ప్రత్యర్థులకు ఓట్ల కరువు తీసుకువస్తున్నారు. మధ్యలో ‘ఓటర్’ను బలిపశువు చేస్తు న్నారు. పెరుగుతున్న ఆర్థిక అంతరాలు ఈ పరిస్థితులకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. నిన్న ముగిసిన శాసనసభ ఎన్నికల్లో డబ్బు ఎంతగా ఖర్చ యిందో అందరికీ తెలుసు. ఈ రోజు జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీలో ఎవరున్నా, తెరవెనుక ఆట నడుపుతున్న ఈ ‘నికృష్ట సంపదే’ వారిని ఆడిస్తోంది. పట్టణాలు, నగరాలు, పారిశ్రామిక వాడల నుంచి వనరులు గ్రామానికి వరదై పారుతున్నాయి. ఎక్కడికక్కడ డబ్బు, మధ్యం ఏరులై ప్రవహిస్తోంది. ఓటుకింతని డబ్బు పెట్టి కొంటున్నారు. ఓటర్లనే కాదు, గంపగుత్తగా కుటుంబాలను, వాడలను వశపరచుకుంటు న్నారు. ఏదో రూపంలో ప్రలోభపెడుతున్నారు. లొంగని చోట బయ పెడుతున్నారు. పై స్థాయి నుంచే, ఓటర్లయిన పౌరుల చేతికి నికరంగా డబ్బు వచ్చేలా ‘పథకాలు’ పన్ని వేర్వేరు స్కీముల్లో వారిని ఇరికిస్తు న్నారు. ప్రజాస్వామ్య ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే ‘ఓటరు’ స్వేచ్ఛను ఆట వస్తువు చేస్తున్నారు. కోరిన రీతిన వంచుతున్నారు. ఓటు విలువను పలుచన చేస్తున్నారు. ఓటరు చైతన్యమొకటే దీనికి విరుగుడు. ఓటరు గట్టిగా నిలబడాలి. డబ్బు పంచినా, ప్రలోభపెట్టినా తన ‘ఓటు’ హక్కు భంగపోకుండా స్వతంత్రంగా వ్యవహరించాలి. స్వేచ్ఛగా ఓటేయాలి. బాహ్య ప్రేరకాలెలా ఉన్నా... స్వేచ్ఛగా ఓటేసే తన హక్కుని అవి ప్రభా వితం చేయకుండా చూసుకోవాలి. ఎందుకంటే, ప్రజాస్వామ్యంలో తన కిష్టమైన పాలకులను నిర్ణ యించుకునేందుకు, తన మనోగతాన్ని వెల్లడి చేసేందుకు బలమైన ఆయుధం ‘ఓటు’. లాటిన్ అమెరికా సాహితీ ప్రపంచంలో వేగుచుక్క అనదగ్గ కవి, రచయిత, జర్నలిస్టు, సామాజిక వేత్త అయిన జోస్ మార్టి (క్యూబా) మాటలతో ముగిస్తా. ‘‘అన్నింటి కన్నా ఓటు అత్యంత సున్నితమైన విశ్వాసం. ఓటరు ప్రయోజనం మాత్రమే కాదు అతని జీవితం, పరువు, భవిష్యత్తు కూడా ఓటుతో ముడివడి ఉన్నాయి’’ (నేడు జాతీయ ఓటరు దినోత్సవం) దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
కోరిక తీరేనా? కొత్తగాలి వీచేనా?
సమకాలీనం లోకసభకు జరుగబోయే సార్వత్రిక ఎన్నికల ముంగిట్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్‌పై తీసుకున్న నిర్ణయం రాజకీయంగా నెరవేర్చే మేళ్లకన్నా దానివల్ల కలిగే సామాజిక ప్రయోజనాలు, కొత్తగా తలెత్తే సందేహాలే ప్రధానాంశాలవుతున్నాయి. తాజా ప్రతిపాదన దేశంలో న్యాయ, రాజకీయ, సామాజిక పరమైన ఏయే కొత్త వివాదాలకు దారితీస్తుందోనన్న భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. అనూహ్యంగా కేంద్ర ప్రభుత్వం కదిపిన ఈ తేనెతుట్టె ఎన్నికల్లో గెలవడమనే కోరికను తీరుస్తుందా లేక రిజర్వేషన్ల చిక్కుముడిపై కొత్తగాలి వీస్తుందా అనేది అసలు ప్రశ్న. ఈ అంశంపై చర్చ తప్పక కొనసాగుతుంది. పర్యవసానాలు వేచి చూడాల్సిందే. అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ ప్రతిపాదన స్థూలంగా మొత్తం రిజర్వేషన్ల అంశాన్నే మరో మారు చర్చకు పెట్టింది. ఒక్క నిర్ణయంతో తేనెతు ట్టెను కదిల్చినట్టయింది. కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న రిజర్వేషన్ డిమాం డ్లు–ఉద్యమాలకు దీన్కొక పరిష్కారంగా చూపుతున్నా, సమాధానం లేని తాజా ప్రశ్నలెన్నింటికో ఆస్కారం కల్పిస్తోంది. కొత్త కోటాను సాధ్యపరిచే రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం లభించినా, ఈ పది శాతం రిజర్వేషన్ల అమలు ఎలా ఉంటుందనే అంశమే ఉత్కంఠ రేపుతోంది. లోకసభకు జరుగ బోయే సార్వత్రిక ఎన్నికల ముంగిట్లో బీజేపీ నేతృత్వపు ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా నెరవేర్చే మేళ్లకన్నా సామాజికంగా ఒనగూర్చబోయే ప్రయోజనాలు, కొత్తగా తలెత్తే సందేహాలే ప్రధానాంశాల వుతున్నాయి. రిజర్వేషన్లపై ఇప్పటివరకూ ఏర్పడ్డ సందిగ్దతను, దురభిప్రా యాన్ని తొలగించే క్రమంలో ఇదొక ముందడుగని సమర్థించే వారున్నారు. దానికి భిన్నంగా, అసలు రిజర్వేషన్లను శాశ్వతంగా ఎత్తివేసే దిశలో ఇది దుందుడుకు చర్య అనే వారూ ఉన్నారు. అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యో గాల్లో రిజర్వేషన్ల కల్పనకుద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో గురువారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) పడింది. తాజా ప్రతిపాదన దేశంలో న్యాయ, రాజకీయ, సామాజికపరమైన ఏయే కొత్త వివాదాలకు దారితీస్తుందోనన్న భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. ఇదే చర్చను రగి లిస్తోంది. దాదాపు అన్ని ప్రధాన పార్టీలు తమ ‘రాజకీయ’విధానాలకు అనుగుణంగా ఉభయసభల్లో ఈ బిల్లుకు మద్దతిచ్చినా, బిల్లు తీసుకువచ్చిన తీరే బాగోలేదని విపక్షాల సన్నాయినొక్కులు. ఈ దిశలోనే... రాజకీయ, రాజ కీయేతర వర్గాల్లో తాజా రిజర్వేషన్ కోటాకు అనుకూల–ప్రతికూల చర్చ ఊపందుకుంటోంది. ప్రభుత్వ రంగంలో విద్య, ఉద్యోగావకాశాలు ఏ మేర కున్నాయి? అగ్రవర్ణాల్లో ఏయే కులాల జనాభా ఎంత? అందులో ఆర్థిక స్థితి గతులకు సంబంధించిన గణాంకాలున్నాయా? పేదరిక గణనకు విధించిన సంపద పరిమితులు హేతుబద్దమా? వీటన్నింటిపై సమగ్ర కసరత్తు జరి గిందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ప్రాతిపదికపైనే పంచాయతీ! రిజర్వేషన్ల వర్తింపు ఏ ప్రాతిపదికన అన్నదే మొదట్నుంచి వివాదాస్పద అంశం. కులాల వారిగా రిజర్వేషన్లు ఇస్తూ, నిరంతరం దాన్ని సంరక్షిస్తూ కుల వ్యవస్థను, వివక్షను నిర్మూలించాలనడం ఓ అర్థరహిత చర్చ అనే వాదన ఉంది. రిజర్వేషన్లను గట్టిగా వ్యతిరేకించే వారు, ఉంటే గింటే అవి ఆర్థిక స్థితి గతుల ఆధారంగా ఉండాలంటారు. అగ్రవర్ణాల్లో పేదలు, దళిత–బలహీన వర్గాల్లో సంపన్నులు ఉన్నపుడు వర్గాల వారిగా రిజర్వేషన్లు తప్పని, ఆర్థిక స్థితిగతుల్ని బట్టి పేదలకు రిజర్వేషన్ వర్తింపజేయాలని, అదే సామాజిక న్యాయమని వీరంటారు. రిజర్వేషన్ల కారణంగా ప్రతిభ తిరస్కారానికి గుర వుతోందనే తమ వాదనకు ఈ అంశాన్ని జోడించి వేదికలపై హోరు ప్రసం గాలు చేస్తుంటారు. బీజేపీ విధానాల్ని ప్రభావితం చేసే ఆరెస్సెస్ సిద్దాంత కర్తల వాదన మొదట్నుంచీ ఇదే! మరోవైపున పూర్తి విరుద్ద వాదన! సమా జంలోని కొన్ని వర్గాలే ప్రగతి ఫలాలు అనుభవించి, నిమ్నజాతి వర్గాలను అణచివేస్తూ సాగిన సుదీర్ఘ చరిత్ర తాలూకు తప్పిదాల్ని సరిదిద్దడానికే రిజర్వేషన్లని వీరంటారు. రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లను, వాటి కొనసాగింపును సమర్థించే వారి వాదన ఇది. సమాజంలో ఇప్పటికీ కొన సాగుతున్న ప్రత్యక్ష–పరోక్ష వివక్షను సమర్థంగా ఎదుర్కొనే ప్రతిచర్యే ఈ రిజర్వేషన్లని వీరంటారు. ఆర్థిక స్థితిగతుల్ని బట్టి రిజర్వేషన్లు కల్పించాలనే వాదనను వీరు వ్యతిరేకిస్తారు. వామపక్షీయులు దీనికి ప్రధాన మద్దతుదా రులు. రాజ్యాంగ నిర్మాణ సమయంలోనూ ఈ చర్చ విస్తృతంగా సాగి, సామాజిక వర్గాల వారిగా రిజర్వేషన్లు కల్పించడానికే నాటి పెద్దలు మొగ్గారు. ఇది సున్నితమైన అంశమని, ఒకవైపు సమసమాజ స్థాపన మరోవైపు కుల నిర్మూలన... పరస్పర విరుద్ధ ప్రయోజనాల్ని నెరవేర్చాల్సి ఉంటుం దనేదీ వారి ఎరుకలోని అంశమే! రాజ్యాంగ నిర్మాణ కమిటీలో మెజారిటీ అగ్రవర్ణ ప్రముఖులే ఉన్నప్పటికీ నిర్ణయం అలా జరిగింది. రిజర్వేషన్ల వర్తింపునకు కేవలం ఆర్థిక స్థితిగతులు ప్రాతిపదిక కారాదనే వారలా నిర్ణయించారు. ‘రాజ్యాంగ స్ఫూర్తి’ని ఎక్కడ్నుంచి తీసుకోవాలి? రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. అయినప్ప టికీ సుప్రీంకోర్టు పరిమితి విధించింది. రాజ్యాంగ అధికరణాలు 15 (4), 16 (4)ను ఉటంకిస్తూ ‘ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో సుప్రీంకోర్టు ఈ మాట చెప్పింది. అప్పట్నుంచి ఎవరు, ఏ వర్గానికి రిజర్వేషన్లు పెంచాలన్నా, కొత్తగా కల్పించాలన్నా పరిమితికి లోబడాల్సి వస్తోంది. అన్ని రిజర్వేషన్లు కలిపి 50 శాతం దాటకుండా ఉండటం హేతు బద్దమని చెప్పిందే కానీ, అది 50 శాతమే ఎందుకో? ఏ 40 శాతమో, 60 శాతమో ఎందుకు కాకూడదో సుప్రీంకోర్టు చెప్పలేదు. దీనిపై వివిధ స్థాయిల్లో లోతైన చర్చలే జరిగాయి. ఈ పరిమితిపై ఎన్నో అనుకూల, ప్రతి కూల వాదనలు వస్తున్నాయి. రాజ్యాంగంలోని ఏ అంశం ఈ ‘పరిమితి’ని నిర్దేశిస్తుందో న్యాయస్థానం చెప్పలేదు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఈ పరిమి తిని దాటాయి. ఇంకొన్ని రాష్ట్రాలు దాటేలా కొత్తగా రిజర్వేషన్లు ప్రతిపాదిస్తు న్నాయి. అందులో రెండు తెలుగు రాష్ట్రాలూ ఉన్నాయి. తమిళనాడు ఈ పరి మితిని దాటి రిజర్వేషన్లు (69శాతం) కల్పించినా ఒక ప్రత్యేక చర్య ద్వారా అవి చెల్లుబాటయ్యేలా చేసుకోగలిగింది. సుప్రీంకోర్టు విధించిన పరిమితిని దాటొద్దని మద్రాస్ హైకోర్టు తిరస్కరించినపుడు, నాటి ముఖ్యమంత్రి జయ లలిత ప్రభుత్వం కేంద్ర సహకారంతో, న్యాయసమీక్షకు ఆస్కారం లేని విధంగా రాజ్యాంగాన్ని సవరింపజేసి, ఈ అంశాన్ని 9వ షెడ్యూల్లో పెట్టుకు న్నారు. ‘అయినా మేం సమీక్షిస్తాం, సమీక్షించగలమ’నే అర్థం వచ్చేలా ఒక సందర్భంలో సుప్రీం పేర్కొంది. ఇక ఈ అవకాశం తర్వాత ఏ ఇతర రాష్ట్రా లకూ కేంద్రం కల్పించలేదు. ఇప్పుడు స్వయంగా కేంద్రమే మరోమార్గంలో సుప్రీంకోర్టు విధించిన ఈ ‘పరిమితి’ని దాటేందుకు నిర్ణయించింది. న్యాయస్థానం అంగీకరించేనా? పేదలకు రిజర్వేషన్ కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందుజా గ్రత్తతో వ్యవహరించింది. పార్లమెంటులో సదరు బిల్లు తీసుకురావడానికి ముందే రాజ్యాంగ సవరణకు సిద్దపడింది. దీన్ని ప్రత్యర్థి రాజకీయ పక్షాలేవీ వ్యతిరేకించలేవనే ధీమాతో సభల్లో అసరమైన మెజారిటీపై సందేహించ లేదు. అంతా అనుకున్నట్టే జరిగింది. కానీ, దీన్ని సుప్రీంకోర్టు అంగీకరి స్తుందా అన్నదే ప్రశ్న! రాజ్యాంగ అధికారణాలు 15, 16 ను సవరించడం ద్వారా కేంద్రమీ భూమిక సిద్దం చేసింది. ‘సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన...’ (అ:15) అన్న పదజాలానికి ‘ఆర్థికంగా వెనుకబడిన...’ అన్న పదాల్ని జతపరుస్తూ సవరణ ప్రతిపాదించారు. ఇంకోచోట ‘ఎస్సీ, ఎస్టీలు...’ (అ:16) అన్న మాటలకు ‘ఈబీసీలు’ అనే పదం చేర్చడం మరో సవరణ. రాజ్యాంగాన్నే సవరిస్తున్నాం కనుక ఇప్పుడు సుప్రీం అభ్యంతరం చెప్పదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అంటున్నారు. ‘అదేం కుదరదు, మాటల సవరణతో మాయజేసి, రిజర్వేషన్లను 50 శాతం దాటించి, రాజ్యాంగ స్ఫూర్తికే భంగం కలిగించారని సుప్రీంకోర్టు కొట్టివేయవచ్చ’నేది ప్రత్యర్థుల వాదన. అధికరణం 368 కింద ఇలాంటి మార్పులు చేసే అధి కారం పార్లమెంటుకు ఉందని ప్రభుత్వం చెబుతోంది. అలా చేసే ఏ సవరణ యినా, రూపొందించే ఎలాంటి చట్టమైనా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉండొద్దని, రాజ్యంగ మౌలిక స్వరూప–స్వభావాల్ని మార్చకూడదని ‘కేశ వానంద భారతి– కేరళ ప్రభుత్వం’ కేసులో 13 మంది న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పిచ్చింది. ఇక్కడ రిజర్వేషన్ల ప్రాతిపదిక సామాజిక వర్గాల వారిగా కాకుండా ఆర్థిక స్థితిగతుల ప్రాతిపదికన చేయడం రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చడమేనని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. పాలక పక్షం దీన్ని ఖండిస్తోంది. ‘‘ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరంగా సమాన అవకాశాలు కల్పించాలి’’ అన్నది రాజ్యాంగ పీఠికలోనే ఉందని, తామదే చేస్తున్నామని ప్రభుత్వ వాదన. మళ్లీ తెరపైకి క్రీమీ లేయర్? అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ లబ్దిదారుల ఎంపికకు నిర్ణయించిన సంపద పరిమితులే విస్మయం కలిగిస్తున్నాయి. ఇది కొత్త వివాదానికి దారి తీసే అవకాశముంది. అయిదెకరాలకు పైబడి భూమి, 8 లక్షలకు మించి వార్షికా దాయం, నగరాల్లో 1000 చదరపు అడుగులకు మించి నివాసస్థలం ఉన్న వారు అర్హులు కారనే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. అంటే, ఆయా పరిమితులకు లోబడి సంపద కలిగిన వారంతా ఈ 10 శాతం రిజర్వేషన్లకు అర్హులే! ఇంత ఉదారంగా సంపద పరిమితిని విధించి, ‘ఆర్థి కంగా వెనుకబడినవారి’గా అగ్రవర్ణాల్లోని అత్యధికుల్ని (80–90 శాతం) ప్రసన్నం చేసుకోవాలనే వ్యూహం కనబడుతోంది. గత కొన్ని సంవత్సరా లుగా జాట్లు, పటేళ్లు, మరాఠీలు, కాపులు తమకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్నారు. బీజేపీకి గట్టి మద్దతుదారు లైన అగ్రవర్ణాలూ క్రమంగా దూరమౌతున్నాయని ఇటీవలి 3 రాష్ట్రాల ఎన్ని కల ఫలితాల విశ్లేషకులు తేల్చారు. సదరు వర్గాల్ని ప్రసన్నం చేసుకునేందుకే ఈ ఎత్తుగడ అని ప్రత్యర్థుల ఆరోపణ. ఉదారపరిమితి వల్ల కోటా మిగిలి పోవడమనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. దళిత, వెనుకబడిన వర్గాలతో పోల్చి చూస్తే చాలా రాష్ట్రాల్లో అగ్రవర్ణాల జనాభా తక్కువ. మొన్నటి సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం తెలంగాణాలో వీరి జనాభా 9 శాతమే! ఒడిశాలో 6 శాతాన్ని మించదు. అంత తక్కువ శాతం జనాభాలోని పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడం, సంపద పరిమితికి ఉదారమేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. కొన్ని విద్యాసంస్థల్లో దళిత, ఓబీసీ రిజర్వు సీట్లు నిండటం లేదు. ఒక వైపు ఏడున్నర ఎకరాల పొలం, నెలకు 65 వేల రూపాయల జీతం, నగరంలో 1000చ.అ లవిస్తీర్ణపు ఇల్లూ ఉన్న అగ్రవర్ణపు వారికి రిజ ర్వేషన్తో సర్కారు కొలువు ఖాయమై, అక్కడే ఒక దళితుడికో, బీసీకో కోటా నిండి ఉద్యోగం దొరక్కపోతే ఆర్థిక సమానత్వం సాధ్యమా అన్న ప్రశ్న తలెత్త వచ్చు! జనాభా ప్రాతిపదిక (దామాషా పద్దతి)న రిజర్వేషన్ల డిమాండ్ పెరిగే ఆస్కారముంది. దళిత, వెనుకబడిన వర్గాల్లో సంపన్నుల సంగతేమిటనే ప్రశ్న తెరపైకి వస్తుంది. ఆర్థిక స్థితిగతుల ఆధారంగా రిజర్వేషన్లు ఒక్క అగ్ర వర్ణాలకేనా? దళిత, వెనుకబడిన వర్గాల్లోనూ సంపన్న వర్గాల (క్రీమీ లేయర్) రిజర్వేషన్‌ను కట్టడి చేయాలనే డిమాండ్ తెరపైకి రావచ్చంటు న్నారు. ఎస్సీల్లో ఎ.బి.సి.డి వర్గీకరణకు ఒత్తిడి పెరిగే ఆస్కారమూ ఉంటుం దనే వాదన ఉంది. తాజా ప్రతిపాదన ఒక చర్చనైతే లేవనెత్తింది. పర్యవసానాలు వేచి చూడాల్సిందే! ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
హత్యలుండవు ఆత్మహత్యలే!
గత దశాబ్ద కాలంలో కాంగ్రెస్‌లో వచ్చిన వేగవంత మార్పులు పార్టీ భవిష్యత్తు మనుగడపైనే తీవ్ర ప్రభావం చూపేవిగా ఉన్నాయి. కాంగ్రెస్‌ను సంస్థాగతంగా బలోపేతం చేయాలని రాహుల్‌కు, సోనియాగాంధీకి బలంగా ఉన్నా, ఎలా చేయాలో, అందుకు ఏం చేయాలో మార్గం తోచడం లేదు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నెగ్గి, యూపీఏ ప్రభుత్వం ఏర్పరచింది. ఏపీలో డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి వంటి నేతలు ఆయా రాష్ట్రాల్లో సాధించిన గొప్ప విజయాలు కాంగ్రెస్‌కు లాభించాయి. రేపటి సార్వత్రిక ఎన్నికల్లో మోదీ వర్సెస్ రాహుల్‌గా ప్రజలు నిర్ణయించాల్సి ఉంటుంది. ఎన్నో పరీక్షలను ఎదుర్కొని కాంగ్రెస్ 2019 ఎన్నికలను ఎదుర్కోవలసి ఉంది. భారత స్వాతంత్య్రానికి ముందొక ఆరు, తర్వాతొక ఆరేడు దశాబ్దాలు ప్రబల రాజకీయ శక్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి నేడేమైంది? రాజకీయ, మేధావి, పాత్రికేయ వర్గాల్లో ఇటీవల తరచూ మెదళ్లను తొలు స్తున్న ప్రశ్న ఇది! సిద్దాంత పరంగా, విధానాల రీత్యా, నిర్మాణం–ఆచరణల వారీగా చూసినా, ఈ సుదీర్ఘ ప్రస్తానంలో కాంగ్రెస్ పలు మార్పు లకు గురైంది. ఇంకా గురవుతూనే ఉంది. ఏర్పడిన నాటికి, నేటికి పొంతనే లేని పార్టీగా కాంగ్రెస్ నేడు మిగిలిందనే భావన ఉంది. స్వతంత్రం సిద్దించగానే కాంగ్రెస్‌ను రద్దు చేయాలనీ పూజ్య బాపూజీ ఒక ఆలోచన చేశారు. కానీ, అలా జరుగక... దేశ రాజకీయాల్లో చాలా కాలం ఏకచత్రాధిపత్యం సాగించిన కాంగ్రెస్ నేడొక విచిత్ర పరిస్థితిని ఎదు ర్కొంటోంది. ఒక రాజకీయ పార్టీని ఎన్నికల్లో గెలుపోటముల పరంగానే తూచలేము! పైగా ప్రపంచంలోనే సుదీర్ఘ చరిత్ర కలిగిన రాజకీయ పార్టీల్లో ఒకటైన కాంగ్రెస్ తాజా స్థితిని అంచనా వేసేటప్పుడు ఎన్నో విషయాల్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. లోకసభ సార్వత్రిక ఎన్నికలు, వివిధ రాష్ట్రాల శాసనసభలకు జరిగే ఎన్నికల ఫలితాల విశ్లేషణల్లో పార్టీ ఉత్ధాన పతనాలు ప్రజల కళ్లకు కడుతూనే ఉన్నాయి. ఇన్నేళ్లలో సంస్థాగతంగా, నాయకత్వపరంగా, జనాదరణలో చూసినా... పార్టీలో గుర్తించదగిన మార్పులే చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా గత దశాబ్దకాలంలో కాంగ్రెస్‌లో వచ్చిన వేగవంత మార్పులు పార్టీ భవిష్యత్తు మనుగడపైనే తీవ్ర ప్రభావం చూపేవిగా ఉన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల ముంగిట్లో పార్టీ తాజా స్థితి వివిధ వేదికలపై చర్చను లేవనెత్తుతోంది. ఈ ఎన్నికల ముందర, ఎన్నికల అనంతర రాజకీయ సమీకరణాల్ని కాంగ్రెస్ ఏ విధంగా ప్రభావితం చేయనుందనేది ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. నేటికి సరిగ్గా 133 సంవత్సరాల కింద, ఇదే రోజు 28 డిసెంబరు(1885)న, ముంబాయిలో కాంగ్రెస్ ఏర్పడి, తొలి సదస్సు జరిపింది. బ్రిటిష్ రిటైర్డు అధికారి ఆలెన్ ఆక్టవియన్ హ్యూమ్ పూనికతో జరిగిన ఈ సదస్సులో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 72 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. దాదాబాయ్ నౌరోజీ, జస్టిస్ రనడే, ఫిరోజ్‌షా మెహతా, కె.టి.తలంగ్, దిన్షా వాచా తదితర ముఖ్యులు పాల్గొన్న ఈ సదస్సుకు డబ్లు.సి.బెనర్జీ అధ్యక్షత వహించి, కాంగ్రెస్ ఉద్దేశాలు, లక్ష్యాలను వివరించారు. ‘‘రాజ్యంలో అక్కడక్కడ నెలకొంటున్న మత, వర్గ, ప్రాంత విభేదాలను పరిహరించి దేశ సంపూర్ణ సమైక్యత సాధనకు అంకితమైన కార్యకర్తల మధ్య మరింత సాన్నిహిత్యాన్ని, స్నేహభావాన్ని పెంపొందించడానికి’’ కాంగ్రెస్ ఏర్పడినట్టు చెప్పారు. ఇది చరిత్ర! నాయకత్వ లేమి ఇప్పుడు కాంగ్రెస్ ఒక రాజకీయ పార్టీగా పలు సమస్యల్ని ఎదుర్కొంటోంది. సమర్థ నాయకత్వం లేకపోవడం ప్రధాన సమస్య! స్వతంత్రానికి పూర్వం.. గోఖలే, మదన్‌మోమన్ మాలవ్య, మహాత్మాగాంధీ, మోతీలాల్ నెహ్రూ, అబుల్ కలామ్ ఆజాద్, లాలా లజపతిరాయ్, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ వంటి గొప్ప నేతలు కాంగ్రెస్‌కు నాయకత్వం వహించారు. స్వతంత్రం తర్వాత ఏళ్లపాటు పాలకపక్షంగా ఉండిన తొలి ప్రధాని నెహ్రూ, తదనంతర ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నర్సింహారావులే కాకుండా జగ్జీవన్‌రామ్, నిజలింగప్ప, పట్టాభి సీతారామయ్య, కామరాజ్నాడార్, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి వంటి హేమాహేమీలు నేతృత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాహుల్‌గాంధీ నేతృత్వంలోకి వచ్చింది. గాంధీ–నెహ్రూ కుటుంబ వారసత్వాన్ని మించిన అర్హతలు ఇంకా ఆయన నిరూపించుకోవాల్సి ఉంది. నిన్నా మొన్న ఆయన పగ్గాలు చేపట్టేనాటికే పార్టీ సంస్థాగతంగా ఎంతో బలహీన పడింది. క్రమంగా పార్టీకి జనాదరణ కూడా తగ్గి ఉన్న సమయంలో ఆయన చేతికి పగ్గాలు అందాయి. అప్పటికే, ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా భారతీయ జనతాపార్టీ తరపున ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ బలమైన క్లాస్–మాస్ నాయకుడిగా స్థిరపడి ఉన్నారు. కాంగ్రెస్‌ను సంస్థాగతంగా బలోపేతం చేయాలని రాహుల్‌కు, సోనియాగాంధీకి బలంగా ఉన్నా... ఎలా చేయాలో, అందుకు ఏం చేయాలో మార్గం తోచడం లేదు. స్వతంత్రానంతర ప్రస్థానంలోనూ కాంగ్రెస్ ఎన్నో రూపాల్లోకి మారినా, ప్రధానంగా వాటిని మూడు దశలుగా చెప్పుకోవచ్చు. 1947 తర్వాత 1952, ’57, ’62 వరుస సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌లో పెద్దగా మార్పులు లేవు. ఇక నెహ్రూ, లాల్‌బహదూర్ శాస్త్రి మరణం తర్వాత ఇందిరాగాంధీ నేతృత్వంలో ఎన్నికలు జరిగాయి. 520 లోకసభ స్థానాల్లో 283 స్థానాలకే పరిమితమైన 1967 ఎన్నికల నాటికి కొంత మార్పు పొడచూపింది. కానీ, 1971లో ఇందిరా గాంధీ పార్టీలో చీలిక తెచ్చి, ‘గరీబీ హటావో’ నినాదంతో ఎన్నికలకు వెళ్లినప్పటి నుంచి రెండో దశగా చెప్పొచ్చు. ఆ సంక్షోభం తర్వాత ప్రజాదరణ కన్నా, విధేయతకు పెద్దపీట వేస్తూ ఇష్టానుసారంగా రాష్ట్రాల్లో పార్టీ నాయకుల్ని మారుస్తూ తెచ్చిన కొత్త సంస్కృతి కాంగ్రెస్‌లో సంస్థా గత మార్పులకు నాంది అయింది. ఎమర్జెన్సీ, విపక్ష కూటమి జనతా ప్రయోగం విజయవంతమవడం, తిరిగి కాంగ్రెస్ అధికారం, ఇందిర హత్యోదంతం, రాజీవ్‌గాంధీ ప్రధాని కావడం, మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపిన ఘనాపాటిగా పీవీ నర్సింహారావు పాలనాకాలమంతా ఈ దశలోదే! ఇక, గాంధీ–నెహ్రూ కుటుంబేతరుడిగా సీతారామ్ కేసరి బలహీన నాయకత్వం నుంచి పరోక్షంగా సోనియగాంధీ పార్టీ నాయకత్వ పగ్గాలు చేబుచ్చుకున్న 1997 నుంచి కాంగ్రెస్ మూడో దశగా పరిగణించవచ్చు. ఈ దశలోనే పార్టీ బాగా బలహీనపడింది. ఆశలు రేపి అడుగంటిన దశ! 1998, 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపాలయింది. పార్టీపై కాంగ్రెస్ నాయకత్వం పట్టు క్రమంగా సడలడం మొదలైంది అప్పుడే! కొత్తదనం కొంత, అయోమయం మరింత... అనవసరపు ఢిల్లీ పెత్తనాలు పెరిగాయి. ఈ దశ ఆరంభంలోనే మమతా బెనర్జీ. శరద్‌పవార్, సంగ్మా, తారిక్ అన్వర్ వంటి సీనియర్ నాయకుల్ని కాంగ్రెస్ దూరం చేసుకుంది. రాజేష్ పైలట్, మాధవరావ్ సింధియా వంటి ద్వితీయ శ్రేణి నాయకులు దుర్ఘటనల్లో మరణించడం పార్టీకి నికర నష్టమైంది. దివంగత ప్రధాని వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 2004 వరకు అధికారంలో ఉంది. సంస్థాగతమైన ప్రతికూలతల నడుమ కూడా, మారిన రాజకీయ సమీకరణాల్లో 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నెగ్గి, యూపీఏ ప్రభుత్వం ఏర్పరచింది. ఏపీలో డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి వంటి నేతలు ఆయా రాష్ట్రాల్లో సాధించిన గొప్ప విజయాలు కాంగ్రెస్‌కు లాభించాయి. కమ్యూనిస్టుల ఒత్తిళ్ల వల్లో, కనీస ఉమ్మడి కార్యక్రమం అమలు వల్లో యుపీఏ–1 (2004–2009) పాలనా పరంగా సత్ఫలితాలు సాధించింది. కానీ, పార్టీగా కాంగ్రెస్ బాగా దెబ్బతిన్నది! కేంద్ర నాయకత్వ లోపమనే నింద ఎక్కువైనప్పటికీ, పార్టీ బలహీనపడటానికి కారణాలు చాలానే ఉన్నాయి. సంప్రదింపులు, ఏకాభిప్రాయ సాధనతో నిర్ణయాలు తీసుకునే పద్దతికి పార్టీ తిలోదకాలిచ్చింది. విశాల దృక్పథంతో రాష్ట్రాల్లో పార్టీ నాయకత్వాన్ని ప్రోత్సహించే సంస్కృతి నిలిచిపోయింది. సంబంధాలు పోయాయి. స్వీయ శ్రమతో ఎదిగిన వైఎస్సార్ వంటి ఒకరిద్దరికి తప్ప రాష్ట్ర నాయకులెవరికీ ‘అధిష్టానం’ వద్ద ప్రాధాన్యత దొరకని స్థితి వచ్చింది. సోనియా చుట్టూ చేరిన ‘కోటరీ’ ముఖ్యులు అయిదారు గురికి క్షేత్రస్థాయి వాస్తవాలు తెలిసేవి కావు. క్షేత్రస్థాయిలో ప్రజానాడి గ్రహించి ఎదిగిన, ఎదుగుతున్న రాష్ట్ర నాయకులకు అత్యున్నత నాయకత్వంతో లింకుని తెంపివేశారు. ఇరువురికీ నడుమ ‘కోటరీ’ సైంధవ పాత్ర పోషించేది. ఈ తప్పుడు ప్రాధాన్యతలు, నాయకత్వపు ఒంటెద్దు పోకడల వల్ల కాంగ్రెస్ క్రియాశీల కార్యకర్తల్లో ఉత్సాహం నీరుకారింది. వివిధ రాజకీయ సమీకరణాల వల్ల 2009లో యూపీయే అధికారాన్ని నిలబెట్టుకున్నా, పార్టీ సంస్థాగతంగా మరింత దిగజారింది. ఈ అసాధారణ విజయాన్ని కార్యకర్తల ఖాతాలో వేయకుండా, ‘కోటరీ’ తమ వ్యూహ విజయంగా చెప్పుకొని నాయకత్వాన్ని తప్పుదోవ పట్టించింది. పార్టీ శ్రేణు లకు అధినాయకత్వానికి నడుమ మరింత దూరం పెరిగింది! ఒకవైపు యూపీఏ–2 పాలనా వైఫల్యాలు, మరోవైపు దిగజారిన పార్టీ వ్యవస్థ, వెరసి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ 44 స్థానాలకు కుదించుకుపోయింది. నిన్నటి ఫలితాలూ తప్పుడు అన్వయమే! పెద్దనోట్ల రద్దు తర్వాత ఉత్తరప్రదేశ్ తదితర అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ సానుకూల ఫలితాలు సాధించి ఉండాల్సింది. పంజాబ్ తప్ప ఏమీ దక్కలేదు. గుజరాత్ ఎన్నికల్లో సమీపం వరకు వచ్చినా తుది ఫలితం దక్కలేదు. ఒకదశలో, దేశం మొత్తంలో మూడు (పంజాబ్, కర్ణాటక, మిజోరాం) రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వాలున్న పరిస్థితి! నిన్నటి అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు కొంత ఊరటనిచ్చినా విశ్లేషణ సరిగా లేదు. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ ఫలితాలు కాంగ్రెస్ ఏకపక్ష విజయాలు కావు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో 15 ఏళ్ల వరుస పాలన తర్వాత కూడా బీజేపీ పోటాపోటీగా స్థానాలు గెలిచింది. ప్రతిసారీ ప్రత్యామ్నాయ ప్రభుత్వాల్ని ఎన్నుకునే రాజస్తాన్‌లో కాంగ్రెస్‌కు చావు తప్పి కన్ను లొట్టబోయిన పరిస్థితి! ఒక సర్వే ప్రకారం ఆయా రాష్ట్రాల్లో ప్రజాదరణ స్థానిక బీజేపీ నాయకత్వం కన్నా ప్రధాని మోదీకి ఎక్కువ మోతాదులో ఉంది. రేపటి సార్వత్రిక ఎన్నికల్లో మోదీ వర్సెస్ రాహుల్‌గా ప్రజలు నిర్ణయించాల్సి ఉంటుంది. హిందీ రాష్ట్రాల్లో సానుకూలంగా ఉండే మాయావతితో పొత్తు కుదరకపోవడం పార్టీ నాయకత్వ వైఫల్యమే! విశ్వసనీయతే లేని చంద్రబాబు నాయుడు వంటి నాయకులతో పొత్తు కుదిరినా తెలంగాణలో ఫలితం వికటించడం వంటివి పార్టీ నాయకత్వ సామర్థ్యాన్ని ఎండగట్టేవే! ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబొక చెల్లని రూపాయి! తెలంగాణలో టీఆరెస్తో నేను పొత్తుకు యత్నించినా, వారు కుదరనీయనందున కాంగ్రెస్‌తో పెట్టుకోవాల్సి వచ్చిందని బాబు బహిరంగంగానే చెప్పారు. ఆయనిచ్చే ‘వనరుల’కు కక్కుర్తి పడి రాష్ట్రంలో పార్టీ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టాలా? మరో చోట వనరులు దొరక్కపోయేవా? కాంగ్రెస్ నాయకత్వం ఆలోచించాలి. ఇటువంటి పరీక్షలన్నిటికీ నిలిచి, కాంగ్రెస్ 2019 ఎన్నికల్ని ఎదుర్కోవాల్సిన కూడలిలో ఉందిప్పుడు! (నేడు కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం) వ్యాసకర్త: దిలీప్ రెడ్డి, ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
మౌన జ్ఞాని మన ఓటరు
తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయాన్ని వెతకటం లేదని విపక్షం గ్రహించలేదు. ఒకవేళ వెతుకుతున్నారనుకున్నా... తాము మెరుగైన ప్రత్యామ్నాయం ఇవ్వగలమని విపక్షం భరోసా కల్పించలేకపోయింది. ఈ రాష్ట్రంలో, దేశంలో వేదికలెక్కి, సామాజిక మాధ్యమాల్లో జొరబడి, టీవీ చర్చల్లో పూనకం వచ్చినట్టు మాట్లాడేవారి చేతుల్లో ఓట్లు లేవు. ఓట్లున్న సగటు పౌరులు మాట్లాడరు. అందుకే, పైపై పరిశీలకులకు, మీడియాకు ప్రజానాడి దొరకదు. నిన్న వెలువడిన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్∙రాష్ట్రాల ఎన్నికల ఫలితాల విశ్లేషణలోనూ శాస్త్రీయత కొరవడింది. స్థానిక పరిస్థితుల్ని, దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయాల్ని పరిగణనలోకి తీసుకోకుండానే నిర్ణయానికి వస్తున్నారు. రాజకీయ క్షేత్రంలో దృశ్యం ఎలా ఉన్నా ప్రజాక్షేత్రంలో అయోమయం, అస్పష్టత ఉండదు. ఎక్కువ సందర్భాల్లో సాధారణ ప్రభావాలకు, ప్రలోభాలకూ లొంగని ఏకరీతి జనాభిప్రాయాన్నే ప్రతి బింబిస్తుంది. సాధారణ చూపులకు ఆననిదేదో అంతర్లీనంగా ఉండటం వల్లే కడవరకు దృశ్యం ఆవిష్కృతం కాదు. పలు ఊహలకు, అంచనాలకు తావిస్తుంది. ఎక్కువ సందర్భాల్లో వాటి ఆధారంగానే ప్రసారమాధ్యమాల విశ్లేషణలు, మేధావి వర్గం వాదనలు రూపుదిద్దుకుంటాయి. కొన్ని సంకేతాలను శాస్త్రీయంగా పరిశీలించి, విశ్లేషించే వారికి ప్రజానాడి దొరి కినా వేర్వేరు కారణాల వల్ల వాటిని ప్రజలు నమ్మరు. ఎన్నికల సమయంలో తీవ్ర ఉత్కంఠ తర్వాత ఏకపక్ష ఫలితాలు చాలా మందికి విస్మయం కల్గించడానికి ఈ మర్మమే కారణం! తెలంగాణలో నిన్నటి ఎన్నికల ఫలితాలు అధికులకు ఆశ్చర్యం కలిగించాయి. ఘనవిజయం సాధించిన పాలక తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస)లోనూ, తమ అంచనాల్ని మించి ఎక్కువ స్థానాలు రావడంతో కొందరు విస్మయం చెందారు. గెలుపోటముల కారణాలను ఇప్పడు ఎవరికి వారు తమకు అనువైన, అవగాహన మేర విశ్లేషిస్తున్నారు. తెరాసకు లభించిన స్థానాలు, ఆధిక్యతలు, ఒకటీ అర జిల్లాలు మినహా రాష్ట్రమంతటా వెలసిన విజయ విస్తృతిని చూస్తే ఒక అంశం స్పష్టమౌతోంది. ప్రచారం జరిగిన ప్రభుత్వ వ్యతిరేకత ప్రజాక్షేత్రంలో లేదు. పైగా, సానుకూలత క్రమంగా బలపడింది. దానికి తోడు పలు పరిణామాలు పాలకపక్షానికి కలిసి వచ్చాయి. అన్నిటికన్నా ముఖ్యంగా నాయకత్వంపై ప్రజల్లో ఏర్పడ్డ ప్రగాఢ విశ్వాసం కడవరకూ చెదరక నిలవడం తుది ఫలితాల్ని శాసిం చింది. సదరు నాయకత్వంపై విశ్వాసాన్ని సడలింప జేసేందుకు జరిగిన యత్నాలను తిప్పికొట్టే క్రమంలో నాయకుడు, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు (కేసీఆర్) తీసుకున్న జాగ్రత్తలు, ఎత్తుగడలు వారి గెలుపును మరింత దృఢపరిచాయి. కేసీఆర్ తనను తాను ‘ఎజెండా’ చేసుకున్నారు. పార్టీ శ్రేణులన్నీ క్రమశిక్షణ కలిగిన సైన్యంలాగే తమ ‘జనరల్’ వెనుక కవాతులా నడిచాయి. ప్రజాభిప్రాయాన్ని మలచడమొక కళ! ఎన్నికల్లో రాజకీయ పక్షాలు తమ విధానాల ప్రచారం ద్వారా ప్రజాభిప్రాయాన్ని సానుకూలంగా మలచ జూస్తాయి. ఈ క్రమంలో... పాలక–విపక్షాలు కొన్ని మౌలిక విషయాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వాలపై ప్రజాభిప్రాయానికి వివిధ స్థాయిలుంటాయి. సామూహిక ప్రజా వ్యతిరేకత, తీవ్ర ప్రజా వ్యతిరేకత, వ్యతిరేక–సానుకూల భావనలు లేని తటస్థ స్థితి, సానుకూలత, బలమైన సానుకూలత.... ఇలా వైవిధ్యంగా ఉండే పరిస్థితుల్ని బట్టి ఎవరైనా నిర్దిష్ట కార్యాచరణతో ఎన్నికల పోరు జరపాలి. ఇక్కడ అంచనాలు ఏ మాత్రం తప్పినా వ్యూహం ఫలించదు. పుష్కర కాలం ఉద్యమించి తెలంగాణ సాధించిన పార్టీగా అధికారం చేపట్టిన తెరాస, నాలుగున్నరేళ్ల పాలన తర్వాత నాలుగయిదు మాసాలు ముందే ఎన్నికలు తెచ్చింది. అదొక వ్యూహం! విపక్షం అంచనా వేసినట్టు వ్యతిరేకత మొదలవుతోంది, అది బలపడక ముందే ప్రజాతీర్పుకు వెల్లడం మేలు చేస్తుందన్న భావనా పాలకపక్షానికి ఉండిందేమో! ప్రజావ్యతిరేకత స్థాయిని విపక్షం గ్రహించి ఉండాల్సింది. సామూహిక ప్రజా వ్యతిరేకత తెలంగాణ రాష్ట్రంలో లేదు. సంఖ్యాపరంగా అత్యధికులైన సామాన్యులు, మధ్యతరగతికి ప్రత్యక్ష లబ్ది చేకూరుస్తున్న పింఛన్లు, కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్, రైతుబంధు, కేసీఆర్ కిట్, వృత్తులపరమైన మేళ్లు వంటి సంక్షేమ పథకాల అమలు సవ్యంగా ఉంది. లబ్దిదారులు సర్కారుపై కొంత కృతజ్ఞతతో ఉన్నారు. ముఖ్యంగా కొడుకులు సరిగా చూడని తలిదండ్రులు, భర్తల ఆర్థిక వెసలుబాటు కరువై కాన్పు ఖర్చులకు జడుస్తున్న భార్యలు, ఒంటరి మహిళలు, పెట్టుబడి ఖర్చులతో కృంగిన రైతులు... సర్కారు చేయూతకు సంతసించారు. ప్రభుత్వంపైన, నాయకుడు కేసీఆర్ పైన ప్రజా విశ్వాసం బలంగా ఉంది. పౌరుల ఇతరేతర వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేరనందున స్థానిక నాయకత్వం, ముఖ్యంగా ఎమ్మెల్యేలపై వ్యతిరేకత బలంగా ఉంది. అది పలు సందర్భాల్లో కొట్టొచ్చినట్టు కనిపించింది. అందుకే, స్థూలంగా ప్రభుత్వంపైనో, నాయకుడిపైనో ప్రచారాన్ని కేంద్రీకృతం చేయకుండా విపక్షాలు స్థానిక నాయకత్వాన్నే లక్ష్యం చేసి పోరాడాల్సింది. ప్రజల్లోకి వెళ్లి, వారితో సంబంధాల్ని నెరపి, ప్రజాభిప్రాయాన్ని మలచడానికి ఈ దారి ఎంచుకొని ఉండాల్సింది. వారెదుర్కొంటున్న ప్రధాన సమస్యల్ని తీసుకొని క్రమంగా ఉద్యమాలు నిర్మించాల్సింది. అలా కాకుండా కేవలం పత్రికా ప్రకటనలు, టీవీ చర్చల్లో విసుర్లు, నిత్యం మీడియా వేదికగా విమర్శలతోనే ప్రజాభిప్రాయాన్ని నిర్మిస్తామనుకోవడం పొరపాటు అని ఈ ఎన్నికల ఫలితాలు తేల్చాయి. సంక్షేమ పథకాల పట్ల సానుకూలతతో లబ్దిపొందాలనుకున్న పాలకపక్షం నియోజకవర్గాల వారిగా వివరాలు సేకరించింది. ప్రతి నియోజకవర్గంలోనూ, బహుళ పథకాల లబ్దిని కలగలిపి లెక్కించినా, నికరంగా సగటున 30 నుంచి 60 వేల మంది ఓటర్లు ప్రత్యక్ష లబ్దిదారులుగా తేలారు. ఆ జాబితాలు చేబూని నిర్దిష్ట ప్రచారమూ చేశారు. ఇవి కొనసాగడమా, నిలిచిపోవడమా? మీకేం కావాలి? అన్న తరహాలోనూ కొన్నిచోట్ల ప్రచారం వారికి లాభించింది. పెద్ద సంఖ్యలో ఓట్ల వ్యత్యాసాలతో వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో లక్షకు పైగా ఓట్లు పొందిన విజేతలు 26 మంది ఉండగా అందులో 24 మంది తెరాస వాళ్లే! బాబుతో ‘చేయి’ కలపడం నిలువునా ముంచింది సున్నిత మనోభావాలు, స్వీయ అస్తిత్వ ప్రభావం నుంచి క్రమంగా బయటపడుతూ పాలన–రాజకీయ అంశాల ఆధారంగానే ఇక తెలంగాణ రాష్ట్రం రెండో ఎన్నికలని అత్యధికులు భావించారు. తెలంగాణ మనుగడతోనే నిమిత్తం లేని తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రంగప్రవేశంతో పూర్తి ఎన్నికల అస్తిత్వ చిత్రమే మారిపోయింది. కాంగ్రెస్ నిర్హేతుకంగా టీడీపీతో జట్టు కట్టి, బాబును ముందు పెట్టి తెరాసను ఢీకొనడం రాజకీయ పరిశీలకుల్నీ విస్మయపరిచింది. అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని మళ్లీ తెరమీదకు తెచ్చి ఆలోచనల్ని రగిలించే నిప్పందించినట్టయింది. విశ్వసనీయత, పాలనాదక్షత కొరవడిన పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి, తెరవెనుక వ్యవహారాలతో ఈ రాష్ట్రాన్ని నడిపిస్తారన్న ఊహనే తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోయింది. దాన్నొక ప్రమాదంగానూ శంకించింది. పాలకుల ఒంటెద్దు పోకడ, నియంతృత్వ ధోరణిని నిరసించిన వారూ మనసు మార్చుకొని, తమ ‘ఓటింగ్’ నిర్ణయ దిశనే మార్చారు. సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చినట్టుగానే, ఏ ప్రచార పటాటోపాలకూ లొంగకుండా, ‘సర్వే’ జిమ్మిక్కులకూ బోల్తాపడకుండా, అయోమయానికీ గురి కాకుండా ఇచ్చిన ‘తీర్పు’నకు ఏపీలోనే కాక ఇతర రాష్ట్రాల్లోనూ అభినందనలు వ్యక్తమౌతున్నాయి. ఆర్థిక వనరులతో ఆదుకున్నాడన్న లాలూచీతో కాంగ్రెస్ ఇచ్చిన చనువు, చంద్రబాబు వ్యూహ తప్పిదం విపక్షాలకు తీవ్ర నష్టం కలిగించింది. సానుకూల అంశాలతో, స్థానిక నాయకత్వ వైఫల్యాల్ని ఎత్తిచూపడంతో సాగాల్సిన విపక్ష ప్రచారం భిన్నంగా సాగింది. ప్రచార హోరు... టీఆరెస్ వర్సెస్ కూట మిగా కాకుండా కేసీఆర్ వర్సెస్ చంద్రబాబుగా దిశ మార్చుకుంది. దాంతో కేసీఆర్ నాయకత్వ ఖ్యాతి ముందు చంద్రబాబు విశ్వసనీయత వెలవెలబోయింది. ఉద్యోగులు ఉద్యమించినా అణచివేసి ఏపీలో బలవంతంగా అమలు చేస్తున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను తెలంగాణలో అధికారంలోకి రాగానే ఎత్తివేస్తామనడాన్ని తెలంగాణ ఉద్యోగులెవరూ నమ్మలేదు. ఏపీలో ప్రత్యర్థి పక్షమైన వైఎస్సార్సీపీ ఎమ్మేల్యేల్ని పెద్ద సంఖ్యలో తన పార్టీలోకి కొని తెచ్చుకొని, నలుగురిని మంత్రుల్ని చేసిన బాబే, ఇక్కడ పార్టీ మారిన వారిని చిత్తుచిత్తుగా ఓడించండని పిలుపునిస్తే... జనం నవ్వుకున్నారు. నాయకత్వ పరంగానే ప్రత్యామ్నాయం చూస్తారు ఇదివరకు ప్రజలు ఓటర్లు మాత్రమే! ఇప్పుడు ఓటర్లు తాము పౌరులమని ఆలోచిస్తున్నారు. తమకు గురి కుదిరిన, విశ్వాసం కలిగిన నాయకుడి ఆలోచనల్ని స్వాగతిస్తున్నారు. తమ అవసరాలు ఈ నాయకత్వంతో తీరుతాయా? ఇచ్చిన మాటయినా వీరు నిలబెట్టుకోగలరా? అనీ ఆలోచిస్తున్నారు. రాజకీయ పక్షాలు ఈ లోతుల్ని గ్రహించడం లేదు. తెలం గాణ ప్రజలు ప్రత్యామ్నాయాన్ని వెతకటం లేదని విపక్షం గ్రహించలేదు. ఒక వేళ వెతుకుతున్నారనుకున్నా... తాము మెరుగైన ప్రత్యామ్నాయం ఇవ్వగలమని విపక్షం ఏ దశలోనూ భరోసా కల్పించలేకపోయింది. ఈ రాష్ట్రంలో, దేశంలో వేదికలెక్కి, సామాజిక మాధ్యమాల్లో జొరబడి, టీవీ చర్చల్లో పూనకం వహించి... ఎక్కువగా మాట్లాడేవారి చేతుల్లో ఓట్లు లేవు. ఓట్లున్న సగటు పౌరులు మాట్లాడరు. అందుకే, పైపై పరిశీలకులకు, మీడియాకు ప్రజానాడి దొరకదు. నిన్న వెలువడిన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్∙రాష్ట్రాల ఎన్నికల ఫలితాల విశ్లేషణలోనూ శాస్త్రీ యత కొరవడింది. స్థానిక పరిస్థితుల్ని, దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయాల్ని పరిగణనలోకి తీసుకోకుండానే నిర్ణయానికి వస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో పదిహేనేళ్లుగా పాలకపక్షమై ఉండి బీజేపీ ఓడిపోయింది. రాజస్తాన్‌లో ప్రతిసారీ ప్రత్యామ్నాయ ప్రభుత్వాల్ని ఎన్నుకునే సంప్రదాయాన్ని కొనసాగించారు. అప్పటికీ మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో బీజేపీ గౌరవప్రదమైన సంఖ్యతో గట్టి పోటీ ఇచ్చింది. సదరు తీర్పు ప్రధాని మోదీకి వ్యతిరేకమనో, కాంగ్రెస్ అధినేత రాహుల్‌కు అనుకూలమనో అంకెలతో తేల్చేస్తున్నారు. దీంతో ఇక తమ రొట్టె నేతిలో పడిందని కొందరు అవకాశవాద రాజకీయులు చంకలు గుద్దుకుంటున్నారు. ఎన్నికల ముందు ఎన్డీటీవి జరిపిన సర్వేలో ఆయా రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు చౌహాన్, విజయ రాజె, రమణ్సింగ్లకన్నా ప్రజానుకూలత అదే పార్టీకి చెందిన ప్రధాని నరేంద్ర మోదీకి ఎంతో ఎక్కువగా ఉంది. రేపు ఏపీ ఎన్నికల్లో అయినా, పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో అయినా నాయకత్వ పటిమ, ఇచ్చిన మాట నిలబెట్టుకునే విశ్వసనీయత, ప్రజావసరాలు తీర్చే నిబద్దతే జనం దృష్టిలో ప్రామాణికమౌతాయి. రాజకీయ పక్షాలు ఇది గ్రహించాలి. ప్రచారాల మాయలో పడకుండా, నిండైన తమ విశ్వాసంతో, ఆశలతో, ఆకాంక్షలతో ప్రజలిచ్చిన తీర్పును ఏ పక్షాలూ వంచించ కూడదు. ముఖ్యమంత్రి కేసీఆరే అన్నట్టు, ‘‘గెలుపు ఎంత ఘనమో! బాధ్యత అంత బరువు’’. వ్యాసకర్త: దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
చిన్న మార్జిన్లు.. పెద్ద తేడా!
సాధారణ ఎన్నికల్లో బహుముఖ పోటీలు, నువ్వా-నేనా అన్నట్టుండే ముఖాముఖి పోటీలు పెరిగినపుడు సహజంగానే గెలుపోటముల మధ్య వ్యత్యాసం తగ్గిపోతుంది. స్వల్ప ఓట్ల తేడాతోనే ఫలితాలు అంతిమ విజేతల్ని నిర్ణయిస్తాయి. ఉత్కంఠ పోరులో ఆ స్వల్ప పెచ్చు ఎవరికి రానుందో ఓట్ల లెక్కింపు ముగిసే వరకూ తెలియదు. అప్పటిదాకా తమదే గెలుపనే ధీమాతో ఉండే అత్యధికుల ఆశలు గల్లంతవుతాయి. ఇప్పుడు తెలంగాణలో మూడో వంతు నుంచి సగం వరకు నియోజకవర్గాల్లో అటువంటి పరిస్థితులున్నాయి. మిగతా పోటీ దారుల్ని వెనక్కి నెట్టి ప్రధాన పక్షాల అభ్యర్థులు నువ్వా నేనా అన్నంత తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న నియోజకవర్గాల సంఖ్య పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ పెరుగుతోంది. ఇవి కాక, ప్రధాన పక్షాలైన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి అభ్యర్థులు కాకుండా బీజేపీ, బీఎస్పీ, బీఎల్ఎఫ్ (కూటమి)ల అభ్యర్థులు బరిలో ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీలున్నాయి. ప్రధాన పక్షాల నుంచి బరిలో బలమైన తిరుగుబాటు అభ్యర్థులు దూసుకొస్తున్న చోట కూడా త్రిముఖ పోటీ రోజురోజుకీ బలపడుతోంది. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చి చూస్తే సామాజిక అవగాహన, రాజకీయ పరిణతి, మీడియా చేతన అధికంగా ఉండే దక్షిణాది రాష్ట్రాల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఫలితాలు తేలే నియోజకవర్గాల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. ఈ పరిస్థితి రాజకీయ పరిశీలకుల అంచనాల్ని కూడా గల్లంతు చేస్తోంది. ఫలితాల తర్వాత అధికారం మాదంటే మాదని ప్రధానపక్షాలైన టీఆర్ఎస్, కాంగ్రెస్ బల్లగుద్ది చెబుతున్న ప్రస్తుత తరుణంలో, ఈ స్వల్ప ఓట్ల వ్యత్యాసపు గెలుపోటములు ఎవరి కొంపముంచుతాయన్నది ఉత్కంఠ రేపుతోంది. జనం ముందు సిద్ధాంత రాద్ధాంతాలు నిలువవు పలు సమకాలీన అంశాల్ని పరిగణనలోకి తీసుకొని రాజకీయ పరిశీలకులు, ఎన్నికల విశ్లేషకులు, సెఫాలజిస్టులు రకరకాల అంచనాలు చెబుతారు. కానీ, అత్యధిక సందర్భాల్లో ప్రజా తీర్పు విస్మయం కలిగిస్తుంది. అంచనాల్ని గల్లంతు చేస్తుంది. ఫలితం హంగ్ అనో, గెలుపెవరిదైనా కావచ్చనో అంచనాలు సాగే సందర్భాల్లోనూ... ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇచ్చిన దాఖలాలే ఎక్కువ. పార్టీల ప్రచారపు ఎత్తుగడలు, వ్యూహాలతో నిమిత్తం లేకుండా, ఆసిఫాబాద్ నుంచి భద్రాచలం వరకు ఓటర్లు ఒకరికొకరు మాట్లాడుకొని ఓట్లేసినట్టే ఉంటుంది. మనకు తెలియని ‘న్యూరో నెట్వర్క్’ ఏదో అంతర్లీనంగా పనిచేసిందన్నట్టు ఏకరీతి ఫలితాల్ని ప్రజలు శాసిస్తారు. ఒక శాస్త్రీయ అధ్యయనం, పరిశీలన ద్వారా క్షేత్రంలో ఉన్న పరిస్థితిని ముందుగా ప్రతిబింబించేవే ‘సర్వే’లని మనబోటి సామాన్యులనుకుంటారు. కానీ, సర్వేల పేరిట పలికే గణాంకాలతో, ఆయా పార్టీలకిచ్చే హెచ్చు-తగ్గులతో రాబోయే ప్రజాతీర్పునే ప్రభావితం చేయాలని కొందరు ‘మేధావులు’ యోచిస్తుంటారు. రాజకీయ పక్షాలకు కొమ్ముకాసే కొన్ని మీడియా సంస్థలు కూడా ఇటువంటి మేధావిత్వాన్ని తరచూ ప్రదర్శిస్తాయి. అందువల్లే, కాలక్రమంలో సర్వేలంటేనే విశ్వసనీయత లేకుండా పోతోంది. గణాంకాలు కొన్ని సార్లు విచిత్రంగానూ ఉంటాయి. ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న తెలంగాణ (ఆపద్ధర్మ) ముఖ్యమంత్రి, తెరాస అధినేత కె.చంద్రశేఖరరావును ఇంటర్వ్యూ చేస్తూ సీనియర్ జర్నలిస్టు, ఎన్నికల విశ్లేషకుడు ప్రణయ్‌రాయ్ (ఎన్డీటీవీ) ఒక ప్రశ్న అడిగారు. ‘కిందటిసారి ఎన్నికల్లో మీ ఓట్ల శాతం 33 మాత్రమే, ఈ సారి కాంగ్రెస్-తెలుగుదేశం కలిసి పోటీ చేస్తున్నాయి, దీన్ని ఎలా అధిగమిస్తారు?’ అన్నదా ప్రశ్న. దీనికి సంబంధం లేకుండా ఆయనేదో సమాధానం చెప్పారు, అసలు చంద్రబాబునాయుడికి ఇక్కడి రాజకీయాల్లో జొరబడే నైతిక హక్కే లేదని కొట్టివేశారు. ఇక్కడి ప్రాజెక్టుల్ని, ప్రగతిని చంద్రబాబు వ్యతిరేకిస్తున్నాడన్నారు. అదొకరకంగా ప్రణయ్ ప్రశ్నకు సమాధానమే కావచ్చు! ఇద్దరు కలిస్తే పెరుగుతాయనే ఎందుకనుకుంటున్నారు? తగ్గొచ్చు, అన్నది కేసీఆర్ కవి హృదయమేమో తెలియదు! ఎలా అంటే, 2 కు 2 కలిపితే 4 అయేది గణితంలోనే! రాజకీయాల్లో అది 4 అవొచ్చు, ఆరో, ఎనిమిదో కావచ్చు. అవేవీ కాకుండా సున్నా కూడా కావచ్చు. ఓట్ల శాతాల్లోని వ్యత్యాసాలకు పొందే సీట్ల హెచ్చుతగ్గులకు పొంతనలేని సందర్భాలెన్నో! ప్రజలు గమనిస్తున్నారని గ్రహించాలి రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని చిత్తు చేసి, తమను మెరుగుపరచుకునే ఎత్తులు, జిత్తులు ఎన్ని చేసినా ప్రజలు గమనిస్తున్నారనేది తప్పక గ్రహించాలి. ప్రజల్ని ఏ మాత్రం లెక్క చేయకుండా రాజకీయ వ్యూహాలు రచించి, ఇబ్బడి ముబ్బడిగా డబ్బు వెచ్చించి, విచ్చలవిడిగా వెదజల్లినంత మాత్రాన ఫలితాలు తమకే అనుకూలిస్తాయనుకోవడం భ్రమ. స్థూలంగా కూటమి నుంచి, ప్రత్యేకంగా ‘తెలంగాణ జన సమితి’ నుంచి బయటకు వెళ్తూ యువ న్యాయవాది, హక్కుల కార్యకర్త రచనారెడ్డి ఒక మాటన్నారు. ‘‘కూటమిలో మీరు మీ స్వార్థం, తగాదాలతో... ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఎంపిక చేసుకునేందుకు ‘ప్రత్యామ్నాయం’ అవకాశాన్నే లేకుండా చేసి తెలంగాణ సమాజాన్ని వంచించారు, ప్రజల్ని మోసపుచ్చారు’’ అన్నది ఆలోచించదగ్గ వ్యాఖ్యే! గత ఎన్నికలన్నీ గుణపాఠాలే! ఒకే ప్రత్యర్థి పార్టీల మధ్య కిందటి సారి ఎన్నికల్లో ఓట్ల వ్యత్యాసాలకు, తర్వాత మారిన మొగ్గుకు, తాజా పరిస్థితికి ఉండే లంకెని రాజకీయ వ్యూహకర్తలు పరిశీలించాలి. గత గణాంకాలను బట్టి ఇప్పుడేం పనిచేస్తుందో యోచించి అన్వయించాలి. కిందటి ఎన్నికల్లో విడిగా పోటీ చేసిన రెండు పార్టీలు ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేయగానే, అప్పట్లో వారికి లభించిన ఓట్ల శాతాల్ని ఇప్పుడు కలిపి లెక్కించలేం. ఒకే ఎన్నికలో కూడా, ఓట్ల శాతాలకు సీట్ల సంఖ్యకు ఉండే సంబద్ధత ఏకరీతిన ఉండాలని కూడా లేదు. 2014లో ఉమ్మడి ఏపీలో జరిగిన ఎన్నికలు తెలుగు రాష్ట్రాలకు విడివిడిగా వర్తిం చాయి. అవశేష ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాల్ని గతేడాది జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఆశ్చర్యకరమైన తేడాలున్నాయి. స్వల్ప వ్యత్యాసపు గెలుపోటములు ఒక రాజకీయ పార్టీకి ఎలా అనుకూలించాయో ఏపీ గణాంకాల విశ్లేషణ స్పష్టం చేస్తోంది. 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్లో బీజేపీకి 49.1% ఓట్లు (99 సీట్లు)రాగా కాంగ్రెస్‌కు 41.4 శాతం ఓట్లు(77 సీట్లు) లభించాయి. అంటే దాదాపు 8 శాతం (7.7 శాతం) ఓట్ల వ్యత్యాసమున్నపుడు సాధించిన సీట్లలో తేడా 22 మాత్రమే! కానీ, ఏపీకి వచ్చే సరికి పరిస్థితి భిన్నం! టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధించిన ఓట్ల వ్యత్యాసం 2 శాతం కన్నా తక్కువ. 175 స్థానాలున్న ఏపీలో టీడీపీకి 46.30 శాతం ఓట్లు (102 సీట్లు) రాగా వైఎస్సార్సీపీకి 44.47 శాతం ఓట్లు (67 సీట్లు) లభించాయి. అంటే 2 కన్నా తక్కువ (1.83 శాతం) ఓట్ల వ్యత్యాసమున్నా 35 సీట్లు తక్కువ లభించాయి. -దిలీప్‌రెడ్డి -
ఇంత దుర్మార్గం మీకే సాధ్యం
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నమే దారుణమంటే, సదరు భౌతిక దాడి కన్నా ఈ ‘సామూహిక ప్రచారం’ అత్యంత ప్రమాదకర ధోరణికి సంకేతాలిస్తోంది. ఇటు డీజీపీ మాట్లాడిన కొంత వ్యవధిలోనే అటు మంత్రుల బృందగానం ఎంత నోటికొస్తే అంత అన్నట్టే సాగింది. ఇక సాయంత్రం పొద్దుపోయిన తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు జుగుప్సాకరం! నిర్హేతుకమైన నిందలతో పాటు అర్థంపర్థం లేని ప్రశ్నలన్నీ సంధించారు. ఎవరికివారుగా పని చేయాల్సిన శాసన, కార్యనిర్వాహక, స్వతంత్ర మీడియా వ్యవస్థలు ఎంతలా కలగలిసి పోయాయో, అన్నింటినీ రాజకీయం చేయడం ఎంత యధేచ్ఛగా సాగుతోందో తేటతెల్లమైంది. విచారణకు పూర్వమే తీర్పి చ్చినట్టుంది ఆంధ్రప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆర్పీ ఠాకూర్ మాట తీరు. ఇక... ఆయన కింది అధికారులు జరిపే దర్యాప్తు, తేల్చే నిజాలు, కేసు ముగింపు ఎలా ఉంటుందో ఇప్పుడే ఊహించవచ్చు! విశాఖ విమా నాశ్రయంలో విపక్షనేత, వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగి గంటలు గడవక ముందే... ‘ఇది ప్రచారం కోసం చేసినట్టుంది’ అనడం, ‘ప్రాథమిక సమాచారాన్ని బట్టి నిందితుడు బాధితుడికి అభిమానిగా తెలుస్తోంద’నడం సాధారణ తెలివితేట లున్న వారికి కూడా విస్మయం కలిగించింది. బాధ్యతా రాహిత్యమే కాకుండా, రాజకీయ వ్యవస్థతో అంటకాగ డానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోంది. నిందితుని జేబులో ఓ ఉత్తరం ఉందని చెప్పీ, అయిదు గంటల జాప్యంతో వెలువరించి తదుపరి కథ నడిపే ఎత్తుగడకు ఆయన జీవం పోశారు. కత్తితో దాడి చేసి హత్యాయత్నా నికి తలపడిన వ్యక్తి, గాయపడిన జగన్మోహన్రెడ్డిని కలగలిపి ఫోటోలు సృష్టించి, స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పాలకపక్షీయులు జరిపిన విస్తృత ప్రచారం ‘గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడు ముకున్నట్టుంది’. అదేదో ఆంగ్ల సామెత చెప్పినట్టు, ‘దాడే ఉత్తమ రక్షణ’ అనే సూత్రాన్ని ఏలికలు అక్షరాలా పాటిస్తున్నారు. ఇందులో సీఎం కార్యాలయ సన్నిహిత వ్యవస్థ, మంత్రివర్గ సభ్యులు, ఇతర ముఖ్య నాయ కులు, అనుకూల మీడియా, చివరకు స్వతంత్రంగా దర్యాప్తు జరపాల్సిన పోలీసు బాసు.. అంతా ఒకే మాట, ఒకే బాట అన్నట్టు వ్యవహరించిన తీరు దారు ణం. కొన్ని గంటల వ్యవధిలోనే ఒకటికి తోడుగా మరొ కటి పుట్టుకొచ్చిన పరిణామాల్ని బట్టి ఇదెంత పథకం ప్రకారం జరుగుతోందో ఇట్టే బోధపడింది. హత్యాయ త్నమే దారుణమంటే, సదరు భౌతిక దాడి కన్నా ఈ ‘సామూహిక ప్రచారం’ అత్యంత ప్రమాదకర ధోరణికి సంకేతాలిస్తోంది. ఇటు డీజీపీ మాట్లాడిన కొంత వ్యవధి లోనే అటు మంత్రుల బృందగానం ఎంత నోటికొస్తే అంత అన్నట్టే సాగింది. ఇక సాయంత్రం పొద్దుపోయిన తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు జుగుప్సాకరం! నిర్హేతుకమైన నిందలతో పాటు అర్థంపర్థంలేని ప్రశ్న లన్నీ సంధించారు. ఎవరికివారుగా పని చేయాల్సిన శాసన, కార్యనిర్వాహక, స్వతంత్ర మీడియా వ్యవస్థలు ఎంతలా కలగలిసి పోయాయో, అన్నింటినీ రాజకీయం చేయడం ఎంత యధేచ్ఛగా సాగుతోందో తేట తెల్లమైంది. పౌర పోలీసు, ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసు, నేర పరిశోధన... వంటి విభాగాలన్నీ కలగాపులగమై రాజకీయ వ్యవస్థకు ఊడిగం చేస్తున్న తీరుకు ఇది పరాకాష్ట! ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకారి! నిలువెల్లా నిస్సిగ్గుతనం తుని రైల్వే దుర్ఘటన కడప జిల్లా రౌడీల పనే అని మొన్న, విశాఖ ఎజెన్సీలో ఎమ్మెల్యేని హతమార్చిన మావోల చర్య వెనుకా ప్రత్యర్థి పార్టీ ప్రమేయముందని నిన్న స్వయానా ముఖ్యమంత్రి పేర్కొన్నా దిక్కులేని పరిస్థితి! అది తప్పని నిర్దారణ అయినా... కనీసం క్షమాపణ కోరకపోవడం సీఎం తెంపరితనం! విపక్ష నేతపై దాడి వారికి వారే జరుపుకున్నారంటూ నేడు నిరాధార నింద మోపడానికైనా వెనుకాడని బాధ్యతా రాహిత్యం ముఖ్యమంత్రిది. దర్యాప్తుకు ముందే, అన్నీ తానే తేల్చి ఇక ఏ దర్యాప్తూ అక్కర్లేదన్న దబాయింపు ఆయనది. ‘సంఘటన ఎక్కడ జరిగింది? సీఐఎస్ఎఫ్ నియంత్రణలో కాదా, మాకేం సంబంధం...?’ అంటూ, ‘ఏయ్ నువ్ చెప్పవయ్యా!’అని విలేకరిని గద్దించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, అదే రన్‌వే అంతటా తన పోలీసు పటాలాన్ని దించి, ఎయిర్ క్రాఫ్ట్ వరకు మోహరించి, ఇదే జగన్మోహన్రెడ్డిని నిర్బంధిచడం ఎలా మరచిపోయారు? ఎంతటి పచ్చి అబద్దాన్నయినా అల వోకగా పలుకొచ్చు. సిగ్గు–బిడియం లేకుండా విస్తృ తంగా ప్రచారం చేయొచ్చు, అందుకనుకూలంగా పాలనా వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగ పరచవచ్చ న్నది ఇప్పుడు వారి ధీమా! జరిగిన దారుణాన్ని ఖండించి, పాలనాపరంగానో, నైతికంగానో బాధ్యత తీసుకోవాల్సింది పోయి, ఎదురుదాడులతో దుష్ప్ర చారానికి దిగుతున్న తీరు ఏహ్యంగా ఉంది. ‘ఆపరేషన్ గరుడ’ కూడా ఈ విశాల కుట్రలో భాగమే అనడానికి ఎన్నో ఆధారాలున్నాయి. తమ ప్రచార వ్యూహంలో బాగంగా పాత వీడియోలను ఇప్పుడు మళ్లీ తెరకెక్కిం చారు. ముఖ్యమంత్రితో సహా కీలకమైన, బాధ్యతాయు తమైన స్థానాల్లోని వారు ఎన్ని అబద్దాలు ఆడి అయినా తమ దాష్టికాల నుంచి తప్పుకోవచ్చు! వైఫల్యాల నుంచి వైదొలగొచ్చు! ‘తాన అంటే తందాన’ అనే అనుకూల మీడియా సహకారంతో వాటిని వేయినోళ్లతో ప్రచారం చేయాలంతే! ఇదే వ్యూహంతో రాజకీయ ప్రత్యర్థులపై బురదజల్లడం కూడా ఇప్పుడు వారికి రివాజయింది. దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రతిష్టను గంగలో కలిపిందీ ఈ ‘రాజకీయ కాలు ష్యమే!’ పొరుగు రాష్ట్రం ఒడిశాలో 17 జిల్లాల్లో తుఫాను ముందు జాగ్రత్త–సహాయక చర్యలు సజావుగా సాగితే, ఏపీలో పావుజిల్లాలోనూ ఎక్కడికక్కడ విఫలమయ్యారు. పట్టుమని రెండొందల గ్రామాల్లోనూ సహాయక చర్యల్ని ఓ కొలిక్కితీసుకు రాలేక ప్రభుత్వం ఘోరంగా విఫల మైంది. ప్రజలు నేటికీ అల్లాడే దుస్థితికి ఈ మితిమీరిన ‘అతి రాజకీయ’ జోక్యమే కారణమని తేటతెల్లమవు తోంది. అధికారుల్ని స్వేచ్ఛగా పనిచేసుకోనీయని అతి జోక్యం వారిదయితే, వారి కనుసన్నల్లో పనిచేస్తూ విధిని ర్వహణకు సంబంధించిన కనీస ‘ప్రోటోకాల్స్’ను మరిచి ఊడిగం చేయడం వీరి పంథా అయింది. ఏ ఎత్తుగడ వెనుక ఎవరున్నారో..! విమానాశ్రయంలో కత్తి దాడి ఏ విధంగా చూసినా భద్రతా వైఫల్యమే! అయితే, అది మాత్రమే ముఖ్యం కాదు. అంతకు మించి, ఈ దాడి వెనుక ఉద్దేశ్యమేమిటి? ఎందుకు జరిగింది? సదరు చర్య వెనుక ఎవరున్నారు? అన్నది చాలా ముఖ్యం. అది తగిన దర్యాప్తుతోనే తేలు తుంది. కానీ, ఆ దర్యాప్తునకు ఆస్కారాన్ని, సానుకూ లతను ముఖ్యమంత్రి స్వయానా పనిగట్టుకొని భగ్నం చేస్తున్నారు. ముందస్తు అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ భవిష్యత్ దర్యాప్తు ప్రక్రియనే దారి మళ్లించే కుట్రను వ్యూహాత్మకంగా చేపట్టారు. ఆయన, ఆయన మను షులు ముందుగానే ఎవరెవరికో ఉద్దేశ్యాలు ఆపాదిస్తు న్నారు. ఇంకెవరెవరినో తప్పించేందుకు యత్నిస్తున్నా యధేచ్చగా తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. దొంగ ఫోటోలు రూపొందిస్తు న్నారు. అంతకు ముందు నుంచే నిందితుడు శ్రీనివాస్, బాధితుడు జగన్మోహన్రెడ్డి కలిసి ఉన్నట్టు ఓ ఫోటోను ‘సాంకేతికత’తో సృష్టించి, స్వయంగా మంత్రులే విలేకరుల సమావేశంలో ప్రద ర్శించారు. అలాంటి సృష్టి ఎవరైనా చేయొచ్చు.... సదరు నిందితునితో చంద్రబాబు ఉన్నట్టు, ఆయన కుమారుడైన మంత్రి లోకేష్ ఉన్నట్టు కూడా సృష్టించడం ఎంత తేలికో సామాజిక మాధ్యమాల్లో నిమిషాల్లోనే ప్రత్యక్షమైంది! దాంతో, పాలకపక్షం నిందల వ్యాప్తి భాగోతం బట్టబ యలైంది. ఇలాంటి ప్రాణహాని లేని హత్యాయత్నం విపక్షనేతపై జరుగుతుందని ‘ఆపరేషన్ గరుడ’లో ఇదివరకే చెప్పారనే ఒక వీడియో క్లిప్పిం గును మళ్లీ ప్రచారంలోకి తెచ్చారు. ‘చూశారా! చెప్పినట్టే జరిగింద’నే వాదనను తెరకెక్కించారు. కానీ, సదరు ‘ఆపరేషన్ గరుడ’లో అంత కీలకమైన విషయాలు అప్పుడే వెలుగు చూస్తే, ప్రభుత్వం ఏం చేసింది? నిజమని భావిస్తే ఆ ‘డ్రామా’ను ముందే ఎండగట్టి ఎందుకు చర్యలు తీసుకోలేదు? తప్పని భావిస్తే, అటువంటి ప్రచారాలకు పాల్పడుతున్న వ్యక్తిపై చట్టపరంగా చర్య తీసుకోకుండా ఎందుకు ఉపేక్షించి చోద్యం చూసింది? ఇది పాలకపక్షం కనుసన్నల్లో జరుగుతున్న విస్తృత కుట్రలో భాగంగా భావించాలా? విమానాశ్రయంలో కత్తి దాడి కూడా ఇందులో భాగ మేనా? దాడి విజయవంతమైతే తామాశించిన భౌతిక నిర్మూలన లక్ష్యం నెరవేరుతుంది. రాజకీయంగా తమ కిక ఎదురుండదు. ఏ పరిస్థితుల్లోనయినా దాడి విఫల మైతే.... ‘అదుగో ఆపరేషన్ గరుడలో మేం ముందే చెప్పాం, ఇది వారికి వారు చేసుకున్న దాడి, మేమన్నట్టే జరిగింది’ అని దుష్ప్రచారం చేయొచ్చన్నది వారి ద్విముఖ వ్యూహమా? అదే నిజమైతే, ఇప్పుడిది తేలాలి. ఇది నిర్దారణ అయితే తప్ప, ‘ఆపరేషన్ గరుడ’కు ముఖ్యమంత్రిది డైరెక్షన్, శివాజీది ‘యాక్షన్’ అని జరుగుతున్న ప్రచారంలోని నిజానిజాలు తేలవు! నిన్నొక నీతి నేడొక రీతి! విమానాశ్రయంలో వ్యక్తుల, వీఐపీల భద్రతకు సంబం ధించి ఎవరి బాధ్యత ఎంత? అనే విషయంలో రాష్ట్ర– కేంద్ర పోలీసు బలగాలు పరస్పరం అవతలివారి వైపు వేలెత్తి చూపుతున్నారు. సాధారణ తనిఖీలు నిర్వహించి, ప్రయాణీకుల గుర్తింపును ఖరారు చేస్తాం, వ్యక్తిగత భద్రత మా బాధ్యత కాదని కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాల (సీఐఎసెఫ్) ఉన్నతాధికారులంటున్నారు. సదరు బలగాల నియంత్రణ, అంటే ఏకంగా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చెబుతున్నారు. ‘మాకేం సంబంధం..?’ అని దబాయి స్తున్న ముఖ్యమంత్రి, ప్రత్యేక హోదా నిరసన కార్యక్ర మంలో పాల్గొనడానికి హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చిన విపక్షనేతను లోగడ రాష్ట్ర పోలీసులతో అడ్డగించి నపుడేం జరిగిందో మరచిపోయినట్టున్నారు. నగరపో లీసు కమిషనర్‌తో సహా రాష్ట్ర పోలీసు సిబ్బంది విమానాశ్రయం రన్‌వే వరకు మోహరించి, విపక్ష నేతను నిర్భందించారు. విమానాశ్రయం బయటకు రానీకుండా అడ్డగించి, అక్కడ్నుంచే విమానంలో హైద రాబాద్ తిరిగి పంపించారు. అదంతా మరచిపోయి, ఇప్పుడు, మారిన రాజకీయ సమీకరణాల్లో ఫక్తు రాజ కీయంగా మాట్లాడటం ముఖ్యమంత్రి నైజాన్నే వెల్లడి చేస్తోంది. జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నాన్ని చిన్నది చేసి చూపే కుట్రకు పూనుకున్న ఓ వర్గ మీడియా పక్కన పెద్దగీత గీస్తూ తిమ్మరుసు నీతికి దిగింది. రాష్ట్ర ప్రభు త్వాన్ని అస్థిరపరిచే యత్నం జరుగుతోందని నెత్తీనోరూ మొత్తుకుంటూ పాలకపక్షంతో స్వరం కలిపింది. గంపెడు బాధను గుండెలోనే దిగమింగి కూడా వైఎస్సా ర్సీపీ శ్రేణులు, అభిమానులు సంయమనం పాటిం చారు. ఇంత జరిగినా.... ఎదుటివారి కుట్ర సామాన్యు లకూ తెలిసి రావాలనో! తమ నేత పిలుపునకు వారి చ్చిన గౌరవమో! ఎక్కడా ఒక అవాంఛనీయ ఘటనా చొటు చేసుకోలేదు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిని, నలభై ఏళ్ల రాజకీయం అని జబ్బలు చరుచుకోవడం కాకుండా హైకోర్టు న్యాయమూర్తితోనో, తటస్థ దర్యాప్తు సంస్థతోనో ఈ కేసు విచారణ జరిపించి నిజాయితీని నిరూపించుకోవాలి. తాను మోపిన నిందల్ని నిరూ పించాలి. అది జరిగితే సరేసరి! జరక్కపోయినా.... ప్రజాకవి కాళోజీ నారాయణ రావు అన్నట్టు ‘కాలమ్ము రాగానే కాటేసి తీరాలి....’ అని ఏపీ రాష్ట్ర ప్రజలు కాచు కొని ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త! దిలీప్ రెడ్డి, ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
కడలి గర్భంలో కల్లోలాలున్నాయి
ఇప్పటివరకు వెలుగు చూస్తున్నది తీరంలో అలల అలికిడి మాత్రమే! గంభీరమైన కల్లోలాలు, తుఫానులు కడలి మధ్యలో ఉంటున్నాయి. నగరప్రాంతాల్లో చేతనాపరుల ‘నేను కూడా...’ ఉద్యమాన్నే చూస్తున్నాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో... డబ్బు, అధికారం, హోదా, ఆధిపత్యం కింద లైంగిక హింసతో నలుగుతున్న జీవితాలెన్నో లెక్కే లేదు. ఆర్థిక, సామాజిక పరిస్థితులు వారి చుట్టూ ఓ ముళ్ల కంపల్ని అల్లుతుంటాయి. లైంగిక దాష్టీకం తెలిసి జరుగుతున్నా బయటపడలేని అశక్తత! దశాబ్దాల కిందటి కారంచేడు కన్నీటి గాథల నుంచి... నిన్నా ఇవాల్టి ‘కాల్‌మనీ’ కావరం వరకు లైంగిక వేధింపు పర్వం గ్రామీణ జీవితంలో ఓ మౌన రోదన! కడతీరని వేదన!! పశ్చిమాద్రి నుంచి ఏడాది కింద వెలుగు రేఖలు విచ్చు కున్న తర్వాత కొత్త వెలు తురు అంతటా పరచుకుంటోంది. అమెరికాలో మొద లైన చిన్న కదలిక పెద్ద ఉద్యమమౌతోంది. శతాబ్దా లుగా అలుముకున్న వేదన పెల్లుబికి మౌనాన్ని ఛేది స్తు్తన్న క్రమంలోనే స్వరాలు పెగులుతున్నాయి. లోలోన రగిలే రోదనతో ఇన్నాళ్లూ మూగవోయిన గొంతులు ఒకటొకటిగా విచ్ఛుకుంటున్నాయి. బెరుకు, బిడియం, పరువు, ప్రతిష్ట వంటి పొరలూ, ముసుగులూ తొలగిపోతున్నాయి. ఎప్పుడో జరిగిన దాష్టీకాల తాజా‘వెల్లడి’తో ఇప్పుడు ఎక్కడెక్కడో డొంకలు కదులుతున్నాయి. అవతలి వాళ్ల బలహీనత వల్ల ఇన్నాళ్లు లభించిన రక్షణ కవచాలు కరుగుతు న్నాయి. ‘నేను కూడా...’ (మీ టూ) అంటూ గొంతు విప్పే ఉద్యమం దేశంలో బలోపేతమౌతోంది. ఈ వెలుతురు చినుకులతో... లైంగిక హింసను దాచిన చీకటి కడుక్కుపోతోంది. సినిమా, టీవీ, క్రీడా రంగాలు దాటి మీడియా, రాజకీయ రంగాలకూ ఈ ‘వెల్లడి వెల్లువ’ విస్తరిస్తోంది. మరుగుపడిన మరు గుజ్జు మనస్తత్వాలను బట్టబయలు చేస్తోంది. పేరున్న పెద్ద ‘సెలబ్రటీలు’ కూడా ఒక్కసారిగా కురు చయిపోతున్నారు. ఏ వాదన వినిపించాలో దిక్కు తోచడం లేదు. ఇంకా కలుగుల్లో సురక్షితంగా ఉన్నామనుకునే వారిలో చిన్నపాటి అలజడి! ‘ఏమో... అది తమదాకా వస్తే...?’ ఓ భయం! ఎప్పుడో, ఏదో రూపంలో మహిళల పట్ల అనుచిత, అమర్యాద ప్రవర్తనో, జరిపిన లైంగిక హింసో జ్ఞాప కానికి వస్తే చాలు... గగుర్పాటే! గత వారం రోజు లుగా చర్చనీయాంశమౌతున్న ఈ వెల్లడి వెల్లువలో, ఇప్పటిదాకా బయటపడింది, నిజానికి పిసరంతే! ఇంకా వెలుగుచూడని దాష్టీకాలకు లెక్కే లేదు! ఇదంతా నగరాలకు పరిమితమై బయటపడుతున్న కొన్ని ఘటనల ఛాయ మాత్రమే! ఇక గ్రామీణ– పట్టణ ప్రాంతాల్లో నిత్యం జరుగుతూ వెలుగుచూ డని లైంగిక వేధింపు దురాగతాలెన్నెన్నో! ఉద్యమ లక్ష్యానికి రెండు పార్శ్వాలు పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులనేవి ప్రధానంగా మనిషి తత్వం, నైతికత, ప్రవర్తనకు సంబంధించిన అంశాలు. ఇది అవసరాలు–అవకాశాల నడిమి సంబంధం ఆధారంగా సాగే ఎలుక–పిల్లి చెలగాటం వంటిది. కేవలం వేధింపుల వద్ద ఆగదు. ఆ దశ దాటి లైంగిక హింస, లైంగిక దోపిడీ, లైంగిక అరాచకత్వం వంటి తీవ్ర స్థితికి చేరిన ఉదంతాలెన్నో ఉన్నాయి. మనిషి నైజం, పరిసరాలే కాకుండా ఆర్థిక, రాజకీయ, సామాజికాంశాలూ ఈ దుస్థితిని ప్రభావితం చేస్తు న్నాయి. లైంగిక హింస ఎదుర్కొన్న తర్వాత కూడా గొంతు పెగలని ఇన్నాళ్ల మౌనానికి కారణాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు! ఆర్థిక అంతరాల మధ్య, హోదాల హెచ్చుతగ్గుల నడుమ, వ్యవస్థీకృత పురుషాధిక్యత ముందు... మాట్లాడటం కంటే, మౌనంగా భరించడమే అనివార్యమైన పరిస్థితి అత్య ధిక బాధితులకుంటుంది. కానీ, మౌనం వీడి నిజాలు ఇప్పుడు వెల్లడించడాన్ని కొన్ని గొంతులు ప్రశ్నిస్తు న్నాయి. ‘అదేదో జరిగితే... ఇన్నాళ్లేం చేశార’నో! ‘అప్పుడే చెప్పి ఉండాల్సింద’నో! వాదన తెరపైకి తెస్తున్నారు. జరిగిన తప్పిదాలు, ఆలస్యంగా వెల్లడించినంత మాత్రాన తప్పులు కాకుండా పోతాయా? అన్నది నైతిక ప్రశ్న. పాత గాయాలకు నేడు సాక్ష్యాధారాలూ ఉండకపోవచ్చు, ఉండొచ్చు! ఉన్న చోట చట్టప్రకారం శిక్ష ఎలాగూ తప్పదు. లేని చోట నేరం నిరూపణ కాకపోవచ్చు! కానీ, ఒక సాధికారిక విచారణకైనా ప్రాతిపదిక ఏర్పడుతుం దనేది ఉద్యమకారుల వాదన. చట్ట ప్రకారం శిక్ష పడకపోయినా, సాటి సమాజం దృష్టిలో పడే శిక్ష తక్కువేం కాదు. ఈ కారణంగానే ఉద్యమానికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఫలితం, ధైర్యంగా గొంతులు పెగులుతున్నాయి. తప్పు చేసిన వారే దర్జాగా బతుకుతుంటే, బాధితులయిన వారెందుకు మౌనంగా ఉండాలి? ఎందుకు న్యూనతతో బతకాలి? ఎందుకు బయటపెట్టి నిలదీయొద్దు? అనే హేతుబద్ద వాదన బలపడుతోంది. అందుకే ఈ ‘నేను కూడా...’ ఉద్యమ స్వరం ఊపందుకుంది! ఇంకా గొంతులు పెగలాలి. పుట్ట పగిలి చీమల బారులు పెల్లుబి కినట్టు... అట్టడుగు పొరల్లోని లైంగిక దాష్టీకాలన్ని టినీ వెలుగులోకి తేవాలనే అభిలాష అంతటా వ్యక్తమౌతోంది. పరిస్థితుల్ని ఆసరా చేసుకొని లైంగిక హింసకు పాల్పడ్డవారికి ఆలస్యంగానైనా శిక్షలు పడటం ఒక ప్రయోజనం. వారు సామాజిక పరాభ వానికి గురి కావడం మరో లబ్ది! ఉద్యమ ఫలితంగా భవిష్యత్తులో ఎవరూ పని ప్రదేశాల్లో లైంగిక హింస, దోపిడీకి సాహసించరనేది ఒక ఆశ! అవతలి వారి అవసరాల్ని తమ అవకాశంగా మలచుకుంటూ లైంగి కంగా హింస పెట్టరనేది ఓ ఆకాంక్ష! అదే సమయంలో కక్ష సాధింపులు, పనిగట్టు కొని ఇతరుల పరువునష్టం కలిగించడం వంటి లక్ష్యా లతో ‘నేను కూడా...’ అనడం తప్పు! నిర్హేతుక వాద నలు నిలువవు. ఏదో ఇతరుల్ని ఇరికించే దురాశా యత్నాలు ఉద్యమాన్ని బలహీన పరుస్తాయి. నిజమైన బాధితులకు లభించే నైతిక మద్దతూ కరువయ్యే ప్రమాదముంటుంది. అధికారం, హోదా, సంపదను అడ్డుపెట్టుకొని మగవారి పట్ల జరిపే లైంగిక వేధిం పులు వెలుగు చూసినపుడూ ఇంతటి సహృదయత, మద్దతు ఉండాలని కొందరు వాదిస్తున్నారు. దివిటీలే వెలుగును కాటేస్తే...? పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల (నివా రణ, నిషేధం, సరిదిద్దడం) చట్టం–2013 లో ఎన్నో మార్గదర్శకాలున్నాయి. పని ప్రదేశాల్లో ప్రతికూల పరిస్థితుల్ని తప్పించే చర్యల్ని ఈ చట్టం నిర్దేశిస్తోంది. లైంగిక వేధింపుల్ని అరికట్టడానికి ప్రభుత్వాలు, ఆయా పరిశ్రమలు, కంపెనీలు ఏయే చర్యలు తీసు కోవాలో సుప్రీంకోర్టు 1997లో (విశాఖ మార్గదర్శ కాలు) సూచించిన అంశాల్నే ఈ చట్టంలో పొందుపరి చారు. ప్రతి సంస్థ అంతర్గతంగా ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ)ని ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఫిర్యాదుల్ని సదరు కమిటీ పరిశీలించి, పరిష్కరిం చాలి. మార్కెట్ గణాంకాల ప్రకారం దేశంలోని 50 అతి పెద్ద కంపెనీల్లో ఏయేటికాయేడు పెరుగుతున్న ఈ ఫిర్యాదుల సంఖ్యను బట్టి అవగాహన హెచ్చు తున్నట్టే! కానీ, ఇది ప్రధానంగా ఐటీ, ఆర్థిక సంస్థ ల్లోనే ఉన్నట్టు వెల్లడయింది. మొత్తం ఫిర్యాదుల్లో సగం నాలుగు సంస్థల్లోనే నమోదయ్యాయి. పబ్లిక్ రంగ సంస్థల్లో ఈ అవగాహన అంతంతే! బృహ న్ముంబాయి మున్సిపల్ కార్పొరేషన్ వంటి చోట తప్పితే ప్రభుత్వ విభాగాల్లోనూ ఫిర్యాదులు నామ మాత్రమే! నిఫ్టీ ఇండెక్స్‌లో చోటున్న తొమ్మిది పబ్లిక్ రంగ సంస్థల్లో ఈ ఆర్థిక సంవత్సరం, ఒక లైంగిక వేధింపు ఫిర్యాదు కూడా ఐసీసీల వద్ద నమోదు కాలేదంటే పరిస్థితి ఇట్టే అర్థమౌతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నతాధికారుల వేధింపులు సాగు తున్నా ఎప్పుడో గాని వెలుగు చూడవు. అక్కడంతా చాపకింద నీరల్లే జరిగిపోతుంది. ఆ పరిస్థితి మారాలి. చూపులతో, సూటిపోటి మాటలతో బజా రుల్లో, బస్టాండ్ల వద్ద వేధించే వారిని నియంత్రిం చడానికి మనకు ‘షీ టీమ్స్’ వ్యవస్థ ఉంది. కానీ, వివిధ అంచెలుగా ఉండే ఉద్యోగ వ్యవస్థలో పై అధికారుల ప్రత్యక్ష, పరోక్ష లైంగిక వేధింపులకు అడ్డు లేదు. వాటిని నియంత్రించేలా చట్టాలకు మరింత పదును పెట్టాల్సిన అవసరం ఉంది. పై అధికారులు, సహోద్యోగుల లైంగిక వేధింపులు చట్టానికి దొరక నంత అంతర్లీనంగా ఉండి, మహిళలకు ఒక రకమైన కంపర పరిస్థితి కలిగిస్తుంటాయి. మార్కులు, గ్రేడ్లు, తుది ఫలితాల మిషతో... విశ్వవిద్యాలయాల్లో రీసర్చి స్కాలర్లను లైంగికంగా వేధించే ప్రొఫెసర్లు, ఇతర సిబ్బందికి సంబంధించిన వార్తలు తరచూ వస్తుం టాయి. వైద్య, ఇంజనీరింగ్, నర్సింగ్ వంటి వృత్తి విద్యాసంస్థల్లోనూ లైంగిక వేధింపులున్నాయి. ఇటీ వల ఇద్దరు వైద్య విద్యార్థినులు అనుమానాస్పద పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడటం తెలిసిందే! కేంద్ర మంత్రిగా ఉన్న ఎమ్.జె.అక్బర్ లాంటి సీని యర్ జర్నలిస్టు ఇప్పుడీ అంశంలో వార్తల్లోని వ్యక్తి అయ్యారు. తెలుగునాట మీడియా సంస్థల్లోనూ మహిళల పట్ల లైంగిక వేధింపులు, పోలీసు ఫిర్యా దులు, కోర్టు తలుపు తట్టడాలు తరచూ వార్తలకెక్కు తున్నాయి. శీర్ష స్థానంలో ఉన్న ముఖ్యులు కొందరి పైనా అభియోగాలున్నాయి. స్ఫూర్తితో నవతరం ఉద్యమించాలి ఇప్పటివరకు వెలుగు చూస్తున్నది తీరంలో అలల అలికిడి మాత్రమే! గంభీరమైన కల్లోలాలు, తుఫా నులు కడలి మధ్యలో ఉంటున్నాయి. నగరప్రాం తాల్లో చేతనాపరుల ‘నేను కూడా...’ ఉద్యమాన్నే చూస్తున్నాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో... డబ్బు, అధికారం, హోదా, ఆధిపత్యం కింద లైంగిక హింసతో నలుగుతున్న జీవితాలెన్నో లెక్కే లేదు. ఆర్థిక, సామాజిక పరిస్థితులు వారి చుట్టూ ఓ ముళ్ల కంపల్ని అల్లుతుంటాయి. లైంగిక దాష్టీకం తెలిసి జరుగుతున్నా బయటపడలేని అశక్తత! దశాబ్దాల కిందటి కారంచేడు కన్నీటి గాథల నుంచి... నిన్నా ఇవాల్టి ‘కాల్‌మనీ’ కావరం వరకు లైంగిక వేధింపు పర్వం గ్రామీణ జీవితంలో ఓ మౌన రోదన! దొరలు, జమిందార్లు, అప్పిచ్చిన వాళ్లు, కాంట్రాక్టర్లు, వావి వరుసలు మరచిన కుటుంబ సభ్యులు... ఇలా ఎవరెవరి నుంచో నిత్యం, పూట పూటా పొంచి ఉన్న ప్రమాద పరిస్థితితోనే వారి మనుగడ. ఉద్యోగాలకు, ఉపాధికి, రోజువారీ జరుగుబాటుకు ముడివెట్టి.... అచేతన స్థితి కల్పించి లైంగికంగా వాడుకునే ఆధి పత్య వర్గానికి గ్రామీణ ప్రాంతాల్లో అడ్డూ, అదుపూ ఉండదు. పేదలు, ఒంటరి మహిళలు, దినదిన గండంగానే బతకాల్సి వస్తుంది. నోరువిప్పితే జీవనో పాధి పోతుంది. బయటకు పొక్కితే... సమాజంలో ఎన్ని అవమానాలో? ఇంకెన్ని కష్టాలో! తాజా ఉద్య మాల ఉప్పందించి వారికి ఉపశమనం కలిగించాలి. ఈ తరం మహిళలు, యువతులు చేతన పొందాలి. ఏ చిన్న అఘాయిత్యమైనా, దురుద్దేశపు చర్య అయినా ప్రతిఘటించాలి. నిలదీసి గొంతెత్తాలి. ఏది మంచిగా తాకడం, ఏది చెడుగా తాకడం ప్రజ్ఞతో ఉండాలి. పిల్లలకు అవి నేర్పించాలి. చివరగా ఒక మాట! ఉద్యమమెప్పుడూ పలు సాధకబాధకాలతో ముడివడి ఉంటుంది. ప్రపంచ జనాభాలో చెరి సగమైన మగ–ఆడవారు ఒకటి గుర్తె రగాలి. ఆడవారి పట్ల మగవారి ఆలోచనలు రుజు వుగా ఉంటే, ఆడవాళ్లు ఈ విషయంలో ఉద్యమించా ల్సిన అవసరమే ఉండదు! ఈ దుస్థితిని తప్పించడం వారికెంత కర్తవ్యమో, వీరికి అంత బాధ్యత. దిలీప్ రెడ్డి, ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
భయం లేకే బరితెగింపు!
చట్టాల పట్ల నిర్భీతితో, సాటి మనిషిని వెంటాడి, నరికి చంపేందుకు ఉన్మాదులు తెగబడుతున్న తీరు ఆందోళనకరం. తీవ్ర నేరాలు చోటుచేసుకున్నపుడు, సదరు కేసుల విచారణ జరిపించి సత్వర న్యాయం అందేలా ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి. దాంతో ప్రజలకు విశ్వాసం, నేరస్తులకు భయం పెరుగుతాయి. జన సమక్షంలో హత్యలు చేసి, పోలీసుల వద్ద నిందితులు లొంగిపోయి, తగు సాక్ష్యాధారాలున్నపుడు... ఏ మాత్రం జాప్యం చేయకుండా వేగంగా విచారణ ముగించి, శిక్షలు పడేలా చూస్తే, సమా జంలో చట్టాలు–శిక్షల భయం నిలుస్తుంది. వ్యవస్థలన్నీ మనిషి ఉత్కృష్ట జీవనగతి కోసమే! మనిషి ప్రాణాల్ని కాపాడటం సదరు వ్యవస్థలన్నిటి ప్రాథమిక కర్తవ్యం. గత పదిహేనురోజుల్లో పట్టపగలు నడిరొడ్డున జరి గిన హత్యలు, హత్యాయ త్నాలు సగటు మనిషిలో భయం పుట్టిస్తున్నాయి. ఎంచుకున్న వారిని జనం చూస్తుండగానే వెంటాడి హతమార్చిన తీరు, అçక్కడ నెలకొన్న భీతావహ వాతావరణం, తర్వాత జరుగుతున్న చర్చ... ఇదంతా ఒక ‘న్యూస్‌రీల్’లా కళ్ల ముందు తిరుగు తోంది. నాగరిక సమాజంగా మనం ఎటు పయని స్తున్నాం? అనే ఊహ గగుర్పాటు కలిగిస్తోంది. ‘అంతటా, రోజూ ఇవే జరుగుతున్నాయా? ఏదో ఒకటీ, అరా ఘటనలకు ఇంతలా కంగారు పడాలా?’ అనొచ్చు సగటు మేధావులెవరైనా! కానీ, అవి జరి గిన తీరు, అందుకు దారితీసిన కారణాలు, రాగల పరిణామాల్ని లోతుగా విశ్లేషిస్తే, అలా తీసిపారేయ డానికి వీళ్లేదు అనిపిస్తోంది. చట్టం–న్యాయ ప్రక్రియ, పోలీసు వ్యవస్థ, మీడియా, సామాజిక పరిస్థితులు, మానవ సంబంధాలు... ఇలా అన్నీ ఇపుడు చర్చకు వస్తున్నాయి. ఆయా ఘటనల ముందు, వెనక పరి స్థితులెలా ఉన్నా, రెండంశాలు మాత్రం తీవ్రంగా కలత రేపుతున్నాయి. చట్టాల పట్ల నిర్భీతితో, జనం చూస్తుండగానే సాటి మనిషిని వెంటాడి, నరికి చంపేందుకు ఉన్మాదులు తెగబడుతున్న తీరు ఆందో ళనకరం. అదే సమయంలో... జనం అచేతన, నిష్క్రి యత్వం, తమకేమీ పట్టనట్టు సాఫీగా సాగిపోతున్న తీరు మరింత గగుర్పాటు కలిగిస్తోంది. సామాజిక మాధ్యమాలు వంటి ‘కృత్రిమ ప్రపంచం’ (వర్చువల్ వల్డ్)లో ఉన్నంత క్రియాశీలంగా జనం వాస్తవిక ప్రపంచంలో ఉండట్లేదు. ఈ పరిస్థితులిలాగే ఉంటే, ఇంకెన్ని ఘాతుకాల్ని చూడాల్సి వస్తుందోననే భయం పలువురిని కలవరపెడుతోంది. ఈ ఘోరాల వెనుక భూవివాదాలు, వివాహేతర సంబంధాలు, పరువు భావనలు, కులాంతర ధ్వేషాగ్నులు, పగ–కక్ష సాధిం పులు ప్రధాన కారణాలవటం వికటిస్తున్న సామాజిక పరిస్థితులకు అద్దం పడుతోంది. ఇవన్నీ తమకేమీ సంబంధంలేని వ్యవహారాలన్నట్టు పాలకులు స్పంద నారహితంగా ఉండటం మరింత ఆశ్చర్యకరం. ఏ విరుగుడు చర్యలూ తీసుకోకుండా ఈ పరిస్థితుల్ని ఇలాగే కొనసాగనిస్తే, అవింకా ఎటు దారితీస్తాయో అంతుబట్టని అయోమయం! నిరంతరం తలపై వేలాడే కత్తిలా చట్టమంటే ఓ ‘భయం’ నెలకొల్పడం ద్వారానే నేరాల్ని నియంత్రించగలమనే సంప్రదాయ భావన తరచూ గుర్తుకొస్తోంది. ఆ భయం సడలు తోంది. అందుకు, అనేకాంశాలు కారణమవుతు న్నాయి. మారిన ప్రభుత్వాల ప్రాధాన్యతలు, వ్యవ స్థాగత లోపాలు, సన్నగిల్లిన సామాజిక విలువలు, పలుచనైన మానవ సంబంధాలు, ప్రపంచీకరణ తాలూకు ఆర్థిక అసమానతలు... ఇలా ఎన్నెన్నో అంశాలు పరిస్థితుల్ని అక్కడికి తోస్తున్నాయి. ఎవరూ దీన్ని గట్టిగా పట్టించుకోక మనుషుల భద్రత గాల్లో దీపమయితే ఎలా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇంత నిర్భీతి ప్రమాదకరం! చట్టం, న్యాయ వ్యవస్థ, శిక్షలంటే ఇంతటి భయంలేని తనం ప్రమాద సంకేతమని సామాజికవేత్తలంటు న్నారు. మొన్న మిర్యాలగూడ, నిన్న ఎర్రగడ్డ, నేడు అత్తాపూర్‌లో జరిగిన çఘటనలు మనకదే భావన కలి గించాయి. ఇవి కాకుండా ఇలాంటి హత్యలు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. ఇది పరిమితంగా అక్క డక్కడ పొడచూపుతున్నదే అనుకున్నా... ఈ సంకే తాలు సమాజానికంత శ్రేయస్కరం కాదనేది ఆందో ళన.. పట్టపగలు, జనం మధ్య మారణాయుధాలతో తలపడి మనుషుల్ని తెగనరకడం అన్నదో ఉన్మాద చర్య! ఇందుకు కారణాలు చాలానే ఉండొచ్చు. తర్వాత తామెదుర్కోబోయే ఇబ్బందుల కన్నా లక్ష్యంగా ఎంచుకున్న వ్యక్తిని మట్టుపెట్టడమే ప్రధాన మనే ఉన్మాదపు భావనతోనో, మద్యం సేవించిన మత్తులోనో కొందరు ఇలాంటి దాష్టీకాలకు పాల్పడ వచ్చని మానసిక విశ్లేషకులు చెబుతున్నారు. ఏం చేసయినా తర్వాతి పరిస్థితిని తామెదుర్కొనగలమనే మొండి ధీమా కూడా ఇలాంటి చర్యలకు వారిని పురిగొల్పే ఆస్కారముందని సామాజిక శాస్త్రవేత్తలం టున్నారు. నేర–న్యాయ ప్రక్రయలోని లోపాలే ఈ నిర్భీతికి ముఖ్య కారణమని నిపుణుల విశ్లేషణ. నేర దర్యాప్తు, సాక్ష్యాల పరీక్ష, న్యాయ విచారణ–అప్పీలు తదితర ప్రక్రియల్ని ఏ దశలోనయినా ప్రభావితం చేయగలలమనే ధీమాయే ఇటువంటి తెగింపులకు కారణమౌతోంది. ప్రక్రియలో జాప్యం, సాక్ష్యాల్ని తారుమారు చేయడం, సాక్షులు మాట మార్చేలా చూడ్డం, అప్పీలుతో శిక్షల అమలు వాయిదా వేయిం చుకోవడం.... ఇలా ఎన్నో మాయోపాయాలతో నేర స్తులు తప్పించుకుంటున్నారు. మహా అంటే రెండు, మూడు నెలలు జైళ్లో ఉంటాం, తర్వాత బెయిలో, అప్పీలో.. బయటకొచ్చేస్తామనే ధైర్యం కూడా వారినీ దుశ్చర్యలకు పురిగొల్పుతోంది. దర్యాప్తు–విచార ణల్లో అసాధారణ జాప్యాలు, అతి తక్కువ (సగటు 27 శాతం) కేసుల్లోనే శిక్షలు పడుతున్న తీరు, శిక్ష ఖరారయ్యాక కూడా దాని అమలు వాయిదాతో అప్పీళ్లు దశాబ్దాలపాటు సాగేలా చూసుకోవడం ఇందుకు నిదర్శనం. ఇటువంటి దురాగతాలకు రాజ కీయ నాయకులు, పలుకుబడి గలిగిన వారు వత్తాసుగా నిలవడం పరిస్థితిని ఇంకా దిగజా రుస్తోంది. సంబంధాలు తెగిన సమాజం మనుష్యుల మధ్య సంబంధాలు సన్నగిల్లాయి. నగర, పట్టణ ప్రాంతాల్లో ఒకరికొకరు సంబంధం లేకుండానే బతికేస్తున్నారు. పక్కింట్లో ఏం జరుగు తోందో ఈ ఇంటివాళ్లకు తెలియదు. రోడ్డు మీద కత్తిపోటుకు గురైన మనిషి రక్తపు మడుగులో గిలగిల్లాడుతుంటే... ఓ చూపు చూసి, నిట్టూర్చి తమ మానాన తాము సాగిపోవడం రివాజయింది. కళ్లె దుట ఒకర్ని మరొకరు పొడుస్తున్నా చోద్యం చూస్తు న్నారు. పని ఒత్తిడి లేకుంటే కాసేపు నిలబడి సెల్ ఫోన్లో ఫోటోనో, వీడియోనో తీసి సామాజిక మాధ్య మాల్లో పోస్టింగ్ పెట్టడం మామూలయింది. తెగించ యినా ప్రాణాలు నిలబెట్టడం మనిషి ప్రధాన కర్తవ్య మనే భావన తగ్గుతోంది. రిస్కు తీసుకోవడానికి సిద్దపడట్లేదు. ‘దాడి నాపై కాదు కదా! నాకెందుకు... అడ్డుకున్నందుకు దుండగులు నాపై కక్ష కడితేనో! సాక్షమివ్వడానికి పోలీస్‌స్టేషన్ చుట్టో, కోర్టు చుట్టో తిరగాల్సి వస్తేనో..! ఇలాంటి శంక, మీమాంస ఎక్కు వయింది. ఎర్రగడ్డ ఘటనలో సాహసించిన ఓ యువ కుడు వెనకనుంచి పటేల్మని తన్నడంతో నిందితుడు పడిపోయినందువల్ల, ఒక పోటు తగ్గి మాధవి ప్రాణా లతో బతికి బట్టకట్టింది. కనీసం ఆ జోక్యం లేకుంటే! ఏమయ్యేదో! అత్తాపూర్‌లో ఒక వ్యక్తి నిందితుడ్ని వెనకనుంచి పట్టుకొని నిరోధించడానికి యత్నిం చినా.. తానొక్కడవడం వల్లేమో అది సాధ్యపడ లేదు. విదిల్చుకున్న నిందితుడు వరుస పోట్లతో, లక్ష్యం చేసుకున్న వ్యక్తిని అక్కడికక్కడే హతమా ర్చాడు. దుండగుడి చేతిలో ఉన్నది గన్ వంటి ప్రమా దకర మారణాయుధం కాదు, గొడ్డలే అయినందున అక్కడున్నవారిలో ఓ నలుగురయిదుగురు పరస్పరం కనుసైగ చేసుకొని ఒక్కసారిగా నిందితులపై లంఘించి ఉంటే, పరిస్థితి ఎలా ఉండేదో? అనే భావన అత్యధికులు వ్యక్తం చేశారు. ఇలా సాహసం చేసే వారికి తర్వాతయినా పోలీసులు రక్షణ కల్పిం చాలి. ప్రభుత్వం, పోలీసులు, మీడియా... తగు ప్రోత్సాహకాలివ్వడం, అవార్డులు–రివార్డులతో సత్కరించడం వంటివి చేయాలి. ‘కాదు, మా గుర్తింపు గోప్యంగా ఉంచండ’ని వారు కోరితే అదే చేయాలి. సదరు సాహసం ఇతరులకు స్ఫూర్తి అవు తుంది. నేరగాళ్లను అడ్డుకునేందుకు ఇంకెందరో సిద్ద మవుతారు. ఘటనా స్థలిలో సాటి మనుషులే అడ్డు కున్న సందర్భాలు పెరిగితే దుండగుల మొండి సాహ సాలు, హంతక చర్యలు తగ్గుతాయి. మీడియాకూ బాధ్యత ప్రసారమాధ్యమాలు సంయమనం పాటించాలని, బాధ్యతతో వ్యవహరించాలని సామాజికవేత్తలంటు న్నారు. పట్టపగలు, వెంటాడి మనిషిని మనిషి చంపే దాష్టీకాలు జరిగినపుడు ప్రసారాల్లో విచక్షణ చూపా లనేది వారి అభిప్రాయం. వాటిని పదే పదే చూపి, ‘ఓస్! ఇంతేనా.... హత్య ఇంత తేలికా..? ఇంత సుల భంగా నేరస్థలి నుంచి జారుకోవచ్చా!’ అన్న భావ నలు బలపడనీకుండా ప్రసారాల్లో జాగ్రత్త వహిం చాలి. చిరు చొరవే అయినా.. సాహసించిన వారిని హీరోలుగా చూపాలి. వేగంగా దర్యాప్తు–విచారణ ముగించి, సత్వర న్యాయంతో శిక్షలు పడ్డపుడు మీడియా వాటికెక్కువ ప్రాచుర్యం కల్పించాలనేది నిపుణుల అభిప్రాయం. పౌరులెవరైనా.. తామే పాఠకులు, తామే రిపోర్టర్లయ్యే వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమ వేదికల్లోనూ విచ్చలవిడితనం పెరిగిపోతోంది. ధృవీకరణ లేని వార్తల వ్యాప్తిని ఇక్కడ నిలువరించాలి. శీఘ్ర విచారణలు నిరంతరం జరగాలి పోలీసుల నేర దర్యాప్తు ప్రక్రి యల్లో ఇటీవల ఎంతో శాస్త్రీయత వచ్చింది. సాధారణ వేలి ముద్రలకు తోడు డీఎన్యే వేలిముద్రల్ని సరిపోల్చడం, ఇతర ఫొరెన్సిక్ పరీక్షలు, సీసీ కెమెరాల ఫుటేజీ విశ్లేషణ, లై డిటెక్టర్ల వాడకం... ఇలా పలు పద్దతులతో నిందితుల్ని ఇట్టే పట్టేస్తున్నారు. దర్యాప్తు వేగంగా ఓ కొలిక్కి తెస్తు న్నారు. శాస్త్ర–సాంకేతిక సహకారం వల్ల వివిధ విభాగాల మధ్య సమన్వయం, దర్యాప్తుల్లో ఖచ్చి తత్వం పెరిగాయి. ఇదే పరిస్థితి న్యాయ విచా రణ–శిక్షల ఖరారులోనూ ఉంటే, నేరస్తుల మీద చట్ట ప్రభావం ఎంతో ఉంటుంది. శిక్ష భయంతో నేరం చేయడానికి జంకుతారు. నేర తీవ్రతను బట్టి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సత్వర న్యాయం కోసం ‘శీఘ్ర విచారణ న్యాయ స్థానాల్ని’ (ఫాస్ట్ ట్రాక్ కోర్ట్సు) ఏర్పాటు చేస్తున్నారు. నిర్భయ వంటి కేసుల్లో విచారణ వేగంగా జరిపి, తక్కువ సమయంలోనే శిక్షల్ని ఖరారు చేశారు. అలాంటి కొన్ని న్యాయ స్థానాలను శాశ్వత ప్రాతిపదికన నడపాలి. తీవ్ర నేరాలు చోటుచేసుకున్నపుడు, సదరు కేసుల విచా రణ అక్కడ జరిపించి సత్వర న్యాయం అందేలా ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి. దాంతో ప్రజలకు విశ్వాసం, నేరస్తులకు భయం పెరుగుతాయి. జన సమక్షంలో హత్యలు చేసి, పోలీసుల వద్ద నిందితులు లొంగిపోయి, తగు సాక్ష్యాధారాలున్నపుడు... ఏ మాత్రం జాప్యం చేయకుండా వేగంగా విచారణ ముగించాలి. సత్వరం శిక్షలు పడేలా చూస్తే, సమా జంలో చట్టాలు–శిక్షల భయం నిలుస్తుంది. తాను ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలన్నీ మనిషి ఉత్కృష్ట జీవనగతి కోసమే! మనిషి ప్రాణాల్ని కాపాడటం సదరు వ్యవస్థలన్నిటి ప్రాథమిక కర్తవ్యం. దిలీప్ రెడ్డి -
దిలీప్‌కు స్వర్ణం
గచ్చిబౌలి: జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో గచ్చిబౌలి స్టేడియానికి చెందిన క్రీడాకారులు దిలీప్, మహేశ్‌రెడ్డి, సీహెచ్ రాఘవి, రామకృష్ణ మెరుగైన ప్రదర్శనతో రాష్ట్రానికి పతకాలు అందించారు. గుంటూరులో జరిగిన సౌత్‌జోన్ జూనియర్ అథ్లెటిక్స్ టోర్నీ అండర్–14 బాలుర 100మీ. పరుగులో దిలీప్ స్వర్ణాన్ని గెలుచుకోగా... అండర్–18 బాలుర కేటగిరీ 2000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో మహేశ్‌రెడ్డి రజతాన్ని, అండర్–20 బాలుర 4–100 మీటర్ల రిలేలో రామకృష్ణారెడ్డి రన్నరప్‌గా నిలిచి వెండి పతకాన్ని అందుకున్నారు. అండర్–16 బాలికల 2000 మీ. పరుగులో రాఘవి రజతాన్ని సాధించింది. ఈ సందర్భంగా గచ్చిబౌలి స్టేడియం ఏఓ శ్రీనివాస్, కోచ్ శ్రీనివాసులు క్రీడాకారులను అభినందించారు. -
నిరసనను అణచేది నియంతలే!
పాలకపక్షాలు తప్పుడు హామీలిచ్చినపుడు, ఇచ్చిన హామీలు మరచినపుడు, మాయమాటలతో పబ్బం గడుపుకోజూసినపుడు... చేతనతో పౌరులు అది పసిగడుతున్నారు, ప్రశ్నించి నిలదీస్తున్నారు. ఓట్ల వేటలో.. పౌరుల్లో తప్పుడు భావనలు కల్పించి లబ్ది పొందేందుకు చేసే రాజకీయ సంకుచిత యత్నాల్ని ప్రజలు ఎత్తి చూపుతున్నారు. అధికారంలో ఉన్నవారికి ఇది కంటగింపుగా మారుతోంది. పౌరుల ప్రశ్నలకు, సందేహాలకు సమాధానమిచ్చుకోలేని ఇరకాటపు పరిస్థితుల్లో... ‘ఈ నిరసనలకు, నిలదీతకు ఆస్కారమే లేకుంటే బావుండుకదా!’ అనుకోవడం సహజం. అధికార వ్యవస్థను అరచేత పట్టుకొని నిరసన గొంతు నొక్కే అణచివేతకు పాల్పడుతున్నారు. ఇది దారుణం. ‘‘నీ వాదనను నేను తిరస్కరించవచ్చు గాక! కానీ, అది వినిపించే నీ హక్కును... నా ప్రాణాలు పణంగా పెట్టయినా కాపాడుతా’’ – వాల్తేర్ (ఫ్రాన్స్ రచయిత, తాత్వికుడు) దేశంలో సాగుతున్న ఓ ప్రమాదకర అణచివేత పరి స్థితికి సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్య అద్దం పట్టింది. ‘భిన్నాభిప్రాయం, నిరసనని వ్యక్తం చేయడం ప్రజా స్వామ్యంలో భాగం. అణచివేత సరికాదు. ఈ హక్కు ప్రజాస్వామ్యానికే సేఫ్టీ వాల్వ్లాంటిది, కాదని మీరు దాన్ని అణగదొక్కితే, ఏదో రోజు ప్రజాస్వామ్యం ఫ్రెషర్ కుక్కర్‌లా పేలిపోతుంది’ అని ప్రభుత్వ నిర్వాకంపై న్యాయస్థానం చేసిన ఈ వ్యాఖ్య ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. హింసకు కుట్ర పన్నారంటూ దేశ వ్యాప్తంగా పేరెన్నికగన్న అయిదు గురు పౌరహక్కుల నేతల్ని ఏకపక్షంగా అరెస్టు చేయడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. వారందరినీ గృహనిర్బంధానికే పరిమితం చేయాలని ఆదేశిస్తూ, వచ్చే బుధవారం లోపు ఈ కేసులో ప్రతివా దన తెలుపాలని ప్రభుత్వాల్ని నిర్దేశించింది. హక్కుల కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులను ఆందోళనకు గురిచేసిన ఇది దుందుడుకు చర్య అని సుప్రీంకోర్టుతో పాటు ఢిల్లీ హైకోర్టు, పుణె కోర్టు, జాతీయ మానవహక్కుల సంఘం, ఇతర ప్రజా సంఘాలు తప్పుబట్టాయి. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కొంత కాలంగా దేశంలో నెలకొన్న పరిస్థితుల్ని చెప్ప కనే చెబుతున్నాయి. కక్ష సాధిస్తారనే భయం లేకుండా పౌరులు తమ అభిప్రాయాల్ని, నిరసన చట్టపరిధిలో స్వేచ్ఛగా వ్యక్తం చేయగలగడం వల్లనే ప్రజాస్వామ్య పాలనకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగింది. ప్రపంచం లోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమని చెప్పుకునే మన దేశంలో ఆ హక్కును ప్రభుత్వాలు కాలరాయడం ఆందోళన కలిగిస్తోంది. సరిగ్గా ఈ తీర్పు వెలువడు తున్న సమయానికి, ఇక్కడ తెలుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రజా స్వామ్య నిరసనను సర్కారు కర్క శంగా అణచి వేసింది. ముఖ్యమంత్రి పాల్గొన్న ఓ సభలో దూరంగా నిలబడి, ప్లకార్డులు చూపుతూ తమకు న్యాయం చేయండని గొంతెత్తిన పలువురు ముస్లీం యువకుల్ని పోలీసులు నిర్బంధించారు. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియనీకుండా గోప్యంగా ఉంచి, మీడియా ఎండగట్టడంతో 24 గంటలకు అరెస్టు చూపించారు. విచిత్రంగా వారిపై దేశద్రోహం కేసులు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనూ నిరసనకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ప్రభు త్వాన్ని నిలదీస్తారనుకుంటే చాలు సభలు, సమా వేశాలకూ అనుమతి లభించదు. ముందస్తు అరె స్టులు, నిర్బంధకాండ. తర్వాత కక్షసాధింపులు ఇవన్నీ మామూలే! హక్కుల చేతనను అంగీకరించరా? సామాజిక మాధ్యమాల్లో చెడు పరివ్యాప్తం చేయొ ద్దని ప్రధాని నరేంద్ర మోదీ ఒక పిలుపునిచ్చారు. తన నియోజకవర్గ (వారణాసి) పార్టీ కార్యకర్తలను ద్దేశించి ప్రసంగిస్తూ ఈ మాటలన్నారు. ప్రేరణ ఏమై ఉంటుంది? నిజమే! అడ్డూ అదుపూ లేకుండా సామా జిక మాధ్యమాలు వేదికగా ఇటీవల ఏదేదో ప్రచారం లోకి వస్తోంది. దృవీకరణ లేకున్నా, విశ్వసనీయత కొరవడినా... సదరు సమాచారం రేపుతున్న దుమా రం ఇంతంత కాదు. ముఖ్యంగా మత, కుల, ప్రాంతీయ, సామాజిక వర్గ భావనలను రెచ్చగొట్టి పలు విపరిణామాలకు ఇది కారణమవుతున్న సంద ర్భాలెన్నో! వీటిని తప్పక నియంత్రించాల్సిందే! ‘ఫేస్బుక్’ ‘వాట్సాప్’ వంటి వేదికల్ని నిర్వహించే సంస్థలతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపు తోంది. చెడు, తప్పుడు సమాచారం సృష్టిస్తున్న మూలాల్ని పట్టుకునే ప్రయత్నం ముమ్మరంగా సాగుతోంది. అదే సమయంలో ఈ మాధ్యమాల వల్ల పౌరు లకు చాలా విషయాలు తెలిసి వస్తున్నాయి. తమ హక్కుల గురించిన స్పృహ, ప్రభుత్వాల బాధ్య తకు సంబంధించిన చైతన్యం పౌరుల్లో పెరుగు తోంది. పాలకపక్షాలు తప్పుడు హామీలిచ్చినపుడు, ఇచ్చిన హామీలు మరచినపుడు, మాయమాటలతో పబ్బం గడుపుకోజూసినపుడు... చేతనతో పౌరులది పసిగడు తున్నారు, ప్రశ్నించి నిలదీస్తున్నారు. ఓట్ల వేటలో.. పౌరుల్లో తప్పుడు భావనలు కల్పించి లబ్ది పొందేం దుకు చేసే రాజకీయ సంకుచిత యత్నాల్ని ప్రజలు ఎత్తి చూపుతున్నారు. అధికారంలో ఉన్నవారికి ఇది కంటకింపుగా మారుతోంది. పౌరుల ప్రశ్నలకు, సందేహాలకు సమాధానమిచ్చుకోలేని ఇరకాటపు పరిస్థితుల్లో...‘ఈ నిరసనలకు, నిలదీతకు ఆస్కారమే లేకుంటే బావుండుకదా!’ అనుకోవడం సహజం. అధికార వ్యవస్థను అరచేత పట్టుకొని నిరసన గొంతు నొక్కే అణచివేతకు పాల్పడుతున్నారు. తమ ఈ తప్పుడు పంథాను హేతుబద్దం చేసుకోవడానికి, నియంతృత్వపు పోకడల్ని కప్పిపుచ్చడానికి దేశభక్తి, జాతీయత వంటి భావనల ముసుగు తొడుగు తున్నారు. అభివృద్ధికి అడ్డుపడుతున్నారనో, ప్రత్యర్థి రాజకీయ పక్షాల ప్రోద్బలంతో సాగుతున్న కుట్ర అనో ప్రజా నిరసన గళాన్ని చిన్నబుచ్చే యత్నం చేస్తున్నారు. ఎవరిది టెర్రర్ చర్య? పాలకుల నిర్లక్ష్యం వల్ల కడుపు కాలిందనో, కొంప కూలిందనో, బతుకు చెడిందనో, భవిష్యత్తు అంధ కారమౌతోందనో... ఆక్రందనలు చేసే వారిని అనున యించకపోగా తీవ్రవాదులని ముద్ర వేస్తున్నారు. ఉగ్రవాదులని, దేశద్రోహులని, జాతి వ్యతిరేకులనీ, అర్బన్‌నక్సల్స్ అనీ... ఇలా కొత్త కొత్త పదజాలం వాడుతూ ప్రభుత్వాలు నిష్కర్షగా అణచివేతకు పాల్పడుతున్నాయి. ప్రభుత్వ ప్రాజెక్టుల్ని వ్యతిరేకిం చేవారు ‘టెర్రరిస్టులే’ అంటూ కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి రాధాకృష్ణన్ గత నెల్లో చెన్నైలో చేసిన ప్రకటన ఇటువంటిదే! తమిళనాడు తూటుకుడిలో వాయుకాలుష్యాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన తెలపుతున్న పౌరులపై నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపి 13 మందిని పొట్టనపెట్టుకోవడం కన్నా టెర్రరిస్టు చర్య ఏముంటుంది? పైగా, ప్రభుత్వ చర్యల్ని నిరసిస్తూ సాగిన స్టెరిలైట్ వ్యతిరేకపోరా టంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న కార్య కర్తలు, న్యాయవాదులు, వార్తా కథనాలిచ్చిన జర్నలి స్టుల్ని కూడా ప్రభుత్వం నిర్బంధించింది. ముంబయి –అహ్మదాబాద్ బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టు కోసం చేపట్టిన భూసేకరణను వ్యతి రేకిస్తున్న రైతులపై మహారాష్ట్ర ప్రభుత్వం దమన కాండ కొనసాగిస్తూనే ఉంది. అటవీచట్టాల సాక్షిగా తమ హక్కుల పరిరక్షణ కోసం ఒడిశాలోని నియమ్ గిరి గిరిజన తెగలు అక్కడి వేదాంత–బాక్సైట్ తవ్వకాల్ని వ్యతిరేకించాయి. ప్రజాస్వామ్యయుత మైన వారి పోరాట పటిమ, మొత్తం ప్రపంచానికే స్ఫూర్తినిస్తే, స్వయంగా కేంద్ర హోమ్‌మంత్రి, ‘నియ మ్గిరి సురక్షా సమితి’కి మావో యిస్టులతో సంబం ధాలు అంటగట్టారు. సర్దార్ సరో వర్ వంటి బారీ ప్రాజెక్టులు పర్యావరణానికి, స్థానిక గిరిజనుల మను గడకు ప్రమాదకరమని నర్మదా బచావో ఆందో ళన్(ఎన్బీయే) చేసిన పోరుపై సుదీర్ఘ కాలం సాగిన ప్రభుత్వ నిర్బంధ కాండ తెలిసిందే! తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పంథా! విభజనతో రెండుగా ఏర్పడ్డ తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లోనూ పౌర నిరసను çసర్కార్లు సహించే పరిస్థితుల్లేవు. అడుగడుగున అణచివేస్తు న్నారు. ముస్లీమ్ యువకుల్ని చెరబట్టి ముప్పతిప్పలు పెడుతున్న కర్నూలు తాజా ఘటన ఏపీ ప్రభుత్వ దాష్టీకాలకు మచ్చుతునక. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు రోడ్డెక్కినప్పుడు తమకు చాకిరీ తప్పించమని ఆశా వర్కర్లు గొంతెత్తినప్పుడు, సమస్యలు పరిష్కరించమని ఉపాధ్యాయ సంఘాలు శాంతి ర్యాలీ జరిపినప్పుడు, సీపీఎస్ రద్దు కోరి ఉద్యోగులు ఉద్యమించినప్పుడు... పోలీసులను మోహరించి ఏపీ సర్కారు ఈ నిరనలన్నింటినీ నిర్భీతిగా ఉక్కుపాదంతో అణచివేసింది. తెలంగాణలోనూ పరిస్థితి ఏమీ గొప్పగా లేదు. నిరసనలు తెలుపుకొనే వేదికగా ఇందిరాపార్కు వద్ద నున్న ధర్నాచౌక్‌ను ఎత్తేయించారు. సర్కారు ఏర్పడ్డ తొలినాళ్లలోనే, ‘ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక’ ఏర్పాటుకు జరిగిన యత్నాన్ని భగ్నం చేసి నాయ కులు, కార్యకర్తల్ని ఎక్కడికక్కడ ఇళ్లలోనే నిర్బంధించి ప్రభుత్వం దమనకాండకు తలపడింది. మల్లన్నసా గర్‌ను వ్యతిరేకించి నిరసన తెలిపిన వారికీ అదే గతి పట్టించింది. విద్యార్థి ఉద్యమాల్నీ ఎక్కడికక్కడ అణ చివేస్తోంది. మౌనం పంపే తప్పుడు సంకేతాలు కర్ణాటకకు చెందిన హేతువాది, రచయిత కె.ఎస్. భగవాన్ తనను చంపదలచుకున్నవారికి ఓ సవాల్ విసిరారు. ఒక తేదీ ఖరారు చేస్తే తాను బెంగళూరు లోని విధానసౌధ ముందుకు వస్తానని, ముఖ్య మంత్రి, పోలీసుల సమక్షంలో తనను చంపి హీరో లుగా కీర్తి పొందొచ్చన్నారు. సంపాదకురాలు గౌరీ లంకేష్ హత్యకేసు దర్యాప్తులో వెల్లడైన సమాచారం ప్రకారం భగవాన్ కూడా హంతకులు లక్ష్యంచేసు కున్న ‘బుద్దిజీవుల’ జాబితాలో ఉన్నారు. నరేంద్ర దబోల్కర్, గోవింద్ పన్సరే, ఎమ్మెమ్ కల్బుర్గి లను హతమార్చినవారే పథకం ప్రకారం గౌరీ లంకేష్నూ హత్య చేశారని వెల్లడవడం తెలిసిందే! సహనంతో నిరసనల్ని అనుమతించే ప్రజాస్వామ్య వాతావరణ మైనా, అసహనంతో సాగించే నియంతృత్వపు అణచి వేతయినా.... అధికారంలో శీర్షస్థానంలోని వారిచ్చే సంకేతాల్ని బట్టే ఉంటుంది. బీజేపీ నుంచి తృణమూల్ కాంగ్రెస్‌లోకి మారిన సీనియర్ సంపాదకుడు, రాజకీయవేత్త చందన్ మిత్రా చేసిన వ్యాఖ్యలు ఇక్కడ సందర్బోచితమనిపి స్తుంది. పథకం ప్రకారం సాగిన బుద్దిజీవుల హత్య లైనా, దేశంలో పలుచోట్ల ఉన్మాదపు అల్లరిమూకలు జరిపిన కొట్టిచంపడాలయినా మన సమాజంలో బలపడుతున్న ఛాందసవాదానికి, మితిమీరిన అస హనానికి పరాకాష్ట! సదరు హంత కులకు వత్తాసుగా కొన్ని హిందూ మత సంస్థలవారు, పాలకపక్ష ఎంపీలు, కేంద్ర మంత్రులు చేసిన వాఖ్యల్ని ఆయా ప్రభుత్వాలు ఉపేక్షించాయి. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీటిని గట్టిగా నియంత్రించి ఉండాల్సిందని రెండుసార్లు రాజ్యసభకు ప్రాతి నిధ్యం వహించిన చందన్ మిత్ర మరో సీనియర్ జర్నలిస్టు బర్కాదత్‌కు ఇచ్చిన ఇంటర్వూ్యలో చేసిన ఈ వ్యాఖ్యలు సగటు పౌరుల్లోనూ ఆలోచనలు రేపు తాయి. నిరసనను కర్కశంగా అణచి వేయడం అప్రజాస్వామికమన్న సుప్రీం వ్యాఖ్యలు పాలకులకు కర్తవ్య బోధ చేస్తాయి. దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
తనో రాజధర్మ దీపస్తంభం
భారత్ వైవిధ్య సామాజిక పరిస్థితుల నేపథ్యంలోనూ రాజకీయాలకు ఓ కొత్త నిర్వచనం చెప్పిన దార్శనికుడు అటల్ బిహారీ వాజ్‌పేయి. మూడుమార్లు దేశ ప్రధాని అయి, దేశంలో అత్యధిక కాలం ఆ పదవిలో ఉన్న కాంగ్రెసేతర ప్రధానిగా రికార్డులకెక్కారు. పార్టీలకు, సిద్ధాంతాలకతీతంగా విస్తృత జనావళి అభిమానం చూరగొన్న నేత అయ్యారు. ‘సరిపోని శిబిరంలో సరైన వ్యక్తి’ (ఎ రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీ) అన్న విమర్శే ఆయన పట్ల జనాదరణకు గీటురాయిగా నిలిచే పొగడ్తయింది! బాబ్రీ మసీదు కూల్చివేతను నిర్ద్వంద్వంగా ఖండించారు. గోద్రా నరమేధం ఆపే ‘రాజధర్మం’ లోపించిందన్నారు. సరిహద్దులు చెరిపే శాంతికపోతమయ్యారు. ‘‘హార్ నహీ మానూంగా... రార్ నహీ థానుంగా కాల్కే కపాల్ పర్ దిఖాతా మిఠాతాహూ, గీత్ నయా గాతాహు...’’ ‘‘ఓటమిని ఒప్పుకోను... పోరుకు వెనుకాడను కాలం నుదుట పాతను చెరిపి, కొత్తను లిఖిస్తా... సరికొత్త గీతాన్ని ఆలపిస్తా!’’ జీవిత పర్యంతం పలు సందర్భాల్లో పాత రాతల్ని చెరిపి కొత్త రాతలు లిఖించిన రాజనీతిజ్ఞుడు, భారత రత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆఖరి గీతం పాడారు. యావద్భారతం నిండైన అభిమా నంతో నివాళి అర్పించేలా సాగిందా గీతం! మృత్యు వును అంత తేలిగ్గా అంగీకరించని ఆయన, సుదీర్ఘ పోరు తర్వాత తుది శ్వాసతో విశ్రమించారు. సంఘ ర్షణ–సంయమనం, జాతీయత–కవితాత్మకత, అవ కాశాలు–సవాళ్ల మధ్య సాగిన 93 ఏళ్ల ఆయన జీవన గమనమే ఓ విలక్షణ గీతం! భారత్ వైవిధ్య సామా జిక పరిస్థితుల నేపథ్యంలోనూ రాజకీయాలకు ఓ కొత్త నిర్వచనం చెప్పిన దార్శనికుడు. మూడు మార్లు దేశ ప్రధాని అయి, దేశంలో అత్యధిక కాలం ఆ పదవిలో ఉన్న కాంగ్రెసేతర ప్రధానిగా రికార్డులకెక్కారు. పార్టీలకు, సిద్ధాంతాలకతీతంగా విస్తృత జనా వళి అభిమానం చూరగొన్న నేత అయ్యారు. ‘సరి పోని శిబిరంలో సరైన వ్యక్తి’ (ఎ రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీ) అన్న విమర్శే ఆయన పట్ల జనాదరణకు గీటురాయిగా నిలిచే పొగడ్తయింది! ప్రత్యర్థులూ ప్రశంసించే విశిష్ట వ్యక్తిత్వమాయనది. స్వాతంత్ర పోరు సాగిన తన చిన్నతనం నుంచే దేశభక్తి భావాలు, జాతీయతా దృక్పథం ఉన్న వాజ్‌పేయి క్రమంగా ఎదిగి భారత రాజకీయ యవనికపై తనదైన చెరగని ముద్రవేశారు. అధికారంలో కన్నా విపక్షంలోనే అధికకాలం ఉండి భవిష్యత్తరాలకు ఆదర్శ వంతమైన రాజకీయ బాట పరిచారు. ఉదాత్త వ్యక్తిత్వం, ఉన్నత వక్తృత్వంతో పలు రూపాల్లో భారత ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేశారు. విశ్వ పటంలో భారత్ స్థానాన్ని పదిలపరిచారు. ఆయన ఓ స్ఫూర్తి, ప్రేరణ యువకుడిగా శ్యామాప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ వంటి పెద్దల మెప్పు పొందిన అటల్జీ తర్వాత తానే ఎందరెందరికో స్ఫూర్తి అయ్యారు. విషయాల్ని సులభంగా గ్రహించే శక్తి, పనిపట్ల నిబద్దత, స్పష్టమైన అభివ్యక్తి తక్కువ కాలంలో ఆయనకు పేరు తెచ్చాయి. దానికి తోడు స్పష్టమైన, ప్రభావవంతమైన హిందీలో అనర్గళంగా మాట్లాడగలగటం అదనపు శక్తి అయింది. సభల్లో జరిపే ప్రసంగాల్లోనే కాకుండా నలుగురు చేరి ముచ్చటించుకునే చోట కూడా హాస్యస్పోరకంగా మాట్లా డటం, మధ్యలో కవితల్ని వినిపించడం ద్వారా పలు వుర్ని ఆకట్టుకోగలిగేవారు. ప్రతి మాటలో వాస్తవిక తను ప్రతిబింబించడం, శ్రోతల్లో నిజమనే భావన కలిగించడం ఆయన ప్రత్యేకత. భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసిన కొత్తలో ఒకసారి ఆయన మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డికి వచ్చారు. మున్సి పల్ మైదానంలో ఆయన సభ, ప్రసంగం ఉందని తెలిసి జోగిపేట పట్టణపు డిగ్రీ విద్యార్థులుగా యువ కులు కొందరం వెళ్లాం. ఆయన ప్రసంగానికి మేమే కాకుండా సామాన్యులూ మంత్రముగ్దులైనట్టు నిలబడిపోయారు. సభ ముగిసిందని నిర్వహకులు ప్రకటించే వరకు ఎవరూ తమ స్థానాల నుంచి కదల నంత నిశ్చేష్టులయ్యారు. ‘‘1952లో నేను తొలిసారి అటల్‌జీని కలిశాను. ఆయన అప్పుడు డా‘‘ శ్యామా ప్రసాద్ ముఖర్జీ రాజకీయ కార్యదర్శిగా ఉండేవారు.. రాజస్థాన్ కోట నుంచి వెళుతున్నారని తెలిసి, ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా నేను వెళ్లాను... యవ్వనపు ఆదర్శ భావాలు ఆయన పుణికి పుచ్చుకున్నారని నాకు సులభంగా అర్థమైంది. రాజకీయాల్లోకి ప్రవేశించినా, ఆయన చుట్టూ ఒక కవితాత్మక ఆకర్షణ నెలకొని ఉండేది. ఆయనలో ఏదో ఒక శక్తి జ్వలిస్తున్నట్టు, ఆ అంతర్జ్వాల ముఖంపై ప్రస్పుటంగా గోచరించేది, అప్పుడాయన వయసు 27 ఉండవచ్చు...’’ అని బీజేపీ సీనియర్ నాయకుడు లాల్‌క్రిష్ణ అడ్వాణీ తన ఆత్మకథ (నాదేశం, నా జీవితం)లో రాశారు. అప్పు డేర్పడ్డ తన తొలి అభిప్రాయమే అటల్‌జీపై చివరి అభిప్రాయమన్నారు. పార్టీలకు అతీతమైన విశాల దృక్పథం వాజ్‌పేయిది పార్టీల, సిద్దాంతాల మూసలో ఇరుక్కు పోయే హస్వ్ర దృష్టి కాదు. విషయాల్ని సమగ్రంగా పరిశీలించి భూత, వర్తమాన, భవిష్యత్ పరిణా మాల్ని పరిగణనలోకి తీసుకునే వాస్తవిక, విశాల దృక్పథం. అందుకే, ఆయన అత్యధికులకు నచ్చే వారు. జనతా ప్రభుత్వపు మురార్జీదేశాయ్ మంత్రి వర్గంలో విదేశీవ్యవహారాల మంత్రిగా తన కార్యాల యంలో ప్రవేశించినపుడు సిబ్బందిని ఒకింత విస్మ యానికి గురిచేశారు. ‘అంతకు మున్నొచ్చినపుడు గోడపై కనిపించిన చిత్రపటం ఇప్పుడు లేదేంట’ని అడిగి, ‘మీరొస్తున్నారని తీసేశామం’టే, అప్పటిక ప్పుడు దాన్ని తెప్పించి మరీ గోడకు పెట్టించారా యన. ఆ ఫోటో వేరెవరిదో కాదు, భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూది. రాజకీయంగా ఎన్ని అంశాల్లో విభేదించినా, పార్లమెంటు వేదికగా తానెన్ని పోరాటాలు చేసినా... రాజకీయాల్లో తనకు ఆదర్శం నెహ్రూ అని బహిరంగంగా చెప్పగలిగిన ధీరోదాత్తుడు అటల్జీ. ‘స్పష్టమైన భావాలు, నిక్కచ్చి అభివ్యక్తి, సమ్యక్దృష్టీ ఉన్న ఈ యువకుడికి ఎంతో భవిష్యత్తు ఉంది, ఏదో ఒక రోజు దేశానికి గొప్ప నేత అవుతాడ’ని అదే నెహ్రూతో ప్రశంసలు పొందారాయన. మానవహక్కుల విషయమై జెనీవా అంతర్జాతీయ న్యాయస్థానంలో దేశం తరపు వాదనలు వినిపించడానికి వెళుతున్న ప్రతినిధి బృందానికి అటల్‌జీనే నేతృత్వం వహించాలని నాటి ప్రధాని పి.వి. నర్సింహారావు కోరి పంపారు. బాబ్రీమసీద్ కూల్చారనే మకిలి అంటి, అంటరాని పార్టీగా ఉన్న బీజేపీతో ఇతర పార్టీల్ని భాగస్వాముల్ని చేసి జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) ఏర్పర చడం వాజ్‌పేయి వల్లే సాధ్యపడింది. ‘1996లో అట ల్‌జీ 13 రోజుల ప్రధానిగా ఉన్నపుడు స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిన పార్టీ వైఫల్యం నుంచి, 1998లో విజయవంతంగా అధికారం చేప ట్టడం వరకూ... ఆయన వ్యక్తిగత ఆదరణే ప్రధానాం శమైందని నేను నిస్సందేహంగా చెప్పగలను. ఈ ఆక ర్షణ పార్టీకున్న మద్దతు కంటే అధికమైంది, అతీత మైంది’ అని అడ్వాణీ స్వయంగా పేర్కొన్నారు. జర్నలిజంపై ఉదాత్త భావన దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని స్థాయిల జర్నలిస్టులకు వాజ్‌పేయి అంటే ఓ ప్రత్యేక గౌరవం, ఆరాధ్య భావం ఉండేది. సమాజ ఉన్నతికోసం జర్నలిస్టులు కూడా గురుతర బాధ్యత కలిగిన వృత్తిపని వారనేది ఆయన అభిప్రాయం. దేశంలో ఏ మూలకు వెళ్లినా అటల్జీ–జర్నలిస్టులది ఓ అవినాభావ బంధం! రాజకీయాలకు ముందు జర్నలిజంలోనూ వాజ్‌పేయి తనదైన ముద్ర వేశారు. 1948లో ‘పాంచజన్య’కు సంస్థాపక సంపాదకుడిగా పనిచేశారు. శక్తి వంతమైన ఆయన సంపాదకీయాలు చదివి ఉత్తేజితు లైన రాజకీయ నాయకులు దేశంలో ఎందరో! హిందీ మాసపత్రిక ‘రాష్ట్రధర్మ’కు, దినపత్రిక ‘స్వదేశ్’కు ఆయన సంపాదకుడిగా వ్యవహరించారు. 1996లో అటల్జీ విపక్షనేతగా ఉన్నపుడు ఒక అధ్యయన బృందంలో సభ్యుడిగా నేను ఆయన్ని తొలిసారి, వారి అధికార నివాసంలో కలిసినపుడు రెండు గొప్ప మాటలు చెప్పారు. ఇచ్చిన సమయం కన్నా కాస్త ఆల స్యంగా వెళ్లిన మా బృందాన్ని ఆహ్వానిస్తూ, ‘‘రండి... మీ ఆలస్యం వల్ల నేనీరోజు ‘క్వశ్చన్ అవర్’ అందుకోలేకపోతున్నా, పార్లమెంటు కార్యకలాపాల్లో ప్రజా సమస్యలకు సమాధానాలు వెతికే ఆ సమయమే అత్యంత కీలకమైంది’’ అన్నారు. తర్వాత మా వృత్తి గురించి చెబుతూ, ‘జర్నలిజం ఉద్యోగం కాదు, ఒక వృత్తి, వృత్తిని మించి ఉదాత్త కార్యం (మిషన్)’ అని స్ఫూర్తినిచ్చారు. తొలిసారి ప్రధానిగా ఉన్నపుడు హైదరాబాద్ వచ్చిన అటల్జీ, తనకు పూర్వ పరిచయమున్న ఓ జర్నలిస్టు ఇంటర్వ్యూ కోరితే 5 నిమిషాల సమయమిచ్చారు. ఓ ఆసక్తికర ప్రశ్నకు ముగ్దుడై, ‘మరో 5 నిమిషాలు పొడిగించాను పో!’ అని పగలబడి నవ్వారు. సంస్కరణ రథం, శాంతి కపోతం ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినపుడు (1998–99) దేశంలో 5.8 ఆర్థిక వృద్ధి రేటు సాధిం చింది వాజ్‌పేయి ప్రభుత్వం. మౌలికసదుపాయాల కల్పనకు మున్నెన్నడు లేనంత ప్రాధాన్యత దక్కింది. ఎన్నో సంస్కరణలు తెచ్చారు. రావణ కాష్టంలా రగిలే భారత్–పాక్ మధ్య, ఉద్రిక్త సరిహద్దుల్ని చెరిపి సౌహార్ద్ర బస్సుయాత్ర నడిపిన శాంతి కపోత మాయన! జనతా ప్రభుత్వంలో తాను విదేశాంగ మంత్రిగా విత్తిన విత్తనాలు మొక్కై ఎదిగిన సందర్భం. నమ్మిన నిజమైన లౌకికవాదం పునాదులపై విశ్వాసంతో, తన రాజకీయ భవిష్యత్తునే పణంగా పెట్టి సాగించిన లాహోర్ యాత్ర అది! దౌత్య ప్రపం చంలోనే పెను సంచలనం! బాబ్రీ మసీదు కూల్చివేతను నిర్ద్వంద్వంగా ఖండించారు. గోద్రా నరమేధం ఆపే ‘రాజధర్మం’ లోపించిందన్నారు. అన్ని కాలా ల్లోనూ... రాజకీయ వ్యవస్థను సంస్కరించాలనుకునే ప్రజాస్వామ్యవాదులకు అస్త్రంగా ఆయన అందించిన ఒక గొప్ప కవితతో ముగిస్తా. ‘‘అధికారంతో సత్యం పోరాడుతుంది, నిరంకుశత్వంతో న్యాయం యుద్దం చేస్తుంది, చీకటి ఓ సవాల్ విసిరింది, వెలుగే కడపటి అస్త్రమౌతుంది, అన్నీ పణంగా పెట్టాం... ఇక ఆగలేం! విరిగైనా పొతాం కానీ, వంగేది లేదు!’’ దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
అమ్మతో పెట్టుకుంటే అంతే సంగతులా?
ఈ ప్రపంచంలో ఎవరు మన మేలు కోరుకున్నా కోరుకోకపోయినా మనం బాగుండాలని కోరుకునే ఏకైక వ్యక్తి ‘అమ్మ’. తప్పు చేసినా క్షమించే గుణం అమ్మకి ఉంటుంది. మరి.. అమ్మతో పెట్టుకుంటే అంతే సంగతులా? అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. ఈ ‘అమ్మ’ వేరు. ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్’ (అమ్మ). కేరళ నటీనటుల సంఘం అన్నమాట. కథానాయిక భావనపై జరిగిన లైంగిక దాడిలో జోక్యం ఉందనే కారణంగా నటుడు దిలీప్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనివల్ల ‘అమ్మ’లో దిలీప్ సభ్యత్వం రద్దయింది. బెయిల్ మీద బయటికొచ్చిన దిలీప్ని మళ్లీ అసోసియేషన్‌లో చేర్చుకోవాలని ‘అమ్మ’ అధ్యక్షుడు మోహన్‌లాల్, ఇతర సభ్యులు నిర్ణయం తీసుకోవడంపట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన నటీమణుల్లో రమ్యా నంబీసన్ ఒకరు. బాధిత నటికి అండగా ఉండటం కోసం ‘అమ్మ’కు ఆమె రాజీనామా చేసిన వెంటనే రమ్యా నంబీసన్, రీమా కల్లింగల్ వంటి తారలు తామూ రాజీనామా చేశారు. ఆ తర్వాత అవకాశాలు తగ్గుటున్నట్లు అనిపించిందని ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న రమ్యా నంబీసన్ పేర్కొన్నారు. ‘‘అమ్మ’ నుంచి బయటికొచ్చాక అభద్రతాభావం ఏర్పడింది. అవకాశాలు తగ్గుతున్నాయని గ్రహించాను. అది మాత్రమే కాదు.. నేను షూటింగ్స్‌కి సరిగ్గా రానని, నిర్మాతలను ఇబ్బంది పెడతానని, అందుకని నన్ను తీసుకోకూడదనీ ప్రచారం చేస్తున్నారు. కానీ నేనెప్పుడూ ఎవర్నీ ఇబ్బందిపెట్టలేదు. ‘అమ్మ’ తీసుకున్న నిర్ణయాన్ని తోటి నటీమణులతో కలసి వ్యతిరేకించాను కానీ నేను ఏం మాట్లాడినా అది మొత్తం మగవాళ్లందర్నీ వ్యతిరేకిస్తున్నట్లు కాదు కదా. ఒక సమస్య ఉంది.. పరిష్కరించండి అన్నాం. అది తప్పా’’ అని రమ్యా నంబీసన్ అన్నారు. నిజమే కదా. నిర్భయంగా మాట్లాడితే లేనిపోని నిందలు వేయడం న్యాయమా? -
ప్రజాధనం–పచ్చదనం–మనం
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో, దేశం మొత్తమ్మీద పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని వెచ్చించి చేపడుతున్న ‘హరిత’ కార్యక్రమాల్లో జనభాగస్వామ్యం, పౌర అప్రమత్తత, ప్రజాసంఘాల నిఘా, సామాజిక సంస్థల తనిఖీ ఎంత? అన్నది కీలక ప్రశ్న. ఇవన్నీ సవ్యంగా జరిగినపుడే ఆయా కార్యక్రమాల రచనలో ఉద్దేశించిన లక్ష్యాలు నెరవేరుతాయి. ఖర్చయ్యే ప్రతి పైసాకు ఎంతో కొంత ప్రయోజనం నెరవేరుతుంది. లేకుంటే, పెద్ద మొత్తం ప్రజాధనం ఖర్చయిపోయి ఇదొక డొల్ల కార్యక్రమంగానే మిగిలిపోతుంది. అందుకే ప్రజలు స్వచ్చందంగా పాల్గొని రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యత నెరవేర్చాలి. హక్కుల గురించి మాత్రమే మాట్లాడే మను షులకు బాధ్యతల్ని గుర్తు చేస్తే చురుక్కుమంటుంది. తమ విధులు–బాధ్యతల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి దంటారు. మన సామూహిక బాధ్యతలు కూడా ఏతావాతా మనందరం ఉమ్మడి హక్కులు నిండుగా అనుభవించడానికే అని చెబితే... ఎట్టెట్టా? అని ముక్కున వేలేసుకుంటారు. వ్యక్తిగత హక్కుల భద్ర తకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. హక్కులు, బాధ్య తలూ ఒకే నాణేనికి రెండు వైపులంటే... ‘ఓయబ్బో! ఈయనొచ్చాడయా దిగి... మాకు నీతి పాఠాలు చెప్ప డానికి, హు...!’ అన్నా అంటారు. కానీ, ఇది పచ్చి నిజం! మానవ సంబంధాలు, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల ఏర్పాటు, విద్య–ఉపాధి అవ కాశాల కల్పన... ఇలాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినపుడు మనం హక్కుల గురించి మాట్లాడినంత బాధ్యతల గురించి మాట్లాడం, మాట్లాడనీయం. అదీ ముఖ్యంగా పౌరుల బాధ్యతల గురించైతే అస్సలు మాట్లాడం! ఎంతసేపు ప్రభుత్వాల బాధ్య త–జవాబుదారితనం, అధికారుల విధులు–కర్త వ్యాలు, వాటి విజయ–వైఫల్యాలే మనకు సదా కథా వస్తువు. మన హక్కుల గురించి, అవి భంగపోయిన తీరు గురించి ఎంతైనా మాట్లాడతాం. అవతలి వారి బాధ్యతల గురించి, వాటి అమలులో వైఫల్యం గురించి అంతకన్నా పిసరు ఎక్కువగానే మాట్లా డతాం. మరి మన బాధ్యతల సంగతి? మన విధి నిర్వహణ మాటో! మన జవాబుదారితనం ఏం గాను? కొన్ని విషయాల్లో మనం బాధ్యతల్ని విస్మరిం చడం ఎంతటి విపరిణామాలకు దారి తీస్తుందో తెలు సుకుంటే గుండె తరుక్కుపోతుంది. పర్యావరణమే తీసుకుంటే, దాని పరిరక్షణ రాజ్యాంగం మనకు నిర్దే శించిన బాధ్యత. ఈ విషయంలో ఏ మేరకు మనం బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నామని ఎవరికి వారు బేరీజు వేసుకోవాల్సిందే! పౌరులుగా, ప్రజా సంఘాలుగా, పౌర సమాజంగా మనకూ ఈ విషయంలో విహిత బాధ్యత ఉంది. ముఖ్యంగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో, దేశం మొత్తమ్మీద పెద్ద ఎత్తున ప్రజాధ నాన్ని వెచ్చించి చేపడుతున్న ‘హరిత’ కార్యక్రమాల్లో జనభాగస్వామ్యం, పౌర అప్రమత్తత, ప్రజాసం ఘాల నిఘా, సామాజిక సంస్థల తనిఖీ ఎంత? అన్నది కీలక ప్రశ్న. ఇవన్నీ సవ్యంగా జరిగినపుడే ఆయా కార్యక్రమాల రచనలో ఉద్దేశించిన లక్ష్యాలు నెరవేరుతాయి. ఖర్చయ్యే ప్రతి పైసాకు ఎంతో కొంత ప్రయోజనం నెరవేరుతుంది. లేకుంటే, పెద్ద మొత్తం ప్రజాధనం ఖర్చయిపోయి ఇదొక డొల్ల కార్య క్రమంగానే మిగిలిపోతుంది. మంచి పనికి పౌర మద్దతుండాలి జనాకర్షణ పథకాలతో ఓట్లు పిండుకునే రాజ కీయాలు నడుస్తున్న కాలంలో, ఏ వత్తిడి లేకపోయినా ప్రభుత్వాలు ‘హరితహారం’ వంటి బృహత్ కార్య క్రమం తీసుకోవడాన్ని విమర్శకులు కూడా అభినంది స్తారు. అయిదేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటాలని తెలంగాణ ప్రభుత్వం తలపెట్టింది. నాలుగో విడత హరితహారాన్ని బుధవారమే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించింది. ఈ యేడు 40 కోట్ల మొక్కలు నాటాలన్నది లక్ష్యం. 33 శాతం ఉండా ల్సిన అడవుల విస్తీర్ణం 23 శాతమే ఉన్నట్టు ప్రభు త్వం చెబుతోంది. అది కూడా సందేహమేనని పర్యా వరణవేత్తలంటున్నారు. పంచాయతీరాజ్ చట్టం లోనూ మార్పులు చేసి హరితహారాన్నొక శాశ్వత కార్యక్రమం చేయాలన్న సర్కారు తలంపునకు స్థాని కంగా పౌర సహాకారం ఉంటే తప్ప ఏదీ సాకారం కాదు. ఒకటి, రెండేళ్లలో ప్రతి గ్రామంలో నర్సరీని నడిపే దిశగా అడుగులు పడాలన్నది సర్కారు ఆకాంక్ష. ప్రభుత్వంలోని వివిధ శాఖల్ని అనుసంధా నపరచడం, అధికారులతో పాటు ప్రజాప్రతినిధుల్నీ బాధ్యుల్ని చేయడం, వివిధ రూపాల్లో ఉపాధిహామీ పథకపు నిధుల్నే ప్రధానంగా వినియోగించడం... ఇప్పటివరకు జరుగుతూ వచ్చింది. ఈ కార్యక్రమా నికి గడచిన మూడేళ్లలో 2473 కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించింది. గొప్ప కార్యక్రమమే అయినా... మొక్కలు నాటడంపై ఉన్న శ్రద్ద వాటిని బతికించడంలో లేదనే విమర్శ ఉంది. ఎక్కడికక్కడ మొక్కల మనుగడ దక్కేది తక్కువే కావడం ఆందో ళన కలిగిస్తోంది. సగటు నలబై శాతం కూడా దక్క ట్లేదు. నాయకుల శ్రద్ద, అధికారుల నిబద్దత, స్థానిక సంస్థల పాత్ర, పౌర సంఘాల ప్రమేయం, ప్రజల భాగస్వామ్యం మొక్కల్ని అధికశాతం బతికించుకోవ డంలో కీలక పాత్ర వహిస్తాయి. సిద్దిపేట జిల్లాలో అత్యధిక శాతం మనుగడ నమోదవడం, మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో అత్యల్ప శాతం మొక్కలే బత కడం ఇందుకు నిదర్శనం. వాటిని బతికించుకోవా ల్సిన బాధ్యత పౌరులు, ప్రజా సంఘాలపైనా ఉంది. ప్రచారంపై ఉన్న శ్రద్ద పనిపై ఏది? మొక్కలు నాటే, అడవులు పెంచే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వాలు అదే స్థాయి శ్రద్ద పౌరుల్ని భాగస్వాముల్ని చేయడంపై చూపటం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం నిర్వహి స్తున్న ‘వనం మనం’ ఇందుకు నిరద్శనం. ఏటా జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కార్తీక పౌర్ణమి వరకు ఈ కార్యక్రమం కింద కోట్లాది మొక్కలు నాట డాన్ని లక్ష్యంగా ప్రభుత్వం చెబుతోంది. 2015–16లో 30 కోట్ల మొక్కలు నాటినట్టు సర్కారు లెక్క! నేలమీద అవి ఎక్కడున్నాయో జాడే లేదు! మొక్కకు సగటున రూ.15 ఖర్చయినట్టు రికార్డు రాశారు. ఇలా ఒక సంవత్సరం రూ.360 కోట్లు ఖర్చు చేసింది. గత సంవత్సరం 25 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యం కాగా 18.46 కోట్లు నాటామని, ఈ యేడు మరో 25 కోట్ల మొక్కలు లక్ష్యమనీ అంటోంది. 25 కోట్ల మొక్కల్ని అందించేపాటి నర్సరీల వ్యవస్థే రాష్ట్రంలో లేదనేది విమర్శ. లెక్కలే తప్ప మొక్కలు లేవని, ఉన్న మొక్కలు కూడా మొక్కుబడి పనుల వల్ల సరిగా నాట కుండానే రోడ్ల పైన పారవేసి పోతున్నట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. అటవీ ప్రాంతం ఇప్పుడు 24 శాతం ఉందని చెప్పే ప్రభుత్వం, 2029 నాటికి 50 శాతం చేయాలని ‘మిషన్ హరితాం ధ్రప్రదేశ్’ చేప ట్టినట్టు విస్తృత ప్రచారం చేస్తోంది. పనిలో పనిగా కార్పొరేట్ రంగాన్ని, స్థానికసంస్థల్ని, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల్ని. పౌర సంఘాల్ని కూడా భాగ స్వాముల్ని చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ‘పారిస్ ఒప్పందం’లో పలు పర్యావరణ స్వీయ నిర్భందాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశలో అడుగులైతే నెమ్మదిగా వేస్తోంది. జనాన్ని చైతన్య పరిచే చర్యలే లేవు. ‘నష్టపరిహార అటవీ అభివృద్ధి నిధి నిర్వహణ, ప్రణాళిక ప్రాధికార సంస్థ’ (కంపా) కింద పెద్ద ఎత్తున నిధులున్నా వాటిని వినియోగించడం లేదని ఏటా ‘కాగ్’ తప్పుబడు తోంది. రూ.39000 కోట్లుండగా ఏటా రూ.6000 కోట్లు కొత్తగా జత అవుతున్నాయి. పౌర భాగస్వా మ్యంపై ప్రభుత్వాలేవీ పెద్దగా శ్రద్ద పెట్టడం లేదు. రాజ్యాంగ స్ఫూర్తికి సుప్రీం రక్షణ ఒకరి బాధ్యత మరొకరికి హక్కు అయినట్టే, ఒకరి హక్కు ఇంకొకరి బాధ్యత అని దేశంలోని న్యాయ స్థానాలు పలుమార్లు తీర్పుల్లో స్పష్టం చేశాయి. పర్యావరణ పరిరక్షణ సవ్యంగా జరిగితేనే పౌరులం దరి జీవించే హక్కుకు భద్రత! ఇలా అందరి హక్కు రక్షణ క్రమంలో పర్యావరణాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత కూడా అవుతుంది. రాజ్యాంగం 21వ అధికరణంలోని జీవించే హక్కును సమగ్రంగా వివరిస్తూ, కాలుష్యరహిత జీవితం పౌరుల ప్రాథ మిక హక్కని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (ఎమ్.సీ మెహతా వర్సెస్ యూనియన్ ఆప్ ఇండియా) 1987లోనే స్పష్టత ఇచ్చింది. అధికరణం 19 (1)(జి) ప్రకారం ఏ వృత్తయినా, ఏ వాణిజ్య– వ్యాపారమైనా నిర్వహించుకోవడం పౌరుల ప్రాథ మిక హక్కే అయినప్పటికీ, దానికి కొన్ని పరిమితు లున్నాయి. సమాజం, ఇతర జనసమూహాల ఆరో గ్యాన్ని దెబ్బతీసే విధంగా పౌరులెవరూ తమ స్వేచ్ఛాయుత వాణిజ్య–వ్యాపారపు హక్కును విని యోగించుకోజాలరనీ సుప్రీంకోర్టు (కూవర్జీ బి.బరుచ్చా వర్సెస్ ఎక్సైజ్ కమిషనర్, అజ్మీర్–1954 కేసులో) చెప్పింది. పౌర హక్కుల పరంగా... వాణిజ్య స్వేచ్ఛ, పర్యావరణ పరిరక్షణ అనే అంశాల మధ్య వివాదం తలెత్తినపుడు న్యాయస్థానాలు సహజంగానే పర్యావరణ పరిరక్షణ వైపు మొగ్గాలని కూడా న్యాయ స్థానం స్పష్టం చేసింది. దానికి లోబడే ఏ వాణి జ్య–వ్యాపార కార్యకలాపాలైనా చేసుకోవచ్చంది. వేదాల నుంచి మన ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాల్లో కూడా ప్రకృతితో మమైకమై సకల జీవ రాశితో మనిషి సహజీవనం సాగించడాన్నే నొక్కి చెప్పారు. అదే జరిగింది ఇంతకాలం. ‘మానవుని స్వర్గం భూమ్మీదే ఉంది. ఈ సజీవ భూగ్రహం అన్ని జీవులది. ఇది ప్రకృతి వరం. దీన్ని పరిరక్షించు కుంటూ ప్రేమాస్పద జీవనం సాగించాలి’ అని అధ ర్వణవేదంలో ఉంది. పర్యావరణ పరిరక్షణ అన్నది మన సంస్కృతి, సంప్రదాయాల్లో ఆచరణగానే కాకుండా రాజ్యాంగపరంగా కూడా తగు భద్రత ఏర్పా ట్లున్నాయి. అటవుల సంరక్షణ, నీటి నిర్వహణ, భూసార పరిరక్షణలో గ్రామస్థాయి నుంచి స్థానిక సంస్థలకు విశేషాధికారాలు కల్సిస్తూ మనం రాజ్యాం గాన్ని సవరించుకున్నాం. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల ప్రకారం ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పౌరులకు అందించడం, అందుకోసం ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడటం సంక్షేమ ప్రభుత్వాల బాధ్యత (అధికరణం 47, 48) అనేది తిరుగులేని భద్రత! అదే సమయంలో పౌరుల బాధ్యతను కూడా రాజ్యాంగం ఎప్పటికప్పుడు గుర్తుచేస్తోంది. అడ వులు, చెరువులు, నదులు, జీవవైవిధ్యంతో కూడిన ప్రకృతిని కాపాడుతూ, పర్యావరణాన్ని అభివృద్ధి పరుస్తూ సకలజీవుల పట్ల దయ, అనుకంపతో ఉండ టం ప్రతి పౌరుని బాధ్యత (అధికరణం 51–ఎ (జి)) అని చెబుతోంది. ఇప్పుడా స్ఫూర్తి సర్వత్రా రగలాలి. ప్రతి పౌరుడూ తన స్థాయిలో స్పందించాలి. ప్రతి గ్రామమూ కదలాలి. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు నూరు శాతం విజయవంతమయ్యేలా తోడ్పడాలి. అది ‘కంపా’ అయినా, ‘హరితహారమై’నా, ‘వనం మనం’ అయినా... అక్కడ ఖర్యయ్యే ప్రతిపైసా ప్రజాధనం. అది వృధా కానీయకుండా ప్రయోజనం కలిగించేలా చూసే, చూడాల్సిన బాధ్యత మనది, మనందరిది! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ :dileepreddy@sakshi.com -
జనాయుధానికి జనాందోళనే రక్ష
సమకాలీనం విధాన నిర్ణయాలకు ముందు అధికారిక పత్రాల్లో సంబంధిత అధికారులు, పాలకులు రాసే వ్యాఖ్యలు (నోట్‌ఫైల్స్) ఎంతో కీలకమైనవి. అవినీతి–బంధు ప్రీతి–అక్రమాల గుట్టుమట్లను అవే బయట పెడతాయి. సమాచార హక్కు చట్టం కింద పౌరులు అవన్నీ పొందవచ్చు. ‘ఔను, మీవి ప్రజాకార్యాలయాలే, ప్రజలకు సమాచారం ఇవ్వండి, చట్టానికి కట్టుబడండి’ అని ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పినా రాజకీయపక్షాలు పెడచెవిన పెడుతున్నాయి. ఈ క్రమంలో... కమిషన్లను నిర్వీర్యపరిచే తాజా సవరణ ప్రతిపాదన ప్రమాదకరమనే భావన ఉంది. ప్రజాప్రతిఘటనే దీనికి సరైన మందు. ప్రజలు పోరాడి సాధించు కున్న పౌర సదుపాయం, సమాచార హక్కు చట్టాన్ని పలుచన చేసే ప్రమాదం మూడో మారు ముంచు కొచ్చింది. ఆ ప్రమాదం తెస్తున్నదెవరో కాదు, స్వయానా కేంద్ర ప్రభుత్వమే! ఇదివరకు రెండు మార్లు ప్రయత్నం చేసిందీ కేంద్రమే! కాకపోతే ఇంతకు మున్ను యూపీఏ ప్రభుత్వం చేస్తే, ఇప్పుడు చేస్తున్నది ఎన్డీయే ప్రభుత్వం. లోగడ చేసింది రెక్కలు విరిచే యత్నమైతే ఇప్పుడు చేసేది తలనరకడమే! ఈ ప్రయత్నాన్నీ అడ్డుకోవాల్సింది ప్రజలే! ఇదివరకటి రెండు యత్నాల్నీ దేశ పౌరులే సమర్థంగా అడ్డుకొని చట్ట సవరణ జరగనీకుండా తమ హక్కును కాపాడు కున్నారు. ఇక ముందైనా కాపాడుకోవడం పౌర సమాజం కర్తవ్యంగా మారింది. క్షేత్రపరంగా ఆర్టీఐ అమలును క్రమంగా గండికొట్టిన ప్రభుత్వాలు ఇప్పుడు చట్టపరంగానూ దెబ్బకొట్టే ప్రతిపాదనను ముందుకు తోస్తున్నాయి. ఫలితంగా, సమాచారం పొందే పౌర హక్కు విషయమై రాజ్యాంగ స్ఫూర్తికే భంగం వాటిల్లు తోంది. పౌరసంఘాలతో పాటు విపక్ష రాజకీయ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. సమాచార హక్కు చట్ట సవరణ బిల్లు ముసాయిదాను రాజ్యసభలో ప్రవేశపెట్టే ప్రతిపాదనను గురువారం ఎజెండాలో చేర్చారు. కానీ, జరగలేదు. ఇక పార్లమెంటు లోపలా, బయటా గట్టి వ్యతిరేకత, ప్రజాందోళనలు వస్తే తప్ప ఈ సవరణ ఆగక పోవచ్చు! అదే జరిగితే ఆర్టీఐ చట్టం అమలు మరింత నీరుకారడం ఖాయం. గుండెకాయనే బలహీనపరిస్తే... సమాచార హక్కు చట్టం అమలులో అత్యంత కీలక పాత్ర సమాచార కమిషన్లది. 2005లో వచ్చిన ఈ చట్టం, ప్రభుత్వాలతో సహా మరే సంస్థలకూ ఆ బాధ్యతను అప్పగించలేదు. కేంద్ర ప్రభుత్వంలోని పౌర కార్యాలయాల్లో చట్టం అమలు బాధ్యత కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ)ది కాగా రాష్ట్రాల్లో ఆ బాధ్యత రాష్ట్ర కమిషన్లు (ఎస్ఐసీ) నిర్వహించాలి. ఫిర్యాదులు, అప్పీళ్లను కూడా పాక్షిక న్యాయస్థాన హోదాలో కమిషన్లే పరిష్కరించాలి. çపూర్తి స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేయాలి. ఇప్పుడా కమిషన్లను బల హీనపరిచే ప్రక్రియకు కేంద్రం పూనుకుంది. కమి షన్లో ముఖ్యులైన కమిష నర్ల హోదా, పదవీకాలం, జీతభత్యాల విషయంలో మార్పులు ప్రతిపాదిస్తున్నారు. చట్టంలో పొందుపరచినట్టు కాకుండా నిర్ణ యాధికారాన్ని ఏక పక్షంగా కేంద్ర ప్రభుత్వానికి దఖలు పరచడమే తాజా చట్టసవరణలోని ముఖ్యాంశం. కేంద్ర సమాచార ముఖ్య కమిషనర్ (సీఐసీ) స్థాయిని ప్రస్తుత చట్టంలో కేంద్ర ఎన్నికల ముఖ్య కమిషనర్ (సీఈసీ)కు సమాన హోదాగా పేర్కొ న్నారు. తత్సమాన జీత–భత్యాలు ఇస్తున్నారు. కేంద్ర ఇతర సమాచార కమిషనర్లకు ఎన్నికల కమిషనర్ల సమాన హోదాను, జీతభత్యాలనూ కల్పించారు. రాష్ట్రాల్లోని సమాచార ముఖ్య కమిషనర్‌కు కేంద్ర ఎన్నికల కమిషనర్ హోదా, సమాచార ఇతర కమిష నర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) హోదాను చట్టం కల్పిస్తోంది. చట్టం పకడ్బందీ అమ లుకు ఇది అవసరమని అప్పట్లో భావించారు. ప్రభు త్వాలకు లొంగిఉండనవసరం లేకుండా, స్వేచ్ఛగా– స్వతంత్య్రంగా వ్యవహరించేందుకే వాటిని కల్పిం చారు. ఎవరూ మార్చడానికి వీల్లేకుండా ఈ అంశాల్ని చట్టంలో భాగం చేశారు. పార్లమెంటు స్థాయీ సంఘం (పిఎస్సీ) చొరవతోనే అప్పుడీ నిర్ణయం జరిగింది. గత పుష్కర కాలంగా అమలు పరుస్తున్నారు. ఇది సముచితం కాదని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వీరందరికీ అయిదేళ్ల పదవీ కాలాన్ని చట్టం నిర్దేశిస్తోంది. అలా కాకుండా, ఇకపై హోదా, పదవీకాలం, జీతభత్యాలు కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించి, అమలుపరిచే విధంగా అధి కారాలు కల్పిస్తూ చట్ట సవరణ చేయనున్నారు. ఎన్నికల ముఖ్య కమిషనర్ అన్నది రాజ్యాంగ హోదా అని, సమాచార ముఖ్య కమిషనర్ చట్టపరమైన హోదా కనుక సమానంగా ఉండనవసరం లేదనేది తాజా వాదన. కమిషనర్ల పదవీ కాలాన్ని మొదట్లో అయిదేళ్లని పేర్కొన్నారు, అంత అవసరంలేదనే కొత్త వాదనను తెరపైకి తెస్తున్నారు. ఈ మార్పులు ఏ మంచికోసమో ఎక్కడా సరైన వివరణ లేదు. ముసాయిదాలో సవరణ బిల్లు ఉద్దేశాలు–లక్ష్యాలను వెల్ల డిస్తూ, హోదాలను హేతుబద్దం చేయడానికే అని పేర్కొన్నారు. మరోపక్క ఇది ఖచ్చితంగా చట్టం అమలును నీరు కారుస్తుందని పౌర సమాజం ఆందోళన. ప్రజా సమాచార హక్కు జాతీయ ప్రచార మండలి(ఎన్సీపీఆర్ఐ), మజ్దూర్ కామ్‌గార్ శక్తి సంఘటన్ (ఎమ్కేఎస్సెస్)వంటి సంఘాలు అప్పుడే నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. కేంద్రం ఇకపై సమాచార కమిషన్లను, తద్వారా వ్యవస్థను తమ చెప్పుచేతల్లో ఉంచుకునేందుకే అన్నది విమర్శ. ప్రజా క్షేత్రంలో ఏ చర్చ జరుపకుండానే ఈ ప్రతి పాదన తెస్తున్నారు. ఈ ‘కత్తిరింపులు’, కేంద్ర గుత్తాధిపత్యం వల్ల అధికార యంత్రాంగం ఇక కమిషనర్లను, స్థూలంగా కమిషన్లను ఖాతరు చేయదనే భయ ముంది. ఫలితంగా అన్ని స్థాయిల్లోనూ సమా చార నిరాకరణ, జాప్యం సర్వసాధారణమయ్యే ప్రమా దాన్నీ ప్రజాసంఘాలు శంకిస్తున్నాయి. అప్పుడు విచక్షణతో చేసిందే! రాజ్యాంగపరమైన బాధ్యత నిర్వహించడమంటే రాజ్యాంగంలో ఆ పదవిని విధిగా ప్రస్తావించి ఉండా లనే వాదన సరికాదు. పౌరుల ఓటు హక్కుకు రక్షణ కల్పించం ఎలాంటి బాధ్యతో, పౌరులు సమాచారం తెలుసుకునే హక్కును పరిరక్షిం చడం కూడా అంతే బాధ్యతాయుతమైన కార్యం. ఈ రెండు హక్కుల మూలాలూ... భారత రాజ్యాంగం భద్రత కల్పించిన భావప్రకటన స్వేచ్ఛ హక్కు (అధికరణం 19)లో ఒదిగి ఉన్నాయి. పాలకులుగా ఇష్టమైన వారిని ఎన్ను కోవడం ద్వారా తమ భావ ప్రకటన స్వేచ్ఛను పౌరులు వినియోగించుకున్నట్టే, వివిధ కార్యక్ర మాల్లో పాల్గొని ప్రయోజనం పొందేలా వాటి గురిం చిన సమాచారం తెలుసుకోవడం కూడా వారి ప్రాథ మిక హక్కులో భాగమే! ఈ విషయాన్ని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో (స్టేట్ ఆఫ్ యూపీ వర్సెస్ రాజ్ నారాయన్–1976, ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా–1982) నొక్కి చెప్పింది. ప్రభుత్వ వ్యవస్థల నుంచి సమాచారం పొందడం పౌరుల ప్రాథమిక హక్కేనని ఐక్యరాజ్యసమితి మానవహ క్కుల సంఘం కూడా తన 2011 నివేదికలో నిర్ద్వం దంగా వెల్లడించింది. పౌరుల ప్రాథమిక హక్కు రక్షణ విధులు నిర్వర్తించే సమాచార కమిషన్లు, అందులోని కమిషనర్లు రాజ్యాంగ విహిత బాధ్యతను నిర్వర్తిస్తున్నట్టే లెక్క. వారికి కేంద్రంలో ఎన్నికల కమి షనర్ హోదా, రాష్ట్రంలో సీఎస్ హోదా కల్పించడం నిర్దిష్ట లక్ష్యంతోనేనని, ఇదే లేకుంటే ఇంతటి వ్యవ స్థను ఏర్పాటు చేయడంలో అర్థమే లేదని పార్లమెం టరీ స్థాయి సంఘం (పీఎస్సీ) కూడా పేర్కొంది. వివిధ స్థాయిల్లో చర్చ కూడా జరిగింది. 2005 చట్టం రూపొందే క్రమంలో చేసిన బిల్లు ముసాయిదాలో ఒక ప్రతిపాదన ఉండింది. ప్రతి కమిషన్లోనూ అదనంగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో పనిచేసే డిప్యూటీ కమిషనర్లు ఉండాలన్నది ఆ ప్రతి పాదన. దానివల్ల, కేంద్రం జోక్యంతో కమిషన్ల స్వయం ప్రతి పత్తికి భంగమని పీఎస్సీనే అభ్యంతరం వ్యక్తం చేసింది. అందుకేనేమో, చట్టంలో సదరు డిప్యూటీ కమిషనర్ల వ్యవస్థకు స్థానం కల్పించలేదు. అటు వంటిది, ఇప్పుడు అందుకు భిన్నంగా కమిష నర్ల హోదా, పదవీకాలం, జీతభత్యాలంతా కేంద్రం ఇష్టా నుసారం జరగాలని చేస్తున్న ప్రతిపాదన కమిషన్ల స్వతంత్ర పనితీరుకు పూర్తి భంగకరమే. ప్రతిఘటనతోనే ఆగిన కుయుక్తులు! స్వాతంత్ర భారత చరిత్రలో వచ్చిన అతి కొద్ది మంచి చట్టాల్లో మేలైనది, జనహితమైనదిగా సమాచార హక్కు చట్టానికి పేరుంది. పాలనా వ్యవస్థల్లో ఎంతో కొంత పారదర్శకతకు, తద్వారా అధికార యంత్రాంగం జవాబుదారీతనానికి ఈ చట్టం కారణమౌ తోంది. రాజకీయ వ్యవస్థ దుందుడుకు తనాన్నీ కొంతమేర నియంత్రించగలుగుతోంది. జనాల్లో అవ గాహన పెరిగే క్రమంలోనే ఇది మరిన్ని ఫలాలు అందించి, ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసే ఆస్కార ముంది. కానీ, ప్రభుత్వాలు, ముఖ్యంగా పాలనా యంత్రాంగం దీన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు నిరంతరం సాగిస్తూనే ఉన్నాయి. కమిషన్లను రిటైర్డ్ ఉద్యోగులతో నింపడమో, అసలు నింపక ఖాళీలతో కొనసాగించడమో చేస్తున్నాయి. మరోవైపు చట్టాన్ని పలుచన చేసే ఎత్తుగడలకు వెళ్తున్నాయి. చట్టం వచ్చి ఏడాది తిరగక ముందే గండికొట్టే యత్నం జరిగింది. విధాన నిర్ణయాలకు ముందు అధికారిక పత్రాల్లో సంబంధిత అధికా రులు, పాలకులు రాసే వ్యాఖ్యలు (నోట్‌ఫైల్స్) ఎంతో కీలకమైనవి. అవినీతి–బంధు ప్రీతి–అక్రమాల గుట్టుమట్లను అవే బయట పెడ తాయి. సమాచార హక్కు చట్టం కింద పౌరులు అవన్నీ పొందవచ్చు. వాటిని ఈ చట్టపరిధి నుంచి తొలగించే యత్నం 2006 జూలైలోనే జరిగింది. ఇందుకు అప్పటి యూపీఏ ప్రభుత్వ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆర్టీఐ కార్యకర్తల చొరవతో దేశ వ్యాప్తంగా ఆందోళన జరిగింది. అన్నాహజారే దీక్షకు దిగారు. ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సమాచారంలో భాగమైన ‘నోట్‌ఫైల్స్’ను నేటికీ ఏ పౌరుడైనా పొందవచ్చు. ఈ హక్కును నీరుగార్చే రెండో దాడి 2013 ఆగస్టులో జరిగింది. లోక్‌సభలో బిల్లు ముసాయిదాను కూడా ప్రవేశపెట్టారు. ప్రజాప్రాతినిధ్య చట్టం పరిధిలో ఏర్పడ్డ రాజకీయపక్షాలను ఈ చట్టం పరిధి నుంచి తప్పించేందుకు చేసిన యత్నమది. దాని క్కూడా పౌర సంస్థల నుంచి గట్టి వ్యతిరేకత వ్యక్తమైంది. మినహాయింపుకోసం చట్టసవరణకు యత్నించిన వారు, పౌర కార్యాలయాలుగా రాజకీ యపక్షాలన్నీ చట్టం పరిధిలోకే వస్తాయి అంటే మాత్రం ఒప్పుకోరు! ‘ఔను, మీవి ప్రజాకార్యాల యాలే, ప్రజలకు సమాచారం ఇవ్వండి, చట్టానికి కట్టుబడండి’ అని ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పినా రాజకీయపక్షాలు పెడచెవిన పెడుతున్నాయి. ఈ క్రమంలో... కమిషన్లను నిర్వీర్య పరిచే తాజా సవరణ ప్రతిపాదన ప్రమాదకరమనే భావన ఉంది. ప్రజాప్రతిఘటనే దీనికి సరైన మందు. ప్రజాస్వామ్య పరిపుష్ఠికి ఆయుధమైన ఆర్టీఐ చట్టాన్ని పోరాడైనా కాపాడుకోవడం పౌరసమాజ కర్తవ్యం. వ్యాసకర్త సమాచార పూర్వ కమిషనర్ దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
అమ్మ చేసింది తప్పు
... అని కమల్‌హాసన్ నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. ‘అమ్మ’ (అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్) అంటే మలయాళం నటీనటుల సంఘం అని అర్థం. గతేడాది నటి భావన కారులో ప్రయాణిస్తున్నప్పుడు లైంగిక వేధింపులకు గురైన విషయం తెలిసిందే. ఈ సంఘటన వెనకాల నటుడు దిలీప్ హస్తం ఉందని భావన ఆరోపించారు. ఆమె ఫిర్యాదుని పరిశీలించి, పోలీసులు దిలీప్‌ను అరెస్ట్ చేయడం, ఆయన బెయిల్‌పై బయటకు రావడం జరిగాయి. కాగా, ‘అమ్మ’లో దిలీప్ సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ ఆయనకు సభ్యత్వం ఇచ్చారు ఇటీవల ‘అమ్మ’ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మోహన్‌లాల్. ఈ నిర్ణయంపై బాధితురాలు భావనతో సహా పలువురు కథానాయికలు బాహాటంగానే నిరసన వ్యక్తం చేశారు. ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి మళ్లీ సభ్యత్వం ఎలా ఇస్తారు? అని ‘అమ్మ’ని నిలదీశారు. ఈ విషయం గురించి కమల్‌హాసన్ స్పందించారు. ‘‘చట్టపరంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి సభ్యత్వం ఇవ్వడం తప్పు. ఒకవేళ దిలీప్ని క్షమించాలనుకుంటే వ్యక్తిగతంగా చేయొచ్చు. అయితే ఓ అసోసియేషన్ తీసుకునే నిర్ణయానికి సభ్యులందరి ఆమోదం ఉండాలి. దిలీప్ని వెనక్కి తీసుకోవడం సరైన నిర్ణయం కాదని ‘అమ్మ’లో ఉన్న పలువురు అంటున్నారు. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నప్పుడు మొత్తం సభ్యులందరితో చర్చించాలి. అలా కాకుండా అతనికి సభ్యత్వం ఇచ్చి, బాధిత నటికి అన్యాయం చేశారు. ఆర్టిస్టులందరి కలయికతో ఏర్పడేదే ఆర్టిస్ట్స్ అసోసియేషన్. అది సజావుగా సాగాలంటే అందరి సహకారం కావాలి’’ అన్నారు కమల్. చిత్రసీమలో లింగ వివక్ష గురించి మాట్లాడుతూ – ‘‘మిగతా చిత్రపరిశ్రమలతో పోల్చితే మలయాళంలో లింగ వివక్ష తక్కువ’’ అన్నారు కమల్. -
‘సాక్షి’ జర్నలిజం తుది ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : సాక్షి జర్నలిజం కోర్సు ప్రవేశ పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. సాక్షి జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్ బుధవారం ఈ ఫలితాలను విడుదల చేశారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను కింద పేర్కొన్న వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. అలాగే, ఎంపికైన అభ్యర్థులు వెబ్సైట్ నుంచి అడ్మిషన్ లెటర్లను డౌన్లోడ్ చేసుకోవాలి. కోర్సు ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందన్న వివరాలను త్వరలోనే వెబ్సైట్ ద్వారా తెలియజేయడంతో పాటు అభ్యర్థులకు ఎస్సెమ్మెస్ ద్వారా కూడా సమాచారం ఇస్తారు. పూర్తి వివరాలను ఈ కింద లింక్ క్లిక్ చేయండి http://www.sakshieducation.com/jschool/index.aspx -
ఇంత బరువు భావ్యమా?
నిజానికి పెళ్లి ఏ హంగూ ఆర్భాటం లేకుండా, నిరాడంబరంగా జరుపుకుంటే తప్పేంటి? పెళ్లి పవిత్రతను గౌరవించినట్టూ ఉంటుంది. సంప్రదాయ పద్ధతిలో ఇంటి ముందు పచ్చని పందిరి వేసి, ఇరు కుటుంబాలు, ఇరుగుపొరుగే కాకుండా బంధువర్గమందరినీ పిలుచుకొని మూడు రోజుల పండుగయినా చాలా హుందాగా, సంతోషంగా జరుపుకోవచ్చు. ఆత్మీయ కలయికలా ఉంటుంది. ఖర్చు రమారమి తగ్గుతుంది. భూలోకమంత పీట, ఆకాశమంత పందిరే వేయక్కర్లేదు. ఇరు కుటుంబాల వారి మనసులు కలిస్తే చాలు. ‘‘పెళ్లంటే నూరేళ్ల పంట, అది పండాలి కోరుకున్న వారింట’’ అన్నాడో సినీకవి. నిజమే! ఎవరం కోరుకునేదయినా అదే! వారి వారి అంతస్తులు, ఆస్తిపాస్తులతో నిమిత్తం లేకుండా ఏ ఇంటి ఆడబిడ్డయినా, మగబిడ్డయినా యుక్తవయసు రాగానే సరిజోడయిన వారితో పెళ్లి చేసుకోవాలనే కోరుకుంటాం. చక్కగా పెళ్లయి, సంతానం పొంది, పిల్లా, పాపలతో బతికినంత కాలం సుఖసంతోషాలతో ఉండాలనేదే ఎవరి కోరికైనా! మానవ మనుగడలో పెళ్లి అనేదొక కీలక ఘట్టం. ఇద్దర్ని జత కలపడమే కాకుండా, ఇకపై వారు ఉమ్మడిగా దాంపత్య జీవితం కొనసాగిస్తారని అందరికీ తెలియజెప్పడానికే పెళ్లి అంటారు పెద్దలు. ఇది, ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన కుటుంబాల బహిరంగ వేడుక. దీవించ వచ్చే వందలు, వేలాది మంది దానికి సాక్షులు. సాధారణ పరిస్థితుల్లో పెళ్లి వీలయినంత తక్కువ వ్యయంతో జరగాలనే మన సంప్రదాయాలు, కట్టుబాట్లు, పద్ధతులు వెల్లడిస్తున్నాయి. కానీ, క్రమంగా పరిస్థితి మారుతోంది. ఒకరకంగా చేయి దాటిపోతోంది. పెళ్లి అనే పవిత్ర ప్రక్రియను చుట్టుముట్టి కన్యాశుల్కం, వరకట్నం వంటి సాంఘిక దురాచారాలు వేర్వేరు కాలాల్లో చాలా కుటుంబాల్ని వేధించాయి, ఇంకా వేధిస్తూనే ఉన్నాయి. కుటుంబాలే రగిలే సామాజిక అశాంతికి అవి పోసిన ఆజ్యం అంతా ఇంతా కాదు. ఇప్పుడిక, అసాధారణ వ్యయభారంతో పెళ్లి ప్రక్రియే ఓ గుదిబండలా తయారయింది. ఖరీదయిన, ఖర్చుతో కూడిన పెద్ద ఆర్థిక వ్యవహారం అయింది. పేద, మధ్యతరగతి వారికి, ఉద్యోగులు, అల్పాదాయవర్గాలు, ఆర్థిక స్తోమత అంతంతగా ఉన్నవారికి పెళ్లంటేనే భయం కలిగించే పరిస్థితి నెలకొంది. కొందరు సంపన్నులకిది ‘సంపద అసభ్య ప్రదర్శన’కు ఓ అవకాశమైంది. మరికొందరు, హంగూ –ఆర్భాటాల పెళ్లితో తమ ఆర్థిక–సామాజిక హోదాను చాటుకునేందుకు తాపత్రయ పడుతున్నారు. ముఖ్యంగా ఇటీవల పెళ్లిని ఓ పెద్ద తంతుగా మార్చి, లెక్కకు మిక్కిలి డబ్బు వ్యయం చేస్తున్న తీరు గగుర్పాటు కలిగిస్తోంది. ఇది అన్ని స్థాయిల్లోనూ జరుగుతోంది. కొందరు హెచ్చు లకోసం, ఇంకొందరు దర్పం కోసం, మరి కొందరు సంపద ప్రదర్శన కోసం చేస్తే.... అత్యధికులు ‘ఇక మాకూ తప్పదేమో!’ అనే అపోహలో చేస్తున్నారు. సాటివారితో సరిపోల్చుకొని తామూ హంగులు, ఆర్భాటాలకు పోతున్నారు. ఈ వడిలో పడి ఆస్తులు కరిగిస్తున్నారు, లేదంటే అప్పుల పాలవుతున్నారు. కమ్మేసిన మార్కెట్ మాయ! సమాజంలో పలు అంశాల్లాగే క్రమంగా పెళ్లినీ మార్కెట్ మాయ కమ్మేసింది. పెళ్లి ఏ పవిత్రతనూ వదలకుండా ప్రతి అంశాన్నీ మార్కెట్ తన పిడికిట్లోకి లాక్కుంది. అనుబంధ వ్యవహారాలన్నింటిలోకి మార్కెట్ చొరబడింది. పెళ్లి చేసే వారి మెడపై కత్తి పెట్టి వసూళ్లకు దిగినట్టుంది పరిస్థితి. వారది తమ అవసరమనుకుంటే, వీరికిది అవకాశం! సాధారణ కుటుంబాల్లోనూ ఈ అయిదారేళ్లలోనే పెళ్లి వ్యయం సగటున 30 నుంచి 40 శాతం పెరిగింది. వెరసి ఒకో పెళ్లి ఖర్చు లక్షలు, కొన్నిచోట్ల కోట్ల రూపాయలకు విస్తరించింది. పదేళ్ల కింద, నగరంలో పేరు మోసిన ఓ డాక్టర్ నాతో మాట్లాడుతూ ‘‘.... ఏమిటిది! ప్లేటు 800 రూపాయలట, పెళ్లికి కనీసం 2000 మంది వస్తారనుకుంటున్నాము. ఒక్కపూట భోజనానికే 16 లక్షల రూపాయలు, మా వియ్యంకుడైనా, నేనైనా.. సరే మేమిద్దరం పెట్టగలిగిన వాళ్లం కనుక, చెరిసగం భరిస్తున్నాం. పెట్టలేని వాళ్ల సంగతేంటి? లేదు... ఎక్కడో ఈ దుబారా పరిస్థితి మారాలి. మీ బోటివాళ్లు ప్రసంగాల్లోనో, వ్యాసాల్లోనో చెప్పి ఓ సామాజిక మార్పుకు నాంది పలకాలి’ అన్నారు. ఈ దశాబ్దకాలంలో అది మారకపోగా మరింత దిగజారింది. స్థాయి ఉందో, లేదో కూడా చూసుకోకుండా నిశ్చితార్థం, పెళ్లి, రిసెప్షన్ ఈ మూడూ దాదాపు తప్పనిసరి ప్రక్రియలయ్యాయి. పెళ్లి పత్రికల నుంచే చేతి చమురు వదలడం మొదలవుతుంది. అక్కడ్నుంచి బట్టలు–నగల కొనుగోళ్లు, మంటపాలు, వేదిక, పూల అలంకరణ, వీడియో ప్రొమోలు, డ్రెస్ డిజైనింగ్–మేకప్, ఫొటో–వీడియోగ్రఫీ, కొరియోగ్రఫీ.... ఇలా ప్రతి వ్యవహారమూ ఖరీదే! ఎంత గిరిగీసి లెక్కేసినా ఖర్చు గిర్రున తిరిగే మీటరే! వాటికి తోడు మెహంది, సంగీత్ ఉత్సవాలు జరిపే సంస్కృతి తోడయింది. అపరిమితమైన మాంసాహార భోజనాలు, మద్యం టేబుళ్లతో విందులు, రిటర్న్ గిఫ్టులు.... ఖర్చు ఆలోచించండి! ఇక రిసార్టులో, స్టార్ హోటళ్లో బుక్ చేసుకొని ఎక్కడో గోవానో, జైపూరో, ఇండొనేíసియానో.... వెళ్లి జరిపే ‘డెస్టినేషన్ మ్యారేజెస్’ వ్యయానికి లెక్కే లేదు. సంప్రదాయిక విలువలేమయ్యాయి? నిజానికి పెళ్లి ఏ హంగూ ఆర్భాటం లేకుండా, నిరాడంబరంగా జరుపుకుంటే తప్పేంటి? పెళ్లి పవిత్రతను గౌరవించినట్టూ ఉంటుంది. సంప్రదాయ పద్ధతిలో ఇంటి ముందు పచ్చని పందిరి వేసి, ఇరు కుటుంబాలు, ఇరుగుపొరుగే కాకుండా బంధువర్గమందరినీ పిలుచుకొని మూడు రోజుల పండుగయినా చాలా çహుందాగా, సంతోషంగా జరుపుకోవచ్చు. ఆత్మీయ కలయికలా ఉంటుంది. ఖర్చు రమారమి తగ్గుతుంది. భూలోకమంత పీట, ఆకాశమంత పందిరే వేయక్కర్లేదు. ఇరు కుటుంబాల వారి మనసులు కలిస్తే చాలు. ఇంటి ముంగిట పెళ్లి నిర్వహణ ఎంతో సౌలభ్యం! వచ్చేవారి సౌకర్యమనే సాకు చూపి అందరూ నేల విడిచి సాము చేస్తున్నారు, డబ్బు తగలేస్తున్నారు. మధ్య, అల్పాదాయాల వారిపై సంపన్నులు ఒత్తిడి పెంచుతున్నారు. నగరాలు, పట్టణాలు, చివరకు మండల కేంద్రాల్లోని ఫంక్షన్ హాళ్లలోనే పెళ్లిళ్లు. సీనియర్ పాత్రికేయుడొకరంటారు.. ‘మా ఊళ్లోగాని, మా మండలంలోగాని, ఆ మాటకొస్తే నాకు తెలిసిన వాళ్లెవరూ గడచిన మూడేళ్లలో.. ఇంటిముందు వేసిన పచ్చని పందిట్లో పెళ్లి జరిపిన సందర్భమే నే చూడలేదు’అని. ఫంక్షన్ హాళ్లదీ ఓ మాయ! హాలుకే పెద్ద మొత్తం చార్జీ చేస్తారు. అది కాకుండా ఇక వేదికపై అలంకరణ, కుర్చీలు, వంట సామగ్రి, దేనికదే ప్రత్యేక చార్జీ! పురోహితుడి నుంచి బాజా, భజంత్రీ, సన్నాయి, పూలవాడు, మైక్‌సెట్టు, పాటకచేరీ.... ఇలా అందరి వ్యాపారమూ హాల్ వాడితో ముడివడి ఉంటుంది చాలా సందర్భాల్లో! అదో మాయా మేళం! మండల కేంద్రాల్లో, రెండు మూడు పెద్ద గ్రామాల మధ్యలో ఇటీవల చాలా ఫంక్షన్ హాళ్లు వెలిశాయి. కరీంనగర్, వరంగల్ వంటి జిల్లా కేంద్రాలతో పాటు పలు పట్టణాల్లో దాదాపు కమ్యూనిటీ హాళ్లన్నీ ఇలాంటి కమర్షియల్ ఫంక్షన్ హాళ్లయ్యాయి. ఆర్థికంగా స్థితిమంతులయిన వారు హడావుడి చేస్తున్నారు. సామాజికంగా, బంధుత్వాల పరంగా సమస్థాయిగల వారు తమ వద్ద సొమ్ము లేకపోయినా... హెచ్చులకు అదే స్థాయిలో పెళ్లిళ్లు్ల చేస్తున్నారు. లేని డాంబికాలు ప్రదర్శిస్తూ చేయి కాల్చుకుంటున్నారు. పోల్చి చూసుకోవడం, ఫలానా వారికన్నా తగ్గొద్దనే భావనలు పెరిగాయి. ఖర్చు తట్టుకోవడానికి, ఉంటే ఆస్తులు కరిగేసుకోవడం, లేదంటే అప్పో, సప్పో చేయడం రివాజయింది. అప్పటి వరకు నిబ్బరంగా, గౌరవంగా బతికిన కుటుంబాలు, పెళ్లి తర్వాత చితికిపోయిన సందర్భాలూ ఉన్నాయి. హన్మకొండలో తాహతుకు మించిన ఖర్చుతో పెళ్లి చేసిన ఓ ఉమ్మడి కుటుంబం తర్వాత విడివడి, చితికిపోయింది. కరీంనగర్లో ఓ వ్యాపారి పెళ్లి జరుగుతున్నంత సేçపూ హెలికాప్టర్‌తో పూలవర్షం కురిపించి, తర్వాత ఐటీ దాడులు, ఆస్తికి సరితూగని ఆదాయవనరులు... కేసుల్లో ఇరుక్కుని నలిగిపోయాడు. చట్టపరంగా నియంత్రించే యత్నాలు... పెళ్లికొచ్చే అతిథుల సంఖ్యపైన, వంటకాలపైన, మొత్తం పెళ్లి ఖర్చులపైన పరిమితులు విధించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఇందుకోసం ఓ చట్టమే ఉండాలనేది అభిమతం. కాంగ్రెస్ ఎంపీ రంజిత్ రంజన్ లోక్‌సభలో కిందటేడు ఒక (ప్రయివేటు మెంబరు) బిల్లును ప్రతిపాదించారు. ఈ ‘పెళ్లి (తప్పనిసరి రిజిస్ట్రేషన్–అనవసర వ్యయ నియంత్రణ) బిల్లు’కు ఆమోదం లభించలేదు. 2011లో అఖిలేష్ దాస్‌గుప్త రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు లాంటిదే! అతిథుల సంఖ్య, విందులో వంటకాలపై పరిమితికి యత్నం. పెళ్లి ఖర్చు రూ.5 లక్షల వరకే అనుమతించాలని, మించితే పది శాతం చొప్పున స్థానిక ప్రభుత్వాలకు చెల్లించేలా చర్యలుండాలని ప్రతిపాదించారు. ఆ డబ్బును పేద కుటుంబాల ఆడపిల్లల పెళ్లిళ్లకు ఖర్చు చేయాలని ప్రతిపాదన. ఈ రెండు సందర్భాల్లోనే కాకుండా 1996లో సరోజ్ కపర్దే, 2005లో ప్రేమ్ కరియప్ప రాజ్యసభలోను, 2005లోనే తెలుగు ఎంపీ రాయపాటి సాంబశివరావు, 2011లో పి.జె.కురియన్, అదే సంవత్సరం మహేంద్ర చౌహాన్లు లోక్‌సభలో దాదాపు ఇటువంటి బిల్లుల్నే ప్రతిపాదించారు. పెళ్లి ఖర్చులపైన, జల్సాలపైన, ఆహారం వృథాపైన నియంత్రణ ఉండాలంటూ ఇలాంటి బిల్లులు జమ్మూ కశ్మీర్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ ప్రతిపాదనకు వచ్చాయి. పొరుగుదేశం పాకి స్తాన్‌లో పెళ్లి వ్యయం, అతిథుల సంఖ్యపై నియంత్రణ ఉంది. పెళ్లిళ్లు, రిసెప్షన్లలో వచ్చే అతిథుల సంఖ్య, వడ్డించే ఆహారపదార్థాల సంఖ్య, మైకుల వినియోగం, టపాసులు కాల్చడంపై నియంత్రణ విధిస్తూ గత సంవత్సరం జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలిచ్చింది. ఇదే యత్నాలు ఇతర రాష్ట్రాల్లోనూ సాగుతున్నాయి. సమగ్ర చట్టం వస్తే తప్ప ఈ పెళ్లి దుబారాలను, డీజేలు, రికార్డింగ్ డాన్స్‌లు, పెద్దపెద్ద శబ్దాలతో గంటల తరబడి సాగే బారాత్‌లను నియంత్రించలేమని పోలీసులంటు న్నారు. పబ్లిక్ న్యూసెన్స్ తప్ప వేరే కేసులు పెట్టలేకపోతున్నామని వారి వాదన. పెళ్లి ముగింపు కాదు ఆరంభం ఉన్న డబ్బంతా కరిగించి జల్సా చేయడానికి పెళ్లేం ముగింపు వేడుక కాదు, ఇది దాంపత్య జీవితానికి ఆరంభం! పెళ్లిలో దుబారా ఆపి, పొదుపు ద్వారా మిగిల్చే డబ్బు ఆ దంపతులకిచ్చినా ఓ గొప్ప భరోసాతో వారి ఉమ్మడి జీవితం మొదలవుతుంది. తదుపరి దశలో పిల్లల పెంపకం, విద్య, వైద్యం వంటి వాటికి ఎలాగూ ఖర్చు తప్పదు, నియంత్రించ గలిగిన చోటన్నా ఎందుకు చేయరనేది ప్రశ్న! పెళ్లి జీవిత కాలపు వేడుకే! అది జీవితాన్ని వెలిగించేదవాలి తప్ప ఖర్చు తడిసి మోపెడై నలిపేసేది కావద్దు! దిలీప్ రెడ్డి dileepreddy@sakshi.com -
ప్రజాగళం విచ్చుకొని పదేళ్లు
సమకాలీనం తెలుగునాట జర్నలిజం వృత్తికి ఎనలేని గౌరవం తెస్తూ ఒక ప్రభంజనంలా మొదలైంది. మీడియా ఉద్యోగులు, ముఖ్యంగా జర్నలిజంలో ఉన్న వారి గౌరవాన్ని, జీతభత్యాల్ని, అవకాశాల్ని ఒక్కపెట్టున పెంచింది సాక్షి. ఈ విషయాల్లో పరిశ్రమ ఊహించని స్థాయీ మార్పు సంతరించుకుందంటే అతిశయోక్తికాదు కదా, ప్రత్యర్థి కూడా కాదనలేని సత్యమిది. పత్రికల, పత్రికలు నిర్వహించే మీడియా సంస్థల ప్రవర్తనలోనే పెను మార్పులకు నాంది పలికింది. ఎన్నో ప్రజా ఉద్యమాలను అద్దమై ప్రతిబింబించింది. ‘వార్త అంటేనే, ఎవరో అణచివేయ జూసేదే. మిగిలిందంతా ఉత్తి వ్యాపార ప్రకటన. ఎజెండా ఏర్పాటుకే శక్తి కావాలి. మనం దేన్ని వెలుగులోకి తెస్తున్నాం, దేన్ని వెలుగులోకి రానీకుండా నిలిపివేస్తున్నామన్నదాంట్లోనే ఎంతో మతలబుంది!’అంటారు, అమెరికా మీడియా దిగ్గజం, రెండు దశాబ్దాల పాటు ‘వాషింగ్టన్ పోస్ట్’ను నడిపిన క్యాథరీన గ్రాహమ్. నిజమే! మొత్తం సమాచార వ్యవస్థనే చెరపట్టిన గుత్తాదిపత్యంతో.... మేం చెప్పిందే వార్త, చేసిందే వ్యాఖ్య! చూపిందే చిత్రం, అల్లిందే కథ! అన్నట్టు కొన్ని మీడియా శక్తులు రాజకీయ గమనాన్ని, సమాజాన్ని శాసిస్తున్నపుడు తెలుగునాట ప్రజాస్వామ్యం పరిహాసం పాలయింది. అబద్ధాలకు నగిషీలు చెక్కి, నిజాలను నిలువునా పాతరేసి ఏకస్వామ్యం నడుస్తున్నపుడు జనహితం కోరే గొంతులకు స్థానం లేకుండా పోయింది. అప్పుడు.... నేనున్నానంటూ ఓ స్వరం గొంతు పెగుల్చుకుంది. గోదావరి ఉధృతితో పరవళ్లు తొక్కుతున్నపుడు ధవళేశ్వరం వద్ద ఏటికెదురీదే పొలసచేపలా వచ్చింది. సరిగ్గా దశాబ్దం కింద.. ఆ పొలికేక పెట్టింది వేరెవరో కాదు ‘సాక్షి’. దిక్కులేని వారికి, దిగాలు పడ్డవారికి, అణచివేత వాతపడిన వారికి, ఆదరణ కోల్పోయిన వారికి... ఇలా సమాజంలో ఎందరెందరికో గొంతుకయింది. గుంపు గుంపు కొట్టుకుపోతుంటే, వేల సమూహాలు నోరు మెదిపే ధైర్యం, ఆస్కారం, అవకాశం లేని వేళ.. ఒక స్వరం పొలికేకై, మూగవోయిన కోటి గొంతులకు స్వరాన్ని, గుండె ధైర్యాన్ని, ఆత్మ నిబ్బరాన్నీ ఇచ్చిన కొత్త ఊపిరైంది. వ్యవస్థల్ని చెరబట్టిన వారు దుర్బుద్ధితో దాపెట్టిన నాణెపు రెండో పార్శా్వన్ని సాక్షి ఆవిష్కరించింది. ప్రత్యామ్నాయ సమాచారానికి, అవసరానికి, అవకాశాలకు తానే వేదికయింది. సమాచారం సంకెళ్లు విప్పి, నిజాన్ని నిజంలా చెబుతామని సంకల్పం తీసుకొని నేటికి సరిగ్గా పదేళ్లయింది. ఈ పదేళ్ల ప్రస్థానంలో ఎన్నెన్నో ఆటుపోట్లు, మరెన్నో విజయాలు. సరళ సమాజంలోనే విజయాలంత తేలిగ్గా దక్కవు, అటువంటిది సంక్లిష్టమైన మన సమాజంలో అదంత తేలికయింది కాదు. సాక్షి విషయంలోనూ అదే జరిగింది. మొగ్గ దశ నుంచి సాక్షిని తుంచేసే యత్నాల్లో అనేక శక్తులు! ఇప్పటికీ నిరంతరంగా అటువంటి యత్నాలు సాగి స్తూనే ఉన్నాయి. నిన్నటికి నిన్న, అధికారంతో కళ్లు మూసుకుపోయిన పెద్దలు, ‘ఇంకేముంది, సాక్షిని సీజ్ చేసినట్టే, అంటే ప్రభుత్వం గుప్పెట్లోకొచ్చేసింది, రేపో మాపో తీసేసుకొని సర్కారే నడిపిస్తుంద’ని గర్వాతిశయాన్ని చాటడం తెలి సిందే. అన్ని అణచివేతల్ని, దాష్టీకాల్ని సమర్థంగా ఎదుర్కొంటూ, అడుగడుగునా ఉద్యమిస్తూ, తనను తాను నిరూపించుకుంటూ తెలుగువారి గుండె చప్పుడుగా సాక్షి సాగిపోతూనే ఉంది. ఇదొక నిరంతర యజ్ఞం. నిజం చెప్పే జనం పత్రిక సాక్షి లేకుంటే ఎన్నో నిజాలు వెలుగు చూసేవి కావు. ఇది సర్వత్రా ఆమోదం ఉన్న వ్యాఖ్య. వారి వారి నేపథ్యాల్ని, సామాజిక పరిస్థితుల్ని బట్టి ఏ విషయంలో ఎవరికి ఏ భిన్నాభిప్రాయమున్నా, ఈ విషయాన్ని మాత్రం అందరూ అంగీకరిస్తారు. సాక్షి పుట్టాక ఏడాదిలోనే వచ్చిన 2009 ఎన్నికలప్పుడు ఇది మరింత స్పష్టంగా కనిపించింది. ఎన్నెన్ని విష ప్రచారాలు! లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు వండివార్చిన వార్తా కథనాల కనికట్టుతో మాయాజాలం చేయజూసింది పచ్చ మీడియా! అది అప్పటివరకు వారికున్న సహజ లక్షణం. పైగా ఎప్పుడూ వారది దాచింది లేదు. ఎన్నికలవడంతో రాజకీయ ప్రయోజనాల కోసం ఆ తత్వాన్ని అనేక రెట్లు పెంచి ఆచరించారు. దాన్ని సాక్షి సమర్థంగా ఎదుర్కొంది. జనం రోజువారీ జీవితంతో ముడివడి ఉన్న ప్రతి విషయంలోనూ వాస్తవం ఇది అని విడమర్చి చెప్పింది. ‘ఇదీ! పనిగట్టుకొని కనుమరుగు చేస్తున్న వాస్తవం’అని సాక్ష్యాధారాలతో ప్రచురించి తన రాతలతో నిజాల్ని నిగ్గుతేల్చింది. జనాన్ని చైతన్య పరచింది. ముఖ్యంగా రాజకీయ వ్యవహారాలు, పరిణామాలకు సంబంధించిన విష ప్రచారాల తెర వెనుక భాగోతాల్ని ఎప్పటికప్పుడు ఎండగట్టింది. ఆ ఎన్నికల తర్వాత కొందరు సామాజికవేత్తలు, రాజకీయ పరిశీలకుల వ్యాఖ్యల్ని విశ్లేషించినపుడు అప్పుడు సాక్షి నిర్వహించిన పాత్ర ఇట్టే బోధపడుతుంది. ఎన్నికల ఫలితాల తర్వాత ‘అబ్బో! సాక్షి లేకుంటే....!’అని పలువురు వ్యక్తం చేసిన ఆందోళనలోనే సాక్షి సాధిం చిన విజయ గాథలు దాగి ఉన్నాయి. మార్చి 24, 2008 న సర్వసన్నాహాలతో సాక్షి మొదలయినప్పుడు, ముఖ్యమంత్రి హోదాలో ఆవిష్కరణ సభకు విచ్చేసిన డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఒక ఆశీర్వచనం ఇచ్చారు. కొత్తగా ఆరంభమైన దినపత్రిక సాక్షి నిజాన్ని నిజంలాగే వెల్లడించాలని ఆయన సూచించారు. ‘‘...ఎలాంటి వక్రీకరణలూ వద్దు, ఇది ఆంధ్రప్రదేశ్ (నాటి ఉమ్మడి తెలుగు రాష్ట్రం) ఉజ్వల భవిష్యత్తుకు సాక్షిలా నిలబడాలి. ప్రతి తెలుగువాడూ సగర్వంగా చెప్పుకునేలా ఎదగాలి’’అని అభిలషించారాయన. అదే జరుగుతూ వచ్చింది. ఆయన ఆశయాల పునాదులపై ఎదగిన, ఎదుగుతున్న సౌధమిది! నిరంతర ప్రయోగం సాక్షి ఓ దినపత్రికగా ఆరంభం నుంచే చాలా ప్రయోగాలు చేసింది. పాఠకుల అభిరుచి, ఆసక్తి, అవసరాలే ప్రాతిపదికగా ఆ పరంపర కొనసాగిస్తూనే ఉంది. 19 నగరాల్లో ప్రింటింగ్, 23 ఎడిషన్లతో ప్రారంభమే ఒక గొప్ప ప్రయోగం! తెలుగునాట జర్నలిజం వృత్తికి ఎనలేని గౌరవం తెస్తూ ఒక ప్రభంజనంలా మొదలైంది. మీడియా ఉద్యోగులు, ముఖ్యంగా జర్నలిజంలో ఉన్న వారి గౌరవాన్ని, జీతభత్యాల్ని, అవకాశాల్ని ఒక్కపెట్టున పెంచింది సాక్షి. ఈ విషయాల్లో పరిశ్రమ ఊహించని స్థాయీ మార్పు సంతరించుకుందంటే అతిశయోక్తికాదు కదా, ప్రత్యర్థి కూడా కాదనలేని సత్యమిది! పత్రికల, పత్రికలు నిర్వహించే మీడియా సంస్థల ప్రవర్తనలోనే పెను మార్పులకు నాంది పలి కింది. మానవసంబంధాల మూల స్తంభమైన కుటుంబాన్ని ఆలంబన చేస్తూ ‘ఫ్యామిలీ’ని విలువల గీటురాయి చేసింది. ఇంటిల్లిపాదినీ పత్రికకు పాఠకుల్ని చేసింది. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల ప్రపంచాన్ని అరచేతికి చేర్చి యువతరం ‘భవిత’కు ఆశాసౌధాలు కట్టింది. కార్పొరేట్లకు ఎర్రతివాచీలు పరచి వ్యవసాయం దండగ అన్న దుర్నీతి పాలకుల పన్నాగాల్ని ఎండగడుతూ, అన్నం పెట్టే రైతన్నకు ‘సాగుబడి’పాఠాలు చెప్పింది. ప్రకృతి వ్యవసాయాన్ని పొత్తిళ్లలో పెట్టి ప్రోత్సహించింది. ‘ఇంటిపంట’ను ఆర్థిక–ఆరోగ్య మంత్రం చేసింది. మహిళా సాధికారతకు పట్టం గట్టింది. ప్రాంతీయ వార్తలతో పాటు జాతీయ–అంతర్జాతీయ వార్తలకు ప్రాధాన్యం తెచ్చింది. క్రీడలు, వాణిజ్యం, సాహిత్యం, తదితర రంగాలన్నిటా కొత్త పుంతలతో పాఠకుల్ని సరికొత్త తీరాలకు చేర్చింది. వార్తా కథనాల్లోని అంశాలకు కారకులయ్యే, ప్రభావితులయ్యే వారి అభిప్రాయాలకూ ఎక్కడికక్కడే స్థానం కల్పించే సంస్కృతిని విస్తృత పరచింది. మీడియా బాధ్యత–జవాబుదారీతనాన్ని మరింత పెంచింది. ‘‘...లుప్తమయిపోతున్న పత్రికా సత్సంప్రదాయాలూ, కొనప్రాణంతో ఉన్న వార్తా సంస్కృతీ ‘సాక్షి’ద్వారా మళ్లీ జవజీవాలు పుంజుకుంటాయని మీరు నిశ్చయంగా ఆశించవచ్చు’’ అని సాక్షి వ్యవస్థాపక అధ్యక్షుడిగా వై.ఎస్. జగన్మోహన్రెడ్డి తొలి ప్రతిపై సంతకంతో ఇచ్చిన భరోసా ఇప్పటికీ, ఎప్పటికీ తెలుగువారికి లభిస్తూనే ఉంటుంది. మొక్కవోని దీక్ష ప్రజా సమస్య ఏదైనా నిర్భీతితో స్పందించి, నివేదించడం సాక్షి ప్రాథమిక లక్షణం. రాజకీయ కల్లోల పరిస్థితుల్లో కూడా ఈ నియతిని వీడలేదు. పత్రిక పుట్టిన తొలిరోజు ప్రతిలోనే ప్రకటించుకున్నట్టు ‘‘.... అభిప్రాయాలు కలిగి ఉండే హక్కు అందరికీ ఉంటుందని మేము పూర్తిగా నమ్ముతాము. ఇతరుల అభిప్రాయాలతో విభేదించే హక్కును కూడా మేం గౌరవిస్తాం. ఒక వార్తా పత్రికగా మేము ప్రజాస్వామ్య బద్ధులం కాబట్టి, రాజ్యాంగ బద్ధులం కనుక, సెక్యులరిస్టు భావజాలం కలిగివున్న కారణాన వాటికి విరుద్ధంగా ఉన్న శక్తులను తప్పనిసరిగా వ్యతిరేకిస్తాం. అయితే వ్యతిరేకిస్తున్నాం కాబట్టి సత్యాలను చిత్రవధ చేయబోము. వార్తలను వక్రీకరించే పాడు పనికి ఒడికట్టబోమని పాఠకలోకానికి హామీ ఇస్తున్నాము’’అన్న సంకల్పం సాక్షికి నేటికీ, ఎప్పటికీ శిరోధార్యమే! ఆ హామీని నిలబెట్టుకునే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అధికారంలో ఉన్నవాళ్లు, రాజకీయ ప్రత్యర్థులు కుమ్మక్కై సాక్షిని అడ్డదారుల్లో అణగదొక్కినపుడు కూడా పట్టు సడలనీయలేదు. పాత్రికేయ విలువలను వీడలేదు. సంబంధమే లేని వ్యవహారాన్ని అంటగట్టి పత్రికా కార్యాలయంలో సోదాలు చేసినపుడు, అకౌంట్లు స్తంభింపజేసినపుడు కించిత్ వెరవలేదు. సాక్షి ఉద్యోగులందరు కూడా ఒక్కతాటిపై నిలిచి సంఘీభావం ప్రకటించారు. సర్కారుకో, నచ్చిన రాజకీయ శక్తులకో కొమ్ముకాసే పచ్చ మీడియా ‘ఇక సాక్షి పని అయిపోయింద..’ని విష ప్రచారం చేసినా, ఒక్కరంటే ఒక్క ఉద్యోగి కూడా ఆ భయంతో సాక్షిని వీడలేదు. ఇన్ని ఆర్థిక ఇబ్బందుల నడుమ కూడా ఉద్యోగుల జీతం డబ్బుల్ని ఏ నెలా యాజమాన్యం ఒక్క రోజు ఆలస్యం కానీలేదు. కుట్ర పన్నిన ప్రత్యర్థి పాలకశక్తులు ప్రత్యక్ష–పరోక్ష పద్ధతుల్లో పత్రికాస్వేచ్ఛను కాలరాయ జూసినపుడు సాక్షి పరివారమంతా ఉద్యమమై ఉవ్వెత్తున ఎగిసింది. ఎన్నో ప్రజా ఉద్యమాలను అద్దమై ప్రతిబింబించింది. ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా... ఎన్నెన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా ఏది జనహితమని భావిస్తే ఆ సమాచారాన్ని అన్ని కోణాల్లో స్పృశించి, సమర్పించింది. రాష్ట్ర విభజన తర్వాత అనేకానేక ప్రజాహిత అంశాల్లో పిల్లిమొగ్గలు వేస్తూ పాలకపక్షాలు చేసిన దాష్టీకాలన్నింటినీ పరిశోధనాత్మక కథనాలతో జనం ముందు పరి చింది. పచ్చని పంటపొలాల్లో చిచ్చు పెట్టి జరిపిన భూసేకరణ–సమీకరణైనా, రాజధాని పేరిట రంగుల చిత్రం చూపుతూ సర్కారే ఓ పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఒడిగట్టినా, కనికట్టుతో భ్రమలు కల్పించిన పట్టిసీమ దోపిడీ అయినా, స్వప్రయోజనాల కోసం ‘ప్రత్యేక హోదా’ను పణంగా పెట్టి రాజకీయావసరాల కోసం నాలుకను నాలుగు వంకర్లు తిప్పినా.... విశ్వసించదగ్గ సాక్ష్యాధారాలతోనే వార్తా కథనాల్ని ప్రచురించింది. తొలిరోజు సంకల్పంలో చెప్పినట్టు, ‘‘.... మేము కచ్చితంగా ప్రజాహితమైన అంశాన్నే ఎంచుకొని దాన్ని నిర్మొహమాటంగా సమర్ధిస్తాము... ప్రజల మనస్సాక్షిగా వ్యవహరిస్తూ మొత్తం సమాజంలో జరిగే సకల కార్యకలాపాలనూ ప్రజాకోటికి యథాతథంగా, ఉన్నది ఉన్నట్టు నివేదిస్తాం’’అన్నదే సాక్షి అక్షరాలా పాటిస్తోంది. అందుకే ప్రజాదరణ చూరగొంది. ఇది వందేళ్లకు పైబడి నడిచే పత్రికగా నిలదొక్కుకోవాలని ప్రస్తుత చైర్పర్సన్ వై.ఎస్.భారతీరెడ్డి వ్యక్తం చేసిన అభిలాషకు దన్నుగా ఈ దశాబ్ది ప్రస్థానం ఓ బలమైన ముందడుగు. వ్యాసకర్త దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
దిక్సూచి కొరవడిన దివ్యశక్తి
♦ సమకాలీనం ‘...లక్షల మంది ఆకలితో, అజ్ఞానంతో అలమటిస్తున్నపుడు, వారందరి శ్రమనుంచి విద్యార్జన చేసి, వారికేమాత్రం సహకారం అందించని వారిని నేను ద్రోహులుగానే పరిగణిస్తాను. నిర్భాగ్యులను అణచి, దోచి, బాధించి పొందిన సొమ్ముతో తమ ఆడంబరాల్లో బందీలుగా ఉంటూ, ఆ బాధితులకు ఏ రూపంలోనూ ఉపయోగపడని వారూ నా దృష్టిలో ఆకలిగొన్న క్రూర మృగాలే! నిజానికి అటువంటి వారమంతా దరిద్రులం, చివరకు ఏమీ కాకుండా పోతాం!’ అని రాస్తూ, అలా కాకుండా నడుచుకుందామని హితబోధ చేస్తారు. ‘‘ఇప్పటి యువకుల మీద, వారి ఆధునికత పైన నాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది. వారి నుండే నాకవసరమైన కార్యకర్తలు లభిస్తారు. వారు సమస్యల్ని సింహబలులై ఎదుర్కొంటారు’’ అని స్వామీ వివేకానందుడు విశ్వాసం ప్రకటించి నూటపాతిక సంవత్సరాలయింది. ఆ తర్వాత అనేక మార్పులొచ్చాయి. రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. భారతదేశం స్వాతంత్య్రం పొందింది. రాజకీయ, ఆర్థిక, సామాజిక, సంస్కృతీ పరంగా ఇంటా బయటా ఎన్నెన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. శాస్త్ర–సాంకేతికత ప్రగతికి బాటలు పరిచాయి. ముఖ్యంగా యువతకు అపారమైన అవకాశాలు అందివస్తున్నాయి. ఇప్పటికీ యువతే ఏ దేశ భవిష్యత్తునైనా నిర్దేశించే స్థితిలో ఉంది. భారతదేశం అత్యధిక యువతరం కలిగిన దేశంగా లెక్కలకెక్కుతోంది. ప్రపంచీకరణ ఫలితంగా విశ్వవ్యాప్తమై లభిస్తున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని ఒడిసిపడుతూ మనవాళ్లు ముందుకు సాగుతున్నారు. దేశీ యంగానూ ఉన్నంతలో అవకాశాల్ని అందిపుచ్చుకునే యత్నం మన యువత నిర్విరామంగా సాగిస్తోంది. కానీ, వివేకానందుని ఆలోచనా ధోరణికి, తాత్విక చింతనకు, ఆశావహ దృక్పథానికి విరుద్ధమైన భావజాలం, ఆలోచన, కార్యాచరణ అత్యధికుల్లో ఇప్పుడు రాజ్యమేలుతోంది. సరైన గమ్యం, దిశానిర్దేశం లేని పంథాలో వారు సాగుతున్నారు. జాతిని జాగృత పరచి, అనుపమానమైన యువశక్తిని ఏకీకృతం చేసి సరైన మార్గాన నడిపే ఆత్మ దేశంలో కొరవడింది. ఆదర్శ మార్గదర్శకత్వం లేకుండా పోయింది. సరైన దిక్సూచి లేక యువశక్తి... కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, భావజాలాల వారీగా విడిపోయి సంకుచిత మార్గాల్లో సాగుతోంది. విలువలు పతనమైన ఫక్తు వ్యాపార విద్యావిధానం వల్ల వారిలో పరిమిత యోచన, హ్రస్వ దృష్టి పెరిగి ఆలోచనా పరిధి విస్తరించడం లేదు. జీవనశైలి సంక్లిష్టమౌతోంది. నిర్హేతుకమైన హింస, విధ్వంసాలకు తెగించే పెడధోరణులు యువతలో పెచ్చరిల్లుతున్నాయి. 1984లో ఉత్తర కర్ణాటకకు చెందిన గుల్బర్గా నగరంలోని న్యాయ కళాశాల వార్షికోత్సవ సదస్సు జరి గింది. న్యాయ కోవిదుడు రామ్‌జెఠ్మలానీని ఆహ్వానించి ‘‘భారతదేశానికిపుడు రాజకీయ నాయకుల కన్నా నైతికనేతల అవసరం ఎక్కువుంది’’ అనే అంశంపై ప్రసంగ కార్యక్రమం ఏర్పాటు చేశాము. మూడున్నర దశాబ్దాల తర్వాత... ఇప్పటికీ పరిస్థితిలో ఏం మార్పు లేదు! ఒక పిలుపుతో అత్యధికుల్ని ఒక్కతాటిపై నడిపే నిబద్ధత కలిగిన నైతిక, ధార్మిక నేతృత్వపు నేటి అవసరాన్ని వివేకానందుడు గుర్తుచేస్తున్నారు. విత్తొకటి వేస్తే చెట్టొకటి వస్తుందా? దారితప్పిన మన విద్యావిధానం ప్రస్తుత పెడధోరణులకు ప్రధాన కారణం. ప్రభుత్వ నిర్వహణ నుంచి విద్య క్రమంగా ప్రయివేటు వైపు మళ్లుతున్న క్రమంలోనే ప్రతి అంశంలోనూ ఫక్తు వ్యాపార ధోరణి పెచ్చు మీరింది. లాభాపేక్షతో విద్యాబోధన జరిపించే ‘పరిశ్రమ’లు వెలిశాయి. ఫలితంగా విలువలు అడుగంటుతున్నాయి. విద్యార్థులు–యువతరం ఆలోచనా ధోరణి వికటిస్తోంది. ప్రపంచీకరణలో అన్నీ వినియోగ వస్తు దృక్పథంతో చూడటం అలవాటయ్యాక త్యాగ భావనే కొరవడుతోంది. చదువులో, ఉద్యోగాలు పొందడంలో అనారోగ్యకర పోటీ పెరిగి వారిలో స్వార్థం కట్టలు తెంచుకుంటోంది. దాని చుట్టే జీవనశైలి రూపుదిద్దుకుంటోంది. ఇది విద్యావిధానమే కాదనేది వివేకానందుడి భావన. ‘మెదడును అసంఖ్యాకమైన వైజ్ఞానిక విషయాలతో నింపటం విద్య కాదు. మనస్సు సమగ్ర ఉత్తీర్ణతను సాధించాలి. దానిపై సాధికారతను, నియంత్రణను సమకూర్చడమే విద్య లక్ష్యమై ఉండాలి’ అంటారాయన. విద్య ఎలా ఉండకూడదో చెబుతూ, ‘గంధపు చెక్కలు మోసే గాడిదకు వాటి బరువు తప్ప విలువ తెలియదు, ఎంత సమాచారం మెదడులో నింపామన్నది మన విద్యాజ్ఞానం కొలమానమే కాదంటారు. ‘సమాచార సేకరణ, విషయ గ్రహణమే విద్య అయితే, మన గ్రంథాలయాలు తాపసులౌతాయి, మన విజ్ఞానసర్వస్వాలు మహర్షులుగా వెలుగొందుతాయ’ని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తారు. ‘జీవితానికి, ప్రవర్తనకు అక్కరకొచ్చే అయిదు ఆలోచనల్ని మనస్సుకు పట్టించుకుంటే చాలంటారు. ‘విద్యవల్ల సత్ప్రవర్తన అలవడాలి, మనో దారుఢ్యం పెరగాలి, వ్యక్తిత్వ వికాసం–వివేక విస్తరణ జరగాలి. చివరగా, మన కాళ్లమీద మనం నిలబడగలగాలి అంతే!’ అంటారు స్వామీజీ. తప్పు తెలిస్తే, దిద్దుకోవడం తేలిక! భారతదేశంలో రెండు దుష్కర్మలు సాగుతున్నాయని వివేకానందుడనేవారు. ఒకటి స్త్రీ జాతి అణచివేత, రెండోది బీదల పట్ల వివక్ష, ముఖ్యంగా కుల వివక్షతో చూపే నిర్దాక్షిణ్య వైఖరి అని ఆయన అభిప్రాయం. అవి ఇంకా కొనసాగడం దురదృష్టకరం! మహిళల పట్ల ఇప్పటికీ జరుగుతున్న దాష్టీకాలు చూస్తుంటే, లింగపరంగా సరైన దృక్పథం అలవడకపోవడమే వాటికి కారణం అనిపిస్తుంది. ఈ విషయంలో స్వామీజీకి ఉదాత్తమైన భావాలుం డేవి. ‘స్త్రీ పురుష భేదాన్ని విస్మరించి, మానవులంతా సమానులే అన్న భావన రానంతవరకు, స్త్రీ జనోద్ధరణకు అవకాశమే ఉండదు’ అని బలంగా అభిప్రాయపడ్డారు. ‘మానవ జాతి ఒక్కటే. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని ఏమీ ఉండదు. అందరూ సర్వసమానతా భావాన్ని ప్రోత్సహిస్తూ ఒకరి సాహచర్యాన్ని మరొకరు అభిలషిస్తూ స్త్రీ–పురుషులు పరస్పర సహకారంతో సంచరిస్తేనే జీవతం ఆనందమయమౌతుంది’అనేవారు. ‘ప్రపంచ శ్రేయస్సును సంరక్షించుకోవాలంటే స్త్రీ పరిస్థితి మెరుగుపడాలి. పక్షి ఎన్నడూ ఒక రెక్క సహాయంతో ఎగురలేదు’ అన్నారాయన. తరాల తరబడి కొన్ని అట్టడుగు వర్గాల ప్రజలు మోసగించబడ్డారని, వాటికి చారిత్రక సాక్ష్యాధారాలున్నాయని వివేకానందుడు పేర్కొనేవారు. ‘మనదేశంలో బీదలను, అట్టడుగు వర్గాల వారిని ఆదుకునేందుకు స్నేహితులుండరు. వారు ఎంత కష్టించినా వారొక స్థాయి నుండి పైకి రాలేరు. రోజులు గడిచిన కొద్దీ ఇంకా తక్కువ స్థాయికి దిగజారుతున్నారు. సమాజం నిర్దయగా వారిని చెప్పుదెబ్బలు కొడుతూనే ఉంది. ఆ దెబ్బలు ఏ సమయంలో ఎలా వచ్చి తాకుతాయో కూడ ఆ నిస్సహాయ ప్రజలకు తెలియదు’ అన్నారు. 1894లో చికాగో నుంచి ‘అలి సింగ’కు రాసిన ఉత్తరంలో చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ‘...లక్షల మంది ఆకలితో, అజ్ఞానంతో అలమటిస్తున్నపుడు, వారందరి శ్రమనుంచి విద్యార్జన చేసి, వారికేమాత్రం సహకారం అందించని వారిని నేను ద్రోహులుగానే పరిగణిస్తాను. నిర్భాగ్యులను అణచి, దోచి, బాధించి పొందిన సొమ్ముతో తమ ఆడంబరాల్లో బందీలుగా ఉంటూ, ఆ బాధితులకు ఏ రూపంలోనూ ఉపయోగపడని వారూ నా దృష్టిలో ఆకలిగొన్న క్రూర మృగాలే! నిజానికి అటువంటి వారమంతా దరిద్రులం, చివరకు ఏమీ కాకుండా పోతాం!’ అని రాస్తూ, అలా కాకుండా నడుచుకుందామని హితబోధ చేస్తారు. ముందు మేల్కొనండి... యువత పట్ల వివేకానందుడికి అపారమైన ఆశ, నమ్మకం ఉండేవి. మీలో ఎంతో శక్తి ఉంది, ఆత్మవిశ్వాసంతో ఉండండి, అప్రమత్తం కండి, అంతే చాలు, మిగతావన్నీ వాటంతట అవే జరిగిపోతాయని యువతరానికి సందేశం ఇచ్చేవారు. సమాజంలో కొనసాగుతున్న అరిష్టాల్ని ఎదుర్కొనేందుకు యువత సన్నద్దం కావాలని పిలుపునిచ్చేది. 1896 జూన్ 7న లండన్ నుంచి మిస్ మార్గరెట్ నోబెల్‌కు ఉత్తరం రాస్తూ వివేకానందుడు ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. ‘... ప్రపంచం దుఃఖంతో జ్వలిస్తోంది. మీరు నిద్రించగలరా? మనం బిగ్గరగా అరవాలి... ఎంతలా అంటే, మనలో విశ్రమిస్తున్న దేవత నిద్రలేవాలి, ఆ పిలుపులకు ప్రతిస్పందించాలి’ అని రాశారు. యువత ఎక్కువగా ఉన్న ఒక సమావేశంలో మాట్లాడుతూ, ‘సాహసికులైన యువకులారా! మీకు కావలసినవి మూడే విషయాలు: అవి ప్రేమ, నిజాయితీ, సహనం. జీవితమంటే ప్రేమ. ప్రేమమయమే జీవితం. ఇదే జీవిత పరమార్థం. స్వార్థపరత్వమే మరణం! ఇది ఇప్పటికే కాదు ఎప్పటికీ సత్యమే. మనకు భావి లేదనుకున్నా, ఇతరులకు మంచి చేయడమే జీవితం. హాని సల్పటం మరణం. నీకు కనిపించే పశుప్రవృత్తి కలిగిన మానవుల్లో నూటికి తొంబై మంది మృతులే!’ అన్నారు. జీవితంపైనే సరైన దృక్పథం లేని నేటి యువకులు కొందరు, ఉన్మాదంతో ఎదుటివారి జీవితాల్ని హరిస్తున్నారు. వివేకానందుడు చెప్పిన ప్రేమ, నిజాయితీ, సహనం మూడూ లేని ముష్కరులు తయారవుతున్నారు. చిన్న వయసులో తాగి తందనాలాడుతున్నారు. నేర ప్రవృత్తిలోకి దిగుతున్నారు. విలువలు నశించినా ఆడంబరాలకు అతుక్కుపోతున్నారు. అందరి పూనికతోనే మార్పు... యువతరం భారత్‌కు ఓ గొప్ప శక్తి! 35 ఏళ్ల లోపు వయస్కులైన 65 శాతం జనాభాతో ప్రపంచంలోనే అగ్రగామి ‘యువ’దేశంగా మనకు కీర్తి లభిస్తోంది. 15–29 మధ్య వయస్కుల జనాభా 27.5 శాతంగా మానవవనరుల సహాయ మంత్రి డా. సత్యపాల్‌సింగ్ వారం కింద లోకసభకు తెలిపారు. తగిన విద్య, శిక్షణ, నైపుణ్యాల వృద్ధి చేస్తూ వారిని శ్రమశక్తి వనరుగా తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. ప్రపంచ కార్మిక సంస్థ (ఐఎల్వో) ప్రమాణాల ప్రకారం పనిచేసే–చేయని మానవ వనరుల నిష్పత్తి, రాగల ఒకటిన్నర దశాబ్దాల్లో (2016–30) చైనా, కొరియా, బ్రెజల్ కంటే భారత్‌లోనే మెరుగ్గా ఉంటుందని కార్మిక మంత్రి సంతోష్‌కుమార్ గాంగ్వార్ తెలిపారు. భారత యువజనాభివృద్ధి సూచిక 0.569 సగటుతో ఆశావహంగానే ఉందని యువజన వ్యవహారాలు–క్రీడల సహాయ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ వివరించారు. 2014 యువ విధాన పత్రం ప్రకారం, అభివృద్ది ఫలాల గ్రహీతలుగా మాత్రమే కాకుండా యువతను చోదకశక్తులుగా, క్రియాశీలంగా ఉంచే కార్యక్రమాలు రచించి, అమలు చేస్తున్నట్టు ఆ శాఖ మంత్రి విజయ్‌గోయల్ సభలో వెల్లడించారు. ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది అర్హులైన నిరుద్యోగులు తమ ఉద్యోగ–ఉపాధి అవకాశాల కోసం నిత్య పోరాటం చేస్తున్నారు. మరో వంక మూడు ప్రభుత్వాలు తాము ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ప్రకటనలు చేస్తున్నాయి. ప్రభుత్వ లెక్కలు, కథలు, కథనాలెలా ఉన్నా... నేటి యువతరం ప్రవర్తన, ఆలోచనా ధోరణి, దృక్పథాలను తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, విద్యాసంస్థల పాత్ర ఎంతో కీలకం. దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలామ్, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఫేస్బుక్ అధినేత జుకెర్‌బర్గ్, ఐటీ దిగ్గజాలు అజీమ్ ప్రేమ్‌జీ, నందన్ నీలేకనీ వంటి వారి మాటలకు అక్కడక్కడ యువతరం ఎంతో కొంత ప్రభావితమవుతున్నారు, స్పందిస్తున్నారు. కానీ, యువతను దారిన పెట్టే ప్రభావశీలురు, వైతాళికులు లేకుండా పోయారు. కుంచించుకుపోతున్న యువత ఆలోచనా ధోరణి విస్తరించాలి. విశాల దృక్పథం అలవడాలి. ఇందుకు, తల్లిదండ్రులు క్రియాశీల పాత్ర పోషించాలి. ఆదర్శమూర్తుల దారిన నడిచేలా తమ పిలల్ని చిన్నప్పట్నుంచే ప్రభావితుల్ని చేయాలి. నరేంద్రుడు వివేకానందుడిగా మారేంత ప్రభావితం చేసిన భువనేశ్వరీ దేవి అందరికీ ఆదర్శం కావాలి. ఒకనాడు తల్లి తనకు చెప్పినట్టు వివేకానందుడే స్వయంగా తన పుస్తకంలో రాసుకున్న మాటలతో ముగిస్తా. ‘‘పవిత్రంగా ఉండు. స్వచ్ఛమైన జీవితాన్ని గడుపు. ఆత్మగౌరవాన్ని సంరక్షిం చుకో. ఇతరులను గౌరవంగా చూడు. సరళ స్వభావుడవై నిరాడంబరంగా మెలుగు. కానీ, అవసరమైనచోట దృఢత్వాన్ని ప్రదర్శించడానికి వెనుకాడకు’’ (నేడు వివేకానంద జయంతి) దిలీప్ రెడ్డి వ్యాసకర్త పూర్వ సమాచార కమిషనర్ ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
వెరీ స్పెషల్
ఐదు నెలల తర్వాత ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేశారు మలయాళ నటుడు దిలీప్. అంత గ్యాప్ ఎందుకొచ్చింది? అంటే.. నటి భావన కేసులో నిందితుడిగా ఆల్మోస్ట్ 80 రోజులు జైల్లో ఉన్నారాయన. గతేడాది జూలై 10న దిలీప్ ‘రామలీల’ సినిమాలోని ఓ లుక్‌ను పోస్ట్ చేశారు. అదే రోజున భావన కేసుకు సంబంధించి ఆయన అరెస్ట్ అయ్యారు. దిలీప్ రిలీజైన తర్వాత విడుదలైన ‘రామలీలా’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌ను రాబట్టింది. అయితే.. ఇప్పుడు ఆయన పోస్ట్ చేసింది తన అప్‌కమింగ్ సినిమా ‘కమ్మార సంభవం’ గురించి. ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న లుక్‌ను ఫేస్బుక్లో పోస్ట్ చేశారాయన. దిలీప్, సిద్ధార్థ్, నమితా ప్రమోద్, బాబీ సింహా ముఖ్య తారలుగా నటిస్తున్నారు. రతిస్ అంబత్ దర్శకత్వం వహిస్తున్నారు. నిజానికి 2016లో ఈ సినిమా స్టారై్టంది. దిలీప్ అరెస్ట్ ఇష్యూతో షూటింగ్ లేట్ అయ్యింది. అందుకే ఈ సినిమా షూటింగ్‌ను ప్రస్తుతం వేగంగా జరుపుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే.. మలయాళంలో సిద్ధార్థ్‌కు ఈ సినిమా ఫస్ట్ మూవీ. ‘మలయాళంలో నా తొలి చిత్రం ‘కమ్మార సంభవం’ ఫస్ట్ లుక్ ఇది. దిలీప్ లుక్ బాగుంది కదూ. వెరీ స్పెషల్ లుక్. నాకు వెరీ వెరీ స్పెషల్ పిక్చర్’ అని సిద్ధార్థ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. సిద్ధార్థ్ కూడా ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. -
మంచితనమై పరిమళించనీ!
అతి సంపన్నుల్లో ఇటీవల పొడసూపుతున్న దాతృత్వ గుణం ఓ మంచి లక్షణమే! ఫ్రెంచ్ తాత్వికుడు రూసో అన్నట్టు, తగిన నిర్వచనం చెప్పని ‘అభివృద్ధి’ ముసుగులో రాజ్యం, దాన్ని గుప్పిట పట్టిన పాలకులు చేసే విధ్వంసాలెన్నో! మన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అమరావతిలో చెప్పిన అక్షరసత్యంతో ముగిస్తా. ‘‘భవనాలు, రహదారులు, వంతెనలు అభివృద్ధి సంకేతాలు మాత్రమే! సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండటమే నిజమైన అభివృద్ధి’’. కాలం, గతం నుంచి వర్తమానం గుండా భవిష్యత్తుకు సాగే ఓ నిరంతర పయనం. సహజంగానో, కృత్రిమంగానో చోటుచేసుకునే సమస్త ఘటనలు, పరిణామాలు, జయాపజయాలు... వాటి ఉనికికి ప్రత్యక్ష సాక్షి కాలం. అగణితం, అనంతమైన ఈ కాలానికి మనిషి ఊహతో గీసుకున్న విభజన రేఖలే... క్షణం, నిమిషం, గంట, దినం, వారం, మాసం, ఏడాది. ఇదొక రకంగా కాలానికి మనిషి కట్టిన కొలతల వంతెన. నడుస్తున్న ఏడాది ముగుస్తుంటే, కొత్త ఏడాది వాకిట్లో నిలబడి ఉన్నాం. 30, 31....1 ఇలా తేదీలూ, గణాంకాలు ఎప్పుడూ ఉండేవే! మనిషి అనేక అవసరాల కోసం ఈ లెక్కలు కడుతూనే ఉన్నాడు, ఉంటాడు! డిసెంబరు 31 కాగానే, జనవరి 1తో కొత్త సంవత్సరం మొదలు! మార్పన్నది, గోడకు వేలాడదీసిన ఉత్తి క్యాలెండర్ మారడమేనా? మనిషేమయినా మారుతున్నాడా? ఏడాదికోసారి తప్పనిసరిగా మనిషి మారాలా? ఇవన్నీ శేషప్రశ్నలే! మార్పు అనేది సహజం. ఎంత మార్పు జరిగింది? ఎక్కడ్నుంచి మార్పు మొదలయింది? మార్పుతో ఆశిం చిన లక్ష్యసాధన జరిగిందా? మార్పు మంచికా, చెడుకా? అన్న ప్రశ్నలకు సమాధానం సాపేక్షంగా పోల్చి చెప్పాల్సిందే తప్ప చాలాసార్లు నేరుగా జవాబుండదు. మార్పును ఆశించే వారంతా, ఎక్కడో ఇది మొదలవాలి కనుక కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, ఆశయాలతో ముందుకు వస్తారు. మార్పు తమకు అనుకూలంగా ఫలితమివ్వాలని ఆశించడం సహజం! అదంతా అలా ప్రతిఫలిస్తే ఇప్పటివరకు సమాజంలో సర్వత్రా మంచే జరిగుండాలి! కానీ, మన చుట్టూ జరుగుతున్న పరిణామాలు సదరు భరోసా ఇవ్వలేకపోతున్నాయి. పరిశోధన, శాస్త్రసాంకేతికత మనిషిని ముందుకు నడిపిస్తుంటే, విలువలు పతనమౌతున్న దుస్థితి, పర్యవసానాలు సగటు మనిషి ఆలోచన, ఆచరణను వెనక్కి నడుపుతున్నాయి. వొళ్లు గగుర్పొడిచే కొన్ని ఘటనలు, పరిణామాల్ని లోతుగా విశ్లేషిస్తే భవిష్యత్తు భయంగొల్పేదిగా ఉంటోంది! మనకేమైంది? ఎటుపోతున్నామని మనల్ని మనం నిలదీసి ప్రశ్నించాలనిపిస్తుంది. అదే సమయంలో, ఎడారిలో ఒయాసిస్సులా గుండెల్ని కదిలించే పరిణామాలూ చోటు చేసుకుంటున్నాయి. మంచి–చెడు నిష్పత్తిలో హెచ్చుతగ్గులే కాలధర్మాన్ని నిర్దేశిస్తాయంటారు. సదరు నిష్పత్తి మార్పునకు ఎవరి వంతు కృషి వారు చేయలేరా? కొత్త సంవత్సరం ముంగిట్లో సంకల్పం తీసుకోలేరా? ఎంత అమానవీయం! తన ప్రేమ ప్రతిపాదనను అంగీకరించలేదని నిర్దాక్షిణ్యంగా పెట్రోల్ పోసి కాల్చి చంపాడో ఉన్మాది. తండ్రిలేని కుటుంబానికి జీవనాధారమైన యువతి జీవితాన్నే హరించాడు. జనమంతా తూ... అంటున్నా, పశ్చాత్తాపమే లేని పశుప్రవృత్తితో పోలీసుస్టేషన్‌కొచ్చి లొంగిపోయాడు! సమాజానికి ఇదేం సంకేతం? ఒకరిపై వేరొకరికుండే అధికారమేంటి? ‘ప్రేమ’ పవిత్రత తాలూకు వాసనైనా లేని స్వార్థ ఆలోచనాపరులు, తమ సంకుచిత వ్యామోహానికి ఆ ముసుగు కప్పి అరాచకాలకు దిగుతున్నారు. తప్పొప్పుల మీమాంసే లేదు, ప్రతీకార బాట పడుతున్నారు. ఈ భావనల్ని ప్రేరేపించే వస్తువుతో, బాధ్యతారహితంగా తీస్తున్న సమకాలీన సినిమా ప్రభావాన్ని ఎలా చూడాలి? ఇదమిత్ధంగా ఏమీ తెలియని యువతరం బలహీనతలపై ఆడుకుంటూ ఓ చౌకబారు ‘వాణిజ్య నమూనా’ను ‘ప్రేమ’ చుట్టూ అల్లి సొమ్ము చేసుకునే సినీ పెద్దల దోషమేమీ లేదా? ప్రేమించినా, విడిపోవాల్సి వచ్చిన ఓ తప్పనిసరి పరిస్థితిలో... ‘‘ప్రేమించినదే నిజమైతే, నిను మరచుటయే ఇక రుజువుకదా....’’ (ఆత్రేయ) అని తనకుతానుగా దూరమయ్యే ప్రేమ పిపాసుల్ని సృష్టించి, సమాజానికి మార్గదర్శకులుగా నిలిచిన నాటి దర్శకులు ఇప్పుడు మనకేరి? సాంకేతికత, ఆర్థికాభివృద్ధి అవి రెండూ నియంత్రిస్తున్న వస్తు వినిమయ ప్రపంచం మానవ సంబంధాలను పలుచన చేస్తోంది. మనిషి మనుగడపై వ్యతిరేక ప్రభావం చూపిస్తోంది. అన్ని స్థాయిల్లో విలువలు పతనమవుతున్నాయి. వాటిని పునరుద్ధరించే వస్తువు ఇప్పుడు సమకాలీన సాహిత్యం, కళలు, థియేటర్, సినిమా, టీవీ, ఇతర ప్రసారమాధ్యమాల్లో రావలసి ఉంది. కానీ, జరుగుతున్నది అందుకు పూర్తి విరుద్ధం. వస్తువు నిర్ణయించే అత్యధికుల్లో సామాజిక బాధ్యత గుండు సున్నా. జీవనశైలిపై తీవ్ర ప్రభావం ఇష్టపడి చేసుకున్న భర్తని ఓ గృహిణి తన ప్రియుడితో చేతులు కలిపి హతమార్చింది. ఆమ్లం–ప్లాస్టిక్ సర్జరీతో ముఖకవళికల్ని మార్చి అతడే మొగుడని నమ్మింపజూసి అడ్డంగా దొరికిపోయింది. ఏమిటీ దారుణమంటే, ‘టీవీ సీరియల్ చూసి చేశాను, అందులో లాగానే అంతా సజావుగా జరిగిపోతుందనుకున్నాన’ని బదులిచ్చింది. ఇదా సగటు మనుషులు జనమాధ్యమాల నుంచి పొందాల్సిన స్ఫూర్తి? పలు నేరాలకు, అసహజ పరిణామాలకు సినిమాలు, టీవీ సీరియళ్లు ప్రేరణ అవుతున్నాయి. తరచూ ఇటువంటి ఘటనలు బయటపడుతున్నాయి. నిజానికి టీవీ దుష్ప్రభావం వల్ల జనం చెడి, వెలుగుచూడని దురాగతాల సంఖ్యతో పొలిస్తే ఇవి పిసరంతే! కుటుంబ సంబంధాలు బెడిసికొడుతున్నాయి, ఆర్థిక లావాదేవీలు మనుషుల్ని విడదీస్తున్నాయి. వావివరసలు గాల్లో కలుస్తున్నాయి. కనీస మానవ విలువలు అడుగంటుతున్నాయి. టీవీ కార్యక్రమాలు నూరిపోసే పగ–ద్వేషం, కక్ష–కార్పణ్యం, అలవోక అక్రమసంబంధాలు, చీటికిమాటికి చిందే నెత్తురు... సగటు జీవి నరనరానికి పాకుతున్నాయి. నిద్రలో, మెలకువలో వెంటాడుతున్నాయి. జీవితాన్ని–వినోదాన్నీ వేరు చేసి చూపే/చూసే విజ్ఞత లోపించినపుడు పరిణామాలిలాగే ఉంటాయి. టీవీ మాధ్యమం వచ్చిన కొత్తలో జిందగీ, తమస్, బునియాద్, ఎజోహై జిందగీ, హమ్‌లోగ్ వంటి టీవీ కార్యక్రమాలు వినోదంతో పాటు జీవితపు బాధ్యతను తెలిపేవి. అంతర్లీనంగా మావనసంబంధాల్లోని, సంఘ భావన– సమిష్ఠి కుటుంబ జీవన విధానాల్లోని మాధుర్యాన్ని అవి అందించేవి. ప్రపంచం దగ్గరైంది, మనుషులు దూరమయ్యారు సాంకేతిక ప్రపంచం నూతన ఆవిష్కరణలెన్నో! కాల్ సెంటర్లు, కృత్రిమ మేధ యుగంలో ఉన్నాం. సౌకర్యాల సంగతెలా ఉన్నా, సగటు మనిషి సరళ జీవితం మరింత సంక్లిష్టమైంది. జీవన పోరాటం జటిలమైంది. ‘మానవ సంబంధాల్ని సాంకేతికత అధిగమించే ఓ రోజొస్తుంది, అప్పుడిక మిగిలేది మూర్ఖుల లోకమే!’ అని ఈ సహస్రాబ్ది మహామేధావిగా పేరొందిన ఐన్‌స్టీన్ అన్నారు. పక్కంటివారి జీవితం పట్టదు. ఆ ఇంట్లో ఏం జరుగుతుందో, ఎవరొచ్చి పోతున్నారో, వారి మంచి–చెడులేంటో పొరుగునున్న వారికేమాత్రం తెలియని పరిస్థితి. రెండు దశాబ్దాల కింద ఉన్న సామాజిక జీవన పరిస్థితులు నేడు లేవు. ఆనందం లేకున్నా సౌఖ్యంగా జీవించాలనుకోవడం, తృప్తి లేకున్నా ఇతరుల గుర్తింపుకోసం వెంపర్లాడటం, ‘సెలబ్రిటీ’ ముద్రకోసం అర్రులు చాచడం.. రివాజయ్యాయి. కోట్ల రూపాయలు అప్పులు చేసి, నమ్మకం లేని షేర్ మార్కెట్లో పెటి,్ట ఒక్కరోజులోనే కోట్లకు అధిపతి కావాలనే ఆత్రుత ఎందుకో! ఇదే నేపథ్యంతో అమీన్‌పూర్‌కు చెందిన ఓ కుటుంబం మొత్తం అనాథల్లా రోడ్డు పక్కన బతుకు చాలించింది. కరీంనగర్ హుజూరాబాద్‌లోనూ ఒక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. పచ్చని జీవితాల్లో నిప్పుపెట్టుకొని, యుక్తవయసులోనే నూరేళ్లు నింపుకుంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారెం దరో! తరచి చూస్తే తెలిసివచ్చేది చిన్న చిన్న కారణాలే! చదువే ఒక శాపంలా ఒత్తిళ్ల మధ్య చావులు. పెళ్లే ఒక నరకంగా వేధింపుల మధ్య బలవన్మరణాలు! బెడిసిన కుటుంబ, ఆర్థిక సంబంధాలే వెంటాడే కష్టాలుగా తనువు చాలించడాలు... ఇదీ పరిస్థితి! కష్టాలను ఎదుర్కొనే పాటి ధైర్యం చిక్కటం లేదు. స్థయిర్యం చాలటం లేదు. గతంలో, కఠిన సమయాల్లోనూ చిరు సహాయాలు ప్రాణాలు నిలిపేవి. వ్యక్తిగత సమస్యల్లో నలుగుతుంటే సమిష్టి కుటుంబంలో ఓ ఆసరా దొరికేది. ఆర్థిక సమస్యల్లో సతమతమౌతుంటే ఇరుగుపొరుగు నుంచి ఓ అనునయింపు లభించేది. చావు ఆలోచన దరికొచ్చేది కాదు. మధ్యగడులు మాయం! సమాజంలో ఈ రోజు చాలా మందికి స్పష్టమైన విభజన రేఖ కావాలి! మంచి–చెడు, తెలుపు–నలుపు, ఎడమ–కుడి, లాభం–నష్టం... అంతే, మధ్యలో గడులుంటాయన్న స్పృహే వారికి లేదు. కనీస మానవ సంబంధాల ఊసేలేదు! ఫలితంగా పిల్లలు, కిశోరవయస్కులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. కూతురు కులం కాని వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని కన్నతండ్రే ఆ యువకుడ్ని కిరాతకంగా హతమార్చిన ఘటన భువనగిరిలో సంచలనం సృష్టించింది. ఎదిగిన సమాజాల్లో కూడా ఇలాంటి పరువు హత్యలు పొడచూపడం ప్రమాద సంకేతం! పిల్లలకు ఏమి ఆసక్తో కాకుండా, వారిని తామేమి చేయాలనుకుంటున్నారో... ఆ చదువులు రుద్దుతున్నారు. వయసు పైబడిన కన్నవాళ్లను తమకొక భారంగా భావించి రోడ్డుపైన వదిలేస్తున్నారు. ఇంట్లో అన్నీ ఉన్నా, నిర్దాక్షిణ్యంగా వృద్ధాశ్రమాలకు తరలిస్తున్నారు. సమాజంలోనూ అసహనం తీవ్రస్థాయికి చేరింది. అయితే నాతో, లేదంటే శత్రువుతో.... మధ్యలో మరో ప్రత్యామ్నాయమే లేదంటున్నారు. అది ఆహారపు అలవాటో, వస్తు వినియోగమో, నిరసన తెలుపడమో.... ఏదైతేనేం, గిట్టని పనులు చేసే వారిని హతమారుస్తున్నారు. చర్చ, సంప్రదింపులకు బదులు భౌతికనిర్మూలనే మార్గంగా ఎంచుకుంటున్నారు. శాస్త్ర సాంకేతికత పుణ్యమా అని సామాజిక మాధ్యమాలు మనిషి జీవితాల్లో తిష్ట వేసుకున్నాయి. ఫేస్బుక్, మెసెంజర్, వాట్సాప్... ఇలా ఎన్నెన్నో! ఉపయోగాలున్నా, వ్యసనంగా మారి యుక్తవయస్కుల్ని సోమరి, దద్దమ్మల్ని చేస్తున్న సందర్భాలెన్నో! సరైన ‘సెక్స్ ఎడ్యుకేషన్’ లేని మన సమాజంలో కిశోరవయస్కుల్ని పోర్నో సైట్లు, సామాజిక మాధ్యమాలు కల్లోలపరుస్తున్నాయి. వయసుకు మించిన అనుచితాలకు పురికొల్పుతున్నాయి. మైనర్, అదీ మందు తాగి, లైసెన్సు లేకుండా కారు నడిపి.. ఏ మాత్రం సబంధంలేకుండా దారిన పోయే ఒక కుటుంబాన్నే నాశనం చేసిన ఓ దుర్మార్గాన్ని హైదరాబాద్ నగరం కన్నీటి పర్యంతమై చూసింది. మంచి మార్గం ఎంచుకోలేమా? జరుగుతున్న ఎన్ని అనర్థాల గురించి మాట్లాడినా... మంచికీ మార్గముంది. సత్సంకల్పం, ఆచరించే చిత్తశుద్ధి కావాలి. సాటి మనిషిని మనిషిగా గుర్తించే సద్బుద్ధి ఉండాలంతే! దేశం కోసం ప్రాణ త్యాగానికీ సిద్ధపడి ఒక పోలీసు కానిస్టేబుల్ ఉగ్రవాదిని పట్టుకున్నాడు. కర్ణాటకకు వెళ్లి, కత్తిపోట్లకూ వెరవకుండా, ఐసిస్ వైపు మళ్లి కుట్రదారుడైన యువకుడ్ని బంధించి శౌర్యచక్ర పొందాడు. కరీంనగర్లో రొడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి, తన అవయవదానం ద్వారా మరణానంతరం కూడా ఇతరులకు ఉపయోగపడ్డాడు. ఈ భావన ఇటీవల చాలా పెరిగింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ పరోపకారం గురించి యోచించి, ఆచరించే మానవతామూర్తులెందరో! పెరుగుతున్న ఆర్థిక అసమానతలు సమాజంలో అశాంతికి కారణమవుతున్నాయి. అతి సంపన్నుల్లో ఇటీవల పొడసూపుతున్న దాతృత్వ గుణం ఓ మంచి లక్షణమే! ఫ్రెంచ్ తాత్వికుడు రూసో అన్నట్టు, తగిన నిర్వచనం చెప్పని ‘అభివృద్ధి’ముసుగులో రాజ్యం, దాన్ని గుప్పిట పట్టిన పాలకులు చేసే విధ్వంసాలెన్నో! మన రాష్ట్రపతి కోవింద్ అమరావతిలో చెప్పిన అక్షరసత్యంతో ముగిస్తా. ‘‘భవనాలు, రహదారులు, వంతెనలు అభివృద్ధి సంకేతాలు మాత్రమే! సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండటమే నిజమైన అభివృద్ధి’’. దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
ఇలా చేద్దాం...!
వలస పాలన నుంచి విముక్తి చెందిన మనం ఇంగ్లిష్ ఆదిపత్య ప్రభావం నుంచి బయటపడితే తప్ప తెలుగు సంపూర్ణ వికాసం చెందదు. ఇలా చెప్పడం అంటే, ఇంగ్లిష్‌ను అంటరాని భాషగా దూరం పెట్టి మడికట్టుకోమని కాదు. ప్రాథమిక స్థాయిలో తల్లి భాషలో విద్యాబోధన జరుపుతూ, తదనంతరం ఆంగ్లం నేర్పించాలి. దేశమేదయినా.. స్థానికంగా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరెన్నిక గన్న మేధావుల్లో అత్యధికులు అలా వచ్చినవారే. ఆంగ్లంలో సాధించే ప్రావీణ్యం తెలుగును పణంగా పెట్టి కావొద్దు. రెండో ప్రాధాన్యతతోనే ఇంగ్లిష్ నేర్చుకోవాలి. ప్రపంచీకరణ రోజుల్లో అదంత తేలిక కాకపోవచ్చు. కష్టమైనా అదే జరగాలి, అప్పుడే తెలుగు బతుకుతుంది. ప్రభుత్వాలు పూనిక వహిస్తే అసాధ్యమేమీ ఉండదు. అన్ని కాలాల్లోనూ భాషను బతికించడం, వృద్ధి పరచడంలో పౌర సమాజంతోపాటు పాలకులదే ప్రధాన పాత్ర. రాజరిక వ్యవస్థ నుంచి నేటి ప్రజాస్వామ్య పాలన వరకు ఇదే జరుగుతోంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి, ఆ మేరకు సంకల్పం ఉంటేనే తెలుగు భాషాభివృద్ధికి అండ. ఓట్ల రాజకీయాలకు పెద్దపీట వేస్తున్న ఈ రోజుల్లో ఎవరు ఒత్తిడి తెచ్చారని రాష్ట్రంలో ఇంతపెద్ద తెలుగు పండుగ జరుపుతున్నారు? సంకల్పం అంటే ఇదే! కానీ, ఆచరణలో లోపాలున్నాయి. సభా వేదిక వద్ద ‘మీడియా మీటింగ్ హాల్’ అని ఆంగ్లంలో తాటికాయంత అక్షరాలతో రాయడమే పరభాషా అనుచిత ప్రభావం. ఇది రాష్ట్రమంతా ఉంది. అన్ని నామఫలకాలదీ అదే గతి. ఒకోసారి తెలుగే ఉండదు. ఆశించే మార్పు ప్రభుత్వం నుంచి మొదలవాలి. పొరుగునున్న తమిళనాడు, కర్ణాటక, ఒడిశా వంటి రాష్ట్రాలు తల్లిభాషను పకడ్బందిగా అమలు పరుస్తాయి. రాయితీ కొనసాగిస్తూ సినిమా పేరు ‘రోబో’ అనుమతించాలన్న ప్రముఖ నటుడు రజనీకాంత్ విజ్ఞప్తిని తమిళ ముఖ్యమంత్రి తోసిపుచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఏ ఇతర భాషలో అయినా ‘రోబో’గానే విడుదలయిన ఆ సినిమా తమిళనాట మాత్రం ’యెన్తిరన్’ (యంత్రం)గా విడుదలయింది. అదీ భాష పట్ల కచ్చితత్వం. అదుండాలి. ..: దిలీప్‌రెడ్డి -
భాషాభివృద్ధికి బాట వేయాలి!
సమకాలీనం తల్లిభాషలో విద్యాబోధనను నిర్బంధం చేసైనా విద్యావిధానంలో పెనుమార్పులు తేవాలన్న భాషా పరిశోధకులు, సంస్కర్తలు, మేధావివర్గం ప్రతిపాదనలకు ప్రభుత్వ సహకారం అంతంతే! రాజ్యాంగం, చట్టాలు, న్యాయస్థానాల తీర్పుల్ని కూడా అమలుపరచడం లేదు. పరిశోధనలు జరగటం లేదు. సాంకేతికంగా పుట్టుకొస్తున్న కొత్త పదాలకు తెలుగులో సమానార్థకాలు రావడం లేదు. ఒక ప్రామాణిక నిఘంటువైనా నిర్మాణానికి నోచుకోలే! పారిభాషిక పదకోశాలు రావటం లేదు. అందువల్ల కొత్త తరానికి భాష పట్ల ఆసక్తి కలగటం లేదు. ‘‘ఒక మాటకు ఒక అర్థం. అదీ న్యాయం. కాని, ఈ ప్రపంచంలో చూడండి! ఒక మాటకు పది అర్థాలు. ఒక అక్షరానికి లక్ష అర్థాలు. శ్రీ అనే అక్షరం, లేదా మాట, చూడండి–ఎన్ని అర్థాలో! ఇక రెండో కొసను: ఒక అర్థానికే కోటి పదాలు, ఉదాహరణ, స్త్రీ, స్త్రీ వాచకానికి పర్యాయపదాలు ఇంతవరకు సంపుటీకరించిన శాస్త్రి గారెవరూ నాకు కనబడలేదు. ఈ పదార్థాల నిరంకుశత్వాన్ని భరించలేడు నవకవి! ఒక పదం అనేక అర్థాలను అంతఃపురంలో దాచుకునే వివాహం, ఒక అర్థం అనేక పదాలతో విచ్చలవిడిగా విహరించే వ్యభిచారం......’’ –శ్రీశ్రీ తెలుగు భాషను సుసంపన్నం చేసిన ‘నానార్థాలు’, ‘పర్యాయపదాల’ను ఇంత బాగా విశ్లేషించిన వారు లేరేమో! 1939 లో ఒక పుస్తకానికి ముందుమాట రాస్తూ మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు ఈ వ్యాఖ్య చేశారు. ఏడున్నర దశాబ్దాల కింద నవకవిలోనే భాషపై అంతటి భిన్నాభిప్రాయం ఉంటే, ఇప్పటి నవతరం ఎలా చూస్తారు? ఎలా చూస్తున్నారు? భాష చలనశీలత కలిగినది. ఎన్నో మార్పులకు గురవుతూ వస్తున్న మన తెలుగుదీ సుదీర్ఘ చరిత్ర, వైభవం. వెయ్యేళ్ల సాంద్ర రచనా సంపత్తి, రెండు వేల ఏండ్ల లిఖిత భాషా ప్రాచీనత, అంతకు పైబడిన ఉనికి మన సొంతం. ఇందులో ఉత్థానపతనాలున్నాయి. ఆయా కాలాల్లో... తెలుగు పరిమళభరితమై విరాజిల్లిన, కల్మషాలను కలగలుపుకొని సాగిన వైవిధ్య గతముంది. కానీ, మునుపెన్నడు లేని తీవ్ర సంక్షుభిత స్థితిని ఇప్పుడు తెలుగు భాష ఎదుర్కొంటోంది. తెలుగు చదవటం, రాయడం పట్ల కొత్తతరం కనీస ఆసక్తిని కూడా కనబరచడం లేది ప్పుడు. కొన్నాళ్లు పోతే తెలుగును కోరేవారే ఉండరేమో! వలసపాలన అవశేషాల్లో ఒకటైన ఆంగ్లంపై భ్రమ, విశ్వమంతటినీ విపణివీధిగా మార్చిన ప్రపంచీకరణ, తల్లి భాష తెలుగుపట్ల గౌరవభావమేలేని నవతరం, వరుస ప్రభుత్వాల నిర్లక్ష్యం... వెరసి భాషను ప్రమాదపు అంచుకు నెడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఇప్పుడీ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. ఈ వేదికనుంచయినా ఓ గొప్ప సంకల్పం భాషోద్ధరణకు దారులు పరవాలి. ఇప్పటికిప్పుడు మాట్లాడుకోవడాలకేం ఇబ్బంది ఉండదేమో కాని, మున్ముందు గడ్డుకాలమే! రాను రాను తెలుగు రాయడం–చదవడం కనుమరుగయ్యే ప్రమాదాన్ని తప్పించాలి. మన దేశంలో అక్షరాస్యతే అంతంత! 40 శాతానికి మించిన అక్షరాస్య జనాభా తల్లిభాషకు దూరమైతే, సదరు భాష స్వల్ప కాలంలో మృతభాషగా మారే ప్రమాదముందనేది ఐక్యరాజ్యసమితి హెచ్చరిక. ఈ ఒరవడి ఇలాగే కొనసాగితే, సమీప భవిష్యత్తులోనే అది తెలుగుకు పతనశాసనమౌతుందని ‘యునెస్కో’ పరిశోధనా ఫలితాలు హెచ్చరిస్తున్నాయి. తల్లిభాషలోనే ప్రాథమిక స్థాయి విద్యాబోధన నిర్బంధం చేయడంతో సహా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలతో భాషను బతకనివ్వాలి. అంతర్జాతీయ అనుసంధాన భాషగా ఇంగ్లిష్ ఎంత ముఖ్యమైనా, పిల్లల్లో సహజ సృజన–పరిశోధనాతత్వం వృద్ధి, వ్యక్తిత్వ వికాసానికి తల్లిభాషలో విద్యాభ్యాసం ప్రాధాన్యతను తల్లిదండ్రులు గుర్తించాలి. పోటీ ప్రవాహంలో పడి కొట్టుకుపోకుండా, పిల్లలు సహజ మేధో వికాసంతో నిలదొక్కుకునేలా విద్యాసంస్థలు పూనిక వహించాలి. అన్యభాషాలంకార పుష్పాలెన్నున్నా, పూలదండలో దారం లాగా తల్లిభాష వారిలో ఇంకేలా చేయాలి. ప్రసారమాధ్యమాలు, ప్రభుత్వాలు, వాటి ఉపాంగాలయిన వివిధ అకాడమీలు భాషపై నిరంతర పరిశోధనల్ని కొనసాగించాలి. కొత్త తరంలో తెలుగుపై ఆసక్తిని, వినియోగంపై అనురక్తిని పెంపొందించే చర్యలుండాలి. సాధనం వారికే, బాధ్యత వారిదే! భాషా వికాసంలో ప్రసారమాధ్యమాల, ముఖ్యంగా జనమాధ్యమాల పాత్ర అపారం. జన సమూహాల మధ్య, ప్రజలు–పాలకులకు మధ్య, పరస్పర ప్రయోజనాలున్న పలు పక్షాల నడుమ జన మాధ్యమాలు సంధానకర్తలు. ఈ క్రమంలో భాషే వాటి భావవ్యాప్తికి ఉపకరణం! ఎప్పటికప్పుడు భావ ప్రసరణ నైపుణ్యాల్ని వృద్ధి చేసుకుంటూ భాగస్వాములకు గరిష్ట ప్రయోజనాలు కలిగించే క్రమంలో భాషను ఆ«ధునీకరించడం, అభివృద్ధి చేయడం తమ కర్తవ్యంగానే కాక ఒక అవసరంగా కూడ లోగడ పరిగణించేవారు. అందుకే మొదట్నుంచీ ఈ మాధ్యమంలో క్రియాశీల పాత్ర నెరిపే వారందరికీ భాషకు సంబంధించి బలమైన పునాదులుండేవి. సంపాదకులకు, మీడియాలో వివిధ స్థాయి నిర్వహకులకు సాహిత్యంతో సాంగత్యం ఆ రోజుల్లో సహజం. స్వాతంత్య్రానికి పూర్వం, తర్వాతి తొలి దశాబ్దాల్లో కూడా అటు సాహితీ శ్రేష్ఠుల్లో పాత్రికేయ అనుభవజ్ఞులు, ఇటు జర్నలిస్టుల్లో సాహితీ మూలాలున్న వారు ఎక్కువగా కనిపించేవారు. కందుకూరి వీరేశలింగం, తాపీ ధర్మారావు, నార్ల వెంకటేశ్వరరావు, బండి గోపాలరెడ్డి (బంగోరె), సురవరం ప్రతాపరెడ్డి, వట్టికోట ఆళ్వార్‌స్వామి, అడవి బాపిరాజు, నండూరి రామ్మోహనరావు తదితరులతో పాటు శ్రీశ్రీ, ఆరుద్ర, బాపు–ముళ్లపూడి వెంకటరమణ, గజ్జెల మల్లారెడ్డి, పురాణం సుబ్రహ్మణ్యశర్మ.... తదితరులు రెండు పాత్రల్ని సమర్థంగా నిర్వహించిన వారే! సాహిత్యం–పాత్రికేయం, రెండు రంగాల్లో ప్రావీణ్యమున్న అటువంటి ముఖ్యుల నేతృత్వంలో దినపత్రికల నుంచి వార, మాస, త్రైమాసిక, వార్షిక ఇలా రకరకాల పత్రికలు, టీవీ తదితర మాధ్యమాలు వేర్వేరు రూపాల్లో భాషాభివృద్ధి జరిపేవి. ఇటీవలి పరిణామాల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భాషకు సంబంధించిన పూర్ణ అవగాహన లేకున్నా, లోతుపాతులు తెలియకున్నా... ఇతరేతర అర్హతలతో మీడియాలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. నేతృత్వం వహిస్తున్నారు, ప్రధాన జర్నలిస్టులుగా చలామణి అయిపోతున్నారు. భాషా వికాసం సంగతలా ఉంచి, భాషపైన శ్రద్ధ కూడా తగ్గింది. తప్పొప్పుల్నీ పెద్దగా పట్టించుకోవడం లేదు. తెలుగు పట్ల కనీస గౌరవం, మర్యాద లేని వారు కీలక స్థానాలు అలంకరిస్తున్నారు. భాషాభివృద్ధికి దోహదపడాల్సిన పత్రికలు, టీవీ చానళ్లు, వెబ్సైట్లు అపప్రయోగాలతో భాషను భ్రష్టుపట్టిస్తున్నాయనే విమర్శలు పెరిగాయి. మీడియా అలక్ష్యం, లెక్కలేనితనం వల్లే భాష సంకరమైపోతోందనేది ఆరోపణ. ఇంగ్లిష్ శరవేగంగా తెలుగు సమాజపు దైనందిన భాషా వాడకంలోకి, సంభాషణల్లోకి చొచ్చుకు వచ్చేసింది. ఈ పరిణామం తెలుగు అస్తిత్వానికే ప్రమాదకారిగా మారిందనే భావన బలపడుతోంది. దీన్ని పరిహరించాల్సిన మాధ్యమాలు, భాషా సంకరానికి తామే కారణమౌతున్నాయని, ముఖ్యంగా టీవీపైన ఈ విషయంలో ఘాటైన విమర్శ ఉంది. ఇదంతా దాదాపు రెండు దశాబ్దాల పరి ణామం. చేతన, స్పృహతో ఇప్పుడు జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగానైనా ఈ దిశలో అడుగులు పడతాయేమోనన్నది ఒక ఆశ! ఈ పండుగైనా శ్రీకారం చుట్టాలి... తెలుగు ప్రపంచ పండుగకు ఇల్లలికారు. ఈ రోజునుంచే పండుగ మొదలు. ప్రతి పండుగా ఇంటిల్లిపాదికీ ఉల్లాసం కలిగించేదే! నిరంతర కాలప్రవాహంలో అప్పుడప్పుడు పండుగలతో సంబురాలు చేసుకోవడం మన సంస్కృతిలో భాగం! ఈ అయిదొద్దుల పండుగకు ఎన్నెన్నో వేదికలు, మరెన్నో వేడుకలు. ఒక జాతిని సమైక్యపరుస్తున్న తెలుగు భాషా వైభవాన్ని తలచుకోవడం, ఉన్నతిని చాటుకోవడం, తాజా స్థితిని సమీక్షించుకోవడం, వీలయినంత బాగుచేసుకోవడం, కనుమరుగు ప్రమాదమున్న చోట కాపాడుకోవడం.... ఇలా అనేక లక్ష్యాలతో పండుగ నిర్వాహకులు పలు కార్యక్రమాలు రూపొం దించారు. ఏకకాలంలో వివిధ వేదికల నుంచి ఈ వేడుకలు జరుగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచే కాక విదేశాల నుంచీ కవులు, రచయితలు, భాషావేత్తలు, పరిశోధకులు, వ్యవహారకర్తలు, భాషాభిమానులు ఇతర ఔత్సాహకులు హైదరాబాద్‌కు దారికట్టారు. తెలుగు భాషను ప్రేమించేవారికిది సంతోషం. ఈ చర్యల పట్ల విశ్వాసం లేని వారూ ఉన్నారు. ఈ సభలను తాము బహిష్కరిస్తున్నట్టు విప్లవకవి వరవరరావు తదితరులు బహిరంగ ప్రకటన చేశారు. 47 ఏళ్ల కిందటి ఒక కరపత్రాన్ని కొందరు మళ్లీ తెరపైకి తెస్తున్నారు. ‘....కసాయివాడు జీవకారుణ్యం మీద సెమినార్ పెడితే భూతదయ కలవాళ్లు ఉరకటమేనా?’ అని గొప్ప కథారచయిత కొడవటిగంటి కుటుంబరావు పేరిట, అప్పట్లో (1970) వ్యాప్తిలోకి వచ్చిన కరపత్రమది. విశాఖ–హైదరాబాద్‌ల నడుమ, మహాకవి శ్రీశ్రీ కేంద్ర బిందువుగా ఈ పరిణామాలు పాలకులకు వ్యతిరేకంగా జరిగాయి. భిన్న వాదనలతో సాహితీవేత్తల సమూహం నిలువునా చీలిపోయింది. తనను సత్కరించేందుకు తలపెట్టిన సదస్సుకు, ముందే ప్రకటించి శ్రీశ్రీ గైర్హాజరయ్యారు. భాషాభివృద్దికి ప్రభుత్వం చేపట్టే చర్యలకు మద్దతెంత లభిస్తుందో, కొన్నిసార్లు వ్యతిరేకతా అంతే ఉంటుంది. అందుకు, వేర్వేరు కారణాలుండవచ్చు. కానీ, భాషను కచ్చితంగా అమలుపరచే విషయమై ప్రభుత్వ చర్యల్లో చిత్తశుద్ధి కొరవడ్డ సందర్భాలు కోకొల్లలు. తల్లిభాషలో విద్యాబోధనను నిర్బంధం చేసైనా విద్యావిధానంలో పెనుమార్పులు తేవాలన్న భాషా పరిశోధకులు, సంస్కర్తలు, మేధావివర్గం ప్రతిపాదనలకు ప్రభుత్వ సహకారం అంతంతే! రాజ్యాంగం, చట్టాలు, న్యాయస్థానాల తీర్పుల్ని కూడా అమలుపరచడం లేదు. పరిశోధనలు జరగటం లేదు. సాంకేతికంగా పుట్టుకొస్తున్న కొత్త పదాలకు తెలుగులో సమానార్థకాలు రావడం లేదు. ఒక ప్రామాణిక నిఘంటువైనా నిర్మాణానికి నోచుకోలే! పారిభాషిక పదకోశాలు తయారవటం లేదు. ఇవేవీ లేకపోవటం వల్ల కొత్త తరానికి భాష పట్ల ఆసక్తి కలగటం లేదు. ఇవన్నీ జరిగేలా ఈ పండుగ నుంచి ఒక కార్యాచరణ పుట్టాలి. దాని అమలుకు ప్రభుత్వం కట్టుబడాలి. ఇంగ్లిష్ ప్రభావం నుంచి బయటపడాలి తెలుగు భాషను ఆధునీకరించుకోవాలి. కొత్త పదాల సృష్టి జరగాలి. మాండలికాలు ప్రామాణిక జాబితాలో చేరి విరివిగా వాడకంలోకి రావాలి. జనం పలుకుబడిలో నలిగిన అన్య భాషాపదాల ఆదానప్రదానాలు జరిగి స్థిరీకరణ పొందాలి. పదసంపద పెరిగి, తల్లిభాషలో తెలుగువారి అభివ్యక్తి రాటుతేలాలి. జనసామాన్యం తిరగాడే చోట నామ ఫలకాలు తెలుగులోనే ఉండాలనే ఒక నిర్బంధాన్నీ అమలు చేయలేదు. ప్రభుత్వ కార్యాలయాల పేర్లను తెలిపే ఫలకాలూ ఆంగ్లంలోనే ఉంటాయి. తెలుగు మాటే ఉండదు. ప్రభుత్వ కార్యకలాపాలు, ఉత్తరప్రత్యుత్తరాలు, విభిన్న స్థాయిల్లోని కోర్టు ఉత్తర్వులు.... ఇలా అన్నీ అన్యభాషలోనే! పాక్షిక న్యాయ విభాగాల్లోనూ అంతే! తెలుగులో ఫిర్యాదు, తెలుగులో విచారణ, తెలుగులో సాక్షి వాంగ్మూలం నమోదు, తెలుగులో వాద–ప్రతివాదనలు.... కానీ, తీర్పులు ఇంగ్లిష్‌లో! ఇంకెప్పటికి పరి స్థితి మారుతుంది? దీన్నుంచి మనం బయటపడాలి. 52 ఏళ్లకింద డాక్టర్ రామ్మనోహర్ లోహియా చెప్పిన ఒక మాటతో ముగిస్తాను. దేశంలో తలెత్తిన భాషాపరమైన అల్లర్లపై 1965, ఫిబ్రవరి 23న కేంద్రం తలపెట్టిన ముఖ్యమంత్రుల సమావేశాన్ని దృష్టిలో ఉంచుకొని, 19న మన హైదరాబాద్ నుంచి ఆయన ఒక ప్రతిపాదన వెల్లడించారు. అందులో 6వ అంశం ఇలా ఉంది. ‘‘తమ ప్రాంతాల నుంచి ఇంగ్లిష్ భాషను తొలగించుకున్న రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాల నుంచి కూడా ఇంగ్లిష్‌ను తొలగించుకోవాలి. కేవలం రాష్ట్ర స్థాయిలో ఇంగ్లిష్‌ను తొలగించినందువల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు సరికదా, ఈ భ్రమోత్పాదక స్థితివల్ల నష్టం కూడా సంభవించవచ్చు.’’ ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com దిలీప్ రెడ్డి -
ఇలా చేద్దాం...!
గొప్ప చరిత్రతో వారసత్వ సంపద అయిన తెలుగు పదికాలు బతకాలి. భాషా పండుగలు ఇందుకెంతో మేలు చేస్తాయి. ఈ స్ఫూర్తి కొనసాగాలి. భాషను బతికించడానికి ఉద్యమాల సంగతెలా ఉన్నా, ఉన్న చట్టాల అమలు ముఖ్యం. 40 శాతం మంది మాతృభాషను చదవడం, రాయడం మానివేసినప్పట్నుంచి ఈ భాష అతి స్పల్ప కాలంలో మృతభాషగా మారే ప్రమాదముందని ఐక్యరాజ్యసమితి (యూఎన్)కి చెందిన ‘యునెస్కో’ హెచ్చరిం చింది. ఇంగ్లీషుపై ఇటీవలి మోజు, కార్పొరేట్ విద్యాసంస్థలు సృష్టిస్తున్న ‘పోటీ’ మాయ, ఆశావహులైన తల్లిదండ్రుల భ్రమ, ప్రభుత్వాల అచేతన... వెరసి నేటితరంలో అత్యధికులు మాతృభాష రాయడం, చదవడం రాని దుస్థితిలోకి జారుతున్నారు. పరిపాలన వ్యవహారాలు తెలుగులో సాగాలని డిమాండ్ చేయలేని తరం తయారైనా ఆశ్చర్యం లేదు. కానీ, అక్షరాస్యతా శాతాలు, ప్రమాణాలను బట్టి చూస్తే తెలుగులో అధికారిక వ్యవహారాలే సామాన్యులకు మేలు. సృజన వృద్ధికి, మేధో పరిణతికి, సంస్కృతీ వికాసానికి, ప్రజాభాషలో పాలనా వ్యవహారాలకు.. తెలుగును కాపాడుకోవడమే కర్తవ్యం. ప్రాథమిక స్థాయి విద్యాబోధన మాతృభాషలోనే సాగాలని, 1993లోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగం 350 అధికరణమూ ఇదే చెబుతోంది. తెలుగును అధికార భాషగా 1966లో శాసనం ద్వారా ప్రకటించారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (1898)ని సవరిస్తూ కేంద్రం 1974లో చట్టం తెచ్చింది. నిబంధనలు 137 ప్రకారం సివిల్ కోర్టుల్లో, 272 ప్రకారం క్రిమినల్ కోర్టుల్లో (హైకోర్టు కాకుండా) అధికార భాష ఏముండాలో నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వాలకిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 1974లో ఇచ్చిన ఉత్తర్వు (జీవో:485) ప్రకారం క్రిమినల్ కోర్టుల్లో తెలుగును అధికార భాషగా పరిగణించాలి. కానీ, అమలు శూన్యం. 2005 సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వం స్వచ్ఛందంగా వెల్లడించాల్సిన సమాచారమైనా, పౌరులు కోరేదైనా స్థానిక/అధికార భాషలో అందించాలి. పౌర సమాజం ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి ఇవన్నీ సాధించుకోవాలి. ..: దిలీప్‌రెడ్డి వైతాళికులు భాగ్యరెడ్డివర్మ సంఘసంస్కర్తగా హరిజనోద్ధ్దరణకు కృషి చేసిన భాగ్యరెడ్డి వర్మ దళితుడు. 1932లో ఆయన రాసిన ‘వెట్టి మాదిగ’ ఒక దళితుని కథ. ఇది తెలుగులో దళితుడు రాసిన మొదటి కథ కూడా. 1914లో ఆయన హైదరాబాద్‌లో బ్రహ్మసమాజం స్థాపించారు. 1915లో సంఘసంస్కార నాటక మండలిని స్థాపించారు. ఈ మండలి ద్వారా హరిజన కళాకారులు నాటకాలను ప్రదర్శించేవారు. 1931లో ‘భాగ్యనగర్’ పత్రికను స్థాపించారు. 1937లో దీనిని ‘ఆది హిందూ పత్రిక’గా మార్చారు. సామాన్య ప్రజల్లో గొప్ప అభిమానాన్ని, ఆదరణను చూరగొన్న భాగ్య రెడ్డివర్మ ఆర్యసమాజం ద్వారా ప్రజల్లో అంటరానితనం, స్త్రీ విద్య, వితంతు వివాహాలు, విగ్రహారాధన వంటి మూఢ నమ్మకాల నిర్మూలనకు కృషి చేశారు. తెలుగులో తొలి రాజనీతి గ్రంథం కాకతీయ సామ్రాజ్యం విచ్ఛిన్నమైన తర్వాత సామంతులు, దండనాథులు చిన్న చిన్న రాజ్యాలను ఏర్పరుచుకున్నారు. ప్రతాపరుద్రుని సేనాని ముప్ప భూపతి సచ్చ రాష్ట్రానికి (కరీంనగర్ జిల్లా) అధిపతి అయ్యాడు. ఆ ముప్ప భూపతి ఆస్థాన కవి మడికి సింగన. పద్మపురాణోత్తర ఖండం, భాగవత దశమస్కంధం, వాసిష్ట రామాయణం, సకల నీతి సమ్మతం గ్రంథాలను రాశాడు సింగన. పురాణాల నుంచి అద్భుతమైన అంశాలను తీసుకుని కావ్యాన్ని రాయడం ఆయన ప్రారంభించిన కొత్త ప్రక్రియ. ఆయన రాసిన సకల నీతి సమ్మతం కూడా గొప్పప్రయోగం. సకల నీతి సమ్మతంలో సమాజానికి అవసరమైన సర్వనీతులూ పొందుపరిచాడు. ఇందులో ప్రస్తుతం మూడు ఆశ్వాసాలే లభిస్తున్నాయి. కాకతీయ సామ్రాజ్యం పతనమైన తర్వాత రాజకీయ అస్థిరత ఏర్పడింది. ఆ పరిస్థితి చక్కబడాలంటే పాలకులకు రాజనీతి పరిజ్ఞానం అవసరం. అందుకే చాణుక్యుడు అర్థశాస్త్రంలో చెప్పిన విషయాలు, భోజరాజు అనుసరించిన రాజనీతి సూత్రాలు, కాకతీయులలోనే సమర్థుడైన మొదటి ప్రతాపరుద్రుడు నీతిసారంలో చెప్పిన మంచి విషయాలు, మహాభారత రామాయణాది కావ్యాలలోని రాజనీతి అంశాలను, ఇతర గ్రంథాలలోని పాటింపదగిన సంగతులను క్రోడీకరించాడు సింగన. పాలకులు అనుసరించాల్సిన రాజనీతిని వారికి కరతలామలకం చేశాడు. - ప్రొ. కుసుమారెడ్డి షడ్రుచుల ‘పద్యా’న్నం! అనవిని వ్రేటువడ్డ యురగాంగనయుంబలె, నేయి వోయ భ గ్గన దరికొన్న భీషణ హుతాశన కీల యనంగ లేచి, హె చ్చిన కనుదోయి కెంపు తన చెక్కుల గుంకుమ పత్రభంగ సం జనిత నవీన కాంతి వెదచల్లగ గద్గద ఖిన్న కంఠిౖయె అసలే సత్యభామ... ఆపై కోపం. నారదుడు తెచ్చిన పారిజాతం ఓ పువ్వే కావచ్చు. రుక్మిణి పక్కనుందని ఆ కృష్ణుడు ఇచ్చేయడమేనా? కోపం రాదేంటి. సత్య అలకను అల్లాటప్పగా చెప్పేందుకు తిమ్మనకు మనసొప్పలేదు. తైలవర్ణ చిత్రం గీసేందుకు ‘వర్ణా’లను సరిచూసుకున్నాడు. సత్య విసురుగా లేచింది... ఎలా? తోకతెగిన ఆడత్రాచులా, నేయిపోస్తే ఎగజిమ్మే జ్వాలలా! చింతనిప్పుల్లా కణకణమండే కళ్లు. కళ్ల ఎరుపు చెక్కిళ్ల ఎరుపుతో కలగలసి జేవురించిన మొహం. అదుపు తప్పిన స్వరం. ఇదీ సత్య ఉగ్రరూపం. ఆవేశం, ఆక్రోశం, ఉక్రోషం ముప్పిరిగొన్న గొంతుకతో సఖితో ఆరా తీయసాగింది. తిమ్మన్న సత్యభామను దూరంలో త్రాచులా, కాస్త దగ్గరలో ఎర్రబడిన కళ్లతో, అతి దగ్గరలో వణుకుతున్న స్వరంతో... మూడు దశల్లో త్రీడీ చిత్రంలా చూపాడు. పద్యం కవితోపాటు పాఠకుల్ని చెలికత్తెగా మార్చి సత్య వద్ద నిలబెట్టినట్టు లేదూ! సామెత ‘ఊరంతా వడ్లెండ బెట్టుకుంటే నక్క తోక ఎండబెట్టుకొన్నదట’ ఇంకొకరిని అనుకరించి అభాసుపాలయ్యేవారిని ఉద్దేశించి ఈ సామెత ప్రయోగిస్తారు. -
భాషాభివృద్ధికి ఇలా చేద్దాం...!
తెలుగును అధికారిక వ్యవహారాల్లో తప్పనిసరి చేయాలనడం మాతృభాషా వ్యామోహమో, భాషా దురభిమానమో కాదు. ఇది, ఒక భాషా ప్రయుక్త సమాజ వికాసానికి సంబంధించిన అంశం. ప్రజాస్వామ్య పాలనలో ఫలాలు సంపూర్ణంగా సామాన్యులకు అందాలనే, నిజమైన పారదర్శక పాలన కోసమే! ప్రభుత్వానికి–అధికారులకు, నాయకులకు–అధికారులకు, ప్రభుత్వ వివిధ విభాగాలు–ప్రజలకు మధ్య జరిగే ఉత్తరప్రత్యుత్తరాలన్నీ మాతృభాషలో జరిగితే ప్రజలకు ఎంతో మేలు. చట్టసభల్లో, పాలకమండళ్ల్లలో, సభలు–సమావేశాల తీర్మానాల్లో, ప్రభుత్వ ఉత్తర్వుల్లో–ఆదేశాల్లో, న్యాయస్థానాల తీర్పుల్లో అంతటా మాతృభాషనే వాడాలి. అలా కాక అన్యభాషలో జరిగినపుడు దళారులు రాజ్యమేలుతారు. సదరు అన్యభాషతో లోతైన పరిజ్ఞానం ఉన్నవారు, భాష రానివారి ప్రయోజనాలను పణంగా పెట్టి అనుచిత లబ్ధి పొందే ప్రమాదముంది. ఇక్కడ ఇంగ్లిషు–తెలుగు భాషల విషయంలో జరుగుతున్నదదే! దీన్ని పరిహరించి, సమత్వ సాధనకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. మాతృభాషాభివృద్ధి్దకి కృషి చేయాలి. అందుకోసం, కొన్ని వెసులుబాట్లు, రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించాలి. ఇది అసాధారణమేమీ కాదు. విశ్వవ్యాప్తంగా ఉన్నదే! - ప్రభుత్వం నిధులు వెచ్చించి, భాషా శాస్త్రజ్ఞులు, సామాజికవేత్తలు, నిపుణులతో కమిటీ వేసి ముందు ఉన్నంతలో భాషను ప్రామాణీకరించాలి. - సంపూర్ణ అక్షరాస్యత సాధనకు తెలుగే ఉపకరణం కనుక, అలా సాధించిన గ్రామాలకు నగదు ప్రోత్సాహకాలు ప్రకటించాలి. - 1–12 తరగతుల్లో తెలుగును తప్పనిసరి చేస్తామంటున్నారు కనుక ఉత్తీర్ణత కోసం (ఇప్పుడు సంస్కృతం, ఫ్రెంచ్ వంటివి చదువుతున్నట్టు) కాకుండా చిత్తశుద్ధి్దతో చదివేలా ఉన్నత విద్యలో, ఉద్యోగ–ఉపాధి అవకాశాల్లో వారికి అదనపు ప్రాధాన్యత (వెయిటేజీ/రిజర్వేషన్) కల్పించాలి. - తమ దైనందిన కార్యకలాపాల్లో తెలుగు రాసే అధికారులకు ప్రోత్సాహకాలు, వాడని వారికి జరిమానాలు విధించాలి. - తెలుగు పాత సాహిత్యాన్ని విరివిగా ప్రచురించి, సామాన్యులకు చౌకగా అందుబాటులోకి తేవాలి. - దిలీప్ రెడ్డి పాతకాలంలో వార్తలు ఇలా రాసేవారు కొన్నాళ్ల కిందట కృష్ణలో వ్యసనకరమయిన వక సంగతి జరిగి అందువలన అనేక ప్రాణహాని హేతువ అయినది. సుమారు నూటికి జనం యెక్కి వక పడవ– బెజవాడ రేవు దాటేటప్పుడు యేటిన తెమికీ పోయి మహా వేగముతో వక పెద్ద రాతినట్టుకు తగిలి దాపు దాపుగా అందులో నుండిన బాటసార్లందరు చనిపోయినారు. ఆ పడవ నీళ్ల వడికి నిలువలేక బహువేగముగా పోతూ వొడ్డిగిలినందువలన నిముషములో నీరు నిండి ముణిగిపోయినది. ముగ్గురు మాత్రము తప్పి వచ్చినారు– ఇది బాజారి ఖబురుగా తెలిసినది గాని అధికారత్వేనా వకరికి సమాచారము అందలేదు. ఆ రేవున వుండే కృష్ణ వెడల్పు సుమారు కోశెడు దాకా ఉన్నది. అక్కడ సంభవించిన పడవ స్థితి వ్రాసి వచ్చినందు వలన నీళ్ల రేవులు పడవల మీద దాటేవారికి జాగ్రత్త కలుగవలెనని తెలియచేసినాము. – 1842 ఆగస్టు 11, వర్తమాన తరంగిణి వారపత్రిక(డాక్టర్ జె.చెన్నయ్య ‘తెలుగు దినపత్రికలు: భాషా సాహిత్య స్వరూపం’ నుంచి...) షడ్రుచుల ‘పద్యా’న్నం! ఏనుగులావెంత, యిల మావటీదెంత, తిమిరంబు బలమెంత,దీపమెంత ఘనసముద్రంబెంత, కర్ణధారకుడెంత, బహుకాననంబెంత, పరశువెంత పారెడు నీరెంత,పర్వతంబదిఝెంత, హరుడెంత, మదులపుష్పాస్త్రమెంత, భీకరఫణిఝెంత, వాకట్టు వేరెంత, బహురాజ్యమెంత, భూపాలుడెంత ఝెవ్వరికి దొడ్డుకొంచెంబు లెంచరాదు, నడచు నిటువంటివెల్ల నీ నాటకటములు –తాళ్లపాక తిమ్మనాచార్యులు ఎంత...చిన్న పదం. నువ్వెంత అంటే నువ్వెంత అంటుంటాం. కానీ ఈ పద్యంలో ఎంత... ఎంతో ఎంతెంతగానో కనిపిస్తుంది. కవి చమత్కారం సరే. దాన్ని ప్రదర్శించే శక్తి భాషకుఉండాలి కదా. తెలుగుకు ఆ సత్తా ఉంది. తాళ్లపాక అన్నమాచార్య కుమారుడు తాళ్లపాక తిమ్మనాచార్యులు రాసిన ఈ పద్యంలో ‘ఎంత’ ఎంత వింతలు చేసిందో చూడండి. ఏనుగు ఎంత లావుంది...మావటీడుని చూడగానే దారికొచ్చేస్తుంది. చీకటి ఎంత దట్టంగా ఉన్నా పరిగెత్తించేందుకు చిన్న దీపం చాలు. సముద్రం ఎంత పెద్దదైతేనేం...దాన్ని చీల్చుకు వెళ్లే నావికుడు చిన్నవాడే. ఎంత గొప్ప హరుడైనా... మన్మథుడు వేసిన చిన్న పూబాణానికి చిత్తయ్యాడు. రాజ్యం ఎంత పెద్దదైనా...పాలించే రాజు ఒక మనిషే. ఇదీ తెలుగు పద్యమంటే! ఒక్కొక్క పాదం పూర్తవుతుంటే భావం విమానంలా పైకి లేస్తుంది. చివరి పాదంలో పెద్ద చిన్న అంటూ తేడాలు చూపడం సరికాదు అని ముగిస్తాడు. ఈ విషయం చెప్పేందుకు ఎంత చక్కని దారి ఎంచుకున్నాడో. భాషకు రససమర్పక శక్తి ఉంది కాబట్టే ‘ఎంత’ అనే చిన్న పదం ఇంతింతై మనసును ఆక్రమిస్తుంది. – రామదుర్గం -
ఇలా చేద్దాం..!
మానవ పరిణామ క్రమంలో భాష పాత్ర అసాధారణం. బుద్ధిజీవులైన మనుషుల పరస్పర భావ మార్పిడి ప్రక్రియలో ప్రత్యామ్నాయం లేని ఉత్కృష్ట సాధనమిది. మానవ సమూహాల, జాతుల వికాసంతో నేరుగా ముడివడిన భాషలు కూడా క్రమ వికాసం పొందుతూ వచ్చాయి, పొందుతున్నాయి, పొందాలి. భాష మనుగడకు వాడుకే జీవగర్ర. అన్ని భాషల్లాగే తెలుగుకూ వివిధ స్థాయి ప్రయోజనాలున్నాయి. భావ వినిమయానికే కాక సంస్కృతి పరిరక్షణలో, వారసత్వ సంపదల్ని కాపాడ్డంలో, కళలను పరిపుష్టపరచడంలో... ఇలా భాష ఉపయోగాలెన్నెన్నో! మనిషి జీవన ప్రస్థానంలో అత్యున్నత ఆశయమైన ఆనందమయ జీవితాన్ని సాకారం చేసుకోవడంలో భాష పోషించే పాత్ర అనితరసాధ్యమైంది. అంతటి కీలకమైన భాషను కాపాడవలసిన బాధ్యత మనందరిదీ. నిర్లక్ష్యం చేసిన ఎన్నో జాతుల మాతృభాషలు కాలగర్భంలో కలిసి, మృతభాషలయ్యాయి. అనునయం పొసగని అన్య భాషలతో తంటాలు పడుతున్న పలు మానవ సమాజాల వికాసం కుంటి నడకే! వారి సృజన గుడ్డి దీపపు మసక కాంతిలో మగ్గుతోంది. నవతరం బడి పిల్లలు, ఉత్సాహం ఉప్పొంగే యువతరం, భావి తరాల్ని తీర్చిదిద్దే తల్లిదండ్రులు, భాష పునాదులకు పాదులు కట్టాల్సిన ఉపాధ్యాయులు, దాన్ని పెంచి పోషించాల్సిన విద్యా సంస్థలు... భాషా పరిరక్షణపై శ్రద్ధ పెంచాలి. ముఖ్యంగా ప్రభుత్వాలు వ్యూహ–నిర్మాణాత్మక చర్యల ద్వారా భాషలను మననిచ్చే, కాపాడే, వృద్ధిపరిచే చర్యలు చేపట్టాలి. గొప్ప సదాశయంతో నిర్వహిస్తున్న ఈ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఇలాంటి విషయాలను ఈ వారం పాటు ఇక్కడ ముచ్చటించుకుందాం. - దిలీప్‌రెడ్డి -
మలయాళం మాట్లాడతా
సిద్ధార్థ్ తమిళ్ పయ్యన్ (అబ్బాయి). అయితే తెలుగు కూడా బాగా మాట్లాడతారు. ఈజీగా నేర్చేసుకున్నారు. కొన్ని రోజులుగా ఈ తమిళ కుర్రాడు మలయాళం నేర్చుకునే పని మీద ఉన్నారు. ఎందుకో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘కమ్మార సంభవం’ అనే మలయాళ మూవీలో నటిస్తున్నారు సిద్ధార్థ్. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో దాదాపు 40 సినిమాల్లో నటించిన సిద్ధూకి మలయాళంలో ఇది మొదటి సినిమా. అందుకని చిత్రదర్శకుడు రితీష్ అంబాతి సిద్ధూ పాత్రకు వేరే వ్యక్తితో డబ్బింగ్ చెప్పించాలనుకున్నారట. కానీ, సిద్ధూ సొంత గొంతు వినిపించడానికి రెడీ అయి, మలయాళం నేర్చుకున్నారు. రితీష్ అంబాతి దర్శకత్వంలో దిలీప్, సిద్ధార్థ్, నమిత, బాబీ సింహా ముఖ్య పాత్రల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ‘‘సినిమాలో సిద్ధార్థ్ పోర్షన్ షూటింగ్‌ను కంప్లీట్ చేశాం. బాగా నటించారాయన. తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకోనున్నారు. వచ్చే ఏడాదిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’’ అన్నారు రితీష్. -
మౌనం శత్రువు..చర్చే నేస్తం
లైంగిక హింస బాధితులపై దీర్ఘకాలపు దుష్ప్రభావాన్ని చూపడమే కాకుండా కుటుంబంపైన, జనసమూహంపైన, మొత్తం సమాజంపైనే ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నా, అవి సరిపోవటం లేదు. ఒక జాడ్యంలా విస్తరిస్తున్న ఈ లైంగిక హింస పరిష్కారానికి గట్టి మార్గాన్వేషణ సాగాలి. అంతకు ముందు భారత శిక్షాస్మృతి (ఐపీసీ) కింది సెక్షన్లతో నేరాల నియంత్రణ సాధ్యపడలేదు. ‘నీ మౌనం నిన్ను కాపాడదు’ అని ఎలుగెత్తి చాటారు ప్రఖ్యాత కవయిత్రి, పౌరహక్కుల ఉద్యమకారిణి అడ్రి లోర్డ్ (1934–92). మనుషుల్ని మనసారా నమ్మే మంచితనం, ‘దగ్గరి తనం’ ముసుగు కింది మృగాలనెరుగని అమాయకత, దురాగతాలపై పెగలని గొంతు.... వెరసి ఈ దేశపు బాల్యాన్ని మొగ్గలోనే చిదిమేస్తున్నాయి. ప్రతి ఘటించని తప్పుడు భావనలతో తరాల తరబడి వారసత్వంగా వస్తున్న ఈ ‘మౌనమే’లైంగిక దాడులకు గురవుతున్న పసిమొగ్గలకు శాపంగా పరిణమిస్తోంది. వారి మౌనమే తమ వికృత క్రీడల మైదానంగా కామంతో కళ్లు మూసుకుపోయిన ‘మృగా’ళ్లు దేశంలో కోట్లాది మంది పసిమొగ్గల్ని కర్కశంగా నలి పేస్తున్నారు. తెలిసి చేసిన నేరమైనా, అది వెలుగుచూడక, సమాజంలో వారింకా పెద్దమనుషులుగానే చలామణి అవుతున్నారు. వివిధ స్థాయిల్లో కామవాంఛను తీర్చుకునే వీరి చేష్టలు చిన్నారుల భవిష్యత్తును చీకట్లోకి నెడుతున్నాయి. పసితనపు వాకిట్లోనే వారి నూరేళ్ల జీవితం దారితప్పుతోంది. తట్టుకోలేని వారు ఆత్మహత్యలతో అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. మిగిలిన వారు, చేదు జ్ఞాపకాలు జీవితకాలం వెన్నాడుతుంటే ఏదోలా బతికేస్తున్నారు. ఈ దుస్థితి ఇలాగే కొనసాగితే, సమీప భవిష్యత్తులోనే ఒక బలహీనమైన సమాజావిష్కరణ తప్పదేమోనన్న ఆందోళన ఆలోచనాపరులకు కలుగుతోంది. తల్లిదండ్రుల తప్పుడు భావనలు, దారి తప్పిస్తున్న ఆధునిక సాంకేతిక సౌలభ్యాలు, గట్టిగా నిలవని చట్ట–న్యాయ ప్రక్రియలు ఈ దిశలో పిల్లల కష్టాలను మరింత ఎక్కువ చేస్తున్నాయి. అఖిల భారత స్థాయిలో జరిగిన సర్వే గణాంకాలు విజ్ఞానవంతమౌతున్న సమాజపు సభ్యులుగా మనందరినీ సిగ్గు పడేటట్టు చేసేవిగా ఉన్నాయి. లైంగిక హింసకు రూపాలెన్నో.... పసిపిల్లలపై సాగుతున్న లైంగిక హింసకు వ్యతిరేకంగా ఇటీవల నోబెల్ బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. 18 ఏళ్ల లోపు పిల్లలపై జరిగే లైంగిక దాడులు వివిధ రూపాల్లో ఉంటాయి. పెద్ద నేరంగా భావించలేమనిపించే పిల్లచేష్టలతో మొదలయ్యే ఈ దాడులు వికృతి రూపు సంతరించుకుంటాయి. మనోభావనల పరంగా, çసంజ్ఞలు–సంకేతాలుగా, మానసికంగా, శారీరకంగానూ పిల్లలపై సాగే ఈ లైంగిక దాడులు శరీరాన్ని తాకని పద్ధతిలోనే కాకుండా తాకి, భౌతికంగా తీవ్ర హింసకు గురి చేసే అత్యాచారాల వరకూ విభిన్న రూపాల్లో ఉంటాయి. అవన్నీ బాధితుల్లో వేదన కలిగించేవే! ఆడపిల్లలపైనే కాకుండా మగపిల్లలపైనా ఈ దాడులు జరుగుతున్నాయి. అమానుషంగా సాగే ఈ దాడులు లింగ, ప్రాంత, వయో, ఆర్థిక, అక్షరాస్యతా స్థాయి వ్యత్యాసాలకు అతీతంగా అంతటా జరగటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే వెల్లడైన ఓ సర్వే ప్రకారం 18 ఏళ్ల లోపు ప్రతి ఇద్దరిలో ఒకరు ఏదో రూపంలో లైంగిక వేధింపులకు గురవుతున్నట్టు వెల్లడైంది. ప్రతి అయిదుగురిలో ఒకరు లైంగిక పరంగా అభద్రతతో ఉన్నట్టు గుర్తించారు. దేశ వ్యాప్తంగా 26 రాష్ట్రాల్లోని, 45,844 మంది పిల్లలతో, వారి స్థాయికి దిగి మాట్లాడి సేకరించిన (డాటా) సమాచారాన్ని శాస్త్రీయంగా విశ్లేషించారు. ‘వల్డ్ విజన్ ఇండియా’ నిర్వహించిన ఈ సర్వేలో చాలా విషయాలు వెల్లడయ్యాయి. నాలుగు కుటుంబాలలో ఒకటి కూడా ఫిర్యాదు చేయడం లేదు. కేంద్రం జరిపిం చిన ఒక సర్వేలోనూ, సమాజంలో జరుగుతున్న ఈ అనర్థాల్లో నమోదవుతున్న కేసులు నాలుగోవంతు కూడా ఉండటం లేదని తేలింది. అంతులేని మౌనం వల్ల సమస్య తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఓ అంచనా దొరకటం లేదు. దగ్గరివారి దాష్టీకాలే ఎక్కువ పిల్లలపై జరుగుతున్న లైంగిక హింసలో 97 శాతం కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, అత్యంత సన్నిహితులు పాల్పడుతున్నవే అన్నది గగుర్పాటు కలిగించే నిజం. అపరిచితుల నుంచి జరిగే నేరాలు చాలా తక్కువ. జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ నిందితులు 304 మందిలో బాధితుల బంధువులే 128 మంది ఉన్నారు. 73 మంది వారి కుటుంబానికి అత్యంత సన్నిహితులు. మిగిలిన 103 మందిలో పరిచయస్తులే ఎక్కువ. పిల్లల బంధువులు, సన్నిహితులు, పరిచయస్తులై ఉండీ వారిపై లైంగిక హింసకు తలపడటానికి, బాధితుల వైపు నుంచి రాజ్యమేలుతున్న మౌనమే ప్రధాన కారణం. ఎక్కడైనా జరిగేదే అనో, పెద్దవాళ్లకూ తమ చిన్నతనంలో అటువంటి అనుభవాలుండటమో, చెప్పుకుంటే బయట పరువు పోతుందనే భయమో.... మొత్తమ్మీద కారణమేదైనా, నిజాలు వెలుగు చూడటం లేదు. ఆ పరిస్థితే మృగా’ళ్లకు తెగించే ధైర్యాన్నిస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి మౌనం వీడటం, ఈ అంశంపై ఎడతెగని చర్చను లేవనెత్తడం ఒక పరిష్కారం. పిల్లల్లో అవగాహన పెంచడం, ప్రతిఘటించి–దోషుల్ని శిక్షించి–ఇతర పరి ష్కారాలు వెతకడం గురించి వారు ఆలోచించేలా పరివర్తన తీసుకురావడమే మార్గమని ఈ అంశంపై పనిచేస్తున్న పౌర సంస్థల వారంటున్నారు. బావలు, మేనమామలు, వరుస సోదరులు, బాబాయ్‌లు, కడకు మారు తండ్రి, కన్నతండ్రి వరకు, నా అనుకునే వాళ్లే పసికందుల్ని కాటేసే ఉదంతాలు చూస్తూనే ఉన్నాం. పని ప్రదేశాల్లో కొందరు యజమానులు, బడిలో కొందరు కీచక టీచర్లు చేసే పైశాచిక చేష్టలకు పిల్లలు నలిగిపోతుంటారు. వెకిలి మాటల నుంచి, రోత పుట్టించే సంజ్ఞలు–సంకేతాల నుంచి, శరీరాన్ని–ముఖ్యంగా జననాంగాల్ని తడిమే దుశ్చేష్టల వరకు అంతే ఉండదు. వాటిలో బయటపడేవి కొన్నే! అనాథలు, తల్లిదండ్రులు లేని వారు, వీథి పిల్లలు, తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నవారు ఎక్కువగా ఈ దురాగతాలకు బలవుతున్నారు. తోడవుతున్న పాడు పరిస్థితులు... పెరుగుతున్న శాస్త్ర–సాంకేతికతను ఆసరా చేసుకొని జడలు విప్పే విష సంస్కృతిపై నియంత్రణ లేకపోవడం పిల్లల పాలిట శాపంగా మారుతోంది. విజ్ఞానం పెరుగుతున్నా విలువలు తగ్గుతున్న సామాజిక స్థితి వారెదుర్కొం టున్న లైంగిక దాడుల సమస్యను జటిలం చేస్తోంది. సెక్స్ ఎడ్యుకేషన్ లేని మన వ్యవస్థలో ఇంటర్నెట్ విస్తృతి, విచ్చలవిడి శృంగార వెబ్సైట్లు (పోర్నో), గేమింగ్ కల్చర్ వంటివి యువతను, పిల్లల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. పోర్నో సైట్లపైనే కాక పిల్లలపైన కూడా తల్లిదండ్రులకు నియంత్రణ లేని పరి స్థితి సమస్యను మరింత తీవ్రం చేస్తోంది. స్మార్ట్ ఫోన్ విరివిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత యువత, ముఖ్యంగా కౌమారదశలో ఉన్న పిల్లలు సదరు సైట్లు చూసే అవకాశం, ప్రమాదపు ఆస్కారం రమారమి పెరిగింది. ఆన్లైన్లో యుక్తవయసు పిల్లల్ని లైన్లో పెట్టి ప్రేరేపణలు చేసే దురాలోచనాపరులు, మోసగాళ్ల అవకాశాలు మెరుగయ్యాయి. ముఖ్యంగా పెద్దవాళ్లతో చనువుగా ఉండే పిల్లల భద్రతకు ముప్పు ఏర్పడింది. పిల్లలతో మాటా మాటా కలపడం, నచ్చేలా ప్రవర్తించడం, పొగడటం, అర్ధనగ్న–నగ్న చిత్రాల పరస్పర మార్పిడి.... ఇలా మెల్లమెల్లగా ముగ్గులోకి లాగుతారు. బయటివారెవరికీ తెలియకుండానే బాధితులకి–నిందితులకి మధ్య బంధం బలపడుతుంది. తెలిసీ తెలియని పిల్లల బలహీనతల్ని ఆసరా చేసుకొని, నిర్మిత (వర్చువల్) శృంగార ప్రపంచంలో రెచ్చగొట్టి, వాస్తవిక ప్రపంచంలో ప్రయోగాలకు పురిగొల్పుతున్నారు. ఏదో రూపంలో లొంగదీసుకుంటారు. ఒక బలహీన క్షణంలోనో, బ్లాక్మెయిల్ ద్వారా బలవంతపెట్టో తమ కామవాంఛలు తీర్చుకుంటున్నారని కౌన్సిలర్లు, సైబర్‌నేరాలు దర్యాప్తు చేసే అధికారులు చెబుతున్నారు. ఈ విష సంస్కృతి పిల్లలపై లైంగిక హింసను పెంచుతోంది. సమాజంపైనే దుష్ప్రభావం దీర్ఘకాలం పాటు లైంగిక వేధింపులకు గురయ్యే పిల్లల్లో మానసిక, శారీరక వేదనకు తోడు ఆత్మన్యూనతా భావం బలపడుతుంది. తానెందుకూ పనికిరానన్న భావన పెరిగిపోతుంది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులితరులపై విశ్వాసం సన్నగిల్లుతుంది. క్రమంగా ఆత్మహత్యకు పాల్పడే లక్షణాలు అధికమౌతాయి. లైంగిక హింస బాధితులపై దీర్ఘకాలపు దుష్ప్రభావాన్ని చూపడమే కాకుండా కుటుంబంపైన, జనసమూహంపైన, మొత్తం సమాజంపైనే ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నా, అవి సరిపోవటం లేదు. సమాజం వైపు నుంచి పెద్ద ఎత్తున సహకారం అవసరం. ఒక జాడ్యంలా విస్తరి స్తున్న ఈ లైంగిక హింస పరిష్కారానికి గట్టి మార్గాన్వేషణ సాగాలి. అంతకు ముందు భారత శిక్షా స్మృతి (ఐపీసీ) కింది సెక్షన్లతో నేరాల నియంత్రణ సాధ్యపడలేదు. కొన్ని సున్నితాంశాల నియంత్రణకు అందులో పేర్కొన్న నిబంధనలు, పద్ధతులు సరిపోకపోవడంతో 2012లో కేంద్ర ప్రభుత్వం, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణకు ‘పోక్సో’కొత్త చట్టాన్ని తెచ్చింది. లైంగిక హింసే కాకుండా, అందుకు తలపడటం, యత్నించడం, సహకరించడం... తదితరాంశాల్ని నేరాలుగా ఇందులో చేర్చింది. శిక్షల్ని పెంచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. వివిధ విభాగాలకు చెందిన మహిళా అధికారులతో ఏర్పడ్డ ఈ కమిటీ పలుమార్లు భేటీ అయి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అమలు అంతంతే! పిల్లలపై జరిగే లైంగిక నేరాలపై విస్తృత ప్రచారం జరగాలని, అవగాహన కల్పించాలని, చిన్న తరగతుల నుంచే ఈ విషయాన్ని పాఠ్యాంశగా చేర్చి తరగతులు పెరిగే క్రమంలోనే అవగాహనను సిలబస్ ద్వారా పెంచుతూ రావాలని నిర్ణయించారు. ప్రతి విద్యా సంస్థలోనూ సమస్య తలెత్తకుండా ఈ విషయాన్ని వివరించే కౌన్సిలర్లు ఉండాలనీ ప్రతిపాదించారు. ఇది అమలుకు నోచలేదు. మౌనం ఛేదిస్తేనే... నేరస్తులకు ఆసరాగా, బాధితులకు శాపంగా మారిన మౌనాన్ని ఛేదించాలి. విషయంపై విస్తృతంగా చర్చ జరగాలి. తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి ప్రధాన బాధ్యత తీసుకోవాలి. పిల్లలకు చిన్నతనం నుంచే అన్ని విషయాలపై అవగాహన కలిగించాలి. ఆడ–మగ మధ్య తేడా చూపకుండా పెంచాలి. జననాంగాలు, యుక్తవయసులో వాటి ఎదుగుదల, పునరుత్పత్తి, వ్యక్తిగత స్వేచ్ఛ–హక్కుల గురించి బోధిస్తుండాలి. ఇతరులు చేసే ఏ చిన్న వెకిలి చేష్టనయినా సహించకూడదని, ప్రతిఘటించాలని, తమ దృష్టికి తేవాలని నేర్పాలి. ఎదిగే పిల్లలతో బంధువులెవర్నీ పడక పంచుకునే ఆస్కారం కల్పించకూడదు. వారున్న గదిలో ఇతరులెవరూ పడుకోకుండా చూడాలి. ఎవరూ చెడుగా, అభ్యంతరకరంగా వారిని తాకడాలను ఉపేక్షించకూడదు. మేధస్సు తగుస్థాయిలో వికసించే వరకు పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వొద్దు. ౖ‘చెల్డ్లాక్’సదుపాయం ఉన్నా 13 శాతం మందే ఈ పద్ధతిని వాడుతున్నారు. పిల్లల కదలికలు, ఆలోచనలు, ఆచరణల్ని ప్రేమ పూర్వకంగానే తల్లిదండ్రులు గమని స్తుండాలి. మితిమీరుతున్నారనిపించినపుడు కొంత నియంత్రణ అవసరమే! పిల్లల్ని జాగ్రత్తగా పెంచేటట్టు తల్లిదండ్రుల్ని కార్యోన్ముఖుల్ని చేసేలా ప్రసారమాధ్యమాలు కృషి చేయాలి. చర్చని ప్రోత్సహించాలి. పిల్లలపై లైంగిక దాడులను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కొన్ని వేల స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. వారి కృషి మరింత సమీకృతంగా జరగాలి. ఈ విషయాల్లో ఒకటి మాత్రం అందరూ గ్రహించాలి. మౌనమే శత్రువు, చర్చే నేస్తం! (‘బాలలపై లైంగికదాడులు–నివారణలో మీడియా పాత్ర’పై నేడు హైదరాబాద్‌లో రౌండ్‌టేబుల్ సందర్భంగా) దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
నాలుగు స్తంభాలాట స్ఫూర్తితో...
శేఖర్, దిలీప్, శ్రీలక్ష్మి, గాయత్రీ గుప్తా ముఖ్య పాత్రలుగా కృష్ణవర్మ దర్శకత్వంలో కార్తీక్ రెడ్డి, అశోక్ సిరియాల నిర్మాణంలో రూపొందిన సినిమా ‘జంధ్యాల రాసిన ప్రేమకథ’. సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 24న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కృష్ణవర్మ మాట్లాడుతూ –‘‘గొప్ప దర్శకులైన జంధ్యాల రూపొందించిన ‘నాలుగు స్తంభాలాట’ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రజెంట్ ట్రెండ్‌కి అనుగుణంగా అన్ని కమర్షియల్ హంగులను కథకు జోడించాం’’ అన్నారు. సంగీతం: గోపి. కెమెరా: రత్నబాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట్. -
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘జంధ్యాల రాసిన ప్రేమకథ’
కీర్తి క్రియేషన్స్ బ్యానర్‌పై కార్తీక్ రెడ్డి, అశోక్ సిరియాల నిర్మాతలుగా కృష్ణవర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జంధ్యాల రాసిన ప్రేమకథ’. శేఖర్, దిలీప్, శ్రీలక్ష్మీ, గాయత్రి గుప్తలు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని నవంబర్ 24 న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కృష్ణవర్మ చిత్ర విశేషాలను తెలియజేస్తూ.. ‘తెలుగు చలనచిత్ర పరిశ్రమకు గొప్ప దర్శకులైన జంధ్యాల గారు రూపొందించిన ‘నాలుగు స్తంభాలాట’ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము. ప్రజెంట్ ట్రెండ్‌కి అనుగుణంగా, అన్ని కమర్షియల్ హంగులతో.. అందరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాము. చిత్రం చాలా బాగా వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యుల నుండి మంచి ఫీడ్ బ్యాక్ తో పాటు యూ బై ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని నవంబర్ 24 న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామ’న్నారు. -
మాజీ భార్యే స్కెచ్ వేసి ఇరికించింది
సాక్షి, తిరువనంతపురం : భావన కిడ్నాప్, లైంగిక దాడి కేసు ఉదంతంలో నటుడు, ఎమ్మెల్యే పీసీ జార్జ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దిలీప్ అమాయకుడని.. అతన్ని ఈ కేసులో అనవసరంగా ఇరికించారని అంటున్నారు. మనోరమ ఆన్లైన్ ఇంటర్వ్యూలో జార్జీ మాట్లాడుతూ.. అతని మాజీ భార్య మంజూ వారియర్ దీనంతటికి కారణమన్నారు. ‘‘ఆమెకు దిలీప్ నుంచి విడిపోవటం ఇష్టం లేదు. కానీ, వేరే మార్గం లేక విడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు అవకాశం దొరకటంతో పథకం పన్ని దిలీప్‌ను ఇరికించి ప్రతీకారం తీర్చుకుంది. మంజు మంచి నటే కావొచ్చు. కానీ, అంతకు మించి కఠిన హృదయం కలది’’ అని జార్జ్ చెప్పారు. దిలీప్‌కు ఇంత అండగా ఎందుకు నిలుస్తున్నారన్న ప్రశ్నకు... ఏ తప్పు చెయ్యని ఓ వ్యక్తి 90 రోజులు జైలు శిక్ష అనుభవించాడు. ధర్మం గెలిచి తీరాలన్న ఒకే ఉద్దేశ్యంతో తాను అతని తరపున నిల్చున్నానని.. అందు కోసం ఎక్కడిదాకా అయినా వెళ్తానని జార్జ్ బదులిచ్చారు. కాగా, జార్జ్ ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదని మంజు అంటున్నారు. పుంజార్ ఎమ్మెల్యే పీసీ జార్జ్ ఈ కేసులో మొదటి నుంచి దిలీప్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అంతకు నటి భావనను లక్ష్యంగా చేసుకుని ఆయన మాటల దాడి చేశారు. అంత పెద్ద దాడి జరిగితే మరుసటి రోజు షూటింగ్ కు వెళ్లటమేంటని ఆయన ప్రశ్నించారు. దీంతో భావన తనను జార్జ్ అవమానిస్తున్నారంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఓ లేఖ రాసింది. -
'మా హీరో తలుచుకుంటే.. మీరు సెక్స్క్లిప్ అవుతారు’
మలయాళ నటి అపహరణ, లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ నటుడు దిలీప్‌కు ఈ నెల 3న బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. 85 రోజులు జైల్లో గడిపిన అనంతరం దిలీప్ బయటకు రావడంతో ఆనందం తట్టుకోలేకపోయిన ఆయన అభిమాని ఒకరు ఫేస్బుక్లో ఒక విపరీతమైన వ్యాఖ్య చేశాడు. దిలీప్‌కు మద్దతునివ్వని వారిని బెదిరిస్తూ మలయాళంలో అతను పెట్టిన పోస్టు దుమారం రేపుతోంది. ’దిలీప్‌కు వ్యతిరేకంగా మాట్లాడే స్త్రీవాదులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కేరళ ఇంకా అసలైన కొటేషన్ (నేరం చేసేందుకు ఇచ్చే కాంట్రాక్టు) చూడలేదు. దిలీప్ కోరుకుంటే.. మీరు పురుషుల ఫోన్లలో సెక్స్క్లిప్గా మారిపోతారు’అంటూ అతను కామెంట్ పెట్టాడు. ఈ కామెంట్‌ను ’లాసర్స్ మీడియా’ అనే ఫేస్బుక్ పేజీ పోస్టు చేయగా.. దాని స్క్రీన్‌షాట్‌ను లైంగిక వేధింపులకు గురైన సినీ నటి తన స్నేహితురాలు రిమా కల్లింగల్కు పంపింది. ఆ స్క్రీన్‌షాట్‌ను ఫేస్బుక్లో పోస్టు చేసిన నటి రిమా.. అందులో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ’ఫిబ్రవరి 17న కిరాతకమైన దాడికి గురైన నా స్నేహితురాలు తన చుట్టూ జరుగుతున్న ప్రతిదీ చూస్తోంది. ప్రతిదీ వింటోంది. ఈ స్క్రీన్‌షాట్‌ను తనే పంపింది’ అని ఆమె పేర్కొన్నారు. అయితే, ఒక్కడి పోస్టు వల్ల మహిళలు పురుషులందరినీ అదేగాటున వేసి కించపరచవద్దని, నిజమైన పురుషులు మహిళలకు అండగా ఉంటారని, వారిని కాపాడాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ఆమె పోస్టును ’నల్లవనోప్పమ్’ (మంచి పురుషులతో), ’అవల్క్కోపమ్’ (ఆమె వెంటే) హ్యాష్‌ట్యాగ్‌లతో పెద్ద ఎత్తున నెటిజన్లు షేర్ చేసుకుంటున్నారు. నటుడు దిలీప్.. నటి రిమా కల్లింగల్ -
జంధ్యాల రాసిన ప్రేమకథ
శేఖర్, దిలీప్, శ్రీలక్ష్మీ, గాయత్రి ముఖ్యతారలుగా కృష్ణవర్మ దర్శకత్వంలో కీర్తి క్రియేషన్‌పై కార్తీక్ రెడ్డి, అశోక్ సిరియాల నిర్మించిన చిత్రం ‘జంధ్యాల రాసిన ప్రేమకథ’. గోపీ సంగీత దర్శకుడు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమయ్యింది. కృష్ణవర్మ మాట్లాడుతూ– ‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో గొప్ప దర్శకులైన జంధ్యాలగారు రూపొందించిన ‘నాలుగు స్తంభాలాట’ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రజెంట్ ట్రెండ్‌కు అనుగుణంగా కమర్షియల్ హంగులు జోడించి అందరికి నచ్చేలా చిత్రాన్ని తీర్చిదిద్దాం. ఈ నెలాఖరుకు సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట్. -
చీకటి మాటున దాగిన వేకువ
సమకాలీనం తామెక్కి వచ్చిన మెట్లను ఒకటొకటిగా కూల్చే బాపతు పాలకపక్షాలు నిరసన దారులన్ని టినీ మూసేస్తాయి. ప్రత్యామ్నాయ రాజకీయాలంటే.. మీకిక మాట్లాడుకునే వేదికలే దొరకవు పొమ్మంటాయి. నిరసన తెలిపితే, తప్పదు నిర్బంధమంటాయి. ధర్నాచౌక్‌లు కనుమరుగవుతాయి. పాలకపక్షాలు ఏదీ, ఎక్కడ ప్రత్యామ్నాయం? అని విర్రవీగినప్పుడే చడీచప్పుడు లేకుండా బలమైన ప్రత్యామ్నాయం ఆవిర్భవించిన సందర్భాలు కోకొల్లలు. అన్ని దారులు మూసుకుపోయినట్టున్నా, ఏదో దారి తెరచుకోవడమే ప్రజాస్వామ్య లక్షణం! ‘ఒక దుర్బల ఊరపిచ్చుకను గరుత్మంతునితో పోరాడించు, ఓ నిరుపేద కార్మికుని శరీరంలో కనలే రక్తానికి నిరసన నిప్పురవ్వ జోడించు.... విప్లవం దానంతట అదే వస్తుంది’ అంటాడు మహాకవి ఇక్బాల్. ‘‘సారే జహాసే అచ్చా హిందూ సితా హమార హమారా...’’ అని ప్రపం చానికి ఎలుగెత్తి చాటిన ఆయన, దేశం ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే తీవ్రంగా కలత చెందివుండేవాడే! ప్రజాస్వామ్య వ్యవస్థల మనుగడకు అవసరమైన వాతావరణం దేశంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా పలుచనవుతోంది. పలు వ్యవస్థల్ని పాలకులు పనిగట్టుకొని పలుచన చేస్తున్నారు. ఏకస్వామ్య పాలనా వ్యవస్థల్ని నిరాఘాటంగా నడపాలనే దూరదృష్టితో ప్రజాస్వామ్య వాతావరణాన్నే కకావికలు చేస్తున్నారు. ఆలోచించే మెదళ్లని, నిలదీసే స్వరాల్ని, ప్రశ్నించే గొంతుకల్ని కర్కశంగా నలిపేస్తున్నారు. విప్లవాలు, పోరా టాల సంగతలా ఉంచితే, ఈ సర్కార్ల నీడలో ఆరోగ్యవంతమైన చర్చ, అవసరానికి పనికొచ్చే ఓ ఆలోచన కూడా చేయలేని సమాజం మెలమెల్లగ బలోపేతమౌతోంది ఇప్పుడు. వేర్వేరు కారణాలతో పౌరసమాజం స్వరం మెత్తబడుతున్న క్రమంలోనే ఓ బలహీనమైన సమాజం రూపుదిద్దుకునే పరిస్థితుల్ని ఎగదోస్తున్నాయి మన ప్రభుత్వాలు. ఒకటి రెండు చోట్ల మినహా, పాలకపక్షాల దాష్టీకాలకు విపక్ష రాజకీయ పార్టీలు నిలబడలేకపోతున్నాయి. ప్రచార ఆర్భాటాలే తప్ప ఆర్థిక విధానాల్లో మార్పుల్లేని ప్రత్యామ్నాయాలు కూడా ప్రజా విశ్వాసం పొందలేకపోతున్నాయి. అందుకే అనిశ్చితి. అన్ని చోట్లా పూర్తిస్థాయి వ్యతిరేకత అని చెప్పలేకపోయినా, లోలోపల ఓ అసం తృప్తి, ఆవేదన, అలసట మాత్రం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అప్రజా స్వామికంగా పావులు కదుపుతూనే, ‘మమ్మల్ని కాదంటే, ప్రత్యామ్నాయం ఏముందో చూపండి?’ అనేంతగా పాలకపక్షాల ధీమా ఎల్లలు దాటుతోంది! ప్రత్యర్థుల్ని చిత్తు చేసే ఎత్తులు–పైఎత్తుల రాజకీయ జిత్తుల్లో... ప్రభుత్వాలు, పాలనా వ్యవస్థలు, వాటి అంగాంగాల నుంచి వెలువడే సమాచారాన్ని సగటు ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏది నిజమో తేల్చుకోలేని సందిగ్ధ పరిస్థితులు పౌరుల్ని అయోమయానికి గురి చేస్తున్నాయి. పాలకులు ఏక పక్షంగా తమ అనుకూల సమాచారాన్ని వారిపై రుద్దుతున్నారు. తమకు గిట్టని, ఇరుకున పెట్టే సమాచారాన్ని అధికార బలంతో అడ్డుకుంటున్నారు. ప్రత్యక్షంగా–పరోక్షంగా ఒత్తిళ్లు, అణచివేతలు పెంచి సగటు జీవి స్వతం త్రంగా ఆలోచించలేని, స్వేచ్ఛగా భావాలు వ్యక్తం చేయలేని దుర్భర వాతా వరణం కల్పిస్తున్నారు. ఇదిలాగే బలపడి, రేపు ‘ఒకే దేశం ఒకే ఎన్నికలు’ అన్నది కార్యరూపం దాలిస్తే.... సమాఖ్య వ్యవస్థ అయినప్పటికీ రాష్ట్రాల్లో పరిస్థితులెలా ఉంటాయోనని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతు న్నారు. అవి ఎడారిలో ఒయాసిస్సులు! ఈ గాంధీ జయంతి రోజున నగరంలో ఓ మేధోచర్చ (మంథన్ సంవాద్) జరిగింది. వివిధ రకాల ఆలోచనా ధారలకు ప్రాతినిధ్యం వహించే ఏడుగురు ముఖ్యులు ప్రసంగాలు చేశారు. 2,500 మంది కూర్చునే వ్యవస్థ కలిగిన ‘శిల్పకళావేదిక’, నిర్వాహకులు ఒక్క వాహనమైనా ఏర్పాటు చేయకుండానే స్వచ్ఛందంగా వచ్చిన సభికులతో నిండిపోయింది. అన్ని వయసుల, వర్గాల, ప్రాంతాల వారూ హాజరయ్యారు. లభించిన పరిమిత సమయంలో కూడా మంచి ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ (న్యాయ), కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా (రాజకీయం), జేఎన్‌యూ ప్రొఫెసర్ సుచేతా మహాజన్ (చరిత్ర), పాటల రచయిత, దర్శకుడు వరుణ్ గ్రోవర్ (కళలు), తక్షశిల సంస్థకు చెందిన నితిన్ పాయ్ (విద్య), ఎన్సీపీఆర్ఐ నిఖిల్‌డే (సామాజిక), సీనియర్ జర్నలిస్టు రవీశ్‌కుమార్(జర్నలిజం)లు చేసిన చక్కటి ప్రసంగాలకు అద్భుతమైన స్పందన లభించింది. అంతకు మునుపు నగరంలో ‘హైదరాబాద్ కలెక్టివ్’ ‘కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్’ ‘కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్’ ‘ఫోరమ్ ఫర్ బెటర్ హైదరాబాద్’ తదితర సంస్థలు కూడా పేరున్న వక్తల్ని, మేధావుల్ని రప్పించి పలు చర్చా కార్యక్రమాల్ని ఏర్పాటు చేశాయి. సగటు పౌరుల్లో ఆరోగ్యవంతమైన చర్చను, అర్థవంతమైన ఆలోచనల్ని రేకెత్తించే ఇటువంటి వేదికల అవసరం ఇంకెంతో ఉంది. వాస్తవాలకు రాజకీయ రంగులు పులమకుండా, సమాజం పట్ల తమ బాధ్యతగా భావించి ఉన్నది ఉన్నట్టు చెప్పే, అదీ ప్రభావవంతంగా మాట్లాడే వారితో చర్చా కార్యక్రమాలు ఒక్క తెలుగునాటనే కాకుండా దేశవ్యాప్తంగా జరగాల్సి ఉంది. హైదరాబాద్ స్థాయి దాటి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, తిరుపతి .... ఇలా చిన్న నగరాలు, పట్టణాలకూ ఈ సంస్కృతి విస్తరించాలి. తెలుగులో ప్రసంగాలు చేసే విశ్వసనీయత కలిగిన మేధావుల్ని చొరవ తీసుకొని ఒక వేదిక మీదకు తేగలగాలి. ప్రజల ఆలోచనా పరిధిని విస్తరింపజేసి, తద్వారా సరైన నిర్ణ యాల వైపు వారిని నడిపే ఈ చైతన్యం మరింత కింది స్థాయికి విస్తరించాల్సిన అవసరాన్ని విశాల జనహితం కోరేవారు కాంక్షిస్తున్నారు. రాజకీయేతర ప్రత్యామ్నాయాలే దన్ను! ప్రజాస్వామ్యం అంటే, అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికల నడుమ పాలకుల య«థేచ్ఛ, విచ్చలవిడితనం కాదు. ఒకసారి ఎన్నికలు జరిగిపోతే, మళ్లీ ఎన్నికలు జరిగే అయిదేళ్ల వరకు పౌరులు ఏమీ చేయజాలని అశక్తతా కాదు! మరేంటి? ప్రజల స్వీయ నిర్ణయాధికారం. ప్రజాభిప్రాయానికి విలువ ఉండాలి. ప్రజలకు బలమైన అభిప్రాయాలుండాలి. అవి ఏర్పరచుకోవడానికి అవసరమైన వాస్తవిక సమాచారం అందాలి. పాలకులు కొన్ని మోసపు టెత్తుగడలతో పన్నే ఉచ్చుల్లో సామాన్యులకు అర్థం కాని మార్మికతను విప్పి చెప్పేలా మేధావివర్గం పూనిక వహించాలి. అందుకొక ఆరోగ్యవంతమైన చర్చ, ఉపయుక్త ఆలోచనా పరంపర సాగాలి. వివిధ వేదికల నుంచి అవి వ్యక్తం కావాలి. స్వేచ్ఛాయుత వాతావరణంలో దానికి తగినంత చోటిచ్చే భూమిక లభించాలి. రాజకీయ వ్యవస్థ, పాలకులు సదరు వాతావరణాన్ని కొనసాగనివ్వాలి. ‘మంథన్’ అందులో భాగమే! ఇవి మరిన్ని ఏర్పడి వాస్తవ సమాచారాన్ని జనబాహుళ్యంలోకి జొప్పిస్తే ప్రజల విచక్షణ పెరిగి, నిర్ణయా ధికారం వినియోగంలోకి వస్తుంది. పౌరులు జాగృతమై ప్రభుత్వాల నియం తృత్వ ధోరణుల్ని నిలువరించగలుగుతారు. కేంద్రంలో, రాష్ట్రాల్లో ప్రభు త్వాలు ప్రజావ్యతిరేక నిర్ణయాలను అమలుపరుస్తూ మొండి వైఖరి వహిం చినా కూడా, ప్రజల ఒత్తిడికి తలొగ్గి వెనక్కి తగ్గిన పరిస్థితులకు ఇలాంటి పౌరసమాజపు ఒత్తిళ్లే కారణం. తాజా ఉదాహరణ పెట్రోల్–డీజిల్ ధరల వ్యవహారమే! అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధర బ్యారెల్ 120 డాలర్లున్న పుడు ఇక్కడ లీటరు పెట్రోలు గరిష్టంగా 80 రూపాయలుంటే, ఇప్పుడు బ్యారెల్ క్రూడ్ ధర 50 డాలర్లకు పడిపోయినా... లీటరు పెట్రోలు ధర సగటున 75 రూపాయలుంటోంది! ఎంత మంది సర్కారు ఆర్థికవేత్తలు ఎన్ని లెక్కలు చెప్పినా అది పొసగటం లేదు. స్వయంగా కేంద్ర ఇంధనశాఖ మంత్రి ‘ఏం చేయలేం, ధర తగ్గించడం అసాధ్యం’ అన్న తర్వాత కూడా ప్రజాభి ప్రాయాన్ని మన్నించి కేంద్రం దిగిరావాల్సి వచ్చింది. రాత్రికి రాత్రి తాను ధరలు తగ్గించడమే కాకుండా, రాష్ట్రాలను కూడా పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించుకొమ్మని ప్రతిపాదించాల్సి వచ్చింది. పౌరసమాజం మరింత చేత నతో, వ్యవస్థీకృతంగా ఉంటే ఎన్నెన్నో సాధించుకోవచ్చని ఈ పరిణామం చెబుతోంది. ఆశ చావొద్దు, భ్రమ బతుకొద్దు! సమకాలీన వ్యవస్థలో రాజకీయాలు చాలా ఖరీదయిపోయాయి. ప్రజా స్వామ్యం గురించి ఎంత గొప్పలు చెప్పుకున్నా సామాన్యులు రాజకీయాల్లో మనలేని రోజులొచ్చాయి. ముఖ్యంగా స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల్లో నిలువడం, చిన్న చిన్న రాజకీయ పార్టీలు నడపడం కనాకష్టమైపోయింది. డబ్బు ప్రమేయం ఎన్నికల్లో బాగా పెరిగింది. సిద్ధాంత రాజకీయాలు కాస్త వెనక్కి వెళ్లి, స్వార్థ రాజకీయాలు పెరిగాక అధికారమే పరమావధిగా అడు గులు వేస్తున్నారు. ఎక్కడికక్కడ కులాలు, మతాలు, ప్రాంతాలపరమైన భావావేశాల్ని రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకొనే పద్ధ్దతులు బలపడ్డాయి. ఎన్నికల ఫలితాలు వచ్చాక పలువురు ప్రజాప్రతినిధులు తమను ప్రజలు గెలిపించిన విపక్ష పార్టీల్లో ఉండలేకపోతున్నారు. పాలకపక్షం కనుసైగ చేస్తే చాలు అందులో చేరిపోతున్నారు. అధికారంతో అంటకాగుతున్నారు. ఉభ యులూ కలిసి ప్రజాతీర్పును వంచిస్తున్నారు. ఐదేళ్ల వరకు ప్రజల్ని పరిహాసం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి విపక్ష పార్టీ జవసత్వాలు లేకుండా నామ మాత్రమైపోతే ఇక తమకు తిరుగే ఉండదన్నది పాలకపక్షాల ధీమా! అను చితమైన ఈ ధీమా ఒట్టి భ్రమ కావాలి. అంతటి శక్తి ఆలోచన బాట పట్టిన జన బలానికుంటుందని మన ప్రజాస్వామ్యం పలుమార్లు నిరూపించింది. ఏదీ! ఎక్కడ ప్రత్యామ్నాయం? అని పాలకపక్షాలు అహంతో ప్రశ్నించిన ప్పుడు కూడా చడీచప్పుడు లేకుండానే బలమైన ప్రత్యామ్నాయం అప్పటి కప్పుడు ఆవిర్భవించిన సందర్భాలు కోకొల్లలు. ఎమర్జెన్సీ కాలంలో తనకు ఎదురే లేదనుకున్న నాటి ప్రధాని ఇందిరా గాంధీ, జయప్రకాశ్ నారాయణ్ రూపంలో ఓ ప్రత్యామ్నాయం అంత తొందర్లో పుట్టుకొస్తుందని ఊహించలేక పోయారు. 1982–83లో తెలుగు నాట సినీ నటుడు ఎన్టీరామారావు ఓ ప్రభంజనంలా దూసుకు రావడం కూడా, అప్పటికే కాంగ్రెస్ చేష్టలతో విసిగి వేసారిన ప్రజలు నిర్ణయించిన ప్రత్యామ్నాయ శక్తి మాత్రమే! ఒక రూపంలో అంతమైనా, మరేదో రూపంలో ప్రత్యామ్నాయం ఆవిర్భవించడమే ప్రజాస్వామ్యపు అందం! అందుకే, ప్రజ లెప్పుడూ నిరాశకు గురికాకుండా జాగరూకత వహిస్తూ ఆశావహ దృక్ప థంతో ఉండాలి. ఎంత పొడవైనదైనా చీకటి సొరంగం తర్వాత వెలుగు ఖాయం! ఈ లోపున, జరుగుతున్న పరిణామాలన్నింటినీ జాగ్రత్తగా గమ నిస్తూ... తగు విధంగా చర్చించి, ఆలోచించి పౌరులు తమవైన నిర్ణయాలు తీసుకోవాలి. ఉమ్మడి చొరవే ఉద్యమ స్ఫూర్తి! బలమైన రాజకీయ వ్యవస్థలకు ఒకప్పుడు భూమికనిచ్చిన విశ్వవిద్యాలయాలు ఇప్పుడు నిర్వీర్యమై ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగానే వాటినలా చేశారు, చేస్తూనే ఉంటారు. మనిషి విచిత్ర స్వభావాన్ని ఎత్తిచూపుతూ చలం అన్నట్టు, మనిషి ఎవర్నయినా క్షమిస్తాడు తనకు సహాయపడ్డవాణ్ణి తప్ప! తామెక్కి వచ్చిన నిచ్చెన మెట్లను ఒకటొకటిగా నరికే స్వభావమున్న పాలక పక్షాలు ఇతరులు నిరసన తెలిపే దారులన్నీ మూసేస్తాయి. ప్రత్యామ్నాయ రాజకీయవేదికలంటారా? మీకిక మాట్లాడుకునే వేదికలే దొరకవు పొమ్మం టాయి. నిరసన తెలిపితే, తప్పదు నిర్బంధమంటాయి. ధర్నాచౌక్‌లు కూడా కనుమరుగవుతాయి. అన్ని దారులు మూసుకుపోయినట్టు కనిపించినా, ఎక్కడో ఓ దిక్కున దారి తెరచుకోవడమే ప్రజాస్వామ్య లక్షణమని చరిత్ర, ప్రకృతి చెబుతోంది! కవులు, రచయితలు, మేధావులు, ఇతర ప్రజాస్వామ్య వాదులు ఏకమవ్వాలి. పౌరుల్ని అప్రమత్తంగా ఉంచి ప్రజాస్వామ్యాన్ని పరి రక్షించాలి. ఆరోగ్యకరమైన చర్చను, అవసరాలు తీర్చే ఆలోచనల పరిధిని మరింత విస్తరించాలి. రేపు బాగుండాలంటే, నేడంటూ ఉండాలి! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
జైలుకెళ్లిన దిలీప్‌కు డబుల్ బొనాంజ
తిరువనంతపురం : ఎట్టకేలకు బెయిల్ లభించడంతో కాస్త ఉపశమనం పొందిన మళయాల నటుడు దిలీప్‌కు మరింత ఊరట లభించింది. ఆయన నటించిన చిత్రం రామలీలా చిత్రం విజయవంతంగా దూసుకెళుతోంది. ప్రేక్షకుల మదిని కొల్లగొడుతోంది. బెంగళూరు, చెన్నైతోసహా దక్షిణాదిన విడుదలైన ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.4.61కోట్ల వసూళ్లు రాబట్టింది. రామలీలా చిత్రం పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఈ సినిమాకు అరుణ్ గోపి దర్శకత్వం వహించాడు. వాస్తవానికి ఈ చిత్రం ఎప్పుడో విడుదలవ్వాల్సి ఉన్నప్పటికీ దిలీప్ జైలుకు వెళ్లిన కారణంగా రెండుసార్లు వాయిదా పడింది. అయితే, అతడు విడుదలయ్యాకే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు. అయితే, దాదాపు నాలుగుసార్లు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ కూడా కోర్టు రద్దు చేయడంతో ఇక సినిమాపై ప్రభావం చూపించకుండా ఈ నెల సెప్టెంబర్ 28న విడుదల చేశారు. తాజాగా దిలీప్‌కు కూడా మంగళవారం బెయిల్ రావడంతో అతడికి రెండు శుభవార్తలు విన్నట్లయింది. -
ఆ నటిని కిడ్నాప్ చేస్తే రూ.3 కోట్లు ఇస్తాను
తిరువనంతపురం : కేరళలో సంచలనం సృష్టించిన నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయి విచారణ ఎదుర్కొంటున్న దిలీప్.. ఆ నాడు నటిని కిడ్నాప్ చేసేందుకు మూడు కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని విచారణ అధికారులు బుధవారం హైకోర్టుకు తెలిపారు. ఈ కేసులో ముఖ్య నిందితుడైన పల్సర్ సునీకి రూ.1.50కోట్లు ఇస్తానని ఒప్పుకున్నారని, ఒక వేళ పోలీసులు పట్టుకుంటే మాత్రం రూ.3కోట్లు చెల్లించేందుకు అంగీకరించారని తెలిపారు. ఈ ఏడాది జులైలో దిలీప్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఓ నటిని కిడ్నాప్ చేసి వేధింపులకు గురిచేసేలా ప్లాన్ చేశారని, కుట్రపూరిత నేరం కేసులో ఆయనను అరెస్టు చేసి ప్రస్తుతం విచారణ ఖైదీగా ఉంచారు. ప్రస్తుతం హైకోర్టులో దిలీప్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగుతోంది. గతంలో రెండుసార్లు కింది స్థాయి కోర్టు ఆయనకు బెయిల్‌ను నిరాకరించింది. -
బ్లూవేల్ భూతాలను ఆపలేమా!
బ్లూవేల్ ఆట నడిపే గ్రూప్ నిర్వహకుల్లో కొందరు దారితప్పిన ఇంజనీర్లున్నారు. అత్యధి కుల్ని ఈ ఆట పరిధిలోకి తెచ్చి, ఆఖరి టాస్క్ (ఆత్మహత్య) కూడా వారితో చేయించి, ఏదో పైశాచికానందం పొందడమే వీరి లక్ష్యమనేది సమాచారం. బడిపిల్లల నుంచి గాలివాటు చదువుల కాలేజీ విద్యార్థుల వరకు, తాడూ బొంగరంలేని పోరంబోకుల నుంచి నిరుద్యో గుల వరకు దుర్బల యువత వీరి లక్ష్యం. తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల పర్యవేక్షణ కొరవడి ఒంటరితనంతో కుమిలేవాళ్లు వీరికి లక్ష్యం! సమకాలీనం మనిషికి జ్వరం రావడం మంచిదే, శరీరంలో వచ్చిన తేడాలు గుర్తించి సరిదిద్దుకునేందుకు అదొక సంకేతం, హెచ్చరిక అని సంప్రదాయ వైద్యులంటారు. ఆధునిక వైద్యులూ కొంతవరకు ఆమోదిస్తారు. సరిదిద్దుకునే పని ఎంత సమర్థంగా చేస్తామనే దాన్ని బట్టి భవిష్యత్ ఆరోగ్యం ఆధార పడుతుంది. ఆన్లైన్ ఆట ‘బ్లూ వేల్ చాలెంజ్’ అటువంటిదే అనుకుంటే! మనం, మన ప్రభుత్వాలు, వ్యవస్థలు ఏ మేరకు అప్రమత్తమై ఈ ఆధునిక జాడ్యాన్ని వదిలించుకునే చర్యలు తీసుకుంటున్నాయన్నది ప్రధానం. ఈ ఆట మర్మమేంటి? ఎందుకు యువతను ఆకట్టుకుంటోంది? చివరకు ఆత్మ హత్యలకు ఎలా పురిగొల్పుతోంది? ఏం చేసి ఈ సమస్యను పరిష్క రించవచ్చు? ఇదేకాక, ఇటువంటివి మున్ముందు మరో పేరుతో తలెత్తితే ఏమిటి పరిస్థితి? ఈ దిశలో తగిన ఆలోచనలు సాగటం లేదు. సరైన అడు గులూ పడటం లేదు. సమస్య తీవ్రత, మూలాల్ని సరిగ్గా అర్థం చేసుకున్న దాఖలాలే కనిపించడం లేదు! ఆటలో పాల్గొనే వారికి సదరు గేమ్ విసిరిన సవాళ్ల కన్నా, ఈ వ్యవహారం మన వ్యవస్థకు విసిరిన సవాలే పెద్దది. శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించి తగు నివారణ చర్యలు తీసుకోకుండా పైపై చర్యలతో సరిపెడితే ఫలితం శూన్యం! సైబర్ లోకానికి సంబంధించైనా, మరోటైనా... సమస్య రాగానే హడావుడి చేయడం, కాస్త సద్దుమణిగిన తర్వాత అన్నీ మరచి మామూలు స్థితికి చేరడం మనకు అలవాటే! బ్లూవేల్ ఆన్లైన్ గేమ్ విషయంలోనూ ఇప్పుడదే జరుగుతోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 16 మంది యువతీయువకులు ఈ ఆటాడి, అజ్ఞాత మారీచు(గ్రూప్ అడ్మిన్)ల పైశాచికత్వానికి బలైనట్టు కథనాలు వస్తున్నాయి. ఏ ఒక్క కేసులోనూ, కచ్చితంగా వారి మరణం ఈ ఆట వల్లే అని ధృవపడలేదని ప్రభుత్వ వర్గా లంటున్నాయి. ఇంతకీ బ్లూవేల్ చాలెంజ్ ఆటా? మాస్ హిస్టీరియానా? భ్రమా–భ్రాంతియా? యువత తెలీక ఇరక్కుపోతున్న ‘నెట్’ వ్యసనమా? రకరకాల చర్చ జరుగుతోంది. ఇదసలు ఓ సాధారణ ఆట కాదు, మృత్యుక్రీడ అనే వారున్నారు. ఇదొక్కటే కాకుండా, యువతరం జీవితాల్ని బుగ్గి పాల్జేస్తున్న ఆన్లైన్, నెట్ ఆధారిత క్రీడలెన్నో ఉన్నాయి. తాజా డిజిటల్ యుగంలో... సైబర్ నేరాల్ని పసిగట్టే, నియంత్రించే, పౌరులకు భద్రత కల్పించే వ్యవస్థ మనదేశంలో ఇంకా బలపడలేదు. సమాచార విప్లవం ఫలితంగా స్మార్ట్ ఫోన్, సామాజిక మాధ్యమాల రూపంలో ‘ఇంటర్నెట్’ సామాన్యుల జీవితాల్లోకి సహితం చొచ్చుకొచ్చింది. ఆన్లైన్ ఆటలు, ప్రాణాల్ని బలి తీసుకునే వికృత క్రీడలూ ఇందులో భాగమయ్యాయి. ఈ ఆన్లైన్ సదుపాయం సగటు మనిషి జీవన విధానాన్ని, ముఖ్యంగా ఎదిగే యువతరం అలవాట్లని సమూలంగా మార్చేసింది. దీనికి తోడు ఇక్కడ మారిన కుటుంబ వ్యవస్థ, జీవనశైలి, విలువలు నశించిన విద్యావిధానం, ప్రభుత్వాల బాధ్యతా రాహిత్యం... వెరసి సమస్యను జటిలం చేస్తున్నాయి. సమస్య మూలాల్ని శోధించి, శస్త్ర చికిత్స జరపడం అవసరమైన చోట పైపై లేపనాలు రుద్ది సరిపెట్టాలనుకోవడం ఓ పెద్ద లోపం. దీన్ని సరిదిద్దడమే తక్షణ కర్తవ్యం. అబ్బే! ఈ చర్యలు సరిపోవు అమెరికా, యూరప్, రష్యా, కొరియా తదితర దేశాల్లో చేదు అను భవాల్ని చవిచూపిన తర్వాత ఈ మాయా క్రీడ భారత్‌లోకి అడుగుపెట్టింది. ఢిల్లీ, ముంబై, పుణె, చెన్నై తదితర ప్రాంతాల్లో ఇప్పటికే పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. మిగతా ఆన్లైన్ క్రీడల్లాగే ‘చాలెంజ్’ పేరిట కొన్ని టాస్క్‌లు ఇవ్వడం, వాటిల్లో కొన్ని అసాధారణ–ప్రమాద భరిత చర్యలుండటం, అవి సాధించేలా యువతను పురికొల్పడం ఈ ఆట లక్షణం. అది సాధించే క్రమంలో కొన్నిసార్లు తెలిసీ, చాలాసార్లు తెలియకుండానే బడిపిల్లలు, యువతరం ప్రమాదంలో ఇరుక్కుంటున్నారు. ఇక బ్లూవేల్ క్రీడ విషయానికొస్తే, యాౖభై రోజులు యాభై టాస్క్లుండటం, ఆఖరున ఆటాడే వారే ఆత్మహత్య చేసుకోవాలనడం దుర్మార్గమైన ముగింపు. ఈ ఆట ఆచూకీ తెలిసేలా, ఈ విషవలయంలో యువత చిక్కుకోకుండా నియంత్రించేలా ఓ హాట్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ‘నాస్కామ్’, ఐటీ లాబీలు కోరాయి. ఆటనే రద్దు చేయాలని కేరళ సర్కారు, కేంద్ర మాతా–శిశు సంక్షేమ మంత్రి మనేకా గాంధీ తదితరులు కోరిన దరిమిలా, కేంద్ర ప్రభుత్వం నిజంగానే నిషేధించింది. తమ సైట్లలో ఈ ఆట లింకులు కూడా అందుబాటులో ఉండరాదని పలు సామాజిక మాధ్యమాలకు హెచ్చరిక నోటీసులిచ్చింది. ఢిల్లీ హైకోర్టు కూడా పలు సంస్థలకు ఇటువంటి తాఖీ దులిచ్చింది. అయినా ఈ తప్పుడు లింకులు, యాప్‌లు అందుబాటులోనే ఉన్నాయి. హరియాణాలో పిల్లల సంరక్షణ కమిషన్ వారు బడులు, ఇతర విద్యా సంస్థలకు ఈ విషయంలో ఏం చేయాలో/చేయకూడదో మార్గదర్శ కాలిచ్చారు. తెలంగాణలో పాఠశాల విద్యాశాఖ పూనుకొని తల్లిదండ్రుల కమిటీలకు, ప్రయివేటు బడుల యాజమాన్యాలకు అవగాహన కలిగించే ఓ ఉన్నతస్థాయి సమావేశాన్నే గతవారం నిర్వహించింది. విద్యాసంస్థల్లో యాజ మాన్యాలు, బోధకులు, తల్లిదండ్రులు ఎటువంటి చర్యలు తీసుకోవాలో మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. కేరళలో ఇదివరకే పలు ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించారు. సమస్య శాశ్వత పరిష్కారానికి ఈ చర్యలు సరిపోవడం లేదు. ఇంతకీ, ఎందుకు ఇరుక్కుంటున్నారు? ఇదే కీలకమైన ప్రశ్న! ఇటువంటి క్రీడల్ని నిర్వహిస్తూ, ప్రోత్సహించే అత్యధిక సంస్థలు అధికారికమైనవి కావు. దొంగచాటుగా ఈ ఆన్లైన్ క్రీడా ప్రక్రియను నడిపే సంస్థలు (క్రాక్ వెర్షన్స్) యథేచ్ఛగా లింక్‌లు, యాప్‌లు తాము లక్ష్యంగా చేసుకున్న వారికి అందుబాటులోకి తెస్తున్నాయి! పైగా ఏ దర్యాప్తు సంస్థకూ ఈ మారీచులు అంత తేలిగ్గా దొరకరు! వారికి నేటి యువతరం బలహీనతలు తెలుసు. ముఖ్యంగా బ్లూవేల్ ఆట నడిపే గ్రూప్ నిర్వహకుల్లో కొందరు దారితప్పిన ఇంజనీర్లున్నారు. అత్యధికుల్ని ఈ ఆట పరిధిలోకి తెచ్చి, ఆఖరి టాస్క్ (ఆత్మహత్య) కూడా వారితో చేయించి, ఏదో పైశా చికానందం పొందడమే వీరి లక్ష్యమనేది సమాచారం. బడిపిల్లల నుంచి గాలివాటు చదువుల కాలేజీ విద్యార్థుల వరకు, తాడూ బొంగరంలేని పోరంబోకుల నుంచి నిరుద్యోగుల వరకు దుర్బల యువత వీరి లక్ష్యం! హేతువేమీ లేకుండానే కొత్త పోకడల వైపు అర్రులు చాచేవారు, ఇప్పుడు చేసే కోర్సుల్లో, ఉద్యోగాల్లో తీవ్రమైన ఒత్తిళ్ల నుంచి పారిపోయే మార్గాలు వెతికేవాళ్లు, మంచి మిత్రుల సాంగత్యాలు లేనివారు, తల్లిదండ్రులు– ఉపాధ్యాయుల పర్యవేక్షణ కొరవడి ఒంటరితనంతో కుమిలేవాళ్లు వీరికి లక్ష్యం! ఇందులో ఒకటి లేదా పలు కారణాల వల్ల నెట్‌కు అతుక్కుపోయే వ్యసనపరులు తేలికగా ఈ వికృత క్రీడలో సమిధలవుతున్నారు. ఇదొక బలహీనత, ఇందుకు కారణాలనేకం! సమిష్టి నుంచి వ్యష్టికి, ఆపై పరిమిత కుటుంబాలకు, చివరకు క్యూబికల్ ఫ్యామిలీస్‌కి, అక్కడక్కడ ఒంటరి (తల్లో, తండ్రో...) పేరెంట్స్గానూ విచ్ఛిన్నమైన మన కుటుంబ వ్యవస్థ కూడా కొంత కారణమే! ఇంటిల్లిపాదీ కలిసి కూర్చొని, మంచీ–చెడూ మాట్లాడుకొని, ఒకరికొకరు భరోసా కల్పించుకొని, పరస్పరం మానసిక స్థయిర్యాన్ని అందిం చుకునే పరిస్థితులు మన సమాజంలో సన్నగిల్లాయి. చిన్న కుటుంబాల్లో తల్లీ,తండ్రీ ఉద్యోగమో, వ్యాపార తదితర వ్యాపకాల్లోనో మునిగితేలే వారయితే, పిల్లలకు కేటాయించే సమయమే తగ్గిపోతోంది. ముఖ్యంగా పట్టణ, నగర ప్రాంతాల్లో తమ పిల్లలు ఏం చేస్తున్నారో, నెట్‌కు అతు క్కుపోతున్నారో, చెడు సావాసాలు చేస్తున్నారో గమనించే సమయం తల్లిదండ్రులకుండటం లేదు. చిన్నపిల్లల చేతికి తమ అత్యాధునిక స్మార్టు ఫోన్లు స్వేచ్ఛగా ఇచ్చేస్తున్నారు. వారితో సమయం వెచ్చించలేని తమ అశక్తతను కప్పిపుచ్చుకుంటూ వారిని అనునయించడానికి దాన్కొక తాయిలంలా ఇచ్చేవారూ ఉన్నారు. కొంచెం పెద్దయితే చాలు అడిగీ అడక్కుండానే సరికొత్త మోడల్ స్మార్ట్ ఫోన్, నిరంతర ఇంటర్నెట్ సదుపాయం పిల్లలకు అందించే తల్లిదండ్రులు కోకొల్లలు! చిన్నపిల్లలే కాకుండా కాస్త ఎదిగిన యువత కూడా ఫోన్‌ను సమాచార అవసరాలకు కాకుండా క్రీడా వస్తువుగా వాడటానికే ప్రాధాన్యం ఇస్తారు. బడి, కళాశాల వాతావరణంలో వేర్వేరు కారణాల వల్ల విద్యాపరంగా ఇతర విద్యార్థులతో పోటీ పడలేనివారు, అక్కడ తమ ఓటమిని అధిగమించడానికి ఇటువంటి క్రీడల్లో ‘గెలుపు’ని ప్రత్యామ్నాయ విజయంగా గర్విస్తున్నారు. ఇటువంటి పరిస్థితులన్నీ నేటి యువతను ఈ ఆన్లైన్ వికృతక్రీడల్లో బలయ్యే దుర్బలులను చేస్తున్నాయి. విద్యేతర తపన, సృజనకు ప్రోత్సాహమేది? విలువల పరంగానే కాకుండా ఆచరణ పరంగా కూడా మన విద్యావిధానం దిగజారిపోవడం యువత తప్పుదోవ పట్టడానికి కారణమౌతోంది. వారి ఇతరేతరమైన ప్రతిభను సానపెట్టుకునే అవకాశాలే కనుమరుగయ్యాయి. ఎదిగే విద్యార్థిగా విద్యేతరమైన తన సహజ సృజన, తపన, ఆసక్తుల్ని తీర్చుకునే దారులన్నీ మూసుకుపోయాయి. క్రీడా ప్రోత్సాహం లేదు. రాష్ట్రంలో 25 వేల ప్రభుత్వ పాఠశాలలకు గాను 15 వేల బడుల్లో క్రీడా మైదానాల్లేవు. ఇంకా ఎక్కువ చోట్ల క్రీడా ఉపాధ్యాయులు లేరు. కళాశాలల పరిస్థితి మరింత ఘోరం. ఇక ప్రయివేటు విద్యా సంస్థల గురించి మాట్లాడకపోవడమే మంచిది. పుస్తక పఠనం దాదాపు నిలిచిపోయింది. నాటకాలు, సాహిత్యం వంటి ప్రక్రియల ఊసు లేదు! నదులు, కాలువలు, వాగులు–వంకలు, బావులకు వెళ్లి ఈదులాడే పరిస్థితులు లేవు. ఇవేవీ లేకుండా కెరీరిజం ముసుగులో బడులు, కాలేజీల్లో మనమంతా సృష్టిస్తున్న ఒత్తిడి నడుమ... వారికి స్మార్టుఫోనుల్లో దొరికే ఇంటర్నెట్ ఏడారిలో ఒయా సిస్సులాంటిదే అంటే అతిశయోక్తి కాదు! విద్యా వికాసానికి ఈ సదు పాయాన్ని ఉపయుక్తంగా వాడుకునేలా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయ డానికి ఉపాధ్యాయులు, లెక్చరర్లు మేధోపరంగానే కాక సాంకేతికంగా ఎంతో ఎదగాల్సి ఉంది. ఒత్తిడిలో, బాహ్య ప్రేరకాలతో విద్యార్థులు దారి తప్పి నపుడు మానసిక పరిస్థితిని సరిదిద్దేలా కౌన్సిలింగ్‌కు ప్రతి విద్యాసంస్థలో మానసిక నిపుణులుండాలని నిబంధనలు మాత్రమే ఉన్నాయి తప్ప, వారు లేరు. ఈ పరిస్థితులు మారాలి. అనేక విషయాల్లో అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటున్న, పోటీ పడుతున్న ఈ రోజుల్లో ఇటువంటి విషయాల్లో మాత్రం మన పాలకులు కిమ్మనకుండా ఉండటం నిజమైన దౌర్భాగ్యం! ఈ పరిస్థితుల్ని ఇలా కొనసాగనివ్వొద్దు. వీడని నెట్ వ్యసనాలతో, అశ్లీల వెబ్సైట్ల అంటకాగుతూ, ఆన్లైన్ వికృత క్రీడల్లో అలమటించి ఈ దేశపు యువత నిర్వీర్యమై నీరుగారకముందే వ్యవస్థలు మేల్కొనాలి, సరిదిద్దుకోవాలి. సమస్య మూలాల్ని గుర్తించి పరిష్కరించుకోవాలి. లేకుంటే, ప్రపంచంలో అత్యధిక యువశక్తి దేశంగా ఇప్పుడున్న మన కీర్తి మంటగలసి, అశక్తుల అడ్డాగా మారే ప్రమాదముంది. ‘‘ మానవ సంబంధాలను శాస్త్ర సాంకేతికత అధిగమించే ఓ రోజు వస్తుంది, అప్పుడీ జగత్తంతా ఒఠ్ఠి మూర్ఖులతో నిండి నదై ఉంటుంది’’ అన్న అల్బర్ట్ ఐన్‌స్టీన్ అంచనాల దిశలో అడుగులు పడ తాయి. తస్మాత్ జాగ్రత్త! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
నాలుగోసారి.. ఆయనకు సారీ!
సాక్షి, కోచి: ప్రముఖ మలయాళ నటిపై కారులో లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నటుడు దిలీప్‌కు మరోసారి చుక్కెదురైంది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు సోమవారం అంగమలై మేజిస్ట్రేట్ కోర్టు నిరాకరించింది. ఆయన బెయిల్ అభ్యర్థనను న్యాయస్థానాలు తిరస్కరించడం ఇది నాలుగోసారి. ఇప్పటికే ఆయన 71 రోజులు కస్టడీలో గడిపారు. గతంలో మూడుసార్లు ఆయన చేసుకున్న బెయిల్ అభ్యర్థనలను కోర్టులు తిరస్కరించాయి. దిలీప్ తాజా సినిమా 'రామాలీల' సెప్టెంబర్ 28న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన దిలీప్‌కు తీవ్ర నిరాశే ఎదురైంది. నటిపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న దిలీప్‌కు వ్యతిరేకంగా ప్రాథమిక సాక్ష్యాలు బలంగా ఉన్నాయని హైకోర్టు గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు తుదిదశలో ఉందని, చార్జ్‌షిట్ కూడా సిద్ధమవుతోందని, ఈ దశలో దిలీప్‌కు బెయిల్ ఇస్తే.. ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని హైకోర్టు వ్యాఖ్యానించింది. గత ఫిబ్రవరి 17న మలయాళ నటిని కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో అరెస్టయిన దిలీప్ జూలై 24న బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే, కేసులో కీలక మొబైల్‌ఫోన్ లభ్యం కాకపోవడంతో హైకోర్టు అప్పట్లో బెయిల్ నిరాకరించింది. -
కాలనీ ప్రేమకథ
దిలీప్, శ్రావణి, రాజ్‌బాల, అపర్ణ, బేబీ అక్షర ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘తొంగి తొంగి చూడమాకు చందమామ’. ఆనంద్ కానుమోలు దర్శకత్వంలో ఏఎం రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయింది. ‘‘ఒక కాలనీలో జరిగే ప్రేమ కథ ఇది. ప్రేమకథా చిత్రాల్లో ఓ వినూత్న ప్రయత్నం అవుతుంది. తమ మధ్య ఉన్నది ఎలాంటి బంధమో తెలియని జంట చివరి వరకు ఒకరికి ఒకరు ఆ బంధాన్ని వ్యక్తీకరించుకోరు. క్లైమాక్స్‌లో ప్రేమను వ్యక్తపరచుకోవడం అనేది ఆసక్తికరం. త్వరలో రెండో షెడ్యూల్ ప్రారంభిస్తాం. డిసెంబర్లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు దర్శకుడు. ఈ చిత్రానికి సమర్పణ: గురు రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్. -
నటి వేధింపుల కేసు: 'మేడం' ఆమెనే
సాక్షి, కోచి: ప్రముఖ మలయాళ నటిపై కారులో లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడైన పల్సర్ సునీ తాజాగా కీలక విషయాలు వెల్లడించాడు. 'నా మేడం ఎవరో కాదు కావ్యామాధవనే' అంటూ వెల్లడించాడు. అయితే, నటిపై లైంగిక వేధింపుల కేసు వెనుక ఆమె ప్రమేయం ఉందా? అన్న ప్రశ్నకు అతను 'లేదు' అని సమాధానం చెప్పాడు. నటిపై లైంగిక వేధింపుల కేసులో కావ్యా మాధవన్ ప్రమేయం కూడా ఉన్నట్టు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. 'మేడం' నుంచి అందిన ఆదేశాల మేరకే నటిని కారులో అపహరించి.. లైంగికంగా వేధించామని, ఆమెను బ్లాక్మెయిల్ చేసేందుకు ఫొటోలు, వీడియోలు తీశామని పల్సర్ సునీ గతంలో తెలిపిన సంగతి తెలిసిందే. తనకు ఆదేశాలు ఇచ్చిన ఈ 'మేడం' సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తేనని అతను చెప్పాడు. ఈ కిరాతకమైన నేరానికి పాల్పడేందుకు డబ్బు సమకూర్చింది కూడా సదరు 'మేడమే'నని వివరించాడు. అయితే, డబ్బు సమకూర్చడం తప్ప ఆమె పెద్దగా నేరంలో పాల్గొనలేదని విచారణలో పల్సన్ సునీ గతంలో పోలీసులకు చెప్పాడు. తాజాగా ఆ మేడం ఎవరో వెల్లడించిన పల్సర్ సునీ.. అయితే, ఆమెకు ఈ కేసులో ఎలాంటి ప్రమేయం లేదని చెప్తుండటం గమనార్హం. ప్రముఖ మాలయళ హీరో దిలీప్ రెండో భార్య అయిన కావ్యా మాధవన్‌కు కూడా ఈ కేసులో ప్రమేయం ఉన్నట్టు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నటిపై వ్యక్తిగత కక్ష తీర్చుకునేందుకే హీరో దిలీప్.. పల్సర్ సునీతో ఆమెపై ఈ అఘాయిత్యాన్ని చేయించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయన రెండో భార్య కావ్య పాత్రపై కూడా అనుమానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ కేసులో రెండోసారి అభ్యర్థించినా నటుడు దిలీప్‌కు కేరళ హైకోర్టు బెయిల్ నిరాకరించిన సంగతి తెలిసిందే. -
ఓనం నాడు ఆ నటుడు జైల్లోనే!
దిలీప్‌కు మరోసారి బెయిల్ నిరాకరించిన హైకోర్టు కోచి: ప్రముఖ మలయాళ నటిపై కారులో లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నటుడు దిలీప్‌కు హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు మంగళవారం కేరళ హైకోర్టు నిరాకరించింది. ఆయన బెయిల్ అభ్యర్థనను హైకోర్టు నిరాకరించడం ఇది రెండోసారి. దీంతో కేరళలో ప్రముఖ ఓనం పండుగ నాడు దిలీప్ జైల్లో గడుపాల్సిన పరిస్థితి నెలకొంది. నటిపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న దిలీప్‌కు వ్యతిరేకంగా ప్రాథమిక సాక్ష్యాలు బలంగా ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు తుదిదశలో ఉందని, చార్జ్‌షిట్ కూడా సిద్ధమవుతోందని, ఈ దశలో దిలీప్‌కు బెయిల్ ఇస్తే.. ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని హైకోర్టు వ్యాఖ్యానించింది. గత ఫిబ్రవరి 17న మలయాళ నటిని కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో అరెస్టయిన దిలీప్ జూలై 24న బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే, కేసులో కీలక మొబైల్‌ఫోన్ లభ్యం కాకపోవడంతో హైకోర్టు అప్పట్లో బెయిల్ నిరాకరించింది. -
రాబోయే కాలానికీ... రక్ష నీవే!
♦ సమకాలీనం చట్టాలకూ, రాజ్యాంగానికీ వ్యతిరేకంగా వ్యక్తులు గానీ, రాజ్యం గానీ దాష్టీకాలకు దిగిన ప్పుడు ఎదిరించి తమను తాము రక్షించు కోవడం ఈ వ్యవస్థలో చాలా తక్కువ మందికే సాధ్యం! దేశంలోని అత్య ధికులకు ప్రభుత్వాలు కల్పించే రక్షణ చర్యలు, చట్టాలు, రాజ్యాంగం, న్యాయ స్థానాల అండ అవసరమయ్యే పరిస్థితులే నేటికీ ఈ దేశంలో నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా పౌరులందరి నిత్య జీవితాల్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా శాసిస్తున్న రాజకీయ వ్యవస్థను క్రమబద్ధీకరించాల్సి ఉందని ప్రతి పౌరుడూ భావిస్తున్న తరుణమిది! భారత అత్యున్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు 48 గంటల వ్యవధిలో రెండు విప్లవాత్మకమైన తీర్పులను వెల్లడించి రాజ్యాంగాన్ని ఈ దేశపు సగటు మనిషికి మరింత చేరువ చేసింది. స్ఫూర్తిదాయకమైన మన రాజ్యాంగం పట్ల మరింత విశ్వసనీయతను పెంచింది. మూడుమార్లు ‘తలాక్’ అంటే విడాకు లిచ్చేసినట్టేనన్న ఆటవిక నీతి ఇక చెల్లదంది. వ్యక్తిగత గోప్యత పౌరుల ప్రాథ మిక హక్కేనని నిర్ద్వంద్వంగా తేల్చింది. రాజ్యాంగం కల్పించిన హక్కుల ఉల్లంఘన ఏ రూపంలో జరిగినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. సంప్ర దాయ ఆచరణలు, సంక్షేమ అవసరాల వంకతో ప్రాథమిక హక్కులకు జరిపే ఏ వక్రీకరణలనూ, అనుచిత భాష్యాలనూ అనుమతించేది లేదని తన చరి త్రాత్మక తీర్పులతో ధృవీకరించింది. ఇదే చొరవ... ఎన్నికల సంస్కరణలు, ముఖ్యంగా ప్రజాప్రాతినిధ్య (పీఆర్) చట్టం, ఫిరాయింపుల నిరోధక చట్టం స్ఫూర్తిని అమలుపరచడంలో చూపాలని యావద్భారతావని కోరుకుం టోంది. నిన్నటికి నిన్న నంద్యాలలో జరిగిన ప్రజాస్వామ్య పరిహాస పర్వం కళ్ల చూసిన వారందరికీ... సుప్రీం జోక్యం తప్ప ఈ దేశంలో ఏ శక్తీ ఇలాంటి దారుణాల్ని అరికట్టలేదేమోనన్న సందేహం బలపడుతోంది. సుదీర్ఘకాలం నుంచి సంశయాత్మకంగా ఉన్న పౌరహక్కుల్ని నిస్సందేహంగా ఖరారు చేస్తూ సుప్రీం ధర్మాసనాలు తాజా తీర్పులు వెలువరించిన దరిమిలా.... కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తిని వెక్కిరించేలా జరుగుతున్న పార్టీ ఫిరా యింపులు, ఎన్నికల ప్రహసనాలు–పాలకపక్ష ఆగడాలు, సర్కార్ల ఇష్టా రాజ్యాన్ని ఎవరూ అడ్డుకోలేని దుస్థితి ఆందోళన కలిగిస్తున్న తరుణమిది. అందుకే, ప్రజాస్వామ్య వాదులంతా సుప్రీంకోర్టు వైపు చూస్తున్నారు. రాజ్యాంగ విధానాల బాటన, న్యాయస్థానాల కనుసన్నల్లో పౌరులకు రక్షణగా నిలవాల్సిన ప్రభుత్వాలే వక్రమార్గాలననుసరిస్తే ఇక వారికి దిక్కెవ్వరు? ‘కన్నతల్లే దయ్యమైతే తొట్టెల కట్టే తావెక్కడ?’ అన్న చందంగా తయార యింది పౌరుల స్థితి! ప్రజలిచ్చిన అధికారాన్ని విచ్చలవిడిగా వాడుతూ ప్రజా స్వామ్య వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసే çసర్కార్ల వైఖరిని పౌరులు జీర్ణిం చుకోలేకపోతున్నారు. డెబ్బయ్యేళ్ల స్వతంత్ర భారతావనిలో అత్యంత ఖరీద యినదిగా నంద్యాల ఎన్నికను నిలిపిన తీరు జుగుప్సాకరం. ఈ ఎన్నికల్లో వేర్వేరు రూపాల్లో డబ్బు విశ్వరూపం చూపింది. చివరకు.... ‘మాకు వేస్తే ఓటుకు పదివేలు, మాకు వేయకున్నా సరే ప్రత్యర్థికి వేయకుండా మిన్నకుంటే అయిదువేలు’ ఇస్తామనే కొత్త విష సంస్కృతికి పాల్పడిన అధికార పక్షం నైచ్యం అందరినీ విస్మయపరుస్తోంది. నంద్యాల ఓ దురాగతం ఎన్నికల నియమావళి, నిబంధనల ఉల్లంఘనకు నంద్యాల ఉప ఎన్నిక ఓ నిలువెత్తు ఉదాహరణ. ఎన్నికల సంఘం ఆదేశాలు–నిఘాను బేఖాతరంటూ, అధికార పార్టీ ఉద్దేశపూర్వకంగానే ఇందుకు సంబంధించిన నియమావళినీ, ఆదేశాలనూ పదే పదే ఉల్లంఘించింది. ఏకంగా ముఖ్యమంత్రి‡స్థాయి వ్యక్తి ఎన్నికల నిబంధనలను పట్టించుకోవాల్సిన అవసరం లేదనీ, ఉల్లంఘిస్తే మహా అయితే నోటీసు మాత్రమే ఇస్తారనీ మంత్రులు, ఎమ్మెల్యేలకు టెలి కాన్ఫరెన్స్‌లో ఆదేశాలిచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నియమా వళి, నిబంధన ప్రకారం ఎన్నికల ముంగిట్లో ప్రభుత్వం కొత్త హామీలు ఇవ్వ కూడదు. నంద్యాల ఉప ఎన్నికల కోడ్ కొనసాగుతుండగానే, మరో రెండు నెలల్లో నిరుద్యోగ యువతకు భృతి ఇవ్వనున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసు కుంది. ఈ విషయాన్ని లీకులిచ్చి మరీ తన అనుకూల మీడియాతో విస్తృత ప్రచారం చేయించింది. మహిళల కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఏర్పాటు చేస్తా మని పొదుపు సంఘాల మహిళలతో నిర్వహించిన సమావేశంలో ముఖ్య మంత్రే హామీ ఇచ్చారు. డ్వాక్రా సంఘాలకు పసుపు–కుంకుమ పథకం కింద మూడో విడతగా రూ.4వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. రాష్ట్రం లోని ఏ ఇతర నియోజకవర్గాల్లో మహిళలకు మూడో విడత డబ్బులు జమ చేయలేదు. ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి ఓట్లు వేయకపోతే పెన్షన్లు, రేషన్ కార్డులు తీసివేస్తామని సర్వే టీమ్‌లను పంపించి బెదిరించారు. సర్వేలు చేయ వద్దని ఎన్నికల సంఘం ఆదేశించినా అధికార పార్టీ సర్వే బృందాలను పంపి మరీ ఈ బెదిరింపులకు పాల్పడింది. తమకు ఓటు వేస్తేనే రోడ్ల విస్తరణ, భూగర్భ డ్రైనేజీ, తాగునీటి సరఫరా పథకాలు చేపడతామనీ, ఇదివరకు చేప ట్టినవి కొనసాగిస్తామనీ సీఎంతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పదేపదే ప్రకటించారు. నిబంధన ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందు జిల్లాకు చెందని వ్యక్తులు జిల్లాను వీడి వెళ్లాలి. నంద్యాల నియోజకవర్గానికి చెందని ఇతర నేతలు నంద్యాల నియోజకవర్గంలో ఉండకూడదు. ఈ స్ఫూర్తికి గండికొ డుతూ మంత్రులు, ఎంఎల్ఏలు పక్క నియోజకవర్గమైన బనగాన పల్లెలోని ఓ ఎమ్మెల్యే ఇంట్లో తిష్ట వేశారు. ఈ వ్యవహారమంతా ఆధారాలతో బయ టపడింది. ఎమ్మెల్యేలు ఏకంగా పోలింగ్ రోజు నంద్యాల నిమోజక వర్గం మొత్తం కలియదిరిగారు. అనపర్తి ఎమ్మెల్యే కానాలలో ప్రత్యక్షం కాగా, బనగానపల్లె ఎమ్మెల్యే యాళ్లూరులో ఏకంగా డీఎస్పీతో మాట్లాడుతూ మీడియా కంటపడ్డారు. కర్నూలు, శ్రీశైలం, కోడుమూరు ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, బుడ్డా రాజశేఖర రెడ్డి, మణిగాం«ధీలు నంద్యాల పుర వీధుల్లో దర్జాగా తిరుగుతూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారు. మంత్రి భూమా అఖిల అయితే మీడియా ముఖంగా ప్రకటించి మరీ ఆళ్లగడ్డ నుంచి నంద్యా లకు వెళ్లారు. అక్కడ పలు టీవీలకు ఇంటర్వ్యూలూ ఇచ్చారు. ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ యథేచ్ఛగా సాగింది. బహుశా దేశచరిత్రలోనే ఇంతగా డబ్బు, మద్యం పంపిణీతో ఎన్నికలు జరగలేదంటే అతిశయోక్తి కాదేమో! పాలకపక్షం వందల కోట్ల మేర ఖర్చు చేసిందని ఒక అంచనా. ఓటుకు రూ. 2 వేలు పంచుతూ అధికార పార్టీకి చెందిన రైతునగర్ సర్పంచ్ కొండారెడ్డి కెమెరాకు చిక్కారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీకి చెందిన కౌన్సి లర్ అభిరుచి మధు మారణాయుధాలను కార్లలో పెట్టుకొని తిరుగుతూ ప్రతి పక్ష పార్టీకి చెందిన నేత, మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డిపై దాడికి తల పడ్డారు. ఏకంగా కత్తి తీసుకొని నడిరోడ్డుపై గీత గీసి దాన్ని దాటి రమ్మని సవాల్ విసరడం, గాల్లో కాల్పుల ఘటన, పోలీసులు ప్రేక్షకపాత్ర వహిం చడం ప్రజాస్వామ్య ప్రక్రియకే సరికొత్త సవాళ్లు. మూలాలు ఛేదిస్తేనే....! విలువలకు తిలోదకాలిచ్చి, పాలకపక్షాలు అధికారమే పరమావధిగా వ్యవహ రించడం వల్లే ఇలాంటి విపరిణామాలు తారస్థాయికి చేరుతున్నాయి. ఇప్పు డున్న అధికారాన్ని విచ్చలవిడిగా అనుభవించడమే కాకుండా తర్వాతి ఎన్ని కల్లోనూ తామే గెలుపొందాలనే దురాశ వారిని అన్ని అనైతిక చర్యలకూ పురి గొల్పుతోంది. అర్థబలం, అధికారం దన్నుగా వీలయితే ప్రలోభాలు లేదంటే బెదిరింపులు... ఏదైతేనేం? వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యర్థి పార్టీల ఉనికే లేకుండా చేయాలనే దుర్నీతి రాజ్యమేలుతోంది. నంద్యాల ఉప ఎన్నికకు దారి తీసిన పరిస్థితులకు మూలకారణమదే! ప్రత్యర్థి పార్టీ తరపున గెలిచిన ప్రజాప్రతినిధుల్ని తమ పార్టీలోకి లాక్కొని, మంత్రిపదవులిస్తూ ప్రజాతీర్పునే వంచిస్తున్న సిగ్గుమాలిన చర్యలు ఇటీవల పెచ్చుమీరాయి. ఫిరాయింపు (నిరో ధక) చట్టంలోని లొసుగుల్ని సానుకూలంగా వాడుకుంటూ పాలకపక్షాలు బరి తెగిస్తున్న తీరుకు విరుగుడు కనిపించడం లేదు. పైగా, వేదికలెక్కి నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఈ జాడ్యానికి ప్రభా వవంతమైన పరిష్కారం లభించడం లేదు. నిబంధనల్ని ఉల్లంఘిస్తూ పార్టీ ఫిరాయించిన వారిని అనర్హులుగా ప్రకటించే ప్రక్రియలో చట్టసభల స్పీకర్లదే కీలకపాత్ర! వారీ విషయంలో పార్టీలకతీతంగా వ్యవహరించి, అలా పార్టీ మారిన వారిని చట్టప్రకారం అనర్హులుగా ప్రకటించాలి. కానీ, కాలక్రమంలో స్పీకర్లు పాలకపక్షాల కనుసన్నల్లో నడుచుకోవడం వల్ల, అధికారంలోని వారికి అనుకూలంగానే తప్ప చట్టబద్ధ, రాజ్యాంగబద్ధమైన నిర్ణయాలు తీసుకోవడం లేదు. పలుమార్లు ఈ వివాదాలు న్యాయస్థానాలకూ చేరాయి. ఎప్పట్లోగా నిర్ణయం తీసుకోవాలో తాము వారిని నిర్దేశించలేమని, వారొక మారు నిర్ణయ మంటూ తీసుకుంటే... దాని రాజ్యాంగబద్ధతను తాము సమీక్షించగలమని న్యాయస్థానాలంటున్నాయి. తెలంగాణ ఎమ్మెల్యే సంపత్ (కాంగ్రెస్) పిటిషన్ మేరకు ఫిరాయింపుల కేసొకటి సుప్రీంకోర్టు విచారణలో ఉంది. శుక్రవారం అది విచారణకు రావాల్సి ఉంది. ‘దీనిలోని సంక్లిష్టత దృష్ట్యా... ఈ కేసు విచా రణను ఎందుకు రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించకూడదు?’ అని సుప్రీం కోర్టు గత డిసెంబర్లో ప్రశ్నించింది. అయినా ఆ ప్రక్రియ జరిగినట్టు లేదు! సుప్రీంకోర్టు చొరవ తీసుకొని రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి ఈ ఫిరా యింపుల జాడ్యానికి చరమ గీతం పాడాల్సిన అవసరం ఉంది. అత్యధికులకు అండ న్యాయస్థానాలే! పలువురు భావిస్తున్నట్టు, కొందరు వక్రీకరిస్తున్నట్టు... వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుగా పేర్కొన్న సుప్రీం తీర్పు ‘ఆధార్’కు వ్యతిరేకమేం కాదు. తగు జాగ్రత్త చర్యలతో ‘ఆధార్’ను యథేచ్ఛగా కొనసాగించవచ్చు, పలు అభి వృద్ధి–సంక్షేమ కార్యక్రమాలకు అనుసంధానం చేయవచ్చు. నిర్దిష్ట అవసరాల కోసం పౌరుల వద్ద నుంచి సేకరించే వ్యక్తిగత సమాచారాన్ని అదే అవస రాలకు వాడటం, ఇతరేతర మార్గాల్లో అది దుర్వినియోగం కాకుండా, ఇతర ప్రైవేటు సంస్థల బారిన పడకుండా తగు భద్రతా చర్యలు తీసుకోవడం ఇకపై ప్రభుత్వాల బాధ్యత అవుతుంది. అందుకోసం, అవసరమైతే ప్రత్యే కంగా సమాచార భద్రతా చట్టం తీసుకురావాల్సి ఉంటుంది. ఆధార్ విష యంలో జరుగుతున్న తప్పిదాల్ని, లోపాల్ని, పౌరుల వ్యక్తిగత సమాచార భద్రత విషయంలో ఇప్పటికే జరిగిన తీవ్ర నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన అడ్డగోలు వాదనకు ఈ తీర్పు చెంపపెట్టు! అందుకే, ఈ తీర్పునకు సర్వత్రా స్వాగతం లభిస్తోంది. హర్షామోదాలు వ్యక్తమౌతు న్నాయి. వ్యక్తిగత గోప్యత మన దేశంలో అసలు హక్కే కాదని వాదించిన కేంద్రం ఇప్పుడు గొంతు సవరించుకుంటోంది. ప్రాథమిక హక్కే గానీ పరి మితులుంటాయని తాము పేర్కొన్నట్టు ఇప్పుడు మాట మారుస్తోంది. సుప్రీంకోర్టు ఇది ప్రాథమిక హక్కే అని చెప్పటమైనా, మూమ్మారు ‘తలాక్’ అని ఉచ్చరించినా, పరోక్షంగా ఫోన్ చేసినా, ఓ చిన్న మెసేజ్ పంపినా చాలు విడాకులిచ్చినట్టే అన్న పద్ధతి చెల్లదని ప్రకటించడమైనా రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడమే! చట్టాలకూ, రాజ్యాంగానికీ వ్యతిరేకంగా వ్యక్తులు గానీ, రాజ్యం గానీ దాష్టీకాలకు దిగినప్పుడు ఎదిరించి తమను తాము రక్షించు కోవడం ఈ వ్యవస్థలో చాలా తక్కువ మందికే సాధ్యం! దేశంలోని అత్య ధికులకు ప్రభుత్వాలు కల్పించే రక్షణ చర్యలు, చట్టాలు, రాజ్యాంగం, న్యాయ స్థానాల అండ అవసరమయ్యే పరిస్థితులే నేటికీ ఈ దేశంలో నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా పౌరులందరి నిత్య జీవితాల్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా శాసిస్తున్న రాజకీయ వ్యవస్థను క్రమబద్ధీకరించాల్సి ఉందని ప్రతి పౌరుడూ భావిస్తున్న తరుణమిది! ఇప్పుడు నెలకొని ఉన్న ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రభు త్వాల జవాబుదారీతనమైనా, ఎన్నికల సంస్కరణలైనా, రాజకీయ పరివర్త నైనా...... సుప్రీంకోర్టు చొరవ, క్రియాశీలతే ఈ దేశ పౌరులకు తక్షణ రక్ష! దిలీప్‌రెడ్డి ఈమెయిల్: dileepreddy@sakshi.com -
సమాచార కమిషనర్లను నియమించాలి
సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి భీమవరం టౌన్/తణుకు టౌన్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సమాచార హక్కు కమిషన్లను ఏర్పాటు చేసి.. వాటికి కమిషనర్లను నియమించాలని సమాచార హక్కు కమిషన్ మాజీ కమిషనర్, సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆర్.దిలీప్‌రెడ్డి డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స.హ. కమిషన్ లేకుండా ఉంటే సరిపోతుందన్నట్లుగా ప్రభుత్వాల తీరుందని విమర్శించారు. ఒక స్వచ్ఛంద సంస్థ పిల్ దాఖలు చేయగా స్పందించిన హైకోర్టు ఆరు వారాల్లో స.హ.కమిషన్‌ను కమిషనర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించిందని తెలిపారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ సమాచార హక్కు కమిషన్ ఏర్పాటు చేసినట్లు జీవో విడుదల చేసి వదిలేసిందన్నారు. అయితే కమిషన్ కార్యకలాపాలు ఇంతవరకూ అందుబా టులోకి రాలేదన్నారు. ఇదే రీతిలో తెలంగాణ ప్రభుత్వం సైతం సాగతీత పద్ధతిలో వ్యవహరిస్తోందన్నారు. చిత్తశుద్ధితో సమాచార హక్కు కమిషన్లను ఏర్పాటు చేసి అర్హుల్ని చీఫ్ కమిషనర్, కమిషనర్లుగా నియమించాలని ఆయన కోరారు. -
నటి కేసుతో మాకు సంబంధం లేదు: హీరో తల్లి
కొచ్చి: తన కుమారుడు అమాయకుడని, అతడికి నటి కేసుతో ఎలాంటి సంబంధంలేదని మలయాళ సూపర్ స్టార్ దిలీప్ తల్లి సరోజం పిళ్లై అన్నారు. ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఆమె లేఖరాశారు. మలయాళ నటి అపహరణ, వేధింపుల కేసుకుగానూ కేరళ పోలీసులు దిలీప్‌ను అరెస్టు చేసి విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా అలువా సబ్ జైలులో ఉన్న తన కుమారుడు దిలీప్‌కు బెయిలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదివరకే బెయిలు మంజూరు చేయాలన్న దిలీప్ అభ్యర్థనను హైకోర్టు నిరాకరించింది. నటుడు మరోసారి దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌ను ఈ నెల 18న మరోసారి హైకోర్టు విచారించనుంది. కేసు తప్పుదోవ పడుతోందని, విచారణలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని లేఖద్వారా దిలీప్ తల్లి సరోజం పిళ్లై సీఎంను కోరారు. నేరాలకు పాల్పడే తరహా వ్యక్తి దిలీప్ కాదన్నారు. కేసును మరోసారి విచారించి తమకు న్యాయం చేయాలని ఆమె విన్నవించారు. మరోవైపు సరోజం పిళ్లై నుంచి లేఖ అందినట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది. ఆమె రాసిన లేఖను కేరళ పోలీసు చీఫ్ లోక్‌నాథ్ బెహెరాకు పంపినట్లు సమాచారం. రాష్ట్ర కేబినెట్ మంత్రి పీసీ జార్జ్‌పై బాధిత నటి సీఎంకు ఫిర్యాదు చేస్తూ లేఖ రాసిన మరుసటి రోజే దిలీప్ తల్లి కూడా పినరయి విజయన్‌కు లేఖ రాయడం గమనార్హం. మంత్రి పీసీ జార్జ్ తీరు కేసు విశ్వనీయతను ప్రశ్నించేలా ఉందని, కేసు తప్పుదోవ పట్టకుండా చూడాలని నటి తన లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్సర్ సునీ సహా ఏడుగురిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. -
మౌన ఛేదనే మార్పుకు నాంది
సమకాలీనం ‘బయటకు వెళ్లిన పిల్లలు ఆలస్యంగా ఇంటికి వస్తున్నారంటే తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సింది ఆడపిల్లల గురించి కాదు, మగపిల్లల గురించి’ అన్న కిరణ్‌ఖేర్ మాట అక్షర సత్యం! చట్టాల్లో, పోలీసు వ్యవస్థలో, న్యాయపాలనలో, సామాజిక దృక్పథంలో, మగవాళ్ల ఆలోచనల్లో... అంతటా మార్పు రావాల్సిందే! వర్ణిక, అదితిల ధైర్యం, పట్టుదల వికసిస్తున్న మహిళా చైతన్యానికి సంకేతం, ఇతరులకు ఆదర్శం. మహిళల పట్ల జరుగుతున్న అన్ని రకాల దాష్టీకాలకూ కాలం చెల్లే రోజులు వస్తున్నాయనడానికి వారి తెగువ బలమైన సంకేతం. కొత్తతరం మహిళ వర్ణిక కుందు పెట్టిన పెద్ద పొలికేక భారతదేశమంతా ఇప్పుడు ప్రతిధ్వనిస్తోంది. అదింకా ఎన్నెన్నో రెట్లు పెరిగి, దిక్కులు పిక్కటిల్లే శబ్దమై ఘోషించాలి. దాన్ని అందిపుచ్చుకొని మహిళలు భవిష్యత్ బాటలు సుస్థిరం చేసుకోవాల్సిన తరుణమిది. న్యాయబద్ధంగా తమదైన ప్రతిష్టాత్మక స్థానాన్ని భారత మహిళ పదిలపరచుకోవాల్సిన సమయం వచ్చేసింది. పటి ష్టంగా వేళ్లూనుకున్న మన పురుషాధిక్య సమాజంలో మొగ్గతొడుగుతున్న మార్పులకిది చిరు సంకేతం! ఓ రకంగా చూస్తే ఘర్షణల పురిటి నొప్పులు పడుతున్న సంధి కాలమనిపిస్తుంది. 48 గంటల వ్యవధిలో చండీగఢ్‌లో వర్ణిక, ముంబైలో అదితి అనే ఇద్దరు వనితలు కనబరచిన అసాధారణ తెగువ అభినందనీయం! ‘మేం ఏం చేసినా చెల్లుబాటవుతుంద’నుకున్న ముగ్గురి పురుషాహంకారాన్ని చెంప చెళ్లు మనేలా తిప్పికొట్టారు. ఈ వీర వనితలు, ఈ దేశపు 65 కోట్ల మహిళలకు ప్రతినిధులే కాదు, మరో 65 కోట్ల మందితో కూడిన పురుష సమాజానికి ప్రత్యక్ష గుణపాఠం చెబుతున్న సవాళ్లు! సమాజ గతి మార్పునకు తెరతీస్తున్న ‘చేంజ్ అంబాసిడర్లు’! రాత్రిపూట వీధుల్లో తమను వెంటాడిన వైట్కాలర్డ్ మానవ మృగాల్ని ధైర్యంగా ఎదుర్కొన్నవారు. స్వీయ ప్రతిభతో విపత్తు నుంచి గట్టెక్కినా, ‘బయటపడ్డాం, బతుకుజీవుడా!’ అని సరిపెట్టుకోకుండా, సాహసించి ఆ ముష్కరుల్ని కటకటాల వెనక్కి పంపారు. పాలకపక్షం బీజేపీ హరియాణా శాఖ అధ్యక్షుడు సుభాష్ బరాలా కుమారుడు, వికాస్ బరాలాను రెండోసారి అరెస్టు చేయించి, అదనపు సెక్షన్లు పెట్టించిందా తెగింపే! ముంబైలో తనను వెంటాడి, కడకు ఇంటి తలుపు తట్టిన ‘టెక్కీ’కీ దాదాపు అదే గతి పట్టించింది ఓ ఇల్లాలి తెగువ! ప్రతికూల పరిస్థితిని వారు సమర్థంగా ప్రతిఘటించారు. సకాలంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుశ్చర్యను సామాజిక మాధ్యమాల్లో (ఫేస్బుక్) ఎండ గట్టారు. తగు చర్యలు తీసుకోవాలని సర్కార్‌ను డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోక తప్పని అనివార్య పరిస్థితుల్ని కల్పించారు. పిరికితనంతో, పాడుప డిన సంప్రదాయ కట్టుబాట్ల గుహల్లో కుమిలి, మగ్గి పోవడానికి వారు సిద్ధంగా లేరు. ‘‘నా పేరును గోప్యంగా ఉంచి ముఖాన్ని దాచుకోవాల్సిన అవ సరం లేదు, ఎందుకంటే, నేను నేరస్తురాల్ని కాదు, బాధితురాలినీ కాదు. ఒక విపత్కర పరిస్థితి నుంచి బయటపడ్డ విజేతను’ అంటోంది వర్ణిక! ‘వేటాడి, కిడ్నాప్‌నకు యత్నించి, నన్నింత క్షోభకు గురిచేసిన నేరతత్వపు ముష్కరులకు తగిన శిక్ష పడాల్సిందే!’ అంటోందామె. ఆమె తండ్రి, సీనియర్ ఐఏఎస్ అధి కారి వరిందర్సింగ్ కుందు ఆమెకు కొండంత అండ. ఇంకా పడికట్టు పదా లతో, మేకపోతు గాంభీర్యం కనబరుస్తున్న సంప్రదాయక సమాజంపై ప్రశ్నల పరంపరనే కురిపించింది వర్ణిక. ఆమె సంధించిన వాటిలో ఇంకా సమాధానం రాని, రావాల్సిన ప్రశ్నలు మనందరి చెవుల్లో గింగిరుమంటూనే ఉన్నాయి. సభ్య సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న అన్ని రకాల దాష్టీకాలకూ క్రమక్రమంగా, కాలం చెల్లే రోజులు అనివార్యంగా సమీపిస్తున్నాయనేందుకు, వారిరువురి తెగువ ఓ బలమైన సంకేతం! ఆధిపత్య దురాలోచనలకు అడ్డు కట్ట, భావజాల సంస్కరణ, ప్రతిఘటన, నివారణ చర్యలు, దోషులకు కఠిన శిక్షల అమలు ద్వారా మాత్రమే ఆడవాళ్లపై జరిగే లైంగిక వేధింపులు, అఘాయిత్యాలు, అత్యాచారాలను నియంత్రించగలుగుతాం. తాము చూపిన తెగువ, పట్టుదల, ప్రతిఘటన దేశవ్యాప్తం కావాలన్న గట్టి సందేశమే వారి ద్దరూ చూపిన సాహసం అంతరార్థం. కళ్లను కనురెప్పలు కాటేస్తున్నాయ్! స్విచ్ వేస్తే బల్బు వెలిగినంత వేగంగా వ్యవస్థలు మారవు. కానీ, మార్పు సంకే తాలున్నపుడు వాటిని గుర్తించడం, స్వాగతించడం, ప్రోత్సహించడం సమా జహితం కోరే వారి బాధ్యత. ఇప్పుడదే జరగాలి. తమపై పురుషులు జరిపే దాష్టీకాలను సాహసంతో ఎదురొడ్డి, మహిళలు ప్రతిఘటించే సంఘటనలు వేళ్లమీద లెక్కించగలిగినన్నే కావచ్చు! భవిష్యత్తులో చెటై్ట విశాలంగా విస్తరించే విత్తుపై ఇప్పుడా క్రాంతి ఓ సన్నని పొట్టులాంటిదే! చీకటి వ్యవహారాల్లా జరిగిపోయే ఈ దారుణాల్లో అసలు వెలుగు చూసేవే కొన్నయితే, అందులో పోరాట బాటన సాగేవి చాలా తక్కువ. డబ్బు, పలుకుబడి, రాజకీయ నేప థ్యమున్న కుటుంబాల వారు చేసే అకృత్యాలు అసలు పోలీసు కేసుల దాకానే రావు. వచ్చినా, కడదాకా నిలువవు. ప్రతిఘటనల నడుమ ప్రాణాలు పణంగా పెట్టి పట్టుదలగా ఎవరైనా పోరు సాగించినా, భ్రష్టుపట్టిన వ్యవ స్థల్ని వివిధ స్థాయిల్లో ప్రభావితం చేసే ‘పెద్ద మనుషులు’ కేసు దర్యాప్తుల్ని, నేర విచారణల్ని నిలువునా నీరుగారస్తారు. పరిస్థితుల్ని తమకనుకూలంగా మలచుకుంటారు. నిర్దోషులుగా చలామణి అవుతారు. తుది ఫలితంపై భరోసా లేక, బాగా చదువుకున్న మహిళలు కూడా ఈ అఘాయిత్యాలను ప్రతిఘటించడానికి, పోరాడటానికి సాహసించలేక పోతున్నారు. మానసి కంగా నలగటం, నలుగురి నోళ్లలో నానటం తప్ప ఒరిగేదేమీ ఉండదని కొన్ని సార్లు ఫిర్యాదు కూడా చేయట్లేదు. కానీ, మారుతున్న పరిస్థితుల్లో, శాస్త్ర– సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకొస్తున్న యుగంలో, నిజాల్ని నిప్పులా చూపే సీసీ కెమెరాల శకంలో, సామాజిక మాధ్యమాలు వేయి కళ్లతో చూస్తూ పౌర సమాజాన్ని అప్రమత్తం చేస్తున్న ఈ రోజుల్లో మహిళలు చూపే చొరవ, తెగింపే వారికి రక్ష. ముంబై, చండీగఢ్ వంటి పెద్ద నగరాల్లో జరిగిన ఈ రెండు ఘటనల్లోనూ వారు చేసిందదే! పట్టు సడలనీయకుండా ప్రతిఘటిం చారు. అందుబాటులోని అన్ని వనరుల్ని సమీకరించి ‘మృగాళ్ల’ ఆట కట్టిం చారు. మహిళలపై అఘాయిత్యమైనా, అందుకు ప్రయత్నమైనా.... లోలోపల కుమిలే మౌనం, నిశ్శబ్దం వారికి రక్ష కాదు సరికదా, చెలరేగే అల్లరి మూకలకు కొత్త ఇంధనం. 2013 అక్టోబర్ 18న హైదరాబాద్ ఇనార్బిట్ మాల్ ప్రాంతంలో క్యాబ్ ఎక్కిన యువతిని దారి మార్చి, ఓఆర్ఆర్లో తీసుకు వెళ్లి క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి తలపడ్డాడు. ‘అభయ’ పేరిట నమోదైన ఈ కేసును విచారించిన ఫాస్ట్‌ట్రాక్ కోర్టు, ఈ దుష్కృత్యానికి పాల్పడ్డ డ్రైవర్, అతని మిత్రుడికి 2014 మేలో, ఇరవై ఏళ్ల కారాగార శిక్ష విధించింది. ‘ఇది వరకెప్పుడూ నేనిటువంటి చర్యలకు పాల్పడలేదు, అత్యాచారం చేస్తే ఏమీ కాదు, ఇతరులెవరికీ వారు చెప్పుకోలేరు అని మా మిత్రుడు నన్ను పురిగొ ల్పాడు, ఇంతకు ముందు తానొకరిపై ఇలాగే అత్యాచారం చేసినా తనకేమీ కాలేద’ని చెప్పాడని విచారణలో వెల్లడించాడు. అదీ వారి భరోసా! గొంతెత్తి ప్రతిఘటించడం, అకృత్యాల్ని ఎలుగెత్తి చాటడం, పట్టుబట్టి నేరానికి తగ్గ శిక్ష ఇప్పించడమే ఉన్నంతలో సరైన మార్గం. వర్ణిక, అదితి ఇప్పుడీ మార్గాన్ని ఎలుగెత్తి చూపారు. ఇప్పటికీ కోట్లాది కుటుంబాల్లో పెదాలు విచ్చుకోవట్లేదు. గొంతులు పెగలట్లేదు. ఉబికివచ్చే కన్నీరు తప్ప, గుండె పొరలు దాటని దుఃఖం లోలోనే సుడులు తిరుగుతోంది. సహోద్యోగుల నుంచి పై అధికారుల దాకా, సాటి పనివారి నుంచి యజమానుల దాకా, వరుసకు సోదరుల నుంచి ఇతర బంధువుల దాకా, పెంపుడు తండ్రుల నుంచి కన్నతండ్రుల దాకా.... కళ్లను కాటేస్తున్న కనురెప్పలెన్నో! గ్రామీణ భారతంలో, పేదరికంలో, పని ప్రదేశాల్లో, పాలన–అధికార వ్యవస్థల హోదా దొంతరల్లో... అంతటా ఆడ వారిపై అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. భావజాలమే మూల సమస్య ‘వాడు మగాడు, ఎలా అయినా తిరగొచ్చు, ఆడాళ్లకెందుకు...?’ ఇదీ, ఉగ్గు పాలతో మన వారు నూరిపోసే భావజాలం. మెజారిటీ తలిదండ్రులు పిల్లల పెంపకంలోనూ ఈ వివక్ష చూపుతున్నారు. చింత చచ్చినా పులుపు చావ లేదన్నట్టు, ఎన్ని చదువులు చదివినా అంతర్లీనంగా ఉన్న భావజాలం వద లడం లేదు. పైకెన్ని గంభీరమైన మాటలు చెప్పినా, లోలోపల ఇటువంటి ఆలోచనా సరళి ఉండటం వల్లే ఆడవాళ్ల పట్ల లింగ వివక్ష, లైంగిక వేధింపులు, మానసిక, భౌతిక దాడులూ, పెంపకం లోపం వల్ల మగాళ్ల వైఖరిలోనే ఆడాళ్ల పట్ల ఓ చిన్నచూపు అంతర్లీనంగా బలపడుతోంది. ఈ దుష్ప్రభావం వల్ల నేమో, ఎదుగుదల క్రమంలోనే మగపిల్లల్లో ఓ విచ్చలవిడితనం, ఆడపిల్లల్లో ఓ రకమైన బెరుకు, భయం అలవడి పోతున్నాయి. దీనికి పూర్తి భిన్నమైన పంథాను వర్ణిక, అదితి కనబర్చారు. మహిళలపై అకృత్యాలకు పాల్పడే వాళ్లకన్నా, పరోక్షంగా వాటిని సమర్థిస్తూ మాట్లాడే పెద్ద మనుషులే ప్రతికూల భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారు. తాజా ఘటనలో కూడా, ‘అంత రాత్రి పూట ఆమెకు అక్కడేం పని, త్వరగా ఇంటికి వచ్చి ఉండాల్సింది. ఆమె తల్లి దండ్రులు ఈ విషయంలో ఎందుకు శ్రద్ధ తీసుకోలేదు’ అని హరియాణా బీజేపీ ఉపా«ధ్యక్షుడు రామ్దీర్ భట్టి చేసిన వ్యాఖ్య ఈ కోవదే! మరి అదే విషయం వర్ణికను వెంటాడిన వికాస్ బరాలాకూ వర్తిస్తుంది కదా! ఇదేదో అతి సాధారణ విషయమైనట్టు, ‘అబ్బా యిలు అమ్మాయిల వెంటపడటం కాలేజీ విద్యార్థుల్లో మామూలే!’ అని మరో బీజేపీ నాయకుడి నిస్సిగ్గు వ్యాఖ్య, ‘కుర్రాళ్లు, కుర్రాళ్ల పనులే చేస్తారు’ అని వారి పోకిరీ పనుల్ని సమర్థిస్తూ లోగడ ములాయంసింగ్ యాదవ్ అన్న మాటల్ని గుర్తుకు తెస్తోంది. సంతానం ఆడో, మగో కనడం ఎవరి చేతు ల్లోనయినా ఉంటుందా? కాలం చెల్లిన సామెతే కావచ్చు! ‘కోడలు మగబిడ్డను కనిపెడతానంటే ఏ అత్త వద్దంటుంది?’ అని ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు పబ్లిగ్గా చేసిన వ్యాఖ్యలు ఏ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాయి? అంటే, ఆడబిడ్డని కంటే అత్తలు వద్దంటారని, అలా అనడం సముచితమేనని అర్థమే కదా! ‘కారు గ్యారేజీలో ఉంటే క్షేమంగా ఉన్నట్టు, ఆడవాళ్లు ఇంట్లోనే ఉంటే ఏ అఘాయిత్యాలూ జరుగవు కదా!’ అని సాక్షాత్తూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేసిన వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాంటివి ఇంకా చాలానే ఉన్నాయి. కొన్ని విషయాల్లో ఇదొక దుర్మార్గమైన సమాజం, మరీ ముఖ్యంగా మహిళల పట్ల! బూజు పట్టిన భావజాలంలో బతికే సనాతన వాదులు మహిళల్ని... అవసరమైన పనులు చేసిపెట్టే, లైంగిక వాంఛలు తీర్చే, పిల్లల్ని కనిచ్చే జీవులుగా తప్ప, సాటి మనుషులుగా కూడా చూడలేక పోతున్నారు. తామై కదిలితే తప్ప... తాను కాకుండా మరో సాధారణ యువతి అయితే పోలీసులు స్పందించి ఉండేవారా? వారు కల్పించుకునే లోపలే పోకిరీలకు తాను చిక్కి ఉంటే? తెగించి తాను సాహసించకుంటే ఏమై ఉండు? ఇలాంటి ఆలోచనలూ వర్ణిక మదిలో మెదిలాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు! ‘ఏది ఏమైనా సరే, దోషులకు శిక్షపడే హేతుబద్ధ్దమైన ముగింపు వరకూ పోరాడుతా, ఈ సమయంలో ఆమెకు నేను అండగా నిలవకపోతే దేశంలో ఏ తండ్రీ తన బిడ్డల కోసం నిలబడలేడ’న్న వరిందర్ కుందు మాటలెంత సత్యం! ‘బయ టకు వెళ్లిన పిల్లలు ఆలస్యంగా ఇంటికి వస్తున్నారంటే తల్లిదండ్రులు ఆందో ళన చెందాల్సింది ఆడపిల్లల గురించి కాదు, మగపిల్లల గురించి’ అన్న బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్ అభివ్యక్తిలో ఎంత నిజముంది! చట్టాల్లో, వాటి అమలులో, పోలీసు వ్యవస్థలో, న్యాయపాలనలో, సామాజిక దృక్పథంలో, మగవాళ్ల ఆలోచనల్లో... అంతటా మార్పు రావాల్సిందే! ముఖ్యంగా మహిళల్లో మరింత చైతన్యం రావాలి. వర్ణిక, అదితిల ధైర్యం, పట్టుదల మహిళా సమా జానికి ఓ స్ఫూర్తి కావాలి. దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
హక్కును హరిస్తే, బతుకు బజారే!
సమకాలీనం బతుక్కు సంబంధమున్న పలు అంశాల్లో హక్కులుండీ, రాజ్యాంగ భద్రత కలిగీ, చట్టాలేర్పడి, ప్రత్యేక సంస్థలున్నచోటే రక్షణ కరువవుతోంది. నట్టింట చిచ్చు పెట్టిన ‘డ్రగ్స్’ మహమ్మారిని చూస్తూనే ఉన్నాం. హక్కులు ఒక్కొక్కటే హరించి, సమాజాన్ని పాలనా సంకెళ్లలో బంధించడం సరికాదు. వ్యక్తిగత గోప్యత హక్కునూ హరిస్తే పిల్లలు, మహిళలతో సహా సామాన్యుల బతుకులు రోడ్డున పడతాయి. పరస్పర ప్రయోజనాలతో ప్రభుత్వాలతోఅంటకాగే బహుళజాతి సంస్థలు, కార్పొరేట్లు, ప్రయివేటు శక్తుల ఆగడాలకు హద్దుండదు. కుక్క తోకనూపడమా? తోకే కుక్కనూపడమా? ఏం జరుగుతోందన్నది ముఖ్యం! విశిష్ట గుర్తింపు కార్డు, ఆధార్‌లో పాటించే పద్ధతుల చట్టబద్ధతను రాజ్యాంగం కల్పించిన ‘వ్యక్తిగత గోప్యత (ప్రైవసీ) హక్కు’ పరిధిలో పరిశీలించాలా? లేక, ఆధార్ ఓ మంచి ప్రక్రియ గనుక దాని నీడలో, అసలు భారత పౌరులకు గోప్యత ప్రాథమిక హక్కేనా అని నిర్ణయించాలా? ఇదీ, ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చల సారం. సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు ఏర్పరచిన తొమ్మండుగురు జడ్జీల ధర్మాసనం ముంది పుడు వాదనలు సాగుతున్నాయి. అవి ముగింపునకు వస్తున్న తరుణంలో, ఈ సంవాదం రేపుతున్న సందేహాలెన్నో! ‘ఆధార్’ను కాసేపు పక్కన పెట్టి చర్చిం చినా, పౌరులకు బోలెడంత వ్యక్తిగత జీవితం ఉంటుంది. దానికనేక పార్శా్వ లుంటాయి. అవి గోప్యంగా ఉంచుకోవాలనే స్వేచ్ఛా భావన ఉంటుంది. సదరు గోప్యతను ప్రభుత్వాలు కాపాడాలనే ఆశ, అనుచితంగా అందులోకి చొరబడే వాళ్లని శిక్షించాలనే ఆకాంక్ష సహజం! వాదనలెలా ఉన్నా ఓ హక్కు, హక్కు కాకుండా ఎలా పోతుంది? పైగా, మారుతున్న కాలమాన పరిస్థి తుల్లో... ఉన్న హక్కులకు భద్రత కల్పిస్తూ, చట్టాలకు పదును పెట్టాల్సింది పోయి వాటిని నీరు గార్చడం దారుణం! సర్కారు కనుసన్నల్లో సమాచార వ్యవస్థను గుప్పిట పట్టిన ప్రయివేటు శక్తులు పౌరుల గోప్యతను గాలికొదిలి, సగటు మనిషిని నిలువునా గుడ్డలిప్పి నడిబజార్లో నిలబెడుతున్న సంధికాల మిది! శాస్త్రసాంకేతికత పుణ్యమా అని ఇతరుల వ్యక్తిగత సమాచార వ్యవస్థ (డాటా) పరిధిలోకి ఎవరైనా చొరబడటం తేలికైన రోజులివి. గోప్యత పౌరుల ప్రాథమిక హక్కే కాదంటే, దీనికొక రాజ్యాంగ భద్రతే లేదంటే, కార్పొరేట్ శక్తులు అనుచితంగా చొరబడటం ఒక ఆటవిడుపవుతుంది. కేంద్రీకృతంగా అధికారాన్ని గుప్పిట పట్టాలనుకునే సర్కార్లకు ఇక అడ్డూ అదుపుండదు. తమ వర్తక, వాణిజ్య, రాజకీయార్థిక ప్రయోజనాల కోసం పౌరుల కనీస హక్కుల్ని కాలరాచే తీరు విలువల పతనానికే దారితీస్తుంది. పౌరులది, ముఖ్యంగా బల హీనులది... తమదైనదేదీ కాసింత గోప్యంగా ఉంచుకోలేని బజారు బతుకవు తుంది. వారేదైనా ఎంపిక చేసుకునే అవకాశాలు కూడా సన్నగిల్లుతాయి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని సమగ్ర తీర్పు చెప్పాల్సిన గురుతర బాధ్యత ఇప్పుడు సుప్రీం ధర్మాసనంపైనే ఉంది. గత అనుభవాల నేపథ్యంలో ఓ చరిత్రాత్మక తీర్పు కోసం దేశం నిరీక్షిస్తోంది. పరిమిత దృష్టితోనే ప్రమాదం హక్కు అప్రతిహతం కాదంటే, పరిమితులు విధించవచ్చు. ఎవరి హక్కులైనా ఇతరుల హక్కులకు భంగం కలిగించకూడదన్నదే రాజ్యాంగ స్ఫూర్తి. దానికి లోబడి సహేతుకమైన పరిమితుల్ని వ్యక్తిగత గోప్యత హక్కుకూ విధించ వచ్చు. ఆధార్ కోసం పౌరుల నుంచి సేకరించిన బయోమెట్రిక్, ఇతర ముఖ్య సమాచారం యథేచ్ఛగా జనబాహుళ్యంలోకి రావడం పట్ల పలువురు అభ్యం తరం వ్యక్తం చేశారు. దురుపయోగమయ్యే ప్రమాదాన్నీ శంకించారు. ఈ విష యమై సుప్రీం సమక్షానికి పలు వినతులు, ప్రజాప్రయోజన వ్యాజ్యాలు రావ డంతో ఇది వార్తలకెక్కింది. వ్యక్తిగత గోప్యత అసలు ప్రాథమిక హక్కే కాదని గత రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. పౌరులకు సంక్రమించిన రెండు హక్కుల మధ్య హెచ్చు–తగ్గుల పోటీ పెట్టి చోద్యం చూసే వింత పంథాను కేంద్రం ఎంచుకుంది. ‘ఏదో కొందరు తమ వ్యక్తిగత గోప్యత హక్కు గురించి మాట్లాడుతున్నారు, మరో వైపు మేం ‘ఆధార్’ ఆసరాతో 27 కోట్ల మందికి ఆహార భద్రత కల్పిస్తున్నాం, ఆహారపు హక్కు కన్నా వ్యక్తిగత గోప్యత హక్కు గొప్పదా?’ అన్న ప్రభుత్వ న్యాయవాది మాటల్లోనే సర్కారు వాదన డొల్ల తనం బయటపడింది. ఆధార్‌తో ఎంతో ప్రయోజనం ఉన్నందున, ఆ ప్రక్రియలో తప్పిదాల్ని ప్రశ్నించే మరొకరి హక్కులకు లెక్కే లేదనే వాదన తప్పు. ఆరున్నర దశాబ్దాల మన రాజ్యాంగ చరిత్రలో వ్యక్తిగత గోప్యత అంశం పలు మార్లు ఉన్నత న్యాయస్థానం సమక్షానికి వచ్చింది. ఇది ప్రాథమిక హక్కు కాదని రెండు మార్లు సుప్రీం ధర్మాసనం తీర్పు చెప్పింది. 1954లో ఎంపీ శర్మ కేసులో 8 మంది న్యాయమూర్తుల ధర్మాసనం, తర్వాత 1962లో ఖరక్ సింగ్ కేసులో ఆరుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. తదనంతర కాలంలో విచారణకు వచ్చిన గోవింద్–మనేక (1975) కేసులో, గోప్యత రాజ్యాంగం నిర్దేశించిన హక్కు అని సుప్రీం తీర్పు స్పష్టం చేసింది. అధికరణం 21లోని జీవించే హక్కుతో పాటు అధికరణం 19లోని పలు ప్రాథమిక హక్కుల్లోనూ వ్యక్తిగత గోప్యత మూలాలు, ఆనవాళ్లు ఉన్నా యని చెబుతూ ఇది రాజ్యాంగపు హక్కని స్పష్టం చేసింది. ఇంకా పలు సందర్భాల్లో, మలక్(1981), రాజగోపాల్ (1994), పీయూసీఎల్ (1997), డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ (2005), సుచిత (2009), సెల్వీ(2010), నల్సా (2014) కేసుల్లోనూ వ్యక్తిగత గోప్యతను రాజ్యాంగం కల్పించిన హక్కుగా గుర్తిస్తూ తీర్పులు వెలువడ్డాయి. కానీ, రాజ్యాంగంలో ఏదైనా అంశంపై స్పష్టత కొరవడి, సందిగ్ధత నెలకొన్నపుడు సుప్రీంకోర్టు తీర్పులే ప్రామాణికమౌతాయి. గోప్యత ప్రాథమిక హక్కు కాదని అంతకు ముందు తీర్పిచ్చినవి విస్తృత ధర్మాసనాలయినందున, తదనంతర కాలంలో తక్కువ మంది న్యాయమూర్తులతో ఏర్పడ్డ ధర్మాసనాలిచ్చిన గోప్యత అనుకూల తీర్పులు కాల పరీక్షకు నిలువలేదు. ఇప్పుడు విచారిస్తున్నది 9 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం కనుక, ఈ తీర్పు ఇకపై శిరోధార్యమౌతుంది. మాట మార్చింది అందుకేనేమో! గోప్యత ప్రాథమిక హక్కు కాదని తీర్పిచ్చిన సందర్భాలు వేరు. ఎంపీ శర్మ (1954) కేసు, దర్యాప్తు అధికారులు దాల్మియా సంస్థల్లో జరిపిన సోదాలను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్. ఖరక్ సింగ్ (1962) కేసు, నేరారో పణలు ఎదుర్కొంటున్న ఖరక్ సింగ్‌పై దర్యాప్తు బృందం ఏర్పాటు చేసిన నిఘా, నియంత్రణ, తనిఖీలను సవాల్ చేస్తూ కోర్టుకెక్కిన సందర్భం. అవన్నీ, ఆరోపణలెదుర్కొంటున్న వారిపై దర్యాప్తు సంస్థలు జరిపే నిఘా, నియంత్రణ, సోదాలకు సంబంధించిన వ్యవహారాల్లో గోప్యత విషయమై వెలువరించిన తీర్పులు. ఆ తీర్పే అన్ని సందర్భాలకూ సరిపోతుందను కోవడం సరికాదు. సగటు మనిషి వ్యక్తిగత గోప్యత హక్కు ప్రాధాన్యతను, అందుకవసరమైన పరిమితుల్ని నిర్ణయించడమే ప్రస్తుతం ధర్మాసనం ముందున్న కర్తవ్యం. అందుకే, మొత్తానికిది ప్రాథమిక హక్కు అవునా? కాదా? అన్నది తేలితే తప్ప తాము తదుపరి తీర్పు వెలువరించలేమన్న ధర్మాసనం అభిప్రాయానికి అర్థముంది. 2012 నుంచి ఆధార్ వివాదంపై కేసు విచారణ సాగుతోంది. దీని చట్టబద్ధతను కర్ణాటకకు చెందిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి కె.ఎస్. పుట్టుస్వామి లోగడ ఓ సందర్భంలో సవాల్ చేశారు. తదనంతరం 2016లో చట్టం తీసుకువచ్చి ఆధార్‌కు చట్టబద్ధత కల్పించిన తీరే ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. కేవలం ఆధార్ దృష్టి కోణంలోనే కాకుండా, విస్తృతార్థంలో గోప్యత హక్కును నిర్వచించి, పౌరుల హక్కును నొక్కిచెప్పి, ఏ మేరకు పరిమితులు విధించే హక్కు–అధికారం ప్రభుత్వానికుందో తేల్చాల్సిన సందర్భం వచ్చింది. రెంటి మధ్య సమతు ల్యత సాధించాలి. ఇన్నాళ్లూ ఇది ప్రాథమిక హక్కే కాదంటూ వచ్చిన కేంద్రం గొంతు మార్చింది. ప్రాథమిక హక్కు అయితే అయివుండవచ్చు, కానీ, పరిమితులేలేని సంపూర్ణ హక్కేం కాదనే తాజా వాదన వినిపిస్తోంది. వ్యక్తిగత గోప్యతలోని పలు అంశాలు, ఉప అంశాల్లో కొన్ని అప్రతిహత హక్కే అయినా, ఇంకొన్నిటికి దాన్ని య«థాతథంగా వర్తింపజేయలేమనే వాదనను తెరపైకి తెచ్చింది. ఇలా అన్ని అంతర్గత అంశాలు, ఉప అంశాలకు ఒకే స్థాయి కల్పిస్తే, అవి ఇతర ప్రాథమిక హక్కుల అమలుకు భంగం కల్గించే ప్రమా దముందన్నది కేంద్ర ప్రభుత్వ భావన! ఐటీతో ప్రపంచమే మారింది ఆధునిక శాస్త్రసాంకేతికత వల్ల సమాచార వ్యవస్థే సమూలంగా మారి పోయింది. వ్యక్తిగత గోప్యతకు అర్థం, ప్రాధాన్యం, ప్రభావం అన్నీ మారాయి. ప్రతి వ్యక్తి తన శరీర, ఆరోగ్య, ఆస్తి, ఆలోచన, భావన, సంబంధాలు తదితర వ్యక్తిగత అంశాల్లో గోప్యత ఆశించడం సహజం. అందులో జోక్యం–దానిపై నియంత్రణ ఏదైనా తనకు తెలిసి, తన స్పృహ–ప్రమేయంతో జరగాలనుకోవడమూ న్యాయబద్ధమే!గోప్యతకు చట్ట బద్ధమైన రక్షణ లేకుంటే సగటు మనుషులు తీవ్రంగా నష్టపోతారు. ఆర్థిక, సామాజిక, హోదా–గౌరవపరమైన అంశాల్లో ఇబ్బందులెదురవుతాయి. ఎవ రితో పంచుకోకుండా తమతోనే అట్టేపెట్టుకోగల సొంత విషయాలే లేని దుస్థితి దాపురిస్తుంది. ‘వ్యక్తిగత గోప్యత హక్కు అంటే, తన మానాన తనని బతకనివ్వడం’ అనే ఓ ప్రసిద్ధ నిర్వచనం కూడా ఉంది. ఇది వ్యక్తి గౌరవం, స్వేచ్ఛకు ప్రతీక! ఒకవైపు గోప్యతకు రక్షణ కరువై, మరోవైపు అందులోకి ఇతరులు సులువుగా చొరబడే, అనుచితంగా జోక్యం చేసుకునే, ‘డాటా’ను య«థేచ్ఛగా వాడుకునే ఆస్కారం పెరగటమన్నది ఏ రకంగా చూసినా ప్రమా దకరమే! హక్కు భద్రత లేనపుడు, అటువంటి అనుచిత జోక్యాలు తనకు నిక రంగా నష్టం కలిగించినా, కారకులైన సదరు వ్యక్తులు, సంస్థలు, ప్రభు త్వాల నిర్వాకాల్ని ప్రశ్నించలేని స్థితి పౌరుడికి ఎదురౌతుంది. ఇంటర్నెట్ విస్తృతి పెరిగి, ఫేస్బుక్, వాట్సాప్, ట్వీటర్ తదితర సామాజిక మాధ్యమాలు మనిషి జీవితంలోకి అతి లాఘవంగా చొచ్చుకు వచ్చాక ‘డాటా’ భద్రత తీరే మారి పోయింది. పోటీ పెరిగిన వ్యాపార ప్రపంచంలో రకరకాల పద్ధతుల్లో వ్యక్తి గోప్యతలోకి చొరబడే యత్నం నిరంతరం సాగుతోంది. ఉచితాల మోజులో పడి మనమే ఎందరెందరికో ఆ ఆస్కారం కల్పిస్తున్నాం. దారపు పోగులా ఓ చిరుబంధం ఏర్పడ్డా చాలు, మనకు సంబంధించిన ఎంత వ్యక్తిగత సమా చారాన్ని జనబాహుళ్యంలోకి లాగుతారో? ఎంతలా మన బతుకును తెరచిన పుస్తకం చేస్తారో? ఆ లెక్కకు అంతే ఉండదు. బహిరంగ వేదిక ‘ఫేస్బుక్’ కన్నా, పరస్పర సమాచార వాహిక ‘వాట్సాప్’ కాస్త సురక్షితం అనుకున్న వారు తమ వ్యక్తిగత సమాచారాన్ని అక్కడ పంచుకున్నారు. వాట్సప్‌ను ఫేస్ బుక్ స్వాధీనపరచుకున్న తర్వాత అంతా బహిరంగమే అయి వినియోగ దారులు భంగపడ్డారు. ఇటువంటివెన్నెన్నో! సంకెళ్లు సరికాదు తరం మారింది. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన తొలిరోజుల నాటి నాయకులు, పాలకులు, వారి ఆలోచనా ధార, హక్కులకై పోరాడే పంథా, విలు వలు... క్రమంగా అన్నీ నశిస్తున్నాయి. ఇప్పుడవేమీ లేవు. మనిషి బతుక్కు సంబంధమున్న పలు అంశాల్లో హక్కులుండీ, రాజ్యాంగ భద్రత కలిగీ, చట్టాలేర్పడి, ప్రత్యేక సంస్థలున్న చోటే రక్షణ కరువవుతోంది. నట్టింట చిచ్చు పెట్టిన ‘డ్రగ్స్’ మహమ్మారిని కళ్లారా చూస్తూనే ఉన్నాం. హక్కులు ఒక్కొక్కటే హరించి, సమాజాన్ని పాలనా సంకెళ్లలో బంధించడం సరికాదు. ఇక వ్యక్తిగత గోప్యత హక్కునూ హరిస్తే పిల్లలు, మహిళలతో సహా సామాన్యుల బతుకులు రోడ్డున పడతాయి. పరస్పర ప్రయోజనాలతో ప్రభుత్వాలతో అంటకాగే బహుళజాతి సంస్థలు, కార్పొరేట్లు, ప్రయివేటు శక్తుల ఆగడాలకు ఇక హద్దుం డదు. వ్యక్తిగత గోప్యతను విస్తృతార్థంలో చూసి, సమాజ విశాల హితంలో అన్వయించి ఆ సర్వోన్నత న్యాయస్థానమే గోప్యత హక్కును కాపాడాలి. - దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
నటుడి భార్య విచారణ.. వెక్కివెక్కి ఏడ్పు
కొచ్చి: కేరళలో ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో విచారణను ఎదుర్కొంటున్న మలయాళ నటుడు దిలీప్ భార్య కావ్య మాధవన్‌ను కూడా విచారించినట్లు కేరళ పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న ఏవీ గార్జ్ విలేకరులతో మాట్లాడుతూ 'మంగళవారం కావ్యమాధవన్‌ను ప్రశ్నించడం జరిగింది. ప్రస్తుతానికి నేను ఈ విషయాన్ని మాత్రమే స్పష్టం చేయగలను. ఇంతకుమించి ఎలాంటి సమాచారం అందించలేను' అని ఆయన తెలిపారు. దిలీప్ పూర్వీకుల నివాసానికే వెళ్లిన అధికారులు అక్కడే ఆమెను దాదాపు ఆరుగంటలపాటు ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ సమయంలో పలుమార్లు ఏడ్చినట్లు సమాచారం. దిలీప్‌కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన కేరళ హైకోర్టు ఆగస్టు 8 వరకు ఆయనను జ్యుడిషియల్ రిమాండ్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. -
కష్టం మరచిపోయాం!
‘‘నా నిర్మాతలు హరికృష్ణ, చందుగారు, జీవన్‌గార్లకు అభినందనలు. ఇంత మంచి సినిమా ఇచ్చిన నిర్మాతలకు మా నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎప్పుడూ రుణపడి ఉంటాం. శివేంద్రగారు విజువల్స్ బాగున్నాయి. సాయికార్తీక్‌గారి సంగీతం, ఆర్ఆర్ సినిమాని మరో లెవల్‌కి తీసుకెళ్లాయి’’ అని హీరో దిలీప్ అన్నారు.దిలీప్, ఇషా, దీక్షాపంత్, సోనియా ముఖ్య పాత్రల్లో గోవింద్ లాలం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మాయా మాల్’. కె.వి.హరికృష్ణ, చందు ముప్పాళ్ల, నల్లం శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలైంది. సోమవారం నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో గోవింద్ లాలం మాట్లాడుతూ– ‘‘మేం పడ్డ కష్టాన్ని ‘మాయామాల్’ మార్నింగ్ షోతో మరచిపోయాం. చాలా చోట్ల హౌస్‌పుల్ కలెక్షన్స్ వస్తుండటంతో హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. నైజాంలో థియేటర్స్ సరిగ్గా దొరకలేదు. ఇంత మంచి సక్సెస్ అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు నిర్మాతలు. -
హీరో దిలీప్‌కు మళ్లీ బెయిల్ నిరాకరణ
కొచ్చి: మలయాళ హీరో దిలీప్‌కు మరోసారి న్యాయస్థానంలో చుక్కెదురు అయింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కేరళ హైకోర్టు తిరస్కరించింది. మళయాల నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన హీరో దిలీప్ కుమార్ బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఆయన బెయిల్ పిటిషన్ తోసిపుచ్చింది. గతంలోనూ బెయిల్ కోసం దిలీప్ చేసుకున్న విజ్ఞప్తిని కోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. కాగా ఫిబ్రవరిలో మలయాళ నటిని కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో దిలీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన జ్యుడిషియల్ కస్టడీ ఈ నెల 25 వరకూ కొనసాగనుంది. -
ఆ రాత్రి ఏం జరిగింది?
దిలీప్, ఈషా జంటగా తెరకెక్కిన చిత్రం ‘మాయామాల్’. గోవింద్ దర్శకత్వంలో హరికృష్ణ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. సాయికార్తీక్ స్వరపరచిన ఈ సినిమా పాటలను హీరో నారా రోహిత్ రిలీజ్ చేశారు. ‘‘ఒక రాత్రి మొత్తం జరిగే హారర్ కామెడీ చిత్రమిది. ఆ రాత్రి ఏం జరిగింది? అన్నది ఆసక్తికరం. నా మిత్రుడు సాయికార్తీక్ వల్లే ఈ సినిమా చేయగలిగా. సాయికార్తీక్, జీవన్ కుమార్ల ప్రోత్సాహంతో రిలీజ్ వరకూ వచ్చాం’’ అన్నారు హరికృష్ణ. ‘‘సినిమా బాగా వచ్చింది’’ అన్నారు గోపాల్. ‘‘హైదరాబాద్‌లోని ప్రతి మాల్లో నైట్ షూట్ చేశాం. అవుట్‌పుట్ బాగా వచ్చింది’’ అన్నారు దిలీప్. -
'దిలీప్‌ను జైలుకు పంపే ఆధారాలున్నాయి'
కొచ్చి: కేరళ ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో దిలీప్‌ను జైలుకు పంపించేందుకు కావాల్సినన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పోలీసులు చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మేం ఆయనను అరెస్టు చేయలేదని స్పష్టం చేశారు. ఈ కేసు విచారణను పర్యవేక్షిస్తున్న ఏవీ గార్గ్ ఈ కేసు విషయంపై ప్రశ్నించగా దర్యాప్తునకు సంబంధించి ఇంతకుమించి ఎలాంటి విషయాలు చెప్పలేమన్నారు. దిలీప్‌నకు వ్యతిరేకంగా పూర్తి ఆధారాలు తమ ఉన్నాయని మాత్రం పునరుద్ఘాటించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న దిలీప్ మేనేజర్ అప్పునీ బుధవారం దిలీప్ కోసం కేరళ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కోసం పిటిషన్ వేశారు. అంతేకాకుండా, తన బెయిల్ పిటిషన్లో పోలీసుల వద్ద అసలు ఎలాంటి ఆధారాలు లేకుండానే దిలీప్‌ను అరెస్టు చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసులో నటుడు, దర్శకుడు నదీర్ షా అప్రూవర్‌గా మారేందుకు పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. దిలీప్ యాంటిసిపేటరీ బెయిల్‌పై హైకోర్టు గురువారం విచారించనుంది. -
ఈ దిలీప్ మిస్టర్ వాల్
qడిఫెన్స్‌లో తన జట్టుకు కోటగోడగా మారి ప్రత్యర్థి జట్టు గోల్స్ చేయకుండా అడ్డుకుంటాడు. జట్టు పాల్గొన్న ప్రతి పోటీలోనూ తన కంటూ ప్రత్యేకత నిలుపుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అనంతపురం సప్తగిరి సర్కిల్ : పరిగి మండలం కాలువపల్లికి చెందిన సాధారణ రైతు కూలీ అశ్వర్థప్ప, అన్నపూర్ణమ్మ దంపతుల కుమారుడు దిలీప్. ప్రస్తుతం ఆర్డీటీ ఫుట్‌బాల్ అకాడమీలో ఉంటూ విన్సెంట్ డీ పాల్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. 2010లో ఆర్డీటీ అకాడమీ పరిగిలో పీఈటీ రామాంజనేయులు వద్ద తన ఫుట్‌బాల్ క్రీడకు సంబంధించిన ఓనమాలు దిద్దాడు. అనంతరం 2014లో స్కూల్ గేమ్స్ పోటీల్లో జిల్లా తరఫున పాల్గొని రాష్ట్ర జట్టులో చోటు సాధించాడు. 2015లో ఆర్డీటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి లీగ్ పోటీల్లో పరిగి జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. తన ఆటతీరును గుర్తించిన ఆర్డీటీ కోచ్ దాదా ఖలందర్, రియాజ్‌లు ఆర్డీటీ అకాడమీకి ఎంపిక చేశారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో సత్తా ఆర్డీటీ అకాడమీలో చేరిన ఆరు నెలల్లోనే దిలీప్ రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాపోటీలకు ఎంపికై తన సత్తా చాటాడు. గతేడాది జాతీయస్థాయి పీఎం టోర్నీకి ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున పాల్గొనే అవకాశం దక్కింది. రైట్ సెంటర్ బ్యాక్ స్థానంలో ఉంటూ ప్రత్యర్థి జట్టు సంధించిన ఏ బంతినైనా అవలీలగా అవతలి గోల్ వైపునకు మళ్లించి ప్రత్యర్థి జట్టును గోల్ సాధించకుండా అడ్డుకుంటూ తన ప్రత్యేకత నిలుపుకుంటున్నాడు. అతని ఆటతీరును గమనించిన సెలెక్టర్లు అతనిని జాతీయ ఫుట్‌బాల్ శిక్షణ శిబిరానికి ఎంపిక చేశారు. ఫతేహ్ హైదరాబాద్ జట్టు నుంచి ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన ఇండియన్ లీగ్ క్రీడా పోటీల్లోను ప్రతిభను కనబరిచాడు. గతేడాది అనంతపురంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో అనంత జట్టును అండర్–14 విజేతగా నిలపడంలో తనే కీలకం. వీటితోపాటు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో 4 సార్లు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో 3 సార్లు, ఖేలో ఇండియా పోటీల్లో 2 సార్లు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించాడు. ఇండియన్ ప్లేయర్ కావడమే లక్ష్యం ఆర్డీటీ లేకుంటే నేను ఇంతటి గొప్ప క్రీడాకారుడిగా మారేవాడిని కాదు. ఇక్కడి కోచ్‌లు దాదా ఖలందర్, రియాజ్‌లు అందిస్తున్న శిక్షణ, వివిధ దేశాల నుంచి వస్తున్న ఆటగాళ్లు ఇచ్చే మెలకువల ద్వారా నా ఆటతీరును మార్చుకోగలిగాను. ఎప్పటికైనా ఇండియన్ ఫుట్‌బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలన్నదే నా లక్ష్యం. - దిలీప్ -
దిలీప్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
కొచ్చి: మళయాల నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన హీరో దిలీప్ కుమార్ బెయిల్ పిటిషన్‌పై విచారణను కేరళ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి గురువారానికి వాయిదా వేశారు. బెంచ్ ముందుకు కేసు విచారణకు వచ్చినపుడు కేసు అధ్యయనానికి సమయం కావాలని ప్రాసిక్యూషన్ కోరడంతో విచారణను కోర్టు ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. దిలీప్‌ను గత సోమవారం అరెస్టు చేయగా కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. దిలీప్‌కు దగ్గరి మిత్రుడైన అలువా నుంచి కాంగ్రెస్ తరపున ఎన్నికైన అన్వర్ సాదత్, సీపీఐ(ఎం)కు చెందిన ఎమ్మెల్యే ముఖేష్లను పోలీసులు సోమవారం విచారించారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలిచ్చినట్లు సాదత్ తెలిపారు. ప్రథమ ముద్దాయి పల్సర్ సుని ఏడాది క్రితం వరకు ముఖేష్‌కు డ్రైవర్‌గా పనిచేయగా తర్వాత తొలగించారు. సుని గురించి తనను పోలీసులు ప్రశ్నించారని ముఖేష్ తెలిపారు. మరోవైపు బెంగాలీ మోడల్, యాంకర్ సోనికా సింగ్ చౌహాన్ మృతి కేసులో నిందితుడుగా ఉన్న బెంగాలీ నటుడు విక్రమ్ చటర్జీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను అలిపోరె సెషన్స్ కోర్టు ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. -
దిలీప్‌కు బెయిల్ నిరాకరణ
తిరువనంతపురం: ప్రముఖ మలయాళ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న దిలీప్‌నకు కిందిస్థాయి కోర్టులో చుక్కెదురైంది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. నేటితో పోలీసుల కస్టడీ ముగియడంతో ఆయనను కోర్టులో హాజరుపరచగా ఈ నెల 25వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఫిబ్రవరిలో మలయాళ నటిని కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో దిలీప్‌ను ఈ వారం ప్రారంభంలో అరెస్టు చేసి తొలుత 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. అయితే, బుధవారం మాత్రం ఆయనను పోలీసుల విచారణకోసం కస్టడీకి అనుమతించింది. దీంతో ఆయనను పలు ప్రాంతాలకు తీసుకెళ్లిన పోలీసులు ఆధారాలు సేకరించే ప్రయత్నాలు చేశారు. అయితే, పోలీసుల కస్టడీ కూడా ముగియడంతో కోర్టులో హాజరుపరచగా ఈ నెల 25వరకు జైలుకు తరలించింది. దీంతో దిలీప్ బెయిల్‌కోసం ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు. -
‘మత్తు’ యావే మరణ శాసనం
సమకాలీనం గోవా–హైదరాబాద్ మధ్య, ఇంకా ఇతర ప్రాంతాల నుంచి వారు యధేచ్చగా తిరుగుతూ డ్రగ్స్ మార్పిడి చేస్తున్నా గుర్తించే వ్యవస్థ లేదు. డ్రగ్స్‌ను నియంత్రించేందుకు 1989లోనే ప్రతీ రాష్ట్ర పోలీసు విభాగంలో ఓ నార్కోటిక్ శాఖ ఏర్పడింది. ఇది కాకుండా కేంద్ర నార్కొ టిక్ డైరెక్టరేట్, ఒక దర్యాప్తు బృందం ఉన్నాయి. కానీ, ఇవన్నీ నామమాత్రమే! సిబ్బంది లేదు, వాటి మధ్య సమన్వయం ఉండదు. ఆధునికీకరణా అంతంతే! మరోవైపు నేరగాళ్లు ‘డార్క్‌వెబ్’ వంటి ఆధునిక సమాచార వ్యవస్థతో డ్రగ్స్ రవాణా– పంపిణీ చేస్తున్నారు. సంపద–విచ్చలవిడితనానికి పుట్టిన అక్రమ సంతానం డ్రగ్ కల్చర్! అప్ర మత్తమై ఆ విష సంస్కృతికి అడ్డుకట్ట వేయకపోతే జరిగే విధ్వంసం చరిత్ర పుటల్ని నిలువునా మలినం చేస్తుంది. సంకేతాలు గుర్తించాక చేపట్టే నివారణ చర్యల సత్తాను బట్టే ఈ విష జాడ్యం విస్తరణా? నియంత్రణా? అన్నది తేల నుంది. పుట్టుక, విస్తరణ అనేవి బాధ్యత విస్మరించిన సంపన్నవర్గ సమాజం నుంచే మొదలైనా... అన్ని బలహీనతల్ని ఆలింగనం చేసుకుంటూ డ్రగ్ రక్కసి సృష్టించే అరాచకం పేద, మధ్యతరగతి కుటుంబాల్లోనూ కార్చిచ్చే! సమస్య తీవ్రత తెలిశాక కూడా చూసీ చూడనట్టుంటే, మొత్తం సమాజమే కోలుకోలేని విధంగా దెబ్బ తింటుంది. కడకు నిర్వీర్యమైన, నిస్తేజమైన ఓ తరాన్ని మిగిల్చి పోయే మహమ్మారి డ్రగ్ సంస్కృతి. పతనం అంచుల దాకా జారిన పంజాబ్ కళ్లెదుట కనిపిస్తూనే ఉంది. దేశంలోనే సంపన్న రాష్ట్రంగా, పౌరుషాల గడ్డగా వెలిగిన పంజాబ్ నేడొక రోగాల దిబ్బ, అశక్తుల అడ్డా! చారిత్రక నగరం హైదరాబాద్‌లో చాపకింద నీరులా విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్ ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఇటీవల వెలుగు చూస్తున్న అవలక్షణాలు భవిష్య త్తుపై గగుర్పాటు కలిగించేవిగా ఉన్నాయి. మన విలువల సమాజం పతన మౌతున్న ఆరంభ సంకేతాలా? అన్న సందేహం కలుగుతోంది. ఎనిమిదో తరగతి పిల్లల నుంచి, సమాజాన్ని ప్రభావితం చేసే సినిమా ‘పెద్ద’ మనుషుల దాకా విస్తరిస్తున్న క్రమం ప్రమాదకరం! ఇది ఇంతేనా? ఇంకెంత లోతుకు విస్తరించింది! అన్నది తేలాలి. మూలాలు ఎక్కడున్నాయి, ఊడ లెక్కడెక్కడ దిగాయి? అన్నది శోధిస్తే తప్ప విరుగుడు చర్యలు అంత తేలక కాదు! ఒక వైపు నిఘా–నియంత్రణ వ్యవస్థల వైఫల్యం, మరో వైపు విద్యా సంస్థల్లో దిగజారుతున్న విలువలు దీనికి ఆజ్యం పోస్తున్నాయి. మత్తులో ఇప్పుడు దొరికే మజా తప్ప తుది పరిణామాలెంత దుర్భరమో గ్రహించని పసితనం–యువతరం అవగాహనా రాహిత్యం ఈ దురాగతానికి వేదిక కట్టింది. పిల్లల కదలికల్ని గమనించని తల్లిదండ్రుల నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం మరింత దన్నుగా నిలుస్తోంది. మద్యాన్ని ప్రభుత్వం విక్రయించి, విద్యను ప్రయివేటు శక్తులు అమ్ముకునే దుర్మార్గపు సమీకరణం... ఇలా అన్నీ వెరసి డ్రగ్ రక్కసి కోరలు చాస్తోంది. తల్లిదండ్రులూ... తస్మాత్ జాగ్రత్త! తొలుత దొరికిన మూడు సెల్ఫోన్లలోని సమాచారాన్ని విశ్లేషిస్తేనే నగరంలోని వెయ్యి మంది విద్యార్థులు, యువత డ్రగ్స్ వినియోగించినట్టు దర్యాప్తు అధి కారులు గుర్తించారు. వారం దర్యాప్తు తర్వాత విద్యార్థుల సంఖ్య 3వేలు దాటింది. మొత్తానికి ఇంకెంతమంది ఉన్నారో? పాతిక పాఠశాలలు, మరో పాతికపైన కళాశాలలకు హెచ్చరిక సందేశాలు పంపారు. విద్యార్థుల ప్రవ ర్తనపై విద్యాసంస్థల నిర్వాహకులకు నియంత్రణ సంగతలా ఉంచి కనీసం అవగాహన కూడా ఉండదు. తరగతుల నిర్వహణ, పాఠాలు చెప్పడం, పరీ క్షలు జరిపి పంపించడం తప్ప మరే క్రియాశీల, సృజనాత్మక పనిని వారు చేపట్టరు. విద్యాసంస్థల ప్రాంగణాల్లో విద్యార్థులేంచేస్తున్నారో? వారి ఆగడా లెలా ఉంటాయో కూడా నిర్వాహకులకు సోయి ఉండదు. ఇక తల్లిదండ్రులు సరేసరి! ముఖ్యంగా సంపన్నవర్గాల వారి పిల్లల ఆగడాలకు అంతే ఉండదు. వాటి గురించి తల్లిదండ్రులు ఏనాడూ పట్టించుకున్న దాఖలాలుండవు. పెద్ద మొత్తంలో నెలసరి పాకెట్ మనీ అందజేసి, క్రెడిట్–డెబిట్ కార్డులు వారి చేతికిస్తూ, ఏయే అవసరాలకా డబ్బు వ్యయం చేస్తున్నారో కూడా గమనించని అలక్ష్యం వారిది. పర్యవసానంగా... లెక్క చెప్పే పనిలేని డబ్బు, బాధ్యతెరు గని స్వేచ్ఛ, ఇతరులతో పోటీ పడే డాబు–దర్పం వెరసి వారిని వ్యసనాలకు బానిసలను చేస్తున్నాయి. ఏ కొరతా రానీయకుండా పెంచుతున్నామనే భావ నలో కొట్టుకుపోయే తల్లిదండ్రులు తెలియకుండానే కన్నబిడ్డల్ని సోమరు లను, అయోగ్యులను, అర్భకులను తయారు చేస్తున్నారు. దారి తప్పుతున్న పుడు గమనించకుండా పరిస్థితి చేయిదాటాక బాధ పడుతుంటారు. అదేదో కొత్త రుచి–చవిచూడాలనే ఉత్సుకతతో కొందరు, ఇతరుల కన్నా తామేమీ తక్కువకాదనే పొగరుబోత్తనంతో ఇంకొందరు, ఒత్తిడే లేని గమ్మత్తు లోకంలో విహరించాలని మరి కొందరు ‘మత్తు’కు అలవాటు పడుతున్నారు. ఒకసారి ఉచ్చులో చిక్కాక బానిసలవుతున్నారు. బతుకు బలిపెట్టి చిత్తవుతున్నారు. రంగు వెలుస్తున్న సినిమా ఒకనాడు విలువలకు నెలవైన తెలుగు సినిమారంగం నేడు పలుచబారు తోంది. తెలుగునాట డ్రగ్స్ జాడ్యం సినిమా రంగానికి తగులుకొని చాన్నాళ్ల యింది. అప్పుడప్పుడు కేసులు పట్టుపడుతున్నా ఎవరూ వాటిని తీవ్రంగా తీసుకోవట్లేదు. రోడ్డుమీద గొడవల్లోనో, ప్రమాదాల్లోనో, ట్రాఫిక్ ఉల్లంఘన లతోనో.. వర్థమాన నటులు కొందరు మత్తులోనే దొరికిన ఘటనలెన్నో! తీగ లాగితే ఇప్పుడు డొంక కదులుతోంది. అరుదుగా కాల్షీట్లు లభించే ముఖ్యు లతో ఎక్కువ గంటలు అలసట లేకుండా పనిచేయించేందుకు డ్రగ్స్ వాడు తున్న సందర్భాలున్నాయి. సన్నివేశాల్లో అనుకున్న నాణ్యత, ప్రభావం తీసు కువచ్చేందుకు, ప్రేమ–శృంగార సన్నివేశాల్ని పండించేందుకు కూడా కోరి మరీ దర్శక–నిర్మాతలు కొందరు డ్రగ్స్ వాడకాన్ని ప్రోత్సహిస్తారు. వీటన్నిం టికీ మించి... ఈ రంగపు లక్షణమైన పుష్కలంగా డబ్బు, తిరుగులేని స్వేచ్ఛ, ఎదురులేని విచ్చలవిడితనం కొందరు ఆర్టిస్టుల్ని డ్రగ్స్ వైపు నడిపిస్తోందని తాజా దర్యాప్తులో వెల్లడయిన లింకుల్ని బట్టి తెలుస్తోంది. పెద్ద పేరున్న కొందరు దర్శకులూ ఈ ‘మత్తు’ మహత్తులో జోగుతున్నట్టు తాజా సమా చారం. సినిమా, టీవీ రంగుల ప్రపంచం పురిగొల్పే ‘రేవ్’పార్టీలే డ్రగ్స్ వ్యాప్తికి బీజం వేస్తున్నాయని దర్యాప్తు అధికారులంటున్నారు. సమాజ పరి వర్తనలో కీలకపాత్ర పోషిస్తామని గొప్పలు చెప్పుకునే సినిమా రంగం, ఇలాంటి పరిణామాలతో మసకబారుతుందని బాధ్యతగల సినీ పెద్దలు కొందరు ఆందోళన చెందుతున్నారు. విరివిగా లభ్యతే పతనానికి తొలిమెట్టు పిల్లలు, యువత ‘మత్తు’లోకి దిగి జీవితాల్ని ఛిద్రంచేసుకోవడానికి కారణా లెన్నో! సులువుగా డ్రగ్స్ లభించడమే ప్రధాన కారణం. ఇది పంజాబ్‌లో, ఢిల్లీలోనూ ధ్రువపడింది. రోజూ సగటున రెండు వేల కోట్ల రూపాయల మాద కద్రవ్యాలు దేశంలోకి వస్తున్నట్టు లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడంచిన సమాచారం. దేశవ్యాప్తంగా డ్రగ్ డీ–అడిక్షన్ సెంటర్లలో 20 శాతం మంది 16 ఏళ్ల లోపువారంటే కళ్లలోకి నీళ్లొస్తాయి. దశాబ్దం కిందట డ్రగ్స్ రవాణాకు హైదరాబాద్ ట్రాన్సిట్ అడ్డాగా మారుతోందనే ప్రచారం ఉండేది. కానీ, విని యోగం అంతగా ఉండేది కాదు. ఇటీవల బాగా పెరిగింది. అదీ ముఖ్యంగా సంపన్న యువతరం, ఆర్భాటపు స్కూల్స్, కాలేజీలు, ఇతర విద్యా సంస్థల్లో వాడకం బహిరంగ రహస్యమే! పని ఒత్తిడి, నూతనత్వపు యావ ఉండే ఐటీ రంగానికీ పాకింది. చాలా సందర్భాల్లో ఇది గంజాయితో మొదలవుతుంది. నగరంలో రోజూ సగటున 200 నుంచి 250 కిలోల గంజాయి వాడుతున్నట్టు సమాచారం. నాలుగయిదు మార్లు గంజా తీసుకున్నాక ఆ డోస్ సరిపోదు. కిక్కివ్వడం లేదనే కారణంతో కొకైన్, హెరాయిన్, బ్రౌన్ షుగర్, ఎల్లెస్డీ, ఎమ్డీఎమ్యే తదితర డ్రగ్స్ వైపు జారుతారు. కేవలం కెమికల్స్‌తో రూపొందే సింథటిక్ డ్రగ్స్ చాలా ప్రమాదకరం. సిగరెట్లలో, బ్లాటింగ్ పేపర్‌పైన, ద్రవంగా, స్వల్పపరిమాణంలో నాలుకపై వేసుకునే ఘన పదార్థంగా... ఇలా రకరకాలుగా ఉంటాయి. ద్రవరూపంలో ఇంజక్షన్ల ద్వారా నరాల్లోకి తీసు కోవడం కాస్త నొప్పితో కూడుకున్నది కావడం వల్ల పద్ధతిని మార్చారు. నాలు కపై వేసుకుంటే 20 సెకన్లలో కరిగిపోయి, పది నుంచి పన్నెండు గంటలు మత్తు ఇచ్చే ఎల్లెస్డీ అత్యాధునికం! అంతే ప్రమాదకరం. గంజా 20–25 మార్లు తీసుకొని వ్యసనపరులవుతుంటే, ఇతర సింథటిక్ డ్రగ్స్ అయిదారు మార్లు తీసుకున్నా చాలు వారికది వ్యసనంగా మారుతోంది. గరిష్ఠంగా నలుగురు పంచుకోగలిగే ఒక్కో యూనిట్ సగటున 3 వేల రూపాయలకు లభిస్తోంది. డబ్బులయిపోయాకో, ఇంట్లో కట్టడి పెరిగితేనో... డబ్బుకోసం చిల్లర మల్లర దొంగతనాలు, దోపిడీలకూ తెగిస్తున్నారు. అదీ కుదరనపుడు, వ్యవసనప రులు తామే స్వయంగా పంపిణీదారు అవతారమెత్తుతారు. నిఘా–నియంత్రణ ఓ భ్రమ! మూడు నెలల కింద, ఏప్రిల్ 8న నగరంలోని కుతుబ్షాయీ సమాధుల వద్ద ప్రమాదకర డ్రగ్స్‌తో 5గురిని టాస్క్‌ఫోర్స్ విభాగం పట్టుకుంది. అందులో ఇద్దరు నైజీరియన్లు. రోతిమి అనే పాత నేరగాడు వస్త్ర వ్యాపారం పేరిట నగరానికి వచ్చి, ఈది అని కొత్తగా వచ్చిన మరో నైజీరియన్తో కలిసి డ్రగ్స్ రవాణా, పంపిణి చేస్తున్నాడు. రోతిమిని జూబ్లీహిల్స్ పీఎస్‌లో 2015లోనే పీడీ యాక్ట్ కింద అరెస్టు చేసి, బెయిల్‌పై విడుదల చేశారు. మళ్లీ ఇవే నేరాలు చేస్తూ పట్టుబడ్డాడు. వీరే కాకుండా పలువురు నైజీరియన్లు ఇక్కడ డ్రగ్స్ వ్యవహారాల్లో ఉన్నారు. వీరిపై ఓ నిఘా, నియంత్రణ ఏదీ లేదు. గోవా– హైదరాబాద్ మధ్య, ఇంకా ఇతర ప్రాంతాల నుంచి వారు యధేచ్చగా తిరు గుతూ డ్రగ్స్ మార్పిడి చేస్తున్నా గుర్తించే వ్యవస్థ లేదు. డ్రగ్స్‌ను నియం త్రించేందుకు 1989లోనే ప్రతీ రాష్ట్ర పోలీసు విభాగంలో ఓ నార్కోటిక్ విభాగం ఏర్పడింది. ఇది కాకుండా కేంద్ర నార్కొటిక్ డైరెక్టరేట్, ఒక దర్యాప్తు బృందం ఉన్నాయి. కానీ, ఇవన్నీ నామమాత్రమే! సిబ్బంది లేదు, వాటి మధ్య సమన్వయం ఉండదు. ఆధునికీకరణా అంతంతే! మరోవైపు నేరగాళ్లు ‘డార్క్‌వెబ్’ వంటి ఆధునిక సమాచార వ్యవస్థను వాడుతూ డ్రగ్స్ రవాణా– పంపిణీ చేస్తున్నారు. ఫెడరల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ సాంకేతికత, ఇన్ఫార్మర్ల వ్యవస్థ నిర్వహణకు ఓ రహస్యనిధి, తగిన సిబ్బంది ఉంటే తప్ప ఇటువంటి నేరాల్ని నియంత్రించలేమని అధికారులంటారు. నగరపోలీసు కమీషనరేట్ పరిధిలోని యాంటీ నార్కోటిక్ సెల్ అప్పుడప్పుడు కొన్ని తనిఖీలు, దాడులు నిర్వహిస్తున్నా పెద్ద ప్రభావం లేదు. నిజానికి ప్రమాదకర డ్రగ్స్, గంజాయి తదితర మాదకద్రవ్యాల రవాణాపై స్థానికుల ద్వారా సమాచారం ఉప్పం దుకునే ఆస్కారమున్న స్థానిక పోలీసులు నమోదు చేసే కేసులే ఉండట్లేదు. ఇదో పెద్దలోపం! డ్రగ్స్ ఓ అంతర్జాతీయ నెట్వర్కింగ్ ఉన్న నేరప్రపంచం! ఇరుగుపొరుగునున్న శత్రుదేశాలూ మన దేశంలో వాటి వ్యాప్తికి కుట్ర చేసే ఆస్కారముంది. వ్యవస్థీకృతంగా సాగే ఈ నేర సామ్రాజ్యం ఆట కట్టించేం దుకు అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ నిఘా–దర్యాప్తు వ్యవస్థలు, వాటి మధ్య సమన్వయం ఎంతో అవసరం. డ్రగ్స్ డీ–అడిక్షన్ సెంటర్లు కూడా తగినన్ని లేవు. ఉన్న అరకొర సెంటర్లు డబ్బు గుంజే దోపిడీ కేంద్రాలే! నాలుగు చేతులు కలిస్తేనే...! డ్రగ్స్ మహమ్మారి ఎంతో ప్రమాదకారి. శైశవ దశలో కర్కశంగా నలిపేస్తే తప్ప దాన్ని నియంత్రించడం దుస్సాధ్యం. అన్ని వైపుల నుంచీ సమీకృత చర్యలు ఓ పోరాట పంథాలో సాగాలి. విద్యార్థులు–యువతరం చక్కటి అవ గాహనతో వ్యవహరించాలి. తమ పిల్లల కదలికల్ని గమనిస్తూ తల్లిదండ్రులూ అప్రమత్తం కావాలి. తగు సాధన సంపత్తితో నిఘా వ్యవస్థలు నిద్రలేవాలి. భవితను దృష్టిలో ఉంచుకొని పౌరసమాజం చేతనతో చొరవ చూపాలి. స్వచ్ఛందంగా కేసులు స్వీకరిస్తూ న్యాయస్థానాలు క్రియాశీలం కావాలి. ప్రభు త్వాలు మరింత బాధ్యతాయుతంగా జవాబుదారీతనాన్ని చాటాలి. ఇవన్నీ జరిగితేనే ‘మత్తు’ మహమ్మారి నుంచి ఈ తరానికి ఊరట, భవితకు భద్రత! - దిలీప్ రెడ్డి ఈమెయిల్: dileepreddy@sakshi.com -
గూగుల్ ఇంట్లో ఆయనదే హాట్ టాపిక్
తిరువనంతపురం: ప్రముఖ నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌లో ఇప్పుడు ఒకే అంశానికి సంబంధించిన కథనాలకోసం తెగ గాలిస్తున్నారు. గత మూడు రోజులుగా ఇదే అంశం ట్రెండింగ్ భారీ స్థాయిలో అవుతోంది. అదేమిటంటే దిలీప్ గురించి. అవును ఓ ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక వేధింపులకు సంబంధించి అరెస్టయి ప్రస్తుతం విచారణ ఖైదీగా ఉన్న దిలీప్ వ్యక్తిగత విషయాలను, ఇతర వివాదాస్పద అంశాలను బాగా వెతుకుతున్నారు. గత నవంబర్‌లో ఆయన అనూహ్యంగా కావ్య మాధవన్ అనే మలయాళ నటిని చేసుకున్నప్పుడు ఏ విధంగానైతే గూగుల్‌లో వెతికారో ఇప్పుడు అదే విధంగా ఆయన గురించి మరోసారి నెటిజన్లు వాకబు చేయడం మొదలు పెట్టారు. ఇదేదో ఒక్క భారత్‌లోనే అనుకుంటే అదీ కాదు.. అటు అమెరికాలో, గల్ఫ్ దేశాల్లో కూడా దిలీప్ గురించి శోధించడం మొదలుపెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి 17 షూటింగ్ వెళ్లి వస్తున్న ప్రముఖ నటిని కిడ్నాప్ చేయి కారులోనే లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో దిలీప్ కుట్ర ఉందనే పేరిట పోలీసులు అతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. గత నవంబర్లోనే పెళ్లి చేసుకున్న దిలీప్ జులై నాటికి జైలులో అడుగుపెట్టారని ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. అంతేకాదు, ట్విట్టర్, ఫేస్బుక్వంటి పలు సామాజిక మాధ్యమాల్లో కూడా ఇప్పుడు ఈ విషయం తెగ ట్రెండింగ్ అవుతోంది. -
'ఇది మాములు స్క్రిప్ట్ కాదు.. ఊహించలేరు'
తిరువనంతపురం: 'దిలీప్ పలు చిత్రాల్లో నటించారు. కానీ, ఇదే ఉత్తమ స్క్రిప్ట్. ఎవ్వరూ ఊహించలేనంత భారీగా సిద్ధం చేసిన స్క్రిప్ట్ ఇది' అంటూ కేరళలో ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన మలయాళ నటుడు దిలీప్ తరుపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం విచారణ ఖైదీగా ఉన్న దిలీప్ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆయన తరుపు న్యాయవాది కోర్టులో వాదనలు చేస్తూ ఎలాంటి ఆధారం లేకుండానే తన క్లైంట్‌ను అరెస్టు చేయడమే కాకుండా రిమాండ్‌కు తరలించారని తెలిపారు. ఇది ముమ్మాటికీ వివక్ష పూరిత చర్యే అవుతుందంటూ కోర్టులో చెప్పుకొచ్చారు. అయితే, కోర్టు మాత్రం కనీసం రెండు రోజుల తర్వాత బెయిల్ పిటిషన్ నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు పోలీసుల విచారణకు అప్పగిస్తున్నామంటూ స్పష్టం చేసింది. -
'అతడి చేతిలో ఆ హీరోలిద్దరు కీలుబొమ్మలు'
తిరువనంతపురం: ప్రముఖ మళయాల నటిపై అత్యాచారయత్నం, కిడ్నాప్ కేసులో పోలీసులు అరెస్టు చేసిన దిలీప్ పెద్ద అవినీతిపరుడని మలయాళ ప్రముఖ దర్శకుడు వినయన్ అన్నారు. అందుకే అతడి అరెస్టు జరిగిందని చెప్పారు.'నాకున్న వ్యక్తిగత అనుభవం మేరకు, దిలీప్ పెద్ద అవినీతి పరుడు. మమ్మూటి, మోహన్‌లాల్ అతడి చేతిలో కీలుబొమ్మలు. మలయాళ చిత్రసీమలో అతడు ఎవరూ ఊహించని విధంగా పాతుకుపోయాడు. మలయాళ చిత్ర సీమను శాసిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉంటే అది ఇతడే' అని వినయన్ చెప్పారు. చిత్ర పరిశ్రమ నుంచి తనను బహిష్కరించడంలో దిలీప్ కుట్రే ఉందని చెప్పారు. తాను మలయాళ చిత్ర సీమ బాగుకోసం కొంతమందితో కలిసి ఎంఏసీటీఏ అనే సంస్థను స్థాపించానని, ఒక చిత్రంలో నటించకుండానే అడ్వాన్స్ తీసుకున్న వివాదంలో తాము ఒకసారి అతడిని బెదిరించామని తెలిపారు. ఆ సమయంలో తనను ఎట్టి పరిస్థితుల్లో చిత్ర పరిశ్రమలో ఉండనివ్వబోనంటూ హెచ్చరించాడని తెలిపారు. దిలీప్ అరెస్టు తర్వాత చిత్ర పరిశ్రమ మొత్తం కూడా భారీ మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. -
నన్ను కేసులో ఇరికించారు: టాప్ హీరో
కొచ్చి: ‘నేను అమాయకుడిని. నా నిర్దోషితత్వాన్ని నిరూపించుకుంటా. నన్ను కుట్రపూరితంగా ఇరికించార’ని ప్రముఖ మలయాళ హీరో దిలీప్ వ్యాఖ్యానించారు. ప్రముఖ నటిపై అత్యాచారయత్నం, కిడ్నాప్ కేసులో ఆయనను సోమవారం సాయంత్రం కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా దిలీప్ మాట్లాడుతూ.. ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. తనను అన్యాయంగా కేసులో ఇరికించారని వాపోయారు. దిలీప్‌కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఆయనను కొచ్చికి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలువా ప్రాంత సబ్‌జైలుకు తరలించారు. జైలు బయట కొంత మంది యువకులు ‘వెల్కమ్ టు సెంట్రల్ జైలు’ అంటూ నినాదాలు చేశారు. దిలీప్ చివరిసారిగా 2016లో ‘వెల్కమ్ టు సెంట్రల్ జైలు’లో నటించారు. కొచ్చిలోని ఆయన హోటల్‌పై ఆందోళనకారులు దాడి చేశారు. బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు దిలీప్ తరపు న్యాయవాది కె. రామకుమార్ తెలిపారు. తదుపరి విచారణ కోసం దిలీప్‌ను తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కూడా న్యాయస్థానాన్ని కోరనున్నారు. ఈ కేసులో ఆయన పాత్రను నిర్ధారించే 19 సాక్ష్యాలను సంపాదించినట్టు పోలీసులు వెల్లడించారు. -
నటిపై వేధింపుల కేసులో కొత్త ట్విస్ట్
కొచ్చి: కేరళ నటి అపహరణ, వేధింపుల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే మలయాళ సూపర్ స్టార్ దిలీప్‌ను విచారించిన పోలీసులు తాజాగా ఆయన భార్య, నటి కావ్య మాధవన్ ఇల్లు, కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. శనివారం ఉదయం 11 గంటలకు మొదలైన సోదాలు అర్థరాత్రి 2 గంటలకు కొనసాగినట్టు తెలుస్తోంది. వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన రికార్డులు, బ్యాంకు పేమెంట్స్ గురించి పోలీసులు ఆరా తీసినట్టు సమాచారం. అయితే సోదాలపై పోలీసులు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్సర్ సునీ నేరం చేసిన తర్వాత రెండుసార్లు కావ్య మాధవన్ కార్యాలయానికి వచ్చినట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు నటిపై అఘాయిత్యానికి పాల్పడుతూ తీసిన వీడియో, ఫొటోలు ఉన్న మెమరీ కార్డును కూడా కార్యాలయంలోనే దాచిపెట్టివుంటాడని అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు ఇక్కడ సోదాలు జరిపారు. 2016లో దిలీప్, కావ్య పెళ్లి చేసుకున్నారు. 17 ఏళ్ల వైవాహిక జీవితం గడిపిన తర్వాత తన మొదటి భార్య మంజు వారియర్‌కు 2015లో దిలీప్ విడాకులు ఇచ్చారు. వ్యాపారవేత్త నిశాల్ చంద్రను 2009లో పెళ్లి చేసుకున్న కావ్య 2010లో ఆయన నుంచి విడిపోయారు. -
నటి కేసు: సూపర్‌స్టార్‌ను ప్రశ్నించిన పోలీసులు
తిరువనంతపురం: కేరళ నటి అపహరణ, వేధింపుల కేసులో మలయాళ సూపర్ స్టార్ దిలీప్‌ను పోలీసులు విచారించారు. నటి కేసు విషయమై నటుడు దిలీప్‌నకు ఇది వరకే సమన్లు జారీ అయిన విషయం తెలిసిందే. నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో తనను ఇరికించకుండా ఉండాలంటే రూ.1.5 కోట్లు ఇవ్వాలని నిందితుడు పల్సర్ సునీ డిమాండ్ చేసినట్లు దిలీప్ చెప్పారు. ఈ క్రమంలో సూపర్ స్టార్‌తో పాటు దర్శకుడు నదిర్షాను బుధవారం దాదాపు 12 గంటలపాటు పోలీసులు ప్రశ్నించారు. నటి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడైన పల్సర్ సునీ తనను బెదిరిస్తున్నాడని నటుడు దిలీప్ ఇటీవల ఆరోపించారు. ఇటీవల టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఎవరైతే ఈ నటిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో ఆ వ్యక్తి, ఆమె మంచి మిత్రులని, చాలా క్లోజ్‌గా ఉండేవారని దిలీప్ వ్యాఖ్యానించాడు. కాగా, నటితో పాత గొడవల నేపథ్యంలో దిలీప్ ఈ పని చేయించారని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ తనకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదని దిలీప్ తర్వాత వివరణ ఇచ్చారు. కేసు విషయంలో పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చాను. అన్ని వివరాలను పోలీసులకు తెలిపానంటూ విచారణ అనంతరం నటుడు దిలీప్ మీడియాకు చెప్పారు. స్నేహం ఎవరితో చేయాలనే విషయంలో ముందుగానే జాగ్రత్త పడితే మంచిదన్న దిలీప్ వ్యాఖ్యలపై భావన స్పందించారు. గత సోమవారం దిలీప్ ఈ వ్యాఖ్యలు చేయగా నటి మాట్లాడుతూ.. 'ఆయన వ్యాఖ్యలు నన్నెంతో బాధ పెట్టాయి. ఇలా నాకు వ్యతిరేకంగా ఆధారం లేకుండా ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోను' అంటూ హెచ్చరించారు. భావన కిడ్నాప్ కేసుతో సంబంధం ఉన్నందునే దిలీప్‌ను నిందితుడు పల్సర్ సునీ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు నటుడు దిలీప్‌ను బుధవారం 12 గంటలపాటు ప్రశ్నించారు. గత ఫిబ్రవరి నెలలో కేరళలోని ప్రముఖ నటిపై ఆమె డ్రైవర్, మరో ఆరుగురు వ్యక్తులు కలిసి లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. త్రిశూర్ నుంచి కోచికి తిరిగొస్తున్న సమయంలో ఆమెను కిడ్నాప్ చేసి ఈ దురాఘతానికి పాల్పడగా అది పెద్ద దుమారం రేగింది. అప్పటినుంచి కేసు విచారణ కొనసాగుతోంది. -
'పోలీసులు చెప్పారని ఇన్నాళ్లు నోరు విప్పలేదు'
తిరువనంతపురం: లైంగిక వేధింపుల అనంతరం పొడిపొడిగా మాత్రమే స్పందించిన ప్రముఖ నటి, పలు తెలుగు చిత్రాల్లో కూడా నటించి పేరు తెచ్చుకున్న కేరళ నటి స్పందించారు. ఓ కేరళ నటుడు టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఎవరైతే కేరళ నటిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో ఆ వ్యక్తి, ఆ నటి మంచి మిత్రులని, చాలా క్లోజ్‌గా ఉండేవారని, అందుకే స్నేహం ఎవరితో చేయాలనే విషయంలో ముందుగానే జాగ్రత్త పడాలని అన్నారు. దీంతో ఆ నటుడి మాటలు తనను చాలా ఇబ్బంది పెట్టాయంటూ సదరు నటి స్పందించారు. గత ఫిబ్రవరి నెలలో కేరళలోని ప్రముఖ నటిపై ఆమె డ్రైవర్, మరో ఆరుగురు వ్యక్తులు కలిసి లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. త్రిశూర్ నుంచి కోచికి తిరిగొస్తున్న సమయంలో ఆమెను కిడ్నాప్ చేసి ఈ దురాఘతానికి పాల్పడగా అది పెద్ద దుమారం రేగింది. ఈ మధ్య ఈ కేసు విషయం కాస్త సర్దుమణిగి గుట్టు చప్పుడు కాకుండా విచారణ సాగుతోంది. అయితే, సోమవారం రాత్రి దిలీప్ అనే నటుడు ఈ విషయంపై ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పై విధంగా వ్యాఖ్యానించి మరోసారి ఆ విషయాన్ని తెరమీదకు తెచ్చారు. దీంతో ఇన్నాళ్లు ఈ వ్యవహారంపై స్పందించేందుకు దూరంగా ఉన్న ఆమె ఏమన్నారంటే.. 'నాపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులో గతంలో నా వద్ద డ్రైవర్‌గా పనిచేసి ప్రస్తుతం ఈ కేసులో నిందితుడిగా ఉన్న పల్సర్ సునీ నేను మిత్రులం అని, స్నేహాన్ని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని ఓ నటుడు(దిలీప్) అన్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇది నన్నెంతో బాధ పెట్టింది. ఇలా నాకు వ్యతిరేకంగా ఆధారం లేకుండా ఆరోపణలు చేస్తే మాత్రం అవసరం అయితే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోను' అంటూ ఆమె హెచ్చరించారు. ఇప్పటి వరకు ఈ కేసులో తాను ఒక్క మాట కూడా మాట్లాడలేదని, తాను ఏం మాట్లాడినా కేసు దర్యాప్తు మీద ప్రభావం పడుతుందని సీనియర్ పోలీసు అధికారులు చెప్పడంతో తాను ఏ మాట్లాడకుండా ఉన్నానని చెప్పారు. -
కూర్చున్న కొమ్మనే నరుక్కునే వంచన
సమకాలీనం ఈ దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో జరిగేంత దోపిడీ మరెక్కడా కనిపించదు. ప్రపంచంలో ఎక్కడైనా ఉత్పత్తిదారే తన ఉత్పత్తి ధరను నిర్ణయిస్తాడు, ఒక్క రైతు తప్ప. రైతును ఆదుకుంటామంటూ ప్రభుత్వాలు నిర్ణయించే కనీస మద్దతు ధర ఎన్నటికీ గిట్టు బాటు ధర కాలేదు. పైగా అదీ అమలు కాదు. వ్యాపారులు, దళారులు కుమ్మక్కై సరుకు వచ్చేనాటికి ధరల్ని దిగజార్చి రైతు నోట్లో మట్టికొడతారు. అప్పులు, అవసరాలు వెంటాడు తుండగా మార్కెట్‌కు చేరిన రైతు పరిస్థితి తోడేళ్ల గుంపు మ«ధ్య చిక్కిన జింకలా ఉంటుంది. ‘‘సంపన్నులు పేదల్ని దోచుకుంటే అది వ్యాపారం అంటారు, తిరిగి రాబ ట్టుకునేందుకు పేదలు పోరాడితే దాన్ని హింస అంటారు’’ అన్న ప్రఖ్యాత రచయిత మార్క్ ట్వైన్ మాటలు, భారత రైతుల్ని తలచుకున్నప్పుడల్లా అక్షర సత్యాలనిపిస్తాయి. స్వేదరక్తాలు కలగలిసిన తమ కష్టార్జితంతో నడిచే మార్కెట్ కమిటీలు దళారులకు వంత పాడుతున్నాయని గొంతెత్తిన ఖమ్మం రైతులకు నిలువెల్లా సంకెళ్లు వేసిన దుర్మార్గాన్ని ఏమనాలి? ఉత్పత్తి వ్యయంలో మూడో వంతు కూడా ధర పలుకక ఘోష పెట్టిన ఏపీ మిర్చి రైతుల ఒళ్లు లాఠీలతో హూనం చేసిన ఖాకీ సంస్కృతికి కారణమెవరు? పంట నష్టానికి పరిహారం రాక, దిగుబడికి ధర గిట్టక, కొత్తగా అప్పు పుట్టక... కడుపు మండి మధ్యప్రదేశ్ రైతు రోడ్డెక్కితే నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపిన పోలీసు చర్యలకు అర్థమేంటి? ‘విచారణ జరిపిస్తున్నాం, బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’ అనటంతోనే ప్రభుత్వాల బాధ్యత తీరిపోతుందా? పోలీసులు ప్రభుత్వంలో భాగం కాదా? జరిగిన దాష్టీకాలకు ప్రభుత్వ నైతిక బాధ్యత ఏంటి? రైతులు పట్ల, వ్యవసాయం పట్ల ప్రభుత్వాలు తమ వైఖరిని స్పష్టం చేయాల్సిన సమయం ఇది. చేష్టలుడగడమో, తప్పుడు విధానాలో, ప్రభుత్వ నిర్వాకాలో కాదా నేటి దేశవ్యాప్త వ్యావసాయిక అశాంతికి కారణం! తడిసిన రైతు ఉడుకు నెత్తురుతో మధ్యప్రదేశ్ ఇంకా అట్టుడుకుతోంది. మహారాష్ట్రలో రైతులు ఆందోళనలో ఉన్నారు. నిన్నటిదాకా తమిళ రైతులు దేశ రాజధానిలో దీక్షలు నిర్వహించారు. హరియాణా, రాజస్థాన్ రైతాంగం పోరాటాలతో అలసిపోతోంది. మృగశిర ముంచుకొచ్చినా వ్యవసాయ ప్రణాళికే లేక రెండు తెలుగు రాష్ట్రాల రైతులు దిక్కులు చూస్తున్నారు. దేశానికి వెన్నెముకని చెప్పే రైతు పరిస్థితి ఇంత దీనంగానూ, 70% జనాభాకు జీవనాధారమైన వ్యవ సాయరంగం ఇంత నిస్తేజంగానూ ఎందుకుంది? ప్రతి 30 నిమిషాలకో రైతు బలవన్మరణానికి పాల్పడుతున్నాడీ నేలపై! రేయింబవళ్లు శ్రమిస్తున్నా బతుకు గడవక గత 20 ఏళ్లలో 3.18 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకు న్నారు. దేశంలో 50%కు పైగా శ్రామికశక్తి కృషి చేస్తున్న వ్యవసాయరంగం, స్థూల జాతీయోత్పత్తికి 17% మించి దోహదపడలేకపోతోంది ఎందుకు? అందుకు ఎవరు బాధ్యులు? వ్యవసాయ రంగం పట్ల చూపుతున్న తీవ్ర నిర్లక్ష్యం వల్ల దేశంలో నెలకొన్న పరిస్థితి కొత్త వ్యవసాయిక విప్లవానికి భూమి కను సిద్ధం చేస్తోంది. పాశమై కాటేస్తున్న రుణం–దారుణం రుణ సమస్య లోతులెరిగీ పరిష్కారం లేక రైతు భంగపడుతున్నాడు. ఏయేటి కాయేడు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. అప్పు లేకుండా వ్యవ సాయం చేసే ఆర్థిక పరిస్థితి అత్యధిక రైతులకు లేదు. బ్యాంకు అప్పులు దొరక్క, ప్రైవేటు అప్పుల వడ్డీలకు తట్టుకోలేక సతమతమౌతున్నాడు. ఏటా పెరుగుతున్న పెట్టుబడి వ్యయం, ఖర్చులు, పంట నష్టాలతో మధ్య తరగతి రైతు కూడా పేదరికంలోకి జారుతున్నాడు. పండిన పంటకూ ధర దక్కట్లేదు. తీర్చలేనంత అప్పు, చుట్టూ ముసిరే సమస్యలతో పోరాడలేక బలవన్మరణా లతో రైతులు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. తిండిపెట్టే ఇంటి పెద్ద మరణంతో మొత్తం కుటుంబమే చితికిపోతోంది. వ్యవసాయ రుణం మాఫీ చేస్తామన్న రాజకీయ పార్టీల మాట నిజమేనని నమ్మి గద్దెనెక్కిస్తే, వారు మాట తప్పినప్పుడల్లా ఏపీలోలాగే రైతులు విలవిల్లాడుతున్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రూ. 36 వేల కోట్ల రుణ మాఫీకి సిద్ధపడటంతో మహారాష్ట్ర, తమిళనాడు, హరియాణా, పంజాబ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఒత్తిడి పెరిగింది. దేశవ్యాప్త రైతు రుణ మాఫీకి దాదాపు రూ. 3 లక్షల కోట్ల వ్యయ మని అంచనా. 2008లో మన్మోహన్సింగ్ ప్రభుత్వం రూ.60 వేల కోట్ల రుణాల్ని మాఫీ చేసింది. రుణ మాఫీ ఒక అంశమైతే, రుణ లభ్యతే మరో ప్రధాన సమస్యగా ఉంది. నోట్ల రద్దు తర్వాత ఇది మరింత కష్టమౌతోంది. గ్రామీణ భారతంలోని 70%కు మించిన బ్యాంకేతర ఆర్థిక వ్యవస్థనంతటినీ ఒక్క దెబ్బతో బ్యాంకుల పరిధిలోకి తెచ్చారు. ప్రైవేటు అప్పు ఇçప్పుడంత తేలిగ్గా పుట్టే పరిస్థితి లేదు. బ్యాంకులేమో ఇవ్వట్లేదు. వ్యవసాయ రుణాల వృద్ధి రేటు 2016 ఏప్రిల్‌లో 15%గా ఉండగా ఈ ఏప్రిల్‌లో అది 8% మాత్ర మేనని తాజాగా ఆర్బీఐ ప్రకటించింది. వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తూ పోతే, ‘రుణ సంస్కృతి’ దెబ్బతింటుందని పదే పదే వల్లించే ఆర్బీఐ గవర్నర్ మళ్లీ అదే రాగం పాడటం విడ్డూరం. పెద్ద పెద్ద కార్పొరేట్ల ‘పాత–కొత్త అప్పు సర్దుబాట’్లకు, ‘ఒకే దఫా పరిష్కారాల’కు లెక్కే లేదు. కార్పొరేట్లకు బ్యాంకు లు దాసోహమంటున్న తత్వానికి ఇది నిదర్శనం. లేకుంటే, 7.7 లక్షల కోట్ల నిరర్థక ఆస్తులు బ్యాంకుల్లో ఎలా పేరుకుపోతాయి? రూ. 500 బాకీకి బ్యాంకు నోటీసులందుకొని మధ్యప్రదేశ్‌లో ఓ రైతు కుమిలి కుమిలి ఏడుస్తున్న రోజున బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టిన విజయ్ మాల్యా ఇంగ్లండ్‌లో దర్జాగా స్టేడి యంలో కూచుని ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ చూస్తూ టీవీ తెరలపై కనిపిస్తే కడుపు మండదా? విత్తనం–కార్పొరేట్ల పెత్తనం ప్రతి వ్యవసాయ సీజన్లో విత్తనాలు దొరక్క, దొరికిన వాటిపై భరోసా లేక బిక్కుబిక్కుమంటాడు రైతు. బహుళజాతి కంపెనీలు వాణిజ్య పంటల నుంచి సంప్రదాయ పంటల వైపు సాగుతూ మొత్తం విత్తన వ్యవస్థను, రైతుల్ని, వారి జీవితాల్ని చెరబడుతున్నాయి. నిజంగా ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు బ్యాంకు అప్పుల్ని, విత్తనాల్ని, ఎరువుల్ని అందించే ప్రక్రియను సమ న్వయపరచి రైతుకు ఏక గవాక్ష పద్ధతి పాటించాలి. గడువు వరకు నిరీక్షించకుండా చొరవతో రుణ మేళాలు ఏర్పాటు చేసి, రుణ మంజూరితో పాటు విత్తనాలు, ఎరువుల్ని ఏ విక్రేత నుంచి, ఎప్పుడు, ఎంత మేర పొందొచ్చో సమాచారమివ్వొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎరువుల సబ్సిడీనీ దీనికి అనుసంధానం చేయొచ్చు. వీట న్నింటినీ రుణ మంజూరీతో సమన్వయపరచి రైతులకు సదరు ‘స్లిప్పు’లు అందజేస్తే చాలని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని రకాల విత్తనాలు, ఎరువుల విషయంలోనైనా ఇది సుసాధ్యమే. ఉదాహరణకు తెలంగాణలో రైతుల 36 లక్షల ఖాతాల సమాచారంతో రుణ మేళాలు నిర్వహించి, విత్తనాలు, ఎరువులతో పాటు పంట బీమా ప్రీమి యంను కూడా అక్కడే మినహాయించుకోవచ్చు. అన్ని పనులు ఏక కాలంలో జరిగిపోతాయి. నిరీక్షణ, మోసం లేకుండా రైతుకు కొంత ఉపశమనం లభి స్తుంది. వర్షాలు మొదలై వ్యవసాయ సీజన్ ప్రారంభమౌతున్నా, ప్రభుత్వాల సంసిద్ధత ఘోరం. మే లో ప్రకటించాల్సిన వ్యవసాయ ప్రణాళిక ఇప్పటి వరకూ లేదు. పంటల ధరల విషయంలో తమకెదురవుతున్న చేదు అనుభ వాల దృష్ట్యా రైతులు అయోమయంలో ఉన్నారు. దొరకని కనీస మద్దతు ధరే ఓ మాయ ఈ దేశంలో వ్యవసాయ ఉత్పత్తులకు జరిగేంత దోపిడీ, మరే విషయంలోనూ జరుగదేమో అనిపిస్తుంది. ప్రపంచంలో ఎక్కడైనా ఉత్పత్తిదారే తన ఉత్పత్తికి ధర నిర్ణయిస్తాడు, ఒక్క రైతు తప్ప. రైతును ఆదుకుంటామనే పేరుతో ప్రభు త్వాలు అశాస్త్రీయ పద్ధతిన ఓ ‘కనీస మద్దతు ధర’(ఎమ్మెస్పీ)ను నిర్ణయి స్తాయి. ఎన్నటికీ గిట్టుబాటు ధర కాలేని అది కూడా అమలుకు నోచదు. వ్యాపారులు రింగై, దళారీ వ్యవస్థ దానికి తోడై మార్కెట్లోకి సరుకు వచ్చేనాటికి ధరల్ని రమారమి దిగజార్చి రైతు నోట్లో మట్టికొడతారు. చేసిన అప్పులు వెంటాడుతుంటే, ఆర్థిక అవసరాలతో పంటను మార్కెట్ తరలించే రైతు పరిస్థితి, దళారీల నడుమ తోడేళ్లు చుట్టుముట్టిన జింక పిల్లలా ఉంటుంది. మార్కెట్లో సరుకును చూసి వ్యాపారులు, దళారీలు ధర దిగజార్చే వికృతక్రీడ ఆడుతుంటారు. సదరు మద్దతు ధరైనా, ఎప్పుడో పంటలు పండి, 80 శాతం సరుకు దళారులు, వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయాక కాకుండా సర్కార్లు ఇప్పుడే ప్రకటించాలి. దాన్ని బట్టి ఏ పంట వేసుకోవాలో రైతు తగి నంత ముందుగానే నిర్ణయించుకోవడానికి వీలవుతుంది. కొన్ని పంటల్ని ప్రోత్సహించి కూడా ప్రభుత్వం ధరకు భరోసా ఇవ్వట్లేదు. విస్తృత మార్కెట్ సదుపాయాల్ని కల్పించాలి. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి–ఎమ్మెస్పీ దక్కనపుడు తానే కొనగోళ్లు చేయాలి, శీతల–సాధారణ గిడ్డంగులు అందు బాటులోకి తేవాలి. 2014–15 ఆర్థిక సర్వే సిఫారసు ప్రకారం చేపట్టిన ‘జాతీయ వ్యవసాయ మార్కెట్’(నామ్) ఏర్పాటు ప్రక్రియ సాఫ్ట్వేర్ లేదని నిలిచిపోయింది. సదరు గ్రిడ్ ఏర్పడితే, ప్రోత్సాహక ధరలకు దేశంలో ఎక్కడైనా తమ పంటను అమ్ముకునే అవకాశం రైతుకు లభిస్తుంది. పాలకుల లెక్కల్లో రైతు సంఘటిత ‘ఓటు బ్యాంకు’ కానందునే ఈ చిన్నచూపనే అభిప్రా యముంది. దేశానికి వెన్నెముకను మనమే విరిచేస్తే మున్ముందు దేశం గతేం టని పాలకులు ప్రశ్నించుకోవాలి. దేశంలోని, ఒక రాష్ట్రంలోని, ఓ జిల్లాలోని... ఓ మారుమూల ‘క్రాప్ హాలిడే’ ప్రకటిస్తేనే సాటి సమాజం నివ్వెరపోయింది. రేపు దేశమంతా రైతు ‘క్రాప్ హాలీడే’ ప్రకటిస్తే దేశం గతి ఏం కాను? ఆలో చించాలి. భయమో, భక్తో... ‘జై జవాన్’ను గౌరవిస్తున్నాం. తిండిపెట్టి పోషిస్తున్న ‘జై కిసాన్’ సంగతేంటి? అన్నం పెట్టే రైతు క్షోభిస్తే దేశానికే అరిష్టం!! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
చేతన కొరవడితే యాతనే!
సమకాలీనం పారదర్శకత గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలిచ్చే అధినేతలకు పాలనావ్యవస్థల్లోని సమాచారం ప్రజలకు అందించడమంటేనే వెరపు! సమాచార వెల్లడితో కొత్త చిక్కుల్ని ఆహ్వానించే కన్నా గోప్యత ద్వారా పబ్బం గడుపుకోవచ్చన్న తప్పుడు ఆలోచనే ఇందుకు కారణం. సమాచారం నిరాకరించే, జాప్యం చేసే ప్రతి సందర్భంలోనూ, అంటే అన్ని ఫిర్యాదులు, అప్పీళ్లల్లో నిందితులుగా నిలవాల్సింది ప్రభుత్వ యంత్రాంగమే! తనను దోషిగా నిలబెట్టి ప్రశ్నించే ఏ పరిస్థితినైనా ప్రభుత్వ వ్యవస్థ ఎందుకు సాఫీగా అనుమతిస్తుంది? ‘సదా అప్రమత్తంగా ఉండటమే స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు మనం చెల్లించే మూల్యం’ (Eternal vigillance is the price of liberty) అని తొలుత ఎవరు చెప్పారో కానీ, గడచిన రెండు శతాబ్దాలుగా ప్రపంచమంతా ప్రాచుర్యంలో ఉన్న మాట ఇది! ఇప్పటికీ వర్తిస్తున్న మాట! ఐరిష్ న్యాయవాది జాన్ ఫిల్‌పోట్ తొలుత చెప్పారనేదొక ప్రచారం. అమెరికాలో సాగిన బానిసత్వ వ్యతిరేక పోరులో క్రియాశీల కార్యకర్తగా వెండెల్ ఫిలిప్స్ 1882లో ఈ మాటన్నారనీ చెబుతారు. ఆధారాల్లేకపోయినా... అమెరికా నిర్మాతల్లో ఒకరైన థామస్ జెఫర్సన్ అంతకు ముందెప్పుడో అన్నట్టు ఆయన పేరిట ప్రచారముంది. ఎవరు చెప్పినా విశ్వవ్యాప్తంగా అనేక పౌర ఉద్యమాలకు ఊపిరులూదిన, ఇంకా ఊదుతున్న గొప్ప స్ఫూర్తి వాక్యం. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు అతికినట్టు సరిపోయే ఆణిముత్యమీ మాట! పౌర సమాజం చైతన్యంతో ఉండి పోరాడితే తప్ప ప్రజాస్వామ్యపు మౌలిక హక్కులు కూడా దక్కని దుస్థితి క్రమంగా బలపడుతోంది. సమాచార హక్కు చట్టం అమలును చూస్తే అది తేటతెల్లమౌతోంది. రాజ్యాంగ స్ఫూర్తితో, చట్టం సాక్షిగా దక్కిన ఈ హక్కు అమలు పర్యవేక్షణకిక తెలుగునాట నేటితో కాలం చెల్లనుంది. పూనిక వహిస్తే తప్ప పునరుద్ధరణకు మరెంత కాలమో! తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల, నిరంతరాయంగా సాగాల్సిన చట్టం అమలు పర్యవేక్షణకు ఇప్పుడు గండి పడుతోంది. రేపట్నుంచి కొంత కాలంపాటు చట్ట శూన్యత, ఇంకా చెప్పాలంటే రాజ్యాంగ శూన్యత ఏర్పడే పరిస్థితులు దాపురించాయి. అడిగినా సమాచారం లభించని సందర్భాల్లో పౌరులు చేసుకొనే ఫిర్యాదులు, అప్పీళ్లు, చట్టం అమలును చూసే సమాచార కమిషన్ రేపట్నుంచి ఉనికిలో లేకుండా పోతోంది. రాష్ట్ర విభజన నేపధ్యంలో, రెండు రాష్ట్రాలకు విడిగా రెండు కమిషన్లను సమకూర్చుకునే జాగ్రత్తలు తీసుకోకపోగా ఉన్న ఉమ్మడి కమిషన్‌కు కాలం చెల్లిపోతున్నా ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. కొత్త కమిషన్, కమిషనర్ల నియామకాలు ఇంకా మొదలు కాలేదు. తెలంగాణలో ఇప్పుడిప్పుడే ప్రక్రియకు తెరలేపుతున్నా ఏపీలో కనీసం ఆ ఊసే లేదు! సహజ మరణంలా కనపడేట్టు చంపుతున్నదెవరు? ప్రభుత్వాలు ఏ కొంచెం జాగ్రత్త తీసుకున్నా కమిషన్‌కు ఈ పరిస్థితి తలెత్తేదే కాదు. 2014 జూన్‌లో రాష్ట్ర విభజన తర్వాత మిగతా పలు విభాగాల్లాగే సమాచార కమిషన్నూ పంచుకోవాల్సింది. పంపకాల జాబితాలో మొదట ఎక్కడా కమిషన్ ప్రస్తావన కూడా లేకపోవడం అందరినీ విస్మయ పరిచింది. తర్వాత జ్ఞానోదయమై, పదో షెడ్యూల్ జాబితాలో చేర్చారు. నిబంధనల ప్రకారం ఏడాదిన్నరలో ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు సయోధ్యతో కమిషన్‌ను పంచుకోవాలి. ఇందులో పంచుకోవడానికీ, పంపకంలో వివాదాలు తలెత్తడానికీ ఆస్తు లేం లేవు! ఉన్నదల్లా కమిషనర్లను, ఇతర సిబ్బందిని పంచుకొని ఏ రాష్ట్రపు అప్పీళ్లు, ఫిర్యాదుల్ని ఆ కమిషన్ పరిష్కరించడం, అక్కడ చట్టం అమలును పర్యవేక్షించడం. ఇంత తేలిక వ్యవహారాన్నీ సర్కార్లు తేల్చలేదు, పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. ఏడాదిన్నర గడువు మీరితే కేంద్ర ప్రభుత్వం చేసిపెట్టాలి. అదీ జరక్కుండానే మొత్తం మూడేళ్లవుతోంది. ఈ మధ్య కాలంలో ఒక్కరొక్కరుగా ముఖ్య సమాచార కమిషనర్లు పదవీ విరమణ చేశారు. పదవిలో కొనసాగుతున్న నలుగురు కమిషనర్ల నియామకమే చెల్లదంటూ లోగడ హైకోర్టిచ్చిన తీర్పును ఈ మధ్యే సుప్రీంకోర్టు ఖరారు చేసింది. దాంతో వారు ఇంటిబాట పట్టారు. అది జరిగిన ఒకట్రెండు రోజుల్లోనే అప్పటివరకు ఆపద్ధర్మ ముఖ్య కమిషనర్‌గా ఉన్న రతన్ పదవీ విరమణ చేశారు. ఇక కమిషన్‌లో మిగిలిన ఏకైక కమిషనర్ విజయబాబుకు ఈ రోజు (శుక్రవారం) ఆఖరి పనిదినం. ఇక కమిషన్ ఉనికిలో లేనట్టే! ఎందుకంటే, చట్టంలో నిబంధనలలా ఉన్నాయి. సమాచార హక్కు చట్టం–2005 సెక్షన్ 15(4) ప్రకారం ‘కమిషన్ నిత్యనిర్వహణ, దిశా నిర్దేశం అన్నది కమిషనర్ల సహకారంతో ముఖ్య కమిషనర్ నిర్వహించాలి...’ అని ఉంది. ఏ వ్యవహారమైనా కమిషనర్లు లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించజాలవు, నిర్వహించకూడదు. ముఖ్య కమిషనర్, ఇతర కమిషనర్లెవరూ లేనప్పుడు కమిషన్ ఉనికిలో లేనట్టే అని గుజరాత్, ఉత్తరాఖండ్ కమిషన్ల నిర్వహణ వివాదంలో అక్కడి ఉన్నత న్యాయస్థానాలు ఇదివరకే తేల్చిచెప్పాయి. లోగడ ఆ తీర్పులతో జడిసిన ఆయా ప్రభుత్వాలు ముఖ్య కమిషనర్‌ను (గుజరాత్), ఇతర కమిషనర్లను (ఉత్తరాఖండ్) సత్వరమే నియమించుకున్నాయి. అందుకే ప్రభుత్వాలు ఈ శూన్యత రాకుండా ఉండటానికి తగినంత ముందుగానే ప్రక్రియ ప్రారంభిస్తాయి. చివరి కమిషనర్ పదవీ విరమణ నాటికి కొత్తగా నియమితులైనవారు బాధ్యత తీసుకునేలా ప్రక్రియను పూర్తి చేస్తాయి. ఆ తెలివిడి ఇప్పుడు రెండు ప్రభుత్వాలకూ లేకుండా పోయింది. సర్కార్లకు శీతకన్నెందుకు? సమాచార హక్కు చట్టం పట్లనే ఈ ప్రభుత్వాలకు సదుద్దేశమున్నట్టు లేదు! అమలు చేయకుంటే నేం? అన్న ధీమాతోనే ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శిస్తుండవచ్చని ఆర్టీఐ క్రియాశీల కార్యకర్తలంటున్నారు. పాలకుల ఈ భావనలకు ఉన్నతాధికార వ్యవస్థ అనాసక్తి తోడవుతోంది. దాంతో చట్టం అమలు నీరుగారుతోంది. ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న అమలు, పర్యవేక్షణ ఇక కమిషన్ కూడా లేకుంటే మరింత కుదేలవడం ఖాయం. ఇలా కమిషన్ ఉనికే లేని పరిస్థితికి నెట్టడం సర్కార్ల నిర్లక్ష్యానికి నిదర్శనం. పాలకులు, ఉన్నతాధికార వ్యవస్థ నుంచి ప్రత్యక్షంగా–పరోక్షంగా అందే సంకేతాలను బట్టే కింది స్థాయి అధికారులు, సిబ్బంది పనితీరు ఉంటుంది. అదే ఆర్టీఐ విజయ–వైఫల్యాలను నిర్ణయిస్తుంది. పారదర్శకత గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలిచ్చే అధినేతలకు పాలనావ్యవస్థల్లోని సమాచారం ప్రజలకు అందించడమంటేనే వెరపు! పూర్వపు/తమ నిర్వాకంలోని అలసత్వం, ఆశ్రిత పక్షపాతం, అక్రమ– అవినీతి వ్యవహారాలు బట్టబయలవుతాయనే భయం కూడా కారణం కావచ్చు. సమాచార వెల్లడితో కొత్త చిక్కుల్ని ఆహ్వానించే కన్నా గోప్యత ద్వారా పబ్బం గడుపుకోవచ్చన్న తప్పుడు ఆలోచనే ఇందుకు కారణం. దాంతో సమాచార హక్కు చట్టం అమలంటేనే తప్పించుకునే దొంగదారులు వెతుకుతారు. సమాచారం నిరాకరించే, జాప్యం చేసే ప్రతి సందర్భంలోనూ, అంటే అన్ని ఫిర్యాదులు, అప్పీళ్లల్లో నిందితులుగా నిలవాల్సింది ప్రభుత్వ యంత్రాంగమే! తనను దోషిగా నిలబెట్టి ప్రశ్నించే ఏ పరిస్థితినైనా ప్రభుత్వ వ్యవస్థ ఎందుకు సాఫీగా అనుమతిస్తుంది? అందుకే ఈ అవరోధాలు. సమాచార వెల్లడికి సంబంధించి తామిచ్చే ఆదేశాలను అధికార యంత్రాంగం పాటించడం లేదని, ఈ విషయంలో సర్కారు సహకరించకుంటే నిర్వహణ కష్టమని కమిషనర్లే తమ వార్షిక సదస్సులో బాహాటంగా చేతులెత్తేసిన దుస్థితి విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రపదేశ్‌లో వెల్లడైంది. విభజనానంతరం ఇక ఆ కమిషన్ ఎవరికీ పట్టని సంస్థగానే మిగిలింది. ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదు. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం. ఒక దశలో కమిషన్ ఆర్థిక నిర్వహణ, కమిషనర్లు ఇతర సిబ్బంది జీతభత్యాలకూ తిప్పలు తప్పలేదు. ఇది రాజ్యాంగ విహిత బాధ్యత సమాచారం తెలుసుకోవడం అన్నది పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పలుమార్లు తీర్పుల్లో వెల్లడించింది. పౌరులు తమ వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ (అధికరణం 19 (1) (ఎ)లో అంతర్భాగంగా) వినియోగించుకునే క్రమంలోనే ఈ హక్కు సంక్రమిస్తుందనీ స్పష్టం చేసింది. దీన్ని సక్రమంగా అమలు పరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్థాయిల్లో కమిషన్లను ఏర్పాటు చేసి, నిర్వహించాలని సమాచార హక్కు చట్టం (సెక్షన్లు 12, 15) నిర్దేశిస్తోంది. ఈ నిర్వహణ లేకుంటే కచ్చితంగా ఇది చట్టోల్లంఘన, రాజ్యాం గోల్లంఘన కిందకే వస్తుందని పౌర సమాజం పేర్కొంటోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సత్వరమే ముఖ్య, ఇతర కమిషనర్ల నియామక ప్రక్రియ చేపట్టాలని ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులకు ఆర్టీఐ జాతీయ ప్రచార వేదిక (ఎన్సీపీఆర్ఐ) ఇటీవలే విడివిడిగా వినతిపత్రాలు సమర్పించింది. అరుణరాయ్, నిఖిల్‌డే, శైలేశ్ గాంధీ, రాకేశ్‌రెడ్డి, రామకృష్ణంరాజు తదితరులు ఇందులో ఉన్నారు. యోగ్యత కలిగిన సమర్థుల్ని కమిషనర్లుగా నియమిస్తూ, ఆ నియామక ప్రక్రియనూ పౌరులకు తెలిసేలా పారదర్శకంగా జరిపించాలనీ కోరారు. ‘నమిత్‌శర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో, నియామకాలకు ఏ ప్రక్రియను పాటించమందో కూడా ఈ వినతిపత్రంలో వారు ప్రస్తావించారు. సుప్రీం తీర్పుననుసరించి కేంద్ర ప్రభుత్వం లోగడ కేంద్ర సమాచార కమిషనర్లను నియమించేటప్పుడు పత్రికల్లో ప్రకటన జారీ చేసి ఆసక్తి గల అర్హుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానించింది. సమాచార హక్కు చట్టం (సెక్షన్లు 12(5), 15(5) లలో) నిర్దేశించినట్టు ప్రజాజీవితంలో ప్రముఖులై ఉండి న్యాయ, శాస్త్ర–సాంకేతిక, సమాజసేవ, పత్రికారంగం, పాలన, నిర్వహణ తదితర రంగాల్లో విస్తృత పరిజ్ఞానం కలిగిన వారి దరఖాస్తుల్ని పరిశీలించాలి. ఎవరి అర్హతలేమిటో నిర్దిష్టంగా పేర్కొంటూ, జాబితా కుదింపు ప్రక్రియలో ప్రతి పేరు పక్కన మినిట్స్ నమోదు చేస్తూ ఈ సమాచారాన్ని పౌరులకు అందుబాటులో ఉంచాలి. అలా కుదించిన జాబితా నుంచి అవసరమైనన్ని పేర్లను ముఖ్యమంత్రి, విపక్షనేత, సీనియర్ మంత్రితో కూడిన త్రిసభ్య సంఘం గవర్నర్‌కు ప్రతిపాదిస్తుంది. ఆయన పరిశీలించి ఖరారు చేస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిది సత్వరం జరగాల్సి ఉంది. దీనికి చాలా సమయమే పట్టొచ్చు! చెవి మెలితిప్పితే తప్ప....! కొన్ని వ్యవహారాల్లో ప్రభుత్వ నిర్వాకాలు చిత్రాతిచిత్రంగా ఉంటాయి. న్యాయస్థానాలతో మొట్టికాయలు వేయించుకునే వరకు తెలిసి తెలిసీ నిస్సిగ్గుగా చట్టాల్ని, రాజ్యాంగాన్నీ ఉల్లంఘిస్తుంటాయి. ఆర్టీఐ అమలు విషయంలో ఇప్పుడిదే జరుగుతోంది. ఒక్క ఆర్టీఐ అనే కాదు, చాలా వ్యవహారాల్లో జరుగుతున్నదిదే. రెండు రాష్ట్రాల్లోనూ మానవహక్కుల సంఘం దాదాపు లేనట్టే! ఛైర్మన్, సభ్యులెవరూ లేకపోవడంతో కార్యదర్శిగా ఉన్న అధికారే ఇప్పుడు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. తెలంగాణలో పరిపాలనా ట్రిబ్యునల్ లేదు. ఇంకా చాలా సంస్థల్ని క్రమంగా నిర్వీర్యం చేస్తున్నారు. అధికార–విపక్షమనే రాజకీయ వ్యవస్థల్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం, అధికారాన్ని అడ్డుపెట్టుకొని విపక్షాల్ని బలహీనపరచడం ద్వారా ఆధిపత్య సాధన! ఇదే, ఇప్పుడు జరుగుతున్న వ్యూహాత్మక తంతు! ఇతర ఏ ప్రజాస్వామ్య వ్యవస్థల్నీ మననీయకుండా చూడటం కుట్రలా సాగుతోంది. అయితే మొత్తానికి లేకుండా చేయడం, కుదరక కొనసాగినా... నిర్వహణ పరంగా వాటిని నిర్వీ ర్యపరచడం పాలకులకు రివాజయింది. ఫలితంగా నష్టపోవడం ప్రజల వంతవుతోంది. ఈ దుస్థితిని అధిగమించడానికి పౌర చైతన్యమే మిగిలిన మార్గం. హక్కుల్ని, హక్కులు కాపాడే ప్రజాస్వామ్య సంస్థల్ని బతికించుకోవడమే పౌరసమాజ తక్షణ కర్తవ్యం. ప్రభుత్వాలేవైనా ప్రజలు గ్రహించాల్సిందిదే! ఎక్కడో శివసాగర్ (కె.జి.సత్యమూర్తి) అడిగిన ప్రశ్న గుర్తొస్తుంది. ‘ఏ పులి మేకను సంరక్షిస్తుంది? ఇది చరిత్ర చెప్పిన సత్యం!’. వ్యాసకర్త: దిలీప్ రెడ్డి ఉమ్మడి ఏపీ సమాచార పూర్వ కమిషనర్ ఈమెయిల్: dileepreddy@sakshi.com -
ఏవి తల్లీ నిన్న వెలిగిన జ్ఞాన దీపికలు?
సమకాలీనం దేశ, విదేశాల నుంచి గొప్ప మహామహుల్ని బోధకులుగా ఏరికోరి తెప్పించుకున్న చరిత్ర ఓయూది. ఇప్పుడు, తగిన ప్రొఫెసర్లు లేకుండానే ఒకటి, రెండు బ్యాచ్‌లు వెళ్లిపోయే పరిస్థితి. దాదాపు ఇటువంటి, ఇంతకన్నా దయనీయ పరిస్థితే తెలుగునాట ఉన్న ఇతర యువ విశ్వవిద్యాలయాలది కూడా. ‘ఉన్నత విద్య పేదల ముంగిట్లోకి రావాలన్నది ఆకాంక్ష’తో ఓయూపై విద్యావంతులు, సామాన్యులు పెట్టుకున్న ఆశలన్నీ నేడు గల్లంతయ్యాయి. ఉన్నత స్థాయి చదువు‘కొనలేని’ వాళ్లకు అరకొర విద్యే అందుతోంది. నూరేళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ‘శతవసంతోత్సవం’ మూడొద్దుల పండుగలో ఉన్నాం. ఇది ఎవరికి పండుగ? భారత రాష్ట్రపతి ప్రణబ్ దాదా, ఆకాంక్షకు, వాస్తవ పరిస్థితులకు మధ్య అంతరాన్ని చూస్తే మనసు చివుక్కుమంటుంది! ‘‘సమాజంలోని సంక్లిష్ట సమస్యలకు విశ్వవిద్యా లయాలు తేలికైన పరిష్కారాలు చూపాలి... అందుకు ఇక్కడ నిరంతర పరి శోధనలు, నూతన ఆవిష్కరణలు జరగాలి’’ అన్నారాయన. కానీ, మన విశ్వవిద్యాలయాల్ని తరచి చూస్తే ‘బుద్ది భూములేలాలని ఉంటే, వంతు వాకిలి ఊడ్వమంద’న్న సామెత గుర్తుకొస్తుంది! పరిస్థితులు ఇంతలా దిగజా రిపోయిన వాస్తవం ఎవరికీ బోధపడటం లేదా? నిజం తెలిసినా ఎవరికి వారు తెచ్చిపెట్టుకున్న గాంభీర్యాన్ని నటిస్తున్నారా? నిర్దిష్టంగా ఉస్మానియా యూని వర్సిటీ అయినా, మరే ఇతర విశ్వవిద్యాలయమైనా.... గతం ఘనమే! భవిష్యత్తేంటి?. వర్తమాన నిజపరిస్థితిని సమీక్షించుకోవడానికి ఇంతకన్నా గొప్ప సందర్భం వేరే ఉంటుందని నేననుకోను. అయినా మాట్లాడుకోవాల్సిన సంద ర్భమే ఇది! దేశంలో, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ విశ్వ విద్యాలయాలది దీన పరిస్థితే. అవి దినదిన పతనావస్థలోకి జారిపోతు న్నాయి. విద్యను ఫక్తు వ్యాపారం చేసిన ప్రైవేటు కార్పొరేట్ల కుట్రకు బలవు తున్నాయి. అందులో భాగంగానే ప్రభుత్వాల నిర్లక్ష్యానికి సమిధలవుతు న్నాయి. కులాల కుమ్ములాటలతో కునారిల్లుతున్నాయి. తగిన బోధకులు లేక ప్రమాణాల్లో వెలవెలపోతున్నాయి. విద్యార్థుల క్రమ శిక్షణా రాహిత్య ప్రదర్శ నకు వేదికలవుతున్నాయి. ప్రపంచంలోని 100 మేటి విశ్వవిద్యాలయాల్లో ఏళ్ల తరబడి భారత్‌కు స్థానం దక్కడం లేదు. ఎందుకీ పరిస్థితులు దాపురిం చాయి? ఎవరు కారకులు? ఎవరు బాధితులు? కుదుపు వెనుక కుట్ర మూలాలు దేశంలో ఉన్నత విద్యాభ్యాసం ఇప్పుడు బలహీన స్థితిలో ఉండటానికి పలు కారణాలున్నాయి. ప్రభుత్వ రంగంలోని విశ్వవిద్యాలయాలు తమపూర్వ వైభ వాన్ని క్రమంగా కోల్పోతున్నాయి. ప్రైవేటు రంగంలోని కార్పొరేట్ విద్యా సంస్థలు, డీమ్డ్ యూనివర్సిటీలు, నేరుగా నెలకొంటున్న వర్సిటీలు, విదేశీ విశ్వవిద్యాలయాల ప్రాబల్యం కోసం పైరవీకారులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వాల్ని ప్రభావితం చేస్తూ ప్రభుత్వ రంగ యూనివర్సిటీలను దెబ్బ తీస్తున్నారు. ఉపకుల పతు(వీసీ)ల నియామకం నుంచి నిధుల విడుదల వరకు, పాలక మండళ్ల ఏర్పాటు నుంచి నిత్యనిర్వహణ వరకు అన్నిచోట్లా ప్రభుత్వ ప్రమేయాలే, అనుచిత జోక్యాలే! రాజకీయ పార్టీల సంకుచిత ఆలోచనలూ నష్టం కలిగిస్తున్నాయి. అంతా కలిసి ఇతరేతర ప్రయోజనాల కోసం దేశంలో ఉన్నత విద్యను, ప్రమాణాలను దారుణంగా దిగజారుస్తు న్నారు. ప్రభుత్వాలు నడుం కట్టి ప్రభుత్వ రంగ విశ్వవిద్యాలయాల్ని చంపేస్తున్నాయి. ఆ చావులపై ప్రయివేటు విద్యా సంస్థలు ఎదిగే ఒరవడి బలపడింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఓ మాట చెప్పారు. గత ఐదేళ్లలో తాను వంద విశ్వ విద్యాలయాల్ని సందర్శించానని, అంతటా ప్రమాణాలు మెరుగుపడాలని, వైఖరి మార్చుకోవాలని, పరిశోధనలు పెంచాలనీ చెబుతున్నానని అన్నారు. ఐదేళ్లుగా ఆయన ఒకే మాట చెప్పాల్సి వస్తోందంటే, మన విశ్వవిద్యాల యాల్లో ప్రమాణాలు దిగజారుడు క్రమం ఎలా ఉందో తెలిసిపోతోంది. నగ రంలోనే జరిగిన మరో సభలో మాట్లాడుతూ రాష్ట్రపతి ఉన్నత విద్య, ముఖ్యంగా ప్రభుత్వరంగంలో పెనుసవాళ్లను ఎదుర్కొంటోందని గుర్తు చేశారు. అందుకు నాలుగు ప్రధాన కారణాలని విశ్లేషించారు. 1) బోధన వ్యయం పెరగటం 2) నేర్చుకోవడంలో సంకుచితత్వం 3) మార్కెట్ దృష్టితో కమ్యూనికేషన్ వ్యవస్థలదే పైచేయి కావడం 4) విశ్వాసాలు తగ్గిపోవడం. వీటి వెనుక ప్రైవేటు కార్పొరేట్ శక్తుల కుట్ర, ప్రభుత్వాల లొంగుబాటు, విశ్వ విద్యాలయాల దీనావస్థ ఉంది. దీంతో పేద, బడుగు బలహీనవర్గాలు ఉన్నత విద్య విషయంలో మోసపోతున్నారు, నాణ్యమైన విద్యకు దూరమౌతున్నారు. వరుసగా ఇది మూడో దెబ్బ ప్రభుత్వరంగంలోని ఉన్నతవిద్యకు వరుస దెబ్బలు తప్పటం లేదు. మండల్ అనుకూల–ప్రతికూల వివాదాల తర్వాత ఒక్కసారిగా ప్రైవేటు రంగం తెర పైకి వచ్చింది. ప్రభుత్వ రంగంలోని విశ్వవిద్యాలయాలు, వృత్తి విద్యా సంస్థల్లో ప్రమాణాల పతనానికది నాంది అయింది. ఆర్థిక సరళీకరణ, ప్రపం చీకరణ ప్రభావం కూడా ఈ ∙సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపింది. విద్య ను పూర్తిస్థాయి వ్యాపారం చేసిన ప్రైవేటు కార్పొరేట్ రంగం విజృంభణతో వ్యవస్థీకృత కుట్రలు మొదలయ్యాయి. విశ్వవిద్యాలయాలు, కాలేజీలు వంటి ప్రభుత్వరంగ విద్యాసంస్థల్లో, వాటి నిర్వహణలో ప్రభుత్వాల, నిర్ణాయక స్థానాల్లోని ముఖ్యుల పాత్ర, ప్రమేయాలు పెరిగాయి. సర్కారు విద్యపై మూడో దెబ్బ బలంగా పడింది. ప్రాధాన్యతతో పాటు అక్కడ సదుపాయాలు సన్నగిల్లి విద్యా ప్రమాణాలు పూర్తిగా దిగజారాయి. వైద్య, ఇంజనీరింగ్, న్యాయ తదితర వృత్తి విద్యాకోర్సులు, ఐటీ వంటి ఇతర సాంకేతిక కోర్సులకు డిమాండ్ పెరిగిన క్రమంలోనే విశ్వవిద్యాలయాల ప్రాభవం తగ్గుతూ వచ్చింది. వాటిలో చేరే వాళ్ల ఆర్థిక–సామాజిక నేపథ్యాల సమీకరణాలూ మారాయి. రాజకీయ నేతల, ఉన్నతోద్యోగుల, న్యాయాధికారులు, బడా వ్యాపారవేత్తల పిల్లలెవరూ వర్సిటీల వైపు కన్నెత్తి చూడని పరిస్థితులు బలపడ్డాయి. పెద్దగా ఆర్థిక స్తోమత, పలుకుబడి లేని అల్పాదాయ, బడుగు, బలహీన వర్గాల వారి పిల్లలే ఎక్కువగా ఈ విశ్వవిద్యాలయాలకు వస్తున్నారు. వారికే అన్యాయం జరుగుతోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రారంభోత్స వంలో తొలి వీసీ నవాబ్ సర్దార్ యార్ జంగ్ బహదూర్ ‘‘ఉన్నత విద్య పేదల ముంగిట్లోకి రావాలన్నది ఆకాంక్ష’’ అనే గొప్ప మాట చెప్పారు. ఆ ఆశలన్నీ గల్లంతయ్యాయి. నేడు ఉన్నత విద్య ఖరీదైపోయింది. ఉన్నత చదువులను ‘కొనలేని’ వాళ్లకు అరకొర విద్యే అందుతోంది. స్వయం ప్రతిపత్తికి మంగళం విశ్వవ్యాప్తంగా పేరున్న ఉస్మానియాతో పాటు పలు విశ్వవిద్యాలయాలకు చట్టబద్ధ స్వయంప్రతిపత్తి ఉందే కానీ, ఆచరణ రీత్యా లేదు. ప్రభుత్వాలు ఇష్టానుసారంగా జోక్యం చేసుకుంటాయి. ఇప్పుడు జరుగుతున్న నూరేళ్ల పండుగే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. రెండున్నరేళ్లకు పైగా ఇంటిపెద్ద లేని వర్సిటీకి ఇటీవలే వీసీని నియమించారు. కార్యనిర్వాహక మండలి (ఈసీ) లేనే లేదు. వర్సిటీ వారి అభీష్టాన్ని పక్కన పెట్టి, ప్రభుత్వమే అన్నీ తానై ఈ ఉత్సవాలు జరుపుతోంది. రాష్ట్రపతి పాల్గొన్న నూరేళ్ల పండుగ వేదికపై గవ ర్నర్, ముఖ్యమంత్రి నోరు విప్పి మాట్లాడలేని పరిస్థితులు ఎందుకు తలె త్తాయో సర్కారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. వీసీ, ఐఏఎస్‌లు, ప్రజా ప్రతి నిధులతో కూడి ఉండే ఈసీ ఉంటేనే తగు నిర్ణయాలతో విశ్వవిద్యాలయాలు పరిపుష్టంగా ఉంటాయి. ప్రభుత్వాలే ఐఏఎస్ అధికారులతో దొడ్డిదారి పాలన సాగించాలనుకున్నప్పుడే ఈ అరిష్టాలు, ప్రమాణాల పతనం. ఈ కుయత్నం ఇప్పటిది కాదు. కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తమ మనిషిని నియమించుకునే క్రమంలో నాటి వీసీ డా. డీసీ రెడ్డిని ఏకపక్షంగా తప్పిస్తే తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. దానిపై సుప్రీంకోర్టుకు వెళ్లి, కేసు గెలిచారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు, ‘కమిషనరేట్ ఆఫ్ హయర్ ఎడ్యుకేషన్’ ఏర్పాటు చేస్తుంటే తలెత్తిన ప్రతిఘటన మళ్లీ సుప్రీం తలుపులు తట్టింది. హితైషులు తమ వాదన గెలిపించుకొని, స్వయంప్రతి పత్తిని నిలు పుకున్నారు. చంద్రబాబు సీఎంగా చేపట్టిన ‘స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్’ ఏర్పాటుకూ బలమైన వ్యతిరేకతే వచ్చింది. ఇలా, అడుగడుగునా సర్కారు అనుచిత జోక్యాలపై పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. వర్సిటీలను తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి ప్రభుత్వాలు ఇంకో మార్గాన్ని ఎంచు కున్నాయి. నిధుల్వికుండా బలహీనపర్చడం, సదుపాయాల్ని నిరాకరించడం, తమకు ‘జీ హుజూర్’ అనే వాళ్లనే వీసీలుగా నియమించుకోవడం, ఇదీ వరుస! అత్యధిక సందర్భాల్లో వెన్నెముకలేని వాళ్లే వీసీలుగా నియమితు లవుతున్నారు. తెలుగునాట ఓ విద్యార్థిని, ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోడా నికి ఒక సామాజిక వర్గానికి చెందిన వీసీ, కాలేజీ ప్రిన్సిపల్ వైఫల్యాలే కారణమని దేశమంతా గగ్గోలెత్తినా.. ఏపీ ప్రభుత్వం ఒకే ఉత్తర్వుతో అదే సామాజిక వర్గానికి చెందిన ముగ్గుర్ని వీసీలుగా నియమించింది! మరో వీసీ, ‘పెదబాబు’ జన్మదిన వేడుకకు ఇంట్లోను, ‘చినబాబు’ పుట్టిన రోజు వేడుకకు వీధిలోనూ బొకేలతో హాజరై మెప్పు పొందుతాడు! నీలం సంజీవరెడ్డి ముఖ్య మంత్రిగా విశాఖ పర్యటనకు వెళ్లినపుడు, స్వాగతం చెప్పడానికి వచ్చిన స్థానిక వీసీని చూసి.. ఆయన్ని కాస్త పక్కకు పిలిచి, ‘ఏంటి వీసీ గారు, మీరొ చ్చారు. ఇదేం బాగుంది! మీరిలా రావొద్దు!’ అని ఆయన పదవి ప్రాధాన్య తను సున్నితంగా తెలియజెప్పారుట. ఎంత తేడా! క్రియాశీల పాత్ర పోషించాలి ప్రాంతీయ సర్వతోముఖ వృద్ధికి విశ్వవిద్యాలయాలు కృషి చేయాలి. విజ్ఞానం కోసం ప్రపంచ దేశాలు అలమటిస్తున్నపుడు నలంద, తక్షశిల, విక్రమశిల వంటి విశ్వవిద్యాలయాలతో విద్యను విశ్వవ్యాప్తం చేసిన నేల మనది. విలు వలు, సంస్కృతి పెంపులోనే కాకుండా రాజకీయ, ఆర్థిక సామాజిక దార్శ నికతతో దేశ నిర్మాణంలో, పునర్నిర్మాణంలో అవి ముఖ్య భూమికను పోషించాయి. ఆ స్పూర్తి ఇప్పుడు కొరవడింది. మనం గొప్పగా చెప్పుకునే మన ఐఐటీలు, ఐఐఎంలు, ఇతర వర్సిటీలు కూడా ఇప్పుడు దేశాభివృద్ధికి నిర్ది ష్టంగా చేస్తున్న కృషి గుండు సున్నా! దేశం లోపల, బయట గొప్ప పేరున్న మహామహుల్ని బోధకులుగా ఏరికోరి తెప్పించుకున్న చరిత్ర ఓయూది. ఇప్పుడు, తగిన ప్రొఫెసర్లు లేకుండానే ఒకటి, రెండు బ్యాచ్‌లు వెళ్లిపోయే పరిస్థితి. ఒక్క ఉస్మానియాలోనే 1,264 బోధకుల పోస్టులుంటే, 732కి పైగా ఖాళీలున్నాయి. దాదాపు ఇటువంటి, ఇంతకన్నా దయనీయ పరిస్థితే తెలు గునాట ఇతర యువ విశ్వవిద్యాలయాలది. అవన్నీ భర్తీ చేసుకోవాలి, సమ ర్థుల్ని తెచ్చుకోవాలి. ప్రభుత్వాలపై ఆధారపడకుండా ఆర్థిక స్వయం ప్రతిపత్తి పొందాలి. అందుకు, ఎప్పటికప్పుడు పారిశ్రామిక రంగానికి, తాను నిర్వ హించే కోర్సులకు మధ్య సమన్వయ సాధనతో వాటిని ఆధునికీకరించాలి. ఇప్పుడు పూర్తిగా అట్టడుగుకు చేరిన విద్యార్థి క్రమశిక్షణను మెరుగుపరచు కోవాలి. విప్లవాత్మక సంస్కరణలతోనే విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్య ఈ దేశంలో ఆశించిన ఫలితాల్ని సాధించగలగుతాయి. హైదరాబాద్‌లో ఒక విశ్వ విద్యాలయాన్ని స్థాపిస్తామని ఏడో నిజామ్ తెలపడంతోనే, ఉర్దూ ప్రాంతీయ భాషా మాధ్యమంగా రావడాన్ని స్వాగతిస్తూ ఆనందంతో పులకించి ఉత్తరం రాశారు విశ్వకవి రవీంద్రుడు. ఆ ప్రార్థనా గీతాన్ని వీసీ చాంబర్ ముందు పలకంపై చెక్కి, ఈ వర్సిటీ శాశ్వత నివాళి అర్పించిందాయనకు. ఈ సందర్భానికి ఆ ప్రార్థన సరిపోతుంది. ‘‘ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో/ఎక్కడ మనుషులు తలెత్తుకుని తిరుగు తారో/ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా ఉంటుందో/సంకుచిత భావాలతో ముక్క లుగా చీలిపోదో/ ఎక్కడ సత్యవాక్కులు వెలువడుతాయో/ఎక్కడ నిర్విరామ కృషి పరిపూర్ణత కోసం చేతులు చాపుతుందో/ ఎక్కడ స్వచ్ఛమైన వివేకధార ఇంకిపోకుండా ఉంటుందో/ఎక్కడ నిరంతర ఆలోచన–ఆచరణవైపు నీవు బుద్దిని నడిపిస్తావో నా తండ్రీ/ ఆ స్వేచ్ఛా స్వర్గానికి నా దేశాన్ని మేల్కొలుపు’’ ఈమెయిల్: dileepreddy@sakshi.com దిలీప్ రెడ్డి -
పెరిగిన నగదు లావాదేవీలు
► తగ్గిన డిజిటల్ చెల్లింపులు ► ఎన్పీసీఐ సీఓఓ దిలీప్ వెల్లడి ముంబై: నగదు వినియోగం మళ్లీ పెరిగిందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) పేర్కొంది.పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా 5 కోట్ల మంది కొత్తగా డిజిటల్ మాధ్యమాల ద్వారా చెల్లింపులు జరిపారని ఎన్పీసీఐ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ దిలీప్ అస్బే చెప్పారు. వీరిలో 3 కోట్ల మంది వరకూ డిజిటల్ చెల్లింపులను కొనసాగిస్తున్నారని వివరించారు. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా పది కోట్ల మంది డిజిటల్, నగదు రహిత లావాదేవీలు జరిపారని, ఆ తర్వాత పలువురు నగదు వినియోగానికే మరలిపోయారని పేర్కొన్నారు. కొత్తగా 3–3.5 కోట్ల మంది డిజిటల్ చెల్లింపులు చేయడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుందని వివరించారు. ఈ ఏడాది జనవరిలో డిజిటల్ లావాదేవీలు 9 శాతం, ఫిబ్రవరిలో 21 శాతం చొప్పున తగ్గాయని పేర్కొన్నారు. నగదు రహిత లావాదేవీల జోరు పెంచడానికి ప్రజల్లో మరింతగా అవగాహనను పెంచాల్సి ఉందని వివరించారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ)కు పేటెంట్ కోసం దరఖాస్తు చేశామని, వచ్చే ఏడాది పేటెంట్ పొందగలమని తెలిపారు. త్వరలో అందుబాటులోకి రానున్న ఆధార్ పేలో మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) ప్రస్తుతమున్నట్లుగానే(రూ.2,000 లోపు 0.25 శాతం) ఉంటుందని వివరించారు. భారత్ క్యూఆర్ కోడ్, యూపీఐ క్యూఆర్ కోడ్ విలీన ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. -
ఎస్ఎస్జే ప్రవేశ పరీక్ష ప్రశాంతం
సాక్షి, హైదరాబాద్: జర్నలిజం పీజీ డిప్లొమో కోర్సు కోసం సాక్షి జర్నలిజం స్కూలు ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు రెండు రాష్ట్రాల నుంచి 1452 మంది దరఖాస్తు చేసుకోగా 1212 మంది అభ్యర్థులు హాజరయినట్లు స్కూలు ప్రిన్సిపల్ దిలీప్‌రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 13 సెంటర్లు, తెలంగాణలో హైదరాబాద్‌తో సహా 8 సెంటర్లలో ఈ పరీక్షలు జరిగాయని వివరించారు. పేపరు-1కు సంబంధించి సమాధానాల ‘కీ’ ఈ నెల 8 నుంచి sakshi school of journalism.com, sakshi education.com, sakshi.com వెబ్సైట్లలో అందుబాటులో ఉంటుందని ప్రిన్సిపల్ దిలీప్‌రెడ్డి తెలిపారు. -
నిరసన గళం.. నిర్బంధపు జులుం!
సమకాలీనం పోలీసు వ్యవస్థతో ఊడిగం చేయించుకునే ఫ్యూడల్ సంస్కృతిని మన ప్రభుత్వాలు బలోపేతం చేస్తున్నాయి. తాము చెప్పిందే సరైనది, మారుమాటాడకుండా ఒప్పుకోవాలనే పాలకుల ధోరణి ఫలితమే నిరసన గళాలపై ఈ నిర్బంధం. దీన్ని గ్రహించి పౌర సమాజం చైతన్యవంతమైతే తప్ప ‘ప్రజాస్వామ్యమంటే ఏ కొందరికో అధికారం కట్టబెట్టడం కాదు! పాలకులు తప్పు చేస్తున్నప్పుడు, ఏయ్, ఎందుకిలా చేస్తున్నావ్? అని ప్రతి పౌరుడూ అడగ్గలిగే స్థితి ఉంటేనే ప్రజాస్వామ్యం’ అన్న గాంధీజీ మాటలు నిజం కావు. ప్రజాస్వామ్యంలో కీలకమైనదని చెప్పుకునే ప్రజాభిప్రాయం నిరంతర ప్రక్రియనా? లేక ఐదేళ్లకొకసారి వ్యక్తమయ్యేదేనా? ఓట్ల రూపంలో వెల్లడైన ప్రజాభీష్టం మేరకు ఏర్పడ్డ ప్రభుత్వాలు మళ్లీ ఎన్నికల వరకు తామేది తలిస్తే అది చేసుకోవచ్చా? మధ్యలో ప్రజలో ఏ భావమూ వ్యక్తం చేయకూడదా? ప్రజాస్వామ్య పాలనల్లో విధాన నిర్ణయాలకు జనాభిప్రాయమే ఊపిరి. వివిధ రూపాల్లో వ్యక్తమయ్యే జనాభిప్రాయం ఒక నిరంతర ప్రక్రియ. అది తెలిసి మసలుకోవడం ప్రభుత్వాల విధి. మనది ప్రాతినిధ్య ప్రజాస్వామ్యమే కాదు, భాగస్వామ్య ప్రజాస్వామ్యం కూడా. ప్రజల ప్రాతినిధ్యం, భాగస్వామ్యం మరో రూపంలోనూ ఉండొచ్చనడానికి పౌరసమాజమే ప్రతీక! కానీ, ఈ మౌలికాంశంపైనే సందేహం రేకెత్తించేలా ఉన్నాయి మన ప్రభుత్వాల నిర్వా కాలు. కేంద్రంలోనూ, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు నిరసన గళా లను నొక్కేస్తున్న తీరు ఆందోళనకరం. పొగడ్త కానిది మరేదైనా సహించలేని అసహనం పాలకుల్లో పెరిగిపోతోంది. మున్నెన్నడూ లేనంత నిర్బంధకాండ అమలవుతోంది. పాలకులకువ్యతిరేకంగా ఎవరూ మాట్లాడరాదు! నిరసన తెలుపడానికే వీల్లేదు! నిరసన కార్యకలాపాల సంగతలా ఉంచి, అలాంటి అనుమానమొచ్చినా అరెస్టులు, నిర్బంధాలతో అరాచకం సాగిస్తున్నారు. చట్టాలు, విధివిధానాలు, సంప్రదాయాలు అన్నీ గాలికి పోతున్నాయి. చట్టా నికి లోబడి వ్యవహరించాలని మరచిన పోలీసు వ్యవస్థ గుడ్డిగా పాలకులకు ఊడిగం చేస్తోంది. పటిష్ట మైన రాజ్య వ్యవస్థతో ‘దేన్నయినా నిరాటకంగా అడ్డుకుంటాం. వ్యతిరేక భావనలను మొగ్గలోనే తుంచేస్తాం... ధిక్కారమున్ సైతుమా?’ అన్నట్టుంది సర్కారు పెద్దల ఒంటెద్దు పోకడ. అంతటా అదే ధోరణి ‘దాడి చేయడమే అత్యుత్తమ రక్షణ చర్య’ అనే ఆంగ్ల నానుడిని గుర్తు చేస్తున్న సర్కారు తీరు వారి భయాన్ని చెప్పకనే చెబుతోంది. విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్తెసరు ఆధిక్యతతో ప్రభుత్వాలను ఏర్పాటుచేసిన పాలక పక్షాల్ని మొదట అభద్రత వెంటాడింది. దీంతో ప్రత్యర్థి పార్టీలను చీలుస్తూ రాజకీయ అనైతికతకు పాల్పడ్డాయి. ఎన్నికైన ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల్ని చట్ట వ్యతిరేకంగా పార్టీలో చేర్చుకుంటూ బలపడటానికి ప్రయాసపడ్డాయి. అధి కారం రుచి మరిగి తిరుగులేని ఆధిక్యతను పెంచుకునే క్రమంలోనే.. నిరసన ఏ మూల నుంచి, ఏ రూపంలోనూ రావొద్దన్న పట్టుదలతో అణచివేతకు దిగు తున్నాయి. ప్రజా ఉద్యమాల్ని ఉక్కుపాదంతో తొక్కేస్తున్నాయి. ఇది, ఎన్నికల నాటికి ప్రత్యర్థి రాజకీయ, పౌరసమాజ శక్తులు మనుగడలో లేకుండా చేయా లనే దురాశ! నిన్న హైదరాబాద్‌లో నిరుద్యోగుల ర్యాలీని చిన్నాభిన్నం చేస్తూ ప్రొఫెసర్ కోదండరామ్‌పై తెలంగాణ సర్కారు జరిపించిన పోలీసు దాష్టీకం దీన్నే వెల్లడి చేసింది. మొన్న ఏపీ ప్రభుత్వం శాసన సభ్యురాలు రోజాను మహిళా పార్లమెంటరేయన్ల సదస్సుకు వెళ్లనీయకుండా నిర్బంధించి, అక్ర మంగా ఎక్కడెక్కడికో తరలించింది. అంతకు మున్ను ‘ప్రత్యేక హోదా’ కోరుతూ జరిగిన శాంతియుత క్యాండిల్ ర్యాలీలో పాల్గొననీకుండా విపక్షనేత జగన్మోహన్రెడ్డిని విశాఖపట్నం విమానాశ్రయంలో రెండు గంటలు నిర్బం ధించడమే కాక హైదరాబాద్‌కు తిప్పిపంపింది. ప్రజా ఉద్యమాల పట్ల కేంద్ర ప్రభుత్వ అసహనానికి పలు ఘటనలు అద్దం పడుతున్నాయి. అసహనానికి పట్టం కట్టడం వల్లనే ఢిల్లీ విశ్వవిద్యాలయం ఈరోజు అట్టుడుకుతోంది. ‘నిర సనల సంస్కృతి’ సదస్సు విషయమై జరిగిన విద్యార్థుల ఘర్షణ, ఉమర్ ఖలీద్‌ను రానీయకుండా అడ్డుకున్న తీరు, అధికార విద్యార్థి సంఘం దాడులు సాగిస్తుండగా పోలీసులు పోషించిన ఉద్దేశపూర్వక ప్రేక్షక పాత్ర ఇదే చెబుతు న్నాయి. ఏ ప్రభుత్వమైనా గిట్టని నిరసన గళాల్ని నియంత్రించడం కాకుండా, తగు వాదనతో ప్రత్యర్థుల్ని ఓడించి విధానాల పరంగా ఆధిపత్యం సాధిం చాలి. ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు రావొద్దంటే... హోదా లేకున్నా తామెలా నెట్టుకు రాగలమో వివరించి ప్రజల్ని మెప్పించాలి. నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తున్నామంటే జరిపిన, జరుపనున్న నియామకాలేవో వివ రించాలి. అంతే తప్ప పోలీసు నిర్బంధకాండ అమలుచేయడం సరికాదు. నిరసన ప్రజాస్వామ్య హక్కు ప్రభుత్వాల వైఖరి, విధానాలు, పద్ధతులు, ప్రాథమ్యాలు నచ్చనపుడు నిరసన తెలుపడం పౌరుల ప్రాథమిక హక్కు. నిరసన తెలిపే అవకాశమే లేనప్పుడు ప్రజాస్వామ్యానికి అర్థమే లేదన్నది న్యాయ నిపుణుల మాట. మార్చ్, ర్యాలీ, ప్రదర్శన, పికెటింగ్, ధర్నా ... ఇలా వివిధ పద్ధతుల్లో ప్రజలు నిరసన తెలు పొచ్చు. ఇది, రాజ్యాంగంలోని 19వ అ«ధికరణం కల్పించిన హక్కు. పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు దీన్ని స్పష్టీకరించింది. అధికరణం 21 జీవించ డానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు భరోసా కల్పించింది. అధికరణం 21 కల్పించిన ‘స్వేచ్ఛతో కూడిన జీవించే హక్కు’ ప్రజాస్వామ్య సమాజ రాజ్యాంగ విలు వలకు గుండెకాయ లాంటిది అని జస్టిస్ కృష్ణయ్యర్, జస్టిస్ భగవతి వ్యాఖ్యా నించారు. ఓ అంశానికి అనుకూలంగానో, ప్రతికూలంగానో ప్రజాభిప్రా యాన్ని వ్యక్తం చేసే పద్ధతే నిరసన. సహజంగా శాంతియుతంగానే జరిగే ఇటువంటి నిరసన ర్యాలీలు, ప్రదర్శనలు కొన్ని సందర్భాల్లో హింసాయు తంగా మారొచ్చు. వాటిని పసిగట్టి తగు చర్యల ద్వారా నియంత్రించడం సమర్థ పోలీసింగ్‌పై ఆధారపడి ఉంటుంది. హింసకు ఆస్కారముందనే సాకును చూపి అసలు ర్యాలీలు, ప్రదర్శనలు జరుపుకోవడానికే అనుమతిం చకపోవడం దారుణం. చట్టం అనుమతిస్తోంది కదా అని, తగు ప్రాతిపదిక లేకుండానే సెక్షన్ 151 (సీఆర్పీసీ)ని రాజకీయంగా వాడుకుంటూ ప్రత్యర్థుల్ని ముందస్తు అరెస్టులు చేసి నిర్బం«ధించడం కచ్చితంగా అణచివేతే! ‘మీరు హింస జరుపుతారని మాకు అనుమానం ఉందం’టూ ఒక నిరాధార మైన,æహేతుబద్ధం కాని కారణంతో నిర్బంధించడం, నిరసనే తెలుపనీయ కుండా అడ్డుకోవడం పౌరుల హక్కును కాలరాయడమే. నిజానికి ఆ సెక్షన్ వాడాలంటే 1) సదరు వ్యక్తి విచారించదగ్గ నేరానికి పాల్పడే వ్యూహంతో ఉన్నట్టు పోలీసులకు నిర్దిష్ట సమాచారం ఉండాలి. 2) అరెస్టు ద్వారా తప్ప మరో విధంగా దాన్ని అడ్డుకోలేని స్థితి ఉండాలి. పైన ప్రస్తావించిన హైద రాబాద్, గన్నవరం, విశాఖ ఘటనలకు సంబంధించి వీటిలో ఏ ఒక్క పరిస్థితీ లేదు. ‘మీ ముందస్తు అరెస్టు నాకు తెలుసు, ఉదయం 6 గంటలకు బయట కొస్తాను కదా! అప్పుడు అరెస్టు చేసుకోండ’ని కోదండరామ్ కిటికీలోంచి చెబుతుంటే, వినకుండా తలుపులు బద్దలు కొట్టి 3 గంటల రాత్రి ఆయన్ని అరెస్టు చేయడాన్ని పోలీసులైనా, ప్రభుత్వమైనా ఎలా సమర్థించుకుంటారు? పెట్టుబడిదారీ దేశాల్లోనూ నిరసన ర్యాలీలు, ప్రదర్శనల్ని అనుమతించే ప్రజా స్వామ్య వాతావరణం ఉంది. ఒక వైపు డొనాల్డ్ ట్రంప్ అమెరికా దేశాధ్య క్షుడిగా ఎన్నికైనట్టు అధికారికంగా ప్రకటిస్తుండగా మొదలైన నిరసన ప్రద ర్శనలు, ఆయన పాలన సాగిస్తున్నా కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన్ని అధ్యక్షుడిగా అంగీకరించని ప్రజల నిరసనలు స్వేచ్ఛగా సాగుతున్నాయి. అభి వృద్ధిచెందిన దేశాల్లో నిరసన వ్యక్తంచేసే పౌరుల స్వేచ్ఛను కాపాడుతూనే, జన సమూహాల్ని పోలీసులు జాగ్రత్తగా నియంత్రిస్తారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజస్వామ్య దేశంలో అది కరవవుతోంది. అసమ్మతికి తావే లేకుండా చేసే కుట్ర భావ ప్రకటన స్వేచ్ఛ, నిరసన తెలిపే హక్కును పౌరులు వాడుకునే ఆస్కా రాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు తీవ్రంగా యత్నిస్తున్నాయి. ఈ క్రమంలో సామాన్య పౌరులు, సామాజిక కార్యకర్తలు నష్టపోవాల్సి వస్తోంది. హైదరా బాద్‌లో ఒకప్పుడు నిరసనకారులు అసెంబ్లీ వద్దకు, తెలంగాణ అమరవీరుల స్థూపం వరకు వచ్చేవారు. తర్వాతి కాలంలో బాబూజగ్జీవన్‌రామ్ (బషీర్ బాగ్), అంబేద్కర్ (ట్యాంక్‌బండ్ సర్కిల్) విగ్రహాల వరకూ ప్రదర్శనల్ని అనుమతించే వారు. నిరనస ప్రదర్శన చేస్తున్న అంగన్వాడి మహిళల్ని లోగడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుర్రాలతో తొక్కించిన దుర్ఘటన చోటు చేసుకున్నది తెలుగుతల్లి విగ్రహం సమీపంలోనే. నిర్దిష్టంగా స్థలం చూపి, అక్కడే (జలదృశ్యం) టెంట్ వేసి నిరసనలు తెలుపుకోవడాన్ని సర్కారు కొంతకాలం అనుమతించింది. రోజుల తరబడి నిరసనకు కూర్చునే బాధితు లతో చర్చలు జరపడానికి ప్రభుత్వ ప్రతినిధులు వెళ్లే సంప్రదాయం కూడా కూడా లోగడ ఉండేది. తర్వాత ఆ నిరసనల స్థలాన్ని ఇందిరాపార్క్ ఎదుటికి తరలించారు. అది ఎవరి దృష్టికీ ఆనేదీ కాదు, ప్రభుత్వం తరçఫున ఎవరూ పట్టించుకున్న పాపాన పోయేవారూ కాదు 108 వైద్య సర్వీసు ఉద్యోగులు దాదాపు ఏడాది పాటు ఎండలో, వానలో, చలిలో రిలే నిరాహార దీక్షలు జరి పినా ఎవరి నుంచీ స్పందన లేక సమస్య పరిష్కారం కాకుండానే తమ నిరసనను విరమించాల్సి వచ్చింది. ఇప్పుడు ఎవరరికీ పట్టని అక్కడ్నుంచి కూడా నిరసన స్థలిని నగర శివార్లలోకి తరలించాలని ప్రభుత్వం యోచి స్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో నిరసన స్థలి జంతర్‌మంతర్ పార్లమెంటుకు సమీపంలో ఉంటుంది. అమెరికాలోనూ ఇలా ‘ఫ్రీ స్పీచ్ జోన్స్’ ఏర్పాటు చేసి నిరసన ప్రదర్శనల్ని అక్కడికి పరిమితం చేసిన ప్పుడు ఇది వారి రాజ్యాంగపు తొలి సవరణ స్ఫూర్తికి విరుద్ధమంటూ తీవ్ర నిరసన వ్యక్తమైంది. నిరసన తెలిపే, ప్రదర్శనలు నిర్వహించుకునే హక్కులకు భంగకరమైన చట్టాలను చేయకుండా నిరోధించడమే అమెరికా రాజ్యాంగ తొలి సవరణ పరమార్థం. పౌరచేతనే పరిష్కారమా? పోలీసు వ్యవస్థతో ఊడిగం చేయించుకునే ఫ్యూడల్ సంస్కృతిని మన ప్రభు త్వాలు బలోపేతం చేస్తున్నాయి. దీన్నిపుడు వ్యవస్థీకృతంగా చేస్తున్నారు. తద్వారా చట్ట నిబంధనలు, కోర్టు తీర్పులు, మానవహక్కుల సంఘ మార్గ దర్శకాలు, ‘అమ్నెస్టీ’ వంటి అంతర్జాతీయ సంస్థల నివేదికలతో నిమిత్తం లేకుండా పోలీసులు సర్కారుకు వీరవిధేయులై వ్యవహరిస్తున్నారు. నియామ కాల నుంచి బదిలీలు, పదోన్నతులు, కీలకబాధ్యతల అప్పగింతవరకు రాజ కీయ ప్రమేయాలు పోలీసు శాఖ పని తీరును ప్రభావితం చేస్తున్నాయి, ప్రజా స్వామ్య విలువల్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. శాఖాపరమైన నిర్ణయాల్లో ‘పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు’ ప్రమేయాన్ని పాలకులు నామమాత్రం చేశారు. పోలీసు విభాగానికి మంచి వాహనాలు, వసతులు, భత్యాలు వంటి మౌలిక సదుపాయాలు పెంచడం వారిని మచ్చిక చేసుకొని నియంత్రణలోకి తెచ్చు కునే ఎత్తుగడేనని పరిశీలకుల వాదన. నరహంతక నేరగాడు నయీమ్‌తో నెయ్యం నెరపిన బడా పోలీసు బాసుల్ని కూడా ప్రభుత్వం కాపాడుతోంది, పరోక్షంగా వారితో దొడ్డిదారి మేళ్లు పొందుతోందనే విమర్శలున్నాయి. పాల కులకుగాక, రాజ్యాంగానికి, దాని పరిధిలో ఏర్పడ్డ చట్టాలకే విధేయులుగా ఉండాలనే స్ఫూర్తి పోలీసు యంత్రాంగంలో పెరగాలని మేధావి వర్గం చెబు తోంది. ఎదుటివారి వాదన వినకపోవడమేగాక, తాము చెప్పిందే సరైనది, తమ నిర్ణయాన్ని సమీక్షించకుండానే అంతా మారుమాటాడకుండా అంగీకరిం చాలనే ప్రభుత్వాల ధోరణి వల్లే నిరసన గళంపై ఈ నిర్బంధం వచ్చిపడింది. ఈ విషయాలన్నీ గ్రహించి పౌర సమాజం చైతన్యం తెచ్చుకుంటే తప్ప ‘‘ప్రజాస్వామ్యమంటే ఏ కొందరి చేతులకో అధికారం కట్టబెట్టడం కాదు! పాలకులు తప్పు చేస్తున్నప్పుడు, ఏయ్, ఎందుకిలా చేస్తున్నావ్? అని ప్రతి పౌరుడూ అడగ్గలిగే స్థితి ఉన్నదే ప్రజాస్వామ్యం’’ అన్న గాంధీజీ మాటలు నిజం కావు. జాతిపిత కలలు కన్న ప్రజాస్వామ్యం పరిఢవిల్లదు. ( వ్యాసకర్త : దిలీప్ రెడ్డి ఈమెయిల్: dileepreddy@sakshi.com) -
పరిణామం ఒకటి, పాఠాలెన్నో..!
తమిళనాడుతో పోల్చిచూస్తే తెలుగు రాష్ట్రాల్లో పౌర సమాజం చేతన విరుద్ధంగా ఉంది. తమ జీవితాల్ని ప్రభావితం చేసే పలు కీలక విషయాల్లో పౌర సమాజం స్పందన సన్నగిల్లుతోంది. అధికారం గుప్పిటపట్టిన రాజకీయ, పాలనా వ్యవస్థలు తమ పబ్బం గడుపుకోవడానికి, ప్రజాచేతనను సన్నగిల్ల జేసే ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి. ముఖ్యంగా విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు రోజురోజుకూ సన్నగిల్లుతున్నాయి. ఏ ప్రజాస్వామ్య వ్యవస్థనూ గౌరవించని పాలకపక్షం వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు రాజకీయ పరిణామాలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అంతమాత్రాన అక్కడవి అసహజం కావు, అసాధారణం అంతకన్నా కావు. గతించిన ఓ తమిళ మహానేత రాజకీయ వారసత్వం ఎవరిదన్న వివాదం పెను సంచలనం సృష్టించడం ఇదేం తొలిసారి కాదు. మూడోసారి! అన్నా దొరై నుంచి వారసత్వం నీదా–నాదా అన్న స్పర్ధ కరుణానిధి–నెడుంజెళియన్ మధ్య వస్తే, ఎమ్జీరామచంద్రన్ వారసురాలివి నువ్వా–నేనా అన్న తగాదా జానకీ, జయలలితల మధ్య వచ్చింది. ఇక జయలలిత రాజకీయ వారసత్వం ఎవరిదనే విషయంలో ప్రస్తుత గొడవ పన్నీరు సెల్వం–శశికళ మ«ధ్య అత్యంత వేగంగా పుట్టుకొచ్చింది. ఇప్పుడీ సంక్షోభం పతాకస్థాయి చేరింది. అన్ని సంద ర్భాల్లోనూ... అంతిమంగా వారసత్వాన్ని నిర్ణయించింది, భవిష్యత్తులో నిర్ణ యించబోయేది తమిళ ప్రజలు, స్థూలంగా చెప్పాలంటే తమిళ సమాజం. రాష్ట్ర–కేంద్ర స్థాయి రాజకీయ వ్యవస్థల ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా జరుగుతున్న పరిణామమిది. భావోద్వేగాలను గరిష్ఠంగా ప్రకటించడంలో విలక్షణత చూపే తమిళ పౌరసమాజపు చైతన్యమే వేరు! ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, కేంద్రంలో సర్కారు నడుపుతున్న ఎన్డీయే, ముఖ్యంగా బీజేపీ నాయకత్వం ఈ సంక్లిష్టత నుంచి ఏమాశిస్తోందన్నదే! ఏమీ ఆశించ కుండానే గవర్నర్ వ్యవస్థ ద్వారా రాజ్యాంగ ప్రక్రియలో కాలయాపనకు తలపడిందని అనుకోలేం. అలా అనుకోవాల్సి వస్తే, ప్రధానమంత్రి లేదా కేంద్ర అగ్రనాయకత్వం పురమాయింపు లేకుండానో, వారికి సమాచారం లేకుండానో అత్యవసర రాజ్యాంగ ప్రక్రియను సకాలంలో చేపట్టకుండా తమిళనాడు తాత్కాలిక గవర్నర్ తాత్సారం చేశారని అనుకోవాలి. అలా అను కునేంత అమాయకులెవరూ ఉండరు. బీజేపీ నాయకత్వం కూడా అమాయ కంగానే పావులు కదుపుతోందనీ అనుకోవడానికి లేదు. ఎవరిదో ఇల్లు కాలు తుంటే ఆ మంటకు చలికాచుకోవాలనే తత్వం కాకపోవచ్చు కానీ, దీన్నొక అవకాశంగా వాడుకొని ఎంతో కొంత రాజకీయ లబ్ధి పిండుకోవాలనే ఎత్తు గడ మాత్రం కనిపిస్తోంది. ఇవి లోగడ కాంగ్రెస్ నాయకత్వం చేయని యత్నాలు, వేయని ఎత్తుగడలేం కావు. వారా ప్రయోగాలు చేసి, వాటంగా చేయికాల్చుకొని, కడకు లాభం లేదని ప్రాంతీయశక్తులతో రాజీకి వచ్చిన బాపతే! ‘రాష్ట్ర రాజకీయాలు మీకు, ఢిల్లీ నంబర్లు మాక’ని స్థానిక ద్రవిడ పార్టీలతో కాంగ్రెస్ ఓ ఒప్పందానికి వచ్చిన నమూనా సుదీర్ఘకాలం సాగిందీ నేలపైన! నిన్నటి జల్లికట్టు సమస్య అయినా, నేటి రాజకీయ సంక్షోభమైనా, రేపటి మరో పరిస్థితయినా... తమిళ పౌరసమాజం నిర్ణాయక స్థితి అటు వంటిది. అందుకే, ఈ సంక్షోభం నుంచి కేంద్ర నాయకత్వం గ్రహించాల్సిన సూక్ష్మం, పొరుగునున్న రెండు తెలుగు రాష్ట్రాలు నేర్చుకోవాల్సిన గుణ పాఠాలు చాలానే ఉన్నాయి. తేలడానికి కొంత సమయం పట్టొచ్చు అస్వస్థతకు గురై జయలలిత ఆస్పత్రి పాలయిన నుంచి బీజేపీ నాయకత్వం తమిళ రాజకీయ చదరంగంపై పావులు కదుపుతూనే ఉంది. ఆమె మరణ సమయానికి గూడుపుఠాణిగా మారిన కేంద్ర సర్కారు పెద్దల తెరవెనుక ఎత్తులు ఎప్పటికప్పుడు లీలగా కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడవి తారస్థాయికి చేరాయి. ‘తాటి చెట్టెక్కావెందుకు?’ అంటే, ‘దూడగడ్డికోసం...!’ అన్నట్టు తడబాటు సమాధానాలిచ్చిన సందర్భాలూ ఉన్నాయి. అప్పటివరకు ముఖ్య మంత్రిగా ఉన్న పన్నీరుసెల్వం రాజీనామా చేసి, ఏఐఏడీఎంకే శాసన సభాపక్షం శశికళను తమ నేతగా ఎన్నుకున్న తర్వాత గవర్నర్ అందుబాటు లోకి రాకపోవడం అనుచిత జాప్యమనే భావనలు, ఇంకా సందేహాలు వ్యక్తమై నాయి. ఈ జాప్యంలోంచి కొత్త పరిణామాలు పుట్టుకొచ్చాయి. అందులో ప్రధానమైంది, పన్నీరుసెల్వం తిరుగుబాటు. ఫలితంగా అన్నా డీఎంకే పార్టీ రెండుగా చీలిపోయింది. ఎవరికెంత బలం? అనే విషయంలో స్పష్టత లేక పోయినా రెండు శిబిరాల మధ్య దూరం పెరుగుతోంది. ఒక అనుచిత జాప్యం ఈ పరిణామాలన్నింటికీ తావిచ్చిందనే అభిప్రాయం సర్వత్రా ఉంది. గవర్నర్ అలా జాప్యం చేయడానికి సుప్రీంకోర్టులో ఉన్న పెండింగ్ కేసు వారంలో విచా రణకు రానుండటమేనని ఓ సంజాయిషీని ప్రచారంలోకి తెచ్చారు. సదరు అక్రమాస్తుల కేసులో శశికళ రెండో నిందితురాలిగా ఉన్నందునే గవర్నర్ వేచి చూసే ధోరణి అవలంబించారని వివరణ జోడిస్తున్నారు. ఇది రాజ్యాంగ బద్ధమా? అన్నది సందేహాస్పదమే! ఎట్టకేలకు గవర్నర్ గురువారం చెన్నైకి చేరిన పిదప చోటుచేసుకున్న పరిణామాల్లో మరింత వేగం పెరిగింది. ఇప్ప టికిప్పుడు శశికళ ముఖ్యమంత్రి అవుతారా? రాజీనామా వెనక్కి తీసుకొని పన్నీరు సెల్వం పూర్తిస్థాయి ముఖ్యమంత్రిగా కొనసాగుతారా? సభ సుప్తచేత నావస్థలోకి వెళ్లి రాష్ట్రపతి పాలన వస్తుందా? అన్నవి పక్కన పెడితే జయలలిత నిజమైన రాజకీయ వారసులెవరనేది తేలడానికి కొంత సమయంపడుతుంది. దానికి అనేక కారణాలున్నాయి. తాజా పరిణామాల్లో... పార్టీ భవిష్యత్ నిర్వహణ అన్న కోణంలో ఎన్నికైన మెజారిటీ ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ వైపు చూస్తున్నారు. జయలలిత వారసురాలిగా శశికళను మెజారిటీ ప్రజానీకం అంగీకరించలేకపోవడం వల్ల నేమో ధిక్కార స్వరం తర్వాత పన్నీరు సెల్వంకు ప్రజాదరణ పెరుగుతోంది. నిజమైన వారసులెవరన్నది మళ్లీ తమిళ సమాజమే తేల్చాలి. వారసత్వం పక్కా చేయడమా? డీఎంకే నెత్తిన పాలుపోయడమా? తమిళనాడు రాజకీయాలెరిగిన వారెవరైనా రాగల పరిణామాల్ని తేలిగ్గానే అంచనా వేయగలరు. ఒక అనిశ్చిత పరిస్థితిని సానుకూలంగా మలచుకోవ చ్చనే దూరదృష్టితో కేంద్రంలోని పాలకపక్షం బీజేపీ కొంత ‘పొలిటికల్ ఇంజనీరింగ్’కు పాల్పడ్డా, తద్వారా తాను నేరుగా పొందే లబ్ధి ఏమీ ఉండదు. ఈ పరిణామాల తర్వాత బీజేపీ వంటి జాతీయ పార్టీ తమిళనాట కొత్తగా బలోపేతమయ్యే ఆస్కారమే లేదనేది చరిత్ర చెప్పే సత్యం. శశికళకు సానుకూల వాతావరణం కల్పిస్తే, అన్నా డీఎంకే క్రమ క్రమంగా బలపడటం ఖాయం. అలా కాకుండా ఆమె అవకాశాల్ని నొక్కిపెట్టి, పన్నీరు సెల్వంకు సానుకూలంగా వ్యవహరిస్తే కాలక్రమంలో రాజకీయంగా ఆమె కనుమరు గయ్యే అవకాశాలుంటాయి. పన్నీరు సెల్వం పార్టీని అంత పటిష్టంగా ముందుకు తీసుకువెళ్లగలరని అటు పార్టీ శ్రేణులు, ఇటు సామాన్య ప్రజలూ విశ్వసించడం లేదు. ఇది దీర్ఘకాలంలో డీఎంకేకి అనుకూలించే అంశం. అందుకే, బహిరంగంగా పన్నీరు సెల్వంకు మద్దతు మాటలు చెబుతూ పిల వని పేరంటంగా డీఎంకే తాజా సంక్షోభ బరిలోకి దూకుతోంది. శశికళను పక్కకు నెట్టి పన్నీరుసెల్వం ముఖ్యమంత్రిగా కొనసాగినా... తమకు ప్రయో జనమే తప్ప నష్టం లేదన్నది వారి లెక్క. ఎన్నికల రాజకీయాల నిర్వహణలో సెల్వం శక్తి–సామర్థ్యాలపై డీఎంకేకి స్పష్టమైన అంచనాలున్నాయి. ఈ విష యంలో అన్నా డీఎంకే పార్టీ నాయకులు, క్రియాశీల కార్యకర్తలకు కూడా విశ్వాసాన్ని మించిన సందేహాలున్నాయి. వ్యూహ–ప్రతివ్యూహాలతో, ఆర్థిక నిర్వహణతో రాగల ఎన్నికల్లో తమను పన్నీరు సెల్వం విజయతీరాలకు చేర్చ గలడన్న నమ్మకం వారికి కుదరటం లేదు. పౌరసమాజం చేతనే రక్ష తమిళనాడుతో పోల్చిచూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో పౌర సమాజం చేతన విరుద్ధంగా ఉంది. తమ జీవితాల్ని ప్రభావితం చేసే పలు కీలక విషయాల్లో పౌర సమాజం స్పందన ఇటీవల సన్నగిల్లుతోంది. అధికారం గుప్పిటపట్టిన రాజకీయ, పాలనా వ్యవస్థలు తమ పబ్బం గడుపుకోవడానికి, ప్రజాచేతనను సన్నగిల్ల జేసే ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి. ముఖ్యంగా విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు రోజురోజుకూ సన్నగిల్లుతున్నాయి. ఏ ప్రజాస్వామ్య వ్యవస్థనూ గౌరవించని పాలకపక్షం వ్యవహార శైలిపై విమ ర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయిదేళ్లకు అధికారం ఉంది కనుక తమకిక అడ్డే లేదన్న ధోరణిలో ఆదినుంచీ ప్రభుత్వం, పాలకపక్షం వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉంది. ఎర్రచందనం తీవ్రవాదులంటూ తమిళ కూలీలను నిర్దాక్షిణ్యంగా కాల్చివేసిన ఘటన నుంచి రెండున్నరేళ్లలో ఎన్నో సందేహాస్పద పరిణామాల్లో ప్రభుత్వం ఏకపక్ష ధోరణి కొట్టొచ్చినట్టు కనిపించింది. భూసే కరణలో దోపిడీకే దిగింది. ‘దివీస్’ భూవివాదాల విషయంలో సర్కారు జరిపిన, కొనసాగిస్తున్న నిర్బంధ కాండ నుంచి నిన్నా ఇవ్వాళా అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో జరిగిన ఘాతుకాల వరకు దౌర్జన్యకాండకు అడ్డూ, అదుపూ లేదు. అనం తపురంలో తన హక్కుల విషయంలో గొంతెత్తిన ఓ మహిళను రోడ్డుకీడ్చి, సర్పంచి సహా పాలకపక్షీయుల దాడిచేసిన దుశ్శాసనపర్వాన్ని ప్రశ్నించిన వారు లేరు. చీరాలలో తమకు గిట్టని రాత రాశాడని ఓ జర్నలిస్టుపై పట్టపగలే అధికార తెలుగుదేశం ఎమ్మెల్యే సోదరుడు కర్రతో దాడి చేసి హత్యాయత్నం చేస్తే అడ్డుకున్న వారు లేరు. ఇటువంటి అరాచకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రభుత్వం వైపు నుంచి బాధ్యత కలిగిన ఓ అధికారి గాని, రాజకీయ పెద్దలు గానీ కనీసం పెదవి విప్పరు. తమ ఆధిపత్యం కోసం రాష్ట్రమంతటికీ ఇవే సంకేతాలు వెళ్లాలన్నది వారి ఉద్దేశం కావచ్చు! ప్రతిపక్ష పార్టీ ఎత్తిచూపడం, ఎండగట్టడం తప్ప పౌరసమాజం తీవ్రంగా పరిగణించిన దాఖలాలే లేవు. సంప్రదాయంగా వస్తున్న ఓ సనాతన క్రీడ జల్లికట్టు నిషేదాన్ని ఎత్తివేయించుకొని, తమిళ సమాజం సదరు క్రీడను పునరుద్ధరించు కున్న తీరుకు అంతటా ప్రశంసలు లభించాయి. ఆ పరిస్థితిని, ఆంధ్రప్రదేశ్‌కు దక్కాల్సిన ప్రత్యేక హోదా విషయమై జరిగిన అన్యాయంతో అనేక స్థాయిల్లో పోలికలు వచ్చాయి. ఇక్కడి ప్రభుత్వం ఎందుకు శ్రద్ధ చూపట్లేదు, పైగా ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తోందన్న ప్రశ్నకు సమాధానం లేదు. రాజకీయ ప్రక్రియనూ నియంత్రించొచ్చు పౌరసమాజం గళాన్ని చిన్నబుచ్చే పాలకపక్ష యత్నం తెలంగాణ రాష్ట్రం లోనూ జరుగుతోంది. ప్రభుత్వ విధానాలను, నిర్ణయాలను ఎవరు ప్రశ్నిం చినా సహించని తత్వం ప్రభుత్వ పెద్దల్లో బలపడుతోంది. ఇదేమిటని ఎవరు గొంతెత్తినా అణచివేసే చర్యలకు పాల్పడటం ద్వారా పౌరసమాజాన్ని బలో పేతం కానీకుండా పైయెత్తులు వేస్తోంది. ప్రజాసమస్యలపై రాజకీయాలకతీ తంగా కోదండరామ్ వంటి వారు విమర్శిస్తే ముప్పేట దాడి చేస్తున్నారు. ప్రత్యర్థి రాజకీయ పార్టీకి బాకా అయ్యావనో, అక్కడ చేరి క్రియాశీల రాజ కీయాల్లోకి రమ్మనో సలహాలిస్తున్నారు. రాజకీయ వేదికల నుంచి తప్ప మరో వేదిక నుంచి స్వరం వినిపించవద్దన్న పరోక్ష సంకేతాలిస్తూ పౌరసమాజాన్ని చిన్నబుచ్చుతున్నారు. విమలక్క గొంతు నొక్కడానికి ఆమె ప్రాతినిధ్యం వహి స్తున్న సంస్థ కార్యాలయానికే తాళం వేసింది. మన బలహీన సమాఖ్య విధాన లోపాలే ఆసరాగా సాగే కేంద్రం పెత్తనం నుంచి అవకాశవాద రాజకీయ స్వార్థాల నుంచి, పౌర సమాజ చేతనే రాష్ట్రాలకు రక్ష. స్థానిక అస్తిత్వ రాజకీయాలే తమకు ముఖ్యమని బీజేపీ వంటి జాతీయ పార్టీలకు పాఠం చెబుతోంది తమిళ పౌరసమాజం. రాజకీయ నిర్ణయాధికారాన్ని కూడా ప్రజాగళం ప్రభావితం చేయగలదని వివిధ స్థాయిల్లో నిరూపిస్తోంది. పొరుగునున్న తెలుగు రాష్ట్రాలకు స్ఫూర్తినిస్తోంది తమిళ సంఘటిత గళం. అదీ పౌరసమాజం బలం! ఈమెయిల్: dileepreddy@sakshi.com దిలీప్ రెడ్డి -
ప్రాంతీయ అస్తిత్వాలపై దొంగ దెబ్బ
సమకాలీనం లోక్‌సభకు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికల వల్ల వ్యయం భారీగా తగ్గుతుందని, ఐదేళ్లు ప్రభుత్వాలు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవచ్చని అంటున్నారు. కానీ దీనివల్ల నష్టాలను ప్రస్తావించడం లేదు. ఐదేళ్లకు లైసెన్సు అన్నట్టు ప్రభుత్వాలు నిరంకుశంగా ప్రవర్తించకుండా మధ్య, మధ్య జరిగే ఎన్నికలు అడ్డుకుంటాయని వాదన ఉంది. ఇది, జాతీయ సమస్యలపై ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీల ప్రాభవాన్ని తగ్గించవచ్చనే జాతీయ పార్టీల దురాశనీ, ప్రాంతీయ అకాంక్షలకు, అస్థిత్వాలకు ముప్పు అని విమర్శకులు భావిస్తున్నారు. రాజుకు ఏడుగురు కొడుకులు. వేటకు వెళ్లి ఏడు చేపలు తెచ్చారు. ఎండ బెడితే ఒకటి ఎండలేదు. చేపాచేపా ఎందుకు ఎండలేదంటే, గడ్డిమోపు అడ్డొ చ్చిందని... ఎందుకడ్డొచ్చావంటే ఆవు మేయలేదని... ఎందుకు మేయలే దంటే, పనివాడు మేపలేదని... ఎందుకు మేపలేదంటే, అవ్వ బువ్వ పెట్టలే దని... ఎందుకు పెట్టలేదంటే, చంటాడు ఏడ్చాడని, ఎందుకు ఏడ్చావంటే? చీమ కుట్టిందని! చీమా! చీమా! ఎందుకు కుట్టావంటే, నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా! అందనేది పాత కథ. గణతంత్ర దినోత్సవం సంద ర్భంగా రాష్ట్రపతి ప్రసంగమైనా, ఓటర్ దినోత్సవంలో గవర్నర్ అభిభాష ణైనా... సారమొక్కటే, సంస్కరణలు రావాలి, భారత ప్రజాస్వామ్యం మరింత పరిపుష్టం కావాలి. ఓటరు బలోపేతమై జనాభిప్రాయానికి ప్రాధా న్యత పెరగాలి. మరి ఎందుకు జరగట్లేదు? పైన చెప్పిన కథలాగే అదో పెద్ద గొలుసు ప్రక్రియ. కడకు ఎక్కడొచ్చి ఆగుతుందంటే, మన రాజకీయ వ్యవస్థ వద్ద! తక్షణం ప్రక్షాళన చేయాల్సిన వాటిలో కీలకమైంది రాజకీయ రంగమే. నల్ల సంపదకు వ్యతిరేకంగా యావత్ దేశం యజ్ఞం చేస్తోంది, కానీ రాజకీయ వ్యవస్థ ఆజ్యం పోస్తున్న అక్రమార్జన మూలాల్ని కత్తిరించం. పన్ను ఎగవేత సంస్కృతికి పగ్గమేయాలంటాం కానీ, రాజకీయ పార్టీలకొచ్చే విరాళాలకు లెక్కపక్కాలుండవు. పాలనా వ్యవస్థల్లో పారదర్శకత కావాలంటాం కానీ, పార్టీల అంతర్గత వ్యవహారాలపై గోప్యత ముసుగు తీయం. లోక్‌సభ, శాసన సభలకు శాశ్వత ప్రాతిపదికన జమిలి ఎన్నికలంటాం కానీ, సాధ్యాసాధ్యాల పైన, స్థానిక ప్రజల ఆకాంక్షలు, అభీష్టాలపైన నిర్మాణాత్మక చర్చ జరపం. ఇదీ వర్తమాన భారతం! పార్టీలకు లభించే విరాళాలపై నిఘా, నియంత్రణ లేకుండా ఎన్నికల ప్రచార వ్యయానికి ప్రజాధనాన్ని వెచ్చించడం ఎలా సమం జసమనే ప్రశ్న తలెత్తుతోంది. ఓసారి ఎన్నికైతే చాలు, జనాభిప్రాయానికి కించిత్తు విలువివ్వకుండా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపే ప్రభుత్వాలు... అయిదేళ్ల దాకా దేశంలో ఎక్కడా ఇక ఎన్నికలే లేవంటే ఎలా వ్యవహరిస్తాయో ఊహించడం దుర్భరమంటున్నాయి ప్రజాసంఘాలు. ఎన్నికల సంస్కరణ లపై నిర్మాణాత్మక చర్చ జరగాలంటూనే, ఇప్పుడున్న పలు విధానాలు 'పకడ్బందీగా' లేవని రాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేసిన దరిమిలా కొన్ని కీల కాంశాలు తెరపైకి వస్తున్నాయి. ఎన్నికల సంస్కరణల్ని విడిగా చూడలేము, అవీ స్థూల రాజకీయ సంస్కరణల్లో భాగంగా జరగాల్సిందేనన్న అభిప్రాయం దృఢంగా వ్యక్తమౌతోంది. ఉద్యమాలపై ఉక్కు పాదానికి లైసెన్స్ మొన్న తమిళనాడులో జల్లికట్టు, నిన్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా.... రేపు మరోటి! రాజకీయాలకతీతంగా జనాభిప్రాయం ఉవ్వెత్తున ఎగిసిపడ్డ కీలకాం శాలు. వీటిని లక్ష్యపెట్టకుంటే ఎలా? ఏపీలో పాలకపక్షమైన తెలుగుదేశం కేంద్రంలోని ఎన్డీఏలో భాగమై జనాందోళనల్ని అణగదొక్కుతున్న తీరు కళ్లకు కట్టింది. 'ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా, అధికారంలో ఉన్నాం మాకు తోచిందే చేస్తాం!' అన్న వ్యవహార శైలి రాజకీయ నిరంకుశత్వానికి ప్రతీక! సాక్షాత్తూ గణతంత్ర దినోత్సవం రోజున విశాఖ విమానాశ్రయంలో విపక్షనేతను నిర్బం ధించిన తీరు, శాంతియుత నిరసనను అడ్డుకున్న వైనం పాలకపక్ష దురహం కారాన్ని తేటతెల్లం చేసింది. లోక్‌సభ, శాసనసభల ఎన్నికలు జమిలిగా జరగా లనే ప్రతిపాదనను ఇటీవల ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు తోస్తోంది. రాష్ట్రపతి గణతంత్ర ప్రసంగంలోనూ ఇది వ్యక్తమైంది. స్వతంత్రపు తొలినాళ్లలో ఇలాగే జరిగిందనీ ఆయన ప్రస్తావించారు. ఇప్పుడు జమిలి ఎన్నికలు మొదలైనా... కాలం క్రమేణా రకరకాల కారణాల వల్ల వివిధ రాష్ట్రాల శాసన సభల ఎన్ని కలు విడిగా జరగడం, వాటి శాసనసభా కాలాలు ముగియడం మారడం అనివార్యం. అస్పష్ట ప్రజా తీర్పు, రాజకీయ అస్థిరత, పార్టీ మార్పిడుల వల్ల ప్రభుత్వాలు కూలడం వంటి పరిస్థితుల్లో సభలు అర్ధంతరంగా రద్దవుతాయి. అలా ముందే ఎన్నికలు జరిగిన రాష్ట్రంలో ఆ పైన విధిగా లోక్‌సభ, శాస నసభల ఎన్నికలు ఒకేసారి జరగవు. అలా కాదని, నిర్బంధంగా జమిలి ఎన్నికలు జరిపితే అనర్థాలు తప్పవు. ముఖ్యంగా ప్రాంతీయ అస్తిత్వాలు, స్థానికాంశాల ఆధారంగా సాగే ఆందోళనలు, ఉద్యమాలకు అది విఘాతం. ప్రాంతీయ పార్టీల మనుగడకు పెనుసవాలు! అన్నిటికీ మించి సమాఖ్య స్పూర్తికే ఇది భంగకరం. జమిలి ఎన్నికల వల్ల రెండు ప్రయోజనాలను చూపు తున్నారు. అలాచేస్తే ఒకటి అపారమైన ఎన్నికల వ్యయాన్ని నియంత్రించ వచ్చు. రెండు, దేశమంతా ఒక్కసారి ఎన్నికలయిపోయాక ఐదేళ్ల వరకూ రాజ కీయ 'క్రీడ'లుండవు, ప్రభుత్వాలు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ రెండు ప్రయోజనాల గురించి ప్రచారమే తప్ప, దీనివల్ల కలిగే నష్టాల ప్రస్తా వన తేవడం లేదు. ఐదేళ్లకు లైసెన్సు దొరికినట్టు ప్రభుత్వాలు నియంతృ త్వంగా వ్యవహరించకుండా, మధ్య మధ్య వచ్చే రాష్ట్రాల ఎన్నికలు అడ్డుకుం టాయనీ, కొంత మేరకైనా ప్రజాభిప్రాయమెరిగి నడుచుకుంటాయనే వాదనా ఉంది. లోక్‌సభ, శాసనసభల ఎన్నికల్ని ఒకేసారి జరిపే తలంపు వెనుక జాతీయ పార్టీల స్వార్థమూ ఉంది. ఇదంతా జాతీయ సమస్యల ఆధారంగానే ఎన్నికలు జరిగితే, ప్రాంతీయ పార్టీల ప్రాభవం తగ్గుతుందనే దురాశ కావ చ్చని పరిశీలకుల భావన. ఇది ప్రాంతీయ ఆకాంక్షలకు, అస్థిత్వాలకు ముప్పు అని వారంటున్నారు. ఎన్నికల సంస్కరణల్ని విడదీసి చూడలేము మన దేశంలో ఎన్నికల సంస్కరణల్ని ఎప్పుడూ స్థూలంగా రాజకీయ సంస్కర ణల్లో భాగంగానే చూడాలి. రాష్ట్రపతైనా, గవర్నరైనా ఎన్నికల సంస్కరణల గురించే తప్ప, రాజకీయ పక్షాల గురించి మాట్లాడరు. పార్టీలన్నీ ఒకే తాను ముక్కలైనపుడు మార్పులైనా, సంస్కరణలైనా తమకు అనుకూలంగా ఉండా లనే దాదాపుగా అవన్నీ కోరుకుంటాయి. దేశ ప్రయోజనం, జనహితం గాలికి పోతుంది. అందుకే, తమ అకృత్యాలకు ప్రతిబంధకాలు ఏర్పడ్డ ప్రతిసారీ రాజకీయ విభేదాలకతీతంగా పార్టీలన్నీ ఏకమౌతాయి. ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలని సుప్రీంకోర్టు లోగడ తీర్పిస్తే... దాన్ని వ్యతిరేకించిన పార్టీలన్నీ ఆ తీర్పును వమ్ముచేయడానికి ఏకమయ్యాయి. ఇప్పుడూ సమా చార హక్కు చట్టం పరిధిలోకి తాము రామనే పిడివాద పంథాను అనుసరి స్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలియజేస్తూ కేంద్ర ఉద్యోగులు శిక్షణ మంత్రిత్వ శాఖ (డీఓపీటీ) సుప్రీం కోర్టుకు గత వారం ఒక వివరణ ఇచ్చింది. 'ఆ విషయంలో కేంద్ర సమాచార కమిషన్ లోగడ తప్పుడు తీర్పి చ్చింది, రాజకీయ పార్టీలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావు, అలా వచ్చి, వాటిని పబ్లిక్ అథారిటీ(పీఏ)లుగా ప్రకటించాల్సివస్తే తీవ్ర ఇబ్బం దులు ముంచుకొస్తాయి' అన్నది దాని సారాంశం. నిజానికి ప్రజా వ్యవహా రాల్లో మునిగి తేలి, భారీగా విరాళాలు పొందుతూ, ప్రభుత్వం నుంచి విలు వైన స్థలాలు, పన్ను మినహాయింపులు, ఇతర రాయితీలు పొందే పార్టీలు... చట్ట నిర్వచనం ప్రకారం పీఏలేనని 2013 జూన్‌లో కేంద్ర సమాచార కమిషన్ తీర్పునిచ్చింది. పార్టీల అంతర్గత నిర్మాణం, ఎన్నికల ప్రక్రియ, విరాళాలు, వ్యయం పైన అడిగిన వారికి సమాచారం ఇవ్వాల్సిందేనని ఆ తీర్పు సారాంశం. ఆ తీర్పును పార్టీలు పాటించట్లేదు, పాటించేలా చర్యలు తీసు కోవాలని కోరుతూ ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)తో సుప్రీంకోర్టును సంప్రదించింది. దానిపై సుప్రీం ఇచ్చిన నోటీసుకు కేంద్రం ఇప్పుడు స్పందించింది. పార్టీలు కూడా దాదాపు ఇలాగే స్పందిస్తున్నాయి. పార్టీల ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని వెల్లడించేలా ప్రజాప్రాతినిధ్య చట్టంలో, ఆదాయం పన్ను చట్టంలో ఉన్న కొన్ని నిర్బంధాలు సరిపోతాయని కేంద్రం వాదన. వాటిలోని డొల్లతనం వల్లే ఇన్ని అనర్థాలూ జరుగుతున్నాయని, చట్టాల్లోని లొసుగులు, అనుచిత మిన హాయింపులు పార్టీల అకృత్యాలకు అండగా ఉన్నాయని ప్రజా సంఘాల విమర్శ. వాటిని పరిహరించే సంస్కరణలు కావాలన్నది వాటి ప్రధాన డిమాండు. విరాళాల విష సంస్కృతే నల్ల సంపదకు మూలం దేశంలోని ప్రధాన జాతీయ, ప్రాంతీయ పార్టీలకు దశాబ్ద కాలంలో రూ. 11,367 కోట్లు విరాళంగా లభించినట్టు ఒక అంచనా. అందులో, రూ. 7,833 కోట్లు, అంటే 69% విరాళాలు ఎవరి నుంచి అందాయో లెక్కల్లేవు. చెప్పనవసరం లేదని వాటి వాదన. రూ. 20 వేలకు పైబడ్డ విరాళాల ఇచ్చిన దాతల పేర్లు పేర్కొనాలని ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఉంది. దీనికి రూ. 20 వేల లోపు విరాళాల దాతల పేర్లు చెప్పనక్కర్లేదని వ్యాఖ్యానం చెప్పి వారి పేర్లను చెప్పడం లేదు. ఎంత పెద్ద విరాళాలనైనా రూ. 20 వేల లోపువిగానే విడగొట్టి చూపుతూ దాతల వివరాలను దాచడానికి ఆ నిబంధనను వాడుకుంటు న్నారు. కాంగ్రెస్‌కు లభించిన రూ.3,982 కోట్లలో 83% గుప్త విరాళాలే! బీజేపీకి లభించిన రూ. 3,273 కోట్లలో 65% శాతం ఇదే బాపతు! సమా జ్‌వాదీ పార్టీ విరాళాల్లో 94%, అంటే రూ.786 కోట్లు కూడా ఈ ఖాతాల్లోవే. ఇక బీఎస్పీకి లభించిన రూ.764 కోట్లకు గాను అది ఒక్క దాత పేరూ వెల్ల డించలేదు! తెలుగు రాష్ట్రాల్లోని పాలకపక్షాల విరాళాల కథా అలాంటిదే! తెలుగుదేశం ప్రకటించిన మొత్తం రూ.145 కోట్ల విరాళాల్లో రూ.45 కోట్లు గుప్త దాతలవే! తెలంగాణ రాష్ట్ర సమితి విరాళాలు రూ.35.92 కోట్లలో రూ. 25.2 కోట్లు ఎవరిచ్చిందీ పేర్కొనలేదు. చట్టాల్లోని లొసుగుల్ని ఆసరా చేసు కొని రాజకీయ పార్టీలు అనుచిత ప్రయోజనాలు పొందుతున్నాయి. ఎన్నికల్లో విచ్చలవిడిగా ధనం వెచ్చించి రాజకీయాల్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. రాజకీయ పార్టీలకిచ్చిన మినహాయింపులకు వ్యతిరేకంగా దాఖలైన 'పిల్'ను జనవరి 11న సుప్రీంకోర్టు కొట్టివేసింది. కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేయగా దేశ మంతా నోట్ల కొరతతో అల్లల్లాడుతున్నపుడు రాజకీయ పార్టీల సొత్తు మాత్రం భద్రంగా ఉండటం సగటు మనిషిని నివ్వెరపరిచింది. ఆదాయం పన్ను చట్టం–1961, సెక్షన్ 13 ఏ ప్రకారం రాజకీయ పార్టీల విరాళాలకు పన్ను మినహాయింపు ఉందని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి ప్రకటిస్తే, డిసెంబర్ 31 వరకు బ్యాంకుల్లో, 31 మార్చి 2017 వరకు ఆర్బీఐ కౌంటర్లలో రద్దయిన పాత నోట్లను అవి డిపాజిట్ చేసుకోవచ్చని కేంద్ర ఆర్థిక కార్యదర్శి ప్రకటించారు. దీంతో సామాన్యులకు పుండు మీద కారం చల్లినట్టయింది. విమర్శలు వెల్లు వెత్తాయి. కేంద్రం సర్దుకుంది. మొత్తానికి, గత డిసెంబర్లో తెచ్చిన చట్ట సవ రణ ద్వారా ఈ సౌకర్యాన్ని రద్దు చేసినట్టు ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటించారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన రాజకీయ పార్టీలు ఆర్థిక, సామాజిక వ్యవస్థల్ని కలుషితం చేస్తున్నాయి. జూలై 2015 నాటికి దేశంలో 1,866 రాజకీయ పార్టీలున్నట్టు ఎన్నికల సంఘం తేల్చింది. ఇందులో 464 పార్టీలే 2014 ఎన్నికల్లో అభ్యర్థుల్ని బరిలోకి దించినా, అందులో మూడింట రెండొం తుల పార్టీలు కడదాకా పోరాడనే లేదు. ముఖ్యంగా నల్లసంపద వృద్ధి మూలాలపై ఆరా ఎక్కడ మొదలెట్టినా, పైన కథలో చెప్పినట్టు లెక్క రాజ కీయ వ్యవస్థ వద్ద కొచ్చి ఆగుతుంది. స్థూలంగా రాజకీయాల్ని, అందులో భాగంగానే ఎన్నికల ప్రక్రియను సంస్కరించాల్సిన అవసరాన్ని తాజా పరి స్థితులు నొక్కి చెబుతున్నాయి. ఇది క్యాన్సర్‌లా విస్తరించి ప్రాణాల్ని కబ ళించకముందే జాగ్రత్తపడాలి. అవసరమైతే శస్త్రచికిత్సకు సిద్ధపడి మనను మనం రక్షించుకోవాలి. ఈమెయిల్: dileepreddy@sakshi.com దిలీప్ రెడ్డి -
సంపన్నులు చంకన.. పేదలు వీధిన
సమకాలీనం కేంద్రంలో, తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలేవీ ధనక–పేద వ్యత్యాసాల్ని తగ్గించే విగా లేవు. భూసేకరణల నిర్వాసితుల నుంచి రైతులు, వ్యవసాయ కూలీల వరకు అంద రిదీ దయనీయ స్థితి! చిన్న వ్యాపారులు, నిరుద్యోగులు, చిరుద్యోగులు, అసంఘటిత కార్మి కులు, దినసరి కూలీల వరకు పేదరికంలోకి నెట్టేస్తున్న పరిస్థితి! ‘ప్రపంచీకరణ రెండు వైపులా పదునున్న కత్తి’. దాన్ని ఒడుపుగా వాడుకొని ఆర్థిక అంతరాల్ని తగ్గించాలి. విప్లవం నేరుగా ఉత్పత్తి కాదు, అది విప్లవ పరిస్థితుల నుంచి పుట్టే ఉప ఉత్పత్తి మాత్రమే! ప్రపంచమంతా, ముఖ్యంగా మన దేశంలో పెరుగుతున్న ఆర్థిక అంతరా లను చూస్తుంటే భవిష్యత్తు భయానకంగా కన్పిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వాల విధానాలు, నిర్వాకాలు ఈ అంతరాల్ని మరింత పెంచి పోషించేవిగానే తప్ప, తగ్గించేవిగా లేవు. ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణల అమలు తర్వాత ఈ అంతరాలు వేగంగా పెరుగుతున్నాయి. స్థూలంగా మన ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ సంపద ఒకవైపు పోగవుతుంటే, దారిద్య్రం స్థిరపడుతోంది. సంపన్నులు మరింత సంపన్నులవుతున్నారు. పేదలు కటిక దారిద్య్రంలోకి జారుతున్నారు. వేగంగా ఎదుగుతున్న ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ భారత్‌లో 30% తిండి కోసం అలమటిస్తున్నారు. మరో వంక 1% అంటే కోటీ ముఫ్పై లక్షల మంది వద్ద ఉన్న ఆస్తి 99% అంటే 128 కోట్ల 70 లక్షల మంది మొత్తం సంపద కన్నా 16% ఎక్కువ! పరిస్థితులు ఇలాగే కొనసాగితే... వచ్చే 20 ఏళ్లలో, దేశంలోని 500 మంది అగ్ర సంపన్నుల ఆస్తి మిగతా భారతదేశపు స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)ని మించి పోతుం దనే అంచనా మరింత గగుర్పాటు కలిగిస్తోంది. పేదరిక నిర్మూలనను కోరు తున్న ఓ అంతర్జాతీయ సంస్థ ‘ఆక్స్‌ఫామ్’ అధ్యయన నివేదిక వెల్లడించిన గణాంకాల సారాంశమిది. స్విట్జర్లాండ్‌లోని ఆల్ఫ్స్ పర్వతశ్రేణి ఒడిలో ఒది గిన దావోస్ నగరంలో ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆక్స్ ఫామ్... సమాజిక అశాంతికి ఆజ్యం పోస్తున్న ఆర్థిక అంతరాల నివేది కను వెల్లడించింది. సంపద సృష్టికన్నా పంపిణీ ముఖ్యం ప్రపంచదేశాల నేతలు, సంపన్నులు, బ్యాంకింగ్, కార్పొ రేట్ ప్రతిని ధులు, వాణిజ్య, వ్యాపార ముఖ్యుల నాలుగు రోజుల భేటీ నేటితో ముగు స్తోంది. ప్రపంచదేశాల విధాన నిర్ణాయక స్థానాల్లోని నేతలు, ఆర్థిక స్థితి గతుల్ని మలుపుతిప్పే ముఖ్యుల సమాలోచనల్లో ఈ అంతరాలే కీలకాంశమై కూర్చుంది. దీంతో ఇన్నాళ్లు బెట్టు చేసినా వారు ఇక ‘సమ్మిళిత ప్రగతే’ పరిష్కార మార్గమని అంగీకరించాల్సి వస్తోంది. ఆర్థిక అంతరాల్ని నియం త్రించకపోతే ప్రపంచీకరణకు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు గండం తప్ప దనే భయం, వారిని పట్టుకుంది. సుస్థిరాభివృద్ధిని సాధించలేమనే సందే హాలు బలపడుతున్నాయి. ప్రతి సమాజంలోపల, సమాజాల మధ్య ఆర్థిక అంతరాల తగ్గింపు ముఖ్య ఎజెండాగా మారుతోంది. ఒక దశకు చేరాక సంపద సృష్టి కన్నా పంపిణీ ముఖ్యమని సత్యాన్ని గుర్తించక ఇంకా ‘పంపిణీ సవ్యంగా జరగాలన్నా ముందు ‘సంపద’ సృష్టి జరగాలి, అదే ముఖ్యమ’నే పాత పాటే పాడుతున్నారు ముఖేష్ అంబానీ! ఇటువంటి కార్పొరేట్లతో అంట కాగుతున్న ప్రభుత్వాల ఆలోచనా ధోరణీ అంతే. కేంద్రంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అమలవుతున్న విధానాలేవీ ధనక–పేద వ్యత్యాసాల్ని తగ్గించేవిగా లేవు. అభివృద్ధి పేరిట జరిగే భూసేకరణల నిర్వాసితుల నుంచి రైతులు, వ్యవసాయ కూలీల వరకు అందరిదీ దయనీయ స్థితి! చిన్న వ్యాపారులు, నిరుద్యోగులు, చిరుద్యోగులు, అసంఘటిత కార్మికులు, దినసరి కూలీల వరకు అందర్నీ పేదరికంలోకి నెట్టేస్తున్న పరిస్థితి! కార్పొరేట్ శక్తులు మాత్రం ఇంకా బలపడుతున్నాయి, ప్రపంచ స్థాయికి విస్తరిస్తున్నాయి. వారి ఏ ఆర్థిక నివేదిక చూసినా ఇది సుస్పష్టం. బాబెందుకు వెళతాడో........?! ‘నోట్లో రాయి తీసుకోలేని వాడు ఏట్లో రాళ్లు ఏరేయడానికి వెళ్లాడ’ని వెనకటి సామెత! దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సుకు ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు క్రమం తప్పకుండా ఎందుకు వెళతారు? ఇది, మేధావులైనా సమాధానం చెప్పలేని ప్రశ్న. పిలిచారనుకుందామా అంటే ఆయన్నెందుకు, ఏ హోదాలో పిలుస్తారు? తనంత తానుగా వెళితే ఏమి సాధించడానికి? ఇప్పటివరకేమైనా సాధించారా? ఇవి సమాధానం లేని ప్రశ్నలు. ఇంత ప్రజాధనం వెచ్చించి ఆయన రాష్ట్రం కోసం సాధించిందేమైనా ఉందా? వివిధ రాజకీయ పక్షాలు, పౌర సంస్థలు లేవనెత్తుతున్న ఈ సందే హాలను నివృత్తి చేస్తూ ఆయన ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగలదా? తనకు, తన పరివార గణానికి ఈసారి అయిన దారి భత్యం ఖర్చు దాదాపు కోటి రూపాయలు. రాష్ట్రానికి ప్రచారం కల్పించడానికి ఒక స్టాల్ లాంటి దానిని ఏర్పాటు చేయడానికి, ఇతర ప్రచార వ్యవహారాలకు రూ. 7.57 కోట్ల ప్రజాధనం వెచ్చించారని సమాచారం. పనుల మీద కన్నా ప్రచారం మీద వందలు, వేల కోట్లు వెచ్చించి పబ్బం గడిపే చంద్రబాబు నాయుడి ఇదివర కటి పాలనా లక్షణాలన్నీ ఇప్పుడు మళ్లీ తెర మీదికొస్తున్నాయి. అంతరాలను పెంచుతున్న భూసేకరణలు ప్రపంచ ఆర్థిక వేదిక చర్చలకు, తాజా ఆలోచనా ధోరణులకు ఫక్తు విరుద్ధ విధానాల్ని ఆయన ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్నారు. రాజధాని భూసేక రణనే తీసుకుంటే అది సమాజంలో తీవ్ర ఆర్థికాంతరాలకు దారితీస్తున్నట్టు కనిపిస్తోంది. రెండువేల ఎకరాల రాజధాని నిర్మాణాల కోసం దాదాపు 34 వేల ఎకరాల సామాన్యుల, రైతుల భూమిని ప్రభుత్వం కబ్జాపెట్టింది. భూస మీకరణ పేరిట ఇప్పటికే దాదాపు 28 వేల ఎకరాల వరకు స్వాధీనపరచుకొని, మరో నాలుగయిదు వేల ఎకరాలు లాక్కోవడానికి బెదిరింపులకు, అధికార దుర్వి నియోగానికి పాల్పడుతోంది. తమ భూములిచ్చేది లేదనే స్థిరాభిప్రా యంతో ఉన్నవారిని ‘భూసేకరణ’ పేరిట కొత్తగా బెదిరిస్తోంది. దాదాపు రెండున్నర వేల ఎకరాల భూముల్ని లాక్కోవడం సర్కారు లక్ష్యం. రికార్డుల్లో తక్కువ చూపిన వ్యక్తిగత భూములు, గ్రామకంఠాలు, అసైన్డ్ భూములు, సరైన రికార్డులు నిర్వహించని చుక్క బెట్టిన భూములు... ఇలా రకరకాల భూముల్ని తమ వందిమాగధులకు కట్టబెడుతూ ఆర్థిక అంతరాలకు తానే కారణమౌతోంది. ఇది కాకుండా లంక భూములు, పోరంబోకు, గైరానీ, అటవీ శాఖతో పాటు వివిధ విభాగాల అధీనంలో ఉన్న దాదాపు 17 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా తీసుకొని ప్రపంచంలో మరెక్కడా లేనంత పెద్ద ‘భూదందా’ను స్వయంగా ప్రభుత్వమే నిర్వహిస్తోంది. ఉమ్మడి అభివృద్ధి ముసుగులో ఉచితంగా, నామమాత్రపు ధరకు భూములు పొందే విదేశీ కంపెనీలు, కార్పొరేట్లు, ప్రైవేటు కంపెనీలు, సంస్థలు, వాటి ప్రతి నిధులు... ఇలా ప్రభుత్వంతో అంటకాగిన వారంతా కోట్లకు పడగలెత్తుతారు. సర్కారు చలువతో ఓ నయా సంపన్న వర్గం స్వల్ప కాలంలోనే పైకి లేస్తుంది. ఏ భూమీ లేకున్నా పంట భూములపై ఆధారపడి ఉపాధి పొందినవాళ్లు, ఎకరం, అర ఎకరంతోనే ఏటా మూడుకు తగ్గని పంటలతో దర్జాగా బతికిన వాళ్లు ఇప్పుడు దీనంగా దారిద్య్రరేఖ దిగువకు జారుతున్నారు. రాబడి పెంచుకుంటూ, బరువు దించుకుంటూ... సమసమాజ స్థాపన లక్ష్యంగా కలిగిన సంక్షేమ రాజ్యం మనది. ఎన్నికల్లో ఓట్లు రాల్చే ప్రజాకర్షక విధానాలే తప్ప, ప్రజలకు హితం చేసే పనుల పట్ల ప్రభుత్వాలు శ్రద్ధ చూపట్లేదు, పైగా వైదొలగుతున్నాయి. ఎన్నికల హామీల అమలుకూ దిక్కులేని పరిస్థితి. ముక్కుపిండి జనం వద్ద ప్రత్యక్ష, పరోక్ష పన్నులతో ఏటేటా రాబడి పెంచుకుంటున్న ప్రభుత్వాలు కీలకమైన విద్య, వైద్యం, ఆరోగ్యం వంటి రంగాల్లోనూ బరువు, బాధ్యతల నుంచి క్రమంగా తప్పుకుంటూ... ప్రైవేటు రంగానికి ఎర్రతివాచీలు పరుస్తున్నాయి. అలా ప్రైవేటు రాజ్యాలు నెలకొల్పిన వాళ్లు ఇప్పుడు ప్రభుత్వాల్లో భాగమై శాస నాలు, విధానాలు రూపొందిస్తున్నారు. పైగా నీరుగారిన, నిర్వీర్యమైన నియంత్రణా వ్యవస్థలతో పనిచేస్తూ కార్పొరేట్లకు, ఇతర ప్రైవేట్లకు మన సర్కార్లు అనుచిత ప్రయోజనాలు కల్పిస్తున్నారు. ఒకరికొకరు అంటకాగుతూ అవినీతికి హారతి పడుతున్నారు, అంతరాలకు ఆజ్యం పోస్తున్నారు. దీంతో ఆర్థిక అంతరాలు వేగంగా పెరుగుతున్నాయి. పదేళ్ల కిందటి బడ్జెట్‌తో పోలిస్తే తెలుగు రాష్ట్రాల బడ్జెట్ ఆరింతలు పెరిగింది. 2005–06లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ రూ. 55,330 కోట్లు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలసి రూ. 3 లక్షల కోట్లు దాటనుంది. రూ. 1.60 లక్షల కోట్ల బడ్జెట్‌కు తెలం గాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దాదాపు అంతే పరిమాణంతో ఏపీ బడ్జెట్ రూపొందనుంది. కీలక రంగాల్లో బరువు దించుకుంటున్న ప్రభుత్వం ప్రజా ధనాన్ని ఎక్కడ వ్యయం చేస్తోంది? సాగునీటి ప్రాజెక్టుల వ్యయ అంచనాలు పెరిగే తీరు, ప్రజాకర్షక పథకాలకు వెచ్చించే పద్ధతి విస్మయం కలిగిస్తోంది. వాస్తు భ్రమల్లో తరచూ మారే పాలకుల నివాసాలు, కార్యాలయాలు, విడిది కేంద్రాల నిర్మాణా లకయ్యే దుబారా, గాల్లో జరిపే ‘ప్రత్యేక’ ప్రయాణాల కయ్యే ఖర్చులు, అతి ఉదారంగా ఇచ్చే విరాళాలు... ఇలా ఎన్నిటికో ప్రజాధనం వ్యయమౌతోంది. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం నిర్లక్ష్యానికి గురవుతోంది. రైతుల్ని ఆదుకునే చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నం జరగట్లేదనే విమర్శ ఉంది. మార్కెట్ జోక్యాలకు గాను నిర్ధిష్టంగా కొంత మొత్తం వెచ్చించి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలన్న సూచన అమల్లోకి రావట్లేదు. ఇప్పటికే అనేక సమస్యల్లో కూరుకుపోయిన రైతాంగం తమ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలు లభించని స్థితిలో అల్లాడుతున్నారు. ఇది వీడని ఆర్థిక అంతరాలకే దారి తీస్తోంది. అవకాశాల కల్పనతోనే అంతరాలు తీరేది పేదరికం ఏ రూపంలో ఉన్నా దాన్ని తొలగించాలన్నది ఐక్యరాజ్యసమితి ప్రతి పాదించి, ప్రపంచదేశాలు అంగీకరించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో (ఎస్డీజీ) మొదటిది. రాగల పదిహేనేళ్లు అన్ని స్థాయిల్లో ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తే తప్ప 2030 నాటికైనా ఈ లక్ష్యసాధన జరగదు. పెద్దనోట్ల రద్దు చర్యతో సాధించిన ఫలితాలేమిటో కేంద్రం ఇప్పటివరకు వెల్ల్లడించలేదు. ఆ పరంపరలో తదుపరి ఆర్థిక, పాలనా సంస్కరణలు, ఇతర చర్యల్ని జాగ్రత్తగా చేపడితే తప్ప నల్ల సంపదను వ్యతిరేకించిన సామాన్యుల త్యాగాలకు అర్థం ఉండదని ప్రపంచ ఆర్థికవేత్తలు సైతం భావిస్తున్నారు. ఆర్థిక అంతరాలు తగ్గించే క్రమంలో ఒక వంక సంపద వృద్ధి చట్టపరిధికి లోబడి జరిగేలా చూస్తూనే, సామాన్యుల ఎదుగుదల అవకాశాల్ని వృద్ధి చేయాలి. ఈ ఉదాహర ణను చూస్తే ప్రభుత్వాల వైఫల్యాలు కళ్లకు కడతాయి. నిర్మాణరంగ కూలీల కోసం ఆ రంగం నుంచి వసూలు చేసిన 2% సెస్ మొత్తాల్ని పదేళ్లలో ప్రభు త్వాలు వ్యయం చేసిన తీరే ఇందుకు నిదర్శనం. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దావోస్‌లో మాట్లాడుతూ అన్నట్టు ‘ప్రపంచీకరణ రెండువైపులా పదునున్న కత్తి’ అని పాలకులు గ్రహించాలి. దాన్ని ఒడుపుగా వాడుకొని ఆర్థిక అంత రాల్ని తగ్గించి, సమాజంలోని అశాంతిని తొలగించాలి. ‘‘విప్లవం నేరుగా ఉత్పత్తి కాదు, అది విప్లవ పరిస్థితుల నుంచి పుట్టే ఉప ఉత్పత్తి మాత్రమే’’ అన్న ఇంగితం అత్యవసరం. దిలీప్ రెడ్డి ఈమెయిల్: dileepreddy@sakshi.com -
కార్పొరేట్ల సిరి, లేత ఆశకు ఉరి
సమకాలీనం నియంత్రణ లేని వ్యవస్థలో ర్యాగింగ్ భూతమొకటి! బంగారు భవిష్యత్తును పణంగా పెట్టి చిన్న వయసులో భావి భారత పౌరులు బలవన్మరణాలకు సాహసిస్తున్నారు. గత రెండున్నరేళ్లలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో యాభై మందికి పైగా విద్యార్థులు ఇలా అర్ధంతరంగా తనువు చాలించారు. ఎంత మంది చనిపోతున్నా ప్రభుత్వాలకు పట్టదు. కార్పొరేట్ సంస్థలపై కేసుల్లేవు. లోగడ చాలా విచారణ కమిటీలు వేసినా, కొన్ని కమిటీలు నిర్దిష్టమైన సిఫారసులు చేసినా అవి అమలుకు నోచుకోలేదు. ‘‘ఆత్మవిశ్వాసాన్నీ, నిగ్రహాన్నీ కోల్పోకుండా... దేన్నయినా వినగలిగే, ఎదు ర్కోగలిగే సామర్థ్యాన్నిచ్చేదే విద్య’’ అంటాడు నాలుగుమార్లు పులిట్జర్ అవార్డు పొందిన అమెరికా కవి రాబర్ట్ లీ ఫ్రాస్ట్. మనం మన పిల్లలకు ఏ రకం విద్య అందిస్తున్నాం? ఎంత ఆత్మ విశ్వాసాన్ని వారిలో నింపగలుగుతున్నాం? ఏపాటి అవగాహన బతుకుపై వారిలో కలిగిస్తున్నాం? ఎంతటి జీవితేచ్ఛను వారిలో రగిలిస్తున్నాం? ఒకసారి గుండెల మీద చేయి వేసుకొని మనమందరం ఆలోచించాల్సిన అంశం. పాపం, చంద్రశేఖర్, నవీన దంపతులు తమ ఒక్కగానొక్క కొడుకు వంశీకృష్ణ గురించి ఎన్నెన్ని కలలు కన్నారో! అంతలోనే ఆ కలలు కల్లలయి.... కన్న కొడుకు లేత వయసులో చదువు చట్రాల ఇరుసులో పడి నలిగాడు. పూవై నూరు రేకులతో వికసించాల్సినవాడు మొగ్గగానే రాలిపోతే... నలభై రోజుల పైగా రెండు హృదయాలు తుపానులో చిగురుటాకుల్లా అల్లాడినై.‘తమకే ఎందుకిలా జరిగింది...’ దుఃఖం తన్నుకొస్తున్నా ఏ వైపు నుంచీ సమాధానం లేదు. కడకు ఆత్మహత్యతో రెండు బతుకులూ కడతేరినై. విన్న ప్రతి హృదయాన్నీ కదిలించిందీ గుంటూరు జిల్లా దుర్ఘటన! వెలిగే ఓ చిరుదివ్వె కొండెక్కితే, ఉన్న రెండు దీపాలూ దీనంగా ఆరిపోయినయ్. ఆ దినమలా గడిచింది. ఎప్పటిలాగే పొద్దువాలింది, మళ్లీ తెల్లారింది. ఏం జరగనట్టే, అంతా సద్దుమణిగింది! రారండంటూ సర్కారు, ప్రైవేటు బడులు స్వాగతం పలికాయి. పొలోమంటూ పిల్లలు బడులకు పరుగులు తీశారు. పిల్లల భవి ష్యత్తు గురించి కలలు కంటున్న తల్లిదండ్రులూ వారిని బడుల్లో దింపు తున్నారు, హాస్టళ్లలో కుక్కుతున్నారు. లేత ఆలోచనల్ని పునాదుల్లో పూడ్చి ఆశల సౌధాలు కడుతూనే ఉన్నారు. షరా మామూలే! ఇదిలా సాగాల్సిందేనా! ఎవరూ మనసు పెట్టి ఆలోచించరా? బడులు–కాలేజీలెందుకు పిల్లల పాలిట వధ్యశిలలవుతున్నాయి? సర్కారు బడులెందుకు కంటికానని దుస్థితికి జారు తున్నాయి? మూడు బడులు ఆరు కాలేజీలై ప్రైవేటు విద్యా వ్యాపారం కోట్లకెలా, ఎందుకు పడగలెత్తుతోంది? చిరుప్రాయంలోనే విద్యాకుసుమాలెం దుకు రాలుతున్నాయి? ఎందరి మెదళ్లనో తొలుస్తున్న శేష ప్రశ్నలివి. అనా రోగ్యంతో అసువులు వీడారనో, ఆత్మహత్యతో కడతేరారనో, ప్రమాదవశాత్తు మరణించారనో... ఎప్పటికప్పుడు ఓ కథ వినిపిస్తున్నారు. నూరు పుటల వారి బతుకు పుస్తకాల్ని తొలి పేజీల్లోనే కర్కశంగా మూసేస్తున్నారు. కన్నవారికి తీరని గర్భశోకం మిగిలిస్తున్నారు. స్వేచ్ఛగా ఎదగాల్సిన లేత మెదళ్లు ఒత్తిడిలో చిత్తవుతున్నాయి. అత్యాశే తప్ప, ఆశెప్పుడూ తప్పు కాదు ఆర్థిక సరళీకరణ తర్వాతి పరిణామాల్లో ఎదుగుదల అవకాశాలు అందరికీ కనిపించాయి. ఆశలు రేపాయి. పద్ధతిగా సాగిన కొన్ని కలలు సజావుగా నెర వేరుతున్నాయి. వాస్తవిక దృక్పథంతో కాకుండా అత్యాశతో ఆలోచించి, పథ కాలు రచించిన చోట విలువలు వేగంగా పతనమయ్యాయి. ఈ దురవస్థ, కుటుంబ వ్యవస్థలో మానవ సంబంధాలైనా, బయటి సమాజంలోని వ్యాపార లావాదేవీలైనా మినహాయింపు లేకుండా అంతటా వర్తిస్తోంది. అభిరుచి స్థాయితో నిమిత్తం లేకుండా తమ పిల్లలు పెద్ద చదువులు చదివి, గొప్ప కొలువులు పట్టి, బోలెడు సంపాదించాలన్న తలిదండ్రుల అత్యాశ పిల్లల లేత మెదళ్లపై ఒత్తిడి పెంచే గుదిబండౌతోంది. ఈ బలహీనతే, తక్కువ సమయంలో ఇబ్బడి ముబ్బడిగా ధనార్జన చేయాలనుకున్న స్వార్థ విద్యా వ్యాపారులకు పెట్టుబడి అయింది. దొడ్డి దారిన సంపద కూడగట్టాలనుకున్న అధికార పెద్దలకిదొక అక్రమార్జన మార్గమయింది. విశ్వవ్యాప్తంగా, వేల సంవత్సరాలు కీర్తిమానమైన భారతీయ విద్య, విలువలతో కూడిన సంస్కృతి సర్వనాశనమైంది. మనం గొప్పగా చెప్పుకునే కేంబ్రిడ్జి, హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ వంటి యూనివర్సిటీల కన్నా కొన్ని వందల యేళ్లకు ముందే విశ్వ విద్యకు శ్రీకారం చుట్టిన నలంద, తక్షశిల, విక్రమశిల వంటి విశ్వవిద్యాలయాలకు నెలవైన నేల మనది. స్వేచ్ఛా విద్యార్జనకు నిలయంగా విశ్వకవి రవీంద్రుడు ‘శాంతినికేతన్’ నెలకొల్పిందిక్కడే! అటువంటిది ప్రస్తుతం విద్య ఫక్తు వ్యాపా రమైంది. ఆమీర్‌ఖాన్ ఓ చక్కటి కళాఖండంగా తీర్చిదిద్దిన ‘త్రీ ఇడియట్స్’లో సందేహించినట్టు విద్యార్థులుంటున్నది కాలేజీయో, ప్రెజర్కుక్కరో తెలియని పరిస్థితులు దాపురించాయి. భరించలేని ఒత్తిళ్లలో పిల్లలు నలిగి పోవడానికి తల్లిదండ్రుల అత్యాశ కూడా కారణమే! తమ పిల్లల ఆసక్తి, నైపుణ్యాలు, మానసిక ప్రవర్తన వంటి అంశాలతో నిమిత్తం లేకుండానే వారిని ఏదేదో చేసేయాలనుకోవడంలోనే లోపముంది. ఏటా ఎంతమంది ఇంటర్ పాసయి ఉన్నత విద్యకు వెళ్తుంటే, ఎన్ని ఐఐటి సీట్లున్నాయి, ఎంత నిష్పత్తి అన్న లెక్కయినా లేకుండా... పిల్లల్ని ఎట్లయినా నెట్టాలని చూడటమే వింత. వారి అభిరుచి–ఆసక్తిని ఏ మాత్రం లెక్క చేయకుండా ఐఏఎస్–ఐపీఎస్ చేయాల నుకునే ఆశలేమిటో అంతుబట్టదు. వీరి వేలం వెర్రితత్వాన్ని చూసి ఇంటర్, పదో తరగతి, ఆరో తరగతి... ఇలా కిందకు వస్తూ, వస్తూ చివరకు ఒకటో తరగతి నుంచే ఐఐటీ శిక్షణ అని విద్యావ్యాపార సంస్థలు వారికి వలపన్నే దాకా వచ్చింది. ఫలితంగా ఐఐటీ, ఒలంపియాడ్, టెక్నో, కాన్సెప్ట్, ఈ– టెక్నో, ఈ–శాస్త్ర, కాన్వెంట్, పబ్లిక్‌స్కూల్, ఇంటర్నేషనల్... ఇలా ఎన్ని పేర్లో! ఎంతెంత ఫీజులో! అంతే లేదు. అక్కడ దరఖాస్తు ఫారమ్ నుంచి పుస్తకాలు, బెల్ట్, డ్రెస్, తిండి, రవాణా... సర్టిఫికేట్ల వరకు ప్రతిదీ వ్యాపారమే! బడుల నుంచి కాలేజీల దాకా.... విద్యా కుసుమాలు అసాధారణ ఒత్తిళ్లలో వాడిపోతున్న విపరీతం అన్ని స్థాయిల్లోనూ ఉంది. ఈ జాఢ్యం పాఠశాలల నుంచి కాలేజీల దాకా పాకింది. కార్పొరేట్ విద్యాసంస్థల ప్రమేయం పుణ్యమా అని ప్రత్యక్ష–పరోక్ష కారణా లతో ప్రభుత్వ పాఠశాలల్లో, కాలేజీల్లో చదువులు సన్నగిల్లాయి. ఏడు, ఎనిమిది తరగతులకొచ్చాక కూడా సరిగా తెలుగు చదవలేని, రాయలేని, గుణింతాలు–భాగహారాలు చేయలేని ‘ప్రమాణాలు’న్నాయి. సర్కారు విప రీత నిర్లక్ష్యం వాటిని కునారిల్లేలా చేసింది. సర్కారు బడులపై విరక్తి చెంది, అప్పో సొప్పో చేసయినా ప్రైవేటులో చదివించాలని సామాన్యులు కూడా తపన చెందే బలీయ వాతావరణం తీసుకొచ్చారు. తెలంగాణలో 14,250 పై చిలుకు ప్రైవేటు బడుల్లో 29.66 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, ఇతర పట్టణ ప్రాంతాల్లోని దాదాపు 9వేల పాఠశాలల్లోనే సుమారు 20 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 13,513 ప్రయివేటు పాఠశాలల్లో 27.85 లక్షల విద్యార్థులు న్నారు. అక్కడ కూడా మెజారిటీ పాఠశాలలు విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుపతి తదితర పట్టణ ప్రాంతాలతో పాటు జిల్లా కేంద్రాల్లో కేంద్రీ కృతమై ఉన్నాయి. భారీ ఫీజులే తప్ప విద్యా ప్రమాణాలు ఎక్కడా గొప్పగా లేవు. ఇక క్రీడలు, సైన్స్ ల్యాబులు, గ్రంథాలయాలు, ఇతరేతర సదుపా యాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అనుమతి లేకున్నా చాలా చోట్ల హాస్టల్స్ నడుపుతున్నారు. వాటి నిర్వహణ నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి, కార్పొరేట్ విద్యాసంస్థలు తమ ఇష్టానుసారం వాటిని నడుపుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలన్నీ గాలికిపోతాయి. ప్రవేశాలు, ఫీజులు, సిలబస్, సెలవులు, వసతులు... ఇలా అన్ని విషయాల్లో ప్రభుత్వం ఎప్పటి కప్పుడిచ్చే ఏ ఉత్తర్వుల్నీ వారు పాటించరు. ఇక ఇంటర్ కాలేజీ విద్య విష యంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రెండే విద్యా సంస్థలది ఇష్టారాజ్యం. ప్రభుత్వ విధానాలనే తమకనుకూలంగా వారు ప్రభావితం చేస్తారు. కదిలించే ఆత్మహత్యలు... కంటి తుడుపు విచారణలు అశాస్త్రీయమైన బట్టీ విద్యావిధానంలో నెట్టుకురాలేని విద్యార్థులంతా నలిగి పోతున్నారు. సృజనని హతమార్చి పెట్టే వింత టార్గెట్లతో వారిని పగలూ రాత్రీ రుద్దుతూనే ఉంటారు. హేతుబద్ధంకాని మార్కుల తూనికలు– కొలత లతో, ఒకరితో ఒకర్ని పోల్చి వేధిస్తుంటారు. ఇదంతా ఒత్తిడే! ప్రతిభగల విద్యార్థులు కూడా ఈ వైఫల్యాల్ని జీర్ణించుకోలేక అవమానంగా భావిస్తుం టారు. చిన్న విషయాల్నీ భూతద్దంలో చూస్తున్నారు. విపరీత నిర్ణయాలకు తెగిస్తున్నారు. దీనికి తోడు తల్లిదండ్రుల ఆశల్ని నెరవేర్చలేకపోతున్నామన్న భావన వారిని మరింత వేదనకు గురిచేస్తోంది. నియంత్రణ లేని వ్యవస్థలో ర్యాగింగ్ భూతమొకటి! బంగారు భవిష్యత్తును పణంగా పెట్టి చిన్న వయ సులో బలవన్మరణాలకు సాహసిస్తున్నారు. గత రెండున్నరేళ్లలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో యాభై మందికి పైగా విద్యార్థులు ఇలా అర్ధంతరంగా తనువు చాలించారు. ఎంత మంది చనిపోతున్నా ప్రభుత్వాలకు పట్టదు. కార్పొరేట్ సంస్థలపై కేసుల్లేవు. లోగడ చాలా విచారణ కమిటీలు వేసినా, కొన్ని కమిటీలు నిర్దిష్టమైన సిఫారసులు చేసినా అవి అమలుకు నోచుకోలేదు. కాలేజీ విద్యార్థుల బలవన్మరణాలపై ఇంటర్‌బోర్డు మాజీ కార్యదర్శి డి.చక్ర పాణి, మాజీ వీసీ రత్నకుమారిల నేతృత్వంలో ఒక కమిటీని ఏపీ ప్రభుత్వం నియమించింది. అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఇలాగే నియమించిన ప్రొఫెసర్ నీరదారెడ్డి కమిటీ లోతైన పరిశీలనతో విలువైన సూచనలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలు హాస్టళ్లు నిర్వహిస్తున్నాయని, అవి జైళ్లకన్నా ఘోరంగా ఉన్నాయని, ఫలితంగా ఒత్తిళ్లకు గురవుతున్న విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తేల్చింది. ఈ నివేదికను అధ్యయనం చేసిన ఓ త్రిసభ్య కమిటీ వారి సిఫార సుల్ని య«థాతథంగా అమలు చేయాలని చెప్పినా సర్కారు మొదట పట్టిం చుకోలేదు. పౌరసమాజం ఒత్తిళ్లకు లొంగి ఉత్తర్వులిచ్చినా... వాటి అమలును కార్పొరేట్ విద్యా సంస్థలు నీరుగార్చాయి. ఆదివారాలు పరీక్షలుండొద్దని, సాయంత్రం 4 తర్వాత స్వేచ్ఛగా తిరగనివ్వాలని, స్టడీ సమయాలు రోజూ 9 గంటలు మించొద్దని, ప్రతికాలేజీలో ఫిజికల్ డైరెక్టర్లను, సైక్రియాట్రిస్టుల్ని విధిగా నియమించాలని, జీవన నైపుణ్యాలపైన, నైతిక వర్తనపైన ప్రత్యేక తరగతులుండాలని, పేరెంట్స్‌తో కూడిన కమిటీలు–తరచూ సమావేశాలూ ఉండాలని ఇచ్చిన ఆదేశాలు అమలు కావట్లేదు. ఏ సమస్యకూ చావు పరిష్కారం కాదు విద్యాసంస్థ ఏదైనా తమ విద్యార్థుల్లో ధైర్యం నూరిపోయాలి. చావు దేనికీ పరిష్కారం కాదని ఒంటబట్టేలా చెప్పాలి. భారత్‌లో ప్రతి లక్ష మందికి 58 మంది విద్యార్థులు బలవన్మరణాల పాలవుతుంటే, 148 మంది విద్యార్థినులు ఆత్మహత్యలకు గురవుతున్నట్టు ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇది ప్రపంచ సగటు (14.5/లక్ష) కన్నా ఎక్కువ కాగా, బ్రిటన్ సగటు (2.1/లక్ష) కన్నా చాలా ఎక్కువ. భారత అమ్మాయిల్లో పరీక్షలకు సంబంధించిన గెలుపు ఒత్తిళ్లు ఎంతో అధికం. తల్లిదండ్రుల ఆశలకి–వ్యయానికి న్యాయం చేయలేక పోతు న్నామన్న బెంగా వారిలోనే ఎక్కువ. పరీక్షల్లో విఫలమైతే పెళ్లి తప్ప తమ కుండే ప్రత్యామ్నాయాలు తక్కువనే భావన అమ్మాయిల్లో ఈ అధిక ఒత్తిళ్లకు కారణం అయి ఉండవచ్చని చాలా కాలం కింద పీటర్ ఫోస్టర్ (టెలిగ్రాఫ్– బ్రిటన్) రాశారు. భారత ఉజ్జ్వల భవిష్యత్తును నిర్మించాల్సిన యువతను ఎవ రైనా కోరేదొక్కటే! ఆత్మహత్యలు బలవన్మరణాలు సరికాదు. అరుణోదయ తరపున వేదికలపై మార్మోగే విమలక్క పాట స్ఫురణకు వస్తోంది. ‘‘ఎందుకు కాలిపోతవు? నువెందుకు రాలి పోతవు? కాలకురా, రాలకురా... మాడి బూడిద కాకురా!....’’ (వ్యాసకర్త : దిలీప్ రెడ్డి ఈమెయిల్: dileepreddy@sakshi.com ) -
మూలాలు నరికితేనే మేలైన ఫలాలు
సమకాలీనం నల్లసంపద ఏ దేశానికైనా ప్రమాదకారే. అయితే, శస్త్ర చికిత్స అవసరమైన చోట లేపనాలతో ఫలితాలుండవు. నల్ల సంపద మూలాలను అరికట్టే పాలన, రాజకీయ సంస్కరణలు, నియంత్రించే ఆర్థిక సంస్కరణలు కావాలి. బినామీ ఆస్తులు, బం గారపు నిల్వలు, ఎగుమ తులు, దిగుమతులు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, షేర్లు, విదేశీ మారక ద్రవ్యం, విదేశీ బ్యాంకు ఖాతాల రూపేణా సాగే ఏ అక్రమ లావాదేవీలనూ వదలరాదు. నోట్ల రద్దు ప్రయోజనాల ఫలాలు సామాన్యులకు అం దకపోతే వారి త్యాగాలకు అర్థముండదు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని నల్ల సంపదకు వ్యతిరేకంగా ప్రకటించిన యుద్ధంలోని యాౖభై రోజుల తొలి అంకం విఫలమైందా? సఫలమైందా? ఈ ప్రశ్న ఇప్పుడు దేశమంతా సంచారం చేస్తోంది. రెండు వర్గాలుగా నిలువునా చీలిన ఆర్థికవేత్తలతో సహా... చాలా మందికి చాలా అభిప్రాయాలున్నాయి. తదనుగుణంగానే వారంతా విభిన్నంగా స్పందిస్తున్నారు. గొప్ప ఆరంభమని కొందరంటున్నారు. కాగా అంచనా గల్లంతయిందనీ, కొత్త ఏటి వేకువ ముందరి సాయం సంధ్యలో జాతినుద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగం తుçస్సు మనడమే ఇందుకు నిదర్శనమని ఇంకొందరంటున్నారు. రూ.3 లక్షల కోట్ల నుంచి 5 లక్షల కోట్ల వరకు బ్యాంకులకు రాకుండా మిగిలి మురిగిపోతుం దనుకున్న నల్లధనం నలభై, యాభై వేల కోట్లకు మించేలా లేదు. ఇక రద్ద యిన రూ.15.4 లక్షల కోట్లకు గాను బ్యాంకులకు చేరిన 97 శాతం పెద్ద నోట్లలో నలుపెంత? తెలుపెంత? తేలాల్సి ఉంది. ఇంతలో ఐదు రాష్ట్రాల ఎ న్నికలకు నగారా మోగింది. నోట్ల రద్దు అంశాన్నే ఎజెండా చేస్తామని వైరి వర్గాలు కత్తులు నూరుతున్నాయి. ఇది, ఈ ఎన్నికల్లో సానుకూల ఫలితాలనా శించి పాలకులు వేసిన స్వల్ప కాలిక ఎత్తుగడా? సుదీర్ఘంగా ఈ దేశాన్ని ఏలాలని ప న్నిన దీర్ఘకాలిక వ్యూహమా? తదుపరి చర్యల్ని బట్టే అది తేల నుంది. అనుబంధ చర్యలు ఎప్పుడు, ఎలా కొనసాగుతాయనేదాన్ని బట్టి నల్ల సంపదపై యుద్ధ విజయం ఆధారపడనుంది. చిత్తశుద్ధితో రాజకీయ, పాలనా సంస్కరణల్ని చేపట్టి అమలు పరచకుంటే ఈ యుద్ధం, ఆశించిన ఫలితమి వ్వకపోగా బెడిసికొట్టే ప్రమాదముందని ప్రపంచ ఆర్థిక నిపుణులు హెచ్చరి స్తున్నారు. ఆదాయ పన్ను విధింపు పరిధిని విస్తరించి, పన్ను రేటు తగ్గించా లని ఆర్థిక మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. రాజకీయాల్నీ శుద్ధిచేస్తున్నట్టు కనిపించాలని... ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచార వ్యయాన్ని ప్రజాధనం నుంచి వెచ్చించాలనే ఆలోచనలు సాగుతున్నాయి. అంతకు ముందే, రాజకీయ పార్టీల విరాళాలు, నిధుల నిర్వహణలో పారదర్శకతను తీసుకురావాలి. అక్ర మార్జనను అరికట్టకుండా, చిత్తశుద్ధితో సంస్కరణలు అమలు చేయకుండా పై చర్యలు ఏవి చేపట్టినా నష్టదాయకమే! ప్రజల పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టవుతుంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మంచిదే అయినా ముందస్తు ప్రణాళిక లోపించినా, అమలు గతి తప్పినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అదే జరిగింది. దీనివల్ల ఆర్థిక సత్ప్రవర్తనతో దేశం మంచి కోసం కష్టనష్టాలన్నీ భరిస్తున్న సగటు పౌరులు భంగపోతారు. వారి ఓపికను ఇంకా పరీక్షిస్తే పాలకులు తగిన మూల్యం చెల్లించక తప్పదు. జమిలి సంస్కరణలే శరణ్యం ఈ వారంలో జరిగిన రెండు ముఖ్య పరిణామాలు రాజకీయ సంస్కరణలకు వాకిళ్లు తెరిచే చర్చకు తెర లేపాయి. మతం, వర్గం, కులం, ప్రాంతం, భాష వంటి వాటిని ఎన్నికల్లో లబ్ధి కోసం వాడుకోవడమూ అవినీతే అని సుప్రీం కోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఈ దిశలో ముందడుగు. ఏడుగురు న్యాయ మూర్తుల ధర్మాసనంలో వ్యక్తమైన (4:3) భిన్నాభిప్రాయాల సారం ఓ కొత్త కోణాన్ని అవిష్కరించింది. మతం, కులం ప్రాతిపదికన ఓట్లు కోరే అభ్య ర్థులతో, వారి ప్రతి నిధులతో, ఓట్లు వేసే వారిని సరిచూడలేమనే మైనారిటీ అభిప్రాయానికి మద్దతు లభిస్తోంది. రకరకాల చారిత్రక కారణాల వల్ల అణచి వేతకు గురైన వారికి రాజ్యాంగం కల్పించిన భద్రతల వల్ల సమాజంలోని కొన్ని వర్గాలు ఆయా అస్థిత్వాలతో ఉం టూ, గుర్తింపును కోరుకుకుంటాయనే వాస్తవిక అంశాన్ని విస్మరింపజాలమని వారి అభిప్రాయం. ఎన్నికల ప్రచార వ్యయంలో రూ. 20 వేలకు మించిన ప్రతి ఖర్చునూ అభ్యర్థులు చెక్కులు, ఇతర బ్యాంకు సాధనాల ద్వారా మాత్రమే జరపాలని, అలాగే లెక్క చూపా లని కేంద్ర ఎన్నికల సంఘం కొత్త షరతు విధించింది. ఈ తాజా నిబంధన సవ్యంగా అమలయితే వ్యయ పరిమితి ఖాయమే! పాలనా సంస్కరణలకు తోడు రాజకీయ సంస్కరణలు సత్వరం అమల్లోకి వస్తే తప్ప నల్ల సం పదపై పోరు ఓSహేతుబద్ధమైన దారికి, ముగింపునకు రాదు. నల్ల ధనం గుర్తింపు, సంపద వృద్ధి నిరోధక చర్యలు సరే... సమాంతర ఆర్థిక వ్యవస్థగా రూపొంది సమాజాన్ని అస్థిరపరుస్తున్న నల్ల సంపద సృష్టి మూలాల్లోకి వెళ్లే చర్యలు కావాలి. మొత్తం నల్ల సంపదలో 8 శాతం కూడా లేని నల్ల డబ్బును పట్టు కోవడానికి చేసిన ప్రయత్నమే కోట్లాది భారతీయుల్ని దాదాపు రెండు నెల లుగా ముప్పతిప్పలు పెట్టింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఉత్పత్తిరంగం, చిన్న వర్తక, వ్యా పారాలు ఇంకా కోలుకోలేదు. ఇది ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపిందని నివేదకలొస్తున్నాయి. ‘ఇప్పుడున్న వ్యాపార పద్ధతులు, ప్రభుత్వ విధానాల వల్ల తలెత్తే సవాళ్లను అధిగమించకుండా డిజిటల్ ఆర్థిక వ్యవస్థవైపు మళ్లడం వల్ల సత్ఫలితాలుండవు’ అని నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ జీన్ టిరోల్ అంటున్నారు. డిజిటల్ డాటా సురక్షితం కాదనే హెచ్చరికలూ ఉన్నాయి. ‘నోట్ల రద్దుతో భారత ఆర్థిక రంగం కుదేలయింది. ఇది అధికారి కంగా దిగువకు నడపడమే తప్ప మరోటి కాదు’ అని అమెరికా ఆర్థికవేత్త స్టీవ్ హెచ్ హాంకే హెచ్చరించారు. తగు జాగ్రత్తలతో తదుపరి చర్యలకు సమా యత్తం కావాలి. నల్లధనం సృష్టికి కారణమవుతున్న రాజకీయ, అధికార వ్యవస్థ పనితీరులో మార్పులు రావాలి. రాజకీయ పార్టీలకందే విరాళాల వివ రాలు, నిర్వహణ, వ్యయం వ్యవహారాల్లో కచ్చితమైన పారదర్శకత ఉండాలి. రానున్న బడ్జెట్ సమావేశాల్లోనే దానిపై ఒక బిల్లు తేవాలని కేంద్రం యోచి స్తోంది. బడ్జెట్ సమావేశాల ముందు జరిగే అఖిలపక్ష భేటీలోనే ఏకాభిప్రాయ సాధనకు కృషి చేయవచ్చంటున్నారు. పార్టీలకందే రూ. 2 వేల రూపాయల పైబడ్డ విరాళాలన్నీ చెక్కు, డీడీ రూపంలోనే ఉండాలని, వివరాలు వెల్లడిం చాలని నిబంధన తేవాలనుకుంటున్నారు. ఇప్పుడది రూ. 20వేల ుగా ఉంది. ఎంత భారీ విరాళాన్నయినా రూ. 20 వేలు కంటే తక్కువ భాగాలుగా విడగొట్టి లెక్క చూçపడం దాదాపు ప్రధాన పార్టీలన్నీ చేస్తున్నదే. కేంద్ర సమాచార కమి షన్, చివరకు సుప్రీం కోర్టు చెప్పినాగానీ.. తాము సమాచార హక్కు చట్టం పరిధిలోకి రామని రాజకీయ పార్టీలన్నీ మొరాయిస్తున్న తీరే వారి గోప్యతా తత్వానికి నిదర్శనం. ఈ పరిస్థితి మారాలి. పాత సైన్యంతో కొత్త యుద్ధమా? నల్లసంపదపై యుద్ధం ప్రకటించిన ప్రధాని మోదీ నవంబర్ 8న రాత్రికి రాత్రి పెద్దనోట్లను రద్దు చేసినా.. దేశం కోసం ఓపికగా సహించిన కోట్లాది మందికి ఆ తర్వాతి పరిణామాలు రుచించలేదు. చిన్ననోట్లను అందుబా టులోకి తెచ్చి, తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం, పెద్ద పెద్ద ఆసాములెవరూ బ్యాంకులకు రాకుండానే తమ అవసరాలను తేలిగ్గా తీర్చు కోవడం, ముఖ్యంగా ఆర్బీఐ, బ్యాంకుల ద్వారానే భారీగా కొత్త నోట్లు దొడ్డిదారిన అక్రమార్కులకు చేరడం వంటివి వారికి మింగుడుపడలేదు. పాత నోట్లతో కొత్త నోట్లు మార్చుకునే ఓ చక్కటి సదుపాయం కూడా బ్యాంకుల అధికారులు, సిబ్బంది తప్పిదాల వల్లే అర్ధాంతరంగా రద్దయిందన్న కోపం వారికుంది. యాభై రోజుల పైనే బ్యాంకు సిబ్బంది పని వేళలకు మించి పనిచేస్తూ ఎంతో శ్రమించినా... డబ్బు కోసం ఇబ్బందులు పడ్డ పౌరులకు వారిపై సానుభూతి కలుగలేదు. బ్యాంకుల్లో, ఏటీఎంలలో ‘నగదు లేద’నే బోర్డులు రోజుల తరబడి వారిని వెక్కిరించేవి. ఉత్పత్తులు నిలుపుకొని, వ్యాపారాలు ఆపి, పెళ్లిళ్లు రద్దు చేసుకొని, ఉద్యోగ, ఉపాధులు కోల్పోయి... జరుగుబాటుకు చేతిలో డబ్బుల్లేక తాము నానా యాతన పడుతుంటే, పెద్ద వారు నిక్షేపంగా ఉండటం చూస్తే వారికి పుండు మీద కారం చల్లినట్టయింది. అన్నీ భరిస్తూ, దేశానికి ఏదో మేలు జరిగిపోతుందని నిరీక్షిస్తుంటే.. రద్దయిన నోట్లన్నీ బ్యాంకులకు చేరాయని తెలిసి అత్యధికులు నీరుగారి పోయారు. నవంబర్ 8న ఉత్సాహం పెల్లుబికిన ప్రధాని ప్రసంగం, 31 డిసెంబర్ నాటికి చిన్న చిన్న రాయితీల ప్రకటనలతో చప్పగా సాగిన తీరు ప్రజానీకాన్ని నిస్స త్తువకు గురిచేసింది. ఆశించిన ఫలితం దక్కనందునే ఆయన యాభై రోజుల ప్రగతి సమీక్షను, యుద్ధం తదుపరి గణాంకాలనుగానీ వెల్లడి చేయలేదేమోన నని అధికులకు అనిపించింది. బ్యాంకుల్లోకి వచ్చిన సొమ్మంతా తెల్లధనం కాదని, ఆదాయపు పన్ను అధికారులు తగిన నోటీసు లిచ్చి, నలుపు, తెలు పుల లెక్క తేలుస్తారని ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటించారు. దేశంలోని మొత్తం బ్యాంకు ఖాతాలు సుమారు 55 కోట్లు కాగా, 60 లక్షల ఖాతాల్లోకే రూ. 7 ఏడు లక్షల కోట్లు (సగం డబ్బు) వచ్చి చేరడం విస్మయ కరం. అందులోనూ సగం డబ్బు, అంటే రూ. 3 నుంచి 4 లక్షల కోట్లు వ్యక్తిగత ఖాతాల్లోకే చేరింది. ఆదాయపు పన్ను శాఖ వీటి రంగు తేల్చాల్సి ఉంది. సిబ్బంది కొరత పెద్ద అవరోధంగా ఉంది. పైగా మన దేశంలో నిబంధనలను పాటించడం కన్నా నియంత్రణ వ్యవస్థల్ని లంచాలతో మేపడం చౌక అనే అభిప్రాయముంది. ఐటీ చట్టంలోని సందేహాస్పద అం శాలను, సంశయ లాభాలను సానుకూ లంగా మలచుకొని ఇబ్బడిముబ్బడిగా సొమ్ముచేసుకునే ఐటీ అధికారుల కథలు విన్నాం. ఇప్పుడూ అదే జరిగితే!? అందుకే, రాజకీయ సంస్కరణలతో పాటు పాలనా సంస్కరణలూ రావాలనే వాదన బలపడుతోంది. వ్రతం చెడ్డా ఫలితం దక్కాలి నల్లసంపద ఏ దేశానికైనా ప్రమాదకారే. సమాజంలో అశాంతిని రేపుతున్న ఆర్థిక అంతరాల వృద్ధికి అది ప్రధాన కారణం. అయితే, శస్త్ర చికిత్స అవస రమైన చోట లేపనాలతో ఫలితాలుండవు. నల్ల సంపద సృష్టి జరిగే మూలా లను వదిలి కేవlలం చలామణిలోని ద్రవ్యాన్ని తగ్గిస్తే ఫలితం ఉండదని ఆర్థిక నిపుణులు అభిజిత్ సేన్ అన్నారు. నల్ల సంపదకు హేతువవుతున్న మూలా లను అరికట్టే పాలన, రాజకీయ సంస్కరణలతో పాటు ఎప్పటికప్పుడు నియంత్రించే ఆర్థిక సంస్కరణల అమలూ పకడ్బందీగా జరగాలి. ప్రధాని ఇదివరకే ప్రకటించినట్టు బినామీ ఆస్తుల నిర్వహణపైన, బంగారపు నిల్వల పైన నిఘా వేయాలి. ఎగుమతులు, దిగుమతులు, రియల్ ఎస్టేట్ వ్యవహా రాలు, షేర్లు, ఈక్విటీ పార్టిసిపేషన్స్, విదేశీ మారక ద్రవl్యం, విదేశీ బ్యాంకు ఖాతాల్లో మన వారి గుప్త నిల్వలపై శాస్త్రీయ పరిశీలన అవసరం. చట్ట నిబం ధనలకు వ్యతిరేకంగా ఏదీ జరక్కుండా చూసే వ్యవస్థల్ని బలో పేతం చేయాలి. రాజకీయాలకు అతీతంగా ఈ చర్యలన్నింటినీ వ్యవస్థాగతం చేయాలి. ప్రత్యక్షంగా, పరోక్షంగా దేశ ప్రజలందరినీ నొప్పించిన నోట్ల రద్దు ప్రక్రియతో జరిగిన ప్రయోజనాల ఫలాల్ని సామాన్యులకందించాలి. ‘ఈ దెబ్బతో మిగులు రాబడిగా కనీసం రూ. 50 వేల కోట్లయినా ప్రభుత్వానికి రాకుంటే ఈ ప్రయాసంతా వృ«థా’ అన్న ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు వ్యాఖ్యలు అక్షర సత్యాలు. ఈ క్రతువుతో నల్ల ధన లావాదేవీలు తగ్గుతాయి. పన్ను పరిధి విస్తరిస్తుంది. ఆర్థిక పారదర్శకత మెరుగయినట్టే! దానికి తోడు, పెద్ద మొత్తంలో డబ్బు బ్యాంకులకు వచ్చి చేరింది. ముంచే కార్పొరేట్లకు ఊడిగం మానాలి. ప్రధాని అన్నట్టు సామాన్యులు, మధ్య తర గతి జీవులు, ముఖ్యంగా వ్యవసాయదారులపట్ల బ్యాంకులు మరింత ఉదా రంగా ఉండి రుణ సదుపాయం కల్పించి ఆర్థిక వృద్ధికి దోహదపడాలి. ఇవన్నీ జరిగితే గాని సగటు మనిషి త్యాగాలకు అర్థముండదు. దిలీప్ రెడ్డి ఈ మెయిల్ : dileepreddy@sakshi.com -
పరిహారం పేరిట హక్కుల హననం
సమకాలీనం ఉమ్మడి జాబితాలోని ఒక అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ చట్టాలు చేసు కోవచ్చు. అలా చేసిన రెండు చట్టాల్లో పరస్పర వైరుధ్యాలుంటే, అంతిమంగా ఏది వర్తి స్తుందో కూడా 254 లోని 1, 2 క్లాజుల్లో వివరించింది రాజ్యాంగం. పార్లమెంటు చేసిన చట్టంలోని ఏదైనా అంశంలో ఆమోదయోగ్యం కాని భిన్నమైన అంశం రాష్ట్ర శాసనసభ చేసిన చట్టంలో ఉంటే, పార్లమెంటు చేసిందే చెల్లుబాటవుతుందని, రాష్ట్ర శాసనసభ చేసింది చెల్లదని ఒకటో క్లాజులో పేర్కొంది. రెండో క్లాజులో అసెంబ్లీలకూ వెసులుబాటు ఇచ్చింది. ప్రభుత్వాల పనితీరుని పట్టిచ్చేవి మాటలా? చేతలా? మాటలు అరచేత స్వర్గాన్ని చూపుతూ, చేతలు ప్రజాప్రయోజనాలకు సమాధి కడుతున్నపుడు ప్రజాస్వామ్యవాదులు చేతన పొంది ప్రజల్ని ఆ మేరకు చైతన్యపరచాల్సిందే! ప్రజాప్రయోజనాల పేరు చెప్పి ప్రభుత్వాలు ఏకపక్షంగా జరిపే భూసేకరణో, మరోటో... ప్రజల జీవించే హక్కునే హరిస్తున్నపుడు గొంతెత్తడం, నిలదీ యడం పౌరసమాజపు కర్తవ్యం. రక్షణ కల్పించాల్సిన చట్టాల్ని పాలకులు అసలు రూపొందించేప్పుడే ప్రజల ప్రజాస్వామిక హక్కుల్ని, సామాజిక న్యాయాన్ని కొల్లగొట్టేలా ఉంటే అడ్డుకోవడం విపక్ష పార్టీల విధి. రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి ఇవన్నీ జరగేలా చూస్తూ, ఏ ఉల్లంఘననీ ఉపేక్షించకుండా తగు తీర్పులివ్వడం న్యాయస్థానాల విహిత బాధ్యత. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాల భూదాహం చట్టాలనే చట్టుబండలు చేసేలా తయార యింది. కడకు ప్రజాస్వామ్య స్ఫూర్తినే భంగపరుస్తోంది. రాష్ట్రపతి విచక్షణాదికారాల్నే చిన్నబుచ్చేందుకూ వెనుకాడని స్థితికి చేరుకుంది. 120 యేళ్ల సుదీర్ఘ కాలాయాపన తర్వాత, పలు పౌర ఉద్యమాల ఫలితంగా రెండున్నరేళ్ల కింద కేంద్రం తెచ్చిన 2013 భూసేకరణ చట్టం స్ఫూర్తికే గండికొడుతున్నాయి. అపరిమితమైన భూసేకరణ–సమీకరణల పేరిట ఈ ప్రభుత్వాలు చేస్తున్న పన్నాగాలు, మున్ముందు అడ్డుపడే వారే లేకుండా దారి సుగమం చేసుకుం టున్న ఎత్తుగడలు ఆలోచనాపరులకే విస్మయం కలిగిస్తున్నాయి. తరాల తర బడి కాసింత భూమితో జీవితాలు పెనవేసుకున్న సామాన్యుల్ని తీరని అశాం తికి గురిచేస్తున్నాయి. నిర్వచనం లేని అభివృద్ధి సాకుతో, ప్రాజెక్టుల పేరిట భూములు లాక్కొని కార్పొరేట్లకు ధారాదత్తం చేసే కుటిల సన్నాహాలు పతాక స్థాయికి చేరుతున్నాయి. కేంద్రంలో, రాష్ట్రాల్లో ఉన్న సర్కార్ల అపవిత్ర సాన్ని హిత్యం ఇందుకు దోహదం చేస్తోందని తాజా పరిణామాలు చెబుతున్నాయి. రహదారి నచ్చక అడ్డదారులా? మల్లన్నసాగర్ భూసేకరణకు జీవో 123 విడుదల చేయడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. భూసేకరణ చట్టం–2013 ఉండగా దాన్ని కాదని జీవో 123 ఎందుకు అన్నది కోర్టు సహేతుకమైన ప్రశ్న. ఆ చట్టాన్ని కాదని ఏం చేయా లన్నా ఇంకో (సొంత) చట్టం ఉంటే సరి అన్నది రాష్ట్ర ప్రభుత్వానికి కనిపిం చిన ప్రత్యామ్నాయం. పైగా ఇదివరకే కొన్ని రాష్ట్రాలు అలా చేసి ఉండటం వారికి ఊతమిచ్చింది. ఈ అంశంపై మన హైకోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. మరి, ఇలా దారి వెతుక్కున్నవాళ్లకి తీరా బిల్లు వచ్చేనాటికెందుకంత గందరగోళం! 2013 చట్టంలోని సెక్షన్ 107 ప్రకారం అని ఒకసారి, కాదు కాదు రాజ్యాంగం 298 అధికరణం ప్రకారం మేం భూసమీకరణ చేయవచ్చని మరోసారి, అలా కాదు కేంద్ర చట్టానికి రాష్ట్రం సవరణలు చేసే అధికారం రాజ్యాంగంలోని 254వ అధికరణం ద్వారా సంక్రమించిందని ఇంకోసారి– ఇలా తత్తరపాటు ప్రదర్శించింది. తీరా చూస్తే, ఇది కేంద్ర చట్టానికి సవరణ కాదు, అందులో పేర్కొన్న కొన్ని అంశాల్ని సవరిస్తూ రాష్ట్రం సొంతంగా తెచ్చే చట్టం తాలూకు కొత్త బిల్లు అని వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కానే కాదు, సవరణే అనీ అంది. నిజానికి భూసేకరణ చట్టం–2013 లోని సెక్షన్ 107 ఏం చెబుతుంది? నిర్వాసితులకు ఈ చట్టంలో కల్పించిన దానికన్నా మరింత మేలు చేసేలా పరిహారం, పునరావాసం, పునఃపరిష్కారం కల్పించే విధంగా రాష్ట్రాలు ఎక్కడికక్కడ చట్టం తెచ్చుకోవడానికి ఇదేం అడ్డంకి కాదని మాత్రమే పేర్కొంది. అలాంటి సందర్భాల్లో నిర్వాసితులు తమకు ఏది మేలయితే అది కోరుకునే వెసలుబాటును సెక్షన్ 108లో కల్పించారు. ఇక రాజ్యాంగం 254 అధికరణానికి చెప్పిందీ తప్పుడు భాష్యమే! ఉమ్మడి జాబితాలోని ఒక అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ చట్టాలు చేసుకోవచ్చు. అలా చేసిన రెండు చట్టాల్లో పరస్పర వైరుధ్యాలుంటే, అంతిమంగా ఏది వర్తిస్తుందో కూడా 254లోని 1, 2 క్లాజుల్లో వివరించింది రాజ్యాంగం. పార్లమెంటు చేసిన చట్టంలోని ఏదైనా అంశంలో ఆమోదయోగ్యం కాని భిన్నమైన అంశం రాష్ట్ర శాసనసభ చేసిన చట్టంలో ఉంటే, పార్లమెంటు చేసిందే చెల్లుబాటవుతుందని, రాష్ట్ర శాసనసభ చేసింది చెల్లదని ఒకటో క్లాజులో పేర్కొంది. అయితే, ఇది రెండో క్లాజ్‌కు లోబడి ఉంటుందంటూ... రెండో క్లాజులో మరింత వివరణ ఇచ్చింది. పార్లమెంటు ముందే చేసిన చట్టంలోని ఏదైనా అంశానికి భిన్నంగా, ఆమోదయోగ్యం కాని ప్రతిపాదన శాసనసభ తదుపరి చేసిన చట్టంలో ఉండి, దానికి రాష్ట్రపతి ఆమోదం ఉంటే, ఆ రాష్ట్రం వరకు అదే చెల్లుబాటవుతుందని చెబుతోంది. కానీ, అలా రాష్ట్రం చేసిన చట్టభాగాన్ని సవరించడమో, తొలగిం చడమో చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుందనీ స్పష్టం చేసింది. స్ఫూర్తి ఒకలా, ఆలోచన మరోలా... కేంద్ర ప్రభుత్వం చేసిన భూసేకరణ (2013) చట్ట స్ఫూర్తి అలా ఉంటే, ఈ చట్టానికి తూట్లు పొడిచే ప్రయత్నం ఎన్డీయే ప్రభుత్వం ఆరంభం నుంచీ చేపట్టింది. రెండుసార్లు ఆర్డినెన్స్ తీసుకువచ్చేందుకు చేసిన యత్నాలు ఫలిం చలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ చట్టం స్ఫూర్తికి గండికొట్టి భూసమీ కరణ పేరుతో విడిగా చట్టం తెచ్చుకొని రైతులు, పేదల నుంచి అపరిమితంగా భూముల్ని లాక్కోవడం వివాదాస్పదమైంది. 2013 చట్టంలో పలు ప్రజా ప్రయోజనకర ప్రతిపాదనలుండటం ప్రభుత్వాలకు మింగుడుపడటం లేదు. ప్రభుత్వ పథకాలకు గానీ, ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టే పను లకు గానీ సర్కార్లు భూసేకరణ చేస్తున్నపుడు నిర్వాసితులకు ఇచ్చే పరిహారం, పునరావాసం, పునఃపరిష్కారం విషయంలో మంచి ప్రతిపాదనలు ఈ చట్టంలో ఉన్నాయి. అలా భూసేకరణ జరిపేటప్పుడు తలెత్తే సామాజిక ప్రభా వాల అంచనా, పర్యావరణ ప్రభావాల అంచనా ఎలా జరగాలో నిర్దేశించింది కూడా. ప్రభావితులయ్యే వారిలో 70, 80 శాతం మంది ఆమోదం అవసర మని పేర్కొంది. సేకరణకు గ్రామసభ ఆమోదం తప్పనిసరి చేసింది. భూమి కోల్పోయిన వారే కాకుండా, సదరు భూమిలో జరిగే కార్యక్రమాల వల్ల ప్రత్యక్షంగా–పరోక్షంగా ఉపాధి పొందుతున్న భూమిలేని వారి ప్రయోజ నాల్నీ పరిరక్షించాలనే అంశం ఉంది. ఆహారోత్పత్తికి దోహదపడే, యేటా రెండు అంతకన్నా ఎక్కువ పంటలు పండే సాగుభూముల జోలికి వెళ్లొద్దనీ చెబుతోంది. ప్రతి దశలో ఆయా ప్రక్రియలకు కనీస నిర్దిష్ట కాలపరిమితిని ఈ చట్టం పేర్కొంది. ఆ స్ఫూర్తికి భంగం కలిగించే విధంగా మినహాయింపుల్ని వర్తింపజేయడం, కొన్ని మినహాయింపుల్లో అదనపు అంశాల చేర్పులు, మార్పులు ప్రస్తుత బిల్లులో తెలంగాణ ప్రభుత్వం పొందుపరిచింది. వీటి పట్ల విపక్షాలకు, పౌర సంఘాలకు అభ్యంతరాలున్నాయి. 2013 చట్టం స్ఫూర్తికి గండికొట్టే ప్రతిపాదనలూ ఉన్నాయి. 254 అధికరణాన్నే ఉటంకిస్తూ రేపు ఎవరైనా కోర్టులకు వెళితే ఇవి నిలబడడం కష్టమేనని నిపుణుల అభిప్రాయం. ఇదే బాటలో సాగుతున్న ఏపీ ఇప్పటివరకు భూసమీకరణ పేరుతో వ్యవహారం నడుపుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ సొంతంగా ఒక భూసేకరణ చట్టం తీసుకురావాలని యోచి స్తోంది. పేరున్న ఒక న్యాయ విశ్వవిద్యాలయం వారికి ముసాయిదా బిల్లు రూపొందించే బాధ్యత అప్పగించింది. సదరు ప్రతిపాదనల్ని పరిశీలించిన ఆ రాష్ట్ర న్యాయ విభాగం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అది న్యాయ స్థానంలో నిలువదనుకుంటే, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నెలకొల్పిన బాటలోనే సవరణలకు సంసిద్ధం కావాలనే యోచన ఆ ప్రభుత్వానికీ ఉంది. రాజధాని కోసం 34 వేల ఎకరాల భూసమీకరణ చేసి రికార్డు సృష్టించిన ప్రభుత్వం ఇప్పుడు పారిశ్రామికీకరణ పేరుతో పది లక్షల ఎకరాల ‘ల్యాండ్ బ్యాంకు’ ఏర్పాటుకు కుతూహలంతో ఉంది. ఇప్పటికే చర్యలు చేపట్టింది. విశాఖ సమీపంలోనే మరో అంతర్జాతీయ విమానాశ్రయమంటూ భోగాపు రంలో, మచిలీపట్నం ప్రాంత అభివృద్ధి సంస్థ (మాడా) పేరుతో పెద్ద మొత్తంలో భూసమీకరణకు దిగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో దివీస్ కోసం 500 ఎకరాలు కేటాయిస్తూ ఏకంగా జీవో ఇవ్వడం, ఇలా భూదందా లకు చేస్తున్న యత్నాలకు తీవ్ర ప్రజాప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తోంది. అయినా విడువకుండా ప్రకటనలు, మారు ప్రకటనలు జారీ చేస్తూ ప్రశాంత ప్రజా జీవనంలో అల్లకల్లోలం రేపుతోంది. 43, 204 ఎకరాల భూమి ఏపీఐ ఐసీ ల్యాండ్ బ్యాంకు అ«ధీనంలో సిద్ధంగా ఉన్నట్టు, మరో 1,15,971 ఎక రాలు సమీకరించడానికి సిద్ధంగా ఉన్నట్టు ఇటీవల జరిగిన కలెక్టర్ల సమా వేశంలో పంపిణి చేసిన ఓ అధికారిక పత్రం వెల్లడిస్తోంది. భూసేకరణ వీలవ కుంటే, నాలుగు, ఆరు లేన్ల రహదారుల నిర్మాణానికీ భూసమీకరణే జరపం డని అధినేత ఇచ్చిన పురమాయింపు అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. తగని తెంపరితనం రాజ్యాంగ స్ఫూర్తికి గండి కొట్టడమే కాకుండా, రాష్ట్రపతి స్వీయ విచక్షణా ధికారాలనే చిన్నబుచ్చే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని సమక్షంలో రాష్ట్రాధినేతలతో జరిగిన ‘నీతి ఆయోగ్’ సమావేశంలో ఈ అంశాలు లోగడ ప్రస్తావనకు వచ్చి, రాష్ట్రాలు తమ అవసరాల మేరకు చట్ట సవరణ చేసుకునే ప్రతిపాదనను చర్చించినట్టు చెబుతున్నారు. ‘మా ప్రయ త్నాలు మేం చేశాం, సాధ్యపడలేదు. మీరు రాష్ట్రాల్లో చట్టసవరణ చేసుకోండి, కేంద్రం అభ్యంతర పెట్టదు’అని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ అప్పట్లో పేర్కొ న్నారు. ఆ మేరకు రాష్ట్రపతి ఆమోదం విషయంలో సహకరిస్తామని ఆయన న్నట్టు వార్తలొచ్చాయి. ఇది నిజమని ధృవీకరిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు స్వయంగా శాసనసభా వేదిక నుంచి చెప్పారు. ప్రధాని సలహా మేరకే తామీ చర్యలు చేపట్టామనీ చెప్పారు. రాష్ట్రాలు విడిగా చట్టం చేసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ పార్లమెంటు చేసిన చట్టాన్ని రాష్ట్ర శాసన సభ సవరించగలదా అన్నది సందేహమే! బిల్లును చట్టరూపంలోకి తెచ్చే టప్పటికి దాన్ని రాష్ట్ర చట్టంగానే తెస్తారేమో చూడాలి. ఏమైనా... నిర్వాసితు లయ్యే వారి విషయంలో 2013 భూసేకరణ చట్టం బాగుందని ప్రజాసం ఘాలు, పౌర సమాజం, న్యాయస్థానాలు పేర్కొంటుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాధినేతలు మాత్రం భిన్నంగా మాట్లాడుతున్నారు. ఈ చట్టంలోని అంశా లది సరైన కూర్పు కాదు, భాష కూడా సవ్యంగా లేదని జైట్లీ అంటే, తాడూ– బొంగరం లేని వాళ్లు రూపొందించిన చట్టమని తెలంగాణ ముఖ్యమంత్రి తప్పుబట్టారు. ఆ చట్టంలో బంగారం, వజ్ర, వైఢూర్యాలేమీ లేవంటూ, తామే పదిరెట్లు పరిహారం చెల్లిస్తామని ఆయనన్నారు. చట్టమంటే ఒక్క పరిహారం మాత్రమేనా? సామాజిక, పర్యావరణ ప్రభావాల అంచనా, రైతు సాగు భూములు వదులుకోవాల్సి వస్తే, భూముల్లేని నిర్వాసితుల పరిస్థితి.... ఇవన్నీ ముఖ్యం కాదా? అని ప్రజాస్వామ్యవాదులంటున్నారు. కేంద్ర (2013) చట్టం స్ఫూర్తికి తూట్లు పొడిచే చర్యలు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, దాంతో రాజకీయ సాన్నిహిత్యం కలిగిన రాష్ట్ర ప్రభుత్వాల ఏలుబడిలో నిరా టంకంగా సాగుతున్నాయి. గుజరాత్, రాజస్తాన్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు ఇప్పటికే ఈ మార్పులకు వాకిళ్లు తెరవగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు వంత పాడుతున్నాయి. ఈ ఉపద్రవాన్ని ఎదుర్కోవడానికి రాజ కీయ పోరాటాలు, ప్రజాందోళనలే దిక్కేమో! (వ్యాసకర్త : దిలీప్ రెడ్డి ఈమెయిల్: dileepreddy@sakshi.com) -
ఆ తూర్పు తలుపు తెరుచుకోనీ!
సమకాలీనం ‘పుస్తకాలు లేకుండా నేను జీవించజాలను’ అంటాడు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన మేధావి థామస్ జెఫర్సన్. ఒకప్పటితో పోల్చి చూస్తే పరిమాణంలో ఇప్పుడు ఎక్కువ పుస్తకాలు వస్తున్నా, అవి సమాజంపై చూపే ప్రభావం అంతంతే! దేశంలో, తెలుగునాట పేరు ప్రతిష్ఠలు గలిగిన కవులు, రచయితలు, స్వాతంత్య్ర సమరయోధులు, సంఘ సంస్కర్తలు, రాజకీయ నాయకులు.. ఇలా అప్పట్లో అందరూ గొప్ప చదువరులు. నేటి తరం ఆంగ్ల భాష మోజుతో తల్లి భాష తెలుగునే ఖాతరు చేయడం లేదు. ‘‘హృదయ వికాసం జరుపకుండా మెదడుకు మాత్రమే అందించే విద్య అసలు విద్యయే కాదు’’ – గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్. మానవేతిహాసంలో పరిణామాన్ని బట్టి వేర్వేరు కాలాల్లో విద్యను పలు విధాలుగా నిర్వచించారు. విద్య రానివాడు వింత పశువన్న భావన మొదలు.. విద్యయే అత్యంత శక్తివంతమైందనే అభిప్రాయం వ్యక్తమైంది. విద్యావృద్ధికి పుస్తకం ఓ గొప్ప ఉపకరణమైంది. భావ వినిమయానికి భాష వృద్ధి చెంది, దానికొక శాశ్వతత్వం కల్పించే క్రమంలో పుస్తకం రూపుదిద్దుకుంది. ఆయా కాలాల్లో వేర్వేరు రూపాల్లో అది విలసిల్లినా... అంతిమంగా పుస్తకమై కాల పరీక్షకు నిలిచింది. ఎదిగే సమాజ నిర్మాణంలో కీలకాంగమైంది. సంజ్ఞలు, శబ్దాలు, మౌఖిక సంభాషణల స్థితి నుంచి లిపి ఆవిర్భ వించింది. ఆపై... లోహాలు–రాళ్లపైన రాతలు, గోడరాతలు, శాసనాలు, తాళపత్ర గ్రంథాలు, కాగితం వరకు అనేక విధాలుగా ఈ ఉపకరణం రూపాంతరం చెందుతూ వచ్చింది. కాగిత పుస్తకం సుదీర్ఘకాలంగా రాజ్యమేలుతోంది. శాస్త్ర సాంకేతికత పెరిగాక ఇప్పుడు ఇంటర్నెట్, ఈ పుస్తకాలుగా దర్శనమిస్తున్నాయి. సమాజ పరిణామ క్రమాన్ని ప్రభావితం చేసిన, చేస్తున్న కవులు, రచయితలు, నేతలు, బోధకులు, శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు.... ఇలా ఎందరెందరికో పుస్తకం ఒక వాహకంగా, వేదికగా మారింది. భావ వ్యాప్తికి బలమైన అస్త్రమైంది. పఠనా సక్తిలో మార్పు, వాటిని బట్టే పుస్తకాలు వెలువరిం చడంలోనూ మార్పులొ చ్చాయి. వివిధ కాలాల్లో, సమాజాల్లో పుస్తకాల ఆదరణ, అనాదరణలో హెచ్చుతగ్గులున్నాయి. మధ్యలో పుస్తకాదరణ కొంత తగ్గినా... ఇటీవల మళ్లీ పుంజుకోవడం ఆశావహమని సామాజిక శాస్త్రవేత్తలంటున్నారు. పరిమాణా త్మకంగా పుస్తకాదరణ పరిస్థితి కొంత మెరుగైనా, ఏ రకం పుస్తకాల వైపు మొగ్గుతున్నారని పరిశీలించినపుడు బాధ కలుగుతుంది. జీవించడం నేర్పే సమాజశాస్త్రాల కన్నా, కవిత–కథ–నవల వంటి సాహితీ సృజనల కన్నా, చరిత్ర–జీవిత గాథలు వంటి స్ఫూర్తి పుస్తకాల కన్నా.. విద్యా–ఉపాధి అవకాశాల్ని మెరుగుపరిచే సిలబస్ పుస్తకాలవైపు మొగ్గు పెరిగింది. కోర్సు– కెరీర్ పుస్తకాలు, పోటీ పరీక్షలకు సంసిద్ధం చేసే పుస్తకాల కొనుగోళ్లు పెరిగి నట్టు విక్రేతలు చెబుతున్నారు. మేధో వికాసపరమైనవే తప్ప హృదయగత మైన వికాసానికి దోహదపడే పుస్తకాలకు ఆదరణ తగ్గిపోయింది. ఇక్కడా మార్కెట్ మాయాజాలమే! ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణ తర్వాత మానవాళి జీవన సరళిలో మార్పు లొచ్చాయి. అందుకు, మౌలిక ఆలోచనా ధోరణిలో మార్పులే కారణం. నూతన ప్రపంచావిష్కరణ క్రమంలో ప్రతిదీ మార్కెట్ శక్తుల ప్రభావాలకు లోనై, అదే దృష్టి కోణంలోనే చూడటం మొదలైంది. సామాజిక రంగాన్ని ఆర్థిక రంగమే శాసిస్తోంది. మన దేశంలోనూ తొంబయ్యో దశకం ఆరంభం నుంచీ ఈ పరిస్థితులు బలపడ్డాయి. తక్షణ ప్రయోజనం ఆశించే తత్వం అల వడ్డ సంస్కృతిలో, పౌరులెవరూ ఒక పరిధి దాటి ఆలోచించలేని స్థితి నెల కొంది. పాలకులు కూడా చరిత్ర వృథా! సాహిత్యం తిండి పెడుతుందా? ఇప్పుడు, ఎప్పటివో జీవిత చరిత్రల సంబద్ధత ఏమిటి? వంటి ప్రశ్నల్ని యువ మెదళ్లలో నాటుతున్నారు. విద్యతో ఉపాధి అవకాశాలు వెతుక్కునే యువ తరంలోనూ అటువంటి భావజాలమే! ఏం చదివి ఎక్కువ మార్కులు సాధిస్తే, పోటీ పరీక్షలు నెగ్గితే, ఏం ఉద్యోగం సంపాదించొచ్చు? ఎంత ఎత్తు ఎదగొచ్చు! ఏం సంపాదించొచ్చు? అన్న ఆలోచన తప్ప మరోటి స్పృహకు రావట్లేదు. ఇతరేతరమైనవి చదవడం సమయం వృథా తప్ప మరోటి కాదనే భావన! ఫలితంగా సమాజం పట్ల అవగాహనే లోపిస్తోంది. విద్యార్థులు, బోధకులు, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు... అందరిదీ అదే ధోరణి. వెరసి, జీవన శైలిలో మంచి చెడుల్ని స్థిమితంగా ఆలోచించలేని వేగం పెరిగింది. అయిదారు వందల ఏళ్ల కిందట భాగవతంలో పోతన ఓ పద్యం రాస్తూ... ‘చదువని వాడజ్ఞుండగు, చదివిన సదసద్ వివేక చతురత గల్గున్, చదువగ వలయును జనులకు...’ అని ప్రహ్లాదుడ్ని బడికి పంపేట ప్పుడు తండ్రి హిరణ్యకశ్యపునితో అనిపిస్తాడు. చదువు అంతిమ లక్ష్యాన్ని అత్యంత సూక్ష్మంగా చెప్పిన నిర్వచనమిది. మంచి–చెడుల్ని విడదీయగలిగే విచక్షణా జ్ఞానాన్ని చదువు ఇస్తుందనే స్పృహ ఇప్పుడు కొరవడింది. కారల్ మార్క్స్ ‘దాస్‌కాపిటల్’, మాగ్జిమ్ గోర్కీ నవల ‘అమ్మ’ వంటి పుస్తకాలు కోట్ల మంది ఆలోచనా సరళినే ప్రభావితం చేశాయి. తెలుగునాట అనువాద పుస్తకా లుగా ‘అమ్మ’తో పాటు ‘ఉక్కుపాదం’ (జాక్ లండన్ ‘ఐరన్ హీల్’), ‘ఏడు తరాలు’ (ఎలెక్స్ హేలీ ‘ది రూట్స్’) వంటి పుస్తకాలు లెక్కలేనంత మంది యువకుల్ని వామపక్ష ఉద్యమాల వైపు నడిపాయంటే అతిశయోక్తి కాదు. ‘..తీగలను తెంపి అగ్నిలో దింపినావు, నా తెలంగాణ కోటి రతనాల వీణ...’ అన్న దాశరథి ఒక పద్యం ఓ ఉద్యమానికే ఊతకర్ర అయింది. ఒకప్పుడు బంగ రచయిత శరత్ తెలుగు వాడేమోననిపించేది. సామాజిక స్పృహతో సాగిన రచన ఏదైనా ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ తరాలని ప్రభావితం చేస్తుందంటారు. ప్రాచీన చైనా తాత్వికుడు కన్ఫూసియస్ చెప్పినట్టు ‘భవి ష్యత్తును నిర్వచించాలంటే గతం చదవాల్సిందే!’ పఠనాసక్తికి శత్రువులెవరు? ‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో’ అని సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం అన్నారు. మానవ సమాజాన్ని ఉన్నతీకరించడంలో పుస్తకం కీలకపాత్ర వహించింది. ఆలోచన పరిధిని విస్త రించింది. అవగాహనా స్థాయిని పెంచింది. మానవ సంబంధాల్ని మెరుగు పరిచింది. కాలక్రమంలో ఎందుకు ఆదరణ తగ్గింది? అనేకాంశాలు దీన్ని ప్రభావితం చేశాయి. మొదట సినిమా, తర్వాత టెలివిజన్, ఇప్పుడు ఇంట ర్నెట్, ముఖ్యంగా ఐటి ఆధారిత సామాజిక మాధ్యమాలు పుస్తక పఠనా భిరుచిపైన అనుకూల–ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. సినిమాలొచ్చాక, ముఖ్యంగా టెలివిజన్ విస్తృతి పెరిగాక అనేక సాహితీ ప్రక్రియలు దెబ్బ తిన్నాయి. ముఖ్యంగా కవిత్వం, కథ, నవల, నాటకం, చరిత్ర, జీవిత చరి త్రలు వంటి అనేక ప్రక్రియల పుస్తకాదరణ సాపేక్షంగా తగ్గింది. కారణా లేమైనా, ఇటీవలి అయిదారేళ్ల కాలంలో పరిస్థితి కొంతమేర మారింది. పుస్తక ప్రదర్శ నలకు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. పెద్దనోట్ల రద్దు–కరెన్సీ తగి నంత అందు బాటులో లేకపోవడంతో ఈ సంవత్సరం కొంత ఇబ్బంది తలె త్తినట్టు ఇటీవల రాజమండ్రిలో జరిగిన పుస్తక ప్రదర్శన, ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రదర్శనలో కొనుగోళ్లను బట్టి తెలుస్తోంది. దేశంలో, ముఖ్యంగా తెలుగునాట సినిమా ఆధారిత వినోదమే ప్రధానాంశం. అందుకే, టెలివిజన్ మాధ్యమాలు తమ వార్తేతర వినోద కార్యక్రమాల్లో సాహితీ ప్రక్రియల కన్నా సినిమా వస్తువుకే ఎక్కువ స్థానం కల్పిస్తున్నారు. లేదా ఇతరేతర చౌకబారు కార్యక్రమాల్ని ప్రేక్షకులపై రుద్దుతున్నారు. ఎందుకీ పరి స్థితి అని ఎవరైనా విమర్శకులీ అంశాన్ని ఎత్తిచూపితే.. ‘విత్తుముందా? చెట్టు ముందా?’ వంటి తర్కం తెరపైకి వస్తుంది. పక్కనున్న తమిళ, కన్నడ రంగాల్లో ఉన్నపాటి మేలిరకం సరుకు కూడా తెలుగు చానళ్లలో ఉండదనే విమర్శ ఉంది. ఫేస్బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలొచ్చాక మరింత దెబ్బపడింది. పరస్పర భావ వినిమయానికి, కాలక్షేపానికి, వ్యక్తీకర ణలకు ఇప్పుడవే వేదికలయ్యాయి. సృజన దారి మళ్లింది. ఈ మాధ్యమాల వల్ల ఉపయోగం కన్నా.. విద్యార్థులతో పాటు యువతరం, గృహిణులు, ఉద్యోగుల్లో తీవ్ర కాలహరణం జరుగుతోంది. నిరర్థకమైన సంభాషణలకే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారనేది ఒక అధ్యయనం. ఫలితంగా పుస్తకాల మీద వెచ్చించగలిగే అరకొర సమయం కూడా మిగలని పరిస్థితి. ‘పుస్తకాల్ని దగ్ధం చేయడం కన్నా తీవ్రమైన నేరాలూ ఉన్నాయి, వాటిని చదవకుండా ఉంచడం అందులో ఒకటి’ అన్న జోసెఫ్ బ్రాడ్స్కీ మాట అక్షర సత్యం. పఠన–సృజన తగ్గితే భాషలకూ ద్రోహం ‘పుస్తకాలు లేకుండా నేను జీవించజాలను’అంటాడు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన మేధావి థామస్ జెఫర్సన్. ఒకప్పటితో పోల్చి చూస్తే పరిమాణంలో ఇప్పుడు ఎక్కువ పుస్తకాలు వస్తున్నా, అవి సమాజంపై చూపే ప్రభావం అంతంతే! దేశంలో, తెలుగునాట పేరు ప్రతిష్ఠలు గలిగిన కవులు, రచయి తలు, స్వాతంత్య్ర సమరయోధులు, సంఘ సంస్కర్తలు, రాజకీయ నాయ కులు.. ఇలా అప్పట్లో అందరూ గొప్ప చదువరులు. ఇవాల్టి తరం ఆంగ్ల భాష మోజుతో తల్లి భాష తెలుగునే ఖాతరు చేయడం లేదు. కందుకూరి, గుర జాడ, పానుగంటి, గిడుగు, శ్రీశ్రీ, విశ్వనాథ, దాశరథి, వట్టికోట.. గొప్ప తెలుగు ప్రముఖులు ఎవరిని తీసుకున్నా, వారంతా ఇంగ్లిష్ తదితర అన్య భాషల్లోనూ ప్రావీణ్యం కలిగిన వారే! మాతృ భాషపై ఆధిపత్యం ఉన్న వారికే అన్య భాషలపైనా పట్టు లభిస్తుందన్నది విశ్వవ్యాప్తంగా రుజువైన సత్యం. అంటే, భాష ఏదైనా వారంత లోతుగా చదివారు కనుక గొప్ప రచనలు చేయ గలిగారు. ఇటీవలి సాహిత్యంలో, ఇతర సృజనల్లో అంతగా లోతు, ప్రభావశీ లత ఉండట్లేదనేది విమర్శ. చదివే వారు ఉంటేనే కదా, రాసే వారికి కాస్త ఉత్సాహం, ప్రోత్సాహం అనే భావనా ఉంది. ‘రాయగలిగిన వాళ్లు రాయాల్సి నంత రాయకపోవడంవల్ల, రాయకూడని వాళ్లు రాయకూడనంత రాస్తున్నా ర’ని ఇటీవల ఒక సమావేశంలో కవి శివారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. జర్న లిజంలో ప్రవేశ పరీక్ష ఉత్తీర్ణులై ఇంటర్వూ్యలకు హాజరైన 300 మందిలో పట్టు మని పదిమంది కూడా, సిలబస్కాని పుస్తకాలు చదివిన వారు లేరు. పుస్త కాలు చదివి ఉండకపోవడం లోపంగా కూడా వారు భావించడం లేదు. మరో ఉద్యమం రావాలేమో? ఆలెన్ బెన్నెట్ అన్నట్టు ‘ఊహాశక్తిని ఉద్దీపింపజేసే ఉత్ప్రేరకం పుస్తకం’. సామాజిక పరిణతి, మానవ సంబంధాల్లో ఉత్కృష్టత, మనిషి ఆలోచనల్లో విశాల దృక్పథం వంటివి మెరుగుపడాలంటే పఠనాసక్తి సజీవంగా ఉండాలి, పెరగాలి. తెలుగునాట ఉధృతంగా వచ్చిన గ్రంథాలయోధ్యమం వంటి మరో ఉద్యమమే రావాలేమో! ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకొని పాఠశాల, కళాశాల స్థాయిలో గ్రంథాలయాల్ని పరిపుష్టం చేయాలి. సిలబస్‌ను సమీ క్షించాలి. గతంలో తెలుగు, ఇంగ్లిష్ ఉపవాచకాలు (నాన్ డిటేయిల్) పిల్లల్లో పఠనాసక్తిని పెంచేవి. ఇప్పుడవి లేవు. మార్కుల వెంట పరుగులు తప్ప మరోటి లేదు. ఇంటర్నెట్–స్మార్ట్‌ఫోన్ వచ్చాక గొప్ప సౌకర్యం ఏర్పడింది. ఒకప్పటిలా కాకుండా, ఉన్న చోటి నుంచి తన ఫోన్ ద్వారా కోరుకున్న పుస్త కాన్ని క్షణాల్లో స్క్రీన్ మీదకు రప్పించుకోగలిగే వెసులుబాటుంది. కేవలం ఒక విక్రయ అంగడిగా కాకుండా, ముందు వెనుక, ప్రదర్శన సమయంలో వివిధ ప్రోత్సాహక కార్యక్రమాల ద్వారా హైదరాబాద్ బుక్‌ఫెయిర్ వారు చేస్తున్న కృషి అభినందనీయం. రష్యా–అమెరికా వారధిలాంటి వర్ధమాన రచ యిత్రి వెరా నజారియా చెప్పిన ఓ గొప్ప మాటతో ముగిస్తా. ‘నువ్వు ఓ మంచి పుస్తకం చదువుతున్నప్పుడే, మరింత వెలుగును లోనికి ఆహ్వానించే తలు పొకటి ప్రపంచంలో ఎక్కడో తెరుచుకుంటోంది’ (వ్యాసకర్త : దిలీప్ రెడ్డి ఈమెయిల్: dileepreddy@sakshi.com ) -
నల్లడబ్బు తెల్లనౌతోందా..?
సమకాలీనం నోట్ల రద్దు తదనంతర పరిణామాల్లో సర్కారు వైఫల్యం రాజకీయ ప్రత్యర్థుల స్వరంలో మార్పులకు ఆస్కారం కల్పిస్తోంది. స్వరాల్లాగే రాజకీయ చిత్రమూ మారేనా? అనే సందే హాలకూ తావిస్తోంది. ఎమర్జెన్సీ వాతావరణానికి ఆస్కారముందని లోగడ సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ అగ్రనేత అడ్వాణీ.. ఏడాది తర్వాత ఆర్థిక ఎమర్జెన్సీని తలపిస్తున్న ప్రస్తుత వాతావరణంలో మౌనం వీడి స్వరం విప్పడం విశేషం. సొంత పార్టీలోనే భిన్నాభి ప్రాయాలతో ఉన్నవారికాయన మున్ముందు కేంద్ర బిందువౌతారా? వేచి చూడాల్సిందే! వ్రతం చెడ్డా ఫలితం దక్కాలనేది సూక్తి. రెండూ దక్కితే తిరుగే లేదు. కానీ, వ్రతమూ చెడి, ఫలితమూ దక్కకుంటే... మిగిలేది వ్యథే! ప్రపంచ దృష్టినాక ర్షించేలా ‘నల్లసంపద’పై భారత్ ప్రకటించిన యుద్ధం తొలి అంకం సంకేతా లెలా ఉన్నాయి? పెద్దనోట్ల రద్దుతో బ్యాంకులకు రాకుండా జనక్షేత్రంలోనే ఆగిపోయి, శాశ్వతంగా పోతుందనుకున్న నల్లధనం ఆనవాళ్లెక్కడ? చూడ బోతే అది రూటు మార్చినట్టుంది. సరాసరి నల్లధనంగానో, రూపుమారి తెల్ల ధనంగానో... ఎటు తిరిగి మళ్లీ బ్యాంకులకు చేరుతోంది. కేంద్ర ప్రభుత్వ పెద్దల అంచనాలు గల్లంతయ్యాయి. స్వపక్షంతో సహా ధిక్కార స్వరాలు పెరుగుతున్నాయి. కొండంత రాగం తీసిన పాలకులకిప్పుడు ఏం పాట పాడాలో పాలుపోని పరిస్థితి! రద్దు వరకు చలామణిలో ఉన్న పెద్ద నోట్లు (రూ 1000, రూ 500) దాదాపు మొత్తంగానే దేశ ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి చేరే వాతావరణం కనిపిస్తోంది. రద్దయిన 14.5 లక్షల కోట్ల రూపాయల్లో సుమారు 13 లక్షల కోట్లు ఇప్పటికే బ్యాంకులకు చేరాయి. డిసెంబర్ అఖర్న గడువు ముగిసేనాటికి... కనీసం లక్ష కోట్లయినా చెల్లుబాటుకాని ‘నల్ల ధనం’గా బ్యాంకులకు రాకుండా మిగిలిపోతుందో, లేదో?అనుమానమే! రకరకాల లెక్కల ఆధారంగా భారత ఆర్థిక వ్యవస్థలో సమారు రూ. 6.5 లక్షల కోట్లు నల్లధనమున్నట్టు ఓ అంచనా. 5 లక్షల కోట్ల రూపాయల వరకున్న నల్లధనం పెద్దనోట్ల రద్దుతో రానేరాదని భావిస్తున్నట్టు కేంద్రం సుప్రీం కోర్టుకు విన్నవించింది. తాజా నిర్ణయంతో నల్లధనం పోయి ప్రభుత్వానికి కలిసివచ్చే 3 లక్షల కోట్ల రూపాయల అదనపు ద్రవ్యంతో సంక్షేమ కార్య క్రమాలు చేపడతామని కేంద్రమంత్రి ఒకరు హామీ వదిలారు. రద్దయిన ద్రవ్యంలో కనీసం 25 శాతం (అంటే, రూ. 3.6 లక్షల కోట్లు) నల్లధనం ఇక లెక్కలకెక్కదని సర్కారు విధేయ ఆర్థిక నిపుణులు సెలవిచ్చారు. పార్లమెంటు కార్యకలాపాలతో పాటు వివిధ వ్యవస్థల్ని స్తంభింపజేసిన మహా క్రతువిది. నెల రోజులుగా దేశంలో వ్యాపారాలు, వాణిజ్యం, ఉత్పత్తులు, వ్యవసాయం, జనజీవనం ఇలా ఎన్నింటినో ప్రభావితం చేసిన ‘నోట్ల రద్దు’ నిర్ణయం సగటు మనిషిని నలిపేసింది. చేతిలో డబ్బుల్లేక చేష్టలుడిగేలా చేసింది. సుమారు వంద మంది అసువులు తీసింది. చెల్లని నోట్లు స్వీకరించడమే తప్ప, కనీసా వసరాలక్కూడా పనికొచ్చే నోట్లు ఇవ్వలేని బ్యాంకులు, ఏటీఎంల ముందు భారతదేశాన్నే బారులు తీయించింది. మీరీ వార్త చదివేటప్పటికి ‘నో క్యాష్’ బోర్డు వేలాడితే తప్ప, తెరచి ఉంచిన ప్రతి బ్యాంకు ముందూ జనాలు వరుస కట్టి ఉంటారు. ఇలా తాము దాచుకున్న డబ్బు తృణమో, పణమో తిరిగి తీసుకునేందుకు పోరు మొదలై సరిగ్గా నెల. లెక్కతప్పినందుకే.... గురి మారిందా? ప్రధానమంత్రి అనుభవ లేమి, అవగాహనా రాహిత్యం వల్లే నల్లధనం లెక్క తప్పిందా? ప్రస్తుత గందరగోళానికి అదే కారణమా? అవునంటున్నారు విశ్లేషకులు. ఆర్థిక నిపుణుల సంప్రదింపులతో సమగ్రంగా మదింపు చేయ కుండా తీసుకున్న తొందరపాటు నిర్ణయమని అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా, నోట్ల రద్దు తర్వాత సర్కారు నిలకడలేని నిర్ణయాలకు తోడు వారి గురి-లక్ష్యం కూడా మారింది. 30 రోజుల్లో 50 నిబంధనలు విధించారు. పెద్దనోట్ల రద్దు ప్రకటన చేసేటప్పుడు మాటమాత్రంగానైనా ప్రస్తావన లేని నగదు రహిత ఆర్థిక లావాదేవీలు ఇప్పుడు ప్రధాన లక్ష్యమై కూర్చున్నాయి. దేశంలో ఇప్పటివరకు 3 శాతం మించని నగదు రహిత ఆర్థిక నిర్వహణ ఇక వంద శాతానికెదిగి ఇప్పటికిప్పుడు డిజిటల్ భారత్ ఆవిష్కరణ జరగాలి. అందుకే, సర్కారు గురువారం తాయిలాలు కూడా ప్రకటించింది. ఒక లెక్క ప్రకారం మన మొత్తం (తెలుపు, నలుపు) స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) రూ. 225 లక్షల కోట్లలో మూడో వంతు (సుమారు రూ. 75 లక్షల కోట్లు) నల్ల సంపద ఉందంటారు. ఇందులో సుమారు 8 శాతం, అంటే... రూ. 6.5 లక్షల కోట్లు ద్రవ్యరూపంలో ఉందని అంచనా! అందుకే మొత్తం ద్రవ్యం (రూ. 16.18 లక్షల కోట్లు)లో 30 శాతం వరకు నల్లడబ్బు ఉందనేది చాన్నాళ్లుగా ప్రచారం. ద్రవ్యంలో 86 శాతమున్న పెద్దనోట్ల రూపంలో నల్లడబ్బు కనీసం 3 నుంచి 5 లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుందని ఆర్థిక నిపుణులు లెక్కలేస్తారు. సర్కారు తీవ్ర హెచ్చరికల తర్వాత చాలావరకు రాదనే అను కుంటారు. అయినా బ్యాంకులకు వచ్చి చేరడమే విస్మయం కలిగిస్తోంది. ఇందులో ఇంకో వాదన కూడా ఉంది. కొత్త చట్టం (బిల్లు)లో ప్రతిపాదించిన దాన్ని బట్టి, తమ నల్లడబ్బును ముందు బ్యాంకుల్లో జమ చేసుకొని, తర్వాత స్వచ్ఛంద వెల్లడి ద్వారా 50 శాతం ప్రభుత్వానికి వదులుకొని, 50 శాతం (25 శాతం వెంటనే, 25 శాతం నాలుగేళ్ల తర్వాత తీసుకునేలా) మిగుల్చుకుంటా రని ఒక విశ్లేషణ. ఇందుకుగల ఆస్కారం తక్కువే! రాగల 3 వారాల్లో ఇంకెన్ని పెద్దనోట్లు బ్యాంకులకొస్తాయో! ఆ పైన కూడా సహేతుక కారణాలు చూపి రిజర్వుబ్యాంకు కౌంటర్లలో 2017 మార్చి మాసాంతం వరకూ డిపాజిట్ చేసు కోవచ్చు. నిలకడలేని సర్కారు చర్యల్లో... తదుపరి వచ్చే ఇంకే నిర్ణయమైనా ఉపశమనం కలిగిస్తుందేమో! అని తమ వద్దనున్న నోట్ల కట్టలు డిపాజిట్ చేసుకోకుండా నిరీక్షిస్తున్న వారూ ఉన్నారు. వారు ఎటుతిరిగి డిసెంబరు 30 వరకు ఆ డబ్బును బ్యాంకుల్లోకి తెస్తారు. రంగు మారే నల్లధనం విసురుతున్న సవాల్! తమ పాతనోట్లు బ్యాంకుల్లో జమ చేసుకొని, చెల్లుబాటయ్యే నోట్ల కోసం బ్యాంకుల వద్ద పడిగాపుల యుద్ధం చేస్తున్న సామాన్య జనం, రేపు రెండో పోరాటానికీ సన్నద్ధం కావాలేమో? అంచనా వేసిన నాలుగయిదు లక్షల కోట్ల నల్లధనం చిక్కట్లేదని కోపంతో ఉన్న సర్కారు, రేపు జనం ఖాతాలన్నింటినీ శల్య పరీక్ష చేస్తానంటుందేమో! రెండున్నర లక్షల రూపాయల వరకు చేసు కునే డిపాజిట్ల జోలికి రామన్న ప్రభుత్వం అప్పుడే మనసు మార్చుకున్న ట్టుంది. నవంబరు 10, డిసెంబరు 30 మధ్య, తమ బ్యాంకు ఖాతాల్లో యాభై వేలకు మించి డిపాజిట్ చేసుకున్న వారి వివరాలివ్వాలని ఆదాయపన్ను (ఐటి) శాఖ వారు తాజాగా బ్యాంకులకు ఆదేశించినట్టు సమాచారం. అదే జరిగితే, ఇది ఎలుకలున్నాయని ఇల్లు దగ్ధం చేసుకునే మరో చర్య అవుతుంది. ఎప్పట్నుంచో బ్యాంకేతర ఆర్థిక లావాదేవీల్లో డబ్బు జమ చేసుకున్నవారు, బంగారం సమకూర్చుకున్న వారు అతికే కారణాలు చెప్పాల్సి వస్తుంది. సందిగ్ధమైన కొన్ని విషయాల్లో ఐటీ అధికారుల (నిర్వచనం లేని) విచక్షణ మేరకు నిర్ణయాలుంటాయని చట్టం చెబుతోంది. డిసెంబరు 30 గడిచాక రెండో అంకంలో వేధింపులు తప్పవేమోనన్న భయం జనాల్ని వెంటాడు తోంది. మన ఆదాయపన్ను వ్యవస్థ అలా ఉంది. ఒక వంక సిబ్బంది కొరత, మరో వంక నిబద్ధత లేనితనం కూడా సామాన్యుల భయాలకు కారణం. మన దేశంలో నిర్ణయాలు ఎంత కటువుగా ఉంటాయో అమలు అంత లోపభూ యిష్టంగా ఉంటుంది. ఇప్పుడు జరిగిందదే! ముఖ్యంగా నిర్వహణ-నియం త్రణ వ్యవస్థలు ఎంతో లోపాయికారి అని నోట్లరద్దు, తదనంతర పరిణా మాల్లో స్పష్టమైంది. డిపాజిట్ల నిష్పత్తిలో కాకుండా పరిమితంగా విడుదల చేసిన కొత్త నోట్లు కూడా విచ్చలవిడిగా అక్రమార్కుల చేతికి చేరాయి. అందుకే, పాలకపక్ష ప్రజాప్రతినిధుల వద్దే కాక ఎక్కడ పడితే అక్కడ దొరి కిపోతున్నాయి. బయట బ్యాంకుల వద్ద రోజంతా నిరీక్షిస్తూ నాలుగు వేలు, రెండు వేల రూపాయలూ పొందలేక కోట్లాది మంది పడిగాపులు కాస్తుంటే, చట్టాన్ని చుట్టచుట్టిన వారి వద్ద కొత్త నోట్లు కోట్లలో దొరుకుతున్నాయి. ఇదెలా సాధ్యమౌతోందన్న ప్రశ్న సగటు మనిషిని వేధిస్తోంది. దేశ వ్యాప్తంగా లక్షల రూపాయల్లో కొత్త నోట్ల కట్టలు పట్టుబడుతున్న ఘటనలకు లెక్కే లేదు. విశాఖలో కొటిన్నర, ముంబాయిలో 4 కోట్లు, బెంగళూరులో 6 కోట్లు, నిన్న టికి నిన్న చెన్నైలో 70 కోట్లు... అన్నీ కొత్తనోట్లు ! ఏమిటిది? కొత్త కరెన్సీ కద లికల మీద, బ్యాంకులకు ఆర్బీఐ డబ్బు కేటాయింపులపైన, బ్యాంకుల నిర్వ హణపైన... సరైన నిఘా-నియంత్రణ లేకపోవడం కొట్టొచ్చినట్టు కనిపి స్తోంది. గడచిన నెలరోజుల్లో నల్లధనం అయిదారు మార్గాల్లో తెల్లధనంగా మారినట్టు నివేదికలున్నాయి. 1) అడ్డగోలుగా పాత తేదీలతో బంగారం కొను గోళ్లు 2) 15 నుంచి 30 శాతం కమిషన్‌తో బ్రోకర్ల ద్వారా పాత-కొత్త నోట్ల మార్పిళ్లు 3) బ్యాంకు వారితో చేతులు కలిపి పెద్ద మొత్తాల్లో కొత్తనోట్ల దారి మళ్లింపులు 4) అనువైన ఇతరుల ఖాతాల్లో డిపాజిట్లు 5) పాతనోట్లతో విక్ర యాలు అనుమతించిన వ్యాపార లావాదేవీల్లో తమ సొమ్ము కలపడాలు 6) నోట్ల మార్పిడి (ఎక్స్చేంజ్) అనుమతించినంత కాలం బ్యాంకుల్లో మనుషుల్ని పెట్టి సైక్లింగ్ పద్ధతిలో మార్చడాలు... ఇలా రకరకాల పద్ధతుల్లో నల్లధనాన్ని తెల్లధనం చేశారు, చేస్తున్నారు. స్వరాలలాగే రాజకీయ చిత్రమూ మారుతోందా? నోట్ల రద్దు తదనంతర పరిణామాల్లో సర్కారు వైఫల్యం రాజకీయ ప్రత్యర్థుల స్వరంలో మార్పులకు ఆస్కారం కల్పిస్తోంది. స్వరాల్లాగే రాజకీయ చిత్రమూ మారేనా? అనే సందేహాలకూ తావిస్తోంది. ఎమర్జెన్సీ వాతావరణానికి ఆస్కా రముందని లోగడ సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ అగ్రనేత అడ్వాణీ.. ఏడాది విరామం తర్వాత ఆర్థిక ఎమర్జెన్సీని తలపిస్తున్న ప్రస్తుత వాతావ రణంలో మౌనం వీడి మళ్లీ స్వరం విప్పడం విశేషం. సొంత పార్టీలోనే భిన్నా భిప్రాయాలతో ఉన్నవారికాయన మున్ముందు కేంద్ర బిందువౌతారా? వేచి చూడాల్సిందే! నోట్లరద్దుకు మొదట్లో అనుకూలంగా మాట్లాడిన సీనియర్ నేత శరద్ పవార్ కూడా గొంతు మార్చారు. ‘ఆలోచన మంచిదే, ఆచరణే చెత్త... అత్యధికులు గ్రామీణ-వ్యవసాయదారులుండి, 92 శాతం మంది నగదు లావాదేవీలు జరిపే భారత వ్యవస్థలో నగదు రహిత ఆర్థిక నిర్వహణ ఎలా సాధ్యం?’ అని ఆయన ప్రశ్నించారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా స్వరం మార్చి సర్కారు వ్యవహార శైలిపై ధ్వజమెత్తారు. మొద ట్నుంచీ వ్యతిరేకిస్తున్న వారు సరేసరి! నోట్ల రద్దు ప్రక్రియ ఏ దేశంలో అయినా నల్లసంపదను, నల్లధనాన్ని నిర్మూలించడంలో సంపూర్ణ విజయం సాధించిన దృష్టాంతాలు లేవు. ఫలి తాలు కొంత మేరకే! కానీ, నిర్వహణా లోపాల వల్ల అదే ప్రక్రియ ఆర్థిక వృద్ధిని నిలువరించి మాంద్యాన్ని సృష్టించిన దాఖలాలున్నాయి. ఒకవైపు నోట్లను రద్దు చేసి, మరోవంక కొత్త నోట్ల పంపిణీని పరిమితం చేసి, నగదు రహిత లావాదేవీల వైపు దేశాన్ని నడుపుతున్న ప్రస్తుత వ్యవహారం వల్ల పన్నుల విధింపు-వసూళ్ల పరిధి పెరగడం ఖాయం. ఈ క్రమంలో... బ్యాంకే తరంగా ఉన్న అనియత ఆర్థిక వ్యవస్థను బ్యాంకుల పరిధిలోకి తెచ్చే ఓ ప్రక్రియగా ఇది మిగలొచ్చు! ఖాతాల్లో జమ చేసుకున్న సొమ్ము పొంద లేకపోవడానికి కారణం బ్యాంకులు కాదన్న స్పృహ కలిగిన ప్రజలు బ్యాంకులపై దాడి చేయకపోవచ్చు. అంతమాత్రాన అది జనంలో ఆగ్రహం లేకపోవడం కాదు, జరుగుతున్న అవ్యవస్థకు ఆమోదం అంతకన్నా కాదు. జనం అసౌకర్యాల్ని, ప్రజాగ్రహాన్ని వాస్తవికంగా కొలిచే సాధనాలు ప్రజా ప్రభుత్వాలకు అవసరం. పన్ను వసూళ్ల రుచిమరిగిన పాలకులకు రాబడి వేరు ఆదాయం వేరన్న స్పృహ కూడా అత్యవసరం. దిలీప్ రెడ్డి ఈమెయిల్: dileepreddy@sakshi.com -
సర్ప్రైజ్.. ఆ హీరోహీరోయిన్ల పెళ్లైపోయింది!
-
సర్ప్రైజ్.. ఆ హీరోహీరోయిన్ల పెళ్లైపోయింది!
అంతులేని ప్రేమకథకు ఎట్టకేలకు శుభంకార్డు పడింది. లివింగ్ ‘లైలా- మజ్నూ’లుగా ఇటీవలి కాలంలో పలుమార్లు వార్తల్లో నిలిచిన హీరోహీరోయిన్లు కావ్యా మాధవన్- దిలిప్‌లు ఒక్కఇంటివాళ్లయ్యారు. మలయాళంలో నంబర్ వన్ హీరోయిన్గా వెలుగొందుతున్న కావ్యా.. అదే ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతోన్న దిలిప్‌లు శుక్రవారం వివాహబంధంలోకి ప్రవేశించారు. అతికొద్దిమంది ఆంతరంగికుల సమక్షంలో శుక్రవారం కొచిలోని ఓ హోటల్లో ఈ ఇద్దరూ మనువాడారు. కాగా, కావ్యా, దిలిప్‌లు ఇద్దరిరీ ఇది రెండో పెళ్లేకావడం గమనార్హం. మలయాళ నటి మంజూ వారియర్‌ను 1998లో పెళ్లాడిన దిలిప్.. కొన్నేళ్ల కిందటే ఆమెకు విడాకులిచ్చాడు. ఇటు కావ్య.. కెరీర్ జోరుమీదున్న సమయంలోనే(2009లో) కువైట్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను పెళ్లాడి.. సంవత్సరం తిరిగేలోపే విడాకులిచ్చింది. గడిచిన కొద్దికాలంగా కావ్యా, దిలిప్‌ల ప్రణయగాథపై మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. వీటిని ఏ దశలోనూ ఖండించని ఆ ఇద్దరూ.. అందరికి సర్ప్రైజ్ ఇస్తూ పెళ్లిపీటలెక్కారు. కావ్యతో పెళ్లికి దిలీప్ కుమార్తె మీనాక్షి కూడా అభ్యంతరపెట్టలేదని, ఆ ఇద్దరూ(కావ్యా, దిలీప్‌లు) కలిసి ఉండటం కంటే సంతోషకరమైన విషయం ఏదీ లేదని నటి మనేకా(నిర్మాత సురేశ్ భార్య) మీడియాతో అన్నారు. కావ్యా దిలిప్‌లు కలిసి ఇప్పటిదాకా 21 సినిమాల్లో జతకట్టారు. వాటిలో మీసమాధవన్, కాసిపట్టణం, పిన్నెయుమ్ తదితర సినిమాలు సూపర్హిట్లుగా నిలిచాయి. -
సయోధ్య మీ దయ కాదు, బాధ్యత!
సమకాలీనం దేశవ్యాప్తంగా మొత్తం పెండింగ్ కేసులు 2.28 కోట్లని కేంద్ర న్యాయశాఖ అధికారికంగా వెల్లడించింది. ఇక మన దేశంలో జనాభా–న్యాయమూర్తుల నిష్పత్తి కూడా ఆశావహంగా లేదు. సగటున ప్రతి పదిలక్షల జనాభాకు 13 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు. ఐక్యరాజ్య సమితి అధ్యయనం జరిపిన 65 దేశాల్లో ఇంతకన్నా తక్కువ నిష్పత్తిలో జడ్జీలున్న దేశాలు గోటమాల, నికరాగువా, కెన్యా ఈ మూడు మాత్రమే! ప్రతి పదిలక్షల జనాభాకు కనీసం 50 మంది జడ్జీలు సగటున ఉండాలని లా కమిషన్ ఏనాడో సిఫారసు చేసింది. ఏ దేశ న్యాయవ్యవస్థ నుంచైనా ఆ దేశస్తులు ఆశించేదేముంటుంది? అమె రికా చీఫ్ జస్టిస్‌గా పనిచేసిన ఎర్ల్ వారెన్ (అంతకు ముందు మూడు పర్యా యాలు కాలిఫోర్నియా గవర్నర్) ఆ పదవి చేపట్టడానికి ముందు ఒక గొప్ప మాట చెప్పారు. ‘‘...ఎక్కడ అన్యాయం జరిగినా మనం సరిదిద్దాలి. ఎక్కడ పేదరికం ఉన్నా మనం నిర్మూలించాలి. ఎక్కడ హింస చెలరేగినా మనం శిక్షించాలి. ఎక్కడ నిర్లక్ష్యం పొడచూపినా మనం శ్రద్ధ–భరోసా కల్పించాలి’’ ఇంతకన్నా న్యాయవ్యవస్థ నుంచి ఎవరైనా ఏమాశిస్తారు? కానీ, ఇవేవీ లభించనప్పుడు... పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుంది? పరిష్కారం నోచక న్యాయస్థానాల్లో కూరుకుపోయిన కోట్లకొలది కేసుల్లోని కక్షిదారులు మన దేశంలో సకాలంలో న్యాయం అందక అలమటిస్తున్నారు. ‘న్యాయ జాప్యం న్యాయ తిరస్కరణ కిందే లెక్క’ అన్న మౌలిక సూత్రం ప్రకారం చూస్తే ఇక్కడ న్యాయమెంత అపురూపమైందో ఊహించవచ్చు. ఎంత అరు దైనదో! అని కూడా అనిపిస్తుంది. ఒక లోతైన సమీక్ష, ఆత్మపరిశీలన, ప్రగతి శీల సంస్కరణలు, ప్రజాసేవకు పునరంకితం కావాల్సిన దిశా నిర్దేశం అవస రమైన పరిస్థితిని భారత న్యాయవ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటోంది. న్యాయ మూర్తుల ఖాళీలు–నియామకాలు, కొలీజియం–కమిషన్ స్పర్థలు, సుప్రీం కోర్టు–కేంద్రప్రభుత్వం గిల్లికజ్జాలు వంటివి బయటకు కనిపించే పాలనాపర మైన వివాదాల్లాగున్నా... అంతర్లీనమైన ఎన్నో కారణాలు, ఎత్తులు–పై ఎత్తులూ తలచుకుంటే మనసును కలచివేస్తాయి. వాటి ప్రతికూల ప్రభావం ప్రజాస్వామ్య స్పూర్థికి గండికొట్టడమే కాక, భారత రాజ్యాంగం సంకల్పించిన దేశ సమ పురోగతినే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. పైపైన కనిపించే న్యాయ– కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య విభేదాలుగానో, న్యాయ–శాసన వ్యవస్థల మధ్య పంతాలుగానో వీటిని చూడలేము. ఇంకొంచెం లోతుకు వెళ్లి, రాజ్యాంగం అమలును సాకారం చేసే మూడు కీలకాంగాల మధ్య సమ న్వయ సాధనకు ప్రతిబంధకమౌతున్న కారణాల్ని అన్వేషించాలి. ప్రధాన మంత్రి, సుప్రీంకోర్టు చీఫ్‌జస్టిస్ వంటి వారు చిత్తశుద్ధితో కృషిచేయాలి. ఏకాభిప్రాయం ఎందుకు రాదు? ఏ విషయంలోనైనా కాస్త పట్టువిడుపులుంటే ఏకాభిప్రాయం సుసాధ్యమే! న్యాయమూర్తుల్ని న్యాయమూర్తులే ఎంపిక చేయడమేమిటన్న మౌలిక ప్రశ్నతో ‘కొలీజియం’ పద్ధతి వివాదాస్పదమైంది. కొలీజియం భేటీల్లో వెల్ల డయ్యే అభి ప్రాయాల్ని రికార్డు చేయటం లేదని, పారదర్శకత లోపించిందని, జవాబు దారీతనం కోసం వాటిని పొందుపరచడం అవసరమని... అందులో సభ్యు డైన జస్టిస్ చలమేశ్వర్ ఫిర్యాదు చేసిన తర్వాత ఈ వివాదం మరింత జటిల మైంది. న్యాయమూర్తుల నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘జాతీయ న్యాయ నియామక కమిషన్’ (ఎన్‌జేఏసీ) ప్రక్రియ కూడా లోపభూయిష్ఠంగా ఉందనే విమర్శలు వచ్చాయి. దరిమిలా గత సంవ త్సరం సుప్రీంకోర్టు ధర్మాసనం సదరు కమిషన్ చెల్లుబాటునే కొట్టివేసింది. ఫలి తంగా తలెత్తిన ప్రతిష్ఠంభన ఉన్నత న్యాయస్థానాల్లో ఖాళీల భర్తీకి ఆటం కంగా మారింది. ఈ లోపు, నియామకాల కోసం కొంత ప్రత్యామ్నాయ ప్రక్రియ జరిగినా... ప్రతిష్ఠంభన మాత్రం తొలగలేదు. నిజానికి అసాధారణ ఖాళీలకు, కేసుల పరిష్కారంలో జరుగుతున్న విపరీత జాప్యాలకు అదొక్కటే కారణం కాదు. చివరకు పరిస్థితి, ‘న్యాయవ్యవస్థను ధ్వంసం చేసి, న్యాయ స్థానాల్నే మూసివేయాలనుకుంటున్నారా? అది సాగనివ్వం...!’ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహించే దాకా వచ్చింది. ‘మా సహనం పరీ క్షించకండి, కార్యనిర్వాహక వ్యవస్థ నిష్క్రియాపరత్వానికి న్యాయవ్యవస్థను బలిపెట్టకండి’ అని కూడా మందలించారు. కమిషన్ రద్దుతో పూర్వపు కొలీ జియం వ్యవస్థ తిరిగి అమల్లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వపు అభ్యంతరాల దృష్ట్యా కొత్తగా ఒక ‘ప్రక్రియ పత్రం’ (ఎంఓపీ) రూపొందించాలని సుప్రీం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ఎంఓపీ పై ఏకా భిప్రాయం కుదరకపోవడంతో అది అమల్లోకి రాలేదు. ‘అయినా నియామక ప్రక్రియ ఏం ఆగిపోలేదు కదా! గడచిన రెండేళ్లలో పెద్ద సంఖ్యలోనే జడ్జీల నియామకాలు, సుప్రీం కొలీజియం ప్రతిపాదించినట్టు జడ్జీల బదిలీలు చేశాం’ అని కేంద్ర ప్రభుత్వం అంటోంది. ‘86 మంది హైకోర్టు జడ్జీల్ని, నలు గురు సుప్రీంకోర్టు జడ్జీల్ని కొత్తగా నియమించాం, 33 మంది హైకోర్టు జడ్జీల్ని, నలుగురు సుప్రీంకోర్టు జడ్జీల్ని కొలీజియం ప్రతిపాదించినట్టే బది లీలు చేశాం’ అన్నది కేంద్ర వాదన. ‘మేం 77 మంది జడ్జీల జాబితా ఇస్తే, కేవలం 18 మందినే ఖరారు చేశారు. మిగతా పేర్ల జాబితా పెట్టుకొని కూర్చో వడం ఏం పద్ధతి, అందులో ఎవరి విషయంలోనైనా అభ్యంతరాలుంటే వెనక్కి పంపొచ్చు కదా! మేం పరిశీలించి, సరిదిద్ది పంపుతాం’ అనేది సుప్రీం వాదన. ఎదుటివారి ఆధిపత్యాన్ని అంగీకరించరాదన్న ఇరువురి భావనే ప్రస్తుత ప్రతిష్టంభనకు కారణమని న్యాయనిపుణులభిప్రాయపడుతున్నారు. కేంద్రం తాజాగా రూపొందించిన ఎంఓపీలో ఒక ప్రతిపాదన ఉంది. కొలీ జియం ప్రతిపాదనలు ఇష్టం లేకుంటే, దేశ భద్రత కారణాలతో వీటో చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికుంది. అది తుది నిర్ణయమౌతుంది, అలాంటి నిర్ణయాధికారం ఉండటాన్ని ఆధిపత్యంగానే సుప్రీం భావిస్తున్నట్టుంది. గగుర్పాటు కలిగించే గణాంకాలు దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో పేరుకుపోయిన పెండింగ్ కేసుల్ని తలచు కుంటే గగుర్పాటు కలుగుతుంది. దేశవ్యాప్తంగా 2.72 కోట్ల కేసులు పెండిం గ్లో ఉండగా, అందులో 2.30 కోట్ల కేసులు కిందిస్థాయి (సబార్డనేట్) న్యాయస్థానాల్లో విచారణలో ఉన్నాయని ఒక లెక్క. అన్ని హైకోర్టుల్లో 40 లక్షల కేసుల వరకు, సుప్రీంకోర్టులో 60 వేల వరకు కేసులు, వివాదాలు అపరి ష్కృతంగా ఉన్నాయనేది విశ్వసనీయ సమాచారం. గత సెప్టెంబరు1 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం పెండింగ్ కేసులు 2.28 కోట్లని కేంద్ర న్యాయశాఖ అధికారికంగా వెల్లడించింది. ఇక మన దేశంలో జనాభా–న్యాయమూర్తుల నిష్పత్తి కూడా ఆశావహంగా లేదు. సగటున ప్రతి పదిలక్షల జనాభాకు 13 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు. ఐక్యరాజ్యసమితి అధ్యయనం జరిపిన 65 దేశాల్లో ఇంతకన్నా తక్కువ నిష్పత్తిలో జడ్జీలున్న దేశాలు గోటమాల, నిక రాగువా, కెన్యా ఈ మూడు మాత్రమే! ప్రతి పదిలక్షల జనాభాకు కనీసం 50 మంది జడ్జీలు సగటున ఉండాలని చాలా కాలం కిందటే లా కమిషన్ సిఫా రసు చేసింది. ఇక ఖాళీల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇదే నెల ఒకటో తేదీ నాటికి ఉన్నత న్యాయస్థానాల్లో ఈ ఖాళీల సంఖ్య 461 (1079 ఆమోదించిన పోస్టులు) అని న్యాయశాఖ వెల్లడించింది. అంటే, దాదాపు 46 శాతం పైనే ఖాళీలన్నమాట! అందులో అయిదు ఖాళీలు సుప్రీం కోర్టువి కూడా ఉన్నాయి. మన ఉమ్మడి న్యాయస్థానంలో ఆమోదించిన 61 జడ్జీ స్థానాలకు గాను 23 మంది మాత్రమే ఉన్నారు. ఇది సగం కన్నా చాలా తక్కువ. ఇక దేశంలో కింది స్థాయి న్యాయస్థానాల్లో 4,400 జడ్జీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అనుమతించిన పోస్టుల్లో ఇది దాదాపు సగం సంఖ్య. ఖాళీ లను భర్తీ చేసేలా జడ్జీల నియామకం పాలనాపరమైన నిర్ణయమే అయినా ఉన్నత న్యాయస్థానాల క్రియాశీల పాత్ర ఉంటుంది. కోర్టుల్లో కేసుల పరి ష్కారం కావడంలో జాప్యాలకు అనేకానేక కారణాలున్నా, జడ్జీల కొరత, ఖాళీలు కూడా ప్రధానమైనదేనని లా కమిషన్ 245వ నివేదిక స్పష్టం చేసింది. వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని, మౌలిక/కనీస సదుపాయాల్ని మెరుగు పరచాలని విస్పష్టంగా సిఫారసు చేసింది. అమలు ఆమడ దూరంలోనే ఉంది. ‘కేసు ఓడిన వాడు కోర్టు ప్రాంగణంలో ఏడిస్తే, గెలిచిన వాడు ఇంటికొచ్చి ఏడ్చాడ’న్న నూరేళ్ల కింద పుట్టిన నానుడి కాస్త అటుఇటుగా ఇప్పటికీ వాస్తవం కావడమే దురదృష్టకరం! సంస్కరణ లు, చొరవ అవసరం ‘దేశంలోని న్యాయస్థానాల్లో ప్రభుత్వమే ఓ పెద్ద కక్షిదారు, ఆ పరిస్థితి ఉండ కూడదు, వీలయినన్ని వివాదాల్ని ప్రభుత్వ స్థాయిలోనే పరిష్కరించుకొని న్యాయస్థానాలపై భారం తగ్గించాల’ని స్వయానా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెలవిచ్చారు. నిజమే! పాలకుల నిర్లక్ష్యం, కార్యనిర్వాహక వ్యవస్థ తోలుమందం వైఖరి వల్ల సమస్యలు, చట్టోల్లంఘనలు తలెత్తి బాధితులైన పౌరులు న్యాయస్థానాలకెక్కాల్సి వస్తోంది. ఇది చాలదన్నట్టు, పౌరులకు అనుకూలంగా కోర్టులు తీర్పిచ్చిన సందర్భాల్లో కూడా ప్రభుత్వాలు పెడచెవిన పెట్టి, న్యాయధిక్కార (కంటెప్ట్) కేసులు వేసుకోవాల్సిన పరిస్థితులు కల్పిస్తు న్నారు. ఇది పౌరులకు అదనపు కష్టం, ఓ రకంగా వేధింపే! అభివృద్ధి చెందిన దేశాలు వినియోగిస్తున్నట్టు ఆధునిక శాస్త్ర–సాంకేతికతను ఉపయోగించుకొని న్యాయ విచారణ ప్రక్రియల్లో ఇ–సిస్టమ్స్ అభివృద్ధి చేసుకోవాలి. న్యాయ వ్యవస్థలోనూ బాధ్యత–జవాబుదారీతనాన్ని వ్యవస్థాగతం చేయాల్సిన అవస రాన్ని న్యాయకోవిదులు నొక్కి చెబుతున్నారు. రెండో తరం సంస్కరణలకు వాకిళ్లు తెరవడమే కాకుండా న్యాయమూర్తులు క్రియాశీలంగా వ్యవహరిస్తూ మరింత చొరవ చూపాలి. న్యాయ జాప్యాల నివారణకు తోడ్పడుతూనే సత్వర న్యాయానికి మానవీయ దృక్పథాన్ని కనబరచాలి. యావజ్జీవ శిక్షపడ్డ కేసుల్లో సదరు అప్పీళ్లు ఉన్నత న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్నపుడు, సదరు ఖైదీలకు సానుకూల దృక్ప«థంతో బెయిలివ్వాలని హైదరాబాద్ హైకోర్టు గురువారం ఇచ్చిన తీర్పు ప్రశంసనీయం. అభియోగం ఎదుర్కొం టున్న ఒక వ్యక్తి, సత్యాసత్య నిరూపణతో నిమిత్తం లేకుండా నేరాన్ని స్వయంగా అంగీకరించినా... విధించే పూర్తి శిక్షా కాలానికి మించి, విచారణ ఖైదీలుగానే జైళ్లలో మగ్గే దుస్థితినేమనాలి? విచారణ అనంతరం దోషిగా తేలినా, నిర్దోషిగా విడుదలైనా, మన పాలనాపరమైన నిర్హేతుక కారణాలతో జైల్లో మగ్గిన సదరు కాలాన్ని ఎవరు వెనక్కి తెచ్చిస్తారు? ఖాళీల్ని భర్తీ చేస్తూ సత్వర నియామకాలు జరిపి కోట్లాది పెండింగ్ కేసుల్ని పరిష్కరించాలి. మహ నీయుడు జస్టిస్ కృష్ణ అయ్యర్ చెప్పిన ఒకమాట గుర్తుచేస్తాను. ‘‘...తొమ్మిది మంది జడ్జీల ధర్మాసనం తీర్పుతో, దురదృష్టకరమైన ప్రయోగంగా వచ్చిన కొలీజియం పక్షపాత నియామకాలెంత అసంతృప్తి నిచ్చాయో తెలుసు... అలా అని కార్యనిర్వాహక వ్యవస్థనూ విశ్వసించలేము, ఎందుకంటే, దానివల్ల నియామక ప్రక్రియలోకి రాజకీయాలు జొరబడ తాయి. ప్రధానమంత్రికి నిర్ణయాధికారాన్ని కట్టబెట్టే పద్ధతిని మనం బ్రిటిష్ పార్లమెంటరీ విధానం నుంచి అరువు తెచ్చుకున్నాం, అదెంత లోపభూయిష్ట మంటే, 30 మంది బంధువులు, పార్టీ శ్రేణుల్ని బెంచి మీదకు తెచ్చినట్టు లార్డ్ హల్స్బరీనే విమర్శలెదుర్కోవాల్సి వచ్చింది. అందుకని, సమపాళ్లలో ప్రాతి నిధ్యముండే జాతీయ న్యాయ కమిషన్ నియామకమే మంచిది. జడ్జీల పనితీరును కూడా ఇదే కమిషన్ తనిఖీ చేయాలి, పర్యవేక్షించాలి.’’ ఆయన చెప్పిన బాటలో, ప్రజాస్వామ్య మూల స్తంభాలయిన న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు సమన్వయంతో ఆలోచించి పనికొచ్చే పరిష్కారం వెతకాలి. (వ్యాసకర్త : దిలీప్ రెడ్డి ఈ–మెయిల్: dileepreddy@sakshi.com) -
ఆ ‘రాక్షస’ వధతోనే నిత్య దీపావళి
సమకాలీనం కాలుష్యమైనా, మహిళలపై నేరాలయినా, సంపద ప్రదర్శనాతత్వమైనా... ప్రభుత్వం చట్టా నికి లోబడి చర్యలు తీసుకుంటుంది. అలా ఒత్తిడి తీసుకురావడం పౌరుల బాధ్యత. అదొక్కటే సరిపోదు. ఎవరికి వారు, ఇందుకు కారణమవుతున్న తమలోని రాక్షసుడ్ని వెతికి, తుదముట్టించాలి. స్వార్థంతో పర్యావరణానికి భంగం కలిగించేలా భూమిని చెరబట్టిన హిరణ్యాక్ష హననం జరగాలి. పరకాంతను చెడు దృష్టితో చూసే కీచక సంహారం జరగాలి. సంపద ప్రదర్శనాతత్వం మితిమీరిన రావణాసుర హతం జరగాలి. అప్పుడే నిత్య దీపావళి. దీపావళి అంటేనే వెలుగుల వెల్లువ. ఆనందం వెల్లివిరిసే సంబురాల పండుగ. చీకటిపై వెలుగు, చెడుపైన మంచి, అజ్ఞానమ్మీద జ్ఞానం సాధించిన గెలుపునకు ప్రతీకగా జరుపుకునే విజయానందం. ఇది ఇంటింటా, ఇంటిల్లి పాదీ జరుపుకొనే విజయోత్సవ వేడుక! భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతీ, సంప్రదాయాల్లో చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. జగతిని పట్టి పీడిస్తున్న నరకాసురుడ్ని వధించిన రోజు నరకచతుర్థి అని, తర్వాతి రోజు వేడుకే దీపావళి పండుగని పురాణాలు చెబుతున్నాయి. రాక్షసరాజు రావణాసురుడ్ని వధించి శ్రీరాముడు లంక నుంచి సీతా–లక్ష్మణ సమేతుడై అయోధ్యకు తిరిగి వచ్చిన సంబరమే దీపావళి అంటారు. పద్మపురాణం, స్కంధ పురాణంలో ఇటువంటి పలు ప్రస్తావనలున్నాయి. అది ఏ రూపంలో అయితేనేం! రాక్షస (చెడు) సంహారం జరిగి, లక్ష్య శుద్ధితో శ్రమించిన (మంచి) వారికి విజయం చేకూరితే అదే దీపావళి. ఇలా ఎంత కాలం పురాణ గాథలు చెబుతూ–వింటూ గడుపుతాం? మనం కూడా చెడుపై మంచిని గెలిపించి విజయోత్సవ వేడు కగా దీపావళి జరుపుకోవాలనే భావన ఆధునిక తరానికి రావడం సహజం! మరిప్పుడు రాక్షసులు లేరు కదా! అనే సందేహమూ రావచ్చు. ఎందుకు లేరు! రాక్షసులు ఇప్పుడూ ఉన్నారు. కాకపోతే... వేరెక్కడో దూరంగా కాదు, మనలోనే ఉన్నారు. అందుకు, విజ్ఞులు ఒక మంచి పరిణామ క్రమాన్ని చెబుతారు. యుగ క్రమంలో... మొదటిదైన కృతయుగంలో ధర్మం నాలుగు పాదాల సాగింది కనుక అంతా మంచివారే తప్ప రాక్షసులు లేరు. తర్వాతిదైన త్రేతా యుగంలో రావణాది రాక్షసులు వేరు, దేవత్వా స్వభావంతో రాముడి వంటి నరులు, ఆంజనేయుడి వంటి వానరులు వేరు వేరు జాతులుగా ఉన్నారు. ఆ తర్వాతి ద్వాపర యుగానికి వచ్చేసరికి మనుషుల్లోనే దైవాంశ కలిగిన కృష్ణుడు, వ్యాసుడు, భీష్ముడు వంటి వారు, రాక్షసాంశ కలిగిన కంసుడు, శిశుపాలుడు, దుర్యోధనుడు వంటి వారూ ఉన్నారు. ఇక చివరిదైన ప్రస్తుత కలియుగంలో పరిస్థితి మరింతగా మారింది. ఒక మనిషిలోనే దైవ స్వభావం, రాక్షస స్వభావం వేర్వేరు పాళ్లలో ఉన్నాయి. ఆయా స్వభావాల హెచ్చు తగ్గుల్ని బట్టి మంచివారు, చెడ్డవారు. అందుకే స్వామీ వివేకా నందుడంటారు, ‘విద్య అంటే వేరేదో కాదు, మనిషిలో ఉండే దైవత్వాన్ని వివిధ రూపాల్లో వెలికితీయడమే’ అని. మరో రకంగా, మనిషిలోని రాక్షస త్వాన్ని సంహరించడమే నిత్యదీపావళి అనుకోవచ్చు. ఎంపిక చేసిన లక్ష్యా లపై దాడుల (సర్జికల్ స్రై్టక్స్)తో ఆ రాక్షస సంహారమే జరగాలిప్పుడు. ఇది కొత్త మాట కాదు... కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలని మనలోనే ఉన్న ఆరుగురు అంతశ్శత్రువులని, వాటిని జయించాలన్ని ఆర్ష సంస్కృతి చెబుతోంది. కాలుష్యకాసారంలో బతుకు దుర్భరం దేశంలోని మహానగరాల్లో వాయుకాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంటే ఆ ప్రభావం హైదరాబాద్ మీద కూడా తక్కువేం లేదు. తీవ్రంగా ఈ సమస్య నెదుర్కొంటున్న నాలుగో మెట్రో నగరంగా రికార్డులకెక్కింది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబాయి తర్వాత స్థానం మనదే! వాహనాల పొగ, దుమ్ము–దూళీ, పరి శ్రమలు వెలువరించే వ్యర్థాలు కలిసి ఈ కాలుష్యానికి కారణమవుతున్నాయి. దీనికి తోడు రోజురోజుకు చెట్టు చేమలు, మొత్తంగా హరితమే హరించిపోతూ నగరం కాంక్రీట్ వనంగా విస్తరిస్తోంది. ఆక్సిజన్–ఆక్సిజనేతర వాయువుల నిష్పత్తి మారి ప్రమాదకరంగా తయారవుతోంది. పదేళ్ల కాలంలో ఎన్నో రెట్లు పెరిగిన వాహనాల సంఖ్య, కాలం చెల్లిన వాహనాలు నిరాటంకంగా విడుదల చేసే పొగ వల్ల కూడా వాయు కాలుష్యం హెచ్చుతోంది. ఐటీ రంగం విస్తరి స్తున్న నగరం కావడంతో పెద్ద సంఖ్యలో వాడే ఎలక్ట్రిక్–ఎలక్ట్రానిక్ ఉపకర ణాలు, ఏసీల వినియోగం నగరం సగటు ఉష్ణతాపాన్నే కాక కాలుష్యాన్నీ పెంచుతోందని ఇటీవల ఓ అంతర్జాతీయ సంస్థ (ఐజేఐఆర్సెట్) జరిపిన అధ్యయనంలో వెల్లడయింది. ఫలితంగా ఛాతీ, శ్వాస సంబంధ వ్యాధులు అసాధారణ స్థాయిలో పెరిగాయి. డయాబెటిస్, క్యాన్సర్, గుండె జబ్బులు వంటివి అంతకన్నా ప్రమాదకరంగా ముదిరే పరిస్థితులున్నాయి. నగర వాసులు మైగ్రేన్ వంటి తలనొప్పులు, సొరియాసిస్ వంటి చర్మవ్యాధులు, ఆస్తమా, క్షయ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. కాలుష్య నివారణకు ప్రభుత్వాలు నిర్దిష్ట కార్యాచరణను ఆమలు పరచడమే కాదు, వ్యక్తులుగా అందరూ తమ వంతు పాత్ర నిర్వహించాల్సి ఉంది. ఉదాహ రణకు దీపావళి వేడుకల్నే తీసుకుందాం, విపరీతమైన వాయు, శబ్ద కాలుష్యం జరుగుతుందని గత అనుభవాలు చెబుతున్నాయి. కిందటి ఏడాది లెక్కలు చూస్తే, బాణాసంచాతో వాయు కాలుష్యానికి లెక్కేలేదు. సగటున 96 నుంచి 105 డెసిబుల్స్ వరకు శబ్దకాలుష్యం వెలువడింది. దీంతో చిన్నారులు, వృద్ధులు, నవజాత శిశువులు, పెంపుడు జంతువులు ఎన్ని అవస్థల పాల య్యారో! సాధారణంగా 50 డెసిబుల్స్ దాటిన శబ్దాలు వీరిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని, నవజాత శిశువులు వినికిడి శక్తి కోల్పోతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారి గుండె కొట్టుకునే వేగం పెరిగి ఇతరత్రా అనారోగ్య సమస్యలు తలెత్తడం తథ్యం. కుక్క, పిల్లి వంటివి 50 డెసిబుల్స్ దాటిన శబ్దాలు వింటే విపరీతంగా ప్రవర్తిస్తాయంటున్నారు. వాటి కర్ణభేరీ బద్దలయ్యే ప్రమాదమూ ఉంది. గాయాలు సమీప భవిష్యత్‌లో వాటి మనుగడకు ముప్పుగా పరిణమిస్తాయి. టపాసులు కాల్చినపుడు వెలువడే పొగలో సల్ఫర్‌డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, ధూళి రేణువులు రేగి పర్యా వరణానికి తీవ్ర హాని కలిగిస్తాయి. ముఖ్యంగా సల్ఫర్ డై ఆక్సైడ్ క్యూబిక్ మీటరు గాలిలో 80 మైక్రోగ్రాములు మించకూడదు. కానీ టపాసులు అధికంగా కాల్చినపుడు ఈ స్థాయి 450–500 మైక్రోగ్రాములకు చేరుతుంది. దీంతోlఊపిరితిత్తులకు హాని. బ్రాంకైటిస్ (తీవ్రమైన దగ్గు) తప్పదని వైద్యులు చెబుతున్నారు. ఇక నైట్రోజన్ ఆక్సైడ్ పెరుగుదల కూడా ఇదే స్థాయిలో ఉంటుంది. దీంతో కళ్లు, ముక్కు మండుతాయి. శ్వాసకోశాలకు తీవ్ర చికాకు కలుగుతుంది. ఇక ధూళి రేణువులు (ఎస్పీఎం) క్యూబిక్ మీటరు గాలిలో 100 మైక్రోగ్రాములకు మించరాదు. కానీ, వీటి మొతాదు క్యూబిక్ మీటరు గాలిలో 300 మైక్రో గ్రాములకు మించే పరిస్థితి ఉండటం వల్ల తీవ్ర మైన శ్వాసకోశ వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులంటున్నారు. మహిళలంటే మర్యాదలేనితనం చదవేస్తే ఉన్న మతి పోయిందని మొరటు సామెత! దీన్ని నిజం చేస్తున్నామా అన్నట్టుంటోంది మహిళల పట్ల మగవారి వైఖరి చూస్తుంటే. ఒకప్పటితో పోల్చి చూస్తే ఉన్నత చదువులు, డిగ్రీలు, సగటు విద్యార్హతలు ఈ మధ్య కాలంలో రమారమి పెరిగాయి. కానీ, మహిళల పట్ల మగవాళ్లు వ్యవహరి స్తున్నతీరు, అత్యాచారాలతో సహా జరుగుతున్న నేరాలు, నమోదవుతున్న కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించడం తగ్గకపోగా పెరగడం దీన్నే సూచిస్తోంది. విద్యార్హతలతో నిమిత్తం లేకుండా బాగా చదువు కున్న వారు కూడా మహిళల్ని న్యూనతపరిచే, అవమానించే, వేధించే, హింసించే దురాగతాలు ఈ దుస్థితికి అద్దం పడుతున్నాయి. గృహహింస (నిరోధక) చట్టం, నిర్భయ చట్టం అమల్లోకి వచ్చాక కూడా సదరు నేరాలు, నేర స్వభావం తగ్గటం లేదు. జాతీయ నేర నమోదు బ్యూరో గణాంకాలు విస్మయం కలిగిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ నేర గణాంకాల్లో అగ్ర శ్రేణిలో ఉండటం ఆందోళనకరం. ఇది ప్రధానంగా వ్యక్తి ఆలోచనా ధోరణి, వ్యక్తిత్వం, స్వభావానికి సంబంధించిన అంశం. 2015లో దేశవ్యాప్తంగా 3.27 లక్షల కేసులు నమోదు కాగా ఏపీలో 15,931, తెలంగాణలో 15,135 కేసులు నమోదయ్యాయి. ప్రతి లక్ష మహిళా జనా భాకు ఎంత మందికి ఇలాంటి నేరాలు అని లెక్కగట్టే క్రైమ్ రేటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదకర స్థితిలో ఉంది. ఢిల్లీ, అస్సాం, రాజస్థాన్ తర్వాతి స్థానం తెలంగాణ (83.1), ఏపీ (62.3)లదే అంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితి మారాలి! సంపద గర్వంతో ప్రదర్శనాతత్వం సమాజంలో ఆర్థిక అసమానతలే అనర్థమంటే, సంపద గర్వం, ప్రదర్శ నాతత్వం కొందరిలో మితిమీరుతున్న వైనం మరో అనర్థం. ఈ పోకడ ఇటీ వల కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అక్రమార్జన వల్ల తేలిగ్గా వచ్చే డబ్బు వారినిలా ప్రోత్సహిస్తుండవచ్చని అనిపిస్తోంది. ముఖ్యంగా పండుగలు, పబ్బాలు, పెళ్లి ఇతర సాంఘిక వేడుకల్లో ఈ ప్రదర్శనా∙తత్వం తారస్థాయికి చేరడం విస్మయకరం, కొన్ని సందర్భాల్లో జుగుప్సాకరం కూడా. తమ సంపదను బహిరంగ ప్రదర్శనకు పెట్టడం ధనగర్వం, ప్రదర్శనతత్వం తప్ప మరోటి కాదని, ఇది ధనిక–పేద అంతరాల్ని ఎలుగెత్తి చాటే కవ్వింపు చర్య అని సామాజిక శాస్త్రవేత్తలంటున్నారు. సినిమా సెట్టింగుల ఆర్భాటంతో ఒక్కో పెళ్లికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న వారున్నారు. కర్ణాటక మాజీ మంత్రి ఒకరు తమ కుమార్తె వేడుకకు చేస్తున్న ఆర్భాటాన్ని చూసి ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి కె. ఆర్. రమేష్‌కుమార్ నివ్వెరపోయారు. పెళ్లి వేడుకలను భారీ హంగు, ఆర్భాటంతో జరిపించి సంపదను ప్రదర్శించడాన్ని నియం త్రించాలంటూ ఆయనే ఇటీవల ఆ రాష్ట్ర శాసనసభలో ప్రైవేటు మెంబరు బిల్లును తీసుకువచ్చారు. ఎంపిక చేసిన వారికి విమాన టిక్కెట్లు, స్టార్ హోటళ్లు, లగ్జరీ కార్లు ఏర్పాటు చేసే ఖరీదైన ‘డెస్టినేషన్ మ్యారేజెస్’ వేడుకలు జరుపుతున్న సంపన్నులూ ఉన్నారు. పుట్టినరోజు, పిల్లలకి పట్టు వస్త్రాలు కట్టివ్వడం వంటి చిన్న చిన్న వేడుకలకూ భారీ ఆర్భాటాలు జరిపించే «ధోరణీ పెరిగిపోతోంది. అన్నీ కలిగిన వారిని చూసి ఆర్థిక స్తోమత లేకపోయినా కొందరు కుహనా ప్రతిష్టకు పోయి, ఇటువంటి ఆర్భాటాలకు పోయి చతికిల బడతున్నవారు పెరుగుతున్నారు. ఇలాంటి వేడుకల్లో ఆహారంతో సహా అన్నీ వృధాయే. కవి కాళోజీ అన్నట్టు ‘అన్నపు రాశులు ఒకవైపు ఆకలి మంటలు ఒకవైపు’ అన్న తరహాలో ఈ నిర్లక్ష్యపు వృధాలు ఆర్థిక అసమానతల్ని ఎత్తి చూపుతాయి. పేదల్ని రెచ్చగొట్టే ఇటువంటి చర్యలే సామాజిక అశాంతికి దారితీస్తాయి.. రాక్షస సంహారమే తరువాయి కాలుష్యమైనా, మహిళలపై నేరాలయినా, సంపద ప్రదర్శన తత్వమైనా... మరో అవాంఛనీయ పరిణామమేదైనా ప్రభుత్వం చట్టానికి లోబడి చర్యలు తీసుకుంటుంది. అలా ఒత్తిడి తీసుకురావడం సగటు పౌరుల బాధ్యత. అదొ క్కటే సరిపోదు. వీటిని నిలువరించడంలో వ్యక్తులుగా ఎవరేం చేయవచ్చ న్నది ఆలోచించాలి. ఎవరికి వారు, ఇందుకు కారణమవుతున్న తమలోని రాక్షసుడ్ని వెతకాలి. ఉంటే, తుదముట్టించాలి. స్వార్థంతో పర్యావరణానికి భంగం కలిగించేలా భూమిని చెరబట్టిన ‘హిరణ్యాక్ష’ హననం జరగాలి. పర కాంతను చెడుదృష్టితో చూసే ‘కీచక’ సంహారం జరగాలి. సంపద ప్రదర్శనా తత్వం బలపడ్డ ‘రావణ’ హతం జరగాలి. అదే చీకటిపై వెలుగు గెలుపు! అప్పుడే నిజమైన దీపావళి, నిత్యదీపావళి. (వ్యాసకర్త : దిలీప్ రెడ్డి ఈ మెయిల్: dileepreddy@sakshi.com ) -
జల జగడాలతో జాతుల వైరాలు
సమకాలీనం గాలిలాగే నీరు కూడా మానవాళి మనుగడకు ప్రకృతి ప్రసాదించిన సహజ వనరు. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కులో భాగంగానే ఎక్కడి నీటిపై అక్కడి వారికి హక్కులు సంక్రమిస్తాయనే వాదనని ఇటీవల మానవహక్కుల కార్యకర్తలతోపాటు, ఆ సంస్థలు కూడా ముందుకు తెస్తున్నాయి. వారు వినియోగించుకోగా మిగిలినవి నది దిగువకు వస్తాయనేది ఆలోచన. దీంతో, నది దిగువ ప్రాంతపు హక్కులు, నికర జలాలు, మిగులు జలాలు, దామాషా వాటా... తదితర పదాలకు కాలం చెల్లిందనేది వారి వాదన. జలజగడాలు విశ్వవ్యాప్తం. అంతటా ఉన్నాయి, ఇక్కడా ఉన్నాయి. అవసరా లకన్నా జలవనరులు తక్కువున్నపుడు తగవులు తప్పవు. గోదావరి గొడవల కన్నా, కృష్ణా కిరికిరి ఎక్కువుండటానికి అదే కారణం. కృష్ణాలో డిమాండ్ ఎక్కువ, నీటి లభ్యత తక్కువ కావడం అంతర్రాష్ట్ర జలవివాదాలకు ఆజ్యం పోస్తోంది. సమస్య కన్నా పరిష్కారం సంక్లిష్టమైనపుడు పర్యవసానాలూ బాధాకరమే! కృష్ణానది నీటి పంచాయితీలు ఎడతెగని సమస్యగా పరిణమి స్తున్నాయి. ఇప్పుడు బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తాజా తీర్పు రెండు తెలుగు రాష్ట్రాలకు మింగుడు పడటంలేదు. ఎందుకంటే, తీర్పు అను కూలంగా లేదనేది ఒక బాధయితే, సదరు తీర్పును ప్రభావితం చేసిన అంశాలు ఇంకా బాధను కలిగిస్తున్నాయి! తీర్పును అన్వయించుకుంటున్న తీరులోని స్వీయ అపరిపక్వత బాధకు మరింత కారణమౌతోంది. వెరసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తీరని అసంతృప్తితో రగులుతున్నాయి. ఆపత్కా లంలో ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం రాజకీయ కారణాలతోనే ప్రతికూ లంగా వ్యవహరించిందనే కోపం ఇద్దరికీ ఉంది. ఇక సుప్రీంకోర్టు తలుపు తట్టడమే తరుణోపాయమంటున్నాయి దాదాపు రెండు ప్రభుత్వాలు. ఇది వరకే సుప్రీం ధర్మగంటను మోగించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్తి ఇంకా పరిష్కారానికి నోచుకోలేదు. ఫలితంగా, నీటి తాజా పంపకాలకు సంబం ధించి ట్రిబ్యునల్ ఇచ్చిన అంతిమ అవార్డు (29 నవంబర్-2013) ఇంకా ‘గజెట్’రూపం పొందలేదు. నిర్దిష్ట అభ్యంతరాలతో ఉమ్మడి ఏపీ సుప్రీం కోర్టులో ఎస్సెల్పీ వేసింది. రాష్ట్రాల మధ్య నీటి పంపకాల అమలుకు ప్రాతి పదిక అయ్యేది ఆ తీర్పే! సదరు తీర్పుకై నిరీక్షించడమా? ఈ లోపున్నే మరో మారు కోర్టు మెట్లెక్కడమా? ఇదీ ఇప్పుడు ప్రభుత్వాల ముందున్న ప్రశ్న. ట్రిబ్యునల్ తాజా తీర్పు ప్రతిని చూసి, నిపుణులతో లోతుగా చర్చించి వ్యూహాత్మకంగా అడుగేయాలనుకుంటున్నట్టు ప్రభుత్వాలు సంకేతాలిస్తు న్నాయి. కృష్ణా పరీవాహక ప్రాంతాలైన నాలుగు రాష్ట్రాల్నీ కలిపి పంపకాల పునరాలోచన చేయాలన్న తెలుగు రాష్ట్రాల ప్రతిపాదనను ట్రిబ్యునల్ తోసి పుచ్చి, ‘ఇది కొత్తగా ఏర్పడ్డ మీ రెండు రాష్ట్రాల వ్యవహారమే’ అని తేల్చడంతో వారికి పాలుపోవటం లేదు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రివర్ వ్యాలీ అథా రిటీల ఏర్పాటు డిమాండ్ తెరపైకి వస్తోంది. సుస్థిరాభివృద్ధి నమూనాలో ప్రతిపాదించినట్టు ప్రకృతిగతమైన సహజ పద్ధతుల్లో ఎక్కడి నీరక్కడ నిల్వ చేయడం, ప్రత్యామ్నాయ జలవనరుల్ని మెరుగుపరచడం, సంప్రదాయ పరి జ్ఞానాన్ని వినియోగించడం అన్న పంథాలో వెళితే తప్ప పరిష్కారాలు దొరక వన్నది జల వ్యవహారాల నిపుణుల భావన. రాజకీయాంశం ప్రభావితం చేసిందా? కృష్ణా ట్రిబ్యునల్ ఇప్పుడిచ్చిన తీర్పు నిజానికి నీటి కేటాయింపులకు సంబం ధించి కాదు. తాజా వివాద పరిష్కారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకే పరిమితం చేయాలా? మొత్తం కృష్ణా పరివాహక ప్రాంతాలయిన మహారాష్ట్ర, కర్ణాటక సహా నాలుగు రాష్ట్రాల్ని కలిపి చేయాలా? అనే అంశాన్ని తేల్చింది. మహారాష్ట్ర, కర్ణాటకకు ఇదివరకే చేసిన నీటి కేటాయింపుల్ని ముట్టు కోవద్దు, తాజా వివాదాన్ని విభజనతో కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ, ఏపీలకే పరిమితం చేయండంటూ కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్కిచ్చిన (25 ఆగస్టు 2014) అఫిడవిట్టే ఈ తీర్పును ప్రభావితం చేసిందనే అభిప్రాయముంది. సదరు అఫిడవిట్ ఇప్పించడంలో ఆ రెండు రాష్ట్రాల రాజకీయ లాబీలు గట్టిగా పనిచేశాయి. మహారాష్ట్రలో అధికార పక్షంగా, కర్ణాటకలో అధికారం ఆశిస్తున్న పార్టీగా బీజేపీ నాయకత్వం అఫిడవిట్టు ఇప్పిచ్చే వ్యవహారాన్ని తనకను కూలంగా నడిపిందని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వవర్గాలు భావించడం సహజం. ముఖ్యమైన నదులన్నీ పలు రాష్ట్రాల మధ్య ప్రవహిస్తూ, తరచూ వివాదాలు రగిలే సమాఖ్య రాజ్యంలో ఇప్పటివరకు జాతీయ జలవిధానం లేకపోవడమే దారుణం. రాజకీయ అవకాశవాదమే ఇందుకు కారణమనేది మేధావివర్గం విమర్శ. నదీజలాల వినియోగం తమ చెప్పుచేతల్లో ఉండాలని, అంతర్రాష్ట్ర వివాదాలను, తద్వారా తలెత్తే ప్రజల మనోభావాలు- ఉద్విగ్న తల్ని తమ తమ రాజకీయ అవసరాలకు ఎరగా వాడుకునే ఎత్తుగడతోనే పార్టీలు ‘స్వతంత్ర నదీలోయ ప్రాధికార సంస్థ’ల ఏర్పాటుకూ మోకాలడ్డు తున్నాయనేదొక విమర్శ. సమస్య తీవ్రతను, అంటే నీటి పంపకాలతో పాటు ఏయేటి కాయేడు లభ్యత-వినియోగావకాశాల్ని ట్రిబ్యునల్ సహజ న్యాయ సూత్రాల ప్రకారం పరిశీలించడం లేదని దిగువ రాష్ట్రాలు అరోపిస్తున్నాయి. ఎగువనున్న మహారాష్ట్ర-కర్ణాటకతో కలిపి కాకుండా, కేవలం తెలంగాణ- ఏపీల మధ్యే వివాదం పరిష్కరించుకొమ్మని చెబితే తాము కొత్త వ్యూహాలు అనుసరించాల్సి వస్తుందని రెండు తెలుగు రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఫలి తంగా తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త స్పర్థలకు, వివాదాలకు ఆస్కారమేర్పడు తోంది. క్యారీ ఓవర్ కింద వంద టీఎమ్సీలు, పోలవరం-పట్టిసీమ ప్రాజె క్టులు కడుతున్నందున, ఇదివరకటి ఒప్పందం ప్రకారం తమకు వాటాగా రావా ల్సిన తొంభయ్ (45+45) టీఎమ్సీలు, మొత్తం 190 టీఎమ్సీలపై దృష్టి కేంద్రీకరించాల్సి వస్తుందని తెలంగాణ ప్రభుత్వం, వారి ఈ యత్నాల్ని అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం ఎత్తుగడల్లో ఉన్నాయి. అన్ని విధాలా పునరాలోచన అవసరం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ప్రస్తుత వ్యవహారం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిందే అనడం సబబే! అయితే, ఇక్కడ ఒక విషయాన్ని ఎగువ రాష్ట్రాలతో పాటు ట్రిబ్యునల్ కూడా పెడచెవిని పెట్టింది. నదీజలాల పంపిణి అన్నది ఫక్తు అన్నదమ్ముల ఆస్తి పంపకాల వంటిదనే వాదన తప్పు! ఎలా అంటే, ఓ కుటుంబంలోని ఉమ్మడి సంపద ఏ రూపంలో ఉన్నా, ఒకసారి పంపిణీ ద్వారా... తదనంతర కాలంలో పరస్పరం సంబంధం లేని విధంగా వేర్పరచగల ఆస్తి అది. వేర్వేరు సమయాల్లో, వేర్వేరు వాటాదారుల మధ్య కూడా పంపిణి చేయొచ్చు. ఉదాహరణకు: నలుగురు సోదరుల్లో ఇద్దరు ముందే విడిపోయినా, చివరి ఇద్దరు కొన్నేళ్లు కలిసుండి, తాజాగా వారిద్దరూ విడిపోతామంటే.... చివరి పంపిణీ వారిద్దరి మధ్యే పరిమితమౌతుంది. కానీ, నదీజలాలు అలా కాదు. వేరుపడ్డ తర్వాత కూడా సంబంధముండే వ్యవహారాలుంటాయి. తెలుగు రాష్ట్రాలు లేవనెత్తు తున్న అభ్యంతరాల్లో రెండు ముఖ్యమైన అంశాలున్నాయి. ఒకటి: రాష్ట్ర పునర్విభజన తర్వాత కొనసాగింపు పొందిన ట్రిబ్యునల్ పరిశీలనాంశాల పరిధిలో అంతర్రాష్ట్ర వివాద పరిష్కారంతో పాటు నదిలో ‘తక్కువ నీటి ప్రవాహం ఉన్నపుడు’ నీటి నిర్వహణ నిబంధనావళి (ఆపరేషనల్ ప్రోటో కాల్)ని ఖరారు చేయడం. అందుకే ప్రాజెక్టుల వారీ కేటాయింపుల అంశం ముందుకొచ్చింది. ఎగువ రెండు రాష్ట్రాల్లో జలాల స్థూల కేటాయింపులు జరిపి, కింది రాష్ట్రాల్లో ప్రాజెక్టుల వారీ నీటి కేటాయింపులంటే, సమతూకం లేకుండా ఆపరేషన్ ప్రోటోకాల్ ఎలా ఆచరిస్తారు? అన్నది తెలుగు రాష్ట్రాల అభ్యంతరం. ఈ విషయాన్ని ట్రిబ్యునల్ ముందు ఏపీ న్యాయవాది ఎ.కె. గంగూలీ సమర్థంగా వినిపించే యత్నం చేసినా ట్రిబ్యునల్ పట్టించుకున్నట్టు లేదు. రెండు: ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారం ఎగువ రాష్ట్రాలు తమ రిజర్వాయర్లలో నీటిని నింపుకుంటూ వెళితే... సీజన్ ఆలస్యమైనప్పుడు, వర్షాలు తక్కువగా కురిసినప్పుడు దిగువ రాష్ట్రాల పరిస్థితేమిటి? కోటా నింపుకునే వరకు దిగువకు చుక్క నీరొదలరు. ఇందుకు ట్రిబ్యునల్ చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లేమిటి? శూన్యం. సీజన్ల వారీగా నీటి లభ్యతను బట్టి అన్ని రాష్ట్రాల మధ్య దామషా పద్ధతినైనా పంపకాలు జరపాలి. ఇదిలేని దుస్థితి వల్లే అక్టోబర్ వరకు కిందికి నీటిని వదలటం లేదు. ఇక.. నికర జలాలనో! మిగులు జలాలనో! దిగువ రాష్ట్రాలకు ఎన్ని టీఎమ్సీలు కేటా యిస్తే మాత్రం ఏమిటి ప్రయోజనం? దిగువన సాగే జరగదు కదా? అనే ప్రశ్న తలెత్తుతోంది. మారిన వాతావరణ, భౌగోళిక, నిర్వహణా పరిస్థితుల నేపథ్యంలో నాలుగు రాష్ట్రాల్ని కలిపి తాజాగా ఆలోచన చేయాలన్నది ఆ విజ్ఞప్తి వెనుక భావన. ఒక నది బేసిన్ నుంచి ఇతర నదీపరీవాహక ప్రాంతా లకు కూడా ఎగువ రాష్ట్రాల్లో యథేచ్ఛగా నీటి మళ్లింపులు జరుగుతున్నందున పునరాలోచన, తాజా పరిశీలన అవసరమని దిగువ రాష్ట్రాలంటున్నాయి. ఇందుకు పూర్తి భిన్నమైన వాదన కూడా ఉంది. గాలిలాగే నీరు కూడా మాన వాళి మనుగడకు ప్రకృతి ప్రసాదించిన సహజవనరు. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కులో భాగంగానే ఎక్కడి నీటిపై అక్కడి వారికి హక్కులు సంక్రమిస్తాయనే వాదనని ఇటీవల మానవహక్కుల కార్యకర్తలు, సంస్థలు ముందుకు తెస్తున్నాయి. వారు వినియోగించుకోగా మిగిలినవి నది దిగువకు వస్తాయనేది ఒక ఆలోచన. దీంతో, నది దిగువ ప్రాంతపు హక్కులు, నికర జలాలు, మిగులు జలాలు, దామాషా వాటాలు... తదితర పదజాలానికి కాలం చెల్లిందనేది వారి అభిప్రాయం. నది దిగువ ప్రాంతపు హక్కులనే వాదనను వరల్డ్వాటర్ ఫోరమ్ కూడా కొట్టివేసిందని వారు ఉటంకిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలే పరిష్కారం కృష్ణా తొలి ట్రిబ్యునల్ బచావత్ (‘ఏ’స్కీమ్)లోనే నదీలోయ ప్రాధికార సంస్థ (ఆర్వీయే)ల ఏర్పాటు ప్రతిపాదన ఉంది. రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాక ‘బి’ స్కీమ్‌కు వెళ్లారు. వచ్చే శీతాకాల సమావేశాల్లో ఆర్వీయే బిల్లు తేవాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వాటిని కేంద్ర జలవనరుల మంత్రి నేతృత్వంలో ఉంచాలని ముసాయిదాలో ప్రతిపాదిస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే, మళ్లీ అంతా రాజకీయమే! అలా కాకుండా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలుగా తేవాలి. అవసరాన్ని బట్టి సుప్రీంకోర్టు మాత్రమే జోక్యం చేసుకోవాలి. పాలకుల ఆలోచనల్లోనూ మార్పు రావాలి. పెద్ద పెద్ద ప్రాజె క్టులు మాత్రమే పరిష్కారంకాదు. అత్యధిక ప్రాజెక్టులున్న మహారాష్ట్రలోనే కరవులెక్కువ, రైతు ఆత్మహత్యలెక్కువ. హనుమంతరావు వంటి నిపుణులు చెబుతున్నట్టు సంప్రదాయక ప్రత్యామ్నాయాలపై శ్రద్ధ పెట్టాలి. వాన నీటిని ఎక్కడికక్కడ నిలపాలి. ఉపరితల, భూగర్భ జలమట్టాల్ని మెరుగుపరచాలి. తేమ పెంచే- పరిరక్షించే ప్రక్రియల్ని బలో పేతం చేయాలి. రెండు దశాబ్దాల కింద, 1996 మే నెల, ‘రాజ్యం-సంక్షేమం’ అంశంపై విశాఖపట్నంలో జరిగిన సెమినార్లో దివంగత మేధావి కె. బాలగోపాల్ చెప్పిన మాట మననం చేసు కోవాలి. ‘‘గాలిలాగే నీరు ప్రకృతి వనరు. అందరికీ సమానంగా అందు బాటులో ఉండాలి. ఇదొక మౌలిక ప్రజాస్వామ్య సూత్రమని నేననుకుం టాను. ఈ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి నా అంచనా ఏంటంటే, అన్నిరకాల నీటివనరుల్నీ కలిపి అందరూ వాడుకునేటట్టయితే.. ప్రతి ఎక రాకూ ఒక పంటకు నీరివ్వచ్చు. ఈ మాట కొన్ని ప్రాంతాల వాళ్లకి పెద్ద విషయం అనిపించకపోవచ్చు. కానీ, అనంతపురం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ మాటంటే వాళ్లెంత ఆనందపడతారో! ప్రాణం లేచొచ్చినట్టుగా అనిపిస్తుంది. నీళ్లు అనే వనరును పంచకోవడం ఒక ప్రజాస్వామిక సూత్రంగా అన్ని ప్రాంతాల వాళ్లు- ఒక ప్రాంతానికి వ్యతిరేకం, ఇంకొక ప్రాంతానికి అను కూలం అని కాదు- ఒప్పుకోవాలి’’ దిలీప్ రెడ్డి ఈమెయిల్: dileepreddy@sakshi.com -
సర్కారు సామాన్యుని వరిస్తేనే..!
సమకాలీనం జల్లాల పెంపుపై విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో కొంత నిజమున్నా, ప్రక్రియను నిలిపివేయదగినంత పసలేదు. ఏకపక్షంగా తప్ప శాస్త్రీయంగా జరగలేదని, పారదర్శకత లోపించిం దని, ప్రత్యర్థుల్ని దెబ్బతీసే రాజకీయ ఎత్తుగడలతో పాలకపక్షం జరిపించిందని విమర్శిస్తున్నారు. ఒక న్యాయ కమిషన్ వేసైనా స్వతంత్రంగా జరిపించి ఉండాల్సిందనేది వాదన. జిల్లా విభజనకు జనాభానో, నైసర్గిక స్వరూపాన్నో, సంస్కృతినో, గ్రామీణ-పట్టణ స్వభా వాన్నో... దేన్నీ ప్రామాణికం చేసుకోకుండా అడ్డగోలుగా జరిపించారనేది విపక్షాల విమర్శ. నిజమైన పరిపాలనా వికేంద్రీకరణకు సమయం ఆసన్నమైంది. అంతి మంగా ప్రజాప్రయోజనాలే లక్ష్యమై, నికర ఫలితాలు వారికి లభించేలా జరగాలి. ఇది ప్రభుత్వాలు స్వచ్ఛందంగా చేస్తే సరేసరి! చేయకపోతే పౌరులే పూనిక వహించి బలవంతంగానైనా జరిపించాల్సి వస్తుందనేది రెండో అభిప్రాయానికి తావులేని సత్యం. ఎప్పటికిది సాకారమౌతుందన్నది ప్రభుత్వ నిర్వాకాలపైన, అంతకు మించి పౌరసమాజం చేతనపైనా ఆధారపడి ఉంది. ప్రభుత్వాలు తీసుకొస్తున్న పాలనా మార్పులు అంతిమంగా ప్రజలకేమైనా మేలు చేస్తాయా? అన్నది ఇప్పటికిప్పుడు సమాధానం లభించని వేయి రూకల ప్రశ్న! మేలు జరిపించే క్రమంలో జిల్లాల విభజన ఓ బలమైన ముందడుగనే అభిప్రాయాన్ని అత్యధికులు అంగీకరిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిదొక చర్చనీయాంశం. తెలంగాణలో పెద్ద సంఖ్యలో కొత్త జిల్లాలేర్పడ్డాయి, అందులో భాగంగా రెవెన్యూ డివిజన్లు, మండలాలు పెరి గాయి. మరి ఆంధ్రప్రదేశ్‌లోనూ జిల్లాల విభజన చేస్తారా? అన్నది తరచూ ప్రస్తావనకు వస్తోంది. వికేంద్రీకరణ, జిల్లాల విభజన సంగతలా ఉంచితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఒక్కొక్క అడుగూ అధికార కేంద్రీ కరణవైపే సాగుతోంది. తానూ, తన తనయుడే కేంద్రబిందువులుగా అధి కారమంతా గుప్పిట పట్టే చర్యలు ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో కొట్టొచ్చి నట్టు కనిపిస్తున్నాయి. తెలంగాణ సాకారమై తొలి ప్రభుత్వం ఏర్పడ్డ నుంచీ క్రమంగా ఇటువంటి విమర్శ నెదుర్కొంటున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఒక్కదెబ్బతో విమర్శకుల నోళ్లు మూయించారని పాలకపక్షం భావన. కొత్త జిల్లాల ఏర్పాటు దేశాన్నే అబ్బురపరచిన గొప్ప పాలనా సంస్కరణ అని స్వయంగా ముఖ్యమంత్రే చెబుతున్నారు. అది నిజంగా పాలనా సంస్కరణా? పాలనలో భాగంగా జరిగిన సంస్థాగత మార్పా? అన్న మీమాంస రాజకీయవర్గాల్లో చక్కర్లు కొడుతోంది. చిన్న జిల్లాలతో పాలన పౌరులకు మరింత చేరువ వుతుందనడంలో సందేహం లేదు. కానీ, అదే ఇప్పుడున్న ప్రధాన సమస్యల న్నిటికి పరిష్కారమౌతుందా? దీనికి తోడు ఇంకేమైనా జరగాలా? రాజకీయ వ్యవస్థ-అధికార యంత్రాంగంలో బాధ్యత, జవాబుదారీతనం పెరక్కుండా జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఎన్నొస్తే మాత్రం ఏమిటి ప్రయోజనం? ఆ జవాబుదారీతనం పెరగడానికి ఏం చేస్తారు? అన్న ప్రశ్నలకు నిర్దిష్టంగా సమాధానం లేదు. వికేంద్రీకరణే బాబుకు పొసగదేమో! పాలనా సంస్కరణల్లో వికేంద్రీకరణ కీలకాంశమే! కానీ, అసలైన వికేంద్రీకరణ స్ఫూర్తి మూడంచెల పాలనా వ్యవస్థలో ఉంది. 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా చట్టబద్ధం చేసుకున్నట్టు ‘స్థానిక సంస్థలకు అధికారాల బదలాయింపు’తో జరిగే పాలనా వికేంద్రీకరణలో ప్రజలు ప్రత్యక్షంగా ప్రయోజనం పొందుతారు. స్థానిక సంస్థలు బలోపేతమవుతాయి. గ్రామం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడతాయి. ఇప్పుడు తెలంగాణలో జరిగింది జిల్లాల్ని విభజించి చిన్న జిల్లాలు చేయడమే! మిగతా పాలనావ్యవస్థ అంతా యథాతథం. ఈపాటి చొరవ కూడా లేని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారాన్ని క్రమంగా కేంద్రీకృతం చేస్తున్నారు. 1996-2004 నాటి ఆయన పాలననే మించి రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ ఇప్పుడు నిర్వీర్యం చేస్తున్నారు. రాజ్యాంగ, చట్ట, సంప్రదాయకంగా వస్తున్న కొన్ని పాలనా ప్రక్రియల్ని ఒకటొకటిగా ధ్వంసం చేస్తున్నారు. ఏదీ ఎవర్నీ చేసుకోనివ్వరు, అన్నిటికీ తానే అంటారు. ఇద్దరు ముగ్గురు మినహా మంత్రి వర్గమంతా డమ్మీ! మరోవైపు తనయుడు లోకేశ్‌బాబును రాజ్యాంగేతరశక్తిగా బలోపేతం చేస్తున్నారు. మామ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కర్షక పరిషత్ హోదాతో తాను వ్యవహరించినటే,్ట ఆ వారసత్వాన్ని బాబు ఇప్పుడు లోకేశ్బాబుతో కొనసాగిస్తున్నారు. చినరాజప్ప వంటి సీనియర్ నాయకుడి తోనూ లోకేశ్ అమర్యాదగా వ్యవహరించడానికి ఇదే కారణం! కొత్త రాష్ట్రం ఎదుగుదలకు దోహదపడే... విద్యుత్తు, పరిశ్రమలు, మౌలికసదుపాయాలు- పెట్టుబడులు (ఐఅండ్ఐ), టూరిజం, శాంతిభద్రతలు వంటి కీలక శాఖలన్నీ సీఎం తన వద్దే ఉంచుకున్నారు. మిగతా అన్ని ముఖ్య శాఖల సమీక్షలూ తానే నిర్వహిస్తారు. సమీక్షల తాకిడి ఎంత అధికమంటే, ఫలితాల సాధన సంగ తలా ఉంచితే, రెండు సమీక్షల మధ్య ఉన్నతాధికారులకు ఊపిరి తీసుకునే వెసులుబాటు కూడా ఇవ్వరు. ఆర్థికశాఖను గురువారం సమీక్షించారు. 5 రోజుల వ్యవధితో ఈ నెల 18న, మరో 3 రోజుల వ్యవధితో 21న మళ్లీ సమీక్షిస్తారట! మధ్య రోజుల్లో ఈ సమీక్షలకు నివేదికలు సిద్ధం చేయడంలోనే అధికారులు తలమునకలవుతారు. ఇక ఆయా సమీక్షల్లో నిర్ణయించింది అమలు చేసేదెప్పుడు? నిర్ణయాల మేర పనులు జరపాల్సిన అధికారులు, గంటల పాటు ఏకపక్ష ప్రసంగాలతో సాగే సమీక్ష ముగిస్తే చాలు... ‘హమ్మయ్య!’ అని ఊపిరి తీసుకోవడం అలవాటు చేసుకుంటున్నారు. సీసీ కెమెరాల ద్వారా మానిటర్ చేసే పోలీసు భద్రతా వ్యవస్థకు కూడా ‘నేనే చీఫ్ కమాండర్’ అంటారు ముఖ్యమంత్రి. కాంట్రాక్టు పనుల బిల్లుల చెల్లింపులు ఆన్లైన్లో అని బయట ప్రకటిస్తారు. కానీ, లోలోపల జరిగేది వేరు. తన జోక్యం లేకుండా ఏదీ ఆమోదం పొందదు. బిల్లులు ఓకే అవ్వాలంటే తనను కలవాల్సిందే! మధ్యలో ఉన్న వ్యవస్థలన్నింటినీ త్రోసిరాజని, అట్టడుగు స్థాయి ఎమ్మార్వోలతో, ఇంజనీర్లతో ముఖ్యమంత్రి తానే మాట్లాడుతారు. రెయిన్‌గన్ ఉపయోగాన్నీ తానే పురమాయిస్తారు. కానీ, జరిగే ఏ తప్పిదానికీ స్వయంగా బాధ్యత తీసుకోరు, జవాబుదారితనం చూపరు. ఇదీ వరస! పౌరకేంద్రక పాలనే ముఖ్యం రాజకీయ, అధికార వ్యవస్థ బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రజల అవసరాల్ని సమర్థంగా తీరిస్తేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది. అభివృద్ధి, సంక్షేమం, నియంత్రణ అన్న మూడు రకాల ప్రధాన బాధ్యతలు నిర్వహించే ప్రభుత్వం అన్ని స్థాయిల్లోనూ జనహితం అన్న దృష్టి కోణంలోనే పనిచేయాలి. చట్టం నిర్దేశించే నిబంధనలకు లోబడి వ్యవహారాలన్నీ అవాంతరాలు రాకుండా, రాజకీయ ప్రమేయాలు-జోక్యాలు అవసరం లేకుండా జరిగిపోయే కార్యా చరణ నిత్యం అవసరం. ఇందుకు ఏర్పాటయ్యే వ్యవస్థ నిర్మాణం, విధానాలు, నిర్ణయాలు, పనితీరు అన్నీ ఈ దిశలోనే ఉండాలి. అట్టడుగు స్థాయిలోనూ పౌరుల పనులు సవ్యంగా జరగాలి. వారికి ప్రభుత్వ సేవలు సజావుగా అందాలి. పలు అంచెల్లో ప్రభుత్వం విస్తరించి ఉండే మన వ్యవస్థలో, దీనికి జిల్లా పరిమాణం పెద్దదా? చిన్నదా? అన్నది అంతగా ప్రామాణికం కాదు, అది కొంతవరకే! పాలనా సౌలభ్యానికి చిన్న రాష్ట్రాలెంత సమర్థనీయమో, చిన్న జిల్లాలూ అంతే అనుసరణీయమన్నది స్ఫూర్తి. ప్రభుత్వ సేవలు అందు కునే క్రమంలో సామాన్యులకు తక్కువ శ్రమ-ఎక్కువ సౌలభ్యం కలిగించేలా చూసుకోవడంలో జిల్లా చిన్నదిగా ఉండటం కొంతమేర ఉపయోగకరం. అంతకు మించిన ప్రయోజనం మరొకటుంది. భౌగోళికంగా పరిమాణం తగ్గడం వల్ల జిల్లా అత్యున్నతాధికారి అయిన కలెక్టరుతో సహా జిల్లా ముఖ్య అధికారులందరికీ తమ అధీనంలోని శాఖాపరమైన వ్యవస్థపై నిఘా, నియం త్రణ తేలికవుతుంది. కచ్చితంగా ఫలితాలు రాబట్టుకునేలా చూసుకునే తీరిక, వెసలుబాటు వారికి లభిస్తుంది. అది ప్రజలకుపయోగమే! సగటున 50-60 మండలాలపై నియంత్రణ కన్నా 15-25 మండలాలపై నియంత్రణ సహజం గానే సులువవుతుంది. తమపై గట్టి నిఘా ఉన్నట్టు తెలిసి కింది వ్యవస్థ కూడా భయంతో పనిచేసే వాతావరణం పెరుగుతుంది. జిల్లా పెద్దగా ఉన్నపుడు జిల్లా కేంద్రంలో పనుల కోసం దూరప్రాంతాల నుంచి వెళ్లే వారికి కొంత ఇబ్బందయ్యేది. చిన్నదవడంతో అలాంటి వారికి ఇప్పుడా శ్రమ తప్పుతుంది. గ్రామ సభకు నిర్ణయాధికారం లేకుండా, ప్రాథమిక వైద్య కేంద్రంలో వైద్యు లు-మందులు అందుబడాటులో రాకుండా, సర్కారు కార్యాలయాల్లో చేయి తడపనిదే పనులు జరక్కుండా, బడులకు వరుసగా వారం-పది రోజులు రాకున్నా ఒకే రోజు వచ్చి సంతకాలు పెట్టుకునే టీచర్ల పద్ధతి మారకుండా 10 జిల్లాలు 31 అయితే మాత్రం ఏమిటి ప్రయోజనం అనే ప్రశ్న తలెత్తుతోంది. వీటన్నిటినీ పౌర సమాజం జాగ్రత్తగా గమనించాలి. మార్పు ఏ కొత్త ఫలి తాలూ ఇవ్వకుండా, మళ్లీ పాతపద్ధతిలోకే జారిపోయే దుస్థితిని అడ్డుకునే కాపలాదారుగా వ్యవహరించాలి. జనం చైతన్యం పొంది ఈ సంధికాలంలో అప్రమత్తంగా ఉండకపోతే, ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణపై శ్రద్ధ చూపక పోతే ఆశావహ దృక్పథంతో తెచ్చిన మార్పు కూడా ప్రతికూల ఫలితాలిచ్చే ప్రమాదముంది. అశ్రద్ధ చేస్తే అనర్థమే! జల్లాల పెంపుపై విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో కొంత నిజమున్నా, ప్రక్రి యను నిలిపివేయదగినంత పసలేదు. ఏకపక్షంగా తప్ప శాస్త్రీయంగా జరగ లేదని, పారదర్శకత లోపించిందని, ప్రత్యర్థుల్ని దెబ్బతీసే రాజకీయ ఎత్తుగ డలతో పాలకపక్షం జరిపించిందని విమర్శిస్తున్నారు. ఒక న్యాయ కమిషన్ వేసైనా స్వతంత్రంగా జరిపించి ఉండాల్సిందనేది వాదన. జిల్లా విభజనకు జనాభానో, నైసర్గిక స్వరూపాన్నో, సంస్కృతినో, గ్రామీణ-పట్టణ స్వభా వాన్నో... దేన్నీ ప్రామాణికం చేసుకోకుండా అడ్డగోలుగా జరిపించారనేది విపక్షాల విమర్శ. అందులో కొంత వాస్తవముంది. ఇంకా కొన్ని సమాధా నాలు రావాల్సిన సంక్లిష్ట ప్రశ్నలున్నాయి. రాజ్యాంగం అధికరణం 371-డి ప్రకారం ఉన్న జోనల్ వ్యవస్థను ఏం చేస్తారు? మేడ్చెల్ వంటి జిల్లాలో పరి మితంగా ఉన్న అయిదారు జడ్పీటీసీల సంగతేంటి? పక్క జిల్లాలో భాగంగానే కొనసాగిస్తారా? 2019లో పదవీ కాలం ముగిశాక వాటినేం చేస్తారు? ఓ జిల్లాలో 40 లక్షల జనాభా ఉంటే మరో జిల్లాలో 5 లక్షలే ఉంది, ఇంత అసమ తూకంతో ఎలా? ఇవన్నీ శేష ప్రశ్నలే! జిల్లాల పెంపును... ఉద్యోగులకు పదో న్నతులకు, కొత్తగా కొన్ని నియామకాలకు, రాజకీయ నిరుద్యోగుల పున రావాసానికే పరిమితం చేయొద్దని సామాజిక వేత్తలు సూచిస్తున్నారు. అభి వృద్ధి-సంక్షేమ కార్యక్రమాల అమలు, సేవల విస్తరణకు ప్రభుత్వం శ్రద్ధ తీసు కోవాలి. అవినీతి రహిత పాలనను అందిస్తున్నామని సర్కారు పెద్దలెంత చెబుతున్నా అన్నిస్థాయిల్లోనూ ఇప్పటికే అది బలపడిపోయింది. రాష్ట్రమంతా అదే ప్రాంతం, అన్నే వనరులు, అంతే జనాభా, అవే అవసరాలు... కానీ జిల్లాల సంఖ్య మూడింతలయింది. అధికారులూ పెరుగుతున్నారు. అదే నిష్పత్తిలో వివిధ స్థాయి రాజకీయ ప్రతినిధులూ పెరుగుతారు. ఇప్పుడున్న అవినీతిని నియంత్రించకుంటే, సగటున తలసరి లంచాలు రెండింతలో, మూడింతలో అయ్యే ప్రమాదముంది. పెరిగిన జిల్లాల్లో అభివృద్దికి బదులు అవినీతి మూడింతలయితే మాత్రం అది పెనంలోంచి పొయ్యిలో పడ్డట్టే! అప్పుడు... పెరిగిన మన నేతలు, అధికారుల్ని తలచుకుంటూ బాలగంగాధర తిలక్ కవితను మననం చేసుకోవాల్సిందే. ‘‘దేవుడా రక్షించు నా దేశాన్ని... పెద్దమనుషుల నుంచి పెద్దపులుల నుండి/నీతుల రెండు నాల్కలు సాచి బుసలుకొట్టే నిర్హేతుక కృపా సర్పాల నుండి... వారి వారి ప్రతినిధుల నుండి...’’ అని పాడుకోవాల్సి వస్తుంది, తస్మాత్ జాగ్రత్త! వ్యాసకర్త: దిలీప్ రెడ్డి ఈమెయిల్: dileepreddy@sakshi.com -
బతుకంతా పండుగ కావాలి!
సమకాలీనం పూలను పేర్చి చేసే బతుకమ్మల పండుగ ప్రకృతి పూజే! పూలు నవ్వినట్టే స్త్రీలు సంతోషంగా ఉండాలి. బతుకమ్మ పండక్కి పుట్టింటి కి ఆడబిడ్డలొస్తేనే కళ. కొడుకైతేనేం, కూతురై తేనేం అన్న ధ్యాస, ఆడ బిడ్డే ఇంటికి కళ అన్న స్పృహ తగ్గుతోంది. గతంలో ఈ పండుగ నాటికి వర్షాలు కురిసి, చెరువులు నిండి, ఏర్లు పొంగి పారేవి. మానవ ప్రవర్తనను బట్టే ప్రకృతి స్పందిస్తుందేమో! ఈ సారి కాలం బాగుంది. చిన్న జిల్లాలతో పల్లెలు, గ్రామసీమల అవకాశాల్ని మెరుగుపరుస్తున్నారు. అలాగే మహిళల అవకాశాల్నీ విస్తృతపరచాలి. పల్లెకు పండుగొచ్చింది. అంతకు ముందే పండుగ కళొచ్చింది. ప్రకృతి చల్లని చూపూ తోడవడంతో తెలంగాణ చెరువులన్నీ నేడు నీటితో నిండి కళకళలాడు తున్నాయి. చెరువంచుల్లో ఏపుగా ఎదిగిన సర్కారు తుమ్మ కొమ్మ కొసలు, తూటి పొద చివర్లు వయ్యారంగా వంగి నీటిని ముద్దాడుతున్నాయి. పల్లెకు ఆనుకొనో... ఆ పక్కో, ఈ పక్కో నెలకొన్న చెరువుల్లో పరుపులా పరుచుకున్న నీరు ఎండకు వెండిలా తళుక్కున మెరుస్తోంది. మొత్తమ్మీద ఊరి వెలుగే వేరుగా ఉంది. ఊరూరా బతుకమ్మల ఆటలు జోరుమీదున్నాయి. రంగుల కల బోతగా బారులుతీరిన మహిళలు పల్లెకాంతికి వర్ణాలద్దుతున్నారు. అంతటా ఆనందం వెల్లివిరుస్తోంది. బతుకు కథలే నేపథ్యంగా అల్లుకున్న బతుకమ్మ పాటలు ఊరుమ్మడి స్వరాలై ఉబికి వస్తున్నాయి. సాయంత్రం ఆట కాగానే రోజువారీ బతుకమ్మలు చెరువుల్ని చేరి, అలల కదలికలపై తేలుతూ సాగు తున్నాయి. ఆఖరునాడు సద్దుల బతుకమ్మ, ఆ పైన దసరా! అదే రోజున కొత్త జిల్లాల ఆవిర్భావం. పాలనా వికేంద్రీకరణ, దశాబ్దాల కలకు కార్యరూపం. ఇక సందడే సందడి! పండుగంటేనే సంబురం. ఏటా పండుగలొస్తుంటాయ్, పోతుంటాయ్! మనస్ఫూర్తిగా ఆనందం నింపే పండుగలే ప్రత్యేకంగా నిలు స్తాయి. ఈసారి రాష్ట్రమంతా నెలకొన్న వాతావరణమే అలా ఉంది. పాత బంగరు రోజులు గుర్తొస్తున్నాయి. అన్నీ వ్యవసాయాధారిత గ్రామాలయినం దుకేమో... ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పండక్కి ముందే కళ వచ్చేసింది. కాలం కలిసివస్తేనే ఏదైనా! ప్రభుత్వాలు, పాలకులు ఎన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా... ప్రకృతి సహకరించకపోతే, అవేవీ పూర్తి ఫలితాలి వ్వవు. ప్రభుత్వాలు చొరవ తీసుకోకున్నా ప్రగతి శూన్యం. సంవత్సరాల తరబడి వర్షాలు లేక కరవుతో అల్లాడినా క్రమం తప్పకుండా ఏటా పండుగలు వస్తూనే ఉంటాయి! కానీ, పండుగ పండుగలా ఉండదు. ఆనందం అడుగం టుతుంది. అంతా మొక్కుబడి వ్యవహారంలా సాగుతుంది. బలవంతంగా ముఖానికి నవ్వు పులుముకోవడమూ కష్టమౌతుంది. కాస్త ఆలస్యమైనా ఇటీవల వర్షాలు బాగా కురిశాయి. అంతకు ముందు... సకాలంలో వానలు రాక కొంత, పండిన అరకొర ఖరీఫ్ పంట దెబ్బతిని ఇంకొంత నష్టపోయింది రైతాంగం. ఈ పరిస్థితి వినాయక చవితి పండుగలో కనిపించింది. కానీ, రబీ పంటలకు భరోసా కల్పిస్తూ సమృద్ధిగా కురిసిన వానలు, నిండిన చెరువులు భవిష్యత్తుపై ఎన్నో ఆశలు కల్పిస్తున్నాయి. మిషన్ కాకతీయ పుణ్యమా అని భూగర్భజల మట్టాలూ పెరిగాయి. సదరు ఆనందం ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఊరూరా ప్రతిబింబిస్తోంది. దీనికొక శాశ్వతత్వం కావాలి. సమానావకాశా లతో మహిళలకు మంచి రోజులొచ్చి, ఉపాధి దొరికి యువతరం పెడదారి వీడితే గ్రామాల్లో ఆనందం పండుగై కలకాలం నిలుస్తుంది. ప్రకృతికి ప్రతీక బతుకమ్మ వర్షాకాలం మొదలయ్యాక విరివిగా పూసే పూలను పేర్చి చేసే బతుకమ్మల పండుగ నిజానికి ప్రకృతి పూజే! గుమ్మడాకులో అందంగా పేర్చే బతుకమ్మకు నిండుగా నవ్వుతున్నట్టుండే తంగేడు, గునుగు పూలు తప్పనిసరి. నట్టింట మహిళలు కలకాలం నవ్వుతూ ఉంటేనే బతుకు పండుగకు సంబురం! ‘కలకంఠి కంట కన్నీరొలికిన ఇంట సిరితానుండనొల్లద’న్న పెద్దల మాట అక్షర సత్యం. బతుకమ్మలో పూలు నవ్వినట్టే ఇంటింటా స్త్రీలు సంతోషంగా ఉండాలి. ‘పుష్పలావికల’ని వ్యాసం రాస్తూ దేవులపల్లి కృష్ణ శాస్త్రి అన్నట్టు ఆడపిల్లలంటేనే పూలు. పెళ్లయిన కొత్తలో అయిదారేళ్ల దాకా అమ్మాయిలు తప్పనిసరిగా బతుకమ్మ పండక్కి పుట్టింటికొస్తారు. అప్పుడా ఇంటి కళే వేరు! పది రోజుల పాటు సందడి సందడిగా ఉంటుంది. తలిదండ్రుల కళ్లల్లో ఆ వెలుగు ప్రతిఫలిస్తుంది. కూతురైతేనేం? కోడలైతేనేం? ఆడపిల్ల ఆడపిల్లే! ఆ స్పృహ మనవాళ్లకి కొరవడుతోంది. కొడుకైతేనేం? కూతురైతేనేం? బిడ్డ బిడ్డే! అన్న ధ్యాసా తగ్గుతోంది. మానవసంబంధాలు మాసిపోయి ఆర్థికబంధా లుగా మారుతున్న ప్రపంచీకరణలో ఆడపిల్లను భారమని భావిస్తున్నారు. భ్రూణ హత్యలతో పుట్టకముందే కడతేరుస్తున్నారు. 1980-90ల తర్వాత పెచ్చుమీరిన ఈ దురాలోచనల ఫలితం, ఈ రోజు యుక్తవయసు యువతీ- యువకుల నిష్పత్తి గగుర్పాటు కలిగిస్తోంది. పెళ్లీడు మగపిల్లలు పది మంది ఉంటే, అదే వయసు ఆడపిల్లలు నలుగురు కూడా లేరు. మనమెటు పయ నిస్తున్నాం? ఒకప్పుడు ఈ నిష్పత్తి భిన్నంగా ఉంటే సంతోషించేవారు! ‘‘ఇద్దరక్క చెల్లెండ్ల ఉయ్యాలో ఒక్కూరికిచ్చి ఉయ్యాలో..... ఒక్కడే మా యన్న ఉయ్యాలో వచ్చన్నా పోడు ఉయ్యాలో’’అని పాడుకోవడంలోనే ఆ ఆర్తి, ఆప్యాయతలు, అనుబంధం, ఆనందం ప్రస్ఫుటమౌతాయి. ‘‘ఎట్లొత్తు చెల్లెలా ఉయ్యాలో ఏరడ్డమాయె ఉయ్యాలో!’’ అంటే బతుకమ్మ పండుగ నాటికి సంతృప్త స్థాయిలో వర్షాలు కురిసి, చెరువులు నిండి, ఏర్లు పొంగి పారేవి. మానవ ప్రవర్తనను బట్టే ప్రకృతి ప్రతిస్పందిస్తుందేమో! ఏమైతేనేం ఈ సారి కాలం బాగుంది. చిన్న జిల్లాల ఏర్పాటుతో పాలనను వికేంద్రీకరించి అన్ని పల్లెలు, గ్రామసీమల అవకాశాల్ని మెరుగుపరుస్తున్నారు. పురుషులతో పాటు మహిళల అవకాశాల్నీ విస్తృతపరచాలి. ప్రభుత్వ విధానాల్లో, అభి వృద్ధి-సంక్షేమ కార్యక్రమాల్లో వారికి ప్రాతినిధ్యం, ప్రాధాన్యత పెంచాలి. జెండర్ బడ్జెట్ స్పృహ ప్రభుత్వ ప్రతిపాదనల్లో ప్రతిబింబించాలి. అప్పుడే, ఆకాశంలోనే కాదు అవకాశాల్లోనూ సగం నువ్వు సగం నేను అని సగర్వంగా చెప్పగలిగే పండుగ! పండుగంటే అదికాదని చెప్పాలె! వరుస కరువులతో, ప్రభుత్వాల నిర్లక్ష్యంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నమైనపుడు తెలుగు పల్లెలు చిన్నబోయాయి. ఊరు వల్లకాడై, ఉపాధి అవకాశాలు ఉట్టెక్కడం వల్ల ముఖ్యంగా నష్టపోయింది గ్రామీణ యువతరం. ఉపాధి వేటలో పలు కుటుంబాలే పొట్టచేత పట్టుకొని పట్టణాలు, నగరాల వైపు వలసబాట పట్టాయి. చేతి వృత్తుల కుటుంబాలు చెల్లాచెదరయ్యాయి. ఉన్న ఊరి బంధం వీడక, కాస్తోకూస్తో కలిగిన భూమిపై ఆశ చావక కొన్ని కుటుంబాలు గ్రామాల్లోనే మిగిలిపోయాయి. సొంతూళ్లో ఏ ఆదరువూ లేకున్నా... కదిలి వెళ్లే ధైర్యం చాలక, ఉన్నచోటే ఉపాధికి యాతన పడ్డ కుటుంబాలు మరికొన్ని. అలా గ్రామాల్లో మిగిలిపోయిన పేద కుటుంబాల్లో దారిద్య్రం తాండవించింది. ఉపాధిహామీ పథకమైతేనేం, వృద్ధాప్య -వితంతు -వికలాంగుల పెన్షన్ల వల్ల ఆ కుటుంబాలు పదీ పరకా కళ్ల జూశాయి. కొన్ని పేద కుంటుంబాలకు చౌకధరకు బియ్యం, ఇతర నిత్యా వసరాలు లభిం చడంతో కొంత నిలదొక్కుకునే యత్నం చేశాయి. ఆ కుటుంబాల్లోని యువ కుల్లో అత్యధికులు ఎందుకూ కొరగాకుండా పోయారు. విద్యావకాశాలు సరిగా లేక, ఉన్నా వినియోగించుకోలేక మెజారిటీ గ్రామీణ యువత చదు వులు సగంలోనే ఆగిపోయాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాల్లేక యువత గాలి తిరుగుళ్లకు అలవాటు పడింది. 15-16 ఏళ్ల నుంచి 40 దాటిన వారి వరకు తాగుళ్లకు అలవాటు పడ్డారు. డబ్బుంటే బీరు, విస్కీలు, లేకుంటే కల్లు, సారా... ఇలా వ్యసనానికి బానిసలయ్యారు. మెజారిటీ యువకులకు చీకటి పడితే చాలు, ఇంకొందరికయితే పగలు-రాత్రి తేడా లేదు. పండుగ లొస్తే ఇక పట్టపగ్గాలుండవు, మద్యంలో మునిగితేలు తారు. దసరా, సంక్రాంతి వంటి పండుగలు వారి విపరీత చేష్టలకు పరాకాష్ట! అసలు పండుగలొచ్చేదే అందుకని కూడా వారు సూత్రీకరిస్తారు. అది పట్ట ణాలు, నగరాల్లోనూ ఉంది. తాగి కన్నుమిన్నుకానని యువకుల వికృత చేష్టలు, మద్యం మత్తులో వాహనాలు నడపడం వంటివి ఇతరులకెలా ప్రాణాంత కమవుతాయో నగరంలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాలే నిద ర్శనం. యువత ఈ దుస్థితి నుంచి బయటపడాలి. పండుగ సంబురాలకు అర్థం అది కాదని గ్రహించాలి. ఒకరి ఆనందం... హద్దులు దాటి స్వయంగా తమకే అయినా, ఇతరులకైనా ఆటంకం, ప్రాణాంతకం కావొద్దని తెలుసు కోవాలి. అరకొరగానే అయినా అందుబాటులో ఉన్న అవకాశాల్ని అంది పుచ్చుకొని ఎదగాలి. అలా పండుగ చేయాలి. ప్రభుత్వాల చొరవతోనే కొత్తగాలి యువశక్తిని వినియోగించుకొని పల్లెల్లో పండుగ జేసే కొత్తగాలి వీయాలి. అందుకు ప్రభుత్వాలు చొరవ చూపాలి. జీవనదులు దిగువన ప్రవహిస్తుంటే తెలంగాణ దక్కన్ పీఠభూమిపై ఎగువన ఉన్నందుకు ఇక్కడ చెరువులు, కుంటలే ప్రత్యామ్నాయ జలవనరు. నదులు సమతలంగా పారి, ప్రాజె క్టులు-కాలువల వ్యవస్థ ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి వేరు. వర్షాలు ఆలస్యంగా కురిసినందువల్ల ఖరీఫ్ పంటలు ఎండిపోయిన ఏపీలోని వెనుక బడిన జల్లాల్లో పరిస్థితి నేడు దయనీయంగా ఉంది. ప్రతిపక్షనాయకుడు, వైఎస్సార్సీపీ నేత జగన్మోహన్రెడ్డి కరువు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటి స్తుంటే రైతాంగం తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ప్రభుత్వం ప్రత్యేక సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రైతుల్ని ఆదుకోని ప్రభుత్వ వైఖరిని నిరసిస్తున్నారు. ప్రకృతి సహకరించినపుడైనా వ్యూహా త్మకంగా నడుచుకోవడం ప్రభుత్వాల కనీస బాధ్యత. చెరువులు నిండు కుండల్లా ఉన్న తాజా పరిస్థితిని సానుకూలంగా మలచుకుంటూ తెలంగాణ ప్రభుత్వం మత్స్య పరిశ్రమాభివృద్ధికి పూనుకోవడం ప్రశంసలందుకుం టోంది. ‘‘పరక చేపలకు గాలాలేసే తురకల పోరలు యాడికిబోయిరి.... లారీ లల్లా క్లీనర్లయ్యిర.... పెట్రోల్ మురికిల మురికయ్యిండ్రా... తల్లి దూద్ సేమియకు దూరమయ్యినారా సాయబుల పోరలు ఆ బేకరి కేఫ్‌లో ఆకలి తీరిందా ఆ పట్టణాలలో...’’ అని గోరటి వెంకన్న రాసిన ‘పల్లె కన్నీరు పెడు తుందో...’ అన్న పాట, విన్న ప్రతి ఒక్కరినీ కంట తడి పెట్టించింది. 48 కోట్ల రూపాయలు వెచ్చించి, 4,532 చెరువుల్లో 35 కోట్ల చేప పిల్లల్ని విడవడం ద్వారా భవిష్యత్ గ్రామీణ ఉపాధి అవకాశాల్ని ప్రభుత్వం మెరుగుపరు స్తోంది. ప్రజల బతుకుల్ని పండుగ చేసే తెలివిడి ప్రభుత్వాలకున్నపుడే ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.... బంగారు బతుకమ్మ ఉయ్యాలో...’ అన్న పాట సార్థకమవుతుంది. - దిలీప్ రెడ్డి సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఈమెయిల్: dileepreddy@sakshi.com -
నీటి జగడాలకు నీళ్లొదలాలి!
సమకాలీనం తాగు-సాగునీటి వినియోగం, విద్యుదుత్పత్తి... తదితరావసరాలకిచ్చే ప్రాధాన్యతల విష యంలో రాజకీయ నిర్ణయాలు తరచూ విమర్శలకు, వివాదాలకు కారణమవుతున్నాయి. ఇవి రాష్ట్రాల మధ్యే కాకుండా, ఒకే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల మధ్యా వివాదాలకు దారి తీస్తున్నాయి. వీటన్నటి దృష్ట్యా... రాజకీయాలకు అతీతంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన నదీలోయ ప్రాధికార సంస్థలను ఏర్పాటు చేయాలనే సూచన వస్తోంది. కాలానుగుణంగా మారడమే దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారమవుతుంది. మూడో ప్రపంచ యుద్ధమంటూ వస్తే భూగ్రహం మీద మూడింట రెండొం తులుగా ఉన్న నీరే కారణమవుతుందని లోగడ ఎవరో మేధావి చెప్పిన మాటలు తరచూ ప్రస్తావనకు వస్తుంటాయి. వ్యక్తుల మధ్య, జన సమూహాల మధ్య, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య... ఇలా వివిధ స్థాయిల్లో నీటి పోరాటాలే కాకుండా ఇతరేతరంగా నీటి ఉపద్రవాలూ కారణం కావచ్చేమోనని ఇటీవలి పరిణామాల్ని బట్టి భావించాల్సి వ స్తోంది. కాలుష్యం వల్ల భూతాపోన్నతి పెరిగి ధృవాల్లో కరుగుతున్న మంచు నీరై జనావాసాల్ని ముంచేసే ప్రమా దమైనా కావచ్చు! వాతావరణ మార్పుల వల్ల అకాల వర్షాలు, వర్షాభావ పరిస్థితులతో వరదలు ముంచెత్తో, కరువులు కాటేసో రాష్ట్రాలు, దేశాల ఆర్థిక-రాజకీయ అస్థిరతతో కావచ్చు! నీటి ఉపద్రవాలు, ప్రపంచ యుద్ధం సంగతలా ఉంచినా.... మన దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య తరచూ వివా దాలకు నదీజలాలే కారణమవుతున్నాయి. అంతర్రాష్ట్ర నదీజలాల పంపకం, వాడకం, ప్రాజెక్టుల నిర్మాణాలు, వాటిల్లో నీటిని నిలుపుకోవడం, వదలడం.... వంటివి ఎడతెగని వివాదాల్ని పుట్టిస్తున్నాయి. కొత్తగా ఏర్పడ్డ రెండు తెలుగు రాష్ట్రాల నడుమా ఇదొక కార్చిచ్చులా రగులుతోంది. రెండు జీవ నదుల్లో గోదావరి కన్నా కృష్ణా విషయంలో ఈ వివాదం జటిలంగా ఉంది. రెండు రాష్ట్రాల పరస్పర విరుద్ధ భావనలు-వాదనలతో ముదురుతున్న ఈ వివాదం మున్ముందు మరే విపత్తుకు దారితీస్తుందోనన్న సందేహలు కలుగు తున్నాయి. కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు సత్వరం చొరవ తీసుకొని శాశ్వత పరిష్కారాల్ని యోచించాల్సిన అవసరం కనిపిస్తోంది. ముఖ్యంగా దీన్ని రాజ కీయాంశంగా మారనీయకుండా చూడాలి. రాజకీయ పక్షాలు, నాయకులు తమ అవసరాలకు వాడుకొని, జీవనాధారపు నీటితో ముడివడ్డ ప్రజల మనోభావాల్ని రెచ్చగొడితే, సరిదిద్ద వీలుకాని నష్టాల్ని రెండు రాష్ట్రాల ప్రజలు చవిచూడాల్సి వస్తుంది. నిన్నటికి నిన్న కావేరీ జల వివాదం వల్ల తమిళులు-కన్నడిగుల మధ్య రగిలిన ద్వేషాగ్నుల వేడి బెంగళూరు, చెన్నై నగరాల్లో విధ్వంసాన్ని సృష్టించింది. ముఖ్యంగా బెంగళూరులో చెలరేగిన హింస నగరం బ్రాండ్ ఇమేజ్ పై కూడా ప్రతికూల ప్రభావం చూపింది. బలంగా వేళ్లూనుకున్న ఐ.టి. పరిశ్రమ తొలసారి కంగుతిన్నది. జరిగిన ప్రాణహానితో పాటు ఆర్థిక నష్టం ఒక్క బెంగళూరులోనే పాతికవేల కోట్ల రూపాయలని ‘అసోచామ్’ పేర్కొంది. సమాఖ్య రాజ్యమైనా నిర్దిష్ట జాతీయ జలవిధానం లేకపోవడం, ట్రిబ్యునల్స్ ఇచ్చే తీర్పుల్లో జాప్యాలు, వాటి అమలులో లోపాలు, పాలకపక్షాల ఓటు రాజకీయాలు.. వెరసి సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. రాష్ట్రాలకు, రాజకీయాలకు, పాలకపక్షాల ఇష్టాయి ష్టాలకతీతంగా పనిచేసే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన నదీలోయ ప్రాధికార సంస్థల్ని ఏర్పాటు చేయాలన్న వాదన తెరపైకి వస్తోంది. నిన్నొకపోరు-నేడింకొకటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జలాలకోసం ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలతో తగాదా పడేది. నీటి కేటాయింపుల నుంచి ప్రాజెక్టుల నిర్వ హణ-నీటి విడుదల వరకు అన్నీ పంచాయితీలే! విభజన తర్వాత ఆ పంచాయితీ తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య ముదురుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి చైర్ పర్సన్‌గా ఢిల్లీలో బుధవారం జరిగిన ఉన్నత మండలి (అపెక్స్ కౌన్సిల్) సమావేశంలో ఇద్దరు సీఎంలు చంద్రశేఖరరావు, చంద్రబాబునాయుడులు తమ మంత్రులు, ఉన్నతాధికారులతో పాల్గొన్నారు. ఇందులో అంగీకారం కుదిరినవి మూడంశాలు కాగా, ఏదీ ముడివడని వివాదాంశాలే ఎక్కువ! కేటాయించిన నికర జలాల ఆధారంగా కాకుండా మిగులు జలాల్ని ఆధారం చేసుకొని ప్రాజెక్టులు కడుతున్నారని, వాటికి అనుమతుల్లేవని, చట్ట విరు ద్ధమనే వాదనతో రెండు రాష్ట్రాలు, ప్రత్యర్థి రాష్ట్రంపై విమర్శలు చేస్తున్నాయి. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు అనుమతులు లేనివని ఏపీ అంటే, అలా అయితే అక్కడి గాలేరు-నగరి, హంద్రీ-నీవా, పట్టిసీమ అటువంటివే అని తెలంగాణ తిప్పికొడుతోంది. గోదావరి కన్నా కృష్ణానదితోనే ఎక్కువ సమస్య. ఎందుకంటే, ఈ నదిలో నీళ్లు, ఆధారపడదగ్గ పరిస్థితి తక్కువ, నీటి అవసరాలు ఎక్కువ! ఈ నది ఎక్కువగా మైదాన ప్రాంతాల్లో ప్రవహిస్తోంది. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఎక్కువ భాగం వెనుకబడిన ప్రాంతమే! వర్షపాతం ఎక్కువగా లేని ప్రాంతాల గుండా ఈ నది ప్రవహిస్తోంది. కానీ, గోదావరి అలా కాకుండా అడవుల గుండా, వర్షపాతం అధికంగా ఉండే ప్రాంతాల గుండా ప్రవహిస్తున్నది. నీటి లభ్యత కూడా అధికం. ఈ కొట్లాటలు లేకుండా ఉండాలంటే నీటి పంపకాలకు ఓ సహేతుకమైన ప్రాతిపదిక ఉండాలి. ఎవరికి అందుబాటులో ఉండే నీటిని వారు వాడుకొని, ప్రాజెక్టులు కట్టుకొని, మేము ప్రాజెక్టులు కట్టుకున్నాం కనుక మాకు నీళ్లు ఇవ్వాల్సిందేనని ఆ తర్వాత ట్రిబ్యునల్స్ దగ్గర వాదించడమూ జరుగుతోంది. నిజానికి ప్రజల అవసరాలే ప్రాతిపదిక కావాలి. ఆయా ప్రాంతాల్లో పండే పంటలేంటి? వాటికి ఎంత నీరవసరం? దానికి తోడు... ఆ ప్రాంతాల్లో ఇతర నీటి వనరు లేంటి? భూగర్భజలాల పరిస్థితేంటి? ఇటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని వాటాల పంపకం చేస్తే బాగుంటుందన్నది నిపుణుల అభిప్రాయం. తీర్పులే జాప్యమంటే, అమలు అంతంతే! అంతర్రాష్ట్ర నదీ జలాల సమస్యల్ని పరిష్కరించేందుకు ఏర్పాటవుతున్న ట్రిబ్యునల్ తీర్పుల్లో విపరీత జాప్యం జరుగుతోంది. దానికి తోడు, ఎంతో ఆలస్యంగా వెలువడిన తీర్పుల అమలు, పర్యవేక్షణ కూడా సవ్యంగా లేకపో వడం వివాదాలకు, తదనంతర సమస్యలకు కారణమవుతోంది. దాంతో ట్రిబ్యునల్స్ వల్ల ప్రభావం లేకుండా పోతోంది. ఫలితంగా మళ్లీ సుప్రీం తలుపులు తట్టాల్సి వస్తోంది. ఈ వివాదాల లోతైన పరిశీలనకు సుప్రీంకోర్టు సమయం వెచ్చించలేని కారణంగానే, ‘అంతర్రాష్ట్ర జలవివాదాల (పరిష్కార) చట్టం-1956’ ఆధారంగా ఈ ట్రిబ్యునల్స్ ఏర్పాటయ్యాయి. కావేరి తీసు కుంటే, 1990లో ట్రిబ్యునల్ ఏర్పడగా పదిహేడేళ్లకు 2007లో తీర్పు వచ్చింది. 2013లో గజెట్ వెలువడింది. అయినా, కేటాయింపులు-వినియోగం ఓ కొలిక్కి రాలేదు. సుప్రీంకోర్టు తరచూ జోక్యం చేసుకోవాల్సి వస్తోంది. 1969లో ఏర్పడ్డ కృష్ణా జల వివాద ట్రిబ్యునల్ 2013లో తీర్పు చెప్పింది. కర్ణాటక-గోవా మధ్య మాండవి నదీ జలాల వివాదాలకు సంబంధించి పది హేనేళ్ల సంప్రదింపులు విఫలమైన మీదట 2010లో ట్రిబ్యునల్ ఏర్పాటయినా ఇప్పటికీ నిర్ణయం వెల్లడించలేదు. తమిళనాడు-కేరళ మధ్య కూడా వివాదాలున్నాయి. కృష్ణా నీటి పంపకాలు తాజాగా నాలుగు రాష్ట్రాల మధ్య జరగా లని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. బ్రిజేష్ ట్రిబ్యునల్ వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టు వద్ద ఉంది. కేటాయించిన నీటి నిలువ-వాడకం, మిగులు జలా లపై హక్కులు, వాతావరణ మార్పులు, జనాభా వృద్ధి, నగరీకరణలు వంటి సంక్లిష్టతల్లో తలెత్తే సరికొత్త వివాదాల్ని ఈ ట్రిబ్యునల్స్ సరిగా పరిష్కరించ లేకపోతున్నాయనేది విమర్శ. ట్రిబ్యునళ్ల ప్రస్తుత కూర్పు ప్రకారం సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి చైర్మన్‌గాను, ఇద్దరు హైకోర్టు రిటైర్డ్ జడ్జీలు సభ్యులుగానూ ఉంటున్నారు. సాగునీటి, పర్యావరణ నిపుణుల సహకారం తీసుకోవాల్సి రావడం వల్ల అంతిమ తీర్పులకు కనీసం 10-15 సంవత్సరాలు జాప్యమ వుతోందన్నది పరిశీలన. అలా కాకుండా ఆయా రంగ నిపుణుల్నే ట్రిబ్యునల్ సభ్యులుగా ఉంచాలనేది ఓ ప్రతిపాదన. అంశాలు, వివాదాల వారిగా ఒక్కో నదికి అని కాకుండా అంతర్రాష్ట్ర నదీవివాదాల పరిష్కారానికి ఒక శాశ్వత ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోంది. అనుసంధానంపై అనుమానాలు! దేశంలోని వివిధ ప్రాంతాల్లోని నదుల్ని అనుసంధానపరచడం ద్వారా గరి ష్టంగా లబ్ధి పొందవచ్చన్నది ఒక ఆలోచన. ఉత్తరాదిలో బిహార్, అసోం, ఒడిశాల్లో వరదలు ముంచెత్తుతుంటే దక్షిణాది రాష్ట్రాల్లో కరవు-కాటకాలు ప్రజల్ని పీడించడం దృష్ట్యా ఈ ఆలోచన చేశారు. బ్రహ్మపుత్ర, గంగ వంటి నదుల్ని దక్షిణాది నదులతో గ్రిడ్ ద్వారా అనుసంధానించి మధ్య, దక్షిణ భారతాన్ని సస్యశ్యామలం చేయాలన్నది ఈ తలంపు. దీనిపై సమగ్ర నివేదిక (డీపీఆర్)కు గాను 2014-15 బడ్జెట్లో వందకోట్ల రూపాయలు కేటాయిం చారు. ‘జాతీయ నదుల అనుసంధాన కార్యక్రమం’ద్వారా మొత్తం 37 నదు లకు తాజాగా 30 లింకులు ఏర్పాటు చేసి, 3వేల నీటి నిల్వ డ్యాముల నిర్మాణంతో 3.5 కోట్ల హెక్టార్లని కొత్తగా సాగులోకి తేవాలన్నది లక్ష్యం. సూచాయగా ఇందుకయ్యే వ్యయం రూ. 5.6 లక్షల కోట్లన్నది 2002 నాటి అంచనా కాగా, ఇప్పుడది పది లక్షల కోట్ల రూపాయల వరకుంటుందని భావిస్తున్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఇది ప్రకృతి సహజ నైసర్గిక స్థితికి వ్యతిరేకమని, పర్యావరణ, జీవవైవిధ్య పరమైన ప్రతికూల పరిస్థి తులుంటాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనితో స్వచ్ఛమైన నదులూ కలుషితమయ్యే ప్రమాదమూ ఉందంటున్నారు. కృత్రిమ నీటి నిల్వ డ్యాముల వల్ల నిర్వాసితులయ్యేవారికి పునరావాస, పునఃస్థిరీకరణ వంటివి సమస్యగా పరిణమిస్తాయంటున్నారు. ఇంత కన్నా, వికేంద్రీకరణ పద్ధతుల్లోనే వాటర్‌షెడ్, వాననీటి సంరక్షణ, భూగర్భ జలవృద్ధి, శాస్త్రీయ-హేతుబద్ధ పంటల విధానం వంటి సంప్రదాయ పద్ధతులే అనుసరణీయం అనే వాదనా ఉంది. పెద్ద ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలన్న ఆలోచనాసరళి నుంచి ‘పెద్ద ప్రాజెక్టులు పెను విపత్తుల’నే దిశలో ఇప్పుడు యోచిస్తున్నారు. స్వతంత్ర సంస్థలే శరణ్యం తాగు-సాగునీటి వినియోగం, విద్యుదుత్పత్తి... తదితరావసరాలకిచ్చే ప్రాధా న్యతల విషయంలో రాజకీయ నిర్ణయాలు తరచూ విమర్శలకు, వివాదాలకు కారణమవుతున్నాయి. ఇవి రాష్ట్రాల మధ్యే కాకుండా, ఒకే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల మధ్యా వివాదాలకు దారి తీస్తున్నాయి. వీటన్నటి దృష్ట్యా... రాజ కీయాలకు అతీతంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన నదీలోయ ప్రాధికార సంస్థ (రివర్ వ్యాలీ అథారిటీ)లను ఏర్పాటు చేయాలనే సూచన వస్తోంది. 2010లో రాజకీయ కారణాల వల్ల సకాలంలో నిర్ణయం తీసుకోనందునే శ్రీశైలం ప్రాజెక్టు నిలువ నీటితో కర్నూలు, మహబూబ్‌నగర్ మునిగిపోయి అంతటి ఉపద్రవం ఎదుర్కోవాల్సి వచ్చిందనే వాదనుంది. నిర్ణయ జాప్యం వల్లే శ్రీశైలంలోకి వచ్చే ఇన్‌ఫ్లో, ప్రాజెక్టు అన్ని గేట్లు తెరిచి నీటిని వదిలినా సాధ్య మయ్యే ఔట్‌ఫ్లో కన్నా అధికంగా ఉండటమే సదరు ప్రమాదానికి కారణమని రుజువైంది. ఒక ప్రాధికార సంస్థ ఉండి ఉంటే, ఆ తప్పిదం జరిగి ఉండేది కాదనేది నిపుణుల అభిప్రాయం. నది పుట్టిన చోటు నుంచి సముద్రంలో కలిసే వరకు ఎక్కడ, ఎప్పుడు, ఏ విధమైన అవసరాలుంటే పరిస్థితుల్ని బట్టి సదరు సంస్థ తగిన నిర్ణయం తీసుకోగలుగుతుందని వారంటారు. ఇక, రాష్ట్రాల్లోని రాజకీయ అవసరాలు అడ్డంకి కావు. టెన్నెసీ రివర్ వ్యాలీ అథారిటీ (యుఎస్), లింపో పో ఆర్వీఏ (దక్షిణాఫ్రికా), ముర్రే డార్లింగ్ ఆర్వీఏ (ఆస్ట్రే లియా)లు విజయవంతంగా పనిచేయడం ఈ రంగంలో ఓ గొప్ప అనుభవం. కాలానుగుణంగా మారడమే దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారమవుతుంది. దిలీప్ రెడ్డి ఈమెయిల్ : dileepreddy@sakshi.com -
మట్టే బంగారం విజేతలు వీరే!
మాసబ్‌ట్యాంక్: సామాజిక బాధ్యతతో పర్యావరణ పరిరక్షణకు ‘సాక్షి’ దినపత్రిక నిర్వహించిన ‘మట్టే బంగారం’ పోటీలకు గ్రేటర్ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మట్టి విగ్రహాలను ప్రతిష్టించి... సెల్ఫీలను పంపిన వారికి ‘సాక్షి’ లక్కీ డిప్లో పాల్గొని రూ.లక్ష విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పించింది. ఈ నెల 6 నుంచి 14 తేదీ వరకు పంపిన సెల్ఫీలను ‘సాక్షి’లో ప్రచురించిన విషయం విదితమే. ఈ మేరకు గురువారం బంజారాహిల్స్‌లోని ‘సాక్షి’ కార్యాలయంలో లక్కీ డ్రా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్ రెడ్డి, ఆలివ్ మిఠాయి సంస్థల అధినేత దొరైరాజు డ్రా ద్వారా విజేతను ప్రకటించారు. మొదటి విజేతగా కూకట్‌పల్లికి చెందిన హారిక, రెండో విజేతగా ఎల్బీనగర్ ఎన్టీఆర్ నగర్‌కు చెందిన నవదీప్, మూడో విజేతగా శేరిలింగంపల్లికి చెందిన మధుబాబులు నిలిచారు. కొండాపూర్‌కు చెందిన గోవింద్ నాయక్, బోడుప్పల్‌కు చెందిన భాస్కర్ రెడ్డి, మౌలాలీకి చెందిన శ్రీనివాస్ కన్సోలేషన్ బహుమతులను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ఈడీ రామచంద్రమూర్తి విజేతలకు ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో వారికి బహుమతులు అందించనున్నారు. -
తీర్పు స్ఫూర్తితో చిగురించిన ఆశ
ఇప్పటికే గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ముందున్న కేసు తదుపరి విచారణ శుక్రవారం జరుగనుంది. పర్యావరణ ప్రభావ అధ్యయనమే జరుగలేదని, మూడు పంటలు పండే వ్యవసాయ భూముల్ని నాశనం చేయడమే కాకుండా సమీకరించిన భూమి కొండవీటి వాగు వరద ప్రభావిత ప్రాంతమనే నిపుణుల నివేదికలున్నాయని వారంటున్నారు. 2013 చట్టం బహుళపంటల భూముల్ని సేకరించవద్దనే చెబుతోంది. తెలంగాణలోని మల్లన్నసాగర్ భూసేకరణలోనూ 2013 చట్ట స్ఫూర్తికి భంగం జరిగిందనే వాదనుంది. ‘‘కోర్టు కోర్టుకీ తీర్పు తీర్పుకీ ఇంత మార్పు ఉంటే మీ న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్టా యువరానర్....’’ అని జడ్జిని ఉద్దేశించి ఆగ్రహంగా, ఉద్రేకంగా అడుగుతాడు బొబ్బిలిపులి సినిమాలో కథానాయక పాత్రలో నటించిన ఎన్టీరామారావు. ఒకోసారి తేడా ఉంటుంది. ఎందుకుంటుందీ? అంటే అందుకొక కారణం చెబుతారు న్యాయనిపుణులు. కేసు ఒకటే అయినా ఒకసారి ఓ కోర్టు ముందు ప్రవేశపెట్టిన సాక్ష్యాలు, ఆధారాలు, పరిస్థితులు, వాదనలు తర్వాతి కాలంలో అదే కోర్టులో గానీ, ఇతర ఉన్నత న్యాయస్థానాల ముందుగ్గాని వచ్చినపుడు మార్పులకు గురయితే తీర్పు భిన్నంగా ఉండటా నికి ఆస్కారం ఉంటుందనేది ఓ అభిప్రాయం. కొన్ని విషయాల్లో న్యాయస్థా నాలు వెలువరించే తీర్పులు దాదాపు అదే పరిస్థితులున్న ఇతర పరిణామా లకు, సందర్భాలకు యథాతథం వర్తిస్తాయి. కొన్నిసార్లు పాక్షికంగానే వర్తి స్తాయి. అసలు వర్తించవు. చట్టాల్లో, విధానాల్లో నిర్దిష్టంగా పేర్కొనని సందిగ్ధ అంశాల్లో రాజ్యాంగ న్యాయస్థానాలైన హైకోర్టు, సుప్రీంకోర్టులిచ్చే తీర్పులే తర్వాతి కాలంలో తలెత్తే అటువంటి అన్ని వివాదాలకూ విధిగా వర్తిస్తాయి. ప్రామాణికం కూడా అవుతాయి. పశ్చిమబెంగాల్లో దశాబ్దం కింద జరిపిన సింగూరు భూసేకరణే అక్రమమని సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పిచ్చింది. వారం కింద వెలువడ్డ ఈ తాజా తీర్పును ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతం, తెలంగాణలోని మల్లన్నసాగర్ ప్రాంత రైతులు, రైతు నాయకులు, ప్రజాసంఘాల వారు లోతుగా పరిశీలిస్తున్నారు. ఈ తీర్పు నీడలో తమకేమైనా ఉపశమనం లభించేనా? అని న్యాయనిపుణులతో సంప్ర దింపులు జరుపుతున్నారు. రాజధాని భూముల విషయంలో సీనియర్ సంపాదకుడు ఏబీకే ప్రసాద్ తదితరులు సంప్రదించినపుడు, లేవనెత్తిన అంశాల్లోకి వెళ్లకుండానే ‘మీరు రైతులు కాదుకదా! భూములు కోల్పోయిన రైతులే వచ్చినపుడు చూద్దాం...’ అనే వ్యాఖ్యలతో కేసును సుప్రీంకోర్టు తోసిపుచ్చిన దరిమిలా ఈ కొత్త ఆలోచనలు చోటు చేసుకుంటున్నాయి. సింగూరు భూముల విషయంలో పరిస్థితి పూర్తిగా వేరనీ, ఇది అమరావతి భూములకు వర్తించబోదనీ కొట్టివేసేవారూ ఉన్నారు. సింగూరులో జరిగింది భూసేకరణ కాగా, అమరావతిలో జరిపింది భూసమీకరణ అని వారు అన్వయం చెబుతున్నారు. సేకరణయినా, సమీకరణయినా నిర్దిష్ట అవసరాల కోసం ప్రభుత్వం భూమిని తీసుకుంటూ భూయజమానుల నుంచి దాన్ని దూరం చేయడమే! ఈ మౌలికాంశాన్నే న్యాయమూర్తులు పరిగణన లోకి తీసు కున్నట్టు సింగూరు కేసులో సుప్రీం తీర్పును విశ్లేషిస్తే స్పష్టమౌతోంది. స్ఫూర్తి కొరవడటం తప్పిదమే! పౌరుల భూయాజమాన్యపు అధికారం మొదట్లో ప్రాథమిక హక్కుగానే ఉండేది. రాజ్యాంగం మూడో భాగంలోని ఆస్తి హక్కు కింద 1949 నుంచే ఈ ప్రయాణం మొదలైంది. కాలక్రమంలో రాజ్యం తన విస్తృతాధికారాల్ని ఇష్టా నుసారం వినియోగించడంతో ‘ప్రజా సంక్షేమం కోసం’ అనే సాకు నీడన సుదీర్ఘకాలం పాటు భూచట్టాలు దుర్వినియోగమవుతూ వచ్చాయి. అదే క్రమంలో రాజ్యాంగ సవరణ జరిగి ప్రాథమిక హక్కు స్థానే చట్టబద్ధమైన హక్కుగా ఇది మారింది. ప్రభుత్వాలు భూసేకరణ తలపెట్టిన ప్రతిసారీ ఈ వ్యవహారాల్లో 1894, అంటే 122 ఏళ్లకిందటి భూసేకరణ చట్టం నిర్దేశించిన అంశాలే ప్రాతిపదిక అయ్యేవి. భూహక్కుదారుల ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ‘జనహితం’లో భూముల్ని సేకరించే అధికారం ప్రభుత్వాలకు ధారా దత్తమైంది. కాలం చెల్లిన 1894 నాటి చట్టంలో ప్రభుత్వ సానుకూలత తప్ప మానవీయ అంశమే లేదనే వాదన తెరపైకి వచ్చింది. నిర్వాసితులయ్యే, ఉపాధి కోల్పోయే వారికి రక్షణ లేని పరిస్థితులు బలపడ్డాయి. ఉమ్మడి జాబితాలోని అంశమే అయినా... కేంద్ర చట్టం నీడలో తమ రాష్ట్ర భూసేకరణ చట్టాలు, విధానాలు రూపొందించుకున్న అనేక రాష్ట్రాలు సదరు లోపాల్ని సరిదిద్దకపోగా మరింత లోపభూయిష్టంగా వాటిని తయారు చేసుకుంటూ వచ్చాయి. దాంతో నిర్వాసితుల సానుకూలాంశాలే లేకుండా పోయాయి. ప్రజల్లో అవగాహన, చైతన్యం పెరుగుతున్న కొద్దీ ప్రతిఘటనలూ పెరిగాయి. భూసేకరణల్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలే వచ్చాయి. ఒకవైపు రాజ్యబలం మరోవైపు ప్రజాందోళనలు.. నేల మీద నెత్తురు చిందే ఘటనలు అధికమయ్యాయి. చర్చ ఊపందుకోవడంతో పాలకులు తలవంచాల్సి వచ్చింది. పర్యవసానంగా పలు సానుకూల అంశాలతో 2013లో కొత్త భూసేకరణ చట్టం వచ్చింది. తప్పనిసరిగా సామాజిక-పర్యావరణ ప్రభావ అధ్యయనాలు, 70 శాతం, 80 శాతం మంది అంగీకారం, నిర్వాసితులు, ప్రభావితులయ్యేవారికి నష్టపరిహారం, పునరావాసం, పునఃప్రతిష్ట వంటి అంశాలు ఇందులో భాగమయ్యాయి. ఇప్పుడదే చట్టం అమల్లో ఉంది. సింగూరు భూసేకరణ వ్యవహారం 2006 నాటిది కావడంతో ఆ కేసు వివిధ న్యాయస్థానాల్లో దశాబ్ద కాలం నానుతూ వచ్చింది. భూసేకరణే అక్రమమని ఇచ్చిన ధర్మాసనం తీర్పులో అసలు భూసేకరణ చట్టం నిర్దేశించే (సెక్షన్ 5ఏ) విధానాలనే ఉల్లంఘించారని ఇద్దరు న్యాయమూర్తులూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజావసరాలని చెప్పి టాటా కంపెనీ కోసం భూమి సేక రించడాన్ని తన ఆదేశాల్లో జస్టిస్ గౌడ తప్పుబట్టారు. ప్రజాభిప్రాయ సేకరణ సరిగ్గా జరగలేదని, అభ్యంతరాల్ని పరిగణనలోకి తీసుకోకుండా భూసేకరణ కలెక్టరిచ్చిన నివేదికను యథాతథం స్వీకరించి చట్ట నిబంధనను తూతూ మంత్రంగా పాటించారని జస్టిస్ మిశ్రా ఎండగట్టారు. చట్టపు స్ఫూర్తిని కూడా పరిరక్షించలేకపోయారని జడ్జీలు తప్పుబట్టారు. డొంకతిరుగుళ్లు... దొడ్డిదారి నడకలు అమరావతి కొత్త రాజధాని కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూసేకరణకు బదులు భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్)కు వెళ్లింది. భవిష్యత్ ప్రయోజ నాల్లో భూయజమానులనూ భాగస్వాముల్ని చేస్తూ వారి భూముల్ని సమీ కరించడం ఈ పద్ధతి. రాజధానిని అభివృద్ధి పరిచే క్రమంలో విలువ పెరిగే కొంత నివాస, వాణిజ్య స్థలాల్ని వారికి పరిహారంగా ఇస్తారు. అప్పటివరకు ఏటా ఇంతని ప్రభుత్వం సదరు భూయజమానులకు కౌలు చెల్లించాలి. రైతులు 33వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారన్నది ప్రభుత్వ ప్రచారం. కానీ, అక్కడ జరిగిందేమిటో అందరికీ తెలుసు. అత్యధిక సందర్భాల్లో బెది రించి, భయపెట్టి, విపరీత పరిస్థితులు కల్పించి, మైండ్ గేమ్‌తో పలు కుయుక్తులు పన్ని భూసమీకరణ పేరిట పరోక్షంగా భూసేకరణే జరిపారన్నది నిజం. కొందరు రైతులకు ఇటీవల భూసేకరణ కిందే నోటీసులిస్తున్నారు. నిజానికి 75 శాతం భూముల్నే సమీకరించ గలిగారు. ఇప్పటికీ భూములివ్వని గ్రామాలున్నాయి. మొదట తెలియక నిబంధన (పత్రం-9.3) కింద అంగీ కారం తెలిపి, నిజాలు తెలిసి అంగీకారాన్ని (పత్రం-9.14 కింద) ఉపసం హరించుకున్న వారూ ఉన్నారు. సుమారు అయిదారువేల ఎకరాల భూమి ఇంకా ప్రభుత్వ ఖాతాలోకి రానిదుంది. ఏ రకమైన అంగీకారానికి రాని రైతుల వద్ద ఇంకా 3,200 ఎకరాల భూమి ఉంది. ఉండవల్లి (78శాతం), పెనుమాక (55శాతం), నిడమర్రు (40శాతం), రాయపూడి, వెలగపూడి, బేతపూడి, నవులూరు (10శాతం వరకు)లలో కొన్ని భూములు ఇంకా ఈ పరిధిలోకి రానేలేదు. తమ ప్రాథమిక అంగీకారాన్ని ఉపసంహరించుకున్న రైతుల తాలూకు భూమి సుమారు 1,600 ఎకరాలుంటుంది. ఇక పాలకపక్షానికి చెందిన నాయకుల, పలుకుబడిగలిగిన వారి దాష్టీకాలకు అక్కడ లెక్కే లేదు. అధికారపార్టీకి, ఒక సామాజిక వర్గానికి చెందిన వారు మొదట్నుంచీ అధికారం అండతో యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన కొంతమంది మాత్రం ప్రభుత్వ తీరును నిశితంగా విమర్శిస్తున్నారు. దాష్టీకాలకు పాల్పడుతున్న వారు అసైన్డ్ భూములకు పైసా పరిహారం రాదని మొదట ఎస్సీ, ఎస్టీల్ని బెదిరించి, భయపెట్టి వారి భూముల్ని నామమాత్రపు ధరకు కొనుగోలు చేశారు. వారిని నియంత్రణలో ఉంచుకోవడానికి వాటిని సీసీ కెమెరాల్లో రికార్డు చేయించారు. మెజారిటీ అసైన్డ్ భూములు తమ చేజి క్కిన తర్వాత ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆ భూములకూ నష్టపరిహారం లభించేలా చట్టసవరణకు పావులు కదిపారు. సమీకరించిన భూములకు సంబంధించి మొదటి సంవత్సరం కౌలు చెల్లించిన ప్రభుత్వం రెండో సంవ త్సరం నిలిపివేసింది. భూమిలేని పేద కూలీలకిచ్చే నిరుద్యోగభృతి విష యంలోనూ ఇదే జరిగింది. కూలీల ఎంపికే సరిగ్గా జరగలేదని, 29 గ్రామాల కింద 16 వేల మందినే ఎంపిక చేశారనేది విమర్శ. అత్యధిక చోట్ల నిజమైన వారిని ఎంపిక చేయకుండా మొండిచేయి చూపారన్నది అభియోగం. నెలకు రూ. 2,500 భృతి కింద ఇవ్వాల్సి ఉంది. అది ఏటా పదిశాతం పెరగాలి. మభ్యపెట్టేందుకు మొదట అయిదు మాసాలదీ కలిపి రూ.12,500 అక్కడ క్కడ ఇచ్చి తర్వాత నిలుపుదల చేశారు. భూమిలేని చేతివృత్తుల వారిని పూర్తిగా గాలికొదిలేశారు. గ్రామకంఠాల వివాదం తేల్చకుండా నాన్చుతూ ఊరూరా కొత్త సమస్యలు రేపి అశాంతి రగిలిస్తున్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెబుతుందో? భూసమీకరణలో అవకతవకలు, అక్రమాలు ఒక ఎత్తయితే చట్ట నిబంధన లకూ, నైతిక సూత్రాలకూ తూట్లు పొడిచి విదేశీ సంస్థలతో కుదుర్చుకుం టున్న ఒప్పందాలు, లీజులు, వాణిజ్య యత్నాలు అమరావతిలో మరింత వివాదాస్పదమయ్యాయి. భూ వినియోగం దేనికి? కనీస వినియోగ స్థలం ఎంత? తదితరాంశాల్ని స్పష్టం చేయకుండా జరిపిన భూసమీకరణే చట్ట విరుద్ధమని కొందరు వాదిస్తున్నారు. పరిహారం, పునరావాస-పునఃప్రతిష్ఠ, పర్యావరణ ప్రభావ అధ్యయనం, సామాజిక భద్రత వంటి అంశాల్లో 2013 చట్టం స్ఫూర్తికి గండికొట్టిన ఈ సమీకరణనే వారు తప్పుబడుతున్నారు. ఇదే విషయమై సుప్రీంకోర్టును సంప్రదించే యత్నాల్లో ఉన్నారు. ఇదివరకే న్యాయ స్థానాల్ని సంప్రదించిన కేసుల్లో కొందరు రైతులు ఇంప్లీడ్ అవుతున్నారు. ఇప్పటికే గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ముందున్న కేసు తదుపరి విచారణ శుక్రవారం జరుగనుంది. పర్యావరణ ప్రభావ అధ్యయనమే జరుగలేదని, మూడు పంటలు పండే వ్యవసాయ భూముల్ని నాశనం చేయడమే కాకుండా సమీకరించిన భూమి కొండవీటి వాగు వరద ప్రభావిత ప్రాంతమనే నిపు ణుల నివేదికలున్నాయని వారంటున్నారు. 2013 చట్టం బహుళపంటల భూముల్ని సేకరించవద్దనే చెబుతోంది. తెలంగాణలోని మల్లన్నసాగర్ భూసే కరణలోనూ 2013 చట్ట స్ఫూర్తికి భంగం జరిగిందనే వాదనుంది. ఆ చట్టంలో నిర్దేశించిన దానికన్నా 123 జీవోలో ఎక్కువ నష్టపరిహారం ప్రతిపాదించామని ప్రభుత్వం చెబుతున్నా, అదొక్కటే ప్రాతిపదిక కాదని, పలు అంశాల్లో చట్టం స్ఫూర్తికి గండికొట్టారని రైతులు, ప్రజాసంఘాల వారంటున్నారు. ఈ అంశా లన్నింటినీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకుపోగలిగితే తప్పక న్యాయం జరుగు తుందని రెండు రాష్ట్రాల భూనిర్వాసితులు ఆశిస్తున్నారు. జీవనాధారమైన కాసింత భూమితో ఉండే అనుబంధానికి దూరమౌతూ నలిగి పోతున్నవారెం దరో! ‘‘చావడానికి ధైర్యంలేక బతుకుతున్నాం’’ అంటున్న కొందరి ఆర్తినైనా సుప్రీంకోర్టు పట్టించుకోకపోతుందా! అన్నది మిణుకు మిణుకుమనే ఆశ! దిలీప్ రెడ్డి ఈమెయిల్:dileepreddy@sakshi.com -
పెరిగే పేదరికం సంపదకే సవాల్
సమకాలీనం గ్రామీణార్థిక వ్యవస్థ ఛిద్రమవడం, అత్యధికులు ఆధారపడ్డ వ్యవసాయరంగం కుదేలవడం పేదరికాన్ని మరింత పెంచింది. విద్య, వైద్యం వంటి రంగాల్లో ప్రభుత్వాల అశ్రద్ధ పేద, అల్పాదాయ వర్గాల్ని దారుణంగా కుంగదీస్తోంది. ఓ అధ్యయనం ప్రకారం, ఒక వ్యవ సాయ కుటుంబం వార్షిక వ్యయ–రాబడి వ్యత్యాసాల వల్ల సగటున 4 శాతం మంది ఏటా కొత్తగా పేదరికంలోకి జారుతున్నారు. అనుకోకుండా వచ్చే విద్య, వైద్య ఖర్చుల కారణంగా సగటున మరో 3 శాతం మంది ఏటా బలవంతంగా దారిద్య్రరేఖ కిందకు పడిపోతున్నారు. ప్రపంచంలో ఏడో సంపన్న దేశవాసిని నేను. భూమి మీదున్న దాదాపు రెండువందల దేశాల్లో ఇంత గొప్ప స్థానంలో ఉండటం గర్వించదగ్గ విష యమే! ఇది నాణేనికి ఒక పార్శ్వం మాత్రమే! నాణెపు మరోవైపు చూడ టానికి సాహసం కావాలి. కొంచెం ధైర్యమూ కూడగట్టుకోవాలి. ఇంతటి వైరుధ్యం ప్రపంచంలో మరే దేశానికీ ఉండదేమో! ఎప్పుడో స్వతంత్రం వచ్చిన కొత్తలో సరదాకి చెప్పుకున్న వ్యంగ్యోక్తి నేటికీ నూటికి నూరుపాళ్లు నిజం. వైరుధ్యాన్ని నిరూపించే ప్రపంచ నివేదికల్లోని కఠిన వాస్తవాల్ని మన మంతా జీర్ణించుకోవాల్సిందే! అదేంటంటే, ప్రపంచంలో ఏడో సంపన్న దేశ మైనా అత్యధిక నిరుపేదలున్న దేశం కూడా మనదే! వేళ్లపైన లెక్కించదగ్గ సంఖ్యలో సంపన్నులు, ముప్పయ్ కోట్లకు పైబడి నిరుపేదలు కలగలిసి సహ జీవనం చేస్తున్న ‘భిన్నత్వంలో ఏకత్వం’ మనది. అపార సహజవనరులు, గొప్ప సంస్కృతీ వారసత్వ సంపదల వల్ల భారతదేశానికున్న పేరు ప్రతిష్టల దృష్ట్యా అప్పట్లో మేధావులు దీన్నొక గొప్ప దేశంగా అభివర్ణించేవారు. ఆ క్రమంలోనే ‘నిరుపేదలు నివసించే సంపన్నదేశమ’ని సరదా వ్యాఖ్యా వినిపించేది. వారి సరదా సంగతేమో గానీ, నేటికీ మన పేదరికం సమస్య గట్టె క్కలేదు. మహా మేధావులు రూపుదిద్దిన రాజ్యాంగం నీడలో పలు పంచవర్ష ప్రణాళికలు, గరీబీ హఠావో నినాదాలు, అందర్నీ కలుపుకుపోయే (ఇంక్‌లు సివ్) అభివృద్ధి నమూనాలు.... వెరసి, మెడలో బోర్డు కట్టుకున్న ‘సంక్షేమ రాజ్యం’ ఏడు దశాబ్దాలు గడుస్తున్నా లక్ష్యానికింకా ఆమడ దూరంలోనే ఉంది. పేదరికం పెనుశాపమై నాలుగోవంతు జనాభాను నలిపేస్తోంది. మరో వైపు సంపద మాత్రం పోగవుతూనే ఉంది. అది అవకాశాల్ని అందిపుచ్చు కున్న, అధికారానికి అతి సమీపంగా ఉన్న కొద్దిమంది వద్ద మాత్రమే జమవు తోంది. అందుకే, మనకిప్పుడు ఏడో స్థానం దక్కింది. ఒక దశ చేరాక సంపద సృష్టి కన్నా సంపద పంపిణీ ముఖ్యమై కూర్చుంటుందన్న కమ్యూనిస్టు మేధావి కారల్ మార్క్స్ మాటలు వర్తించేది ఇక్కడే! అది సవ్యంగా జరగక పోవడం వల్లే ఈ అసాధారణ అసమానతలు. అనారోగ్యకరమైన ఆర్థిక అంత రాలు. భారమైన బతుకులీడ్చే బహుజనుల్లో నిత్య అశాంతికి కారణాలు. నిత్యం రగిలే కుంపటే! ‘న్యూ వల్డ్ వెల్’్త సంస్థ ప్రపంచంలో పది సంపన్న దేశాల జాబితాని మొన్న మంగళవారం విడుదల చేసింది. అమెరికా అగ్రస్థానంలో ఉంటే చైనా, జపాన్, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్‌లు వరుసగా దాని వెనుకున్నాయి. 5,600 బిలి యన్ అమెరికా డాలర్ల (అంటే 372.5 లక్షల కోట్ల రూపాయల) సంపదతో భారత్ ఏడో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో కెనెడా, ఆస్ట్రేలియా, ఇటలీ ఉన్నాయి. ఒక దేశంలోని అందరి వ్యక్తిగత ఆస్తుల మొత్తం విలువను పరి గణనలోకి తీసుకొని ఈ సంపద లెక్కిస్తారు. అందులో ప్రతి వ్యక్తి స్థిర–చరాస్తి నగదు, ఈక్విటీ, ఇతర వ్యాపార ప్రయోజనాల్ని పరిగణనలోకి తీసుకుం టారు. అప్పులు తదితర బాకీల భారాన్ని మినహాయించిన మీదటే సంపద లెక్కగడతారు. ప్రభుత్వ నిధుల లెక్కల్ని ఈ గణింపులోకి తీసుకోరు. భారత్ పెద్ద జనాభా వల్ల ఇది సాధ్యమైందని నివేదికలో పేర్కొన్నారు. అతి తక్కువ, 2.2 కోట్ల జనాభాతో ఆస్ట్రేలియా తొమ్మిదో స్థానం గడించడం గొప్పనీ పేర్కొంది. ఆస్ట్రేలియా, ఇటలీలతో పాటు గత పదిహేనేళ్లలో సంపద పరంగా భారతదేశం బాగా బలపడిందనీ నివేదిక పేర్కొంది. అయితే, ఈ సంపద వృద్ధి మన దేశంలో నెలకొని ఉన్న ఆర్థిక అసమానతలపై ఓ పెద్ద వెక్కిరింపు అని సామాజిక శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే, స్థూల వార్షికా దాయం లెక్కల్లో గణిస్తే సగటు భారతీయుడు నిరుపేద. అలా చూసినపుడు ప్రపంచ దేశాల్లో మనం 120 స్థానంలో ఉన్నట్టు ప్రపంచ బ్యాంకు నివేదిక చెబుతోంది. మొదటి పది దేశాలకు ఇదెంతో దూరం. దేశంలో నాలుగో వంతు జనాభా, అంటే 30 కోట్ల మంది దారిద్య్రరేఖ దిగువన రోజూ సగటున తొంబై రూపాయలు (1.25 అమెరికా డాలర్) కూడా గడించలేని పేదరికంలో అలమటిస్తున్నారు. ఈ రాబడితో ఇంటిల్లిపాదికీ పూట గడవడమే కష్టం. 80 కోట్ల మంది దినసరి ఆదాయం 150 రూపాయల (2 యుఎస్డీ) లోపేనని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో సంపద పంపిణీ అసమగ్రంగా ఉంటోంది. ఒక వైపు పేదరికం పెరుగుతుంటే మరో వైపు సుసంపన్నులు పెరుగుతున్నారు. మధ్యేరకం సంపన్నుల్లోనూ వృద్ధి లేదు. ముఖేష్ అంబానీ, దిలీప్ సంఘ్వీ, అజీమ్ ప్రేమ్‌జీ, శివ్ నాడార్, సైరస్ పుణావాలా, లక్ష్మిమిత్తల్, ఉదయ్ కోటక్, కుమారమంగళం బిర్లా, సునీల్ మిత్తల్, దేశ్‌బంధు గుప్తాలు అత్యంత సంపన్నులుగా తొలి పది స్థానాల్లో ఉన్నారు. ఫోర్బ్స్ తాజా లెక్కల ప్రకారం దేశంలో దాదాపు వంద మంది బిలియనీర్లున్నారు. కానీ, మిలియనీర్లను పెద్దగా పెరగనీయడం లేదన్న విమర్శ ఉంది. దేశంలో వంద కోట్ల (బిలియనీర్) ఆస్తిపరుడొకరికి సగటున ఎంత మంది మూడేసి కోట్ల (30 మిలియన్ల) ఆస్తిపరులున్నారన్న నిష్పత్తి (యుహెచ్ఎన్ఐస్) లెక్కలు చూస్తే భారత్‌లో అసమానతలు ఇట్టే తెలుస్తాయి. అలా ఒక బిలియనీర్‌కు 29 మంది మాత్రమే మూడు కోట్లకు మించిన సంపదగల వారున్నట్టు సగటు నిష్పత్తి గణాంకాలు చెబుతున్నాయి. ఇదే నిష్పత్తి జపాన్ (1:609), బ్రెజిల్ (1:129), దక్షిణాఫ్రికా (1:119)లలో అధికంగా ఉంది. ప్రపంచ సగటు కూడా 1:100 నిష్పత్తిగా ఉంది. ఇంకో రకంగా చెప్పాలంటే, మన దేశంలోని మొత్తం జనాభాలో 10 శాతం మంది చేతుల్లోనే 76.3 శాతం సంపద కేంద్రీకృతమై ఉంది. మరీ ముఖ్యంగా 1 శాతం జనాభా చేతిలోనే 53 శాతం సంపద పోగై ఉండటం ప్రపంచాన్నే విస్మయపరుస్తోంది. అంటే, 99 శాతం జనాభా చేతిలో సగం సంపద కూడా లేదు. ఇంతటి ఆర్థిక అసమానతలే సామాజిక అశాంతికి కారణం. అంతరాలే భవిష్యత్ సవాల్ అగ్రగామి దేశాల సంపద గర్వంగా ఉన్నా ఆరు అంశాల్లో పరిస్థితులు ప్రపంచ వ్యాప్తంగానే బాగోలేవని న్యూవల్డ్వెల్త్ సంస్థ పేర్కొంది. భరోసాలేని మహి ళల రక్షణ, పెరుగుతున్న సామాజిక భద్రత (పెన్షన్) భారం, ప్రజారోగ్య కల్పన వ్యయం, మందగించిన స్థూలాదాయ వృద్ధి, మత–జాతి పరమైన హింస పెచ్చరిల్లడం, పెరుగుతున్న ఆర్థిక అంతరాలు కలతకు గురిచేసేవేనని పేర్కొంది. ప్రపంచ పేదరికమంతా అయిదే దేశాల్లో కేంద్రీకృతమైందని 2014 ప్రపంచబ్యాంకు ‘పేదల స్థితిగతుల నివేదిక’ వెల్లడించింది. అవి భారత్, చైనా, నైజీరియా, బంగ్లాదేశ్, కాంగో దేశాలుగా పేర్కొంది. మన దేశంలో పరిస్థితులు మెరుగుపడక పోగా మరింత దయనీయంగా మారుతున్నాయి. పేదరిక నిర్మూలనకు చేపట్టే చర్యలు ఆశించిన స్థాయిలో ఫలితాలివ్వటం లేదు. ‘‘ఆర్థిక సరళీకరణ విధానాల వల్ల దేశవాసులందరికీ మేలు జరుగు తుందన్న కొని ప్రతిపాదనల్ని నేను విశ్వసించాను, కానీ, అవి కొన్ని స్థాయి ల్లోని వారికి మాత్రమే ప్రయోజనం కలిగించాయని, అత్యధికులకు ఆశించిన స్థాయి మేళ్లు కలిగించలేదని వాస్తవంలో గ్రహించాను’’ అని స్వయానా దివంగత ప్రధాని పీవీ నరసింహారావు హైదరాబాద్‌లో మర్రి చెన్నారెడ్డి స్మారకోపన్యాసం ఇస్తూ చెమర్చిన కళ్లతో పశ్చాత్తాపపడ్డారు. ఆర్థిక సరళీకరణ విధానాల వల్ల కొన్ని పెట్టుబడులు వచ్చి సంపద వృద్ధి జరిగినా పంపిణీ అస్తవ్యస్తమైంది. అది మరింత అసమానతలకు దారితీస్తోంది. ప్రపంచీకరణ యుగంలో ఆ అంతరాలు మరింతగా పెరుగుతున్నాయి. గ్రామీణార్థిక వ్యవస్థ ఛిద్రమవడం, ముఖ్యంగా అత్యధికులు ఆధారపడ్డ వ్యవసాయ రంగం కుదే లవడం పేదరికాన్ని మరింత పెంచింది. విద్య, వైద్యం వంటి రంగాల్లో వరుస ప్రభుత్వాల అశ్రద్ధ పేద, అల్పాదాయ వర్గాల్ని దారుణంగా కుంగదీస్తోంది. ఓ అధ్యయనం ప్రకారం, ఒక వ్యవసాయ కుటుంబం వార్షిక వ్యయ–రాబడి వ్యత్యాసాల వల్ల సగటున 4 శాతం మంది ఏటా కొత్తగా పేదరికంలోకి జారుతున్నారు. అనుకోకుండా వచ్చే విద్య, వైద్య ఖర్చుల కారణంగా సగటున మరో 3 శాతం మంది ఏటా బలవంతంగా దారిద్య్రరేఖ కిందకు పడిపోతున్నారు. సగటు బతుకుల గతి మారదా? ఏడో సంపన్న దేశంగా ఉన్న మనం మానవాభివృద్ధి సూచిక (హెచ్‌డీఐ)లో 188 దేశాల్లో 130వ స్థానంలో ఉన్నాం. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్య క్రమం (యుఎన్‌డీపీ)లో భాగంగా గత డిసెంబరులో ఇచ్చిన ప్రపంచ మానవా భివృద్ది నివేదికే ఈ విషయం వెల్లడించింది. మనిషి సగటు జీవితకాలం, విద్య–వైద్య సదుపాయాలు, తెలివితేటలు–జీవన ప్రమాణాలు, మాతా–శిశు ఆరోగ్యస్థాయి, స్థూల జాతీయాదాయం, పిల్లలు బడికెళ్లటం–మానటం వంటి అంశాల ఆధారంగా ఈ స్థాయిని నిర్ణయిస్తారు. హెచ్‌డీఐ స్థాయి మెరుగ వాలంటే విద్య, వైద్యం, కనీస పౌర సదుపాయాల కల్పనలో పెద్ద ఎత్తున పెట్టుబడులుండాలి. పేదలు, అల్పాదాయ వర్గాల్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. దేశంలో నాలుగోవంతు జనాభా దారిద్య్రరేఖకు దిగువన ఉండగా వారిలోనూ అత్యంత దయనీయ స్థితిలో జీవచ్ఛవాలుగా బతుకీడుస్తున్న వారిదీ పెద్ద సంఖ్యే! వారికంటూ ఆస్తులు లేకపోవడం, పెట్టుబడి లేకపోవడం, ఉపాధి అవకాశాలే కనిపించకపోవడం వంటివి వారి జీవన ప్రమాణాల్ని శాసిస్తున్నట్టు, అణచి ఉంచుతున్నట్టు యుఎన్‌డీపీ నివేదిక తెలిపింది. పేదల్లో 45 శాతం మంది నిరక్షరాస్యులని, మరో 25 శాతం మంది ప్రాథమిక స్థాయిలోనే చదువు నిలిపివేసిన వారని ఓ తాజా అధ్యయన నివేదిక చెబుతోంది. 6 శాతం మందికే తాగునీటి సదు పాయం ఉంది. పౌష్టికాహార లోపం, పరిసరాల అపరిశుభ్రత వారి ఆయు ష్షును తగ్గిస్తోంది. జీవనోపాధి కోసం పట్టణ ప్రాంతాలకు వలసవెళుతున్నా... జీవితాలు పెద్దగా మెరుగవడం లేదు. ఒక అధ్యయనం ప్రకారం, ఆదిలాబాద్ జిల్లా మారుమూల గిరిజన గ్రామంలో నెలకు సగటున మూడు వేల రూపా యలు ఖర్చయ్యే కుటుంబం వలస వెళ్లిన హైదరాబాద్ వంటి ప్రాంతంలో దాదాపు తొమ్మిది వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అంటే, వలసల తర్వాత రాబడి మూడింతలు పెరిగినా, ఇదివరకటి తరహాలోనే బతు కుతారు తప్ప జీవనప్రమాణాలేమీ మెరుగుపడవు. ఇక పట్టణ ప్రాంతాలది మరో వేదన. సంపద, ఉపాధి అవకాశాలు అక్కడ కొంచెం మెరుగ్గా ఉన్నా... ఆర్థిక అంతరాలు మరింత దారుణం. వలసల పుణ్యమా అని అతి వేగంగా విస్తరిస్తున్న 100 ప్రపంచ నగరాల్లో 25 మన దేశంలోనే ఉన్నాయి. దేశంలోని దాదాపు పావు శాతం జనాభా నివసించే మన 19 నగరాలు దాదాపు మురికి వాడలేనని ప్రపంచస్థాయి నివేదిక చెబుతోంది. 35 ఏళ్ల కింద ప్రముఖ దర్శకుడు బాలచందర్ తీసిన ఆకలిరాజ్యంలో ఆత్రేయ ఒక పాట రాశారు. ‘...మన తల్లి అన్నపూర్ణ... మన అన్న దానకర్ణ... మన భూమి వేదభూమిరా తమ్ముడూ! మన కీర్తి మంచుకొండరా...!’ అని. సంపదొకవైపు పేదరికమొక వైపు పోగవుతున్న పరిస్థితికి అద్దం పట్టే మరో పంక్తి కూడా ఉంది. ‘... బంగారు పంట మనది, మున్నేరు గంగ మనది, ఎలుగెత్తి చాటుదామురా.... ఇంట్లో ఈగల్ని తోలుదామురా....’ అని. నేటి పేదల పరిస్థితి అలాగే ఉంది. ఈమెయిల్: dileepreddy@sakshi.com -దిలీప్ రెడ్డి