
కీర్తి క్రియేషన్స్ బ్యానర్‌పై కార్తీక్ రెడ్డి, అశోక్ సిరియాల నిర్మాతలుగా కృష్ణవర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జంధ్యాల రాసిన ప్రేమకథ’. శేఖర్, దిలీప్, శ్రీలక్ష్మీ, గాయత్రి గుప్తలు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని నవంబర్ 24 న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కృష్ణవర్మ చిత్ర విశేషాలను తెలియజేస్తూ.. ‘తెలుగు చలనచిత్ర పరిశ్రమకు గొప్ప దర్శకులైన జంధ్యాల గారు రూపొందించిన ‘నాలుగు స్తంభాలాట’ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము.
ప్రజెంట్ ట్రెండ్‌కి అనుగుణంగా, అన్ని కమర్షియల్ హంగులతో.. అందరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాము. చిత్రం చాలా బాగా వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యుల నుండి మంచి ఫీడ్ బ్యాక్ తో పాటు యూ బై ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని నవంబర్ 24 న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామ’న్నారు.
Comments
Please login to add a commentAdd a comment