విజేతలను ప్రకటిస్తున్న ఆలివ్ మిఠాయి సంస్థల అధినేత దొరైరాజు, ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప
మాసబ్‌ట్యాంక్: సామాజిక బాధ్యతతో పర్యావరణ పరిరక్షణకు ‘సాక్షి’ దినపత్రిక నిర్వహించిన ‘మట్టే బంగారం’ పోటీలకు గ్రేటర్ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మట్టి విగ్రహాలను ప్రతిష్టించి... సెల్ఫీలను పంపిన వారికి ‘సాక్షి’ లక్కీ డిప్‌లో పాల్గొని రూ.లక్ష విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పించింది. ఈ నెల 6 నుంచి 14 తేదీ వరకు పంపిన సెల్ఫీలను ‘సాక్షి’లో ప్రచురించిన విషయం విదితమే. ఈ మేరకు గురువారం బంజారాహిల్స్‌లోని ‘సాక్షి’ కార్యాలయంలో లక్కీ డ్రా నిర్వహించారు.
ముఖ్య అతిథులుగా హాజరైన ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్ రెడ్డి, ఆలివ్ మిఠాయి సంస్థల అధినేత దొరైరాజు డ్రా ద్వారా విజేతను ప్రకటించారు. మొదటి విజేతగా కూకట్‌పల్లికి చెందిన హారిక, రెండో విజేతగా ఎల్బీనగర్ ఎన్‌టీఆర్ నగర్‌కు చెందిన నవదీప్, మూడో విజేతగా శేరిలింగంపల్లికి చెందిన మధుబాబులు నిలిచారు.
కొండాపూర్‌కు చెందిన గోవింద్ నాయక్, బోడుప్పల్‌కు చెందిన భాస్కర్ రెడ్డి, మౌలాలీకి చెందిన శ్రీనివాస్ కన్సోలేషన్ బహుమతులను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ఈడీ రామచంద్రమూర్తి విజేతలకు ఫోన్‌లో శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో వారికి బహుమతులు అందించనున్నారు.