అమ్మతో పెట్టుకుంటే అంతే సంగతులా? | Remya Nambeesan losing films for attack on Mohanlal? | Sakshi
Sakshi News home page

అమ్మతో పెట్టుకుంటే అంతే సంగతులా?

Published Fri, Aug 10 2018 1:04 AM | Last Updated on Fri, Sep 28 2018 4:15 PM

Remya Nambeesan losing films for attack on Mohanlal? - Sakshi

రమ్యా నంబీసన్‌

ఈ ప్రపంచంలో ఎవరు మన మేలు కోరుకున్నా కోరుకోకపోయినా మనం బాగుండాలని కోరుకునే ఏకైక వ్యక్తి ‘అమ్మ’. తప్పు చేసినా క్షమించే గుణం అమ్మకి ఉంటుంది. మరి.. అమ్మతో పెట్టుకుంటే అంతే సంగతులా? అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. ఈ ‘అమ్మ’ వేరు. ‘అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌’ (అమ్మ). కేరళ నటీనటుల సంఘం అన్నమాట. కథానాయిక భావనపై జరిగిన లైంగిక దాడిలో జోక్యం ఉందనే కారణంగా నటుడు దిలీప్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనివల్ల ‘అమ్మ’లో దిలీప్‌ సభ్యత్వం రద్దయింది. బెయిల్‌ మీద బయటికొచ్చిన దిలీప్‌ని మళ్లీ అసోసియేషన్‌లో చేర్చుకోవాలని ‘అమ్మ’ అధ్యక్షుడు మోహన్‌లాల్, ఇతర సభ్యులు నిర్ణయం తీసుకోవడంపట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన నటీమణుల్లో రమ్యా నంబీసన్‌ ఒకరు.

బాధిత నటికి అండగా ఉండటం కోసం ‘అమ్మ’కు ఆమె రాజీనామా చేసిన వెంటనే రమ్యా నంబీసన్, రీమా కల్లింగల్‌ వంటి తారలు తామూ రాజీనామా చేశారు. ఆ తర్వాత అవకాశాలు తగ్గుటున్నట్లు అనిపించిందని ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న రమ్యా నంబీసన్‌ పేర్కొన్నారు. ‘‘అమ్మ’ నుంచి బయటికొచ్చాక అభద్రతాభావం ఏర్పడింది. అవకాశాలు తగ్గుతున్నాయని గ్రహించాను. అది మాత్రమే కాదు.. నేను షూటింగ్స్‌కి సరిగ్గా రానని, నిర్మాతలను ఇబ్బంది పెడతానని, అందుకని నన్ను తీసుకోకూడదనీ ప్రచారం చేస్తున్నారు. కానీ నేనెప్పుడూ ఎవర్నీ ఇబ్బందిపెట్టలేదు. ‘అమ్మ’ తీసుకున్న నిర్ణయాన్ని తోటి నటీమణులతో కలసి వ్యతిరేకించాను కానీ నేను ఏం మాట్లాడినా అది మొత్తం మగవాళ్లందర్నీ వ్యతిరేకిస్తున్నట్లు కాదు కదా. ఒక సమస్య ఉంది.. పరిష్కరించండి అన్నాం. అది తప్పా’’ అని రమ్యా నంబీసన్‌ అన్నారు. నిజమే కదా. నిర్భయంగా మాట్లాడితే లేనిపోని నిందలు వేయడం న్యాయమా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement