ఓ భాషలో హిట్ అయిన కథలను మరో భాషలో రీమేక్ చేయడం సినీ పరిశ్రమల్లో మాములుగా జరిగేదే. కానీ ఓ భారతీయ సినిమా విదేశీ భాషల్లో రీమేక్ అవడం మాత్రం అరుదనే చెప్పాలి. అది ఓ సౌత్ ఇండియన్ మూవీ అవడం చాలా తక్కువ. ఇప్పుడు మాలయాళం సూపర్ హిట్ సినిమా ‘దృశ్యం’ త్వరలో ఇండోనేషియా లాంగ్వేజ్‌లోకి వెళ్లనుంది.
ఈ విషయాన్ని చిత్ర నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘మోహన్‌లాల్ హీరోగా, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ‘దృశ్యం’ ఇప్పటి వరకు 4 భారతీయ భాషలు, 2 విదేశీ భాషల్లో రీమేకైంది. ఇండియన్ లాంగ్వేజేస్‌తోపాటు చైనీస్, శ్రీలంకన్ భాషల్లో విడుదలై మంచి స్పందన సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇండోనేషియా భాషలో నిర్మితం కానుంది. ఇలా మా సినిమా సరిహద్దులను చెరిపేస్తూ దూసుకుపోవడం ఎంతో సంతోషాన్నిస్తోంది’ అని ఆంటోని తెలిపాడు. ఈ చిత్రాన్ని ఇండోనేషియాలో జకార్తాలోని పీటీ ఫాల్కన్ అనే సంస్థ నిర్మించనుంది. చైనీస్‌లో రీమేక్ అయిన మొదటి మలయాళ చిత్రం ఇదే కావడం విశేషం.
చదవండి: ‘దృశ్యం 2’ అరుదైన రికార్డు, ఇండియన్ సినిమాల్లో అత్యధిక రేటింగ్
కాగా, ఈ సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన ‘దృశ్యం 2’ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన అమెజాన్‌లో ఈ ఫిబ్రవరి విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ చిత్రం కూడా తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రీమేక్‌లు అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment