Jeethu Joseph
-
ఓటీటీలో అమలాపాల్ 'లెవల్ క్రాస్' థ్రిల్లర్ సినిమా
అమలాపాల్ తాజాగా నటించిన మలయాళ సినిమా 'లెవల్ క్రాస్'. ఈ మూవీలో ఆసిఫ్ అలీ హీరోగా నటించగా.. షరాఫుద్దీన్ కీలక పాత్రలో నటించాడు. జులై 26న విడుదలైన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. అర్భాఫ్ అయూబ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్సిడ్ టాక్ తెచ్చుకుంది.'లెవెల్ క్రాస్' చిత్రానికి మలయాళ టాప్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ ప్రజెంటర్‌గా వ్యవహరించారు. ఆయన తెరకెక్కించిన దృశ్యం, 12th మ్యాన్, నెరు, వంటి చిత్రాలతో మంచి గుర్తింపు ఉంది. అయితే, జీతూ జోసెఫ్ శిష్యుడిగా దృశ్యంతో పాటు పలు సినిమాలకు అర్ఫాజ్ అయూబ్ దర్శకుడిగా పనిచేశారు. ఇప్పుడు లెవెల్ క్రాస్ మూవీతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో విడుదలైన ఈ సినిమా పర్వాలేదనిపిస్తుంది. ఓటీటీలో ఎప్పుడు..?సుమారు రూ. 10 కోట్లకు పైగానే లెవల్ క్రాస్ సినిమా కోసం ఖర్చు చేశారు. IMDb రేటింగ్ 7.2తో ఒక వర్గం ప్రేక్షకులను ఈ చిత్రం మెప్పించింది. మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళ్ వర్షన్లో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ఆహా ఓటీటీ సంస్థ సోషల్ మీడియా ద్వార ప్రకటించింది. అయితే, స్ట్రీమింగ్ తేదీని వెళ్లడించలేదు. కానీ, అక్టోబర్ 11న దసరా సందర్భంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. -
OTT: మలయాళ మూవీ ‘నునక్కుజి’ రివ్యూ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ‘నూనక్కూళి’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.సమస్య అన్నది ఎవ్వరికైనా, ఎప్పుడైనా రావచ్చు. కానీ దానిని ఎలా పరిష్కరించుకుంటామన్నది మాత్రం మన మీదే ఆధారపడి ఉంటుంది. గుండు సూదంత ప్రశ్నకు గుండ్రాయంత సమాధానం అనుకుంటే అంతా గందరగోళమే. ఇదే నేపథ్యంలో వచ్చిన మలయాళ సినిమా ‘నూనక్కూళి’. ఇది తెలుగులో డబ్ అయింది. ప్రముఖ దర్శకులు జీతూ జోసెఫ్ తీసిన ఈ సినిమా జీ5 ఓటీటీ వేదికగా ఆద్యంతం ఆకట్టుకుంటోంది. (చదవండి: ఈ వీకెండ్ ఏకంగా 24 మూవీస్.. అవి ఏంటంటే?)ఇక ఈ చిత్రం కథాంశానికొస్తే... ఓ పెద్ద వ్యాపార సంస్థకు ఎండీ అయిన పూళికున్నేల్ తన భార్యతో ఆంతరంగికంగా కలిసున్న వీడియోను తన లాప్టాప్లో దాచుకుంటాడు. ఇంతలో పూళికున్నేల్ సంస్థ పై ఐటీ రైడ్ జరిగి, ఇతని లాప్‌టాప్‌ను కూడా స్వాధీనపరుచుకుంటారు ఐటీ ప్రతినిధులు. కంపెనీ లావాదేవీల కన్నా ఇప్పుడు పూళికున్నేల్ దృష్టి తన వీడియో ఇతరుల దృష్టిలో పడకుండా చూడాలని ఆ ఐటీ ప్రతినిధి ఇంటికి తన లాప్టాప్ కోసం దొంగతనానికి వెళతాడు. ఆ సమయంలో వేరే ఒకావిడ తాను ఆత్మహత్య కోసం తయారు చేసుకున్న విషాన్ని పూళికున్నేల్ పొరపాటున తాగేస్తాడు. అది కాస్త పోలీస్ కేసు అవుతుంది. చివరాఖరికి పూళికున్నేల్ తన లాప్టాప్ దక్కించుకున్నాడా? ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆమెకు, ఐటి ప్రతినిధికి, హీరో పూళికున్నేల్కు ఉన్న సంబంధం ఏంటి? అన్నది మాత్రం ఓటీటీలోనే చూడాలి. పూళికున్నేల్ పాత్రలో బసిల్ జోసెఫ్ అలాగే మరో ప్రధాన పాత్రలో గ్రేస్ ఆంటోని అద్భుతంగా నటించారు. సినిమా ఆద్యంతం కితకితలు పెట్టిస్తూనే ఉంటుంది. సున్నిత సమస్యకు ఆ సరదా పరిష్కారం ఏంటో ‘నూనక్కూళి’ సినిమాలో ఈ వారం చూసేయండి. – ఇంటూరు హరికృష్ణ -
ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్‌బస్టర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి మరో క్రేజీ బ్లాక్‌బస్టర్ వచ్చేసింది. 'సలార్'కి పోటీగా మలయాళంలో రిలీజైన ఈ మూవీ అద్భుతమైన హిట్‌గా నిలిచింది. కోర్ట్ రూమ్ డ్రామా చిత్రాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్‌గా నిలిచిందనే టాక్ వినిపించింది. ఇకపోతే ఈ సినిమాని వెంకటేశ్ రీమేక్ చేస్తారనే వార్తలొచ్చాయి కానీ అలాంటిదేం లేకుండానే తెలుగు వెర్షన్ కూడా ఇప్పుడు ఓటీటీలో రిలీజైపోయింది. ఇంతకీ ఇదే సినిమా? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ఆ కాంబో మళ్లీ మలయాళ ఇండస్ట్రీ అంటే డిఫరెంట్ సినిమాలకు పెట్టింది పేరు. స్టార్ హీరోలు కూడా ఇమేజ్ చట్రంలో పడిపోకుండా అప్పుడప్పుడు స్టోరీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తుంటారు. అలా గతేడాది మోహన్‌లాల్ లాయర్ పాత్రలో 'నెరు' అనే సినిమా చేశారు. 'దృశ్యం' లాంటి థ్రిల్లర్ మూవీస్‌తోనూ చాలా క్రేజ్ తెచ్చుకున్న జీతూ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో మనకు తెలిసిన ప్రియమణి కూడా ఓ లాయర్‌గా నటించడం విశేషం. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్) ఆ ఓటీటీలోనే ఇకపోతే మలయాళంలో మాత్రమే డిసెంబరు 21 ఈ సినిమా రిలీజైంది. నెలలోపే ఓటీటీలోకి వచ్చేసింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. సీరియస్‌గా సాగే కోర్టు రూమ్ డ్రామా చిత్రాలు ఇష్టపడితే మాత్రం దీన్ని అస్సలు మిస్సవొద్దు. 'నెరు' కథేంటి? కళ్లు కనిపించని ఓ అమ్మాయి.. మానభంగానికి గురవుతుంది. అయితే వ్యక్తిని గుర్తించలేనప్పటికీ.. మట్టితో అతడి పోలికలున్న ఓ బొమ్మని తయారు చేస్తుంది. దీనిబట్టి పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఓ కుర్రాడిని అదుపులోకి తీసుకుంటారు. ఆ తర్వాత కోర్టులో ఏం జరిగింది? బాధితురాలికి న్యాయం జరిగిందా? లేదా అనేది 'నెరు' స్టోరీ. (ఇదీ చదవండి: 14 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన సినిమా.. ఫ్రీగా చూసే ఛాన్స్) -
'దృశ్యం 3' ఆ రెండు భాషల్లో ఒకేసారి.. నిజమెంత?
ప్రస్తుత జనరేషన్ కి థ్రిల్లర్ సినిమాలంటే పిచ్చి. థియేటర్, ఓటీటీ ఇలా ఎందులో దొరికితే అందులో తెగ చూసేస్తున్నారు. ఈ జానర్ లో 'దృశ్యం' ఫ్రాంచైజీ సరికొత్త బెంచ్ మార్క్స్ సృష్టించిందని చెప్పొచ్చు. ఇప్పటికే రెండు భాగాలు వచ్చాయి. ప్రేక్షకుల్ని ఓ రేంజులో ఎంటర్ టైన్ చేశాయి. ఇప్పుడు మూడో పార్ట్ గురించి క్రేజీ అప్డేట్ ఒకటి వైరల్ అవుతోంది. మలయాళంలో మోహన్ లాల్ నటించిన 'దృశ్యం'.. 2013లో థియేటర్లలోకి వచ్చింది. థ్రిల్లర్ జానర్ లో వండర్స్ క్రియేట్ చేసింది. దీన్నే తెలుగు, హిందీలో అదే పేరుతో రీమేక్ చేశారు. తీసిన ప్రతిభాషలోనూ సూపర్ హిట్ అవడంతోపాటు అదిరిపోయే రేంజ్లో వసూళ్లు సాధించింది. దీంతో మూడో పార్ట్ కోసం అందరూ వెయిటింగ్. (ఇదీ చదవండి: హీరోయిన్‌తో దృశ్యం 2 డైరెక్టర్ పెళ్లి.. పోస్ట్ వైరల్) తొలి రెండు పార్ట్స్ తీసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్.. మూడో భాగం కోసం షాకింగ్ డెసిషన్ తీసుకున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. మలయాళం, హిందీలో ఒకేసారి షూట్ చేయాలనుకున్నారని.. దీనివల్ల సినిమాలోని స్పాయిలర్స్ కి అస్సలు ఛాన్స్ ఉండదని ఆయన భావిస్తున్నట్లు ఓ వార్త బయటకొచ్చింది. ఇప్పుడు ఈ న్యూస్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ వరకు చేరింది. దీంతో ఆయన దీనిపై స్పందించారు. 'బయట వినిపిస్తున్నవి ఏవి నిజం కాదు. దృశ్యం 3 పనులు ఇంకా మొదలుపెట్టలేదు. మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి షూటింగ్ చేస్తామనేది కూడా రూమర్ మాత్రమే' అని డైరెక్టర్ జీతూ జోసెఫ్ క్లారిటీ ఇచ్చారు. (ఇదీ చదవండి: 'బిచ్చగాడు 2' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఆ రోజు నుంచి స్ట్రీమింగ్) -
ఓ కంక్లూజన్‌తో మోహన్ లాల్ 'దృశ్యం 3'.. ఆసక్తిగా ఫస్ట్ లుక్
Mohanlal Drishyam 3 First Look Poster Released: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, సీనియర్ హీరోయిన్ మీనా ప్రధాన పాత్రల్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రాలు దృశ్యం, దృశ్యం 2. మొదటగా వచ్చిన 'దృశ్యం' మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై మాసీవ్ హిట్‌ను సొంతం చేసుకుంది. దీంతో తెలుగు, తమిళంలో కూడా రీమేక్ కాగా అక్కడ కూడా మంచి విజయం సాధించింది. తెలుగులో విక్టరీ వెంకటేష్, మీనా నటించిన విషయం తెలిసిందే. ఇక దీనికి సీక్వెల్‌గా తెరకెక్కిన 'దృశ్యం 2' కూడా ఎంతపెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కన్న కూతురును, కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఓ తండ్రి చేస్తున్న యుద్ధమే ఈ సిరీస్‌ల కథగా చెప్పుకోవచ్చు. అయితే తాజాగా ఈ సిరీస్‌లో మూడో చిత్రం రానుంది. ఈ రెండు పార్ట్‌లకు కొనసాగింపుగా 'దృశ్యం 3' రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 'దృశ్యం 3: ది కంక్లూజన్' పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో మోహన్ లాల్ సంకెళ్లతో ధీర్ఘంగా ఆలోచిస్తూ కనిపించడం ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా పోస్టర్‌పై ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. కాగా మొదటి రెండు భాగాలకు దర్శకత్వం వహించిన జీతూ జేసేఫ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. మరీ ఈ మూడో చిత్రంలో ఎన్ని ట్విస్టులు ఉంటాయో వేచి చూడాల్సేందే. అలాగే ఈ మూడో భాగంతో ఓ కంక్లూజన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. #Drishyam3 The Conclusion offical announcement soon#Mohanlal @Mohanlal pic.twitter.com/X8dVERlaTR — Shivani Singh (@lastshivani) August 13, 2022 #Drishyam3 George Kutty & Family are coming back! pic.twitter.com/VUoT6m0gLF — Christopher Kanagaraj (@Chrissuccess) August 13, 2022 -
11 మంది ఫ్రెండ్స్ సరదాగా ఆడిన ఆట ఒకరి ప్రాణం తీస్తే.. '12th మ్యాన్' రివ్యూ
టైటిల్: 12th మ్యాన్ (మలయాళం) నటీనటులు: మోహన్ లాల్, ఉన్ని ముకుందన్, అనుశ్రీ, అదితి రవి, రాహుల్ మాధవ్, లియోనా లిషాయ్ తదితరులు కథ: కెఆర్. కృష్ణ కుమార్ దర్శకుడు: జీతూ జోసేఫ్ సంగీతం: అనిల్ జాన్సన్ సినిమాటోగ్రఫీ: సతీష్ కురూప్ నిర్మాత: ఆంటోనీ పెరుంబవూరు విడుదల తేది: మే 20, 2022, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విలక్షణ నటుడు, మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కథ నచ్చితే తన పాత్ర కోసం ఎంతైనా శ్రమిస్తారు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం '12th మ్యాన్'. దృశ్యం, దృశ్యం 2 సినిమాల డైరెక్టర్ జీతూ జోసేఫ్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. మోహన్ లాల్-జీతూ జేసేఫ్ కాంబోలో ముచ్చటగా మూడోసారి వచ్చింది ఈ చిత్రం. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే పెరిగాయి. అదేకాకుండా ఇదివరకు విడుదలైన సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెంచెలా ఉంది. అయితే ఎట్టకేలకు శుక్రవారం (మే 20) నేరుగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైన '12th మ్యాన్' (12th Man Movie) ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ: 11 మంది స్నేహితులు తమ ఫ్రెండ్ సిద్ధార్థ్ (అను మోహన్) బ్యాచ్‌లర్ పార్టీకి వారి భార్యలతో కలిసి ఒక రిసార్ట్‌కు వెళ్తారు. ఈ 11 మందిలో ఇప్పుడు పెళ్లి చేసుకునే జంటతో (ఇద్దరు) పాటు నలుగురు దంపతులు (8 మంది), ఒక పెళ్లి అయి భర్తతో సెపరేట్ అయిన మహిళ ఉంటారు. వీరందరు కలిసి బ్యాచ్‌లర్ పార్టీ బాగా ఎంజాయ్ చేద్దామనుకుంటారు. పార్టీలో భాగంగా మొబైల్ ఫోన్స్‌తో ఒక గేమ్ ఆడతారు. ఆ గేమ్ కాస్తా వారిలోని రహస్యాలను బయటపెడుతుంది. దీంతో ఆ సముహాంలో ఒక అనుమానం, గందరగోళం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే ఆ 11 మందిలో మాథ్యూ (సైజు కురూప్) భార్య షైనీ (అనుశ్రీ) అనుమానస్పదంగా చనిపోతుంది. షైనీ ఎలా చనిపోయింది ? హత్యా ? ఆత్మహత్య ? వారికి ఎదురైన అనుమానం ఏంటీ ? ఆ 11 మందితో కలుస్తానన్న 12వ మనిషి చంద్రశేఖర్ (మోహన్ లాల్) ఎవరు ? అనేది తెలియాలంటే '12th మ్యాన్' మూవీ చూడాల్సిందే. విశ్లేషణ: ఇది ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. దృశ్యం సిరీస్‌తో సంచలన విజయం సాధించిన డైరెక్టర్ జీతూ జోసేఫ్ మళ్లీ అదే తరహాలో ఈ సినిమాను తెరకెక్కించారు. క్రైమ్ థ్రిల్లర్‌ను ఎలా సస్పెన్సింగ్‌గా చూపెట్టాలో బాగా తెలిసిన దర్శకుడు జీతూ. ఈ మూవీని ఆద్యంతం థ్రిల్లింగ్, సస్పెన్సింగ్‌గా చూపెట్టడంలో నూటికి నూరు శాతం విజయం సాధించారు. 11 మంది పాత్రల పరిచయంతో ప్రారంభమైన సినిమా తాగుబోతుగా ఎంట్రీ ఇచ్చిన మోహన్ లాల్‌తో ఆసక్తిగా మారుతుంది. బ్యాచ్‌లర్ పార్టీలో మొబైల్ ఫోన్స్ గేమ్ ఆడతారు. ఈ గేమ్‌లో బ్యాచ్‌లర్ పార్టీ ఇస్తున్న సిద్ధార్థ్‌కు వచ్చిన ఫోన్ కాల్‌తో తన రహస్యం ఒకటి బయటపడుతుంది. దీంతో ఆ ఫ్రెండ్స్ మధ్య ఒక గందరగోళం, అనుమానం ఏర్పడుతుంది. ఇంతలో వారి ఫ్రెండ్ భార్య షైనీ చనిపోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఇక్కడ మోహన్ లాల్ గురించి ఒక విషయం రివీల్ అవుతుంది. అది ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది తప్ప మూవీలో మరే ట్విస్ట్‌లు ఏం లేకపోయినా ఒక్కొక్కరు తమ హిడెన్ సీక్రెట్స్ (నిజాలను) బయటపెట్టడం ఆద్యంతం ఉత్కంఠంగా, ఆసక్తిరకంగా ఉంటుంది. సినిమా రన్ టైమ్ కొంచెం ఎక్కువగానే 2 గంటల 42 నిమిషాలు ఉంటుంది. షైనీది హత్య ? ఆత్మహత్య ? అనేది చివరి వరకు తేలేదాకా ఎంతో గ్రిప్పింగ్‌గా నారేట్ చేశారు. దృశ్యం, దృశ్యం 2 తరహాలో స్క్రీన్‌ప్లే ఆకట్టుకుంది. సస్పెన్స్‌ను క్రియేట్ చేసేలా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చక్కగా కుదిరింది. ఎవరెలా చేశారంటే ? తాగుబోతుగా, మరొక రోల్లో మోహన్ లాల్ అదరగొట్టారు. ఆయన ఆక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేనేలేదు. మిగతా క్యారెక్టర్స్‌లో నటించిన వారంతా సెటిల్డ్ పెర్ఫామెన్స్ ఇచ్చారనే చెప్పవచ్చు. సినిమాకు కథ, కథనం పాత్రల నటన, బీజీఎం, సినిమాటోగ్రఫీ ప్రధాన బలం. సినిమా కథ అంతా ఒకే రోజు జరుగుతుంది. సినిమా ప్రారంభం నుంచే కథలో లీనమయ్యేలా తరెకెక్కించారు డైరెక్టర్ జీతూ. అప్పుడేల ఒక నిజం చెప్పడం.. అంతలోనే అది అబద్ధం అని తేలడం ఎంతో థ్రిల్లింగ్‌గా డైరెక్ట్ చేశారనే చెప్పవచ్చు. ఓవరాల్‌గా చెప్పాలంటే 'దృశ్యం' సిరీస్‌లా మంచి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకుంటే '12th మ్యాన్' సినిమాను కచ్చితంగా ట్రై చేయాల్సిందే. -
మోహన్ లాల్ మరో క్రైమ్ థ్రిల్లర్ '12th మ్యాన్'.. నేరుగా ఓటీటీలోకి
12th Man: Jeethu Joseph Mohanlal Locked Thriller Trailer Released: క్రైమ్ థ్రిల్లర్ జానర్స్తో ప్రేక్షకులను కట్టిపడేసే చిత్రాలను తెరకెక్కించే మలయాళ దర్శకులలో జీతు జోసేఫ్ ముందుంటారు. ఆయన తెరకెక్కించిన దృశ్యం, దృశ్యం 2 సినిమాలు ఎంతటి హిట్ సాధించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఆయన మరో క్రైమ్ థ్రిల్లర్‌ను రూపొందించారు. విలక్షణ నటుడు మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కింది '12th మ్యాన్' చిత్రం. (చదవండి: వావ్.. సినీ ప్రియులకు ఇక పండగే.. ఓటీటీలో ఏకంగా 40) ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా మే 20 నుంచి ప్రసారం కానుంది. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అధికారికంగా ప్రకటిస్తూ ట్రైలర్ విడుదల చేసింది. 11 మంది స్నేహితులు వెకేషన్‌కు వెళ్లినప్పుడు వారితో 12వ మనిషి కలుస్తాడు. ఆ 12వ మనిషి ఎవరు ? మిగతా 11 మందికి అతనికి ఉన్న సంబంధం ఏంటి ? అనే విషయాలతో ట్రైలర్ ఉత్కంఠగా సాగింది. ట్రైలర్ చూస్తుంటే క్రైమ్‌తోపాటు, లాక్డ్ థ్రిల్లర్‌లా ఉంది. ఈ మూవీ కూడా దృశ్యం, దృశ్యం 2 సినిమాల్లానే భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని తెలుస్తోంది. చదవండి: గుడ్‌న్యూస్ చెప్పిన ఆహా, మేలో ఏకంగా 40+ మూవీస్! 12th Man Official Trailer Out Now!!! Watch Here👉 https://t.co/5oyPiQhpH3#12thMan streaming from May 20 on @DisneyPlusHS #12thManOnHotstar @Mohanlal @aashirvadcine @KurupSaiju @Iamunnimukundan @JeethuJosephDir @12thManMovie @sethusivanand @SshivadaOffcl @DisneyplusHSMal pic.twitter.com/tUxENWUIKz — DisneyPlus Hotstar Malayalam (@DisneyplusHSMal) May 3, 2022 -
దృశ్యం సిరీస్ కాంబో రిపీట్.. నేరుగా ఓటీటీలో విడుదల ?
Mohanlal 12th Man Movie Will Release In OTT: ప్రముఖ నటుడు మోహన్ లాల్ తన విలక్షణ నటనతో ఎందరినో ఆకట్టుకున్నారు. కథ నచ్చితే తన పాత్ర కోసం ఎంతైనా శ్రమిస్తారు. తాజాగా ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం '12th మ్యాన్'. మిస్టరీ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు జీతూ జేసెఫ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ క్రమంలో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. '12th మ్యాన్' చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ టాక్. త్వరలో ఈ విషయానికి సంబంధించిన ప్రకటనను అఫిషియల్‌గా అనౌన్స్ చేయనున్నారని ఆ వార్త సారాంశం. మార్చిలో ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకూ వచ్చిన దృశ్యం, దృశ్యం 2 సినిమాలు ఎంత హిట్ అయ్యాయో తెలిసిందే. ఇప్పుడు వీరి కాంబోలో మరో సినిమా వస్తుందంటే అంచనాలు భారీగానే ఉంటాయి. -
ఆ చీకటి ఙ్ఞాపకాల్లోకి మమ్మల్ని మళ్లీ లాగొద్దు : వెంకటేశ్
Venkatesh Drushyam 2 Movie Release Date Confirmed: వెంకటేశ్, మీనా ప్రధాన పాత్రలో నటించిన 'దృశ్యం-2' రిలీజ్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాను ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అనుకోని ఆపదల నుంచి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కుమార్తెను ఓ తండ్రి ఎలా రక్షించుకున్నాడు? అనే కథాంశంతో రూపొందిన సినిమా ఇది. మలయాళం సూపర్ హిట్ మూవీ ‘దృశ్యం 2’కు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మాతృకను డైరెక్ట్ చేసిన జీతూ జోసఫే తెలుగు రీమేక్‌కు కూడా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో ఈనెల 25న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. The truth has begun to unveil itself. But the question is - has it left a permanent scar on Rambabu? Watch #Drushyam2OnPrime, Nov. 25 on @PrimeVideoIN ▶️https://t.co/mL68iUtwzC#MeenaSagar #JeetuJoseph @SureshProdns @aashirvadcinema @antonypbvr @anuprubens #SatheeshKurup pic.twitter.com/YTkirX6oBH — Venkatesh Daggubati (@VenkyMama) November 12, 2021 -
ఓ సౌత్ ఇండియా సినిమా మూడు విదేశీ భాషల్లోకి..
ఓ భాషలో హిట్ అయిన కథలను మరో భాషలో రీమేక్ చేయడం సినీ పరిశ్రమల్లో మాములుగా జరిగేదే. కానీ ఓ భారతీయ సినిమా విదేశీ భాషల్లో రీమేక్ అవడం మాత్రం అరుదనే చెప్పాలి. అది ఓ సౌత్ ఇండియన్ మూవీ అవడం చాలా తక్కువ. ఇప్పుడు మాలయాళం సూపర్ హిట్ సినిమా ‘దృశ్యం’ త్వరలో ఇండోనేషియా లాంగ్వేజ్‌లోకి వెళ్లనుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘మోహన్‌లాల్ హీరోగా, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ‘దృశ్యం’ ఇప్పటి వరకు 4 భారతీయ భాషలు, 2 విదేశీ భాషల్లో రీమేకైంది. ఇండియన్ లాంగ్వేజేస్‌తోపాటు చైనీస్, శ్రీలంకన్ భాషల్లో విడుదలై మంచి స్పందన సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇండోనేషియా భాషలో నిర్మితం కానుంది. ఇలా మా సినిమా సరిహద్దులను చెరిపేస్తూ దూసుకుపోవడం ఎంతో సంతోషాన్నిస్తోంది’ అని ఆంటోని తెలిపాడు. ఈ చిత్రాన్ని ఇండోనేషియాలో జకార్తాలోని పీటీ ఫాల్కన్ అనే సంస్థ నిర్మించనుంది. చైనీస్‌లో రీమేక్ అయిన మొదటి మలయాళ చిత్రం ఇదే కావడం విశేషం. చదవండి: ‘దృశ్యం 2’ అరుదైన రికార్డు, ఇండియన్ సినిమాల్లో అత్యధిక రేటింగ్ కాగా, ఈ సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన ‘దృశ్యం 2’ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన అమెజాన్‌లో ఈ ఫిబ్రవరి విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ చిత్రం కూడా తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రీమేక్‌లు అవుతోంది. View this post on Instagram A post shared by Antony Perumbavoor (@antonyperumbavoor) -
స్పీడు పెంచిన వెంకటేశ్
హీరో వెంకటేశ్ మంచి జోష్‌లో ఉన్నారు. సినిమాల మీద సినిమాలను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ‘నారప్ప’ (తమిళ చిత్రం ‘అసురన్’కు తెలుగు రీమేక్) సినిమా షూట్‌ను పూర్తి చేసిన వెంకటేశ్ తాజాగా ‘దృశ్యం 2’ సినిమాకు కూడా పూర్తిగా ప్యాకప్ చెప్పారు. మలయాళ ‘దృశ్యం 2’ తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ‘దృశ్యం’ తొలి భాగంలో భార్యాభర్తలుగా నటించిన వెంకటేశ్, మీనాలే సీక్వెల్లోనూ నటిస్తున్నారు. మాతృకను డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫే తెలుగు ‘దృశ్యం 2’కు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా వెంకటేశ్ పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయినట్లు చిత్రబందం ప్రకటించింది. ఇప్పుడు నదియా, మీనా కాంబినేషన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరోవైపు వెంకటేశ్ ‘ఎఫ్–3’ సినిమాతో బిజీ అవుతారు. -
రాజమౌళి వాట్సాప్ చాట్‌ను పంచుకున్న జోసెఫ్
దక్షిణాదిలోని సుప్రసిద్ధ దర్శకుల్లో రాజమౌళి ఒకరు. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటిన ఆయన ‘దృశ్యం’ దర్శకుడు జీతూ జోసెఫ్ని ప్రశంసించడం విశేషం. మలయాళ చిత్రాలు ‘దృశ్యం, దృశ్యం 2’తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు జీతూ జోసెఫ్. మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘దృశ్యం 2’ ఫిబ్రవరి 19న అమెజాన్‌లో విడుదలై మంచి హిట్ అందుకుంది. ‘దృశ్యం’ రీమేక్‌లో నటించిన వెంకటేష్ ‘దృశ్యం 2’ రీమేక్‌లోనూ నటిస్తున్నారు. జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా రాజమౌళి వాట్సాప్ ద్వారా జోసెఫ్‌తో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. దీన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపారు జోసెఫ్. రాజమౌళి ప్రశంస ఏంటంటే.. ‘‘హాయ్ జీతూ.. నేను డైరెక్టర్ రాజమౌళిని. ‘దృశ్యం 2’ చూసిన తర్వాత నా ఆలోచలన్నీ దాని చుట్టూనే తిరిగాయి. వెంటనే మళ్లీ ఒకసారి మలయాళ ‘దృశ్యం’ చూశాను. (తెలుగులో విడుదల అయినప్పుడే చూశాను). దర్శకత్వం, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్, యాక్టింగ్.. ఇలా అన్ని విభాగాలు అద్భుతంగా ఉన్నాయి. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన కథ ఇది. ‘దృశ్యం’ ఒక మాస్టర్ పీస్. అదే ఉత్కంఠతో సీక్వెల్ తీసుకురావడం గొప్ప విషయం. మీ నుంచి మరికొన్ని మాస్టర్ పీస్ చిత్రాలు రావాలి’’ అన్నారు. చదవండి: RRR Movie: క్లైమాక్స్‌లో భారీ ట్విస్ట్! -
దృశ్యం 2: మోహన్ లాల్ కథకు ప్రాణం పోశారు
మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘దృశ్యం’ మూవీకి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘దృశ్యం-2’ ఈ రోజు అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ మోహన్‌లాల్, మీనా ప్రధాన పాత్రల్లో నటించారు. ఆరేళ్ల క్రితం సెన్సెషనల్ హిట్ సాధించిన ఈ మూవీ తెలుగు, తమిళంతోపాటు మరో మూడు భాషల్లో రీమేక్ అయ్యిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఇక తాజాగా మలయాళంలో విడుదలైన ఈ మూవీ సిక్వెల్‌కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా సీని రచయిత శీధర్ పిల్లై ట్వీట్ చేశారు. ‘అద్భుతమైన ఆరంభం. దృశ్యం లాగే ఈ సీక్వెల్ కూడా ప్రేక్షక ఆదరణతో ముందుకు వెళుతోంది. జీతూ జోసెఫ్ స్మార్ట్ రైటింగ్, థ్రిల్లింగ్ థాట్‌కు జార్టీ కుట్టిగా మోహన్ లాల్ కథకు ప్రాణం పోశారు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా దృశ్యంలో తన కుటుంబం జోలికి వచ్చిన వరుణ్‌ను కూతురు హత్య చేయడం.. ఆ మృతదేహాన్ని ఎవరూ ఉహించని విధంగా పోలీస్ స్టేషన్లోనే పాతిపెడతాడు జార్జి కుట్టి (మోహన్ లాల్). ఇక ఆ తర్వాత జార్జి తన కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. కానీ ఆ కేసును మాత్రం పోలీసులు వదిలి పెట్టరు. జార్జికి తెలియకుండా ఆ కేసును ఇంకా దర్యాప్తు చేస్తుంటారు. ఈ క్రమంలోనే వారికి కొన్ని కీలక సాక్ష్యాలు దొరుకుతాయి. ఆ సాక్ష్యాలెంటీ.. మళ్లీ వాటి వలన జార్జి కుటుంబానికి ఎదురైన సమస్యలను దర్శకుడు దృశ్యం 2లో చూపించాడు. #Drishyam2 @PrimeVideoIN -Fantastic!A sequel as good as #Drishyam. #JeethuJoseph nailed it smart writing & taut thrilling moments. @Mohanlal as #Georgekutty is extraordinary along with #Meena & #MuraliGopy.Story opens 6 years after events of #D1 & police hasn’t closed the case... pic.twitter.com/ciAYV0J4LU — Sreedhar Pillai (@sri50) February 18, 2021 -
మళ్లీ మలయాళంలో..
కెరీర్ ఆరంభించిన పదహారేళ్లకు త్రిష మలయాళంలో గత ఏడాది తొలి సినిమా (హే జ్యూడ్) చేశారు. ఈ ఏడాది మళ్లీ కేరళ ప్రేక్షకులను పలకరించనున్నారని సమాచారం. మోహన్‌లాల్ సరసన ఓ సినిమా చేయడానికి అంగీకరించారట. దాదాపు ఆరేళ్ల క్రితం మోహన్‌లాల్ హీరోగా ‘దృశ్యం’ వంటి సూపర్ హిట్ మూవీ అందించిన జీతూ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘దృశ్యం’ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రీమేక్ అయిన విషయం తెలిసిందే. జీతు జోసెఫ్ తెరకెక్కించే కథలు అలా అన్ని భాషలకూ సరిపోతుంటాయి. తాజా చిత్రాన్ని మలయాళ, తమిళ భాషల్లో రూపొందించనున్నారట. నవంబరులో చిత్రీకరణ మొదలుపెట్టనున్నారని తెలిసింది. ఈ సినిమాకి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్ ఫారిన్లో జరుగుతుందట. ఈజిప్ట్, యూకె, కెనడా లొకేషన్స్‌లో చిత్రీకరణ ప్లాన్ చేశారని మాలీవుడ్ టాక్. -
ఈ తరుణం గుర్తుండిపోతుంది!
వదిన జ్యోతికతో కలిసి తెరపై తొలిసారిగా నటిస్తున్నా. చాలా సంతోషంగా ఉం ది అని నటుడు కార్తీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇంతకు ముందు అగ్ర కథానాయకిగా రాణించిన జ్యోతిక.. నటుడు సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తరువాత నటనకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అలాంటిది 36 వయదినిలే చిత్రంతో మళ్లీ నటిగా ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాల్లో నటిస్తున్నా రు. తాను రీ ఎంట్రీ అయిన తరువాత భర్త సూర్యతో కలిసి నటించే సందర్భం రాలేదు. కానీ ఇప్పుడు తన మరిది, నటుడు కార్తీ తో కలిసి నటించడానికి జ్యోతిక సిద్ధం అయ్యా రు. వీరు చిత్రంలో కూడా వదినా మరిదిగా నటించడనుండడం విశేషం. మలయాళ దర్శకుడు జిత్తు జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైకం 18 స్టూడియోస్ సమర్పణలో పారలల్ మైండ్స్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఈ చిత్రం గురించి నటుడు కార్తీ తన ట్విట్టర్లో పేర్కొంటూ వెండితెరపై వదినతో నటించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. జిత్తు జోసెఫ్ దర్శకత్వం లో నటించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మీ ఆశీస్సులతో చిత్రం ఈ రోజు ప్రారంభం అయ్యిందన్నారు. నటుడు సూర్య కూడా కార్తీకి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కార్తీకి ఈ తరుణం నట పయనంలో గుర్తుండిపోతుంది. తెరపై జ్యోతికతో కలిసి చూడడానికి చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను. వెండితెర వదినకు మంచి అదృష్టం ఎదురు చూస్తోంది. శుభాకాంక్షలు అని సూర్య, కార్తీ తండ్రి, సీనియర్ నటుడు శివకుమార్ ట్వీట్ చేశారు. కార్తీ, జ్యోతికల చిత్రం కోసం అభిమానులే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంటే, వారి కుటుంబమే మరింత ఆసక్తిగా ఎదురు చూడడం నిజంగా విశేషమే. This one will make a very special Mark! So excited to see you and Jo on screen..!! Good luck to this fantastic team! https://t.co/91VjQQfEaj — Suriya Sivakumar (@Suriya_offl) 27 April 2019 -
వదినా మరిది కాదు.. అక్కా తమ్ముడు
కార్తీ, జ్యోతిక వరుసకు వదినా, మరిది. అంటే సూర్యకు తమ్ముడు. కానీ జ్యోతికకు తమ్ముడిగా మారనున్నారట కార్తీ. మలయాళ దర్శకుడు జీతు జోసెఫ్ తమిళంలో ఓ ఫ్యామిలీ డ్రామా తెరకెక్కించనున్నారు. ఈ సినిమా కోసం అక్క, తమ్ముడు పాత్రల కోసం జ్యోతిక, కార్తీలను ఒప్పించారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సాగే కథ అని సమాచారం. ప్రస్తుతం ఇతర సినిమాలతో బిజీగా ఉన్నారు జ్యోతిక, కార్తీ. వాళ్ల కమిట్మెంట్స్ పూర్తికాగానే జూన్‌లో ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అవుతారట. ఇందులో మిగతా నటీనటులు ఎవరో ఇంకా తెలియదు. కార్తీ, జ్యోతిక ఇద్దరూ తెలుగు ఆడియన్స్‌కు సుపరిచితమే కాబట్టి డబ్బింగ్ చేసి ఇక్కడ కూడా రిలీజ్ చేస్తారేమో చూడాలి. -
మలయాళీ దర్శకుడితో వెంకీ
బాబు బంగారం సినిమాతో మంచి కమర్షియల్ హిట్ అందుకున్న వెంకటేష్.. ఇప్పుడు వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. లాంగ్ గ్యాప్ తరువాత చేసిన బాబు బంగారం వెంకీకి మంచి కిక్ ఇచ్చింది. అదే జోరులో ఇప్పుడు ప్రయోగాలకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం మాధవన్ హీరోగా తెరకెక్కిన ఇరుద్ది సుత్తుర్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న విక్టరీ హీరో, మరో సినిమాను కూడా రెడీ చేసే పనిలో ఉన్నాడు. మళయాలి దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు వెంకీ. ఇప్పటికే జోసెఫ్ చెప్పిన కథకు ఓకె చెప్పిన వెంకీ, పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయాలని సూచించాడట. గతంలో జీతూ దర్శకత్వంలో తెరకెక్కిన దృశ్యం సినిమాను తెలుగులో శ్రీ ప్రియ దర్శకత్వంలో రీమేక్ చేశారు. థ్రిల్లర్ సినిమాల స్పెషలిస్ట్‌గా పేరున్న జీతూ జోసెఫ్, వెంకీ ఇమేజ్‌కు బాడీ లాంగ్వేజ్ తగ్గ కథను రెడీ చేసే పనిలో ఉన్నాడు. -
మలయాళ దర్శకుడికి ఓకే చెప్పాడు
ఏడాది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న వెంకటేష్ మళ్లీ సినిమాలకు రెడీ అవుతున్నాడు. గతంలోరిజెక్ట్ చేసిన మారుతి దర్శకత్వంలో బాబు బంగారం పేరుతో ఓ కామెడీ ఎంటర్ టైనర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 16న లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను కూడా పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నాడు వెంకీ. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు వెంకటేష్. గతంలో జీతూ జోసెఫ్ తెరకెక్కించిన దృశ్యం సినిమా రీమేక్ లో హీరోగా నటించిన వెంకీ, ఈ సారి నేరుగా జీతూ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. తెలుగులో వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళ వర్షన్ లో హీరోను ఫైనల్ చేయాల్సి ఉంది. -
ఆ రెండు సీన్ల గురించే రజనీ వద్దన్నారట
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ దృశ్యం సినిమాలో నటించడానికి రెండు సీన్ల కారణంగానే వద్దన్నారట. మలయాళంలో ఘనవిజయం సాధించిన దృశ్యం సినిమాను తమిళంలో రీమేక్ చేయాలనుకున్న దర్శకుడు జీతూజోసెఫ్ రజనీకాంత్‌ను సంప్రదించారు. అయితే సినిమాలో హీరోను, హీరో కుటుంబాన్ని పోలీసులు బాగా హింసించే దృశ్యాలు, క్లైమాక్స్ సీన్ గురించి రజనీకాంత్ జోసెఫ్ ఆఫర్‌ను తిరస్కరించినట్టు తెలుస్తోంది. ముందు కథ విన్నపుడు ఆయనకు బాగా నచ్చిందనీ, చాలా సంతోషించారనీ జోసెఫ్ తెలిపారు. కానీ తనను బాగా కొట్టడం చూస్తే ఫ్యాన్స్ తట్టుకోలేరని, ఫ్యాన్స్ దీన్ని సరిగ్గా రిసీవ్ చేసుకోరని రజనీ అభిప్రాయాపడినట్టు దర్శకుడు చెప్పుకొచ్చారు. రజనీ సార్ చెప్పినదానికి తాను కన్విన్స్ అయ్యానన్నారు. మరో స్రిప్ట్తో మళ్లీ కలుస్తానని చెప్పి వచ్చేశానని జోసెఫ్ తెలిపారు. కాగా ఈ సినిమాను తమిళంలో కమల్ హాసన్, గౌతమి జంటగా పాపనాశం పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.