ఆ రెండు సీన్ల గురించే రజనీ వద్దన్నారట | Rajinikanth rejected 'Drishyam' remake due to two scenes | Sakshi
Sakshi News home page

ఆ రెండు సీన్ల గురించే రజనీ వద్దన్నారట

Published Sat, Jul 4 2015 2:36 PM | Last Updated on Sat, Sep 29 2018 5:17 PM

ఆ రెండు సీన్ల గురించే రజనీ వద్దన్నారట - Sakshi

ఆ రెండు సీన్ల గురించే రజనీ వద్దన్నారట

చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ దృశ్యం సినిమాలో నటించడానికి రెండు సీన్ల కారణంగానే వద్దన్నారట. మలయాళంలో ఘనవిజయం సాధించిన దృశ్యం సినిమాను తమిళంలో రీమేక్ చేయాలనుకున్న దర్శకుడు జీతూజోసెఫ్ రజనీకాంత్ను సంప్రదించారు.

అయితే సినిమాలో హీరోను, హీరో కుటుంబాన్ని పోలీసులు బాగా హింసించే దృశ్యాలు,  క్లైమాక్స్ సీన్ గురించి  రజనీకాంత్  జోసెఫ్ ఆఫర్ను తిరస్కరించినట్టు తెలుస్తోంది. ముందు కథ విన్నపుడు ఆయనకు బాగా నచ్చిందనీ, చాలా సంతోషించారనీ జోసెఫ్ తెలిపారు. కానీ తనను బాగా కొట్టడం చూస్తే ఫ్యాన్స్ తట్టుకోలేరని, ఫ్యాన్స్ దీన్ని సరిగ్గా రిసీవ్ చేసుకోరని రజనీ అభిప్రాయాపడినట్టు దర్శకుడు చెప్పుకొచ్చారు. రజనీ సార్ చెప్పినదానికి తాను కన్విన్స్ అయ్యానన్నారు. మరో స్రిప్ట్తో మళ్లీ కలుస్తానని చెప్పి వచ్చేశానని  జోసెఫ్ తెలిపారు. కాగా ఈ సినిమాను తమిళంలో కమల్ హాసన్, గౌతమి జంటగా పాపనాశం  పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement