Papanasam
-
సినిమా బంపర్...మా నాన్న సూపర్!
‘‘ఎవరి సినిమా వాళ్లకు ముద్దు. ఒకవేళ నా సినిమా విడుదలైన రోజున నాన్న నటించిన సినిమా విడుదలైతే, ముందు నా సినిమా చూస్తా.. ఆ తర్వాత నాన్న సినిమా చూస్తా’’ అని ఆ మధ్య ఓ సందర్భంలో శ్రుతీహాసన్ పేర్కొన్న విషయం తెలిసిందే. కమల్ కూడా అలానే అంటారు. ఈ తండ్రీ కూతుళ్లు అంత ప్రొఫెషనల్‌గా ఉంటారు. కానీ, ఒకరి సినిమాను ఇంకొకరు చూసి, బాగుంటే అభినందించుకుంటారు. ఇప్పుడు శ్రుతి అదే చేశారు. మలయాళ ‘దృశ్యమ్’ తమిళ రీమేక్ ‘పాపనాశమ్’లో కమలహాసన్, గౌతమి భార్యాభర్తలుగా నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలతో విజయ విహారం చేస్తోంది. ఈ చిత్రాన్ని శ్రుతి చూశారు. ‘‘అద్భుతమైన సినిమా. మొత్తం టీమ్ పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. మా నాన్నని చూస్తే గర్వంగా ఉంది’’ అని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. అంతే కాదు.. ముంబయ్‌లో తన స్నేహితులకి ప్రత్యేకంగా ఓ షో ఏర్పాటు చేసి, ఈ చిత్రాన్ని చూపించాలనుకుంటున్నారామె. ఎంతైనా నాన్నంటే అమ్మడికి ఎంత ప్రేమో! -
రజనీకాంత్‌కి లాస్... కమలహాసన్‌కి ప్రాఫిట్!
మలయాళ సినిమా ‘దృశ్యమ్’ తెలుసుగా! ఆ సూపర్‌హిట్ సినిమా అదే పేరుతో తెలుగులో వెంకటేశ్‌తో, కన్నడంలో ‘దృశ్య’ పేరుతో హీరో వి. రవిచంద్రన్‌తో రీమేకై హిట్టయిన సంగతీ తెలిసిందే. తాజాగా తమిళంలో కమలహాసన్‌తో ‘పాపనాశమ్’గా రిలీజై, హిట్ టాక్‌తో నడుస్తోంది. తాజా విషయం ఏమిటంటే, అసలీ తమిళ రీమేక్‌ను మొదట రజనీకాంత్‌తో చేద్దామనుకున్నారట! మలయాళ ఒరిజనల్‌కూ, ఇప్పుడీ తమిళ రీమేక్‌కూ - రెంటికీ దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్ నేరుగా రజనీని కలిశారట! స్క్రిప్ట్ నచ్చినప్పటికీ, సినిమాలోని రెండు సీన్స్ పట్ల రజనీకాంత్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు చిత్ర యూనిట్ వర్గాలు తాజాగా వెల్లడించాయి. ‘‘సినిమా చివరలో పోలీసులు హీరోను చితగ్గొట్టే సీన్, అలాగే క్లైమాక్స్ సీన్ - ఈ రెండిటి గురించి రజనీ అనుమానపడ్డారు. ఫ్యాన్స్‌కు నచ్చకపోవచ్చేమోనని అన్నారు. దర్శకుడు జీతూ జోసెఫ్ కూడా ఆ మాటతో ఏకీభవించారు’’ అని కోడంబాకమ్ వర్గాలు ఇప్పుడు బయటపెట్టాయి. మొత్తానికి, అలా రజనీకాంత్ వద్దన్న సినిమా కమలహాసన్‌ను వరించింది. ఇప్పుడీ తమిళ రీమేక్‌కు వస్తున్న స్పందన, పత్రికల్లో వస్తున్న రివ్యూలను బట్టి చూస్తే, కమల్‌కు చాలాకాలం తర్వాత మంచి హిట్ వచ్చినట్లుంది. అంటే, సినిమా వదిలేసి రజనీకాంత్ నష్టపోయారనీ, కమల్ లాభపడ్డారనీ అనుకోవచ్చా? -
ఆ రెండు సీన్ల గురించే రజనీ వద్దన్నారట
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ దృశ్యం సినిమాలో నటించడానికి రెండు సీన్ల కారణంగానే వద్దన్నారట. మలయాళంలో ఘనవిజయం సాధించిన దృశ్యం సినిమాను తమిళంలో రీమేక్ చేయాలనుకున్న దర్శకుడు జీతూజోసెఫ్ రజనీకాంత్‌ను సంప్రదించారు. అయితే సినిమాలో హీరోను, హీరో కుటుంబాన్ని పోలీసులు బాగా హింసించే దృశ్యాలు, క్లైమాక్స్ సీన్ గురించి రజనీకాంత్ జోసెఫ్ ఆఫర్‌ను తిరస్కరించినట్టు తెలుస్తోంది. ముందు కథ విన్నపుడు ఆయనకు బాగా నచ్చిందనీ, చాలా సంతోషించారనీ జోసెఫ్ తెలిపారు. కానీ తనను బాగా కొట్టడం చూస్తే ఫ్యాన్స్ తట్టుకోలేరని, ఫ్యాన్స్ దీన్ని సరిగ్గా రిసీవ్ చేసుకోరని రజనీ అభిప్రాయాపడినట్టు దర్శకుడు చెప్పుకొచ్చారు. రజనీ సార్ చెప్పినదానికి తాను కన్విన్స్ అయ్యానన్నారు. మరో స్రిప్ట్తో మళ్లీ కలుస్తానని చెప్పి వచ్చేశానని జోసెఫ్ తెలిపారు. కాగా ఈ సినిమాను తమిళంలో కమల్ హాసన్, గౌతమి జంటగా పాపనాశం పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. -
పాపనాశం మూవీ స్టిల్స్
-
మగపిల్లల్ని పెంచడం కూడా భయమే
చెన్నై: ఈ దుర్మార్గమైన దేశంలో మగపిల్లల్ని పెంచడం కూడా తనకు భయమే అని ప్రముఖ నటుడు, దర్శకుడు కమల్‌హాసన్ అన్నారు. తన తాజా చిత్రం 'పాపనాశం' ఈ శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాపనాశం చిత్రం విశేషాలను తెలుపుతూ తనకు కూడా తన ఇద్దరు ఆడపిల్లలు రక్షణ గురించి ఇప్పటికీ భయంగానే ఉంటుందన్నారు. శృతి, అక్షర స్థానంలో మగపిల్లలు ఉన్నా కూడా తాను ఇలాగా భయపడే వాడినన్నారు. పాపనాశం ప్రోమోలో విభూతి పెట్టుకుని ఉన్నతనను చూసి చాలామంది మీరు నాస్తికులు కదా అని అడుగుతున్నారని తెలిపారు. కానీ సినిమా వేరు, జీవితం వేరన్నారు. సాధారణంగా తన వ్యక్తిగత భావాలను సినిమాల కోసం వదులుకోనన్నారు. మరీ తప్పదనుకుంటే తప్ప తన నమ్మకాలకు, విశ్వాసాలకు వ్యతిరేకంగా నటించనన్నారు. అలాగే ఒక కులాన్ని కీర్తించే సినిమాలు తాను ఎప్పుడూ చేయలేదని చెప్పుకొచ్చారు. కేబల్ ఆపరేటర్‌గా పనిచేసే వ్యక్తి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన ఆడబిడ్డలను దుండగుల వేధింపుల నుంచి రక్షించుకునే కథాంశంతో తెరకెక్కుతున్నమూవీ పాపనాశం. మలయాళంలోనూ, తెలుగులోనూ ఘన విజయం సాధించిన 'దృశ్యం' సినిమాను కమల్ తమిళంలో రీమేక్ చేస్తున్నారు. జీతూ జోసేఫ్ దర్శకత్వంలో కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో గౌతమి మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
పాపవినాశనం వద్ద జీపు బోల్తా
నలుగురు భక్తులకు తీవ్రగాయాలు మరో 13 మందికి స్వల్ప గాయాలు తిరుమల : తిరుమలలో పాపవిశానం వద్ద జీపు బోల్తా పడి నలుగురు భక్తులకు తీవ్ర గాయాలు కాగా, మరో 13 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా పెద్దపేట గ్రామం, కరీంనగర్‌కు చెందిన మొత్తం 16 మంది ఒకే జీపులో తిరుమలకు వచ్చారు. స్వామిని దర్శించుకుని శుక్రవారం ఉదయం 8 గంటలకు భక్తులంద రూ పాపవినాశనం సమీపానికి వెళ్లగానే జీపు పక్కనే ఉన్న చెట్టును ఢీకొని లోయలోకి బోల్తా పడింది. దీంతో వాహనంలోని వారందరూ ఆ అడవిలో చెల్లాచెదురుగా ఎగిరి పడ్డారు. ఇతర వాహనదారుల సహకారంతో అంబులెన్స్‌లో క్షతగాత్రులు మహేం ద్ర (32), భారతి (28), అభిరాం(5), భూమేష్ (30)లను తిరుమలలోని అశ్వని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వీరిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. మరో 8 మంది భక్తులతోపాటు డ్రైవర్‌కు కూడా అశ్వని ఆస్పత్రిలోకి చికిత్సను అందించారు. అతివేగంతోపాటు పరిమితికి మించి భక్తులను వాహనంలో ఎక్కించడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
జూలైలో రాబోతున్న పాపనాశం
-
లెఫ్ట్ బాటలో...
కమల్‌హాసన్ నటించిన ‘విశ్వరూపం-2’, ‘ఉత్తమ విలన్’, ‘పాపనాశమ్’ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. దాంతో కమల్ తన తదుపరి చిత్రానికి సంబంధించిన సన్నాహాల్లో ఉన్నారు. గత ఏడేళ్లుగా ఆయన మనసులో ఓ చిత్రం ఉందట. ఆ చిత్రానికి ఆయన ‘వామ మార్గమ్’ అని టైటిల్ కూడా అనుకున్నారు. అంటే.. ఎడమ దారి అని అర్థం. దీని గురించి కమల్ చెబుతూ, ‘‘కమ్యూనిస్టులను లెఫ్టిస్ట్‌లు అంటారు. అలాగే, అఘోరాలు కూడా వామ మార్గాన్ని అనుసరి స్తుంటారు. కానీ, నా సినిమా వీటికి సంబంధించినది కాదు. వ్యాపారంలో ఉండాల్సిన విలువలు గురించి చెప్పే చిత్రం. ‘మరుదనాయగమ్’, ‘మర్మయోగి’, ‘విరుమాండి’ (తెలుగులో ‘పోతురాజు’), ‘విశ్వరూపం’ చిత్రకథలు నా మనసును ఎలా తొలిచేశాయో ఈ కథ కూడా నన్నలా తొలిచేస్తోంది’’ అన్నారు. -
ఇప్పుడు కమల్ వంతు..
కమల్‌హాసన్ పోషించిన పాత్రను ఇతర భాషల్లో చేయడానికి దాదాపు ఏ హీరో ధైర్యం చేయరు. ఎందుకంటే... కమల్ ఓ పాత్ర చేస్తే... ఆ పాత్రను అంతకు మించి చేయడానికి ఏమీ ఉండదు. అందుకే.. నిర్మాతలు కూడా ఆయన సినిమాలను రీమేక్ చేయడానికి సాహసించరు. సాధ్యమైనంతవరకూ అనువదించేస్తారంతే. అడపాదడపా కొన్ని కమల్ సినిమాలు వేరే హీరోలతో రీమేక్ అయినా... అవి విజయాలను అందుకున్న దాఖలాలు తక్కువ. కమల్ మాత్రం అప్పుడప్పుడు ఇతర హీరోల చిత్రాలను రీమేక్ చేయడానికి ఉత్సాహం చూపుతుంటారు. పదకొండేళ్ల క్రితం బాలీవుడ్లో విజయం సాధించిన ‘మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్’ చిత్రాన్ని కమల్ ‘వసూల్‌రాజా ఎం.బి.బి.ఎస్’గా తమిళంలో చేశారు. నసీరుద్దీన్‌షా నటించిన ‘వెన్స్డే’ చిత్రాన్ని తెలుగులో ‘ఈనాడు’గా, తమిళంలో ‘ఉన్నయ్పోల్ వరువన్’గా చేశారు కమల్. వాటి ఫలితాలు ఎలా ఉన్నా... నటునిగా కమల్ మాత్రం ఆ సినిమాల్లో విశ్వరూపాన్ని చూపించారనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మరో రీమేక్ ‘పాపనాశమ్’. మలయాళంలో మోహన్‌లాల్ నటించిన ‘దృశ్యం’ ఈ చిత్రానికి మాతృక. ఇప్పటికే ఈ కథ తెలుగులో వెంకటేశ్ హీరోగా, కన్నడంలో రవిచంద్రన్ హీరోగా రీమేక్ అయ్యింది. ఇక మిగిలింది తమిళమే. ప్రమాదంలో చిక్కుకున్న తన కుటుంబాన్ని ఆ ఇంటిపెద్ద ఎలా ఒడ్డుకు చేర్చాడన్నదే ఈ సినిమా కథ. ఇందులో కమల్‌కి జోడీగా గౌతమి నటిస్తుండటం విశేషం. కమల్-గౌతమిది ఒకప్పుడు సూపర్‌హిట్ కాంబినేషన్. విచిత్రసోదరులు, క్షత్రియపుత్రుడు చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఈ జంట ఆకట్టుకుంది. గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న ఈ జంట మళ్లీ ఇన్నాళ్లకు తెరను పంచుకోవడం విశేషం. మాతృక దర్శకుడైన జీతూ జోసఫ్ ఈ తమిళ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్‌లాల్, వెంకటేశ్, రవిచంద్రన్ తమ పరిథి మేరకు ఈ పాత్రను అద్భుతంగా రక్తికట్టించారు. ఇప్పుడు కమల్ వంతు వచ్చింది. ఇటీవలే ‘పాపనాశమ్’ స్టిల్స్‌ని మీడియాకు విడుదల చేశారు. వాటిలో కమల్ ఆహార్యం, హావభావాలు సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. సంక్రాంతికి ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. -
‘పాపనాశం’ మూవీ న్యూ స్టిల్స్
-
'దృశ్యం' కోసం.. భాష నేర్చుకుంటున్న కమల్
నటన విషయంలో తాను నిత్య విద్యార్థినని చెప్పుకొంటుంటారు సకల కళా వల్లభుడు కమల్ హాసన్. ఆ విషయం ఏదో చెప్పి ఊరుకోవడం వేరు.. నిజంగా ఆచరించడం వేరు. అలా ఆచరించేవాళ్లలో ముందుంటారు కమల్. ఇప్పుడు తాను తాజాగా నటిస్తున్న 'దృశ్యం' తమిళ రీమేక్ 'పాపనాశం' కోసం ఇప్పుడు కొత్తగా తిరునల్వేలి యాసను ఆయన నేర్చుకుంటున్నారు. మళయాళం, కన్నడ, తెలుగు భాషల్లో హిట్టయిన దృశ్యం సినిమాను తమిళంలో కమల్ హీరోగా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కొంత భాగంలో కమల్ హాసన్ తిరునల్వేలి యాస మాట్లాడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఆయన తన సినిమాల్లో ఎప్పుడూ ఈ యాస మాట్లాడలేదు. దాంతో.. ఇప్పుడు కొత్తగా రచయిత సుగ దగ్గర ఆ యాసలో శిక్షణ పొందుతున్నాడని మరో రచయిత జయమోహన్ తెలిపారు. ఈ సినిమాకు డైలాగులు రాసింది జయమోహనే. ఈ సినిమాలో.. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ గౌతమి నటిస్తోంది. -
సమస్యల్లో సినిమా
రెండు గంటల్లో ముగిసిపోయే సినిమా రూపకల్పనకు దాని స్థాయిని బట్టి రెండు నెలల నుంచి రెండేళ్లవరకు పట్టవచ్చు. అలాంటి సినిమా ఎన్నో పురుటి నొప్పులను ఎదుర్కొని తెరమీదకు రావాలి. కొన్ని పురిటిలోనే ఆగిపోతాయన్నది వేరే సంగతి. ప్రస్తుతం కొన్ని భారీ చిత్రాలతోపాటు చిన్న చిత్రాల నిర్మాణంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకుందాం. లింగా: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం లింగా. అందాలతార అనుష్క, ముంబాయి భామ సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ను కర్ణాటకలో షియోగా జిల్లా, సాగర్ తాలుకాలోని లింగాన్ మాక్కిడ్యాం సమీపంలో నిర్వహిసుతన్నారు. అయితే స్థానిక సమస్యల కారణంగా ఆ ప్రాంత ప్రజలు షూటింగ్ నిలిపివేయూలని డిమాండ్ చేస్తున్నారు. కత్తి : ప్రస్తుతం కోలీవుడ్‌లో ప్రముఖ యువ కథా నాయకుడిగా వెలుగొందుతున్న విజయ్ నటిస్తున్న చిత్రం కత్తి. ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సమంత కథా నాయకి. ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైక్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సంస్థ అధినేత శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు సన్నిహితుడని, అందువల్ల చిత్ర విడుదలను అడ్డుకుంటామని తమిళ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో కత్తి చిత్రం సమస్యల్లో పడింది. చిత్ర నాయకుడు విజయ్, దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ తమిళుల వ్యతిరేకతకు గురవుతున్నారు. ఈ చిత్ర నిర్మాణం చేతులు మారనున్నట్లు సమాచారం. పులి పార్వై : తాజాగా తమిళుల తీవ్ర వ్యతిరేకతను చవిచూస్తున్న చిత్రం పులిపార్వై. ఇది శ్రీలంక తమిళుల కోసం పోరాడిన ఎల్టీటీఈ నేత ప్రభాకరన్ కొడుకు బాలచంద్రన్ ఇతివృత్తంతో రూపొందించిన చిత్రం. ఎస్.ఆర్.ఎం సంస్థల అధినేత పారివేందర్ నిర్మించిన ఈ చిత్రంలో ఎల్‌టీటీఈల యుద్ధాన్నే తప్పుపట్టే విధంగా సన్నివేశాలు చోటు చేసుకున్నాయని తమిళ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో చిక్కుల్లో పడ్డ చిత్ర దర్శక నిర్మాతలు సెన్సార్ పూర్తి చేసుకున్నా పులిపార్వై చిత్రానికి చేర్పులు మార్పులు చేసే పనిలో పడ్డారు. పాపనాశం: పాపనాశం చిత్రానికి ఆదిలోనే సమస్యలు చుట్టుముట్టాయి. ఇది ప్రఖ్యాత నటుడు కమల్‌హాసన్ ఇష్టపడి మరీ నటిస్తున్న చిత్రం మలయాళంలో దృశ్యంగా తెరకెక్కి విజయ దుందుభి మోగించిన చిత్రం. మోహన్‌లాల్, మీనా జంటగా నటించిన చిత్రానికి తమిళంలో సమస్యలెదురయ్యాయి. మోహన్‌లాల్ పాత్రలో కమల్‌హాసన్ పోషిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఆ చిత్ర కథ తనదంటూ కేరళ దర్శకుడు సతీష్ పాల్ ఎర్నాకులం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారించిన న్యాయమూర్తులుతమిళ రీమేక్‌పై తాత్కాలిక స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కమల్‌హాసన్ పాపనాశం చిత్ర నిర్మాణం సమస్యల్లో చిక్కుకుంది. -
పాపనాశం
ముచ్చటగా ఉండే ఇద్దరు కూతుళ్లు, మనసెరిగి నడుచుకునే భార్యతో అతగాడి జీవితం సాఫీగా సాగుతుంటుంది. కానీ, పెద్ద కూతురి జీవితంలో రేగిన కలకలంతో ఆ కుటుంబం ఎలా తల్లడిల్లిందనే కథాంశంతో రూపొందిన మలయాళ చిత్రం ‘దృశ్యం’. ఏ భాషకైనా నప్పే కథతో రూపొందిన ఈ చిత్రం తెలుగులో వెంకటేశ్, మీనా జంటగా పునర్నిర్మితమై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. తమిళంలో ఈ చిత్రం కమల్‌హాసన్ కథానాయకునిగా పునర్నిర్మితం కానుంది. మరో వారంలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. మలయాళ, తెలుగు భాషల్లో మీనా చేసిన పాత్రను నటి, కమల్‌హాసన్ ఆప్తమిత్రురాలు గౌతమి చేస్తారనే వార్త ప్రచారంలో ఉంది. మలయాళ చిత్రానికి దర్శకత్వం వహించిన జీతు జోసఫ్ తమిళ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తారు. మలయాళ టైటిల్‌ని తెలుగులో యథాతథంగా ఉంచేశారు. కానీ, తమిళంలో ‘దృశ్యం’ కాదట.. ‘పాపనాశం’ అనే టైటిల్ ఖరారు చేశారని కోలీవుడ్ టాక్. -
తిరుమలలో మళ్లీ మంటలు