పాపనాశం | Kamal Haasan's Drishyam title Papanasam in Tamil !? | Sakshi
Sakshi News home page

పాపనాశం

Published Sat, Aug 9 2014 10:51 PM | Last Updated on Sat, Sep 29 2018 5:17 PM

పాపనాశం - Sakshi

పాపనాశం

ముచ్చటగా ఉండే ఇద్దరు కూతుళ్లు, మనసెరిగి నడుచుకునే భార్యతో అతగాడి జీవితం సాఫీగా సాగుతుంటుంది. కానీ, పెద్ద కూతురి జీవితంలో రేగిన కలకలంతో ఆ కుటుంబం ఎలా తల్లడిల్లిందనే కథాంశంతో రూపొందిన మలయాళ చిత్రం ‘దృశ్యం’. ఏ భాషకైనా నప్పే కథతో రూపొందిన ఈ చిత్రం తెలుగులో వెంకటేశ్, మీనా జంటగా పునర్నిర్మితమై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

తమిళంలో ఈ చిత్రం కమల్‌హాసన్ కథానాయకునిగా పునర్నిర్మితం కానుంది. మరో వారంలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. మలయాళ, తెలుగు భాషల్లో మీనా చేసిన పాత్రను నటి, కమల్‌హాసన్ ఆప్తమిత్రురాలు గౌతమి చేస్తారనే వార్త ప్రచారంలో ఉంది. మలయాళ చిత్రానికి దర్శకత్వం వహించిన జీతు జోసఫ్ తమిళ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తారు. మలయాళ టైటిల్‌ని తెలుగులో యథాతథంగా ఉంచేశారు. కానీ, తమిళంలో ‘దృశ్యం’ కాదట.. ‘పాపనాశం’ అనే టైటిల్ ఖరారు చేశారని కోలీవుడ్ టాక్.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement