Drishyam movie
-
కంక్లూజన్ తో వచ్చేస్తున్న దృశ్యం 3
-
సూపర్ హిట్ సినిమా అరుదైన ఘనత.. తొలి భారతీయ చిత్రంగా రికార్డ్!
మలయాళ బ్లాక్ బస్టర్ దృశ్యం మూవీకి అరుదైన ఘనత దక్కింది. ఈ సినిమాను హాలీవుడ్లో రీమేక్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ ఇంగ్లిష్, స్పానిష్‌లలో తెరకెక్కించన్నట్లు ప్రకటించింది. దీంతో హాలీవుడ్లో రీమేక్ కానున్న మొదటి భారతీయ చిత్రంగా దృశ్యం నిలవనుంది. ఈ చిత్రాన్ని మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించారు. మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత సీక్వెల్‌గా వచ్చిన దృశ్యం-2 కూడా సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వెంకటేశ్ నటించగా.. భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. హిందీలో అజయ్ దేవ్‌గణ్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళంలో కమల్ హాసన్, గౌతమి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే దృశ్యం సిరీస్ చిత్రాలను కొరియన్లో రీమేక్ చేశారు. అక్కడ కూడా భారీ విజయాన్ని సాధించింది. తాజాగా హాలీవుడ్‌కు చెందిన గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్, మరో నిర్మాణ సంస్థతో కలిసి దృశ్యం సినిమాలను ప్రేక్షకులకు అందించనుంది. ఇండియన్ సినిమా నిర్మాణ సంస్థ పనోరమ స్టూడియోస్ నుంచి అంతర్జాతీయ రీమేక్ హక్కులను ఆ సంస్థ సొంతం చేసుకుంది. దీంతో హలీవుడ్ దృశ్యంలో నటీనటులుగా ఎవరు కనిపించనున్నారన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. కాగా.. త్వరలోనే మలయాళంలో దృశ్యం 3 రానుంది. -
దృశ్యం నటి సీమంతం వేడుక.. మదర్స్ డే సందర్బంగా ఎమోషనల్ పోస్ట్
బాలీవుడ్ నటి ఇషితా దత్తా బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో చాణక్యుడు సినిమాలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్లో దృశ్యం సినిమాతో అరంగేట్రం చేసింది. అయితే 2017లో వాత్సల్ షేత్ను వివాహం చేసుకున్న ముద్దుగుమ్మ గర్భం ధరించినట్లు ప్రకటించి సర్ప్రైజ్ ఇచ్చింది. బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తాకు చెల్లెలుగా ఇండస్ట్రీకి పరిచయమైంది. (ఇది చదవండి: వారసత్వం కోసం బిడ్డను కనడం లేదు.. ఉపాసన ఆసక్తికర పోస్ట్) ఇవాళ మదర్స్ డే సందర్భంగా ఇషితా దత్తా ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఈ మదర్స్ డే తనకు ఎంతో ప్రత్యేకమని తెలిపింది. ఎందుకంటే ఈరోజే తన సీమంతం వేడుకలు జరుపుకోవడం తన జీవితంలో ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుందని సంతోషం వ్యక్తం చేసింది. ఇషితా మాట్లాడుతూ..'ఈ ఏడాది మదర్స్ డే నాకు చాలా ప్రత్యేకం. నా బేబీ షవర్ ఈ రోజున జరుపుకోవడం సంతోషంగా ఉంది. మా అమ్మ, అత్తతో కలిసి మదర్స్ డేని జరుపుకుంటున్నా. నా చిన్నప్పుడు మా అమ్మను కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం చేసేదాన్ని. ఏది ఏమైనా ఆమె నా కోసం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని' వివరించింది. కాగా.. మార్చి 2023లో గర్భం దాల్చినట్లు ప్రకటించింది ఇషితా. (ఇది చదవండి: పెళ్లికి ముందే అమ్మతనం కోసం ఆరాటపడ్డ హీరోయిన్స్ వీళ్లే) -
తల్లి కాబోతున్న దృశ్యం నటి.. సోషల్ మీడియాలో వైరల్!
బాలీవుడ్ నటి ఇషితా దత్తా పెద్దగా పరిచయం లేని పేరు. ఇటీవలే స్పస్పెన్స్ థ్రిల్లర్ మూవీ దృశ్యంలో నటించింది. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. ఇషితా దత్తా త్వరలోనే తల్లి కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సినిమా నటి తనూశ్రీ దత్తా సోదరి. దృశ్యం ఫేమ్ ఇషితా దత్తా 2017లో వత్సల్ షేత్ను పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఇషితా దత్తా ముంబై విమానాశ్రయంలో వెళ్తుండగా కెమెరాకు చిక్కింది. ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్తూ తన బేబీ బంప్‌ను ప్రదర్శించింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. గతంలో ఆమెపై ఊహాగానాలు వచ్చనా.. గర్భం ధరించినట్లు ఈ జంట అధికారికంగా ప్రకటించలేదు. ఈ వీడియోతో ఇషితా తన మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఇది చూసిన అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇషితా దత్తా లవ్ స్టోరీ ఇషితా, వత్సల్ 2016లో వారి మొదటిసారి 'రిష్టన్ కా సౌదాగర్ - బాజీగర్' షో షూటింగ్ సమయంలో కలుసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి స్నేహం ప్రేమగా మారింది. అనంతరం నవంబర్ 2017లో కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇటీవల ముంబైలో కూడా విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఇది కదా అసలు సిసలైన పాన్ ఇండియా కథ!
ఒక ‘దృశ్యం’... మలయాళంలో బంపర్ హిట్. అదే ‘దృశ్యం’... తెలుగు, తమిళ్, కన్నడ, హిందీలోనూ సూపర్ హిట్. అందుకే ఈ ‘దృశ్యం’ దేశం దాటింది. అటు చైనా.. ఇండోనేషియాలోనూ ‘దృశ్యం’ బాక్సాఫీస్ రికార్డులు సాధించింది. ఇలా మలయాళంలో వచ్చిన ‘దృశ్యం’ ఏ భాషలో రీమేక్ అయితే ఆ భాషలో హిట్. ఇప్పుడు ఇంగ్లీష్ ‘దృశ్యం’ రానుంది. ఇంకా పలు విదేశీ భాషల్లో రీమేక్ కానుంది. ప్రపంచ వ్యాప్తంగా చూసే సినిమాలను ‘పాన్ ఇండియా’ అంటున్నాం. ‘పాన్ ఇండియా మూవీ’ అంటే కథ కూడా ‘పాన్ ఇండియా’ది అయ్యుండాలి.‘దృశ్యం’ అలాంటి కథే. ఇది కదా... పాన్ ఇండియా కథ! ఇక ఈ ‘దృశ్యం’ గురించి తెలుసుకుందాం. తొమ్మిదేళ్ల క్రితం హీరో మోహన్‌లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్లో మలయాళంలో ‘దృశ్యం’ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో మీనా, అన్సిబా హాసన్, ఎస్తర్ అనిల్, ఆశా శరత్, సిద్ధిక్ కీలక పాత్రలు పోషించారు. ఐదు కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమాను ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించారు. 2013 డిసెంబరు 19న విడుదలై సంచలన విజయం సాధించిందీ చిత్రం. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి జీతూ జోసెఫ్ తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చింది. ఎంతగా నచ్చిందంటే.. కేరళ బాక్సాఫీస్ చరిత్రలో యాభై కోట్ల రూపాయల వసూళ్లను సాధించిన తొలి చిత్రంగా ‘దృశ్యం’ చరిత్ర సృష్టించింది. మొత్తంగా 75 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా షూటింగ్‌ని కేవలం 44 రోజుల్లోనే పూర్తి చేశారు. ఇక ‘దృశ్యం’ సూపర్ డూపర్ హిట్ సాధించడంతో 2020 సెప్టెంబర్‌లో ‘దృశ్యం 2’ షూటింగ్‌కు శ్రీకారం చూట్టారు మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ అండ్ ఆంటోనీ పెరుంబవూర్. తొలి భాగంలానే పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో 46 రోజుల్లో షూటింగ్‌ను పూర్తి చేసి 2021 ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ‘దృశ్యం 2’ కూడా సూపర్ డూపర్ హిట్. అయితే ఓ వెలితి. అదేంటంటే.. ‘దృశ్యం 2’ థియేటర్స్‌లో కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలైంది. దీనికి కారణం కరోనా. ఒకవేళ థియేటర్స్‌లో విడుదలై ఉంటే కొత్త బాక్సాఫీస్ రికార్డ్స్ నమోదై ఉండేవేమో! 2016లో విడుదలై దాదాపు రూ. 150 కోట్ల వసూళ్లను సాధించిన ‘పులిమురుగన్’(ఇందులో మోహన్‌లాల్ హీరో) రికార్డును ‘దృశ్యం 2’ బ్రేక్ చేసి ఉండేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయయపడ్డాయి. తొలి ఇండియన్ మూవీ! ‘దృశ్యం’ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటు పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై వీక్షకుల, విమర్శకుల ప్రసంశలను పొందింది. దీంతో ఈ సినిమా రీమేక్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. మలయాళ ‘దృశ్యం’ సినిమాను 2014లో తెలుగులో ‘దృశ్యం’గా (ఇందులో వెంకటేశ్ హీరోగా నటించారు), కన్నడంలో ‘దృశ్య’ (ఇందులో రవిచంద్రన్)గా రీమేక్ చేశారు. ఆ తర్వాత 2015లో తమిళంలో ‘పాపనాశం’గా (కమల్‌హాసన్ హీరో), హిందీలో ‘దృశ్యం’ (అజయ్ దేవగన్)గా రీమేక్ చేశారు. అంతేకాదు.. ఆ తర్వాత శ్రీలంక భాషలో ‘ధర్మయుద్దాయ’ (2017)గా, చైనాలో ‘షీప్ వితవుట్ షెపర్డ్’(2019)గా ఆ తర్వాత ఇండోనేషియాలో ‘దృశ్యం’గా రీమేక్ అయ్యింది. ఇలా చైనా, ఇండోనేషియా భాషల్లో రీమేక్ అయిన తొలి ఇండియన్ మూవీ కూడా ‘దృశ్యం’ కావడం విశేషం. రీమేక్ కావడమే కాదు.. అక్కడ బాక్సాఫీస్ పరంగా హిట్ సాధించింది. కాగా, ‘దృశ్యం’ సినిమాకు సీక్వెల్‌గా 2021లో విడుదలైన మలయాళ ‘దృశ్యం 2’కి కూడా డిజిటల్ వీక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో ‘దృశ్యం 2’ను తెలుగు, హిందీ భాషల్లో రీమేక్ చేశారు. ‘దృశ్యం’ రీమేక్‌లో నటించిన వెంకటేశ్‌నే ‘దృశ్యం 2’లోనూ నటించారు. కోవిడ్ వల్ల ఈ చిత్రం 2021 నవంబరు 25న ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. కాగా ‘దృశ్యం 2’ హిందీ రీమేక్ గత ఏడాది నవంబరు 18న థియేటర్స్‌లో విడుదలై రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, 2022లో అత్యధిక వసూళ్లను సాధించిన టాప్ టెన్ హిందీ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. హిందీ ‘దృశ్యం’లో నటించిన అజయ్ దేవగనే ‘దృశ్యం 2’లోనూ నటించారు. అలాగే హిందీ చిత్రం ‘దేవదాస్’ (1955) తర్వాత ఇతర భాషల్లో ఎక్కువగా రీమేక్ అవుతున్న చిత్రం ‘దృశ్యం’ అని టాక్. మాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కి... ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాలకు సంబంధించిన ఇంగ్లిష్, నాన్ ఇండియన్ లాంగ్వేజెస్ రీమేక్ హక్కులను పనోరమ స్టూడియోస్ ఇంటర్నేషనల్ సంస్థ దక్కించుకుంది (ఫిలిప్పినో, ఇండోనేషియా, సింహళ భాషల హక్కులు మాత్రం కాదు.. ఎందుకంటే ఈ భాషల్లో ఆల్రెడీ ‘దృశ్యం’ రీమేక్ అయ్యింది). ‘‘దృశ్యం’, ‘దృశ్యం 2’ల ఫారిన్ లాంగ్వేజెస్ హక్కులను దక్కించుకున్నాం. జపాన్, కొరియా, హాలీవుడ్లో ‘దృశ్యం’ను రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాం. ‘దృశ్యం 2’కు చెందిన చైనీస్ రీమేక్ హక్కులు కూడా మా వద్దే ఉన్నాయి’’ అని పనోరమ స్టూడియోస్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. కథ ఏంటంటే... సినిమాల పట్ల విపరీతమైన ఆసక్తి ఉన్న ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన తండ్రి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన పెద్ద కుమార్తెను ఊహించని ఆపాయం నుంచి ఎలా రక్షించుకోగలిగాడు? ఈ ప్రయత్నంలో ఓ పోలీసాఫీసర్ కుమారుడి హాత్య కేసును చేధించాలనుకునే పోలీస్ డిపార్ట్మెంట్ వ్యూహాలకు ఎటుంవంటి ప్రతివ్యూహాలు రచించి, ఆ తండ్రి సక్సెస్ అయ్యాడు అన్నదే ఈ చిత్రకథ. మోహన్‌లాల్, జీతూ జోసెఫ్, ఆంటోనీల కాంబినేషన్లో ‘దృశ్యం 3’ కూడా రానుంది. గత ఏడాది ఆగస్టులో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్లో ‘దృశ్యం 3’ ఉంటుందన్నారు ఆంటోనీ. చదవండి: నాకు బుద్ధి తక్కువై అలా చేశాను.. చీటింగ్‌పై స్పందించిన సింగర్ -
'దృశ్యం' సినిమా పాప ఇప్పుడు ఎలా ఉందో చూడండి (ఫోటోలు)
-
దృశ్యం ఫేమ్ ‘ఎస్తర్ అనిల్’ ఫొటోలు
-
ఓ సౌత్ ఇండియా సినిమా మూడు విదేశీ భాషల్లోకి..
ఓ భాషలో హిట్ అయిన కథలను మరో భాషలో రీమేక్ చేయడం సినీ పరిశ్రమల్లో మాములుగా జరిగేదే. కానీ ఓ భారతీయ సినిమా విదేశీ భాషల్లో రీమేక్ అవడం మాత్రం అరుదనే చెప్పాలి. అది ఓ సౌత్ ఇండియన్ మూవీ అవడం చాలా తక్కువ. ఇప్పుడు మాలయాళం సూపర్ హిట్ సినిమా ‘దృశ్యం’ త్వరలో ఇండోనేషియా లాంగ్వేజ్‌లోకి వెళ్లనుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘మోహన్‌లాల్ హీరోగా, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ‘దృశ్యం’ ఇప్పటి వరకు 4 భారతీయ భాషలు, 2 విదేశీ భాషల్లో రీమేకైంది. ఇండియన్ లాంగ్వేజేస్‌తోపాటు చైనీస్, శ్రీలంకన్ భాషల్లో విడుదలై మంచి స్పందన సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇండోనేషియా భాషలో నిర్మితం కానుంది. ఇలా మా సినిమా సరిహద్దులను చెరిపేస్తూ దూసుకుపోవడం ఎంతో సంతోషాన్నిస్తోంది’ అని ఆంటోని తెలిపాడు. ఈ చిత్రాన్ని ఇండోనేషియాలో జకార్తాలోని పీటీ ఫాల్కన్ అనే సంస్థ నిర్మించనుంది. చైనీస్‌లో రీమేక్ అయిన మొదటి మలయాళ చిత్రం ఇదే కావడం విశేషం. చదవండి: ‘దృశ్యం 2’ అరుదైన రికార్డు, ఇండియన్ సినిమాల్లో అత్యధిక రేటింగ్ కాగా, ఈ సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన ‘దృశ్యం 2’ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన అమెజాన్‌లో ఈ ఫిబ్రవరి విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ చిత్రం కూడా తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రీమేక్‌లు అవుతోంది. View this post on Instagram A post shared by Antony Perumbavoor (@antonyperumbavoor) -
స్నేహితులకు ‘దృశ్యం’ చూపించాడు.. మరోసారి జైలు పాలయ్యాడు
ఢిల్లీ: వెంకటేశ్ హీరోగా దృశ్యం సినిమా వచ్చిన మీకందరికి తెలిసిందే. అందులో హీరో తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం సినిమాల్లోని సన్నివేశాలను ప్రేరణగా తీసుకొని పోలీసులను ముప్పతిప్పలు పెడుతుంటాడు. అచ్చం అదే తరహాలో హత్యకేసులో బెయిల్‌పై బయటకొచ్చిన ఒక వ్యక్తి తన స్నేహితుల సాయంతో దృశ్యం సినిమా ప్రేరణతో పోలీసులను బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించాడు. కానీ చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాలు.. నార్త్ ఢిల్లీకి చెందిన అమర్‌పాల్ తన ఇంటిపక్కన ఉండే ఒంబిర్ కుటుంబంతో తరచుగా గొడవపడుతుండేవాడు. కాగా జూన్ 29న మరోసారి ఇరు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఒంబిర్ తల్లిని అమర్‌పాల్ చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అమర్‌పాల్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే ఆ తర్వాత 60 రోజుల మధ్యంతర బెయిల్‌పై ఇటీవలే బయటికి వచ్చాడు. పెరోల్‌పై బయటికి వచ్చిన అతను తనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలంటూ ఒంబిర్ కుటుంబంపై ఒత్తిడి తెచ్చాడు. కానీ వారు మాట వినకపోవడంతో ఒక మాస్టర్‌ప్లాన్ వేశాడు. తన సోదరుడు గుడ్డు, కజిన్ అనిల్‌ను ఇంటికి పిలిపించి వారికి దృశ్యం సినిమాను చూపించాడు. ఆ సినిమాలోలాగా ఇక్కడ జరిగిన సన్నివేశాలను, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలోనే తనకు ఒంబిర్ కుటుంబసభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందని.. అయినా ఒంబిర్ తల్లిని తాను చంపలేదని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఒక దేశీ పిస్టల్, బుల్లెట్ ప్యాలెట్‌ను కొనుగోలు చేశాడు. తనను కాల్చాలని.. కానీ తను చనిపోకూడదని.. ఈ కాల్పుల వెనుక ఒంబిర్ కుటుంబం హస్తం ఉందని పోలీసులను నమ్మించాలని అనిల్, గుడ్డులకు తెలిపాడు. ఆ తర్వాత అనిల్ తన స్నేహితుడు మనీష్‌ను కలిసి ప్లాన్‌ను వివవరించాడు. వారి ప్లాన్ ప్రకారం ముందుగా కైబర్పాస్కు వెళ్లిన అమర్‌పాల్ అనిల్ కోసం వేచి చూశాడు. ఒక గంట తర్వాత తమ ప్లాన్‌లో భాగంగా అమర్‌పాల్ ఉన్న చోటికి వచ్చిన అనిల్ అతనిపై కాల్పులు జరిపి అక్కడినుంచి పారిపోయాడు. ఆ తర్వాత గాయాలతోనే అమర్‌పాల్ తన స్నేహితుని ఇంటికి వెళ్లి ఒంబిర్ కుటుంబం తనను చంపడానికి చూస్తుందని వారికి వివరించాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించగా.. అనిల్‌ను అదుపులోకి తీసుకోని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం చెప్పేశాడు. దీంతో అమర్‌పాల్‌ను మరోసారి అరెస్ట్ చేసిన పోలీసులు ప్రస్తుతం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా పరారీలో ఉన్న గుడ్డు, మనీష్‌లను పోలీసులు గాలిస్తున్నారు. -
దృశ్యం-2 షూటింగ్ ప్రారంభోత్సవ ఫోటోలు
-
హిట్ రిపీట్ అవుతుందా?
ఓ భాషలో ఏదైనా సినిమా విజయం సాధిస్తే, రీమేక్ ద్వారా తమ భాషలోకి తీసుకురావాలనుకుంటారు దర్శక–నిర్మాతలు. ఈజీ హిట్ ఫార్ములా అనేది ఒక కారణం. మంచి కథను మరో ప్రాంతం ఆడియన్స్‌కు చూపించాలనేది ఇంకో కారణం. హిట్ సినిమా రీమేక్ కూడా హిట్టే అవుతుందా? అంటే చెప్పలేం. చాలా లెక్కలుంటాయి. ఆ లెక్కలన్నీ సరిగ్గా లెక్క కట్టాలి. ఆ మంత్రం మళ్లీ సరిగ్గా జపించాలి. అప్పుడే మ్యాజిక్ జరుగుతుంది. ప్రస్తుతం ఓ భాషలో తయారైన అయిదు సూపర్ హిట్ సినిమాలు ఏకకాలంలో మూడు భాషల్లో రీమేక్ అవుతున్నాయి. ఆ సినిమాలు – ఆ రీమేక్‌ల విశేషాలు. అయ్యప్పనుమ్ కోషియుమ్ పృథ్వీరాజ్, బిజూ మీనన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’. ఇద్దరు వ్యక్తుల ఈగోకి సంబంధించిన కథాంశంగా ఈ సినిమా తెరకెక్కింది. సచీ దర్శకత్వం వహించారు. మలయాళంలో ఘనవిజయం సాధించింది ఈ సినిమా. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రీమేక్ అవుతోంది. ► తెలుగు రీమేక్‌లో పవన్ కల్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు–స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. నాగవంశీ నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ► హిందీ రీమేక్‌లో ‘దోస్తానా’ కాంబినేషన్ జాన్ అబ్రహామ్, అభిషేక్ బచ్చన్ నటించనున్నారు. నటించడంతో పాటు జాన్ అబ్రహామ్ ఈ సినిమాను నిర్మించనున్నారు కూడా. జూన్ లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారనేది ఇంకా ప్రకటించలేదు. ► ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తమిళ రీమేక్‌లో కార్తీ, పార్తిబన్ నటిస్తారని వార్తలు వచ్చాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. హెలెన్ రెస్టారెంట్‌లోని ఫ్రీజర్‌లో చిక్కుకుపోయిన అమ్మాయి అందులో నుంచి ఎలా బయటపడింది? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మలయాళ థ్రిల్లర్ చిత్రం ‘హెలెన్ ’. అన్నా బెన్ ముఖ్య పాత్ర చేసిన ఈ సినిమాని మతుకుట్టి జేవియర్ డైరెక్ట్ చేశారు. 2019లో ఈ సినిమా విడుదలైంది. తాజాగా ‘హెలెన్ ’ చిత్రాన్ని హిందీ, తమిళం, తెలుగు భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ► అన్నా బెన్ చేసిన పాత్రను తెలుగు రీమేక్‌లో అనుపమా పరమేశ్వరన్ చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ► ‘హెలెన్ ’ తమిళ రీమేక్‌ను ‘అన్బిర్కినియాళ్’ టైటిల్‌తో తెరకెక్కించారు. కీర్తీ పాండియన్ లీడ్ రోల్ చేస్తున్నారు. గోకుల్ దర్శకుడు. చిత్రీకరణ పూర్తయింది. ► ‘హెలెన్ ’ హిందీ రీమేక్‌లో జాన్వీ కపూర్ నటించనున్నారు. దర్శకుడు, మిగతా వివరాలు ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. దృశ్యం 2 మోహన్ లాల్, మీనా జంటగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన థ్రిల్లర్ చిత్రం ‘దృశ్యం’. 2013లో విడుదలైన ఈ సినిమా పెద్ద హిట్. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ (దృశ్యం 2) విడుదలయింది. మొదటి భాగంలో పని చేసిన టీమే ఈ సీక్వెల్ తెరకెక్కించారు. ‘దృశ్యం 2’ చిత్రం ప్రస్తుతం తెలుగులో, తమిళంలో రీమేక్ కాబోతోంది. హిందీలోనూ రీమేక్ కానుందని టాక్. ► ‘దృశ్యం’ మొదటి భాగంలో వెంకటేశ్, మీనా జంటగా నటించారు. సీక్వెల్లోనూ వీరే నటించనున్నారు. మార్చి మొదటి వారం నుంచి ఈ రీమేక్ సెట్స్ మీదకు వెళ్లనుంది. జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేస్తారు. ► ‘దృశ్యం’ తమిళ రీమేక్ జీతూ జోసెఫ్, కమల్‌హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కింది. తాజాగా ఈ సీక్వెల్‌ను కేయస్ రవికుమార్ డైరెక్ట్ చేయనున్నారని వార్తలు వచ్చాయి. కమల్‌హాసన్ ప్రస్తుతం పొలిటికల్‌గా బిజీగా ఉన్నారు. మరి ఈ సీక్వెల్లో ఆయనే నటిస్తారా? వేరెవరైనా సీన్ లోకి వస్తారేమో చూడాలి. ► ‘దృశ్యం’ హిందీ రీమేక్‌లో అజయ్ దేవగణ్, శ్రియ నటించారు. తాజా సీక్వెల్ హిందీలోనూ రీమేక్ అవుతుందని బాలీవుడ్ టాక్. ఓ మై కడవుళే అశోక్ సెల్వన్, రితికా సింగ్ జంటగా అశ్విన్ మారిముత్తు తెరకెక్కించిన తమిళ చిత్రం ‘ఓ మై కడవుళే’. జీవితంలో రెండో అవకాశం లభించినప్పుడు ఏం చేయొచ్చు అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. ఇందులో విజయ్ సేతుపతి అతిథి పాత్రలో నటించారు. 2020లో విడుదలైన ఈ సినిమా మంచి హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ► తమిళ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన అశ్విన్ తెలుగు రీమేక్‌ను కూడా డైరెక్ట్ చేయనున్నారు. విశ్వక్ సేన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తారు. పీవీపీ బ్యానర్ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది. ► హిందీ రీమేక్ హక్కులను ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ దక్కించుకుంది. అశ్విన్ మారిముత్తునే ఈ హిందీ వెర్షన్ ను కూడా డైరెక్ట్ చేస్తారు. ► ‘ఓ మై కడవుళే’ కన్నడ వెర్షన్ లో డార్లింగ్ కృష్ణ హీరోగా నటిస్తున్నారు. అతిథి పాత్రలో కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ కనిపిస్తారు. అంధా ధున్ ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన హిందీ చిత్రం ‘అంధా ధున్ ’. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పెద్ద హిట్. జాతీయ అవార్డు కూడా సాధించింది. ఇప్పుడు ‘అంధా ధున్ ’ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రీమేక్ కానుంది. ► తెలుగు రీమేక్‌లో నితిన్ హీరోగా నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకుడు. రాధికా ఆప్టే పాత్రలో నభా నటేశ్, టబు పాత్రలో తమన్నా కనిపించనున్నారు. జూన్ 11న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ► తమిళ రీమేక్‌లో ‘జీన్స్’ ఫేమ్ ప్రశాంత్ నటిస్తున్నారు. జేజే ఫ్రెడ్రిక్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. టబు చేసిన పాత్రను సిమ్రాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘అంధగన్ ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ► ‘అంధా ధున్ ’ మలయాళ రీమేక్‌ని ‘భ్రమం’ అనే టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. పృధ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటిస్తున్నారు. రాశీ ఖన్నా కథానాయిక. ఆయా భాషల్లో విజయం సాధించినట్టు ఈ రీమేక్స్ కూడా విజయం సాధిస్తాయా? ఒరిజినల్లో జరిగిన మ్యాజిక్‌ను రీమేక్‌లోనూ ఆయా చిత్రబృందాలు క్రియేట్ చేయగలుగుతాయా? వెయిట్ అండ్ సీ! -
దృశ్యం 2: అజయ్ కూడా తప్పించుకుంటాడు
‘దృశ్యం2’ హవా మొదలైంది. తెలుగులో వెంకటేశ్‌తో ఈ సినిమా రీమేక్ అధికారికంగా అనౌన్స్ అయ్యింది. మలయాళ ఒరిజినల్‌ను డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. అలాగే హిందీలో కూడా దీనివార్తలు మొదలయ్యాయి. ‘దృశ్యం’ హిందీ వెర్షన్లో అజయ్ దేవ్‌గణ్, టబూ, శ్రేయ నటించారు. దృశ్యం2 హిట్ అవడంతోటే హిందీలో కూడా రీమేక్ పనులు మొదలయ్యాయి. అజయ్ దీనికి ఒక నిర్మాతగా వ్యవహరిస్తారు. దృశ్యంలో నటించినవారే ఇందులో కూడా నటించే అవకాశాలున్నాయి. అయితే ‘దృశ్యం’కు దర్శకత్వం వహించిన నిషికాంత్ కామంత్ గత సంవత్సరం సిరోసిస్‌తో మరణించడంతో ఈసారి హిందీ వెర్షన్‌కు జీతూ జోసఫ్‌నే అజయ్ తీసుకోనున్నాడని వినికిడి. తెలుగు రీమేక్‌ను పూర్తి చేసుకుని జీతూ హిందీ రీమేక్‌కు వెళ్లొచ్చు. కనుక మలయాళంలో మోహన్‌లాల్ శిక్ష తప్పించుకున్నట్టే తెలుగులో వెంకటేశ్ తప్పించుకోనున్నాడు. అజయ్ కూడా తప్పించుకోనున్నాడు. చూడాలి... ఈ రీమేక్స్ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో. చదవండి: దృశ్యం 2: కుటుంబం గెలిచింది చదవండి: రెండో పెళ్లిపై స్పందించిన సురేఖ వాణి -
దృశ్యం 2: కుటుంబం గెలిచింది
శిక్ష అంటే ఏమిటి? నేరం చేసిన వారిని జైలులో బంధించి వారిని జీవితానికి దూరం చేసి బాధించడమేనా? న్యాయం అంటే ఏమిటి? తమకు జరిగిన అన్యాయానికి కొంతమందికి శిక్ష పడే వరకు వేటాడటమేనా? ‘క్రైమ్ అండ్ పనిష్మెంట్’ గురించి వందల సంవత్సరాలుగా మనిషి తాత్త్వికత రకరకాలుగా ఉంది. తప్పు చేస్తే శిక్ష అనుభవించక తప్పదు. అయితే ఆ శిక్ష మానసికమైనదా? భౌతికమైనదా? పశ్చాత్తాపంతో నిండినదా? ప్రాయశ్చిత్తం చేసుకునేదా? శిక్షను కోరుకునే చోట క్షమకు వీలు లేదా? శిక్ష–క్షమ సమానం కాదా? అయితే మనిషికి భావోద్వేగాలు ఉంటాయి. చట్టానికి ఉండవు. ∙∙ ‘నిజానికి ఆ ఇద్దరూ న్యాయం కోరుకుంటున్నారు. కాని ఇద్దరికీ న్యాయం చేయలేం’ అంటాడు ‘దృశ్యం2’లో ఒక పోలీసు ఉన్నతాధికారి. ‘మళ్లీ పోలీసులు ఎప్పుడొస్తారో అని ఆ కుటుంబం భయపడుతూ ఎదురు చూస్తూ ఉంటుంది. అది శిక్ష కదా?’ అంటాడు మరో పోలీసు అధికారి. ఇది ఒక చిక్కుముడి కేసు. ప్రేక్షకులు కూడా న్యాయం చెప్పలేని కేసు. నిజానికి న్యాయం సాపేక్షమైనది. ఇటు నుంచి చూస్తే ఇటు న్యాయం అనిపిస్తుంది. అటు నుంచి చూస్తే అటు న్యాయమనిపిస్తుంది. ‘దృశ్యం’ సినిమాలో ఒక కుర్రాడి హత్య జరుగుతుంది. ఆ హత్యను చేసింది తల్లీకూతుళ్ల జంట. అతను తప్పు చేశాడు. ఆ తల్లీకూతుళ్లు బతిమిలాడారు. అతను వినలేదు. తకరారు జరిగింది. అనుకోకుండా అతడు చనిపోయాడు. అమాయకులైన తల్లీకూతుళ్లు అతని వల్ల పెద్ద విపత్తులో పడ్డారు. ఆ విపత్తు నుంచి కాపాడుకోవడంలో భాగంగా అతను చనిపోయాడు. క్రైమ్ అండ్ పనిష్మెంట్ జరిగిపోయింది. కాని చట్టం దానిని క్రైమ్ అండ్ పనిష్మెంట్ అనుకోదు. పనిష్ చేయాల్సింది తల్లికూతుళ్లను అని భావిస్తుంది తన నియమాల ప్రకారం. ఆ కుర్రాడి తల్లిదండ్రులు కూడా అదే ఆశిస్తారు చట్టం నుంచి. అయితే ఆ చట్టానికి ఆ తల్లికూతుళ్లకు మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఆ ఇంటి యజమాని. కుటుంబ పెద్ద. అతనికి కుటుంబం ముఖ్యం. తన ఇంటి ఆడవాళ్లు జైలుకు వెళ్లకుండా చూసుకోవడం అతడి విధి. అంటే అతడు శిక్షను నిరాకరిస్తున్నాడు. తన కుటుంబానికి శిక్ష పడటం న్యాయ సమ్మతం కాదనుకుంటున్నాడు. అక్కడి నుంచే గేమ్ మొదలవుతుంది. ‘దృశ్యం’ రిలీజ్ అయ్యింది. అనేక భాషల్లో రీమేక్ అయ్యింది. ‘దృశ్యం’ ఒరిజినల్లో చేసిన మోహన్‌లాల్ తన కుటుంబాన్ని తెలివితో కాపాడుకున్నాడు. ఆ సినిమాలో హత్యకు గురైన కుర్రాడి డెడ్‌బాడీ దొరకదు. శవం లేకపోతే నేరం నిరూపణ కాదు. కనుక శిక్ష లేదు. కనుక వారు శిక్ష నుంచి బయటపడతారు. కథ ముగిసింది అనుకుంటాం. కాని నిజంగా ముగిసిందా? పోలీసులు నిజంగానే కేసు మూసేస్తారా? ఏం మూసేయరు. వాళ్లు ఆ కేసును పట్టుకునే ఉంటారు. ఆ కేసును ఛేదించాలనే చూస్తుంటారు. మోహన్‌లాల్ కుటుంబానికి శిక్ష పడేలా చేయడం వారి విధి. కాని నిజంగానే మోహన్‌లాల్ కుటుంబం శిక్ష పొందడం లేదా? వారు శిక్షను అనుభవిస్తున్నారు. కాకపోతే శిక్షగా అందరూ భావించే జైలులో కాదు. తమ జీవనంలో. పోలీసులు ఎప్పుడొస్తారో అని భయం. పెద్ద కూతురికి పీడకలలు. చిన్నకూతురికి ఆందోళన. ఇంటి యజమానికి ఎప్పుడూ పోలీసుల మీద నిఘా. ఆ డెడ్‌బాడీని ఎక్కడ దాచాడో అతడికి మాత్రమే తెలుసు. కాని ఆ బాడీ బయటపడితే? కేసు మొదటికొస్తే? అందరం జైలుకెళ్లాల్సిందే. ఆ మనోవేదనను ఆ కుటుంబం అనుభవిస్తూనే ఉంది. మరోవైపు ఆ చనిపోయిన కుర్రాడి తల్లిదండ్రులు ‘మా అబ్బాయి అస్తికలైనా ఇవ్వు. కర్మకాండలు జరుపుకుంటాం’ అని సెంటిమెంటల్‌గా అడుగుతూ ఉంటే అదొక వేదన. ఇదంతా శిక్ష కాదా? కాదు అంటుంది చట్టం. వారిని జైలులో వేసి బంధిస్తేనే అది శిక్ష అంటుంది. అలాంటి శిక్షకు ఆ ఇంటి పెద్ద సమ్మతంగా లేడు. ‘దృశ్యం 2’ తాజాగా మలయాళ భాషలో అమేజాన్‌లో రిలీజ్ అయ్యింది. ‘దృశ్యం’కు సీక్వెల్ ఇది. అదే తారాగణం. అదే నేపథ్యం. అదే కొనసాగింది. తల్లీకూతుళ్లు కుర్రాణ్ణి హత్య చేసిన ఆరేళ్ల తర్వాత నుంచి కథ మొదలవుతుంది. ఆరేళ్ల తర్వాత ఆ కేసు గురించి మళ్లీ విచారణ మొదలవుతుంది. ఆ సమయానికి ఆ ఇంటి వాళ్లు కొంచెం ఆర్థికంగా బాగుపడి ఉన్నారు. పెద్దమ్మాయి పెళ్లికి రెడీ అయి ఉంది. రెండో అమ్మాయి కాలేజీకి వచ్చింది. కాని వారు మనశ్శాంతితో మాత్రం లేరు. ఊరు జరిగిన హత్యను మరిచిపోలేదు. పుకార్లను మానలేదు. ఆ కుర్రాడు కూతురి కోసం వచ్చాడని ఒకరంటే తల్లి కోసం వచ్చాడని ఒకరంటుంటారు. జనానికి కూడా వీళ్లిలా హాయిగా తిరిగడం నచ్చదు. బాధల్లో ఉండాలి. మరోవైపు పోలీసుల డేగ కళ్లు. ఏదో ఒక రోజు ఆ పోలీసులు శవాన్ని కనిపెడితే ఆ కుటుంబం పని సఫా అయిపోతుంది. కాని అలా సఫా కాకుండా ఉండటానికి ఆ కుటుంబ యజమాని అయిన మోహన్‌లాల్ సకల సరంజామాతో సిద్ధంగా ఉన్నాడని సినిమా చూశాక తెలుస్తుంది. దృశ్యంలో కుటుంబం గెలిచింది. దృశ్యం 2లో కూడా కుటుంబమే గెలిచింది. చట్టం వారికి శిక్ష వేయలేకపోయింది. కానీ వారు శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. క్రూరమృగం అనుకుని పొదల్లో ఉన్న రుషిని చంపి శిక్ష అనుభవించిన వారు ఉన్నారు. జంట పక్షులలో ఒకదానిని చంపి ప్రాయశ్చిత్తం గా రుషిగా మారినవారూ ఉన్నారు. నేరం జరగడం, చేయడం మనిషి జీవనంలో అనూహ్యం గా ఉంది. పథకం ప్రకారమూ ఉంది. కాని ఒక్కసారి నేరం జరిగిపోయాక ఇరు పక్షాలు వల్లె వేసే ‘క్షమ’–‘శిక్ష’ అనే మాటలు విస్తారమైన చర్చకు పాత్రమవుతుంటాయి. క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్న భార్య, అందుకు కారకుడేమోనని భర్తకు శిక్ష వేయించాలని చూసే పెద్దలు, పిల్లల కోసం తనకు శిక్ష పడకూడదని భావించే తండ్రి... ఎవరివైపు నుంచి చూస్తే వారిది ‘సరైన వాదనే’ అనిపిస్తూ ఉంటుంది. ఇటీవల రాహుల్ గాంధీ ‘నా తండ్రిని చంపిన వారిపై నాకు కోపం లేదు’ అన్నాడు. అది భావోద్వేగం. కాని చట్టానికి విధి ఉంటుంది. ఈ భావోద్వేగాలు, చట్టం కర్తవ్యాలు ఎప్పటికీ ఉంటాయి. నడుమ వాటిని చర్చకు పెట్టే ‘దృశ్యం’ వంటి సినిమాలు నాలుగు డబ్బులు చేసుకుంటూ ఉంటాయి. దర్శకుడు జీతూ జోసెఫ్‌కు తిండికి ఢోకా లేదు. డైరెక్టర్ రేపెప్పుడైనా ఫెయిల్ అయినా డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టుకొని బతికేయవచ్చు. అంత పకడ్బందీగా ఉందీ సినిమా. తెలుగు రీమేక్ కోసం ఎదురు చూడండి. దర్శకుడు జీతూ జోసెఫ్ – సాక్షి ఫ్యామిలీ -
దృశ్యం 2: మోహన్ లాల్ కథకు ప్రాణం పోశారు
మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘దృశ్యం’ మూవీకి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘దృశ్యం-2’ ఈ రోజు అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ మోహన్‌లాల్, మీనా ప్రధాన పాత్రల్లో నటించారు. ఆరేళ్ల క్రితం సెన్సెషనల్ హిట్ సాధించిన ఈ మూవీ తెలుగు, తమిళంతోపాటు మరో మూడు భాషల్లో రీమేక్ అయ్యిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఇక తాజాగా మలయాళంలో విడుదలైన ఈ మూవీ సిక్వెల్‌కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా సీని రచయిత శీధర్ పిల్లై ట్వీట్ చేశారు. ‘అద్భుతమైన ఆరంభం. దృశ్యం లాగే ఈ సీక్వెల్ కూడా ప్రేక్షక ఆదరణతో ముందుకు వెళుతోంది. జీతూ జోసెఫ్ స్మార్ట్ రైటింగ్, థ్రిల్లింగ్ థాట్‌కు జార్టీ కుట్టిగా మోహన్ లాల్ కథకు ప్రాణం పోశారు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా దృశ్యంలో తన కుటుంబం జోలికి వచ్చిన వరుణ్‌ను కూతురు హత్య చేయడం.. ఆ మృతదేహాన్ని ఎవరూ ఉహించని విధంగా పోలీస్ స్టేషన్లోనే పాతిపెడతాడు జార్జి కుట్టి (మోహన్ లాల్). ఇక ఆ తర్వాత జార్జి తన కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. కానీ ఆ కేసును మాత్రం పోలీసులు వదిలి పెట్టరు. జార్జికి తెలియకుండా ఆ కేసును ఇంకా దర్యాప్తు చేస్తుంటారు. ఈ క్రమంలోనే వారికి కొన్ని కీలక సాక్ష్యాలు దొరుకుతాయి. ఆ సాక్ష్యాలెంటీ.. మళ్లీ వాటి వలన జార్జి కుటుంబానికి ఎదురైన సమస్యలను దర్శకుడు దృశ్యం 2లో చూపించాడు. #Drishyam2 @PrimeVideoIN -Fantastic!A sequel as good as #Drishyam. #JeethuJoseph nailed it smart writing & taut thrilling moments. @Mohanlal as #Georgekutty is extraordinary along with #Meena & #MuraliGopy.Story opens 6 years after events of #D1 & police hasn’t closed the case... pic.twitter.com/ciAYV0J4LU — Sreedhar Pillai (@sri50) February 18, 2021 -
దృశ్యం సీక్వెల్లో వెంకటేశ్: ఛాన్స్ ఉందా?
మలయాళంలో 2013లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ చిత్రం దృశ్యం. థ్రిల్లర్ కథాంశం, సస్పెన్స్ అంశాలు ఈ సినిమాను పెద్ద హిట్ చేశాయి. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అనేక భాషల్లో రీమేక్ అయింది. గత దశాబద్ధంలో ఎక్కువ భాషల్లో రీమేక్ అయిన సినిమాల్లో దృశ్యం ఒకటి. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, సింహళీ (శ్రీలంక) భాషలో రీమేక్ అయింది. చైనీస్ భాషలోనూ రీమేక్ అయిన తొలి భారతీయ సినిమా ఇదే కావడం విశేషం. ఏడేళ్ల తర్వాత దృశ్యానికి సీక్వెల్ తెరకెక్కించాడు దర్శకుడు జీతూ జోసెఫ్. మొదటి భాగంలో నటించిన మోహన్‌లాల్, మీనా ఇందులోనూ భార్యాభర్తలుగా నటించారు. ఈ మధ్యే సినిమా ట్రైలర్ రిలీజవగా ఫిబ్రవరి 19న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేస్తున్నారు. థియేటర్లు ఓపెన్ అయినా కూడా ముందస్తు ఒప్పందం ప్రకారం ఓటీటీలో విడుదల చేయక తప్పట్లేదు. దృశ్యం తెలుగు రీమేక్‌లో నటించిన వెంకటేశ్ ఇప్పుడు దాని సీక్వెల్‌పైనా దృష్టి సారించాడు. కానీ డైరెక్టర్ జీతూ దృశ్యం 2ను తెలుగులో డబ్ చేస్తుండటంతో వెంకటేశ్‌కు దాదాపు రీమేక్ ఛాన్స్ లేకుండా పోయింది. పైగా మరికొద్ది రోజుల్లో ఈ సినిమా ఓటీటీలో అందరికీ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో వెంకీ దీన్ని వదిలేసుకునే అవకాశమే అధికంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ సీక్వెల్ తెలుగు రీమేక్ ఉందా? లేదా? అన్న ప్రశ్నకు సమాధానం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం వెంకీ 'నారప్ప' సినిమాతో బిజీబిజీగా ఉన్నాడు. 'అసురన్' రీమేక్‌గా వస్తోన్న ఈ చిత్రం మే 14న విడుదల కానుంది. వరుణ్ తేజ్‌తో కలిసి చేస్తున్న 'ఎఫ్ 3' ఆగస్టు 27న థియేటర్లలో నవ్వులు పూయించేందుకు వస్తోంది. చదవండి: వేసవిలో నారప్ప రిలీజ్.. కేజీఎఫ్ 2 బిజినెస్ మాములుగా లేదుగా.. అన్ని కోట్లా? -
యుద్ధానికి వెళ్తున్నట్లనిపించింది
‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణం అంటే యుద్ధానికి వెళ్తున్న భావన కలుగుతోంది’’ అంటున్నారు మీనా. మలయాళ చిత్రం ‘దృశ్యం’కి సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ తెరకెక్కుతోంది. మోహన్ లాల్, మీనా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం ఏడు నెలల తర్వాత విమానయానం చేశారు మీనా. పీపీఈ కిట్ ధరించి ప్రయాణం చేశారామె. దీని గురించి మీనా మాట్లాడుతూ –‘‘ఈ దుస్తులన్నీ చూస్తుంటే అంతరిక్షానికి వెళ్తున్నట్టు అనిపించింది. అలాగే ఏదో యుద్ధానికి వెళుతున్న ఫీల్ కలిగింది. విమానాశ్రయం చాలా ఖాళీగా ఉంది. నాలా ఎవ్వరూ డ్రెస్ (పీపీఈ కిట్స్) చేసుకోకపోవడం భలే ఆశ్చర్యంగా అనిపించింది. ఈ డ్రెస్‌లో ప్రయాణం చాలా కష్టం. బయట చల్లగా ఉన్నప్పటికీ లోపల ఒకటే ఉక్కపోత. వీటితో రోజూ మన కోసం కష్టపడుతున్న అందరికీ నా సెల్యూట్’’ అన్నారు. -
ఆస్పత్రిలో 'దృశ్యం' దర్శకుడు
సాక్షి, హైదరాబాద్: సక్సెస్ఫుల్ చిత్రం 'దృశ్యం' దర్శకుడు నిశికాంత్ కామత్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీర్ఘకాలంగా కాలేయ వ్యాధితో పోరాడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఏఐజీ ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కాగా నిశికాంత్ 'డోంబివాలీ ఫాస్ట్' అనే మరాఠీ చిత్రంతో 2005లో వెండితెరపై దర్శకుడిగా ప్రవేశించారు. ఈ చిత్రానికి ఆయన జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. (ఇలా చేయడంతో వారంలో కోలుకున్నా: విశాల్) దీనికన్నా ముందు 'హవా ఆనే దే' అనే హిందీ సినిమాలోనూ నటించారు. 'సాచ్య ఆట ఘరాట్' అనే మరాఠీ సినిమాలోను నటనతో ఆకట్టుకున్నారు. "ముంబై మేరీ జాన్" అనే చిత్రంతో డైరెక్టర్‌గా బాలీవుడ్‌కు మకాం మార్చారు. ఈ చిత్రం హిట్ కొట్టడంతో 'ఫోర్స్', 'లై భారీ' సినిమాలకు దర్శకత్వం వహించారు. అలాగే దక్షిణాదిన ఘన విజయాన్ని నమోదు చేసుకున్న "దృశ్యం" సినిమాను అజయ్ దేవ్‌గణ్, టబుతో కలిసి హిందీలో తెరకెక్కించారు. ఆయన పలు హిందీ, తమిళ, మరాఠీ చిత్రాల్లో పని చేశారు. "రాకీ హ్యాండ్ సమ్" చిత్రంలో విలన్‌గానూ కనిపించారు. (ఉత్తమ థ్రిల్లర్ సీక్వెల్‌కు రెడీ!) -
పెళ్లికి రెడీ అవుతోన్న 'దృశ్యం' నటుడు
తిరువనంతపురం: 'దృశ్యం' నటుడు రోషన్ బషీర్‌కు పెళ్లి ఘడియలు దగ్గరపడ్డాయి. కేరళలో తన ప్రేయసి, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి దగ్గరి బంధువైన ఫర్జానాను ఆగస్టు 5న వివాహం చేసుకోనున్నారు. కేరళ ప్రభుత్వం నియమ నిబంధనల మేరకు కేవలం ఇరు కుటుంబాల సమక్షంలోనే ఈ వివాహం జరగనుంది. కాగా ఎప్పటినుంచో ప్రేమ ఊసులు చెప్పుకుంటున్న వీరిద్దరినీ పెళ్లి బంధంతో ఒక్కటి చేసేందుకు పెద్దలు నిర్ణయించుకోవడంతో జూలై 5న వీరి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలను రోషన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీంతో అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా ఫర్జానా న్యాయవిద్యను అభ్యసిస్తున్నారు. (సెలబ్రిటీల పెళ్లిపై మాధవీలత విసుర్లు) రోషన్ బషీర్ "ప్లస్ టూ" చిత్రంతో మలయాళీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. 'ఇన్నను ఆ కల్యాణం', 'బ్యాంకింగ్ అవర్స్', 'రెడ్ వైన్' వంటి పలు సినిమాల్లో కనిపించారు. కానీ అతనికి మంచి బ్రేక్‌నిచ్చింది మాత్రం 'దృశ్యం' సినిమానే. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో రోషన్ నెగెటివ్ పాత్రలో మెరుగైన నటన కనబరిచారు. ఈ సినిమా బంపర్ హిట్ సాధించడంతో ఎన్నో భాషల్లో రీమేక్ అయింది. తెలుగులో వెంకటేశ్ (దృశ్యం), తమిళంలో కమల్ హాసన్ (పాపనాశనం), కన్నడంలో రవిచంద్రన్ (దృశ్య), హిందీలో అజయ్ దేవగన్ (దృశ్యం) హీరోలుగా రీమేక్ చేశారు. అంతేకాదు.. సింహళీ (శ్రీలంక)భాషలో ‘ధర్మయుద్య’గా రీమేక్ అయింది. చైనీస్‌లోనూ ‘షీప్ వితౌట్ ఏ షెపర్డ్’ టైటిల్‌తో రీమేక్ అయింది. (భారీ వ్యూస్ సాధించిన ‘గడ్డి తింటావా’ సాంగ్) -
చైనీస్‌కు దృశ్యం
ఒక భాషలో విజయవంతమైన చిత్రాలు మరో భాషలో రీమేక్ కావడం సాధారణం. ఈ మధ్య కాలంలో మలయాళ హిట్ సినిమా ‘దృశ్యం’ ఎక్కువ భాషల్లో రీమేక్ అయింది. తాజాగా చైనీస్ భాషకి వెళ్లడం విశేషం. మోహన్‌లాల్ హీరోగా జీతూ జోసెఫ్ రూపొందించిన థ్రిల్లర్ ‘దృశ్యం’. తెలుగులో వెంకటేశ్ (దృశ్యం), తమిళంలో కమల్ హాసన్ (పాపనాశనం), కన్నడంలో రవిచంద్రన్ (దృశ్య), హిందీలో అజయ్ దేవగన్ (దృశ్యం) హీరోలుగా రీమేక్ చేశారు. అంతేకాదు.. సింహళీ (శ్రీలంక)భాషలో ‘ధర్మయుద్య’గా రీమేక్ అయింది. ఇప్పుడు చైనీస్‌లో ‘షీప్ వితౌట్ ఏ షెపర్డ్’ ౖటñ టిల్‌తో రీమేక్ అయింది. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 20న విడుదలవుతోంది. -
‘దృశ్యం’ సినిమా చూపించారు!
ఇండోర్: సినిమాల ప్రభావం జనంపై ఉంటుందా అన్న ప్రశ్నకు ఇదొక ఉదాహరణ. దృశ్యం సినిమాను రియల్ లైఫ్‌లో దించేశారు. ట్వింకిల్ దగ్రే (22) అనే మహిళ రెండేళ్ల కింద కనిపించడం లేదని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కేసు నమోదైంది. ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు ఇటీవల గుర్తించారు. ఈ కేసులో నిందితులు బీజేపీ మాజీ కార్పొరేటర్ జగదీశ్ కరొటియా (65), అతని ముగ్గురు కుమారులు అజయ్(38), విజయ్ (36), వినయ్ (31)తో పాటు వీరి సహాయకుడు నీలేశ్ కశ్యప్(28)ని అరెస్టు చేసినట్లు ఇండోర్ డీఐజీ హరినారాయణచారి మిశ్రా వెల్లడించారు. దృశ్యం సినిమా ప్రేరణతో వారు ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. వివాహేతర సంబంధమే: కరొటియాకు ట్వింకిల్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో ఆమె అతనితోనే ఉంటానని పట్టుబట్టడంతో కరొటియా ఇంట్లో కలహాలు మొదలయ్యాయి. దీంతో ఆమె అడ్డు తప్పించాలని భావించిన కరొటియా..తన ముగ్గురు కొడుకులతో కలసి హత్యకు పథకం వేశాడు. దారి మళ్లించారిలా.. ► ఐదుగురు కలసి 2016 అక్టోబర్ 16న ట్వింకిల్ గొంతు నులిమి చంపి..కరొటియా స్థలంలోనే మృతదేహాన్ని కాల్చేశారు. ► ట్వింకిల్‌ను ఆమె తల్లిదండ్రులే హత్య చేశారని నమ్మించడానికి హత్యకు ముందురోజు నిందితుడు అజయ్ ట్వింకిల్ మొబైల్ తీసుకుని ‘నా తల్లిదండ్రుల నుంచి నాకు ప్రాణహాని ఉంది. నన్ను కాపాడు’అంటూ వాట్సప్ నుంచి తన తండ్రికి సందేశాలు పంపించుకున్నాడు. ► హత్య చేసిన రోజే ఓ కుక్కను చంపి ఆమెను కాల్చిన ప్రదేశానికి 100 మీటర్ల దూరంలో పూడ్చిపెట్టారు. ► అదే రోజు ట్వింకిల్ మొబైల్ లొకేషన్ మార్చి బాదన్వర్ సమీపంలో పూడ్చిపెట్టారు. ► అనంతరం 4 నెలలకు తన భూమిలో ఎవర్నో చంపి పూడ్చి పెట్టారని, కొలతలను బట్టి చూస్తుంటే అది ట్వింకిల్ మృతదేహం లాగే ఉందని స్థానికంగా వదంతులు సృష్టించి చర్చనీయంశం చేశాడు. అనంతరం 2 నెలలకు ఈ విషయాన్ని తన సహాయకుడి ద్వారా పోలీసులకు చేరవేశాడు. ► అక్కడ తవ్వి చూసిన పోలీసులకు దృశ్యం సినిమా మాదిరి కుక్క కళేబరం బయటపడింది. ఇది దర్యాప్తును పక్కదారి పట్టించింది. ► కరొటియా సూచనల మేరకు అంతకు ముందే ట్వింకిల్ తన తల్లిదండ్రులతో ప్రాణహాని ఉందని స్థానిక పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదు చేసింది. ఇది ఆమె తల్లిదండ్రులే హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసుల్ని దారి మళ్లించింది. సాక్షులూ..ఆధారాలతో.. కొన్నాళ్లకు మృతదేహాన్ని కాల్చిన ప్రదేశంలో ట్వింకిల్‌కు సంబంధించిన ఒక జత మెట్టెలు, ఓ బ్రాస్లెట్, అస్థికలు, ఆమెను చంపడానికి ఉపయోగించిన తాడును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరొటియాపై అనుమానంతో దర్యాప్తు ప్రారంభించారు. అక్టోబర్ 16న కార్లో ఓ మృతదేహం తెచ్చారని, దాని గురించి అడిగితే కార్పొరేటర్ కుక్క చనిపోయిందని, దాన్ని పూడ్చిపెట్డడానికి తీసుకెళ్తున్నట్లు కరొటియా సహాయకుడు సూర్యవంశీ ద్వారా పోలీసులు రాబట్టారు. అంతకు ముందు రోజు ట్వింకిల్ ఆ ఇంటికి వచ్చినట్లు కూడా అతను చెప్పాడు. చనిపోయిన కుక్కకోసం తమను 5 అడుగుల గొయ్యి తవ్వమన్నారని ఐఎంసీ కార్మికులు పోలీసులకు చెప్పడంతో వారి అనుమానం నిజమైంది. బయటపడింది ఇలా.. ఈ కేసుకోసం ఇండోర్‌లోనే తొలిసారి నిందితునికి బ్రెయిన్ ఎలక్ట్రికల్ ఆసిలేషన్ సిగ్నేచర్ (బీఈఓఎస్) పద్ధతిలో దర్యాప్తు చేశారు. గుజరాత్ లాబొరేటరీలో కరొటియా, అతని ఇద్దరి కుమారులకు ఈ బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్ష నిర్వహించారు. న్యూరో సైకలాజికల్ టెక్నిక్ వల్ల దోషులు దొరికిపోవడంతో కథ పూర్తయింది. -
‘దృశ్యం’తరహాలో యువతిని చంపి, కుక్కను పాతిపెట్టి..
ఇండోర్ : దృశ్యం సినిమా తరహాలో ఓ కాంగ్రెస్ కార్యకర్తను హత్య చేసిన తండ్రీ కొడుకులు.. పోలీసుల కళ్లుకప్పి రెండేళ్లపాటు నిజాన్ని దాచగలిగారు. చివరకు పోలీసుల విచారణలో నిజం బయటపడి కటకటాలపాలయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఇండోర్ కు చెందిన బీజేపీ మాజీ కౌన్సిలర్ జగదీశ్ కరోటియా (65) అదే ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ మహిళా కార్యకర్త ట్వింకిల్ దాగ్రే (22) ల మధ్య వివాహేతర బంధం ఏర్పడింది. వీరి మధ్య ఉన్న అక్రమ సంబంధం కరోటియా ముగ్గురు కుమారులు అజయ్(38), విజయ్(36), వినయ్(31)లకు తెలిసింది. దీంతో తండ్రితో గొడవకు దిగారు. ట్వింకిల్ తో గడిపితే సహించేది లేదని తేల్చి చెప్పారు. కుమారుల ఒత్తిడితో ట్వింకిల్ ను హతమార్చేందుకు జగదీశ్ ప్లాన్ చేశారు. ఆపై 'దృశ్యం' సినిమా చూసిన వీరంతా, అలాగే ప్లాన్ చేశారు. తమ సన్నిహితుడు నిలేశ్(28)తో కలిసి ట్వింకిల్ ను హత్య చేశారు. హత్య అనంతరం ఆమెను తమ కారులో తీసుకెళ్లి కాల్చేశారు. ఈ హత్యపై కచ్చితంగా పోలీసులు తమనే అనుమానిస్తారని ఊహించిన నిందితులు.. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా ఓ చోట చనిపోయిన కుక్క మృత దేహాన్ని పాతిపెట్టారు. కొంతకాలం తరువాత ఎవరినో హత్య చేసి, పూడ్చి పెట్టారన్న పుకారును లేవనెత్తారు. అప్పటికే ట్వింకిల్ అదృశ్యంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు, డాగ్ స్క్వాడ్ తో రాగా, పూడ్చి పెట్టిన ప్రాంతంలో కుక్క కళేబరం మాత్రమే వారికి కనిపించింది. ఇలా రెండేళ్లు గడిచిపోయాయి. పోలీసులకు జగదీశ్ తో ట్వింకిల్ కు ఉన్న వివాహేతర బంధం గురించి తెలిసి ఆ దిశగా విచారించగా, అసలైన నిందితులని గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేశామని, మరిన్ని వివరాల కోసం వారిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
దృశ్యం సినిమా స్ఫూర్తితో హత్య చేశారు
పుణె: పలు భాషల్లో నిర్మించిన దృశ్యం సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో తీసిన ఈ సినిమాలో మీనా.. తన కుమార్తెను బ్లాక్మెయిల్ చేస్తున్న యువకుడి నుంచి కాపాడుకోవడం కోసం అనుకోకుండా అతన్ని చంపేస్తుంది. హీరో వెంకటేష్ తన భార్య, కుమార్తెలను హత్య కేసు నుంచి రక్షించడం కోసం ఎవరికీ తెలియని చోట శవాన్ని పూడ్చిపెట్టి, సాక్ష్యం దొరకకుండా చేస్తాడు. బాలీవుడ్లో రీమేక్ చేసిన ఈ సినిమాలో అజయ్ దేవగణ్ నటించాడు. ఈ సినిమా స్ఫూర్తితో మహారాష్ట్రకు చెందిన తండ్రీకొడుకు ఓ వడ్డీ వ్యాపారిని చంపేశారు. కాగా సినిమాలో మాదిరిగా చట్టం నుంచి తప్పించుకోలేకపోయారు. చిక్లికి చెందిన వడ్డీ వ్యాపారి శ్రీరామ్ శివాజీ వాలేకర్ నుంచి సమిదుల్లా మనియార్ (54), ఆయన కొడుకు మెహబూబ్ మనియార్ (26) 5 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. కాగా వీళ్లు సకాలంలో అప్పు తీర్చకపోవడంతో శ్రీరామ్ డిమాండ్ చేశాడు. అప్పు, వడ్డీ కలపి 8.40 లక్షల రూపాయలు బాకీ పడ్డారు. అప్పు ఎగ్గొట్టేందుకు మనియార్లు దృశ్యం సినిమా తరహాలో శ్రీరామ్‌ను చంపి సాక్ష్యాలు లేకుండా చేయాలని పథకం వేశారు. గతేడాది సెప్టెంబరులో చిక్లీ ప్రాంతంలో వాళ్లు ఓ అద్దె ఇంటిని తీసుకున్నారు. అదే నెల 27న మాట్లాడేందుకని శ్రీరామ్‌ను ఈ ప్లాట్‌కు పిలిచి గొంతు కోసి చంపేశారు. తర్వాత అతని శవాన్ని ఓ ప్లాస్టిక్ షీట్లో చుట్టి ఇంట్లోనే పాతిపెట్టారు. మనియార్లు ఈ విషయం ఇక ఎవరికి తెలియదనుకుని ఏమీ తెలియనట్టు ఉండిపోయారు. కాగా ఆ మరుసటి రోజు అనగా సెప్టెంబర్ 28న శ్రీరామ్ కనిపించడం లేదంటూ ఆయన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శ్రీరామ్ ఫోన్ కాల్స్ డేటాను ఆధారంగా అతను మనియార్లతో అప్పు విషయంపై గొడవపడ్డాడని, పలుమార్లు ఫోన్లో మాట్లాడుకున్నట్టు పోలీసులు తెలుసుకున్నారు. మనియార్ ఫోన్ కాల్ డేటాను కూడా పరిశీలించారు. మనియార్ల గురించి పోలీసులు విచారించగా, వాళ్లు సొంతూరుకు వెళ్లినట్టు తెలిసింది. గురువారం మెహబూబ్ చిక్లీ తిరిగి రాగా పోలీసులు వెంటనే కస్టడీలోకి తీసుకుని విచారించగా అసలు విషయం చెప్పాడు. శుక్రవారం హత్య జరిగిన ప్రాంతం నుంచి శ్రీరామ్ మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు సమిదుల్లాను కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. -
క్రికెట్ మ్యాచ్ రోజునా...‘దృశ్యకావ్యం’ కలెక్షన్లు తగ్గలేదు
‘‘నా కెరీర్లో ఇప్పటివరకూ చాలా యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్స్‌లో నవ్వులు పూయించాను. కానీ హారర్ నే పథ్యంలో తెరకెక్కిన ‘దృశ్యకావ్యం’ చిత్రంలో నటించడం సరికొత్త అనుభూతిని ఇచ్చింది. నాకు మంచి పేరు తీసుకొచ్చిన చిత్రమిది’’ అని హాస్యనటుడు ‘థర్టీ ఇయర్స’ పృథ్వి అన్నారు. కార్తీక్, కశ్మీర జంటగా స్వీయ దర్శకత్వంలో బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఇందులో డాక్టర్ పృథ్విగా నటించిన పృథ్వి ఈ సినిమా గురించి చెప్పిన విశేషాలు... ♦ నేను ఇప్పటివరకూ చాలా అనుభవమున్న దర్శకులతో పనిచేశాను. చేస్తున్నాను. కానీ బెల్లం రామకృష్ణారెడ్డి ఈ సినిమా కథ చెప్పడానికి వచ్చినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎవరి దగ్గరా సహాయకునిగా పనిచేయకపోయినా ఆయన క్లారిటీ అద్భుతం. అది నాకు బాగా నచ్చింది. అందుకే ఈ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాను. కొత్త దర్శకులతో అయినా నేను పనిచేయడానికి రెడీ. ♦ షూటింగ్ టైమ్ చాలా హ్యాపీగా గడిచిపోయింది. రామకృష్ణారెడ్డి చాలా చక్కగా ఈ సీన్స్‌ను తీర్చిదిద్దారు. ఈ సినిమా విడుదలయ్యాక మా కష్టానికి తగ్గ రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల వరల్డ్‌కప్ టీ 20లో భాగంగా ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ జరిగిన రోజు కూడా ఈ సినిమాకు కలెక్షన్స్ తగ్గలేదు. ఈ సినిమా బాగా ఆగుతోందని చెప్పడానికి ఇదొక్కటి చాలు. ♦ ఎక్కడా అభ్యంతరకరమైన సన్నివేశాలు లేకుండా ఈ సినిమా అన్ని వర్గాల వారికి నచ్చేలా తీశారు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చక్కగా కూర్చొని ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు నచ్చే సినిమా ఇది. వేసవి సెలవుల్లో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ♦ సినిమా ద్వితీయార్ధంలో భూతవైద్యుడిగా హీరో ఇంట్లోకి ప్రవేశించిన నాకు హఠాత్తుగా ఎదురయ్యే పిల్లదెయ్యాలు, అవి నన్ను భయపెట్టే సన్నివేశాలకు ముఖ్యంగా పిల్లలు బాగా కనె క్ట్ అవుతున్నారు. ఈ ఎపిసోడ్ మొత్తం ఈ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ♦ ఇక, ఈ సన్నివేశాలకు గ్రాఫిక్ వర్క్ కూడా బాగా కుదిరాయి. లైవ్ ఇన్స్ట్రుమెంట్స్తో ‘ప్రాణం’ కమలాకర్ అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రాణం పోసింది. సినిమా నిడివి ఎక్కువ కావడంతో నా మీద చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలను తొలగించారు. త్వరలో ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందనున్న ‘దృశ్యకావ్యం-2’లో నటించనున్నా. అందులో కూడా నవ్విస్తాను. ♦ ఆ మధ్య చేసిన ‘లౌక్యం’ తర్వాత నుంచి నాకు వరుసగా మంచి పాత్రలు వస్తున్నాయి. ‘సరైనోడు’, మారుతి దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో చాలా మంచి రోల్స్ చేస్తున్నా. -
'దృశ్యకావ్యం' రివ్యూ..
జానర్ : హారర్ నటీనటులు : కార్తీక్, కశ్మీరా కులకర్ణి, పృథ్వీ తదితరులు నిర్మాత, దర్శకత్వం : బెల్లం రామకృష్ణా రెడ్డి సంగీతం : కమలాకర్ ఈ మధ్యకాలంలో దర్శకులు కళ్లు మూసుకుని నమ్ముకుంటున్న సబ్జెక్ట్ 'సస్పెన్స్'. భయానికి మరికొన్ని భావోద్వేగాలను మిళితం చేసి సినిమాలను ప్రేక్షకుల మీదకు వదులుతున్నారు. అలాంటి హారర్ ఎలిమెంట్స్ తో ఈ శుక్రవారం థియేటర్లకు వచ్చిన చిన్న సినిమానే 'దృశ్యకావ్యం'. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందో.. తల నొప్పించిందో.. ఓ సారి చూద్దాం. హనీ అనే పాప తన తండ్రి డైరీ చదువుతుండగా సినిమా మొదలవుతుంది. హీరో అఖిల్(రామ్ కార్తీక్), హీరోయిన్ అభి(కశ్మీరా కులకర్ణి)లు బి.టెక్ చదువుతుండగా ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటారు. వీరికి హనీ అనే ఓ పాప. భార్య, పాపే అఖిల్ ప్రపంచం. పాపకు తండ్రి తోడిదే లోకం. ఇంతలో అఖిల్‌కు ఆఫీసులో యూరప్ ట్రిప్ వెళ్లే అవకాశం వస్తుంది. పాప వద్దంటున్నా వినకుండా అఖిల్ యూరప్ కు బయలుదేరుతాడు. ఇక్కడి వరకు సంతోషంగా, సాఫీగా జరిగిన వారి జీవితంలో మొదలయ్యే అనూహ్య పరిణామాలే మిగిలిన కథాంశం. యూరప్‌కు బయలుదేరిన అఖిల్ ఎయిర్ పోర్టుకు చేరుకోకుండానే రోడ్డుప్రమాదానికి గురై మరణిస్తాడు. ఇదే విషయాన్ని అతని భార్యకు చెప్పడానికి అఖిల్ ఇంటికి చేరుకున్న అతని ఫ్రెండ్(మధునందన్).. ఫోనులో భర్తతో మాట్లాడుతున్న అభిని చూసి అవాక్కవుతాడు. మార్చురీ దగ్గర స్నేహితుడి మృతదేహాన్ని చూసి వచ్చిన అతడికి అఖిల్ ఇంటి పరిస్థితులు దిగ్భ్రాంతిని కలిగిస్తాయి. ఇక ఆ తర్వాత చనిపోయిన తండ్రికి, పాపకు మధ్య చోటుచేసుకునే కొన్ని సంఘటనలతో కథను ముందుకి నడిపించారు. దర్శకుడు మంచి సస్పెన్స్ పాయింట్‌నే తీసుకున్నాడు గానీ ఆ ఒక్క పాయింట్ తోనే కథను నడిపేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఫస్ట్ హాఫ్ అంతా ప్రేమ పాటలతో గడిచిపోతుంది. సెకండ్ హాఫ్ లో కథ మలుపు తీసుకున్నా పెద్దగా ఆకట్టుకున్నదేమీ లేదు. ఇంతా చేసి ఏం జరుగుతుందో స్పష్టత ఇచ్చారా అంటే అదీ లేదు, ఏం జరిగిందో తెలియాలంటే సినిమా రెండవ భాగం చూడండంటూ అకస్మాత్తుగా కథకు తెర దించాడు దర్శకుడు. హీరో కొత్తవాడే అయినా పరిధి మేరకు బాగానే నటించాడు. హీరోయిన్ అందంగా కనిపించిందిగానీ మాటి మాటికీ నవ్వి కాస్త చిరాకు తెప్పించింది. మధ్యలో మన సహనానికి పరీక్ష పెట్టే కమెడియన్ల కష్టాలు. అన్నీ వెరసి అటు భయంగానీ, ఇటు థ్రిల్ గానీ, సస్పెన్స్ గానీ.. ఏదీ కలిగించలేకపోయింది ఈ సినిమా. అసలు సినిమాకి 'దృశ్యకావ్యం' అనే పేరు ఎందుకు పెట్టారో అనే ఆలోచన సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కలగక మానదు. బలాలు సంగీతం పాటలు కెమెరా బలహీనతలు కథనం క్లైమాక్స్ హారర్ ఎలిమెంట్స్ లేకపోవడం -
మలయాళ దర్శకుడికి ఓకే చెప్పాడు
ఏడాది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న వెంకటేష్ మళ్లీ సినిమాలకు రెడీ అవుతున్నాడు. గతంలోరిజెక్ట్ చేసిన మారుతి దర్శకత్వంలో బాబు బంగారం పేరుతో ఓ కామెడీ ఎంటర్ టైనర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 16న లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను కూడా పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నాడు వెంకీ. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు వెంకటేష్. గతంలో జీతూ జోసెఫ్ తెరకెక్కించిన దృశ్యం సినిమా రీమేక్ లో హీరోగా నటించిన వెంకీ, ఈ సారి నేరుగా జీతూ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. తెలుగులో వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళ వర్షన్ లో హీరోను ఫైనల్ చేయాల్సి ఉంది.