
హిందీ 'దృశ్యం'లో టబు
న్యూఢిల్లీ: బాలీవుడ్ చిత్రం 'హైదర్'లో తల్లి పాత్ర పోషించి ప్రశంసలందుకున్న ప్రముఖ నటి టబు ఈ సారి విభిన్నపాత్ర పోషిస్తున్నారు. టబు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గెటప్లో కనిపించనున్నారు. తెలుగులో వచ్చిన దృశ్యం చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. తెలుగు దృశ్యంలో నదియా పోషించిన పాత్రను హిందీలో ఐజీ మీరా దేశ్ముఖ్గా టబు నటిస్తున్నారు. నిషికాంత్ కామత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్నారు.