న్యూఢిల్లీ : బాలీవుడ్ ప్రముఖ హీరో అజయ్ దేవగన్ వల్లే తాను పెళ్లి పెటాకులు లేకుండా ఉండిపోయానంటూ గతంలో ఎన్నోసార్లు చెప్పారు ప్రముఖ నటి టబు. అయితే అజయ్ దేవగన్‌తో నటించే అవకాశం వస్తే మాత్రం ఆ మూవీలో కచ్చితంగా నటిస్తానని, ఎట్టి పరిస్థిత్తుల‍్లోనూ అవకాశాలు వదుకునే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న గోల్‌మాల్ అగేయిన్ చిత్రంలో అజయ్, టబు నటించారు. ఈ శుక్రవారం ఆ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
విజయ్‌పథ్, తక్షక్, దృశ్యం వంటి అజయ్ దేవగన్ చిత్రాల్లో గతంలో నటించిన టబు గోల్‌మాల్ అగేయిన్‌లోనూ కలిసి పనిచేశారు. గోల్‌మాల్ విడుదల నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. ‘అజయ్, నేను చిన్నాప్పటినుంచీ మంచి మిత్రులం. దాంతో అతడి మూవీల్లో నటించేందుకు నాకెలాంటి ఇబ్బంది ఉండదు. అజయ్ హీరోగా నటించినా.. లేక దర్శకుడు, నిర్మాతగా ఇలా ఏ విధంగా పనిచేసినా సరే.. ఆయన మూవీల్లో ఛాన్సిస్తే కచ్చితంగా నటిస్తాను. గోల్‌మాల్ అగేయిన్ తర్వాత లవ్ రంజన్ నిర్మాతగా తెరకెక్కించనున్న లేటెస్ట్ మూవీలో అజయ్‌తో మరోసారి జతకట్టనున్నానంటూ’ టబు వివరించారు. పెళ్లి చేసుకునేందుకు నా కోసం ఓ అబ్బాయిని వెతికి పెట్టమంటూ అజయ్‌ని ఇప్పటికీ అడుగుతుంటానని గతంలో ఆమె సరదాగా చేసిన వ్యాఖ్యలు పెను దూమారం రేపిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment