golmaal again
-
మళ్లీ గోల్మాల్
న్యూజిల్యాండ్‌లో కరోనా వైరస్ ప్రభావం అదుపులోకి రావడంతో అక్కడి పరిస్థితులు మెల్లిగా గాడిలో పడుతున్నాయి. ఇటీవలే న్యూజిల్యాండ్‌లో ‘అవతార్’ సీక్వెల్స్ చిత్రీకరణను ప్రారంభించారు దర్శకుడు జేమ్స్ కామెరూన్. తాజాగా న్యూజిల్యాండ్‌లో థియేటర్స్ రీ ఓపెన్ కానున్నాయి. ఆ దేశంలో హిందీ చిత్రం ‘గోల్మాల్ ఎగైన్’ మళ్లీ విడుదల కానుంది. అజయ్ దేవగన్, పరిణీతీ చోప్రా, టబు, అర్షద్ వార్షి, తుషార్ కపూర్ ముఖ్యతారాగణంగా రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ఇది. ‘‘న్యూజిల్యాండ్‌లో మా ‘గోల్మాల్ ఎగైన్’ చిత్రం రీ–రిలీజ్ కానుంది. గురువారం నుంచి థియేటర్స్ ఓపెన్ చేస్తున్నారు. రీ ఓపెన్ అయిన మొదటి రోజు నుంచే మా చిత్రం విడుదల కావడం ఆనందంగా ఉంది. రీ ఓపెన్ తర్వాత న్యూజిల్యాండ్‌లో విడుదల కాబోతున్న తొలి హిందీ చిత్రం మాదే’’ అని పేర్కొన్నారు రోహిత్ శెట్టి. 20 అక్టోబర్ 2017లో విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టింది. -
మేకింగ్ ఆఫ్ మూవీ - గోల్మాల్ అగైన్
-
అతను చీటర్.. చీటర్.. చీటర్!
మూడు సార్లు ఇంత బలంగా చీటర్.. చీటర్... చీటర్ అని పరిణీతి చోప్రా చెబుతున్నారంటే.. అతనెవరో పెద్ద మోసమే చేసి ఉంటాడు. ఇంతకీ అతనెవరు? అంటే.. ఇంకెవరో కాదు. ఈ మధ్యే విడుదలైన ‘గోల్మాల్ ఎగైన్’ దర్శకుడు రోహిత్‌శెట్టి. అజయ్ దేవ్గన్, పరిణీతీ చోప్రా, టబు, అర్షద్ వార్షి ముఖ్య తారలుగా రూపొందిన ఈ చిత్రం బీ టౌన్ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను రాబట్టి, 200 కోట్ల క్లబ్‌లోకి చేరిన సంగతి తెలిసిందే. ఈ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తూ, షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని విశేషాలను పరిణీతి గుర్తు చేసుకున్నారు. అందులో రోహిత్ శెట్టితో ఆమె క్రికెట్ ఆడిన ఇన్సిడెంట్ ఒకటి. ఆ సమయంలో వీడియో కూడా తీశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న పరిణీతి లాంగ్ఆన్ షాట్ కొట్టారు. నాన్–స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న రోహిత్ శెట్టి ముందు రన్‌కు ట్రై చేసి, సడన్‌గా వెనక్కి వెళ్లారు. అక్కడితో ఆగకుండా మళ్లీ ట్రై చేయడంతో పరిణీతి చోప్రా రనౌట్ అయ్యారు. ఈ సీన్‌కు చిత్రబృందం అంతా నవ్వేశారు. దీంతో ‘మోసం.. మోసం.. అంతా మోసం’ అంటూ రోహిత్ శెట్టిపై సరదాగా అలిగారు పరిణీతి. ‘‘ రోహిత్ శెట్టి సార్ నన్ను చీట్ చేశారు. రనౌట్ అయ్యాను. ఆయన చీటర్.. చీటర్.. చీటర్’’ అని పరిణీతి పేర్కొన్నారు. -
ఆ దర్శకుడు నన్ను మోసం చేశాడు : హీరోయిన్
గోల్ మాల్ ఎగైన సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యూనిట్ సభ్యులు సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్రయూనిట్ కాళీ సమయాల్లో క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అలా హ్యాపీగా ఆడుకుంటున్న సమయంలో జరిగిన ఓ సరదా సంఘటన వీడియోను తన ట్విట్టర్ పేజ్ లో పోస్ట్ చేసిన హీరోయిన్ పరిణితీ చోప్రా ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. క్రికెట్ ఆడుతుండగా దర్శకుడు రోహిత్ శెట్టి తనను మోసం చేసి అవుట్ చేశాడని కామెంట్ చేసిన పరిణితీ చీటర్ చీటర్ చీటర్ అంటూ స్మైలీస్ ను జత చేసి ట్వీట్ చేసింది. నిజానికి ఆ సమయంలో రోహిత్ అవుట్ అయినా.. పరిణితీ అవుటైనట్టుగా చెప్పటంతో ఆమె సరదాగా ఈ కామెంట్స్ చేసింది. రోహిత్ శెట్టి స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన గోల్ మాల్ ఎగైన అక్టోబర్ 20న రిలీజ్ అయి ఇప్పటి వరకు 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. When Rohit sir cheated and got me out!!!! Cheater cheater cheaterr 😍🤣😍 #RohitShetty pic.twitter.com/jPGkA1IyOX — Parineeti Chopra (@ParineetiChopra) 18 November 2017 -
ప్చ్... బాహుబలిని మాత్రం బీట్ చెయ్యట్లేదు!
సాక్షి, సినిమా : బాలీవుడ్‌కు ఎట్టకేలకు కాస్త ఊరట లభించింది. ఈ యేడాది రెండు వందల కోట్లు వసూలు చేసిన తొలి హిందీ చిత్రంగా గోల్మాల్ అగెయిన్ నిలిచింది. ఆదివారం వసూళ్లతో ఈ మార్క్ చేరుకుందని సినీ ట్రేడ్ విశ్లేషకుడు తరన్ ఆదర్శ్ ట్విట్టర్లో తెలియజేశారు. తద్వారా వరుణ్ ధావన్ నటించిన జుద్వా-2 చిత్రాన్ని వెనక్కి నెట్టి గోల్మాల్ అగెయిన్ రెండో స్థానంలో నిలిచింది. ఇక 500 కోట్లకు పైగా వసూళ్లతో బాహుబలి ది కంక్లూజన్ మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. డబ్బింగ్ చిత్రంగా విడుదలైన బాహుబలి-2 ఎవరూ ఊహించని రేంజ్లో ప్రభంజనం సృష్టించగా... తర్వాత వచ్చిన సల్మాన్ ట్యూబ్‌లైట్, షారూఖ్ జబ్ హ్యారీ మెట్ సెజల్, అక్షయ్ కుమార్ టాయ్ లెట్ చిత్రాలు మ్యాజిక్ చేస్తాయని భావించినప్పటికీ అది జరగలేదు. దీంతో ఈ యేడాది కనీసం రెండు వందల కోట్ల క్లబ్లో కూడా ఏ చిత్రం చేరదేమోనని అంతా భావించారు. అయితే దీపావళికి రిలీజ్ అయిన గోల్మాల్ అగెయిన్‌కు అమీర్ ఖాన్ సీక్రెట్ సూపర్‌స్టార్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా 3500 స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం.. విదేశాల్లో 732 స్క్రీన్లలో రిలీజ్ అయి 46 కోట్లు రాబట్టింది. అజయ్ దేవగన్, టబు, పరిణితీ చోప్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి భారీ యాక్షన్ చిత్రాన్ని దర్శకుడు రోహిత్ శెట్టి డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. మొత్తానికి 200 కోట్లు రాబట్టి ఈ యేడాది ఇప్పటిదాకా హయ్యెస్ట్ వసూళ్లు రాబట్టిన హిందీ చిత్రంగా నిలిచింది. ఇక ఇప్పుడు అందరి కళ్లు సంజయ్ లీలా భన్సాలీ పద్మావతి చిత్రంపైనే ఉన్నాయి. -
హీరోకు అభిమాని 'వార్నింగ్'
ముంబై: భవిష్యత్తులో గోల్మాల్ సినిమా సిరీస్ తీస్తే కోర్టుకు లాగుతానని హీరో అజయ్ దేవగన్, దర్శకుడు రోహిత్ శెట్టికి ఓ అభిమాని వార్నింగ్ ఇచ్చాడు. అభిమాని వార్నింగ్ ఇవ్వడమేంటని అనుకుంటున్నారా? మీరు చదవింది నిజమే. దీపావళి కానుకగా అక్టోబర్ 20న విడుదలైన 'గోల్మాల్ ఎగైన్' సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఇప్పటికే రూ.150 కోట్లపైగా వసూళ్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో ఓ అభిమాని ట్విటర్లో సరదాగా వార్నింగ్ ఇచ్చాడు. 'భవిష్యత్తులో గోల్మాల్ సిరీస్ తెరకెక్కించడం ఆపకపోతే మీ అజయ్ దేవగన్, రోహిత్ శెట్టిపై దావా వేస్తాను. గోల్మాల్ ఎగైన్ టీమ్ కు ప్రేమతో' అని ట్వీట్ చేశాడు. ఈ సినిమా అభిమానులను విపరీతంగా నవ్విస్తుండటంతో అభిమాని ఈవిధంగా స్పందించాడు. అభిమాని వార్నింగ్ కు అజయ్ దేవగన్ అంతే సరదాగా జవాబిచ్చాడు. ప్రతి ఏడాది దీపావళికి గోల్మాల్ సిరీస్ విడుదల చేయాలన్న అభిమానులకు కూడా అతడు సమాధానాలిచ్చాడు. గోల్మాల్ ఎగైన్ విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. గోల్మాల్ సిరీస్‌లో వచ్చిన నాలుగో సినిమా ఇది. ఇందులో అజయ్ దేవగన్‌తో పాటు తుషార్ కపూర్, శ్రేయాస్ తల్పాడే, కునాల్ ఖేము, ప్రకాశ్ రాజ్, అర్షద్ వార్సి, నీల్‌నితిన్ ముఖేష్, టబు, పరిణీతి చోప్రా ముఖ్యపాత్రల్లో నటించారు. -
దుమ్మురేపుతున్న 'గోల్మాల్'.. రికార్డు కలెక్షన్స్!
రోహిత్ షెట్టీ, అజయ్ దేవగణ్ కాంబినేషన్లో వచ్చిన 'గోల్మాల్ అగైన్' బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. హర్రర్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వచ్చినప్పటికీ.. వసూళ్లు మాత్రం జోరుగా ఉన్నాయి. ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించింది. ఈ ఏడాది బాలీవుడ్‌కు పెద్దగా కలిసిరాలేదు. బాలీవుడ్ బడా స్టార్ల సినిమాలు బాక్సాఫీస్ వద్ద తడబడ్డాయి. ఈ క్రమంలో 'గోల్మాల్ అగైన్' ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, అజయ్-రోహిత్ కాంబో మరోసారి తమపై పెట్టుకున్న అంచనాలను నిలబెట్టుకుంది. 'గోల్మాల్' సిరీస్ మరో బంపర్ విజయాన్ని అందుకుంది. 'గోల్మాల్-3' తర్వాత నాలుగో పార్టు కూడా వరుసగా వందకోట్ల క్లబ్బులో చేరడం గమనార్హం. ఈ సినిమా తొలిరోజు శుక్రవారం రూ. 30.10 కోట్లు, శనివారం రూ. 28 కోట్లు, ఆదివారం రూ. 29.09 కోట్లు, సోమవారం రూ. 16.04 కోట్లు వసూలు చేసిందని, మొత్తంగా రూ. 103.64 కోట్లుసాధించిందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్లో వెల్లడించారు. సోమవారం సైతం ఈ సినిమా రూ. 16 కోట్లకుపైగా వసూలు చేయడం ట్రేడ్ పండితులను విస్మయపరుస్తోంది. థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న ఈ సినిమా మరింతగా వసూళ్లు రాబట్టే అవకాశముందని భావిస్తున్నారు. ఈ దీపావళి పండుగకు ఆమిర్ ఖాన్ 'సీక్రెట్ సూపర్ స్టార్', అజయ్ దేవగణ్ 'గోల్మాల్ అగైన్' పోటీపడ్డాయి. ఆమిర్ సినిమాకు పెద్ద ఎత్తున పాజిటివ్ మౌత్‌టాక్ వచ్చినప్పటికీ.. భారీ ఎత్తున విడుదలైన 'గోల్మాల్ అగైన్' ఊహించినట్టుగానే పెద్ద మొత్తంలో వసూళ్లు రాబడుతోంది. రోహిత్ షెట్టీ దర్శకత్వంలో గతంలో వచ్చిన 'గోల్మాల్' సిరీస్ సినిమాలు మంచి ప్రేక్షకాదరణ సాధించాయి. గత సినిమాలు సూపర్ హిట్ అయిన నేపథ్యంలో తాజాగా 'గోల్మాల్ అగైన్'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అజయ్ దేవ్‌గణ్, అర్షద్ వార్సీ, పరిణీత చోప్రా, తుషార్ కపూర్, టబు తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. -
ఆన్లైన్లో భారీ సినిమా లీక్!
ముంబై: మరో భారీ సినిమా పైరసీ బారిన పడింది. విడుదలైన మరుసటి రోజే ఈ సినిమా ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన రోహిత్‌శెట్టి సినిమా ‘గోల్మాల్ ఎగైన్’ పైరసీదారులకు చిక్కింది. అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ రాబట్టి అత్యధిక వసూళ్ల దిశగా దూసుకెళుతోంది. తొలిరోజే రూ. 30 కోట్లుపైగా కలెక్షన్లు రాబట్టింది. అయితే ఈ ఆనందం ఎంతసేపు నిలవలేదు. తర్వాతి రోజే మొత్తం సినిమా ఆన్లైన్లో వచ్చేసింది. కొన్ని వెబ్సైట్లలో ప్రింట్ బాగాలేదు. కాన్నీ వెబ్సైట్లలో హెచ్డీ ప్రింట్ ప్రత్యక్షం కావడంతో చిత్రయూనిట్ నివ్వెరపోయింది. పైరసీదారులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. గోల్మాల్ సిరీస్‌లో వచ్చిన నాలుగో సినిమా ఇది. ఇందులో అజయ్ దేవగణ్, తుషార్ కపూర్, శ్రేయాస్ తల్పాడే, కునాల్ ఖేము, ప్రకాశ్ రాజ్, అర్షద్ వార్సి, నీల్‌నితిన్ ముఖేష్, టబు, పరిణీతి చోప్రా ముఖ్యపాత్రల్లో నటించారు. కాగా, ఇంతకుముందు రాజ్‌కుమార్ రావు సినిమా ‘న్యూటన్’ కూడా పైరసీ బారినపడింది. ఈ సినిమా భారత్ తరపున ఆస్కార్‌కు నామినేటయింది. -
గోల్మాల్ అగైన్: తొలిరోజు దుమ్మురేపింది!
రోహిత్ షెట్టీ, అజయ్ దేవగణ్ కాంబినేషన్లో వచ్చిన 'గోల్మాల్ అగైన్' బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. హర్రర్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వచ్చినప్పటికీ.. వసూళ్లు మాత్రం జోరుగా ఉన్నాయని తెలుస్తోంది. తొలిరోజు ఈ సినిమా రూ. 33 కోట్ల భారీ వసూళ్లు రాబట్టింది. ఈ దీపావళి పండుగకు ఆమిర్ ఖాన్ 'సీక్రెట్ సూపర్ స్టార్', అజయ్ దేవగణ్ 'గోల్మాల్ అగైన్' పోటీపడ్డాయి. ఆమిర్ సినిమాకు పెద్ద ఎత్తున పాజిటివ్ మౌత్‌టాక్ వచ్చినప్పటికీ.. చిన్న సినిమాగా విడుదలైన 'సీక్రెట్ సూపర్‌స్టార్' తొలిరోజు రూ. 4.75 కోట్లు వసూలు చేసింది. రెండురోజు ఈ సినిమా వసూళ్లు గణనీయంగా పెరిగి రూ. 9 కోట్లు రాబట్టింది. మొత్తంగా తొలి రెండు రోజుల్లో సీక్రెట్ సూపర్‌స్టార్ రూ. 13 కోట్లు రాబట్టగా.. భారీ ఎత్తున విడుదలైన 'గోల్మాల్ అగైన్' ఊహించినట్టుగానే పెద్ద మొత్తంలో వసూళ్లు రాబడుతోంది. ఆమిర్ సినిమా రాకపోయి ఉంటే ఈ సినిమా తొలిరోజు రికార్డుస్థాయిలో రూ. 45 కోట్లు రాబట్టి ఉండేదని బాలీవుడ్ బాక్సాఫీస్ వర్గాలు చెప్తున్నాయి. రోహిత్ షెట్టీ దర్శకత్వంలో గతంలో వచ్చిన 'గోల్మాల్' సిరీస్ సినిమాలు మంచి ప్రేక్షకాదరణ సాధించాయి. గత సినిమాలు సూపర్ హిట్ అయిన నేపథ్యంలో తాజాగా 'గోల్మాల్ అగైన్'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు అనుగుణంగా ఈ సినిమా వసూళ్లు ఉన్నాయని బాలీవుడ్ ట్రేడ్ పండితులు చెప్తున్నారు. అజయ్ దేవ్‌గణ్, అర్షద్ వార్సీ, పరిణీత చోప్రా, తుషార్ కపూర్, టబు తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. -
ఆ హీరో మూవీకి ఎప్పుడూ నో చెప్పను!
న్యూఢిల్లీ : బాలీవుడ్ ప్రముఖ హీరో అజయ్ దేవగన్ వల్లే తాను పెళ్లి పెటాకులు లేకుండా ఉండిపోయానంటూ గతంలో ఎన్నోసార్లు చెప్పారు ప్రముఖ నటి టబు. అయితే అజయ్ దేవగన్‌తో నటించే అవకాశం వస్తే మాత్రం ఆ మూవీలో కచ్చితంగా నటిస్తానని, ఎట్టి పరిస్థిత్తుల్లోనూ అవకాశాలు వదుకునే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న గోల్మాల్ అగేయిన్ చిత్రంలో అజయ్, టబు నటించారు. ఈ శుక్రవారం ఆ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. విజయ్‌పథ్, తక్షక్, దృశ్యం వంటి అజయ్ దేవగన్ చిత్రాల్లో గతంలో నటించిన టబు గోల్మాల్ అగేయిన్లోనూ కలిసి పనిచేశారు. గోల్మాల్ విడుదల నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. ‘అజయ్, నేను చిన్నాప్పటినుంచీ మంచి మిత్రులం. దాంతో అతడి మూవీల్లో నటించేందుకు నాకెలాంటి ఇబ్బంది ఉండదు. అజయ్ హీరోగా నటించినా.. లేక దర్శకుడు, నిర్మాతగా ఇలా ఏ విధంగా పనిచేసినా సరే.. ఆయన మూవీల్లో ఛాన్సిస్తే కచ్చితంగా నటిస్తాను. గోల్మాల్ అగేయిన్ తర్వాత లవ్ రంజన్ నిర్మాతగా తెరకెక్కించనున్న లేటెస్ట్ మూవీలో అజయ్‌తో మరోసారి జతకట్టనున్నానంటూ’ టబు వివరించారు. పెళ్లి చేసుకునేందుకు నా కోసం ఓ అబ్బాయిని వెతికి పెట్టమంటూ అజయ్‌ని ఇప్పటికీ అడుగుతుంటానని గతంలో ఆమె సరదాగా చేసిన వ్యాఖ్యలు పెను దూమారం రేపిన సంగతి తెలిసిందే. -
ఛాన్స్ దొరికితే ఆయన అన్ని సినిమాల్లో నటిస్తా!
ముంబయి : ప్రియాంక చోప్రా సోదరిగా బాలీవుడ్లో అడుగుపెట్టిన పరిణీత చోప్రా కొన్ని సినిమాలతోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె లేటెస్ట్ గోల్మాల్ అగెయిన్. ఆ మూవీ దర్శకుడు రోహిత్ శెట్టిపై ఆమె తన అభిమానం చాటుకున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పరిణీతి చోప్రా మాట్లాడుతూ.. రోహిత్ ఛాన్సిస్తే ఆయన ప్రతి సినిమాలో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. నటీనటులతో పాటు సిబ్బందిని రోహిత్ చాలా జాగ్రత్తగా చూసుకుంటారని, అందుకే రోహిత్ అంటే తనకెంతో గౌరవమని పరిణీతి చోప్రా అన్నట్లు సమాచారం. అజయ్ దేవగన్, అర్షద్ వార్సీ, తుషార్ కపూర్, కరీనా కపూర్లు గోల్మాల్ ఫ్రాంచైజీలతో సందడి చేశారు. ప్రస్తుతం తనకు గోల్మాల్ లేటెస్ట్ మూవీలో నటించే అవకాశం కారణంగా సంబరాలు చేసుకుంటున్నట్లు బాలీవుడ్ టాక్. రోహిత్ తెరకెక్కించే సినిమాల్లో పనిచేయాలన్నది పరిణీతి కోరిక. అలాంటిది రోహిత్ 'గోల్మాల్ అగెయిన్'లో ప్రధానపాత్ర ఇవ్వడం తనకు దక్కిన గౌరవంగా పరిణీతి భావిస్తున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. గోల్మాల్ తాజా సిరీస్ షూటింగ్ ముగియడంతో పరిణీతి ఏదో కోల్పోయినట్లుగా కాస్త దిగాలుగా కనిపిస్తున్నారని ఆమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు. -
అదృశ్య శక్తుల విధ్వంసం
హ్యారీ పాప్‌కార్న్ చోరీ స్నీకీ టాడ్లర్ స్టీల్స్ ప్రిన్స్ హ్యారీస్ పాప్‌కార్న్ నిడివి: 1 ని. హిట్స్: 1,34,95,392 పిల్లలు స్నీకీగా భలే ముద్దు ముద్దు పనులు చేసేస్తుంటారు. స్నీకీగా అంటే.. దొంగచాటుగా! దొంగచాటు అని మనం అనుకుంటాం కానీ, నిజానికి వాళ్లు ఏ పనైనా దర్జాగానే చేసేస్తారు. ఈ వీడియోలో బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీ చేతిలో ఉన్న పాప్‌కార్న్ బకెట్లోంచి ఓ చిన్నారి.. పాప్‌కార్న్‌ని ఎలా లాగేస్తోందో మీరు చూసి తీరాల్సిందే. ‘ఇదిగో కాస్త పట్టుకుని కూర్చోవయ్యా’ అని, తన పాప్‌కార్న్ బకెట్‌నే ప్రిన్స్ చేతిలో పెట్టి, అందులోంచి తడవకు ఇంత తీసుకుంటున్నంత స్వతంత్రంగా ఆ పాప పాప్‌కార్న్‌ని లాగించేస్తోంది. రెండు మూడు ‘టేక్ అవే’ల తర్వాత ప్రిన్స్ గమనించి, ‘దిస్ ఈజ్ మైన్’ అని సరదాగా చేతిని వెనక్కు లాక్కున్నారు. వెంటనే మళ్లీ, తినమని ఆ చిన్నారికి చిన్న పీస్ ఆఫర్ చేశాడు. సెప్టెంబర్ 30న టొరంటో (కెనడా) స్టేడియంలో క్యాచ్ చేసిన ఈ స్నీకీ మోమెంట్‌ను ‘ది రాయల్ ఫ్యామిలీ ఛానెల్’ యూట్యూబ్‌లోకి అప్లోడ్ చేసింది. ‘ఇన్విక్టస్’ గేమ్స్ చివరి రోజు అది. ప్రిన్స్ హ్యారీ గ్యాలరీలో కూర్చొని ఆటల్ని చూస్తున్నారు. పక్కనే ఒక నస మేళం ఏదో చెబుతుంటే ‘ఊ’ కొడుతూ, పాప్‌కార్న్‌ని కరకరలాడిస్తూ స్టేడియంలోకి చూస్తున్నాడు. ప్రిన్స్‌కి ఇటువైపు ఆయన కుటుంబ స్నేహితురాలి ఒడిలోని పాపాయే మనం ఇంతవరకు మాట్లాడుకున్న స్నీకీ క్వీన్. ఆ చిన్నారి రెండు మూడు దఫాలుగా పాప్‌కార్న్ గుప్పెట పట్టేయడం.. యూట్యూబ్ వీక్షకుల్ని ఇప్పుడు పకపకలాడిస్తోంది. ‘ఇన్విక్టస్’ గేమ్స్ పారాలింపిక్స్ స్టెయిల్లో ఉంటాయి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్రీడాకారుల కోసం కోసం రాజప్రాసాదం 2014లో వీటిని ప్రారంభించింది. ఇన్విక్టస్ అనేది లాటిన్ మాట. 19వ శతాబ్దాంతపు ఆంగ్ల రచయిత విలియమ్ ఎర్నెస్ట్ హెన్లీ రాసిన ‘ఇన్విక్టస్’ కవిత నుంచి ఈ పదాన్ని తీసుకున్నారు. ఈ లాటిన్ మాటకు ‘జయించలేనిది’ అని అర్థం. ‘నా తల బద్దౖలñ రక్తం కారుతున్నా, నేను తలవాల్చను’ అంటాడు ఆ కవితలోని కథానాయకుడు. అదృశ్య శక్తుల విధ్వంసం ఎనాయిలేషన్ టీజర్ ట్రైలర్ నిడివి: 1 ని. 46 సె. హిట్స్: 53,37,914 నేటలీ బయాలజిస్టు. జెన్నిఫర్ సైకాలజిస్ట్. జీనా ఆంత్రోపాలజిస్టు. టెస్సా సర్వేయర్. త్యువా నవోతీ లిగ్విస్టు. ఈ ఐదుగురు మహిళలూ ఒక టాస్క్‌పై బయల్దేరుతారు. ఒక భయంకరమైన ఎక్స్ జోన్లోకి ప్రవేశిస్తారు. అది ఈ భూగోళాన్ని నాశనం చేసే జోన్. విధ్వంసం (ఎనాయిలేషన్) సృష్టించే జోన్. అక్కడ వీళ్లు ఒకళ్లనొకళ్లని కాపాడుకుంటూ టాస్క్ పూర్తి చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. వీళ్లకు ముందు 11 బృందాలు ఈ జోన్లోకి వెళ్లి రహస్యాలను ఛేదించే సాహసాలను చేస్తాయి. ఆ బృందాలలో కొందరు అకస్మాత్తుగా మాయమైపోతారు. కొందరికి పిచ్చి పడుతుంది. కొందరు ఆత్మహత్య చేసుకుంటారు. ఈ పన్నెండో టీమ్‌లోని నేటలీ.. అదృశ్యమైన తన భర్త జాడల్ని కనిపెట్టడానికి టీమ్‌లో చేరుతుంది. టీజర్లో ఒళ్లు గగొర్పొడిచే అమానవీయ ఆకృతులు, వికృత ఆకారాలు, ఏ జాతివో తెలియని జంతువులు కనిపిస్తాయి. ఊడలు దిగిన చెట్ల వంటి మనుషులు ఉంటారు. వాళ్లతో వీళ్ల పోరాటం. 2018 ఫిబ్రవరి 23న పిక్చర్ రిలీజ్. 49 ఏళ్ల అమెరికన్ రచయిత జెఫ్ వాండర్ మీర్ 2014లో రాసిన ‘ఎనాయిలేషన్’ నవల ఆధారంగా అదే పేరుతో వస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ హాలీవుడ్ మూవీ.. టీజర్‌ని బట్టి చూస్తే పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేలా ఉంది. స్వర్గలోకపు స్వీట్ లుక్ మైనే తుర్కో దేఖా గోల్మాల్ అగైన్ నిడివి: 2 ని. 42 సె. హిట్స్: 54,26,605 మళ్లీ ఓ ‘గోల్మాల్’ మూవీ వస్తోంది! అందులోని సాంగే ఈ.. ‘మైనే తుర్nుకో దేఖా’. నేను నిన్ను చూశానంటాడు అజయ్ దేవగణ్. పరిణీతి ఓ స్వీట్ లుక్ ఇస్తుంది. ‘.. నేను నా హృదయాన్ని నీ వైపు పారేసుకున్నాను. నువ్వు స్వర్గలోకపు కన్యవు. ఆ సంగతిని నా కళ్లు చెబుతున్నాయి..’ అని పాటను కంటిన్యూ చేస్తాడు. ఆ పాటే ఈ వీడియో సాంగ్. పిక్చరైజేషన్ కలర్ఫుల్గా ఉంది. తేయాకు తోటల మధ్య సాగే ఈ గుంపు పాటలో అంతా నేలపై డాన్స్ చేస్తున్న రంగురంగుల గాలిపటాల్లా ఉంటారు. తర్వాత ఈ గుంపు ఓపెన్ టాప్ బోగీలలో ఊరేగుతుంది. ‘గోల్మాల్ అగైన్’ చిత్రంలోని ఈ పాటకి యూత్ బాగా కనెక్ట్ అయినట్లే కనిపిస్తోంది, హిట్లను లెక్కేస్తుంటే! మొదటి మూడు గోల్మాల్ చిత్రాల సిరీస్‌ను డైరెక్ట్ చేసిన రోహిత్ శెట్టీనే దీనిని తీస్తున్నారు. ఫస్ట్ పిక్చర్ ‘గోల్మాల్: అన్లిమిటెడ్’ 2006లో వచ్చింది. తర్వాత 2008లో సెకండ్ మూవీ ‘గోల్మాల్ రిటర్న్’ రిలీజ్ అయింది. ‘గోల్మాల్ 3’ ని 2010లో తీశారు. ఫోర్త్ మూవీ.. ఈ అక్టోబర్ 20 న విడుదల కాబోతున్న ‘గోల్మాల్ అగైన్’. నిజానికి దీనిని 2013లోనే తీసుకురావాలనుకున్నారు. హీరోయిన్ను వెతకడంతోనే సరిపోయింది. చివరికి పరిణీతి ఫిక్స్ అయ్యారు. ఈ కామెడీ సీరీస్ అన్నింటిలోనూ అజయ్ దేవగణే హీరో! ఫ్రెండ్స్‌తో కలిసి ఓపెన్ ఎయిర్ గార్డెన్ పార్టీ చేసుకోవాలనుకుంటున్నవాళ్లకు మంచి థాట్ తెప్పించే సీన్ ఒకటి ఈ వీడియో చివర్లో ఉంది. ఎక్కడికైనా గంట లోపే! బి.ఎఫ్.ఆర్. ఎర్త్ టు ఎర్త్ నిడివి: 1 ని. 57 సె. హిట్స్: 21,88,162 న్యూయార్క్. ఉదయం 6 గం. 30 ని. ప్రయాణికులు ఒకరొకరుగా హడ్సన్ నది ఒడ్డున ఉన్న రాకెట్ స్టేషన్‌కు వెళ్లేందుకు పికప్ లాంచీకి చేరుకుంటున్నారు. రాకెట్ స్టేషన్ నుంచి వాళ్లంతా చైనాలోని షాంఘై వెళ్లాలి. అరగంటలో రాకెట్ బయల్దేరుతుంది. న్యూయార్క్‌కి, షాంఘైకి మధ్య దూరం 11,879 కి.మీ. ప్రయాణ సమయం 39 నిముషాలు! రాకెట్ కదా మరి. సరే.. ఈ పికప్ లాంచీ.. ప్రయాణికులను రాకెట్ స్టేషన్ దగ్గరకు తీసుకొచ్చింది. వాళ్లంతా రాకెట్లోకి ఎక్కి కూర్చున్నారు. రాకెట్ పైకి లేచింది. నింగిలోకి ఎగిసింది. భూవాతావరణాన్ని దాటి రయ్యిన దూసుకెళ్లింది. ఆ తర్వాత గమ్యస్థానం చేరుకోగానే నిట్టనిలువుగా షాంఘై రాకెట్ స్టేషన్లో దిగింది. వావ్!! అయితే ఈ అత్యద్భుతమైన, మహా వేగవంతమైన ప్రయాణ సౌకర్యానికి ఇంకా కొంత సమయం పడుతుంది. కొంత అంటే ఓ ఏడాది. ‘స్పేస్ ఎక్స్’ అనే కాలిఫోర్నియా సంస్థ ఈ ఎర్త్ టు ఎర్త్ మానవయాన రాకెట్లను తయారుచేస్తోంది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే.. భూమి మీద ఎక్కడి నుంచి ఎక్కడికైనా గంటలోపే చేరుకోవచ్చు. ఢిల్లీ టు న్యూయార్క్ అయితే అరగంటే. ఈ ప్రయాణం ఎలా ఉంటుందో ఐడియా కోసం స్పేస్ ఎక్స్.. శాంపిల్‌గా ఈ వీడియోను యూట్యూబ్‌లోకి టేక్ ఆఫ్ చేసింది. అన్నట్లు బి.ఎఫ్.ఆర్. అంటే బిగ్ ఫాల్కాన్ రాకెట్. దీని పీక్ కెపాసిటీ గంటకు 28 వేల కి.మీ.! -
తెలుగులో బాలీవుడ్ సీక్వల్
గోల్మాల్ సిరీస్‌లో ఇప్పటికే మూడు సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు రోహిత్ శెట్టి, త్వరలో నాలుగో సినిమాతో రాబోతున్నాడు. గోల్మాల్ ఎగైన్ పేరుతో తెరకెక్కిన ఈసినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో అజయ్ దేవగణ్, అర్షద్ వార్సీ, పరిణితి చోప్రా, తుషార్ కపూర్, ప్రకాశ్ రాజ్, టబులు లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ సినిమాతోనే టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే తెలుగు వారికి కూడా సుపరిచితమైన గోల్ మాల్ సిరీస్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీపావళి సందర్భంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాను ఒకేసారి హిందీ పాటు తెలుగులో కూడా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. -
గోల్మాల్ చేస్తున్న తమన్
అవునండీ... నిజమే తమన్ గోల్‌మాల్‌తో బాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ విషయాన్ని అయనే స్వయంగా చెప్పారు. గోల్మాల్ అంటే ఏదో జిమ్మిక్ అనుకునేరు. స్రై్టట్గా చెప్పాలంటే బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కించనున్న ‘గోల్మాల్ ఎగైన్’ చిత్రానికి తమన్ సంగీత దర్శకునిగా వ్యవహరించనున్నారు. ఈ చిత్రంలో అజయ్ దేవ్గన్, పరిణితి చోప్రా జంటగా నటిస్తున్నారు. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘సింగమ్ రిటర్న్స్’, ‘దిల్వాలే’ వంటి హిట్ చిత్రాలతోపాటు, బంపర్‌హిట్ ‘గోల్మాల్’ సిరీస్‌కు రోహిత్ శెట్టినే డైరెక్టర్. 2008లో మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన తమన్ మాస్ బీట్స్‌తో సౌత్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు. ‘గోల్మాల్ ఎగైన్’తో నార్త్‌లో కూడా నిరూపించుకుని, ఎగైన్ అండ్ ఎగైన్ అవకాశాలు తెచ్చుకుంటారేమో చూడాలి. -
టబు కన్ఫర్మ్ చేసిందోచ్!
ముంబై: మంచి అభినేత్రిగా టబుకు బాలీవుడ్లో చక్కని పేరుంది. 'చాందినీ బార్', 'హైదర్' లాంటి విమర్శకుల ప్రశంసలందుకున్న సినిమాల్లో నటించిన ఈ భామ.. సినీవర్గాలను విస్మయపరుస్తూ.. తాజాగా కామెడీ జానర్ సినిమాకు సై అంటూ పచ్చజెండా ఊపింది. రోహిత్ శెట్టీ పాపులర్ కామెడీ ఫ్రాంచెజీ 'గోల్మాల్'లో నటించేందుకు ఓకే చెప్పింది. 'గోల్మాల్' లెటెస్ట్ వెర్షన్లో ఎప్పటిలాగే అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తుండగా అతని సరసన పరిణీతి చోప్రా నటించబోతున్నది. ఈ సినిమాలో టబు ఓ కీలక పాత్ర పోషించబోతున్నది. 'గోల్మాల్' సిరీస్‌కు తాను పెద్ద అభిమానిని కావడంతో ఈ ఆఫర్ తనకు ముందుకు వచ్చినప్పుడు కాదనలేకపోయానని టబు తెలిపింది. 'ఈ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు నేను షాక్ తినలేదు. సర్ప్రైజ్ కాలేదు. 'గోల్మాల్' సిరీస్‌ను నేను బాగా ఇష్టపడతాను. ఇందులో భాగం కానుండటంతో ఎంతో ఆనందం కలిగిస్తోంది. అజయ్ (దేవగణ్) నా స్నేహితుడు. మిగతా చిత్రయూనిట్ కూడా నాకు తెలుసు. స్నేహితులతో కలిసి పనిచేయడం ఎప్పుడూ ఆనందమే కదా' అంటూ ఆమె ఓ దినపత్రికతో పేర్కొంది. ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యభరితమైన సీరియస్ పాత్రలు పోషించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టబు.. తనలో కామెడీ యాంగిల్ కూడా ఉందని, తనకు చాలా తొందరగా నవ్వు వస్తుందని పేర్కొంది.