గోల్ మాల్ ఎగైన సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యూనిట్ సభ్యులు సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్రయూనిట్ కాళీ సమయాల్లో క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అలా హ్యాపీగా ఆడుకుంటున్న సమయంలో జరిగిన ఓ సరదా సంఘటన వీడియోను తన ట్విట్టర్ పేజ్ లో పోస్ట్ చేసిన హీరోయిన్ పరిణితీ చోప్రా ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.
క్రికెట్ ఆడుతుండగా దర్శకుడు రోహిత్ శెట్టి తనను మోసం చేసి అవుట్ చేశాడని కామెంట్ చేసిన పరిణితీ చీటర్ చీటర్ చీటర్ అంటూ స్మైలీస్ ను జత చేసి ట్వీట్ చేసింది. నిజానికి ఆ సమయంలో రోహిత్ అవుట్ అయినా.. పరిణితీ అవుటైనట్టుగా చెప్పటంతో ఆమె సరదాగా ఈ కామెంట్స్ చేసింది. రోహిత్ శెట్టి స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన గోల్ మాల్ ఎగైన అక్టోబర్ 20న రిలీజ్ అయి ఇప్పటి వరకు 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
When Rohit sir cheated and got me out!!!! Cheater cheater cheaterr 😍🤣😍 #RohitShetty pic.twitter.com/jPGkA1IyOX
— Parineeti Chopra (@ParineetiChopra) 18 November 2017
Comments
Please login to add a commentAdd a comment