
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతీ చోప్రా డిజిటల్ ఎంట్రీ ఖరారైపోయింది. హిందీలో ఓ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌కు ఓకే చెప్పారామె. తాహిర్ రాజ్ బాసిన్, అనూప్ సోనీ, జెన్నిఫర్ వింగెట్, చైతన్య చౌదరి ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
‘రంగ్ దే బసంతి, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ వంటి సినిమాలకు రైటర్‌గా, ‘కుర్భాన్, అంగ్లీ’ సినిమాలకు దర్శకుడిగా పని చేసిన రెన్సిల్ డి. సిల్వా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సిద్ధార్థ్ పి. మల్హోత్రా, సప్నా మల్హోత్రా ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఆల్రెడీ చిత్రీకరణ మొదలైంది. సిమ్లా నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ఇది. ‘‘నా తొలి వెబ్ సిరీస్ చిత్రీకరణలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు పరిణీతి.