
అతిలోక సుందరి శ్రీదేవికి ఇద్దరు కూతుళ్లు. పెద్దమ్మాయి జాన్వీ కపూర్ హీరోయిన్ గా సెట్ అయిపోయింది. రెండో కూతురు ఖుషీ కపూర్ మాత్రం కష్టపడుతూనే ఉంది. ఇప్పటికే మూడు సినిమాలు చేయగా.. అవన్నీ డిజాస్టర్స్ అయ్యాయి. ఈమె లేటెస్ట్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.
(ఇదీ చదవండి: మోనాలిసాకి ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ అరెస్ట్)
రీసెంట్ టైంలో 'లవ్ యాపా' మూవీలో ఖుషీ కపూర్ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాతోనే ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. 'లవ్ టుడే' హిందీ రీమేక్ ఇది. కంటెంట్ మంచిదే కానీ ఖుషీ-జునైద్ ఇద్దరికి ఇద్దరు పసలేని యాక్టింగ్ చేయడంతో మూవీ డిజాస్టర్ అయింది. రూ.60 కోట్లు పెడితే రూ.10 కోట్ల వసూళ్లు వచ్చాయి.
ఇకపోతే లవ్ యాపా మూవీ ఏప్రిల్ 4 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. దాదాపు రెండు నెలల తర్వాత రిలీజ్ అవుతుంది. థియేటర్లలో రిలీజైనప్పుడే ఖుషీ నటనపై విమర్శలు వచ్చాయి. మరి ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఖుషీ యాక్టింగ్ ని ఇంకెంత ట్రోలింగ్ చేస్తారో?
(ఇదీ చదవండి: లంక మాజీ క్రికెటర్ తో 51 ఏళ్ల మలైకా డేటింగ్?)