Kushi kapoor
-
సైఫ్ అలీఖాన్ కుమారుడి తొలి సినిమా.. నేరుగా ఓటీటీలో రిలీజ్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) తనయుడు ఇబ్రహీం అలీఖాన్ నటుడిగా బిగ్ స్క్రీన్కు పరిచయం కాబోతున్నాడు. ఎంతోమంది స్టార్ కిడ్స్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) బ్యానర్లో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి నడానియన్ (Nadaaniyan) అన్న టైటిల్ ఖరారు చేశారు. దివంగత నటి శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో సునీల్ శెట్టి, దియా మీర్జా, జుగల్ హన్సరాజ్, మహిమా చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఓటీటీలో రిలీజ్ కానున్న ఫస్ట్ మూవీఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. అయితే రిలీజ్ ఎప్పుడన్నది చెప్పకుండా త్వరలోనే అంటూ సస్పెన్స్‌లో ఉంచింది. ఈ సినిమాతో షావునా గౌతమ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈయన 'రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ' సినిమాకు కరణ్ జోహార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు.ఇబ్రహీం..సైఫ్ అలీఖాన్, అతడి మాజీ భార్య అమృతా సింగ్ తనయుడే ఇబ్రహీం. మొదటి భార్యకు విడాకులిచ్చిన అనంతరం సైఫ్.. హీరోయిన్ కరీనా కపూర్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి తైమూర్, జెహంగీర్ అని ఇద్దరు కుమారులు సంతానం. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) చదవండి: అంకుల్ అనొద్దన్నాడు.. కావాలంటే అలా పిలవమన్నాడు: కీర్తి సురేశ్ -
ఈ హీరోయిన్ను చూస్తుంటే శ్రీదేవిని చూసినట్లే ఉంది: ఆమిర్ ఖాన్
ఆరంభం అదిరిపోతే ఆ కిక్కే వేరుంటుంది. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ (Junaid Khan) మహారాజ్ చిత్రంతో నటుడిగా పరిచయమయ్యాడు. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో గతేడాది విడుదలై ట్రెండింగ్‌లో నిలిచింది. తొలి సినిమానే సక్సెస్ సాధించాడని ప్రశంసలు సైతం అందుకున్నాడు. ప్రస్తుతం జునైద్.. లవ్యాపా మూవీ (Loveyapa Movie) చేస్తున్నాడు. ఇందులో దివంగత నటి శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. వీరిద్దరూ వెండితెరపై కనిపించబోయే తొలి చిత్రం ఇదే కావడం విశేషం!సాంగ్ రిలీజ్ఖుషి గతంలో ద ఆర్చీస్ అనే సినిమా చేసింది. కానీ ఇది కూడా నేరుగా ఓటీటీలోనే విడుదలైంది. ఇకపోతే లవ్యాపా నుంచి ఇటీవలే లవ్యాపా హో గయా అనే పాట రిలీజ్ చేశారు. ఇది చూసిన జనాలు పాట బాగుంది, కానీ ఈ లవ్‌ట్రాక్ మాత్రం కాస్త విచిత్రంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. అయితే జునైద్ తండ్రి, స్టార్ హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan).. పాట మాత్రమే కాదు సినిమా కూడా అదిరిపోయిందంటున్నాడు.శ్రీదేవిని చూసినట్లే ఉందితాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమిర్ మాట్లాడుతూ.. లవ్పాయా సినిమా రఫ్ కట్ చూశాను. మూవీ చాలా బాగుంది. వినోదాత్మకంగా ఉంది. నాకు నచ్చింది. సెల్ఫోన్ల వల్ల మన జీవితాలు ఎలా అయిపోతున్నాయి? ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయనేది చక్కగా చూపించారు. అందరూ బాగా నటించారు. సినిమాలో ఖుషిని చూస్తుంటే శ్రీదేవి (Sridevi) ని చూసినట్లే ఉంది. శ్రీదేవికి నేను పెద్ద అభిమానిని. ఆవిడ ఎనర్జీ నాకు అక్కడ కనిపించింది అని చెప్పుకొచ్చాడు.(చదవండి: శుభవార్త చెప్పిన హీరోయిన్.. పట్టలేనంత సంతోషం, కొంత నిరాశ!)మరీ ఇంత అబద్ధమాడాలా?ఇది చూసిన నెటిజన్లు ఖుషిని గొప్ప నటి శ్రీదేవితో పోల్చవద్దని వేడుకుంటున్నారు. ప్లీజ్ యార్.. మరీ ఇంత పెద్ద అబద్ధం చెప్పాల్సిన పని లేదు, పిల్లలపై ప్రేమతో ఏదైనా అనేస్తావా?.. అని పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు. లవ్యాపా విషయానికి వస్తే.. తమిళ హిట్ మూవీ లవ్ టుడేకు ఇది రీమేక్‌గా తెరకెక్కింది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించగా ఫాంటమ్ స్టూడియోస్, ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 7న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. మరి ఈ కొత్త హీరోహీరోయిన్లను ప్రజలు ఏమేరకు ఆదరిస్తారో చూడాలి!ఖుషి అక్క ఆల్రెడీ సత్తా చాటుతోంది!ఇప్పటికే ఖుషి అక్క జాన్వీ కపూర్ బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా రాణిస్తోంది. సౌత్‌లో దేవర మూవీతో కుర్రాళ్ల మనసులో గిలిగింతలు పెట్టింది. రామ్చరణ్తోనూ ఓ సినిమా చేస్తోంది. ఈ ముద్దుగుమ్మల తల్లి శ్రీదేవి అతిలోక సుందరిగా ప్రేక్షకల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకుంది.గొప్ప నటి శ్రీదేవితెలుగులో కార్తీకదీపం, ప్రేమాభిషేకం, ఆఖరి పోరాటం, జగదేకవీరుడు అతిలోక సుందరి వంటి చిత్రాలతో అలరించింది. దక్షిణాది చిత్రాలతో పాటు హిందీలోనూ అగ్రకథానాయికగా స్టార్డమ్ సంపాదించుకుంది. 2013లో శ్రీదేవిని భారతీయ ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అయితే 2018లో ఆమె ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయింది. చదవండి: సంధ్య థియేటర్ ఘటన: శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్ -
పెళ్లి కూతురి కంటే అందంగా.. హల్దీ వేడుకల్లో జాన్వీకపూర్ సిస్టర్!
-
అంబానీ గ్రాండ్ వెడ్డింగ్ : అక్క అలా, చెల్లి ఇలా, కపూర్ సిస్టర్స్ సందడే సందడి
-
దివ్య భారతి అందాల విందు.. అషూ రెడ్డి ఎప్పటిలానే అలా!
పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న దివ్య భారతిపరువాలన్నీ చూపిస్తూ అషూరెడ్డి అందాల జాతరకుందనపు బొమ్మలా తమిళ బ్యూటీ దివ్య దురైస్వామిచీరలో నవ్వులు చిందిస్తున్న 'బిగ్ బాస్' అలేఖ్య హారికనైట్ డ్రస్సులో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన పూనమ్ బజ్వాఅక్కకి ఏ మాత్రం తగ్గకుండా ఖుషి కపూర్ అందాల రచ్చ View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Priyanka Sahajananda (@impriyankasahajananda) View this post on Instagram A post shared by Olivia (@oliviakmorris) View this post on Instagram A post shared by Mallika Sherawat (@mallikasherawat) View this post on Instagram A post shared by Vaidehi Parashurami (@parashuramivaidehi) View this post on Instagram A post shared by Aashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushi05k) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Dhivya Duraisamy (@dhivya__duraisamy) View this post on Instagram A post shared by Megha Chowdhury (@megha.chowdhury) View this post on Instagram A post shared by Priya Reddy ♥️ (@sreepriya__126) View this post on Instagram A post shared by Tina Datta (@tinadatta) View this post on Instagram A post shared by Shanvi Srivastava (@shanvisri) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Chaithra J Achar (@chaithra.j.achar) View this post on Instagram A post shared by Prashun Prashanth Sridhar (@prachuprashanth) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) -
శ్రీదేవి డాటర్స్ దూకుడు...!
-
సినిమాల్లోకి ఖుషి కపూర్.. చెల్లికి నా సలహా ఇదే: జాన్వీ కపూర్
దివంగత అతిలోకసుందరి, నటి శ్రీదేవి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియన్ సినిమాను ఏలిన నటి ఆమె. శ్రీదేవి భర్త బోనీ కపూర్ ప్రముఖ నిర్మాత అన్నది తెలిసిందే. ఈయన తమిళంలో అజిత్ కథానాయకుడిగా నేర్కొండ పార్త్వె, వలిమై తదితర చిత్రాలను నిర్మించారు. తాజాగా అజిత్ హీరోగా నిర్మిస్తు న్న తుణివు చిత్రం సంక్రాంతికి విడుదలకు ముస్తాబవుతోంది. కాగా వీరి వారసురాలిగా జాన్వీ కపూర్ బాలీవుడ్లో కథానాయకిగా రంగప్రవేశం చేసిన విషయం తెలిసిందే. చదవండి: మరోసారి మాజీ ప్రియుడితో సుష్మితా, నటిపై నెటిజన్ల అసహనం తొలి చిత్రంలోనే నటిగా ప్రశంసలు అందుకున్న జాన్వీ కపూర్ మంచి నటిగా ఎదిగే ప్రయత్నంలో ఉంది. అయితే ఈమెలో నటించగల సత్తా ఉన్నా ఎందుకనో గ్లామర్ పైనే ఎక్కువగా దృష్టి పెడుతోంది. సామాజిక మాధ్యమాల్లో తరచూ తన గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేస్తూ వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తోంది. కాగా జాన్వీ కపూర్‌ను దక్షిణాది సినిమాకు పరిచయం చేయాలని చాలామంది దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె కూడా సౌత్ సినిమాల్లో నటించాలన్న ఆసక్తిని పలుమార్లు వ్యక్తం చేసింది. అలాంటి రోజు ఇంకా ఆమెకు రాలేదు. అయితే దక్షిణాదిలో సక్సెస్ సాధించిన చిత్రాల హిందీ రీమేక్‌లలో జాన్వీ కపూర్ నటిస్తుండడం విశేషం. చదవండి: సర్ధార్ సక్సెస్ మీట్: నాగార్జున అన్న సపోర్ట్‌ని మర్చిపోలేను: హీరో కార్తీ అలా మలయాళ చిత్రం హె లెన్ హిందీ రీమేక్‌లో, తమిళంలో నయనతార నటించిన కొలమావు కో కిల చిత్ర రీమేక్‌లోనూ నటించి ప్రశంసలు అందుకుంది. కాగా తాజాగా ఈమె సోదరి ఖుషీ కపూర్ కూడా హీరోయిన్గా బాలీవుడ్లో పరిచయం కావడానికి సిద్ధమవుతోంది. దీంతో చెల్లెలికి ఏమైనా సలహాలు సూచనలు, ఇచ్చారా? అన్న ప్రశ్నకు జాన్వీ బదులిస్తూ నటుడిని ప్రేమించవద్దని సలహా ఇచ్చినట్లు చెప్పింది. అలాగే ముందుగా నీ గౌరవం ఏమిటి? అన్నది తెలుసుకోమని, అదే నిన్ను ముందుకు నడిపిస్తుందని చెప్పానంది. సినిమా నటి అయిన తరువాత పలువురు పలు రకాలుగా విమర్శలు చేస్తారని, వాటిని అస్సలు పట్టించుకోవద్దని సలహా ఇచ్చినట్లు నటి జాన్వీ కపూర్ పేర్కొంది. -
బాలీవుడ్ బిగ్ స్టార్స్ వారసులంతా ఒకే ఫ్రేమ్‌లో..
బాలీవుడ్ బిగ్ ఫ్యామిలీస్ వారసులు అగస్త్యా నంద (అమితాబ్ బచ్చన్ మనవడు), ఖుషీ కపూర్ (బోనీ కపూర్ – దివంగత నటి శ్రీదేవిల చిన్న కుమార్తె), సుహానా ఖాన్ (షారుక్ ఖాన్ కుమార్తె) నటిస్తున్న తొలి వెబ్ ఫిల్మ్ ‘ద ఆర్చీస్’ పోస్టర్ విడుదలైంది. జోయా అక్తర్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ మూవీలో మిహిర్ అహుజా, డాట్, యువరాజ్ మెండా కూడా నటిస్తున్నారు. శనివారం ‘ద ఆర్చీస్’ గ్యాంగ్ ఇదే అని ప్రకటించి, ఫొటోని రిలీజ్ చేశారు. 2023లో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వెబ్ ఫిల్మ్ స్ట్రీమింగ్ కానుంది. The sun is out, the news is out! Come meet your new friends. Presenting to you the cast of The Archies, directed by the fantastic Zoya Akhtar. pic.twitter.com/vOtm29V0gP — Netflix India (@NetflixIndia) May 14, 2022 View this post on Instagram A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) -
శ్రీదేవి చిన్నకూతురు ఖుషీ కపూర్ ఫోటోలు
-
త్వరలోనే శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ!
అలనాటి అందాల తార శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్లో హీరోయిన్గా రాణిస్తుంది. మరోవైపు శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా సినిమాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. విదేశాలలో ఇటీవలే చదువు పూర్తి చేసుకుని వచ్చిన ఖుషీ కపూర్ ఇప్పుడు సినిమాల్లో రాణించాలని భావిస్తోందట. తండ్రి బోనీకపూర్ కూడా ఆమెను వెండితెరకి పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. మొదట బాలీవుడ్ మూవీతో ఎంట్రీ ఇవ్వాలని భావించినా తండ్రి బోనీ కపూర్ మాత్రం తెలుగు సినిమాతో అరంగేట్రం చేయించాలని చూస్తున్నారట. ఇందుకోసం ఇప్పటికే ఖుషీ కపూర్ యాక్టింగ్‌లో శిక్షణ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల కానున్నట్లు సమాచారం. ఇక ఇంతకుముందే జాన్వీ కపూర్ సైతం టాలీవుడ్లో నటించనుందనే వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్- మహేష్‌బాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమాతో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఇవి కేవలం పుకార్లే అని తేలిపోయింది. ఇప్పటికే ఆ సినిమాలో పూజా హెగ్డేను ఫైనల్ చేశారు. మరో హీరోయిన్ ఎవరు అన్న దానిపై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. చదవండి : శ్రీదేవి నాకు రోల్‌మోడల్ : ప్రియంక చోప్రా బెదిరింపులు రావడంతో చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన యాంకర్ -
అవును ఖుషీ ఎంట్రీ త్వరలోనే: బోనీ కపూర్
ముంబై: అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. కూతురిని హీరోయిన్గా చూడాలన్నది శ్రీదేవి కోరిక. అనుకున్నట్లుగానే పెద్ద కూతురిని హీరోయిన్గా వెండితెరకు పరిచయం చేసింది శ్రీదేవి. ఇక తాజాగా ఆమె రెండో కూతురు ఖుషీ కపూర్ కూడా త్వరలో నటిగా ఏంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఖుషీ ఎప్పుడు వెండి తెరపై కనిపిస్తుందా అని శ్రీదేవి అభిమానులంతా ఆసక్తిగా ఎదురుస్తున్నారు. ఈ క్రమంలో ఆమె త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందంటూ కొంతకాలంగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఖుషీ తండ్రి, నిర్మాత బోనీ కపూర్ సైతం త్వరలోనే ఖుషీ నటిగా ఆరంగ్రేట్రం చేయనుందని స్పష్టం చేశాడు. అయితే ఖుషీని మొదట పరిచయం చేసేది మాత్రం తాను కాదని పేర్కొన్నాడు. ఓ ఇంటర్య్వూలో బోనీ కపూర్ మాట్లాడుతూ.. ‘ఖుషీని సినిమాల్లో పరిచయం చేయడానికి నా దగ్గర అన్ని వనరులు ఉన్నాయి. (చదవండి: ఆ విషయంలో నన్ను ఎక్కిరించేవారు: ఖుషీ కపూర్) అయితే తనని మాత్రం మొదట పరిచయం చేసే వ్యక్తిని నేను కాదు. ఓ నిర్మాతగా నాకు, నటిగా తనకు ఇది మంచిది కాదు. ఎందుకంటే ఓ తండ్రిగా ఖుషీ తన సొంతంగా ఎదగాలని కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. అంతేగాక ఖుషీ కూడా సోషల్ మీడియాలో వరుసగా తన ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తుండటంతో ఆమె ఎంట్రీ తర్వలోనే ఉందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రైవసీలో ఉన్న తన ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్‌ను తాజాగా ఖుసీ పబ్లిక్ చేసింది. అనంతరం హాట్ హాట్ ఫోటోలను పంచుకోవడం ప్రారంభించింది. అవి చూసిన ఆమె ఫాలోవర్స్, నెటిజన్లు వెండితెరపై కనిపించేందుకు ఖుషీ సిద్దమైందని, ఆమె ఎంట్రీ త్వరలోనే ఉండనుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ఖుషీ లండన్‌లో ఫిలీం స్కూల్లో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటుందని, త్వరలోనే తను నటిగా మీ ముందుకు వస్తుందని పలు ఇంటర్య్వూలో జాన్వీ కూడా చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. (చదవండి: మా పిల్లలు ప్రతిభావంతులు) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushi05k) -
అందరికీ నెగటివ్... ఆల్ హ్యాపీ
కరోనా పరీక్షల్లో నెగటివ్ వచ్చిందని తెలిపారు ప్రముఖ నిర్మాత బోనీకపూర్. ఇటీవల బోనీకపూర్ ఇంటి సిబ్బందిలో ముగ్గురికి కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో బోనీ అండ్ ఫ్యామిలీ 14 రోజులు హోమ్ క్వారంటైన్లో ఉండాల్సి వచ్చింది. ఈ క్వారంటైన్ పీరియడ్ ముగిసిందని తెలిపారు బోనీకపూర్. ‘‘మా 14 రోజుల హోమ్ క్వారంటైన్ పూర్తయింది. కరోనా బారిన పడి, ట్రీట్మెంట్ చేయించుకున్న మా ఇంటి సిబ్బందిలో ఉన్న ముగ్గురికి కూడా ఇప్పుడు కరోనా పరీక్షల్లో నెగటివ్ వచ్చింది. అలాగే నేను, నా కుమార్తెలు (జాన్వీకపూర్, ఖుషీకపూర్) పరీక్ష చేయించుకుంటే నెగటివ్ వచ్చింది. ఇతర సిబ్బందికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. అందరికీ నెగటివ్ వచ్చింది. ఆల్ హ్యాపీ. ఇక మా డైలీ లైఫ్‌ను ఫ్రెష్‌గా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. అలాగే కరోనా సోకి క్వారంటైన్లో ఉన్నవారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ సూచనలను అందరూ పాటించాలి. కరోనా కట్టడి కోసం పోరాడుతున్న డాక్టర్స్, ఇతర హెల్త్‌కేర్ వర్కర్స్, ముంబై పోలీసులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు బోనీకపూర్. -
ఆ విషయంలో నన్ను ఎక్కిరించేవారు: ఖుషీ కపూర్
ముంబై: శ్రీదేశి, బోనికపూర్‌ల ముద్దుల తనయ ఖుషి కపూర్ తాను బాధపడిన విషయాల గురించి, అభద్రతకు లోనైన సంఘటనలకు సంబంధించి ఒక భావోద్వేగమైన వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. క్వారంటైన్ టేప్స్ పేరుతో తన వీడియోలను తన ఎకౌంట్లో ఖుషి పోస్ట్ చేస్తోంది. ఈ వీడియోలో ఖుషి తాను ఒక 19 యేళ్ల అమ్మాయిని అంటూ తనని తాను పరిచయం చేసుకుంది. తాను ఇప్పుడు కనిపిస్తున్నట్లు లేనని తాను పరిపక్వత చెందాను అని తెలిపింది. ఇంకా మాట్లాడుతూ... ‘నేను ఎలా ఉండాలనుకున్నానో అలా లేను, దాని కోసం నేను ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంటుంది. నేను ఏం చేయకపోయిన చాలా మంది నన్ను పొగుడుతూ ఉంటారు. నేను వారిని సంతోషపరచడానికి ఏదో ఒకటి చేయగలను’ అని పేర్కొంది. (ఆ రియాక్షన్ మాకు ఆక్సిజన్) ఆ తరువాత తనకి చాలా సిగ్గు, బిడియం ఎక్కువ అని ఆ కారణంగా తను చాలా సార్లు అవమానాలు ఎదుర్కొన్నానని పేర్కొంది. తనను అమ్మ(హీరోయిన్ శ్రీదేవి)లాగా , అక్క జాన్వీ కపూర్ లాగా లేవంటూ చాలా మంది ఎక్కిరించేవారని కూడా తెలిపింది. అది మానసికంగా తనని చాలా ఇబ్బందులకు గురిచేసిందని తెలిపింది. దీంతో తినే పద్దతిని, డ్రెస్సింగ్ స్టైల్‌ని కూడా మార్చుకున్నట్లు తెలిపింది. ఇక వీడియో చివరిలో ఇటువంటి అన్నింటి కారణంగా తనని తాను ప్రేమించడం నేర్చుకున్నానని తెలిపింది. తాను ఎలా ఉన్నా, తన రంగు ఎలా ఉన్నప్పటికి తనని తాను ఇష్టపడటం అలవాటు చేసుకున్నట్లు చెప్పింది. ఇతరుల గురించి పక్కన పెట్టి మీరు ఏం చేయాలనుకున్నారో అదే చేయండి. తరువాత మిమ్మల్ని అందరూ వాళ్లంతట వారే మెచ్చుకుంటారు అంటూ ఖుషి తన వీడియోని ముగించింది. (సహాయం కోసం వేలం) -
ఖుషీ కపూర్‌ని సాగనంపుతూ.. బోనీ ఉద్వేగం
అతిలోక సుందరి, దివంగత బాలీవుడ్ నటి శ్రీదేవి కుటుంబానికి సంబంధించిన ప్రతీవార్త వైరల్‌గా మారుతుంది. ముఖ్యంగా శ్రీదేవి ముద్దుల కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్లకు సంబంధించిన వార్తలు తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తికనబరుస్తుంటారు. శ్రీదేవి మరణం తరువాత వీరికి సంబంధించిన వార్తలు మీడియాలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తండ్రి బోనీ కపూర్ కూడా తరుచూ కుమార్తెలతో కలిసి పబ్లిక్ ఫంక్షన్స్‌కు వస్తుండటంతో మీడియా వారికి కావాల్సినంత కవరేజ్ ఇస్తోంది. ఇప్పటికే జాన్వీ వెండితెర అరంగేట్రం ఘనంగా జరిగింది. ఆమె లుక్స్, నటనకు అభిమానులు మంచి మార్కులే వేశారు. తాజాగా జాన్వీ చెల్లెలు, ఖుషీ కూడా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా నటనలో శిక్షణ పొందేందుకు విదేశాలకు పయనమయ్యారు. అయితే చిన్న కూతురుని విదేశాలకు సాగనంపుతూ తండ్రి బోనీ కపూర్ ఉద్వేగానికి లోనయ్యారు. ఎయిర్‌పోర్ట్‌లో ఆమెకు సెండాఫ్ ఇస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఖుషీ న్యూయార్క్ ఫిలిం అకాడమిలో యాక్టింగ్ కోర్స్ చేసేందుకు అమెరికా వెళ్లారు. ఆమెకు వీడ్కోలు పలికేందుకు బోనీ తో పాటు.. ఆయన తమ్ముడి( సంజయ్ కపూర్) భార్య మహీప్ కపూర్, వారి కూతురు షానయా కపూర్లు ముంబై ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. ఎయిర్‌పోర్ట్‌లో వీరంతా కలిసి దిగిన సెల్పీ ఫోటోను మహీప్ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కాగా ఖుషీ గతంలోనే ఓ ఇంటర్వ్యూలో ‘న్యూయార్క్ వెళ్లి యాక్టింగ్ నేర్చుకొని.. ఆ తర్వాత తనకు నచ్చిన వృత్తిని ఎంచుకుంటాని’ తెలిపారు. ఇటీవల జాన్వీ, ఖుషీలు సింగపూర్‌లో ఏర్పాటు చేసిన తన తల్లి శ్రీదేవి మైనపు బొమ్మను సందర్శించి, ఆ బొమ్మను తాకి ఉద్వేగానికి గురైన విషయం తెలిసిందే. ఖుషీ గతంలో మోడలింగ్ వైపు వెళ్తుందని బోని తెలిపారు. కానీ ప్రస్తుతం ఖుషీ మోడలింగ్ కంటే యాక్టింగ్పైనే ఎక్కువగా ఆసక్తి చూపుతోందని తెలుస్తోంది. ఇప్పటికే బోని పెద్ద కుమార్తె జాన్వి కపూర్, కొడుకు అర్జున్ కపూర్లు సినిమాలతో బిజీగా ఉన్నారు. అర్జున్ కపూర్ అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహిస్తున్న‘పానిపట్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. జాన్వీ కపూర్.. గుంజన్ సక్సెస్ బయోపిక్‌లో నటిస్తున్నారు. -
ఆర్యన్, ఖుషీల ఆన్‌స్క్రీన్ ఎంట్రీ
ముంబై : దిగ్గజ నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కరణ్ జోహార్ నిర్మించిన ధడక్ మూవీతో బాలీవుడ్లో అడుగుపెట్టగా తాజాగా జాన్వీ సోదరి ఖుషీ సైతం వెండితెరపై తళుక్కున మెరిసేందుకు సిద్ధమైంది. బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌తో కలిసి తొలిమూవీలో ఖషీ కపూర్ ఆడిపాడనుంది. వీరిద్దరి ఆన్‌స్ర్కీన్ ఎంట్రీకి సరైన కథ కోసం చిత్ర మేకర్లు తలమునకలైనట్టు సమాచారం. కరణ్ జోహార్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు ముందుకొచ్చారని, ఈ మేరకు ఖుషీ గ్రాండ్ లాంఛ్ బాధ్యత తనకు అప్పగించాలని బోనీ కపూర్‌ను కోరినట్టు సమాచారం. ఈ కాంబినేషన్ సెట్ అయితే బాలీవుడ్లో క్రేజీ మూవీగా మారుతుందని భావిస్తున్నారు. అయితే ఈ మూవీపై ఇంతవరకూ అధికారిక ప్రకటన వెలువడలేదు. శ్రీదేవి చిన్న కుమార్తె, షారూక్ పెద్ద కుమారుడు జోడీగా తొలి చిత్రం తెరకెక్కుతున్నదనే వార్తలు బాలీవుడ్లో ఆసక్తికరంగా మారాయి. -
వైరల్ అవుతున్న బోని కుమార్తెల సెల్ఫీ
అతిలోక సుందరి శ్రీదేవి మరణం తరువాత బోనీ కపూర్ ఫ్యామిలీ చాలా మార్పులే వచ్చాయి. అప్పటి వరకు ఎడమొహం పెడమొహంగా ఉంటూ వచ్చిన బోని కపూర్ మొదటి భార్య మోనా శౌరి కపూర్, శ్రీదేవీ బిడ్డలు ఇప్పుడు కలిసి పోయారు. శ్రీదేవీ మరణం తర్వాత మొదటి భార్య సంతానం అన్షులా, అర్జున్ కపూర్లు, తమ చెల్లెలు జాహ్నవి కపూర్, ఖుషీ కపూర్లకు తోడుగా నిలుస్తూ వస్తున్నారు. చెల్లలను ఎవరు ఏమన్నా.. అసలు సహించకుండా.. వెంటనే వారికి అర్జున్,అన్షులాలు తగిన రీతిలో బుద్ధి చెబుతున్నారు. ఇటీవలే జాహ్నవి కపూర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ‘ధడక్’ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఆ సమయాన కూడా జాన్హవి కపూర్‌కు, అర్జున్, అన్షులాలు ప్రేమతో శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం బోని కుమార్తెలందరూ కలిసి అందమైన నగరం లండన్‌లో విహరిస్తున్నారు. ధడక్ షూటింగ్ పూర్తయి, విడుదల కాబోతున్న తరుణంలో, ఇప్పుడు దొరికిన కాస్త విరామ సమయాన్ని జాహ్నవి లండన్‌లో సోదరీమణులు అన్షులా, ఖుషీలతో గడుపుతోంది. ఈ విహార యాత్రకు సంబంధించిన ఫోటోలు తాజాగా ఇంటర్నెట్ను బ్రేక్ చేస్తున్నాయి. తమ మధ్య ఉన్న అనుబంధం ఉట్టిపడేటా ఉన్న ఓ సెల్ఫీని బోనీ పెద్ద కుమార్తె అన్షులా కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. అన్షులా, జాహ్నవి, ఖుషీలతో పాటు ఈ సెల్ఫీలో బాలీవుడ్ నిర్మాత రాజ్‌కుమార్ సంతోషి కూతురు తనీషా సంతోషి కూడా ఉంది. శ్రీదేవీ మరణించిన అనంతరం బోనీకి మాత్రమే సపోర్టుగా నిలువకుండా.. ఇటు చెల్లెల సాధకబాదకాలను అర్జున్, అన్షులాలు పట్టించుకుంటూ.. వారిని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా చేస్తుండటంతో, బోనీ ఎంతో సంతోషిస్తున్నారు. అన్షులా పోస్టు చేసిన లండన్ వెకేషన్ ఫోటో... -
మొబైల్ వాల్‌పేపర్‌గా అమ్మ ఫొటో.. వైరల్!
శ్రీదేవీ హఠాన్మరణం కపూర్ ఫ్యామిలీని, ముఖ్యంగా ఆమె కుమార్తెలు జాన్వి కపూర్, ఖుషీ కపూర్లను తీవ్ర విషాదంలోకి నెట్టివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే వారు ఈ విషాదం నుంచి కోలుకుంటూ.. కాస్త స్నేహితులతో సమయాన్ని గడుపుతున్నారు. ఖుషీ తాజాగా ఆమె ఫ్రెండ్‌తో కలిసి ముంబై సిటీ అంతా తిరిగారట. ఇదే సమయంలో ముంబైలోని సబ్అర్బన్ రెస్టారెంట్‌కి ఖుషీ వెళ్లారు. అక్కడకు వెళ్లిన ఖుషీ ఫోన్లో, ఆమె అభిమానులు ఒక స్పెషల్ ఫోటోను గుర్తించారట. అదే ఖుషీ వాల్‌పేపర్. శ్రీదేవీ తనని భుజాలపై ఎత్తుకుని ఉన్న ఫోటోను ఖుషీ తన వాల్‌పేపర్‌గా పెట్టుకున్నారట. ఈ ఫోటోను చూసిన వారి కళ్లన్నీ చెమ్మగిల్లుతున్నాయి. శ్రీదేవీ మరణించకముందు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తన కూతుర్ల గురించి ఎప్పుడూ ప్రస్తావిస్తూనే ఉండేవారు. ఖుషీతో, జాన్వితో తనకున్న అనుబంధం, వారి చిలిపి చేష్టలు వంటివి పంచుకునేవారు. ఖుషీ ఒక ఇండిపెండెంట్, స్ట్రాంగ్ అని, తన భవిష్యత్ గురించి తను ఆలోచించుకోగలదని శ్రీదేవి పలుమార్లు అన్నారు. శ్రీదేవీ పెద్ద కూతురు జాన్వి, ప్రస్తుతం తన బాలీవుడ్ మూవీ ధడక్‌ను పూర్తి చేసుకున్నారు. మరాఠి బ్లాక్‌బస్టర్ సైరాత్‌కు ఇది రిమేక్. కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జూలైలో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. -
శ్రీవారి సన్నిధిలో సినీతార శ్రీదేవి
ప్రముఖ సినీనటి శ్రీదేవి గురువారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. రాత్రి నైవేద్య విరామ సమయంలో శ్రీదేవి తన చిన్న కుమార్తె ఖుషి కపూర్, సోదరి మహేశ్వరితో కలిసి వైకుంఠం క్యూ ద్వారా ఆలయంలోకి వెళ్లారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని అనంతరం వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సినీనటి కావటంతో ఆలయం వెలుపల శ్రీదేవిని చూడటానికి భక్తులు పోటీపడ్డారు. - తిరుమల