మొబైల్‌ వాల్‌పేపర్‌గా అమ్మ ఫొటో.. వైరల్‌! | Khushi Kapoor Phone Wallpaper Is Of Mom Sridevi | Sakshi
Sakshi News home page

ఖుషీ వాల్‌పేపర్‌గా స్పెషల్‌ ఫోటో, వైరల్‌

Published Tue, May 1 2018 12:13 PM | Last Updated on Mon, Jun 11 2018 1:36 PM

Khushi Kapoor Phone Wallpaper Is Of Mom Sridevi - Sakshi

శ్రీదేవీ హఠాన్మరణం కపూర్‌ ఫ్యామిలీని, ముఖ్యంగా ఆమె కుమార్తెలు జాన్వి కపూర్, ఖుషీ కపూర్‌లను తీవ్ర విషాదంలోకి నెట్టివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే వారు ఈ విషాదం నుంచి కోలుకుంటూ.. కాస్త స్నేహితులతో సమయాన్ని గడుపుతున్నారు. ఖుషీ తాజాగా ఆమె ఫ్రెండ్‌తో కలిసి ముంబై సిటీ అంతా తిరిగారట. ఇదే సమయంలో ముంబైలోని సబ్‌అర్బన్‌ రెస్టారెంట్‌కి ఖుషీ వెళ్లారు. అక్కడకు వెళ్లిన ఖుషీ ఫోన్‌లో, ఆమె అభిమానులు ఒక స్పెషల్ ఫోటోను గుర్తించారట. అదే ఖుషీ వాల్‌పేపర్‌. 

శ్రీదేవీ తనని భుజాలపై ఎత్తుకుని ఉన్న ఫోటోను ఖుషీ తన వాల్‌పేపర్‌గా పెట్టుకున్నారట. ఈ ఫోటోను చూసిన వారి కళ్లన్నీ చెమ్మగిల్లుతున్నాయి. శ్రీదేవీ మరణించకముందు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తన కూతుర్ల గురించి ఎప్పుడూ ప్రస్తావిస్తూనే ఉండేవారు. ఖుషీతో, జాన్వితో తనకున్న అనుబంధం, వారి చిలిపి చేష్టలు వంటివి పంచుకునేవారు. ఖుషీ ఒక ఇండిపెండెంట్, స్ట్రాంగ్‌ అని, తన భవిష్యత్ గురించి తను ఆలోచించుకోగలదని శ్రీదేవి పలుమార్లు అన్నారు. శ్రీదేవీ పెద్ద కూతురు జాన్వి, ప్రస్తుతం తన బాలీవుడ్‌ మూవీ ధడక్‌ను పూర్తి చేసుకున్నారు. మరాఠి బ్లాక్‌బస్టర్‌ సైరాత్‌కు ఇది రిమేక్‌. కరణ్‌ జోహార్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జూలైలో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement