wallpaper
-
ప్రస్తుతం ఇంట్లో గోడలకు.. ట్రెండ్‌గా మారిన వాల్‌పేపర్ డిజైన్స్..!
భారతీయ కళా సంస్కృతుల నుంచి ప్రేరణ పొందిన వాల్‌పేపర్ డిజైన్స్, అలనాటి ఐశ్వర్యాన్ని నేడు కళ్ల ముందు నిలిపినట్లు అనిపించకమానదు. ఈ వాల్పేపర్స్లోని ప్రతి డిజైన్ ఒక కళాఖండంలా ఉంటుంది. ఈ వాల్పేపర్లు ఇంటి ఆకర్షణను ఇనుమడింపజేస్తాయి.ఒకప్పటి మొఘల్ రాజభవనాల వైభవాలు, రాజస్థానీ ప్రకృతి దృశ్యాలతో కూడిన వాల్పేపర్లు; వాటికి తోడుగా రోమన్ థీమ్, యురోపియన్ శైలితో ఉండే వాల్పేపర్లను ప్రజలు ఇష్టపడుతున్నట్టు చెబుతున్నారు ‘లైఫ్ ఎన్ కలర్’ నిర్వాహకురాలు అపూర్వ శర్మ.పరిశోధనతో ప్రారంభం..‘మధ్యయుగ కాలంలో భారతీయ కళారూపాలు, భారతీయ పురాణ గాథల చిత్రాలతో çకూడిన డిజైన్లు ఇటీవలి కాలంలో ట్రెండ్‌గా మారాయి. జనాల అభిరుచిలోని మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఈ డిజైన్లను వీలైనంత కొత్తగా రూపొందిస్తుంటాం’ అని చెబుతారామె.పెయింటింగ్స్ మరిపించేలా..భారతీయ పురాణాల చిత్రాలతో పాటు ఆధునిక అలంకరణలను అనుసరించి పేస్టల్ కలర్స్‌తో సృష్టించిన డిజైన్లను ఎంచుకోవచ్చు. ఆకర్షణీయమైన కథలను వివరించే డిజైన్లను ఎంచుకోవచ్చు. గోడలపైన సాధారణంగా పురాణాలు, ఇతిహాసాలు, చారిత్రక డిజైన్లను పెయింటింగ్స్‌లో చూస్తుంటాం. అయితే, ఈ డిజైన్లతో కూడిన వాల్పేపర్లు ఇంటిగోడలకు మరింతగా వన్నె తేగలవని ఇంటీరియర్ డెకరేషన్ నిపుణులు చెబుతున్నారు.ఇవి చదవండి: గర్భవతులు మరింత బరువు పెరిగితే..? -
ఆ ఫోటో వాడితే ఫోన్ క్రాష్..
ఓ వాల్‌పేపర్ వల్ల ఆండ్రాయిడ్ ఫోన్లు క్రాష్ అవుతుందంటూ గత కొద్ది రోజులుగా సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫొటోను వాల్‌పేపర్‌గా పెట్టుకుంటే.. తమ మొబైల్స్ స్క్రీన్‌లాక్ దానంతటదే ఆన్ అవడం, వెంటనే ఆఫ్ అవడం జరుగుతోందని ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు ఫిర్యాదు చేశారు. మోంటానాలోని హిమానీనద జాతీయ ఉద్యానవనంలోని సెయింట్ మేరీ సరస్సు ఫోటో ఇది. ఈ క్రమంలో ఈ ఫోటో తీసిన వ్యక్తి ప్రస్తుతం తెర మీదకు వచ్చారు. గౌరవ్ అగర్వాల్ అనే శాస్త్రవేత్త, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్ 2009, ఆగస్టులో దీనిని తీశారు. ఫోటో షేరింగ్ సైట్ ‘ఫ్లికర్’లో అప్లోడ్ చేశారు. అయితే ఈ మధ్య కాలంలో ఈ ఫోటోను వాల్‌పేపర్‌గా వాడిన ఆండ్రాయిడ్ ఫోన్లు వాటంతట అవే ఆన్, ఆఫ్ కావడం.. క్రాష్ అవ్వడం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అగర్వాల్ ఈ ఫోటో, దాని వెనక ఉన్న కథను తెలియజేశారు. ఈ సందర్భంగా అగర్వాల్ మాట్లాడుతూ.. ‘ఎవరి ఫోన్ పాడు చేయాలనే ఉద్దేశంతో ఈ ఫోటో తీయలేదు. ఈ ఫోటో వల్ల ఇలాంటి ఇబ్బంది ఎదురవుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగేవరకు నాకు దీని గురించి తెలియదు. నికాన్ కెమెరాతో ఈ ఫోటో తీశాను. తరువాత 'లైట్‌రూమ్' అనే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి దాన్ని ఎడిట్ చేశాను. అయితే ఫోటోను ఎక్స్ప్లోర్ చేయడానికి నేను ఎంచుకున్న కలర్ మోడ్.. ఇప్పటి ఆండ్రాయిడ్ ఫోన్లకు అనుకూలంగా లేదు’ అని తెలిపాడు. అంతేకాక ‘ఇక ఇప్పటి నుంచి నేను మరొక ఫార్మాట్ ఉపయోగించబోతున్నాను. ఈ ఫోటోలో ఏమీ తప్పు లేదు, కాని ఇది ఎల్ఆర్ నుండి ప్రోఫోటోఆర్‌జీబీ ఫార్మాట్లో ఎక్స్ప్లోర్ చేశాను. అందుకే ఈ ఫోటో ఆండ్రాయిడ్ ఫోన్‌కు అనుకూలంగా లేదు’ అని అగర్వాల్ అన్నారు. ఈ వాల్ పేపర్ సమస్య పెద్దది కావడంతో ఈ నెల 11న దీనికి సంబంధించి ఓ అప్డేట్ను విడుదల చేయనున్నట్లు సామ్సంగ్ ప్రకటించింది. దీనిపై ఓ నిపుణుడు మాట్లాడుతూ.. సదరు ఫొటో ఆర్జీబీ(RGB) కలర్ ఫార్మాట్లో ఉందని, ఆండ్రాయిడ్ ప్రఫర్డ్ ఎస్‌ఆర్‌జీబీలో లేకపోవడం వల్లే ఇలా జరుగుతుండొచ్చని చెప్పారు -
మొబైల్ వాల్‌పేపర్‌గా అమ్మ ఫొటో.. వైరల్!
శ్రీదేవీ హఠాన్మరణం కపూర్ ఫ్యామిలీని, ముఖ్యంగా ఆమె కుమార్తెలు జాన్వి కపూర్, ఖుషీ కపూర్లను తీవ్ర విషాదంలోకి నెట్టివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే వారు ఈ విషాదం నుంచి కోలుకుంటూ.. కాస్త స్నేహితులతో సమయాన్ని గడుపుతున్నారు. ఖుషీ తాజాగా ఆమె ఫ్రెండ్‌తో కలిసి ముంబై సిటీ అంతా తిరిగారట. ఇదే సమయంలో ముంబైలోని సబ్అర్బన్ రెస్టారెంట్‌కి ఖుషీ వెళ్లారు. అక్కడకు వెళ్లిన ఖుషీ ఫోన్లో, ఆమె అభిమానులు ఒక స్పెషల్ ఫోటోను గుర్తించారట. అదే ఖుషీ వాల్‌పేపర్. శ్రీదేవీ తనని భుజాలపై ఎత్తుకుని ఉన్న ఫోటోను ఖుషీ తన వాల్‌పేపర్‌గా పెట్టుకున్నారట. ఈ ఫోటోను చూసిన వారి కళ్లన్నీ చెమ్మగిల్లుతున్నాయి. శ్రీదేవీ మరణించకముందు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తన కూతుర్ల గురించి ఎప్పుడూ ప్రస్తావిస్తూనే ఉండేవారు. ఖుషీతో, జాన్వితో తనకున్న అనుబంధం, వారి చిలిపి చేష్టలు వంటివి పంచుకునేవారు. ఖుషీ ఒక ఇండిపెండెంట్, స్ట్రాంగ్ అని, తన భవిష్యత్ గురించి తను ఆలోచించుకోగలదని శ్రీదేవి పలుమార్లు అన్నారు. శ్రీదేవీ పెద్ద కూతురు జాన్వి, ప్రస్తుతం తన బాలీవుడ్ మూవీ ధడక్‌ను పూర్తి చేసుకున్నారు. మరాఠి బ్లాక్‌బస్టర్ సైరాత్‌కు ఇది రిమేక్. కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జూలైలో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. -
చంద్రన్న కానుకలో మూడే సరుకులు!
5 వేలకు పైగా రేషన్‌కార్డులు గల్లంతు వాకాడు :రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సంక్రాంతి పురస్కరించుకుని చంద్రన్న కానుకగా ఉచితంగా అందిస్తామన్న ఆరు సరుకులకు గాను మూడే సరుకులే అందాయి. నిరుపేద తెల్లరేషన్ కార్డుదారులందరికీ అరకేజీ బెల్లం, అర లీటరు పామాయిల్, 100గ్రా. నెయ్యి, అరకిలో కందిపప్పు, కిలో ముడి శనగలు, కిలో గోధుమ పిండి ఉచితంగా ఈ నెల 12 తేదీ లోపల పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే రేషన్‌షాపులకు కేజీ గోధుమపిండి, అర కేజీ పామాయిల్, కేజీ ముడిశనగలు మాత్రమే వచ్చాయి. వాకాడు, కోట, చిట్టమూరు మండలాలకు సంబంధించి వాకాడులో ఉన్న ఎంఎల్ఎస్ పాయింట్‌కి మూడు సరుకులు మాత్రమే రావడం, పండగ దగ్గరకు రావడంతో వాటిని మూడు మండలాల్లోని 96 రేషన్ షాపులకు తరలిస్తున్నారు. వాస్తవానికి ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలో సుమారు 45 వేలకు పైగా తెల్లరేషన్ కార్డుదారులు ఉండగా చంద్రన్న సంక్రాంతి కానుక కోసం రూపొం దించిన నూతన జాబితాలో 39,929 మంది పేర్లు మాత్రమే ఉన్నాయి. సుమారు 5 వేలకు పైగా తెల్ల రేషన్‌కార్డు దారుల పేర్లు గల్లంతయ్యాయి. ఈ విషయమై సంబంధిత డిప్యూటీ తహశీల్దార్‌ను సంప్రదించగా మళ్లీ ఆధార్, రేషన్‌కార్డు జెరాక్స్‌లు అందజేస్తే ఆన్లైన్ చేస్తామని తెలిపారు. అయితే తిరిగి జాబితాలో వస్తే రావచ్చు, రాకపోవచ్చునని అంటున్నారు. -
తిరుపతిలో వీడియో వాల్
నేరాల అదుపునకు పోలీసుల కృషి 135 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు 24 గంటలూ నిఘా పది రోజుల్లోనే వీటి ఏర్పాటు తిరుపతి క్రైం: పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరం ఇక నిఘా నీడలోకి వెళ్లనుంది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నగరంలో ఇటీవల నేరాలు పెరగడం పోలీసులను ఆందోళనకు గురిచేస్తోంది. వీటికి కళ్లెం వేయడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ కోసం దేశ రాజధానిలో అనుసరిస్తున్న వీడియో వాల్ విధానం అమలు చేసేందుకు అర్బన్ జిల్లా పోలీసులు కృషి చేస్తున్నారు. ఆ మేరకు జిల్లా ఎస్పీ ఎస్వీ.రాజశేఖర్‌బాబు బుధవారం రాత్రి నగరంలో నిఘా కెమెరాలు ఏర్పాటు చేసేందుకు అనుకూలమైన ప్రాంతాలను గుర్తించారు. రాత్రంతా ఆయన నగరంలో సంచరిస్తూ ఎక్కడెక్కడ కెమెరాలు ఏర్పాటు చేయాలనే అంశంపై నగర పోలీసులతో చర్చించారు. గురువారం ఉదయం తన కార్యాలయంలో వీడియోవాల్కు అవసరమైన సాంకేతిక పరిజ్ఞాన నిపుణులతో సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. పది రోజుల్లోనే ఈ వ్యవస్థ అమల్లోకి వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒక్క ఢిల్లీలో మాత్రమే.. ప్రస్తుతం ఈ తరహా విధానం దేశంలో ఒక్క ఢిల్లీ మెట్రో నగరంలోనే అమల్లో ఉంది. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ నిర్భయ కేసులో నిందితులను త్వరగా గుర్తించేందుకు వీడియోవాల్ పోలీసులకు సహకరించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారీ వ్యయంతో కూడుకున్నదైనప్పటికీ ఈ విధానం తిరుపతిలో ప్రవేశపెట్టేందుకు ఎస్పీ చొరవ తీసుకుంటున్నారు. నగరంలో ఇటీవల నేరాలు పెరిగిపోతున్నాయి. దాంతోపాటు హత్య కేసులు కూడా నమోదవుతున్నాయి. ఈ కేసుల్లో త్వరితగతిన దర్యాప్తు చేసేందుకు వీడియో పుటేజ్ సహరిస్తుందని పోలీసులు భావిస్తున్నారు. వీడియోవాల్తో నేరాల నియంత్రణ ఇప్పటికే నగరంలో ట్రాఫిక్ పోలీసులు 30 కేంద్రాల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే వీటి వల్ల పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. దీని పర్యవేక్షణ సరిగా లేకపోవడమే ఇందుకు కారణంగా చెప్పాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో వీడియోవాల్ వ్యవస్థ వైపు అధికారులు మొగ్గు చూపుతున్నారు. ఈస్ట్ పోలీస్‌స్టేషన్ భవనంలోని మూడో అంతస్తులో దీనికి సంబంధించిన యంత్రాలు అమర్చేందుకు ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ భవనాన్ని కూడా ఎస్పీ రాజశేఖర్ పరిశీలించారు. ఈస్ట్ డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి, ఈస్ట్ సీఐ మురళీధర్‌రెడ్డి టెక్నికల్ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో అర్బన్ ఎస్పీ వీడియోవాల్ ఏర్పాట్లపై సమీక్షించారు. మొత్తానికి పోలీసులు తీసుకుంటున్న చర్యలు భవిష్యత్తులో నగరంలో నేరాల నియంత్రణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సహకరిస్తాయని ఆశిస్తున్నారు. 24 గంటలూ పరిశీలన.. రోజులో 24 గంటలు వీడియోవాల్‌ను పరిశీలించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమిస్తున్నారు. సంఘటనలు జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తం కావడంతో పాటు, వీడియోవాల్ కేంద్రం నుంచి ఇచ్చే సమాచారం కూడా ఎప్పటికప్పుడు అధికారులకు అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా సంబంధిత స్టేషన్లలోని అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేసి నేరాల నియంత్రణకు దృష్టి సారించే అవకాశం ఉంది.