
ముంబై : దిగ్గజ నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కరణ్ జోహార్ నిర్మించిన ధడక్ మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టగా తాజాగా జాన్వీ సోదరి ఖుషీ సైతం వెండితెరపై తళుక్కున మెరిసేందుకు సిద్ధమైంది. బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌తో కలిసి తొలిమూవీలో ఖషీ కపూర్ ఆడిపాడనుంది. వీరిద్దరి ఆన్‌స్ర్కీన్ ఎంట్రీకి సరైన కథ కోసం చిత్ర మేకర్లు తలమునకలైనట్టు సమాచారం.
కరణ్ జోహార్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు ముందుకొచ్చారని, ఈ మేరకు ఖుషీ గ్రాండ్ లాంఛ్ బాధ్యత తనకు అప్పగించాలని బోనీ కపూర్‌ను కోరినట్టు సమాచారం. ఈ కాంబినేషన్ సెట్ అయితే బాలీవుడ్‌లో క్రేజీ మూవీగా మారుతుందని భావిస్తున్నారు. అయితే ఈ మూవీపై ఇంతవరకూ అధికారిక ప్రకటన వెలువడలేదు. శ్రీదేవి చిన్న కుమార్తె, షారూక్ పెద్ద కుమారుడు జోడీగా తొలి చిత్రం తెరకెక్కుతున్నదనే వార్తలు బాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment