'నేను మాత్రమే లాంచ్ చేయగలను'
బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్, ప్రొడ్యూసర్ కం డైరెక్టర్ కరణ్ జోహార్‌ల స్నేహం గురించి అందరికీ తెలిసింది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ ఘనవిజయం సాధించాయి. అంతేకాదు, కరణ్ పలు సందర్భాల్లో షారూఖ్ తన కుటుంబం కంటే ఎక్కవ అంటూ ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు ఇదే ప్రేమతో మరో ప్రకటన చేశాడు కరణ్. షారూఖ్ విషయంలోనే కాదు ఆయన వారసుడి విషయంలో కూడా తాను బెస్ట్ అంటున్నాడు.
'షారూఖ్ తో నా రిలేషన్ చాలా క్లోజ్, ఇప్పుడా రిలేషన్ అతని వారసులతోనూ కంటిన్యూ చేస్తున్నా. షారూఖ్ కొడుకు ఆర్యన్‌ను హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నాడు. నేను తప్ప ఆర్యన్‌ని ఇంకెవరూ లాంచ్ చేయలేరు' అంటూ షారూఖ్ తో తనకున్న సాన్నిహిత్యాన్ని వివరించాడు. ప్రస్తుతం లండన్‌లో ఉన్నత చదువులు అభ్యసిస్తున్న ఆర్యన్, అప్పుడప్పుడు సినిమా ఫంక్షన్స్ లో దర్శనిమిస్తుంటాడు. కరణ్ జోహర్ లాంచ్ చేసిన నటులు మంచి స్టార్లుగా ఎదుగుతుండటంతో షారూఖ్ కూడా తన వారసుడి లాంచింగ్‌కు కరణ్ నే సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ కనిపిస్తోంది.