
న్యూజిల్యాండ్‌లో కరోనా వైరస్ ప్రభావం అదుపులోకి రావడంతో అక్కడి పరిస్థితులు మెల్లిగా గాడిలో పడుతున్నాయి. ఇటీవలే న్యూజిల్యాండ్‌లో ‘అవతార్’ సీక్వెల్స్ చిత్రీకరణను ప్రారంభించారు దర్శకుడు జేమ్స్ కామెరూన్. తాజాగా న్యూజిల్యాండ్‌లో థియేటర్స్ రీ ఓపెన్ కానున్నాయి. ఆ దేశంలో హిందీ చిత్రం ‘గోల్‌మాల్ ఎగైన్’ మళ్లీ విడుదల కానుంది. అజయ్ దేవగన్, పరిణీతీ చోప్రా, టబు, అర్షద్ వార్షి, తుషార్ కపూర్ ముఖ్యతారాగణంగా రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ఇది. ‘‘న్యూజిల్యాండ్‌లో మా ‘గోల్‌మాల్ ఎగైన్’ చిత్రం రీ–రిలీజ్ కానుంది. గురువారం నుంచి థియేటర్స్ ఓపెన్ చేస్తున్నారు. రీ ఓపెన్ అయిన మొదటి రోజు నుంచే మా చిత్రం విడుదల కావడం ఆనందంగా ఉంది. రీ ఓపెన్ తర్వాత న్యూజిల్యాండ్‌లో విడుదల కాబోతున్న తొలి హిందీ చిత్రం మాదే’’ అని పేర్కొన్నారు రోహిత్ శెట్టి. 20 అక్టోబర్ 2017లో విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టింది.
Comments
Please login to add a commentAdd a comment