
ముంబై: భవిష్యత్తులో గోల్‌మాల్ సినిమా సిరీస్ తీస్తే కోర్టుకు లాగుతానని హీరో అజయ్ దేవగన్, దర్శకుడు రోహిత్ శెట్టికి ఓ అభిమాని వార్నింగ్ ఇచ్చాడు. అభిమాని వార్నింగ్ ఇవ్వడమేంటని అనుకుంటున్నారా? మీరు చదవింది నిజమే. దీపావళి కానుకగా అక్టోబర్ 20న విడుదలైన 'గోల్‌మాల్ ఎగైన్' సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఇప్పటికే రూ.150 కోట్లపైగా వసూళ్లు రాబట్టింది.
ఈ నేపథ్యంలో ఓ అభిమాని ట్విటర్‌లో సరదాగా వార్నింగ్ ఇచ్చాడు. 'భవిష్యత్తులో గోల్‌మాల్ సిరీస్ తెరకెక్కించడం ఆపకపోతే మీ అజయ్ దేవగన్, రోహిత్ శెట్టిపై దావా వేస్తాను. గోల్‌మాల్ ఎగైన్ టీమ్ కు ప్రేమతో' అని ట్వీట్ చేశాడు. ఈ సినిమా అభిమానులను విపరీతంగా నవ్విస్తుండటంతో అభిమాని ఈవిధంగా స్పందించాడు.
అభిమాని వార్నింగ్ కు అజయ్ దేవగన్ అంతే సరదాగా జవాబిచ్చాడు. ప్రతి ఏడాది దీపావళికి గోల్‌మాల్ సిరీస్ విడుదల చేయాలన్న అభిమానులకు కూడా అతడు సమాధానాలిచ్చాడు. గోల్‌మాల్ ఎగైన్ విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. గోల్‌మాల్ సిరీస్‌లో వచ్చిన నాలుగో సినిమా ఇది. ఇందులో అజయ్ దేవగన్‌తో పాటు తుషార్ కపూర్, శ్రేయాస్ తల్పాడే, కునాల్ ఖేము, ప్రకాశ్ రాజ్, అర్షద్ వార్సి, నీల్‌నితిన్ ముఖేష్, టబు, పరిణీతి చోప్రా ముఖ్యపాత్రల్లో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment