
ముంబై: మరో భారీ సినిమా పైరసీ బారిన పడింది. విడుదలైన మరుసటి రోజే ఈ సినిమా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన రోహిత్‌శెట్టి సినిమా ‘గోల్‌మాల్ ఎగైన్’ పైరసీదారులకు చిక్కింది. అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ రాబట్టి అత్యధిక వసూళ్ల దిశగా దూసుకెళుతోంది. తొలిరోజే రూ. 30 కోట్లుపైగా కలెక్షన్లు రాబట్టింది. అయితే ఈ ఆనందం ఎంతసేపు నిలవలేదు. తర్వాతి రోజే మొత్తం సినిమా ఆన్‌లైన్‌లో వచ్చేసింది. కొన్ని వెబ్‌సైట్లలో ప్రింట్ బాగాలేదు. కాన్నీ వెబ్‌సైట్లలో హెచ్‌డీ ప్రింట్ ప్రత్యక్షం కావడంతో చిత్రయూనిట్ నివ్వెరపోయింది. పైరసీదారులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది.
గోల్‌మాల్ సిరీస్‌లో వచ్చిన నాలుగో సినిమా ఇది. ఇందులో అజయ్ దేవగణ్, తుషార్ కపూర్, శ్రేయాస్ తల్పాడే, కునాల్ ఖేము, ప్రకాశ్ రాజ్, అర్షద్ వార్సి, నీల్‌నితిన్ ముఖేష్, టబు, పరిణీతి చోప్రా ముఖ్యపాత్రల్లో నటించారు. కాగా, ఇంతకుముందు రాజ్‌కుమార్ రావు సినిమా ‘న్యూటన్’ కూడా పైరసీ బారినపడింది. ఈ సినిమా భారత్ తరపున ఆస్కార్‌కు నామినేటయింది.
Comments
Please login to add a commentAdd a comment