మూడు సార్లు ఇంత బలంగా చీటర్.. చీటర్... చీటర్ అని పరిణీతి చోప్రా చెబుతున్నారంటే.. అతనెవరో పెద్ద మోసమే చేసి ఉంటాడు. ఇంతకీ అతనెవరు? అంటే.. ఇంకెవరో కాదు. ఈ మధ్యే విడుదలైన ‘గోల్‌మాల్ ఎగైన్’ దర్శకుడు రోహిత్‌శెట్టి. అజయ్ దేవ్‌గన్, పరిణీతీ చోప్రా, టబు, అర్షద్ వార్షి ముఖ్య తారలుగా రూపొందిన ఈ చిత్రం బీ టౌన్ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను రాబట్టి, 200 కోట్ల క్లబ్‌లోకి చేరిన సంగతి తెలిసిందే. ఈ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తూ, షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని విశేషాలను పరిణీతి గుర్తు చేసుకున్నారు.
అందులో రోహిత్ శెట్టితో ఆమె క్రికెట్ ఆడిన ఇన్సిడెంట్ ఒకటి. ఆ సమయంలో వీడియో కూడా తీశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న పరిణీతి లాంగ్‌ఆన్ షాట్ కొట్టారు. నాన్–స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న రోహిత్ శెట్టి ముందు రన్‌కు ట్రై చేసి, సడన్‌గా వెనక్కి వెళ్లారు. అక్కడితో ఆగకుండా మళ్లీ ట్రై చేయడంతో పరిణీతి చోప్రా రనౌట్ అయ్యారు. ఈ సీన్‌కు చిత్రబృందం అంతా నవ్వేశారు. దీంతో ‘మోసం.. మోసం.. అంతా మోసం’ అంటూ రోహిత్ శెట్టిపై సరదాగా అలిగారు పరిణీతి. ‘‘ రోహిత్ శెట్టి సార్ నన్ను చీట్ చేశారు. రనౌట్ అయ్యాను. ఆయన చీటర్.. చీటర్.. చీటర్’’ అని పరిణీతి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment