parineethi chopra
-
యానిమల్ రిజెక్ట్ చేసినందుకు బాధగా లేదు: పరిణితి చోప్రా
సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన 'యానిమల్' సినిమాలో హీరోయిన్గా మొదట పరిణితీ చోప్రాను అనుకున్నారు. కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో ఈ అవకాశం రష్మిక మందన్నా చేతికి వెళ్లింది. అయితే ఈ మూవీ వద్దనడానికి గల కారణాన్ని పరిణితి తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టింది.అందుకే యానిమల్ రిజెక్ట్ చేశాపరిణితి చోప్రా మాట్లాడుతూ.. 'యానిమల్ సినిమాను మొదట ఒప్పుకున్నాను. అంతా ఫైనలైపోయింది అనుకుంటున్న సమయంలో నాకు అమర్ సింగ్ చమ్కీలా మూవీ ఆఫర్ వచ్చింది. రెండు సినిమాలు ఒకే సమయంలో తీస్తున్నారు. డేట్స్ కుదరట్లేదు. నాకెందుకో చమ్కీలా వదులుకోకూడదనిపించింది. అందుకే యానిమల్‌ను వదిలేసుకున్నాను. చమ్కీలా మూవీ ద్వారా నేను పొందిన ప్రేమ, గుర్తింపు, అభిమానం.. ఏదీ మర్చిపోలేను. ఇంతటి ఆనందిచ్చిన ఈ మూవీ కోసం యానిమల్‌ను వదిలేసుకున్నందుకు నేనేమీ బాధపడటం లేదు. సంతోషంగా ఉన్నాను అని చెప్పుకొచ్చింది.అమర్ సింగ్ చమ్కీలా సినిమా పోస్టర్సినిమాకాగా గొప్ప సంగీతకారుడు అమర్ సింగ్ చమ్కీలా జీవిత కథ ఆధారంగా అమర్ సింగ్ చమ్కీలా చిత్రం తెరకెక్కింది. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దిల్జిత్ దోసాంజ్ ప్రధాన పాత్రలో నటించాడు. పరిణితి అతడి రెండో భార్య అమర్‌జోత్‌గా యాక్ట్ చేసింది. ఈ మూవీ ఏప్రిల్ 12న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది.చదవండి: విడాకుల తర్వాత ఒకే స్టేజీపై కోలీవుడ్ జంట.. ఫ్యాన్స్ ఎమోషనల్ -
ప్రముఖ బ్యానర్లో చిన్న జాబ్.. తిరిగి అదే సంస్థతో హీరోయిన్గా ఛాన్స్ (ఫోటోలు)
-
అవన్నీ ఫేక్.. అలా చేయొద్దంటూ హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
ఈ ఏడాది పెళ్లిబంధంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను పెళ్లాడింది. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు సెప్టెంబరు 24, 2023న రాజస్థాన్‌లో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి బాలీవుడ్ తారలు, రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. అయితే ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్‌ను ఆస్వాదిస్తున్న బ్యూటీ సోషల్ మీడియా ఫ్యాన్స్, ఫ్యాన్ క్లబ్స్ పేజీలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడితే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కొందరు తమ అభిమాన నటులను ప్రశంసించుకోవడానికి పలువురు తన పేరును ఉపయోగిస్తున్నారని పరిణీతి మండిపడింది. ఈ మేరకు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇన్‌స్టా స్టోరీస్‌లో రాస్తూ.. 'నా పేరుని ఉపయోగించి కొందరు ఫ్యాన్ పేజీలు తమ అభిమాన నటులకు అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు. ఇలాంటివీ చాలా నా దృష్టికి వచ్చాయి. నా పేరుతో వస్తున్న ఇలాంటి పోస్టులన్న నకిలీవి. ఇలా ఏ ఒక్కరినీ పొగిడేందుకు నేను ఎలాంటి ఇంటర్వ్యూలూ ఇవ్వడం లేదు. ఇలా మరోసారి జరిగితే కచ్చితంగా ఫిర్యాదు చేస్తా . మీరు ఏదైనా పోస్టు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోండి.' అంటూ కాస్తా ఘాటుగానే ఇచ్చిపడేసింది. కాగా.. 2011లో బాలీవుడ్‌లోకి నటిగా ఎంట్రీ ఇచ్చిన పరిణీతి చోప్రా ఆ తర్వాత శుద్ధ్ దేశీ రొమాన్స్, కిల్ దిల్, డిష్యూం, కేసరి, సైనా, ది గర్ల్ ఆన్ ది ట్రైన్ చిత్రాల్లో ఆమె నటించారు. పరిణీతి చివరిసారిగా అక్షయ్ కుమార్ నటించిన మిషన్ రాణిగంజ్‌లో కనిపించింది. ఆమె ప్రస్తుతం చమ్కిలా చిత్రంలో దిల్జిత్ దోసాంజ్‌తో స్క్రీన్ పంచుకోనుంది. -
కేవలం దాని కోసమే పెళ్లి చేసుకుంటున్నారు: వివేక్ సంచలన కామెంట్స్
బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయన డైరెక్షన్లో తెరకెక్కించిన 'ది కశ్మీర్ ఫైల్స్' సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చినా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. కశ్మీర్లో హిందూ పండితులపై జరిగిన దాడులను కథాంశంగా సినిమాను రూపొందించారు. అయితే ప్రస్తుతం ఆయన 'ది వ్యాక్సిన్ వార్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. (ఇది చదవండి: పెళ్లికి ముందే అమ్మతనం కోసం ఆరాటపడ్డ హీరోయిన్స్ వీళ్లే) తాజాగా వివేక్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ రోజుల్లో వెడ్డింగ్స్ జరగడంపై ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు. కేవలం పెళ్లి ఫొటోలు తీసుకోవడం కోసమే పెళ్లి చేసుకుంటున్నారని వివేక్ అగ్నిహోత్రి వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. మే 13న దిల్లీలో జరిగిన పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా నిశ్చితార్థం జరగడంతో ఆయన ట్వీట్‌పై చర్చ నడుస్తోంది. (ఇది చదవండి: వారసత్వం కోసం బిడ్డను కనడం లేదు.. ఉపాసన ఆసక్తికర పోస్ట్) వివేక్ తన ట్వీట్లో రాస్తూ.. ' ఈ రోజుల్లో కేవలం ఫోటోలు, వీడియోల కోసమే పెళ్లి చేసుకుంటున్నాపరు. 'డెస్టినేషన్ వెడ్డింగ్' ట్యాగ్‌ని పొందడానికి పెళ్లి చేసుకుంటున్నారని నాతో ఓ వెడ్డింగ్ ప్లానర్ చెప్పారు. నేను ఓ డెస్టినేషన్ వెడ్డింగ్‌లో ఉన్నా. ఆ వివాహానికి ఫోటోగ్రాఫర్ ఆలస్యంగా వస్తున్నాడని ఎవరో చెప్పారు. దీంతో వధువు స్పృహ తప్పి పడిపోయింది.' అంటూ పోస్ట్ చేశారు. వివేక్ చేసిన ట్వీట్‌పై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. “People are getting married just to get wedding photos, videos and to get ‘destination wedding’ tag for show off”. - a wedding planner told me. It’s true I was in a destination wedding and someone said that the wedding photographer is going to be late and the bride fainted. — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) May 13, 2023 -
ఆప్ నేతతో పరిణీతి చోప్రా డేటింగ్.. ట్వీట్ వైరల్
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ నేత రాఘవ్ చద్దా డేటింగ్లో ఉన్నట్లు బీ టౌన్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఇటీవల ఓ రెస్టారెంట్ వద్ద కలిసి వెళ్తూ కెమెరాల కంటపడ్డారు. దీంతో ఈ జంటపై డేటింగ్ రూమర్స్ జోరందుకున్నాయి. అయితే తాజాగా మరో ఎంపీ సంజీవ్ ఆరోరా చేసిన ట్వీట్ వీరిద్దరి రిలేషన్షిప్ మరోసారి చర్చకు దారితీసింది. సంజీవ్ ఆరోరా ట్వీట్లో రాస్తూ..' మీ ఇద్దరి ప్రేమకు నా హృదయపూర్వక ధన్యావాదాలు. వారి మధ్య ప్రేమ, ఆనందం ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. ఈ జంటకు హృదయపూర్వక శుభాకాంక్షలు.' అంటూ వారిద్దరి ఫోటోను పోస్ట్ చేశారు. దీంతో వీరిద్దరి డేటింగ్‌పై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు నెటిజన్స్ ఏకంగా ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. అయితే పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా గురించి వారి సన్నిహితులు ఒకరు క్లారిటీ ఇచ్చారు. ఇరు కుటుంబాలు వివాహంపై చర్చలు ప్రారంభించిన తర్వాతే ఇటీవల విందుకు వెళ్లారు. వారు ఒకరికొకరు బాగా తెలుసు.. అలాగే ఒకరినొకరు ఇష్టపడ్డారు. వీరి కుటుంబాలకు కొంతకాలంగా పరిచయం ఉంది. ఇంకా కుటుంబ సభ్యులు ఈ విషయంపై చర్చించుకుంటున్నారు. త్వరలో వేడుక జరుగనుంది. ఇద్దరూ కలిసి ఉండటం పట్ల ఇరు కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. అయితే ఇద్దరూ తమ తమ షెడ్యూల్లో బిజీగా ఉన్నందున ఇప్పుడే తేదీని నిర్ణయించడం కష్టమని సన్నిహితులు తెలిపారు. I extend my heartfelt congratulations to @raghav_chadha and @ParineetiChopra. May their union be blessed with an abundance of love, joy, and companionship. My best wishes!!! pic.twitter.com/3fSWVT4evR — Sanjeev Arora (@MP_SanjeevArora) March 28, 2023 -
అది నా చేతుల్లో లేదు
‘‘నా కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాను. వేసే ప్రతి అడుగు ఆలోచించి వేస్తాను’’... కెరీర్ గురించి మీ వైఖరి ఎలా ఉంటుంది? అనే ప్రశ్నను హీరోయిన్ల ముందుంచితే సాధారణంగా పై విధంగానే సమాధానాలు చెబుతారు. కానీ బాలీవుడ్ బ్యూటీ పరిణీతీ చోప్రా మాత్రం ‘అది నా చేతుల్లో లేదు’ అంటున్నారు. ‘‘మన అంచనాలు అన్ని వేళలా నిజం కావు. హిట్ అవుతుందనుకున్న సినిమా ఫ్లాప్ అవొచ్చు. ‘‘ఫ్లాప్ అవుతుందనుకున్న సినిమా హిట్ కావొచ్చు. అంతా ఆడియన్స్ చేతిలో ఉంటుంది. కెరీర్ అయినా అంతే. అది మన చేతిలో ఉండదు. మన సినిమాలు హిట్ సాధిస్తే ఆఫర్లు వస్తాయి. లేకపోతే లేదు. అందుకే నేను కెరీర్‌ను పెద్దగా ప్లాన్ చేసుకోను. నాకు వచ్చిన అవకాశాల్లో నచ్చిన పాత్రకు ఓకే చెప్పుకుంటూ ముందుకు వెళతాను. కానీ ఒప్పుకున్న సినిమాకు నా వంతు న్యాయం చేయడానికి మాత్రం ఎంత కష్టమైనా వెనకాడను’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ‘భూజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అనే సినిమా సైన్ చేశారు పరిణీతి. ‘సందీప్ ఔర్ పింకీ పరార్, జబరియా జోడి’ ఆమె నెక్ట్స్ రిలీజ్ చిత్రాలు. -
లెక్క తగ్గదు
ఐదేళ్లుగా ఏడాదికి కనీసం మూడు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. ఈ ఏడాది ఆల్రెడీ ‘ప్యాడ్‌మ్యాన్, గోల్డ్, 2.ఓ’ చిత్రాలతో థియేటర్స్‌లోకి వచ్చి అలరించారు. ఆల్రెడీ నెక్ట్స్ ఇయర్‌కు కూడా లెక్క తగ్గకుండా ఇంకో మూడు సినిమాలను రెడీ చేస్తున్నారు. అందులో భాగంగానే ‘కేసరి’ అనే సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేశారాయన. ‘బ్యాటిల్ ఆఫ్ సారగడి’ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో హవీల్దార్ ఇషార్ సింగ్ పాత్రలో అక్షయ్‌కుమార్ కనిపిస్తారు.‘‘కేసరి చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రం చేసినందుకు నా ఛాతీ గర్వంతో నిండిపోయింది’’ అన్నారు అక్షయ్. ఇందులో పరిణీతీ చోప్రా కథానాయిక. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 31న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరోవైపు ‘హౌస్‌ఫుల్ 4’ సినిమాను కంప్లీట్ చేసిన అక్షయ్ ప్రజెంట్ ‘గుడ్‌న్యూస్, మిషన్ మంగళ్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. -
బావా.. అక్క జాగ్రత్త
ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్‌ల నిశ్చితార్థం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. అక్క ఎంగేజ్మెంట్ కావడంతో సోదరి పరిణీతీ చోప్రా ఎమోషనల్ అయ్యారు. చిన్నప్పటినుంచి వాళ్ల మధ్య ఉన్న ఎమోషనల్ అటాచ్‌మెంట్‌ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారామె. ‘‘మా చిన్నప్పుడు ప్రియాంక, నేను ‘ఘర్’ అనే ఆట ఆడుకునేవాళ్లం. అందులో ఇద్దరం సిగ్గు పడే పెళ్లి కూతుళ్లులా, మాకు ఆల్రెడీ పిల్లలున్నట్టు, వాళ్లను చూసుకుంటున్నట్టు, మా శ్రీవారికి టీ అందిస్తున్నట్టు.. ఇలా ఊహించుకుంటూ ఆడుకునేవాళ్లం. మేం చిన్నప్పటి నుంచి లవ్‌లో ఉన్న మ్యాజిక్‌ని అంతలా నమ్మేవాళ్లం. మాకు మంచి పార్టనర్ దొరకాలని కోరుకున్నాం. ఈరోజు నుంచి ఇక ఊహించుకోవాల్సిన పని లేదు. నిక్.. నీకంటే పర్ఫెక్ట్ పర్సన్ ఎవరూ ఉండరనుకుంటున్నాను. ఎవరైనా మనిషిని అంచనా వేయాలంటే ఆ వ్యక్తితో ట్రావెల్ చేయాలి లేదా కలిసి తినాలి అంటారు. నేను ఆ రెండూ నీతో చేశాను. ఇప్పుడు చెప్పగలను. నువ్వు అక్కకి ఫర్ఫెక్ట్ అని. తనని బాగా ప్రేమించు. ఎందుకంటే తను నిన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తోంది. తనకి ఎప్పుడూ రక్షణగా ఉండు. బయటకి స్ట్రాంగ్‌గా కనిపించినా అక్క సున్నిత మనస్కురాలు. మీ ఇద్దరి లైఫ్ హ్యాపీగా సాగాలి. ఆల్ ది బెస్ట్’’ అన్నారు పరిణీతీ చోప్రా. -
రణ్వీర్ స్థానంలో హృతిక్..!
ముంబై : ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో రణ్వీర్ సింగ్ స్టన్నింగ్ పర్ఫామెన్స్తో అదరగొడతాడని భావించిన అభిమానులకు నిరాశే మిగిలింది. ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పాల్గొన్న రణ్వీర్ భుజానికి గాయమవడంతో ప్రదర్శన ఇవ్వడం లేదని అతడి మేనేజర్ తెలిపారు. డాన్స్ చేయడం వల్ల ఓవర్ స్ట్రెయిన్ అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు సూచించడంతో రణ్వీర్ ఈ వేడుకకు దూరమయ్యాడని వెల్లడించారు. అయితే షెడ్యూల్ ప్రకారం గుల్లీ బాయ్ షూటింగ్లో యథావిధిగా పాల్గొననున్నారు. రణ్వీర్ ప్రస్తుతం రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న సింబాతో పాటు, "83" సినిమాలో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌గా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. రణ్వీర్ కోసం భారీ మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధపడింది ఐపీఎల్ మేనేజ్మెంట్. గాయం కారణంగా రణ్వీర్ దూరమవడంతో హృతిక్ రోషన్‌ను ఐపీఎల్ నిర్వాహకులు సంప్రదించినట్లు సమాచారం. ఈనెల 7న ముంబైలో జరిగే వేడుకల్లో పరిణీతి చోప్రా, వరుణ్ ధావన్, జాక్వలిన్ ఫెర్నాండెజ్‌లు ప్రదర్శన ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం షూటింగ్‌కు విరామం ఇచ్చిన వరుణ్ అప్పుడే రిహార్సల్ కూడా మొదలుపెట్టేశారు. -
యాక్టర్స్‌ని ఎప్పుడూ అపార్ధం చేసుకుంటారు
... అంటున్నారు పరణీతీ చోప్రా. యాక్టర్‌గా ఉండటంలోని ప్లస్‌లు, మైనస్‌లు గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘ప్రజల్లో ఉన్న అతి పెద్ద అపోహ ఏంటంటే యాక్టర్స్ ఎప్పుడూ తమ కోపాన్ని ప్రదర్శిస్తారని, విపరీతమైన యాటిట్యూడ్ చూపిస్తుంటారని, అందుకే వాళ్లని హ్యాండిల్ చేయటం కష్టం అని. అది నిజం కాదు. యాక్టర్స్ చాలా హంబుల్ పర్సన్స్. పబ్లిక్‌లో కనిపించిన ప్రతిసారి మమల్ని చాలా కళ్లు తీక్షణంగా పరీక్షిస్తుంటాయి. దాని వల్ల మేం ప్రతి పని చాలా కేర్‌ఫుల్‌గా చేస్తుండాల్సి వస్తుంటుంది. కామన్ పీపుల్‌తో పోలిస్తే మాది చాలా డిమాండింగ్ లైఫ్. ఏదో పార్టీలో ఏదో చేస్తాం. దాన్నే కొన్నిసార్లు స్టేజి మీద చేయండి అంటారు. చాలామంది చూస్తున్నారనో ఇంకేదైనా కారణం వల్లో మేము అది చేయడం కుదరకపోవచ్చు. వెంటనే మాకు యాటిట్యూడ్ ప్రాబ్లమ్ అనేస్తారు. కామన్ పీపుల్‌తో కంపేర్ చేస్తే యాక్టర్స్‌ని ఎప్పుడూ అపార్థం చేసుకుంటారు. అలాగేమా గురించి ఈజీగా ఓ నిర్ణయానికి వచ్చేస్తారు. ఇలాంటివి జరకుండా ఏదైనా మార్గం ఉంటే బావుండు అని అనుకుంటా. ఇక్కడికి వచ్చి సినిమాల్లో యాక్ట్ చేస్తే తప్ప మా ప్రాబ్లమ్స్ బయటివాళ్లకు అర్థం కావు’’ అని పేర్కొన్నారు పరణీతి. -
జల్దీ జారుకోవాలె!
ఇక్కడ ఉన్న ఫోటో చూశారుగా! హీరో అర్జున్ కపూర్, హీరోయిన్ పరిణీతి చోప్రా ట్రైన్లో ఉన్నారని అర్థం అయ్యే ఉంటుంది. ట్రైన్ పేరు చెప్పడం కష్టం కానీ... ఎక్కడో చెప్పగలం. ఢిల్లీ రైల్వేస్టేషన్లో ఉన్నారు. అక్కడ ఏం చేస్తున్నారు? అంటే.. పారిపోతున్నారట. అర్జున్ కపూర్, పరిణీతి చోప్రా జంటగా దిబాకర్ బెనర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’. ఈ సినిమా షూటింగ్‌ను ఢిల్లీ రైల్వేస్టేషన్లో జరిపారు. విలన్స్ నుంచి అర్జున్, పరిణీతి చోప్రా పారిపోయే సీన్స్‌ను తెరకెక్కించారు చిత్రబృందం. జారుకో.. జారుకో.. జల్దీ జారుకోవాలె అని అక్కడి నుంచి ఉడాయించింది ఈ జంట. అది సరే కానీ విలన్స్‌ను రఫ్ఫాడించకుండా హీరో పారిపోవడం ఏంటీ? అంటే.. ఉంది బాస్.. దానికి రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటో స్క్రీన్‌పై చూడండి అంటున్నారు చిత్రబృందం. ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
మాల్దీవుల్లో మస్తీ
... చేస్తూ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు పరిణీతి చోప్రా. స్కూబా డైవింగ్ అంటే ఈ బ్యూటీకి చాలా ఇష్టం. ఆల్రెడీ ఆమె సర్టిఫైడ్ డైవర్ కూడా. సో.. రొటీన్‌గా కాకుండా కొంచెం డిఫరెంట్ డైవ్స్ చేయాలని డిసైడై మరీ మాల్దీవులకి వెళ్లారు. మరి పరిణీతికి చేతిలో సినిమాల్లేవా? అంటే.. అలాంటిదేమీ లేదండి బాబు. ఆల్రెడీ దిబాకర్ బెనర్జీ దర్శకత్వంలో అర్జున్ కపూర్ హీరోగా రూపొందుతున్న ‘సందీప్ ఔర్ పింకీకీ ఫరార్’ చిత్రంలో ఆమె హీరోయిన్గా నిన్నమొన్నటి వరకు జరిగిన షూట్లో పాల్గొన్నారు. ఇంకో వైపు విశాల్ షా దర్శకత్వంలో రూపొందనున్న ‘నమస్తే లండన్’ సినిమాలోనూ పరిణీతి హీరోయిన్గా నటించనున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న అంటే.. వేలంటేన్స్ డే నాడు∙సెట్స్‌పైకి వెళుతుంది. ఇందులోనూ అర్జున్ కపూర్‌నే హీరో కావడం విశేషం. ఈ రెండు సినిమాల్లోనే కాకుండా అనురాగ్ సింగ్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా రూపొందనున్న ‘కేసరి’ చిత్రంలోనూ పరిణీతినే కథానాయిక అన్న విషయం తెలిసిందే. ఇలా వరుస చాన్స్‌లతోపాటు వీలు చిక్కినప్పుడుల్లా ఎంజాయ్ చేస్తూ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు పరిణీతి. ప్రొఫెషన్ని, పర్సనల్ లైఫ్‌ని చక్కగా బాల్యెన్స్ చేసుకుంటున్నారంటే.. పేరులోనే కాదు.. ఆలోచనలపరంగా కూడా పరిణితి చెందినట్లు ఉన్నారు కదూ. -
కుచ్ కుచ్ నహీ హై!
బీ టౌన్లో కరణ్ జోహార్ ప్రజెంట్ ఎంత బడా నిర్మాతో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘కుచ్ కుచ్ హోతా హై, ‘మై నేమ్ ఈజ్ ఖాన్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, ఏ దిల్ హై ముష్కిల్’ వంటి హిందీ చిత్రాలను కూడా డైరెక్ట్ చేశారాయన. గతేడాది వచ్చిన ‘ఏ దిల్ హై ముష్కిల్’ చిత్రమే డైరెక్టర్‌గా కరణ్‌కు లాస్ట్ మూవీ. ఆ తర్వాత ప్రొడక్షన్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారాయన. అయితే మరోమారు డైరెక్టర్‌గా మారి, ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని కరణ్ డిసైడైయ్యారట. ఇందులో పరిణీతి చోప్రాను హీరోయిన్గా చేయమని సంప్రదించారట. కానీ, ఫుల్ లెంగ్త్ హీరోయిన్ రోల్ కాకపోవడంతో ఆమె ‘నో’ చెప్పారన్నది బాలీవుడ్ టాక్. దీంతో పరిణీతీ చోప్రా, కరణ్ జోహర్ల మధ్య కుచ్ కుచ్ రాంగ్ హోతా హై అన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ‘‘ఈ వార్తలు నిజం కాదు. దయచేసి చెక్ చేసుకుని నిజాలు రాయగలరు’’ అని పేర్కొన్నారామె. ఇప్పుడు అర్థమైందిగా.. కరణ్ జోహర్‌కు, పరిణీతీ చోప్రాకు ప్రాబ్లమ్ కుచ్ కుచ్ నహీ హై అని. ఈ సంగతలా ఉంచితే పరిణీతీ చోప్రా ప్లేస్‌లో కియారా అద్వానీ (ప్రజెంట్ కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా చేస్తున్న సినిమాలో హీరోయిన్)ని సెలక్ట్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. -
అతను చీటర్.. చీటర్.. చీటర్!
మూడు సార్లు ఇంత బలంగా చీటర్.. చీటర్... చీటర్ అని పరిణీతి చోప్రా చెబుతున్నారంటే.. అతనెవరో పెద్ద మోసమే చేసి ఉంటాడు. ఇంతకీ అతనెవరు? అంటే.. ఇంకెవరో కాదు. ఈ మధ్యే విడుదలైన ‘గోల్మాల్ ఎగైన్’ దర్శకుడు రోహిత్‌శెట్టి. అజయ్ దేవ్గన్, పరిణీతీ చోప్రా, టబు, అర్షద్ వార్షి ముఖ్య తారలుగా రూపొందిన ఈ చిత్రం బీ టౌన్ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను రాబట్టి, 200 కోట్ల క్లబ్‌లోకి చేరిన సంగతి తెలిసిందే. ఈ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తూ, షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని విశేషాలను పరిణీతి గుర్తు చేసుకున్నారు. అందులో రోహిత్ శెట్టితో ఆమె క్రికెట్ ఆడిన ఇన్సిడెంట్ ఒకటి. ఆ సమయంలో వీడియో కూడా తీశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న పరిణీతి లాంగ్ఆన్ షాట్ కొట్టారు. నాన్–స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న రోహిత్ శెట్టి ముందు రన్‌కు ట్రై చేసి, సడన్‌గా వెనక్కి వెళ్లారు. అక్కడితో ఆగకుండా మళ్లీ ట్రై చేయడంతో పరిణీతి చోప్రా రనౌట్ అయ్యారు. ఈ సీన్‌కు చిత్రబృందం అంతా నవ్వేశారు. దీంతో ‘మోసం.. మోసం.. అంతా మోసం’ అంటూ రోహిత్ శెట్టిపై సరదాగా అలిగారు పరిణీతి. ‘‘ రోహిత్ శెట్టి సార్ నన్ను చీట్ చేశారు. రనౌట్ అయ్యాను. ఆయన చీటర్.. చీటర్.. చీటర్’’ అని పరిణీతి పేర్కొన్నారు. -
తుపాకీ అబ్బాయి.. లాప్టాప్ అమ్మాయి!
అమ్మాయిది ఐదంకెల జీతం. హైఫై జీవితం. మరి.. అబ్బాయి విషయానికొస్తే పోలీస్. ప్రస్తుతానికి ఆఫీసర్ కాకపోయినా సిన్సియర్ అండ్ స్ట్రిక్ట్ కానిస్టేబుల్. తుపాకీ పట్టిన అబ్బాయి లవ్‌కి లాప్టాప్ అమ్మాయి పడిపోయిందట. అంతేనా? అతని లక్ష్యానికి ఈ అమ్మాయి టెక్నాలజీ పరంగా తన వంతు సాయం చేస్తోందట. అబ్బాయి లక్ష్యం ఏంటి? అమ్మాయి చేస్తున్న సాయం ఏంటి? అనే సస్పెన్స్ ఎలిమెంట్స్‌ను చూడాలంటే వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే అంటున్నారు బాలీవుడ్ దర్శకులు దిబాకర్ బెనర్జీ. అర్జున్ కపూర్, పరిణీతి చోప్రా జంటగా ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’. బీటౌన్‌లో ‘షాంఘై, టిట్లీ’ వంటి చిత్రాలను బెనర్జీ తెరకెక్కించారు. ఈ సినిమాలో అర్జున్ కపూర్ హర్యానా పోలీస్ కానిస్టేబుల్‌గా నటిస్తున్నారు. పరిణీతి చోప్రా కార్పొరేట్ ఆఫీసులో జాబ్ చేసే క్యారెక్టర్లో నటిస్తున్నారు. రీసెంట్గా ఢిల్లీలో ఈ సినిమా షూటింగ్ జరిపారు. ఇటీవల అర్జున్ కపూర్ లుక్‌ను విడుదల చేశారు. ఇప్పుడు ‘పరిణీతి ఎంటర్ ఇన్ కార్పొరేట్ వరల్డ్’ అని ఆమె లుక్‌ను రిలీజ్ చేశారు. ఇన్సెట్లో మీరు చూస్తున్న లుక్ పరిణీతిదే. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టులో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
సూపర్ స్టార్‌తో నటించే అవకాశం
బ్రహ్మోత్సవం సినిమాతో నిరాశపరిచిన సూపర్ స్టార్ మహేష్ బాబు, తన అభిమానులను అలరించడానికి ఓ గిఫ్ట్ ఇవ్వనున్నాడు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఫారిన్లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్ తిరిగి రాగానే తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా జూలై నెలఖరుకి సెట్స్ మీదకు వెళ్లనుంది. మహేష్ కెరీర్లో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అభిమానులకు కూడా నటించే అవకాశం కల్పిస్తున్నారు చిత్రయూనిట్. ఇందుకోసం ప్రత్యేకంగా ఆడిషన్స్ నిర్వహించి మరీ నటీనటులను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని సినీ నిర్మాణ సంస్థ ఆఫీస్‌లో ఈ ఆడిషన్స్‌ను నిర్వహిస్తున్నట్టుగా సమాచారం. ఎనిమి అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో పరిణీతి చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా, హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు.