సూపర్ స్టార్తో నటించే అవకాశం | Auditions for mahesh babu and murugadoss film | Sakshi
Sakshi News home page

సూపర్ స్టార్తో నటించే అవకాశం

Published Thu, Jun 16 2016 11:20 AM | Last Updated on Mon, Sep 4 2017 2:38 AM

సూపర్ స్టార్తో నటించే అవకాశం

సూపర్ స్టార్తో నటించే అవకాశం

బ్రహ్మోత్సవం సినిమాతో నిరాశపరిచిన సూపర్ స్టార్ మహేష్ బాబు, తన అభిమానులను అలరించడానికి ఓ గిఫ్ట్ ఇవ్వనున్నాడు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఫారిన్లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్ తిరిగి రాగానే తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా జూలై నెలఖరుకి సెట్స్ మీదకు వెళ్లనుంది.

మహేష్ కెరీర్లో భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అభిమానులకు కూడా నటించే అవకాశం కల్పిస్తున్నారు చిత్రయూనిట్. ఇందుకోసం ప్రత్యేకంగా ఆడిషన్స్ నిర్వహించి మరీ నటీనటులను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోని సినీ నిర్మాణ సంస్థ ఆఫీస్లో ఈ ఆడిషన్స్ను నిర్వహిస్తున్నట్టుగా సమాచారం. ఎనిమి అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కనున్న ఈ సినిమాలో పరిణీతి చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా, హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement