పరిణీతీ చోప్రా, ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్
ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్‌ల నిశ్చితార్థం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. అక్క ఎంగేజ్‌మెంట్ కావడంతో సోదరి పరిణీతీ చోప్రా ఎమోషనల్ అయ్యారు. చిన్నప్పటినుంచి వాళ్ల మధ్య ఉన్న ఎమోషనల్ అటాచ్‌మెంట్‌ని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారామె. ‘‘మా చిన్నప్పుడు ప్రియాంక, నేను ‘ఘర్’ అనే ఆట ఆడుకునేవాళ్లం. అందులో ఇద్దరం సిగ్గు పడే పెళ్లి కూతుళ్లులా, మాకు ఆల్రెడీ పిల్లలున్నట్టు, వాళ్లను చూసుకుంటున్నట్టు, మా శ్రీవారికి టీ అందిస్తున్నట్టు.. ఇలా ఊహించుకుంటూ ఆడుకునేవాళ్లం. మేం చిన్నప్పటి నుంచి లవ్‌లో ఉన్న మ్యాజిక్‌ని అంతలా నమ్మేవాళ్లం.
మాకు మంచి పార్టనర్ దొరకాలని కోరుకున్నాం. ఈరోజు నుంచి ఇక ఊహించుకోవాల్సిన పని లేదు. నిక్.. నీకంటే పర్ఫెక్ట్ పర్సన్ ఎవరూ ఉండరనుకుంటున్నాను. ఎవరైనా మనిషిని అంచనా వేయాలంటే ఆ వ్యక్తితో ట్రావెల్ చేయాలి లేదా కలిసి తినాలి అంటారు. నేను ఆ రెండూ నీతో చేశాను. ఇప్పుడు చెప్పగలను. నువ్వు అక్కకి ఫర్ఫెక్ట్ అని. తనని బాగా ప్రేమించు. ఎందుకంటే తను నిన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తోంది. తనకి ఎప్పుడూ రక్షణగా ఉండు. బయటకి స్ట్రాంగ్‌గా కనిపించినా అక్క సున్నిత మనస్కురాలు. మీ ఇద్దరి లైఫ్ హ్యాపీగా సాగాలి. ఆల్ ది బెస్ట్’’ అన్నారు పరిణీతీ చోప్రా.
Comments
Please login to add a commentAdd a comment