పరిణీతి చోప్రా
... చేస్తూ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు పరిణీతి చోప్రా. స్కూబా డైవింగ్ అంటే ఈ బ్యూటీకి చాలా ఇష్టం. ఆల్రెడీ ఆమె సర్టిఫైడ్ డైవర్ కూడా. సో.. రొటీన్‌గా కాకుండా కొంచెం డిఫరెంట్ డైవ్స్ చేయాలని డిసైడై మరీ మాల్దీవులకి వెళ్లారు. మరి పరిణీతికి చేతిలో సినిమాల్లేవా? అంటే.. అలాంటిదేమీ లేదండి బాబు. ఆల్రెడీ దిబాకర్ బెనర్జీ దర్శకత్వంలో అర్జున్ కపూర్ హీరోగా రూపొందుతున్న ‘సందీప్ ఔర్ పింకీకీ ఫరార్’ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నిన్నమొన్నటి వరకు జరిగిన షూట్‌లో పాల్గొన్నారు. ఇంకో వైపు విశాల్ షా దర్శకత్వంలో రూపొందనున్న ‘నమస్తే లండన్’ సినిమాలోనూ పరిణీతి హీరోయిన్‌గా నటించనున్నారు.
ఈ సినిమా ఫిబ్రవరి 14న అంటే.. వేలంటేన్స్ డే నాడు∙సెట్స్‌పైకి వెళుతుంది. ఇందులోనూ అర్జున్ కపూర్‌నే హీరో కావడం విశేషం. ఈ రెండు సినిమాల్లోనే కాకుండా అనురాగ్ సింగ్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా రూపొందనున్న ‘కేసరి’ చిత్రంలోనూ పరిణీతినే కథానాయిక అన్న విషయం తెలిసిందే. ఇలా వరుస చాన్స్‌లతోపాటు వీలు చిక్కినప్పుడుల్లా ఎంజాయ్ చేస్తూ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు పరిణీతి. ప్రొఫెషన్‌ని, పర్సనల్ లైఫ్‌ని చక్కగా బాల్యెన్స్ చేసుకుంటున్నారంటే.. పేరులోనే కాదు.. ఆలోచనలపరంగా కూడా పరిణితి చెందినట్లు ఉన్నారు కదూ.
Comments
Please login to add a commentAdd a comment