తుపాకీ అబ్బాయి.. లాప్‌టాప్‌ అమ్మాయి! | Sandeep Aur Pinky Faraar First Look | Sakshi
Sakshi News home page

తుపాకీ అబ్బాయి.. లాప్‌టాప్‌ అమ్మాయి!

Published Tue, Nov 14 2017 1:29 AM | Last Updated on Tue, Nov 14 2017 4:51 AM

Sandeep Aur Pinky Faraar First Look - Sakshi

అమ్మాయిది ఐదంకెల జీతం. హైఫై జీవితం. మరి.. అబ్బాయి విషయానికొస్తే పోలీస్‌. ప్రస్తుతానికి ఆఫీసర్‌ కాకపోయినా సిన్సియర్‌ అండ్‌ స్ట్రిక్ట్‌ కానిస్టేబుల్‌. తుపాకీ పట్టిన అబ్బాయి లవ్‌కి లాప్‌టాప్‌ అమ్మాయి పడిపోయిందట. అంతేనా? అతని లక్ష్యానికి ఈ అమ్మాయి టెక్నాలజీ పరంగా తన వంతు సాయం చేస్తోందట. అబ్బాయి లక్ష్యం ఏంటి? అమ్మాయి చేస్తున్న సాయం ఏంటి? అనే సస్పెన్స్‌ ఎలిమెంట్స్‌ను చూడాలంటే వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే అంటున్నారు బాలీవుడ్‌ దర్శకులు దిబాకర్‌ బెనర్జీ. అర్జున్‌ కపూర్, పరిణీతి చోప్రా జంటగా ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సందీప్‌ ఔర్‌ పింకీ ఫరార్‌’.

బీటౌన్‌లో ‘షాంఘై, టిట్లీ’ వంటి చిత్రాలను బెనర్జీ తెరకెక్కించారు. ఈ సినిమాలో అర్జున్‌ కపూర్‌ హర్యానా పోలీస్‌ కానిస్టేబుల్‌గా నటిస్తున్నారు. పరిణీతి చోప్రా కార్పొరేట్‌ ఆఫీసులో జాబ్‌ చేసే క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. రీసెంట్‌గా ఢిల్లీలో ఈ సినిమా షూటింగ్‌ జరిపారు. ఇటీవల అర్జున్‌ కపూర్‌ లుక్‌ను విడుదల చేశారు. ఇప్పుడు ‘పరిణీతి ఎంటర్‌ ఇన్‌ కార్పొరేట్‌ వరల్డ్‌’ అని ఆమె లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఇన్‌సెట్‌లో మీరు చూస్తున్న లుక్‌ పరిణీతిదే. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టులో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement