సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన 'యానిమల్' సినిమాలో హీరోయిన్‌గా మొదట పరిణితీ చోప్రాను అనుకున్నారు. కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో ఈ అవకాశం రష్మిక మందన్నా చేతికి వెళ్లింది. అయితే ఈ మూవీ వద్దనడానికి గల కారణాన్ని పరిణితి తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టింది.
అందుకే యానిమల్ రిజెక్ట్ చేశా
పరిణితి చోప్రా మాట్లాడుతూ.. 'యానిమల్ సినిమాను మొదట ఒప్పుకున్నాను. అంతా ఫైనలైపోయింది అనుకుంటున్న సమయంలో నాకు అమర్ సింగ్ చమ్కీలా మూవీ ఆఫర్ వచ్చింది. రెండు సినిమాలు ఒకే సమయంలో తీస్తున్నారు. డేట్స్ కుదరట్లేదు. నాకెందుకో చమ్కీలా వదులుకోకూడదనిపించింది. అందుకే యానిమల్‌ను వదిలేసుకున్నాను. చమ్కీలా మూవీ ద్వారా నేను పొందిన ప్రేమ, గుర్తింపు, అభిమానం.. ఏదీ మర్చిపోలేను. ఇంతటి ఆనందిచ్చిన ఈ మూవీ కోసం యానిమల్‌ను వదిలేసుకున్నందుకు నేనేమీ బాధపడటం లేదు. సంతోషంగా ఉన్నాను అని చెప్పుకొచ్చింది.
అమర్ సింగ్ చమ్కీలా సినిమా పోస్టర్
సినిమా
కాగా గొప్ప సంగీతకారుడు అమర్ సింగ్ చమ్కీలా జీవిత కథ ఆధారంగా అమర్ సింగ్ చమ్కీలా చిత్రం తెరకెక్కింది. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దిల్జిత్ దోసాంజ్ ప్రధాన పాత్రలో నటించాడు. పరిణితి అతడి రెండో భార్య అమర్‌జోత్‌గా యాక్ట్ చేసింది. ఈ మూవీ ఏప్రిల్ 12న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది.
Comments
Please login to add a commentAdd a comment