విడాకుల తర్వాత ఒకే స్టేజీపై కోలీవుడ్‌ జంట.. ఫ్యాన్స్‌ ఎమోషనల్‌ | GV Prakash Kumar, Saindhavi Reunite for Concert After Divorce, Videos Goes Viral | Sakshi
Sakshi News home page

GV Prakash Kumar: విడాకుల తర్వాత మళ్లీ కలిసిన జంట!.. వీడియో వైరల్‌

Published Mon, Dec 9 2024 5:36 PM | Last Updated on Mon, Dec 9 2024 6:15 PM

GV Prakash Kumar, Saindhavi Reunite for Concert After Divorce, Videos Goes Viral

తమిళ సంగీత దర్శకుడు, గాయకుడు, హీరో జీవీ ప్రకాశ్‌ కుమార్‌, సింగర్‌ సైంధవి ఈ ఏడాది మేలో విడిపోయారు. బాల్య స్నేహితులైన వీరు 2013లో పెళ్లి చేసుకున్నారు. వీరి దాంపత్యానికి గుర్తుగా ఓ పాప కూడా పుట్టింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట సడన్‌గా విడిపోవడానికి సిద్ధపడటం అభిమానులను షాక్‌కు గురి చేసింది. 

విడాకులు తీసుకున్నజంట
11 ఏళ్ల దాంపత్య జీవితానికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ ఎవరి దారి వారు చూసుకున్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి కనిపించారు. మలేషియాలోని ఓ సంగీత కచేరీలో పాల్గొన్న జీవీ ప్రకాశ్‌, సైంధవి జంటగా పాటలు ఆలపించారు. అది చూసిన అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కచేరీ కోసం జీవీ ప్రకాశ్‌ రిహార్సల్స్‌ చేసేటప్పుడు కూడా సైంధవి.. తన కూతుర్ని తండ్రి దగ్గరకు పంపించింది.

మ్యూజిక్‌ డైరెక్టర్‌గా, సింగర్‌గా, హీరోగా..
ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇకపోతే జీవీ ప్రకాశ్‌ కుమార్‌ తమిళంలో స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గానే కాకుండా సింగర్‌గా, హీరోగానూ ఫామ్‌లో ఉన్నాడు. సైంధవితో కలిసి తమి ఎన్నో పాటలు పాడాడు. ఈయన తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా, కథానాయకుడు, యుగానికి ఒక్కడు, పందెం కోళ్లు, డార్లింగ్‌, ఎందుకంటే ప్రేమంట, రాజా రాణి, ఆకాశమే నీ హద్దురా.., సార్‌, టైగర్‌ నాగేశ్వరరావు, లక్కీ భాస్కర్‌, మట్కా.. ఇలా పలు సినిమాలకు సంగీతం అందించాడు.

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి ప్రస్తుతం జీవీ ప్రకాశ్‌ చేతిలో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పదికి పైగా సినిమాలున్నాయి. హీరోగా ఈ ఏడాది మూడు సినిమాలతో పలకరించిన జీవీ ప్రస్తుతం కథానాయకుడిగా మరో మూడు సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. 

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement