బిగ్‌బాస్ 8వ సీజన్‌లో వచ్చినంత మంది గెస్టులు మరే సీజన్‌లోనూ వచ్చి ఉండరు. ఫ్యామిలీ వీక్ దగ్గరి నుంచి ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. రెండువారాల క్రితం పాత సీజన్ కంటెస్టెంట్లు, గత వారం సెలబ్రిటీలు రాగా ఇప్పుడు బుల్లితెర తారలు హౌస్‌లోకి వస్తున్నారు.
బిగ్‌బాస్ హౌస్‌లో అర్జున్
ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశారు. త్వరలో ప్రారంభమవుతున్న కొత్త సీరియల్ జంటను లోనికి తీసుకొచ్చారు. నటి పెద్దగా పరిచయం లేదేమో కానీ అర్జున్ కళ్యాణ్ మాత్రం ఇదివరకే తెలిసిన వ్యక్తి! అతడు గతంలో బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు.
ఫైనలిస్టులతో గేమ్
ఈ సీరియల్ జంటతో పోటీపడి గెలిస్తే ప్రైజ్‌మనీలో కొంత డబ్బు యాడ్ చేస్తానన్నాడు బిగ్‌బాస్. అలాగే మరో సీరియల్ జంట ప్రభాకర్, ఆమని కూడా వచ్చారు. వీళ్లు కూడా కంటెస్టెంట్లతో కలిసి గేమ్స్ ఆడారు. ఫినాలే వీక్ కాబట్టి ఈ వారం గొడవలు గట్రా ఏమీ ఉండవు. కేవలం ఇలాంటి ఫన్ గేమ్స్, ఎమోషనల్ ఏవీ జర్నీ వీడియోలు మాత్రమే ఉండనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment