అప్పట్లో తెలుగులో 'నువ్వే కావాలి', 'ప్రేమించు' సినిమాల్లో నటించిన సాయికిరణ్.. ప్రస్తుతం తెలుగు సీరియల్స్‌తో బిజీగా ఉన్నాడు. 'కోయిలమ్మ', 'గుప్పెడంత మనసు' తదితర ధారావాహికల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజాగా ఇతడు తన తోటి నటి స్రవంతిని పెళ్లి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు.
(ఇదీ చదవండి: విన్నర్ ప్రైజ్‌మనీ కంటే ఎక్కువే సంపాదించిన విష్ణు!)
దిగ్గజ గాయని పి.సుశీలకు.. సాయికిరణ్ మనవడు వరస అవుతాడు. ఇతడి తండ్రి సింగర్. అలా ఇండస్ట్రీ వాతావారణంలోనే పెరగడంతో 'నువ్వే కావాలి' మూవీతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. కాకపోతే ఎక్కువగా సినిమాలు చేయలేకపోయారు. కొన్నాళ్లు గ్యాప్ తీసుకుని ప్రస్తుతం సీరియల్స్ చేస్తున్నారు. గతంలోనే వైష్ణవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా.. వీళ్లకు ఓ పాప కూడా ఉంది.
మనస్పర్థలు కారణంగా కొన్నాళ్ల క్రితమే సాయికిరణ్-వైష్ణవి విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి ఒంటరిగానే ఉంటున్న సాయికిరణ్.. కొన్నాళ్ల క్రితం తనతోపాటు 'కోయిలమ్మ' సీరియల్‌లో నటించిన స్రవంతితో ప్రేమలో పడ్డాడు. ప్రేమకాస్త ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. ఇప్పుడు భార్యభర్తలయ్యారు. ఈ క్రమంలోనే పలువురు సీరియల్ నటీనటులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment