sai kiran
-
సీరియల్ నటి స్రవంతితో సాయికిరణ్ పెళ్లి..ఫోటోలు వైరల్
-
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ యాక్టర్స్
అప్పట్లో తెలుగులో 'నువ్వే కావాలి', 'ప్రేమించు' సినిమాల్లో నటించిన సాయికిరణ్.. ప్రస్తుతం తెలుగు సీరియల్స్‌తో బిజీగా ఉన్నాడు. 'కోయిలమ్మ', 'గుప్పెడంత మనసు' తదితర ధారావాహికల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజాగా ఇతడు తన తోటి నటి స్రవంతిని పెళ్లి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు.(ఇదీ చదవండి: విన్నర్ ప్రైజ్‌మనీ కంటే ఎక్కువే సంపాదించిన విష్ణు!)దిగ్గజ గాయని పి.సుశీలకు.. సాయికిరణ్ మనవడు వరస అవుతాడు. ఇతడి తండ్రి సింగర్. అలా ఇండస్ట్రీ వాతావారణంలోనే పెరగడంతో 'నువ్వే కావాలి' మూవీతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. కాకపోతే ఎక్కువగా సినిమాలు చేయలేకపోయారు. కొన్నాళ్లు గ్యాప్ తీసుకుని ప్రస్తుతం సీరియల్స్ చేస్తున్నారు. గతంలోనే వైష్ణవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా.. వీళ్లకు ఓ పాప కూడా ఉంది.మనస్పర్థలు కారణంగా కొన్నాళ్ల క్రితమే సాయికిరణ్-వైష్ణవి విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి ఒంటరిగానే ఉంటున్న సాయికిరణ్.. కొన్నాళ్ల క్రితం తనతోపాటు 'కోయిలమ్మ' సీరియల్లో నటించిన స్రవంతితో ప్రేమలో పడ్డాడు. ప్రేమకాస్త ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. ఇప్పుడు భార్యభర్తలయ్యారు. ఈ క్రమంలోనే పలువురు సీరియల్ నటీనటులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు) View this post on Instagram A post shared by Sai Kiran Ram (@saikiran_official_23) -
సీరియల్స్‌లో కలిసి నటించి ఆపై ఏడడుగుల బంధంతో ఒక్కటి కానున్న జంట (ఫోటోలు)
-
పెళ్లికి రెడీ అయిన 46 ఏళ్ల తెలుగు నటుడు
తెలుగులో ఒకప్పుడు హీరోగా పలు సినిమాలు చేసి సాయి కిరణ్.. త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రస్తుతం తెలుగులో సీరియల్స్ చేస్తున్న ఇతడు.. తనతో పాటు 'కోయిలమ్మ' సీరియల్లో యాక్ట్ చేస్తున్న స్రవంతి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని సదరు నటి తన ఇన్ స్టాలో పోస్ట్ చేసి మరీ ప్రకటించింది.దిగ్గజ గాయని పి.సుశీలకు మనవడు వరసయ్యే సాయికిరణ్ తల్లిదండ్రులు కూడా ఇండస్ట్రీకి చెందిన వాళ్లే. తండ్రి అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ సినిమాల్లో పాటలు పాడారు. దీంతో సాయికిరణ్ సులభంగానే ఇండస్ట్రీలోకి వచ్చాడు. 'నువ్వే కావాలి' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దీని తర్వాత 'ప్రేమించు', 'మనసుంటే చాలు', 'ఎంత బావుందో' తదితర చిత్రాల్లో హీరోగా.. 'జగపతి', 'షిరిడి సాయి', 'నక్షత్రం', 'గోపి గోడమీద పిల్లి' సినిమాల్లో సహాయ పాత్రలు చేశాడు.(ఇదీ చదవండి: ఆర్జీవీ మేనకోడలు పెళ్లిలో రష్మిక, విజయ్ దేవరకొండ)ఓవైపు సినిమాల్లో ఆడపాదడపా నటిస్తూనే సీరియల్ నటుడిగానూ సాయి కిరణ్ బోలెడంత గుర్తింపు తెచ్చుకున్నాడు. గుప్పెడంత మనసు, కోయిలమ్మ, పడమటి సంధ్యరాగం ఇలా తెలుగు క్రేజీ సీరియల్స్‌లో కీలక పాత్రలు చేస్తూ బాగానే పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తనతో పాటు 'కోయిలమ్మ' సీరియల్లో నటించిన స్రవంతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.2010లోనే సాయికిరణ్‌కి ఆల్రెడీ వైష్ణవి అనే అమ్మాయితో పెళ్లయిందని, ఓ పాప కూడా ఉందని తెలుస్తోంది. ఇప్పుడు ఇలా సడన్ సర్ప్రైజ్ అన్నట్లు 46 ఏళ్ల సాయికిరణ్.. రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే తోటీనటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కి క్యూట్ గిఫ్ట్ ఇచ్చిన రష్మిక) View this post on Instagram A post shared by Actress Sravanthi (@sravanthi.official) -
హీరోయిన్ లయతో పెళ్లి.. ఆ కారణం వల్లే ఆగిపోయింది: సాయి కిరణ్
నువ్వే కావాలి సినిమాతో హీరోగా అడుగుపెట్టన నటుడు సాయి కిరణ్. ఆ తర్వాత ప్రేమించు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో కనిపించారు. ప్రస్తుతం బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తున్నాడు. గుప్పెడంత మనసు సీరియల్లో నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సాయి కిరణ్.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అంతే కాకుండా లయ, సాయి కిరణ్ జంటగా నటించిన ప్రేమించు మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రంలో లయ బ్లైండ్ పాత్రలో నటించడంపై మాట్లాడారు. (ఇది చదవండి: కార్తి హీరోగా మొదటి సినిమా.. వివాదంపై సముద్రఖని ఆగ్రహం!) లయ పాత్రపై మాట్లాడుతూ.. 'లయ బ్లైండ్‌గా నటించేదుకు ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నారు. ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేశారు. అందువల్లే ఈ సినిమా నేషనల్ అవార్డ్ వరకు వెళ్లింది. నీ జీవితాంతం ఈ సినిమా గుర్తుంటుందని రామానాయుడు అన్నారు. లయతో పెళ్లి విషయంపై మాట్లాడుతూ.. చూడడానికి జంట బాగుంది. పెళ్లి చేసుకుంటే బాగుంటుందని మా తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ మా జాతకాలు కలవలేదు. అందువల్లే సెట్ అవ్వలేదు. మా మధ్య లవ్ అలాంటివేమీ లేవు. మేం కూడా కుదిరితే చేసుకుందామనుకున్నాం. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నాం. ఆ తర్వాత ఇంద్రజిత్ అనే షో చేశాం. ఆ తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ ఎంత బాగుందో మూవీలో నటించాం. జాతకాలు నేను చాలా గట్టిగా నమ్ముతా. పేరేంట్స్ కూడా నమ్ముతారు. ఒకప్పుడు నమ్మేవాడిని కాదు. కానీ ఆ తర్వాత వాటి గురించి తెలుసుకున్నా.' అని అన్నారు. (ఇది చదవండి: స్టార్ కమెడియన్ మరణంతో అనాథగా మారిన ప్రియుడు.. చివరకు..) -
భయపెట్టే పిండం!
శ్రీరామ్, ఖుషీ రవి జంటగా సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించిన హారర్ ఫిల్మ్ ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ఆరోహి దైదా సమర్పణలో యశ్వంత్ దగ్గుమాటి నిర్మించారు. ఈ సినిమాను డిసెంబరు 15న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ‘‘ప్రేక్షకులను భయపెట్టడమే లక్ష్యంగా ఈ సినిమా తీశాం. స్క్రీన్ ప్లే హైలైట్‌గా ఉంటుంది. డిసెంబరు 7న ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు కృష్ణ సౌరభ్ సూరంపల్లి సంగీతం అందించారు. -
'నువ్వే కావాలి' నటుడికి నిర్మాత బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు
ప్రముఖ సీరియల్ నటుడు, 'నువ్వే కావాలి' మూవీ ఫేమ్ సాయి కిరణ్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. 'అనగనగా ఆకాశం ఉంది.. ఆకాశంలో మేఘం ఉంది' అంటూ 'నువ్వే కావాలి' సినిమాలో పాట పాడి తొలి చిత్రంతోనే ఆడియెన్స్‌ను బాగా ఆకర్షించాడు. తర్వాత పలు సినిమాల్లో హీరోగా చేశాడు. ప్రస్తుతం టీవీ సీరియల్స్‌లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే తాజాగా సాయి కిరణ్ తనను నిర్మాత మోసం చేసినట్లు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. మన్న మినిస్ట్రీస్ గ్రూప్‌లో సభ్యత్వం పేరుతో నిర్మాత జాన్ బాబు, లివింగ్ స్టెన్ తన నుంచి రూ. 10.6 లక్షలు తీసుకున్నారని సాయి కిరణ్ తెలిపాడు. తర్వాత తన డబ్బు తనకు తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో జాన్ బాబు, లివింగ్ స్టెన్‌లపై సెక్షన్లు 420, 406 కింద కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. (చదవండి: 9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్ హీరోయిన్..) కాగా సాయి కిరణ్ ప్రముఖ నేపథ్య గాయకుడు రామకృష్ణ తనయుడిగా వెండితెరకు తెరంగేట్రం చేశాడు. సీరియల్స్‌లో విష్ణువు, కృష్ణుడు, వెంకటేశ్వరుడిగా నటించి బుల్లితెర వీక్షకులను మెప్పించాడు. అలాగే హైదరాబాద్ బ్లూక్రాస్ సంస్థలో చేరి జంతు సంరక్షణ బాధ్యతలు కూడా చేపడుతున్నాడు. పలు ఆధ్యాత్మిక సంస్థల్లో సైతం సభ్యుడిగా వ్యవహరిస్తున్నాడు. అంతేకాకుండా శివుడిపై 'శ్రీవత్సన్' అనే ఆల్బమ్‌ను రూపొందిస్తున్నాడు సాయి కిరణ్. చదవండి: వెబ్ స్క్రీన్‌పై బాగా వినిపిస్తున్న ఈ హీరోయిన్ గురించి తెలుసా ? నడిరోడ్డుపై యంగ్ హీరోయిన్ డ్యాన్స్.. వీడియో వైరల్) -
Actor Sai Kiran: నేను భయపడుతుంటే, కూల్‌గా ఎలా ఉన్నారు?
శారదా నను చేరగా.. ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు.. ఎదగడానికెందుకురా తొందరా... శివ శివ శంకర భక్తవశంకర... ఒకనాటి మాట కాదు ఒకనాడు తీరిపోదు.. ఆకాశం దించాలా నెలవంక తుంచాలా... పాండురంగ నామం.. వినరా వినరా.. విలక్షణ గాత్రం.. వైవిధ్యమైన భావం... ఎన్నో పాటలకు తన గళంలో ప్రాణం పోశారు.. సినీ గాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్నారు వి. రామకృష్ణదాసు.. ‘ఒక తండ్రిగా పిల్లల ఎదుగుదలకు ఎంతో సహకరించారు’ అంటూ తండ్రి జ్ఞాపకాలను పంచుకుంటున్నారు కుమారుడు సాయి కిరణ్... కళలకు పుట్టినిల్లయిన విజయనగరంలో పుట్టారు నాన్న. తండ్రి రంగసాయి, తల్లి రత్నం. పది మంది సంతానంలో నాన్న ఇంటి పెద్ద. ఇంట్లో నాన్నను దాసు అని పిలిచేవారు. అన్నదమ్ములను జాగ్రత్తగా చూసుకోవటం, చెల్లెళ్లకు జడలు వేయటం, ఇంటి పనుల్లో సహాయం చేయటం.. ప్రయోజకుడైన పెద్ద కొడుకులా ఉండేవారట. తాతగారి కంటె నాన్నను బాగా చూసేవారట. అన్ని విషయాల్లోనూ అమ్మకు సహాయంగా ఉండేవారట. అలా మొదలైంది... స్కూల్లో చదువుకునే రోజుల్లో బాగా పాడే వారట. ప్రముఖ సంగీత దర్శకులు ఆదినారాయణ రావు నాన్న పాటలు విని, ‘సినిమాల్లో పాడొచ్చుగా’ అన్నారట. నాన్న మాత్రం చదువు మీద శ్రద్ధ పెట్టి, బి.ఎస్.సి వరకు చదువుకున్నారట. ప్రభుత్వం వారి కుటుంబ నియంత్రణ ప్రకటన కోసం పాడిన పాట విన్న అక్కినేని, నాన్న గురించి సమాచారం సేకరించారట. ‘విచిత్ర బంధం’లో పాడే అవకాశం వచ్చింది. ఆదినారాయణరావు సంగీత దర్శకత్వంలో ‘భక్త తుకారాం’ చిత్రంలో మంచి పాటలు పాడారు. హుందాగా ఉండేవారు.. నాన్నది ప్రేమ వివాహం. ఆయన మ్యూజిక్ షోస్‌కి వెళ్లేవారు. అప్పుడే అమ్మ జ్యోతి కూడా అదే ఆర్కెస్ట్రాలో పాడేవారు. వాళ్ల పెయిర్ బాగా హిట్ అయ్యింది. అలా ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది, వివాహం అయింది. రెండు కుటుంబాల అంగీకరిం చటానికి కొంత కాలం పట్టింది. నాన్నకు నేను, చెల్లాయి లేఖ ఇద్దరం పిల్లలం. ఎప్పుడూ తిట్టడం కూడా తెలియదు. ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి గురించి చెప్పేవారు. మా చదువు విషయంలో నాన్న చాలా పర్టిక్యులర్‌గా ఉండేవారు. నేను పదో తరగతి చదువుతున్న రోజుల్లో ఒకరోజున ‘హీరో అవుతాను’ అంటే, బాగా కేకలేశారు. ఒకసారి పని మీద రజనీకాంత్ గారి దగ్గరకు వెళితే, ఆయన నాన్నతో, ‘మీ అబ్బాయి నటుడా’ అని అడిగారు. నాన్న మౌనంగా వచ్చేశారు. ‘నేను నటుడిని అవ్వాలనుకుంటుంటే, మీరే నన్ను ఎదగనివ్వట్లేదు’ అని కోపంగా అన్నాను. ‘నువ్వు డిగ్రీ పూర్తి చెయ్యి. తరవాత చూద్దాం’ అన్నారు నాన్న. హోటల్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ చేసి, గోల్డ్ మెడల్ సాధించాను. చెల్లెలు బి.సి.ఏ. చేసి, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోంది. డిగ్రీ పూర్తి కాగానే మళ్లీ సినిమాల గురించి అడిగాను. వెంటనే నా ఫోటోలు అందరికీ ఇచ్చారు. మొట్ట మొదటగా ఒక చానెల్‌లోను, ఆ తరవాత వారి బ్యానర్లోను నటించే అవకాశం వచ్చింది. నన్ను తెర మీద చూడగానే నాన్న కళ్లలోని ఆనంద బాష్పాలు ఇప్పటికీ మనసులో పదిలంగా ఉన్నాయి. అందరూ ఎగతాళి చేశారు.. నేను సినిమాలలోకి రావటం చూసి, ‘పిల్లల్ని చెడగొడుతున్నావు’ అని అందరూ నాన్నను మందలిస్తుంటే, ‘నేను తప్పు చేస్తున్నానా’ అని నాన్న బాధపడేవారు. ‘ఒక ఏడాది ప్రయత్నిద్దాం, సక్సెస్ సాధించకపోతే ఉద్యోగంలోకి వెళ్లిపోవాలి’ అన్నారు. అప్పుడు చదువు విలువ తెలిసింది నాకు. జీవితమే అన్నీ నేర్పుతుందని అర్థమైంది. నాన్న చనిపోయాక తల్లిదండ్రుల విలువ తెలిసింది నాకు. లైఫ్ సైన్సెస్ నాన్న పెద్దల పట్ల గౌరవంగా ఉండేవారు. పనివారైనా సరే వయసులో పెద్దవారైతే ‘మీరు’ అనాలనేరు. ‘దర్శకుడు వయస్సులో మన కంటె చిన్నవాడైనప్పటికీ, తండ్రి స్థానంలో చూడాలి, కాలి మీద కాలు వేసుకోకూడదు, నిర్మాతను ఇబ్బంది పెట్టకూడదు’ అంటూ చాలా విషయాలు చెప్పారు. రాముడితో పాటు రావణుడు కూడా గొప్పవాడని, కొన్ని చెడ్డ లక్షణాల వల్లే దుర్మార్గుడయ్యాడని చెబుతూంటే, ఆ టీనేజ్‌లో చాలా ఇరిటేటింగ్‌గా ఉండేది. ఇప్పుడు నాలో ఆధ్యాత్మిక ధనం బాగా పెరిగింది. పురాణాలు, కథలు అన్నీ తెలిసినందుకు సంతోషంగా ఉంటోంది. ఈ జీవిత ప్రయాణంలో నాన్న చెప్పిన విషయాలు మెదడులో చేరిపోయాయి. ఎప్పుడైనా తెలియక తప్పు చేస్తే, ‘సారీ చెప్పు’ అని లోపల నుంచి మనసు హెచ్చరిస్తుంది. నన్ను అందరూ గౌరవంగా చూస్తున్నారంటే అందుకు కారణం నాన్న నేర్పిన సత్ప్రవర్తన. నాన్న నన్ను అక్కినేని గారి దగ్గరకు తీసుకువెళ్లినప్పుడు, ఆయన నాకు ‘అక్కినేని అఆలు’ పుస్తకం ఇస్తూ, ‘ఊబిలోకి దిగుతున్నావు, జాగ్రత్త!’ అని సూచించారు. ఆ తరవాత నాన్న కూడా ‘మానసికంగా బలంగా ఉండాల్సిన రంగంలోకి దిగుతున్నావు. నచ్చితే సింహాసనం మీద కూర్చోపెడతారు లేదంటే తోసేస్తారు’ అని చెప్పారు. సినిమా పరిశ్రమ అంటే ‘మెంటల్ రోలర్ కోస్టర్ మీద రైడ్’ అని అర్థమైంది. మంచి జ్ఞాపకం... బాపు గారు తీసిన ‘వెంకటేశ్వర వైభవం’ లో వెంకటేశ్వరస్వామి పాత్ర పోషించాను. ఒకరోజున బాపుగారిని కలిసినప్పుడు నాన్నతో, ‘పురాణ పాత్రలకు ప్రసిద్ధులైన ఎన్టిఆర్ లాంటి కుమారుడిని కని ఇచ్చావు, థాంక్స్ రామకృష్ణా’ అన్నారట. ‘ప్రేమించు’ సినిమాలో నటిస్తున్నప్పుడు బాలు గారు, నాన్నకు ఫోన్ చేసి, ‘నీ కొడుకు హీరోగా నటిస్తున్న సినిమాలో నేను పాడుతున్నాను’ అని చెప్పారట. ఈ రెండు సంఘటనలూ నాన్న ఎంతో ఆనందంగా నాకు చెప్పారు. నా అదృష్టం.. ‘శ్రీశ్రీశ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి’ పాటల రికార్డింగ్‌కి వెళ్లాను. ఎన్టీఆర్ నన్ను చూస్తూనే, ‘దానవీరశూరకర్ణ సినిమా సమయంలో పుట్టినవాడేనా’ అన్నారు. ఆ సినిమా పాటల రికార్డింగ్ సమయంలో నాన్న చాలా టెన్షన్‌గా ఉన్నారట. ఇంతలో ‘అబ్బాయి పుట్టాడు’ అని ఫోన్ వచ్చిందట. వెంటనే ఎన్టిఆర్ అందరికీ స్వీట్స్ పంచారట. అలా ఆయన నా గురించి గుర్తు పెట్టుకున్నారు. ఎన్టీఆర్ నటించిన రాముడు, కృష్ణుడు, రావణాసురుడు, శివుడు.. పాత్రలు నేను కూడా చేయడం యాదృచ్ఛికం కావొచ్చు. ఎన్నటికీ మరచిపోలేను... ‘డార్లింగ్ డార్లింగ్’ సినిమా క్లైమాక్స్ సీన్ రాజమండ్రిలో వేసవి కాలంలో జరిగింది. నాతో పాటు నాన్నను తీసుకువెళ్లాను. షూటింగ్ అయిపోయాక మరో రెండు రోజులుండి, పడవ మీద నాన్నను లంక గ్రామాలలోకి తీసుకువెళ్లాను. గోదావరి స్నానం చేశాం. మరోసారి వీరబ్రహ్మంద్రస్వామి మఠానికి వెళ్లాం. ఆయన సమాధి అయిన చోట నమస్కరిస్తుండగా, నాన్న కళ్లలో నీళ్లు వచ్చాయి. నేను అక్కడకు తీసుకు వెళ్లినందుకు సంతోషించారు. ఒకసారి హైదరాబాద్ నుంచి వైజాగ్ ప్రయాణి స్తున్నాం. రాత్రి 10.30 ప్రాంతంలో ‘ఈరోజు మహాలయ అమావాస్య కదా, శివుడిని దర్శించుకోవాలి’ అన్నారు నాన్న. మహాలయ అమావాస్యనాడు శివుడు శ్మశానంలోనే ఉంటాడని అంటారు. ఆ దారిలో ముందుకి వెళితే శ్మశానం వస్తుంది. అక్కడ పెద్ద శివుడి విగ్రహం,వీర భద్రుడు, హరిశ్చంద్రు డి బొమ్మ ఉంటాయి. అక్కడకు రాగానే ‘ఇక్కడికి ఎందుకు’ అన్నారు. ‘నువ్వు గుడికి వెళ్తాను అన్నావు కదా’ అని కొబ్బరికాయ కొట్టించాను. నాన్న భక్తిపారవశ్యంతో ‘భక్త కన్నప్ప’ చిత్రంలోని, ‘జయ జయ మహాదేవ’ పద్యం గట్టిగా చదువుతుంటే, ప్రకృతి ప్రతిధ్వనించింది. అందరికీ శివుడిని చూసిన అనుభూతి కలిగి, ఒళ్లు పులకరించి, కళ్లలో నీళ్లు తిరిగాయి. పరవశించిపోయాం. ఈ సంఘటనలు నా జీవితంలో నేను మర్చిపోలేను. సరదాగా ఉండేవారు.. నాన్న చాలా సర దాగా ఉండేవారు. హోటల్లో బాగా తినేసి, కదలలేని స్థితిలో ‘ఏంట్రా అస్సలు తినలేకపోతున్నాం’ అనేవారు. ‘ఎదగడానికి ఎందుకురా తొందర..’ పాట నన్ను ఉద్దేశించి అప్పుడప్పుడు పాడేవారు. దేవుడి దయవల్ల నా వృత్తిలో సక్సెస్ అయ్యాను. కోయిలమ్మ సీరియల్లో నటిస్తున్నప్పుడు ‘నాన్న బతికి ఉంటే బావుండేది. చూసి సంతోషపడేవారు’ అనుకున్నాను. నాన్న నేర్పిన జీవిత పాఠాలు నా ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతున్నాయి. ఇప్పటికీ నాన్న నా వెంట ఉండి నడిపిస్తున్నట్లే మనసులో భావించుకుంటాను. చాలా కూల్‌గా ఉంటారు.. ఒకసారి నాన్న, నేను కారులో రాయలసీమలో ప్రయాణిస్తుండగా, ఒక చోట ట్రాఫిక్ ఆగిపోయింది. అక్కడ ఒకరి మీద ఒకరు బాంబులు విసురుకుంటున్నారు. గన్ పేలుస్తున్నారు. నాకు భయం వేసింది. నాన్న మాత్రం చాలా ప్రశాంతంగా, కారు పక్క రోడ్డులోకి తిప్పు అన్నారు. ఆ రోడ్డు చాలా ఎత్తుగా ఉంది. ఆ రోడ్డులోకి వెళ్లి చూస్తే, దూరం నుంచి వారి గొడవ కనిపించింది. ‘నేను భయపడుతుంటే, నువ్వు అంత కూల్‌గా ఎలా ఉన్నావు’ అని అడిగితే, ‘వాళ్లలో వాళ్లు కొట్టుకుంటారు, మన జోలికి రారు వాళ్లు, నువ్వు టెన్షన్ పడకు’ అన్నారు. ఏం జరుగుతున్నా దేనికీ భయపడరు, తొణకరుబెణకరు. - సంభాషణ: వైజయంతి పురాణపండ ఇక్కడ చదవండి: రేలంగి తన సంపాదనంతా ఆమెకే ఇచ్చేవారు..! 'జయప్రద నాన్న దగ్గర సంగీతం నేర్చుకుంది' ఆయన మాట వినకుండా తప్పు చేశానన్న ఇందిరాగాంధీ! -
తీవ్రవాదం నేపథ్యంలో...
‘వినాయకుడు, విలేజ్‌లో వినాయకుడు, కేరింత’ వంటి సెన్సిబుల్ హిట్ సినిమాలు తీసిన సాయికిరణ్ అడివి దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ (ఒ.జి.యఫ్). ఆది సాయికుమార్ హీరోగా నటించారు. ప్రముఖ రచయిత అబ్బూరి రవి ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించారు. ప్రతిభా అడివి, కట్టా ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమాస్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ బీహెచ్, సతీష్ డేగల, పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 18న విడుదల కానుంది. సాయికిరణ్ అడివి మాట్లాడుతూ– ‘‘వాస్తవ ఘటనల ఆధారంగా కల్పిత కథాంశంతో రూపొందిన చిత్రమిది. తీవ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. శ్రీచరణ్ పాకాల చక్కటి స్వరాలు, నేపథ్య సంగీతం అందించాడు. మా సినిమాలో దేశభక్తి గీతాన్ని పాడిన కీరవాణిగారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘తొలిసారి ఎన్.ఎస్.జి కమాండోగా నటించాను. నా లుక్కు మంచి స్పందన వచ్చింది. సాయికిరణ్ అడివిగారు కథపై ఎంతో పరిశోధన చేసి ఈ సినిమా తీశారు. కశ్మీర్ పండిట్ల జీవితాలను, అక్కడి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించారు’’ అన్నారు ఆది సాయికుమార్. ‘ఎయిర్ టెల్’ మోడల్ శషా చెట్రి, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్, కృష్ణుడు, అనీశ్ కురువిల్లా, రావు రమేశ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: జైపాల్ రెడ్డి నిమ్మల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్ రెడ్డి తుమ్మ, సహ నిర్మాత: దామోదర్ యాదవ్ (వైజాగ్). -
మీ ప్రోత్సాహంతోనే పోటీ చేస్తున్నా..
బంజారాహిల్స్: ప్రజాసేవ కోసం వచ్చానని, ఆశీర్వదిస్తే ప్రజల మధ్యే ఉంటూ ప్రజాసంక్షేమం కోసం పాటుపడతానని సీఎం కేసీఆర్ ఆశయ సాధన కోసం లోక్‌సభలో గళం విప్పుతానని సికింద్రాబాద్ పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయికిరణ్ యాదవ్ అన్నారు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో గురువారం ఎఫ్ఎన్సీసీ, ‘మా’, ఫిలింనగర్ సొసైటీ, పలువురు సినీ ప్రముఖులతో ఎన్నికల సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరైన సమావేశంలో సాయికిరణ్ మాట్లాడారు. తనకు ఎంత పెద్ద పదవి వచ్చినా మీ బిడ్డగా మీ మధ్యలోనే ఉంటానని, మీ తమ్ముడిలా ఆదరించాలని, మీ ప్రోత్సాహంతోనే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానన్నారు. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాన్ని నంబర్‌వన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. మంత్రి తలసాని మాట్లాడుతూ ఎల్లవేళలా తనకు అండగా నిలుస్తున్న సినీ ప్రముఖులు, సినీ కార్మికులు, చిత్రపరిశ్రమకు చెందిన సాంకేతిక నిపుణులు ఈ ఎన్నికల్లో తన బిడ్డ సాయికిరణ్ యాదవ్‌ను గెలిపించాలన్నారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ సాయి తన బిడ్డతో సమానమని గెలిపించి తీరుతామని వెల్లడించారు. దర్శకుడు ఎన్. శంకర్, నటి హేమ, ఎఫ్ఎన్సీసీ అధ్యక్షుడు కేఎల్ నారాయణ, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, దర్శకులు బి.గోపాల్, సాగర్ ఉన్నారు. -
విజయ తంత్రం
సికింద్రాబాద్ లోక్‌సభ టీఆర్ఎస్ అభ్యర్థి సాయికిరణ్ ఎన్నికల ప్రచారం బుధవారం మొదలైంది. ప్రచారాన్ని శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, మంత్రి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రారంభించారు. సాయికిరణ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. సాక్షి,సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయంతో మంచి ఊపుమీదున్న అధికార టీఆర్ఎస్ పార్టీ.. గ్రేటర్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రచార హోరును పెంచనుంది. ఈనెల 29న ఎల్బీ స్టేడియంలో ‘గులాబీ బాస్’ కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. మరుసటి రోజు(మార్చి 30) నుంచి ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో రోడ్‌షో నిర్వహించనున్నారు. మార్చి 31, ఏప్రిల్ 1,7 తేదీల్లోనూ ఆయన ఈ నియోజకవర్గంలోని తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్ల, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఇక సికింద్రాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో ఏప్రిల్ 4,5,6 తేదీల్లో అంబర్పేట్, ముషీరాబాద్, సికింద్రాబాద్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ఇక మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలోని ఉప్పల్, ఎల్బీనగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, కంటోన్మెంట్, మేడ్చల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 1,2,3,8 తేదీల్లో రోడ్‌షోలతో ప్రచారం హోరెత్తించనున్నారు. ప్రధానంగా గ్రేటర్ పరిధిలోని ఈ మూడు లోక్‌సభ స్థానాల నుంచి రాజకీయ నేపథ్యం, గెలుపునకు అవకాశంతో పాటు అన్ని విధాలా బలమైన కొత్త ముఖాలనే పార్టీ బరిలోకి దించింది. అయితే, పార్టీకి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, కేడర్ బలంగా ఉన్నప్పటికీ అభ్యర్థులు కొత్తవారు కావడంతో ప్రచార భారాన్ని పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్‌లు భజాన వేసుకున్నారు. మహానగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు గత ఐదేళ్ల కాలంలో చేపట్టిన సంక్షేమ పథకాలను అగ్రనేతలు, స్టార్ క్యాంపెయినర్లు ఓటర్లకు వివరించనున్నారు. ప్రధానంగా పట్టణ మిషన్ భగీరథ పథకం కింద మహానగరంలో విలీనమైన 11 శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో కృష్ణా, గోదావరి జలాలతో దాహార్తిని సమూలంగా దూరం చేయడంతోపాటు.. ఓఆర్ఆర్ లోపలున్న 190 గ్రామాలు, నగరపాలక సంస్థలకు తాగునీరు అందించిన తీరు, నిరుపేదలకు రూ.1కే నల్లా కనెక్షన్ ఏర్పాటు వంటి పథకాలను వివరించనున్నారు. ఇక గ్రేటర్ పరిధిలో ట్రాఫిక్ చిక్కులను నివారించేందుకు చేపట్టిన ఎస్ఆర్డీపీ పనులు, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల పురోగతి, పింఛన్లు తదితర సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఈ అంశాలనే ప్రధాన అస్త్రాలుగా అత్యధిక మెజార్టీ సాధించాలని యోచిస్తున్నారు. అభ్యర్థులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఆ దిశగా ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. -
అర్జున్‌రెడ్డికి మించి...
షఫీ, లక్కీ ఏకరీ, సాయికిరణ్, పూజశ్రీ, మేఘన, జ్యోతికయాదవ్ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘నందికొండ వాగుల్లోన’. సత్యనారాయణ ఏకరీని దర్శకుడిగా పరిచయం చేస్తూ రఘు.హెచ్ ఈ చిత్రం నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ని, నవనీత్ స్వరపరచిన పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సమర్పకులు సాయి వెంకట్, షిరాజ్ మాట్లాడుతూ– ‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో కంటే ఎక్కువ కంటెంట్ ఉంటుంది. ముఖ్యంగా బి, సి సెంటర్స్‌లో బాగా ఆడుతుందని నమ్ముతున్నాం. మార్చి 2న సినిమాను విడుదల చేయాలనుకున్నాం. కానీ, థియేటర్ల బంద్ కారణంగా రిలీజ్ చేయడం లేదు. మంచి డేట్ చూసుకొని విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘ఎ సర్టిఫికెట్ వచ్చిన సినిమానా? అనుకోకండి. ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు సత్యనారాయణ. ‘‘మా సినిమా రిలీజ్ చేయడానికి ముందుకొచ్చిన సాయివెంకట్, ఆర్.కె. గౌడ్గార్లకు ధన్యవాదాలు’’ అని నిర్మాత రఘు అన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ఆర్.కె. గౌడ్ పాల్గొన్నారు. -
టాలీవుడ్‌పై కన్నేసిన ఎయిర్టెల్ భామ
సాక్షి, హైదరాబాద్ : ఎయిర్టెల్ 4జీ యాడ్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సషా చెట్రీ టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనుంది. వినాయకుడు, కేరింత సినిమాల దర్శకుడు సాయి కిరణ్ అడవి మరో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రాన్ని తెరకెక్కించాలనుకుంటున్నారు. చిత్రంలోని పాత్రల్లో ఫ్రేష్ లుక్ కోసం కొత్త వారికి అవకాశం ఇవ్వాలనుకున్నారట. దీనికోసం జరిపిన ఆడిషన్లలో సాషా యాక్టింగ్ స్కిల్స్, డైలాగ్ డెలివరీతో డైరెక్టర్ ఇంప్రెస్ అయినట్టు సమాచారం. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ కూడా ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. డెహ్రాడూన్‌కు చెందిన ఈ 19 ఏళ్ల ముద్దుగుమ్మ మోడల్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. 2015 ఆగష్టులో ఎయిర్టెల్ నెట్వర్క్ ప్రచార యాడ్‌లో సషాకు అవకాశం రావడంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. -
హారర్ నేపథ్యంలో...
సాయికిరణ్, ప్రాచీ అధికారి జంటగా తెరకెక్కిన చిత్రం ‘వలపు సౌధం’. కష్ణమోహన్ దర్శకత్వంలో సునీల్‌సాగర్, మజ్ను సొహ్రాబ్ నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. సునీల్ సాగర్ మాట్లాడుతూ– ‘‘లవ్, హారర్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ఎస్.కె.మజ్ను స్వరపరచిన ఏడు పాటలు శ్రోతలను అలరిస్తాయి’’ అన్నారు. ‘‘నువ్వే కావాలి, ప్రేమించు’ చిత్రాల తర్వాత సాయికిరణ్‌కు ‘వలపు సౌధం’ మంచి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాం. మాజీ మిస్టర్ ఆంధ్ర బల్వాన్ పోలీసాఫీసర్‌గా నటించారు’’ అన్నారు దర్శకుడు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: మజ్ను రెహాన బేగం, కె.ఫిష్‌లక్ష్మి, సమర్పణ: పి.విజయ శేఖర్. -
ఆగస్టులో తొలి కిరణం
పి.డి రాజు, అభినయ, సాయి కిరణ్, భానుచందర్ ముఖ్య తారలుగా జె. జాన్‌బాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తొలి కిరణం’. టి.సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 28న రిలీజ్ కానుంది. ‘‘యేసు సిలువ వేసిన తర్వాత, ఆయన అక్కడే ఉన్న 40 రోజులు ఏం జరిగిందన్న కథతో సినిమా ఉంటుంది. సుమారు గంట గ్రాఫిక్స్ ఉంటాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నాం’’ అన్నారు దర్శకుడు. ‘యేసు పాత్ర చేయడం నా అదృష్టం’’ అని పీడీ రాజు అన్నారు. ఈ చిత్రానికి కో–ప్రొడ్యూసర్: కె సువార ్తపాల్. -
శ్రీకృష్ణ కేసరి టైటిల్ విజేత సాయికిరణ్
-
శ్రీకృష్ణ కేసరి టైటిల్ విజేత సాయికిరణ్
సాక్షి, హైదరాబాద్: ‘శ్రీకృష్ణ కేసరి టైటిల్’ తెలంగాణ రాష్ట్రస్థాయి రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో జె. సాయికిరణ్ సత్తా చాటాడు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో విజేతగా నిలిచి టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఫైనల్లో సాయి కిరణ్, ఈసా బిన్ జావేద్‌పై గెలుపొందాడు. విజేతగా నిలిచిన సాయికిరణ్‌కు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ బహుమతిగా లభించింది. యువ శ్రీకృష్ణ కేసరి టైటిల్‌ను టి. దేవీ సింగ్ దక్కించుకోగా... విజయ్ కుమార్ రన్నరప్‌గా నిలిచాడు. విజేతగా నిలిచిన దేవీ సింగ్ హోండా యాక్టివా బైక్‌ను అందుకున్నాడు. పోటీల అనంతరం జరిగిన ఈ బహుమతి ప్రదాన కార్యక్రమంలో ‘శాట్స్’ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, రెజ్లింగ్ సంఘం సభ్యులు విజయ్ కుమార్ యాదవ్, ముఖేశ్ చౌదరి పాల్గొన్నారు. -
సాయికిరణ్‌కు కేసీఆర్ కేసరి టైటిల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేసరి రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఎంకేయూ గులాబ్ వ్యాయామశాలకు చెందిన రెజ్లర్లు సత్తాచాటారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో 75–100 కేజీ విభాగంలో రెండు పతకాలను సాధించారు. జె. సాయి కిరణ్ ఈ విభాగంలో విజేతగా నిలిచి ‘కేసీఆర్ కేసరి’ టైటిల్‌ను గెలుచుకోగా... జె. నర్సింగ్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. బామ్ అఖాడాకు చెందిన అబ్దుల్ రహీమ్ రెండోస్థానంతో సరిపెట్టుకున్నాడు. మరోవైపు ‘యువ కేసరి’ టైటిల్‌ను సలే ఖులేఖి అఖాడాకు చెందిన జఫర్ బిన్ ముబారక్ గెలుచుకున్నాడు. 65–74 కేజీ విభాగంలో జరిగిన ఫైనల్లో జఫర్... టి. శివ సింగ్ (ఆర్పీసీ)ని ఓడించి విజేతగా నిలిచాడు. ఈ విభాగంలో జై భవాని వ్యాయామశాలకు చెందిన డి. సాయిదీప్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ కె. స్వామి గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహు మతులు ప్రదానం చేశారు. కేసీఆర్ కేసరి టైటిల్‌ను గెలుచుకున్న సాయికిరణ్‌కు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, యువకేసరి జఫర్‌కు పల్సర్ బైక్‌లు బహుమతులుగా లభించాయి. ఈ కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్‌రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, రాష్ట్ర రెజ్లింగ్ సంఘం అధ్యక్షులు విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. ఇతర వెయిట్ కేటగిరీల విజేతల వివరాలు 50 కేజీ: 1. కె. కిషోర్, 2. శ్యామ్ సింగ్, 3. ఎం. శ్రీకాంత్. 57 కేజీ: 1. అబూబకర్ బిన్ అలీ, 2. ఎం. విక్రమ్, 3. ఇలియాస్. 61 కేజీ: 1. ఎస్. అక్షిత్ కుమార్, 2. హెచ్. ధన్‌రాజ్, 3. విజయ్ కుమార్. 66 కేజీ: 1. వినయ్ కుమార్, 2. జి. అక్షయ్ యాదవ్, 3. కె. ఎస్. రూప్‌లాల్. 84 కేజీ: 1. చందన్ సింగ్, 2. ఒమర్ బిన్ జావేద్ 3. ముజాహిద్. 120 కేజీ: 1. షేక్ మొహమ్మద్, 2. అబ్దుల్ వసీఫ్, 3. శాంతికుమార్. -
‘ఉత్తమ అథ్లెట్స్’ సాయి కిరణ్, హారిక
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ కాలేజీ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో సాయి కిరణ్, హారిక సత్తా చాటారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీలో ‘ఉత్తమ అథ్లెట్స్’గా నిలిచారు. నిజాం కాలేజీకి చెందిన డి. సాయి కిరణ్ 927 పాయింట్లు సాధించగా... డీవీఎం కాలేజీకి చెందిన డి. హారిక 973 పాయింట్లతో నిలిచి టైటిల్స్‌ను దక్కించుకున్నారు. పురుషుల విభాగంలో ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాల (41 పాయింట్లు)... మహిళల విభాగంలో వనిత మహావిద్యాలయ (43 పాయింట్లు) ఓవరాల్ టీమ్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నాయి. అంతర్జాతీయ అథ్లెట్ పి. శంకర్ విజేతలకు ట్రోఫీలను ప్రదానం చేశారు. ఇతర పోటీల విజేతల వివరాలు 100మీ. పురుషులు: 1. కె. మహేశ్ (జీసీపీఈ), 2. కె. రాము (జీసీపీఈ), 3. విజయ్ (నిజాం). మహిళలు: 1. హారిక (డీవీఎం), 2. విశాలాక్షి (వనిత), 3. సుజాత (శివాని). 400మీ. పురుషులు: 1. డి. సాయికృష్ణ (నిజాం), 2. సాయి కుమార్ (జీసీపీఈ), 3. రహమాన్ (సెయింట్ జోసెఫ్). మహిళలు: 1.సుస్మిత (నిజాం), 2. బి. సాహితి (లా కాలేజీ), 3. సునీత (నిజాం). 10,000మీ. పురుషులు: 1. బి. రమేశ్ (పీజీ, సికింద్రాబాద్), 2. రంగయ్య (న్యూ బద్రుక), 3. శివానంద్ (అవంతి). మహిళలు: 1. అంకిత (కస్తూర్బా), 2. లావణ్య, 3. తేజస్విని. ట్రిపుల్ జంప్ పురుషులు: 1. వినోద్ కుమార్ (లయోలా), 2. సతీశ్ (నిజాం), 3. ఆర్. వెంకటేశ్ (ఏవీ కాలేజీ). మహిళలు: 1. పి. వీణ (ఏవీ కాలేజీ), 2. హిజ్రత్ (ఓయూ ఆర్ట్స), 3. రవళి (లయోలా). డిస్కస్ త్రో పురుషులు: 1. అంకిత్ (హాజీ గౌజ్ పీఈ), 2. జె. రాజు (నిజాం), 3. లిఖిత్ (భవన్స). మహిళలు: 1. సుమన, 2. సైరీ పాల్ (ఏవీ కాలేజీ), 3. డి. మానస (లయోలా). హ్యామర్ త్రో పురుషులు: 1. కె. అన్వేశ్ (నిజాం), 2. అంకిత్ (హాజీ గౌస్), 3. జి. శ్రవణ్ (లయోలా). మహిళలు: 1. కె. నాగ అనూష, 2. యాస్మిన్, 3. అఖిల. జావెలిన్ త్రో పురుషులు: 1. చార్లెస్ (ఓయూ), 2. ఎం. ప్రకాశ్ (జీసీపీఈ), 3. బి. రమేశ్ (నిజాం). మహిళలు: 1. డి. మానస (లయోలా), 2. రవళి (లయోలా), 3. ఆస్మా (సిద్ధార్థ). 110మీ. హర్డిల్స్ పురుషులు: 1. వి. సాయికుమార్ (శ్రీమేధ), 2. డి. సాయి కిరణ్ (నిజాం), 3. వినోద్ కుమార్ (లయోలా). మహిళలు: 1. విశాలాక్షి (వనిత), 2. హఫీజా (సెయింట్ ఆన్స), 3. మేనిత (ఎంజే ఇంజనీరింగ్ కాలేజీ). 1500మీ. పురుషులు: 1. కె. అనంద్ (జీడీసీఎస్), 2. వి. మారుతి (హాజీ గౌస్), 3. పి. మహిపాల్ (జీసీపీఈ). మహిళలు: 1. ప్రియాంక (వనిత), 2. మానస (కస్తూర్బా), 3. సునీత (నిజాం). 3000మీ. స్టీపుల్ చేజ్ పురుషులు: 1. శ్రీనివాస్ (జీసీపీఈ), 2. బి.రంగయ్య (బద్రుక), 3. బి. ప్రశాంత్. -
వీర్ తెలంగాణ కేసరి సాయికిరణ్
సాక్షి, హైదరాబాద్: తొలి వీర్ కేసరి తెలంగాణ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటీలు శనివారం నగరంలో ముగిశాయి. ఎల్బీ స్టేడియంలో ఈ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల పురుషుల 75-100 కేజీల విభాగంలో సాయి కిరణ్ విజేతగా నిలిచాడు. వీర్ తెలంగాణ కేసరి టైటిల్ అతనికి దక్కింది. 60-65 కేజీల విభాగం (జైరాం కేసరి)లో లాలా తాలిమ్కు చెందిన దేవీసింగ్ ఠాకూర్ విజేతగా నిలిచాడు. మహిళల 50-60 కేజీలో కేటగిరీలో ఆర్.శ్రీవాణి (కరీంనగర్) మొదటి స్థానంలో నిలిచింది. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా... ఒలింపిక్ పతక విజేత, స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. -
రాఖీ కట్టడానికి వచ్చి వెళ్తూ..
రాఖీ కట్టడానికి వచ్చిన అక్కను, తమ్ముడు అత్తవారి ఇంట్లో దించడానికి బైక్ పై తీసుకెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. దీంతో అక్కా, తమ్ముడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో ఆమె ఆరు నెలల కూతురు స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ సంఘటన మెదక్ జిల్లా జిన్నారం మండలం కిష్టాయపల్లి సమీపంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ప్రమీల(24)కు రెండేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా వెనుకనూతల గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం అయింది. వీరికి ఆరు నెలల పాప ఉంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా పుట్టింటికి వచ్చిన ప్రమీలను అత్తింట్లో దించడానికి తమ్ముడు సాయికిరణ్(22) స్కూటీపై తీసుకెళ్తుండగా.. సుల్తాన్పూర్ సర్వీస్ లైన్ వద్ద ఎదురుగా వచ్చిన బొలేరో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో అక్కా తమ్ముడు అక్కడికక్కడే మృతిచెందారు. ఆరు నెలల చిన్నారి మాత్రం స్వల్ప గాయాలతో బయటపడింది. తల్లి మృతదేహం వద్ద కూర్చొని చిన్నారి రోదిస్తున్న దృశ్యం స్థానికులను కంటతడి పెట్టించింది. -
మందలించారని వెళ్లిపోయాడు
పాలకొల్లు అర్బన్ : మండలంలోని భగ్గేశ్వరం గ్రామానికి చెందిన పోలంకి సాయికిరణ్ గతనెల 24 నుంచి కనబడడం లేదని అతని తండ్రి వెంకటేశ్వరరావు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ కె.రామకృష్ణ కథనం ప్రకారం.. సాయికిరణ్ డిగీ పూర్తి చేశాడు. ఖాళీగా ఉంటూ ఫేస్బుక్ ద్వారా పరిచయమైన రేణుక అనే యువతిని తల్లిదండ్రులకు తెలీకుండా హైదరాబాద్‌లో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు మందలించడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. దీంతో అతని తండ్రి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పాలకొల్లు పోలీస్‌స్టేషన్ నంబర్ 08814-222333, లేదా పట్టణ సీఐ సెల్ నంబర్ :9440796668, లేదా పట్టణ ఎస్ఐ సెల్ నంబర్ : 8500506071ను సంప్రదించాలని ఎస్ఐ కోరారు. -
మగబిడ్డ లేకుండా చేయాలని..
నిడదవోలు : బాలుడ్ని దారుణంగా హత్య చేసి, మరొకనిపై హత్యాయత్నం చేసినన కేసుల్లో నిందితుడు అడపా కోటసత్యనారాయణ ను పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. నిడదవోలు సీఐ కార్యాలయంలో కొవ్వూ రు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు కేసు పూర్వాపరాలను విలేకరులకు వెల్లడించా రు. ఆస్తి లేనందున తనను చిన్నచూపు చూస్తున్నారని, అవహేళన చేస్తున్నారని నిందితుడు అడపా సత్యనారాయణ బంధువులపై కక్ష పెంచుకున్నాడని డీఎస్పీ చెప్పారు. బంధువులకు మగబిడ్డ లేకుండా చేయాలనే దుర్బుద్ధితోనే ప్రణాళిక ప్రకారం అతడు బందుల సాయికిరణ్ (12)ను హతమార్చాడని, మరో వ్యక్తిని చంపబోయాడని వెల్లడించారు. ఇలా జరిగింది అట్లపాడుకు చెందిన బందుల రామకృష్ణ, వెంకటలక్ష్మి దంపతులకుమారుడు సాయికిరణ్ శెట్టిపేట గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. అదే ఊళ్లో ఉన్న అడపా సత్యనారాయణ ఈ బాలుడికి బాబయ్య వరస. కానీ అతడు అప్పటికే కిరణ్ కుటుంబంపై కత్తికట్టి ఉన్నాడు. 2వ తేదీ ఉదయం అమ్మమ్మ ఇంటి వద్ద ఉన్న సాయి కిరణ్‌ను ముందుగా వేసుకున్న పథకం ప్రకారం అతడు నిడదవోలు వెళ్లి ఎక్వేరియం తీసుకువద్దామని చెప్పి మోటార్‌సైకిల్ ఎక్కించుకున్నాడు. శెట్టిపేట శివారుల్లో సాయికిరణ్‌ను పీక నులిమి, కాలితో మెడను బలంగా అదిమి హత్యచేసి మృతదేహాన్ని వియార్ కాలువ పక్కన ఉన్న గోతిలో పారేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత శెట్టిపేట వచ్చిన అడపా సత్యనారాయణ తనకు వరసకు మేనల్లుడైన కానురు సత్యనారాయణను కూడా చంపాలనుకున్నాడు. తాటాకులు నరకడానికి రావాలని కోరి అతడిని తన బైక్‌పై పొలానికి తీసుకువెళ్లాడు. బైక్‌ను కానురు సత్యనారాయణకు ఇచ్చి వెనుక కూర్చున్న నిందితుడు వేలివెన్ను రోడ్డులో ఉండగా కొడవలితో దాడి చేసి తలపై నరికాడు. అతడు కింద పడిపోగా తల, చేతులపై పది సార్లు నరికాడు. ఈలోపు అక్కడి కూలీలు కేకలు వేయడంతో పరారయ్యాడు. కొనఊపిరితో ఉన్న కానురు సత్యనారాయణను ఆస్పత్రికి తరలించారు. అతడు ప్రస్తుతం రాజ మండ్రి ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ఈ కేసుల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి కత్తి, మోటార్ సైకిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు పరారై... వేలివెన్ను పుంత మార్గంలో పరారైన అడపా కోటసత్యనారాయణ డి. ముప్పవరం వద్ద కొడవలిని ఒక సంచిలో ఉంచి రోడ్డు పక్కన పారేశాడు. ఆపైన బైక్‌పై సమిశ్రగూడెం పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ వంతెన వద్దకు వెళ్లాడు. అక్కడినుంచి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా పోలీస్ కానిస్టేబుల్‌ను చూసి భయపడి వచ్చేశాడు. అక్కడినుంచి నిడదవోలు ఆస్పత్రి వద్దకు వచ్చాడు. అక్కడ గ్రామస్తులు కనిపించడంతో బస్టాండ్‌కు చేరుకుని అక్కడ బైక్ వదిలి బస్ ఎక్కి విజయవాడ వెళ్లాడు. ఆపై రైల్లో హైదరాబాద్‌కు పరారయ్యాడు. ఈలోపు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ప్రణాళిక ప్రకారం అతడ్ని మళ్లీ శెట్టిపేట రప్పించి ఇంటివద్దే అరెస్ట్ చేశారు. -
ఎవరినీ బెదిరించలేదు: తలసాని
సాక్షి, హైదరాబాద్: తన కుమారుడు సాయికిరణ్ ఎవరినీ కిడ్నాప్ చేయలేదని, బెదిరించలేదని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్పష్టం చేశారు. సాయిపై కిడ్నాప్ కేసు నేపథ్యంలో గురువారం మారేడ్‌పల్లిలోని తన నివాసంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. తన కుమారుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రామకోటేశ్వరరావు తదితరులతో కలసి 2011 ఓ నిర్మాణ సంస్థతో భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నాడని తెలిపారు. ఈ మేరకు పెద్ద మొత్తంలో సొమ్మును తాము రామకోటేశ్వరరావుకు ఇచ్చామన్నారు. దీనికి సంబంధించి పెట్టుబడులు వెనక్కు తీసుకోవాల్సిందిగా రామకోటేశ్వరరావు నుంచి ప్రతిపాదన వచ్చిందని.. అయితే ఏళ్లు గడుస్తున్నా డబ్బులు తిరిగి ఇవ్వలేదన్నారు. బుధవారం రామకోటేశ్వరరావు, అతని మిత్రుడు కృష్ణ, మరో భాగస్వామి రామకృష్ణ, తన కుమారుడు సాయి కిరణ్ తాజ్ కృష్ణ లాబీల్లో కూర్చుని ఈ విషయమై మరోసారి చర్చించుకున్నారని తెలిపారు. కొంత డబ్బులు చెల్లించడానికి అంగీకరించిన రామకోటేశ్వరరావు, మిగతా మొత్తాన్ని నాలుగైదు నెలల్లో ఇస్తానని ప్రతిపాదించాడన్నారు. ఈ మేరకు హామీ ఇస్తూ వైట్‌పేపర్ మీద తానే రాసిచ్చాక సుహృద్భావ వాతావరణంలోనే చర్చలు ముగించుకుని, అక్కడి నుంచి బయలు దేరారన్నారు. ఆ తర్వాత తన కుమారుడు బెదిరించాడని రామకోటేశ్వరరావు ఫిర్యాదు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. దీనిపై పూర్తి వివరాలను శుక్రవారం మరోసారి మీడియాకు వెల్లడిస్తానని మంత్రి చెప్పారు. -
ఫార్మసీ కాలేజీలో సీనియర్ల ర్యాగింగ్..
నల్లగొండ: సూర్యాపేట వికాస్ ఫార్మసీ కళాశాలలో సీనియర్ల ర్యాగింగ్ వ్యవహారం కలకలం సృష్టించింది. థర్డ్ ఇయర్ స్టూడెంట్ సాయికిరణ్‌పై సీనియర్లు ర్యాంగింగ్కు పాల్పడ్డారు. సీనియర్లు కొట్టడంతో విద్యార్థి సాయికిరణ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. దాంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.