శ్రీకృష్ణ కేసరి టైటిల్ విజేత సాయికిరణ్
సాక్షి, హైదరాబాద్: ‘శ్రీకృష్ణ కేసరి టైటిల్’ తెలంగాణ రాష్ట్రస్థాయి రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో జె. సాయికిరణ్ సత్తా చాటాడు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో విజేతగా నిలిచి టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఫైనల్లో సాయి కిరణ్, ఈసా బిన్ జావేద్‌పై గెలుపొందాడు. విజేతగా నిలిచిన సాయికిరణ్‌కు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ బహుమతిగా లభించింది.
యువ శ్రీకృష్ణ కేసరి టైటిల్‌ను టి. దేవీ సింగ్ దక్కించుకోగా... విజయ్ కుమార్ రన్నరప్‌గా నిలిచాడు. విజేతగా నిలిచిన దేవీ సింగ్ హోండా యాక్టివా బైక్‌ను అందుకున్నాడు. పోటీల అనంతరం జరిగిన ఈ బహుమతి ప్రదాన కార్యక్రమంలో ‘శాట్స్’ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, రెజ్లింగ్ సంఘం సభ్యులు విజయ్ కుమార్ యాదవ్, ముఖేశ్ చౌదరి పాల్గొన్నారు.