రాఖీ కట్టడానికి వచ్చిన అక్కను, తమ్ముడు అత్తవారి ఇంట్లో దించడానికి బైక్ పై తీసుకెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. దీంతో అక్కా, తమ్ముడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో ఆమె ఆరు నెలల కూతురు స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ సంఘటన మెదక్ జిల్లా జిన్నారం మండలం కిష్టాయపల్లి సమీపంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ప్రమీల(24)కు రెండేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా వెనుకనూతల గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం అయింది. వీరికి ఆరు నెలల పాప ఉంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా పుట్టింటికి వచ్చిన ప్రమీలను అత్తింట్లో దించడానికి తమ్ముడు సాయికిరణ్(22) స్కూటీపై తీసుకెళ్తుండగా.. సుల్తాన్‌పూర్ సర్వీస్ లైన్ వద్ద ఎదురుగా వచ్చిన బొలేరో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో అక్కా తమ్ముడు అక్కడికక్కడే మృతిచెందారు. ఆరు నెలల చిన్నారి మాత్రం స్వల్ప గాయాలతో బయటపడింది. తల్లి మృతదేహం వద్ద కూర్చొని చిన్నారి రోదిస్తున్న దృశ్యం స్థానికులను కంటతడి పెట్టించింది.