Pramila
-
పారిపోను.. సాయం చేస్తా
శత్రు దేశాలు, ఉగ్రమూకలు, తీవ్రవాదులు విరుచుకుపడినప్పుడు ఎంత శక్తిమంతమైన దేశమైనా అల్లకల్లోలంగా మారిపోతుంది. ఆ మధ్యన అప్ఘానిస్థాన్ పరిస్థితి ఇలానే ఉండేది. అది మర్చిపోయే లోపు ఉక్రేయిన్ రష్యా యుద్ధం మొదలై నేటికీ కొనసాగుతూనే ఉంది. అప్ఘానిస్థాన్, ఉక్రెయిన్లలో ఏర్పడిన పరిస్థితులకు భయపడిపోయిన చాలామంది ప్రజలు ప్రాణాలు అరచేత బట్టి దేశం విడిచి పారిపోయారు. ఇక ఆయా దేశాల్లో ఉన్న విదేశీయులు ముందుగానే పెట్టే బేడా సర్దుకుని తమ తమ దేశాలకు పరుగెత్తుకెళ్లారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. అయినా అక్కడ నివసిస్తోన్న 41 ఏళ్ల ప్రమీలా ప్రభు మాత్రం ‘‘నేను ఇండియా రాను. ఇక్కడే ఉండి సేవలందిస్తాను’’ అని ధైర్యంగా చెబుతోంది. కర్ణాటకలోని ఉడిపి జిల్లా.. హెర్గాలో పుట్టి పెరిగింది ప్రమీలా ప్రభు. మైసూర్లో చదువుకుంది. చదువు పూర్తయ్యాక ఉడిపిలోని మణిపాల్ ఆసుపత్రిలో నర్స్‌గా చేరింది. కొన్నాళ్లు ఇక్కడ పనిచేశాక, ఇజ్రాయేల్‌లో మంచి జీతంతో ఉద్యోగం దొరకడంతో.. తన ఇద్దరు పిల్లలతో ఇజ్రాయెల్‌కు వెళ్లింది. గత ఆరేళ్లుగా అక్కడే ఉంటోన్న ప్రమీలా ఆ దేశం మీద అక్కడి ప్రజల మీద మమకారం పెంచుకుంది. అందుకే పరిస్థితులు దారుణంగా ఉన్నప్పటికీ ... ‘‘ఇండియా నాకు జన్మనిస్తే.. ఇజ్రాయెల్ జీవితాన్నిచ్చింది. ఇలాంటి కష్టసమయంలో దేశాన్ని వదిలి రాను. నేను చేయగలిగిన సాయం చేస్తాను’’ అని కరాఖండిగా చెబుతూ అక్కడి పరిస్థితులను ఇలా వివరించింది.... నేను టెల్ అవీవ్ యాఫోలో నివసిస్తున్నాను. అక్టోబర్ 7తేదీన∙రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో భోజనం చేశాము. అప్పుడు ఎమర్జెన్సీ సైరన్ వినిపించింది. వెంటనే మేమంతా బంకర్లోకి వెళ్లిపోయాము. దాదాపు రాత్రంతా సైరన్ వినిపిస్తూనే ఉంది. నేను ఇజ్రాయెల్ వచ్చాక ఇంతపెద్ద హింసను ఎప్పుడూ చూడలేదు. మా ఇంటికి కిలోమీటర్ దూరంలో బాంబులు పడుతున్నాయి. పెద్దపెద్ద శబ్దాలు ఒక్కసారిగా భయపెట్టేశాయి. ఇక్కడ ప్రతి ఇంటికి బంకర్లు ఉన్నాయి. పబ్లిక్ ప్లేసుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బంకర్లు కూడా ఉన్నాయి. ఎమర్జెన్సీ సమయంలో ఎవరైనా వీటిలోకి వెళ్లి తలదాచుకోవచ్చు. సైరన్ మోగిన వెంటనే కనీసం ముప్ఫైసెకన్లపాటు బాంబుల శబ్దాలు వినపడుతున్నాయి. దశాబ్దకాలంగా ఇజ్రాయెల్‌పై తీవ్రవాద సంస్థ హమాస్ దాడులకు తెగబడుతూనే ఉంది. హమాస్ వల్ల గాజా కూడా దాడులతో కొట్టుమిట్టాడుతూనే ఉంది. ఇప్పటికే వెయ్యిమందికిపైగా చనిపోయారు. ఇక్కడి ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. టెల్ అవీవ్‌లో షాపులు అన్నీ మూసేసారు. వీధుల్లో అక్కడక్కడ ఒకరిద్దరు మాత్రమే విక్రయాలు జరుపుతున్నారు. అందరూ కిరాణా సామాన్లు తెచ్చుకుని నిల్వ చేసుకుంటున్నారు. అరగంట లోపలే... మా చెల్లి ప్రవీణ జెరుసలేంలోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తోంది. నేను టెల్ అవీవ్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నాను. ఈ అపార్ట్మెంట్లో ముఫ్పైమంది వరకు ఉన్నారు. మేమంతా అత్యవసరమైన ఆహారం, నీళ్లు, టార్చ్‌లైట్ వంటివాటిని దగ్గర ఉంచుకుని బేస్మెంట్ తలుపులు లె రుచుకుని ...సైరన్ రాగానే బంకర్లోకి పరుగెడుతున్నాం. సైరన్ ఆగినప్పుడు బంకర్ల నుంచి బయటకు వస్తున్నాం. బంకర్లోకి వెళ్లిన ప్రతిసారి అరగంట పాటు లోపలే ఉండాల్సి వస్తోంది. ఊహకందని దాడి ఇజ్రాయెల్‌మీద పాలస్తీనా దాడులు చేయడం ఇది కొత్తేమీ కాదు. కానీ ఇప్పుడు జరిగిన దాడి అస్సలు ఊహించలేదు. ఊహకందని వికృతదాడికి హమాస్ సంస్థ పాల్పడింది. దక్షిణ ఇజ్రాయెల్‌లో శాంతికోసం ఏర్పాటు చేసిన ‘మ్యూజిక్ ఫెస్టివల్’ను ఇలా అశాంతిగా మారుస్తారని అసలు ఊహించలేదు. ఆ ఫెస్టివల్ గురించి అత్యంత బాధాకరమైన వార్తలు వినాల్సి వస్తోంది. ఇజ్రాయెల్ ఎప్పుడూ.. యుద్ధానికి అన్నిరకాలా సన్నద్ధమై ఉండి, రక్షణాత్మక చర్యలను పర్యవేక్షిస్తుంటుంది. లేదంటే మరింతమంది హమాస్ దాడుల్లోప్రాణాలు కోల్పోయేవారు. ఇప్పుడు రాలేను.. ఇజ్రాయెల్ నాకు జీవితాన్నిచ్చింది. వీరు కష్టాల్లో ఉన్నప్పుడు నేను నా మాతృదేశం వచ్చి సంతోషంగా ఉండలేను. ఇజ్రాయెల్ ప్రభుత్వం అనుమతిస్తే నా సేవలు అందించడానికి సిద్ధ్దంగా ఉన్నాను. ఉడిపిలో ఉన్న మా కుటుంబ సభ్యులు పదేపదే ఫోన్ చేస్తున్నారు. నేను క్షేమంగా ఉన్నానా... లేదా... అని కంగారు పడుతున్నారు. ఇక నా పిల్లలు ఇండియా వెళ్లిపోయారు. వారిని విడిచి ఇక్కడ ఉన్నాను. వాళ్లంతా గుర్తొస్తున్నారు. అయినా ఇంతటి విపత్కర పరిస్థితుల నుంచి పారిపోవాలనుకోవడం లేదు. పరిస్థితులు చక్కబడిన తరువాత ఇండియా తిరిగి రావడం గురించి ఆలోచిస్తాను’’ అని చెబుతూ ఎంతోమంది స్ఫూర్తిగా నిలుస్తోంది ప్రమీలా ప్రభు. -
ఛాన్స్ అడిగితే గెస్ట్ హౌస్‌కి రమ్మన్నారు: 'బాహుబలి' బామ్మ
సినిమా ఇండస్ట్రీ పైకి చూడటానికి కలర్‌ఫుల్. కానీ లోపల చాలా జరుగుతుంటాయి. మరీ ముఖ్యంగా ఛాన్సుల కోసం ప్రయత్నించే లేడీ యాక్టర్స్.. చాలా ఇబ్బందులకు గురవుతుంటారు. అలాంటి సంఘటన తన విషయంలోనూ జరిగిందని సీనియర్ నటి ప్రమీలా రాణి చెప్పుకొచ్చింది. ఛాన్స్ ఇచ్చినట్లే ఇచ్చి గెస్ట్ హౌస్‌కి రమ్మన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈమె ఇంకా ఏమేం చెప్పింది? ఎవరీ నటి? కృష్ణా జిల్లాలో పుట్టిన ఈమె పేరు ప్రమీలా రాణి. దాదాపు 45 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంది. అప్పట్లో సహాయ పాత్రలు చేసిది. ఇప్పుడు మాత్రం అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలకు బామ్మగా నటిస్తూ చాలా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె చేసిన చిత్రాల్లో విక్రమార్కుడు, వేదం, బాహుబలి ఉన్నాయి. అయితే తనకు అప్పట్లోనే క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైనట్లు చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' బ్యూటీపై దారుణమైన కామెంట్స్.. గంటకు రూ.5 వేలు అంటూ!) ఏం జరిగింది? చిన్న వయసులోనే ఈమెకు పెళ్లి చేశారు. అయితే పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పడంతో భర్త వదిలేసి వెళ్లిపోయాడు. కొన్నాళ్ల తర్వాత రెండో పెళ్లి చేశారు. ఈమెకు 23 ఏళ్ల వయసులో అతడు చనిపోయాడు. దీంతో ఒంటరి అయిపోయింది. ఆ సమయంలో కుటుంబాన్ని చూసుకుంటూనే సినిమాల్లో నటిస్తూ వచ్చింది. కానీ ఓ సినిమా విషయంలో మాత్రం తనకు అవకాశం ఇచ్చి, గెస్ట్ హౌస్‌కి పిలిచారని ప్రమీలా రాణి చెప్పింది. యాక్టింగ్, షూటింగ్ అంటే వస్తానని.. ఇలాంటి వాటికి అస్సలు రానని ఖరాఖండీగా చెప్పేసింది. దీంతో ఆ సినిమా ఛాన్స్ పోయింది. ఇది తప్పితే తనకు ఇండస్ట్రీలో మరెలాంటి చేదు అనుభవాలు ఎదురవ్వాలనేది చెప్పింది. ప్రస్తుతం ఈమె వయసు 85 ఏళ్లు. ఇప్పటికీ చురుగ్గా ఉంటూ, సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. (ఇదీ చదవండి: హీరోయిన్ పూజాహెగ్డేకి గాయం.. ఆ ఫొటో వైరల్!) -
పెళ్లి చేసుకొమ్మంటే.. ప్రాణం తీశాడు
నిజాంపేట్: పాత పరిచయం కాస్త..ప్రేమగా మారింది. ఇద్దరిదీ ఒకే ప్రాంతం..ఒకే సామాజికవర్గం. అయినా పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి ఎందుకో ప్రియుడికి మనసొప్పలేదు. ప్రియురాలు ఒత్తిడి తేవడంతో మట్టుబెట్టాడు. పోలీసుల కథనం ప్రకారం...కామారెడ్డి జిల్లా మాచరెడ్డి మండలం నెమలిగుట్టతండాకు చెందిన ప్రమీల (22) ఏడాది క్రితం భర్త చనిపోవడంతో ఉపాధి నిమిత్తం బాచుపల్లి ఏరియాకు వచ్చింది. స్థానికంగా ఓ షోరూమ్‌లో పనికి కుదిరింది. భౌరంపేట్‌లోని ఇందిరమ్మ కాలనీలో రెడ్డిల్యాబ్‌లో పనిచేసే స్నేహితురాళ్లతో కలిసి ఉంటోంది. అదే మండలంలోని సోమరంపేట్ తండాకు చెందిన బాణావత్ తిరుపతి కొండాపూర్‌లో ఉంటూ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ప్రమీలకు తిరుపతితో పాత పరిచయం ఉంది. ఐదారు నెలలుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. పెళ్లి సంబంధాల విషయం తెలుసుకొని.. తిరుపతికి కుటుంబసభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నా రు. విషయం తెలుసుకున్న ప్రమీల పెళ్లి చేసుకుందామంటూ తిరుపతిపై కొద్దిరోజులుగా ఒత్తిడి చేస్తుండగా, వాయిదా వే స్తూ వస్తున్నాడు. ఇటీవల ప్రమీల తన స్వగ్రామానికి వెళ్లి మూడు రోజుల క్రితం నగరానికి తిరిగివచ్చింది. అయితే ప్రమీల శనివారం రాత్రి 9 గంటల తర్వాత గాయాలతో రూ మ్కు వచ్చిందని ఆమె స్నేహితురాళ్లు చెప్పా రు. అయితే పెళ్లి విషయంలో తిరుపతితో గొడవ జరిగి ఉంటుందని తెలిసింది. మాట్లాడుకుందామని రమ్మంటే.... ప్రమీల ఆదివారం ఉదయం తిరుపతికి ఫోన్ చేసింది. ఎప్పుడూ కలుసుకునే బాచుపల్లి వీఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ వద్దకు రమ్మని చెప్పింది. ఉదయం పదిన్నర ప్రాంతంలో తిరుపతి అక్కడకు రాగా, ఇద్దరూ గంటన్నరకుపైగా మాట్లాడుకున్నారు. పెళ్లి విషయమై ప్రమీల ఎంత ఒత్తిడి చేసినా తిరుపతి ఒప్పుకోలేదు. నేను వెళుతున్నానంటూ తిరుపతి రోడ్డు దాటేందుకు వెళుతుండగా, ప్రమీల కూడా అతనిని అనుసరించింది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఇద్దరూ రోడ్డు మధ్యలో డివైడర్ మీదనే ఉన్నారు. ఈ క్రమంలోనే గండిమైసమ్మ చౌరస్తా వైపు నుంచి బాచుపల్లి వైపు వస్తున్న ఓ ట్యాంకర్‌ను తిరుపతి గమనించాడు. ట్యాంకర్ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా ప్రమీలను తోసేశాడు. దీంతో ట్యాంకర్ ఢీకొని ప్రమీల అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన కొందరు స్థానికులు 108కు కాల్ చేశారు. పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రమీల మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. తిరుపతిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. -
పెళ్లి చేసుకోమంటే.. ట్యాంకర్ కిందకు తోసేసి..
నిజామాబాద్: మండలంలోని నెమలి గుట్ట తండాకు చెందిన బుక్య ప్రమీల(22)ను ఆమె ప్రియుడు హైదరాబాద్‌లోని బాచుపల్లిలో ఆదివారం ట్యాంకర్ కింద తోసేసి హత్య చేయడంతో తండాలో విషాదం నెలకొంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. ప్రమీల, మండలంలోని రోడ్డు బండ తండాకు చెందిన తిరుపతి కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ప్రమీల బాచుపల్లిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. తిరుపతి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని ప్రమీల తిరుపతిపై ఒత్తిడి తెచ్చింది. ఇద్దరు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ గొడవ పడ్డారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న వాటర్ ట్యాంకర్ కిందకు తిరుపతి ప్రమీలను తోసేయగా అక్కడికక్కడే మృతి చెందింది. తిరుపతి పరారీలో ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. -
మదనపల్లె మున్సిపల్ కమిషనర్‌గా ప్రమీల
మదనపల్లె సిటీ: మదనపల్లె మున్సిపల్ కమిషనర్‌గా కె. ప్రమీలను నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈమె సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ కమిషనర్‌గా పని చేస్తున్నారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఆమె మదనపల్లె మున్సిపల్ కమిషనర్‌గా రానున్నారు. మదనపల్లె మున్సిపల్ కమిషనర్‌గా పని చేస్తున్న రఘనాథరెడ్డి కర్నూలు జిల్లా ఆదోనికి బదిలీ అయ్యారు. -
‘నాన్న కష్టం చూడలేక’.. సూర్యుడి కంటే ముందే డ్యూటీ
ఈ ఇద్దరమ్మాయిలు... అక్కాచెల్లెళ్లు. అక్క ఇంటర్ ఫస్టియర్... చెల్లి టెన్త్ క్లాస్. ఇద్దరూ ధైర్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నారు. నాన్న కోసం కష్టమైన పనిని ఇష్టంగా అందుకున్నారు. ఆడపిల్లలు చేయని సాహసానికి సిద్ధమయ్యారు. చీకటి చీల్చడానికి సూర్యుడు డ్యూటీ చేస్తాడు. ఆ సూర్యుడికంటే ముందే వీళ్ల డ్యూటీ మొదలవుతుంది. సూర్యుడు వెలుతురును పంచేలోపు... ఈ అక్కాచెల్లెళ్లు అక్షరాల వెలుగును పంచుతున్నారు. నాన్నకు ఎదురైన కష్టాన్ని పంచుకున్నారు. ఇంటి చీకటిని తొలగిస్తున్న కాంతి వీచికలయ్యారు. తెలతెలవారుతోంది. హైదరాబాద్ నగర వీథుల్లో రోడ్డు మీద మాణింగ్ వాకింగ్ చేసే వాళ్లు, వీథులు చిమ్మేవాళ్లు తప్ప మనుష్య సంచారం పెద్దగా లేదు. ఓ అమ్మాయి రయ్యిమంటూ స్కూటీ మీద వచ్చి ఓ ఇంటి ముందు ఆగింది. న్యూస్ పేపర్ని రోల్ చుట్టి ఇంటి బాల్కనీలోకి విసిరేసింది. మరో కాలనీలో అంతకంటే చిన్నమ్మాయి ఇంటింటికీ వెళ్లి న్యూస్ పేపర్ వేస్తోంది. ఓ ఇంటి ముందు అప్పటికే నిద్రలేచి ఉన్న ఓ పెద్దావిడ నవ్వుతూ ఆ అమ్మాయిని పలకరించింది. ‘‘ఆడపిల్ల ఇంత ధైర్యంగా పొద్దున్నే ఇలా ఇంటింటికీ వచ్చి పేపర్ వేయడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందమ్మాయ్! అయినా ఇంత కష్టమైన పనికి ధైర్యంగా ముందుకు రావడం గొప్ప విషయమే. జాగ్రత్త తల్లీ’’ అని జాగ్రత్త చెప్పిందా పెద్దావిడ. ‘‘అలాగే మామ్మ గారూ!’’ అని ఆ అమ్మాయి కూడా నవ్వుతూ మామ్మగారికి టాటా చెప్పి మరో ఇంటిదారి పట్టింది. న్యూస్‌పేపర్ డెలివరీ చేస్తున్న ఈ అమ్మాయిలు కెలావత్ ప్రమీల, పవిత్ర. హైదరాబాద్, బోరబండ, శివమ్మ బాపురెడ్డి హిల్స్‌లో నివసిస్తున్నారు. రోజూ ఉదయం ఐదింటికే నిద్రలేచి ఆరు లోపు మోతీనగర్ చౌరస్తాలోని పేపర్ పాయింట్‌కు చేరుకుంటారు. ఏడు గంటల లోపు మోతీనగర్ చుట్టు పక్కల ఐదారు కాలనీల్లో పేపర్ వేసేసి, ఇంటికి వచ్చి రిఫ్రెష్ అయ్యి ఆన్లైన్ క్లాసులకు సిద్ధమవుతారు. పవిత్ర టెన్త్ క్లాస్, ప్రమీల ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నారు. కరోనా ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ కుటుంబానికి కూడా పరీక్ష పెట్టింది. బాయ్స్ మానేశారు ‘‘మా నాన్నకు న్యూస్ పేపర్ లైన్ ఉంది. ఇరవై ఏళ్లుగా పేపర్లు వేస్తున్నాడు. నాన్న దగ్గర బాయ్స్ ఉండేవాళ్లు. మా లైన్లో మొత్తం ఏడు వందల పేపర్లు పడేవి. కరోనా కారణంగా చాలా మంది పేపర్ మానేశారు. బాయ్స్ కూడా పని మానేశారు. కరోనా భయం తగ్గిన తర్వాత కొందరు బాయ్స్ మళ్లీ వచ్చారు. కానీ అప్పటికే పేపర్ కాపీలు బాగా తగ్గిపోయాయి. బాయ్స్‌కు ఒక్కొక్కరికి వెయ్యి, పన్నెండు వందలు ఇవ్వాలంటే నాన్నకు కుదిరేది కాదు. బాయ్స్ లేకుండా అన్ని ఇళ్లకూ నాన్న ఒక్కడే వేయాలంటే టైమ్ సరిపోయేది కాదు. పేపర్ లేటుగా వేస్తే కోప్పడతారు కదా! పైగా నాన్న పేపర్ వేసిన తరవాత ఫిల్మ్ నగర్లో రేషన్ షాపులో ఉద్యోగానికి వెళ్లాలి. నాన్న అటూ ఇటూ పరుగులు తీయాల్సి వచ్చేది. నాన్న కష్టం చూస్తుంటే బాధనిపించేది. దాంతో ‘మేము పేపర్ వేస్తాం నాన్నా’ అని నాన్నని ఒప్పించాం’’ అని చెప్పింది ప్రమీల. రోజూ పేపర్ చదువుతాం నాన్న పనిలో ఉండడం వల్ల మాకు రోజూ ఇంగ్లిష్, తెలుగు పేపర్లు చదవడం అలవాటైంది. మేము చదివేది ఇంగ్లిష్ మీడియమే, కానీ చిన్నప్పటి నుంచి పేపర్లు చదవడం వల్ల తెలుగు కూడా బాగా వచ్చేసింది’’ అని చెప్పారు ప్రమీల, పవిత్ర. బాగా చదువుకుని పోలీస్ ఆఫీసర్ అవుతామని చెప్తున్న ఈ అక్కాచెల్లెళ్ల సాహస ప్రస్థానం పలువురికి స్ఫూర్తిదాయకం. మెచ్చుకుంటున్నారు! లాక్డౌన్ పోయి అన్‌లాక్ మొదలైంది. కానీ పరిస్థితులు మాత్రం పూర్వపు స్థితికి చేరనేలేదు. పేపర్‌తో కరోనా రాదని తెలిసిన తర్వాత కూడా కాపీలు ముందులాగ పెరగలేదు. ఇప్పుడు మా లైన్లో మూడు వందల కాపీలు వేస్తున్నాం. మేము పేపర్ వేసే ఇళ్లలో పెద్ద వాళ్లు చాలామంది మమ్మల్ని పలకరించి మాట్లాడతారు. ‘ఆడపిల్లలు బాగా చదువుకోవాలి, అన్ని పనుల్లోనూ ముందుకు రావాలమ్మా. మిమ్మల్ని చూస్తే ముచ్చటేస్తోంది’ అంటారు. – ప్రమీల పేపర్ల మధ్య పెరిగాం! మేము చిన్నప్పుడు సెలవుల్లో నాన్న పేపర్ వేయడానికి వెళ్తుంటే మారం చేసి మరీ నాన్న స్కూటీ మీద వెళ్లే వాళ్లం. ఈ కాలనీలన్నీ మాకు బాగా తెలుసు. పేపర్ల మధ్యనే పెరిగాం. ఏ కాలనీలో ఏ పేపర్ ఎన్ని కాపీలు వేయాలనే లెక్క కూడా త్వరగానే తెలిసింది. మాకిద్దరికీ స్కూటీ నేర్పించాడు నాన్న. మా అక్క రూట్లో ఇళ్లు ఒకదానికొకటి దూరంగా ఉన్నాయి. తను స్కూటీ మీద వెళ్తుంది. దగ్గర దగ్గరగా ఉన్న ఎనభై పేపర్ల రూట్ నాది. పేపర్ వేసిన తరవాత నాన్న, అక్క, నేను ముగ్గురం కలిసి ఇంటికి వెళ్తాం – పవిత్ర – వాకా మంజులారెడ్డి -
మహిళా సమస్యలతో టార్చర్
ప్రస్తుత సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘టార్చర్’. గగన్, మణికంఠ, శ్యామ్, దుర్గాప్రసాద్, శ్రీరామ్ సంతోషి, ప్రమీళ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఎం.ఎం. నాయుడు దర్శకత్వంలో రఘు తోట్ల నిర్మిస్తున్నారు. రఘు తోట్ల మాట్లాడుతూ– ‘‘లేడీ ఓరియంటెడ్ నేపథ్యంలో సాగే చిత్రమిది. హరి చెప్పిన కథ బాగుండటంతో సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చాను. ఈ నెల 15న రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తాం’’ అన్నారు. ‘‘ఈ కథ కోసం చాలా రోజులుగా అందరం కష్టపడ్డాం. ఓ మహిళ స్టోరీని తీసుకుని మంచి స్క్రిప్టును రెడీ చేశాం’’ అన్నారు ఎం.ఎం. నాయుడు. ‘‘ఈ దేశంలో ఉన్న ప్రతి మహిళ శారీరకంగానో, మానసికంగానో సమస్యలు ఎదుర్కొంటోంది. చాలా తక్కువ మంది మాత్రమే వారు పడ్డ వేదనను బయటకి చెప్పుకుంటున్నారు. అలాంటి కథాంశంతో మా సినిమా ఉంటుంది’’ అన్నారు గగన్. ఈ చిత్రానికి సంగీతం: ప్రజ్వల్ క్రిష్, కెమెరా: తరుణ్. -
కాలం వెనక్కు వస్తుంది
నిముషం లేటైతేనే పరీక్ష రాయనివ్వరు. కొన్ని సంవత్సరాలు లేటైతే రానిస్తారా! ఇప్పుడీ పనికిపోతున్న ఆడపిల్లలు.. ఏదో ఒక ఉపాధిలో ఉన్న మహిళలు.. మళ్లీ చదువుకోవాలని ఆశపడితే?! ఎప్పుడో చూసిన క్లాసు పుస్తకాలను.. కనులపై మోసిన భవిష్యత్తు కలలను.. కాలం గిర్రున తిరిగి వెనక్కు తెచ్చిస్తుందా? ఇచ్చింది! గీతకు, ప్రమీలకు, కుష్బూకు ఇచ్చింది!! గీత ఒక్కటే ఉంటుంది. ఊరందరికీ ఆమె అక్క. ‘దీదీ’ అని కష్టం చెప్పుకోడానికి వస్తారు. ‘దీదీ’ అని సాయం అడగడానికి వస్తారు. ‘దీదీ’ అని చేతిలో పని అందుకోడానికి వస్తారు. గీత చేతిలో పని అందుకోవడం అంటే ఆమె చేతిలోని బంతిపూల గంపకు.. ఎత్తేటప్పుడు, దించేటప్పుడు.. ఒక చెయ్యి పట్టడం. గీతకు బంతిపూల తోటే ఉంది. పనివాళ్లు లేకుండా ఉంటారా! ఉన్నారు. అయితే తనూ ఒక గంప మొయ్యాలి. అప్పుడే తృప్తి. కొన్ని నెలల క్రితమే తోట పూయడం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు గీత అరవై వేల పూలను చుట్టుపక్కల మార్కెట్లలో అమ్మింది. తోట ఆమెదే, స్థలం మరొకరిది. ఒడిశాలోని రాయగడ జిల్లా కేంద్రానికి 39 కి.మీ. దూరంలో ఉన్న గిరిజన గ్రామం నిమల్‌లో ఉంటుంది గీత. ఐక్యరాజ్యసమితి నుంచి ‘సెకండ్ చాన్స్ ఎడ్యుకేషన్’ ప్రోగ్రామ్ వాళ్లు వచ్చినప్పుడు, వాళ్ల గురించి తెలుసుకుని రాయగడ వెళ్లింది. తనకు చదువూ ఇష్టమే. పూలతోటల పెంపకమూ ఇష్టమే అని చెప్పింది. పూల పెంపకాన్నే పుస్తకాల చదువుగా చేసుకొమ్మని చెప్పారు వాళ్లు. ఎలా పండించాలి, ఎలాంటి ఎరువులు వేయాలి, ఎలా మార్కెట్ చేసుకోవాలి.. వీటిల్లో శిక్షణ ఇచ్చారు. శిక్షణ చక్కగా పండుతోంది. ప్రస్తుతానికి గీత రాబడి కొద్దిగానే ఉన్నా సొంత కాళ్ల మీద నిలబడిన మహిళగా ఊళ్లో బాగానే గుర్తింపు వచ్చింది. పూల సాగును, పూల వ్యాపారాన్ని పెంచుకునేందుకు గ్రామంలోని యువతులకు ఆమె ఉపాధి కల్పించబోతోంది. తెలిసిన విద్య కనుక వారికి శిక్షణ కూడా ఆమే ఇస్తుంది. గీతకు ఒక అన్న ఉండేవాడు. చిన్నప్పుడు గీతను పనిలోకి పంపించడానికి బడి మాన్పించాడు. ‘నేనొక్కడినే అయితే ఎలాగైనా బతికేవాడిని. నిన్నూ బతికించాలి కనుక నువ్వూ పనికి వెళ్లాలి’ అనేవాడు! ఇప్పుడు గీతే అతడికి డబ్బులు పంపుతోంది. ప్రమీల టీనేజ్‌లో ఉంది. స్థోమత ఉంటే బాగా చదువుకోవలసిన వయసు. ఐదవ తరగతితో ఆమె చదువు ఆగిపోయింది. బంధువుల కలహాలలో తండ్రిని అవతలివైపు వాళ్లు చంపేశారు. కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా పోయింది. ప్రమీల కన్నా పెద్దవాళ్లు నలుగురు ఉన్నా, చిన్న వయసులోనే పెళ్లిళ్లు అయి ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. తల్లిని తనే చూసుకోవాలి. తల్లి కష్టపడి, నీరసపడి నాలుగు రాళ్లతో ఇంటికి రావడం చూడలేకపోయింది. వీళ్లది అస్సాం. పనమ్మాయిగా ఐదు వేలు రూపాయలు వస్తాయంటే రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు వెళ్లిపోయింది. నెల నెలా తల్లికి మూడు వేలు పంపిస్తోంది. పని చేస్తోంది కానీ, ప్రమీలకు చదువు మీద ఆశ పోలేదు. కనీసం టెన్త్ అయినా పూర్తి చేయాలని ఆమె తపన. ఇంటి యజమానులు బాగా చదువుకున్నవాళ్లు. ఆమెను సెకండ్ ఛాన్స్ ప్రోగ్రామ్‌లో చేర్పించడంతో పాటు, చదువుకునే వెసులుబాటునూ కల్పించారు. ప్రోగ్రామ్ వాళ్లు ఆమెను ఎన్.ఐ.ఒ.ఎస్. (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్) లో చేర్పించారు. ప్రస్తుతం ప్రమీల పనిచేస్తూనే టెన్త్ చదువుతోంది. స్టడీ కిట్‌ను కూడా వాళ్లే ఇప్పించారు. ఆ అమ్మాయిలో ఇప్పుడు అంతులేని ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. మునుపటి నిరాసక్తత లేదు. జీవితంలో చదువు అనేది ఒకటి ఉంటుందని పద్దెనిమిదేళ్లకే మర్చిపోయింది ఖుష్బూ కుమారి. స్త్రీ పురుష సమానత్వ సాధనకు, స్త్రీ సాధికారతకు చదువే ముఖ్యం అని ఆమె ఇప్పుడు గ్రహించింది. అంత అమాయకపు ప్రాణానికి ఇవి పెద్ద మాటలు అనుకోనక్కర్లేదు. బిహార్‌లోని గయ జిల్లాలో, దొహారీ గ్రామం ఖుష్బూది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె కుటుంబం ఆమెను చదువు మానేయమంది. తల్లి, తండ్రి, తోబుట్టువులు. అందర్లోకి ఖుష్బూ పెద్ద. ఇంటిని పోషించలేక కూతుర్నీ కొన్నాళ్లు పనికి పంపించాడు తండ్రి. సెకండ్ ఛాన్స్ ఎడ్యుకేషన్ టీమ్ ఆ ఊరు వచ్చినప్పుడు ఎవరో చెబితే ఖుష్బూ వెళ్లి వాళ్లను కలిసింది. వాళ్ల స్టడీ ప్రోగ్రాంలో చేరిపోయింది. ఇంటికి వచ్చి మరీ తండ్రికి నచ్చజñ ప్పి ఆ అమ్మాయికి స్టడీ బుక్స్ ఇచ్చి వెళ్లారు యు.ఎన్. వాళ్లు. హిందీ, సోషల్ సైన్స్, హోమ్ సైన్స్ ఆమె సబ్జెక్టులు. కరోనా ఆమె చదువుకేమీ అంతరాయం కలిగించడం లేదు. కొరియర్లో పాఠాలు వస్తున్నాయి. వారం క్రితమే జూలై 15న ‘యూత్ స్కిల్స్ డే’ రోజు ఐక్యరాజ్యసమితి ‘ఉమెన్ ఇండియా’ విభాగం.. గీత, ప్రమీల, ఖుష్బూలను ‘పట్టుదల గల అమ్మాయిలు’ అని అభినందించింది. చదువు, ఉద్యోగం ఆడపిల్లలకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. ఆడపిల్లను బడి మాన్పించి, పనిలో చేర్పిస్తే కుటుంబానికి ఆమె ఆసరా అవొచ్చు. తిప్పలు పడైనా ఆమెను చదివిస్తే ఆ తర్వాత కుటుంబానికి, సమాజానికి కూడా ఆమె ఇచ్చే ఆసరా ముందు ఇది చాలా స్వల్పం, స్వార్థం అనిపిస్తుంది. సెకండ్ చాన్స్ ఎడ్యుకేషన్ (ఎస్.సి.ఇ.) బడికెళ్లి చదువుకునే భాగ్యం అందరు ఆడపిల్లలకూ ఉండదు. పనికి వెళ్లి పది రూపాయలు సంపాదించుకు రావడమే వారి పుట్టుకకు పరమావధి అన్నట్లు ఉంటుంది. మన దేశంలో పదిహేనేళ్ల వయసు దాటిన ప్రతి నలుగురు మహిళల్లో ముగ్గురు పనికి వెళితే కానీ ఇల్లు గడవని పరిస్థితిలో ఉన్నవారే. వీళ్లను పని నుంచి చదువుకు మళ్లించి, పదిమందికి వీళ్లే పనిచ్చే చదువునూ చెప్పించి జీవితంలో నిలబడేలా చేస్తోంది ‘సెకండ్ చాన్స్ ఎడ్యుకేషన్’. ఈ చదువుల శిక్షణను ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం ‘యు.ఎన్. ఉమెన్’ 2018 నుంచి దేశవ్యాప్తంగా బాలికలకు, మహిళలకు ఉచితంగా ఇప్పిస్తోంది. చదువుకోవాలని ఆశ ఉండి చదువుకోలేకపోయిన వారికి, ఏదో ఒక పనితో జీవితాన్ని నెట్టుకొస్తూ.. సొంతంగా ఏదైనా చేసుకుంటే బాగుంటుందని ఆశ పడుతున్న వారికి ‘సెకండ్ చాన్స్ ఎడ్యుకేషన్’ ఉపయోగకరంగా ఉంటోంది. ఎడ్యుకేషన్ అంటే రెండూ.. పుస్తకాల ఎడ్యుకేషన్, ఉపాధి ఎడ్యుకేషన్. -
ప్రమీలక్క
పులి ముందుకు వెళ్లాలంటే వేటగాడికి తుపాకీ కావాలి. తుపాకీ లేకుండా వెళ్లాలంటే ధైర్యం కావాలి. ధైర్యం కూడా లేకుండా వెళ్లాలంటే ‘ప్రేమ’ కావాలి. పులిపై ప్రేమ! ప్రమీలకు ప్రేమ మాత్రమే కాదు, పులితో ఏదో బంధం కూడా ఉన్నట్లుంది. ‘అవని’ పులితో కూతురి బంధం, అవని కూనలతో అక్క బంధం. ప్రమీల ఫారెస్ట్ గార్డ్. ఆమెతో పాటు ఐదుగురు మగ గార్డులు ‘అవని’ పిల్లల్ని వెతికి, సంరక్షించేందుకు ఏడాదిన్నరగా అడవిని గాలిస్తున్నారు. చివరికి ప్రమీలకు మాత్రమే ఆ రెండు కూనలు కనిపించాయి! ‘మదర్లీ ఇన్స్టింక్ట్’ అంటారు. పిల్లల కోసం ‘అవని’ పులి గుండె ప్రమీలలో కొట్టుకుందా? ఆ చప్పుడును అవని పిల్లలు వినగలిగాయా! అందుకే ఆమెకు మాత్రమే కనిపించాయా! మనిషిని మెడ దగ్గర నోట కరుచుకుని వెళ్లడానికి నెత్తురు రుచి మరిగిన పులికి ఒక్క అంగ చాలు. పులికి రెండు మూడు అంగల దూరంలో మాత్రమే ఉంది ప్రమీల! మొదట పులే ఆమెను చూసింది. కొన్ని క్షణాలకు పులిని ఆమె చూసింది. పులిని చూడ్డం కాదు, పులి తననే చూస్తుండటం చూసింది. పైగా ప్రమీల ఉన్న చోటుకు పులి వచ్చేయలేదు. పులి ఉన్న చోటుకే ప్రమీల వెళ్లింది. అడవి అది. కాసేపట్లో చీకటి అడవి అవుతుంది. ఈమె వన్య సంరక్షకురాలు. ఆమె (ఆడపులి) అరణ్య సంచారి. ప్రమీల మనిషి కాకుండా పులి అయివున్నా, పులి.. పులి కాకుండా మనిషి అయివున్నా ఇద్దరూ తల్లీకూతుళ్లలా ఉండేవారు. ప్రమీల వయసు ఇరవై ఆరేళ్లు. పులి వయసు ఆరేళ్లు. ఆరేళ్లంటే మనుషుల్లో యాభై ఏళ్లు. అలా చూసినా ప్రమీల పులికి కూతురవుతుంది. అప్పటికే పది మంది మనుషుల్ని చంపేసిన ఆ పులి.. ప్రమీలను చూసి కూడా చూడనట్లు వెళ్లిపోయింది! పది మందిని చంపేసిన పులి అదే అని ప్రమీలకు తెలియదు. తను చూసింది పులిని మాత్రమే అనుకుంది. అక్కడి నుంచి వచ్చేశాకే.. మనుషుల్ని చంపడానికి అలవాటు పడిన ‘టీ1’ పులి అదేనని తెలిసింది. పులుల జాడ కోసం అడవిలో కెమెరా ట్రాప్లను అమర్చే పనిలో ఉంది ప్రమీల ఆ రోజు. కెమెరాలెందుకు నేరుగానే కనిపిస్తున్నా కదా అన్నట్లు ఎదురొచ్చింది ఆ పులి! డ్యూటీ ముగించుకుని చీకటి పడే వేళకు తను ఉంటున్న అంజి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయ నివాసానికి చేరుకుంది ప్రమీల. అంజి రేంజ్ మహారాష్ట్రలోని యావత్మల్ పర్వత శ్రేణుల కిందికి వస్తుంది. చీకటితో పాటే ఆ చుట్టుపక్కల ఇళ్ల తలుపులకు గడియలు పడుతున్నాయి. గాలొచ్చి తలుపు తట్టినా, ‘టీ1’ పులి వచ్చి తడుతున్నట్లే ఉలిక్కిపడుతున్నారు. రాత్రి పూట పులి చూపు మనిషి చూపు కన్నా ఆరు రెట్లు చురుగ్గా ఉంటుంది. పగటి పూట అన్ని రెట్లు ఉండదు. అందుకేనా ప్రమీల తనకసలు కనిపించనే లేదన్నట్లు పులి వెళ్లిపోయింది! లేక, పూర్వ బంధంలా ఏదైనా అపూర్వ బంధంతో ‘ఈ తల్లీకూతుళ్ల’ను కలపాలని యాభై వేల చదరపు కి.మీ. విస్తీర్ణంలోని ఆ అటవీ ప్రాంతం తనకు తానుగా సంకల్పించుకుందా! అంజి రేంజ్లో రెండు వందల ఎకరాల అటవీ ఆవరణలో ప్రమీల డ్యూటీ. ఆ ఆవరణలోనే పులి తనను చూసింది. చూసి వదిలేసింది. ‘టీ1’ అనేది పులికి అధికారులు పెట్టిన పేరు. వన్యప్రాణి ప్రేమికులు పెట్టుకున్న పేరు ‘అవని’. అవని చంపిన మనుషుల సంఖ్య పదమూడుకు చేరాక.. ఓ రోజు హైదరాబాద్ నుంచి వెళ్లిన హంటర్.. అవనిని చంపేశాడు. అడవిలో ప్రమీల అవనిని చూసింది 2017 సెప్టెంబర్ లో. అవనిని హంటర్ చంపేసింది 2018 నవంబర్‌లో. చనిపోయే నాటికి అవనికి రెండు పిల్లలు ఉన్నాయి. తుపాకీ తూటాకు తల్లి నేలకొరుగుతున్న సమయంలో అవి తల్లి దగ్గర లేవు. ఉండి ఉంటే, తల్లి కోసం అవి ఏమైనా చేసి ఉండేవి. ఏమీ చేయలేకపోయినా హంటర్ని అవి గుర్తుపెట్టుకుని ఉండేవి. చెప్పలేం, ఆ హంటర్‌కి వాటి చేతుల్లో ఏనాటికైనా ఏమైనా రాసి పెట్టి ఉందేమో. పులులకు చూపు తీక్షణతే కాదు, జ్ఞాపకశక్తి కూడా ఎక్కువే. అవని పిల్లల్లో ఒకటి ఆడ కూన. ఒకటి మగ కూన. తల్లి చనిపోవడంతో పది నెలల వయసులోనే అనా«థలయ్యాయి. ఆ కూనల జాడలు కనిపెట్టి వాటిని సంరక్షించే çపనిని మగ గార్డుల మీద పెట్టింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్! ‘‘నేను కూడా వెళ్లి వెతుకుతాను సర్’’ అంది ప్రమీల. అధికారులు వెళ్లనివ్వలేదు. ‘‘పగటి పూట అడవిలోకి వెళ్లడం వేరు. రాత్రి పూట వెళ్లడం వేరు. ఎందుకమ్మాయ్ రిస్కు?’’ అన్నారు. అభర్ణ అనే మహిళా డిప్యూటీ కన్జర్వేటర్ బదిలీపై అక్కడికి వచ్చే వరకు కంప్యూటర్ ఆపరేటర్గానే ఉండి పోయింది ప్రమీల. ఆమె ‘ఎస్’ అనగానే.. దారితప్పి జనారణ్యంలోకి వచ్చి, మళ్లీ ఏ విధంగానో తనుండే అరణ్యంలోకి దారి కనుక్కున్న పులిలా నైట్ డ్యూటీలోకి దుమికింది ప్రమీల. అప్పటికే ఐదుగురు మగ గార్డులు కూనల కోసం గాలిస్తున్నారు. చివరికి ప్రమీల మాత్రమే వాటిని గుర్తించగలిగింది! అడవిలో మూల మూలలా ఎరలు వేసి, పంజా ముద్రలు పడే మెత్తలు (పబ్ ఇంప్రెషన్ ప్యాడ్స్) పరిచి, కిలో మీటర్ల కొద్దీ నడిచీ.. రేయింబవళ్లు శ్రమించిన ఏడాదిన్నరకు ప్రమీలకు మొదట.. ఆడకూన కనిపించింది! మిగతా మగ గార్డులకు కనిపించని ఆడకూన ప్రమీలకు కనిపించింది. తల్లి బిడ్డను ఒడిలోకి తీసుకున్నట్లుగా ఆ కూనను తన సంరక్షణలోకి తీసుకుంది ప్రమీల. రెండున్నరేళ్ల వయసు వచ్చేవరకు పులి పిల్లలు తల్లితోనే ఉంటాయి. అప్పటికి ఆ కూన వయసు పద్దెనిమిది నెలలు. అవని పులికి ప్రమీల కూతురు అనుకుంటే, అవని పులి పిల్లలకు ప్రమీలను అక్క అనుకోవాలి. తనకు పుట్టబోయే బిడ్డల కోసమే ఆ రోజు ప్రమీలను ఏం చేయకుండా వదిలేసిందా.. అవని?! ఆడకూన కనిపించిన కొన్నాళ్లకే జూన్‌లో మగకూన కూడా కనిపించింది. అదీ ప్రమీలకే. అయితే ఇలా కనిపించి, అలా మాయమైంది. అసలైతే క్షేమంగానే ఉంది. అదీ సంతోషం. దాన్నిప్పుడు పట్టి, భద్రంగా చేతుల్లోకి తీసుకునే వెదకులాటలో ఉంది ప్రమీల. తల్లి లేని బిడ్డల్ని అక్కడికీ ఇక్కడికీ కాకుండా.. నేరుగా తల్లి లాంటి వాళ్ల చెంతకి చేర్చే శక్తి ఒకటి పనిచేస్తూ ఉంటుందేమో ప్రకృతి యంత్రాంగంలో! అవనిపులి పిల్లలకు అక్కలా దొరికిన ప్రమీలకు ఈ నెల 21న ‘అంతర్జాతీయ అడవుల దినోత్సవం’ రోజు రెండు ఐదొందల నోట్ల కట్టలను జాతీయ పులుల సంరక్షణ సంస్థ బహుమతిగా ఇవ్వబోతోంది. అవని 2018 నవంబర్ 2 వేటగాడి తూటాకు బలైన ఆడపులి -
ఈమె పిలిస్తే నెమళ్లు వస్తాయి
ఒరిస్సాలోని తూర్పు ప్రాంతంలో ఉన్న గంజాం జిల్లాలో ప్రమీలా బిసోయిని ‘దేవ మాత’ అని పిలుస్తారు. దానికి కారణం ఆమెకు మహిమలు ఉండటం కాదు. మహిమల కంటే ఎక్కువ అనదగ్గ పర్యావరణ స్పృహ ఉండటం. 71 ఏళ్ల ప్రమీలా బిసోయి గంజాం జిల్లాలో ‘పాకిడి’ గిరిశ్రేణుల్లోని విస్తారమైన అటవీ సంపదకు చౌకీదారు. గత పద్దెనిమిదేళ్లుగా ఒరిస్సా ప్రభుత్వం అక్కడి స్త్రీల స్వయం సమృద్ధికి మొదలెట్టిన ‘స్త్రీశక్తి’ అనే కార్యక్రమంలో ఉత్సాహంగా దూకిన బిసోయి నెమ్మదిగా ఆ స్త్రీలను తరలిపోయిన అడవిని తిరిగి పిలవడానికి ఉద్యుక్త పరిచింది. ‘నేను ఈ ప్రాంతానికి నవవధువుగా వచ్చినప్పుడు అడవి ఎంతో పచ్చగా ఉండేది. ఝరులు సంవత్సరం మొత్తం పారేవి. పక్షులు కిలకిలలాడేవి. దాదాపు ముప్పై నలభై ఏళ్ల కాలంలో చెట్లు నరికేయడం వల్ల అంతా పోయింది. మళ్లీ ఆ అడవిని చూడాలని నిశ్చయించున్నాను’ అంటుంది ప్రమీలా. మొత్తం 1970 హెక్టార్లలో అటవీ శాఖ ఆధీనంలో ఉన్న ఆ అడవిలో బిసోయి చేసిన మొదటి పని స్త్రీశక్తి పథకంలో ఉన్న స్త్రీలను చాలామందిని అడవిని ఒక కంట కనిపెట్టి ఉండమని చెప్పడం. వీరు ఎప్పుడైతే కాపలాకు నిలిచారో కలప దొంగలు ఆ వైపు చూడటానికి భయపడసాగారు. ఇక ఈ స్త్రీలే రంగంలో దిగి తిరిగి చెట్లు నాటారు. రాళ్లను తవ్వుకొని పోవడంతో ఏర్పడ్డ గుంతలను పూడ్చారు. డొంకల్లో పూడికలు తీశారు. కొద్ది సంవత్సరాల్లోనే అడవి పెరిగింది. అప్పుడు వచ్చిన తొలి అతిథే– నెమలి. అడవి తరగడంతో మాయమైపోయిన నెమలి ఎప్పుడైతే అడవి పెరిగిందో తిరిగి వచ్చింది. ఆడనెమళ్లు సాధారణంగా వెదురుపొదల్లో గుడ్లు పెడతాయి. అందుకని బిసోయి అడవిలో విస్తారంగా వెదురు నాటించింది. ఆ వెదురు ఇంత నుంచి అంత పెరిగింది. ఒక నెమలి రెండు నెమళ్ల నుంచి ఇవాళ పాకిడి అడవిలో రెండు వేల నెమళ్లు తమ తావు ఏర్పరుచుకున్నాయి. భారతదేశంలో ఇంత పెద్ద నెమళ్ల శాంక్చరీ మరొకటి లేదు. ‘నెమళ్ల వల్ల ఒక్కోసారి పంటలు దెబ్బ తింటాయి. అయినా మేము వాటిని ఏమీ అనం. అవి మాలో భాగం అనుకుంటాము’ అంటుంది బిసోయి. బిసోయి చేసిన ఈ కృషి ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు తెలిసింది. ఆయన ఏకంగా ఆమెకు అదే ప్రాంతానికి చెందిన ‘అస్కా’ పార్లమెంట్ సీట్ ఇచ్చారు. ఆమె ఘనవిజయం సాధించి ఎం.పి అయ్యింది. తను ఎలా ఉందో అలాగే ఆ గిరిజన ఆహార్యంలోనే పార్లమెంట్‌కు హాజరయ్యింది. ఒరిస్సా భాషలో అక్కడ మాట్లాడి కరతాళధ్వనులు అందుకుంది. ఇటువంటి స్త్రీలు ఒక వందమంది ఉంటే చాలు ఈ దేశం వనసందోహం తప్పక అయి తీరుతుంది. -
భర్తను హతమార్చి నెల రోజులుగా కిచెన్‌లో దాచి..
భోపాల్ : వేరే మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడనే ఆగ్రహంతో భర్తను మట్టుబెట్టి నెలరోజుల పాటు కిచెన్‌లో దాచిన భార్య ఉదంతం మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. అనుపూర్ జిల్లాలోని కరోండి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్టోబర్ 22న తన భర్త మహేష్ బనవల్ (35) కనిపించడం లేదని భార్య ప్రమీల ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నెలరోజుల పాటు మహేష్ ఆచూకీ లభించకపోవడంతో ఆయన సోదరుడు అర్జున్ పోలీసులను ఆశ్రయించడంతో ఈనెల 21న ఈ కేసు కీలక మలుపు తిరిగింది. తన సోదరుడికి ఏమి జరిగిందో తెలుసుకునేందుకు వారి ఇంటికి వెళ్లిన ప్రతిసారి తమ వదిన మహేష్‌ను తాము పొట్టన పెట్టుకున్నామని తమను ఇంటిలోకి రానివ్వకుండా నిందలు మోపుతోందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ప్రమీల ఇంటికి వెళ్లగా అక్కడ నుంచి దుర్వాసన రావడంతో కిచెన్‌లో కుళ్లిన స్ధితిలో మహేష్ మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. నెలరోజులుగా భర్త మృతదేహాన్ని కిచెన్ శ్లాబ్‌పై ఉంచి ప్రమీల అక్కడే వంట చేసుకోవడం అందరినీ దిగ్ర్భాంతికి గురిచేసింది. తన భర్త మహేష్ తన బావ భార్యతో వివాహేతర సంబంధం కలిగి ఉండటంతో బావ సహకారంతో తాను ఈ హత్యకు పాల్పడ్డానని ప్రమీల నేరం అంగీకరించారు. మహేష్, ప్రమీల దంపతులకు నలుగురు కుమార్తెలు ఉండటం గమనార్హం. తండ్రి హత్యకు గురికావడం, తల్లిని పోలీసులు అరెస్ట్ చేయడంతో నలుగురు కుమార్తెలు దిక్కులేని వారయ్యారని బంధువులు, స్ధానికులు ఆందోళన వ్యక్తం చేశారు. -
అత్తమ్మ
ప్రమీల ఇంటికొచ్చింది ఆమె తల్లి పార్వతమ్మ. తల్లిని చూసి ఎంతో సంబరపడింది ప్రమీల.తల్లికి ఇష్టమైనవి వండి పెడుతూ, తను కొనుక్కున్న నగలు, చీరలను చూపెడుతూ, ఊళ్ళో ఉన్న తన అత్తగారు, ఆడబిడ్డలని ఆడిపోసుకోవడంతోనే నాలుగు రోజులు గడిచిపోయాయి.అలా అని కూతురు చెప్పిందానికల్లా తల ఊపేసి భుజంతట్టే రకం కాదు పార్వతమ్మ.తన కూతురైనా సరే అకారణంగా ఇతరులను ద్వేషించడం ఆమెకు నచ్చేది కాదు.‘‘అలా తిట్టొద్దు తల్లీ’’ అని ఎన్నోసార్లు చెప్పి చూసినా వినేది కాదు ప్రమీల.పైగా...‘‘అమ్మా, వాళ్ల గురించి నీకు తెలియదు’’ అని దబాయించేది.కూతురి మొండి వైఖరి తెలిసిన పార్వతమ్మ దీనికి బుద్ధెప్పుడు వస్తుందో అని అనుకునేది. ప్రమీల భర్త ప్రసాదరావు చాలా మంచివాడు. భార్య తన తల్లికి, చెల్లెళ్ళకు మర్యాద ఇవ్వకపోయినా వాళ్ళు రావటం ఆమెకు ఇష్టం లేకపోయినా, వాళ్ళు వచ్చినప్పుడు ఆమె పెద్దగా నోరు పారేసుకున్నా సహించి ఊరుకొనేవాడు తప్పితే తిరిగి ఆమెను ఏమనేవాడు కాదు.భార్య నోటికి జడిసి సంపాదించే యంత్రంలా మారి ఆమెను సుఖపెడుతున్నాడే గానీ ఊళ్ళో ఒంటరిగా ఉన్న తన తల్లిని తన దగ్గరికి తెచ్చిపెట్టుకోవటానికి ఏ మాత్రం సాహసించలేదు. ఎప్పుడైనా తల్లి కొడుకు ఇంటికి నాల్గురోజులుండి పోదామని వస్తే రెండో రోజే వెళ్ళిపోయేదావిడ ప్రమీల ఈసడింపు మాటలను భరించలేక.అందుకని ఊళ్ళోనే ఉంటూ అప్పుడప్పుడు కొడుకునే వచ్చి చూసిపోమనేది. ఇంటి చుట్టు పక్కల దగ్గర బంధువులుండటం వలన తల్లిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మనసులోనే బాధ పడేవాడు ప్రసాదరావు.పొద్దున పదిగంటలకు ఆఫీసుకెళ్ళబోతున్న అల్లుడితో...‘‘అల్లుడు గారు, నేనొచ్చి అప్పుడే వారం రోజులైంది. ఈ రోజు సాయంత్రం అమ్మాయి బసెక్కిస్తుంది నన్ను’’ అని చెప్పింది పార్వతమ్మ. ‘‘ఇంకో నాల్రోజులుండి వెళ్ళొచ్చుగా అత్తయగారూ...’’ అన్నాడు ప్రసాదరావు ఆప్యాయంగా. అతనికి పెద్దలంటే గౌరవం. తన తల్లిని భార్య నిర్లక్ష్యం చేసినా తను మాత్రం ఆమె తల్లిని గౌరవిస్తూ ఏలోటూ రానీయకుండా చూసేవాడు. తన తల్లి వస్తే ప్రమీల చాలా సంతోషంగా ఉంటుంది..మరి తనతల్లి వస్తే ఎందుకు మొహం చిట్లించుకుంటుందో అని అతని బాధ.‘‘లేదయ్యా...ప్రమీల నాన్నగారు రమ్మనమని ఫోన్ చేశారు...అందుకే ..’’ అన్నది పార్వతమ్మ.‘‘సరే మీ ఇష్టం.. జాగ్రత్తండీ’’ అని ఆఫీసుకెళ్ళి పోయాడు ప్రసాదరావు.పన్నెండున్నరకి చెమటలు కక్కుతూ ఆదరాబాదరాగా ఇంటికొచ్చిన ప్రసాదరావుని చూసి ఆశ్చర్యపోయారు తల్లీ కూతుళ్ళిద్దరూ. కాసిని మంచినీళ్ళు తాగి ‘‘నేను అర్జెంటుగా ఊరెళుతున్నాను. అమ్మకి సుస్తీగా ఉంది. రెండు రోజుల్లో వస్తాను. నే వచ్చేవరకు మీరు ప్రమీలకి తోడుగా ఉండండి’’ అని చెప్పి మరోమాట లేకుండా వెళ్ళిపోయాడు.రెండు రోజుల తరువాత నీరసంగా ఉన్న తల్లిని నడిపించుకుంటూ తీసుకొస్తున్న భర్తని చూడగానే మొహం మాడ్చుకుంది ప్రమీల. కనీసం పలకరించలేదు. ఆమెను చూడగానే గబగబా ఎదురెళ్ళి ‘‘ఆరోగ్యం ఎలా ఉంది?’’ అని అడిగి తాను చెయ్యి పట్టుకొని మంచం మీద పడుకోబెట్టింది పార్వతమ్మ.వేడి వేడి కాఫీ కలిపి అల్లుడికిచ్చి ఆమె చేత మెల్లగా తాగించింది. కొంచెం స్థిమిత పడ్డాక ఏమైందని అల్లుడిని అడిగింది.‘‘అమ్మకు గత కొంత కాలంగా గుండెల్లో నొప్పి వస్తోంది. మొన్న ఊళ్ళో హాస్పిటల్లో చూపెడితేసిటీకి వెళ్ళి వైద్యం చేయించుకోండి అని చెప్పారు. బంధువులు నాకు ఫోను చేసి చెబితే అమ్మను తీసుకొచ్చాను..’’ చెప్పాడు ప్రసాదరావు.విసుక్కుంటూనే అందరికి వంట చేయడం మొదలుపెట్టింది ప్రమీల. ఆమర్నాడు తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్ళి అన్ని టెస్టులు చేయించాడు ప్రసాదరావు. ‘‘వీలైనంత తొందర్లో బైపాస్ సర్జెరీ చేస్తే మంచిది’’ అని డాక్టర్ చెప్పాడు. ‘‘ఎన్ని రోజుల్లో చేయించాలి?’’ అడిగాడు ప్రసాదరావు.‘‘నాలుగైదు రోజుల్లో చేయిస్తే మంచిది. కొన్ని మెడిసిన్స్ ఇస్తాం...ఏం ఫరవాలేదు ఈ లోపల మీరు డబ్బు రెడీ చేసుకోండి’’ అని చెప్పాడు డాక్టర్.ఇంటికొచ్చిన ప్రసాదరావు తనకు కావలసిన డబ్బు డ్రా చేసుకొచ్చాడు.‘‘నేను ఆఫీసుకు సెలవు పెట్టాను. రేపో, ఎల్లుండో అమ్మకు ఆపరేషన్ జరగొచ్చు’’ అని భార్యకు అత్తగారికి చెప్పాడు.తలనొప్పిగా ఉండటంతో ప్రమీలని కాస్త కాఫీ చేసిమ్మన్నాడు..కళ్ళు మూసుకోని సోఫాలో కూర్చున్నాడు.ఇంతలో కెవ్వున కేక వినబడింది. అటు వంటింట్లోంచి ప్రమీల, ఇటు ప్రసాదరావు గాబరాగా పరుగెత్తుకెళ్ళారు.మేడ మీద ఆరేసిన బట్టలు తీసుకురావడానికి వెళ్ళిన పార్వతమ్మ బట్టలు తీసుకుని వస్తూ పై మెట్టు నుండీ జారి దొర్లుకుంటూ కింద పడి ఉంది. తలకు దెబ్బతగిలిందేమో విపరీతమైన రక్తస్రావం. నుదుటి మీదకి కారుతోంది. తల్లిని అలాంటి స్థితిలో చూసిన ప్రమీల భోరున ఏడ్చేస్తోంది. ప్రసాదరావు ఆమెను రెండు చేతులతో ఎత్తుకొని హాల్లోకి తెచ్చి అంబులెన్స్‌కు ఫోన్ చేసి కారిన రక్తాన్ని తుడిచి తలకు కట్టుకట్టాడు. పార్వతమ్మ అపస్మారక స్థితిలోనే ఉంది. అంబులెన్స్ రాగానే హాస్పిటల్ కి తీసుకెళ్ళారు.డాక్టర్లు ఆమెను చూసి వెంటనే ఐసీయూలో జాయిన్ చేశారు. కాసేపటికి డాక్టర్ వచ్చి–‘‘తలకు బలమైన దెబ్బ తగిలింది. బ్రెయిన్లో బ్లడ్ క్లాటయ్యింది. వెంటనే ఆపరేషన్ చేయాలి. చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఛాన్సెస్ మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ’’ అని చెప్పాడు. ప్రమీల బావురుమంది. అన్నయకు ఫోను చేయమంది. ప్రసాదరావు ఏ మాత్రం ఆలోచించకుండా ‘‘ఓకే డాక్టర్ మీరు ఆపరేషన్ చేయండి. ఎంత డబ్బైనా పరవాలేదు..’’ అన్నాడు.ప్రసాదరావు డబ్బులు కట్టడంతో వెంటనే ఆపరేషన్ చేసి ‘‘నో ప్రాబ్లమ్. షి విల్ బి ఆల్ రైట్’’ అని చెప్పాడు డాక్టర్.తల్లికి గండం తప్పినందుకు సంతోషించిన ప్రమీలకి జ్ఞానోదయమైంది. తన తల్లి ప్రాణాప్రాయ స్థితిలో ఉంటే మానవత్వంతో డబ్బులన్నీ ఖర్చుచేసి ఆమె ప్రాణం నిలవాలని తపించాడు తన భర్త. తన తల్లికి ఆపరేషన్ కోసం పెట్టుకున్న డబ్బుని ఏ మాత్రం ముందూ వెనుకా ఆలోచించకుండా తన తల్లి ఆపరేషన్ కి ఇచ్చేశాడు.‘ ‘నా భర్త దేవుడు. నేను మాత్రం అతని తల్లిని ఈసడించుకుంచు, ఆడిపోసుకుంటూ ఎంతో బాధ పెట్టాను. నా ప్రవర్తనతో ఆయన మనసెంత క్షోభించిందో’’ పశ్చాత్తాపంతో కుమిలిపోయింది ప్రమీల.కన్నీళ్ళతో తన పాదాలను పట్టుకుని క్షమించమని అడుగుతున్న ప్రమీలని రెండుచేతులతో లేవనెత్తి కళ్ళు తుడిచాడు ప్రసాదరావు. అత్తగారి ఆపరేషన్‌కై తన నగలమ్మి డబ్బు తెమ్మన్న భార్యని చూసి ఆశ్చర్యపోయాడు. తన తల్లితో పాటు అత్తగారిని కూడా కంటి రెప్పలా చూసుకుంటూ సేవలు చేసింది ప్రమీల. ‘‘మీ మనసు నొప్పించినందుకు క్షమించండి’’ అని అత్తగారి దగ్గర భోరుమని విలపించింది. ఇక అత్తగారు ఉళ్ళో ఉండవలసిన అవసరం లేదని తమ దగ్గరే ఉండమని వేడుకుంది. అత్తను కూడా అమ్మలా ప్రేమగా చూసుకుంటున్న ప్రమీలను చూసి మనసారా ఆనందించాడు ప్రసాదరావు. -
శ్రమలోనేనా సమానత్వం?
చేనేత వస్త్రాల తయారీలో పురుషులతో సమానంగా శ్రమిస్తున్న మహిళలకు సమానమైన వేతనం లభించకపోగా, ఆర్థికంగా ఇక్కట్లపాలైన కొన్ని చేనేత కుటుంబాలను మహిళలే నడిపించవలసి వస్తోంది! ప్రభుత్వం చొరవ తీసుకుని చేయూతనిస్తే తప్ప మహిళా చేనేత కార్మికుల కష్టానికి గుర్తింపు, గౌరవం, తగిన విలువ లభించని పరిస్థితి నెలకొని ఉంది. పడుగు పేకల మేలు కలయికతో అందమైన, ఆకర్షణీయమైన వస్త్రాలు రూపుదిద్దుకుంటాయి. అలాగే స్త్రీ, పురుషులు ఇద్దరు ప్రత్యేకశ్రద్ధతో చేనేత రంగంలో తమ శక్తియుక్తులను, వృత్తినైపుణ్యాన్ని మేళవించి అపురూప కళాఖండాలతో వస్త్రాలను తయారు చేస్తారు. అయితే ఇద్దరి శ్రమ సమానమే అయినప్పటికీ మహిళా కళాకారులకు మాత్రం సరైన గుర్తింపు, వేతనాలు లభించడం లేదు. అన్నిరంగాల్లో మాదిరిగానే చేనేత రంగంలో కూడా మహిళలు వివక్షకు గురవుతున్నారు. చేనేత వస్త్రాల తయారీలో 60 శాతం పనులలో స్త్రీల భాగస్వామ్యం కచ్చితంగా ఉంటుంది. ఆ స్థాయిలో వారికి గుర్తింపు రావడం లేదు. వేతనాల్లో కూడా వివక్ష కొనసాగుతోంది. కుటీర పరిశ్రమగా ఈ రోజు చేనేత నిలదొక్కుకుందంటే దాంట్లో మహిళల పాత్రే అధికం. కూలీ గిట్టుబాటు కాక బతుకుదెరువు కోసం మగవారు ఇతర ప్రాంతాలకు వలసపోతే ఇంటి వద్ద ఉండి కుటీర పరిశ్రమను నిలబెట్టుకున్న ఘనత మహిళలదే. పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాల్లో చేనేతలు పేర్గాంచినవి కాగా.. ఈ ప్రాంతాలకు అనుబంధంగా పలు గ్రామాల్లో చేనేత కార్మికులు.. ప్రధానంగా మహిళా కార్మికులు ఆ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. ఎనభై ఏళ్ల వృద్ధమహిళలు సైతం జీవనాధారం కోసం రోజువారి కూలీ రూ.100 గిట్టుబాటు కాకున్నా పొట్టకూటి కోసం శ్రమిస్తున్నారు. ఆర్థికపరమైన ఒత్తిళ్లకు తాళలేక భర్త ఆత్మహత్యలు చేసుకుంటే మహిళలే వృత్తిపై ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నారు. తమ పిల్లల భవిష్యత్‌ను భుజాన వేసుకుని కుటుంబ బాధ్యతను మోస్తూ, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారు. ఒక్క పోచంపల్లిలోనే చేనేత మగ్గాలు వేసే వారి సంఖ్య 225 వరకు ఉంటుంది. ఇక్కడ సుమారు వెయ్యికి పైగా చేనేత మగ్గాలు ఉన్నాయి. చేనేత వృత్తిలో చీరలు, ఇతర రకాల వస్త్రాలను తయారు చేయడం కోసం మగ్గం నేయడం, అచ్చులు అతకడం, చిటికీలు కట్టడం, ఆసులు పోయడం, కండెలు చుట్టడం, సరిచేయడం, రంగులు అద్దడం, రబ్బర్లు చుట్టడం ఇలా చెప్పుకుంటూ పోతే అన్నిపనుల్లో మహిళల భాగస్వామ్యం ఉంది. సంప్రదాయంగా వస్తున్న చేనేత వృత్తిలో భర్తకు తోడుగా భార్య కచ్చితంగా తన సహకారాన్ని అందిస్తుంది. అయితే మహిళలకు రావాల్సినంత గుర్తింపు, వేతనాలు అందడం లేదు. సహకార సంఘాల్లో సభ్యత్వాలు, గుర్తింపు కార్డులు అందరికీ ఇవ్వడం లేదు. అందుకే మహిళల భాగస్వామ్యంతో కొనసాగుతున్న ఈ పరిశ్రమలో మహిళలకు మరింత ఆర్థిక చేయూతనివ్వడానికి ప్రభుత్వం మహిళా సొసైటీలను ఏర్పాటు చేయాలని చేనేత కళాకారులు కోరుతున్నారు. అలాగే మహిళలకు వృత్తిపరమైన ప్రత్యేక శిక్షణను ఇస్తూ స్వయంకృషితో ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా కృషి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మగ్గమే జీవనాధారం భూదాన్ పోచంపల్లి మండలం భద్రావతి కాలనీకి చెందిన చేనేత కార్మికురాలు బత్తుల అనితకు మగ్గమే జీవనాధారం అయింది. నిరుపేద చేనేత కుటుంబమైన బత్తుల అంబరుషి, అనిత దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. అనిత భర్త ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో కుటుంబ భారం, పిల్లల చదువులు అనితపై పడ్డాయి. అ«దైర్యపడకుండా తనకు తెలిసిన వృత్తి.. మగ్గాన్ని నమ్ముకుంది. కూలీ మగ్గం నేయగా వచ్చిన ఆదాయంతో పిల్లలను చదివిస్తోంది. ప్రస్తుతం కుమారుడు శివ డిగ్రీ చదువుతుండగా, కుమార్తె పాలిటెక్నిక్ చేస్తోంది. అనిత రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుంది. నెల రోజులు కష్టపడి చీరెలు నేస్తే రూ.10వేలు ఆదాయం వస్తుంది. కిరాయి ఇంట్లో ఉంటుంది. రెండు రోజులకు నాలుగొందలు బాల్యం నుంచి చేనేత వృత్తి తెలుసు. మగ్గం నేస్తూ, చిటికీ కట్టడం, ఆసుపోయడం లాంటి పనులు చేస్తాను. ప్రస్తుతం కూలీకి అచ్చు అతుకుతున్నాను. ఒక అచ్చు అతకడానికి రెండు రోజులు సమయం పడుతుంది. దీనికి రూ. 400 కూలీ లభిస్తుంది. ఇలా నెలలో రూ. 4వేల వరకు సంపాదిస్తాను. నా భర్త కూడా చేతకాక, చేతనై కూలీకి మగ్గం నేస్తున్నాడు. ఒకరికొకరం చేదోడువాదోడుగా పని చేసుకుంటూ కాలాన్ని వెళ్లదీస్తున్నాం. – రాపోలు ప్రమీల, పోచంపల్లి వృద్ధాప్యంలోనూ తప్పని పని భర్త, కుమారుడు, ఇద్దరు వివాహిత కుమార్తెలు ఇదీ మా కుటుంబం. అయితే చేతికంది వచ్చిన కుమారుడు తొమ్మిదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో నా భర్త కూలీ మగ్గం నేస్తున్నాడు. నేను కూడా మాస్టర్ వీవర్ వద్ద రోజువారీ కూలీగా చిటికీలు కడుతున్నాను. నెలంతా పనిచేస్తే రూ. 6 వేల వరకు ఆదాయం వస్తుంది. ఈ వృద్దాప్యంలో కూడా ఇద్దరం పనిచేసుకుంటూనే జీవనాన్ని సాగిస్తున్నాం. – చిందం భద్రమ్మ, భూదాన్ పోచంపల్లి – యంబ నర్సింహులు, సాక్షి, యాదాద్రి -
ప్రముఖ రచయిత్రి ప్రమీలాదేవి మృతి
గౌతంనగర్: ప్రముఖ రచయిత్రి డాక్టర్ మంగళగిరి ప్రమీలాదేవి(75) గురువారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. తెలుగు, సంస్కృతం, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యమున్న ప్రమీలాదేవి సుమారు 40 పుస్తకాలు రచించారు. ‘పద సాహిత్య పరిషత్’ అనే సంస్థను స్థాపించి సాహిత్య సేవలందించారు. అన్నమాచార్య కీర్తనలపై పీహెచ్డీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఈ ఏడాది జులైలో మధ్యప్రదేశ్‌లో జరిగిన అఖిల భారతీయ రాష్ట్ర భాషా సమ్మేళనంలో సరస్వతీ సన్మాన్ అవార్డు అందుకున్నారు. సర్దార్‌పటేల్‌నగర్‌లోని శ్మశానవాటికలో జరిగిన ఆమె అంత్యక్రియలకు ప్రముఖ కవయిత్రులు ముక్తావి భారతి, ఆకెళ్ల విజయలక్ష్మి, తమిరస జానకి, గోల్లమూరి పద్మావతి తదితరులు హాజరై నివాళులర్పించారు. -
మూఢ నమ్మకాలపై సందేశం
నందు, అనురాధా, బాలాజీ, ప్రమీల ముఖ్య తారలుగా ఫణిరామ్ తూఫాన్ దర్శకత్వంలో శ్రీధర్ నిర్మించిన చిత్రం ‘ఐందవి’. ఎస్ఏ అర్మాన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నటుడు కాదంబరి కిరణ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఫణిరామ్ తూఫాన్ మాట్లాడుతూ– ‘‘కొందరు యువతీ యువకులు సరదాగా గడుపుదామని ఇంటి నుంచి వెళతారు. అనుకోకుండా వారు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నారన్నదే ఈ సినిమా కథాంశం. మంచి సస్పెన్స్ థ్రిల్లర్. మూఢ నమ్మకాలను ఆశ్రయించొద్దనే సందేశాన్ని ఇస్తున్నాం’’ అన్నారు. ‘‘ఓ సక్సెస్ఫుల్ ఫార్ములాను అనుసరించి ఈ సినిమా నిర్మించాం. అతీంద్రియ శక్తులు, హారర్ అంశాలను ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చుతుంది. త్వరలో రిలీజ్ చేయనున్నాం’’ అన్నారు శ్రీధర్. ∙బాలాజీ, ప్రమీల -
విదారక ఘటన
భువనేశ్వర్: అధికారుల నిర్లక్ష్యం, గజరాజు భీభత్సం వెరసి ఓ నవజాత శిశువుకు రక్షణ లేకుండా పోయింది. పుట్టుకతోనే కష్టాలను పరిచయం చేశారు. పురిటినొప్పులతో బాధపడుతున్న ఆ తల్లి అటు అసుపత్రికి పోలేక, ఇటు సొంత ఇల్లు లేక చివరికి ఓ చిన్న కాలువపై ఏర్పాటు చేసిన వంతెన కింద బిడ్డకి జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ప్రమిల తిరియా అనే మహిళా ఇంటిపై ఆరు నెలల క్రితం ఏనుగు దాడి చేసి ఇంటిని నాశనం చేసింది. దీంతో ఇంటిని కోల్పొయిన ప్రమిల ప్రభుత్వ సాయం కోసం వేచి చూసింది. నష్టపరిహారం అందిస్తే ఇంటిని నిర్మింకుందామనుకుంది. కానీ అధికారులు ఆమెకు సాయం చేయలేదు. దీంతో అదే ఊర్లో చిన్న కాలువపై ఏర్పాటు చేసిన వంతెన కింద ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వంతెన కిందే కొద్ది రోజుల క్రితం ఓ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయంపై జిల్లా కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ.. ‘ప్రమిలకు ఆశా వర్కర్లనుంచి కూడా ఏ విధమైన సాయం అందలేదు. గర్భిణీల ఆరోగ్య సమస్యలను చూసుకోవాల్సిన బాధ్యత వారిది. ఆమెను ఆస్పత్రికి కూడా తీసుకెళ్లలేదు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటాం. ప్రమిలకు న్యాయం జరిగేలా చూస్తామ’ని పేర్కొన్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. ప్రమిల ఇంటిని ఏనుగు నాశనం చేసిన విషయాన్ని అటవీ శాఖ అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఏవిధమైన సాయం అందజేయలేదన్నారు. ఆరు నెలల నుంచి ఆమె వంతెన కిందే నివాసముంటుందని తెలిపారు. ప్రమిలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. -
రాఖీ కట్టడానికి వచ్చి వెళ్తూ..
రాఖీ కట్టడానికి వచ్చిన అక్కను, తమ్ముడు అత్తవారి ఇంట్లో దించడానికి బైక్ పై తీసుకెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. దీంతో అక్కా, తమ్ముడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో ఆమె ఆరు నెలల కూతురు స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ సంఘటన మెదక్ జిల్లా జిన్నారం మండలం కిష్టాయపల్లి సమీపంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ప్రమీల(24)కు రెండేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా వెనుకనూతల గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం అయింది. వీరికి ఆరు నెలల పాప ఉంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా పుట్టింటికి వచ్చిన ప్రమీలను అత్తింట్లో దించడానికి తమ్ముడు సాయికిరణ్(22) స్కూటీపై తీసుకెళ్తుండగా.. సుల్తాన్పూర్ సర్వీస్ లైన్ వద్ద ఎదురుగా వచ్చిన బొలేరో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో అక్కా తమ్ముడు అక్కడికక్కడే మృతిచెందారు. ఆరు నెలల చిన్నారి మాత్రం స్వల్ప గాయాలతో బయటపడింది. తల్లి మృతదేహం వద్ద కూర్చొని చిన్నారి రోదిస్తున్న దృశ్యం స్థానికులను కంటతడి పెట్టించింది. -
మహిళ అనుమానాస్పద మృతి
తిలక్‌నగర్ సమీపంలో రైల్వే పట్టాలపై ఓ మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. మృతురాలిని ప్రమీలగా గుర్తించారు. తిలక్‌నగర్‌లో నివాసముండే ప్రమీల గురువారం రాత్రి నుంచి కనిపించడం లేదని మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమెకు ఫిట్స్ కూడా ఉన్నాయని చెప్పడంతో రైలు ఢీకొని మృతి చెందిందా లేక ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని మృతి చెందిందా అన్న సందేహాలు నెలకొన్నాయి. దీంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
దంపతులపై దాడి.. కేసు నమోదు
ఇంటి ముందు నిల్చొని ఉన్న భార్య భర్తలపై నలుగురు యువకులు దాడి చేసిన సంఘటన నగరంలోని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అరుణ్‌కాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ఆదినారాయణ, ప్రమీలలు ఇంటి ముందు నిల్చొని ఉన్న సమయంలో అటుగా వచ్చిన నలుగురు యువకులు వారిపై దాడి చేశారు. దీంతో వారికి గాయాలవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దాడి చేసిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి గల కారణాలు తెలియరాలేదు. -
పోలీసు పుట్టిల్లు
ఫంక్షన్ స్టేషన్ వాళ్లు... రివాల్వింగ్ ఛైర్లో కూర్చుని ఉన్న రివాల్వర్లు. చిర్నవ్వునూ, యూనిఫామ్నూ ధరించి ఉన్న రైఫిళ్లు. అప్రమత్తంగా ఉండే స్టెన్గన్లు. అవాంఛిత ఘటనల్లో దూసుకుపోయే బుల్లెట్లు. ఈ మాటలు అక్కడి పురుష సిబ్బందికి కాదు... అక్కడ పోలీసింగ్ చేస్తున్న సివంగులకూ వర్తిస్తాయి. నేర్పుతో మ్యాగజైన్లో బుల్లెట్లు నింపినంత అలవోకగానే నిండైన ఆప్యాయతతో కొత్తసారెతో ఒడి నింపారు. నీకు మేమున్నామన్న భరోసానూ నింపారు. పక్కన పనిచేసే అమ్మాయీ మాకు అక్కచెల్లెళ్లనే సంకేతం ఇచ్చారు. శాంతిభద్రతలతో పాటు సంస్కృతి మాకు కావాలనే సందేశం పంపారు. వాళ్లే గుంటూరులోని పట్టాభిపురం పోలీసులు! వాళ్ల ఆలోచన వైవిధ్యం. వాళ్ల ఆచరణలో సౌభ్రాతృత్వం. వాళ్లు చేసింది సీమంతం. తమ సహోద్యోగిని ప్రమీల కోసం చేసిన వేడుక చూతము రారండి. మునివేళ్లతో నాలుగు మంగళాక్షతలను చల్లేద్దాం పదండి. ఆరోజు శుక్రవారం. సమయం సాయంత్రం ఆరు గంటలు. కాళ్ల చుట్టూ ఎర్రటి తివాచీలు, కళ్లకు కనిపిస్తున్న పచ్చటి తోరణాలు. రంగురంగుల బెలూన్లు. ఆహ్లాదకరమైన సువాసనలు. మల్లెల గుబాళింపులు. అది పోలీస్ స్టేషనేనా లేక ఫంక్షన్‌హాలా అనే సంశయాలు. ఈ సందేహానికి కారణం ఉంది. పట్టుచీరలు కట్టిన మహిళలు ఒక్కొక్కరుగా స్టేషన్‌లోనికి వెళ్తున్నారు. యూనిఫాంలో ఉన్న పోలీసులు ఎదురేగి వాళ్లను ఆహ్వానిస్తున్నారు. కొద్దిసేపట్లోనే స్టేషన్ నిండా సౌభాగ్యవతుల కళకళ. లాఠీలు పట్టే చేతులనిండా ఆ కాసేపు గాజుల గలగల. కాస్త ఎత్తై డయాస్‌పై మహారాజా కుర్చీలో మహారాణిలా కూర్చున్న ప్రమీల. ఎవరీ ప్రమీల, ఎందుకీ వేడుక..? గుంటూరు రామిరెడ్డితోటకు చెందిన మానుపాటి ప్రమీల 2014లో పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపికైంది. పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌లోనే తొలి పోస్టింగ్. కంప్యూటర్ విభాగంలో పనిచేసే ప్రమీల అంటే కొలీగ్స్ అందరికీ ఆదరం. ఎనలేని గౌరవం. సీఐ, ఎస్సైలతో పాటు సిబ్బంది అందరికీ ఆమె తలలో నాల్క. అతి తక్కువ సెలవులు పెట్టే ఉద్యోగినిగా మంచి గుర్తింపు. ఒక్కమాటలో చెప్పాలంటే స్టేషన్‌లోని వారందరికీ తోబుట్టువు. ఈ వాత్సల్య భావనే ఆమెకు సీమంతం చేయాలనే ఆలోచనను అంకురింపజేసింది. ఆ వేడుక సాకారమయ్యేలా చేసింది. సాధారణంగా గర్భిణులకు 5, లేదా 7వ నెలలో పుట్టింటి వారు సీమంతం చేస్తుంటారు. పసుపు, కుంకుమలతో నిండు నూరేళ్లూ సౌభాగ్యంతో జీవించమని ఆశీర్వచనాలు అందజేస్తుంటారు. దీనికితోడు కడుపులో బిడ్డకు చలువ చెయ్యడం కోసం చలివిడి తినిపించాలన్న ఆకాంక్ష. అందరి దీవెనలతోనూ తల్లి కడుపులోని శిశువు గొప్పవాడు కావాలన్న శుభాకాంక్ష. ఆ నమ్మకంతోనే ఈ వేడుకను నిర్వహించడం ఒక ఆనవాయితీ. ఒక సంప్రదాయం. సాధారణంగా ఈ తరహా వేడుకలన్నీ పుట్టింట్లో జరుగుతాయి. కానీ ఇక్కడ ప్రమీలకు ఈ గౌరవాన్ని ఇచ్చారు తోటి పోలీసులు. కారణం... ప్రమీలమ్మ తమ తోబుట్టువు అనుకుంటారు అక్కడి సిబ్బంది. దాంతో ఆమెకు సీమంతం చేశారు. పసుపు, కుంకుమలు, గాజులు, పండ్లు అందజేశారు. నుదుట కుంకుమ బొట్టుపెట్టి, కంఠానికి గంధం పూసి అక్షింతలు చల్లి ఆశీర్వదించారు. ఇలా ఒక పోలీస్ స్టేషన్లో సీమంతం జరగడం తెలుగురాష్ట్రాల్లోనే బహుశా ఇది మొదటిసారి. - పీఎస్‌ఎన్‌వీ ప్రశాంత్, జీ. వేణుగోపాల్, సాక్షి, గుంటూరు ప్రజలకు నమ్మకం పెరగాలి... ప్రజలతో సత్సంబంధాలు పెరగాలంటే సంప్రదాయాలను గౌరవించాలి. ప్రధానంగా మహిళల్లో పోలీసులపై నమ్మకం పెరగాలి. మా మధ్యలో పనిచేసే మా ఇంటి ఆడపడుచుకు సీమంతం చేస్తే ఎలాగుంటుందో తెలియజేయాలనుకున్నాం. ఇది మిగతా వారందరికీ స్ఫూర్తి కావాలన్నది మా కోరిక. - శేషగిరిరావు, సీఐ, పట్టాభిపురం మంచి ఆలోచన... మంచి సంప్రదాయానికి పోలీస్ సోదరులు స్ఫూర్తిగా నిలిచారు. చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల ప్రజల్లో పోలీసులపై గౌరవం, నమ్మకం పెరుగుతుంది. మహిళలు ధైర్యంగా స్టేషన్‌కు రాగలుగుతారు. - కేజీవీ సరిత, డీఎస్పీ, గుంటూరు వెస్ట్. మరచిపోలేని వేడుక... నా భార్యకు జరిగిన సీమంతపు వేడుక చూశాక ఎంతో సంతోషంగా అనిపించింది. స్టేషన్‌లోని సిబ్బంది అంతా ఆమెలో ఒక సోదరిని చూసుకోవడం చూసి ఆనందంగా ఉంది. ప్రమీలకు స్టేషన్లో జరిగిన సీమంతం మరచిపోలేని వేడుక. - అజయ్‌కుమార్, ప్రమీల భర్త. -
ఇద్దరు కుమారులు సహా తల్లి ఆత్మహత్య
జీవితం విరక్తి చెందిన ఓ మహిళ తన ఇద్దరు కుమారులు సహా బావిలో దూకి తనువు చాలించింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా డక్కిలి మండలం నాగులపాడు గ్రామంలో జరిగింది. గ్రామ హరిజనవాడకు చెందిన కట్కం ప్రమీల(28), బుధవారం రాత్రి కుమారులు శేఖర్(11), సుశీల్‌కుమార్(8)తో సహా వెళ్లి సమీపంలోని బావిలో దూకేసింది. బావిలో తేలియాడుతున్న శవాలను గురువారం ఉదయం స్థానికులు గుర్తించారు. మతిస్థిమితం లేకనే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడిందని అంటున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
వివాహిత అనుమానాస్పద మృతి
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట గ్రామంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కట్నం వేధింపులే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. వివరాలివీ...గ్రామానికి చెందిన నాగభూషణ రావుకు ప్రమీల(19)తో 10 నెలల క్రితం వివాహమైంది. బుధవారం రాత్రి ఇంట్లో భర్త లేని సమయంలో తన గదిలో ప్రమీల ఉరేసుకుంది. కొద్దిసేపటి తర్వాత వచ్చిన భర్త ఆమె ఉరిని తప్పించి కిందికి దించాడు. అయితే, అప్పటికే ప్రమీల చనిపోయింది. ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించగా వారు గ్రామానికి చేరుకున్నారు. గత రెండు నెలలుగా అత్తింటి వారు ప్రమీలను కట్నం కోసం వేధిస్తున్నారని తండ్రి గౌరి నాయుడు తెలిపారు. బుధవారం కూడా ఆమె ఫోన్ చేసి తనను అత్తమామలతోపాటు మరిది కూడా వేధిస్తున్నట్లు చెప్పిందని ఆయన అన్నారు. వాళ్లే ఆమెను చంపి ఉరేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
పుస్తకం బూడిదయింది కల రగులుతూనే ఉంది
ష్ష్ష్... అమ్మాయి చదువుకుంటోంది. ఇది మనం మన ఇళ్లలో వినే మాట. పిల్ల చదువుకుంటుంటే... కేబుల్ కనెక్షన్ కూడా తీయించేస్తాం. కానీ దుర్గకు అలాంటి సౌకర్యం లేదు. బస్సు కారును, కారు ఆటోను, ఆటో స్కూటర్‌ను, స్కూటర్ సైకిల్‌ను, సైకిల్ పాదచారిని కేకలేసే రోడ్డది. ఇల్లు కాలి బుగ్గి అయ్యింది కాబట్టి దుర్గ చదువు రోడ్డున పడింది. ఆ రోడ్డు అంచే దుర్గ చదువుకునే ఫుట్‌పాత్. దుర్గ సంకల్పం ముందు రోడ్డు గోల ‘ష్ష్ష్’ అయిపోతుంది! పుస్తకం మంటల్లో కాలిపోయినా... దుర్గ ఆశయం రగులుతూనే ఉంది! కొన్ని సన్నివేశాలు లిప్తపాటే కళ్లకు కనిపించినా గుండెను తట్టి లేపుతాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి నేరుగా వస్తున్నప్పుడు అశోక్‌నగర్ సిగ్నల్ చౌరస్తాలో కనిపించే దృశ్యం అలాంటిదే! హైదరాబాద్ నగరం... బిజీబిజీ జీవితం ఒకవైపు, గజిబిజి ట్రాఫిక్ రణగొణలు మరోవైపు... హడావుడిగా ముందుకు సాగుతున్నప్పుడు నగరం నడిబొడ్డున అయినవాళ్లు కనిపించినా, పట్టించుకుని పలకరించే తీరికలేనంతగా మసిబారిపోయిన మనసులు. మనుషుల మీద నిర్లక్ష్యమేమీ కాదు గానీ, బండబారిన బతుకుల పరిస్థితులే అలాంటివి. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఒక కదిలించే సన్నివేశం కనిపిస్తే... స్పందించకుండా ఉండటం సాధ్యమేనా..? ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి నేరుగా వస్తున్నప్పుడు అశోక్‌నగర్ సిగ్నల్ చౌరస్తా... మరో పద్దెనిమిది సెకన్లలో గ్రీన్ సిగ్నల్ పడుతుంది. అటూ ఇటూ చూపులు సారిస్తే... ఒకచోట చూపు నిలిచిపోయింది. నిజానికి చూపు నిలిచిపోయిందనే కంటే... అక్కడి దృశ్యమే దృష్టిని కట్టి పడేసింది. గబగబా రెండు ఫొటోలు... ఆ చౌరస్తాలోని ఒక ఫుట్‌పాత్ మీద నేలపై పరచిన గోనెసంచి. దాని మీద పరచిన పూలు... వాటి పక్కన ఒక తొమ్మిదేళ్ల పాప. ఆ పరిసరాలంతా వాహనాల రణగొణల చప్పుడు... దుమ్ముధూళి, పొగ, అరుపులు కేకలు... ఇవేవీ ఆ పాప ఏకాగ్రతకు భంగం కలిగించలేకపోతున్నాయి. దించిన తల పెకైత్తకుండా నోట్‌బుక్‌లో ఆ పాప ఏదో రాసుకుంటోంది. ఒకప్పుడు మహానుభావులు రాత్రివేళ వీధి దీపాల కింద కూర్చుని చదువుకున్నట్లు చిన్నప్పుడు మాస్టార్లు చెబితే విన్నాం. కానీ, ఈ చిట్టి చదువుల తల్లి మాత్రం నిజంగా వీధిలోనే... ఫుట్‌పాత్‌పై కూర్చుంది. అప్పటికింకా చీకటి పడలేదు గానీ, సమయం సాయంత్రం 4.30 గంటలు కావస్తోంది. మరో గంట గడిస్తే పొద్దుగుంకే వేళే అవుతుంది. ట్రాఫిక్ రణగొణలను ఏమాత్రం పట్టించుకోకుండా, ఆ పాప పుస్తకంలోకి ఒదిగిపోయి, రాత కొనసాగిస్తూనే ఉంది. అంత ఏకాగ్రతలోనూ పూల కోసం వచ్చిన వారికి పూలు ఇచ్చి, మరుక్షణమే పుస్తకంలో నిమగ్నమైపోయింది. నిరుపేద చదువులతల్లి ఆ పాప పేరు దుర్గ. ఆమె జవహర్‌నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుకుంటోంది. వాళ్ల అమ్మా నాన్నలకు దుర్గ నాలుగో సంతానం. కానీ, ఆమెకు తోబుట్టువులు ఎలా ఉంటారో తెలియదు.. ఎందుకంటే వారిలో ఇద్దరు చనిపోగా.. మరోఅక్క మంజును చిన్నప్పుడే ఎవరో ఎత్తుకెళ్లిపోయారు. మంజు కోసం దుర్గ వాళ్ల తల్లిదండ్రులు కేసు పెట్టి, వెతికించినా లాభం లేకపోయింది. మంజు ఉంటే... ఆమెకిప్పుడు ఇరవయ్యేళ్లు ఉండేవట... ఇప్పుడు మిగిలింది ఆ దీనదంపతులకు దుర్గ మాత్రమే. పురానాపూల్‌కు చెందిన దుర్గ కుటుంబం బతుకుదెరువు కోసం అశోక్ నగర్‌లోని ఓ బస్తీకి కొన్నేళ్ల కిందట తరలి వచ్చింది. దుర్గ తండ్రి కూలిపనులకు వెళుతుంటాడు. తల్లి ప్రమీల ఫుట్‌పాత్ మీద పూల దుకాణం నడిపిస్తోంది. తల్లికి సాయంగా... సాయంత్రం బడి వదిలేయగానే చిట్టి దుర్గ నేరుగా ఫుట్‌పాత్ మీద తల్లి నడిపే పూల దుకాణానికి చేరుకుంటుంది. ఆమె రాగానే తల్లి ఇంటికి వెళ్లి పనులు చేసుకుంటుంది. తల్లి వెళ్లిన తర్వాత దుర్గ ఒకవైపు పూల అమ్మకాలు సాగిస్తూనే, మరోవైపు చదువు కొనసాగిస్తుంది. తల్లికి అనారోగ్యంగా ఉంటే, తానే ఇంటి పనులూ చేస్తుంది. తండ్రి వద్దకు వెళ్లి అతడికి భోజనం కూడా ఇచ్చి వస్తుంది. అనుకోని విషాదం... అసలే పేదరికంతో అల్లాడుతున్న దుర్గ కుటుంబానికి అగ్నిప్రమాదం రూపంలో అనుకోని విషాదం ఎదురైంది. తల్లితో కలసి బంధువుల ఇంట్లో జరిగిన పెళ్లికి వెళ్లి తిరిగి వచ్చిన దుర్గకు... తాము అద్దెకు ఉంటున్న గది మంటల్లో బూడిదై కనిపించింది. ఆ స్థితిలో కంటినీరే తప్ప కళ్లలోని ఆశలన్నీ అడుగంటాయి. కాలిన ఇంట్లోకి అడుగుపెడుతూనే చిన్నారి దుర్గ నేరుగా తన పుస్తకాల సంచి కోసం వెతుక్కుంది. మొత్తం పుస్తకాలన్నీ కాలిపోయాయి. ఏడాదికోసారి తీసుకున్న కొత్త బట్టలూ కాలిపోయాయి. ఈ దుర్ఘటన చిన్నారి దుర్గను నిరాశలో ముంచేసింది. బడికి దూరమై... ఫుట్‌పాత్‌కు చేరువై... రోజూ సాయంత్రం వేళ మాత్రమే పూల అమ్మకం కోసం ఫుట్‌పాత్ మీదకు వచ్చే దుర్గను... అనుకోని అగ్నిప్రమాదం రోజంతా ఫుట్పాత్కే పరిమితం చేసింది. సర్వస్వం కోల్పోవడంతో... ఇప్పటికిప్పుడు పుస్తకాలు సైతం కొనలేని స్థితిలో తల్లిదండ్రులు ఉండటంతో దుర్గ నిస్సహాయంగా మిగిలింది. ‘నాకు బడికి పోవాలనుంది. బుక్కులు కాలిపోయినయి. నా దోస్తుల్ని చూస్తుంటే బడికి వెళ్లాలనిపిస్తుంది. కానీ అమ్మా వాళ్ల దగ్గర డబ్బులు లేవుగా... డబ్బులొచ్చాక పుస్తకాలు కొనుక్కుని బడికిపోతాను’ అని అమాయకంగా చెప్పింది ఆమె. డాక్టర్.. అవుతానో లేదో.. ‘బాగా చదువుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. పూలకొట్టువద్దకు రావడం వల్ల నాకు దోస్తులు కూడా చాలా తక్కువమందే ఉన్నారు. ఒక్క రోజు కూడా బడి మానేయకుండా వెళ్లాలనిపిస్తది. బాగా మార్కులు తెచ్చుకొని అందరికంటే ఫస్టు రావాలనిపిస్తది. డాక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే డాక్టర్ ని అయిపోతా.. కానీ, ఎప్పుడు అవుతానో ఎలా అవుతానో తెలియడం లేదు. నన్ను మంచిగా చదివించే వాళ్లుంటే బాగుంటదనిపిస్తుంది. డాక్టర్ అయ్యి మా అమ్మవాళ్లను బాగా చూసుకోవాలి’ అనే దుర్గ మాటలు ఎవరినైనా కదిలిస్తాయి. ఎవరూ చదివిచ్చినా నా బిడ్డ చల్లగా ఉంటే చాలు.. ‘ముందు నుంచి మాకు కష్టాలే... మొన్న ఇల్లు కాలిపోయి మొత్తం పోయింది. మాకు మిగిలింది ఈ ఒక్క బిడ్డే.. అందుకే కంటికి రెప్పలా చూసుకుంటున్నాం. మేం ఏం కోరుకోగలం.. ఎక్కడ ఉన్నా మా బిడ్డ చల్లగా ఉండాలని కోరుకోవడం తప్ప. ప్రభుత్వం సాయం చేసి నా బిడ్డను సదివిచ్చినా పర్వలేదు.. ఏ అయ్య అన్నా నా బిడ్డకు మంచి చదువు చెప్పించేందుకు ముందుకొచ్చి చదివిచ్చినా పర్వాలేదు. కానీ, దూరంగా పంపించం.. సాయంత్రం పోయి చూసి వచ్చేంత దగ్గరగా నా బిడ్డ ఉండాలి. ఎందుకంటే దుర్గే కదా మాకుంది’ అని దుర్గ తల్లి ప్రమీల చెప్పింది. - ఎం.నాగేశ్వరరావు, m.nageswararao@sakshi.com ఫొటోలు: మోహనాచారి