నిజామాబాద్: మండలంలోని నెమలి గుట్ట తండాకు చెందిన బుక్య ప్రమీల(22)ను ఆమె ప్రియుడు హైదరాబాద్‌లోని బాచుపల్లిలో ఆదివారం ట్యాంకర్ కింద తోసేసి హత్య చేయడంతో తండాలో విషాదం నెలకొంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. ప్రమీల, మండలంలోని రోడ్డు బండ తండాకు చెందిన తిరుపతి కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు.
ప్రమీల బాచుపల్లిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. తిరుపతి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని ప్రమీల తిరుపతిపై ఒత్తిడి తెచ్చింది. ఇద్దరు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ గొడవ పడ్డారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న వాటర్ ట్యాంకర్ కిందకు తిరుపతి ప్రమీలను తోసేయగా అక్కడికక్కడే మృతి చెందింది. తిరుపతి పరారీలో ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment