ఛాన్స్ అడిగితే గెస్ట్ హౌస్‌కి రమ్మన్నారు: 'బాహుబలి' బామ్మ | Senior Actress Pramila Rani Shocking Comments About Casting Couch In Tollywood - Sakshi
Sakshi News home page

Actress Pramila Rani On Casting Couch: సీనియర్ నటికి అప్పట్లోనే చేదు అనుభవం.. రూంకి పిలిచారని!

Oct 4 2023 7:37 PM | Updated on Oct 4 2023 8:01 PM

 Bahubali Actress Pramila Rani Comments Casting Couch - Sakshi

సినిమా ఇండస్ట్రీ పైకి చూడటానికి కలర్‌ఫుల్‌. కానీ లోపల చాలా జరుగుతుంటాయి. మరీ ముఖ్యంగా ఛాన్సుల కోసం ప్రయత్నించే లేడీ యాక్టర్స్.. చాలా ఇబ్బందులకు గురవుతుంటారు. అలాంటి సంఘటన తన విషయంలోనూ జరిగిందని సీనియర్ నటి ప్రమీలా రాణి చెప్పుకొచ్చింది. ఛాన్స్ ఇచ్చినట్లే ఇచ్చి గెస్ట్ హౌస్‌కి రమ్మన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈమె ఇంకా ఏమేం చెప్పింది?

ఎవరీ నటి?
కృష్ణా జిల్లాలో పుట్టిన ఈమె పేరు ప్రమీలా రాణి. దాదాపు 45 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంది. అప్పట్లో సహాయ పాత్రలు చేసిది. ఇప్పుడు మాత్రం అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలకు బామ్మగా నటిస్తూ చాలా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె చేసిన చిత్రాల్లో విక్రమార్కుడు, వేదం, బాహుబలి ఉ‍న్నాయి. అయితే తనకు అప్పట్లోనే క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైనట్లు చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' బ్యూటీపై దారుణమైన కామెంట్స్.. గంటకు రూ.5 వేలు అంటూ!)

ఏం జరిగింది?
చిన్న వయసులోనే ఈమెకు పెళ్లి చేశారు. అయితే పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పడంతో భర్త వదిలేసి వెళ్లిపోయాడు. కొన్నాళ్ల తర్వాత రెండో పెళ్లి చేశారు. ఈమెకు 23 ఏళ్ల వయసులో అతడు చనిపోయాడు. దీంతో ఒంటరి అయిపోయింది. ఆ సమయంలో కుటుంబాన్ని చూసుకుంటూనే సినిమాల్లో నటిస్తూ వచ్చింది. కానీ ఓ సినిమా విషయంలో మాత్రం తనకు అవకాశం ఇచ్చి, గెస్ట్ హౌస్‌కి పిలిచారని ప్రమీలా రాణి చెప్పింది. 

యాక్టింగ్, షూటింగ్ అంటే వస్తానని.. ఇలాంటి వాటికి అస్సలు రానని ఖరాఖండీగా చెప్పేసింది. దీంతో ఆ సినిమా ఛాన్స్ పోయింది. ఇది తప్పితే తనకు ఇండస్ట్రీలో మరెలాంటి చేదు అనుభవాలు ఎదురవ్వాలనేది చెప్పింది. ప్రస్తుతం ఈమె వయసు 85 ఏళ్లు. ఇప్పటికీ చురుగ్గా ఉంటూ, సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. 

(ఇదీ చదవండి: హీరోయిన్ పూజాహెగ్డేకి గాయం.. ఆ ఫొటో వైరల్!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement