ప్రముఖ నటి భర్తకు గుండెపోటు.. అందువల్లే.. | Actress Sana Begum Husband Suffers with Heart Attack | Sakshi
Sakshi News home page

నటి భర్తకు గుండెపోటు.. క్షమాపణలు చెప్తూ పోస్ట్‌!

Published Thu, Apr 11 2024 1:47 PM | Last Updated on Thu, Apr 11 2024 3:27 PM

Actress Sana Begum Husband Suffers with Heart Attack - Sakshi

సనా బేగమ్‌.. బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్‌లోనే కాకుండా ఇటు వెండితెరపై సినిమాల్లోనూ నటించింది. వందలకొద్దీ సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మెప్పించిన ఆమె ఎక్కడ ఎక్స్‌పోజింగ్‌ చేయాల్సి వస్తుందోనని కెరీర్‌ తొలినాళ్లలోనే హీరోయిన్‌ ఛాన్సులను తిరస్కరించింది. సహాయక నటి పాత్రలతోనే సరిపెట్టుకుంది. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది.

సోషల్‌ మీడియకు బ్రేక్‌
సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈమె ఐదారు రోజులనుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌ కూడా పెట్టడం లేదు. అసలే రంజాన్‌ పండుగ.. ఇంతరవకూ ఒక్కపోస్ట్‌ కూడా పెట్టడం లేదేంటా? అని అభిమానులు కంగారుపడిపోయారు. కారణాలు ఆరా తీస్తూ ఆమెకు మెసేజ్‌లు చేశారు. దీంతో సోషల్‌ మీడియాకు చిన్న గ్యాప్‌ ఇవ్వడానికి గల కారణాన్ని బయటపెట్టింది సనా.

సర్జరీ విజయవంతం
'ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో యాక్టివ్‌గా ఉండనందుకు నన్ను క్షమించండి. దురదృష్టవశాత్తూ ఇటీవలే నా భర్తకు గుండెపోటు వచ్చింది. ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో పెద్ద గండం తప్పింది. అల్లా దయ వల్ల సర్జరీ విజయవంతమైంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. మీ ఆదరాభిమానాలు మాపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు తను త్వరగా కోలుకోవాలని కామెంట్స్‌ చేస్తున్నారు.

చదవండి: Fahad Fazil: నన్ను కమెడియన్‌ను చేశారు.. పుష్ప విలన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement